ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్
Published Mon, Oct 3 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM
కాజీపేట : ఫాతిమానగర్ చౌరస్తాలో ఆదివారం ఉద యం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు స్వల్ప గాయాలపాలైనట్లు సీఐ రమేష్‌కుమార్ తెలిపారు. ఆదివారం కాజీపేట పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెడ్డికాలనీకి చెందిన ఉప్పునూతుల వీరాచారి 8వతరగతి చదువుతున్న తన కూతురు ఝాన్సీ(13)ని ట్యూషన్ కోసం సిద్ధార్థనగర్‌కు తీసుకొస్తున్నాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న వీరాచారి కు మారుడు విశ్వజ్ఞ(20) ద్విచక్ర వాహనంపై వస్తానంటూ వెంట వచ్చాడు. దర్గారోడ్డు నుంచి సిద్ధార్థనగర్‌కు వెళ్లడానికి రోడ్డు క్రాస్ అవుతున్న వీరాచారి ద్విచక్రవాహనాన్ని కాజీపేట వైపు నుంచి వేగంగా బ్రిడ్జి దిగుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి ఢీకొట్టింది. ద్విచక్రవాహనం వెనుక భాగంలో కూర్చున్న విశ్వజ్ఞ తీవ్రంగా గాయపడగా తండ్రి, కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఉదయం వాకింగ్‌కు వచ్చిన వ్యక్తులు వారిని గుర్తించి 108లో ఆసుపత్రికి తరలించారు. విశ్వజ్ఞ పరి స్థితి విషమంగా ఉండటంతో నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స అందించేందుకు నిరాకరించాయి. వైద్యుల సూచన మేరకు సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ విశ్వజ్ఞ మృతిచెందాడు. ప్రమాదానికి కారకుడైన ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. వీరాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
Advertisement
Advertisement