మంకీపాక్స్‌ అలానే సోకదు... ఒక్కోసారి..: డబ్ల్యూహెచ్‌ఓ | Monkeypox Outbreak Among Gay Men But Not The Case Everywhere | Sakshi
Sakshi News home page

Monkeypox: ఈ వ్యాధి అలానే సోకదు... ఒక్కోసారి..: డబ్ల్యూహెచ్‌ఓ

Published Wed, Jul 27 2022 10:50 AM | Last Updated on Wed, Jul 27 2022 11:37 AM

Monkeypox Outbreak Among Gay Men But Not The Case Everywhere - Sakshi

జెనీవా: మంకీపాక్స్‌ కేసులు వేగవంతంగా పెరుగుతన్న నేపథ్యంలో ప్రజల్లో ఎలాంటి వివక్షతకు దారితీస్తోందోనని డబ్ల్యూహెచ్‌ఓ అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్‌ఓ) పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ విషయమై డబ్ల్యూహెచ్‌ఓ టెక్నికల్‌ లీడ్‌ డాక్టర్‌ రోసముండ్‌ లూయిస్‌ జెనీవాలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...ఈ వ్యాధికి సంబంధించిన తీవ్రమైన హాని ఏమి లేదని స్పష్టం చేశారు. ఇది స్వలింగ సంపర్కం వల్లే వచ్చిందే కానీ అందరకీ అలానే ఈ వ్యాధి సంక్రమించదని కూడా తేల్చి చెప్పారు.

ప్రస్తుతం దాదాపు 75కు పైగా దేశాల్లో సుమారు 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఐతే వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మంకీపాక్స్‌ వ్యాధిని సరైన వ్యూహాలతో నియత్రించవచ్చు. అంతేకాదు మంకీపాక్స్‌ వ్యాధి ఉన్న వ్యక్తితో కలిసి ఉండటం, అతని వస్తువులు వాడటం, లైంగికి సంబంధం పెట్టుకోవడం వంటి తదితరాల వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.

ఈ వ్యాధి గురించి ప్రజలను ఆందోళన చెందకూడదని, లైంగికంగా సంక్రమించే వ్యాధులపై అవగాహన పెంపొందించు కోవాలని సూచించారు. సమర్ధవంతమైన వ్యూహాలతో ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించగలమని విశ్వసిస్తున్నాని అని నొక్కి చెప్పారు. అంతేకాదు ఈ వ్యాధి కారణంగా ప్రజలు సమాజంలో వివక్షతకు గురికాకుండా ఉండేలా ఈ వ్యాధి పేరు త్వరితగతిన మార్చాలని డబ్ల్యూహెచ్‌ఓ యోచిస్తున్నట్లు తెలిపింది.

(చదవండి: మంకీపాక్స్‌ వద్దు.. మరో పేరు పెట్టండి! డబ్ల్యూహెచ్‌వోకు లేఖ)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement