extortion
-
కర్ణాటకలో నిర్మలపై కేసు
సాక్షి, బెంగళూరు: అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఎన్నికల బాండ్ల పేరిట రూ. కోట్లు దోచుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై బెంగళూరులో కేసు నమోదైంది. నిర్మల తదితరులు పారిశ్రామికవేత్తలను బెదిరించి ఎన్నికల బాండ్ల పేరిట రూ.8,000 కోట్లకుపైగా లూటీ చేశారని జనాధికార సంఘర్ష సంఘటన (జేఎస్పీ) నేత ఆదర్శ ఆర్.అయ్యర్ ఫిర్యాదు చేశారు. దాంతో నిర్మల తదితరులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యే క కోర్టు శనివారం ఆదేశించింది. ఆ మేర కు తిలక్ నగర్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ1గా నిర్మల, ఏ2 గా ఈడీ అధికారులు, ఏ3గా బీజేపీ కేంద్ర పదాధికారులు, ఏ4గా కర్నాటక బీజేపీ మాజీ చీఫ్ నళిన్ కుమార్ కటీల్, ఏ5గా ప్రస్తుత చీఫ్ బి.వై.విజయేంద్ర, ఏ6గా రాష్ట్ర బీజేపీ పదాధికారులను చేర్చారు.నిర్మల రాజీనామా చేయరా: సిద్ధుకేసు నేపథ్యంలో నిర్మలను కూడా బీజేపీ రాజీనామా కోరుతుందా అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారు. ‘ముడా’ కేసులో ఆయన రాజీనామా చేయాల్సిందేనని బీజేపీ కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. -
‘హైడ్రా’ పేరిట వసూళ్లు..! వ్యక్తిపై కేసు నమోదు
సాక్షి,సంగారెడ్డి: అమీన్పూర్లో హైడ్రా పేరిట బిల్డర్ల వద్ద నుంచి వసూళ్లకు యత్నించిన ఓ వ్యక్తిపై పోలిస్స్టేషన్లో కేసు నమోదైంది. బెదిరింపులకు పాల్పడుతున్న డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తిపై బిల్డర్లు వాడల రాజేంద్రనాథ్, మంజునాథ్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. సోషల్ యాక్టివిస్ట్, సోషల్ వర్కర్ అని బోర్డు పెట్టుకొని కస్టమర్లకు తమ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో దగ్గరి పరిచయం ఉందని, ఆయనతో కలిసి దిగిన ఫొటోలు చూపిస్తూ వాట్స్అప్ కాల్ చేసి బెదిరిస్తున్నాడని తెలిపారు. మీ జోలికి రావద్దు అంటే తనకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించారు. బిల్డర్ల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన అమీన్పూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆన్లైన్ మోసాలకు అంతేలేదు
దేశంలో ఆర్థిక మోసాలు పెచ్చరిల్లుతున్నాయి. వినియోగదారుల ఆర్థిక డేటా వివరాలు అంగట్లో సరుకులా అమ్ముడవుతున్నాయి. గడిచిన మూడేళ్లలో పట్టణ భారతీయుల్లో అధిక శాతం మంది క్రెడిట్ కార్డు మోసాలకు గురయ్యారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతుంది. ఆ తర్వాత.. నిత్యం లావాదేవీలకు కోసం వాడే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా సరికొత్త చోరీలు తెరపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశంలోని వేలాది మంది డేటా విక్రేతల ద్వారా దేశీయ వినియోగదారుల క్రెడిట్ కార్డు సమాచారం మార్కెట్లో సులభంగా లభిస్తోందని సోషల్ మీడియా రీసెర్చ్ ఫ్లాట్‌ఫారం సంస్థ లోకల్ సర్కిల్స్ సర్వేలో తేలింది. సాక్షి, అమరావతిక్రెడిట్ కార్డుల ద్వారా 43శాతం మోసాలు..దేశవ్యాప్తంగా గడిచిన 36 నెలల్లో ఏకంగా 47 శాతం మంది పట్టణ భారతీయులు, వారి కుటుంబ సభ్యులు ఆర్థిక మోసాల బారినపడినట్లు నివేదిక పేర్కొంది. 43 శాతం మంది తమ క్రెడిట్ కార్డు ద్వారా.. 30 శాతం మంది యూపీఐ లావాదేవీల ద్వారా మోసపోయారు. క్రెడిట్ కార్డు ద్వారా జరిగిన మోసాల్లో దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరు దేశీయ, అంతర్జాతీయ వ్యాపారులు వెబ్సైట్ల ద్వారా అనధికారిక చార్జీల మోతను భరించాల్సి వచి్చంది. బ్యాంకర్ల పేరుతో ఫోన్లుచేసి ఓటీపీలు ద్వారా డెబిట్ కార్డు వివరాలు అప్డేట్ చేయాలంటూ ఖాతాల్లోని నగదును దోచేస్తున్నారు. ఇక యూపీఐ ద్వారా ఆన్లైన్ దోపిడీ విషయంలో ప్రతి పదిమంది బాధితుల్లో నలుగురు చెల్లింపునకు అంగీకరించడానికి పంపించే లింక్‌ను క్లిక్, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా డబ్బులను పోగొట్టుకున్నారు. ఇక యూపీఐ, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆ అధ్యయనం అభిప్రాయపడింది. ఆర్బీఐ, యూపీఐ.. క్రెడిట్ కార్డులు జారీచేసే బ్యాంకులు ఇలాంటి ఆరి్థక మోసాలను నిరోధించేందుకు మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని తేల్చిచెప్పింది. సైబర్ క్రైం పోలీసుస్టేషన్లు, నిమిషాల వ్యవధిలో ఆన్లైన్ ఫిర్యాదును ఫైల్‌చేసే వ్యవస్థ అందుబాటులోకి రావాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు.ఇక యూపీఐ, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆ అధ్యయనం అభిప్రాయపడింది. ఆర్బీఐ, యూపీఐ.. క్రెడిట్ కార్డులు జారీచేసే బ్యాంకులు ఇలాంటి ఆర్థిక మోసాలను నిరోధించేందుకు మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని తేలి్చచెప్పింది. సైబర్ క్రైం పోలీసుస్టేషన్లు, నిమిషాల వ్యవధిలో ఆన్లైన్ ఫిర్యాదును ఫైల్‌చేసే వ్యవస్థ అందుబాటులోకి రావాలని నిపుణులు సైతం సూచిస్తున్నారు.అమ్మకానికి క్రెడిట్ కార్డు డేటా.. మరోవైపు.. దేశంలోని వినియోగదారుల క్రెడిట్ కార్డు డేటా సులభంగా అమ్మకానికి అందుబాటులో ఉందని ఈ అధ్యయనం చెబుతోంది. పాన్‌కార్డు, ఆధార్, మొబైల్ నంబర్, ఈమెయిల్, చిరునామా వంటి వ్యక్తిగత సమాచారంతో పాటు మొబైల్ నంబర్, ఈమెయిల్, ఇతర చిరునామాతో క్రెడిట్ కార్డుల వివరాలు కూడా అందుబాటులో ఉండటం సమాజానికి శ్రేయస్కరం కాదని పేర్కొంది. ఒక్క ఏడాదిలో రూ.13,930 కోట్ల దోపిడీ.. ఆర్బీఐ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 36వేల కంటే ఎక్కువ ఆర్థిక మోసాలు నమోదైనట్లు తెలుస్తోంది. ఇది గత ఆరి్థక ఏడాదితో పోలిస్తే 166 శాతం మేర గణనీయంగా పెరిగింది. బ్యాంకింగ్ రంగంలో ఈ మోసాల కేసులు 2022–23లో 13,564 నుంచి 2023–24లో 36,075కి చేరుకున్నాయి. అయితే, ఈ మోసాల విలువ 2023–24లో రూ.13,930 కోట్లకు చేరాయి. అయితే, ఇక్కడ ప్రతి పది మంది బాధితుల్లో ఆరుగురు ఎటువంటి ఫిర్యాదులు చేయడానికి ముందుకు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని నివేదిక పేర్కొంది. -
ఎన్నికల బాండ్లు: రాహుల్‌గాంధీకి అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్
గాంధీనగర్: లోక్‌సభ ఎన్నికల వేళ ఎన్నికల బాండ్లపై నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి నామినేషన్ వేసిన సందర్భంగా శుక్రవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల బాండ్లపై మాట్లాడారు. ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్టార్షన్(అక్రమ వసూళ్లు) స్కీమ్‌గా అభివర్ణించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి షా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల బాండ్ల స్కీమ్ అతిపెద్ద ఎక్స్టార్షన్ స్కీమ్ అయితే కాంగ్రెస్‌కూడా ఈ స్కీమ్ కింద అక్రమ వసూళ్లకు పాల్పడిందని షా ఆరోపించారు. తాము కూడా ఈ స్కీమ్ కింద వసూళ్లు చేశామని రాహుల్ ప్రజలకు చెప్పాలి. ఎంపీల సంఖ్య ప్రకారం చూస్తే ప్రతిపక్షాలే అత్యధికంగా ఎన్నికల బాండ్ల స్కీమ్‌లో లాభపడ్డాయన్నారు. ప్రతిపక్షాలకు తమను విమర్శించడానికి ఏమీ లేదని, ఇందుకే ప్రజలను కావాలని గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు. కాగా, ఎన్నికల బాండ్ల స్కీమ్ కింద బీజేపీ అక్రమ వసూళ్లకు పాల్పడిందని, ప్రధాని మోదీ అవినీతి ఛాంపియన్ అని ఇటీవల రాహుల్‌గాంధీ విమర్శించారు. ఇదీ చదవండి.. నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల్లో జీరో పోలింగ్ -
TG: ఎవరా పెద్ద సారు?
సాక్షి, హైదరాబాద్: పోలీసు విభాగంలో డీజీపీ కార్యాలయాన్ని మించిన ఉన్నత విభాగం (టాప్ ఆఫీస్) మరొకటి లేదు. ఆ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలు ఎవరైనా పాటించాల్సిందే. కానీ గతంలో ఓ ఉన్నతాధికారి (హయ్యర్ అప్) ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారా? అంటే.. క్రియ హెల్త్ కేర్ డైరెక్టర్ వేణుమాధవ్ చెన్నుపాటి కిడ్నాప్ కేసును పరిశీలిస్తే అవుననే సమాధానమే లభిస్తోంది. అదే సమయంలో ఎవరా ఉన్నతాధికారి? అనే సందేహం కలుగుతోంది. కృష్ణారావు ద్వారా హయ్యర్ అప్ వద్దకు.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో రిజిస్టర్ అయిన ఈ కేసులో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్‌రావు, ఇన్స్పెక్టర్లు బి.గట్టుమల్లు, ఎస్.మల్లికార్జున్ తదితరులు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కిడ్నాప్ కేసులో ఐదో నిందితుడిగా ఉన్న కృష్ణారావు అలియాస్ కృష్ణ పాత్ర కీలకమని తెలుస్తోంది. ఈయన గతంలో ఓ మీడియా చానల్లో కీలక స్థానంలో పని చేశారు. అప్పట్లోనే పలువురు పోలీసు ఉన్నతాధికారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అలాంటి వారిలో ఈ ‘హయ్యర్ అప్’కూడా ఒకరని సమాచారం. వేణు మాధవ్‌ను కిడ్నాప్ చేసి, తీవ్ర స్థాయిలో బెదిరించి, పత్రాలపై సంతకాలు చేయించుకుని క్రియా హెల్త్ కేర్ సంస్థను చేజిక్కించుకోవాలని దాని పార్ట్‌టైమ్ డైరెక్టర్లు గోపాల్, రాజ్ తలసిల, నవీన్, రవి... గోల్డ్ ఫిష్ అబోడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ వేగేతో కలిసి కుట్ర పన్నారు. కృష్ణారావు అనేక మంది పోలీసు ఉన్నతాధికారులకు సన్నిహితుడని తెలిసిన చంద్రశేఖర్ ఆయన్ను సంప్రదించాడని, కృష్ణారావు ద్వారానే హయ్యర్ అప్ వరకు ఈ వ్యవహారం వెళ్లిందని సమాచారం. కాగా విషయం సెటిల్ చేయడానికి రూ.10 కోట్లకు డీల్ మాట్లాడుకున్న ఆ పెద్ద సారు.. పని పూర్తి చేసే బాధ్యతల్ని రాధాకిషన్‌రావు, గట్టు మల్లులకు అప్పగించినట్లు, దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. డీజీపీ కార్యాలయం గట్టు మల్లుకు ఫోన్ సిట్ సమాచారం మేరకు.. 2018 నవంబర్ 22న ఉదయం 5.30 గంటలకు అప్పట్లో టాస్క్‌ఫోర్స్ ఎస్సైగా పని చేస్తున్న మల్లికార్జున్.. వేణుమాధవ్‌ను తన బృందంతో కిడ్నాప్ చేసి సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించాడు. అక్కడ రాధాకిషన్‌రావు ప్రోద్భలంతో అప్పటి వెస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్ ఇన్స్పెక్టర్ గట్టు మల్లు తీవ్రస్థాయిలో వేణును బెదిరించాడు. అతి కష్టంమ్మీద తన ఫోన్ దక్కించుకున్న వేణుమాధవ్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయం నుంచే తొలుత తన న్యాయవాది శ్రీనివాస్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆయన కోర్టులో తేల్చుకుందాం అన్నారు. తర్వాత తన స్నేహితుడైన లహరి రిసార్ట్స్ యజమాని సంజయ్‌ను వేణు సంప్రదించారు. దీంతో డీజీపీ కార్యాలయానికి వెళ్లిన సంజయ్ అక్కడ నుంచి గట్టు మల్లుకు ఫోన్ చేయించారు. ఆ కాల్ అందుకున్న రాధాకిషన్ రావు మాటాడుతూ.. ఇది ఉన్నతాధికారే అప్పగించిన విషయని చెప్పడంతో డీజీపీ కార్యాలయం చేతులెత్తేసింది. దీంతో రాధాకిషన్‌రావు, గట్టు మల్లు, మల్లికార్జున్ తదితరులు వేణుమాధవ్‌తో పత్రాలపై సంతకాలు చేయించి క్రియా హెల్త్‌కేర్‌లో షేర్లు, ఆయన యాజమాన్యం మార్పు చేశారు. ఆ నలుగురి వాంగ్మూలాలు కీలకమే.. వేణును తీవ్రస్థాయిలో భయపెట్టడానికి ఉగ్రవాదం, మనీలాండరింగ్ కేసులు నమోదు చేస్తామంటూ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బెదిరించారు. ఇందుకు సంబంధించి రాధాకిషన్‌రావు సహా తొమ్మిది మందిపై కేసు నమోదైంది. వేణు మాధవ్ తన నలుగురు పార్ట్‌టైమ్ డైరెక్టర్ల వేధింపులపై 2018 అక్టోబర్ 3న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే నెల 12 నుంచి నలుగురి నుంచి వేణుకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో అప్పటి బంజారాహిల్స్ ఏసీపీని కలిసి న్యాయం చేయమని కోరినా ఫలితం దక్కలేదు. ఈ ఫిర్యాదు విషయంలో పోలీసుల ఉదాశీన వైఖరికి కారణం తెలియాలంటే నాటి బంజారాహిల్స్ ఏసీపీని పిలిచి విచారించాల్సి ఉంది. ముఖ్యంగా డీజీపీ కార్యాలయం, హయ్యర్ అప్‌తో పాటు న్యాయవాది శ్రీనివాస్, లహరి రిసార్ట్స్ యజమాని సంజయ్‌ల నుంచీ వాంగ్మూలాలు సేకరించాలి. అయితే డీజీపీ కార్యాలయం, ‘హయ్యర్ అప్ విషయంలో సిట్ అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారన్నది వేచి చూడాల్సి ఉంది. సిట్ అదుపులో ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రాధాకిషన్‌రావు ఇప్పటికే అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. దీంతో ఆయన్ను కిడ్నాప్ కేసులో పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి, కోర్టు అనుమతితో పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీసులు, సిట్ అధికారులు నిర్ణయించారు. మరోపక్క ఇదే కేసులో నిందితుడిగా ఉన్న నాటి టాస్క్‌ఫోర్స్ ఎస్సై, ప్రస్తుతం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో (ఎస్ఐబీ) ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న మల్లికార్జున్‌ను సిట్ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
బాండ్లు కాదు.. బీజేపీ బలవంతపు వసూళ్లు: అఖిలేశ్
కనౌజ్(యూపీ): ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కేంద్రంలోని అధికార బీజేపీపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మరోసారి విరచుకుపడ్డారు. బీజేపీ బాండ్ల రూపంలో బలవంతంగా డబ్బులు వసూలు చేసిందని ఆరోపించారు. చందాల ముసుగులో వసూళ్ల దందాకు తెరతీసిందని ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. బలవంతపు వసూళ్ల కోసం సీబీఐ, ఈడీ ఐటీ వంటి సంస్థలను బీజేపీ విచ్చలవిడిగా వాడుకుందని మండిపడ్డారు. కొందరు కాంట్రాక్టర్లపై సీబీఐ, ఈడీ, ఐటీ శాఖ నుంచి ఒత్తిళ్లు పెరిగినప్పుడల్లా బీజేపీ ఖాతాలోకి పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్లతో ఇప్పు డు బీజేపీ ప్రతిష్ట మసకబారిందని పేర్కొన్నారు. భిన్నమైన పార్టీ అని చెప్పుకొనే బీజేపీపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని వెల్లడించారు. ఈ ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయించారని అఖిలేశ్ ఆక్షేపించారు. -
‘మేనేజ్’ చేస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: మేనేజ్మెంట్ కోటాలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిపై ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నతవిద్య అధికారులను అప్రమత్తం చేసింది. విద్యార్థి సంఘాలు, వివిధ వర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణలోనికి తీసుకున్నట్టు తెలిసింది. దీని ఆధారంగా సమగ్ర వివరాలు అందించాలని అధికారులను సీఎంఓ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి సహా అన్ని యూనివర్సిటీల వీసీలు వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. విశ్వవిద్యాలయాలపై వస్తున్న ఫిర్యాదులపై ఇటీవల ముఖ్యమంత్రి విద్యాశాఖ సమీక్షలో ప్రస్తావించారు. ఇదే క్రమంలో సీట్ల అమ్మకాలపైనా ఆరా తీశారు. ఆ తర్వాతే వర్సిటీల ప్రక్షా ళన దిశగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలిసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపుపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. పక్కాగా తనిఖీలుండాల్సిందే... ప్రైవేట్ కాలేజీలకు గుర్తింపు ఇచ్చే సమయంలో యూనివర్సిటీ స్థాయిలో ప్రత్యేకంగా కమిటీలు వేస్తారు. ఇవి ప్రతీ కాలేజీకి వెళతాయి. అక్కడ మౌలిక వసతులు, అధ్యాపకుల పరిస్థితిని సమీక్షిస్తాయి. ఈ వ్యవహారం మొత్తం నామమాత్రంగానే సాగుతోందనే ఫిర్యాదులున్నాయి. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో వర్సిటీ అధికారులు బేరం కుదుర్చుకుంటున్నారనే విమర్శలూ వస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించినట్టు తెలిసింది. చాలా కాలేజీల్లో మౌలిక వసతులు లేకున్నా అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి కాలేజీల జాబితా సిద్ధం చేయాలని అధికారులను సీఎంఓ ఆదేశించినట్టు సమాచారం. ఈ ప్రక్రియలో వీసీలనే కాకుండా, ఇతర అధికారులను కూడా భాగస్వామ్యం చేసే ఆలోచననలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఫ్యాకల్టీపై ప్రత్యేక దృష్టి గత ఏడాది రాష్ట్రంలో 14 వేల వరకూ కంప్యూటర్ దాని అనుబంధ బ్రాంచ్‌లలో సీట్లు పెరిగాయి. సీఎస్సీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి బ్రాంచ్‌లలో సీట్లను యాజమాన్యాలు రూ.12 నుంచి రూ.18 లక్షల వరకూ అమ్ముకున్నట్టు ఆరోపణలు వచ్చా యి. ఉన్నత విద్యామండలికి కూడా ఇలాంటి ఫిర్యాదులు 145 వరకూ వచ్చాయి. దీనిపై ఏం చర్యలు తీసుకున్నారనే విషయమై సీఎంఓ ఆరా తీసింది. సరైన ఆధారాలు లేవంటూ అధికారులు వీటిని పక్కన బెట్టడంపై ఇటీవల సీఎం సీరియస్ అయినట్టు సమాచారం. ఫిర్యాదుల ఆధారంగా కొంతమంది అధికారుల బృందంతో దర్యాప్తు జరిపించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వచ్చే ఏడాది కూడా కంప్యూటర్ సైన్స్ బోధించేందుకు యూజీసీ నిబంధనల ప్రకారం అర్హతలు ఉంటేనే అఫ్లియేషన్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికా రులను ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. -
ఔటర్‌పై టోల్ తీస్తున్నారు!
హైదరాబాద్‌కు చెందిన ఓ వాహనదారుడు మూడు రోజుల క్రితం గచ్చిబౌలి నుంచి ఔటర్ మీదుగా టీఎస్పీఏ (అప్పా) వరకు వెళ్లారు. నిబంధనల మేరకు ఈ రూట్లో ఒకసారి వెళితే రూ.20, వెళ్లివస్తే రూ.30 చెల్లించాలి. కానీ సదరు వాహనదారుడి ఖాతా నుంచి ఏకంగా రూ.80 కోత పడింది. దీనిపై సంస్థ ప్రతినిధులను నిలదీయగా ‘సారీ’ అంటూ చేతులు దులిపేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం మరో వాహనదారుడు గౌరెల్లి నుంచి ఘట్కేసర్ వరకు వెళ్లాడు. నిబంధనల మేరకు రూ.20 తీసుకున్నారు. కానీ తిరిగి అదేరోజు ఘట్కేసర్ నుంచి గౌరెల్లికి తిరిగి రాగా ఏకంగా రూ.115 వసూలు చేశారు. నిబంధనల మేరకు రిటర్న్ జర్నీకి రూ.10 చార్జీ చెల్లించాలి. ఒకవేళ నిర్ణీత సమయం మించితే వన్‌వే జర్నీ కింద రూ.20 తీసుకోవాలి. సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై టోల్ ట్యాక్స్ దోపిడీ జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా టోల్ చార్జీలను వసూలు చేస్తున్నట్లు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుట్టుగా వాహనదారుల ఖాతాల్లోంచి కొట్టేస్తున్నట్లు నిర్వహణ సంస్థకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గట్టిగా నిలదీసిన వాళ్లకు 25 రోజుల గడువులోపు తిరిగి చెల్లిస్తామంటున్నారు.. కానీ సకాలంలో ఖాతాలో జమ కావడంలేదని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. 158 కి.మీ. ఔటర్ మార్గంలో రోజూ వేలాది మంది వాహనదారులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. అధికంగా వసూలు చేసినట్లు గుర్తించిన వాహనదారులకు మాత్రమే తిరిగి చెల్లిస్తామని చెబుతున్నారు. కానీచాలామంది తమకు తెలియకుండానే మోసపోతున్నారు. హెచ్ఎండీఏ నియంత్రణ ఏమైనట్లు.. జాతీయ రహదారులపై విధించే టోల్ చార్జీల నిబంధనలే హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్‌కు వర్తిస్తాయి. ఔటర్‌పై ప్రస్తుతం 21 ఇంటర్‌ఛేంజ్‌ల నుంచి వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రింగ్‌రోడ్డును ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థకు ప్రభుత్వం టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో 30 ఏళ్ల లీజుకిచి్చంది. ఐఆర్బీ అనుబంధ సంస్థ అయిన ఐఆర్బీ గోల్కొండ సంస్థ టోల్ చార్జీలను వసూలు చేస్తోంది. నిబంధనల మేరకు హెచ్ఎండీఏ అనుమతితోనే టోల్ చార్జీలను పెంచుకొనేందుకు ఐఆర్బీకి అవకాశం ఉన్నా సొంతంగా పెంచేందుకు అవకాశం లేదు. ఐఆర్బీ అడ్డగోలుగా టోల్ వసూలు చేస్తున్నప్పటికీ హెచ్ఎండీఏ చర్యలు తీసుకోకపోవడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచారిస్తాం ఔటర్‌పై అధికంగా టోల్ వసూలు చేయడానికి వీల్లేదు. వాహనదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను విచారిస్తాం. ఎక్కువ డబ్బులు తీసుకున్నట్లు రుజువైతే తిరిగి వాళ్ల ఖాతాల్లో జమ అవుతాయి. – బీఎల్ఎన్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్, హెచ్ఎండీఏ టోల్ దోపిడీ దారుణం టోల్ ట్యాక్స్ దోపిడీ దారుణంగా ఉంది. అవకతవకలను వాహనదారులు గుర్తించినప్పుడు మాత్రమే తిరిగి చెల్లిస్తామని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. కానీ చాలామంది తమకు తెలియకుండానే నష్టపోతున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. – కేతిరెడ్డి కరుణాకర్‌రెడ్డి దేశాయ్, వాహనదారుడు -
కాంగ్రెస్ కూటమి ఒక దోపిడీ ముఠా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ కూటమి ఒక దోపిడీ ముఠా అని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. పార్లమెంటులో ప్రజాసమస్యలు చర్చకు రాకుండా విపక్షా లు వ్యవహరించాయని, మణిపూర్ అంశంపై చర్చలు జరపాలని కాంగ్రెస్ గొడవ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కాంగ్రెస్‌కు తోకపార్టీల్లా వ్యవహరిస్తున్నాయని ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని, ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలు పొందడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ప్రధాని సమాధానం కోసం పట్టుబట్టిన విపక్షాల నేతలు ఆయన మాట్లాడుతుంటే లోక్‌సభ నుంచి ఎందుకు పారిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. యోధుల త్యాగాలను స్మరించేలా విగ్రహాలు ఎంఐఎం పార్టీ ఒత్తిడికి లోబడి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బత్తిని మొగిలయ్య గౌడ్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర మరుగున పడేలా చేశాయని డాక్టర్ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నెహ్రూ, తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబాలవే చరిత్ర అన్నట్లు ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. గురువారం ఢిల్లీలోని కానిస్టిట్యూ షన్ క్లబ్లో బీజేపీ నాయకుడు తూళ్ల వీరేందర్ గౌడ్ నేతృత్వంలో జరిగిన బత్తిని మొగిలయ్యగౌడ్ వర్ధంతి సభలో కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్, ఎంపీ లక్ష్మణ్ పాల్గొని ప్రసంగించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇలాంటి యోధుల విగ్రహాలు పెట్టడమేకాకుండా, వారి త్యాగాలను స్మరిస్తూ కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. రజాకార్ల పోకడలను కళ్లకు కట్టేలా సినిమా తీస్తున్న రజాకర్ సినిమా బృందాన్ని ఎంపీ లక్ష్మణ్ అభినందించారు. -
ధాన్యం నమోదులో దగా!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్ వేసంగిలో 104 బస్తాల ధాన్యం తూకం వేశాడు. మిల్లు వద్ద ట్రక్‌షీట్‌లో 104 బస్తాలుగానే నమోదు చేశారని భావించాడు. కింద 104 మైనస్ 4 అని రాసినట్టుగా గమనించలేదు. తీరా 100 బస్తాలకు మాత్రమే నగదు జమ కావడంతో అవాక్కయ్యాడు. ఇది ఒక్క కరీంనగర్‌లోనే కాదని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో మిల్లర్లు రైతుల కష్టాన్ని యథేచ్ఛగా దోచేశారని తెలుస్తోంది. మొన్నటిదాకా తాలు పేరిట కొనుగోలు కేంద్రాల్లో, నాణ్యత లేదని రైస్‌మిల్లులో క్వింటాలుకు 9 నుంచి 11 కిలోల వరకు కోతపెట్టారు. వీటికి తోడు తాజాగా మరో కొత్త తరహా దోపిడీకి మిల్లర్లు తెరతీసినట్లు.. శ్రీనివాస్ తరహా ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. రూ.వందల కోట్ల విలువైన ధాన్యానికి ఎసరు గతేడాది 50.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. అయితే ఈసారి అకాల వర్షాలు ఇబ్బంది పెట్టినా దిగుబడి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 7,037 కొనుగోలు కేంద్రాల్లో 11,39,597 మంది రైతుల నుంచి ఇప్పటివరకూ 66.49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. ఈ మొత్తం ధాన్యం విలువ రూ.12,011 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఇందులో దాదాపు రూ.1,500 కోట్లు మినహా మొత్తం ధాన్యం డబ్బులు ప్రభుత్వం చెప్పిన విధంగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. వాస్తవానికి ప్రతి క్వింటాలుకు సగటున 10 కిలోల చొప్పున లెక్కలు వేసుకుంటే.. వేలాది క్వింటాళ్ల వరకు ధాన్యం కోతకు గురైంది. సాధారణ తరుగుతోనే రూ.కోట్లు వెనకేసుకున్న మిల్లర్లు ట్రక్ïÙట్ల మాయాజాలం కుంభకోణంతో రూ.వందల కోట్ల విలువైన ధాన్యాన్ని పోగు చేసుకున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. మొత్తం 21 బస్తాలకు కోత..! పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న»ొంకురుకి చెందిన రైతులు 10 మంది స్థానిక పీఏసీఎస్‌లో ధాన్యం అమ్ముకున్నారు. ధాన్యం కాంట వేస్తున్నప్పుడే తరుగు పేరుతో 2 కిలోలు కోత విధించారు. 10 మంది రైతులకు చెందిన 625 బస్తాల ధాన్యం లారీలో లోడ్ చేసి మిల్లుకు తరలించారు. అయితే రైతులకు తెలియకుండానే మిల్లుల్లో సైతం మరోసారి కటింగ్ పెట్టారు. తర్వాత ట్రక్ షీట్ మాయాజాలంతో కేవలం 604 బస్తాలకే లెక్కగట్టారు. ఆ మేరకే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో తమకు ధాన్యం డబ్బులు తక్కువపడ్డాయని రైతులు వాపోతున్నారు. ఎంతలేదన్నా వీరి వద్దనుంచి 9 క్వింటాళ్ల వరకు ధాన్యం దోపిడీకి గురైంది. 11 బస్తాలు కొట్టేశారు వేసంగి ధాన్యాన్ని మహమ్మదాబాద్‌లోని కొను గోలు కేంద్రం ద్వారా విక్రయించాం. నాతో పాటు మరో ఇద్దరు రైతుల బస్తాలు కలిపి మొ త్తం 383 బ్యాగులు తూకం వేశారు. తొలుత కొనుగోలు కేంద్రంలోనే తరుగు పెట్టారు. మళ్లీ మిల్లు వద్దకు వెళ్లాక మొత్తం మీద 372 బస్తాలుగా ట్రక్ïÙటులో నమోదు చేశారు. – ఎండీ ఆలీ, కంచన్‌పల్లి, మహబూబ్‌నగర్ తేమ, తాలు పేరుతో కట్ చేశారు.. యాసంగి సీజన్లో పండించిన ధాన్యాన్ని ఇప్పగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్‌కు తీసుకెళ్లా. కాంటా పూర్తయిన తర్వాత, 439 బస్తాలు ఉన్నట్లు లెక్కవేసి రైస్ మిల్లుకు పంపించారు. ధాన్యం బస్తాలు మిల్లుకు వెళ్లిన తర్వాత తేమ, తాలు పేరిట కొన్ని బస్తాలు కట్ చేశారు. మొత్తం మీద 428 బస్తాలనే బిల్లులో చూపించారు. –జి.వెంకటయ్య, ఇప్పగూడెం, స్టేషన్‌ఘన్‌పూర్ రైతుల ఇష్టం మేరకే తరుగు ఎడతెరిపిలేని వర్షాల వల్ల ధాన్యం డామేజ్ వచి్చంది. దానివల్ల రైతుల ఇష్టం మేరకే మిల్లర్లు తరుగు తీశారు. ధాన్యం ఆరబెట్టడం, మళ్ళీ వర్షం పడటం పక్షం రోజులు అదే పరిస్థితి. కానీ ఒకసారి తరుగు తీశాక మళ్ళీ తీయడం ఉండదు. – అన్నమనేని సుధాకర్‌రావు, రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి మొత్తం డబ్బులు పడలేదు మా ఊరిలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మిన. అప్పుడు తరుగుతో 142 బస్తాలు లెక్క గట్టారు. తీరా ఇప్పుడు 138 బస్తాలకే డబ్బులు పడ్డాయి. సెంటర్ వాళ్ళను అడిగితే.. మాకేమీ తెలియదు మిల్లు వాళ్ళను అడగమంటున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. –ప్రశాంత్, కౌలు రైతు, చిన్న బొంకూర్, సుల్తానాబాద్ 4.4 క్వింటాళ్ల కోత.. రూ.9,800 నష్టం కొనుగోలు కేంద్రం నుంచి మొత్తం 303 బస్తాలు తూకం వేశారు. ఒకలారీలో 199 బస్తాలు పోగా.. ఆరు బ్యాగులు కట్ చేశారు. మరో దాంట్లో 104 బ్యాగులు పోయినయి.. ఐదు బ్యాగులు కట్ చేశారు. మొత్తంగా 4.4 క్వింటాళ్లు కోతతో మొత్తం రూ.9,800 నష్టం జరిగింది. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. – విష్ణువర్ధన్, కరీంనగర్ -
కేడీసీసీ బ్యాంక్‌లో దోపిడీకి యత్నం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంక్‌లో ఆదివారం రాత్రి దొంగలు దోపిడీకి విఫలయత్నం చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న బ్యాంక్‌లోకి దొంగలు ప్రవేశించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జరిగిన సంఘటనపై ఎస్పీ అఖిల్‌మహాజన్ ఆరా తీశారు. బ్యాంక్ అధికారులు, సీఐ మొగిలి తెలిపిన వివరాలు. మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంక్ వద్ద భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పనులు చేసేందుకు భవనానికి తూర్పు వైపున పలంచ కొట్టారు. దాని ద్వారా మొదటి అంతస్తుపైకి ఎక్కి.. అల్యూమినియం స్లైడింగ్ కిటికి నుంచి బ్యాంక్లోనికి ఇద్దరు దొంగలు ప్రవేశించారు. మొదట సీసీ కెమెరాలకు సంబంధించిన వైర్లను కట్ చేశారు. అనంతరం బ్యాంక్‌లో ఉన్న రెండు షెట్టర్లను ఇనుపరాడుతో పైకెత్తి స్ట్రాంగ్‌రూం లాకర్‌ను కట్టర్‌తో తెరిచేందుకు ప్రయత్నించారు. తెరుచుకోకపోవడంతో అక్కడే ఉన్న ఫైళ్లను చిందరవందరగా పడేసి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం బ్యాంక్‌ను తెరిచేందుకు వాచ్మెన్ అనిల్ వచ్చి పరిస్థితిని మేనేజర్ సంపూర్ణకు వివరించాడు. మేనేజర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ మొగిలి, ఎస్సై ప్రేమ్‌దీప్, క్లూస్‌టీం సభ్యులు, సీసీఎస్ ఎస్సై మారుతి ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. దొంగల వేలిముద్రలు సేకరించి, డాగ్స్క్వాడ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ పుటేజీల ఆధారంగా బ్యాంక్‌లోకి ఇద్దరూ దొంగలు ప్రవేశించినట్లు సీఐ తెలిపారు. గుర్తుపట్టకుండా ఉండేందుకు తలకు హెల్మెట్, చేతులకు గ్లౌస్లు ధరించారన్నారు. సీసీ పుటేజీల ఆధారంగా దొంగలను త్వరలోనే పట్టుకుంటామని వివరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. బ్యాంక్‌లో భద్రత చర్యలు బ్యాంక్‌లో దొంగతనం జరిగినట్లు తెలుసుకున్న రవీందర్రావు హుటాహుటిన ఎల్లారెడ్డిపేటకు వచ్చారు. దొంగతనంపై మేనేజర్ సంపూర్ణ, సింగిల్‌విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం కృష్ణారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. బ్యాంక్‌లో కట్టుదిట్టమైన భద్రత ఉందని వినియోగదారులు, రైతులు ఆందోళనకు గురికావద్దని కోరారు. పూర్తి భద్రత వలయంలో బ్యాంక్‌ను నడిపిస్తున్నామని చెప్పారు. నూతన భవనం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మధ్యాహ్నం నుంచి బ్యాంక్ లావాదేవీలు కొనసాగించారు. మేనేజర్ సంపూర్ణ, సిబ్బంది ఉన్నారు. – రవీందర్రావు, టెస్కాబ్ చైర్మన్ -
ముగ్గురు లేడీ కిలాడీలు.. అమాయక యువకులను సైగలతో ఆకర్షించి
సాక్షి, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వ్యభిచారం ముసుగులో దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను మామునూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్‌జోన్ డీసీపీ వెంకటలక్ష్మీ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు కొత్తూరు గ్రామానికి చెందిన విజయ్‌కుమార్, పర్వతగిరికి చెందిన రాయపురం సరిత, కేసముద్రంకు చెందిన కోడం స్వరూప, నూనె స్వప్నలు కలిసి ఒక ముఠాగా ఏర్పడి సులభంగా డబ్బు సంపాదించాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇందులో ముగ్గురు లేడీ కిలాడీలు ముఠాగా ఏర్పడి బస్స్టేషన్లలో అమాయకులైన యువకులను తమ సైగలతో ఆకర్షించి వారిని ప్రలోభ పెట్టి ఓ వాహనంలో ఎక్కించుకుని నిర్మాణుష్య ప్రదేశాలకు తీసుకెళ్లే వారు. ఈ క్రమంలో విజయ్‌కుమార్ సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకుని యువకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికీ మామునూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు కేసుల్లో రూ.20వేలు, సెల్‌ఫోన్, గీసుకొండ పీఎస్ పరిధిలో రూ.3వేలు, సెల్ఫోన్లను బలవంతంగా దోచుకున్నారు. ఈ ముఠాపై ప్రత్యేక నిఘా ఉంచి మామునూరు ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ తన సిబ్బందితో సోమవారం రాంగోపాల్‌పురం వద్ద నిందితురాళ్లను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏసీపీ నరేష్కుమార్, ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, ఎస్సై రాజిరెడ్డి, కానిస్టేబుళ్లు సర్థార్‌పాషా, రోజాలను ఈస్ట్‌జోన్ డీసీపీ అభినందించారు. -
చెప్పేది నాటువైద్యం, చేసేది దోపిడీలు
సాక్షి, బనశంకరి: ఆయుర్వేద మూలికలతో చికిత్స చేస్తామని చెప్పుకుంటూ ప్రజలవద్ద నుంచి డబ్బు దండుకుని వంచనకు పాల్పడుతున్న రాజస్థాన్ కు చెందిన ముగ్గురు వ్యక్తులను మంగళవారం బెంగళూరు విల్సన్ గార్డెన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మహమ్మద్ సమీన్ అలియాస్ డాక్టర్ మల్లిక్, సైఫ్ అలీ, మహ్మద్ రహీస్. ఇంటికెళ్లి రూ.8.8 లక్షలతో పరారు వివరాలు... నెలమంగల వద్ద టెంట్లు వేసుకుని నాటు మూలికలు ప్రదర్శిస్తూ మొండి రోగాలను నయం చేస్తామని ప్రజలను నమ్మించేవారు. శాంతినగర బసప్పరోడ్డు నివాసి పంకజ్‌ఠాకూర్ తన తల్లికి కాలి నొప్పికి చికిత్స చేయాలని వీరిని గత నెల 16 తేదీన ఇంటికి తీసుకెళ్లాడు. చికిత్స చేయడానికి ఖర్చవుతుందని వారిని మాటల్లో పెట్టి రూ.8.8 లక్షలు తీసుకుని ఉడాయించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో డీసీపీ శ్రీనివాసగౌడ, ఏసీపీ నారాయణస్వామి ఆధ్వర్యంలో ముఠాను గాలించి పట్టుకున్నారు. వారి నుంచి నాలుగుకార్లు, మూడు ద్విచక్రవాహనాలు రూ.3.50 లక్షలు నగదు, నాటు మూలికలను స్వాధీనం చేసుకున్నారు. ఇలా వైద్యం పేరుతో ఎంతోమందిని మోసగించినట్లు అనుమానాలున్నాయి. (చదవండి: స్నేహితురాలి ఇంటికే కన్నం..మహిళకు ఆరేళ్లు జైలు శిక్ష) -
పెళ్లి రద్దు.. రూ.50 లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసిన అమ్మాయి..
ముంబై: అతనో ఐటీ ఇంజినీర్. వయసు 28 ఏళ్లు. తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు అమ్మాయి కోసం వెతుకుతున్నారు. ఇంతలో ఓ మేట్రీమోని ద్వారా అమ్మాయి దొరికింది. ఇద్దరి జాతకాలు కూడా బాగా కలిశాయి. దీంతో ఇరుకుటుంబాలు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాయి. జులైలో అమ్మాయి పుట్టినరోజున ఇంటికి వెళ్లి సెలబ్రేట్ చేశారు అబ్బాయి కుటుంబసభ్యులు. ఎంగేజ్మెంట్ కోసం అబ్బాయి ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేశాడు. పెళ్లి కోసం సూరత్ వెళ్లి నగలు కొనుగోలు చేశారు. అక్టోబర్‌లో వివాహం చేసుకోవాలనుకున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో అమ్మాయి తరచూ ఫోన్లో మాట్లాడటం గమనించాడు అబ్బాయి. ఎవరు అని అడిగితే.. తన మాజీ బాయ్ ఫ్రెండ్ అని ఆమె బదులిచ్చింది. క్యాజువల్‌గా మాట్లాడుతుందేమో అనుకుని పట్టించుకోలేదు. అయితే అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌ను బయట కలవడం చూశాడు అబ్బాయి. అతను ఇచ్చే గిఫ్ట్‌లు కూడా ఆమె తీసుకోవడం గమనించాడు. ఓ రోజు ఇద్దరూ రోడ్డుపై హగ్ చేసుకోవడం చూసి షాక్ అయ్యాడు. ఇక లాభం లేదని తెలిసి పెళ్లి రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తనకు ఈ పెళ్లి వద్దని ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పాడు. అబ్బాయి పెళ్లి వద్దన్నాడని తెలిసి అమ్మాయి అతడ్ని ఒప్పించేందుకు ప్రత్నించింది. కానీ అతను మాత్రం ససేమిరా అన్నాడు. దీంతో పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని అమ్మాయి బెదిరించింది. విషం తీసుకుంటానని చెప్పి వీడియో కాల్లో ఓ పౌడర్‌ను కూడా చూపించింది. కానీ అబ్బాయి మాత్రం పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. దీంతో తల్లిదండ్రులతో కలిసి అమ్మాయి అతడ్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. పెళ్లి రద్దు చేసుకున్నందుకు రూ.50లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే తప్పుడు కేసులు పెడతానని బెదిరించింది. ఏం చేయాలో తెలియక అబ్బాయి పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయం వాళ్లకు వివరించాడు. దీంతో వారు అమ్మాయి, ఆమె తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర ముంబైలోని చార్కోప్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. చదవండి: భర్తకు తెలియకుండా అబార్షన్ మాత్ర తీసుకున్న మహిళ.. చివరకు.. -
రాజవంశానికి చెందిన వాడినంటూ మహిళలకు వల...చివరికీ..
రాజకుటుంబానికి చెందిన వాడినంటూ ఒక వ్యక్తి సోషల్ మీడియాలో మహిళలను ట్రాప్ చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. చివరికి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ముంబైకి చెందిన రాజ్వీర్ సింగ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో తనను తాను రాజస్తాన్‌లోని రాజకుటుంబానికి చెందిన వాడిగా పరిచయం చేసుకుంటూ పలువురు మహిళల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. దీంతో అతని వేధింపులు తాళలేక ఒక మహిళా అతడిపై ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన గోరెగావ్ పోలీసులు అతన్ని ఒక ప్రైవేట్ హోటల్లో పట్టుకుని అరెస్టు చేశారు. అతను రాజస్తాన్‌లోని రాజకుటుంబానికి చెందినవాడిగా నటించి అమ్మాయిల నుంచి డబ్బులు ఎలా వసూలు చేసేవాడో వివరించారు. ఇప్పటి వరకు అతడు బాధిత మహిళ నుంచి సుమారు రూ. 13 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. నిందితుడు రాజ్వీర్ సింగ్‌పై ఇప్పటికే జుహు పోలీస్టేషన్లో కేసు నమోదైందని, అతను ఒక ఏడాదిపాటు జైల్లో ఉండి వచ్చాడని చెప్పారు. ఐతే ఆ తర్వాత కూడా తన తీరు మార్చుకోకుండా మరో మహిళను వేదించడమే కాకుండా ఆమె ఎనిమిదేళ్ల కుమార్తెను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు. (చదవండి: అమానుష ఘటన: విద్యార్థికి డ్రిల్లింగ్ మిషన్‌తో పనిష్మెంట్ ఇచ్చిన టీచర్) -
వలపు వల విసిరి బ్లాక్మెయిల్.. రూ.80 లక్షలు వసూలు చేసిన జంట
న్యూఢిల్లీ: వ్యాపారవేత్తకు వలపు విసిరి బ్లాక్మెయిల్ చేసింది ఓ జంట. ప్రైవేటు ఫొటోలు, వీడియోలు లీక్ చేస్తామని బెదిరించి రూ.80లక్షలు వసూలు చేసింది. ఇంకా డబ్బు కావాలని డిమాండ్ చేస్తుండటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అధికారులు ఆ జంటపై కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. వివారాల్లోకి వెలితే.. గురుగ్రాం బాద్‌షాపుర్‌కు చెందిన వ్యాపారవేత్త ఓ అడ్వర్టైస్మెంట్ ఏజెన్సీని నడుపుతున్నాడు. ఢిల్లీ షాలిమర్ బాగ్‌కు చెందిన నామ్రా ఖాదిర్ అనే మహిళను బిజినెస్ విషయాలు మాట్లాడేందుకు కొద్ది నెలల క్రితం ఓ హోటల్లో కలిశాడు. ఆమెతో పాటు విరాట్ అలియాస్ మనీశ్ బనీవాల్ కూడా ఉన్నాడు. పెళ్లి చేసుకుంటానని.. తన వ్యాపార పనుల కోసం నామ్రా ఖాదిర్‌కు రూ.2.50లక్షలు ఇచ్చాడు బాధితుడు. అయితే డబ్బు తీసుకున్నప్పటికీ ఆమె దానికి తగినట్లు పనిచేయలేదు. దీంతో ఆమెను అతడు ప్రశ్నించాడు. ఆ సమయంలోనే ఆమె అతడ్ని ఇష్టపడ్డానని, పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆ తర్వాత ఇద్దరూ క్లోజ్ అయ్యారు. పెళ్లి ప్రపోజల్ తర్వాత నమ్రా ఖాదిర్‌తో వ్యాపారవేత్త చాలా రోజలు కలిసితిరిగాడు. ఇద్దరూ పలుమార్లు హోటల్లో గడిపారు. ఈ క్రమంలోనే వీరిద్దరు సన్నిహితంగా ఉన్నప్పుడు విరాట్ ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ తర్వాత వాటిని లీక్ చేస్తామని, రేప్ కేసు పెడతామని బెదిరించి వ్యాపారవేత్త నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఇలా మొత్తం రూ.80లక్షలు కాజేశారు. అయినా ఇంకా బ్లాక్మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇక చివరకు పోలీస్ స్టేషన్ వెళ్లాడు ఆ బిజినెస్‌మేన్. ఖాదిర్, విరాట్‌పై ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్టోబర్ 10న ఈ జంటకు నోటీసులు పంపారు. అయితే వాళ్లు బెయిల్ కోసం గురుగ్రామ్ కోర్టును ఆశ్రయించారు. కానీ న్యాయస్థానం నవంబర్ 18న వారి పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో వాళ్లిద్దరిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ జంటను అదుపులోకి తీసుకుంటామన్నారు. చదవండి: ప్రియుడు మాట్లాడలేదని విషం తాగుతూ వీడియో తీసి.. -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కలుసుకుందామని చెప్పడంతో
సాక్షి, హైదరాబాద్: డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తిని కత్తితో బెదిరించి నగదు లాక్కున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... బీహెచ్ఈఎల్లో పనిచేస్తున్న యువకుడు(25) ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. అతడికి బ్లూడ్ అనే స్వలింగ సంపర్కుల యాప్‌లో అమీర్ అలియాస్ వంశీనాయుడు అనే పేరుతో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడి ప్రొఫైల్ పిక్చర్ చూసిన బాధిత యువకుడు కలుసుకుందామని చెప్పడంతో ఈ నెల 21న రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెం 12కు వచ్చాడు. అయితే ప్రొఫైల్‌లో పెట్టిన ఫొటోకు.. తనను కలిసేందుకు వచ్చిన వ్యక్తికి పోలికలు లేకపోవడంతో పాటు వచ్చిన వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌గా గుర్తించిన బాధితుడు తనకు నచ్చలేదని చెప్పి వెనక్కి వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డాడు. దీంతో ఆగ్రహానికి గురైన అమీర్ అలియాస్ వంశీకృష్ణ కత్తి బయటికి తీసి డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. తనవద్ద డబ్బు లేదని చెప్పినా వినిపించుకోకుండా ఫోన్ లాక్కుని గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా రూ. 31 వేలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. బాధితుడు శనివారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: Hyderabad: భర్తతో సినిమాకు వెళ్లి.. కనిపించకుండా పోయిన భార్య -
దోపిడి చేసేందుకు వచ్చి కాల్పుల వీరంగం
న్యూఢిల్లీ: ఒక దుండగుడు దుకాణం వద్దకు వచ్చి కాల్పుల కలకలం సృష్టించాడు. ఈ ఘటన ఢిల్లీలోని దరీపూర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఢిల్లీలోని ఒక గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటార్ బైక్ పై దుకాణం వద్దకు వచ్చి గాల్లో కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆ ఇద్దరు దుండగులు షాపులోకి వెళ్లి యజమానిని భయబ్రాంతులకు గురిచేసి దాదాపు రూ. 50 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్ల తెలిపారు. షాపు యజమానిని భయపట్టేందుకు ఆ దుండగులు ఇలా గాల్లో కాల్పులు జరిపి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఐతే ఈ ఘటన మొత్తం దుకాణం వద్ద ఉన్న సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: నకిలీ వెబ్సైట్లతో చీటింగ్... 12 మంది అరెస్టు) -
కన్నుపడితే లూటీ ! 40 ఏళ్లుగా దొంగతనాలే వృత్తి
బనశంకరి: 40 ఏళ్లకు పైబడి దొంగతనాలకు దోపిడీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను శనివారం రాజాజీనగర పోలీసులు అరెస్ట్‌చేశారు. దొంగ ప్రకాష్ (54), కోలారు, శివమొగ్గ బళ్లారిలో మొత్తం మూడు వివాహాలు చేసుకోగా ఇతడికి 7 మంది సంతానం. ఇప్పటి వరకు ఇతనిపై 160 కి పైగా దొంగతనం కేసులు నమోదయ్యాయి. బెంగళూరు, కోలారు, బళ్లారి, శివమొగ్గ, చిత్రదుర్గ, గుల్బర్గా తో పాటు గోవా, కేరళలో చోరీలకు తెగబడ్డాడు. 20 సార్లకు పైగా జైలుకెళ్లి వచ్చాడు. 10 ఏళ్ల వయసులో తొలిసారి 1978లో ప్రకాష్ 10 ఏళ్ల బాల్యంలోనే తొలి చోరీ చేశాడు. తరువాత సహోదరుడు వరదరాజ్, పిల్లలు బాలరాజ్, మిథున్, అల్లుడు జాన్ కలిశారు. ఈ నెల 22 తేదీన రాజాజీనగరలో ప్రకాష్ చోరీకి పాల్పడి పోలీసులకు పట్టుబడ్డాడు. కేజీల కొద్దీ పసిడి దోపిడీ 1978–1986 వరకు 100 ఇళ్లలో చోరీలు చేశాడు. అప్పట్లో ప్రకాష్ కేరళ కొట్టాయంలో 2.5 కిలోల బంగారం చోరీ, శేషాద్రిపురంలో బంగారు దుకాణం గోడ కు కన్నం వేసి రెండున్నర కిలోల బంగారు నగల ఆభరణాలు దోపిడీ, మరో బంగారు షాపునకు కన్నం వేసి 4 కిలోల పసిడి నగలు లూటీ, 20 కిలోల వెండి చోరీకి పాల్పడ్డాడు. అనుచరులైన జోసెఫ్, ఆనందన్, బాషా సహకరించారు. దోచుకున్న నగదును పంచుకుని జల్సాలు చేసేవారు. వైరముడి, నాగేశ్ అనే అనుచరులతో కలిసి ప్రకాష్ 1989లో మైసూరులో 20 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. 1992 లో నాగేశ్ తో కలిసి మహారాష్ట్ర కొల్హాపురలో రెండు బంగారు దుకాణాలకు కన్నంవేసి 17 కిలోల బంగారు ఆభరణాలు దోపిడీచేశారు. 1992లో శివమొగ్గ ఫైనాన్స్ కార్యాలయం నుంచి రూ.3 కోట్లు నగదు దోపిడీకి పాల్పడ్డాడు. 1997లో గోవాలో 7 కిలోల స్వర్ణాభరణాలను ఎత్తుకెళ్లాడు. 2006 నుంచి ప్రకాష్ తన పిల్లలైన మిథున్, బాలరాజ్ తో పాటు అల్లుడు, అతని పిల్లలతో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. విలాసవంతమైన ఇళ్లు, జ్యువెలరీ దుకాణాలు, ఫైనాన్స్ కార్యాలయాలను ఎంచుకుని కొల్లగొడతాడు. ప్రతిసారి పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లినప్పటికీ బయటికి వచ్చి కొత్త ముఠాను ఏర్పాటు చేసుకునేవాడు. (చదవండి: మహిళలను వేధించే పోకిరీలకు జైలు శిక్ష!) -
ఆబ్కారీకి నకిలీ మకిలి! కోట్లలో అక్రమార్జన
సాక్షి హైదరాబాద్: ఆబ్కారీశాఖలో నకిలీ ఈవెంట్ పర్మిట్ల దందా చర్చనీయాంశంగా మారింది. వేడుకల సందర్భంగా మద్యం వినియోగానికి నకిలీ అనుమతులు ఇచ్చిన ఉదంతంలో శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. నగర శివార్లలోని ఫంక్షన్ హాళ్లు, స్టార్ హోటళ్లు, బాంక్విట్ హాళ్లు వంటి చోట్ల నిర్వహించే వేడుకల సందర్భంగా మద్యం వినియోగం కోసం పెద్ద సంఖ్యలో నకిలీ అనుమతులను ఇచ్చినట్లు వెల్లడి కావడంతో ఎక్సైజ్ శాఖ సదరు ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఈ ఉదంతం వెనుక పైఅధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇద్దరు సీఐలతో పాటు మరో సూపరింటెండెంట్ స్థాయి అధికారి అనుమతితోనే నకిలీ దందా కొనసాగినట్లు ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఖాతాలో చేరాల్సిన సొమ్మును స్వాహా చేయడాన్ని తీవ్రంగా పరిగణించి క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉండగా కేవలం సస్పెన్షన్‌కే పరిమితం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌తో పాటు నగర శివార్లలోని మరికొన్ని స్టేషన్ల పరిధిలోనూ ఇలాంటి నకిలీ పర్మిట్లు వందల సంఖ్యలో వెలువడ్డాయని, ఉన్నతస్థాయిలో విచారణ జరిపితే అనేక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కొందరు అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎక్సైజ్ శాఖలో ఏళ్లుగా.. మరోవైపు తాజాగా నకిలీ అనుమతుల ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటికీ 2016 అక్టోబర్ నుంచి ఇలాంటి అనుమతుల దందా కొనసాగుతున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు తదితర ప్రాంతాల్లో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో వేడుకలు జరుగుతాయి. అంతర్జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహిస్తా రు. ఇలాంటి కార్యక్రమాలకు ఒకరోజు అనుమతికి రూ.8000 నుంచి రూ.9000 వరకు మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు రూ.30 వేలకుపైగా ఎక్సైజ్‌శాఖకు చలానాల రూపంలో చెల్లించి ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. పైఅధికారుల అండతోనే కిందిస్థాయి సిబ్బంది అనుమతుల సమూనాపత్రాల్లో తేదీలు, వేడుక స్థలాలను మార్పు చేసి ఇస్తున్నారు. ఇలా ఏటా వందల సంఖ్యలో నకిలీ అనుమతులు వెలువడుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన ఆదాయం కొందరు అధికారులు, సిబ్బంది జేబుల్లోకొ వెళ్తోంది. మరోవైపు ఈ తరహా అక్రమాలకు పాల్పడే సిబ్బంది ఎలాంటి బదిలీలు లేకుండా ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయి పని చేయడం గమనార్హం. ఏసీబీతో విచారణ జరిపించాలి.. ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడిన నేపథ్యంలో నకిలీ అనుమతులపై ఉద్యోగుల సస్పెన్షన్, శాఖాపరమైన విచారణకు పరిమితం కాకుండా ఏసీబీ విచారణ జరిపించాలని, ఏ స్థాయి అధికారులైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ వర్గాలు కోరుతున్నాయి. (చదవండి: పడవతో గస్తీ.. లేక్ పోలీసింగ్ వ్యవస్థ) -
మనీలాండరింగ్ కేసు: జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు స్వల్ప ఊరట
ముంబై: మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు స్వల్ప ఊరట లభించింది. ఆమె దేశంవిడిచి వెళ్ళేందుకు ఈడీ అనుమతిచ్చింది. 200కోట్లకు సంబంధించిన ఓ మనీ లాండరింగ్ కేసును విచారిస్తోన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ప్రధాన నిందితుడిగా సుకేశ్ చంద్రశేఖర్ అనే వ్యక్తి పేరును ఛార్జిషీటులో పేర్కొంది. అందులో బాలీవుడ్ నటి, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తోపాటు నోరా ఫతే పేర్లను కూడా చేర్చింది. చదవండి: బాలీవుడ్ భామకి గిఫ్ట్‌గా రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పిల్లి ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఇప్పటికే ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. అయితే, రూ.10కోట్ల విలువైన బహుమతులు తీసుకున్న ఆరోపణలపై జాక్వెలిన్‌కు ఈమధ్యే మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై ఆమె నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈడీ అధికారులు ఆమెపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇదే సయమంలో ఆమె దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ముంబయి విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. -
ఢిల్లీ జైలులో రూ. 200 కోట్ల బెదిరింపు..హైదరాబాద్‌కు లింకులు!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలోని రోహిణి జైల్ కేంద్రంగా చోటు చేసుకున్న రూ.200 కోట్ల బెదిరింపు వసూళ్ల కేసు లింకులు సిటీలో బయటపడ్డాయి. ఆ మొత్తం నుంచి కొంత హైదరాబాద్‌లోని ఓ షెల్ కంపెనీకి బదిలీ అయినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ ఎకనమికల్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) అధికారులతో కూడిన ప్రత్యేక బృందం ఆదివారం నగరానికి చేరుకుంది. దర్యాప్తులో భాగంగా ఆ కంపెనీ వ్యవహారాలను సేకరించడంతో పాటు నిర్వాహకులను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ►ఢిల్లీకి చెందిన ఘరానా మోసగాడు, గ్యాంగ్‌స్టర్ సుఖేష్ చంద్రశేఖర్ కొన్నాళ్లుగా అక్కడి రోహిణి జైల్లో ఖైదీగా ఉన్నాడు. ఇతడి అనుచరులు అవినాష్ కుమార్, జితేందర్ నారూలా కూడా ఇతడితో పాటే అరెస్టు కావడంతో అదే జైల్లో ఉంచారు. ►ఢిల్లీలోని రెలేగీ ఫైనాన్స్ సంస్థలో భాగస్వామి అయిన సుఖ్‌వీర్‌ను మోసం చేయడంతో పాటు ఆయన భార్య ఆదితిని బెదిరించిన ఆరోపణలపై వీళ్లు అరెస్టు అయ్యారు. సుదీర్ఘ కాలం జైల్లోనే ఉండటంతో అక్కడి అధికారులతోనూ సుఖేష్‌కు పరిచయాలు ఏర్పడ్డాయి. కొందరు సన్నిహితంగానూ మారారు. ►తన అనుచరులు ఇద్దరితో కలిసి సుఖేష్ జైలు నుంచే దందా చేయడానికి పథకం వేశాడు. ఢిల్లీకి చెందిన వ్యాపారులను బెదిరించడం ద్వారా వసూళ్లకు పాల్పడాలని నిర్ణయించుకున్న ఈ త్రయం రంగంలోకి దిగింది. దీనికోసం సుఖేష్ తన ప్రియురాలు లీనా మారియా పౌల్ సహాయం తీసుకున్నాడు. ►ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారుల వివరాలు సేకరించిన లీనా వాటిని ఎప్పటికప్పుడు సుఖేష్‌కు అందిస్తూ వచ్చింది. ములాఖత్‌లో కలిసిన ప్రతి సందర్భంలోనూ వీళ్లు ఇదే విషయాలు చర్చించారు. ఎట్టకేలకు కరోల్‌బాగ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకున్నారు. ►ఆయనతో పాటు కుటుంబీకులు సైతం వ్యాపారులే కావడంతో సుఖేష్ భారీ మొత్తం వసూలు చేయాలని పథకం వేశాడు. వారిపై రెక్కీ నిర్వహించాల్సిన బాధ్యతలను బయట ఉన్న తన అనుచరులకు అప్పగించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏడుగురు ఆ పని పూర్తి చేసి ములాఖత్‌లో వివరాలు అందించారు. ►డిప్యూటీ, అసిస్టెంట్ సూపరింటెండెంట్ హోదాల్లో ఉన్న ఐదుగురు అధికారులూ సుఖేష్‌తో జట్టు కట్టారు. నైతిక మద్దతు ఇవ్వడం ద్వారా పరోక్షంగా, సెల్ఫోన్లు అందించడం ద్వారా ప్రత్యక్షంగా రోహిణి జైల్‌కు చెందిన ఐదుగురు సుఖేష్‌కు సహకరించారు. ►బయట ఉన్న అనుచరుల ద్వారా టార్గెట్ చేసిన ఢిల్లీ వ్యాపారితో పాటు అతడి కుటుంబీకుల కదలికలు తెలుసుకుంటున్న సుఖేష్ వారికి ఫోన్లు చేయడం ద్వారా బెదిరింపులకు దిగాడు. ఈ ఏడాది ఆగస్టు వరకు మొత్తం రెండు నెలల పాటు వారి నుంచి రూ.200 కోట్లు వసూలు చేశాడు. ►ఆ మొత్తాన్ని నేరుగా నగదు రూపంలో తీసుకోకుండా అనేక షెల్ కంపెనీల్లోకి మళ్లించేలా చేశాడు. ఇందులో రూ.20 కోట్లను సుఖేష్ రోహిణి జైలు అధికారులకు పంచాడు. మిగిలింది షెల్ కంపెనీల ద్వారా తన అనుచరులకు చేరేలా చేశాడు. ►ఆగస్టు నెలాఖరులో ఈ విషయం వెలుగులోకి రావడంతో ఢిల్లీ ఈఓడబ్ల్యూ అధికారులు కేసు నమోదు చేశారు. సుఖేష్, లీనా సహా మొత్తం 11 మందిని అరెస్టు చేసి వారిపై చార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారు. సోమవారం రోహిణి జైల్ అధికారులను అరెస్టు చేశారు. వీరిపై ఐపీసీతో పాటు ఎంకోకా చట్ట ప్రకారం అభియోగాలు మోపారు. ►ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈఓడబ్ల్యూ అధికారులకు సుఖేష్ వసూలు చేసిన మొత్తం హాంగ్‌కాంగ్‌తో పాటు ముంబై, చెన్నై, హైదరాబాద్‌ల్లో ఉన్న షెల్ కంపెనీలకు బదిలీ అయినట్లు గుర్తించారు. ఆ మొత్తంలో 7 శాతం కమీషన్‌గా తీసుకున్నవాటి నిర్వాహకులు హవాలా రూపంలో డబ్బు సుఖేష్ చెప్పిన వారికి అందించినట్లు తేల్చారు. ►దీంతో ఆయా షెల్ కంపెనీల నిర్వాహకులు, హవాలా ఏజెంట్లను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. హైదరాబాద్‌కు చెందిన కంపెనీ సనత్‌నగర్ చిరునామాతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు నిర్వాహకుల వివరాలు ఆరా తీసి..పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందం ఆదివారం సిటీకి వచ్చింది. ►ఈఓడబ్ల్యూ అధికారులు రిజ్రిస్టార్ ఆఫ్ కంపెనీస్ నుంచీ ఈ కంపెనీ వివరాలు సేకరించాలని నిర్ణయించారు. ఢిల్లీ పోలీసుల రాక, వారి కదలికలపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఇక్కడి పోలీసులు చెప్తున్నారు. వీలున్నంత వరకు వాళ్లు నేరుగానే పని చేసుకుంటారని, అవసరమైన పక్షంలో తమ సహాయం కోరతారని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
రూ. 200 కోట్లకు టోకరా : బాలీవుడ్ హీరోయిన్, భర్త అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: రూ. 200కోట్ల మేర మోసం కేసులో బాలీవుడ్ హీరోయిన్ లీనా మరియా పాల్, ఆమె భర్త సుకేశ్ చంద్రశేఖర్‌కు ఈడీ షాక్ ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ జంటను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్ట్ చేసింది. అనంతరం వారి ఢిల్లీ కోర్టుముందు హాజరుపర్చింది. వీరికి 14 రోజుల రిమాండ్ విధించాలని కోరింది. గతంలో ఈ దంపతులను ఈడీ అనేక సందర్బాల్లో విచారించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మూవీ ‘మద్రాస్ కేఫ్’లో నటించిన లీనా, తన భర్త సుకేశ్ చంద్రశేఖర్ జైల్లో ఉండగా స్పూఫ్ ఫోన్ కాల్ ద్వారా ఒక కేంద్ర ప్రభుత్వ అధికారిలా నటిస్తూ ఒక వ్యాపారవేత్త భార్య నుండి 200 కోట్ల రూపాయలు దోచుకున్నట్టు ఆరోపణలు నమోదైనాయి. ఈ వ్యవహారంలో ఆమెతో కుమ్మక్కయ్యారంటూ అనేక మంది జైలు, బ్యాంకు అధికారులు కూడా అడ్డంగా బుక్కయ్యారు. ఈ కేసు దర్యాప్తులో ఈడీకి గట్టి ఆధారాలు లభించడంతో చంద్రశేఖర్ భార్య లీనాను ఢిల్లీ పోలీసులు కూడా అరెస్టు చేశారు ఇటీవల చెన్నైలోని వీరి బంగ్లాపై నిర్వహించిన దాడుల్లో కోట్ల రూపాయల విలువైన వస్తువులను, అంతర్జాతీయ బ్రాండ్ల ఖరీదైన దుస్తులు, 16 వాహనాలను స్వాధీనం ఈడీ చేసుకుంది. సుకేశ్అక్రమంగా సంపాదించిన డబ్బులతో లీనా లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నట్టు ఈడీ భావించింది. అలాగే ఈ రాకెట్లో ప్రధాన నిందితుడు సుకేశ్‌కు సహకరించిన దీపక్ రామ్‌దానీ, ప్రదీప్ రమణిలను ఈడీ అరెస్టుచేసింది. సుకేష్ సూచనల మేరకు వ్యాపారవేత్త భార్య నుండి అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ అధికారులు వెల్లడించారు. జూన్ 2020 నుండి మే 2021 మధ్య, ఈ జంట దాదాపు 40 సార్లు మోసానికి పాల్పడినట్టు ఈడీ గతంలొ పేర్కొంది. Enforcement Directorate arrests Sukesh Chandrasekhar & his partner actress Leena Maria Paul in connection with a Rs 200 crore extortion case, produces them before a court in Delhi, seeking 14 days remand — ANI (@ANI) October 9, 2021 -
తీన్మార్ మల్లన్నకు 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్: క్యూ నూస్ చానెల్ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్నకు సికింద్రాబాద్ కోర్టు శనివారం 14 రోజుల రిమాండ్ విధించింది. సికింద్రాబాద్ మధురానగర్ కాలనీలోని మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ.. తీన్మార్ మల్లన్న తనపై బెదిరింపులకు పాల్పడడ్డాడంటూ ఫిర్యాదు చేయడంతో శుక్రవారం రాత్రి( ఆగస్టు 27న) మల్లన్నను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా శనివారం మల్లన్నను సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు విచారణలో భాగంగా తీన్మార్ మల్లన్నపై ఐపీసీ సెక్షన్ 306,సెక్షన్ 511 కింద కేసులు పెట్టడంపై అతని తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫిర్యాదిదారుడు ఎలాంటి సూసైడ్ అటెంప్ట్ చేయలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా ఏడు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని చిలకలగూడ పోలీసులు కోర్టును అడిగింది. ఈ అంశాలన్నింటిని పరిశీలిస్తామని తెలిపిన కోర్టు మల్లన్నకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం మల్లన్నను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇక తీన్మార్ మల్లన్న తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర బెయిల్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఇక మల్లన్న కేసు విషయానికి వస్తే.. సికింద్రాబాద్ మధురానగర్ కాలనీలోని మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ తీన్మార్ మల్లన్న తనపై బెదిరింపులకు పాల్పడడ్డాడంటూ ఏప్రిల్ 22న చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్నోఏళ్లుగా తాను జ్యోతిషాలయం నిర్వహిస్తున్నానని.. కానీ ఇటీవల కొందరు వ్యక్తులు నకిలీ భక్తులను పంపి తనను ఇబ్బంది పెడ్తున్నారని, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు . అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు మల్లన్నకు రెండుసార్లు నోటీసులు అందించారు. అయితే నోటీసులపై మల్లన్న నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. చదవండి: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు..! ఓటుకు కోట్లు కేసు: రేవంత్ రెడ్డికి సమన్లు -
అత్తతో తగాదా.. అశ్లీల ఫొటోలు పంపి బ్లాక్మెయిల్
సాక్షి, బంజారాహిల్స్: అత్తింటి వాళ్లు తన ప్రమేయం లేకుండా భార్యను తీసుకెళ్లారనే కోపంతో అత్తతో గొడవపడి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డ అల్లుడిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రహమత్‌నగర్‌లో నివసించే మహ్మద్ అక్రం పాషా పాన్‌షాప్ నిర్వహిస్తుంటాడు. కార్మికనగర్‌కు చెందిన యువతితో ఏడు నెలల క్రితం పెళ్లైంది. భార్య గర్భిణి కావడంతో రెండు రోజుల క్రితం అతడి మామ వచ్చి ఆమెను పుట్టింటికి తీసుకెళ్లాడు. అయితే తన ప్రమేయం లేకుండానే భార్యను తీసుకెళ్లాడనే కోపంతో అక్రంపాష ఆగ్రహంతో అత్తతో గొడవపడ్డాడు. తన భార్యను పంపించకపోతే అంతు చూస్తానని, మీ అశ్లీల ఫొటోలు నెట్లో పెట్టి పరువు తీస్తానంటూ బెదిరించాడు. నెట్లో నుంచి ఒక అశ్లీల ఫొటో అత్తకు వాట్సాప్ చేసి ఇదే మాదిరిగా మీ ఫొటోలను ఎడిట్ చేసి నెట్లో పెడతానని బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో అత్త జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై ఐపీసీ 506, 509, 292 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భూవివాదం.. యువకుడిని కొట్టి చంపిన దుండగులు