Donors Help
-
అమ్మా.. బతకాలని ఉంది!
కరీంనగర్: ‘అమ్మా.. నాన్న నాకు బతకాలని ఉంది. మీరు ఇన్నిరోజులు నా కోసం ఎంతోడబ్బు ఖర్చు చేశారు. ఇక డబ్బులు లేవని బాధపడకండి.. నేను మంచి మార్కులతో ఇంటర్మీడియెట్ పాసైన. జీవితంలో మరిన్ని సాధించాలని ఉంది. కానీ, నా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం, దాతలు దయ తలచి సాయం అందించి నా ప్రాణాలు కాపాడండి.. ప్లీజ్’ అంటోది కూనారపు సిరి.చదువులో మిన్న..రామగుండం కార్పొరేషన్ మూడో డివిజన్ జంగాలపల్లెలో నివసిస్తున్న కూనారపు పోశం–వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోశం సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పో షిస్తున్నాడు. ఏడాది క్రితం పెద్దకూతురు సిరి గో దావరిఖని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సీఈసీ విభాగంలో 927 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. కానీ, చదువులో గెలిచినా.. అనారోగ్యం ఆమెను వెంటాడుతోంది. ఆటో ఇ మ్యూన్ వ్యాధి బారిన పడడంతో కిడ్నీలు పనిచే యడం లేదని వైద్యులు తెలిపారు. వారి సూచన మేరకు వారానికి రెండుసార్లు డయాలసిస్ చేస్తు న్నారు. కిందుకోసం తల్లిదండ్రులు చాలావరకు అప్పు చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దాతలు ఆదుకోండి.. ప్రాణాలు కాపాడండి..ఆర్థిక ఇబ్బందులతో చదువుల తల్లి ఇబ్బంది పడుతున్న విషయాన్ని ప్రభుత్వం, మనసున్న దాతలు స్పందించి ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. తమ తూతురు ప్రాణాలు కాపాడి పునర్జన్మ ప్రసాదించాలని వారు వేడుకుంటున్నారు.సాయం అందించే వారు..కూనారపు పోశం: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాఖాతా నంబర్: 62414082268ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్ 0011086గూగుల్ పే, ఫోన్‌పే నం: 99590 59795అమ్మ వెంకటలక్ష్మి: 93985 57486తండ్రి పోశం: 89774 79397 -
నా కూతురే పెద్ద దిక్కనుకున్నా... ఇంతలోనే..!
కష్టాలు,కన్నీళ్లతో జీవితాన్ని అతి జాగ్రత్తగా నెట్టుకొస్తున్న కుటుంబానికి వరుసగా దెబ్బ మీద దెబ్బ కోలుకోలేని మరో దెబ్బ పడితే! కష్టసమయంలో ఫ్యామిలీగా అండగా ఉన్నవారే ఉన్నట్టుండి ప్రమాదంలో పడితే! ఆ ఇంట్లోని వాళ్లు అనుభవించే బాధ ఊహించడానికే కష్టం. లలిత మనీషా కష్టం అలాంటిదే! జీవన్మరణ పోరాట చేస్తున్న కన్న కూతురిని కాపాడుకునేందుకు అష్టకష్టాలుపడుతూ..దాతలు స్పందించాలని వేడుకుంటున్న కన్నతల్లి గాథ ఇది!! 2008లో లలితషా భర్త బ్రెయిన్ హేమరేజ్‌తో చనిపోయారు. ఆర్థిక సంక్షోభానికి తోడు, చిన్నపిల్లలతో కుటుంబాన్ని ఎలాగోలా నెట్టుకొస్తోంది. ఈ క్రమంలో పెద్ద కుమార్తె ఏళ్ల మనీషా(22) ఎంతో కష్టపడి పీజీ పూర్తి చేసి ఉద్యోగాన్ని సంపాదించుకుంది. కుటుంబం బాధ్యతలను తన భుజాలపై వేసుకుంది. చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుని, అనేక కష్టాలుపడిన తనకు అంతకంటే చిన్నవయసులోనే పెద్దకుమార్తె చేతికి అందిరావడంతో పొంగిపోయింది. కానీ ఆ ఆనందం ఆమెకు ఎంతోకాలం నిలవలేదు ఈ ఏడాదిలో కొద్దిగా తలనొప్పి అనిపించింది మనీషాకు. పెద్దగా పట్టించుకోలేదు యథావిధిగాగా డ్యూటీకి వెళ్లిపోయింది. తర్వాత అదికాస్తా మరింత తీవ్రమై గత ఏప్రిల్‌లో స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఆమెకు మెదడులో రక్తస్రావమై, గడ్డ కట్టినట్లు పరీక్షల్లో తేలింది. వైద్యులు ఎంఆర్ఐ, రక్తపరీక్షలు, సీటీ స్కాన్లు నిర్వహించి మనీషాకు మెదడుకు సంబంధించిన వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. తక్షణమే అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ క్రమంలో పక్షవాతానికి గురైన మనీషా మాట్లాడలేని, చూడలేని దీనస్థితికి చేరుకుంది. మెదడులో రక్తం గడ్డ కట్టడంతోపాటు, నీరు కూడా చేరడంతో తలంతా ఉబ్బిపోయింది. చివరికి, మనీషా బతకాలంటే న్యూరో సర్జరీ అవసరమని వైద్యులు తేల్చేశారు. దీనికయ్యే ఖర్చు రూ. 7,41,200 ($ 9291.25)గా అంచనా వేశారు. అయితే మనీషా వైద్యం కోసం నగలు అమ్మేశారు లలిత షా. దొరికిన చోటల్లా శక్తికిమించి అప్పు చేసి ఇప్పటికే రూ. 10లక్షలు దాకా ఖర్చు చేశారు. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన లలిత కుటుంబానికి ఇక వైద్య ఖర్చులు భరించే శక్తి లేదు. అందుకే దాతలే కరుణించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. "ప్రతి సెకనుకి నా బిడ్డ పరిస్థితి క్షీణిస్తోంది. సరిగ్గా చూడలేక నోరారా మాటకు నోచుకోకుండా పడివున్న నా కుమార్తెను చూస్తోంటే గుండె తరుక్కుపోతోంది. దయచేసిన నా పరిస్థితిని అర్థం చేసుకుని విరళాలివ్వండి! నా కుమార్తెను కాపాడండి’’ అంటూ కన్నీళ్లతో వేడుకుంటోంది. దయచేసి సాయం చేయండి,మనీషాకు ప్రాణభిక్ష పెట్టండి! అని ప్రార్థిస్తోంది. (అడ్వర్టోరియల్) మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
పాపం చిట్టితల్లి.. రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ వస్తేనే వైద్యం
సాక్షి,దుమ్ముగూడెం(ఖమ్మం): బోసినవ్వులతో ఇంట్లో ఆడుకోవాల్సిన పసిపాప అరుదైన వ్యాధి బారిన పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. వేలల్లో ఒకరికి వచ్చే జన్యుసంబంధిత వ్యాధితో 14 నెలల ఎల్లెన్ వైద్యశాలలో చికిత్స పొందుతుండడం హృదయాలను కలిచివేస్తోంది. చికిత్సకు రూ.16కోట్లు అవసరమని వైద్యులు చెప్పగా.. అంత స్థోమత లేని పాప తల్లిదండ్రులు బరువెక్కిన హృదయాలతో బోరున విలపిస్తున్నారు. సహృదయం కలిగిన దాతలు ముందుకొస్తే తప్ప తమ పాపను దక్కదని వేడుకుంటున్నారు. సత్వర వైద్యం అందకపోతే.. దుమ్ముగూడెం మండలంలోని రేగుబల్లి గ్రామానికి చెందిన రాయపూడి ప్రవీణ్ – స్టెల్లా దంపతులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు. ప్రవీణ్ ప్రైవేట్ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి 2018లో వివాహం కాగా 14నెలల ఎల్లెన్ పాప ఉంది. పాప నాలుగో నెల నుంచి మెడ భాగం పటిష్టంగా లేకపోవడం, కిందకు వాలిపోతుండడాన్ని తల్లిదండ్రులు గమనించారు. నెలలు గడుస్తున్నా శరీర భాగాల్లో కదలికలు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన వారు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. అయినా ఏమీ తెలియకపోవడంతో జన్యుసంబంధిత సమస్యగా అనుమానిస్తూ మరో రెండు పరీక్షలు నిర్వహించారు. అయినా చిన్నారి సమస్య బహిర్గతం కాలేదు. రోజురోజుకూ చిన్నారి కదల్లేని పరిస్థితికి చేరుతుండడంతో తల్లిదండ్రులు చెన్నైలోని వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. తమ స్థోమతకు మించి అప్పులు చేసి గత ఏడాది డిసెంబర్ 7న జెనెటిక్ పరీక్షలు చేయిస్తే ఈ నెల 10న రిపోర్టులు వచ్చాయి. ఈ నివేదిక ఆధారంగా ఎల్లెన్ జన్యుసంబందిత వ్యాధితో బాధపడుతోందని.. నరాలు, కండరాలు బలహీనంగా అయ్యాయని వైద్యులు వెల్లడించారు. సత్వర వైద్యం అందకపోతే భవిష్యత్ ప్రశ్నార్థకమేనని చెప్పడం... రానురాను చిన్నారి శరీర భాగాల్లో కదలికలు తగ్గుతుండడంతో తల్లిదండ్రులు దిగాలు చెందుతున్నారు. ప్రస్తుతం రోజుకు చిన్నారి మందులు, చికిత్స కోసం రూ.25వేల వరకు ఖర్చు అవుతుండగా ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతం. రూ.కోట్లల్లో ఖర్చు... చిన్నారి ఎల్లెన్‌కు నిర్వహించిన పరీక్షలలో జన్యుసంబంధిత వ్యాధిగా నిర్ధారించారు. అయితే, ఈ వ్యాధికి చికిత్స చేయించాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ (జోల్జెన్స్మా)ను అమెరికా నుంచి తెప్పించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబ పరిస్థితిల్లో ఇంత ఖర్చు అంటే సాధారణ విషయం కాదు. ప్రస్తుతం చేస్తున్న వైద్యం అంతా తాత్కాలికమేనని వైద్యులు సూచించారు. ఈ మేరకు ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చి చిన్నారి ఎల్లెన్‌కు ప్రాణభిక్ష పెట్టాలని ఆమె తల్లిదండ్రులు ప్రవీణ్ – స్టెల్లా కోరుతున్నారు. కాగా, ఎల్లెన్‌కు ప్రస్తుతం విజయవాడలోని రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఆమె చికిత్స కోసం సాయం చేయాలనుకునే దాతలు 99085 89604 నంబర్లో సంప్రదించాలని ప్రవీణ్ కోరారు. చదవండి: అంగన్వాడీల్లో గుడ్డు వెరీబ్యాడ్ -
మరుగుదొడ్డిలో నివాసం.. ‘సాక్షి’ చొరవతో సుజాతకు పక్కా ఇల్లు
బాలానగర్: మరుగుదొడ్డిలో నివసిస్తున్న ఆ కుటుంబ కష్టాలను సాక్షి వెలుగులోకి తీసుకువచ్చింది. సాక్షి కథనానికి స్పందించిన మానవతామూర్తులు ఆ కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని తిరుమలగిరికి చెందిన సుజాతకు పక్కా ఇల్లు కట్టించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చారు. గ్రామానికి చెందిన సుజాత భర్త ఆరేళ్ల కిందట మృతి చెందాడు. అయితే వారి ఇల్లు మూడేళ్ల కిందట కూలిపోయింది. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం కావడంతో ఇల్లు నిర్మించుకోవడం కష్టమవడంతో ఇంటి ముందు ఉన్న మరుగుదొడ్డిలోనే నివసిస్తున్నారు. చదవండి: మగువ, మందుతో ఖాకీలకు వల.. సవాల్‌గా కార్పొరేటర్ భర్త కేసు సుజాతతోపాటు తన ఇద్దరు పిల్లలు, అత్తతో కలిసి మరుగుదొడ్డిలో ఉంటున్నారు. వీరి కష్టాలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. ఇటీవల ఓ కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన హైదరాబాద్ ఇబ్రహీంపట్నం ఆదిబట్లకు చెందిన ప్రభాకర్‌రెడ్డి, ఆస్ట్రేలియాలో ఉన్న ఆయన బంధువు రాఘవరెడ్డి, రత్నాకర్‌రెడ్డి ముందుకు వచ్చారు. తమ స్నేహితుల సహకారంతో సుజాతకు ఇల్లు కట్టించేందుకు ఆర్థిక సహాయం అందించారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణం చురుకుగా సాగుతోంది. ఇందుకు సంబంధించి గ్రామానికి చెందిన మోహన్‌నాయక్‌కు రూ.1.60 లక్షలు అందజేసి ఇంటి నిర్మాణం పూర్తి బాధ్యతను అప్పగించారు. రెండు నెలల్లోగా ఇంటి నిర్మాణం పూర్తిచేయాలని వారు కోరారు. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’ -
అఫ్గన్‌కు 60 కోట్ల డాలర్ల సాయం చేయండి: ఐరాస
జెనీవా: తాలిబన్ల వశమైన అఫ్గనిస్తాన్‌ను ఆదుకునేందుకు ఆపన్నహస్తం అందించా ల్సిందిగా సోమవారం ప్రపంచ దేశాలను ఐక్యరాజ్య సమితి(ఐరాస) కోరింది. ఈ ఏడాది డిసెంబర్ వరకు అఫ్గన్ ప్రజల కష్టాలు తీర్చేందుకు 60.6 కోట్ల డాలర్లు (దాదాపు రూ.4,463 కోట్లు) సాయం చేసి ప్రపంచ దేశాలు తమ మానవతా దృక్పథాన్ని మరోసారి చాటాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ హితవు పలికారు. సోమవారం జెనీవాలో జరిగిన విరాళాల సేక రణ సదస్సులో ఆయన మాట్లాడారు. అఫ్గన్ పేదలకు సాయపడాలన్నారు. ఐక్యరాజ్య సమితి అత్యవసర విభాగం తరఫున 2 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు సదస్సులో గుటెర్రస్ ప్రకటించారు. -
‘అమ్మ ఆవేదన’కు కదిలిన హృదయాలు
శ్రీకాకుళం: టెక్కలి ఎన్టీఆర్ కాలనీకు చెందిన బూసి అఖిల్ అనే కిడ్నీ బాధిత యువకునికి సాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. కుమారుడి రెండు కిడ్నీలు పాడై, మెరుగైన వైద్యం కోసం తల్లి లోకేశ్వరి డబ్బులు కోసం పడుతున్న వేదనపై ‘సాక్షి’ లో ‘అమ్మ ఆవేదన’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి దాతలు స్పందిస్తున్నారు. టెక్కలికి చెందిన అభయం యువజన సేవా సంఘం సభ్యులు తమ వంతు సాయంగా రూ.15 వేలను బాధితుడి తల్లి లోకేశ్వరికి అందజేశారు. ఇందులో సేవా సంఘం నుంచి రూ.10 వేలు, ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన ఆర్థోపెడిక్ వైద్యుడు శంభాన శ్రీనివాసరావు తన వంతు సాయంగా రూ.5 వేలు అందించారు. అలాగే పట్టణానికి చెందిన మాజీ సర్పంచ్ బెహరా కృష్ణవేణి కాళీ తన వంతు సాయంగా రూ.5 వేలను బాధితుడి తల్లికి అందజేశారు. చదవండి: ట్విట్టర్‌ను వదిలేస్తున్నారు,'కూ' కు క్యూ కట్టేస్తున్నారు -
ప్లాస్మా కావాలంటే ఈ నంబర్లకు కాల్.. తీరా చేస్తే..
హిమాయత్‌నగర్: కోవిడ్ సమయంలో ‘మనుషుల మాట సాయం’ అవతలి వ్యక్తి ప్రాణాన్ని నిలబెడుతుంది. కోవిడ్‌కు గురైన వ్యక్తులకు ప్రస్తుతం రెమిడిసివర్ ఇంజక్షన్, ఆక్సిజన్ ఎంత అవసరమో.. ప్లాస్మా కూడా అంతే అవసరం. ప్లాస్మా కావాలంటే ఈ నంబర్లకు ఫోన్లు చేయండి. వీరంతా హైదరాబాద్‌లో ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ గత కొద్దిరోజులుగా వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ వంటి మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న నంబర్లన్నీ ఫేక్ అనే నిర్ధారణ బాధితుల నుంచి వెలువడుతుంది. ఆఖరి సమయంలో వారి సాయం కోసం ఫోన్ చేస్తుండగా స్విచ్ఛాఫ్ లేదా ఔట్ఆఫ్ కవరేజ్ అనేది వినిపిస్తుంది. వెరిఫైడ్ అంటూ వైరల్.. కోవిడ్ సెకెండ్ వేవ్ ప్రారంభమైన వారం రోజుల నుంచి ప్లాస్మా దాతల కోసం కోవిడ్ రోగుల తరుఫు బంధువులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్దికాలంగా 50 మంది లిస్ట్ ఉన్న ప్లాస్మా దాతల ఫోన్ నంబర్లు ఒక 5, 6 వాట్సాప్ గ్రూపుల్లో బాగా సర్క్యులేట్ అయ్యాయి. ఇవన్నీ తాము వెరిఫై చేసే పోస్ట్ చేస్తున్నామని, మీరు ఆపత్కాల సమయంలో సంప్రదించి ప్రాణాన్ని నిలబెట్టండంటూ ఓ సందేశాన్ని కూడా ఇస్తున్నారు. చాలా ఈ మెసేజ్‌లను ఫార్వర్డ్ కూడా చేస్తున్నారు. అయితే గత కొద్దిరోజులుగా కోవిడ్ బారీన పడిన వారు ప్లాస్మా దాతల కోసం ఈ ఫోన్నంబర్లకు ట్రై చేస్తుంటే ఏ ఒక్కరూ స్పందించడం లేదు. ఆయా నంబర్లకు ఫోన్లు చేస్తే స్విచ్ఛాఫ్ లేదంటే ఔట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుంది. ఇలా చివరి నిమిషంలో కోవిడ్ తరఫున నాన్న, కొడుకు, తల్లి, అక్క, చెల్లి పడుతున్న వేధన వర్ణణాతీతం. దీనిపై ఎవరూ కూడా సరైన అవగాహన లేకుండా సర్క్యులేట్ చేయడం కారణంగా విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ బాధితులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ( చదవండి: ఆక్సిజన్ వచ్చేసింది ) -
ఆమె కథలో వ్యథలెన్నో..!
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్. ఎందరో రోగులకు సేవ చేసి ప్రాణాలు నిలిపిన ఆమె ఇప్పుడు అనారోగ్యంపాౖలై మంచం పట్టింది. రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి. లివర్ పాడైంది. వైద్యానికి డబ్బులు లేక దాతలే తనను బతికించాలంటూ దీనంగా వేడుకుంటోంది. తనలాంటి కష్టం ఎవరికీ రాకూడదంటూ బోరున విలపిస్తోంది. కష్టాలు వెంటాడుతున్న ఓ గర్భిణి కథ ఇది.. దాతలు, ప్రభుత్వం ఆదుకుంటే గానీ తీరని వ్యథ ఇది... కంచరపాలెంలో నివాసముంటున్న బి.రాణి నర్సింగ్ విద్యనభ్యసించింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్‌గా చేరింది. ఎనిమిదేళ్ల క్రితం ప్రకాష్ అనే వ్యక్తిని వివాహమాడింది. భర్త రోజువారి కూలి. వీరికి ఒక కుమారుడు జన్మించాడు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకున్నా ఫెయిల్ కావడంతో మళ్లీ గర్భం దాలి్చంది. ప్రస్తుతం రాణి ఆరు నెలల గర్భిణి. ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుంది. రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయని, లివర్ పాడైందని వైద్యులు నిర్థారించారు. దీంతో కేజీహెచ్‌లో చేరేందుకు వెళితే అక్కడ ఎవరూ జాయిన్ చేసుకోలేదు. కేజీహెచ్ గైనకాలజీ విభాగం ముందున్న చెట్టు వద్దనే రోజంతా కూర్చుంది. విషయం తెలుసుకున్న తోటి నర్సింగ్ ఉద్యోగులు తలోకొంత వేసుకుని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆ డబ్బులతో వైద్యం సాధ్యం కాదని ఆ ఆస్పత్రి వైద్యులు చెప్పడంతో.. రాణి పుస్తెలు తాకట్టు పెట్టి కొంత నగదు, అలాగే మరో కొంతమంది స్నేహితులు కలిసి కొంత నగదు సేకరించి ఆస్పత్రికి కట్టారు. అలా చెల్లించిన డబ్బులు కేవలం రెండు రోజుల వైద్యానికే సరిపోయాయి. ఇప్పుడు కథ మళ్లీ మొదటికి వచ్చింది. చేతిలో చిల్లి గవ్వ లేదు. వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదని రాణి కన్నీటిపర్యంతమవుతోంది. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటోంది. తన కడుపులో పెరుగుతున్న పసికందు భవిష్యత్తు ఏమిటోనని ఆందోళన చెందుతోంది. దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. సహాయం చేసే దాతలు ఆంధ్రాబ్యాంకు, అకౌంట్ నంబరు 179610100043093, ఐఎఫ్ఎస్సీ కోడ్ ANDB0001796కు జమ చేయాలని విజ్ఞప్తి చేసింది. లేదా 93982 94998, 63095 41731 నంబర్లకు ఫోన్ చేసి ఆర్థిక సాయం చేయాలని రాణి వేడుకుంటోంది. -
బడి రుణం తీర్చుకున్నారు
సాక్షి, కాశీబుగ్గ(శ్రీకాకుళం) : అక్షరాలు నేరి్పన చోటు శిథిలమవ్వకుండా వారు కాపాడారు. విద్యా బుద్ధులు నేరి్పన బడి నిర్జీవమవుతుంటే వచ్చి ఆదుకున్నారు. బతుకునిచ్చిన బడి చితికిపోతుంటే ముందుకు వచ్చి తమ కర్తవ్యాన్ని మర్చిపోకుండా అమలు చేశా రు. మొత్తానికి ఆ బడి రుణం తీర్చుకున్నారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని చినబడాంలో 1956లో ప్రభు త్వ పాఠశాల ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అనేక మంది విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని వివిధ హోదా ల్లో స్థిరపడ్డారు. చాలా మంది విదేశాల్లోనూ ఉన్నత స్థాయిలో ఉన్నారు. సంక్రాంతి, ఉగాది తదితర పండగలకు ఊరు వచ్చిన వారంతా శిథిలావస్థలో ఉన్న బడిని చూసి చలించిపోయేవారు. బడి దుస్థితిని చూసి తట్టుకోలేకపోయారు. దీంతో అంతా కలిసి బడిని బాగు చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఓ సమావేశం పెట్టుకుని ఎవరెవరు ఏమేం చేయాలో బాధ్యతలు పంచుకున్నారు. అంతే.. ఏకంగా రెండు అంతస్తుల్లో నా లుగు గదులు, రక్షణ గోడ, ముఖ ద్వా రం ఏర్పాటైపోయాయి. కొందరు స్థలం రాసివ్వగా, మరికొందరు పనికి సాయం చేశారు, ఇంకొందరు డబ్బులు పంపించారు. మొత్తానికి రూ.25లక్షల విలువైన భవనాలను అవలీలగా కట్టేశారు. నేడు భవనాలు ప్రారంభం చినబడాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతలు నిర్మించిన భవనాలను పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు గురువారం ప్రారంభించనున్నారు. ప్రధానోపాధ్యాయుడు కె.శ్రీనివాసరావు, ఇతర ఉపా«ధ్యాయులు ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. దాతలు ముందుకు రావడం సంతోషం ప్రభుత్వ పాఠశాలలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. అందుకు ఇలాంటి దాతలు తో డైతే పాఠశాలలు బంగారంలా తయారవుతాయి. పూర్వ విద్యార్థులు, పెద్దలు ముందుకు వచ్చి వితరణ చేశారు. రూ.25 లక్షలు ఖర్చు చేశారు. విదేశాల్లో ఉన్నవారితో పాటు, వైద్య వృత్తిలో స్థిరపడినవారు సాయం అందించారు. – కె.శ్రీనివాసరావు, హెచ్ఎం, ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చినబడాం దాతలు నిర్మించిన ముఖ ద్వారం, ప్రహరీ -
ఆనందానికి అడ్రెస్ ఇవ్వండి
ఈ కాలం ధరించడానికి సరైన దుస్తులు లేక చల్లటి వాతావరణాన్ని తట్టుకోలేక కొంత మంది కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడే కొందరు దాతలు ముందుకువచ్చి తాము వాడని దుస్తులను అవసరమైన వారికి ఇస్తుంటారు. మీరు దానంగా ఇచ్చే దుస్తులను తీసుకున్నవారి ముఖంలో చిరునవ్వులు వెలిగే విధంగా ఉండాలి. అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.. ఎంపిక అవసరం మీ దుస్తుల అల్మారాను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి. కొన్నాళ్లుగా పక్కన పెట్టేసినవి, మీకు నచ్చనివి, మరోసారి అవి మీకు తగిన విధంగా ఉన్నాయా అనేది సరిచూసుకోండి. వాటిలో కుటుంబసభ్యులకు ఏవైనా ఉపయోగించవచ్చా అని ఆలోచించి, ఎంపిక చేసి పక్కన పెట్టండి.. చిరిగిన, మరకలు పడిన, ఇంకొద్ది రోజుల్లో పూర్తిగా పనికిరావు అనుకున్న దుస్తులను దానంగా ఇవ్వాలనుకోవద్దు. దారాల బంధం కొన్ని డ్రెస్సులు కొద్దిగా చిరిగినవో, కుట్లు ఊడిపోయినవో ఉంటాయి. ఇలాంటప్పుడు సూది, దారం తీసుకొని ఆ డ్రెస్సులు తిరిగి వాడేలా కుట్లు వేయాలి. మీరు చేసే పని మానవత్వానికి సంబంధించింది కాబట్టి ఆ దయ, ప్రేమ ఆ దుస్తుల ద్వారా వాటిని అందుకున్నవారికి చేరుతుంది. ఇది మీలో ఓ గొప్ప పాజిటివ్ శక్తిని నింపుతుంది. బట్టలన్నీ సేకరించడమే కాదు, వాటిని ఉపయోగించే విధంగా బాగుచేసి ఇవ్వడంలోనే మన గొప్పదనం దాగుంటుంది. ఉదాహరణకు పాత జీన్స్, పాత మోడల్ అనిపించిన ఫుల్ హ్యాండ్ షర్ట్స్, వాడని స్కార్ఫ్స్, స్వెటర్స్.. వంటివి ఇవ్వచ్చు. స్వచ్ఛమైన మనసు ‘దానంగా ఇచ్చే బట్టలే కదా మళ్లీ వాటిని శుభ్రం చేయడం ఎందుకు’ అనే ఆలోచనతో వాటిని అలాగే ఇవ్వకూడదు. సరిచేసిన దుస్తులను, శుభ్రం చేసి, చక్కగా మడతవేసి ఇస్తే వాటిని అందుకున్నవారి మనసు కూడా అంతే ఆనందంగా ఉంటుంది. కాలానికి తగినవి ఏ కాలంలో దుస్తులను ఇస్తున్నాం అనేది కూడా ముఖ్యం. చలికాలం కాబట్టి ఈ కాలం వాడుకోదగిన దుస్తులనే దానంగా ఇస్తే అవి వారికి ఉపయోగపడతాయి. అలాకాకుండా ఇంట్లోని చెత్త తీసేస్తున్నాం అనుకుంటే వేసవి కాలానికి అనువైన డ్రెస్సులు కూడా ఆ జాబితాలో ఉంటాయి. అవి, చివరకు ఎవరికీ ఉపయోగం లేని విధంగా ఉండిపోతాయి. ఎవరికి అవసరమో వారికే! సేకరించిన, బాగు చేసిన బట్టలన్నీ ఒక దగ్గరగా ఉంచాక ఎవరికి ఇవ్వాలో కూడా సరిచూసుకోవాలి. అందుకు స్వచ్ఛంద సంస్థలు గానీ దగ్గరలో ఉన్న ఆశ్రమాలకు గాని వెళ్లి వాటిని ఇవ్వచ్చు. ఇందుకు ఆన్లైన్ సమాచారం కూడా ఉపయోగపడుతుంది. -
అయ్యో...ఆయేషా..!
కడప కార్పొరేషన్: ముద్దులొలికే ఈ చిన్నారి పాప పేరు ఆయేషా(8). కడప నగరం రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన హుస్సేన్‌ఖాన్, షాహీనా దంపతుల పెద్ద కుమార్తె. జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న చర్చి స్కూల్లో 3వ తరగతి చదువుతోంది. ఈ ఏడాది మే మాసంలో ఆ పాపకు ఉన్నట్టుండి జ్వరం రావడంతో తల్లిదండ్రులు హాస్పిటల్లో చూపించగా కామెర్లు అని వైద్యులు తెలిపారు. జ్వరం తగ్గినప్పటికీ కడుపు, కాళ్లు వాపులు ఎక్కువ కావడంతో బెంగళూరులోని ఇందిరా గాంధీ హాస్పిటల్, మధురైలోని వేలమ్మాల్ ఆసుపత్రి, చెన్నైలోని ఐసీహెచ్ అండ్ హెచ్‌సీ హాస్పిటల్లో వైద్యం చేయించారు. ఇందుకోసం రూ.2లక్షల వరకూ ఖర్చు చేసుకున్నారు. కాలేయంలో కాఫర్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఆయేషాకు తీవ్రమైన సమస్య ఏర్పడిందని, దీనికి కాలేయ మార్పిడి తప్ప మరో మార్గం లేదని వైద్యులు తేల్చిచెప్పారు. ఇందుకోసం సుమారు రూ.40లక్షలు ఖర్చు చేయాల్సి ఉండటంతో రెక్కాడితేగానీ డొక్కాడని ఆ నిరుపేద తల్లిదండ్రులు అంతమొత్తం ఎలా తెచ్చుకోవాలో తెలియక సతమతం అవుతున్నారు. ఎప్పుడూ మంచానికే పరిమితమై ఉండే ఆయేషాను బాత్రూమ్కు కూడా తల్లిదండ్రులే ఎత్తుకొని పోవాల్సి వస్తోంది. కాళ్లు చేతుల వాపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ తమ బిడ్డ పడుతున్న అవస్థను కళ్లారా చూస్తూ వారు లోలోపలే కుమిలిపోతున్నారు. ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతుండటంతో చెన్నైకి పరుగులు పెట్టడం ఆ తల్లిదండ్రులకు పరిపాటిగా మారింది. ఇప్పటికి మూడుసార్లు అలా కోమాలోకి వెళ్లిపోవడంతో చెన్నైకి వెళ్లి చికిత్స చేయించుకొని తీసుకొచ్చారు. పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని వారు కంటిమీద కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. ‘త్వరగా ఆపరేషన్ చేస్తే తప్పా మా బిడ్డ బతకదని వైద్యులు చెబుతున్నారు, నా బిడ్డను ఎలాగైనా కాపాడండి’ అని ఆ తల్లిదండ్రులు చేతులు జోడించి వేడుకుంటున్నారు. దాతలు సహకరించి సాయం చేస్తే ఆయేషా మళ్లీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. వివరాలకు 6300163449 ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. -
మా అమ్మను బతికించండి
వారిదో నిరుపేద కుటుంబం. భార్యాభర్త... ఇద్దరు పిల్లలు. భర్త అంధుడు కావడంతో కుటుంబపోషణంతా ఆమెపైనే... రెక్కలు ముక్కలు చేసుకుని కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని సాకింది. ప్రభుత్వం ఇచ్చిన 20 గుంటల భూమికి మరో 20 గుంటలు కౌలుకు తీసుకుని పత్తి వేయగా... కలిసిరాని కాలం కరువు రూపంలో వెంటాడింది. పెట్టుబడి, కుటుంబపోషణకు చేసిన అప్పు తీర్చే మార్గం కనిపించక చావే శరణ్యమనుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మెరుగైన వైద్యం అందిస్తే బతికే అవకాశముండడంతో తల్లిని బతికించుకునేందుకు ఆ పన్నెండేళ్ల పిల్లాడు చేతులు జోడించి వేడుకుంటున్నాడు. * అప్పులబాధతో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం * చికిత్సకు చిల్లిగవ్వ లేక చావుబతుకుల మధ్య పోరాటం * అంధుడైన భర్త.. ఇద్దరు పిల్లలకు ఆమే ఆధారం * దాతలు సాయం చేస్తే నిలువనున్న నిండుప్రాణం జమ్మికుంట: వీణవంక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన కారుపాకల రమ-రవిది నిరుపేద కుటుంబం. వీరికి కుమారుడు అంజి(12), కుమార్తె అమూల్య(7) ఉన్నారు. రవి అంధుడు కావడంతో కుటుంబపోషణ భారమంతా రమపైనే. కూలీ పనులకు వెళ్తూ రెక్కలు ముక్కలు చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో అంజి ఏడో తరగతి, అమూల్య రెండో తరగతి చదువుతున్నారు. ప్రభుత్వం గతంలో వీరికి 20 గుంటల భూమి మంజూరు చేసింది. ఈ 20 గుంటలతోపాటు పక్కనే ఉన్న మరో 20 గుంటలు కౌలుకు తీసుకుని ఈ ఏడాది పత్తిపంట వేశారు. మిగతా సమయంలో ఆమె కూలీకి వెళ్తుంది. సాగు పెట్టుబడి కోసం రూ.20 వేలు అప్పు చేశారు. కరువు వెంటాడడంతో పంట చేతికి రాకుండా కళ్లముందే ఎండిపోయింది. తెలిసినవారి వద్ద అప్పు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. కరువు ఛాయలతో చేసేందుకు పనిలేకపోగా కుటుంబపోషణ భారంగా మారింది. అప్పులు ఇచ్చినోళ్లు ఇంటిచుట్టూ తిరుగుతుండడంతో మనోవేదన చెందింది. అప్పు కట్టే స్థోమత లేక ఆత్మహత్యే శరణ్యమనుకుంది. ఈ నెల 3న పిల్లలిద్దరినీ పాఠశాలకు పంపించింది. అనంతరం ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన ముందే భార్య పురుగుల మందు తాగుతున్నా... కళ్లు కనిపించకపోవడంతో రవి ఏమీ చేయలేకపోయాడు. కిందపడి కొట్టుకుంటున్నా.. ఏం జరిగిందో తెలుసుకోలేకపోయాడు. ఇరుగుపొరుగు ఆ సమయంలో రమ కోసం ఇంటికి రాగా ఆమె ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను జమ్మికుంటలోని విజయ్‌సాయి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. అమ్మ ఆస్పత్రిలో ఉండగా, తండ్రి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండడంతో తాత(రమ తండ్రి) వచ్చి పిల్లలను చూసుకుంటున్నాడు. ఆస్పత్రిలో కుమారుడే తల్లికి సపర్యలు చేస్తున్నాడు. ఇప్పటికే రూ.1.50 లక్షల ఖర్చు రమ వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పటికే లక్షన్నర రూపాయలు ఖర్చయ్యాయి. చేతిలో చిల్లి గవ్వలేక... కుటుంబాన్ని పోషించలేక... అప్పులు చెల్లించలేక చనిపోవాలని నిర్ణయించుకున్న రమ ప్రాణపాయస్థితిలో ఉండగా కుమారుడు అంజి తన తల్లిని బతికించాలని వేడుకుంటున్నాడు. ఇంటి పెద్ద దిక్కు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో ఉంటే కనిపించినవారినల్లా తమ తల్లిని కాపాడాలని వేడుకుంటున్నాడు. తన తల్లి లేకుంటే నాన్న, తాను, చెల్లి ఎలా బతికేదంటూ కన్నీరు పెట్టుకుంటున్నాడు. మా అందరికీ అమ్మే దిక్కని, అమ్మ లేకుంటే తాము బతకలేమని విలపిస్తున్నాడు. మెరుగైన వైద్యం చేస్తే తన తల్లి బతికే అవకాశముందని డాక్టర్లు చెబుతున్నారని... చేతిలో చిల్లిగవ్వ లేక తామెలా వైద్యం చేయించేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటివరకు అయిన రూ.లక్షన్నర ఖర్చు ఆస్పత్రి వైద్యుడే భరిస్తున్నాడు. రమను బతికించాలనే తపనతో డాక్టర్ సురంజన్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. తన తల్లి ప్రాణాలు కాపాడేందుకు దాతలు ముందుకు రావాలని కుమారుడు అంజి, రమ తండ్రి ఐలమల్లు వేడుకుంటున్నారు. మెరుగైన వైద్యం అందితే బతికే అవకాశం రమ పరిస్థితి విషమంగా ఉంది. వారం రోజులుగా చికిత్స అందిస్తున్నాం. సకాలంలో తీసుకురావడం వల్ల చికిత్స చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆమెను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు మెరుగైన చికిత్సతో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారం రోజులుగా వెంటిలేటర్‌పై ఆక్సీజన్ అందిస్తూ ఖరీదైన మందులు వేస్తూ ప్రాణాలు కాపాడుతున్నాం. ఇప్పటికే రూ.లక్షన్నర ఖర్చు వచ్చింది. మరో రూ.లక్షన్నర ఖర్చయ్యే అవకాశముంది. దాతలు ముందుకు వస్తే ఆమెకు పునర్జన్మ ప్రసాదించినవారవుతారు. పేదరికం, కుటుంబపోషణలో ఇబ్బందులతో తొందరపాటులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరం. ఇద్దరు చిన్న పిల్లలు, తండ్రి అంధుడు అయిన ఈ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిస్తే బాగుంటుంది. దాతలు కూడా ముందుకు రావాలి. - సురంజన్, వైద్యుడు, విజయ్‌సాయి హాస్పిటల్