వామ్మో.. ప్రైవేట్ డ్రైవర్లు
హన్మకొండ పీఎస్ పరిధిలో ఇష్టారాజ్యం
రాత్రి వేళ్లల్లో లాఠీలతో హల్‌చల్
షాపుల యజమానులకు బెదిరింపులు
హన్మకొండ చౌరస్తా : హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లోని ప్రైవేటు డ్రైవర్ల తీరు రోజురోజుకు ఇబ్బందికరంగా మారుతోంది. పేరుకు ప్రైవేటు డ్రైవర్లే అరుునా ఇన్‌స్పెక్టర్ల స్థారుులో ప్రజలను భయపెడుతున్నారనే విమర్శలు ఉన్నారుు. అధికారులు విధులు నిర్వహించే సమయంలో ప్రైవేటు డ్రైవర్లు చేస్తున్న హడావుడి అంతాఇంతా కాదు. చేతుల్లో లాఠీలు పట్టుకుని ప్రజలను బెదిరిస్తున్నారు. ఇక వాహనాల తనిఖీ, బందోబస్తు ప్రక్రియలో వారి తీరు ప్రజలకు మరీ ఇబ్బందికరంగా ఉంటోంది. అవసరంలేని ప్రశ్నలతో వాహనదారులను బెదిరిస్తున్నారు. రాత్రిపూట రక్షక్ వాహనాలను నడిపే సమయంలో వీరి ప్రవర్తన అతిగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. కానిస్టేబుళ్లుగా చెప్పుకుంటూ లాఠీలతో హల్‌చల్ చేస్తూ.. దుకాణాల వద్దకు వెళ్లి బెదిరింపులకు గురిచేస్తున్నారు. రాత్రిపూట ఆలస్యంగా మూసివేసే షాపుల యజమానుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రైవేటు డ్రైవర్ల వ్యవహారంపై హన్మకొండ పోలీస్‌స్టేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఎస్సై స్థారుు అధికారులకు తెలిసే ప్రైవేటు డ్రైవర్లు ఈ వ్యవహారానికి పాల్పడుతున్నారని చెబుతున్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పోలీసుశాఖకు భారీగా వసతులు కల్పించింది.
ప్రతి పోలీస్‌స్టేషన్‌కు నిర్వహణ ఖర్చులను ఇస్తోంది. అధికారుల విధి నిర్వహణకు పలు వాహనాలను కేటారుుంచింది. వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో మిగిలిన జిల్లాల్లో కంటే మెరుగైన వాహనాలను పోలీస్‌స్టేషన్లకు సరఫరా చేశారు. హన్మకొండ పోలీస్‌స్టేషన్‌కు రెండు ఇన్నోవా, మూడు సుమో వాహనాలను కొత్తగా కేటారుుంచింది. రెండు స్కార్పియో, ఒక కమాండర్ జీపు ఉన్నారుు. మొత్తం ఎనిమిది వాహనాల్లో సివిల్ విభాగం పోలీసులు ఆరు వాహనాలను వినియోగిస్తున్నారు. ఒక్కో వాహనానికి ఇద్దరు చొప్పున ఎనిమిది వాహనాలను నడిపేందుకు 16మంది డ్రైవర్లు అవసరమవుతారు. ప్రస్తుతం ఏడుగురు రెగ్యులర్ డ్రైవర్లు ఉన్నట్లు సమాచారం.
అత్యవసర సేవల పేరిట ఆరుగురు ప్రైవేటు డ్రైవర్లు పనిచేస్తున్నారు. హన్మకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం పోలీసులు వేగంగా సంఘటన స్థలాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో వాహనాల డ్రైవర్ల పాత్ర కీలకంగా ఉంటుంది. శిక్షణ పొందిన డ్రైవర్లు లేకపోవడంతో అధికారులు అయోమయానికి గురువుతున్న సందర్భాలు ఉంటున్నారుు. అధికారులు ఎక్కడికి వెళ్తున్నదీ కొందరు ప్రైవేటు డ్రైవర్లు ముందుగానే ‘అవసరమైన’ వారికి చేరవేస్తున్నారని విమర్శలు ఉన్నారుు.