
ముంబై: మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు స్వల్ప ఊరట లభించింది. ఆమె దేశంవిడిచి వెళ్ళేందుకు ఈడీ అనుమతిచ్చింది. 200కోట్లకు సంబంధించిన ఓ మనీ లాండరింగ్ కేసును విచారిస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ప్రధాన నిందితుడిగా సుకేశ్ చంద్రశేఖర్ అనే వ్యక్తి పేరును ఛార్జిషీటులో పేర్కొంది. అందులో బాలీవుడ్ నటి, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తోపాటు నోరా ఫతే పేర్లను కూడా చేర్చింది.
చదవండి: బాలీవుడ్ భామకి గిఫ్ట్‌గా రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పిల్లి
ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఇప్పటికే ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. అయితే, రూ.10కోట్ల విలువైన బహుమతులు తీసుకున్న ఆరోపణలపై జాక్వెలిన్‌కు ఈమధ్యే మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై ఆమె నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈడీ అధికారులు ఆమెపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇదే సయమంలో ఆమె దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ముంబయి విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment