కరీంనగర్: ఆ డీఈ మరోసారి నోరుపారేసుకున్నాడు. వరుస వివాదాలు చుట్టుముట్టినా తనను ఎవరూ ఏమి చేయరనే ధీమా మళ్లీమళ్లీ మాటలు తూలేలా చేస్తోంది. తన పైఅధికారులనే లెక్కచేయని సదరు డీఈ ఈ సారి మున్సిపల్ ప్రైవేట్ డ్రైవర్లపై బూతులందుకున్నారు. డీఈ బూతులను తట్టుకోలేని డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. మేయర్‌కు , అధికారులకు ఫిర్యాదు చేశారు.
నగరపాలకసంస్థ కార్యాలయంలో పార్కింగ్ టైల్స్ పనులు కొనసాగుతున్నందున, అద్దెకార్లను కళాభారతి వైపు పార్క్ చేస్తున్నారు. కళాభారతి వైపున్న గేట్‌ను మూసివేయడంతో కార్ల పార్కింగ్‌కు ఇబ్బంది కూడా లేదు. మంగళవారం సాయంత్రం సదరు డీఈ మూసి ఉన్న గేట్‌ను తీయించుకుని లోనికివచ్చాడు. రావడంతోనే ‘ఎవడ్రా నా కొడుకుల్లారా..కార్లిక్కడ పెట్టింది’ అంటూ బూతులతో దూషణకు దిగాడు.
డీఈ వైఖరిపై తీవ్ర ఆవేదనకు లోనైన డ్రైవర్లు బుధవారం కార్యాలయంలో నిరసన తెలిపారు. సదరు డీఈపై చర్యతీసుకోవాలని మేయర్ సునీల్‌రావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాగా డీఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బూతుల డీఈని ఉన్నతాధికారులు నియంత్రించాలని బాధితులు కోరుతున్నారు. ఫిర్యాదు చేసినవారిలో ప్రైవేట్ డ్రైవర్లు గిరిభవన్కుమార్, ప్రశాంత్, సంపత్, శేఖర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment