అఫ్గన్‌కు 60 కోట్ల డాలర్ల సాయం చేయండి: ఐరాస | World donors pledge more than 1 Billion dollers in aid for Afghanistan | Sakshi
Sakshi News home page

అఫ్గన్‌కు 60 కోట్ల డాలర్ల సాయం చేయండి: ఐరాస

Published Tue, Sep 14 2021 4:14 AM | Last Updated on Tue, Sep 14 2021 10:07 AM

World donors pledge more than 1 Billion dollers in aid for Afghanistan - Sakshi

జెనీవా: తాలిబన్ల వశమైన అఫ్గనిస్తాన్‌ను ఆదుకునేందుకు ఆపన్నహస్తం అందించా ల్సిందిగా సోమవారం ప్రపంచ దేశాలను ఐక్యరాజ్య సమితి(ఐరాస) కోరింది. ఈ ఏడాది డిసెంబర్‌ వరకు అఫ్గన్‌ ప్రజల కష్టాలు తీర్చేందుకు 60.6 కోట్ల డాలర్లు (దాదాపు రూ.4,463 కోట్లు) సాయం చేసి ప్రపంచ దేశాలు తమ మానవతా దృక్పథాన్ని మరోసారి చాటాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ హితవు పలికారు. సోమవారం జెనీవాలో జరిగిన విరాళాల సేక రణ సదస్సులో ఆయన మాట్లాడారు. అఫ్గన్‌ పేదలకు సాయపడాలన్నారు. ఐక్యరాజ్య సమితి అత్యవసర విభాగం తరఫున  2 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు సదస్సులో గుటెర్రస్‌ ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement