సాక్షి, చెన్నై: పలుమార్లు తనకు బెదిరింపులు వచ్చాయని, అయితే వాటికి తాను భయపడే ప్రసక్తే లేదని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. మంగళూరు కుక్కర్ బాంబు పేలుడు కేసు నిందితుడు సారిక్ తన మొబైల్ డీపీగా ఈషా యోగా కేంద్రంలోని ఆది యోగి విగ్రహం ఫొటోను కలిగి ఉన్నట్లు బయటపడిన విషయం తెలిసిందే. ఇతడు ఈషాయోగా కేంద్రాన్ని సందర్శించి రెక్కీ నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది.
దీనిపై ఓవైపు మంగళూరు పోలీసులు, మరోవైపు తమిళ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కోయంబత్తూరు, మదురై, కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ కేంద్రంగా ఈ విచారణ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆంగ్ల మీడియాతో జగ్గీ వాసుదేవ్ మాట్లాడారు. వాట్సాప్ డీపీగా సారిక్ ఆదియోగి విగ్రహాన్ని భక్తితో పెట్టుకున్నాడో లేదా.. తన మతాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశాడో స్పష్టంగా తెలియ లేదన్నారు. బెదిరింపులు తనకు కొత్త కాదని, ప్రాణానికి హాని కల్గిస్తామనే బెదిరింపులు ఎన్నోసార్లు వచ్చాయన్నారు. అయినా తాను ఇంకా జీవించే ఉన్నానని చమత్కరించారు.
చదవండి: జయలలితకు సరైన చికిత్స అందలేదు.. ఆర్ముగ స్వామి సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment