సాక్షి, కాజీపేట రూరల్: సికింద్రాబాద్ నుంచి బల్లార్షా వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం ఓ నకిలీ టీసీ ప్రయాణికులను బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. అంతేకాకుండా బ్లేడ్‌తో ఒక ప్రయాణికుడిని గాయపరచిన ఘటన ప్రయాణికులలో, రైల్వేశాఖలో కలకలం రేపింది. కాజీ పేట జీఆర్పీ ఎస్సై జితేందర్‌రెడ్డి కథనంప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన గుండే టి రాజేష్(30) భువనగిరిలో కట్టెకోత మిషన్‌లో పనిచేస్తున్నాడు. సాయంత్రం భాగ్యనగర్‌లో భువనగిరికి చేరుకోగా మద్యం సేవించి ఉన్న రాజేష్ ఇంటికి వెళ్లేందుకు రైలెక్కాడు.
నేను రైల్వే టీసీనంటూ బోగీల్లో టికెట్ లేని వారు జరిమానా కట్టాలని లేదంటే జైలుకు వెళ్తారని బెదిరించి డబ్బులు వసూల్ చేశాడు. అతడి వద్ద బ్లేడ్‌ను చూపిస్తూ ఒక ప్రయాణికుడిని గాయపరిచాడు. రైలు కాజీపేట జంక్షన్‌కు చేరుకోవడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచా రం ఇవ్వగా అతడిని అదుపులోకి తీసుకుని జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సోమవారం రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment