కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఊరట | Karnataka High Court Stays Probe Against Nirmala Sitharaman In Poll Bonds Case | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఊరట.. విచారణపై స్టే

Published Mon, Sep 30 2024 8:27 PM | Last Updated on Mon, Sep 30 2024 8:30 PM

Karnataka High Court Stays Probe Against Nirmala Sitharaman In Poll Bonds Case

బెంగళూరు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కాస్త ఊరట లభించింది. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జేపీ నడ్డాతోపాటు మరికొందరిపై నమోదైన కేసు విచారణపై కర్ణాటక హైకోర్టు స్టే ఇచ్చింది. 

ఈ మేరకు తమపై తిలక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్‌​ చేస్తూ బీజేపీ నేత నళిన్‌ కుమార్‌ కటీల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎం నాగప్రసన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను అక్టోబర్‌ 22కు వాయిదా వేసింది. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

కాగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఎన్నికల బాండ్ల పేరిట రూ. కోట్లు దోచుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై బెంగళూరులో కేసు నమోదైన విషయం తెలిసిందే. నిర్మల తదితరులు పారిశ్రామికవేత్తలను బెదిరించి ఎన్నికల బాండ్ల పేరిట  రూ.8,000 కోట్లకుపైగా లూటీ చేశారని జనాధికార సంఘర్ష సంఘటన (జేఎస్‌పీ) నేత ఆదర్శ ఆర్‌.అయ్యర్‌ ఫిర్యాదు చేశారు.  

దాంతో నిర్మల తదితరులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యే క కోర్టు శనివారం ఆదేశించింది. ఆ మేర కు తిలక్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఏ1గా నిర్మల, ఏ2 గా ఈడీ అధికారులు, ఏ3గా బీజేపీ కేంద్ర పదాధికారులు, ఏ4గా కర్నాటక బీజేపీ మాజీ చీఫ్‌ నళిన్‌ కుమార్‌ కటీల్, ఏ5గా ప్రస్తుత చీఫ్‌ బి.వై.విజయేంద్ర, ఏ6గా రాష్ట్ర బీజేపీ పదాధికారులను చేర్చారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement