
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.
ఇక.. నిన్న(శుక్రవారం) 61,613 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,291 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.12 కోట్లుగా లెక్క తేలింది.
Comments
Please login to add a commentAdd a comment