
సాక్షి, బెంగళూరు: అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఎన్నికల బాండ్ల పేరిట రూ. కోట్లు దోచుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై బెంగళూరులో కేసు నమోదైంది. నిర్మల తదితరులు పారిశ్రామికవేత్తలను బెదిరించి ఎన్నికల బాండ్ల పేరిట రూ.8,000 కోట్లకుపైగా లూటీ చేశారని జనాధికార సంఘర్ష సంఘటన (జేఎస్‌పీ) నేత ఆదర్శ ఆర్.అయ్యర్ ఫిర్యాదు చేశారు.
దాంతో నిర్మల తదితరులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యే క కోర్టు శనివారం ఆదేశించింది. ఆ మేర కు తిలక్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా నిర్మల, ఏ2 గా ఈడీ అధికారులు, ఏ3గా బీజేపీ కేంద్ర పదాధికారులు, ఏ4గా కర్నాటక బీజేపీ మాజీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్, ఏ5గా ప్రస్తుత చీఫ్ బి.వై.విజయేంద్ర, ఏ6గా రాష్ట్ర బీజేపీ పదాధికారులను చేర్చారు.
నిర్మల రాజీనామా చేయరా: సిద్ధు
కేసు నేపథ్యంలో నిర్మలను కూడా బీజేపీ రాజీనామా కోరుతుందా అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారు. ‘ముడా’ కేసులో ఆయన రాజీనామా చేయాల్సిందేనని బీజేపీ కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తుండటం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment