Tirupati Devasthanam
-
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న (ఆదివారం) 71,441 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 23,595 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.87 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(శుక్రవారం) 61,613 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,291 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.12 కోట్లుగా లెక్క తేలింది. -
బోర్డు లేదు.. స్పెసిఫైడ్ అథారిటీ లేదు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడి వందరోజులైనా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం జరగలేదు. పాలకమండలి ఆలస్యమైతే వెంటనే స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేయాలన్నది నిబంధన. దీనీని సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. కనీసం నెయ్యి, ఇతర వస్తువుల పర్చేజింగ్ కమిటీని కూడా నియమించలేదు. ఇవేమీ లేకుండానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు, కొనుగోళ్లు జరిగిపోతున్నాయి. ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. పాలక మండలి, కనీసం స్పెసిఫైడ్ అథారిటీ లేక తిరుమలపై భక్తుల సౌకర్యాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎటువంటి కమిటీ లేకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం టీటీడీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇంత నిర్లక్ష్యమా అంటూ బాబు సర్కారుపై భక్తులు మండిపడుతున్నారు.కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు తిరుమల వచ్చారు. వైఎస్సార్సీపీ పాలనపై విమర్శలు చేశారు. నాడు అవినీతి, అక్రమాలు జరిగాయని, ప్రక్షాళన టీటీడీ నుంచే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అయినా ఇంతవరకు సరైన పాలన వ్యవస్థనే ఏర్పాటు చేయలేకపోయారు. నిత్యం వేలాది భక్తులు, కోట్ల రూపాయల్లో ఆదాయం ఉండే టీటీడీలో ఏ వస్తువు కొనాలన్నా పాలక మండలి ఆమోదం, పర్చేజింగ్ కమిటీ అనుమతులు తప్పనిసరి. పర్చేజింగ్ కమిటీలో మార్కెటింగ్ అధికారి, ఫైనాన్స్ అడ్వైజర్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎఫ్ఏ అండ్ సీఏఓ), జేఈవో, బోర్డు మెంబర్లు ఉంటారు. నెయ్యి వివాదం నేపథ్యంలో ఈ కమిటీ అత్యవసరం కూడా. అయితే మూడు నెలలుగా బోర్డు, పర్చేజింగ్ కమిటీ రెండూ లేవు. కనీసం ఉన్నతాధికారులతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీ కూడా లేదు. -
Tirumala: తిరుమలలో భక్తుల రద్ధీ.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల: వేసవి సెలవులు ముఖ్యంగా ఎలక్షన్లు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపధ్యంలో, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ముఖ్యంగా, శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ వలన, వారు దర్శనానికి సుమారు ౩౦- 40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి వుంది.సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా.. జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాలలో బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని.. భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. భక్తులు కూడా రద్దీని గమనించి తిరుమల ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. కొండపై వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు అన్ని నిండిపోయి.. ఏకంగా రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూ కట్టి ఉన్నారు. భక్తులు దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్నారు. వీరికి శ్రీవారి దర్శనానికి 24 గంటలకుపైగా సమయం పడుతోందని టీటీడీ చెబుతోంది. టీటీడీ రద్దీని గమనిస్తూ.. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందిస్తున్నారు. -
Tirumala: తిరుమలలో భారీ రద్దీ.. బారులు తీరిన భక్తులు
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న 70,668 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 38,036 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.64 కోట్లు.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న 80,048 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 35,403 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ 4.17 కోట్లు.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది -
టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.5,141.74 కోట్లు
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానములకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. చైర్మన్ అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. వార్షిక బడ్జెట్‌తోపాటు పలు కీలక నిర్ణయాలకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపినట్లు భూమన వెల్లడించారు. దాదాపు 30ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న టీటీడీ ఉద్యోగుల కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి టీటీడీ పాలకమండలి కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం చేసిందని చెప్పారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నవారికి, శిల్పులకు వేతనాలు, వేదపారాయణదారులకు పెన్షన్, కాంట్రాక్టు అర్చకులు, సంభావన అర్చకులు, వేద పాఠశాలల్లోని సంభావన అధ్యాపకుల వేతనాలను, క్రమాపాఠీలు, ఘనాపాఠీలకు సంభావనలు పెంచినట్లు వివరించారు. టీటీడీ నిర్వహిస్తున్న 26 స్థానిక ఆలయాలు, విలీనం చేసుకున్న 34 ఆలయాల్లో 515 పోస్టులు సృష్టించేందుకు ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో టీటీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నగదు, బంగారం ద్వారా వడ్డీ రూ.1,167 కోట్లు వస్తుందని భావిస్తున్నట్లు వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో శ్రీవారి హుండీ ద్వారా సుమారు రూ.1,611 కోట్లు, ప్రసాదాల ద్వారా రూ.600 కోట్లు, దర్శనం ద్వారా రూ.338 కోట్లు వస్తాయని అంచనా వేసినట్లు చెప్పారు. అదేవిధంగా పరికరాల కొనుగోలు కోసం రూ.751కోట్లు, కార్పస్, ఇతర పెట్టుబడుల కోసం రూ.750 కోట్లను బడ్జెట్లో కేటాయించామని, మానవ వనరుల ఖర్చు రూ.1,733 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. హిందూ ధర్మ ప్రచారానికి రూ.108.50కోట్లు కేటాయించినట్లు భూమన వివరించారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల కోసం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద అదనంగా కేటాయించిన 132.05 ఎకరాల స్థలంలో గ్రావెల్ రోడ్డు ఏర్పాటు టెండరుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, పలువురు పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. మహిళలకు శ్రీవారి ఆశీస్సులు అందించిన మంగళ సూత్రాలు సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా హిందువుల ఆరాధ్యదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందించిన మంగళసూత్రాల(తాళిబొట్లు)ను మహిళలకు అందించాలని టీడీపీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. స్వామి వారికి భక్తులు సమర్పించిన బంగారంతో వివిధ ఆచారాలు అనుసరించి మంగళసూత్రాలు తయారు చేయిస్తారు. ఆ మంగళసూత్రాలను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేసి లాభ, నష్టాలు లేని ధర నిర్ణయించి విక్రయిస్తారు. నాలుగైదు డిజైన్లలో తయారు చేసే ఈ మంగళ సూత్రాలు 5 గ్రాములు, 10 గ్రాముల బరువుతో ఉంటాయి. ఇప్పటికే వివాహం అయినవారు, వివాహం చేసుకోబోయే వధువులు ఈ తాళిబొట్లను ధరించడం వల్ల దీర్ఘసుమంగళిగా ఉంటారని భక్తుల విశ్వాసం. భూమన కరుణాకరరెడ్డి గతంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో నిర్వహించిన కల్యాణమస్తు (సామూహిక వివాహాలు) ద్వారా సుమారు 32వేల మంది వధువులకు స్వామివారి ఆశీస్సులు అందించిన మంగళసూత్రాలు ఉచితంగా అందించారు. -
‘మహా సంప్రోక్షణలో సీసీ కెమెరాలు ఆపాల్సిన అవసరం లేదు’
విజయనగరం టౌన్ : తిరుపతి వేంకటేశ్వరాలయంలో చేసేవి శాంతి, సంప్రోక్షణలే అయితే సీసీ కెమెరాలు ఆపాల్సిన అవసరం లేదని ఉత్తరాంధ్ర సాధు సంతు పరిషత్ అధ్యక్షుడు సమతానంద స్వామి అన్నారు. కోట జంక్షన్ వద్ద బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహో సంప్రోక్షణం పేరిట తొమ్మిది రోజుల పాటు భక్తుల దర్శనానికి నిరాకరించడం, సీసీ కెమెరాలు ఆపేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆగస్టు 7 నుంచి 17 వరకూ సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించడం మంచిదే కానీ, ఆ విషయాలను లక్షలాది మంది భక్తులకు సీసీల ద్వారా చూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు. సంప్రోక్షణ కార్యక్రమాలు ఎంతో శ్రద్ధతో చేయాలన్నారు. ఇప్పటికే ర్యాలీలు, నిరసనలు వెల్లువెత్తిన తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం మార్చుకుని రోజుకు 50వేల మందికి దర్శనానికి అనుమతి ఇస్తామన్నా, సీసీ కెమెరాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదన్నారు. ఇప్పటికే టీటీడీపై భక్తులకు ఎన్నో అనుమానాలున్నాయని, ఇటువంటి సమయంలో ఇలా చేస్తే ఆ అనుమానాలు మరింత బలపడే అవకాశం ఉందని తెలిపారు. ఆలయ సంప్రోక్షణ ముహూర్తం ఏ పీఠాధిపతి ధర్మాచార్యుడిని అడిగి ఖరారు చేశారని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రవణ్ చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
తిరుమల సమాచారం
తిరుమల: తిరుమల శ్రీవారికి శనివారం ఉదయం ప్రత్యేక సహస్ర కలశాభిషేకం సేవ జరగనుంది. ఆలయంలోని భోగ శ్రీనివాసమూర్తికి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు 1008 కలశాలతో ఈ సేవను అర్చకులు నిర్వహిస్తారు. ఏటా ఈ సేవను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మరోవైపు శనివారం ఆలయంలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. -
తిరుమల సమాచారం
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. గదులు ఏవీ ఖాళీగా లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 11 కంపార్టుమెంట్లు నిండాయి. శుక్రవారం ఉదయానికి అందిన సమాచారం: ఉచిత గదులు- ఖాళీ లేవు రూ.50 గదులు- ఖాళీ లేవు రూ.100 గదులు- ఖాళీ లేవు రూ.500 గదులు- ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం: ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ సేవ: ఖాళీ లేవు వసంతోత్సవం: ఖాళీ లేవు శుక్రవారం ప్రత్యేక సేవ : పూరాభిషేకం. -
మేల్‌ఛాట్ వస్త్రాలు భక్తులూ ఇవ్వొచ్చు
సాక్షి, తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామిని కనులారా క్షణంపాటు దర్శించినా భక్తులు పరవశించిపోతుంటారు. ఆ స్వామికి తమ చేతులమీదుగా సమర్పించే మేల్‌ఛాట్ వస్త్రాన్ని (మూలమూర్తికి 12 గజాల పొడవు రెండుగజాల వెడల్పు కలిగిన ధోవతి) అలంకరింప చేస్తే.. అలాంటి మధురానుభూతి పొందే అవకాశాన్ని తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి కల్పించింది. తిరుమల ఆలయంలో ప్రతి శుక్రవారం శ్రీవారికి బహూకరించే మేల్‌ఛాట్ వస్త్రాన్ని ఇకపై భక్తులు ఇస్తే స్వీకరించాలని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గిరిధర్ గోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశం తీర్మానించింది. భారీగా మార్కెటింగ్ కొనుగోళ్లకు అవసరమైన అనుమతులకు ఆమోదం తెలిపింది. అలాగే, టీటీడీ మార్కెటింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్ల అసోసియేషన్ నుంచి కేజీ రూ.42 చొప్పున ఆరునెలలకు సరిపడా రూ.12.85కోట్లతో బియ్యం కొనుగోలు చేయనున్నారు. రూ.9కోట్లతో 22లక్షల కిలోల బెంగాల్ దాల్(పప్పు), రూ.1.35 కోట్లతో 1.5 లక్షల కిలోల పెసరపప్పు, రూ.1.67 కోట్లతో 440 టన్నుల బెల్లం కొనుగోలు చేయనున్నారు. ముంబైలోని మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎంఎంటీసీ) లిమిటెడ్ సంస్థ నుంచి 2 గ్రాములు, 5 గ్రాముల వెండి డాలర్లు 30 వేలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. శ్రీవారి భక్తులకు లడ్డూల కొరత లేకుండా చూసేందుకు ఆలయంలో ప్రధాన పోటులో 332మంది, అదనపు పోటులో 140మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని 2016వ సంవత్సరం వరకు కొనసాగించనున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 32 కంపార్ట్మెంట్లలో దర్శనం కోసం వేచి ఉండే భక్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు తిలకించేలా రూ.2.70 కోట్లతో 108 అంగుళాల ప్లాస్మా టీవీలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. -
గదుల్లేక తిరుమలలో భక్తుల ఇక్కట్లు
-
తిరుమలకి తాకిన సమైక్య సెగ