
కాజీపేట: ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లలకు డెంగీ సోకిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని సోమిడి ఎస్సీ కాలనీకి చెందిన మురికిపుడి వినయ్‌కుమార్ ఇద్దరు పిల్లలు, అతని తమ్ముడు విక్రం కుమార్ కుమారుడికి నాలుగు రోజుల కింద తీవ్ర జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
పరీక్షించిన వైద్యులు ఆ పిల్లలు డెంగీ వ్యాధితో బాధపడుతున్నట్లుగా ధృవీకరించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై సోమిడి అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి అర్చనను వివరణ కోరగా.. ఒకే ఇంట్లో ముగ్గురికి జ్వరాలు వచ్చిన మాట వాస్తవమేనని, మెరుగైన చికిత్స అందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment