బెంగళూరు: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఊరట లభించింది. ఈడీని అడ్డం పెట్టుకొని వ్యాపారవేత్తలను బెదిరించి ఎలక్టోరల్ బాండ్ల పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేశారనే కేసులో నిర్మల, ఇతరులపై సాగుతున్న దర్యాప్తుపై కర్నాటక హైకోర్టు సోమవారం స్టే విధించింది. నిందితుల్లో ఒకరైన బీజేపీ నేత నళిన్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎం.నాగప్రసన్న దర్యాప్తుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
తదుపరి విచారణను అక్టోబరు 22కు వాయిదా వేశారు. ఆదర్శ్ ఆర్ అయ్యర్ చేసిన ఫిర్యాదు మేరకు.. స్పెషల్ కోర్టు ఆదేశాలతో నిర్మలా సీతారామన్, బీజేపీ జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఈడీ అధికారులపై శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదైంది. భారతీయ న్యాయసంహిత సెక్షన్ 384 (బెదిరించి డబ్బు గుంజడం), 120బి (నేరపూరిత కుట్ర), సెక్షన్ 34 కింద వీరిపై కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment