Mangaluru
-
స్విమ్మింగ్ పూల్‌లో గంతులేస్తూ..
దొడ్డబళ్లాపురం: మంగళూరు వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. సెలవులు గడుపుదామని వచ్చిన యువతులు నీట మునిగిపోయారు. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ముగ్గురు యువతులు మృతిచెందిన సంఘటన మంగళూరు శివారులోని ఉచ్చిల బీచ్‌ను ఆనుకుని ఉండే వాజ్కో బీచ్ రిసార్ట్‌లో చోటుచేసుకుంది. మైసూరుకు చెందిన ఎన్. నిశిత (21), పార్వతి (20), ఎండీ కీర్తన (21) మృతులు. వీకెండ్ కావడంతో వీరు శనివారం నాడు రిసార్ట్‌కు వచ్చారు. ఆదివారం ఉదయం 10 గంటలకు స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టసాగారు. కొంతసేపటికే నీట మునిగిపోయారు. యువతులకు ఈత రాకపోవడం, స్విమ్మింగ్ పూల్ ఆరు అడుగుల కంటే లోతుగా ఉండడం వల్ల మునిగిపోయినట్లు అనుమానాలున్నాయి. ఉళ్లాల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనాస్థలిని నగర పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ పరిశీలించారు. గంతులేస్తూ ఆడుతూనే..మొదట అందరూ ఈత కొలనులో గంతులేస్తూ సరదాగా ఆడుకుంటూ ఉన్నారు. అయితే కాస్త లోతైన చోట నిశిత మునిగిపోవడంతో ఆమెను కాపాడాలని పార్వతి ముందుకు వెళ్లింది. ఇదంతా చూస్తున్న కీర్తన కూడా వెళ్లింది. ఇలా వరుసగా మునిగి చనిపోయారని కమిషనర్ చెప్పారు. అక్కడి సీసీ కెమెరాలలో ఈ ఘోరం దృశ్యాలు నమోదయ్యాయి. అమ్మాయిల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు మధ్యాహ్నం కల్లా చేరుకుని విగతజీవులుగా ఉన్న కూతుళ్లను చూసి పెద్ద పెట్టున రోదించారు. వేలకు వేల ఫీజులు వసూలు చేసి రిసార్టులు, హోటళ్లలో కనీస భద్రతా వసతులు లేవని, ఫలితమే ఈ ఘోరమని ఆరోపణలున్నాయి. -
వ్యాపారి అదృశ్యం కలకలం.. బిడ్జ్ వద్ద ప్రమాదానికి గురైన కారు
బెంగళూరు: కర్నాటకలో ఓ వ్యాపారవేత్త అదృశ్యం కలకలం రేపుతోంది. ఆ వ్యాపారికి సంబంధించి ప్రమాదానికి గురైన బీఎండబ్ల్యూ కారును మంగళూరులోని ఓ బిడ్జ్ వద్ద ఆదివారం పోలీసులు గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మొహియుద్దీన్ బావా సోదరుడు వ్యాపారవేత్త ముంతాజ్ అలీ ఆదివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. ఆయన కుమార్తె పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆయన కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు వ్యాపారవేత్త ముంతాజ్ అలీ తన ఇంటి నుంచి బయలుదేరి కారులో మంగళూరు నగరం చుట్టూ తిరిగారు. 5 గంటల సమయంలో మంగళూరులోని కులూరు వంతెన దగ్గర ఆయన కారు ఆపారు. కారులో ప్రమాదానికి సంబంధించిన కొన్ని గుర్తులు ఉన్నాయని తెలిపారు. తన తండ్రి అదృశ్యానికి సంబంధించి ముంతాజ్ అలీ కుమార్తె స్థానిక పోలీసులకు సమాచారం అందించటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ వెల్లడించారు.ముంతాజ్ అలీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే.. ఆయన వంతెనపై నుంచి దూకి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నదిలో గాలించడానికి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, కోస్ట్ గార్డ్లను మోహరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.చదవండి: రూ. 1,800 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ పట్టివేత -
మంగళూరులో దాహం.. దాహం!
