sadhguru jaggi vasudev
-
ఈషా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట
న్యూఢిల్లీ: తమిళనాడులో కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్వహిస్తున్న ఇషా ఫౌండేషన్‌పై మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈషా ఫౌండేషన్‌లో తమ కూతుళ్లకు బ్రెయిన్ వాష్‌చేసి సన్యాసం వైపు మళ్లించారని ఆరోపిస్తూ ప్రొఫెసర్ వేసిన కేసు విచారణను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ కేసులో మద్రాస్ హైకోర్టు పూర్తి అనుచితంగా వ్యవహరించిందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఇద్దరు మహిళలు గీత(42), లత(39) మేజర్లు కావడం, వారి ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో నివసిస్తున్నందున ఈ పిటిషన్ చట్టవిరుద్దమని, దీనిని తిరస్కరిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.కాగా పిటిషనర్ కూతుళ్లలో ఒకరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నేను, నా సోదరి స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగానే ఈషా ఫౌండేషన్‌లో నివసిస్తున్నాం. ఇందులో ఎవరి బలవంతం, ఒత్తిడి లేదు. మా తండ్రి ఎనిమిదేళ్లుగా మమ్మల్ని వేధిస్తున్నారు’ అని కోర్టుకు తెలిపారు.కేసు పుర్వాపరాలు..ఈషా ఫౌండేషన్‌పై తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ హెబియస్ కార్పస్ రిట్ దాఖలు చేయడంతో మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇద్దరు కుమార్తెలు గీత, లత ఈషా యోగా కేంద్రంలో యోగా నేర్చుకునేందుకు వెళ్లి అక్కడే ఉండి పోయారని, ఈశా కేంద్రంలో వారికి బ్రెయిన్ వాష్ చేసి సన్యాసంవైపు మళ్లించారని ఆయన ఆరోపించారు. ఇద్దరు కుమార్తెలను తమకు అప్పగించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈషా యోగా కేంద్రంపై ఇప్పటి వరకు ఎన్ని క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి వివరాలు దాఖలు చేయాలని పోలీసులకు ఉత్తర్వులిచ్చింది. ఆశ్రమంలో ఉన్న అందరినీ విచారించాలని ఆదేశించింది. ప్రొఫెసర్ ఆరోపణలను ఈషా యోగా కేంద్రం తోసిపుచ్చింది. తాము ఎవర్నీ పెళ్లి చేసుకోమనిగానీ.. సన్యాసం తీసుకోవాలని గానీ సలహాలు ఇవ్వమని, ఎవరికి వారు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుంటారని ఓ ప్రకటన విడుదల చేసింది.దీనిపై ఈషా యోగా కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు పోలీసులకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ధర్మాసనం స్టే విధించింది. అలాగే స్టేటస్ రిపోర్టును తమకు సమర్పించాలని తమిళనాడు పోలీసును స్పష్టం చేసింది. తాజాగా ఇద్దరు మహిళలు ఆ శ్రమంలో స్వచ్ఛందంగానే ఉంటున్నారని అత్యున్నత న్యాయస్థానానికి పోలీసులు వివరాలు సమర్పించారు. దీంతో కేసును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. -
హెల్త్ అప్డేట్ షేర్ చేసిన సద్గురు
ఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్(66) శరవేగంగా కోలుకుంటున్నారు. తలకు బ్యాండేజ్ ప్యాచ్‌తో ఆస్పత్రిలో బెడ్ మీద ఆయన పేపర్ చదువుతూ ఉండగా.. వీడియో తీసిన ఆయన కుమార్తె రాధే జగ్గీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆయన అభిమానులు, శిష్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెదడులో రక్తస్రావం కారణంగా ప్రాణాపాయ స్థితికి చేరుకున్న సద్గురు.. ఎమర్జెన్సీ బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. మెదడు, కపాలం మధ్య చేరిన రక్తాన్ని తొలగించడానికి ఈ నెల 17న న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో వైద్యులు సర్జరీ చేశారు. #Sadhguru #SpeedyRecovery pic.twitter.com/rTiyhYPiJM — Sadhguru (@SadhguruJV) March 25, 2024 సద్గురుకి సర్జరీ విషయం తెలియగానే ఆయన అభిమానులు, శిష్యుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఆయన త్వరగా కోలుకుని మన ముందుకు వస్తారంటూ ఈశా ఫౌండేషన్ ఒక ప్రకటన చేసింది. మరోవైపు.. ఆ టైంలో సద్గురుతో మాట్లాడానని, ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని మోదీ సైతం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఇక తాము ఊహించిందానికంటే వేగంగా ఆయన కోలుకుంటున్నారని.. త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు ప్రకటించారు. -
Sadhgurus Brain Surgery: మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుందంటే..!
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ బ్రెయిన్ కు సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని ఈషా ఫౌండేషన్ బుధవారం ప్రకటించింది. ఆయన కోలుకుంటున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొంది. ఆయన బ్రెయిన్లో రక్త స్రావం జరగడంతో అపోలో హాస్పిటల్లో వైద్య బృందం ఆపరేషన్ నిర్వహించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అసలు ఇలా మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుంది? దేనివల్ల అనే విషయాలు గురించి సవివరంగా తెలుసుకుందాం. నిజానికి ఇక్కడ సద్గురు గత నాలుగు వారాలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. అంత నొప్పి ఉన్నప్పటికీ రోజువారీ షెడ్యూల్ ప్రకారం తన సామాజిక కార్యకలాపాలను కొనసాగించారు. ఓ పక్క బ్రెయిన్ లో రక్త స్రావం జరుగుతున్నా.. ఈ నెల 8వ తేదీ నిర్వహించిన మహా శివరాత్రి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నట్లు సమాచారం. ఇప్పుడూ ఆయనకు ఇలా జరగడం అందర్నీ తీవ్ర విస్మయానికి గురి చేసింది. అంటే ఇక్కడ సద్గురు తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారనే విషయాన్ని గమనించాలి. నిజానికి ఇలా మెదడులో రక్తస్రావం అవ్వడానికి ముందు సంకేతమే తీవ్రమైన తలనొప్పి అనే ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ టైంలోనే వైద్యులను సంప్రదిస్తే మెదడులో బ్లీడింగ్ జరగకుండా కొంత నిరోధించగలమని చెబుతున్నారు. అసలు ఈ తలనొప్పి ఎందుకు వస్తుందంటే..? బ్రెయిన్ స్ట్రోక్ కారణంగానే ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి మెదడు కణాలకు ఆక్సిజన్ అవసరం. ఈ ఆక్సిజన్ రక్తం ద్వారా అందుతుంది. మెదడు కణాలకు రక్తం సరఫరా నిలిచిపోవడంతో వచ్చే ప్రమాదమే ఇది. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలపై అవగాహన ఏర్పరచుకుంటే ప్రాణాపాయం నుంచి గట్టెక్కవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ ఎన్ని రకాలు? బ్రెయిన్ స్ట్రోక్‌ను సాధారణంగా ఐస్కీమిక్ స్ట్రోక్, హీమోరజిక్ స్ట్రోక్, ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్‌లుగా మూడు రకాలుగా గుర్తించవచ్చు. ఐస్కీమిక్ స్ట్రోక్: ఇది మెదడుకు దారితీసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయిన సందర్భాల్లో వచ్చే స్ట్రోక్‌ని ఐస్కీమిక్ స్ట్రోక్‌గా పిలుస్తారు. హీమోర్హజిక్ స్ట్రోక్: మెదడు రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కలిగే స్ట్రోక్ ఇది. రక్తస్రావం జరగడంతో మెదడులోని కణాలు దెబ్బతింటాయి. ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్: ఉన్నట్టుండి రక్త సరఫరా ఆగిపోతుంది. మళ్ళీ దానంతట అదే తిరిగి ప్రారంభం అవుతుంది. ఈ స్థితినే ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్ అంటారు. ఒకరకంగా దీన్ని బ్రెయిన్ స్ట్రోక్‌కి హెచ్చరికగా భావించవచ్చు. ఈ లక్షణాన్ని నిర్దిష్ఠ కాలంలో గుర్తించి, చికిత్స అందిస్తే బ్రెయిన్ స్ట్రోక్‌ను అడ్డుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు.. ఏ రకమైన స్ట్రోక్ వచ్చినా ముందుగా తలనొప్పి వస్తుంది. హెమరేజిక్ స్ట్రోక్ సాధారణ లక్షణం తలనొప్పి.కరోటిడ్ ఆర్టరీ నుండి స్ట్రోక్ మొదలవుతుంది. ఆ సమయంలో తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ముఖం ఓ వైపుకి వంగిపోవవడం,రెండు చేతులు పైకి ఎత్తకపోవడం,ఓ చేయి తిమ్మిరి, బలహీనంగా మారడం, నడవలేకపోవడం వంటివి దీని లక్షణాలు. ఇక్కడ సద్గురు నాలుగువారాలుగుఆ తీవ్రమైన తలనొప్పిని ఫేస్ చేశారు. అయినప్పటికీ సామాజికి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడంతో సమస్య తీవ్రమయ్యిందని చెప్పొచ్చు. అలాగే శ్వాసలో సమస్య ఏర్పడుతుంది. ఛాతీనొప్పి, శ్వాసలో సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే అది స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందని జాగ్రత్తపడాలి. ఎక్కిళ్లు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఒక సర్వే ప్రకారం.. 10శాతం మంది మహిళలలకు ఎక్కిళ్లు ఎక్కువగా వస్తాయని గుర్తించారు. ఎందుకు వస్తుందంటే.. అధిక రక్తపోటు,డయాబెటిస్,అధిక కొలెస్ట్రాల్,ధూమపానం, మధ్యపానం, వ్యాయామం చేయకపోవడం, ఊబకాయం, వీటితో పాటు ఎక్కువగా ఆందోళన చెందడం, గుండె వ్యాధులు, అధిక ప్లాస్మా లిపిడ్స్ వంటివి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు. ముందుగానే సమస్యను గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. అయితే జన్యు సంబంధిత కారణాలు, వృద్ధాప్యం,ఇంతకుముందే బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడటం వంటివి కూడా స్ట్రోక్ ముప్పును శాశ్వతంగా కలిగిస్తాయి. వీటి నుంచి మనం తప్పించుకోలేం. చికిత్స ఇలా.. పైన వివరించిన లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. బీపీ, షుగర్ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండటమే కాకుండా బరువును అదుపులో ఉంచుకోవాలి. ఈ బ్రెయిన్స్ట్రోక్కి సంబంధించిన లక్షణాలను ఒక నెల ముందు నుంచి కనిపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ముందుగా పసిగడితే ప్రాణాపాయం నుంచి బయటపడగలమని అంటున్నారు నిపుణులు. (చదవండి: బొటాక్స్ ఇంజెక్షన్లు ఇంత డేంజరా? మైగ్రేన్ కోసం వాడితే..!) -
Sadhguru Jaggi Vasudev: సద్గురు జగ్గీ వాసుదేవ్ (ఫొటో గ్యాలరీ)
-
సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్ సర్జరీ
న్యూఢిల్లీ: ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ అనూహ్యంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా తరచుగా వాంతి చేసుకుంటోన్న సద్గురుకు స్కానింగ్ నిర్వహించగా.. బ్రెయిన్లో కొంత తేడాను గమనించారు వైద్యులు. ఈ నెల 17న ఢిల్లీ అపొలో ఆస్పత్రికి తరలించగా.. ఆయనకు బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా చేసినట్టు తెలిసింది. సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రస్తుత వయస్సు 66 సంవత్సరాలు. మార్చి 17న ఢిల్లీ అపొలో ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా.. బ్రెయిన్లో స్వెల్లింగ్ వచ్చినట్టు గుర్తించారు. అలాగే కొంత మేర బ్లీడింగ్‌ను గుర్తించారు. ఢిల్లీ అపొలో ఆస్పత్రిలో డాక్టర్ వినీత్ సురీ నేతృత్వంలోని బృందం ఎమ్మారై పరీక్షలు నిర్వహించగా బ్లీడింగ్ ఎక్కువగా కనిపించినట్టు తెలిసింది. పరిస్థితి విషమించకుండా ఉండాలంటే తక్షణం శస్త్రచికిత్స అవసరమని గుర్తించిన డాక్టర్లు.. వెంటనే ఆపరేషన్ నిర్వహించినట్టు తెలిసింది. వైద్యబృందంలో డాక్టర్ వినీత్ సూరితో పాటు డాక్టర్ ప్రణవ్ కుమార్, డాక్టర్ సుధీర్ త్యాగి, డాక్టర్ ఎస్ ఛటర్జీ ఉన్నారు. ఆపరేషన్ తర్వాత సద్గురుకు సంబంధించిన అన్ని హెల్త్ పారామీటర్లు మెరుగవుతున్నట్టు తెలిసింది. దీనిపై ఢిల్లీ అపొలో నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. View this post on Instagram A post shared by Sadhguru (@sadhguru) కర్ణాటకలోని మైసూర్లో ఓ తెలుగు కుటుంబంలో పుట్టిన జగ్గీ వాసుదేవ్ నలుగురి సంతానంలో ఆఖరివాడు. సద్గురు తండ్రి రైల్వేశాఖలో కంటి డాక్టర్. 11ఏళ్లప్పుడు యోగా నేర్చుకున్న సద్గురు స్కూలు మైసూర్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీషులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మోటార్ డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టపడే సద్గురు.. పాతికేళ్ల వయస్సులో మోటారు సైకిల్‌పై చాముండి కొండ పైకి వెళ్ళి ఓ ఆధ్యాత్మిక అనుభవం కలిగిందని చెబుతారు. ఆ తర్వాత ధ్యానమార్గం పట్టి ఈషా ఫౌండేషన్ ప్రారంభించారు. ఈ సంస్థ ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ ఐక్యరాజ్యసమితి ఆర్ధిక, సామాజిక సంస్థకి ప్రత్యేక సలహాదారుగా నియమించబడింది. కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో సద్గురుకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. Neurologist Dr. Vinit Suri of @HospitalsApollo gives an update about Sadhguru’s recent Brain Surgery. A few days ago, Sadhguru underwent brain surgery after life-threatening bleeding in the brain. Sadhguru is recovering very well, and the team of doctors who performed the… pic.twitter.com/UpwfPtAN7p — Isha Foundation (@ishafoundation) March 20, 2024 1983లో మైసూరులో మొదటి యోగా క్లాస్‌ను నిర్వహించాడు. 1989 లో కోయంబత్తూర్ లో ఈశా యోగ సెంటర్ ఏర్పాటు చేశాడు. కోయంబత్తూరు నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వెళ్ళంగిరి పర్వత పాదాల చెంత పదమూడు ఎకరాల భూమిలో ఈ సెంటర్ నడుస్తోంది. 1999లో సద్గురు ఆశ్రమ ప్రాంగణంలో ధ్యానలింగం ఏర్పాటు చేశారు. ఏ ప్రత్యేక మతానికీ, విశ్వాసానికీ చెందని ధ్యానలింగ యోగాలయం ధ్యానానికి మాత్రమే నిర్దేశించామని, కాంక్రీటు, స్టీలు ఉపయోగించకుండా ఇటుకరాళ్ళూ, సున్నంలతో 76 అడుగుల గోపురం, గర్భగుడిని నిర్మించామని సద్గురు చెబుతారు. హిందూ, ఇస్లాం, క్రైస్తవ, జైన్, టావో, జొరాష్ట్రియన్, జుడాయిజం, షింటో, బౌధ్ధ మతాల గుర్తులతో, అన్ని మతాల ఏకత్వాన్ని చాటుతూ ఓ సర్వధర్మ స్థంభాన్ని ఏర్పాటు చేశారు -
‘ఈశా’ శివరాత్రి వేడుకలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్
ఈ నెల 8న మహాశివరాత్రి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఆధ్మాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులోగల ‘ఈశా’ ఫౌండేషన్ రాబోయే మహశివరాత్రి వేడుకలను ఆదియోగి విగ్రహం ముందు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ మెగా వేడుక మార్చి 8వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి మార్చి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు సద్గురు యూట్యూబ్ ఛానల్లో, ప్రధాన మీడియా నెట్‌వర్క్‌లలో ప్రసారం కానుంది. ఆరోజు అర్ధరాత్రి, బ్రహ్మ ముహూర్త సమయంలో ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ‘సద్గురు’ జగ్గీవాసుదేవ్ భక్తులను శివుని ధ్యానంలో లీనమయ్యేలా చేయనున్నారు. కాగా గతంలో జరిగిన ‘ఈశా’ మహాశివరాత్రి వేడుకల లైవ్ స్ట్రీమింగ్ పలు రికార్డులను బద్దలు కొట్టింది. 2023లో ‘ఈశా’లో జరిగిన మహాశివరాత్రి వేడుకలను 14 కోట్ల మంది వీక్షించారు. -
సద్గురు హాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా అలాంటి సినిమాలో!
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ పరిచయం చేయాల్సిన పనిలేదు. తన ఫౌండేషన్ ద్వారా సేవ్ సాయిల్ పేరిట అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ఆయన సినిమాల్లోను ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల విడుదలైన హాలీవుడ్ చిత్రం 'దిస్ ఈజ్ మీ నౌ: ఎ లవ్ స్టోరీ'లో నటి జెన్నిఫర్ లోపెజ్ నటించిన చిత్రంలో కనిపించారు. ఈ సినిమాకు డేవ్ మేయర్స్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కించిన దిస్ ఈజ్ మీ నౌ: ఎ లవ్ స్టోరీలో బెన్ అఫ్లెక్, ట్రెవర్ నోహ్, సోఫియా వెర్గారా, కేకే పాల్మెర్, పోస్ట్ మలోన్, నీల్ డి గ్రాస్సే టైసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటు ఇషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్ ఓ కీలక పాత్రలో కనిపించారు. తాజాగా ఈ సినిమాలో ఆయన నటించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈనెల 16 నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇండియాతో పాటు మరికొన్ని దేశాల్లో పేరు తెచ్చుకున్న జగ్గీ వాసుదేవ్ ఈ సినిమాతో మరింత ఫేమస్ అయ్యారు. See who is in Hollywood. Sadhguru appeared in the Hollywood movie, 'This is Me... Now'. It's so exciting to see his role alongside other Hollywood stars. 🙌✨🤩 "You Shall Always Be Loved" ❤️🙏#sadhguru #SadhguruInHollywood pic.twitter.com/Hr7lBVkJby — JANAKA (@immortalsutra) February 17, 2024 nothing, just all shades of @JLo being herself! 💗#ThisIsMeNowOnPrime, watch now pic.twitter.com/ZORql3wrf9 — prime video IN (@PrimeVideoIN) February 21, 2024 -
అలా ఉండడం దాదాపు అసాధ్యం: సమంత పోస్ట్ వైరల్
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు చెప్పిన సామ్.. త్వరలోనే వైద్యం కోసం విదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే. అప్పట్లో చికిత్స కూడా తీసుకుంది. కోలుకున్న తర్వాత విజయ్ దేవరకొండ సరసన ఖుషి మూవీ, వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటించింది. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత ప్రస్తుతం తన ఆరోగ్యంపైనే పూర్తిగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చేసింది. త్వరలోనే అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. (ఇది చదవండి: జులై 13 నాకు చాలా స్పెషల్ : సమంత) అయితే అంతకుముందే ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు సామ్. ఇటీవలే తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్ దర్శించుకని ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఖుషీ భామ. అయితే వైద్యం కోసం విదేశాలకు వెళ్లేముందు మనోధైర్యం కోసమే ఆలయాలకు వెళ్తున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా సమంత మరోసారి ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయింది. ప్రముఖ యోగా గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు నిర్వహించిన ఆధ్యాత్మిక యెగా కార్యక్రమానికి సమంత హాజరయ్యారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన యోగా శిబిరంలో సామ్ ఓ సామాన్య భక్తురాలిగా కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సామ్ తన ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. సమంత తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఎలాంటి ఆలోచనలు, కదలికలు, మెలికలు తిరగకుండా నిశ్చలంగా కూర్చోవడం దాదాపు అసాధ్యమనిపించింది. కానీ ఈరోజు ధ్యానం అనేది ప్రశాంతత, శక్తి, స్పష్టతకు అత్యంత శక్తివంతమైన మూలమని తెలిసింది. ఇంత సింపుల్‌గా ఉండే ధ్యానం.. ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఎవరు అనుకోరు.' అంటూ రాసుకొచ్చింది. కాగా.. ఇటీవలే ఖుషీ షూటింగ్ పూర్తి చేసుకున్న భామ త్వరలోనే వైద్యం కోసం విదేశాలకు బయలుదేరనుంది. (ఇది చదవండి: వైద్యం కోసం విదేశాలకు సమంత.. అతడు ఎమోషనల్!) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు: సద్గురు
సాక్షి, చెన్నై: పలుమార్లు తనకు బెదిరింపులు వచ్చాయని, అయితే వాటికి తాను భయపడే ప్రసక్తే లేదని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. మంగళూరు కుక్కర్ బాంబు పేలుడు కేసు నిందితుడు సారిక్ తన మొబైల్ డీపీగా ఈషా యోగా కేంద్రంలోని ఆది యోగి విగ్రహం ఫొటోను కలిగి ఉన్నట్లు బయటపడిన విషయం తెలిసిందే. ఇతడు ఈషాయోగా కేంద్రాన్ని సందర్శించి రెక్కీ నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఓవైపు మంగళూరు పోలీసులు, మరోవైపు తమిళ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కోయంబత్తూరు, మదురై, కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ కేంద్రంగా ఈ విచారణ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆంగ్ల మీడియాతో జగ్గీ వాసుదేవ్ మాట్లాడారు. వాట్సాప్ డీపీగా సారిక్ ఆదియోగి విగ్రహాన్ని భక్తితో పెట్టుకున్నాడో లేదా.. తన మతాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశాడో స్పష్టంగా తెలియ లేదన్నారు. బెదిరింపులు తనకు కొత్త కాదని, ప్రాణానికి హాని కల్గిస్తామనే బెదిరింపులు ఎన్నోసార్లు వచ్చాయన్నారు. అయినా తాను ఇంకా జీవించే ఉన్నానని చమత్కరించారు. చదవండి: జయలలితకు సరైన చికిత్స అందలేదు.. ఆర్ముగ స్వామి సంచలన వ్యాఖ్యలు -
అసోం సీఎం హిమంత, సద్గురుపై కేసు
దిస్పూర్: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌పై కేసు నమోదైంది. ఆదివారం కాజీరంగ జాతీయ పార్కులో సూర్యాస్తమయం తర్వాత వీరు జీపులో సఫారీ యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇది వన్యప్రాణుల పరిరక్షణ చట్టం నిబంధనలకు విరుద్దమని పార్కు సమీపంలోని గ్రామస్థులు బోకాఖాట్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు నమోదైంది వాస్తవమేనని పోలీసులు తెలిపారు. అయితే ఆ పార్కు అటవీ శాఖ కిందకు వస్తుందని, అందుకే ఆ అధికారులను స్టేటస్ రిపోర్టు కోరినట్లు చెప్పారు. దీనిపై అటవీ అధికారులు స్పందిస్తూ.. కేసు పెట్టే హక్కు ప్రజలకు ఉందని చెప్పారు. అయితే సీఎం అధికారిక కార్యక్రమంలో భాగంగానే సఫారీ యాత్రకు వెళ్లారని, ఇది నిబంధనలను అతిక్రమించినట్లు కాదని తాము భావిస్తున్నట్లు చెప్పారు. కొన్నిసార్లు సీఎం కార్యక్రమాలు ఆలస్యం అవుతాయని గుర్తుచేశారు. ఈ ఘటనపై సీఎం హిమంత స్పందించారు. జాతీయ పార్కులోకి సూర్యాస్తమయం తర్వాత వెళ్లవద్దని చట్టంలో ఎక్కడా నిబంధన లేదని చెప్పారు. అధికారుల అనుమతితోనే తాను సఫారీ యాత్రలో పాల్గొన్నట్లు స్పష్టం చేశారు. అనుమతి ఉంటే ఉదయం 2గంటలకు కూడా పార్కులోకి వెళ్లొచ్చని పేర్కొన్నారు. సీఎం, సద్గురుతో పాటు వారితో వెళ్లిన మంత్రి, ఇతరులపైనా కేసు పెట్టారు గ్రామస్థులు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు వీరందరినీ వెంటనే అరెస్టు చేయాలన్నారు. లేకపోతే అందరూ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: నా చేతుల్లో ఏం లేదు.. అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు! -
పెళ్లై 10 ఏళ్లు, పిల్లలు లేరంటూ సద్గురును అడిగిన ఉపాసన
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్- ఉపాసనలది చూడముచ్చటైన జంట. ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు ఇటీవలే పదవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. అయితే ఇప్పటికీ వీరికి సంతానం లేదు. అది వాళ్ల వ్యక్తిగత విషయమైనప్పటికీ నెట్టింట్లో ఎప్పుడూ దీని గురిం చర్చ సాగుతూనే ఉంటుంది. ఉపాసనకు సైతం తరచూ ఈ ప్రశ్న ఎదురవుతున్నా ఏదో ఒకలా దాన్ని దాటవేస్తూ వచ్చింది. తాజాగా ఆధ్యాత్మిక గురువు సద్గురు దగ్గర పిల్లలను కనడం గురించి అడిగేసింది ఉపాసన. 'నేను పెళ్లి చేసుకుని పదేండ్లవుతోంది. నా వైవాహిక జీవితం చాలా చాలా సంతోషంగా సాగుతోంది. నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. కానీ ప్రజలు మాత్రం నా లైఫ్‌లోని ఆర్ఆర్ఆర్ గురించే ఎక్కువ చర్చించుకుంటున్నారు. ఫస్ట్ ఆర్.. నా రిలేషన్షిప్ గురించి, సెకండ్ ఆర్.. రీ ప్రొడ్యూస్(పిల్లలను కనే సామర్థ్యం), మూడో ఆర్.. లైఫ్‌లో నా రోల్.. వీటి గురించే జనాలు ఎక్కువగా చర్చిస్తున్నారు' అని చెప్పుకొచ్చింది. ఈ ప్రశ్నకు సద్గురు ఆసక్తికరంగా సమాధానాలిచ్చారు. 'రిలేషన్ అనేది నీ వ్యక్తిగత విషయం. అందులో ఎవరూ తలదూర్చకూడదు. రెండోది రీప్రొడ్యూస్.. పిల్లలను కనకుండా ఉండేవారందరికీ నేను అవార్డులిస్తాను. ఈ తరం వాళ్లు పిల్లలని కనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ జనాభా మరీ అధికమైపోయింది. ఒకవేళ నువ్వు ఆడపులివి అయి ఉంటే మాత్రం కచ్చితంగా పిల్లల్ని కనమని సలహా ఇచ్చేవాడిని. ఎందుకంటే అవి అంతరించిపోతున్నాయి. కానీ మనం అంతరించడం లేదు. ఇప్పటికే మనం ఈ భూమి మీద ఎక్కువ సంఖ్యలో ఉన్నాం' అని సద్గురు బదులిచ్చారు. ఆయన సమాధానం విన్న ఉపాసన.. మీరు ఇలా చెప్పారు కదా! ఇక మీకు మా అమ్మ, అత్తయ్యగారి నుంచి ఫోన్లు వస్తాయని సరదాగా చమత్కరించింది. దీంతో ఆయన కూడా అలాంటి అమ్మలు, అత్తల నుంచి తనకు ఎన్నో ఫోన్లు వస్తుంటాయ్ అని నవ్వేశారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: హీరో విశాల్‌కు గాయాలు.. నిలిచిపోయిన సినిమా షూటింగ్ వారిద్దరూ కలిసి ఎలా ఉంటారో చూస్తా.. నరేష్ మూడో భార్య రమ్య శపథం -
లండన్ నుంచి కావేరి వరకూ 30 వేల కిలోమీటర్ల బైక్‌యాత్ర
‘మట్టిని రక్షించు’ ఉద్యమంలో ప్రపంచవ్యాప్తంగా 27 దేశాలు తిరిగాను. మన దేశంలో గుజరాత్ నుంచి ఏపీ వరకూ వచ్చాను. తొమ్మిది దేశాలు, ఆరు రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఏపీ ప్రభుత్వం మట్టి రక్షణకు కట్టుబడి ఉంది. సీఎం వైఎస్ జగన్ దీనిపై స్పష్టమైన వైఖరితో ఉన్నారు. దావోస్‌లో నేను ఆయనతో చర్చించాను. ఆయన పూర్తి సహకారం అందిస్తామన్నారు. ప్రభుత్వంతో కలిసి ఏపీలో మట్టిరక్షణకు ముందడుగు వేస్తున్నాం. దీనికి అవసరమైన నిధులను వెచ్చించడానికి సిద్ధం’.. అని సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. ‘మట్టిని రక్షించు’ ఉద్యమంలో భాగంగా లండన్ నుంచి కావేరి ప్రాంతం వరకూ 30 వేల కిలోమీటర్లు బైక్‌యాత్రను చేస్తున్న సద్గురు కర్నూలుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు.. – సాక్షి ప్రతినిధి, కర్నూలు సాక్షి : ‘సేవ్ సాయిల్’ యాత్రకు ఎలాంటి స్పందన వస్తోంది? సద్గురు : ఇప్పటిదాకా ప్రతీ దేశం నుండి అద్భుత స్పందన వస్తోంది. నాలుగు నెలల కిందట వరకూ మట్టిపై ప్రస్తావనే లేదు. కానీ, ఇప్పుడు ప్రతీచోట ‘సాయిల్’ అనే పదం ప్రతిధ్వనిస్తోంది. తొమ్మిది దేశాలు మట్టిని రక్షించే ఉద్యమంలో అవగాహన ఒప్పందాలు చేశాయి. ఇప్పటికే 74 దేశాలు మట్టిని రక్షించేందుకు కట్టుబడి ఉంటామన్నారు. సాక్షి : ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సహకారం అందించబోతున్నారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాన్ని ఆశిస్తున్నారు? సద్గురు : ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించాం. ఇప్పటికే మా ప్రధాన సలహాదారు మాజీ యూఎన్ఈపీ డైరెక్టర్ ఎరిక్సోల్హైమ్ ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. సీఎంతో నేను మాట్లాడాను. ఆయన సుముఖంగా ఉన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి చాలా చర్యలు తీసుకోవడం మంచి విషయం. ఇది మరింత వేగంగా జరిగేందుకు ప్రోత్సాహకాలు అందించాలి. సాక్షి : ఏపీలో మాదిరిగా వ్యవసాయాభివృద్ధికి ప్రత్యేక చర్యలపై దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలను చైతన్యంచేస్తే బాగుంటుంది కదా? సద్గురు : ఏపీ ప్రభుత్వం చర్యలను తెలుసుకున్నా. సీఎం వైఎస్ జగన్‌తో దావోస్‌లో భేటీ అయ్యా. ఈషా ఫౌండేషన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సాధారణ వ్యవసాయ భూముల్లో సేంద్రియ పదార్థం కనీసం 3–6శాతం మధ్య ఉండాలి. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో అది 1 శాతం కంటే తక్కువగా ఉంది. కచ్చితంగా 3–6 శాతం ఉండేలా ప్రభుత్వ పాలసీలలో పొందుపరచాలి. సాక్షి : భావితరాలకు వ్యవసాయంపై ఆసక్తిలేదు. వ్యవసాయ భూములను విక్రయించి ఇతర ఉపాధి మార్గాలు అన్వేషిస్తున్నారు. దీంతో వ్యవసాయ భూమి ‘రియల్ ఎస్టేట్’ ఉచ్చులో విలవిలలాడిపోతోంది? పరిష్కారం ఏంటంటారు? సద్గురు : మనం వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి తీరాలి. అందుకు ప్రోత్సాహకాలు అందించాలి. లేకపోతే తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటాం. ప్రోత్సాహకాలతో రాబోయే 6–8 ఏళ్లలో మట్టిలో కనీసం 3 శాతం సేంద్రియ పదార్థం పెంపొందే దిశగా మనం అడుగులు వేయొచ్చు. సాక్షి : మీ 30వేల కిలోమీటర్ల ప్రయాణంలో మట్టిని రక్షించే చర్యలు ఏ దేశంలో సంతృప్తికరంగా ఉన్నాయి? మన దేశంలో ఏ రాష్ట్రంలో పరిస్థితి? సద్గురు : 2015లో ఫ్రాన్సు ‘4 ఫర్ 1000’ అనే కార్యాన్ని నిర్వహించింది. ఇది ‘మట్టిని రక్షించు’ పాలసీలా ఉంది. కానీ, వాళ్లు మట్టిని ఇతర సమస్యలతో ముడిపెట్టారు. దాంతో ఏడేళ్లు గడిచినా వారు దాన్ని అమలుచేయలేకపోయారు. (క్లిక్: మట్టి ప్రమాదంలో పడింది.. కాపాడుదాం!) సాక్షి : ‘సేవ్ సాయిల్’ ఉద్యమం భవిష్యత్‌లో ఎలా ఉండబోతోంది? సద్గురు : ఈ ఉద్యమం ప్రజలు స్పందించడం కోసమే. మేం 25–30 శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటుచేస్తున్నాం. వీరు మట్టి పునరుద్ధరణపై సహకారం అందిస్తారు. సాక్షి : ఈ ఉద్యమంలో ప్రభుత్వాలు, ప్రజల బాధ్యత ఏంటి? సద్గురు : మట్టి అనేది భూమి మీది జీవనానికి ఆయువుపట్టు. దురదృష్టవశాత్తు అదిప్పుడు చేజారిపోతోంది. అందరూ మట్టిపై మాట్లాడాలి. స్వచ్ఛమైన నీటికి, స్వచ్ఛమైన గాలికి, మన జీవితాలకి ఆధారం ఆ మట్టే! మట్టి నాణ్యతను సంరక్షించడమే మన పిల్లలకు మనం అందించే గొప్ప వారసత్వం. (క్లిక్: కర్నూలులో జగ్గీ వాసుదేవ్.. ఫొటోగ్యాలరీ) -
మట్టి మేలుకు గట్టి స్పందన (ఫోటోలు)
-
పుడమిని కాపాడటమే లక్ష్యం: జగ్గీ వాసుదేవ్
శంషాబాద్ రూరల్: ‘ప్రకృతిని పరిరక్షిస్తేనే భవిష్యత్ ఉంటుంది. పుడమిని కాపాడడమే సేవ్ సాయిల్, గ్రీన్ ఇండియా చాలెంజ్ సంయుక్త లక్ష్యం’ అని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా గొల్లూరు అటవీ ప్రాంతంలో గురువారం ఆయన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ఐదో విడతను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణకు హరితహారంతో పచ్చదనం పెంపు, గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ మాట్లాడుతూ... తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ప్రారంభించానని, సద్గురు ఆశీస్సులు అందుకోవటం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. అటవీశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు పి.సబితా ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్, ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, నవీన్‌రావు, విఠల్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఆర్ఎం డోబ్రియల్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ముచ్చింతల్ సమీపంలో ఉన్న సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన సద్గురు, శ్రీ త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి ‘సేవ్ సాయిల్’ పోస్టర్లను ఆవిష్కరించారు. -
‘సేవ్ సాయిల్’ కార్యక్రమానికి సినీ నటి సమంత (ఫొటోలు)
-
సద్గురు ‘సేవ్ సాయిల్’ అద్భుతం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సద్గురు జగ్గీ వాసుదేవ్ చేపట్టిన ‘సేవ్ సాయిల్’ కార్యక్రమం ప్రశంసనీయమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. తెలంగాణలో సారవంతమైన భూములను కాపాడుకోవడంతోపాటు పర్యావరణ అనుకూల కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ‘సేవ్ సాయిల్’ పేరుతో సద్గురు అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా రెండు రోజులపాటు దావోస్‌లో ప్రపంచస్థాయి కంపెనీల ప్రతినిధులను కలిశారు. తన కార్యక్రమంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం కేటీఆర్‌తో కలిసి దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో సద్గురు చర్చా కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా భూమి సారాన్ని కోల్పోతోందని, త్వరలోనే ఈ సమస్య వల్ల ఆహారకొరత ఏర్పడే ప్రమాదముందని సద్గురు అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో వ్యవసాయ యోగ్యమైన నేలలు అంతరించిపోయే ప్రమాదం ఉన్నందున ఇప్పటి నుంచే భూమిని పంటలకు అనుగుణంగా సారవంతం చేసే కార్యక్రమాలను చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మానవ ప్రయత్నం అయిన హరితహారం కార్యక్రమం గురించి కేటీఆర్ వివరించారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన కార్యక్రమాలను ప్రశంసించిన సద్గురు తమసంస్థ ద్వారా వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం పెంపునకు చేపట్టిన కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. -
ఇండియాకు వచ్చిన విల్‌స్మిత్.. అతని కోసమేనా ? ఫొటోలు వైరల్..
Will Smith In India And Spotted At Mumbai Airport After Slap Controversy: హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ అంటే సినీ ప్రియులకు తప్ప ఇంకేవరికి పెద్దగా పరిచయం లేదు. కానీ ఇటీవల నిర్వహించిన ఆస్కార్ వేడుకల్లో హోస్ట్, కమెడియన్ క్రిస్‌రాక్‌పై విల్ స్మిత్ చేయి చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఈ సంఘటన తర్వాత విల్ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మోషన్ పిక్చర్ అకాడమీ విల్‌స్మిత్‌పై 10 ఏళ్ల నిషేధం కూడా విధించింది. ఇదిలా ఉంటే విల్ స్మిత్ తాజాగా ఇండియా బాట పట్టాడు. శనివారం (ఏప్రిల్ 23) ముంబై విమానాశ్రయం వద్ద విల్ స్మిత్ దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. చెంపదెబ్బ ఘటన తర్వాత విల్ కెమెరాలకు చిక్కడం ఇదే తొలిసారి. విల్ స్మిత్ జుహులోని జెడబ్ల్యూ మారియట్హోటల్లో బస చేస్తున్నట్లు సమాచారం. అయితే విల్ స్మిత్ ఇండియాకు రావడానికి కారణం ఏంటని తీవ్రంగా చర్చ నడుస్తోంది. అందులోనూ ఇలాంటి సమయంలో రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ను కలిసేందుకే విల్ స్మిత్ వచ్చినట్లు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. చెంపదెబ్బ ఘటనతో విల్ కొద్ది రోజులుగా విచారంగా ఉన్నాడట. దీంతో సద్గురు వద్ద కొంత సమయం గడిపేందుకు వచ్చాడని సమాచారం. ఈ విషయంపై ఎలాంటి అదికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు వెలువడలేదు. గతంలో విల్ స్మిత్ సద్గురుకు తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. 2019లో కూడా విల్ స్మిత్ భారతదేశాన్ని సందర్శించాడు. అప్పుడు పలువురు బాలీవుడ్ ప్రముఖులను కలిసి ముచ్చటించాడు. మరీ ఈసారి ఎవర్నైనా కలుస్తాడా ? లేదో ? చూడాలి. చదవండి: విల్ స్మిత్‌పై 10 ఏళ్లు నిషేధం, స్పందించిన హీరో చెంపదెబ్బ ఎఫెక్ట్.. ఆగిపోయిన విల్ స్మిత్ సినిమాలు ! -
నెలసరి ఉన్నా ఈ గర్భగుడిలోకి వెళ్లవచ్చు!
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఓ ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈ ఆలయంలో నెలసరి సమయంలో కూడా మహిళలలు పూజలు చేసుకోవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ ప్రత్యేక ఆలయం కోయంబత్తూరులోని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆశ్రమంలో ఉంది. దీని పేరు ‘మా లింగా భైరవి’. ఇక్కడ బైరాగిని అమ్మవారు కొలువుదేరి ఉన్నారు. ఈ ఆలయ గర్భగుడిలోకి కేవలం మహిళలకు మాత్రమే అనుమతి ఉండటం మరో విశేషం. సద్గురు జగ్గీ వాసుదేవ్ ఉన్నత భావాలు కలిగిన స్వామిజీ అని అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఆశ్రమంలో.. మా లింగా భైరవి ఆలయానికి ప్రతిరోజు పురుషులు, మహిళా భక్తులు దర్శనార్థం వస్తుంటారు. కానీ ఈ ఆలయ గర్భగుడి లోపలికి వెళ్లి పూజలు చేసుకునే అవకాశం కేవలం మహిళలకు మాత్రమే ఆయన కల్పించారు. దీనికి కారణం రుతుస్రావం సమయంలో వారిని అంటరాని వారిగా చూడకూడదనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాటు చేశారు. అదే విధంగా మహిళలకు రుతుస్రావం అనేది ప్రకృతిలో భాగమనీ.. ఆ సమయంలో మహిళలు గుడికి రాకూడదు, పూజలు చేయకూడదంటూ ఆంక్షలు విధించడం సరైనది కాదని తాను అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. గత జన్మలో మహిళ.. ఈ జన్మలో ఇలా! ఈ విషయం గురించి నిర్మలా అనే ఆశ్రమ మహిళా సన్యాసిని మాట్లాడుతూ.. ‘ ఇది స్వామీ సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్ణయం. రుతుస్రావ సమయంలో మహిళల అభద్రతా భావాన్ని పోగొట్టేందుకే ఆయన ఇలా చేస్తున్నారు. దీంతో బైరాగిని మాతను పూజించుకోవడానికి రోజూ మహిళలు, పురుషులు వస్తారు. కానీ గర్భగుడిలోకి కేవలం మహిళలను మాత్రమే అనుమతించడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఆలయాల్లోని గర్భగుడిలోకి మహిళలకు అనుమతి ఉండక పోవడం.. ఇక్కడ ఆ ఏర్పాటు ఉండటంతో వారంతా సంతోషిస్తున్నారు’ అని ఆమె చెప్పారు. ‘నెలసరిలో వంట చేస్తే కుక్కలుగా పుడతారు’ ‘‘కంప్యూటర్ యుగంలో కూడా చాలా ప్రాంతాల్లో రుతుస్రావంలో ఉన్న మహిళలను, యువతులను అంటరానివారుగా భావిస్తారన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో వారిని ఇంట్లోకి అనుమతించరు. ఇక వారికి తినడానికి ప్లేటు, గ్లాసు విడిగా ఉంచుతారు. ఆ సమయంలో ఇంట్లోని వారంతా వారి పట్ల ప్రవర్తించే తీరు చూస్తే అభద్రత భావం కలుగుతుంది. ఈ ఆచారాన్ని వారు అవమానకరంగా భావించడంతో పాటుగా.. వారి ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. అందుకే వీటన్నింటికీ అడ్డుకట్ట వేసేందుకే సద్గురు వాసుదేవ్ ఇలా చేస్తున్నట్లు’’ నిర్మల తెలిపారు. -
సద్గురు వీడియోతో మోదీ ప్రచారం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతన్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ మాత్రం సీఏఏపై జరుగుతున్న ఆందోళనలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. అలాగే సీఏఏకు మద్దతుగా దేశ ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ సీఏఏకు మద్దతు కూడగట్టేలా సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. సీఏఏ అనేది శరణార్థులకు పౌరసత్వం కల్పించడానికి మాత్రమేనని.. ఎవరి పౌరసత్వం తొలగించడానికి కాదని ట్వీట్ చేశారు. ఇండియా సపోర్ట్స్ సీఏఏ(#IndiaSupportsCAA) హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేశారు. నమో యాప్‌లో ఈ హ్యాష్ ట్యాగ్‌తో వెతికితే సీఏఏకు సంబంధించి సమగ్ర సమాచారం లభిస్తుందని.. దానిని అందరికి షేర్ చేసి సీఏఏకు మద్దతుగా నిలవాలని కోరారు. అంతేకాకుండా సీఏఏపై సద్గురు జగ్గీ వాసుదేవ్ వివరణకు సంబంధించిన వీడియోను కూడా మోదీ ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా, సీఏఏ ముస్లింలపై వివక్ష కనబరిచేలా ఉందని ఆందోళనకారులు చెబుతున్నారు. రాజ్యాంగం మూల సూత్రాలను దెబ్బతీసే విధంగా సీఏఏ ఉందని విమర్శిస్తున్నారు. #IndiaSupportsCAA because CAA is about giving citizenship to persecuted refugees & not about taking anyone’s citizenship away. Check out this hashtag in Your Voice section of Volunteer module on NaMo App for content, graphics, videos & more. Share & show your support for CAA.. — narendramodi_in (@narendramodi_in) December 30, 2019 Do hear this lucid explanation of aspects relating to CAA and more by @SadhguruJV. He provides historical context, brilliantly highlights our culture of brotherhood. He also calls out the misinformation by vested interest groups. #IndiaSupportsCAA https://t.co/97CW4EQZ7Z — Narendra Modi (@narendramodi) December 30, 2019 -
సద్గురు ట్వీట్.. నెటిజన్ల ఆగ్రహం
హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్‌కు గురవుతున్నారు. 18 రోజుల వ్యవధిలో ఐదు స్వర్ణాలు గెలుచుకొని యావత్ భారతావని దృష్టిని ఆకర్షించిన అథ్లెట్ హిమ దాస్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సద్గురు ట్వీట్ చేశారు. ‘హిమదాస్‌కు శుభాకాంక్షలు, అదేవిధంగా బ్లెస్సింగ్స్’అంటూ పేర్కొన్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ ట్వీట్లో ‘Golden Shower For India’అని పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది అసభ్యపద జాలం అంటూ సద్గురుకు వ్యతిరేకంగా కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే దీనిపై సద్గురు ఫాలోవర్స్ కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. హిమదాస్ బంగారు వర్షం కురిపిస్తోందనే ఉద్దేశంతో అలా అన్నారని కానీ దానిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వారు పేర్కొంటున్నారు. అయితే దీనిపై రెండు వర్గాల వారు ట్విటర్ వేదికగా వాగ్వాదం చేసుకుంటున్నారు. మామూలుగా సద్గురు వాడిన పదంలో ఎలాంటి అభ్యతరకరం లేదని.. కానీ పాశ్చాత్య దేశాల్లో దాని అర్థాన్ని మార్చారని సద్గురు అభిమానులు తెలియజేస్తున్నారు. అయితే గతంలో అమెరికన్ రచయిత జేమ్స్ కోమే ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఈ పదజాలం వాడి విమర్శలపాలైన విషయాన్ని సద్గురు వ్యతిరేకులు గుర్తుచేస్తున్నారు. -
‘ఈషా’లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
-
సృజనాత్మకతను వెలికి తీయడమే విద్య
⇒ నిత్యవిద్యార్థిగా ఉపాధ్యాయులు ⇒ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆశాభావం ⇒ ఆహ్లాదకరంగా పాఠశాల విద్య: సద్గురువు జగ్గి వాసుదేవ్ ⇒ ఇషాయోగా కేంద్రంలో విద్యా సదస్సు కోయంబత్తూరు నుంచి సాక్షి ప్రతినిధి: ‘ఇన్నొవేటింగ్ ఇండియాస్ స్కూలింగ్’ అనే అంశంపై కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో జాతీయస్థాయి సమావేశాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, సద్గురువు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జవదేకర్ మాట్లాడుతూ విద్యావిధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడమే నా లక్ష్యం. ఒకప్పుడు సమాజం అన్నీ చేసుకునేది. ఆ తరువాత ప్రభుత్వమే అన్నీ చేయాలనే భావన బయలుదేరింది. కానీ నేడు విద్యావిధానంలో సమాజ బాధ్యత పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, నిర్వాహుకుల్లోనే లోపాలు ఉన్నాయి. ప్రజల నుండి అభిప్రాయాలను స్వీకరించడం లేదు. ఒక పాఠశాలకు తనిఖీకి వెళ్లి ఎవ్వరీని బదిలీ చేయను, శిక్షించను, పూర్తిగా నమ్ముతాను అని చెప్పిన తరువాత ఉత్తీర్ణతశాతం గణణీయంగా పెంచిచూపారు. అనుకూలతాధోరణి పెంచుకుంటే ఏదైనా సాధ్యం. కొలంబస్ అమెరికాను కనుగొనేందుకు బయలుదేరలేదు, భారత దేశం కోసం బయలుదేరితే అమెరికా తగిలింది, అంతటి ఆకర్షణ భారత దేశంలో ఉంది. గత 70 ఏళ్లలో ఎంతో విద్యావ్యాప్తి జరిగింది. అయితే బ్రిటీష్‌వారు అందరికీ విద్యను బోధించలేదు. తమ వద్ద చాకిరికి పనికి వచ్చేవారికి మాత్రమే చదువు చెప్పారు. దాదాపుగా అదే విద్యావిధానం నేటికీ కొనసాగుతుండగా, ప్రస్తుతం నాణ్యమైన విద్యపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. పరీక్షల పరంగా విద్యార్దుల్లో మానసిక వత్తిడులు సరికాదు. నేను కేంద్ర మంత్రికాగానే అందరూ నన్ను సన్మానిస్తామని అన్నారు. విద్యార్థులను పాఠ్యపుస్తకాల్లో ముం చెత్తడం కాకుండా వారిలోని సృజనాత్మకతను వెలికి తీయడమే అసలైన విద్యాబోధన.. విద్యావిధానంలో అదే మనం సాధించాల్సిన సంస్కరణ అని కేంద్ర మానవవనరుల శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. నేను ఇంతటి వాడు కావడానికి కారణమైన టీచర్లను సన్మానిస్తానని చెప్పాను. అందుకే గురుపూర్ణిమ రోజున పార్లమెంటు సభ్యుల్లోని 60 మంది ప్రొఫెసర్లను సన్మానించాను. ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ చేసిన నా 92 ఏళ్ల వయసున్న నా తల్లి నేటికి చదువుతుంది, బోధిస్తుంది, నేర్చుకుంటుంది. ప్రతి ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్దిగా కూడా ఉండాలని అయన అన్నారు. విద్యాలయాలు బాధా నిలయాలు కారాదు: సద్గురువు ఈషా యోగా కేంద్ర వ్యవస్థాపకులు సద్గురువు జగ్గి వాసుదేవ్ ప్రసంగిస్తూ, లేలేత బాల్య దశను విద్యాబోధనలతో భయపెడుతూ విద్యాలయాలను బాధా నిలయాలుగా మార్చరాదని ఉద్బోధించారు. బోధనాసిబ్బంది వల్లనే పాఠశాలకు వెళ్లేందుకు పిల్లలు భయపడుతున్నారు. వాస్తవానికి పిల్లలను సంతోషంగా ఉంచడం ఎంతో సులభం. పెద్దలు సైతం 24 గంటలపాటూ చీకు చింతాలేకుండా ఆలోచించండి వందేళ్లకు సమానమైన శక్తి లభిస్తుంది. ప్రతివారికి సంతోషంగా ఉండాలని ఉంటుంది, ఎలా ఉండాలో తెలియదు. అడిగితే మాత్రం తాము సంతోషంగా ఉన్నామని చెబుతారు. మట్టి వద్దు, చెట్టు వద్దు, మామిడి పండు మాత్రం కావాలంటే ఎలా. చదువుచెప్పేపుడు విద్యార్దులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకోండి. భయపెడుతూ చెప్పే బోధనా పద్దతుల వల్లనే విద్యార్దులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్దులను తమ జీవితాలను అనుభవించేందుకు అవకాశం కల్పించండి. 98 శాతం మార్కులు వస్తే ఆ 2 శాతం ఎందుకు రాలేదని ప్రశ్నించే తత్వం తల్లిదండ్రుల్లో పోవాలి. పిల్లలను భిన్నంగా చూడటం అలవాటు చేసుకోండి. ఈషాయోగా స్కూళ్లు అన్నింటిలా సాధారణమైనవే, అంకిత భావంతో పనిచేసే అందులోని సిబ్బంది వల్లనే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అలాగే మా విద్యార్దులు వారికి ఇష్టమైన రీతిలో చదువుచెప్పిస్తున్నాము, మాకు ఇష్టమైనట్లు కాదు. మరే దేశంలోనూ లేనట్లుగా అనేక భాషల సమ్మేళనం భారతదేశానికి గర్వకారణం. అయితే ప్రతి ఒక్క విద్యార్ది ఇంగ్లీషు దానితోపాటూ ఒక ప్రాంతీయ లేదా స్థానిక భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలి. బ్రిటీష్‌వాళ్లు మనకు ఎంత ద్రోహం చేసినా ఇంగ్లీషు భాష ఇచ్చి మేలు చేశారు. ఆలోచింపజేసిన చర్చగోష్టి: ప్రారంభోత్సవ కార్యక్రమానంతరం ఉదయం 11.30 నుండి రాత్రి 7 గంటల వరకు రెండు దశల్లో సాగిన విద్యావేత్తల, మేధావుల చర్చాగోష్టి అందరినీ ఆలోజింపజేసింది. చర్చగోష్టిలో తెరీ ప్రకృతి స్కూల్ గుర్గావ్ (డిల్లీ) డైరక్టర్ లతా వైద్యనాధన్, స్పెరనామిక్స్ ఎల్ఎల్సీ (యూఎస్ఏ) చైర్మన్ రాకేష్‌కౌల్, సృష్టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ డిజైన్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపక డైరక్టర్ గీతా నారాయణన్, వసంత్ వ్యాలీ స్కూల్ చైర్పర్సన్ రేఖాపురి, మిలినియం ఎడ్యుకేషన్ మేనేజిమెంట్ ఫౌండర్ సీఈఓ బిందురాణా, ఈషా విద్య అకడమిక్ డైరక్టర్, సీఈఓ కరడిపాత్ సీఈఓ సీపీ విశ్వనాధ్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్సిటిట్యూషనల్ సొసైటీ కార్యదర్శి, ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, రిసెర్చ్, ట్రైనింగ్ మాజీ సంచాలకులు జేఎస్ రాజ్‌పుత్, యూజీసీ మాజీ వైస్‌చైర్మన్ దేవరాజ్, ఎడ్యుకమ్ సీఎండీ శాంతను ప్రకాష్, మలయాళం యూనివర్సిటీ వైస్ చాన్సలర్, మాజీ ఐఏఎస్ అధికారి కే జయకుమార్ తదితరులు ప్రస్తుత విద్యావిధానం, తీసుకురావాల్సిన మార్పులు గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఈషా విద్య ఎడ్యుకేటింగ్ రూరల్ ఇండియా, ఈషా సంస్కృతి పాఠశాలల విద్యార్దులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉన్నత ఫలితాలు సాధించిన విద్యార్దులకు, బోధనా సిబ్బందికి పతకాలు, ప్రశంశాపత్రాలు అందజేశారు. -
యోగాసనాలు ఎందుకు చేయాలి?
యోగా ఆసనం అనేది ఒక భంగిమ. మీ శరీరం అసంఖ్యాకమైన భంగిమలను తీసుకోగలదు. వీటిలో కొన్ని భంగిమలు ‘యోగాసనాలు’గా గుర్తించబడ్డాయి. ‘యోగా’ అంటే మిమ్మల్ని ఒక ఉన్నత పార్శ్వానికి లేక ఉన్నతమైన జీవిత అవగాహనకు తీసుకువెళ్లేది. అందువల్ల ఎటువంటి భంగిమ అయితే మిమ్మల్ని ఉన్నత అవకాశాలవైపు తీసుకువెళ్తుందో దాన్నే యోగాసన అంటారు. మీరు అనుభవించే వివిధ మానసిక, భావోద్వేగ పరిస్థితులకు మీ శరీరం సహజంగానే ఒక భంగిమను తీసుకుంటుంది. మీరు ఆనందంగా ఉంటే, ఒక విధంగా కూర్చుంటారు. మీరు ఆనందంగా లేనప్పుడు, కోపంగా ఉన్నప్పుడు మరోలా కూర్చుంటారు. ఎవరైనా ఎలా కూర్చున్నారనే దాన్ని బట్టి వారి విషయంలో ఏమి జరుగుతుందో మనం కొన్నిసార్లు చెప్పగలుగుతాము. మీరు ఇది గమనించారా? ఆసన శాస్త్రంలో దీనికి విరుద్ధంగా చేస్తాము. అంటే చేతనంగా మీ శరీరాన్ని ఒక నిర్దిష్ట భంగిమలోకి తీసుకువెళ్లి మీ చైతన్యాన్ని పెంచేలా చేస్తాం. ఒక నిర్దిష్ట విధానంలో కూర్చోవడం ద్వారా మీరు ఎలా అనుభూతి చెందుతున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు అనే విషయాలను మార్చుకోవచ్చు. యోగాసనాలలో చైతన్యాన్ని పెంచే ప్రాథమిక ఆసనాలు 84 ఉన్నాయి. మనం 84 ఆసనాలు అన్నప్పుడు అవి 84 భంగిమలని అనుకోకండి. ఇది ముక్తి సాధించడానికి ఉన్న 84 వ్యవస్థలు, లేదా 84 మార్గాలు. మీకు కేవలం ఒక్క యోగాసనంలో ప్రావీణ్యత ఉంటే, ఈ సృష్టిలో తెలుసుకోదగినవన్నీ తెసుకోవచ్చు. యోగాసనాలు అనేవి వ్యాయామ ప్రక్రియలు కావు. అవి మీ ప్రాణశక్తిని ఒక నిర్దిష్ట దిశలో నడిపించే సున్నితమైన ప్రక్రియలు. ఇవి ఒక స్థాయి ఎరుక(ఎవేర్నెస్)తో చేయవలసి ఉంటుంది. యోగా సూత్రాలతో పతంజలి ‘‘సుఖం స్థిరం ఆసనం’’ అని అన్నారు. మీకు ఏ ఆసనమైతే అత్యంత సౌకర్యమైనదీ, స్థిరమైనదో, అదే మీ ఆసనం! మీ శరీరం అత్యంత సౌకర్యంగా ఉండి, మనస్సుకు కూడా పూర్తిగా హాయిగా ఉండి, మీ శక్తి పూర్తి ఉత్తేజంలో, సమతుల్యతతో ఉంటే అప్పుడు మీరు ఊరికే కూర్చున్నా, ధ్యానంలోనే ఉంటారు. ఆసనమనేది సహజసిద్ధంగా ధ్యానంలో ఉండటానికి మనం వేసే ఒక సన్నాహక అడుగు. అందువల్ల ఆసనాలు అనేవి ఒక విధంగా చురుకైన ధ్యాన మార్గాలే! - సద్గురు జగ్గీ వాసుదేవ్ www.sadhguru.org -
మనిషిపై సూర్యచంద్రుల ప్రభావం ఉంటుందా?
సద్గురు జగ్గీ వాసుదేవ్ www.sadhguru.org యోగా యోగాలో, హఠయోగా ఒక సన్నాహక ప్రక్రియ. హ అంటే సూర్యుడు. ఠ అంటే చంద్రుడు. మీలోని సూర్యచంద్రుల మధ్య, లేదా ఇడ, పింగళ అనే నాడుల మధ్య సమతుల్యతను తీసుకువచ్చే యోగానే హఠయోగా. హఠ అంటే మీ శరీరానికి కారణభూతమైన ఈ రెండు ముఖ్య అంశాల మధ్య ఒక విధమైన సమన్వయం తీసుకురావటం! ఈ భూమిపై ఉన్న జీవాన్ని ప్రభావితం చేయటంలో ఈ విశ్వంలోని అన్నిటి కంటే కూడా సూర్యుడు చాలా ప్రధానమైనవాడు. సూర్యుడు మన గ్రహం మీద ఉన్న జీవానికి మూలం. మనం తినే తిండి, తాగే నీరు, పీల్చుకునే గాలి ఇలా ప్రతీ దాంట్లో సూర్యుడి పాత్ర ఉంటుంది. సూర్య కిరణాలు ఈ గ్రహం మీద పడకపోతే, జీవ మనుగడకు అవకాశమే లేదు. అంతా ముగిసిపోతుంది. ఇప్పుడు అకస్మాత్తుగా సూర్యుడు అదృశ్యమైపోతే, 18 గంటల్లో అన్నీ గడ్డకట్టుకుపోతాయి. సముద్రాలన్నిటితో పాటు మీ రక్తం కూడా! అసలు ఈ గ్రహం మీద ఉత్పత్తి అయ్యే వేడి అంతా కూడా వివిధ మార్గాల్లో వ్యక్తమయ్యే సౌరశక్తి! చంద్రుడి వివిధ స్థానాలు కూడా మనిషి శారీరక, మానసిక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. భారతదేశంలో చంద్రుడి స్థానం ప్రతిరోజూ పరిగణనలోకి తీసుకోబడుతుంది. చంద్రుని వివిధ స్థానాలను మానవ శ్రేయస్సుకు ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఈ సంప్రదాయంలో ఎప్పుడో తెలుసుకున్నారు. మీరు ఒక స్థాయి ఎరుక(అవేర్నెస్), గ్రహణశక్తితో ఉంటే, చంద్రుని ప్రతీ దశలో మీ శరీరం కొంత భిన్నంగా ప్రవర్తించడం మీరు గమనిస్తారు. మహిళల్లోని పునరుత్పత్తి ప్రక్రియ, అంటే అసలు మానవ జనన ప్రక్రియే చంద్ర భ్రమణంతో చాలా లోతుగా అనుసంధానమై ఉంది. అంటే, భూమి చుట్టూ జరిగే చంద్ర భ్రమణం, మనిషిలో సంభవించే పునరావృత స్థితులు ఈ రెండూ చాలా లోతుగా అనుసంధానమై ఉంటాయి. మీ జీవితంలోని ప్రతీ క్షణం, మీరు చేసే ప్రతీ విషయం ఈ రెండు శక్తులచే, అంటే సూర్యచంద్రులచే నియంత్రించబడుతుంది. అందుకే, భౌతికంగా మనం చేసే ఆధ్యాత్మిక సాధన అంతా కూడా ఈ ప్రకృతి చక్రాలతో, అంటే సూర్యచంద్రభ్రమణాలతో మనల్ని మనం అనుసంధానం చేసుకోవటం కోసమే! ప్రేమాశీస్సులతో - సద్గురు