DE
-
నా గురించి తెలుసుకదా..! అలా చేయలేదంటే మిమ్మల్నీ?
కరీంనగర్: ‘బిల్లులో ఏముందనేది సంబంధం లేదు.. నేను చెప్పిందానికి సంతకం పెట్టలేదంటే అంతే. మీ ఎంబడి పడుడైతది చెబుతున్నా.. నా గురించి తెలుసు కదా.. నన్ను ఏ కొడుకు.. ఏం చేయలేడు’.. ఇది నగరపాలకసంస్థలో ఓ డీఈ దౌర్జన్యకాండ. నగరపాలక సంస్థలో పనులు పూర్తికాకున్నా బిల్లులపై సంతకాల కోసం ఇంజినీరింగ్ అధికారులపై వివాదాస్పద డీఈ వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. నిత్యం వివాదాల్లో ఉండే సదరు డీఈ కాంట్రాక్టర్ల తరఫున రంగంలోకి దిగాడు. ఏఈలు, డీఈలను సంతకాలకోసం బెదిరిస్తుండగా, వారు సెలవుపై వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. పూర్తి కాని, నాణ్యత పాటించని పనులకు.. ఓ వైపు స్మార్ట్ సిటీ, సీఎంఏ తదితర నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో వందల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయని అధికార, విపక్షాలనే తేడా లేకుండా ఫిర్యాదులు చేస్తుంటే.. మరో వైపు ఎలాంటి భయం లేకుండా పూర్తి కాని, నాణ్యత పాటించని పనులకు రికార్డులు తయారుచేసి బిల్లులు ఎత్తే పనిని సదరు డీఈ విజయవంతంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడు. దీనికోసం ఏఈలు, సహచర డీఈలపై బెదిరింపులకు దిగుతున్నాడు. సంతకాలు పెట్టకపోతే మీ సంగతి చెబుతానంటూ బూతులందుకుంటున్నాడు. మళ్లీ వేధింపులు షురూ! బల్దియాలో వివాదాస్పద అధికారిగా పేరొందిన సదరు డీఈ బెదిరింపులు మళ్లీ మొదలయ్యాయి. గతంలో ఉన్నతాధికారులను సైతం అసభ్యపదజాలంతో దూషించిన వ్యవహారం అప్పట్లో కలకలం సృష్టించింది. కొద్దికాలంగా స్థబ్దుగా ఉన్న ఆయన నాలుగైదు రోజుల నుంచి కిందిస్థాయి, సహచర, ఉన్నత అనే తేడా లేకుండా ఇంజినీరింగ్ అధికారులపై దూషణలకు దిగుతున్నాడు. వారి పరిధిలోని పనులకు సంబంధించిన బిల్లుల తయారీలో సంతకాలు పెట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నాడు. సెలవులో వెళ్లేందుకు ప్రయత్నం సదరు డీఈ ఆగడాలు ఎక్కువవుతున్న క్రమంలో సెలవులో వెళ్లేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. నగరపాలకసంస్థలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ముఖ్యంగా ఇంజినీరింగ్ అధికారులు ఒత్తిడిలో ఉన్నారు. ఈ క్రమంలో డీఈ సంతకాల కోసం దౌర్జన్యానికి దిగుతుండడంతో తాము సంతకాలు చేసి ఉద్యోగాలను ఫణంగా పెట్టలేమని అధికారులు పేర్కొంటున్నారు. దీనికన్నా సెలవులో వెళ్లడం మేలని, అవసరమైతే బదిలీకి కూడా సిద్ధపడుతున్నారు. కాగా నగరంలో అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అక్రమాలు, సదరు డీఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించి ఆయన ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నతాధికారులపై ఉంది. ఇవి చదవండి: నేరడిగొండ జెడ్పీఎస్‌ఎస్‌లో ఓ ఉపాధ్యాయుడు.. -
ఆ 'డీఈ' మరోసారి నోరుపారేసుకున్నాడు.. చివరికి..
కరీంనగర్: ఆ డీఈ మరోసారి నోరుపారేసుకున్నాడు. వరుస వివాదాలు చుట్టుముట్టినా తనను ఎవరూ ఏమి చేయరనే ధీమా మళ్లీమళ్లీ మాటలు తూలేలా చేస్తోంది. తన పైఅధికారులనే లెక్కచేయని సదరు డీఈ ఈ సారి మున్సిపల్ ప్రైవేట్ డ్రైవర్లపై బూతులందుకున్నారు. డీఈ బూతులను తట్టుకోలేని డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. మేయర్‌కు , అధికారులకు ఫిర్యాదు చేశారు. నగరపాలకసంస్థ కార్యాలయంలో పార్కింగ్ టైల్స్ పనులు కొనసాగుతున్నందున, అద్దెకార్లను కళాభారతి వైపు పార్క్ చేస్తున్నారు. కళాభారతి వైపున్న గేట్‌ను మూసివేయడంతో కార్ల పార్కింగ్‌కు ఇబ్బంది కూడా లేదు. మంగళవారం సాయంత్రం సదరు డీఈ మూసి ఉన్న గేట్‌ను తీయించుకుని లోనికివచ్చాడు. రావడంతోనే ‘ఎవడ్రా నా కొడుకుల్లారా..కార్లిక్కడ పెట్టింది’ అంటూ బూతులతో దూషణకు దిగాడు. డీఈ వైఖరిపై తీవ్ర ఆవేదనకు లోనైన డ్రైవర్లు బుధవారం కార్యాలయంలో నిరసన తెలిపారు. సదరు డీఈపై చర్యతీసుకోవాలని మేయర్ సునీల్‌రావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాగా డీఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బూతుల డీఈని ఉన్నతాధికారులు నియంత్రించాలని బాధితులు కోరుతున్నారు. ఫిర్యాదు చేసినవారిలో ప్రైవేట్ డ్రైవర్లు గిరిభవన్కుమార్, ప్రశాంత్, సంపత్, శేఖర్ ఉన్నారు. -
నాకు చెప్పేదెవడ్రా?.. నా కొడుకల్లారా..! కలెక్టరేట్ సాక్షిగా బూతులు..
కరీంనగర్: ‘నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా...మీరెవర్రా నాకు చెప్పేది. మీరు చెబితే వినాల్నారా? నా...కొడుకల్లారా’ అంటూ నగరపాలక సంస్థకు చెందిన ఓ డీఈ తన పైఅధికారులపై చిందులు వేశారు. బల్దియా వర్గాల్లో సంచలనం సృష్టించిన సంఘటన వివరాలు విశ్వసనీయ వర్గాల కథనం మేరకు ఇలా ఉన్నాయి. ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు నగరపాలకసంస్థ ఇంజినీరింగ్ అధికారులు బుధవారం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈ మేరకు పైస్థాయి అధికారులు డీఈలు, ఏఈలకు కలెక్టరేట్‌కు రావాలని సమాచారం ఇచ్చారు. ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చే సమయంలోనే సదరు డీఈ ‘నేను రాను...నాకు పని ఉంది...కలవడం అవసరమా?’ అంటూ పెడసరిగా మాట్లాడడంతోనే సదరు అధికారి మిన్నకుండిపోయారు. అతను లేకుండానే అదనపు కలెక్టర్‌ను కలిసి బయటకు వస్తున్న క్రమంలో సదరు డీఈ సైతం కలెక్టరేట్‌కు వచ్చి తారసపడ్డారు. ‘పని ఉంది రానంటివి కదా?’ అని పైస్థాయి అధికారి ఒకరు అనడంతోనే డీఈ తిట్లదండకం అందుకున్నాడు. పరుషపదజాలంతో దూషించడంతో పాటు, నానా బూతులు తిట్టడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ సమయంలో అధికారులతో పాటు కొంతమంది కిందిస్థాయి ఉద్యోగులు కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. సాక్షాత్తు కలెక్టరేట్లో తన పైఅధికారులను ఇష్టారీతిన డీఈ బూతులు తిట్టడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. చెప్పుకునే దిక్కేది...? నగరపాలకసంస్థ కార్యాలయంలో ‘పనిమంతుడు’గా గుర్తింపు పొందిన సదరు డీఈ కొంతకాలంగా ప్రదర్శిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. నగరంలో జరిగే అభివృద్ధి పనుల్లో ఎక్కువ పనులు తన ‘చేతుల మీదుగా’ జరుగుతుండడం, ప్రజాప్రతినిధులతో ఉన్న సాన్నిహిత్యం అతడిని దారితప్పేట్లు చేస్తున్నాయనే ప్రచారం ఉంది. కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో అక్రమాలకు ఇతనే బాధ్యుడని, అంచనాలు, బిల్లులు పెంచడంలోనూ అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదులు కూడా ఉన్నాయి. తన పై అధికారులను లెక్కచేయడని, బెదిరింపులకు గురిచేస్తాడని ఇతనికి పేరుంది. ఇటీవల వరుసగా తన పైఅధికారులను, సహచర అధికారులను ఇష్టారీతిన బూతులు తిట్టినా.. అతనికి చిన్న మెమో కూడా జారీ కాలేదంటే అతడి పలుకుబడి ఏంటో అర్థమవుతోంది. బాధిత అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సదరు డీఈని మందలించే సాహసంకూడా ఎవరూ చేయడంలేదు. ఏదిఏమైనా సదరు అధికారి తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో కొత్త కోణం..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ డీఈ పేరు కొత్తగా వెలుగులోకి వచ్చింది. విద్యుత్ శాఖ డీఈ కనుసన్నల్లో ఏఈ పేపర్ చేతులు మారినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ రవికిషోర్‌ను సిట్ అరెస్ట్ చేసింది. ఆయన 20 మందికి పశ్నాపత్రాలు విక్రయించినట్లు సిట్ బృందం గుర్తించింది. డీఈ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఓ కోచింగ్ సెంటర్లో శిక్షకుడిగా పనిచేస్తున్నాడని, అభ్యర్థులతో పరిచయం పెంచుకుని ఈ దందాకు తెరలేపినట్లు సిట్ అధికారులు గుర్తించారు. టాప్ మార్కులు వచ్చిన వారి వివరాలను సిట్ బృందం సేకరిస్తోంది. కాగా, ప్రశ్నపత్రాల లీకేజి కేసులో సిట్ అధికారులు గురువారం మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 43కి, అరెస్ట్ అయిన వారి సంఖ్య 42కు చేరింది. ఈ వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్న కమిషన్ మాజీ ఉద్యోగులు పులిదిండి ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి ద్వారా అనేక ప్రశ్నపత్రాలు ఒకప్పుడు కమిషన్‌లో పని చేసిన వీరి స్నేహితుడు సురేశ్‌కు చేరాయి. చదవండి: రవికిశోర్ ద్వారా మరో ముగ్గురికి.. ఇతడు వీటిలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పేపర్లను తన అపార్ట్మెంట్లో నివసించే వారికి మధ్యవర్తి ద్వారా విక్రయించాడు. ఈ వ్యవహారంలో నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పూల రవికిశోర్ మధ్యవర్తిగా వ్యవహరించాడు. సురేశ్ గతంలోనే అరెస్టు కాగా.. రవికిశోర్‌తోపాటు ఏఈ, డీఏఓ పేపర్లు ఖరీదు చేసిన అన్నాచెల్లెళ్లు రాయపురం విక్రమ్, దివ్యలను బుధవారం అరెస్టు చేశారు. -
భింద్రన్‌వాలే 2.0: అమృత్‌పాల్ సింగ్
‘సిద్ధాంతానికి చావుండదు. మా సిద్ధాంతమూ అంతే’ ‘మా లక్ష్యాన్ని మేధోపరంగా, భౌగోళిక రాజకీయపరంగా చూడాలి’ ‘ఖలిస్తాన్ ఉద్యమాన్ని అడ్డుకుంటే ఇందిరకు పట్టిన గతే అమిత్ షాకూ పడుతుంది’ – ఇవీ... తనను తాను ఖలిస్తాన్ ఉద్యమ నాయకుడిగా ప్రకటించుకున్న అమృత్ పాల్ సింగ్ వ్యాఖ్యలు! ఏదైనా ‘చేస్తా’నని బహిరంగంగా చెప్పి మరీ చేస్తున్నాడు. ఎవరితను? అతని సారథ్యంలో ఖలిస్తాన్ ఉద్యమం మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోందా...? అమృత్‌పాల్ సింగ్ రాకతో ఏడాదిగా ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమ వాణి బలంగా మళ్లీ వినిపిస్తోంది. అచ్చం ఆపరేషన్ బ్లూ స్టార్‌లో మరణించిన కరడుగట్టిన ఖలిస్తానీ తీవ్రవాది భింద్రన్‌వాలే మాదిరిగా నీలం రంగు తలపాగా చుట్టుకొని, తెల్లటి వస్త్రధారణతో మాటల తూటాలు విసురుతూ యువతను ఉద్యమం వైపు ప్రేరేపిస్తున్నాడు. ఇటీవలి దాకా ఎవరికీ పెద్దగా తెలియని అమృత్‌పాల్ కేంద్రంపై తరచూ విమర్శలతో ఉన్నట్టుండి చర్చనీయాంశంగా మారిపోయాడు. ఎవరీ అమృత్‌పాల్ 29 ఏళ్ల అమృత్ పాల్ సింగ్ గతేడాది దాకా దుబాయ్‌లోనే రవాణా వ్యాపారంలో ఉన్నాడు. సంప్రదాయాలకు అంత విలువనిచ్చేవాడు కాదు. కానీ నటుడు దీప్ సిద్ధూ స్థాపించిన ‘వారిస్ పంజాబ్ దే’సంస్థ సభ్యుడు. 2022 ఫిబ్రవరిలో దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సంస్థను తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. పంజాబ్‌కు తిరిగి వచ్చి, అణగారిన ఖలిస్తానీ ఉద్యమానికి తన మాటలు, చేతలతో మళ్లీ ఊపిరిలూదుతున్నాడు. హింసామార్గాన్నే ఎంచుకున్న అమృత్‌పాల్ అచ్చం పాకిస్తాన్ ఐఎస్ఐ తరహాలో ఉద్యమాన్ని నడిపిస్తున్నాడన్న ఆందోళనలున్నాయి. ఏమిటీ ఖలిస్తాన్ ఉద్యమం? ఖలిస్తాన్ అంటే పంజాబీలో పవిత్రమైన భూమి. సిక్కులకు ప్రత్యేక దేశమే కావాలంటూ 1940లో ఖలిస్తాన్ ఉద్యమం ప్రారంభమైంది. భారత్‌లో పంజాబ్‌ను తమ మాతృభూమిగా ప్రకటించాలంటూ సిక్కులు ఇప్పటిదాకా ఎన్నో ఉద్యమాలు నడిపారు. 1970–80ల్లో తార స్థాయికి వెళ్లిన ఈ ఉద్యమాన్ని ప్రధాని ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్‌తో అణచి వేశారు. ఏకంగా అమృత్సర్ స్వర్ణ దేవాలయా న్ని కేంద్రంగా చేసుకొని సమాంతర ప్రభుత్వా న్నే నడిపిన ఖలిస్తానీ నేత భింద్రన్‌వాలేను స్వర్ణ దేవాలయంలోకి చొచ్చు కెళ్లి మరీ సైన్యం హతమార్చింది. అలా చల్లబడ్డ ఉద్యమం ఇప్పుడు విస్తరిస్తున్నట్టు కనిపిస్తోంది. అమృత్ పాల్ కూడా స్వర్ణ దేవాలయం కేంద్రంగానే మరింత కాక రాజేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్వర్ణ దేవాలయంపై దాడిని నిరసిస్తూ ఇందిరను ఆమె సిక్కు అంగరక్షకులే బలిగొన్న తరహాలో అమిత్ షా తమ టార్గెట్ అంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు! కెనడా కనెక్షన్ కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో సిక్కు జనాభా ఎక్కువ. దాంతో ఆయా దేశాల్లో ఖలిస్తానీ ఉద్యమ ప్రభావం బాగా కనిపిస్తుంటుంది. అక్కడి హిందూ ఆలయాలపై, గణతంత్ర వేడుకలు జరుపుకునే వారిపై దాడులు పరిపాటిగా మారాయి. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఖలీస్తాన్ ఉద్యమకారులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉంటారు. కెనడాలోనైతే సిక్కు జనాభా మరీ ఎక్కువ. ప్రభుత్వంలోనూ సిక్కుల ప్రాబల్యముది. ప్రత్యేక ఖలిస్తాన్ కోసం ఖలీస్తాన్ ఉద్యమ సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (సీఎఫ్‌జే) కెనడాలో ఏకంగా రిఫరెండం నిర్వహించగా లక్షకు మందికిపైగా సిక్కులు ఓటింగ్‌లో పాల్గొన్నారు! దీన్ని ఆపాలని మోదీ ప్రభుత్వం కోరినా కెనడా ప్రభుత్వం ఒప్పుకోలేదు. అది తమ చట్టాల ప్రకారం ప్రజాస్వామ్యయుతంగానే జరుగుతోందంటూ అనుమతి నిచ్చింది. భారత్ నుంచి పంజాబ్‌ను విడదీసి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని ఏకంగా ఐక్యరాజ్యసమితికే విజ్ఞప్తి చేయడానికి ఖలీస్తాన్ మద్దతు çసంఘాలు యూఎన్‌ను సంప్రదించనున్నాయి! ఖలిస్తానీ శక్తులు పుంజుకుంటున్నాయా ? తన అనుచరుడు లవ్‌ప్రీత్ సింగ్‌ను ఓ కిడ్నాపింగ్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుంటే అమృత్‌సర్‌లో అమృత్ పాల్ సృష్టించిన భయోత్సాతాన్ని అంతా దిగ్భ్రమతో చూశారు. కత్తులు, కటార్లే గాక అధునాతన తుపాకులు కూడా చేతబట్టుకొని వేలాది మంది సిక్కులు పోలీసుస్టేషన్లోకి చొరబడటమే గాక ఏకంగా పోలీసులతో బాహాబాహీకి దిగారు. దాంతో పంజాబ్ ఆప్ ప్రభుత్వం అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవంటూ విడుదల చేసిన పరిస్థితి! ఈ ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది. అంతకుముందు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేసినప్పుడు ఢిల్లీలో ధర్నా సందర్భంగా ఏకంగా చారిత్రక ఎర్రకోటపైనే ఖలిస్తాన్ జెండా ఎగురవేశారు! వీధుల్లో వీరంగం వేశారు. ఖలిస్తానీ శక్తులు బలం పుంజుకుంటున్నా యనడానికి ఇవన్నీ తార్కాణాలే. ఏడాది కాలం జరిగిన రైతు ఉద్యమం వెనకా ఖలిస్తానీ వేర్పాటు వాదుల హస్తమే ఉందంటారు. ఖలీస్తానీ ఉద్యమ పునాదులపై పుట్టిన అకాలీదళ్ పార్టీ బలహీనపడిపోతున్న తరుణంలో అమృత్‌పాల్ రూపంలో కొత్త గళం బలంగా వినిపించడం ప్రారంభమైంది. ఆప్ పాత్రపై అనుమానాలు పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఖలిస్తానీ వేర్పాటువాదులకు అనుకూలంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. పెచ్చరిల్లిన హింసాకాండ, కాల్చి చంపడాల నేపథ్యంలో గన్ లైసెన్సులపై ఇటీవల సంపూర్ణ సమీక్ష నిర్వహిస్తున్న పంజాబ్ పోలీసులు ఎవరి దగ్గర ఆయుధాలు, తుపాకులున్నా వెంటనే కేసులు పెడుతున్నారు. కానీ బాహాటంగా ఆయుధాలు చేబూని తిరుగుతూ భయోత్పాతానికి దిగుతున్న అమృత్‌పాల్, అతని అనుచరులపై ఇప్పటిదాకా ఒక్క కేసూ నమోదవలేదు! ఏకంగా కేంద్ర హోం మంత్రికే చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రభుత్వ పెద్దలను బాహాటంగా బెదిరిస్తున్నా చూసిచూడనట్టు వదిలేస్తున్నారు. దీని వెనక రాజకీయ కారణాలున్నాయనే అభిప్రాయాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయానికి ఖలీస్తాన్ శక్తులే తోడ్పాటు అందించినట్టు విశ్లేషణలున్నాయి. అందుకే ఇప్పుడు వారి ఆగడాలపై ఆప్ నోరు మెదపడం లేదంటూ విపక్షాలు దుయ్యబడుతున్నాయి. ఇక పంజాబ్‌లో మిలిటెంట్ కార్యకలాపాల్లో దోషులుగా తేలి 30 ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న బందీ సింగ్ (సిక్కు ఖైదీ)ల విడుదల కోసం వారి మద్దతుదారులు వేలాదిగా రోడ్డెక్కి నిరసనలకు దిగుతున్నారు. ఇలా ఈ మధ్య ఖలీస్తాన్ వేర్పాటువాదులు ఏదో ఒక కార్యక్రమంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. -
కమీషన్.. డిస్కం
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అవినీతికి నిలయంగా మారింది. పైసా విదల్చనిదే ఫైలు కదలని పరిస్థితి నెలకొంది. ట్రాన్స్ఫార్మర్, కొత్త వెంచర్లో లైన్ల ఏర్పాటు, లైన్ల మార్పిడి, ప్యానల్ బోర్డు, కరెంట్ మీటర్....ఇలా ప్రతి పనికీ ఓ రేట్ ఫిక్స్ చేశారు. అడిగినంత ఇస్తే సరి..లేదంటే వినియోగదారులకు చుక్కలు చూపుతున్నారు. ఇంజినీర్ల తీరుతో విసిగిపోయిన వినియోగదారులు, విద్యుత్ కాంట్రాక్టర్లు చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తుండటంతో వారు వలపన్ని అవినీతి తిమింగలాలను పట్టుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఒక సారి ఏసీబీ కేసులో అరెస్టై కేసు విచారణలో ఉన్న అధికారులు కూడా ఏడాది తిరక్క ముందే అంత కంటే మంచి పోస్టులో చేరిపోతుండటంపై విశేషం. ఏసీబీ కేసులున్న అధికారులను నాన్ ఫోకల్ పోస్టుల్లో నియమించాల్సి ఉండగా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఇందుకు విరుద్ధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పెద్దపీట వేస్తుండటం గమనార్హం. ఆ డివిజన్లు అవినీతికి నిలయాలు: నగర శివార్లలో కొత్తగా అనేక వెంచర్లు వెలుస్తున్నాయి. కొత్తలైన్లు, మీటర్లు కరెంటోళ్లకు కామధేనువులా మారాయి. నిజానికి నాలుగు మీటర్లకు మించితే ప్యానల్ బోర్డు ఏర్పాటు చేసుకోవాలి. అయితే పలవురు వినియోగదారులు జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. ఒక వేళ అనుమతి తీసుకున్నా..సెట్‌బ్యాక్, పార్కింగ్, ఫైర్‌సేఫ్టీ తదితర నిబంధనలు పాటించకపోవడంతో వాటికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వరు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, చంపాపేట్, హబ్సిగూడ, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, మియాపూర్, కూకట్పల్లి, కొండాపూర్, మాదాపూర్ డివిజన్లలో పని చేస్తున్న కొందరు అధికారులు వినియోగదారుల బలహీనతను ఆసరాగా చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. అధికారికంగా ఎలాంటి ఎస్టిమేషన్లు లేకుండానే కొత్తలైన్లు, ప్యానల్‌బోర్డులు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జీడిమెట్ల సుభాష్‌నగర్, ప్రగతినగర్, షాపూర్‌నగర్, డీపీపల్లి, ప్రగతినగర్‌లోని క్షేత్రస్థాయి సిబ్బందిపై ఇటీవల పెద్దత్తున ఆరోపణలు వెల్లువెత్తడంతో ఇద్దరు క్షేత్రస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి భవనం, వెంచర్ యజమానులు కొత్త లైన్లు, కనెక్షన్ల కోసం ఆయా డివిజన్ల పరిధిలోని వినియోగదారుల సేవాకేంద్రంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కేంద్రం నుంచి దరఖాస్తు సంబంధిత సెక్షన్ ఏఈ, ఏడీఈ, డీఈ,ఎస్ఈకి వెళుతుంది. వర్క్ ఎస్టిమేషన్ దగ్గరి నుంచి మెటీరియల్ సరఫరా, వర్క్ పూర్తయిన తర్వాత తనిఖీ చేసే వరకు ఆయా విభాగాల అధికారులకు అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. లేనిపక్షంలో రోజుల తరబడి తిరిగినా పనులు కావడం లేదు. క్షేత్రస్థాయి ఇంజినీర్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో విసుగెత్తిన వినియోగదారులు, విద్యుత్ కాంట్రాక్టర్లు గత్యంతరం లేర ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ఏసీబీకి చిక్కిన ఇద్దరు డీఈలు కీసర విలేజ్, నాగారం పరిధిలో ఇటీవల కొత్తగా ఓ వెంచర్ వెలసింది. కొత్తలైన్కోసం యజమానులు డిస్కంకు దరఖాస్తు చేశారు. వర్క్ ఎస్టిమేషన్, అనుమతులు మంజూరు చేసేందుకు మేడ్చల్ డీఈ ప్రసాదరావు సంబంధిత కాంట్రాక్టర్ బొల్లారం బాలనరసింహను రూ.50 వేలు డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం ఆయనకు రూ.25 వేలు చెల్లించారు. అయినా వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా ఆఫీసు చుట్టూ తిప్పుకుంటుండటంతో విసుగుచెందిన కాంట్రాక్టర్ నరసింహ ఏసీబీని ఆశ్రయించారు. గురువారం మధ్యాహ్నం తన కార్యాలయంలోనే డీఈ ప్రసాదరావు కాంట్రాక్టర్ నుంచి రూ. 5000 లంచంగా తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. సదరు అధికారి ఇటీవలే కార్పొరేట్ ఆఫీసు(నాన్‌ఫోకల్ ఫోస్టు) నుంచి మేడ్చల్ డీఈ (ఫోకల్ పోస్టు)కు బదిలీ కావడం విశేషం. ♦ మణికొండలోని ఓ బహుళ అంతస్తుల భవనానికి విద్యుత్ కనెక్షన్ కోసం వర్క్స్ ఎస్టిమేషన్కు భవన యజమాని రవీందర్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకుగాను సైబర్‌సిటీ డీఈ టెక్నికల్ ముత్యం వెంకటరమణ రూ.25 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆ భవనం పనులు దక్కించుకున్న విద్యుత్ కాంట్రాక్టర్ శివకుమార్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం సాయంత్రం డీఈ వెంకటరమణ కాంట్రాక్టర్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మచ్చుకు కొన్ని కేసులు: ♦ సెప్టెంబర్‌లో లైన్మెన్ రాజేందర్ గచ్చిబౌలిలోని నిర్మాణంలో ఉన్న భవనానికి మీటర్ బిగించేందుకు రూ.60వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. ♦ నవంబర్‌లో కొండాపూర్ ఏడీఈ డి.శ్యాంమనోహర్ రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ట్రాన్స్ఫార్మర్, ఆరు మీటర్లు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేశారు. ♦ మియాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌కు మీటర్ అమర్చేందుకు ఓ సోలార్ విద్యుత్ సంస్థ ప్రతినిధి నుంచి లంచం తీసుకుంటున్న మియాపూర్ ఏడీఈ రమేష్, సబ్ ఇంజినీర్ పాండులను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఏడీఈ రమేష్‌పై 2008లోనే ఏసీబీ కేసు నమోదైంది. కేసు విచారణలో ఉన్న సమయంలోనే ఆయన మరోసారి పట్టుబడటం విశేషం. ♦ షాపూర్‌నగర్ ఏఈ చిత్తరంజన్ సహా యూసఫ్‌గూడ ఏఈ సుధాకర్ కూడా ఇటీవల ఏసీబీకి పట్టుబడ్డవారిలో ఉన్నారు. ♦ 2017 జూన్‌లో అసెస్మెంట్స్ ఎస్ఈ శివాజీ రాఠోడ్ ఐమ్యాక్స్ థియేటర్లో వినియోగదారుల నుంచి రూ.80వేలు లంచం తీసుకుంటూ దొరికాడు. ♦ గత ఏడాది ఏప్రిల్‌లో షేక్‌పేట ఏఏఈ షేక్‌బాబా మెహిదీపట్నంలోని అపార్ట్‌మెంట్‌కు ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసేందుకు రూ.30వేలు తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. -
అరగంటలో వస్తానని..అనంత లోకాలకు...
సెలవు రోజున నాన్నతో కాలక్షేపం చేద్దామనుకుంది ఆ కూతురు. ఆఫీసుకు బయల్దేరుతున్న తండ్రితో అదే మాట చెప్పింది. ‘లేదురా నాన్నా.. పని ఉంది. అది ముగించుకుని త్వరగానే వచ్చేస్తా’నంటూ ఆ బిడ్డను ఊరడించాడు. ఆఫీసు నుంచి తిరుగు ప్రయాణమయ్యేసరికే ఆలస్యమైంది. చీకటి పడింది. భార్యకు ఫోన్ చేసి, ‘‘బాగా ఆకలేస్తోంది... రోటీలు తింటాను... రెడీ చేయి. దారిలో ఉన్నా.. అరగంటలో వస్తాను’’ అని ఫోన్ చేసి చెప్పాడు. అరగంట దాటింది. గంట.. రెండు గంటలు. ఆయన రాలేదు. ఫోన్ స్విచ్చాఫ్. ఖమ్మం / రఘునాథపాలెం: మండలంలోని ఇల్లెందు–ఖమ్మం ప్రధాన రోడ్డులో మంచుకొండ–శివాయిగూడెం మధ్యలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఇల్లెందు మున్సిపల్ డీఈ వాంగుడోత్ భోజ్యా(46) మృతిచెందారు. మృతదేహాన్ని సోమవారం ఉదయం గమనించారు. ఎస్ఐ ఎస్ క్రిష్ణ, భోజ్యా కుటుంబీకులు తెలిపిన వివరాలు... రఘునాథపాలెంలోని ప్రగతి ప్రైడ్ నివాస సముదాయంలో భోజ్యా కుటుంబం నివసిస్తోంది. ఆదివారం రాత్రి ఆఫీసు నుంచి ఇంటికి బైక్‌పై బయల్దేరారు. మంచుకొండ సమీపంలో ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో బైక్ అదుపు తప్పింది. రోడ్డు పక్కనున్న కంప చెట్లలోకి దూసుకెళ్లింది. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు భార్య పద్మ, పదేళ్ల లోపు వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏడాది క్రితమే ఇల్లెందుకు... కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాకు చెందిన భోజ్యా, ఏడాది క్రితమే ఆదిలాబాద్ నుంచి బదిలీపై ఇల్లెందు మున్సిపాలిటీకి వచ్చారు. తన ఇద్దరు కుమార్తెలను మంచి పాఠశాలలో చదివించాలనుకున్నారు. పాఠశాలకు, ఇల్లెందుకు అనువుగా ఉన్న రఘునాథపాలెంలోని ప్రగతి ప్రైడ్ నివాస సముదాయంలోని ఇంటిలో ఉంటున్నారు. ఆదివారం రోజున కూడా ఆఫీసుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో, గమ్యానికి చేరకుండానే అనంత లోకానికి వెళ్లిపోయారు. దారిలో ఉన్నా.. ఆకలేస్తోంది.. ‘‘దారిలో ఉన్నాను.. ఆకలేస్తోంది.. రోటీలు చేయి.. అని ఫోన్ చేశారు. అరగంటలో వస్తానన్నా రు. అరగంట దాటినా రాలేదు. చూసి.. చూసి.. ఫోన్ చేస్తే.. స్విచ్చాఫ్. మేమంతా భయపడ్డాం’’ అని, భోజ్యా భార్య చెప్పారు. భోజ్యా కుటుంబీ కులు, బంధువులు కలిసి ఆ రోజు రాత్రంతా ఇల్లెందు నుంచి రఘునాథపాలెం వరకు రహదారి వెంట వెతికారు. జాడ తెలియలేదు. సోమవారం ఉదయం రోడ్డు పక్కన ముళ్ల చెట్ల చాటున విగతుడిగా కనిపించారు. భార్యాపిల్లలు గుండెలు పగిలేలా ఏడ్చారు. సెల్ ఫోన్ పగిలిపోయింది. భోజ్యా దేహంపై తీవ్ర గాయాలున్నాయి. బోర్ కొడుతోంది డాడీ అన్నా... ‘‘రాత్రి ఏడు గంటల ప్రాంతంలో డాడీ ఫోన్ చేశారు. అప్పుడు నేను మాట్లాడా. డాడీ వస్తున్నావా.. నాకు బోర్ కొడుతోంది.. అన్నాను. అరగంటలో ఇంట్లో ఉంటానన్నారు. మళ్లీ ఫోన్ చేస్తే మోగలేదు’’– ఏడుస్తూ చెప్పింది భోజ్యా కుమార్తె టీనా. కేసు నమోదు భోజ్యా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి ఎస్ఐ క్రిష్ణ తరలించారు. కేసు నమోదు చేశారు. రాత్రివేళ, ఎదు రుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో రోడ్డు పక్కకు బైక్ దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగుంటుందని ‘సాక్షి’తో ఎస్సై చెప్పారు. ఘన నివాళి డీఈ మృతదేహాన్ని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్, తోటి అధికారులు, ఉద్యోగులు, బంధువులు సందర్శించారు. ఘనం గా నివాళులర్పించారు. భోజ్యా తండ్రి, భార్య, పిల్లలు, బంధువులు భోరున విలపించారు. -
పైరవీలదే పవర్
–విద్యుత్ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు – ప్రక్రియ ముగిసిన తర్వాత మార్పులు, చేర్పులు – పదుల సంఖ్యలో ఈపీడీసీఎల్ మోడిఫికేషన్ ఉత్తర్వులు – తాజాగా రాజమహేంద్రవరం సర్కిల్లో ముగ్గురు డీఈల బదిలీ సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీ ఈపీడీసీఎల్) బదిలీల్లో పైరవీలు చేసిన వారిదే పై చేయి అయింది. మునుపెన్నడూ లేని విధంగా బదిలీల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. సీనియారిటీ పరిగణనలో ట్రాన్స్‌కో మార్గదర్శకాలకు విరుద్ధంగా జూన్ 25న బదిలీలు చేసిన ఈపీడీసీఎల్ తర్వాత కూడా పదుల సంఖ్యలో మార్పులు చేర్పులు చేసింది. కొందరు అధికారులు ఆపరేషన్ విభాగాల్లో పోస్టుల కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేయడంతో మూడేళ్ల కాలపరిమితి ముగియకపోయినా ఆ స్థానంలో ఉన్న అధికారిని బదిలీ చేస్తూ పైరవీలు చేసుకున్న అధికారికి మోడిఫికేషన్ ద్వారా ఆ పోస్టును కట్టపెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు, మోడిఫికేషన్ల వ్యవహారం ఇప్పటికీ సాగుతూనే ఉంది. తమకు జరిగిన అన్యాయంపై కొందరు అధికారులు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చేయడంతో వారికి న్యాయం చేసేందుకు తాజాగా కొత్తవారిని బలిచేశారు. శనివారం రాజమహేంద్రవరం సర్కిల్లో మరో మగ్గురు డీఈలను బదిలీ చేస్తూ ఈపీడీసీఎల్ నిర్ణయం తీసుకుంది. కాకినాడ ఆపరేషన్స్ డీఈగా పని చేస్తున్న పి.సాల్మన్‌రాజును అమలాపురం ఆపరేషన్స్ డీఈగా పంపుతూ ఆ స్థానంలో ఉన్న ఎన్.రమేష్‌ను రాజమహేంద్రవరం ట్రాన్స్ఫార్మర్స్ డీఈగా బదిలీ చేసింది. అక్కడ పని చేస్తున్న డీఈ జి.ప్రసాద్‌ను కాకినాడ ఆపరేషన్స్ డీఈగా నియమించింది. ఒకరికి ఏడాదిలోనే రెండు బదిలీలు అప్పటి వరకూ ఆపరేషన్స్ విభాగంలో పని చేసిన కొందరు అధికారులు బదిలీల్లో అప్రధానమైన ట్రాన్స్ఫార్మర్స్, కన్స్ట్రక్షన్ తదితర విభాగాలకు వెళ్లారు. వీరిలో కొందరు తిరిగి ప్రధానమైన ఆపరేషన్స్ విభాగంలో పోస్టు కోసం పెద్ద ఎత్తున పైరవీలు చేశారు. ఫలితంగానే ఈపీడీసీఎల్ బదిలీలు ముగిసిన తర్వాత పదుల సంఖ్యలో మార్పులు చేర్పులు (మోడిఫికేషన్స్) చేసింది. దీంతో అనేక మంది అధికారులకు అన్యాయం జరిగింది. తాజాగా జరిగిన బదిలీల్లో కాకినాడ డివిజన్ ఆపరేషన్స్ నుంచి అమలాపురం ఆపరేషన్స్‌కు వచ్చిన పి.సాల్మన్‌రాజు జూన్ 25న జరిగిన బదిలీల్లో రాజమహేంద్రవరం ట్రాన్స్ఫార్మర్స్ డీఈగా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆపరేషన్స్ నుంచి వచ్చారు. అయితే నాలుగు రోజులకే సాల్మన్‌రాజును కాకినాడ ఆపరేషన్స్ డీఈగా పంపుతూ బదిలీలో మోడిఫికేషన్ చేశారు. అక్కడ రెండేళ్లుగా పని చేస్తున్న జి.ప్రసాద్‌ను సాల్మన్‌రాజు స్థానంలోకి పంపారు. ఒక పోస్టులో మూడేళ్లు, ఒక స్టేషన్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారే బదిలీకి అర్హులు. అయితే కేవలం రెండేళ్ల సీనియారిటీ ఉన్న ప్రసాద్‌ను సాల్మన్‌రాజు కోసం మోడిఫికేన్ ద్వారా బదిలీ చేశారు. మళ్లీ ఇప్పుడు ప్రసాద్‌ను కాకినాడకు పంపేందుకు అమలాపురం ఆపరేషన్స్ డీఈగా ఉన్న రమేష్‌ను బలి చేశారు. కాకినాడ డివిజన్ ఆపరేషన్స్ డీఈగా ఉన్న సాల్మన్ రాజును అమలాపురం డీఈగా పంపి అక్కడ ఏడాది నుంచి పని చేస్తున్న ఎన్.రమేష్‌ను రాజమహేంద్రవరం ట్రాన్స్ఫార్మర్స్ డీఈగా బదిలీ చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి ఏడాది క్రితం అమలాపురం వచ్చిన రమేష్‌ను ఇంతలోనే తిరిగి బదిలీ చేశారు. కాగా, జూన్‌లో జరిగిన బదిలీల్లో ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లు సీనియారిటీ నిర్ధారణలో భిన్నంగా వ్యవహరించాయి. ఎస్పీడీసీఎల్ ఒక లిస్టు తయారు చేయగా, ఈపీడీసీఎల్ మూడు లిస్టులు తయారు చేసి చివరకు జూనియర్లను బదిలీ చేయడంతో ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాలు మిన్నకుండిపోయాయి. -
ఆ డీఈ కీచకుడే!
– మరిన్ని వెలుగులోకి వచ్చిన ఆపరేషన్స్ డీఈ రాసలీలలు – సీఎస్సీ ఉద్యోగిని, ఆమె సోదరితోనూ అదే వ్యవహారం – ఓ టెక్నికల్ ఏఈకీ తప్పని ఇబ్బదులు – గతంలో పనిచేసిన డివిజన్‌లోనూ డ్రైవరు భార్యకు తప్పని వేధింపులు – ఫలితంగా రూ.లక్షల వాహనం, ఆపరేటర్ పోస్టు నజరాన – జ్వరం పేరుతో 3 రోజులు సెలవు కోరినట్లు సమాచారం కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ శాఖ (ఎస్పీడీసీఎల్) డీఈ చీకటి కార్యకలాపాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అదే సంస్థలోని లారీ డ్రైవర్ భార్యతో డీఈ నడిపిన ‘చీకటి లీలలు’ పై ‘సాక్షి’లో శనివారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పలువురు ఉద్యోగులు, బాధితులు మరిన్ని డీఈ లీలలను బయటకు తీసుకొచ్చారు. గతంలో ఆ డీఈ పనిచేసిన చోట్ల జరిపిన వ్యవహారాలను వివరిస్తున్నారు. కింది స్థాయి ఉద్యోగుల అవసరాలు, బలహీనతలను ఆసరా చేసుకొని లోబరుచుకోవడం ఆయనకు అలవాటుగా మారిందని ఆరోపిస్తున్నారు. – మరిన్ని ఉదాహరణలు: విద్యుత్ శాఖ ఓ ఆపరేషన్స్ డివిజన్ డీఈ చేపట్టిన రాస క్రీడలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఓ సీఎస్సీ సెంటర్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిణితో ఇదే తంతు కొనసాగించిన విషయం వెలుగులోకి వచ్చింది. అంతటితో ఆగని ఆయన ఆమె సోదరితోనూ ఆలాగే వ్యవహరించినట్లు సమాచారం. గతంలో ఇదంతా ప్రచారం జరగడంతో జిల్లా కేంద్రంలో పనిచేసే అధికారి విచారణ చేపట్టి సమస్య వ్యాపించకుండా అణిచివేసినట్లు ఆశాఖ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఇటు ఒక టెక్నికల్ విభాగంలో పనిచేసిన ఓ ఏఈకి సైతం ఇబ్బందులకు గురి చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో పనిచేసిన డివిజన్లో ఈయన చేసిన ఘనకార్యం ఇంతా అంత కాదు. అక్కడ కూడా డ్రైవర్ భార్యతో సన్నిహితంగా ఉన్న కారణంగా రూ.4లక్షలు వెచ్చించి మూడు టన్నుల వాహనం కొనుగోలు చేసి బహుమానంగా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వాహనం ప్రస్తుతం సంస్థకే అద్దె ప్రతిపాదికన నడుస్తోంది. దీంతోపాటు ఓ ఆపరేటర్ పోస్టును కూడా నజరానా ఇచ్చినట్లు సమాచారం. – గతంలో పని చేసిన చోట్ల ఆరోపణలే: ఆ కరెంటు డీఈ గతంలో పనిచేసిన చోట్లలో కూడా ఇలాంటి ఆరోపణలు భారీగా ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. కర్నూలు చుట్టు పక్కన ఉన్న జిల్లాలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. అక్కడ రాసలీలలు, మామూళ్ల దంద నడపడం, వివిధ కాంట్రాక్టు పోస్టులు అమ్ముకోవడం, మామూళ్లు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడం అంతా ఆయన ఖాతాలోనే ఉన్నట్లు సమాచారం. – జ్వరం పేరుతో సెలవులోకి... వ్యవహారం అంతా బయటకు పొక్కి పోలీసు, కేసుల దాక వెళ్లడం, సాక్షిలో ఆయన చీకటిలీలలపై కథనం ప్రచురితం కావడంతో ఆ డీఈకి జర్వం వచ్చినట్లు ఉంది. ‘సాక్షి’ పత్రికలో కథనం చూసిన మరుక్షణమే తనకు జ్వరం వచ్చిందని, మూడు రోజులు సెలవుపై వెళ్తున్నట్లు పై అధికారులకు మెసేజ్ పెట్టినట్లు సమాచారం. – ఎస్పీకి ఫిర్యాదు చేసిన డ్రైవర్? తనకు చేసిన అన్యాయం పట్ల ఆ డ్రైవర్ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఆ డీఈ తన భార్య పట్ల అసభ్యకంగా వ్యవహరించడంతోపాటు ఆమెతో కేసు పెట్టించి అరెస్టు చేయించారని, ఆ డీఈపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి న్యాయం చేయాలని విన్నవించుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కేసును రాజీ చేసుకునేందుకు బాధితులు, అటు స్థానిక పోలీసులతో తీవ్ర స్థాయిలో యత్నిస్తున్నట్లు విద్యుత్ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. -
నత్తేనయం !
► మూడేళ్లుగా సాగుతున్న నకిరేకల్–నల్లగొండ రోడ్డు విస్తరణ ► ఏడాది కాలంగా పనులకు బ్రేక్ ► గడువుముగిసి ఏడాది ► ఎక్కడి పనులు అక్కడే.. ► ప్రమాదకరంగా ప్రయాణాలు నకిరేకల్ : అధికారుల నిర్లక్ష్యమో.. కాంట్రాక్టర్ల పరిహాసమో గానీ రెండేళ్లలో పూర్తికావాల్సిన పనులు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలోని రహదారుల విస్తరణ పనులు నత్త కంటే మిన్నగా సాగుతున్నాయి. రోడ్డు విస్తరణ జరుగుతుందనడంతో ఆనందించిన ప్రజలు, ప్రయాణికులకు నిరాశే మిగులుతోంది. జిల్లాలోని కీలకమైన జాతీయ రహదారిగా మారనున్న నకిరేకల్ – నాగార్జునసాగర్ రోడ్డు పనులు ప్రారంభమై మూడేళ్లు గడుస్తోంది. అయినా.. నేటికీ సగమైనా పూర్తికాలేదు. నిత్యం వేల సంఖ్యలో ప్రజలు ఈ రహదారి మీదుగా జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగిస్తారు. అయితే..విస్తరణ పనుల్లో భాగంగా రహదారి మొత్తం తవ్వారు. అక్కడక్కడా కొంత మేరకు ఒక వైపు రోడ్డు నిర్మాణం చేసి మరోవైపు తవ్వడంతో ఎప్పుడు ఏ వాహనం గుంతలో పడుతుందోనని ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి. ఈ రహదారి మీదుగా ప్రయాణమంటేనే ప్రజలు బిక్కచచ్చిపోయే స్థితి. కానీ తప్పని పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సివస్తుందని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డ పనులను పూర్తిచేయాలని పలువురు కోరుతున్నారు. 1. అసంపూర్తిగా నిర్మించిన కల్వర్టు 2. నకిరేకల్ – నల్లగొండ మధ్య ఏడాదిగా నిలిచిపోయిన జాతీయ రహదారి విస్తరణ పనులు 3. విస్తరణలో భాగంగా రోడ్డు పక్కన తవ్విన గుంతలు భూసేకరణ జాప్యంతో పనుల నిలిపివేత ఈ రహదారి పనులు భూ సేకరణ జాప్యంతో పడకేశాయి. నకిరేకల్ నుంచి నాగార్జున సాగర్ వరకు జిల్లాలో దాదాపు 86 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి 565 నిర్మాణానికి 2014 మార్చి 13న జీవిఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ సంస్థకు ఈ విస్తరణ పనులను దక్కించుకుంది. 2016 మార్చి 11వ తేదిలోగా ఈ పనులను పూర్తి చేయాల్సి ఉంది. పనుల ప్రారంభించి మూడేళ్లు కావస్తున్నా ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా మారాయి. 100 శాతం పనులలో కేవలం 40శాతం మేర పనులు మాత్రమే పూర్తి చేశారు. ఇంకా 60 శాతం మేర నిర్మాణం పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ మార్గంలో ప్రస్తుతం నల్లగొండ నుంచి హాలియా వరకు రహదారి విస్తరణ పనులు పూర్తి కాగా అధికారుల పర్యవేక్షణ, భూ సేకరణ జాప్యంతో నకిరేకల్ నుంచి వయా తాటికల్ మీదుగా నల్లగొండ వరకు జరుగుతున్న రహదారి పనులు గతేడాది కాలంగా నిలిచిపోయాయి. 2013లో మంజూరు జిల్లా నుంచి ఇప్పటికే హైదరాబాద్ – విజయవాడ, హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారులు వెళ్తున్నాయి. 2013లో కేంద్ర ప్రభుత్వం మూడో జాతీయ రహదారిని జిల్లాకు మంజూరు చేసింది. మహారాష్ట్రలోని సిరోంచ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రేణుగుంట(తిరుపతి) వరకు మొత్తం 643 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, చిత్తూరు జిల్లాల నుంచి ఈ రహదారి వెళ్తుంది. సిరోంచ నుంచి వరంగల్ వరకు, వరంగల్ నుంచి నకిరేకల్, నకిరేకల్ నుంచి రేణిగుంట వరకు మొత్తం మూడు విభాగాలుగా దీన్ని విభజించి మూడు జాతీయ రహదారి నెంబర్లు కేటాయించారు. సిరొంచ నుంచి వరంగల్ వరకు నిర్మించే రహదారికి 363, వరంగల్ – నకిరేకల్ వరకు 365, నకిరేకల్ నుంచి రేణిగుంట వరకు 565గా విభజించి కేటాయించారు. ఏడాదిగా నిలిచిన పనులు ప్రత్యేకించి జిల్లాలోని నకిరేకల్ – నల్లగొండ మధ్యలో ఉన్న 565 నెంబర్ జాతీయ రహదారి విస్తరణ పనులు భూ సేకరణతో ఏడాది కాలంగా నిలిచిపోయింది. నకిరేకల్ నుంచి నాగార్జునసాగర్ వరకు 86 కిలో మీటర్ల పొడవున నిర్మించే 565 నెంబర్ జాతీయ రహదారి నిర్మాణాఇకి రూ.190 కోట్లు కేటాయించారు. 2014 మార్చిలో జీవిఆర్ ఇన్ఫ్రా సంస్థ ఈ పనుల కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. 2016 మార్చి 12 నాటికి 86 కిలో మీటర్ల మేర రెండు వరుసల జాతీయ రహదారి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. నల్లగొండ నుంచి హాలియా వరకు మాత్రమే విస్తరణ పనులు పూర్తి చేశారు. నకిరేకల్ – నల్లగొండ మధ్యలోని రహదారి వెంట ఉన్న కొందరు రైతులు తమ భూములు కోల్పోతున్న నేపథ్యంలో కోర్టును ఆశ్రయించారు. దీంతో నిర్మాణ పనులకు ఏడాది కాలంగా పూర్తిగా బ్రేక్ పడింది. ప్రమాదపు అంచున ప్రయాణం నకిరేకల్ నుంచి వయా తాటికల్ మీదుగా నల్లగొండకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మొత్తం నకిరేకల్ నుంచి వయా తాటికల్ మీదుగా పానగల్ వరకు 21 కిలో మీటర్ల సింగిల్ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని జాతీయ రహదారిగా గుర్తించి విస్తరణకు శ్రీకారం చుట్టారు. రోడ్డు విస్తరణ అవుతుంది కదా ఇక రాకపోకలు ఎంతో సాఫీగా సాగిద్దామనుకున్న వాహనదారులు, ప్రయాణికుల ఆశలు నెరవేరడం లేదు. ఈ రహదారి మొత్తం పూర్తిగా పెకిలించి నిర్మాణ పనులు ఎక్కడికక్కడే వదిలివేశారు. దీంతో రోడ్డు పక్కన గుంతలు, కంకర, మట్టి దుమ్ముతో ప్రయాణికులు, వాహనదారులు ఇటుగా వెళ్లాలంటే జంకుతున్నారు. గత వర్షాకాలంలో రోడ్డు వెంట ఉన్న గుంతల్లో నీరు నిలిచి ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో పలువురు ప్రమాదాల బారిన పడిన ఘటనలు లేకపోలేదు. విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో హెచ్చరికల బోర్డులు కూడా నామమాత్రంగా ఏర్పాటు చేశారు. రాత్రి పూట ఒక వైపు తవ్విన రహదారి కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారు. సత్వరమే పనులు పూర్తి చేయాలి నకిరేకల్ వయా తాటికల్ మీదుగా నల్లగొండకు చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనులు సత్వరమే పూర్తి చేయాలి. రోడ్డు పనులు పూర్తికాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ మంది ద్విచక్రవాహనదారులు ఈ రహదారి మీదుగా నల్లగొండకు రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు విస్తరణ పనులతో పూర్తిగా అస్తవ్యస్తంగా మారి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఈ విషయంలో సంబంధిత కాంట్రాక్ట్ సంస్థ చొరవ చూపి పూర్తి చేయాలి. – కొండయ్య, తాటికల్, నకిరేకల్ మండలం త్వరలోనే పనులు ప్రారంభిస్తాం నకిరేకల్ – పానగల్ మధ్య అసంపూర్తిగా ఉన్న జాతీయ రహదారి విస్తరణ పనులను త్వరలోనే ప్రారంభిస్తాం. ప్రస్తుతం భూ సేకరణ వల్ల పనులు నిలిచిపోయాయి. కొందరు రైతులు భూములు కోల్పోతున్నందున కోర్టును ఆశ్రయించారు. నకిరేకల్ నుంచి పానగల్ వరకు రోడ్డు వెంట 33 ఫీట్ల వరకు మాత్రమే రోడ్డుకు సంబంధించిన భూమి ఉంది. మిగతా భూమి అంతా ప్రైవేటు వ్యక్తులది. మొత్తం ఈ రహదారి వెంట భూములు కోల్పోతున్న వారికి సుమారుగా రూ.70 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత భూ సేకరణ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రతిపాదించాం. త్వరలోనే ఆమోదం కూడా వస్తుంది. తర్వాత విస్తరణ పనులు ప్రారంభించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – ప్రవీణ్‌రెడ్డి, డీఈ, ఎన్హెచ్ఏఐ, నల్లగొండ -
సెలవులో డీసీ గాయత్రి దేవి
కర్నూలు(న్యూసిటీ) : దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉపకమిషనర్ బి.గాయత్రి దేవి శుక్రవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు సెలవుపై వెళ్లారు. కర్నూలు సహాయ కమిషనర్ సి.వెంకటేశ్వర్లు ఇన్చార్జిగా ఉంటారు. ఈ మేరకు కమిషనర్ వై.వి.అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలంలో ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు ఇన్చార్జి ఈఓగా గంజి మల్లికార్జున ప్రసాద్‌ను నియమించారు. -
టాటా గ్రూపు కంపెనీల వివరణ కోరిన సెబీ...
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్పొరేట్ గ్రూపు అయిన టాటాల యాజమాన్యం విషయంలో జరుగుతున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో కేపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వీటిపై దృష్టిసారించింది. కార్పొరేట్ పరిపాలనా నియమాలు, లిస్టింగ్ నిబంధనల ఉల్లంఘన జరిగిందా అన్న అంశాలను పరిశీలిస్తోంది. టాటా గ్రూపు చైర్మన్ పదవి నుంచి అవమానకరరీతిలో ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ... టాటా గ్రూపు కంపెనీలకు సంబంధించి 1.18 లక్షల కోట్ల రూపాయల నష్టాలను చూపించాల్సి ఉందంటూ పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాటా గ్రూపు లిస్టెడ్ కంపెనీల నుంచి సెబీ వివరణ కోరింది. ఈ మేరకు టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇండియన్ హోటల్స్, టాటా టెలీసర్వీసెస్, టాటా పవర్ సహా గ్రూపులోని ఇతర కంపెనీలకు సెబీ నుంచి ఆదేశాలు అందాయి. అన్ని అంశాలపై పూర్తి వివరాలివ్వాలని ఎక్స్ఛేంజ్లు కూడా టాటా గ్రూపు కంపెనీలకు నోటీసులు జారీ చేశాయి. మీడియాలో వచ్చిన వార్తలపై వివరణ ఇవ్వాలని ప్రతీ అంశంపై క్రమ పద్ధతిలో వివరాలు చెప్పాలని ఆదేశించాయి. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్
కాజీపేట : ఫాతిమానగర్ చౌరస్తాలో ఆదివారం ఉద యం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు స్వల్ప గాయాలపాలైనట్లు సీఐ రమేష్‌కుమార్ తెలిపారు. ఆదివారం కాజీపేట పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెడ్డికాలనీకి చెందిన ఉప్పునూతుల వీరాచారి 8వతరగతి చదువుతున్న తన కూతురు ఝాన్సీ(13)ని ట్యూషన్ కోసం సిద్ధార్థనగర్‌కు తీసుకొస్తున్నాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న వీరాచారి కు మారుడు విశ్వజ్ఞ(20) ద్విచక్ర వాహనంపై వస్తానంటూ వెంట వచ్చాడు. దర్గారోడ్డు నుంచి సిద్ధార్థనగర్‌కు వెళ్లడానికి రోడ్డు క్రాస్ అవుతున్న వీరాచారి ద్విచక్రవాహనాన్ని కాజీపేట వైపు నుంచి వేగంగా బ్రిడ్జి దిగుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి ఢీకొట్టింది. ద్విచక్రవాహనం వెనుక భాగంలో కూర్చున్న విశ్వజ్ఞ తీవ్రంగా గాయపడగా తండ్రి, కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఉదయం వాకింగ్‌కు వచ్చిన వ్యక్తులు వారిని గుర్తించి 108లో ఆసుపత్రికి తరలించారు. విశ్వజ్ఞ పరి స్థితి విషమంగా ఉండటంతో నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స అందించేందుకు నిరాకరించాయి. వైద్యుల సూచన మేరకు సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ విశ్వజ్ఞ మృతిచెందాడు. ప్రమాదానికి కారకుడైన ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. వీరాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. -
ఆటో, లారీ ఢీకొని యువకుడి దుర్మరణం
మరో నలుగురికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం హసనుపర్తి : ఆటో, లారీ ఢీకొని ఓ యువకుడు మృతిచెందగా, మరో నలుగురికి గాయాలైన సంఘటన హన్మకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిలోని బాహుపేట క్రాస్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. నగరంలోని మండిబజార్‌కు చెందిన షేక్ షకీల్ అఫ్సర్(17), షేక్ గఫార్, ఎండీ ఫైజల్, ఎండీ రియాజ్, ఎండీ సమీర్(ఆటోడ్రైవర్) మంగళవారం రాత్రి వరంగల్ నుంచి బిజిగిరీ షరీఫ్ ఉత్సవాలను బయల్దేరారు. అయితే బాహుపేట సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో షేక్ షకీల్ అఫ్సర్ అక్కడికక్కడే మృతిచెందగా గఫార్, ఎండీ ఫైజల్, రియాజ్, ఆటో డ్రైవర్ సమీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో సమీర్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇనుస్పెక్టర్ రవికుమార్ తెలిపారు. రోడ్డుపై ఉన్న లారీ టైరే కారణం ? ఈ ప్రమాదానికి మరో లారీ టైరే కారణమని పోలీసులు నిర్ధారించారు. హన్మకొండ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ బాహుపేట సమీపంలో పంక్చర్ కావడంతో డ్రైవర్ రాంVŠ æరూట్లో లారీని నిలిపివేసి స్టెపినుటైర్ విప్పి రోడ్డుపై అడ్డంగా పెట్టి టైర్ నట్లు విప్పుతున్నాడు. ఈ క్రమంలో కరీంనగర్ వైపు నుంచి వరంగల్ వైపునకు వస్తున్న లారీ ఒకేసారి రోడ్డుపై అడ్డంగా ఉన్న టైర్‌పైకి ఎక్కి అదే వేగంతో ఎదురుగా వస్తున్న ఆటోపైకి దూసుకెళ్లింది. దీంతో ఆటో నుజ్జునుజ్జయింది. ఫలితంగా ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. -
భద్రాద్రిలో అసలేం జరుగుతోంది?
విగ్రహాల బంగారు తాపడంపై ‘దేవాదాయ’ వివరణ కోరిన సీఎం సాక్షి, హైదరాబాద్: భద్రాచలం శ్రీరామచంద్రస్వామి దేవాలయంలో స్వామివారి పురాతన విగ్రహాల బంగారు తాపడంలో గోల్‌మాల్‌పై సీఎం కేసీఆర్ దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్‌ను వివరణ కోరారు. రామదాసు కాలం నాటి పురాత న విగ్రహాలకున్న బంగారు తాపడం జీర్ణం కావటంతో కొత్తవి చేయించే క్రమంలో జరిగిన గందరగోళంపై ఇటీవల పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ గందరగోళమేంటో, అసలు ఆలయంలో జరుగుతున్న పనులేంటో తనకు తెలపాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం సీఎం కార్యాలయం నుంచి దేవాదాయశాఖ కార్యదర్శి కార్యాలయానికి శ్రీముఖం అందింది. విగ్రహాల తాపడం కోసం ఎంత బంగారాన్ని కరిగించారు, దాని నాణ్యత, విలువ, అందుకు దేవాదాయశాఖ నుంచి అనుమతులున్నాయా, కొత్తగా మరికొంత బంగారాన్ని కరిగించేందుకు నగరంలోని మింట్‌కు తరలించటం లాంటి అంశాలపై ఎలాంటి విషయాలూ బయటకు పొక్కకుండా జాగ్రత్త పడటంపై అనుమానాలు వెల్లువెత్తాయి. దీనిపై దేవాదాయశాఖ కమిషనర్ శివశంకర్ అధికారుల వివరణ కోరారు. ఈ విషయంలో అధికారులు వ్యవహరించిన తీరును కూడా ఆయన తప్పుపట్టినట్టు తెలిసింది. మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా దీనిపై అధికారులను వివరణ కోరారు. మీడియాపై ఆంక్షలు భద్రాచలం: భద్రాచలం దేవ స్థానం అధికారులు తమ తప్పిదాలు బయటపడకుండా ఉండేందుకు ఏకంగా మీడియాపైనే ఆంక్షలు విధించారు. ఆలయ ఉద్యోగులు, అధికారులు, వైదిక సిబ్బంది తన అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడటానికి వీల్లేదంటూ ఈఓ జ్యోతి ఈ నెల 1న అత్యవసర సర్క్యులర్ జారీ చేశారు. ఇటీవల కాలంలో ముఖ్యమైన విషయాలు తన అనుమతి లేకుండానే మీడియూకు తెలియటం వల్ల దేవస్థానం కీర్తిప్రతిష్టలకు భంగం కలిగించేలా కథనాలు వచ్చాయని అందులో పేర్కొన్నారు. ఇక నుంచి ఆలయ సమాచారాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి అనుమతి మేరకు పేషీ ద్వారానే మీడియాకు ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకు భిన్నంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలావుంటే... తొందపాటు నిర్ణయాలతో విమర్శల పాలవుతున్న ఈఓ జ్యోతి హైదరాబాద్‌కు బదిలీ అయినట్టు ప్రచారం సాగుతోంది. -
నీటి పారుదల శాఖ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి
రూ.10 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు ప్రొద్దుటూరు (వైఎస్సార్ జిల్లా): వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీలో ఉంటున్న నీటి పారుదల శాఖ డీఈ బుక్కె గోపాల్ నాయక్ ఇంటిపై బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కర్నూలు జిల్లా శ్రీశైలం కుడికాలువ ప్రాజెక్టు పరిధిలోని బనగానపల్లె కార్యాలయంలో డీఈగా పని చేస్తున్న ఈయన చాలా ఏళ్లుగా ప్రొద్దుటూరులో ఉంటున్నారు. ఇతను అక్రమంగా అస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో ఏసీబీ కడప డీఎస్పీ ఎన్.నాగరాజు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. గోపాల్ నాయక్‌కు హైదరాబాద్‌లో మూడు, ప్రొద్దుటూరులో 10 ఇళ్ల స్థలాలు, ప్రస్తుతం ఉంటున్న ఇంటితోపాటు పెన్నానగర్లో మరో రెండు ఇళ్లు ఉన్నాయన్నారు. గోపవరం, కామనూరు గ్రామాల పరిధిలో 13 ఎకరాల భూమి, కడప పరిధిలోని రామరాజుపల్లె వద్ద 70 సెంట్ల స్థలం ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రొద్దుటూరులోని ఇంటిలో 190 గ్రాములు, ఎస్బీఐ లాకర్లో 20 తులాల బంగారం ఉందని చెప్పారు. ఒక ఇన్నోవా, మరో షిఫ్ట్ కారుతోపాటు రెండు మోటార్ సైకిళ్లు ఉన్నాయన్నారు. రిజిస్టర్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ.3 కోట్లు, మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.10-12 కోట్లు ఉంటుందన్నారు. డీఈ బంధువులు ఉంటున్న సుండుపల్లెలో కూడా తనిఖీలు చేశామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఆయన్ను రిమాండ్‌కు తరలిస్తున్నామని చెప్పారు. దాడుల్లో తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల పరిధిలో పనిచేస్తున్న సీఐలు సుధాకర్‌రెడ్డి, శివకుమార్, శంకర్‌నాయక్ పాల్గొన్నారు. -
కళ్యాణదుర్గం డీఈని నిర్బంధించిన బాధితులు
కళ్యాణదుర్గం (అనంతపురం) : ఇంటి బిల్లులు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్న డీఈ, ఏఈలను స్థానికులు నిర్బంధించారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం హౌసింగ్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. డీఈ శివశంకర్ నాయక్, ఏఈ రంగనాయక్‌లు బిల్లులు ఇవ్వకుండా ప్రజలను తిప్పించుకుంటున్నారని.. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ ఎమ్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బాధితులు హౌసింగ్ కార్యాలయానికి చేరుకొని డీఈని, ఏఈని నిర్బంధించారు. -
కాదంటే తంతాం
ప్రభుత్వం మాది.. మేం చెప్పినట్లే మీరు వినాలి. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాలి. కాదు.. గీదు అంటే కుదర్దు. మీతో ఎలా పని చేయించుకోవాలో మాకు తెలుసు. అవసరమైతే తన్నైనా సరే మీతో పనులు చేయించుకుంటామంటూ ఇద్దరు ఇంజినీరింగ్ అధికారులపై టీడీపీ కౌన్సిలర్లు, మరో కౌన్సిలర్ భర్త(శానిటరీ మేస్ట్రీ) బెదిరించారు. వారి మొహాన పేపర్లు విసిరికొట్టారని విశ్వసనీయ సమాచారం. దీంతో మనస్తాపం చెందిన సదరు అధికారులు సెలవులో వెళ్లిపోవడం కలకలం రేపుతోంది. ప్రొద్దుటూరు టౌన్ ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో డీఈలు గా పని చేస్తున్న రమణ, విజయకుమార్‌రెడ్డిపై టీడీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు సహా అదే పార్టీకి చెందిన మరో కౌన్సిలర్ భర్త(శానిటరీ మేస్త్రీ) సోమవారం రాత్రి బిల్లల మంజూరుకు సంబంధించిన కాగితాలను చేతబట్టుకుని మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. వాటి చూపిస్తూ పాస్ చేయాలని డీఈలపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. రికార్డులు లేనిదే బిల్లులు చేయడానికి సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు. మున్సిపల్ చైర్మన్ గురివిరెడ్డి చాంబర్లో ఉండగానే డీఈలు ఇద్దరినీ అక్కడికి పిలిపించారు. చైర్మన్ సమక్షంలో బిల్లులు చేయాలని కోరగా.. డీఈలు నిరాకరించారు. దీంతో అసహనంతో చైర్మన్ ఎదుటే డీఈలపై వారు రెచ్చిపోయారు. చెప్పినట్లు సంతకాలు పెట్టకపోతే తంతామంటూ దాదాగిరి చేశారు. బిల్లులను తీసుకుని వారి మొహాలపై విసిరికొట్టారు. ఊహించని ఈ పరిణామంతో డీఈలు ఇద్దరూ అవాక్కయ్యారు. మనస్తాపంతో సెలవులో వెళ్లిన డీఈలు టీడీపీ కౌన్సిలర్ల నోటి దురుసుతో తీవ్ర మనస్తాపం చెందిన డీఈలు ‘ఇక మేం పని చేయలేమంటూ’ మున్సిపల్ కమిషనర్‌కు విషయం చెప్పి మెడికల్ సెలవులో వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఆ సమయంలో కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ఇద్దరూ అందుబాటులో లేకపోవడంతో రెండు సిమ్‌కార్డులను కార్యాలయంలోని ఓ అధికారికి అప్పగించి మెడికల్ లీవ్‌లో వెళ్లిపోయారు.