janadhikar party
-
కర్ణాటకలో నిర్మలపై కేసు
సాక్షి, బెంగళూరు: అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఎన్నికల బాండ్ల పేరిట రూ. కోట్లు దోచుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై బెంగళూరులో కేసు నమోదైంది. నిర్మల తదితరులు పారిశ్రామికవేత్తలను బెదిరించి ఎన్నికల బాండ్ల పేరిట రూ.8,000 కోట్లకుపైగా లూటీ చేశారని జనాధికార సంఘర్ష సంఘటన (జేఎస్పీ) నేత ఆదర్శ ఆర్.అయ్యర్ ఫిర్యాదు చేశారు. దాంతో నిర్మల తదితరులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యే క కోర్టు శనివారం ఆదేశించింది. ఆ మేర కు తిలక్ నగర్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా నిర్మల, ఏ2 గా ఈడీ అధికారులు, ఏ3గా బీజేపీ కేంద్ర పదాధికారులు, ఏ4గా కర్నాటక బీజేపీ మాజీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్, ఏ5గా ప్రస్తుత చీఫ్ బి.వై.విజయేంద్ర, ఏ6గా రాష్ట్ర బీజేపీ పదాధికారులను చేర్చారు.నిర్మల రాజీనామా చేయరా: సిద్ధుకేసు నేపథ్యంలో నిర్మలను కూడా బీజేపీ రాజీనామా కోరుతుందా అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారు. ‘ముడా’ కేసులో ఆయన రాజీనామా చేయాల్సిందేనని బీజేపీ కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. -
జైలు నుంచి బయటకొచ్చిన పప్పు యాదవ్
పట్నా: బీజేడీ బహిష్కృత నేత జనాధికార్ పార్టీ వ్యవస్థాపకుడు రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ జైలు నుంచి విడుదలయ్యాడు. 25 రోజులపాటు బియుర్ జైలులో గడిపిన ఆయన పట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం విడుదలయ్యాడు. ఈ సందర్భంగా జైలు వెలుపల ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మిఠాయిలు పంచుకున్నారు. మాదేపురా నుంచి ఎంపీగా పనిచేస్తున్న పప్పును శాంతిభద్రతలకు భంగంకలిగించాడనే కేసులో పోలీసులు మార్చి 27న అరెస్టు చేశారు. ప్రస్తుతం విడుదలైన నేపథ్యంలో నేరుగా మోతిహారి వెళ్లి అక్కడ షుగర్ మిల్లులో పనిచేస్తూ ఏరియర్స్‌కోసం ఆందోళన చేసి నిరసనగా ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు ప్రైవేటు యూనియన్ నాయకుల కుటుంబాలను కలవనున్నారట. తన పార్టీ తరుపున ఆ రెండు కుటుంబాలకు చెరో రూ.50వేలు ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపాడు. రెండు కుటుంబాలు ఆగమై పోయినా కనీసం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పట్టించుకోలేదని మండిపడ్డారు. అందుకే తాను వారి కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పప్పుయాదవ్ అరెస్టు, చేతికి బేడీలు ఉంచే కోర్టుకు తీసుకెళ్లడంపై ఆయన భార్య కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ లోక్‌సభలో లేవనెత్తారు.