Geneva
-
మరోసారి తెరపైకి ‘గోల్కొండ వజ్రం’
సాక్షి, హైదరాబాద్: ‘అసలు సిసలైన వజ్రం కావాలంటే గోల్కొండ గనుల్లోనే దొరకాలి’ఇది ఒకప్పుడు ప్రపంచం మాట. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విస్తరించిన గోల్కొండ గనుల్లో లభించే వజ్రాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వజ్రం అనగానే గుర్తుకొచ్చే ‘కోహినూర్’ఇక్కడ దొరికిందే. ఇప్పుడు మరోసారి గోల్కొండ వజ్రాల అంశం తెరపైకి వచ్చింది. బ్రిటిష్ రాజకుటుంబం నగల కలెక్షన్లలో భాగంగా ఉన్న 18వ శతాబ్దం నాటి అరుదైన నెక్లెస్ నవంబర్‌లో వేలానికి వస్తోంది.వేలం నిర్వహణలో ఖ్యాతిగాంచిన సోథెబైస్ జెనీవాలో దీనిని వేలం వేస్తోంది. మూడు వరుసలతో ఉన్న ఈ నెక్లెస్‌లో దాదాపు 500 వజ్రాలున్నాయి. అవి ప్రఖ్యాత గోల్కొండ గనుల నుంచి సేకరించినవే అయ్యి ఉంటాయంటూ తాజాగా వేలం నిర్వహణ సంస్థ సోథేబైస్ ప్రకటించింది. ఈ నెక్లెస్‌కు వేలంలో 2.8 మిలియన్ డాలర్ల గరిష్ట ధర పలుకుతుందని వేలం సంస్థ అంచనా వేస్తోంది. గోల్కొండ వజ్రాల స్వచ్ఛత ఆధారంగా వాటికి వేలం పాటల్లో అధికంగా ధరలు పలుకుతాయి. దీంతో ఇప్పు డు మరోసారి గోల్కొండ వజ్రాలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గోల్కొండ వజ్రాలు ప్రజలను విపరీతంగా అకట్టుకుంటున్నాయి.కోహినూర్‌తో..గోల్కొండ వజ్రాలకు అంతగా ఖ్యాతి రావటానికి కోహినూర్ వజ్రం ప్రధాన భూమిక పోషించింది. ప్రపంచం మొత్తానికి రెండున్నర రోజుల పాటు భోజన ఏర్పాట్లు చేసినందుకు ఎంత ఖర్చవుతుందో కోహినూర్ వజ్రం విలువ అంత ఉంటుందని మొఘల్ చక్రవర్తులు వ్యాఖ్యానించారట. గత పదేళ్లలో కొల్లాపూర్, నారాయణపేటలో జీఎస్ఐకి ముడి వజ్రాలుండే కింబర్లైట్ డైక్స్ లభించాయి. ఈ ప్రాంతాల్లో వజ్రాలుంటాయనటానికి ఇది ఓ ఆధారం. మూసీ పరీవాహకంలో కూడా వజ్రాలు భూగర్భంలో ఉన్నాయని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. బ్రిటిష్ పాలన కాలంలో గుంతకల్ సమీపంలోని వజ్రకరూరులో భారీ వజ్రాల గని తవ్వారు. ఇప్పటికీ అక్కడ 90 మీటర్ల లోతుతో భారీ గుంత నీటితో నిండి ఉంటుంది. » కుతుబ్‌షాహీల కాలంలో వజ్రాల వ్యాపారం ముమ్మరంగా సాగింది. విస్తారంగా గనులు తవ్వి వజ్రాలు వెలికితీశారు. దాదాపు లక్ష మంది కార్మికులు ఈ గనుల్లో పనిచేసేవారట. » ఈ గనులు స్థానిక సుబేదారుల అధ్వర్యంలో రోజువారీగా లీజుకు తీసుకొని హైదరాబాద్‌లోని వ్యాపారులు వజ్రాలు వెలికి తీసేవారు. ఒక క్యారెట్ కంటే ఎక్కువ బరువు తూగే వజ్రం లభిస్తే రాజుకు చెందుతుంది అన్న విధానం అమలులో ఉండేది. అలా కుతుబ్‌షాహీలు చాలా విలువైన, పెద్ద సైజు వజ్రాలు సొంతం చేసుకున్నారు. » గోల్కొండ వజ్రాల్లో నైట్రోజన్, బోరాన్ ఉండదు. ఈ కారణంగా వజ్రం అధిక కాంతివంతంగా ఉంటుంది. » కోహినూర్ తర్వాత అతిపెద్ద వజ్రం నిజాం జాకబ్ వజ్రమే. ఇది 420 క్యారెట్ బరువు ఉండేది. » గోల్కొండ గనుల నుంచి 12 మిలియన్ క్యారెట్ల వజ్రాలు తవ్వారని బ్రిటిష్ కాలంలో నిపుణులు అంచనా వేశారు. ఇప్పటికీ గోల్కొండ గనుల ప్రాంతంలో చిన్నసైజు వజ్రాలు లభిస్తూనే ఉన్నాయి. » గోల్కొండ డైమండ్స్ అన్నీ ఇప్పుడు యూరోపియన్ రాజకుటుంబాల సేకరణలో భాగంగా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇరాన్ ట్రెజరీలో ఉన్నాయి. ఒకటి రెండు నైజాం కలెక్షన్లలో ఉన్నాయిటైప్ టూ ఏ కేటగిరీ..» అసలైన వజ్రం స్వచ్ఛతకు మారుపేరుగా ఉంటుందని, ‘గోల్కొండ వజ్రాలు కన్నీళ్లంత స్వచ్ఛమైనవి’అని నిపుణులు చెబుతారు. వజ్రాల వ్యాపారంలో టైప్ టూ ఏ కేటగిరీని అత్యంత అరుదైన, స్వచ్ఛమైనదిగా భావిస్తారు. అందుకే గోల్కొండ వజ్రాలను ఆ కేటగిరీకి చెందినవిగా పేర్కొంటారు. కాకతీయుల కాలంలో గోల్కొండ వజ్రాలను వెలికితీయటం ప్రారంభించారు. ప్రస్తుతం కర్ణాటకలోకి రాయచూరు నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ వరకు ఉన్న ప్రాంతాన్ని గోల్కొండ గనులుగా పరిగణిస్తారు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వజ్రాలు లభించేవి. ఈ వజ్రాలు అధికంగా ఉన్న ప్రాంతాలను తన పరిధిలో ఉంచుకునేందుకు నిజాం తహతహలాడేవాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని భూభాగాన్ని అప్పట్లో నిజాం ఆంగ్లేయుల పరం చేశాడు. ఆ సమయంలో ప్రస్తుతం ఆంధ్రాప్రాంతంలో ఉన్న పరిటాల ప్రాంతాన్ని నిజాం తన పరిధిలోకి వచ్చేలా చేసుకున్నాడు. అక్కడ వజ్రాలు అధికంగా లభిస్తుండటమే దీనికి కారణం. ప్రస్తుతం తెలంగాణలో భాగంగా ఉన్న మునగాలను నిజాం సర్కారు బ్రిటిష్ పరిధిలోకి మార్చింది. రాష్ట్రాల పునరి్వభజన సమయంలో భౌగోళికంగా ఈ తీరు సరిగ్గా లేకపోవటంతో పరిటాలను ఆంధ్రప్రదేశ్‌కు, మునగాలను తెలంగాణకు కేటాయించారు. ఇప్పటి వరకు వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన మూడు ప్రధాన వజ్రాలు 2008: విట్టెల్స్‌బాచ్ డైమండ్ - 23.7 మిలియన్ డాలర్లు 1995: ఓర్లోవ్ డైమండ్ - 20.7 మిలియన్ డాలర్లకు 1995: జాకబ్ డైమండ్ - 13.4 మిలియన్ డాలర్లుప్రధాన గోల్కొండ వజ్రాల నమూనాలుప్రజలు సందర్శించేందుకు వీలుగా కొన్ని ప్రధాన గోల్కొండ వజ్రాలకు నమూనాలు రూపొందించారు. » లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో కోహినూర్ నకలు వజ్రం ఉంది » మాస్కోలోని క్రెమ్లిన్ ఆర్మరీలో ఓర్లోవ్ డైమండ్ నమూనా ఉంది » టెహరాన్స్ నేషనల్ మ్యూజియంలో దరియా–ఇ–నూర్ వజ్రం నమూనా ఏర్పాటు చేశారు. -
భారత్, చైనా సరిహద్దుల్లో సైనికీకరణ ఆందోళనకరం
జెనీవా: తూర్పు లద్ధాఖ్‌లో భారత్–చైనా సరిహద్దులో నాలుగేళ్ల క్రితం మొదలైన ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైన్యం వెనక్కి వెళ్లిపోయే విషయంలో చైనాతో నెలకొన్న సమస్యలు 75 శాతం పరిష్కారమైనట్లు తెలిపారు. చేయాల్సింది ఇంకా మిగిలే ఉందని పేర్కొన్నారు. గురువారం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఓ చర్చా కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడారు. 2020లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణలు భారత్–చైనా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఉంటేనే ఇరుదేశాల మధ్య సంబంధాలు బలపడతాయని ఉద్ఘాటించారు. భారత్, చైనా సైన్యం మధ్య ఘర్షణలకు పూర్తిగా తెరదించడానికి నాలుగేళ్లుగా చర్చలు జరుగుతున్నాయని వివరించారు. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంబడి భారత్, చైనా సైన్యం వెనక్కి వెళ్తుండగా, మరోవైపు అక్కడ మిగిలి ఉన్న రెండు దేశాల సేనలు ఎదురెదురుగా సమీపంలోకి వస్తుండడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. సరిహద్దుల్లో సైనికీకరణ జరుగుతోందని వెల్లడించారు. ఈ సమస్యను కచి్చతంగా పరిష్కరించాల్సి ఉందన్నారు. సేనలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని భారత్, చైనా నిర్ణయం తూర్పు లద్దాఖ్‌లో వివాదాస్పద సరిహద్దుల నుంచి తమ సేనలను సాధ్యమైనంత త్వరగా పూర్తిగా ఉపసంహరించుకోవాలని భారత్, చైనా నిర్ణయించుకున్నాయి. ఈ దిశగా ప్రయత్నాలను వేగవంతం, రెట్టింపు చేయాలని తీర్మానించుకున్నాయి. భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొనాలని తాము కోరుకుంటున్నామని అజిత్ దోవల్ ఈ సందర్భంగా తేలి్చచెప్పారు. వాస్తవా«దీన రేఖను(ఎల్ఏసీ)ని గౌరవించాలని వాంగ్ యీకి సూచించారు. భారత్, చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఎల్ఏసీని గౌరవించాల్సిందేనని స్పష్టంచేశారు. -
హిందూజా కుటుంబానికి జైలు శిక్ష
సిబ్బందని వేధింపులకు గురి చేసిన కేసులో హిందూజా కుటుంబంలోని నలుగురు వ్యక్తులకు స్విస్ కోర్టు శుక్రవారం జైలు శిక్ష విధించింది. హిందూజా గ్రూప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజా, ఆయన భార్య కమల్ హిందూజాలకు చెరో నాలుగు సంవత్సరాల ఆరు నెలలు, వారి కుమారుడు అజయ్, ఆయన భార్య నమ్రతకు నాలుగేళ్ల శిక్ష విధిస్తూ జెనీవాలోని ప్రిసైడింగ్ జడ్జి తీర్పు చెప్పారు.బ్రిటన్‌లో రిచెస్ట్ ఫ్యామిలీగా ఉన్న హిందూజా కుటుంబం జెనీవాలోని తమ నివాసంలో పనిచేయించుకునేందుకు స్వదేశమైన భారత్ నుంచి పనివాళ్లను రప్పించుకుని వారి పాస్ పోర్టులను తీసేసుకున్నారన్న ఆరోపణలతో ఈ కేసులు నమోదయ్యాయి. భారత్ నుంచి వచ్చిన వీరికి హిందుజా కుటుంబం చాలా తక్కువ జీతం చెల్లించారని, ఇంటి నుంచి బయటకు రాకుండా ఆంక్షలు పెట్టారని ప్రాసిక్యూటర్లు వాదించారు.ఈ ఆరోపణలను హిందూజా కుటుంబం ఖండించింది. 78, 75 ఏళ్ల వయసున్న ప్రకాశ్ హిందూజా, కమల్ హిందూజా అనారోగ్య కారణాల రీత్యా విచారణ ప్రారంభమైనప్పటి గైర్హాజరయ్యారు. వీరిపై మానవ అక్రమ రవాణా అభియోగాలు మోపినప్పటికీ ఇతర అభియోగాలపై దోషులుగా కోర్టు నిర్ధారించి శిక్షలు విధించింది. -
కంప్యూటర్ల దిగుమతి ఆంక్షలపై ఆందోళన
న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లపై దిగుమతి ఆంక్షలు విధించాలన్న భారత్ నిర్ణయంపై అమెరికా, చైనా, కొరియా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) సమావేశంలో ఈ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయని ఓ అధికారి తెలిపారు. నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత భారత్‌కు అమెరికా చేసే ఎగుమతులతో సహా ఈ ఉత్పత్తుల వాణిజ్యంపై ప్రభావం చూపుతుందని అమెరికా పేర్కొన్నట్టు జెనీవాకు చెందిన అధికారి వెల్లడించారు. భారత నిర్ణయం ఎగుమతిదారులు, అంతిమ వినియోగదా రులకు అనిశి్చతిని సృష్టిస్తోందని అమెరికా పేర్కొంది. అయితే ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల దిగుమతులకు లైసెన్స్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం గత వారం స్పష్టం చేసింది. దిగుమతులను కేవలం పర్యవేక్షిస్తామని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ వెల్లడించారు. ల్యాప్టాప్స్, టాబ్లెట్ పీసీలు, కంప్యూటర్లను నవంబర్ 1 నుండి లైసెన్సింగ్ విధానంలో ఉంచుతామని 2023 ఆగస్టులో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో - ప్రత్యేక ఆకర్షణగా 'సిముర్గ్' (ఫోటోలు)
-
అంతర్జాతీయ స్థాయిలో కాంతారకు అరుదైన గౌరవం..
రిషబ్ శెట్టి హీరోగా నటించడమే కాకుండా స్వీయదర్శకత్వం వహించిన అద్భుత చిత్రం కాంతారకు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం జెనీవాలో మార్చి 17న ఈ సినిమా ప్రదర్శించనున్నారు. స్క్రీనింగ్ పూర్తైన అనంతరం రిషబ్ శెట్టి ప్రసంగిస్తారు. ఇప్పటికే హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి స్విట్జర్లాండ్ చేరుకున్నారు. తన సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించనుడంతో సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాంతార సినిమా ప్రకృతి ప్రసాదించిన అడవుల రక్షణ గురించి ప్రస్తావించిన కాంతార చిత్రం ప్రపంచ స్థాయిలో ప్రదర్శితం కానుండటం నిజంగా గొప్ప విషయం అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ రాసుకొచ్చారు. దీనికి పలు ఫోటోలు జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా తక్కువ బడ్జెట్‌తో రూపొందిన కాంతార వందల కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే! దీంతో కాంతార ప్రీక్వెల్ తీసే పనిలో పడింది చిత్రయూనిట్. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
‘నిత్యానంద కైలాస’ను పరిగణించం: ఐరాస
జెనీవా: భారత్‌లో లైంగిక వేధింపుల ఆరోపణల కేసులు ఎదుర్కొంటూ దేశం వదిలి పారిపోయిన నిత్యానంద స్వామి నెలకొల్పినట్లు చెబుతున్న ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస (యూఎస్‌కే)’ దేశం తరఫున ఇద్దరు ప్రతినిధులు జెనీవాలో గత నెల 24న ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక చర్చాగోష్టిలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఐరాస గుర్తించని దేశం తరఫు వ్యక్తులు ఆ కార్యక్రమంలో ఎలా భాగస్వాములయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఐరాస స్పష్టతనిచ్చింది. ‘యూఎస్‌కే ప్రతినిధులు వాస్తవానికి ఒక దేశం తరఫున ఆ చర్చలో పాల్గొనలేదు. కేవలం ఒక స్వచ్ఛంద సంస్థగా వాళ్లు వచ్చి మాట్లాడారు. వాటిని పరిగణనలోకి తీసుకోవట్లేదు’ అని ఐరాస బుధవారం స్పష్టంచేసింది. ‘ జెనీవా చర్చాగోష్ఠిలో ముందస్తు అనుమతితో ఎవరైనా వచ్చి మాట్లాడొచ్చు. పలు సమస్యలు, ఇతివృత్తాలపై వెలువడే భిన్నాభిప్రాయాలతో కూడిన ముసాయిదా అది. ఐరాసలో కైలాస దేశ శాశ్వత మహిళా రాయబారిగా చెప్పుకున్న విజయప్రియ నిత్యానంద అభిప్రాయాలను పట్టించుకోబోం’ అని జెనీవాలోని ఐరాస మానవహక్కుల హై కమిషనర్ చెప్పారు. -
జెనీవా ఇంటర్నేషనల్ వేదికపై ఏపీ విద్యా విధానం స్టాల్
-
ప్రతికూల ఆలోచనల వల్లే ఆందోళన, కుంగుబాటు
లండన్: వృద్ధుల్లో ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడికి ప్రతికూల భావోద్వేగాలు, ఆలోచనలే కారణమని పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. మనసులో ప్రతికూల ఆలోచనలు మొదలైతే ఆందోళన పెరుగుతున్నట్లు తేల్చారు. భావోద్వేగాలను నియంత్రించుకుంటే ఒత్తిడి నుంచి బయటపడవచ్చని సూచించారు. పెద్దల్లో మెదడుపై ప్రతికూల ఆలోచనల ప్రభావం, మానసిక ఆందోళనకు మధ్య గల సంబంధాన్ని స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ జెనీవాకు చెందిన న్యూరో సైంటిస్టులు కనుగొన్నారు. ఇతరుల మానసిక వ్య«థ పట్ల యువకులు, వృద్ధులు ఎలా స్పందిస్తారు? వారి మెదడు ఎలా ఉత్తేజితం చెందుతుంది? వారిలో ఎలాంటి భావోద్వేగాలు తలెత్తుతాయి? అనే దానిపై పరిశోధన చేశారు. మొదటి గ్రూప్‌లో 27 మందిని(65 ఏళ్లు దాటినవారు), రెండో గ్రూప్‌లో 29 మందిని(25 ఏళ్ల యువకులు), మూడో గ్రూప్‌లో 127 మంది వయో వృద్ధులను తీసుకున్నారు. విపత్తుల వంటి ప్రతికూల పరిస్థితుల కారణంగా మానసికంగా బాధపడుతున్న వారి వీడియో క్లిప్పులను, తటస్థ మానసిక వైఖరి ఉన్నవారి వీడియో క్లిప్పులను చూపించారు. యువకులతో పోలిస్తే వయో వృద్ధుల మెదడు త్వరగా ఉత్తేజితం చెంది, ప్రతికూల భావోద్వేగాలకు గురవుతున్నట్లు ఫంక్షనల్ ఎంఆర్ఐ ద్వారా గమనించారు. వారి మనసులో సైతం ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి వంటి విపరీత భావాలు ఏర్పడుతున్నట్లు గుర్తించారు. అలాంటి ప్రతికూల భావోద్వేగాలను నియంత్రించుకుంటే ఆందోళన, ఒత్తిడి సైతం తగ్గుముఖం పడుతున్నట్లు కనిపెట్టారు. అధ్యయనం వివరాలను నేచర్ ఏజింగ్ పత్రికలో ప్రచురించారు. -
ఎయిర్‌లైన్స్‌కు పూర్వ వైభవం.. వచ్చే ఏడాది నుంచి లాభాలే లాభాలు
జెనీవా: అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్ పరిశ్రమ 2022 సంవత్సరానికి 6.9 బిలియన్ డాలర్లు (రూ.56,580 కోట్లు) నష్టాలను ప్రకటించొచ్చని.. వచ్చే ఏడాది నుంచి లాభాల బాటలో ప్రయాణిస్తుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) పేర్కొంది. ఎయిర్‌లైన్స్ సంస్థలు వ్యయ నియంత్రణకు తీసుకున్న చర్యలు, అధి ప్రయాణికుల రవాణా నష్టాలు తగ్గేందుకు అనుకూలిస్తాయని తెలిపింది. ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ జెనీవాలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంతో పోలిస్తే భారత్ ఎయిర్‌లైన్స్ పరిశ్రమ ఈ ఏడాది మంచి రికవరీని చూసినట్టు చెప్పారు. కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లను, వాటి విడిభాగాలను పొందడమే సవాలుగా పేర్కొన్నారు. కరోనాతో కుదేలైన దేశీ ఎయిర్‌లైన్స్ పరిశ్రమ ఈ ఏడాది మంచిగా కోలుకోవడం తెలిసిందే. ప్రయాణికుల డిమాండ్ బలంగా ఉండడంతో ఎయిర్‌లైన్స్ కంపెనీలు సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించే పనిలో ఉన్నాయి. అయితే, చైనాలోని లాక్డౌన్లు, జీరో కోవిడ్ పాలసీ, రవాణాపై ఆంక్షలు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో పరిశ్రమ రికవరీపై ప్రభావం పడేలా చేసినట్టు ఐఏటీఏ తన తాజా నివేదికలో తెలిపింది. వచ్చే ఏడాది లాభాలు.. 2023లో అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్ పరిశ్రమ లాభాల్లోకి అడుగు పెడుతుందని ఐఏటీఏ అంచనా వేసింది. 4.7 బిలియన్ డాలర్ల లాభాన్ని నమోదు చేయవచ్చని పేర్కొంది. ఈ ఏడాదికి 6.9 బిలియన్ డాలర్ల నష్టాన్ని ఎదుర్కోవచ్చన్న ఈ నివేదిక.. 2020లో 138 బిలియన్ డాలర్లు, 2021లో 42 బిలియన్ డాలర్ల కంటే చాలా తగ్గినట్టేనని తెలిపింది. ఈ ఏడాది అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్ కంపెనీలు 9.7 బిలియన్ డాలర్ల నష్టాలను ఎదుర్కోవచ్చని ఐఏటీఏ జూన్‌లో అంచనా వేయడం గమనార్హం. ఈ ఏడాది ఒక్క నార్త్ అమెరికాలోనే ఎయిర్‌లైన్స్ పరిశ్రమ లాభాలను కళ్ల చూసినట్టు తెలిపింది. 2023లో నార్త్ అమెరికాతోపాటు యూరప్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లోని సంస్థలు సైతం లాభాల్లోకి అడుగుపెడతాయని పేర్కొంది. ఇక ల్యాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా/పసిఫిక్ ప్రాంతాల్లోని సంస్థలు వచ్చే ఏడాదీ నికరంగా నష్టాలను చూస్తాయని అంచనా వేసింది. 2019లో నమోదైన ప్రయాణికుల రేటుతో పోలిస్తే ఈ ఏడాది 70 శాతంతో ముగించొచ్చని పేర్కొంది. ఈ ఏడాది అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్ సంస్థల ఆదాయం 727 బిలియన్ డాలర్లుగా ఉంటుందని, వచ్చే ఏడాది 779 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. -
ప్రకృతి అద్భుతం.. వెల కూడా అదే రేంజ్!
జెనీవా: ప్రకృతిలోని నిజమైన అద్భుతం అది. అందుకే వెల కూడా అదే స్థాయిలో రాబట్టింది. మంగళవారం స్విట్జర్లాండ్ జెనీవాలో క్రిస్టీస్ సంస్థ నిర్వహించిన వేలంపాటలో రికార్డుస్థాయిలో దాదాపు రూ.231 కోట్ల ధర($28.8 millions) పలికింది ఫార్చూన్ పింక్. అత్యంత అరుదైన రత్నం ఇది. ఆసియాకు చెందిన ఒక వ్యక్తి దీనిని సొంతంచేసుకున్నారు. ఆ వ్యక్తి వివరాలు వెల్లడించేందుకు క్రిస్టీస్ జ్యువెలరీ విభాగపు అధినేత మాక్స్ ఫావ్కెట్ నిరాకరించారు. అయితే.. పదిహేనేళ్ల కిందట బ్రెజిల్ గనుల్లో ఆ వజ్రాన్ని సేకరించినట్లు తెలిపారు. ఇక ఇక్కడో ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రపంచంలోనే మొట్టమొదటి పింక్ డైమండ్ ఇండియాలోని గోల్కొండ గనుల్లో 16వ శతాబ్ధంలో బయటపడ్డాయి. ఆపై ఆఫ్రికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, రష్యా గనుల్లో వీటిని గుర్తించారు. న్యూయార్క్, షాంగై, సింగపూర్, తైవాన్ తర్వాత జెనీవాలో పింక్ డైమండ్స్ వేలం నిర్వహిస్తున్నారు. -
ఆవిష్కరణల్లో భారత్‌కు 40వ స్థానం
న్యూఢిల్లీ: ఆవిష్కరణల్లో భారత్ అంతర్జాతీయంగా మెరిసింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022లో ఆరు స్థానాలు మెరుగుపడి, మన దేశం 40వ స్థానానికి చేరుకుంది. ఈ వివరాలను జెనీవా కేంద్రంగా పనిచేసే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఐపీవో) ఓ నివేదికగా విడుదల చేసింది. స్విట్జర్లాండ్, యూఎస్, స్వీడన్, యూకే, నెదర్లాండ్స్ ఆవిష్కరణల పరంగా ప్రపంచంలో టాప్–5 ఆర్థిక వ్యవస్థలుగా ఈ సూచీలో నిలిచాయి. చైనా టాప్–10లో చోటు సంపాదించుకుంది. ‘‘భారత్, టర్కీ మొదటిసారి టాప్–40లోకి చేరాయి. టర్కీ 37వ స్థానాన్ని, భారత్ 40వ స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. కెనడా తిరిగి 15వ స్థానంతో టాప్–15లోకి అడుగు పెట్టింది. భారత్ ఆవిష్కరణల పనితీరు సగటు కంటే ఎగువన ఉంది. ఒక్క మౌలిక రంగంలోనే సగటు కంటే తక్కువ స్కోరు సాధించింది’’అని ఈ నివేదిక తెలిపింది. 2021 ఆవిష్కరణల సూచీలో మన దేశం 46వ స్థానంలో ఉండగా, 2015లో అయితే 81 ర్యాంకుతో ఉండడం గమనార్హం. -
మంకీపాక్స్ అలానే సోకదు... ఒక్కోసారి..: డబ్ల్యూహెచ్ఓ
జెనీవా: మంకీపాక్స్ కేసులు వేగవంతంగా పెరుగుతన్న నేపథ్యంలో ప్రజల్లో ఎలాంటి వివక్షతకు దారితీస్తోందోనని డబ్ల్యూహెచ్ఓ అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ విషయమై డబ్ల్యూహెచ్ఓ టెక్నికల్ లీడ్ డాక్టర్ రోసముండ్ లూయిస్ జెనీవాలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...ఈ వ్యాధికి సంబంధించిన తీవ్రమైన హాని ఏమి లేదని స్పష్టం చేశారు. ఇది స్వలింగ సంపర్కం వల్లే వచ్చిందే కానీ అందరకీ అలానే ఈ వ్యాధి సంక్రమించదని కూడా తేల్చి చెప్పారు. ప్రస్తుతం దాదాపు 75కు పైగా దేశాల్లో సుమారు 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఐతే వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మంకీపాక్స్ వ్యాధిని సరైన వ్యూహాలతో నియత్రించవచ్చు. అంతేకాదు మంకీపాక్స్ వ్యాధి ఉన్న వ్యక్తితో కలిసి ఉండటం, అతని వస్తువులు వాడటం, లైంగికి సంబంధం పెట్టుకోవడం వంటి తదితరాల వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ వ్యాధి గురించి ప్రజలను ఆందోళన చెందకూడదని, లైంగికంగా సంక్రమించే వ్యాధులపై అవగాహన పెంపొందించు కోవాలని సూచించారు. సమర్ధవంతమైన వ్యూహాలతో ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించగలమని విశ్వసిస్తున్నాని అని నొక్కి చెప్పారు. అంతేకాదు ఈ వ్యాధి కారణంగా ప్రజలు సమాజంలో వివక్షతకు గురికాకుండా ఉండేలా ఈ వ్యాధి పేరు త్వరితగతిన మార్చాలని డబ్ల్యూహెచ్ఓ యోచిస్తున్నట్లు తెలిపింది. (చదవండి: మంకీపాక్స్ వద్దు.. మరో పేరు పెట్టండి! డబ్ల్యూహెచ్‌వోకు లేఖ) -
మంకీపాక్స్ ప్రమాకరమైనదేనా? కాదా! డబ్ల్యూహుచ్‌ఓ అత్యవసర సమావేశం
జెనీవా: మంకీపాక్స్ వ్యాప్తి పై డబ్ల్యూహెచ్ఓ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఇది అంతర్జాతీయపరంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా వర్గీకరించాలా వద్దా అని నిర్ణయించడానికి జూన్ 23న అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ ఛీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ..."మంకీపాక్స్ వ్యాధులు ఎక్కువగా నమోదవ్వడంతో ఇది అసాధరణమైన వ్యాధి అని సందేహం కలుగుతోంది. అందువల్ల ఈ విషయమై అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం అత్యవసర కమిటీని సమావేశపరచాలని నిర్ణయించాను. ఈ వ్యాప్తి అంతర్జాతీయపరంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని సూచిస్తుందో లేదో అంచనా వేయడానికే సమావేశం ఏర్పాటు చేస్తున్నాను" అని చెప్పారు. (చదవండి: ఆ సమాధి పై ఎరుపు రంగుతో రాసిన హెచ్చరిక... తెరిచారో అంతే...) -
ఆహార ధాన్యాల ఎగుమతులు.. భారత్ ఆందోళన
జెనీవా: ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార పథకం కోసం కొనుగోలు చేసే ఆహార ధాన్యాలకు ఎగుమతుల నుంచి పూర్తి మినహాయింపులను కొనసాగించడానికి సుముఖంగా లేమని భారత్ తెలిపింది. ఇది దేశీయంగా ఆహార భద్రత సవాళ్లను ఎదుర్కొనే విషయంలో పాలకులను నియంత్రిస్తుందని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదివారం జెనీవాలో మొదలైన ప్రపంచ వాణిజ్య సంస్థ 12వ మంత్రిత్వ సదస్సులో ఇది చర్చకు వచ్చింది. డబ్ల్యూటీవో కింద 164 సభ్య దేశాల తరఫున నిర్ణయాలు తీసుకునే అత్యున్నత మండలి ఇది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఆధ్వర్యంలోని బృందం ఇందులో పాల్గొంటోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల జీ–33 గ్రూపు ఉమ్మడిగా కలసి పనిచేయాలని, భాగస్వామ్య దేశాల మద్దతుతో తటస్థమైన, పారదర్శక ఫలితం వచ్చేలా డబ్ల్యూటీవోలో కృషి చేయాలని భారత్ పిలుపునిచ్చింది. డబ్ల్యూటీవో సమావేశం సందర్భంగా జీ33 దేశాల మంత్రులను ఉద్దేశించి గోయల్ మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాలు భారీ సబ్సిడీలతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతులను కుమ్మరించడం వల్ల స్థానికంగా ధరలు పడిపోయి, అస్థిరతలను ఎదుర్కోవాల్సి వస్తోందని వాణిజ్య గోయల్ మరోసారి ప్రస్తావించారు. దీన్నుంచి రక్షణ కల్పించే ‘ప్రత్యేక రక్షణ యంత్రాంగం (ఎస్ఎస్ఎం) కోసం భారత్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. చదవండి: వెబ్ 3నే అంతు చిక్కలేదు అప్పుడే వెబ్ 5 అంటున్నారు! -
ఒమిక్రాన్ ‘తీవ్రత’పై స్పష్టత లేదు
ఐక్యరాజ్యసమితి/జెనీవా: కొత్త కరోనా వేరియంట్ ‘ఒమిక్రాన్’ వ్యాధి తీవ్రత ఎంతటి స్థాయిలో ఉంటుందనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ప్రపంచాన్ని చుట్టేసి జనజీవనాన్ని అతలాకుతలం చేసిన డెల్టా వేరియంట్ తరహాలో వేగంగా వ్యాప్తి చెందుతుందో లేదో అనే విషయాన్ని నిర్ధారించే సమాచారం తమ వద్ద లేదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ‘‘ప్రస్తుత సమాచారం ప్రకారం ఒమిక్రాన్‌ను ‘హై రిస్క్’ వేరియంట్‌గా గుర్తిస్తున్నాం. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ సోకిన వారిలో భిన్నమైన వ్యాధి లక్షణాలు ఉంటాయని రూఢీ చేసే సమాచారమూ మా వద్ద లేదు. దక్షిణాఫ్రికాలో సాధారణంగానే కేసులు పెరిగాయా? లేదంటే ఒమిక్రాన్ వల్లే పెరిగాయా? అనే దానిపై పరిశోధనలు పూర్తికాలేదు’ అని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. సమష్టి పోరుకు సిద్దంకావాలి ఒమిక్రాన్ వంటి కొత్తకొత్త వైరస్ వేరియంట్లు ఉద్భవిస్తున్న ఈ తరుణంలో ‘అంతర్జాతీయ వేదిక’గా ఏర్పడి ప్రపంచ దేశాలన్నీ కోవిడ్‌పై ఉమ్మడి పోరుకు సిద్ధంకావాలని డబ్ల్యూహెచ్‌వో పిలుపునిచ్చింది. రాబోయే ఉపద్రవాలను పసిగట్టడం, ముందే సంసిద్ధమవడం, ధీటుగా ఆరోగ్య రంగాన్ని పటిష్టంచేయడం వంటి చర్యలతో మరో మహోత్పాతాన్ని ఆపాలని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రియేసిస్ ప్రపంచ దేశాలను అభ్యర్థించారు. జెనీవాలో జరుగుతున్న ‘వరల్డ్ హెల్త్ అసెంబ్లీ’లో ఆయన మాట్లాడారు. కోవిడ్‌పై ఉమ్మడి పోరాటానికి దేశాలన్నీ ఒక చట్టబద్ధ ఒప్పందం కుదుర్చుకో వాలని ఆయన సూచించారు. ఒప్పందం ద్వారా ప్రపంచం ఏకతాటి మీదకు రావాల్సిన సమయం ఆసన్నమైందని ఒమిక్రాన్ గుర్తుచేస్తోం దన్నారు. విదేశీయులకు ద్వారాలు మూసేసిన జపాన్ ఒమిక్రాన్ జపాన్‌లో ఇంకా వెలుగుచూడకపోయినా ఆ దేశం అప్రమత్తమైంది. మంగళవారం నుంచి ప్రపంచ దేశాల పర్యాటకులను తమ దేశంలోకి అనుమతించబోమని జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా సోమవారం ప్రకటించారు. దేశ సరిహద్దుల వద్ద ఆంక్షలను పెంచారు. మరోవైపు, ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య తాజాగా ఐదుకు పెరిగింది. బుధవారం నుంచి ప్రయాణ ఆంక్షలకు సడలించాలన్న నిర్ణయాన్ని మరో రెండు వారాలపాటు ఆస్ట్రేలియా వాయిదావేసుకుంది. డిసెంబర్ 15దాకా ప్రస్తుత ఆంక్షలే కొనసాగుతాయి. కాగా, పోర్చుగల్‌లో ఒమిక్రాన్ కేసులు పదమూడుకు పెరిగాయి. బ్రిటన్‌లో ఈ రకం కేసుల సంఖ్య తాజాగా తొమ్మిదికి చేరింది. ఇంగ్లండ్‌లో ఇప్పటికే మూడు కేసులుండగా సోమవారం స్కాట్లాండ్లో ఆరు కేసులొచ్చాయి. భారత్‌లో కనిపించని జాడలు భారత్‌లో ఇప్పటిదాకా ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ సోకిన ఒక్క కేసు కూడా నమోదుకాలేదని కేంద్ర ఉన్నతాధికారి ఒకరు సోమవారం చెప్పారు. విదేశాల నుంచి ఇటీవల భారత్‌కు వచ్చిన వారి జీనోమ్ సీక్వెన్సింగ్‌పై పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. ఇటీవల విదేశాల నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఒక వ్యక్తి నుంచి సేకరించిన శాంపిల్.. డెల్టా వేరియంట్‌కు భిన్నంగా ఉందని కర్ణాటక ఆరోగ్య మంత్రి సుధాకర్ సోమవారం చెప్పారు. 63 ఏళ్ల ఆ వృద్ధుడి శాంపిల్‌లో ఉన్నది ఒమిక్రానా? మరేదైనా వ్యాధి లక్షణాలా? అన్నది ఐసీఎంఆర్ అధికారులే బహిర్గతం చేస్తారని ఆయన అన్నారు. -
అఫ్గన్‌కు 60 కోట్ల డాలర్ల సాయం చేయండి: ఐరాస
జెనీవా: తాలిబన్ల వశమైన అఫ్గనిస్తాన్‌ను ఆదుకునేందుకు ఆపన్నహస్తం అందించా ల్సిందిగా సోమవారం ప్రపంచ దేశాలను ఐక్యరాజ్య సమితి(ఐరాస) కోరింది. ఈ ఏడాది డిసెంబర్ వరకు అఫ్గన్ ప్రజల కష్టాలు తీర్చేందుకు 60.6 కోట్ల డాలర్లు (దాదాపు రూ.4,463 కోట్లు) సాయం చేసి ప్రపంచ దేశాలు తమ మానవతా దృక్పథాన్ని మరోసారి చాటాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ హితవు పలికారు. సోమవారం జెనీవాలో జరిగిన విరాళాల సేక రణ సదస్సులో ఆయన మాట్లాడారు. అఫ్గన్ పేదలకు సాయపడాలన్నారు. ఐక్యరాజ్య సమితి అత్యవసర విభాగం తరఫున 2 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు సదస్సులో గుటెర్రస్ ప్రకటించారు. -
భారత్‌లో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధిగా కరోనా: డబ్ల్యూహెచ్ఓ
జెనీవా: భారత్‌లో కరోనా ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతోందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మరికొన్ని రోజులు కోవిడ్ ఇలానే ఉండే అవకాశం ఉందని తెలిపింది. పిల్లలకు కరోనా సోకినా వ్యాధి అతి స్వల్పంగానే ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా ఇటీవల కోవిడ్ ఎప్పటికీ అంతం కాదని, మనతోనే శాశ్వతంగా ఉంటుందని చాలామంది శాస్త్రవేత్తలు పేర్కొన్న విషయం తెలిసిందే. సార్స్-కోవి-2ను అంతం చేయొచ్చా అని ప్రముఖ సైన్స్ జర్నల్ 'నేచర్' గత జనవరిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100కు పైగా మ్యునాలజిస్టులను, వైరాలజిస్టులను, ఆరోగ్య నిపుణులను అడిగింది. 'నిర్మూలించడం కుదరదు' అని వారిలో 90శాతానికి పైగా సమాధానమిచ్చారు. చదవండి: Finn Allen: వ్యాక్సిన్ రెండు డోసుల తర్వాత క్రికెటర్‌కు కరోనా పాజిటివ్ -
విబేధాల పరిష్కారం దిశగా తొలి అడుగు
జెనీవా: అగ్రదేశాలు అమెరికా, రష్యాల అధ్యక్షులు జో బైడెన్, వ్లాదిమిర్ పుతిన్‌ల శిఖరాగ్ర సమావేశం బుధవారం జెనీవా వేదికగా జరిగింది. సుహృద్భావ వాతావరణంలో భేటీ జరిగిందని, తమ ఇద్దరి మధ్య ఎలాంటి విరోధ భావన నెలకొనలేదని పుతిన్ పేర్కొన్నారు. చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయన్నారు. ‘చాలా అంశాల్లో మేం విబేధిస్తాం. అయితే, ఒకరినొకరు అర్థం చేసుకునే, పరస్పరం దగ్గరయ్యే దిశగా ముందడుగు వేశామని భావిస్తున్నా’ అని పుతిన్ పేర్కొన్నారు. ఇరుదేశాల రాయబారులను తమతమ విధుల్లో చేరేందుకు తాను, బైడెన్ అంగీకరించామన్నారు. రెండు దేశాల మద్య విబేధాలను తొలగించేందుకు, అణ్వాయుధ పరిమితిపై ఒప్పందానికి సంబంధించి చర్చలను ప్రారంభించేందుకు అంగీకారం కుదిరిందన్నారు. సైబర్ సెక్యూరిటీపైనా చర్చలు జరపాలని నిర్ణయించారు. ‘చర్చల సమయంలో మా మధ్య ఎలాంటి శత్రు భావం లేదు. అనుకున్న సమయం కన్నా ముందే చర్చలను ముగించాం’ అన్నారు. రెండు గొప్ప శక్తుల మధ్య భేటీగా ఈ సదస్సును చర్చలకు ముందు బైడెన్ అభివర్ణించారు. ముఖాముఖి చర్చలెప్పుడూ మంచిదేనని వ్యాఖ్యానించారు. ఇద్దరు నేతలు అంత సౌకర్యవంతంగా కనిపించలేదు. గత కొన్ని నెలలుగా ఇరువురు నేతల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చర్చలు ముగిసిన అనంతరం ఇరువురు నేతలు వేర్వేరుగా మీడియా సమావేశంలో పాల్గొనడం విశేషం. మొదట పుతిన్, ఆ తరువాత బైడెన్ చర్చల వివరాలను వేర్వేరుగా మీడియాకు తెలిపారు. సైబర్ భద్రత అంశంపై చర్చలు జరపాలని రెండు దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించాయని పుతిన్ వెల్లడించారు. అమెరికాలోని వ్యాపార, ప్రభుత్వ సంస్థల వెబ్‌సైట్స్‌ను రష్యా హ్యాక్ చేస్తోందని యూఎస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను పుతిన్ ఖండించారు. చర్చల సందర్భంగా మానవ హక్కుల అంశాన్ని, ప్రతిపక్ష నేత నేవల్నీ జైలు శిక్ష విషయాన్ని బైడెన్ ప్రస్తావించారని పుతిన్ వెల్లడించారు. -
సినోవాక్ టీకాకు డబ్ల్యూహెచ్ఓ అత్యవసర అనుమతి
బీజింగ్/జెనీవా: చైనాకు చెందిన దిగ్గజ ఫార్మా కంపెనీ సినోవాక్ తయారుచేసిన సినోవాక్ కరోనా వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా వినియోగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మంగళవారం అత్యవసర అనుమతులిచ్చింది. చైనా నుంచి ఇప్పటికే సైనోఫార్మ్ వ్యాక్సిన్ డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ అనుమతులు పొందిన సంగతి తెలిసిందే. సినోవాక్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నందునే అనుమతులు ఇచ్చినట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వ్యాక్సిన్ల లోటు ఏర్పడిన తరుణంలో మరిన్ని వ్యాక్సిన్లు ఉండటం అత్యవసరమని డబ్ల్యూహెచ్ఓ ఆరోగ్య ఉత్పత్తుల అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మరియాంజెలా సిమానో తెలిపారు. కోవ్యాక్స్ ఫెసిలిటీ ద్వారా ప్రపంచంలోని పేద దేశాలకు వ్యాక్సిన్లను అందించాల్సిందిగా వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలను ఆమె కోరారు. ప్రపంచంలోని పేద దేశాలకు కోవ్యాక్స్ ద్వారా ఉచిత వ్యాక్సిన్లను అందిస్తోన్న సంగతి తెలిసిందే. మే 7న చైనాకు చెందిన సైనోఫార్మ్ కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: వైరల్: 12 ఏళ్ల నాటి సీసీటీవీ ఫుటేజీ.. కలవరపడుతున్న నెటిజన్లు) -
WHO: పొగ తాగేవారు కరోనాతో మరణించే అవకాశాలు ఎక్కువ
జెనివా: ధూమపానం(పొగ త్రాగేవారు) చేసేవారిలో వివిధ ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు కరోనాతో మరణించే అవకాశాలు 50 శాతం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్వో) స్పష్టం చేసింది. స్మోకింగ్‌ను వదిలేయాలని.. దీంతో కరోనా రిస్క్ తగ్గుతుందని, క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని డబ్ల్యుహెచ్వో డైరెక్టర్ టెడ్రోస్ గెబ్రెయెసన్ పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్‌వో చేపట్టిన ''క్విట్ టొబాకో క్యాంపెయిన్'' కార్యక్రమంలో టెడ్రోస్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము చేపట్టిన క్విట్ టొబాకో క్యాంపెయిన్‌కు మంచి స్పందన వచ్చిందని ఆయన తెలిపారు. ఈ క్యాంపెయిన్‌లో అన్ని దేశాలు చేతులు కలపాలని కోరారు. దీనిపై ప్రజలకు అవసరమైన సమాచారం, సపోర్ట్, టూల్స్ అందుబాటులోకి తేవాలన్నారు. ప్రస్తుతం 29 దేశాల్లో నేరుగా పనిచేస్తున్నట్లు టెడ్రోస్ పేర్కొన్నారు. చదవండి: చైనాలో దడపుట్టిస్తున్న కొత్తరకం స్రెయిన్ మరోముప్పు.. కరోనా హైబ్రిడ్ -
బైడెన్, పుతిన్ భేటీల భేటీ ఖరారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జూన్ 16న జెనీవాలో భేటీ కానున్నారు. బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో అమెరికా, రష్యా మధ్య స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు ముఖాముఖి సమావేశం అవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీని వైట్‌హౌస్ మంగళవారం ధ్రువీకరించింది. అమెరికా–రష్యా సంబంధాలపై బైడెన్, పుతిన్ పూర్తి స్థాయిలో చర్చించుకొనే అవకాశం ఉందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ చెప్పారు. -
థర్డ్‌వేవ్ భయాలకు ఇదే సరైన పరిష్కారం!
జెనీవా: నాసల్ వ్యాక్సిన్ వస్తేనే ఇండియాలో విద్యా వ్యవస్థ గాడిన పడుతుందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్. సాధారణ వ్యాక్సిన్లతో పోల్చినప్పుడు ముక్కు ద్వారా టీకా అందించడం తేలికన్నారు. ఎక్కడైనా ఆ టీకాను సుళువుగా అందించవచ్చని, ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే పిల్లలకు నాసల్ వ్యాక్సిన్లను స్కూళ్లలోనే అందించవచ్చని చెప్పారు. దీనివల్ల దాదాపుగా స్కూల్ అంతా ఒకేసారి ఇమ్యూన్ అవుతుందని చెప్పారు. దీంతో పాఠశాలలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి భయం పోతుందన్నారు. ఫలితంగా పిల్లలు స్వేచ్ఛగా స్కూల్‌కి వెళ్లి చదువుకోగలరని, తల్లిదండ్రులు సైతం ధైర్యంగా పిల్లలను పాఠశాలకు పంపగలరంటూ ఆమె అభిప్రాయడ్డారు. అంతకంటే ముందు ఉపాధ్యాయులు, ఇతర స్కూల్ స్టాఫ్‌కి కూడా వ్యాక్సినేషన్ జరగాలన్నారు. అప్పుడే కరోనా థర్డ్‌వేవ్ భయాలు తొలగిపోతాయన్నారు. అయితే ప్రస్తుతం నాసల్ వ్యాక్సిన్లు ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఆ వ్యాక్సిన్లకు అనుమతులు రావొచ్చని... అప్పటి వరకు థర్డ్‌వేవ్ భయాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందనే ప్రచారం సాగుతుండంతో సౌమ్య స్వామినాథన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. (చదవండి: 20 ఏళ్ల తర్వాత అగ్నిపర్వతం బద్ధలు) -
French Open: మరో స్టార్ ప్లేయర్ దూరం
రొమేనియా: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరమైన స్టార్ ప్లేయర్ల జాబితాలో మరొకరు చేరారు. పురుషుల సింగిల్స్‌లో 2015 చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్), మాజీ నంబర్‌వన్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఈ మెగా ఈవెంట్‌కు దూరంకాగా ... తాజాగా మహిళల సింగిల్స్‌లో 2018 చాంపియన్, మూడో ర్యాంకర్ సిమోనా హలెప్ బరిలోకి దిగడంలేదని ప్రకటించింది. కాలిపిక్క గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హలెప్ తెలిపింది. ఈనెల 30న ఫ్రెంచ్ ఓపెన్ మొదలవుతుంది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట ఓటమి జెనీవా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–ఫ్రాంకోస్కుగర్ (క్రొయేషియా) పోరాటం ముగిసింది. స్విట్జర్లాండ్‌లో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ బోపన్న–స్కుగర్ ద్వయం 3–6, 6–3, 11–13తో ‘సూపర్ టైబ్రేక్’లో గొంజాలో ఎస్కోబార్ (కొలంబియా)–ఏరియల్ బెహర్ (ఉరుగ్వే) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. క్వార్టర్స్‌లో ఓడిన బోపన్న జంటకు 4,710 యూరోల (రూ. 4 లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
‘ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో’...
జెనీవాలో బుధవారం మానవ హక్కుల మండలి సమావేశం జరుగుతోంది. ఐక్యరాజ్యసమితి మండలి అది. అత్యంత కీలకమైన సమావేశం. దేశాలన్నీ బాధ్యతగా హాజరవుతాయి. మానవ హక్కుల గురించి మాట్లాడతాయి. మనమూ వెళ్లాం. మన పొరుగున ఉండే పాకిస్తాన్ కూడా వచ్చింది. ఎప్పటిలా జమ్మూ–కశ్మీర్లో ఉగ్రవాదం గురించి, స్వతంత్ర ప్రతిపత్తి గురించి మాట్లాడ్డం మొదలు పెట్టింది! మాట్లాడినంతా మాట్లాడనిచ్చి, మన దౌత్య అధికారి సీమా పూజాని మైక్ అందుకున్నారు. ‘నీకు సంబంధం లేని విషయం లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు?’ అని ప్రశ్నించారు. ‘ఆగస్టులో జరిగిన సదస్సులో కూడా ఇలాగే ఎక్కువ చేశావు’ అని హెచ్చరించారు. అక్కడితో ఆగలేదు. ఆ దేశం ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నుతోంది, భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు అంతర్జాతీయ వేదికల్ని ఎలా వాడుకుంటోందో మండలి సభ్యులందరి దృష్టికి తెచ్చారు. ఆ యువ ఐ.ఎఫ్.ఎస్. ఇచ్చిన ‘రైట్ ఆఫ్ రిప్లయ్’కి దేశంలో ఇప్పుడు ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ∙∙ సీమా పూజాని ఐక్యరాజ్య సమితిలో భారత్ తరఫున మాట్లాడే హక్కు కలిగిన సెకెండ్ సెక్రెటరీ. దౌత్య అధికారి. ఆమె ఇచ్చిన సమాధానం గానీ, చేసిన ప్రకటన గానీ భారత్ తరఫున అధికారికం అవుతుంది. అందుకే హక్కుల మండలి సమావేశంలో పాకిస్తాన్ ఆరోపణలను ఆమె తిప్పికొట్టిన విధానానికి దౌత్యపరమైన ప్రాధాన్యం ఏర్పడింది. సాధారణ భాషలో చెప్పాలంటే.. ‘ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో’ అని ఆ దేశానికి చెప్పడమే. సీమను తగిన పోస్ట్‌లోనే నియమించుకుంది భారత్. 2014 సివిల్స్‌లో ఆలిండియా ర్యాంకర్ ఆమె. 34వ ర్యాంకు సాధించి, ఇండియన్ ఫారిన్ సర్వీసును ఎంచుకున్నారు. అప్పటికి ఆమె ‘లా’ పూర్తయింది. ‘లా’ లోనే పై చదువుల కోసం జర్మనీ వెళ్లి అక్కడి ప్రతిష్టాత్మక బ్యూసెరియస్ లా స్కూల్ చేరుదామని అనుకుని కూడా.. సివిల్స్ సాధించాలనే తన కలలోకి మళ్లీ వెళ్లిపోయారు. రెండో అటెంప్ట్‌తో ఆమె కల నిజమైంది. సీమ హర్యానా అమ్మాయి. ఫరీదాబాద్‌లో పుట్టింది. ఇంట్లో తనే చిన్న. మిగతా ఇద్దరూ అక్కలు. తండ్రి అమర్నాథ్ పూజానీ రిటైర్డ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్. తల్లి గృహిణి. సీమ మొదట ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు. ఇంటర్లో సైన్స్ తీసుకున్నారు. ఇంటర్ తర్వాత మాత్రం ఇంజనీరింగ్ చేయలేదు. ‘లా’ వైపు వెళ్లిపోయారు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్లో చదివారు. అప్పుడే విస్తృతంగా సామాజిక అంశాల అధ్యయనం చేశారు. దాంతో సివిల్స్ వైపు వెళ్లాలన్న ఆలోచన కలిగింది. మరీ చిన్నప్పుడైతే ఆమెకు వెటరినరీ డాక్టర్ అవాలని ఉండేదట. చివరికి ఆరోగ్యకరమైన దౌత్య సంబంధాలను నెరిపే బాధ్యతల్లోకి వెళ్లిపోయారు. అవసరమైతే మాటకు మాటతో చికిత్స కూడా. సమితి మానవ హక్కుల మండలిలో మొన్న పాకిస్తాన్‌కు ఆమె చేసిన చికిత్స అటువంటిదే. సమితి హక్కుల ‘మండలి’లో సీమ మాటకు మాట -
10 మందిలో ఒకరికి కరోనా: డబ్ల్యూహెచ్‌వో
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా పదిశాతం మంది కోవిడ్ మహమ్మారి బారిన పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర సేవల విభాగం అధిపతి డాక్టర్ మైఖేల్ రయాన్ ప్రకటించారు. డబ్ల్యూహెచ్‌వో అంచనా ప్రకారం, ఇది వాస్తవంగా కరోనా సోకిన వారి సంఖ్యకన్నా 20 రెట్లు అధికమని, రానున్నది అత్యంత క్లిష్టమైన కాలమని ఆయన హెచ్చరించారు. ప్రతి 10 మందిలో ఒకరు కరోనా వైరస్ బారిన పడినట్లు ఆయన వెల్లడించారు. కోవిడ్‌పై చర్చించేందుకు సమావేశమైన 34 సభ్యదేశాల ఎగ్జిక్యూటివ్ బోర్డును ఉద్దేశించి మైఖేల్ రయాన్ మాట్లాడారు. ప్రపంచ జనాభా 760 కోట్లలో, 76 కోట్ల మంది కరోనా బారిన పడ్డారన్న డబ్ల్యూహెచ్‌వో అంచనాలతో, జాన్సన్ హాకిన్స్ యూనివర్సిటీ అంచనాలు సరిపోయాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 3.5 కోట్ల మందికి పైగా కరోనా బాధితులున్నారని ఆయన తెలిపారు. (కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ షురూ) -
కరోనా: గతం కంటే ఘోరం..
జెనీవా : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సంక్షోభం కారణంగా పెద్ద సంఖ్యలో కార్మికులు ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మారవచ్చని అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) మంగళవారం పేర్కొంది. 2020 సంవత్సరం ద్వితీయార్థం ప్రపంచ కార్మిక మార్కెట్లో తీవ్ర అనిశ్చితి తప్పదని తాజా నివేదికలో తెలిపింది. కరోనా కారణంగా కోల్పోయిన ఉద్యోగాల స్థాయిని వైరస్ వ్యాప్తికి ముందు ఉన్న స్థితికి ఈ సంవత్సరంలో తీసుకు రాలేమని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వల్ల పని గంటలు, వేతనాలు తగ్గుతాయని ఐఎల్ఓ హెచ్చరించింది.(లాక్‌డౌన్‌తో 12 కోట్ల మంది నిరుద్యోగులు) కరోనా సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చడంతో కార్మిక మార్కెట్లకు జరిగిన నష్టం అంచనాలను గతం కంటే గణనీయంగా పెంచామని ప్రపంచ కార్మిక సంస్థ డైరెక్టర్ జనరల్ గై రైడర్ అన్నారు. ఈ పరిస్థితి నుంచి ఇప్పట్లో కోలుకోలేమన్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయన్నారు. ఇప్పటికీ 93 శాతం మంది కార్మికులు పని ప్రదేశాలు మూసివేసిన దేశాల్లోనే నివసిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా ప్రభావం మహిళా కార్మికులపై అధికంగా ఉందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంక్షోభం మాత్రమే కాదు, ఆర్థిక సంక్షోభం.. ఇది ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందన్నారు. వైరస్ నేపథ్యంలో నిరుద్యోగాన్ని ఎదుర్కోవటానికి ప్రపంచం కూడా సిద్ధంగా ఉండాలని, ఈ పరిస్థితులను నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని ఐఎల్ఓ పేర్కొంది. (చైనాపై మరింత కోపంగా ఉన్నాను: ట్రంప్) ప్రపంచ పని గంటలు తగ్గడంతో గతంలో అంచనా వేసిన దానికంటే ఈ సంవత్సరం మొదటి భాగంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఐఎల్ఓ తన తాజా నివేదికలో తెలిపింది. కరోనా సంక్షోభం ప్రభావం అమెరికాపై అత్యధికంగా ఉందని, అగ్రరాజ్యం దాదాపు 18.3 శాతం పని గంటలను కోల్పోయిందని వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా రెండవ త్రైమాసికంలో 14 శాతం పని గంటలు వృధా అయ్యాయని, ఇది 40 కోట్ల ఫుల్ టైం ఉద్యోగాలకు సమానమని అంచనా వేసినట్లు ఐఎల్ఓ తెలిపింది. ఈ నష్టాలు నాల్గవ త్రైమాసికంలోనూ కొనసాగి దాదాపు 14 కోట్ల ఫుల్ టైం ఉద్యోగాలకు సమానమైన 4.9 శాతం పని గంటలు కోల్పోయే అవకాశముందని అంచనా వేసింది. మహమ్మారి రెండో దశగా పరిగణిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సంఖ్య 11.9 శాతం లేదా 340 మిలియన్ ఉద్యోగాలకు పెరగవచ్చని తెలిపింది. (కరోనా : అమెరికాకు కొత్త హెచ్చరిక) -
స్వతంత్ర దర్యాప్తు: భారత్ సహా 62 దేశాల మద్దతు!
జెనీవా: మహమ్మారి కోవిడ్-19 పుట్టుక, వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) స్పందన, కరోనా సంక్షోభంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలన్న ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ నిర్ణయానికి భారత్ సహా 62 దేశాలు మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు సోమవారం ప్రారంభమైన డబ్ల్యూహెచ్ఓ అసెంబ్లీ సమావేశాల్లో ముసాయిదా తీర్మానానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. కోవిడ్-19 విషయంలో డబ్ల్యూహెచ్ఓ స్పందనపై నిష్పాక్షిక, సమగ్ర విచారణకై తొలుత ఆస్ట్రేలియా పిలుపునివ్వగా.. ఈయూ ఇందుకు మద్దతు పలికింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఈరోజు వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ప్రాణాంతక వైరస్ ఉద్భవించిన నాటి నుంచి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడం.. నియంత్రణ చర్యలకై సభ్య దేశాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడం తదితర అంశాల్లో అంతర్జాతీయ సంస్థ స్పందించిన తీరుపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా కోరాయి. (అది మనుషులకు ప్రమాదం: డబ్ల్యూహెచ్‌వో) ఈ క్రమంలో జపాన్, యూకే, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, బ్రెజిల్, కెనడా, భారత్ వంటి 62 దేశాలు వీటికి మద్దతు పలికాయి. మరోవైపు... కరోనా బయటపడిన తర్వాత తొలిసారిగా వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 73వ వార్షిక సమావేశం సోమవారం జెనీవాలో ప్రారంభమైంది. కరోనా సంక్షోభానికి కేంద్ర బిందువుగా భావిస్తున్న చైనాపై విచారణకు ఈ వేదికను ఉపయోగించుకోవాలని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అదే సమయంలో తనపై వస్తున్న ఆరోపణలకు చైనా ధీటుగా బదులిచ్చేందుకు చైనా సైతం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా డబ్ల్యూహెచ్ఏ నుంచి తైవాన్‌కు ఆహ్వాన ప్రతిపాదనపై పలు దేశాలు మద్దతునివ్వడాన్ని కూడా చైనా తప్పుబట్టింది. ఇదిలా ఉండగా.. వైరస్‌కు జన్మస్థానంగా భావిస్తున్న చైనాలోని వుహాన్ నగరం పేరును మాత్రం డ్రాఫ్ట్ రిసల్యూషన్‌లో ప్రస్తావించకపోవడం గమనార్హం.(భారత్ మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నాం: తైవాన్) ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఫల్యం ఎక్కడ!? -
కోవిడ్-19 : డబ్ల్యూహెచ్ఓ కీలక సూచన
జెనీవా : కరోనా మహమ్మారి మూలాలపై తర్జనభర్జనలు సాగుతున్న క్రమంలో ఫ్రాన్స్‌లో గత ఏడాది డిసెంబర్లోనే కోవిడ్-19 వెలుగు చూసిందనే వార్తను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఉటంకించింది. గతంలో అంచనా వేసిన దానికంటే ముందే అక్కడ కరోనా వ్యాప్తి మొదలైందనే సమాచారం ఆశ్చర్యపరచలేదని వ్యాఖ్యానించింది. గతంలో వెల్లడైన కరోనా అనుమానిత కేసులను విచారించాలని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని అర్ధం చేసుకోవడంలో ఈ పరిశోధన ఉపకరిస్తుందని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి క్రిస్టియన్ లిండ్‌మీర్ పేర్కొన్నారు. శాంపిల్స్‌ను తిరిగి పరీక్షిస్తే గత అనుమానిత వైరస్ కేసులు వెలుగుచూస్తాయని తెలిపారు. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 36,71,812కు చేరగా మృతుల సంఖ్య 2,53,241కు పెరిగింది. ఇక భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 46,711కు పెరగ్గా 1583 మంది మహమ్మారి బారిన పడి మరణించారు. 13,161 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. చదవండి : లాక్డౌన్ ఎత్తివేతపై హెచ్చరికలు -
9 మంది ఐక్య రాజ్య సమితి సిబ్బందికి కరోనా!
జెనీవా: ప్రపంచ మానవాళికి దడ పుట్టిస్తున్న మహమ్మారి కరోనా ఐక్య రాజ్య సమితికీ పాకింది. జెనీవాలోని 9 మంది యూఎన్ కార్యాలయ సిబ్బందికి కరోనా సోకినట్టు ఐక్యరాజ్య సమితి సమాచార డైరెక్టర్ అలెసాండ్రా వెలుసి తెలిపారు. ఈమేరకు ఆమె ఓ లేఖలో పేర్కొన్నట్టు జిన్హువా వార్త సంస్థ మంగళవారం వెల్లడించింది. అయితే, ప్రస్తుత సమయంలో బాధితులకు సంబంధించిన వివరాలేవీ చెప్పబోమని ఆమె స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. స్థానిక స్విట్జర్లాండ్ ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి కోవిడ్-19 పై పోరుకు పనిచేస్తామని తెలిపారు. (చదవండి: కొంపముచ్చిన మొక్కుబడి హెచ్చరికలు) కాగా, మార్చి 28న వెలుసి మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 78 మంది యూఎన్ సిబ్బందికి కరోనా సోకిందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. జెనీవాలోని యూఎన్ కార్యాలయంతోపాటు.. అక్కడే ఉన్న అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తమ సిబ్బందిలో కొందరికి కరోనా సోకిందని ప్రకటించాయి. ఈనేపథ్యంలో యూఎన్ సిబ్బందిలో దాదాపు అందరూ ఇప్పుడు టెలీ వర్కింగ్ చేస్తున్నారు. కరోనా నియంత్రణకు తమ వంతు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలెవరూ తమ కార్యాలయాలకు రాకుండా చూస్తున్నామని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఇక 85 లక్షల జనాభా ఉన్న స్విట్జర్లాండ్‌లో మంగళవారం ఉదయం వరకు 16,176 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 373 మంది మరణించారు. (చదవండి: గల్లీల్లో 'ఢిల్లీ') -
కరోనా కట్టడి : లాక్డౌన్లు సరిపోతాయా?
జెనీవా : కోవిడ్-19 మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వరుసగా పెరగుతున్న పాజిటివ్ కేసులతో భారతదేశం గజగజలాడుతోంది. ఈక్రమంలో దేశంలోని అన్నిరాష్ట్రాలు ఇప్పటికే సత్వర చర్యలకు దిగాయి. కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. తద్వారా అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈప్రాణాంతక వ్యాధి విస్తరణను అడ్డుకోవాలనేది ప్రధాన లక్ష్యం. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్‌వో) నిపుణుడు మైక్ ర్యాన్ కొన్ని కీలక విషయాలను ప్రకటించారు. వైరస్ నిరోధానికి కేవలం లాక్డౌన్లు ఎంత మాత్రం చాలవని పేర్కొన్నారు. వైరస్ తిరిగి పుంజుకోకుండా ఉండాలంటే కరోనా బాధిత దేశాలు వైరస్ సోకిన వాళ్లను కనిపెట్టి వాళ్లను ఐసోలేషన్ వార్డుకు తరలించడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఆయా దేశాలు చేపట్టే కట్టుదిట్టమైన ప్రజారోగ్య చర్యలు కీలకమని అన్నారు. (ట్రంప్ గుడ్‌న్యూస్.. కరోనాకు విరుగుడు..!) ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర నిపుణుడు డాక్టర్ మైక్ ర్యాన్ బీబీసీ ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. ‘అనారోగ్యంతో ఉన్నవారిని, వైరస్ ఉన్నవారిని కనుగొనడం, వారిని వేరుచేయడం, వారి పరిచయాలను కనుగొని వారిని వేరుచేయడం పై నిజంగా దృష్టి పెట్టాలి. లాక్ డౌన్లతో ప్రస్తుతం ప్రమాదం.. లాక్డౌన్లు విధించినంత మాత్రాన వైరస్‌ను అడ్డుకోలేం. బలమైన ప్రజారోగ్య సంరక్షణ చర్యలు బలంగా లేకపోతే లాక్డౌన్లు ఎత్తివేసినప్పుడు, ప్రమాదం ముదిరి వ్యాధి తిరిగి మరింత ఎక్కువగా వ్యాపిస్తుంది. చైనా, సింగపూర్, దక్షిణ కొరియా వంటి దేశాలు వైరస్ బాధితులను వేగంగా గుర్తించిడంతో పాటు, కఠినమైన చర్యలతో వ్యాధిని కట్టడిచేశాయి. ఆ దేశాలను మిగతా దేశాలు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైరస్ పై పోరుకు తీవ్రమైన ఆంక్షలను ప్రవేశపెట్టాయి. వర్క్ ఫ్రం హోం, పాఠశాలలు, బార్లు, పబ్బులు , రెస్టారెంట్లు మూసివేత లాంటిచర్యలు చేపట్టాయి. త్వరలోనే ఈ వైరస్‌కు టీకా వస్తుందని ఆశిస్తున్నాం. కానీ తక్షణం దీన్నుంచి బయటపడేందుకు ఇప్పుడు చేయవలసినది చేయాలి. ప్రజలు బాధ్యతగా జాగ్రత్తలు పాటించడం చాలా కీలకం’ అని పేర్కొన్నారు. -
కోవిడ్-19 : స్విస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
కోవిడ్-19 (కరోనా వైరస్) ఆటో ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తోంది. చైనాలోని వూహాన్ విస్తరించిన ఈ ప్రాణాంతకమైన వైరస్ 6 ఖండాల్లో తన ఉనికిని చాటుకుని మరణ మృదంగం వాయిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలవిల్లాడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి అసాధారణమైన చర్యగా 1,000 మందికి పైగా ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలను నిషేధిస్తూ స్విట్జర్లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని, మార్చి 15 వతేదీ వరకు ఈ నిషేధం అమల్లో వుంటుందని తెలిపింది. దీంతో జెనీవాలో జరగనున్న అంతర్జాతీయ ఆటో షోను కూడా నిర్వాహకులు రద్దు చేశారు. ఆటో పరిశ్రమకు ప్రధానమైన జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో రద్దయిందని స్థానిక అధికారులు శుక్రవారం తెలిపారు. "90వ జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో-2020 జరగదు" అని జెనీవా ప్రాంతీయ కంటోనల్ ప్రభుత్వ అధినేత ఆంటోనియో హోడ్జర్స్ ట్విటర్లో వెల్లడించారు. మరోమూడు రోజుల్లో ఆటో షోలో ప్రధాన వేడుక ప్రారంభం కానుండగా తాజా నిర్ణయం వెలువడింది. ఈ పరిస్థితికి చింతిస్తున్నామనీ, కానీ ఆటో షో పాల్గొనే వారందరి ఆరోగ్యమే తమ ప్రధాన ప్రాధాన్యత అని ఫౌండేషన్ బోర్డు చైర్మన్ మారిస్ తురెట్టిని తెలిపారు. భారీగా పెట్టుబడులు పెట్టిన తయారీదారులకు ఈ నిర్ణయం విపరీతమైన నష్టమే అయినప్పటికీ, అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉందన్నారు. (కోవిడ్-19 షాక్‌నకు ఆర్థిక టానిక్ అదే!) ఈ కార్ షో వచ్చే వారం (మార్చి5 -15) ప్రారంభం కానుంది. కరోనా విజృంభిస్తున్న క్రమంలో ఇప్పటికే చాలా దేశాలు కార్ షోలో తాము పాల్గొడంలేదని ఇప్పటికే ప్రకటించాయి. అలాగే హై ప్రొఫైల్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా తన సందర్శనను రద్దు చేసుకున్నారు. ప్రయాణ ఆంక్షలు, కరోనావైరస్ వ్యాప్తి భయాలు బార్సిలోనాలోని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్, ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరగనున్న లైట్ , బిల్డింగ్ ఫెయిర్ , బీజింగ్ ఆటో షోతో సహాపలు ముఖ్యకార్యక్రమాలను వాయిదా లేదా రద్దుకు కారణమయ్యాయి. కాగా ప్రపంచాన్ని చుట్టేస్తున్న మహమ్మారి కరోనావైరస్కు సంబంధించి మూడు ఖండాల్లోని దేశాలు మొదటి కేసులను శుక్రవారం నివేదించాయి. స్విట్జర్లాండ్‌లో ధృవీకరించిన కరోనావైరస్ కేసుల సంఖ్య 15కి పెరిగిందని, 100 మందికి పైగా పరిశీలనలో ఉన్నారని ప్రభుత్వ మంత్రి అలైన్ బెర్సెట్ తెలిపారు. చదవండి : 5 నిమిషాల్లో రూ. 5 లక్షల కోట్లు హాంఫట్ ఏప్రిల్ నుంచి పెట్రోలు ధరల మోత? -
తొలిసారిగా కశ్మీర్ భారత రాష్ట్రమని అంగీకరించిన పాక్!
జెనీవా : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో దాయాది దేశం పాకిస్తాన్ వీలు చిక్కినప్పుడల్లా భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టేందుకు అన్ని ప్రయత్నాలు విఫలమైన వేళ పాక్ మరోసారి ఐక్యరాజ్య సమితి ఎదుట కశ్మీర్ అంశాన్ని లేవనెత్తేందుకు సిద్ధమైంది. జెనీవాలో జరుగుతున్న యూఎన్ మానవ హక్కుల కమిషన్ మండలి సమావేశానికి పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పే క్రమంలో భారత దేశంలోని రాష్ట్రమైన జమ్మూ కశ్మీర్ అంటూ సంబోధించారు. ‘ కశ్మీర్లో పరిస్థితులను సమీక్షించేందుకు యూఎన్ ఆధ్వర్యంలో కమిటీ నియమించాలి. కమిటీ సభ్యులకు మేము పూర్తి మద్దతునిస్తాం అని పేర్కొన్నారు. అదే విధంగా కశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయంటూ భారత్ చెప్పడం విడ్డూరంగా ఉంది’ అని ఖురేషి విమర్శలు గుప్పించారు. #WATCH: Pakistan Foreign Minister Shah Mehmood Qureshi mentions Kashmir as “Indian State of Jammu and Kashmir” in Geneva pic.twitter.com/kCc3VDzVuN — ANI (@ANI) September 10, 2019 కాగా పాక్ ఆరోపణలకు ధీటుగా సమాధానమిచ్చేందుకు భారత ప్రతినిధులు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కశ్మీర్ అంశంపై పాక్ వాదనలను తిప్పికొట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేశామని.. తమకు అవకాశం వచ్చినపుడు వాళ్లకు సరైన సమాధానం చెబుతామని వెల్లడించారు. కాగా కశ్మీర్ భారత అంతర్గత అంశమని ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్యదేశాలైన రష్యా, యూకే, అమెరికా సహా ఫ్రాన్స్ వంటి ఇతర దేశాలు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి అంతర్జాతీయ సమాజం ముందు భారత్ పరువు తీయాలని భావించిన పాక్ మంత్రి... కశ్మీర్ భారత రాష్ట్రం అని సంబోధించి నాలుక కరుచుకున్నారు. దీంతో దేశ విభజన నాటి నుంచి ఇప్పటిదాకా దాయాది దేశం వెంట ఈ మాట వినాలని ఎదురు చూస్తున్న వాళ్లకు ఖురేషి మాటలు హాయినిస్తాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తద్వారా కశ్మీర్ భారత అంతర్గత అంశమని పాక్ కూడా ఒప్పుకున్నదంటూ తమదైన శైలిలో పాక్ తీరును ఎండగడుతున్నారు. -
అందరికీ ఆరోగ్యం.. అదే మా నినాదం
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రతి ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తోంది. డబ్ల్యూహెచ్ఓ ఏర్పడిన రోజునే ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. 1948లో జెనీవాలో తొలిసారిగా జరిగిన డబ్ల్యూహెచ్ఓ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. 2019 సంవత్సరంతో డబ్ల్యూహెచ్ఓ 70 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరానికి గాను ‘అందరికీ ఆరోగ్య రక్షణ’ అనే నినాదాన్ని ఇచ్చింది. ‘కుల, మత, జాతి, ప్రాంత, ఆర్థిక తేడాలు లేకుండా అందరికీ ఒకే విదమైన ఆరోగ్య రక్షణ, నాణ్యమైన సేవలు అందించడం అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధోనం గెహెబ్రేస్స్ తెలిపారు. ఆయన ఆదివారం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో తమ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెడ్రోస్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో అనేక దేశాల్లో ప్రభలుతున్న వ్యాధులను, అనారోగ్యం వల్ల సంభవించే మరణాలను నిర్మూలించేందుకు తమ సంస్థ చాలా కృషి చేస్తోందని, అయినప్పటికీ ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికి కూడా ప్రపంచంలో సగం జనాభాకు తగిన వైద్యం అందడం లేదని, కొన్ని దేశాల్లో కనీస వైద్య సౌకర్యాలు లేక గర్భిణీ మహిళలు అవస్థలు పడుతున్నారని, చాలా మంది పిల్లలకు రోగనిరోధక టీకాలు కూడా అందడం లేదని టెడ్రోస్ ఆవేదన వ్యక్తం చేశారు. మరికొన్ని దేశాల ప్రజలకు సరైన సమయంలో వైద్యం అందక హెచ్ఐవీ, టీబీ, మలేరియా బారిన పడి చనిపోతున్నారని, 2019 సంవత్సరంతో ఇవన్నీ ఆగిపోవాలని కోరుకుంటున్నాట్లు తెలిపారు. పేద వారికి కూడు, గూడు, గుడ్డతో పాటు ఆరోగ్యం కూడా కనీస సదుపాయంగా కల్పించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశ్యమని, అందుకే 2019లో ‘అందరికి ఆరోగ్య రక్షణ ప్రతి ఒక్కరికి, ప్రతి చోటుకు’ అనే నినాదంతో ప్రజలందరికి ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. -
పాక్ జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించిందా?
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్థాన్ సైనికులకు బందీగా చిక్కిని భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్‌ను చిత్రహింసలకు గురిచేయవద్దని, జెనీవా ఒప్పందానికి కట్టుబడి వ్యవహరించాలని పాక్ సైన్యానికి భారత్‌తోపాటు అంతర్జాతీయ సమాజం విజ్ఞప్తి చేసింది. ఇంతకు జెనీవా ఒప్పందం అంటే ఏమిటీ ? అందులోని అంశాలేమిటీ? అవి ఎప్పుడు అమల్లోకి వచ్చాయి ? జేనీవా ఒప్పందానికి ఏయే దేశాలు కట్టుబడి ఉండాలి ? ఉల్లంఘిస్తే శిక్షేమిటీ ? జేనీవా ఒప్పందంలో నాలుగు అంతర్జాతీయ ఒప్పందాలు అంతర్భాగం. ఈ ఒప్పందంపై సంతకం చేసిన ప్రతి దేశం అంతర్జాతీయ మానవతా విలువలకు కట్టుబడి వ్యవహరించాలి. 1929లో మొదటిసారి ఈ ఒప్పందం అమల్లోకి రాగా, రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక రెండో సారి 1949లో ఆధునీకరించారు. జెనీవా ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఓ సైనికుడు పట్టుబడినా, ఓ పౌరుడు పట్టుబడినా వారిని ఎలా చూసుకోవాలో స్పష్టమైన నిబంధనలను రచించారు. ఒక్క యుద్ధం జరిగినప్పుడు మాత్రమే కాకుండా శాంతియుత పరిస్థితుల్లో కూడా దేశాల మధ్య ఈ నిబంధనలు వర్తిస్తాయి. (పైలట్ అభినందన్ తండ్రి భావోద్వేగం) 13వ అధికరణం ఏం చెబుతోంది? పట్టుబడిన సైనికుడికి అవసరమైన వైద్య చికిత్సలు అందించడంతోపాటు ఆయన్ని ఎలా చూసుకోవాలో కూడా జెనీవా ఒప్పందంలోకి 13వ అధికరణం తెలియజేస్తోంది. ‘నిర్బంధంలో ఉన్న సైనికుడిని శారీరకంగా ఎలాంటి హింసకు గురి చేయరాదు. హింస కారణంగా బందీ గాయపడినా, ప్రాణం పోయినా, ప్రాణాపాయానికి గురైన ఒప్పందం ప్రకారం తీవ్రమైన నేరం. ప్రజల నుంచి పొంచి ఉన్న ముప్పు నుంచి, ప్రజా హింస నుంచి పూర్తి రక్షణ కల్పించాలి. బందీపై ఎలాంటి వైద్య, శాస్త్ర ప్రయోగాలు నిర్వహించరాదు’ అని చెబుతోంది. భారత పైలట్ అభినందన స్థానిక ప్రజలకు చిక్కగానే వారు ఆయనపై దాడి చేసిన విషయం తెల్సిందే. (ట్రెండింగ్: వెలకమ్ బ్యాక్ అభినందన్) ఇదే సెక్షన్‌కు రెడ్‌క్రాస్ సొసైటీ అంతర్జాతీయ కమిటీ ఇచ్చిన నిర్వచనం ప్రకారం పట్టుబడిన బందీ ఫొటోలనుగానీ, వీడియోలనుగానీ విడుదల చేయరాదు. విడుదల చేసినట్లయితే ఆయన ప్రాణాలకు ప్రజల నుంచి లేదా ఇతర శక్తుల నుంచిగా ముప్పు ఉంటుందన్నది రెడ్‌క్రాస్ కమిటీ అభిప్రాయం. ఈ లెక్కన పాక్ సైనికులకు చిక్కిన అభినందన ఫొటోలను, వీడియోలను పాక్ సైనికులు విడుదల చేశారు కనుక వారిపై జెనీవా ఒప్పందం ఉల్లంఘించారని భారత్ అభియోగాలు మోపవచ్చు! (తలొగ్గిన పాక్.. రేపు అభినందన్ విడుదల) జెనీవా ఒప్పందంలో 140 అధికరణలు ఉన్నాయి. ఓ బందీ పట్ల జైలు లోపల, జైలు బయట, కోర్టులో కేసు విచారణ సందర్భంగా ఎలా ప్రవర్తించాలో, వారికి ఎలాంటి భోజనం పెట్టాలో, వారు ఉండేందుకు ఎలాంటి వసతి కల్పించాలో, పట్టుబడిన వెంటనే ఎలాంటి ప్రొటోకాల్స్ పాటించాలో ఈ అధికరణలు స్పష్టం చేస్తున్నాయి. బందీ మత విశ్వాసాల ప్రకారం ప్రార్థనలు చేసుకునే అవకాశం కూడా ఇవ్వాలి. ఈ ఒప్పందంపై అనేక దేశాలతోపాటు భారత్, పాకిస్థాన్ దేశాలు కూడా సంతకాలు చేశాయి. ఇందులోని నిబంధనలను, మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయవచ్చు. అయితే అక్కడ అంత త్వరగా కేసులు పరిష్కారం కావు. రాజీలే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో అంతర్జాతీయ ఒత్తిడులే ఎక్కువగా పనిచేస్తాయి. (ఎవరీ అభినందన్?) గతంలో జరిగిన సంఘటనలు 1999లో కార్గిల్ యుద్ధం సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన పైలట్, గ్రూప్ క్యాప్టెన్ కే. నాచికేత విమానం చెడిపోవడంతో పారాషూట్ సాయంతో కిందకు దూకేశాడు. ఆయన్ని పాక్ సైనికులు బంధించారు. భారత్ ఈ విషయమై ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించడంతోపాటు అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి తీసుకరావడంతో ఎనిమిది రోజుల అనంతరం ఆయన్ని విడిచిపెట్టారు. అయితే తన నుంచి గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని తెలుసుకోవడం కోసం తనను చిత్ర హింసలకు గురిచేశారని అప్పుడు ఆయన ఆరోపించారు. 1965లో జరిగిన భారత్, పాక్ యుద్ధం సందర్భంగా అనేక మంది భారత సైనికులు పాక్‌కు బంధీలుగా చిక్కారు. 2015, ఆగస్టు నెలలో ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప కుమారుడు కేసీ కరియప్ప పాక్ సైనికులకు చిక్కారు. ఆయన నాలుగు నెలల అనంతరం విడుదలయ్యారు. పాక్ జైళ్లలో తన నాలుగు నెలల అనుభవాలను ఆయన ‘అవుట్ లుక్’ పత్రికలో సవివరంగా రాశారు. -
దళిత మహిళలపై ఇలాంటి దారుణాలెన్నో!
సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత దేశంలో పుట్టుకతోనే దళిత మహిళలపై వివక్ష కొనసాగుతోంది. దళిత యువతులపై దారుణాలు జరుగుతున్నాయి. దళిత మహిళలను ఎప్పుడైనా ఏమైనా చేయవచ్చని, ఏం చేసినా చెల్లిపోతుందని, తమకు వ్యతిరేకంగా నోరు విప్పేవారే ఉండరన్నది అగ్రవర్ణాల అహంకారం. నిర్జన ప్రదేశాల్లో దళిత బాలికలు, యువతులు కనిపిస్తే వారిపై అగ్రవర్ణాల మగాళ్లు ఎక్కడెక్కడనో చేతులు పెడతారు, ఏవేవో తడుముతారు. అనుకుంటే వారి ఇళ్లకు, వారి గదుల్లోకి, వారి పక్కలోకి వెళ్లగలమని భావిస్తారు. ఇందులో భయపడాల్సింది ఏమీ లేదని, తమను ఎవరు ఏమీ చేయలేరన్నది అగ్రవర్ణ మగవాళ్ల ఆలోచన’ అని మధ్యప్రదేశ్‌కు చెందిన సుమన అనే దళిత మహిళ వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ‘అధికారంలో ఉన్నా దళిత మహిళలకు రక్షణ లేదు. వారిని కూడా అగ్రవర్ణాల వారే నియంత్రిస్తుంటారు. దళితులపై జరిగిన దాడికో, దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలబడితే దళిత సర్పంచ్‌లను కూడా లక్ష్యంగా చేసుకొని హింసిస్తారు. చంపేస్తారు. ఓ గ్రామంలో దళిత మహిళపై జరిగిన దారుణాన్ని ఓ దళిత మహిళా సర్పంచ్ ప్రశ్నించినందుకు ఆమెను, ఆ మహిళను సజీవంగా దహనం చేశారు. మరో దారుణాన్ని ప్రశ్నించినందుకు ఓ దళిత సర్పంచ్ మేనల్లుడిని చితకబాదారు. ఈ రెండు సంఘటనల్లో ఎలాంటి కేసులు లేవు. శిక్షలు లేవు. నేను కూడా నా విధులను సక్రమంగా నిర్వర్తించాలని అనుకుంటాను. అగ్రవర్ణాల వారు చేయనీయరు’ అని అదే రాష్ట్రానికి చెందిన గాయత్రి అనే ఓ గ్రామ సర్పంచ్ చెప్పిన కథనం. ‘అగ్రవర్ణాల మహిళలు, దళిత మహిళలు ఒక్కటేనంటే, వారిద్దరు సమానమంటే నేను ఒప్పుకోను. 15 ఏళ్ల దళిత బాలికలపై 33.2 శాతం అత్యాచారాలు జరుగుతుంటే అగ్రవర్ణాల బాలికలపై 19.7 శాతం అత్యాచారాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ లెక్కలే తెలియజేస్తున్నాయి. దళిత మహిళలపై జరుగుతున్న దారుణాల్లో వందకు ఐదు కేసులు మాత్రమే కోర్టుకు వస్తున్నాయి. ముందుగా కేసులు దాఖలైనా ఒత్తిళ్ల మేరకు అవి కోర్టు వరకు చేరుకోవు’ అని హర్యానాలో పానిపట్‌లో సవిత అనే దళిత లాయర్ అభిప్రాయపడ్డారు. జెనీవా సదస్సుకు నివేదన వీరి అభిప్రాయాలను జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల 38వ సమావేశంలో ‘అఖిల భారత దళిత మహిళా అధికార్ మంచ్’ నాయకులు గురువారం నాడు వినిపించారు. జూన్ 19వ తేదీ నుంచి ఈ సమావేశాలు కొనసాగుతుండగా, తమ వాదనను వినిపించేందుకు తమకు ఈ రోజు అవకాశం లభించినట్లు మంచ్ ప్రధాన కార్యదర్శి ఆశా కోతల్ తెలిపారు. దేశంలో కుల వివక్ష కొనసాగుతోందని, ముఖ్యంగా దళితులను అంటరాని వారిగా చూస్తారని భారత ప్రభుత్వం ఏనాడు అంతర్జాతీయ వేదికలపై అంగీకరించలేదు. పైగా అదంతా అబద్ధమంటూ ఖండించేది. వివక్ష దాడుల గురించి ఇలా వివరించినప్పుడు అది తమ అంతర్గత విషయమని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామంటూ ముక్తిసరి మాటలతోనే వాస్తవాలకు మసిపూసేది. ఈ మాత్రం అంగీకరించడం కూడా డర్బన్‌లో 2001లో జాతి విద్వేశంపై జరిగిన ప్రపంచ సదస్సులోనే జరిగింది. కుల వివక్ష అంశాన్ని జాతి విద్వేశంతో సమానంగా చూడవద్దని నాడు సదస్సును కోరింది. భారత్‌లో కొనసాగుతున్న కుల వివక్షతపై ఐక్యరాజ్య సమితి జాతి వివక్ష నిర్మూలన కమిటీ సభ్యురాలు రీటా ఇసాక్ 2016లో విడుదల చేసిన నివేదికను కూడా భారత ప్రభుత్వం నిర్ద్వంద్వంగా ఖండించింది. పోగొట్టుకోవడానికి మా వద్ద ఏమీ మిగల్లేదు ప్రపంచ సదస్సుల్లో భారత్‌లో కొనసాగుతున్న కుల, లింగ వివక్షతలపై అంతర్జాతీయ హక్కుల సంఘాలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, నివేదికల్లో వివక్షత తీవ్రత ప్రతిబింబించడం లేదన్న ఉద్దేశంతో దళిత మహిళా అధికార మంచ్ తొలిసారిగా దళిత మహిళల అభిప్రాయాలను వారి మాటల్లోనే వ్యక్తం చేసింది. ‘వాయిసెస్ అగనెస్ట్ క్యాస్ట్ ఇంప్యునిటీ: న్యారెటీస్ ఆఫ్ దళిత విమెన్ ఇన్ ఇండియా’ శీర్షికతో సమావేశానికి సమర్పించింది. ‘కుల వ్యవస్థ చావు కేకలను వినేందుకు మేము గుండెలు దిటువు చేసుకొని ముందుకు వెళుతున్నాం. విజయం కోసం మేము అన్నీ వదులుకున్నాం. పోగొట్టుకోవడానికి మా వద్ద ఇంకా ఏమీ మిగల్లేదు’ అన్న వ్యాఖ్యలతో ఆ నివేదికను ముగించారు. -
జెనీవా ఇంటర్నేషనల్ మోటర్ షో..
-
15 సెకన్లకే.. రెండు కిలోమీటర్లు
జెనీవా: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొలది మనిషి వేగం కూడా ఆలోచనంత వేగంగా కదులుతోంది. ఇందుకు సాక్ష్యంగా వచ్చే ఏడాది జెనీవాలో మారనున్న ప్రజా రవాణా వ్యవస్థ కనిపించనుంది. అవును.. 2017 నుంచి జెనీవాలో ప్రజా రవాణాలో విప్లవాత్మక మార్పు రానుంది. రెండు కిలో మీటర్ల దూరాన్ని 15 సెకన్ల చార్జింగ్‌తో ముగించేయగల బస్సులను ప్రజా రవాణాకోసం జెనీవా సిద్దం చేస్తోంది. ఈ బస్సులకోసం ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం పర్యావరణానికి హానీ కలిగించనిదట. ఇదే పరిజ్ఞానాన్ని కొంతమంది భారతీయ పర్యావరణ వేత్తలు విజ్ఞప్తి మేరకు వారికి కూడా అందించే ఆలోచన చేస్తున్నారట. జెనీవాలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాహనాల నిర్వహణ సంస్థ టీజీపీ, జెనీవా పవర్ యుటిలిటీ సిగ్ అండ్ ఏబీబీ సంయుక్త ఆధ్వర్యంలో వీటిని అభివృద్ది చేస్తున్నాయి. ఈ బస్సులు చూడ్డానికి యూరోపియన్ దేశాల్లోని ఎలెక్ట్రిక్ ట్రాలీ బస్సుల మాదిరిగానే ఉంటాయి. అయితే, వాటికి బస్సు వెళ్లే మార్గంలో ప్రత్యేక పవర్ పోల్స్ ఉండగా దీనికి మాత్రం బస్సుకు పైనే ఒక పెద్ద ప్యానెల్ ఉంటుంది. అందులో బస్సుకు అవసరమైన బ్యాటరీ ఉంటుంది. ప్రతి రెండు కిలో మీటర్లకు ఒక బస్ స్టాపు ఉండగా అందులో ఆ బస్సుకు చార్జింగ్ పెట్టుకునే అవకాశం ఏర్పాటుచేస్తారు. మాములుగా అయితే, గంటలకొద్ది చార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. కానీ, ఈ బస్సులకు మాత్రం 15 సెకన్లు చార్జింగ్ పెడితే రెండు కిలోమీటర్లు సునాయాసంగా పరుగెడతాయి. నగరంలో లోపల ఇలాంటి బస్సులు ఎక్కువ మేలును కలిగించనున్నాయి. -
90 శాతం మంది పీల్చేది ఆ గాలినే...
ఆధునిక జీవనం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో దాని మాటున కమ్ముకుంటున్న కాలుష్య ప్రమాదం కూడా అంత ముంచుకొస్తోంది. వాయు కాలుష్యం కొరల్లో లక్షలాది మరణాలు సంభవిస్తున్నాయనే హెచ్చరికలు నేపథ్యంలోనే మరో సంచలనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదిమందిలో తొమ్మిది మంది అంటే 90 శాతం మంది చెడుగాలినే పీల్చుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఏడాదిలో ఆరు మిలియన్లకు పైగా మరణాలు క్వాలిటీ లేని గాలి(విషపూరితమైన)ని పీల్చుకోవడం వలనే సంభవిస్తున్నాయని తేల్చింది. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ విభాగానికి సంబంధించిన డబ్ల్యూహెచ్ఓ డిపార్ట్మెంట్ అధినేత మరియా నైనా ఈ విషయాలను వెల్లడించారు. నగరాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని, మనం ఊహించుతున్న దానికంటే గ్రామాల్లో పరిస్థితేమి మెరుగ్గా లేదని డబ్ల్యూహెచ్ఓ నిపుణులు పేర్కొన్నారు. నగరాలతో పాటు గ్రామాల పరిస్థితి కూడా అధ్వాన్నంగా మారుతుందని తెలిపారు. అయితే ఇంకో సంచలనకర వార్తమేమిటంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే పేద దేశాల్లో ఈ కాలుష్యమయమైన గాలి ప్రభావం ఎక్కువగా ఉందని రిపోర్టులో పేర్కొంది. ప్రపంచమంతా, అన్ని ప్రాంతాల ప్రజలు ఈ కాలుష్య ముప్పుకు ప్రభావితమవుతున్నారని నైనా ఓ ప్రకటనలో చెప్పారు. ఇది పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీకి దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. గాలి కాలుష్యంపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై పరుగెడుతున్న వాహనాల శాతాన్ని తగ్గించడం, వ్యర్థ పదార్థాల నిర్వహణను మెరుగుపర్చడం, క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ వాడకానికి ప్రచారం కల్పించడం వంటి చర్యలను ప్రభుత్వాలు ప్రారంభిస్తేనే వాయు కాలుష్యాన్ని నిరోధించవచ్చని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా 3000 నగరాల డేటా ఆధారంగా యూఎన్ గ్లోబల్ హెల్త్ బాడీ ఈ రిపోర్టును రూపొందించింది. డబ్ల్యూహెచ్ఓ పరిమితుల కంటే ఎక్కువగా 92 శాతం మంది నాణ్యత లేని గాలిలో నివసిస్తున్నారని ఈ డేటాలో గుర్తించింది. ప్రమాదకరమైన అవుట్డోర్ గాలితో ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయో దానికి సమానంగా ఇన్డోర్ గాలితోనూ సంభవిస్తున్నాయని డేటా హెచ్చరించింది. వంటకోసం బొగ్గును కాల్చడం వల్ల పేద దేశాల్లో ఈ ప్రభావం అధికంగా ఉందని పేర్కొంది. వాయు కాలుష్యానికి సంబంధించిన దాదాపు 90 శాతం మరణాలు పేద, మధ్యతరగతి దేశాల్లోనే సంభవిస్తున్నాయని డేటా వెల్లడించింది. చైనా, మలేషియా, వియత్నాం లాంటి ఆగ్నేయ ఆసియా, పాశ్చాత్య పసిఫిక్ ప్రాంతాలు ఈ సమస్య బారిన ఎక్కువగా పడుతున్నాయని రిపోర్టు తెలిపింది. పర్యావరణానికి ముంచుకొస్తున్న కాలుష్య ముప్పుపై చర్చించడానికి గతేడాదే 150 దేశాల ప్రతినిధులు పారిస్‌లో కాప్ సదస్సు ఏర్పాటుచేశారు. ఆ సదస్సులో కాలుష్య శాతాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పూనుకున్నారు. తాజా డబ్ల్యూహెచ్ఓ రిపోర్టుతో ప్రపంచ దేశాలు వాయు కాలుష్యంపై మరింత పోరాడాల్సి ఉందని వెల్లడవుతోంది. -
సిరియాలో అంతర్యుద్ధం.. 60 మంది మృతి
బీరట్: సిరియాలో ప్రభుత్వం, తిరుగుబాటుదారుల మధ్య తీవ్ర అంతర్యుద్ధం జరుగుతోంది. ఉత్తర సిరియాలోని అలెప్పో నగరంలో గత 24 గంటల్లో జరిగిన వైమానిక దాడి, బుల్లెట్ల వర్షంలో కనీసం 60 మంది చనిపోయారు. అలెప్పోలో తిరుగుబాటుదారుల ఆక్రమిత ప్రాంతంలో ఆసుపత్రిపై జరిగిన దాడిలో 27 మంది మరణించారు. గురువారం నివాస ప్రాంతాల పై దాడులు చేయడంతో మరో 20 మంది చనిపోయారు. ఈ దాడులతో జెనీవాలో శాంతి చర్చలు కూడా ఆగిపోయాయి. -
సృజనాత్మకతకు ఓ వేదిక!
♦ జెనీవాలో 44వ ఇన్నోవేషన్ షో ప్రారంభం ♦ ఈ నెల 17 వరకు కొనసాగనున్న ప్రదర్శన ♦ 48 దేశాల నుంచి ఔత్సాహికుల హాజరు కొన్ని సమస్యలు చిన్నగా అనిపిస్తాయి. కాని వాటి పరిష్కారాలు కనిపెట్టడమే చాలా కష్టం. ఎంతో మంది ఇలాంటి సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలను కనిపెడుతూనే ఉంటారు. అయితే సృజనాత్మకత ఉన్న వారంతా ఒకే చోట చేరితే.. ఇలాంటి వారందరూ తమ ఆలోచనలను నలుగురితో పంచుకునేందుకు స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదికైంది. ఏప్రిల్ 13న ప్రారంభమైన 44వ ‘ఇన్వెన్షన్ షో’ 17 వరకు కొనసాగనుంది. ఇందులో 48 దేశాలకు చెందిన 752 మంది తాము రూపొందించిన దాదాపు వెయ్యి ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. అందులో మచ్చుకు కొన్ని మీకోసం.. పొరపాటున తప్పిపోయిన చిన్న పిల్లలను ఈ బూట్లు తమ తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాయి. ఎలాగంటే వాటిపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను మీ స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేస్తే చాలు. పిల్లల తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్లు ఫోన్లో కనిపిస్తాయి. ఈ బూట్లను దక్షిణ కొరియాకు చెందిన లీ యాన్ యున్ తయారు చేశారు. యున్ది మంచి స్మార్ట్ ఆలోచన కదా..! మొక్కజొన్న పిండిని రకరకాల వంటల్లో వాడుతుంటాం. అయితే శ్రీలంకకు చెందిన శోభనీ అనుషా విజయత మాత్రం కొంచెం వినూత్నంగా ఆలోచించింది. ఆ పిండికి మరికొన్ని పదార్థాలు కలిపి కేక్‌ల అలంకరణకు వాడే ‘ఐసింగ్’ స్థానంలో వాడే ఓ పదార్థాన్ని తయారు చేసింది. ఈ పదార్థం అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుని కేక్ పాడవకుండా ఉంచడమే కాకుండా షుగర్ ఫ్రీ కూడా ముడిచమురును తరలించే పైపు దేశదేశాలను దాటుకుని వెళుతుంటుంది. ఈ పైపుల్లో ఎక్కడైనా చిన్న లోపమొచ్చి లీకేజీ అయినా నష్టం భారీగా ఉంటుంది. పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. ఫొటోలో ఉన్న యంత్రంతో ఈ ప్రమాదాలకు చెక్ పెట్టొచ్చు. రుమేనియాకు చెందిన అడ్రియన్ తొమోయిగా ఈ యంత్రాన్ని కనిపెట్టాడు. దీని సాయంతో పెద్దపెద్ద పైపుల్లోని లోపాలను కనిపెట్టడమే కాదు మరమ్మతులు కూడా చేయొచ్చని చెబుతున్నాడు. కొన్ని రకాల పండ్లు పచ్చిగా ఉన్నా, బాగా మగ్గినా ఒకే రంగులో కనిపిస్తాయి. ఫొటోలో ఉన్న డ్యూరియన్ పండు కూడా అలాంటి కోవలోకే వస్తుంది. ఓ పండు కింద ఉన్న యంత్రాన్ని చూశారుగా! పండు ఏ స్థాయిలో మగ్గింది అనే విషయాన్ని ఇది సూక్ష్మ తరంగాల ద్వారా గుర్తించి మనకు చెబుతుంది. దీన్ని థాయ్‌లాండ్‌కు చెందిన సొరావత్ చివప్రీచ కనుగొన్నాడు. -
వేలానికి రూ. 320 కోట్ల వజ్రం
లండన్: తళతళలాడే స్పష్టమైన నీలి రంగు దీర్ఘచతురస్రాకారపు అతిపెద్ద వజ్రాన్ని వేలం సంస్థ క్రిస్టీ అమ్మకానికి పెట్టింది. 14.62 క్యారెట్ల బరువుగల ఈ వజ్రానికి ప్రామాణిక ధరను 320 కోట్ల రూపాయలుగా నిర్ణయించినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి అతిపెద్ద ఫ్యాన్సీ వజ్రం అమ్మకానికి తమ వద్దకు రావడం ఇదే మొదటి సారయితే లండన్‌లోని డైమండ్ సిండికేట్‌ను తన ఆధీనంలో ఉంచుకొని చక్రం తిప్పిన సర్ ఫిలిప్ ఓపెన్ హైమర్ పేరు మీద ఈ వజ్రం ఉండడం మరో విశేషమని వారు వివరించారు. సర్ ఫిలిప్ కేమ్బ్రిడ్జ్ యూనివర్శిటీలో చదవుకోవడమే కాకుండా అక్కడి బాక్సింగ్ టీమ్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. ఆయన అనంతరం 1934లో కుటుంబపరంగా సాగుతున్న వజ్రాల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత రెండో ప్రపంచయుద్ధం సందర్భంగా బ్రిటీష్ సైన్యంలో లెఫ్ట్‌నెంట్ కల్నల్‌గా పనిచేశారు. తిరిగి వజ్రాల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆ వ్యాపారంలో గొప్ప ఆర్కిటెక్ట్‌గా, మంచి నెగోషియేటర్‌గా పేరు తెచ్చుకున్న సర్ ఫిలిప్ మొత్తం లండన్‌లోని డమైండ్ సిండికేట్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. రినౌన్ రేసు గుర్రం యజమానికిగా కూడా గుర్తింపు పొందిన సర్ ఫిలిప్‌కు 1970లో ‘నైట్‌హుడ్’ కూడా లభించింది. ఆయన వద్ద అతిపెద్ద రతనాల కలెక్షన్ కూడా ఉండేది. అంతటి పేరు ప్రఖ్యాతలుగల ఫిలిప్ పేరిట ఉన్న ఈ నీలిరంగు వజ్రానికి మంచి ధర పలుకుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు కలెక్టర్ వద్దనున్న ఈ వజ్రాన్ని మే 18వ తేదీన జెనీవాలో వేలం వేయనున్నారు. -
ఆ నేడు 3 సెప్టెంబర్ 1976
గాలిలో లేచిన గంటకే... న్యూయార్క్ నుంచి జెనీవా బయల్దేరిన స్విస్ ఎయిర్‌క్రాఫ్ట్... గాలిలో లేచిన గంటకు నోవా స్కాటియా సముద్రతీర ప్రాంతంలో కూలిపోయింది. మెక్‌డొన్నెల్ డగ్లాస్ ఎం.డి-11 అనే ఆ స్కాటిష్ విమానంలో ప్రయాణిస్తున్న 229 మందీ ఆ దుర్ఘటనలో మరణించారు. అయితే విమానం ఎందుకు కూలిపోయిందనే దానిపై స్పష్టత రాలేదు. దీని వెనుక ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని తాము భావించడం లేదని యు.ఎస్. ఇంటెలిజెన్స్ ప్రకటించింది. క్యాబిన్ నుంచి పొగలు వచ్చాయని, ఆ తర్వాత కొద్దిసేపటికే విమానం కూలిపోయిందని రెస్క్యూ టీమ్ నివేదికను అందజేసింది. -
చెత్త ఏరుకుంటూ.. జెనీవా వరకు!
పుణే: పొట్టకూటి కోసం పుణేకి వచ్చాం. మా కులం మూలంగా మాకు ఎక్కడా ఏ ఉద్యోగమూ దొరకలేదు. చాలా బాధలు పడ్డాం.. దాంతో వేరే గత్యంతరం లేక పాత ఇనుప సామానులు, చిత్తు కాగితాలు, చెత్త సేకరించడం మొదలుపెట్టా. చెత్త సేకరించేటపుడు మొదట్లో స్థానికుల నుంచి, పోలీసుల నుంచి చాలా అవమానాలు ఎదుర్కొన్నా. దేనికి దాన్ని ప్రత్యేకంగా విడదీయడం వల్ల వచ్చే లాభాలు తెలుసుకున్నా... ఇలా అనర్గంళంగా సాగిపోతోంది. సాక్షాత్తు జెనీవా ప్రపంచ సదస్సులో... ఓ 50 ఏళ్ల చెత్త ఏరుకునే మహిళా కార్మికురాలి ప్రసంగం. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో ఓ కుగ్రామానికి చెందిన సుమన్ అంతర్జాతీయ కార్మిక సంస్థ అందించే అరుదైన పురస్కారాన్ని దక్కించుకుంది. జూన్ 1నుంచి l3 వరకు జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మికసదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొంది. ప్రపంచవ్యాప్తంగా హాజరైన 2000 మంది నిపుణులు ఆమె ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. వివరాల్లోకి వెళితే.. తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం చెత్త ఏరడాన్ని వృత్తిగా స్వీకరించిన సుమన్. ఈ క్రమంలో స్థానికుల నుంచి దొంగ అనే అవమానాలను భరించింది. అకారణంగా పోలీసుల వేధింపులు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే తన తోటి వారినందరినీ ఏకం చేసి కెకెపికెపి (కచరా, కాగజ్, పత్ర, కష్టాకారీ పంచాయత్) అనే సంఘాన్ని ఏర్పాటచేసింది. తమ హక్కుల కోసం పోరాడింది. తన అనుభవాలను తన సంఘంతో పంచుకుని వేస్ట్ మేనేజ్మెంట్లో అత్యుత్తమ ఫలితాలు సాధించింది. అలా స్థానిక మున్సిపాలిటీ దృష్టిలో పడింది. నగరంలోని పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు మున్సిపాలిటీ అధికారులతో కలిసి వేస్టే మేనేజ్మెంట్ పథకాన్ని విజయవంతంగా అమలుచేసింది. దీంతో ఇటు నగరాభివృద్ధికి, తన తోటి కార్మికుల సంక్షేమానికి చేసిన కృషికి గాను అరుదైన గౌరవ పురస్కారాన్ని అందుకుంది. అంతేకాదు 37 ఏళ్లుగా తాను ఈ వృత్తిలో ఉన్నానని, తన నలుగురు పిల్లల్ని చదివించుకోడానికి పస్తులు కూడా ఉన్నానని సుమన్ చెప్పారు. తన పిల్లలందరూ బాగా సెటిల్ అవ్వడంతో తన సంపాదన అంతా మురికివాడల్లో ఉండే పిల్లల చదువుల కోసం వెచ్చిస్తోందని సుమన్ బంధువు శ్వేత చెప్పారు. అంతేకాదు పిల్లలు క్రమంగా స్కూళ్లకు వెడుతున్నారో లేదో స్వయంగా తానే పర్యవేక్షిస్తుందనీ, ఈ విషయం తామందరికీ చాలా గర్వంగా ఉందన్నారు. ఆమె నలుగురు పిల్లల్లో ఒకరు డబుల్ మాస్టర్ డిగ్రీ సాధించి జర్నలిస్టుగా పనిచేస్తుండగా, మరొకరు సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్నారు. కొడుకు డిగ్రీ చదువుతున్నాడు. పెద్ద కూతురికి పెళ్లి చేసింది. -
కార్మిక విధానానికి ఐఎల్వో ఆమోదం
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగం పరిధిలోకి వచ్చేందుకు వీలుగా ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్వో) ఓ విధానాన్ని ఆమోదించింది. జెనీవాలో శుక్రవారం జరిగిన 104వ అంతర్జాతీయ కార్మిక సదస్సులో 484 ఓట్ల మెజార్టీతో దీన్ని ఆమోదించారు. భారత్‌లో 93 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలోనే ఉన్నారని, ఈ అంశంపై చర్చల్లో భారత్ కీలక పాత్ర పోషించిందని ఐఎల్వో ఉపాధి విధాన శాఖ డెరైక్టర్ అజితా అవద్ అన్నారు. సదస్సుకు భారత్ తరపున కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ హాజరై ప్రసంగించారు. -
అమెరికా దెబ్బకు మరో స్విస్ బ్యాంక్ మూసివేత
జెనీవా: పన్నుల ఎగవేతలకు ప్రోత్సహిస్తున్న ఆర్ధిక సంస్థలపై ఉక్కుపాదం మోపాలంటూ అమెరికా చేస్తున్న ఒత్తిడితో మరో స్విస్ బ్యాంక్ మూత పడింది. జ్యూరిచ్ కు చెందిన ఫ్రే అండ్ కో అనే స్విస్ బ్యాంక్ తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు వాటాదారులకు వెల్లడించింది. అమెరికాతో పన్న వివాదాల కారణంగా నియంత్రణలు అంతకంతకూ పెరిగిపోతుండటం, చిన్న బ్యాంకుల మనుగడకు వీలుకాని రీతిలో నిబంధనలు, కష్ట తరమైన మార్కెట్ పరిస్థితుల వల్లే ఈ మూసివేత నిర్నయాన్ని తీసుకున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది.దీంతో అమెరికా ఒత్తిడితో మూసేసిన రెండో స్విస్ బ్యాంక్ ఫ్రే అండ్ కో నిలిచింది. దాదాపు 2.2 బిలియన్ల డాలర్ల నిధులు ఈ బ్యాంక్ నిర్వహణలో ఉన్నాయి. అమెరికా పన్ను చెల్లింపుదారులు ఎగవేతలకు చేదోడుగా నిలుస్తాయన్న ఆరోపణలతో అక్కడి న్యాయశాఖ దాదాపు 14 స్విస్ బ్యాంక్ లపై దర్యాప్తు చేపట్టింది.