ఆటో, లారీ ఢీకొని యువకుడి దుర్మరణం | auto lorry de | Sakshi
Sakshi News home page

ఆటో, లారీ ఢీకొని యువకుడి దుర్మరణం

Published Thu, Sep 15 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

ఆటో, లారీ ఢీకొని ఓ యువకుడు మృతిచెందగా, మరో నలుగురికి గాయాలైన సంఘటన హన్మకొండ–కరీంనగర్‌ ప్రధాన రహదారిలోని బాహుపేట క్రాస్‌ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. నగరంలోని మండిబజార్‌కు చెందిన షేక్‌ షకీల్‌ అఫ్సర్‌(17), షేక్‌ గఫార్, ఎండీ ఫైజల్, ఎండీ రియాజ్, ఎండీ సమీర్‌(ఆటోడ్రైవర్‌) మంగళవారం రాత్రి వరంగల్‌ నుంచి బిజిగిరీ షరీఫ్‌ ఉత్సవాలను బయల్దేరారు.

  • మరో నలుగురికి గాయాలు 
  • ఒకరి పరిస్థితి విషమం
  • హసనుపర్తి : ఆటో, లారీ ఢీకొని ఓ యువకుడు మృతిచెందగా, మరో నలుగురికి గాయాలైన సంఘటన హన్మకొండ–కరీంనగర్‌ ప్రధాన రహదారిలోని బాహుపేట క్రాస్‌ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. నగరంలోని మండిబజార్‌కు చెందిన  షేక్‌ షకీల్‌ అఫ్సర్‌(17), షేక్‌ గఫార్, ఎండీ ఫైజల్, ఎండీ రియాజ్, ఎండీ సమీర్‌(ఆటోడ్రైవర్‌)  మంగళవారం రాత్రి వరంగల్‌ నుంచి బిజిగిరీ షరీఫ్‌ ఉత్సవాలను బయల్దేరారు. అయితే  బాహుపేట సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో షేక్‌ షకీల్‌ అఫ్సర్‌ అక్కడికక్కడే మృతిచెందగా గఫార్, ఎండీ ఫైజల్, రియాజ్, ఆటో డ్రైవర్‌ సమీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో సమీర్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు  పోలీస్‌ ఇనుస్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపారు. 
     
    రోడ్డుపై ఉన్న లారీ టైరే కారణం ?
    ఈ ప్రమాదానికి మరో లారీ టైరే కారణమని పోలీసులు నిర్ధారించారు. హన్మకొండ నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తున్న లారీ బాహుపేట సమీపంలో పంక్చర్‌ కావడంతో డ్రైవర్‌ రాంVŠ æరూట్‌లో లారీని నిలిపివేసి స్టెపినుటైర్‌ విప్పి రోడ్డుపై అడ్డంగా పెట్టి టైర్‌ నట్లు విప్పుతున్నాడు.  ఈ క్రమంలో కరీంనగర్‌ వైపు నుంచి వరంగల్‌ వైపునకు వస్తున్న లారీ ఒకేసారి రోడ్డుపై అడ్డంగా ఉన్న టైర్‌పైకి ఎక్కి అదే వేగంతో ఎదురుగా వస్తున్న  ఆటోపైకి దూసుకెళ్లింది. దీంతో ఆటో నుజ్జునుజ్జయింది. ఫలితంగా ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement