పోటీ పడితే పతకమే!.. అమ్మ కష్టంతో ‘పసిడి పంట’ | Hasini From Manthani Selected For Malaysia International Karate Tourney | Sakshi
Sakshi News home page

నాన్నేమో కుటుంబానికి దూరం.. అమ్మ కష్టంతో ‘పసిడి పతకాల పంట’

Published Thu, Apr 3 2025 3:27 PM | Last Updated on Thu, Apr 3 2025 3:47 PM

Hasini From Manthani Selected For Malaysia International Karate Tourney

అంతర్జాతీయ కరాటే పోటీల్లో గ్రామీణ విద్యార్థిని ప్రతిభ 

మలేషియా ఇంటర్నేషనల్‌ పోటీలకు హాసిని ఎంపిక  

వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో దేశానికి మెడల్‌ తేవడమే లక్ష్యం

ముత్తారం(మంథని): ఆమె గ్రామీణ విద్యార్థిని.. ఆర్థిక స మస్యలున్నా కరాటే పోటీల్లో పంచ్‌ కొడితే పతకం సాధించాలనే తపనతో ప్రతిభకు ప దును పెడుతోంది. ఇటీవల జ రిగిన జాతీయస్థాయి పోటీల్లో ప్ర తిభ చూపి మే నెలలో మలేషియాలో దేశంలో జరిగే ఇంటర్నేషనల్‌ కరాటే పోటీలకు ఎంపికైంది మెట్టు హాసిని.

పోటీ పడితే పతకమే.. 
మంథనికి చెందిన మెట్టు దేవి – నర్సింగం దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కుతూరు మానసకు వివాహం అయ్యింది. చిన్నకుతూరు హాసిని మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు మంథని బాలికల హై స్కూల్‌లో చదివింది. ముత్తారం మండలం ధర్యపూర్‌ మోడల్‌ స్కూల్‌లో ఇంటటర్‌ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రా సింది. 

నాలుగో తరగతిలోనే సీనియర్ల ను చూసి కరాటే నే ర్చుకోవడమే కాదు.. అందులో రాణించాలని కంకణం కట్టుకుంది. ఇలా ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతూనే కరాటేలో శిక్షణ తీసుకుంది.

పసిడి పతకాల పంట
అదేసమయంలో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించింది.  పోటీపడితే వెండి పతకాలతోపాటు ఇప్పటివరకు 15 బంగారు పతకాలు సాధించింది. 2024లో హరియాణాలోని పంచకుల, మధ్యప్రదేశ్‌లోని గాలియానాలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో బ్లాక్‌బెల్ట్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించి ఔరా అనిపించింది.

గతేడాది 2024 నవంబరులో కరీంనగర్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ కరాటే పోటీల్లో బ్లాక్‌బెల్ట్‌లో ఫస్ట్‌డాన్‌గా గోల్డ్‌ మెడల్‌ కైవసం చేసుకుంది. ఈఏడాది మే 7 నుంచి 12వతేదీ వరకు మలేషియాలో జరిగే అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభ చూపే అవకాశం దక్కించుకుంది.

అమ్మ ప్రోత్సాహం.. మాస్టర్‌ కృషి 
మా నాన్న మా కుటుంబానికి దూరంగా ఉంటున్నా.. మా అమ్మ కూలీ పనిచేస్తూ అక్క పెళ్లి చేసి, నన్ను చదివిస్తోంది. ఆడపిల్లకు కరాటే పోటీలు అవసరమా అని బంధువులు, ఇరుగుపొరుగువారు సూటిపోటీ మాటలతో ప్రశ్నించేవారు. ఇది మనోవేదనకు దారితీసినా.. కరాటే మాస్టర్‌ సమ్మయ్య నచ్చజెప్పి మళ్లీ శిక్షణ ఇచ్చారు. 

ఆడవాళ్లు అంటే కుటుంబానికే పరిమితం కాదనే పట్టుదలతో కరాటేలో రాణిస్తున్నా. మలేషియాలో జరిగే పోటీల్లో మెడల్‌ సాధించడమే లక్ష్యంగా ప్రాక్టీస్‌ చేస్తున్నా. నా ప్రతిభ నాలాంటి ఆడపిల్లల కుటుంబాలకు ఆదర్శంగా నిలవాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement