న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్(ఈసీ) వెల్లడించిన ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాల వివరాల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాజకీయ పార్టీలకు అత్యధిక మొత్తం విరాళాలిచ్చిన టాప్ 30 కంపెనీల్లో 15 కంపెనీలకుపైగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ (ఐటీ)వంటి సంస్థల దర్యాప్తు ఎదుర్కొన్నవే కావడం గమనార్హం.
అయితే ఏజెన్సీల దర్యాప్తు ఒక్కో కంపెనీకి సంబంధించి ఒక్కో దశలో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని కంపెనీలపై కేవలం కేసులు ఫైల్‌కాగా, మరికొన్ని కంపెనీలపై దాడులు జరిగాయి. ఇంకా కొన్ని కంపెనీల ఆస్తులను ఈడీ ఏకంగా జప్తు చేసేదాకా వెళ్లింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలతో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)ఎన్నికల కమిషన్(ఈసీ)కి అందించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఈసీ గురువారం బహిర్గతం చేసింది.
ఈ విరాళాల్లో ఎక్కువ మొత్తం బీజేపీకి వెళ్లగా ఆ తర్వాతి స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తదితర పార్టీలున్నాయి. ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు వ్యక్తులు, కంపెనీలు విరాళాలందించడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు ఈ స్కీమ్‌ను ఇప్పటికే రద్దు చేసింది.
ఇదీ చదవండి.. ఎన్నికల బాండ్ల కేసు.. ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment