Private drivers
-
ఆ 'డీఈ' మరోసారి నోరుపారేసుకున్నాడు.. చివరికి..
కరీంనగర్: ఆ డీఈ మరోసారి నోరుపారేసుకున్నాడు. వరుస వివాదాలు చుట్టుముట్టినా తనను ఎవరూ ఏమి చేయరనే ధీమా మళ్లీమళ్లీ మాటలు తూలేలా చేస్తోంది. తన పైఅధికారులనే లెక్కచేయని సదరు డీఈ ఈ సారి మున్సిపల్ ప్రైవేట్ డ్రైవర్లపై బూతులందుకున్నారు. డీఈ బూతులను తట్టుకోలేని డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. మేయర్‌కు , అధికారులకు ఫిర్యాదు చేశారు. నగరపాలకసంస్థ కార్యాలయంలో పార్కింగ్ టైల్స్ పనులు కొనసాగుతున్నందున, అద్దెకార్లను కళాభారతి వైపు పార్క్ చేస్తున్నారు. కళాభారతి వైపున్న గేట్‌ను మూసివేయడంతో కార్ల పార్కింగ్‌కు ఇబ్బంది కూడా లేదు. మంగళవారం సాయంత్రం సదరు డీఈ మూసి ఉన్న గేట్‌ను తీయించుకుని లోనికివచ్చాడు. రావడంతోనే ‘ఎవడ్రా నా కొడుకుల్లారా..కార్లిక్కడ పెట్టింది’ అంటూ బూతులతో దూషణకు దిగాడు. డీఈ వైఖరిపై తీవ్ర ఆవేదనకు లోనైన డ్రైవర్లు బుధవారం కార్యాలయంలో నిరసన తెలిపారు. సదరు డీఈపై చర్యతీసుకోవాలని మేయర్ సునీల్‌రావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాగా డీఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బూతుల డీఈని ఉన్నతాధికారులు నియంత్రించాలని బాధితులు కోరుతున్నారు. ఫిర్యాదు చేసినవారిలో ప్రైవేట్ డ్రైవర్లు గిరిభవన్కుమార్, ప్రశాంత్, సంపత్, శేఖర్ ఉన్నారు. -
కార్మికులకు హెచ్చరిక; దాడి చేస్తే చర్యలు..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో బస్సులు నడుపుతున్న ప్రైవేటు డ్రైవర్లకు ఆటంకం కలిగించి వారిపై దాడి చేస్తే చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ హెచ్చరించారు. తమ డిమండ్లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు గత 18 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రవాణా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యమ్నాయంగా ప్రైవేటు వ్యక్తుల ద్వారా బస్సులను నడిపిస్తుంది. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సులు, మిగిలిన ప్రైవేటు వాహనాలు నడుపుతున్న డ్రైవర్లను అడ్డుకుంటున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. సమ్మె చేస్తున్న యూనియన్లు ప్రైవేటు వ్యక్తులపై దాడి చేస్తున్నారని, అలా చేసే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న డ్రైవర్లకు ఆటంకం కలిగిస్తే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి ఫాస్టాక్ కోర్టు విచారణ ద్వారా వెంటనే శిక్ష పడుతుందని తెలిపారు. -
ఆర్టీసీ సమ్మె: సొంత విధుల్లోకి ప్రైవేట్ డ్రైవర్లు
సుదీర్ఘ సెలవుల అనంతరం పాఠశాలలు, కళాశాలలకుబయలుదేరిన విద్యార్థులు తొలిరోజే చుక్కలు చూశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సరిపడా బస్సులు లేకపోవడంతో విద్యాసంస్థలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి స్టాపుల్లో నిరీక్షించినా బస్సులు రాకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ఒకట్రెండు బస్సులు వస్తే అందులో కిక్కిరిసి ప్రమాదరక స్థితిలో ప్రయాణించారు. ప్రధానంగా నగర శివార్లలోని కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, అధ్యాపకులుఅవస్థలు పడ్డారు. అదనపు సర్వీసులు నడపాలని గ్రేటర్ ఆర్టీసీ భావించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మిగతా రోజులతో పోలిస్తే సర్వీసుల సంఖ్య మరింత తగ్గింది. తాత్కాలిక సిబ్బందితో ఇప్పటి వరకు 1300 బస్సులు నడపగా... అదికాస్త 1087కుపడిపోయింది. టెంపరరీ డ్రైవర్లు సొంత విధుల్లోకి వెళ్లడంతోఈ పరిస్థితి తలెత్తింది. విద్యాసంస్థల పునఃప్రారంభం సందర్భంగా‘సాక్షి’ సోమవారం విజిట్ నిర్వహించింది. సాక్షి,సిటీబ్యూరో: ఆర్టీసీ సమ్మె కష్టాలు సోమవారం విద్యార్థులను చుట్టుముట్టాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు తగినన్ని బస్సుల్లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాధారణ ప్రయాణికులు సైతం గంటల తరబడి బస్టాపుల్లో పడిగాపులు కాశారు. శివార్లలోని ఇంజినీరింగ్, ఒకేషనల్ కళాశాలలకు వెళ్లే విద్యార్థులు చేసేది లేక ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. చాలా మంది బైకులపై త్రిబుల్ రైడింగ్ చేశారు. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య విద్యార్థులు, ఉద్యోగులు వాహనాలు దొరక్క నరకం చూశారు. తిరిగిన ఒకటి, రెండు బస్సుల్లోనూ కిక్కిరిసి వెళ్లారు. దసరా సెలవుల్లో సమ్మె ప్రారంభం కావడంతో ప్రభుత్వం వారం రోజుల పాటు సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించేందుకు, ప్రైవేట్ సిబ్బంది సహాయంతో పూర్తిస్థాయిలో ఆర్టీసీ బస్సులను నడిపేందుకు అనువుగా ఈ సెలవులను పొడిగించారు. కానీ విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమైన సోమవారం నాటికి ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ 1087 బస్సులను మాత్రమే రోడ్డెక్కించగలిగింది. మరో 375 అద్దె బస్సులు ఉన్నప్పటికీ వాటిపై నియంత్రణ కొరవడింది. అవి ఏ రూట్లో తిరిగాయి.. ప్రయాణికులకు ఎలాంటి సేవలందజేశారనే అంశంపై స్పష్టత లేదు. నగరంలో విద్యార్థుల రద్దీకి అనుగుణంగా కనీసం 2000 బస్సులను నడిపాలి. ఆర్టీసీ ప్రణాళిక రూపొందించినప్పటికీ ఆ స్థాయిలో నడపలేకపోయారు. తాత్కాలిక డ్రైవర్లలో చాలామంది తిరిగి తమ సొంత విధుల్లోకి వెళ్లిపోయారు. బస్సులు నడిపేవారు లేక ఘట్కేసర్, బోగారం, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డినగర్, కీసర, బాచుపల్లి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, గండిమైసమ్మ, తదితర ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కళాశాలలకు వెళ్లే సుమారు 2.5 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రయాణ గండం తప్పలేదు. మెట్రో బస్సులు నడపలేరు ప్రస్తుతం పనిచేస్తున్న డ్రైవర్లు కేవలం అశోక్ లేలాండ్‌కు చెందిన ఆర్డినరీ బస్సులను మాత్రమే నడుపగలుగుతున్నారు. ఆర్టీసీలో ఉన్న 160 మార్కోపోలో లోఫ్లోర్ నాన్ ఏసీ, మరో 90 వోల్వో ఏసీ, మరో 6 మల్టి యాక్సిల్ బస్సులు, 40 రాజధాని ఏసీ బస్సులు, 246 మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు నడపాలంటే ప్రత్యేక శిక్షణ పొందినవారు అవసరం. ఆర్టీసీలో అనుభవం ఉన్నవారికే ఈ బస్సులను అప్పగిస్తారు. ప్రస్తుతం తాత్కాలికంగా విధుల్లో చేరుతున్న వాళ్లంతా లారీలు, ట్రాక్టర్లు నడిపిన వాళ్లే కావడంతో ఈ బస్సులను వారికి అప్పగించడం లేదు. వెంటాడుతున్న డ్రైవర్ల కొరత ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో మొత్తం 3,775 బస్సులు తిరుగుతుంటాయి. 19,500 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. వీరిలో 7.5 వేల మంది డ్రైవర్లు, మరో 7 వేల మంది కండక్టర్లు ఉన్నారు. 17 రోజులుగా సిబ్బంది మొత్తం సమ్మెలో ఉండడంతో కేవలం డిపోమేనేజర్లు విధులు నిర్వహిస్తున్నారు. అయితే, తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లతో బస్సులు నడుస్తున్నాయి. కండక్టర్లుగా పని చేసేందుకు చాలా మంది సుముఖంగా ఉన్నప్పటికీ డ్రైవర్లు మాత్రం వెనుకంజ వేస్తున్నారు. మరోవైపు స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు నడిపే డ్రైవర్లే ఇప్పటి దాకా బస్సులు నడిపారు. కానీ విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో వారంతా తిరిగి తమ విధులకు వెళ్లారు. దీంతో ప్రైవేట్ సిబ్బంది సహాయంతో నడిపే బస్సుల సంఖ్య 1300 నుంచి 1087కు పడిపోయింది. నో టిమ్స్..టికెట్ ప్రైవేట్ సిబ్బంది దోపిడీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ బస్సుల్లో ప్రింటెడ్ టిక్కెట్ల జారీని ప్రవేశపెట్టనున్నట్లు రవాణాశాఖ ప్రకటించింది. అలాగే టిమ్స్ యంత్రాల ద్వారా టిక్కెట్లను అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆ సదుపాయం రాలేదు. మరోవైపు సొంత ప్రింటింగ్‌ప్రెస్ లేకపోవడం వల్ల ప్రింటెడ్ టిక్కెట్ల కోసం ఇతర ముద్రణ సంస్థలపై ఆధార పడాల్సి వస్తుంది. మియాపూర్ బస్‌బాడీ యూనిట్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌ను గతంలోనే మూసేశారు. దీంతో ఆర్టీసీలో టిక్కెట్ల జారీ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే అంశంపై అనిశ్చితి నెలకొంది. -
ఆర్టీసీ సమ్మె: ‘డేంజర్’ డ్రైవర్స్!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీలో ప్రైవేట్ డ్రైవర్లు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని గందరగోళంనెలకొంది. పలుచోట్ల డ్రైవర్లు బస్సులను సక్రమంగా నడపలేకపోతుండడంతో చోటుచేసుకుంటున్న ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెను దృష్టిలో ఉంచుకొని రవాణాశాఖ అధికారులు పెద్ద సంఖ్యలో డ్రైవర్లను, కండక్టర్లను డిపోలకు తరలిస్తున్నారు. హెవీ డ్రైవింగ్ లైసెన్సు ఉంటే చాలు. పెద్దగా అనుభవం, నైపుణ్యం లేకపోయినా సరే బస్సులను అప్పగిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ డిపోల్లో సుమారు 1500 మంది తాత్కాలిక డ్రైవర్లు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం లారీలు, ట్రాక్టర్లు, తదితర సరుకు రవాణా వాహనాలను నడిపిన వారే ఉన్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సిటీ బస్సులు నడిపేందుకు ప్రత్యేక నైపుణ్యం, శిక్షణ అవసరమని, అలాంటి శిక్షణ కొరవడిన వ్యక్తులు బస్సులు నడపడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్టీసీ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధానకార్యదర్శి హనుమంతు ముదిరాజ్ ఆరోపించారు. తాత్కాలిక డ్రైవర్ల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల మద్యం సేవించి బస్సులు నడపడం, అదుపు తప్పి డివైడర్లకు ఢీకొట్టడం లేదా ముందు బస్సులను ఢీకొట్టడం వంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. హయత్‌నగర్, కూకట్‌పల్లిలో జరిగిన ప్రమాదాలు ప్రయాణికులను, వాహనదారులను భయాందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఓల్వోలు ఎలా అప్పగించాలి... ఈ క్రమంలో సమ్మె మరి కొంత కాలం ఇలాగే కొనసాగితే నాన్ ఏసీ లోఫ్లోర్, ఏసీ మెట్రో లగ్జరీ ఓల్వో బస్సులను తాత్కాలిక డ్రైవర్లకు అప్పగించడంపై ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే బస్సుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రాత్రి సర్వీసులను నిలిపివేశారు. ఒకవేళ తప్పనిసరిగా పూర్తిస్థాయిలో అన్ని బస్సులను నడపవలసి వస్తే ఎలా అనేది ఇప్పుడు ఆర్టీసీ అధికారులను ఆందోళనకు గురి చేస్తుంది. 11వ రోజుకు చేరిన సమ్మె.. ఆర్టీసీ కార్మికుల సమ్మె మంగళవారం 11వ రోజుకు చేరుకుంది. బస్‌భవన్ వద్ద ఏఐఎస్ఎఫ్ఐ, ఇతర ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.అలాగే మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుఖ్నగర్ బస్ష్టేషన్లు, డిపోల వద్ద కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. సమ్మె కారణంగా నిలిచిపోయిన బస్సులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాత్రి పూట బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలు పెద్ద ఎత్తున దోచుకుంటున్నాయి. -
వామ్మో.. ప్రైవేట్ డ్రైవర్లు
హన్మకొండ పీఎస్ పరిధిలో ఇష్టారాజ్యం రాత్రి వేళ్లల్లో లాఠీలతో హల్చల్ షాపుల యజమానులకు బెదిరింపులు హన్మకొండ చౌరస్తా : హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లోని ప్రైవేటు డ్రైవర్ల తీరు రోజురోజుకు ఇబ్బందికరంగా మారుతోంది. పేరుకు ప్రైవేటు డ్రైవర్లే అరుునా ఇన్స్పెక్టర్ల స్థారుులో ప్రజలను భయపెడుతున్నారనే విమర్శలు ఉన్నారుు. అధికారులు విధులు నిర్వహించే సమయంలో ప్రైవేటు డ్రైవర్లు చేస్తున్న హడావుడి అంతాఇంతా కాదు. చేతుల్లో లాఠీలు పట్టుకుని ప్రజలను బెదిరిస్తున్నారు. ఇక వాహనాల తనిఖీ, బందోబస్తు ప్రక్రియలో వారి తీరు ప్రజలకు మరీ ఇబ్బందికరంగా ఉంటోంది. అవసరంలేని ప్రశ్నలతో వాహనదారులను బెదిరిస్తున్నారు. రాత్రిపూట రక్షక్ వాహనాలను నడిపే సమయంలో వీరి ప్రవర్తన అతిగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. కానిస్టేబుళ్లుగా చెప్పుకుంటూ లాఠీలతో హల్చల్ చేస్తూ.. దుకాణాల వద్దకు వెళ్లి బెదిరింపులకు గురిచేస్తున్నారు. రాత్రిపూట ఆలస్యంగా మూసివేసే షాపుల యజమానుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రైవేటు డ్రైవర్ల వ్యవహారంపై హన్మకొండ పోలీస్‌స్టేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఎస్సై స్థారుు అధికారులకు తెలిసే ప్రైవేటు డ్రైవర్లు ఈ వ్యవహారానికి పాల్పడుతున్నారని చెబుతున్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పోలీసుశాఖకు భారీగా వసతులు కల్పించింది. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు నిర్వహణ ఖర్చులను ఇస్తోంది. అధికారుల విధి నిర్వహణకు పలు వాహనాలను కేటారుుంచింది. వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో మిగిలిన జిల్లాల్లో కంటే మెరుగైన వాహనాలను పోలీస్స్టేషన్లకు సరఫరా చేశారు. హన్మకొండ పోలీస్‌స్టేషన్‌కు రెండు ఇన్నోవా, మూడు సుమో వాహనాలను కొత్తగా కేటారుుంచింది. రెండు స్కార్పియో, ఒక కమాండర్ జీపు ఉన్నారుు. మొత్తం ఎనిమిది వాహనాల్లో సివిల్ విభాగం పోలీసులు ఆరు వాహనాలను వినియోగిస్తున్నారు. ఒక్కో వాహనానికి ఇద్దరు చొప్పున ఎనిమిది వాహనాలను నడిపేందుకు 16మంది డ్రైవర్లు అవసరమవుతారు. ప్రస్తుతం ఏడుగురు రెగ్యులర్ డ్రైవర్లు ఉన్నట్లు సమాచారం. అత్యవసర సేవల పేరిట ఆరుగురు ప్రైవేటు డ్రైవర్లు పనిచేస్తున్నారు. హన్మకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ కోసం పోలీసులు వేగంగా సంఘటన స్థలాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో వాహనాల డ్రైవర్ల పాత్ర కీలకంగా ఉంటుంది. శిక్షణ పొందిన డ్రైవర్లు లేకపోవడంతో అధికారులు అయోమయానికి గురువుతున్న సందర్భాలు ఉంటున్నారుు. అధికారులు ఎక్కడికి వెళ్తున్నదీ కొందరు ప్రైవేటు డ్రైవర్లు ముందుగానే ‘అవసరమైన’ వారికి చేరవేస్తున్నారని విమర్శలు ఉన్నారుు. -
ప్రైవేట్ డ్రైవర్‌పై కార్మికుల దాడి