
విరాళాలిచ్చే వారికి ఈ-పాస్‌బుక్కులు
దాతలకు పారదర్శకంగా బస, శ్రీవారి దర్శన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఇప్పటికే టీసీఎస్ సహకారంతో దేవస్థానం ఐటీ విభాగం ‘డోనార్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఆన్‌లైన్ అíప్లికేషన్’ను ప్రారంభించారు. ఇందులో భాగంగానే టీటీడీలోని 9 ట్రస్టులు, ఒక స్కీమ్‌కు రూ.10 లక్షలు, ఆపైన విరాళాలందించిన దాతలందరికీ ఈ–పాస్‌బుక్‌లు అందించే ప్రక్రియను టీటీడీ వేగవంతం చేసింది. దాతలు ఇంటెర్నెట్ ద్వారా స్వయంగా ఈ–పాస్‌బుక్ పొందే సౌలభ్యాన్ని కూడా టీటీడీ కల్పించింది. ఇలా ఇప్పటికే సుమారు ఐదు వేల మంది దాతలు ఆన్‌లైన్‌లో ఈ–పాస్‌బుక్‌లు పొందారు.