fake tc
-
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో నకిలీ టీసీ హల్చల్
సాక్షి, కాజీపేట రూరల్: సికింద్రాబాద్ నుంచి బల్లార్షా వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం ఓ నకిలీ టీసీ ప్రయాణికులను బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. అంతేకాకుండా బ్లేడ్‌తో ఒక ప్రయాణికుడిని గాయపరచిన ఘటన ప్రయాణికులలో, రైల్వేశాఖలో కలకలం రేపింది. కాజీ పేట జీఆర్పీ ఎస్సై జితేందర్‌రెడ్డి కథనంప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన గుండే టి రాజేష్(30) భువనగిరిలో కట్టెకోత మిషన్‌లో పనిచేస్తున్నాడు. సాయంత్రం భాగ్యనగర్‌లో భువనగిరికి చేరుకోగా మద్యం సేవించి ఉన్న రాజేష్ ఇంటికి వెళ్లేందుకు రైలెక్కాడు. నేను రైల్వే టీసీనంటూ బోగీల్లో టికెట్ లేని వారు జరిమానా కట్టాలని లేదంటే జైలుకు వెళ్తారని బెదిరించి డబ్బులు వసూల్ చేశాడు. అతడి వద్ద బ్లేడ్‌ను చూపిస్తూ ఒక ప్రయాణికుడిని గాయపరిచాడు. రైలు కాజీపేట జంక్షన్‌కు చేరుకోవడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచా రం ఇవ్వగా అతడిని అదుపులోకి తీసుకుని జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సోమవారం రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. -
ఆర్పీఎఫ్ అదుపులో నకిలీ టీసీ
బాపట్లటౌన్` వివరాల్లోకి వెళితే కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామానికి చెందిన బోగాది వెంకటనాగశ్రీహరిప్రసాద్ అలియాస్ బీవీఎన్ఎస్ ప్రసాద్ సోమవారం ఉదయం తెనాలి నుంచి ఒంగోలు వెళ్తున్న 67256 నంబర్ గల పాసింజర్ రైలులో ప్రయాణిస్తూ టీసీని అని చెప్పి రైల్లో టికెట్లు లేని ప్రయాణికులను బెదిరించి వారి వద్ద నుంచి రూ.250 వసూలు చేశారు. అదుపులోకి తీసుకుందిలా... రైలు బాపట్లలో నిలిచిన సమయంలో బాపట్ల స్టేషన్లో దిగి బీవీఎన్ఎస్ ప్రసాద్ అనుమానస్పదంగా ప్లాట్‌ఫామ్‌పై తిరుగుతుండడాన్ని గమనించిన ఆర్పీఎఫ్ ఏఎస్ఐ ఎస్.సుధాకరరావు అతన్ని అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిన్నప్పటి నుంచి రైల్వే ఉద్యోగి కావాలనే కోరిక ఉండేదని, అది నెరవేరకపోవడంతో ఇలాంటి చేష్టలకు అలవాటు పడటం జరిగిందని ప్రసాద్ తెలిపారన్నారు. మరిన్ని వివరాల సేకరించేందుకు ఆర్పీఎఫ్ పోలీసులు ప్రసాద్‌ను జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. నిందితుడిన్ని అదుపులోకి తీసుకున్న ఆర్పీఎఫ్ ఏఎస్ఐ ఎస్.సుధాకర్‌రావు, కానిస్టేబుల్ డి.సుబ్రమణ్యంలను ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు ఫోన్లో అభినందించారు. -
నకిలీ టీసీ అరెస్టు
రైల్లో టీసీ కనిపించారా.. మీకు టికెట్ లేదనో, జనరల్ టికెట్ తీసుకుని రిజర్వేషన్ బోగీలో ప్రయాణిస్తున్నారనో బెదిరించారా? ఫైన్ రాయాలంటే వెయ్యి రూపాయలవుతుంది, నాకు 500 ఇస్తే సరేనన్నారా? అయితే ఒక్కసారి ఆ టీసీగారి గుర్తింపు చూపించమని అడగండి. ఎందుకంటే, ఇప్పుడు రైళ్లలో నకిలీ టీసీల బెడద కూడా ఎక్కువైపోయింది. గుంటూరు జిల్లాలో ఇలాంటి నకిలీ టీసీయే ఒకరిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. తెనాలి నుంచి ఒంగోలు వెళ్తున్న ప్యాసింజర్ రైల్లో ఇలా ప్రయాణికులను బెదిరిస్తున్న నకిలీ టీసీని బాపట్ల రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.