న్యూఢిల్లీ: విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ‘పరీక్షా పే చర్చ’.. ఈ ఏడాది కొత్త ఫార్మాట్‌లో జరగనుంది. మోదీతో పాటు ఈసారి పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొనే పరీక్షా పే చర్చ ఇప్పటికే ఏడు ఎడిషన్లు పూర్తి చేసుకుంది. పిబ్రవరి 10వ తేదీన న్యూఢిల్లీలోని భారత మండపంలో 8వ ఎడిషన్ జరగనుంది. అయితే ఈ చర్చకు ప్రత్యేకత తీసుకురావాలని అధికారులకు మోదీ సూచించారు. ఈ క్రమంలోనే ప్రముఖులను చర్చలో భాగం చేయనున్నారు.
ఆధ్యాత్మికవేత్త సద్గురు, నటి దీపికా పదుకొనే, మేరీ కోమ్, విక్రాంత్ మెస్సీ, భూమి ఫడ్నేకర్, అవనీ లేఖరా, రుజుతా దివేకర్, సోనాలి సభార్వల్, ఫుడ్‌ఫార్మర్, టెక్నికల్ గురూజీ, రాధికా గుప్తా.. ఇందులో పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా 6 నుంచి 12 తరగతుల చదివే సుమారు 2,500 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.
మరోవైపు.. ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే విద్యార్థులందరినీ పీపీసీ కిట్స్‌ను కేంద్ర విద్యా శాఖ అందించనుందని సమాచారం. అలాగే.. లెజెండరీ ఎగ్జామ్ వారియర్స్‌గా ఎంపిక చేసిన 10 మందికి ప్రధాని నివాసం సందర్శించే అవకాశం కల్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment