kajipet
-
వరంగల్ రాజకీయాలలో కాకా పుట్టిస్తున్న.. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ
-
ఆన్లైన్.. విద్యకు లైఫ్ లైన్: గవర్నర్
సాక్షి, కాజీపేట: ఆన్లైన్ విద్యాబోధన కరోనా నేపథ్యంలో లైఫ్‌లైన్‌గా మారిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. కాజీపేటలోని నిట్‌లో మంగళవారం ‘ఆన్లైన్ విద్య – అవకాశాలు – సవాళ్లు’ అంశంపై జాతీయ స్థాయి వెబినార్‌ను నిర్వహించారు. ఈ వెబినార్‌ను హైదరాబాద్ నుంచి ఆన్లైన్ ద్వారా గవర్నర్ ప్రారంభించి మాట్లాడారు. కరోనా విజృంభన విద్యారంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని పేర్కొన్నారు. ఈ సమయంలో విద్యాబోధనను ఆన్లైన్లో కొనసాగిస్తున్నా కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో విద్యాలయాలు మరింత కృషి చేయాలని సూచించారు. ఆదర్శంగా తెలంగాణ కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ఆన్లైన్ విద్యాబోధన అందిస్తూ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలవడం అభినందనీయమని గవర్నర్ పేర్కొన్నారు. కోవిడ్‌కు వాక్సిన్ వచ్చేంత వరకు నేరుగా తరగతి గదుల్లో విద్యాబోధన సాధ్యం కాదని, ఆన్లైన్ బోధనే ఉత్తమమని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, విజ్ఞానం, నైపుణ్యత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో నిట్ ముందంజలో నిలుస్తోందని నిట్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు తెలిపారు. దేశంలో నిర్వహించిన సర్వేలో వరంగల్ నిట్ ప్రథమంగా నిలిచిందని వెల్లడించారు. వెబినార్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆనంద్‌కిషోర్, నిట్ రిజిస్ట్రార్ ఎస్.గోవర్దన్‌రావు, ప్రొఫెసర్లు శ్రీనివాస్, హీరాలాల్, గంగాధరన్‌తో పాటు వివిధ ప్రాంతాల నుండి వెయ్యి మంది ఆన్లైన్ ద్వారా వెబినార్‌లో లో పాల్గొన్నారు. మాట్లాడుతున్న గవర్నర్ తమిళిసై -
కవలలపై కీచక తండ్రి అఘాయిత్యం
సాక్షి, కాజీపేట అర్బన్ : కంచె చేను మేసిన చందంగా కన్న తండ్రి, మేనమామ కలిసి మైనర్లు అయిన కవలలపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఇది. దీనికి సంబంధించి వరంగల్ ఇంతేజార్గంజ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా షీ టీమ్స్ ఏసీపీ బాబురావు శుక్రవారం రాత్రి వివరాలు వెల్లడించారు. వరంగల్ కాశిబుగ్గలోని శ్రీనివాసకాలనీకి చెందిన దంపతులకు 14 ఏళ్ల కవలల కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరి తండ్రి, మేనమామ సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, మూడేళ్ల నుంచి మేనమామ, ఏడాది కాలంగా తండ్రి బాలికలపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అయితే, ఎవరికైనా చెబితే ఏమవుతుందోనన్న భయంతో బాలికలు లోలోపల కుమిలిపోతున్నారు. ఇటీవల వేధింపులు తీవ్రంగా కావడంతో తాము చదువుతున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు విషయాన్ని వెల్లడించారు. దీంతో ఉపాధ్యాయులు షీ టీంకు సమాచారం ఇవ్వగా.. నిందితులను అదుపులోకి తీసుకుని ఇంతేజార్గంజ్ పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ తెలిపారు. మామ లైంగిక వేధింపులు.. కోడలి ఆత్మహత్య నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం మామునూరు: అభం శుభం తెలియని ఓ నాలుగేళ్ల చిన్నారిపై 58 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి యత్నించిన ఘటన శుక్రవారం మధ్యా హ్నం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. తిమ్మాపురం గ్రామంలోని ఓ కాలనీకి చెందిన దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. వీరి ఇంటి పక్కన ఉన్న పొలంలో ఐనవో లు మండలం గర్నెపల్లికి చెందిన చిదురాల యాకయ్య(58) పాలేరుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా మొక్కజొన్న కంకులు ఇస్తానని చేనులోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించా డు. ఇంతలోనే పానను పిలుస్తూ తల్లి రాగా యాకయ్య పారిపోయేందుకు యత్నించాడు. దీంతో ఆయనను బాలిక తల్లిదండ్రులు పట్టుకుని దేహశుద్ధి చేశాక పోలీసులకు అప్పగించా రు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో నకిలీ టీసీ హల్చల్
సాక్షి, కాజీపేట రూరల్: సికింద్రాబాద్ నుంచి బల్లార్షా వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం ఓ నకిలీ టీసీ ప్రయాణికులను బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. అంతేకాకుండా బ్లేడ్‌తో ఒక ప్రయాణికుడిని గాయపరచిన ఘటన ప్రయాణికులలో, రైల్వేశాఖలో కలకలం రేపింది. కాజీ పేట జీఆర్పీ ఎస్సై జితేందర్‌రెడ్డి కథనంప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన గుండే టి రాజేష్(30) భువనగిరిలో కట్టెకోత మిషన్‌లో పనిచేస్తున్నాడు. సాయంత్రం భాగ్యనగర్‌లో భువనగిరికి చేరుకోగా మద్యం సేవించి ఉన్న రాజేష్ ఇంటికి వెళ్లేందుకు రైలెక్కాడు. నేను రైల్వే టీసీనంటూ బోగీల్లో టికెట్ లేని వారు జరిమానా కట్టాలని లేదంటే జైలుకు వెళ్తారని బెదిరించి డబ్బులు వసూల్ చేశాడు. అతడి వద్ద బ్లేడ్‌ను చూపిస్తూ ఒక ప్రయాణికుడిని గాయపరిచాడు. రైలు కాజీపేట జంక్షన్‌కు చేరుకోవడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచా రం ఇవ్వగా అతడిని అదుపులోకి తీసుకుని జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సోమవారం రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. -
ఒకే ఇంట్లో ముగ్గురికి డెంగీ
కాజీపేట: ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లలకు డెంగీ సోకిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని సోమిడి ఎస్సీ కాలనీకి చెందిన మురికిపుడి వినయ్‌కుమార్ ఇద్దరు పిల్లలు, అతని తమ్ముడు విక్రం కుమార్ కుమారుడికి నాలుగు రోజుల కింద తీవ్ర జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆ పిల్లలు డెంగీ వ్యాధితో బాధపడుతున్నట్లుగా ధృవీకరించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై సోమిడి అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి అర్చనను వివరణ కోరగా.. ఒకే ఇంట్లో ముగ్గురికి జ్వరాలు వచ్చిన మాట వాస్తవమేనని, మెరుగైన చికిత్స అందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. -
బడ్జెట్ రైలు ఆగేనా ?
సాక్షి, కాజీపేట : కేంద్రంలో ప్రవేశపెట్టె బడ్జెట్లో రైల్వే పరంగా ఈసారైనా న్యాయం జరిగేనా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రవేశపెట్టే బడ్జెట్లో కాజీపేట జంక్షన్‌కు న్యాయం జరగాలని జిల్లా ప్రజలు, రైల్వే కార్మికులు ఆకాంక్షిస్తున్నారు. నిజాం రైల్వే కాలంలో 1094లో ఏర్పాటైన కాజీపేట దినాదినాభివృద్ధి చెంది కాజీపేట జంక్షన్‌గా ఏర్పడి ఇప్పుడు దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు గేట్వేగా విలసిల్లుతోంది. అయితే, గతంలో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లు, ఇప్పుడు ఉమ్మడిగా ప్రవేశపెడుతున్న సాధారణ బడ్జెట్లకు సంబంధించి ఏటా నిరాశే ఎదురవుతోంది. ఈసారైనా కాజీపేట జంక్షన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న యూనిట్ల నిర్మాణం, రైల్వే లైన్ల నిర్మాణంతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి అడుగులు పడుతాయని భావిస్తున్నారు. ఫిట్‌లైన్ నుండి కొత్త రైళ్లు కాజీపేటలో రూ.15 కోట్ల వ్యయంతో నిర్మాణమవుతున్న ఫిట్‌లైన్ పనులను త్వరగా పూర్తి చేసి కాజీపేట కేంద్రంగా కొత్త రైళ్లు ప్రారంభించాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే జరిగితే కాజీపేట జంక్షన్ నుంచి ముంబై, తిరుపతి, సికింద్రాబాద్ రూట్లలో కొత్త రైళ్లను ఇక్కడి నుంచే ప్రారంభించవచ్చు. తద్వారా కార్మికుల సంఖ్య పెరగడంతో పాటు కొత్తగా రైల్వే కార్యాలయాలు వస్తాయి. మూడో లేన్ కాజీపేట జంక్షన్ మీదుగా బల్లార్షా – విజయవాడ వరకు నిర్మాణంలో ఉన్న మూడో రైల్వే లైన్‌ను పూర్తి చేసేందుకు ఈసారి బడ్జెట్లో పూర్తి స్థాయి కేటాయింపులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ లేన్ పూర్తయితే అయితే న్యూఢిల్లీ, విజయవాడ, హైదరాబాద్ మార్గాల్లో ట్రాఫిక్ తగ్గిపోతుంది. అలాగే, ఆలస్యాన్ని నివారించచ్చు. వడ్డేపల్లి చెరువు కట్లపై రైల్వే లైన్ కాజీపేట వడ్డేపల్లి చెరువు కట్టపై 200 మీటర్ల మేర సర్వే అయిన రేల్ అండర్ రైల్ లైన్ నిర్మాణం, కాజీపేట – బల్లార్షా వరకు సర్వే అయిన నాలుగో లేన్ నిర్మాణానికి బడ్జెట్ కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. సర్వే పూర్తయిన మణుగూరు – రామగుండం లేన్‌కు నిధులు, ఘన్పూర్ – సూర్యాపేట వరకు వయా పాలకుర్తి, కొడకండ్ల మీదుగా సర్వే అయిన లేన్ నిర్మాణానికి ఈ బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని, భూపాలపల్లి రైల్వే లేన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని జిల్లా ప్రజలు గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. కొత్త రైళ్లు, రైళ్ల పొడిగింపు కాజీపేట జంక్షన్ మీదుగా ఈసారి బడ్జెట్లో కొత్త రైళ్లు ఉంటాయా, లేదా అనే చర్చ సాగుతోంది. ఇంకా పద్మావతి ఎక్స్‌ప్రెస్, కరీంనగర్ – తిరుపతి ఎక్స్‌ప్రెస్, షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లను డెయిలీగా మార్చాలనే డిమాండ్ ఉంది. అంతేకాకుండా కాజీపేట జంక్షన్ మీదుగా వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పిస్తూ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. డివిజన్ కల నెరవేరేనా? 1904 సంవత్సరంలో ఏర్పాటైన కాజీపేట రైల్వే స్టేషన్ 115 ఏళ్ల ప్రస్థానంలో డివిజన్ కేంద్రంగా ఏర్పాటు కావాలనేది జిల్లా ప్రజలు, ఇక్కడ పని చేస్తున్న కార్మికుల చిరకాల కోరిక. ఇది ఈసారి బడ్జెట్లో నెరవేరుతుందని అనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్‌ను డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేసినా కాజీపేట జంక్షన్‌ను చేయకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. డివిజన్ ఏర్పాటైతే ఈ ప్రాంత అభివృద్దితో పాటు కొత్త రైల్వే పరిశ్రమలు వస్తాయి. పాలన అందరి చెంతకు చేరుతుంది. కొత్త రైళ్లను ఇక్కడకు ప్రారంభించేందుకు వెసలుబాటు కలుగుతుంది. డివిజన్ స్థాయి రైల్వే భవనాలు, అధికారులు వస్తారు. వ్యాగన్ పీఓహెచ్ షెడ్ కాజీపేట కేంద్రంగా పదేళ్ల క్రితం మంజూరైన రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమ.. ఆ తర్వాత దీని స్థానంలో మంజూరైన వ్యాగన్ పీరియాడికల్ ఓవరాలింగ్ షెడ్(పీఓహెచ్ షెడ్) నిర్మాణానికి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈసారైనా ఇవి తొలగిపోయి బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని, శంకుస్థాపన జరుగుతుం దని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. వ్యాగన్ పీఓహెచ్ షెడ్ వస్తే కాజీపేట అభివృద్ధి చెందడమే కాకుండా ప్రాధాన్యత పెరుగుతుంది. కొంత మేరకు నిరుద్యోగం తగ్గుతుంది. దీనికి తోడు అనుబంధంగా చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటవుతాయి. -
‘నిట్’ విద్యార్థి దుర్మరణం
కాజీపేట అర్బన్ /లింగాలఘణపురం : జనగామ, సూర్యాపేట రోడ్డులో నెల్లుట్ల సమీపంలోని ఆర్టీసీ కాలనీ వద్ద శుక్రవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వాహనం ఢీకొని వరంగల్ నిట్‌లో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న నల్గొండ జిల్లాకు చెందిన కేతావత్ భార్గవ్ (20) దుర్మరణం చెందాడు. ఏఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా దామెరచర్ల మండలం జిలావర్పూర్ శివారు గ్రామమైన కేతావత్తండాకు చెందిన కేతావత్ భార్గవ్ మిర్యాలగూడలో ఉంటున్న తల్లిదండ్రులు సైదమ్మ, సీతారాంనాయక్‌లను చూసేందుకు గురువారం హోండా ఎఫ్‌జెడ్ ద్విచక్రవాహనంపై వెళ్లాడు. తల్లిదండ్రులను చూసిన భార్గవ్ రాత్రి 1.30గంటల సమయంలో మిర్యాలగూడ నుంచి అదే వాహనంపై వరంగల్ నిట్ కళాశాలకు బయలుదేరాడు. శుక్రవారం తెల్లవారు జామున సుమారు 4.30 గంటల సమయంలో నెల్లుట్ల ఆర్టీసీ కాలనీ కల్వర్టు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి తలకు బలమైన గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. చీటూరు నుంచి జనగామకు వెళ్తున్న టాటాఏస్ డ్రైవర్ ప్రమాదానికి సంబంధించి వివరాలను ఇంట్రాసెక్టార్, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. తలకు బలమైన గాయం కావడంతో రోడ్డంతా రక్తసిక్తమై అక్కడికక్కడే భార్గవ్ మృత్యువాత పడ్డాడు. మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు భోరున విలపించారు. కాగా ప్రమాదానికి కారణమైన వాహనం కోసం పోలీసులు నవాబుపేట, నెల్లుట్ల, జనగామలోని సీసీ కెమెరాల పూటేజీలను పరిశీలిస్తున్నారు. నవాబుపేట సీసీ కెమెరాల పుటేజీలో భార్గవ్ 4.05 గంటలకు అక్కడి నుంచి వచ్చినట్లు గుర్తించారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్
కాజీపేట : ఫాతిమానగర్ చౌరస్తాలో ఆదివారం ఉద యం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు స్వల్ప గాయాలపాలైనట్లు సీఐ రమేష్‌కుమార్ తెలిపారు. ఆదివారం కాజీపేట పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెడ్డికాలనీకి చెందిన ఉప్పునూతుల వీరాచారి 8వతరగతి చదువుతున్న తన కూతురు ఝాన్సీ(13)ని ట్యూషన్ కోసం సిద్ధార్థనగర్‌కు తీసుకొస్తున్నాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న వీరాచారి కు మారుడు విశ్వజ్ఞ(20) ద్విచక్ర వాహనంపై వస్తానంటూ వెంట వచ్చాడు. దర్గారోడ్డు నుంచి సిద్ధార్థనగర్‌కు వెళ్లడానికి రోడ్డు క్రాస్ అవుతున్న వీరాచారి ద్విచక్రవాహనాన్ని కాజీపేట వైపు నుంచి వేగంగా బ్రిడ్జి దిగుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి ఢీకొట్టింది. ద్విచక్రవాహనం వెనుక భాగంలో కూర్చున్న విశ్వజ్ఞ తీవ్రంగా గాయపడగా తండ్రి, కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఉదయం వాకింగ్‌కు వచ్చిన వ్యక్తులు వారిని గుర్తించి 108లో ఆసుపత్రికి తరలించారు. విశ్వజ్ఞ పరి స్థితి విషమంగా ఉండటంతో నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స అందించేందుకు నిరాకరించాయి. వైద్యుల సూచన మేరకు సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ విశ్వజ్ఞ మృతిచెందాడు. ప్రమాదానికి కారకుడైన ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. వీరాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. -
28 కిలోల గంజాయి పట్టివేత
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్లో శనివారం 28 కిలోల గంజాయిని జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. కాజీపేట జీఆర్పీ సీఐ మధుసూదన్ కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన దొంతి రామాంజనేయులు అన్నవరంలో 28 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. ఆ గంజాయితో అనంతపురం నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. అయితే రైల్వే అధికారులు విజయవాడ రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టం ఆధునీకరణ పనుల కారణంగా ఈ రైలును కాజీపేట జంక్షన్ మీదుగా దారి మళ్లించారు. ఈ క్రమంలో కాజీపేట జంక్షన్‌కు చేరుకున్న రైలు నుంచి గంజాయి బ్యాగుతో అతడు దిగాడు. పక్కన బ్యాగు పెట్టి ప్లాట్‌ఫాంపై నిల్చొని అటుఇటు దిక్కులు చూస్తుండగా పెట్రోలింగ్ సిబ్బందికి అనుమానం వచ్చి తనిఖీ చేయగా గంజాయి తరలింపును ఒప్పుకున్నాడు. రూ.42,000 విలువైన గంజాయి బ్యాగును స్వాధీనం చేసుకుని రామాంజనేయులును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
700 గ్రాముల బంగారం పట్టివేత
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సింగపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుడిని లగేజీనీ అధికారులు తనిఖీ చేశారు. అందులో 700 గ్రాముల బంగారు బిస్కెట్టు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా వరంగల్ జిల్లాలోని కాజీపేట జంక్షన్ లో గురువారం ఉదయం 14 కిలోల బంగారాన్ని జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తనిఖీల సందర్భంగా రెండు బ్యాగుల్లో అనుమాస్పదంగా ఇద్దరు వ్యక్తులు కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు. బ్యాగులో ప్యాకింగ్ ఉన్న 147 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వాటి విలువ రూ.4 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. బంగారాన్ని హైదరాబాద్ బేగంపేటలోని బ్రింక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ బజ్జూరి బులియన్ నుంచి తీసుకువస్తున్నట్టు విచారణలో తేలింది. అయితే బ్రింక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ నుంచి 16 కిలోల బంగారం డెలివరీ చలాన్ లో ఉందని, కానీ నిందితుల దగ్గర 14.700 కిలోల మాత్రమే ఉన్నాయని పోలీసులు తెలిపారు. పట్టబడిన బంగారం, రసీదులలో తేడా ఉండటంతో బజ్జూరి బులియన్ వారిని పిలిపించి , బంగారాన్ని సీజ్ చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. -
కాజీపేట్‌కు రైల్వే డివిజన్ హోదా!
-
ఈవీ మహేశ్వర్ రెడ్డి ఇంటిపై దాడికి యత్నం
కాజీపేట : వైఎస్ఆర్ జిల్లా కాజీపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఈవీ మహేశ్వర్ రెడ్డి నివాసంపై దాడికి యత్నం జరిగింది. అయిదు ట్రాక్టర్లతో వచ్చిన వ్యక్తులు దాడికి యత్నించటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.