కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాలిక
దాతల సాయం కోసం ఎదురుచూపు
కరీంనగర్: ‘అమ్మా.. నాన్న నాకు బతకాలని ఉంది. మీరు ఇన్నిరోజులు నా కోసం ఎంతోడబ్బు ఖర్చు చేశారు. ఇక డబ్బులు లేవని బాధపడకండి.. నేను మంచి మార్కులతో ఇంటర్మీడియెట్ పాసైన. జీవితంలో మరిన్ని సాధించాలని ఉంది. కానీ, నా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం, దాతలు దయ తలచి సాయం అందించి నా ప్రాణాలు కాపాడండి.. ప్లీజ్’ అంటోది కూనారపు సిరి.
చదువులో మిన్న..
రామగుండం కార్పొరేషన్ మూడో డివిజన్ జంగాలపల్లెలో నివసిస్తున్న కూనారపు పోశం–వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోశం సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పో షిస్తున్నాడు. ఏడాది క్రితం పెద్దకూతురు సిరి గో దావరిఖని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సీఈసీ విభాగంలో 927 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. కానీ, చదువులో గెలిచినా.. అనారోగ్యం ఆమెను వెంటాడుతోంది. ఆటో ఇ మ్యూన్ వ్యాధి బారిన పడడంతో కిడ్నీలు పనిచే యడం లేదని వైద్యులు తెలిపారు. వారి సూచన మేరకు వారానికి రెండుసార్లు డయాలసిస్ చేస్తు న్నారు. కిందుకోసం తల్లిదండ్రులు చాలావరకు అప్పు చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దాతలు ఆదుకోండి.. ప్రాణాలు కాపాడండి..
ఆర్థిక ఇబ్బందులతో చదువుల తల్లి ఇబ్బంది పడుతున్న విషయాన్ని ప్రభుత్వం, మనసున్న దాతలు స్పందించి ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. తమ తూతురు ప్రాణాలు కాపాడి పునర్జన్మ ప్రసాదించాలని వారు వేడుకుంటున్నారు.
సాయం అందించే వారు..
కూనారపు పోశం: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఖాతా నంబర్: 62414082268
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్: ఎస్‌బీఐఎన్ 0011086
గూగుల్ పే, ఫోన్‌పే నం: 99590 59795
అమ్మ వెంకటలక్ష్మి: 93985 57486
తండ్రి పోశం: 89774 79397
Comments
Please login to add a commentAdd a comment