సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకొనే ప్రసక్తే లేదు
సుప్రీంకు కేంద్రం స్పష్టికరణ
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తమ నియంత్రణలో లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సీబీఐ ఒక కేసును నమోదు చేయడాన్ని గానీ, సీబీఐ దర్యాప్తును గానీ తాము పర్యవేక్షించలేమని వెల్లడించింది. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, విపక్షాలను లక్ష్యంగా చేసుకొని వేధించడానికి వాడుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచి్చన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.
తమ రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు ఇచి్చన సాధారణ సమ్మతిని బెంగాల్ ప్రభుత్వం 2018 నవంబర్ 16న ఉపసంహరించుకుంది. దాంతో రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేయలేదు. కొన్ని నెలల క్రితం బెంగాల్‌లో ఈడీ అధికారుల బృందంపై జరిగిన దాడిపై సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. సందేశ్‌ఖాలీ అక్రమాలపై దర్యాప్తు చేపట్టింది. దీనిపై బెంగాల్ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ అనుమతి తీసుకోకుండానే సీబీఐ తమ రాష్ట్రంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కేసులు దర్యాప్తు చేస్తోందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
రాజ్యాంగంలోని ఆరి్టకల్ 131 కింద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. బెంగాల్‌లో కేసులను భారత ప్రభుత్వం నమోదు చేయలేదని, సీబీఐ నమోదు చేసిందని తెలిపారు. సీబీఐపై ప్రభుత్వæ నియంత్రణ ఉండదన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ దర్యాప్తులో కేంద్రం జోక్యం చేసుకొనే ప్రసక్తే లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment