Donors
-
తిరుమలలో ‘లక్ష్మణ’ లీలలు!
అమరావతి: తిరుమల తిరుపతి దేవ స్థానం (టీటీడీ)లో ప్రైవేట్ వ్యక్తుల హవాకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. 2014– 19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న వేమూరి హరికృష్ణ ఓ పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో దేవస్థానంలో చక్రం తిప్పుతుంటే మరోవైపు లోకేశ్ మనిషిగా ముద్రపడ్డ లక్ష్మణ్‌కుమార్ ఏకంగా ‘సూడో’ అదనపు ఈఓగా చెలరేగిపోతున్నారు. అదన ఈఓ వెంకయ్య చౌదరి పక్కనే ఈయనకు కుర్చీవేసి ప్రొటోకాల్ మర్యాదలు అందిస్తున్నారంటే ఈయన హవా ఏ స్థాయిలో నడుస్తోందో అర్థంచేసుకోవచ్చు.లక్ష్మణ్‌కుమార్‌కు ఛాంబర్, వాహనం, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఏ అధికారిక ఉత్తర్వులు లేకపోయినా టీటీడీలో తిష్టవేసి అందరినీ శాసిస్తున్న లక్ష్మణ్‌కుమార్ వ్యవహారం ఇప్పుడు టీటీడీలో హాట్ టాపిక్. టీటీడీలో ఎలాంటి ఉత్తర్వుల్లేకుండా అధికారిక సమావేశంలో పాలొ్గనడం, ఏఈఓతోపాటు సమీక్షల్లో ఉండడం.. నిఘా, ముఖ్యభద్రతాధికారి పాల్గొన్న సమావేశానికీ హాజరైన ఈ సూడో అడిషనల్ ఈఓ కథా కమామిషు ఇదీ..అంతటా ఆయనే..సీఎం కార్యాలయం నుంచి వచ్చే సిఫార్సు లేఖలతో పాటు, టీటీడీకి ప్రపంచం నలుమూలలు నుంచి వచ్చి దాతలిచ్చే విలువైన కానుక లపై ఈ సూడో ఏఈఓ ప్రత్యేక దృష్టిపెట్టినట్లు సమాచారం. కొందరు అజ్ఞాత భక్తులు స్వామివారికి కానుకలిచ్చే సమయంలో తమ పేరు చెప్పడానికి సైతం ఇష్టపడరు. అలాంటి వాటిపై సూడో ఏఈఓ అవతారమెత్తిన లక్ష్మణ్‌కుమార్ ఈ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి నాడు విద్యుత్ దీపాలంకరణ బాధ్యతను దాత సహాయంతో అంతా లక్ష్మణ్‌కుమారే నడిపించినట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి.ఆయన చూస్తేనే అదనపు ఈఓ సిఫారసు..తిరుమలలో అదనపు ఈఓ కార్యాలయంలో ఏ పని జరగాలన్న లక్ష్మణ్‌కుమార్ కనుసన్నల్లోనే జరగాలని.. ఆ తర్వాతే ఏఈఓ వెంకయ్యచౌదరి సంతకాలు చేస్తారని టీటీడీ ఉద్యోగులు చెబుతున్నారు. అసలు ఏ అర్హతతో ఈయన్ను ఏఈఓ కార్యాలయంలో ప్రత్యేక చాంబర్ ఏర్పాటుచేయాల్సి వచ్చింది? స్పెషల్ టైప్–05 నెంబర్ గెస్ట్‌హౌస్‌ను ఆయనకు ఎందుకు నివాసంగా ఏర్పాటుచేశారని వారు చర్చించుకుంటున్నారు. పైగా.. ఈయన ఏఈఓ కార్యాలయంలోనే అపవిత్ర కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు.టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తామేంచేసినా చెల్లుబాటవుతుందనేలా వీరు రాజ్యాంగేతర శక్తులుగా అవతరిస్తున్నారు. వ్యవస్థల్ని శాసిస్తూ, దోచుకునేందుకు తిరుమల కొండపై తిష్టవేశారని ఉద్యోగులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇక తిరుమలను ప్రక్షాళన చేస్తానంటూ ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబునాయుడు.. అధికారంలోకి వచ్చాక టీటీడీని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పెట్ట డమే ప్రక్షాళనా అని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అదనపు ఈఓకు అనుభవంలేకపోవడంతో..నిజానికి.. టీటీడీ అదనపు ఈఓగా ఉన్న వెంకయ్యచౌదరికి పాలనా అనుభవంలేకపోవడం, నిత్యం కార్యాలయ పనులపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో లక్ష్మణ్‌కుమార్ సూడో అడిషనల్ ఈఓ చెలామణి అవుతున్నారు. అసలు కస్టమ్స్ ఆఫీసర్‌గా పనిచేసిన వ్యక్తిని టీటీడీ అదనపు ఈఓగా ఎలా నియమిస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. పైగా.. తిరుమలలో జేఈఓ కార్యాలయంలో పనిచేసేందుకు ఐఏఎస్ అధికారులు ఎవరూ లేన్నట్లు ఐఆర్ఎస్ అధికారిని అదనపు ఈఓగా తీసుకురావడం.. దీనికితోడు మరో సూడో అదనపు ఈఓకు పెత్తనం ఇవ్వడం పవిత్ర తిరుమల భ్రష్టుపట్టిపోవడానికి దారితీస్తోందని కార్యాలయ సిబ్బంది మండిపడుతున్నారు.తిరుమలను చెప్పుచేతల్లో పెట్టుకునేందుకే..టీటీడీకి సంబంధించిన ప్రతి విషయం ఎంతో గోప్యంగా, భద్రంగా ఉంటుంది. కానీ, చంద్రబాబు ఈ మొత్తం వ్యవస్థను తన చెప్పుచేతుల్లో పెట్టుకునేందుకే లక్ష్మణ్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన పరకామణి, పోటు, దాతలిచ్చే విరాళాలు, టీటీడీ ఈ– ఫైల్స్, టీటీడీ టెండర్లు తదితర వాటిపై పెత్తనం సాగిస్తున్నారు. రహస్య సమాచారం అంతా ఆయన చేతుల్లోకి తీసుకున్నారు. అలాగే, సిఫార్సు లేఖలు కూడా ఎవరికివ్వాలి, ఎవరికి ఇవ్వకూడదనే విషయాలనూ ఆయనే చూసుకుంటున్నారు. ఈయన చూసి ఓకే చేసిన తర్వాతే టీటీడీ ఏఈఓ, ఈఓ నిర్ణయం తీసుకునేలా వ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. ఇలా కీలక వ్యవహారాలన్నీ చంద్రబాబు ఓ ప్రైవేట్ వ్యక్తికి అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలో ఏ స్కాం జరిగినా బయటకు రాకుండా వ్యవస్థను ఏర్పరుచుకున్నారని టీటీడీ సిబ్బంది చర్చించుకుంటున్నారు. -
దాతలకు బైడెన్, హారిస్ కృతజ్ఞతలు
వాషింగ్టన్: ఎన్నికల ఓటమి తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు హారిస్ తొలిసారిగా ఒకే చోట కలిసి కనిపించారు. డెమొ క్రటిక్ నేషనల్ కమిటీ ఆదివారం నిర్వహించిన హాలిడే పార్టిలో వారిద్దరూ వేదికను పంచుకున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచార నిమిత్తం 200 కోట్ల డాలర్లకు పైగా విరాళాలిచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘డెమొక్రాట్లు విలువల కోసం పోరాటం సాగించాలి. మన స్ఫూర్తి ఓడలేదు. మనం ఓడిపోలేదు. బలంగా ఉన్నాం. దేనికోసం పోరాడుతున్నామో మనకు స్పష్టత ఉంది’’అని అతిథులుతో బైడెన్, హారిస్ అన్నా రు. ‘‘కింద పడితే కచ్చితంగా లేవాల్సిందే.. ఎంత వేగంగా లేస్తారనేదే వ్యక్తికైనా, పార్టికైనా కొలమానమని మా నాన్న చెప్పేవారు’’అని బైడెన్ అన్నారు. నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి పోటీ ఇచ్చారని భావించిన హారిస్ చివరికి ఆయన చేతిలో భారీ తేడాతో ఓడటం తెలిసిందే. హారిస్ భవితవ్యం ఏమిటి? హారిస్ తన సొంత రాష్ట్రమైన కాలిఫోరి్నయా గవర్నర్ పదవికి పోటీ చేయాలని కొందరు డెమొక్రాట్లు కోరుతున్నారు. ఆమె మాత్రం తన భవిష్యత్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బైడెన్ జనవరి 20న అధ్యక్ష పదవి నుంచి వైదొలగనుండటం తెలిసిందే. అయినా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ అమెరికా సమాజంలో నెలకొన్న లోతైన విభేదాలను చక్కదిద్దేందుకు కృషి చేయాలనుకుంటున్నట్లు ఆయన సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘మీకందరికీ బ్యాడ్ న్యూస్ ఏమిటంటే నేనెక్కడికీ వెళ్లడం లేదు. ఇక్కడే ఉండాలనుకుంటున్నా’’అని నవ్వుతూ అన్నారు. -
‘గుండె’ను వీడని గమనం ‘కంటి’ని వదలని జ్ఞాపకం
ఓ పాత సినిమా.. కంటిచూపు దెబ్బతిన్న ఒక యువకుడికి, అంతక్రితమే మరణించిన మరో వ్యక్తి కళ్లను అమర్చుతారు.. ఆపరేషన్ సక్సెస్.. యువకుడికి చూపు బ్రహ్మాండంగా వచ్చేస్తుంది.. కానీ తరచూ ఎవరో వచ్చి తనను కత్తితో పొడుస్తున్నట్టుగా కళ్ల ముందు ఏదో దృశ్యం తారాడుతూ ఉంటుంది.. నిజానికి ఆ కళ్లకు సంబంధించిన వ్యక్తి చనిపోవడానికి కారణమైన ఘటన అది.ఇదంతా జస్ట్ సినిమాటిక్ ఫిక్షన్, అవయవాల్లో అలా జ్ఞాపకాలేవీ నిక్షిప్తమయ్యే అవకాశమే లేదన్నది ఇటీవలి వరకు ఉన్న భావన. కానీ ఎవరి అవయవాలనైనా మరొకరికి అమర్చినప్పుడు.. వారి లక్షణాలు, అలవాట్లు కూడా వస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధన చేశారు.సెల్యులార్ మెమొరీతోనే ఇదంతా! శరీరంలో అన్ని కణాలకు కొంత జ్ఞాపకశక్తి ఉంటుందన్న ‘సెల్యులార్ మెమొరీ’ సిద్ధాంతాన్ని కొలరాడో వర్సిటీ శాస్త్రవేత్తలు తెరపైకి తెస్తున్నారు. ప్రతి వ్యక్తికి సంబంధించి కిడ్నీలు, గుండె, కళ్లు... వంటి వాటిలో.. వారి శారీరక, మానసిక లక్షణాల జ్ఞాపకాలు ఉంటాయని చెప్తున్నారు. వేరేవారికి ఈ అవయవాలు అమర్చినప్పుడు వారిని ఈ ‘సెల్యులార్ మెమొరీ’ ప్రభావితం చేస్తుందని.. అందుకే వారిలో కొత్త లక్షణాలు, అలవాట్లు కనిపిస్తాయని అంటున్నారు. మన కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్డేట్ చేసుకుంటే కొత్త ఆప్షన్లు అందుబాటులోకి వచ్చినట్టుగా.. దీనిని పోల్చుకోవచ్చని చెప్తున్నారు.అవయవ మార్పిడికి ముందు, తర్వాత..శాస్త్రవేత్తలు యూనివర్సిటీ పరిధిలోని ఆస్పత్రిలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకున్న 47 మందిని స్టడీకి ఎంచుకున్నారు. ఇందులో కిడ్నీ, లివర్ నుంచి గుండె మార్పిడి వరకు చేయించుకున్నవారు ఉన్నారు. వారిలో అవయవ మార్పిడికి ముందు, తర్వాత ఉన్న అలవాట్లు, లక్షణాలను నమోదు చేశారు. అవయవ మార్పిడి తర్వాత ఎదుర్కొన్న అనుభవాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నో చిత్రమైన అంశాలు వెల్లడయ్యాయి.డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్‌ను నేరస్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపేశారు. అతడి గుండెను ఓ యువకుడికి అమర్చారు. అవయవ మార్పిడి తర్వాత తరచూ తనను ఎవరో దగ్గరి నుంచి కాల్చేస్తున్నట్టుగా కలలు వస్తున్నాయని.. బుల్లెట్ తాకినట్టుగా నుదుటిపై తీవ్రంగా నొప్పికూడా వస్తోందని ఆ యువకుడు డాక్టర్లకు చెప్పాడు.ఓ మూడేళ్ల పిల్లాడికి పవర్ రేంజర్స్ బొమ్మలంటే చాలా ఇష్టం. ఎప్పుడూ వాటితోనే ఆడుకునేవాడు. కానీ అతడికి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశాక.. ఒక్కసారిగా ఆ బొమ్మలను దూరం పడేయడం మొదలుపెట్టాడు. చిత్రమేంటంటే.. అతడికి అమర్చిన గుండె ఓ ఏడాదిన్నర చిన్నారిది. పవర్ రేంజర్స్ బొమ్మలను అందుకోవడానికి ప్రయత్నిస్తూ.. కిటికీ నుంచి పడిపోయి చనిపోయాడు.ఇవే కాదు. ఆపరేషన్‌కు ముందు వరకు ఎంతో ప్రశాంతంగా ఉండే వ్యక్తి.. తర్వాత తీవ్రంగా కోపతాపాలకు, తీవ్ర భావోద్వేగాలకు గురవడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. మరోవైపు ఎప్పుడూ మూడీగా ఉండే కొందరు.. ఆపరేషన్ తర్వాత యాక్టివ్‌గా మారడం, అందరితో చనువుగా ఉండటాన్ని గుర్తించారు. ఒక్కసారిగా కొత్త అలవాట్లు రావడం, అప్పటివరకు ఇష్టంగా చేసిన పనులు అసలే నచ్చకపోవడం, ఆధ్యాత్మిక నమ్మకాల్లోనూ మార్పులు రావడం వంటివీ గమనించారు. -
అమ్మా.. బతకాలని ఉంది!
కరీంనగర్: ‘అమ్మా.. నాన్న నాకు బతకాలని ఉంది. మీరు ఇన్నిరోజులు నా కోసం ఎంతోడబ్బు ఖర్చు చేశారు. ఇక డబ్బులు లేవని బాధపడకండి.. నేను మంచి మార్కులతో ఇంటర్మీడియెట్ పాసైన. జీవితంలో మరిన్ని సాధించాలని ఉంది. కానీ, నా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం, దాతలు దయ తలచి సాయం అందించి నా ప్రాణాలు కాపాడండి.. ప్లీజ్’ అంటోది కూనారపు సిరి.చదువులో మిన్న..రామగుండం కార్పొరేషన్ మూడో డివిజన్ జంగాలపల్లెలో నివసిస్తున్న కూనారపు పోశం–వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోశం సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పో షిస్తున్నాడు. ఏడాది క్రితం పెద్దకూతురు సిరి గో దావరిఖని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సీఈసీ విభాగంలో 927 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. కానీ, చదువులో గెలిచినా.. అనారోగ్యం ఆమెను వెంటాడుతోంది. ఆటో ఇ మ్యూన్ వ్యాధి బారిన పడడంతో కిడ్నీలు పనిచే యడం లేదని వైద్యులు తెలిపారు. వారి సూచన మేరకు వారానికి రెండుసార్లు డయాలసిస్ చేస్తు న్నారు. కిందుకోసం తల్లిదండ్రులు చాలావరకు అప్పు చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దాతలు ఆదుకోండి.. ప్రాణాలు కాపాడండి..ఆర్థిక ఇబ్బందులతో చదువుల తల్లి ఇబ్బంది పడుతున్న విషయాన్ని ప్రభుత్వం, మనసున్న దాతలు స్పందించి ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. తమ తూతురు ప్రాణాలు కాపాడి పునర్జన్మ ప్రసాదించాలని వారు వేడుకుంటున్నారు.సాయం అందించే వారు..కూనారపు పోశం: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాఖాతా నంబర్: 62414082268ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్ 0011086గూగుల్ పే, ఫోన్‌పే నం: 99590 59795అమ్మ వెంకటలక్ష్మి: 93985 57486తండ్రి పోశం: 89774 79397 -
ఎన్నికల బాండ్లు.. ఆ కేసులున్న కంపెనీలే డోనర్లు..!
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్(ఈసీ) వెల్లడించిన ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాల వివరాల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాజకీయ పార్టీలకు అత్యధిక మొత్తం విరాళాలిచ్చిన టాప్ 30 కంపెనీల్లో 15 కంపెనీలకుపైగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్ (ఐటీ)వంటి సంస్థల దర్యాప్తు ఎదుర్కొన్నవే కావడం గమనార్హం. అయితే ఏజెన్సీల దర్యాప్తు ఒక్కో కంపెనీకి సంబంధించి ఒక్కో దశలో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని కంపెనీలపై కేవలం కేసులు ఫైల్‌కాగా, మరికొన్ని కంపెనీలపై దాడులు జరిగాయి. ఇంకా కొన్ని కంపెనీల ఆస్తులను ఈడీ ఏకంగా జప్తు చేసేదాకా వెళ్లింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలతో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)ఎన్నికల కమిషన్(ఈసీ)కి అందించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీ గురువారం బహిర్గతం చేసింది. ఈ విరాళాల్లో ఎక్కువ మొత్తం బీజేపీకి వెళ్లగా ఆ తర్వాతి స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ తదితర పార్టీలున్నాయి. ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు వ్యక్తులు, కంపెనీలు విరాళాలందించడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు ఈ స్కీమ్‌ను ఇప్పటికే రద్దు చేసింది. ఇదీ చదవండి.. ఎన్నికల బాండ్ల కేసు.. ఎస్బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం -
ఏ గ్రూపు రక్తం ఎవరికి రైట్... ఎవరికి రాంగ్?
-
బడిని బాగుచేసుకుందాం
సాక్షి ప్రతినిధి, వరంగల్: చిన్నప్పుడు మీరు అఆలు దిద్దిన బడిని చక్కగా తీర్చిదిద్ది రుణం తీర్చుకోవాలని భావిస్తున్నారా.. మీ ఆర్థికసాయాన్ని బడిఒడికి ఎలా చేర్చాలోనని యోచిస్తున్నారా.. ఎక్కడో దూరంగా ఉండటం వల్ల మీకు వీలు చిక్కడంలేదా.. ‘విద్యాంజలి’ ఉండగా.. చింత ఎందుకు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలో భాగస్వాములుకండి. మీ కలల సాకారానికి ఇది చక్కని వేదిక. సర్కారు బడుల్లోని సమస్యల పరిష్కారంలో దాతలను భాగస్వాములను చేయడమే ఈ పథకం ఉద్దేశం. ఆయా పరిశ్రమలవారు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ పథకం ద్వారా స్కూళ్లకు ఆర్థిక తోడ్పాటును ఇవ్వవచ్చు. విద్యాంజలిలో నమోదు చేసుకున్న పాఠశాలల్లో సమస్యల పరిష్కారం కోసం దాతలు ముందుకొస్తే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారితో ఎంవోయూ కుదుర్చుకొని పనులు మొదలుపెడతారు. వెబ్సైట్లో పేరు నమోదు ఇలా..: రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల వివరాలు, సమస్యలు, అవసరాల గురించి ప్రధానోపాధ్యాయులు విద్యాంజలి వెబ్సైట్లో నమోదు చేస్తారు. సంబంధిత పాఠశాలకు సాయం చేయాలనుకునేవారు అదే వెబ్సైట్లో ఉన్న దాతల ఆప్షన్‌ను క్లిక్ చేసి తమ పేర్లు నమోదు చేసుకొని సేవలను అందించవచ్చు. తొలిస్థానం రాజన్న సిరిసిల్లదే..: ఈ ప్రక్రియలో రాష్ట్రంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, కేజీబీవీ, ఎంఎస్యూఆర్ఎస్, ఎయిడెడ్ తదితర అన్ని రకాల పాఠశాలలు 28,888 ఉండగా.. 21,585 పాఠశాలలు(74.72 శాతం) నమోదు చేసుకున్నాయి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముందంజలో ఉంది. మొత్తం 514 పాఠశాలలకుగాను 506 (98.44 శాతం) పాఠశాలల పేర్లు నమోదు చేసి ప్రథమ స్థానంలో ఉండగా.. ఖమ్మం జిల్లా 1,273 పాఠశాలలకు 558 పాఠశాలల (43.83 శాతం) నమోదుతో చివరి స్థానంలో ఉంది. నమోదైన సమస్యలివే...: పాఠశాలలను నమో దు చేసిన హెచ్ఎంలు తమ పాఠశాలల్లోని సమస్యలను కూడా అందులో పొందుపర్చారు. అత్యధికం గా నిర్మాణ పనులు, విద్యుత్ ఉపకరణాలు, బోర్డు లు, బల్లలు, కుర్చీలు, పుస్తకాలు, సైన్స్, గణితం కిట్లు, కంప్యూటర్, ఎల్ఈడీ ప్రొజెక్టర్, ఇంటరాక్టివ్ వైట్‌బోర్డు, టీవీ, ల్యాప్‌టాప్, క్రీడలు, విద్యేతర(కో కర్క్యులర్) కార్యకలాపాలకు అవసరమైన వస్తు సామగ్రి, ఫస్ట్ ఎయిడ్ కిట్, వాటర్ ప్యూరిఫైడ్, థర్మామీటర్, చేతుల శుభ్రత (హ్యాండ్‌వాష్) సౌకర్యాలు, వీల్‌చైర్, హియరింగ్ హెడ్స్, టూల్‌కిట్స్, బోధన–అభ్యసన సామగ్రి, నిర్వహణ–మరమ్మతులు, కార్యాలయ అవసరాల కోసం సాయం చేయాల్సిందిగా దాతలను కోరారు. దాతలు ముందుకొస్తేనే.. విద్యాంజలి పథకంతో పాఠశాలలను అభివృద్ధి చేసుకోవచ్చు. సమాజ భాగస్వామ్యంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. జిల్లా పరిషత్ హసన్‌పర్తి బాలుర పాఠశాల పేరును ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్నాం. ఇందుకోసం దాతలు సహకరించాలి. -
జాండీస్ ఎఫెక్ట్‌తో లివర్, కిడ్నీలు సరిగ్గా పనిచేయవు.. దయ చూపి.. ప్రాణం నిలపండి
సాక్షి,జ్యోతినగర్(పెద్దపల్లి): జాండీస్ బారినపడి లివర్, కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో ఓ నిరుపేద వైద్య ఖర్చులకు దాతల సాయ కోసం ఎదురుచూస్తోంది. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు సూచించడంతో అప్పులు చేస్తూ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. తన భర్తను ఎలాగైనా కాపాడుకోవాలని ఆ ఇల్లాలు దీనంగా రోధిస్తుంది. రామగుండం కార్పొరేషన్ నాలుగో డివిజన్ కృష్ణానగర్‌కు చెందిన రామగిరి శ్రావణ్‌కుమార్ కిరాణా వ్యాపారం చేసుకుంటూ భార్య మౌనిక, తల్లి లలిత, కుమారులు మోక్షానంద్(మూడేళ్లు), అనిరుధ్(మూడు నెలలు)లతో జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శ్రావణ్‌కుమార్ అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లాడు. వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు జాండీస్ ఎఫెక్ట్‌తో లివర్, కిడ్నీలు సరిగ్గా పనిచేయడం లేదని మెరుగైన వైద్యం అందించాలన్నారు. దీంతో ఆ కుటుంబం అప్పులు చేసి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యం మెరుగుపడటానికి ఇంకా డబ్బులు ఖర్చు అవుతాయని డాక్టర్లు తెలుపడంతో దాతలు ఆదుకోవాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే దాతలు రామగిరి శ్రావణ్‌కుమార్ గూగుల్ పే, ఫోన్ పే: 8465921213 -
గతంలో మాదిరిగా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రాని దాతలు
-
కేసులు పెరుగుతుండడంతో ముందుకు రాని దాతలు
-
ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్లాస్మా దాతలతో రక్షాబంధన్‌ను జరుపుకున్నారు. కరోనా నుంచి కోలుకుని, ప్లాస్మా దానం చేసి కోవిడ్ పేషెంట్లు కోలుకోవడానికి సాయం చేసిన 13 మంది ప్లాస్మా దాతలకు గవర్నర్ సోమవారం రాజ్‌భవన్‌లో రాఖీలు, స్వీట్లు అందించారు. రాజ్‌భవన్ దర్బార్ హాల్ లో జరిగిన ఈ ప్రత్యేక సంబురాల్లో భాగంగా గవర్నర్ ప్లాస్మా దాతల దాతృత్వాన్ని, ప్లాస్మా దానం కోసం వారు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. వారు ఇతరులకు స్ఫూర్తి దాతలని తమిళిసై కొనియాడారు. తక్కువ ఖర్చుతో కోవిడ్ చికిత్స.. 13 మంది ప్లాస్మా దాతలు కోవిడ్ బారిన పడినప్పడు ప్రభుత్వ వైద్యశాలల్లోనే, ముఖ్యంగా గాంధీ హాస్పిటల్లోనే చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఇదే విషయాన్ని గవర్నర్ ప్రముఖంగా ప్రస్తావించారు. ‘ప్రభుత్వ ఆసుపత్రులు, అక్కడి వైద్యులు కోవిడ్–19 చికిత్సలో గొప్ప సేవలు చేస్తున్నారని’ అభినందించారు. ప్రజలు ఎలాంటి అపోహలకు తావు లేకుండా, ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కోవిడ్ చికిత్సను నమ్మకంగా తీసుకోవచ్చని, అక్కడ వైద్యులు, ఇతర సిబ్బంది అంకితభావంతో సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా కోవిడ్–19 బాధితులకు తక్కువ ఖర్చుతో, మానవతా దృక్పథంతో సేవలు అందించాలని, రోగులను, వారి కుటుంబాలను మరింత కుంగదీయకుండా బాధ్యతగా వ్యవహరించాలని గవర్నర్ సూచించారు. ఈ సందర్భంగా ప్లాస్మా దాత లు తమ కరోనా చికిత్స, ప్లాస్మా దానం చేయడానికి వచ్చిన ప్రేరణ, తదితర విషయాలను గవర్నర్‌తో పంచుకున్నారు. గవర్నర్ ఈ దిశ గా చేస్తున్న కృషి తమలో స్ఫూర్తిని నింపాయ ని వివరించారు. గవర్నర్‌తో రాఖీలు, అభినం దనలు అందుకున్న ప్లాస్మా దాతలలో రాష్ట్రం లో మొట్టమొదటి కోవిడ్ పేషెంట్ రాంతేజ గంపాల, నాలుగు సార్లు ప్లాస్మా దానం చేసిన ఐఐటీ ముంబై, గ్రాడ్యుయేట్ బి.నితిన్‌కుమా ర్, రాష్ట్రంలో మొదటి ప్లాస్మా దాత ఎన్నంశెట్టి అఖిల్, సురం శివప్రతాప్, సయ్యద్ ముస్తఫా ఇర్ఫాన్, ఉమర్ ఫరూఖ్, డా. సుమీత్, జె.రా జ్‌కుమార్, పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్సై పీ రామకృష్ణాగౌడ్, ఎస్. శివానంద్, డా. సాయి సోమసుందర్, డా. రూపదర్శిని ఉన్నారు. ఇందులో మొత్తం ఆరుగురు రెండు సార్లు, అంతకన్నా ఎక్కువసార్లు ప్లాస్మా దానం చేయడం అభినందనీయమని గవర్నర్ ప్రశంసించారు. -
అమ్మ మళ్లీ నవ్వాలి..
అమ్మ కళ్ల ముందే ఉంది.. కానీ గోరు ముద్దలు తినిపించలేకపోతోంది. ఆ తల్లి పిల్లల ఎదురుగానే ఉంది. కానీ దగ్గరకు తీసుకోలేకపోతోంది. అంతుచిక్కని వ్యాధి అమ్మను కబళించేస్తుంటే.. ఆ పిల్లలు చూడలేకపోతున్నారు. తల్లిని కాపాడుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు పూటలా తినిపించడం దగ్గర నుంచి మందులు వేయించడం వరకు అన్ని బాధ్యతలు వారివే. కన్నతల్లిని కళ్లలో పెట్టుకుని చూసుకుంటున్నారు. చికిత్స కోసం మాత్రం సమాజం నుంచి కాస్త సాయం కోరుతున్నారు. ‘మా అమ్మ మళ్లీ మాకు నవ్వుతూ కనిపించాలి’ అంటూ చే యూత అర్థిస్తున్నారు.. రణస్థలం మండలం కమ్మశిగడాం గ్రామానికి చెందిన సునీత అనే మాతృమూర్తి కోసం భర్త, పిల్లలు పడుతున్న ఆ..వేదన. రణస్థలం రూరల్: రణస్థలం మండలం కమ్మశిగడాంకు చెందిన కాపరపు మహాలక్ష్ము నాయీ బ్రాహ్మణుడు. కుల వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. అప్పుడప్పుడూ కూలి పనులకు కూడా వెళ్లేవారు. ఈయనకు 2006 లో ఒడిశాకు చెందిన సునీతతో వివాహమైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. జీవితం సాఫీగా సాగుతుండగా నాలుగేళ్ల కిందట సు నీత ఓ దీర్ఘకాలిక వ్యాధితో మంచాన పట్టింది. ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా ఫలితం కనిపించలేదు. ఓ వైపు పేదరికం, ఇంకోవైపు అంతు చిక్కని వ్యాధి, మరోవైపు పిల్లలు చదువులు.. ఇన్ని బాధ్యతల నడుమ మహాలక్ష్ము నలిగిపోతున్నాడు. ప్రభుత్వం పింఛన్ సదుపాయం క ల్పించాలని కోరుతున్నాడు. రోజూ వంట చేసి కూలి పనికి వెళ్లి తిరిగి వచ్చే వరకు తన భార్య ఆలనాపాలనా పిల్లలే చూసుకుంటున్నారని, ఈ యాతన తప్పేలా చికిత్స కోసం దాతలు సాయం చేయాలని అభ్యర్థిస్తున్నాడు. వంట చేసి పనికి వెళ్తున్నా.. వంట చేసి నా భార్యకు పిల్లలకు భోజనం పె ట్టి కూలి పనులకు వెళ్తుంటాను. పిల్లలే వాళ్ల అ మ్మకు భోజనం తినిపిస్తుంటారు. నేను కూలికి వెళ్తే తప్ప పూట గడవదు. పింఛన్‌కు దరఖాస్తు చేసుకుందామంటే కరోనా సమయంలో సద రం సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దాతలే మమ్మల్ని ఆదుకోవాలి. – మహాలక్ష్ము, సునీత భర్త అమ్మ త్వరగా కోలుకోవాలి.. నా చిన్నతనం నుంచి అమ్మను మంచంపైనే చూస్తున్నాను. ఆమె త్వరగా కోలుకోవాలి. అ మ్మకు బాగవ్వాలని రోజూ దేవుడిని ప్రార్థి స్తున్నాం. – మణికంఠేశ్వరి, పెద్ద కుమార్తె సాయం చేయదలచుకున్న వారు 78936 41275 ఫోన్ నంబర్‌కు కాల్ చేసి సాయం అందించాలని కుటుంబం విజ్ఞప్తి చేసింది. -
రక్తదానం చేసి ప్రాణాలు కాపాడండి
‘‘కరోనా వైరస్ నేపథ్యంలో నెలకొన్న లాక్డౌన్ వల్ల రక్త దాతల కొరత ఏర్పడింది. ఈ కారణంగా ధీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రక్తం అవసరం ఉన్న వారికి లాక్డౌన్ పెను సమస్యాత్మకంగా మారింది. ఈ పరిస్థితుల్లో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడండి’’ అంటూ హీరో చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కి చిరంజీవి ఆదివారం స్వయంగా వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో బ్లడ్ బ్యాంక్స్‌లో రక్త నిల్వలు తగడంతో ఆస్పత్రి వర్గాల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తలసేమియా, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు, బైపాస్ సర్జరీ, హార్ట్ పేషెంట్స్, ప్రమాదాలకు గురైన వారు, ఎనీమియా వంటి సమస్యలు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రక్తం లేక ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకునేందుకు ప్రజలు, మెగా అభిమానులు ముందుకు రావాలి. మీకు సమీపంలోని బ్లడ్ బ్యాంక్స్‌కి వెళ్లి రక్తదానం చేయండి. లాక్డౌన్ నేపథ్యంలో రక్తదానం చేసేందుకు పోలీసుల వల్ల ఎటువంటి ఇబ్బంది తలెత్తదు. రక్తదానం చేస్తామని సమీపంలోని బ్లడ్ బ్యాంక్ వారికి చెప్పగానే మీ ఫోన్ వాట్సాప్‌కు పాస్ వస్తుంది.. అది పోలీసులకు చూపిస్తే సరిపోతుంది’’ అన్నారు. చిరంజీవితో సహా హీరో శ్రీకాంత్, ఆయన తనయుడు రోషన్, శ్రీమిత్ర చౌదరి, ఆయన వారసులు తేజ్ నివాస్, తేజ్ గోవింద్, నటులు బెనర్జీ, భూపాల్, గోవిందరావు, విజయ్, ‘సంతోషం’ పత్రికాధినేత, నిర్మాత సురేష్ కొండేటి తదితరులు రక్తదానం చేసిన వారిలో ఉన్నారు. -
60మంది ఆర్టీసీ కార్మికులకు చేయూత
సాక్షి, నల్లగొండ: సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు పలువురు చేయూతనందించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని తెలంగాణ విద్యావంతుల వేదిక కార్యాలయంలో 60మంది పేద ఆర్టీసీ కార్మికులకు 25 కిలోల బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను అందజేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకరు, తెలంగాణ విద్యావంతుల వేదిక, డీటీఎఫ్ నాయకులు, రిటైర్డ్ అధ్యాపకులు ఈ సరుకులను విరాళంగా అందజేశారు. పిల్లల చదువు, ఇంటి అద్దె,కుటుంబం గడవడం కష్టంగా ఉన్న తరుణంలో ఆదుకున్నారని పలువురు కార్మికులు కంటతడి పెట్టారు. సీఎం కనుకరించకపోయినా మంచి మనసున్నవారిగా కార్మికుల పట్ల కరుణ చూపడం తమకు ఎంతో బలాన్ని ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సీ ఎం కేసీఆర్ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించినట్లుగా ఉందని, న్యాయస్థానాలు సూ చించినా మార్పు రాకపోవడం.. ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకపోగా, 48వేల మంది కార్మికులను రోడ్డు పాలు చేశారని, ఆర్టీసీ ఆస్తులపై కన్నేశారని, ఓట్లు వేసిన ప్రజలంతా తప్పుచేశామన్న ఆలోచనలో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమయ్య, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య, జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు, రిటైర్డ్ అధ్యాపకుల సంఘం నాయకులు ఆర్. విజయ్‌కుమార్, నర్సిరెడ్డి, వెంకులు, ఏడుకొండలు, మునాస వెంకన్న, హరికృష్ణ, బకరం శ్రీనివాస్, కొండేటి మురళి, దయాకర్, ఈఎస్ రెడ్డి, రామలింగం, రాజు, వెంకన్న పాల్గొన్నారు. కార్మికుల నిరసన తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు వామపక్ష ప్రజా సంఘాలతో కలిసి స్థానిక అంబేద్కర్ భవన్లో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వంటావార్పు నిర్వహించారు. విధుల్లో చేరిన కార్మికుల ఫ్లెక్సీని చెప్పులతో కొడుతూ.. మిర్యాలగూడ డిపోలో ఇద్దరు కార్మికులు విధుల్లో చేరారు. వీరి తీరును నిరసిస్తూ కార్మికుల ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి చెప్పులతో కొడుతూ ర్యాలీ నిర్వహించారు. ఇంతమంది కార్మికులు రోడ్డున పడితే ఇద్దరు విధుల్లోకి చేరి నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. -
కష్టమే.. ఆ కార్మికుడి చుట్టం!
- నిత్యం వెన్నంటే కష్టాలు ∙అనారోగ్యంతో కుదేలైన జీవితం - వెన్నుపూసపై కణితి తొలగించే ఆపరేషన్‌తో మంచం పట్టిన వైనం - ఇదీ.. చెప్పులు కుట్టుకుని జీవనం సాగించే ఓ కార్మికుడి కన్నీటి వ్యథ టెక్కలి : తనకు ఊహ తెలిసినప్పటి నుంచీ చెప్పులు కుట్టుకునే వృత్తినే నమ్ముకున్నాడు. దాంతోనే కుటుంబాన్ని పోషించుకుని వచ్చాడు. అదే వృత్తిలో ఉంటూ ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడికి వివాహం చేశాడు. ఉన్న దాంతో తృప్తి పడుతూ.. జీవితం గడుపుతున్న సమయంలో హఠాత్తుగా అతని భార్య మరణించింది. అక్కడకు కొద్ది రోజుల్లోనే చిన్న కుమారుడికి పక్షవాతం వచ్చింది. వీటికి తోడుగా అతని వెన్నుపూసపై కణితి ఏర్పడింది. దానిని తొలగించే ఆపరేషన్ చేసుకున్నాడు. ఏం జరిగిందో తెలియదు గానీ.. ఆపరేషన్ తరువాత ఆ కార్మికుడు మంచానికే పరిమితమైపోయాడు. సాఫీగా సాగిపోతున్న ఆ కార్మికుడి జీవితం అల్లకల్లోలంగా మారింది. మేడే.. ప్రపంచ కార్మిక దినోత్సవం. ఈ రోజున ఓ కార్మికుడి దీనగాథ తెలుసుకుందాం. టెక్కలి రామదాసుపేటవీధికి చెందిన కటారి అప్పారావు స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదురుగా ఉన్న దుకాణంలో చెప్పులు కుట్టుకుని జీవనం సాగించేవాడు. అయితే 2014 సంవత్సరంలో అతని భార్య సుశీల హఠాత్తుగా మరణించింది. అక్కడకు ఆరు నెలల తరువాత చిన్న కుమారుడు సత్యనారాయణకు పక్షవాతం వచ్చింది. చెప్పులు కుట్టుకుంటే వచ్చిన డబ్బులతోపాటు.. చుట్టుపక్కల వారి దగ్గర అప్పులు చేసి మరీ అప్పారావు తన చిన్న కుమారుడికి విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం అందజేశాడు. ఇలా అప్పులు చేసి వైద్యం అందజేస్తున్న సమయంలో.. అప్పారావు వెన్నుపూసపై కణితి ఏర్పడింది. రాగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేస్తారని స్థానికులు చెప్పడంతో.. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అప్పారావు ఆపరేషన్ చేయించుకున్నాడు. అంతే.. ఆ తరువాత అప్పారావు మంచం పట్టాడు. నెలలు గడుస్తున్నప్పటికీ కోలుకోవడం లేదు. పెద్ద కుమారుడు నారాయణరావుకు వివాహం జరిగింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన కూడా చెప్పులు కుట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం తండ్రి, సోదరుడి భారం నారాయణరావుపై పడింది. ప్రభుత్వం దృష్టిలో ‘ముచ్చి’ (ఎస్సీ) కులంగా గుర్తింపు ఉన్నప్పటికీ.. ఏనాడూ తమను ఆర్థికంగా ఆదుకునే సాయం లేదంటూ ఆ కుటుంబం వాపోయింది. చేతి వృత్తి కార్మికులకు అందజేసే కనీస సంక్షేమ పథకాలు కూడా ఏనాడూ తాము అందుకోలేదని.. మంచం పట్టిన అప్పారావు భోరున విలపించాడు. తనతోపాటు చిన్న కుమారుడి వైద్యం కోసం ప్రభుత్వంతోపాటు దాతలు దయ చూపాలని వేడుకుంటున్నాడు. -
విరాళాలిచ్చే వారికి ఈ-పాస్‌బుక్కులు
తిరుమల: తిరుమలలో భక్తుల సౌకర్యాలు, ఆథ్యాత్మిక, ధార్మికతతోపాటు సామాజిక సేవల్లో భాగంగా విద్య, వైద్య సేవల నిర్వహణ చేపట్టారు. వీటి కోసం టీటీడీ ట్రస్టులకు విరాళాలు ఇచ్చిన దాతలకు పాస్బుక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాతలకు పారదర్శకంగా బస, శ్రీవారి దర్శన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఇప్పటికే టీసీఎస్ సహకారంతో దేవస్థానం ఐటీ విభాగం ‘డోనార్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆన్లైన్ అíప్లికేషన్’ను ప్రారంభించారు. ఇందులో భాగంగానే టీటీడీలోని 9 ట్రస్టులు, ఒక స్కీమ్‌కు రూ.10 లక్షలు, ఆపైన విరాళాలందించిన దాతలందరికీ ఈ–పాస్‌బుక్‌లు అందించే ప్రక్రియను టీటీడీ వేగవంతం చేసింది. దాతలు ఇంటెర్నెట్ ద్వారా స్వయంగా ఈ–పాస్‌బుక్ పొందే సౌలభ్యాన్ని కూడా టీటీడీ కల్పించింది. ఇలా ఇప్పటికే సుమారు ఐదు వేల మంది దాతలు ఆన్లైన్లో ఈ–పాస్‌బుక్‌లు పొందారు. -
చిట్టితల్లీ.. సుఖీభవ
జ్ఞానసాయికి సాయం అందించేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వం వరుస కథనాలతో చిన్నారికి అండగా నిలిచిన ‘సాక్షి’ స్పందించిన అనేక మంది దాతలు ములకలచెరువు : మండలంలోని వేపూరికోట పంచాయతీ బత్తలాపురానికి చెందిన జె.రమణప్ప, సరస్యతి దంపతుల కుమార్తె జ్ఞానసాయికి పూర్తిస్థాయి వైద్యసేవందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివరాల్లోకి వెళితే.. చిన్నారి జ్ఞానసాయికి కాలేయం పూర్తిగా దెబ్బతినడంతో కాలేయ మార్పిడి కోసం రూ. 15 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీనిపై బాధితులు సాక్షిని సంప్రదించగా దాతలసాయం కోసం ఈ నెల 16వ తేదీ ‘ పసిమొగ్గకు ప్రాణం పోయండి‘ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం వెలువడింది. వెంటనే స్పందించిన ములకలచెరువు సీఐ రుషికేశవ్ చిన్నారి కుటుంబ సభ్యులకు రూ.7,500 వేలను నగదు రూపంలో అందించారు. అనంతరం మరుసటి రోజు పుత్తూరుకు చెందిన చిరంజీవి అనే దాత రూ. 3 వేలను చిన్నారి తల్లి జే. సరస్వతి బ్యాంకు ఖాతాలో జమచేశారు. తర్వాత ములకలచెరువు కస్తుర్బా పాఠశాలకు చెందిన టీచర్ నిర్మలమ్మ రూ. వెయ్యి, అదే పాఠశాలకు చెందిన విద్యార్థిణి చందన రూ.500లను బాధితులకు అందించారు. వరుసగా దాతల సహాయంపైన సాక్షిలో కథనాలు వెలబడుతుండడంతో స్థానిక ములకలచెరువుకు చెందిన వ్యాపారస్తుడు నరసింహులు మూడు రోజుల క్రితం బాధితులకు రూ. 5 వేలను చిన్నారి వైద్యం కోసం చేయూత నిచ్చారు. కారుణ్య మరణం కథనంతో వెలుగులోకి.. పేద కుటుంబం కావడంతో చిన్నారి వైద్యం కోసం డబ్బు వెచ్చించే స్థోమత లేదని కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని బాధితులు గురువారం తంబళ్లపల్లె, మదనపల్లె కోర్టులో పటిషన్ వేశారు. ఈ విషయంపై శుక్రవారం పసిమొగ్గకు ఎంతకష్టం శీర్షికతో సాక్షిలో కథనం వెలువడింది. దీనిపై ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చిన్నారికి వైద్యం చేయిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు చిన్నారి తండ్రి జే.రమణప్పకు శుక్రవారం ఫోను ద్వారా సమాచారం అందించారు. అనంతరం చిన్నారి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని మదనపల్లె సబ్‌కలెక్టర్ కృతికాబాత్రాకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశించినట్లు సమాచారం. సబ్‌కలెక్టర్ ములకలచెరువు తహశీల్దార్ అమరేంద్రబాబుకు చిన్నారి వివరాలు, జబ్బుకు అయ్యే ఖర్చుపై నివేదిక అందివ్వాలని అదేశించడంతో రెవెన్యూ అధికారులు ఒక్కసారిగా బాధితుల ఇంటి వద్దకు ఆగమేఘాలపైన పరుగులు తీశారు. బాధితులు ఇంటి వద్ద లే కపోవడంతో ఫోను ద్వారా వివరాలు సేకరించారు. అనంతరం సబ్క లెక్టర్‌కు నివేదిక పంపించారు. ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం చిన్నారిని హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం చిన్నారికి ఆపరేషన్ నిర్వహించి కాలేయం మార్పిడి చేయనున్నారు. తల్లీదండ్రులలో ఒక్కరికి ఆపరేషన్ చేసి వారి నుంచి కొద్దిబాగం కాలేయాన్ని తీసి చిన్నారికి అమర్చనున్నట్లు సమాచారం. వీటి మొత్తానికి సుమారుగా రూ. 25 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు అంచనా చేస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరావడంతో చిన్నారి కుటుం సభ్యుల కళ్లలో ఆనందం కనిపించింది. సాక్షిలో కథనాలకు స్పందన రావడంతో చిన్నారి తల్లిదండ్రులు సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు. -
పరిమళించిన మానవత్వం
‘సాక్షి’ కథనంపై విశేషంగా స్పందించిన దాతలు అనాథ విద్యార్థి చదువుకు ఆర్థిక చేయూత నాగోలు: ‘చదువు కొనలేని సరస్వతీ పుత్రుడు’ శీర్షికతో ఈ నెల 11న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి దాతల నుంచి విశేష స్పందన లభించింది. ఈ వార్తను చదివిన దయార్థ హృదయులు అనాథ బాలుడిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. దాదాపు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేసి మానవత్వాన్ని చాటారు. ఎల్బీనగర్కు చెందిన అనాథ విద్యార్థి గృహం స్టూడెంట్ కె.జీవన్ ఎన్ఐటీలో సీటు సంపాదించాడు. అయితే నాలుగేళ్ల కోర్సులో ఫీజుల చెల్లింపు, పుస్తకాల కొనుగోలుకు డబ్బులు లేకపోవడంతో సీటును వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. చిన్నతనంలోనే కన్నవారిని కోల్పోయి అనాథగా మారినా.. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదివి మంచి మార్కులు సాధించిన జీవన్ గురించి ‘సాక్షి’ చక్కగా వివరించింది. దీనిపై స్పందించిన దాతలు రాజరాజేశ్వరి రూ.50,016, సంజయ్ రూ.21 వేలు, పుష్పలత రూ.20 వేలు, ఇంద్రషీలారాణి రూ.20 వేలు, యువసేన ట్రస్ట్ యూ.ఎస్.ఏ రూ.16 వేలు, జస్టిస్ ఎం.ఎన్.రావు రూ.10 వేలు, నిఖిల్ రూ.10 వేలు, మరికొంత మంది దాతలు రూ.54 వేలు అందజేశారు. ‘సాక్షి’ చేసిన అక్షర సాయం వల్ల జీవన్‌కు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందింది. దీనిపై అనాథ విద్యార్థుల వసతి గృహం ప్రధాన కార్యదర్శి మార్గం రాజేష్ ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. -
పార్టీకే పంగనామాలు...
-
‘స్మార్ట్’ కి దాతలు కావలెను
జిల్లాలో 1,200 మంది అవసరం ఇప్పటి వరకు ముందుకొచ్చింది కేవలం 124 మంది వితరణశీలురే దాతల అన్వేషణ, ఎంపిక కోసం గ్రామం నుంచి కమిటీలు కలెక్టర్ చైర్మన్‌గా రెండు రోజుల్లో జిల్లా కమిటీని ప్రకటించే అవకాశం రక్షణ లేని కల్వర్టులు.. కనిపించని డ్రైనేజీలు.. రోడ్లపైనే పారే మురుగునీరు.. కుళాయి నీటిని మురుగు నీటిలోనే పట్టుకునే దుస్థితి.. పసర్లు పట్టిన పంచాయతీ చెరువులు.. చాలీచాలని తరగతి గదులు.. సౌకర్యాలు లేని పాఠశాలలు.. అసౌకర్యాల నిలయాలుగా పీహెచ్సీ సెంటర్లు.. ఇలా ఒకటేమిటి.. ఎన్నో సమస్యలు గ్రామాల్లో పడకేశాయి. వాటిని పరిష్కరించేందుకు స్మార్ట్ విలేజ్, వార్డు పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం దాతల కోసం వేట ప్రారంభించింది. సాక్షి, విజయవాడ : జిల్లాక ు ‘స్మార్ట్’ దాతలు కావాలి. వీరి కోసం ప్రభుత్వం కూడా అన్వేషిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా ఒక కమిటీ కూడా రెండు రోజుల్లో ఏర్పాటుకానుంది. దాతల సహకారంతో గ్రామాలను స్మార్ట్ విలేజీలుగా, మున్సిపాలిటీల్లో స్మార్ట్ వార్డులుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మారుమూల గ్రామాల్లో సైతం రోడ్ల నుంచి ఇంటర్నెట్ వరకు అన్ని రకాల సదుపాయాలు కల్పించేందుకు ‘స్మార్ట్ విలేజి-స్మార్ట్ వార్డు’ కార్యక్రమాన్ని గత నెల 18న ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు ప్రణాళికా విభాగం అధికారులు జిల్లాలో స్మార్ట్ విలేజి కార్యక్రమం అమలు చేసేందుకు కసరత్తు సాగిస్తున్నారు. జిల్లాలో గ్రామాలను దత్తత తీసుకోవడానికి పలువురు రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు, విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు ముందుకొస్తున్నారు. దాతల సమగ్ర వివరాలను జిల్లా కమిటీ పరిశీలించిన తర్వాత గ్రామాలను దత్తత ఇస్తారు. కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా కమిటీ.. గ్రామాల్లో సమస్యల గుర్తింపు, పరిష్కార మార్గాలను చూపేందుకు మండలం నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే మండల స్థాయి కమిటీలు పూర్తికాగా, జిల్లా స్థాయి కమిటీ రెండు రోజుల్లో ఏర్పాటుకానుంది. జిల్లా కమిటీకి అనుబంధంగా సపోర్ట్ కమిటీ మరొకటి ఏర్పాటుచేస్తారు. జిల్లా కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్ అహ్మద్‌బాబు కన్వీనర్‌గా ముఖ్య ప్రణాళికాధికారి డాక్టర్ శర్మ, సభ్యులుగా డీఆర్డీఏ, డ్వామా పీడీలు, మరో ముగ్గురు ఉంటారు. దాతల ఎంపికపై ఈ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. దాతల నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, గ్రామాల ఎంపిక ప్రక్రియ సాగుతుందని జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి డాక్టర్ శర్మ ‘సాక్షి’కి తెలిపారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎంపిక చేసిన గ్రామాల్లో దాతల కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు. నిమ్మకూరును దత్తత తీసుకున్న నారా బ్రాహ్మణి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జన్మస్థలమైన నిమ్మకూరు గ్రామాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కోడలు, ఎన్టీఆర్ మనుమరాలు నారా బ్రాహ్మణి దత్తత తీసుకున్నారు. నిమ్మకూరును స్మార్ట్ విలేజీగా రూపొందించేందుకు తాను దత్తత తీసుకున్నట్లు ఆమె గత నెల 18న ప్రకటించారు. 950 గ్రామాలు... 277 వార్డులకు దాతలు కావాలి జిల్లాలోని 49 మండలాల్లో 950 గ్రామాలు ఉన్నాయి. ఆరు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో 218 వార్డులు, విజయవాడ నగరపాలక సంస్థలో 59 డివిజన్లు ఉన్నాయి. ఆయా గ్రామాలు, వార్డులు, డివిజన్లను దాతలకు అప్పగించి వారి నిధులు, ఇతర సేవా కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటుచేశారు. మండల స్థాయిలో తహశీల్దార్, ఆర్డీవోల నేతృత్వంలో నియమించిన కమిటీలు ప్రతి గురువారం గ్రామాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులు, సమస్యలను అధ్యయనం చేసి ఆర్డీవో ద్వారా ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని గత గురువారం జిల్లాలో ప్రారంభించారు. ఈ క్రమంలో జిల్లాలోని గ్రామాలను దత్తత తీసుకునేందుకు దాతలు కూడా ముందుకొస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు ఇప్పటికే మండలాలను దత్తత తీసుకుంటామని ప్రకటించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కృష్ణా జిల్లాలోని గ్రామాలను దత్తత తీసుకుంటామని ఆన్లైన్లో 124 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులు సమర్పించిన వారిలో ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది ఉండటం విశేషం. దాతల ఎంపిక ఇలా... - సాయం చేస్తామని ముందుకొచ్చిన దాతల దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించి సమగ్రంగా పరిశీలిస్తారు. - దాత ఆసక్తి ఏమిటి.. గ్రామానికి ఏం చేయాలనుకుంటున్నారు.. అతని గత అనుభవం ఏమిటనే అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. - ఈ నెల రెండో వారంలోపు ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి దాతల జాబితాను ప్రకటిస్తారు. - దాతల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
బతక లేక.. మెతుకు లేక..
కష్టాల కడలిలో ‘చెన్నమ్మ’ దెబ్బతిన్న కుమారుడి రెండు కిడ్నీలు ఓ కిడ్నీని దానం చేసిన తల్లి కాళ్లు విరిగిన భర్త దిక్కూమొక్కు లేక దీనావస్థలో పేద కుటుంబం మెరుగైన వైద్యం కోసం దాతల వైపు చూపు సాక్షి, సిటీబ్యూరో: ఆ నిరుపేద కుటుంబాన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. సమస్యల మీద సమస్యలు రావడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. అటు బతుకుదెరువు సాగక, ఇటు వైద్యం చేయించుకునే పరిస్థితి లేక ఆ కుటుంబం సతమతమవుతోంది. కొడుకు రెండు కిడ్నీలు పాడైతే తల్లే ఓ కిడ్నీ దానం చేసింది. అదే సమయంలో భర్త గాయపడి మంచాన పడ్డాడు. ఇన్ని సమస్యల మధ్య ఆమె ఒక్కతే పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న భర్త, కుమారుడి వైద్యం కోసం దాతల వైపు దీనంగా ఎదురు చూస్తోంది చెన్నమ్మ. మాలపాటి బాల చెన్నయ్య(38), చెన్నమ్మ(36)లు దంపతులు. వీరికి బాలు(14) అనే కుమారుడున్నాడు. వీరిది గుంటూరు జిల్లా నరసారావుపేట వెంగళరెడ్డి నగర్. నిరుపేద దళిత వర్గానికి చెందిన వీరు కూలి పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరి ఏకైక కుమారుడు బాలు స్థానికంగా ఏడోతరగతి చదువుతున్నాడు. గత ఏడాది బాలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. నగరంలోని ఉస్మానియాలో వైద్యులు పరీక్షించి అతడి రెండు కిడ్నీలు చెడిపోయాయని తేల్చారు. బాలుకు ప్రాణం పోసేం దుకు తల్లి చెన్నమ్మ ముందుకు వచ్చింది. తన కిడ్నీని కుమారుడికి దానం చేసింది. నిమ్స్‌లో ఆపరేషన్‌కు ఆరోగ్యశ్రీ కింద వచ్చిన రూ.2 లక్షలతోపాటు ఇళ్లు అమ్మగా వచ్చిన రూ.9 లక్షలు కలిపి మొత్తం రూ.11 లక్షలు ఖర్చు చేశారు. నెలనెలా డయాలసిస్‌కు హైదరాబాద్‌కు రాలేక ఇక్కడే కూకట్పల్లి ప్రాంతంలోని ప్రగతినగర్‌లో భవన నిర్మాణ కూలీగా పనికి కుదిరా డు చెన్నయ్య. నాలుగు నెలల క్రితం చెన్నయ్య పనులు చేస్తూ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడ్డాడు. రెండు కాళ్లు విరిగిపోయి నడవలేని స్థితిలో ఉన్నాడు. అటు కుమారుడి పరిస్థితి బాగాలేక ఇటు భర్త మంచాన పడడంతో చెన్నమ్మ తల్లడిల్లిపోయింది. ఆమె కిడ్నీ దానం చేసినందున నెలకు 30 రోజులు పని చేయలేని పరిస్థితి. అయినా ఎలాగోలా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. భర్త, కుమారుడి మందులకే నెలకు రూ.15 నుంచి 20 వేలు ఖర్చు అవుతోందని ఆమె చెబుతోంది. తనకు డబ్బులు చేతికివ్వాల్సిన అవసరం లేదని, కుమారుడుకి నెలనెలా డయాలసిస్, భర్త కోలుకునే వరకు మందులకు సహాయం చేస్తే చాలునని చెన్నమ్మ రెండు చేతులు జోడించి వేడుకొంటోంది. కరుణ చూపేవారెవరైనా 8106187906 నంబర్లో సంప్రదించాలని ఆమె కోరుతోంది. -
భర్తల కోసం భార్యల పరస్పర కిడ్నీ దానం
న్యూఢిల్లీ: మూత్రపిండాల వ్యాధి కారణంగా మృత్యువుకు చేరువైన తమ భర్తలను కాపాడుకునేందుకు ఇద్దరు భార్యలు పరస్పరం కిడ్నీదానం చేశారు. దీంతో వారి భర్తలకు పరస్పర కిడ్నీ మార్పిడి ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో విజయవంతంగా జరిగింది. బొకారోలోని సెయిల్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఎస్బీ రామ్(61), ఎన్డీఎంసీకి చెందిన సీనియర్ అధికారి శాంత్ రామ్(58)లు రెండేళ్ల నుంచి తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. కుటుంబసభ్యుల మూత్రపిండాలు మార్పిడి చేసేందుకు వీలుకాకపోవడం, తగిన దాతలు కూడా దొరకకపోవడంతో రెండేళ్లుగా వారు డయాలసిస్ చేయించుకుంటూ వస్తున్నారు. దీంతో ఢిల్లీలోని బీఎల్కే హాస్పిటల్ వైద్యులు ఎస్బీ రామ్, శాంత్ రామ్ భార్యలు ఊర్మిళ, గంగాదేవీలను కలిపి పరిస్థితిని వివరించారు. వారిద్దరూ పరస్పర కిడ్నీదానానికి అంగీకరించడంతో ఒకరి కిడ్నీని మరొకరి భర్తకు ఇటీవల విజయవంతంగా అమర్చారు. వీరిలాగే అందరూ ‘పరస్పర కిడ్నీ మార్పిడి’ పద్ధతికి ముందుకు వస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడొచ్చని వైద్యులు సూచించారు. -
హీల్.. సేవే గోల్
జిల్లాలో హీల్ సేవా ప్రస్థానం ఆరంభం ఆగిరిపల్లి మండలంలో రూ.50కోట్లతో అనాథ, అంధుల పాఠశాల అత్యాధునిక వసతులతో నిర్మాణం ముందుకొచ్చిన ఎన్ఆర్ఐ దాతలు ఒంటరి అన్న భావన భరించలేనిది. అనాథలా బతకడం భారమైనది. అంతా ఉండి ఎవరూ లేనట్టుగా జీవించడం కష్టమైనది.. జీవితంలో ఇలాంటి నిరాశ, నిస్పృహలు అలముకుని అనాథలుగా బతుకుతున్న చిన్నారులకు నేనున్నానంటూ భరోసా ఇస్తోంది ‘హీల్’ సంస్థ. కారు చీకట్లు కమ్ముకున్న జీవితాల్లో అక్షర కాంతులనే వెలుగు దారులు వేస్తోంది. అనాథలు, అంధుల కోసం రూ.50కోట్లతో ప్రత్యేక వసతులు కలిగిన పాఠశాలను నిర్మించి తన సేవా ప్రస్థానానికి పరిమితి లేదని నిరూపించింది. నరసింగపాలెం (ఆగిరిపల్లి) : అనాథ పిల్లలు, అంధ బాలబాలికల పాలిట వరంగా మారింది హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఫర్ ఆల్ (హీల్) ప్యారడైజ్. అనాథలు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోరుు నిరాదరణకు గురైన పిల్లలు, అంధ బాలికలకు ఆశ్రయం కల్పించి విద్యాదానం చేస్తోంది. ఆగిరిపల్లి మండల పరిధిలోని నరసింగపాలెంలో రూపుదిద్దుకుంటున్న ఈ హీల్ ప్యారడైజ్‌లో 1,300 మంది అనాథలు, అంధులు ఆశ్రయం పొందవచ్చు. ఇందులో అత్యాధునిక వసతులతో ఏర్పాటుచేసిన ప్రాథమిక పాఠశాల గత బుధవారమే ప్రారంభమైంది. ‘హీల్’ ప్రారంభమైంది ఇలా.. 1992లో యూకేలో హీల్ సంస్థ ప్రారంభమైంది. విజయవాడలోని పటమటకు చెందిన కోనేరు సత్యప్రసాద్ ఫౌండర్, చైర్మన్‌గా 1993లో గుంటూరులో హీల్-ఇండియా మొదలైంది. అనంతరం గుంటూరు జిల్లా చోడవరంలో హీల్ విలేజ్ ఏర్పాటుచేశారు. అక్కడ నిర్మించిన ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 250 మంది అనాథలు చదువుకుంటున్నారు. వీరికి ఉన్నత చదువులతో పాటు బయటి కళాశాలల్లో చదువుతున్న మరో 250మంది పేద విద్యార్థులకు అవసరమైన ఫీజులు, ఇతర అవసరాలను హీల్ సంస్థే చూసుకుంటుంది. జిల్లాలో సేవా ప్రస్థానం కృష్ణాజిల్లాలోని కానూరు జెడ్పీ పాఠశాలను 2009లో దత్తత తీసుకోవడంతో ఇక్కడ హీల్ తన సేవా ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ స్కూల్ విద్యార్థులకు కావాల్సిన నోట్ పుస్తకాలు, బ్యాగులు, ఫీజులను ఆ సంస్థే చెల్లించింది. సైన్స్ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేసింది. తరువాతి ప్రయత్నంగా ఆగిరిపల్లి మండల పరిధిలోని నరసింగపాలెంలో ఎటువంటి ప్రభుత్వ సహకారం లేకుండా, దాతల ప్రోత్సాహంతో రూ.50 కోట్లతో హీల్ ప్యారడైజ్‌కు శ్రీకారం చుట్టింది. ఎంతోమంది దాతల సహకారంతో... రూ.50 కోట్లతో నిర్మిస్తున్న ఈ హీల్ ప్యారడైజ్‌లో సుమారు 1,300 మంది అనాథ, అంధ విద్యార్థుల కోసం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, కిండర్ గార్డెన్, ఆరోగ్య కేంద్రం, ఇంటిగ్రేటెడ్ ఒకేషనల్ సెంటర్, అంధ పాఠశాల ఏర్పాటుచేయనున్నారు. ప్రాథమిక పాఠశాలను హీల్ ఇండియా వ్యవస్థాపకుడు కోనేరు సత్యప్రసాద్ తన తల్లిదండ్రులు లలిత, రామ కృష్ణారావు జ్ఞాపకార్థం ఇచ్చిన విరాళంతో నిర్మించారు. ఇక్కడ 400 మంది విద్యార్థులకు ఆంగ్లంలో సెంట్రల్ సిలబస్ బోధిస్తారు. బాలబాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యం ఉండేలా ఢిల్లీకి చెందిన హాన్స్ ఇండియా ప్రత్యేక అత్యాధునిక భవనాన్ని నిర్మిస్తోంది. హీల్ ప్యారడైజ్‌లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, అంధుల పాఠశాల, కిండర్ గార్డెన్, ఒకేషనల్ శిక్షణా కేంద్రానికి చెందిన విద్యార్థులకు హీల్ ఆధ్వర్యంలోనే వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు. అంధుల పాఠశాలను ప్రవాస భారతీయుడు చుండూరి ధనుంజయరావు దంపతులు వారి కుమారుడు ఫణీంద్ర పేరు మీద అందించే విరాళంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ వందమంది అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపిలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువు చెబుతారు. ఇంటిగ్రేటెడ్ ఒకేషనల్ శిక్షణా కేంద్రాన్ని ప్రవాస భారతీయుడు చుండూరి కృష్ణబాబు తన తల్లి పేరు మీద అందించే విరాళంతో నిర్మిస్తున్నారు. కంప్యూటర్ కోర్సులతో పాటు ఇతర వృత్తివిద్యా కోర్సులపై 150 మందికి శిక్షణ ఇచ్చేందుకు ప్రవాస భారతీయులు డాక్టర్ బెల్లం శివప్రసాద్, విజయ దంపతులు విరాళం ఇచ్చారు. ఈ మేరకు కోటి రూపాయల విరాళాన్ని వారి కుమారుడు కృష్ణ హీల్ ప్యారడైజ్ చైర్మన్ పిన్నమేనేని ధనప్రకాశ్కు గత బుధవారం జరిగిన కార్యక్రమంలో అందజేశారు. ఇందులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ఆగిరిపల్లి, గన్నవరం మండలాల్లోని 30 గ్రామాలను దత్తత తీసుకుని మొబైల్ వైద్యసేవలు అందించనున్నారు. దీని నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అలాగే, కిండర్‌గార్డెన్ పాఠశాలను ప్రవాస భారతీయులు పిన్నమనేని కవిత, లెనిన్ దంపతుల విరాళంతో నిర్మిస్తున్నారు. హీల్ ప్యారడైజ్ నిర్వహణ కార్యాలయ భవనాన్ని పిన్నమనేని ధనప్రకాశ్ విరాళంతో నిర్మించనున్నారు. అనాథలకే ప్రథమ ప్రాధాన్యం హీల్ ప్యారడైజ్‌లోని ప్రాథమిక పాఠశాలలో ప్రవేశానికి ప్రప్రథమంగా అనాథలు, రెండో ప్రాధాన్యం కింద తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయిన పిల్లలు, మూడో ప్రాధాన్యం కింద ఆర్థిక స్థోమత లేని ఆశక్తులైన తల్లిదండ్రులు కలిగిన పిల్లలకు అర్హత కల్పిస్తాం. ఇందులో ప్రవేశం కావాలనుకునేవారు చిరునామా తెలిపే రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, సంరక్షకుని వివరాలు ముందుగానే అందజేయాలి. వివరాలకు 0866-2842777, 8500122577 నంబర్లను సంప్రదించాలి. ఈ విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలలో 200 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నాం. మరో నాలుగు నెలల్లో వసతిగృహం, అంధుల పాఠశాల, ఒకేషనల్ శిక్షణా కేంద్రాలు పూర్తవుతాయి. వచ్చే ఏడాదికి ప్రాథమికోన్నత పాఠశాల, కిండర్‌గార్డెన్ పాఠశాల, ఆరోగ్య కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టి హీల్ ప్యారడైజ్ పరిపూర్ణంగా అందుబాటులోకి వస్తుంది. - పిన్నమనేని ధనప్రకాశ్, మోడల్ డెయిరీ చైర్మన్, హీల్ ప్యారడైజ్ చైర్మన్