కర్నాటకలోని మంగళూరు ప్రజలు తాగునీటి ఎద్దడితో విలవిలలాడిపోతున్నారు. ఈ ప్రాంతానికి ప్రధాన నీటి వనరు అయిన నేత్రావతి నదిలో ఎక్కువ భాగం ఎండిపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురయ్యింది. దీంతో మంగళూరు మునిసిపల్ కార్పొరేషన్ సిటీలో రోజు విడిచి రోజు వారీగా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది.దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్ ముల్లై ముహిలన్ అధ్యక్షతన జరిగిన మంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఇతర అనుబంధ శాఖల అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి తోడు పట్టణ ప్రజలు నీటిని దుర్వినియోగం చేయకూడదని, గృహ అవసరాల కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం నీటిని వృథా చేయవద్దని అధికారులు కోరారు.గత ఐదేళ్లలో తొలిసారిగా మంగళూరు నగరం ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. నైరుతి రుతుపవనాలు సకాలంలో వస్తే నీటి ఎద్దడి సమస్య తీరుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. కర్నాటకలోని బెంగళూరు నగరం కూడా నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపధ్యంలో బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఇటీవలే నగరంలోని స్విమ్మింగ్ పూల్స్‌లో తాగునీటి వినియోగాన్ని నిషేధించింది. దీనిని ఉల్లంఘిస్తే రూ. ఐదువేలు జరిమానా విధిస్తామని బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. -
పరీక్షకు వచ్చిన విద్యార్థినిపై యాసిడ్ దాడి!
కర్ణాటకలోని మంగళూరులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నగరంలోని కడబా ప్రాంతంలో 17 ఏళ్ల మైనర్ బాలికపై ఓ యువకుడు యాసిడ్ దాడి చేశాడు. బాధితురాలు స్థానిక పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. ఆ బాలిక సోమవారం ఉదయం పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పరీక్షా కేంద్రం వద్ద కాపుగాసిన 23 ఏళ్ల అబిన్ ఆమెపై యాసిడ్ విసిరాడు. దీనిని గమనించిన అక్కడున్నవారు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అబిన్ కేరళకు చెందినవాడని, ఎంబీఏ చదువుకున్నాడని తెలిపారు. అతనికి బాధితురాలితో గతంలో పరిచయం ఉంది. నిందితుడు అబిన్ బాధితురాలు కేరళలో ఒకే ప్రాంతంలో ఉండేవారని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం బాధితురాలికి వైద్యులు చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
పిల్లల్లో ఆ భయం పోగొట్టేలా..
డాక్టర్: నీ టెడ్డీబేర్‌కు ఏమైంది? చిన్నారి: కాలు నొప్పి డాక్టర్: ఎక్కడ? చిన్నారి: ఇక్కడ డాక్టర్: ఏం కాదు... తగ్గిపోతుంది... ఇలాంటి క్లినిక్‌లు ఇప్పుడు మంగళూరులోని స్కూళ్లలో నిర్వహిస్తున్నారు డాక్టర్లు. యు.కె.జి. నుంచి 2వ తరగతిలోపు పిల్లల్లో హాస్పిటల్ భయం పోవడానికి వారి ఆరోగ్య సమస్యలు బయటకు చెప్పడానికి ఈ క్లినిక్‌లు ఉపయోగపడుతున్నాయి. పేషెంట్లుగా సొంత టెడ్డీబేర్లను తెమ్మనడంతో పిల్లలు వాటిని తీసుకుని ధైర్యంగా వస్తున్నారు. దేశంలోని అన్ని పల్లెల్లో ‘బొమ్మల ఆస్పత్రి’ పేరుతో ఇలాంటి క్లినిక్‌లు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మూడేళ్ల లోపు చంటిపిల్లలను హాస్పిటల్లో చూపించడం తల్లులకు కష్టం కాదు. కాని ఐదారేళ్లు వచ్చాక పిల్లలకు హాస్పిటల్ అంటే భయం వస్తుంది. డాక్టర్ని చూడటం, వ్యాక్సిన్ కోసం సూది వేయించుకోవడం, జ్వరాలకు సిరప్లు తాగాల్సి రావడం వారికి హాస్పిటల్ అంటే భయం వేసేలా చేస్తుంది. 5 ఏళ్ల నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు ఈ భయంతో ఏదైనా ఇబ్బంది ఉన్నా తల్లిదండ్రులకు చెప్పకపోవచ్చు– హాస్పిటల్‌కు వెళ్లాల్సి వస్తుందని. అంతేకాదు హాస్పిటల్‌కు తీసుకెళితే డాక్టర్‌కి చూపించి బయటకు వచ్చేంత వరకూ ఏడుస్తూనే మారాం చేస్తూనే ఉంటారు కొందరు పిల్లలు. దీని వల్ల తల్లిదండ్రులకే కాదు... క్లినిక్‌కు వచ్చిన ఇతర పిల్లలు, పెద్దలు కూడా ఇబ్బంది పడతారు. అందుకే వీరికి క్లినిక్లంటే భయం పోగొట్టాలి. దానికి ఏం చేయాలి? టెడ్డీ బేర్ క్లినిక్స్ యూకేలో ఇటీవల కాలంలో ‘టెడ్డీ బేర్’ క్లినిక్స్ నిర్వహిస్తున్నారు. 5 నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్లను పేషెంట్లకు మల్లే తెచ్చి డాక్టర్లకు చూపించడం కాన్సెప్ట్. ఇందుకోసం నిజమైన డాక్టర్లు నిర్దేశిత స్కూల్‌కు టీమ్‌గా వస్తారు.. లేదా ఏదైనా చిల్డ్రన్స్ హాస్పిటల్లో దీనిని నిర్వహిస్తారు. క్లినిక్స్ అంటే భయం పోగొట్టడమే ముఖ్యోద్దేశం. క్లినిక్స్‌లో ఎంత చక్కగా టెడ్డీ బేర్లకు వైద్యం జరుగుతుందో చూశాక తమకు కూడా అంతే ఈజీగా వైద్యం చేస్తారు అనే భావన పిల్లల్లో కలుగుతుంది. మంగుళూరులో ట్రెండ్ గత సంవత్సరం జూలై నుంచి మంగుళూరులోని చాలా స్కూళ్లల్లో విడతల వారీగా టెడ్డీబేర్ క్లినిక్స్ నడుస్తున్నాయి. ఇందుకు స్కూళ్ల యాజమాన్యాలు సహకరిస్తున్నాయి. ప్రయివేట్ ఆస్పత్రులు తమ ప్రచారం కోసమే కావచ్చు... లేదా పిల్లల పట్ల బాధ్యతతోనే కావచ్చు... చాలా ప్రొఫెషనల్‌గా ఈ క్లినిక్స్‌ను నిర్వహిస్తున్నారు. క్లినిక్ స్కూల్లో నడిపే రోజున పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్‌ను కాని లేదా మరేదైనా ఆటబొమ్మను (మనిషి, పెట్) తీసుకురావాలి. తమ పేషెంట్ పేరును అచ్చు హాస్పిటల్లో ఎలా రిజిస్టర్ చేయిస్తారో అలా చేయించాలి. ఆ తర్వాత ఓ.పీ.కి వెళ్లాలి. ఓ.పీ.లో డాక్టర్లు టెడ్డీబేర్‌కు ఏం ఇబ్బంది ఉందో అడుగుతారు. వైద్యం చేయాలంటే పొడవు, ఎత్తు చూడాలని చెప్పి చూస్తారు, పిల్లలు సాధారణంగా తమకున్న ఇబ్బందులే టెడ్డీబేర్‌కు ఉన్నట్టుగా చెబుతారు. టెడ్డీబేర్‌ను చూస్తున్నట్టుగా పిల్లల్ని కూడా వారి మూడ్‌ను బట్టి డాక్టర్లు చూస్తారు. పిల్లల హెల్త్ అసెస్మెంట్ను స్కూల్ సాయంతో పేరెంట్స్‌కు పంపుతారు. కంటి, పంటి పరీక్ష చిన్న పిల్లల్లో కంటి, పంటి పరీక్షలు ముఖ్యమైనవి. టెడ్డీబేర్ క్లినిక్స్ పేరుతో పిల్లలను ఉత్సాహపరిచి వారికి కంటి, పంటి పరీక్షలు కూడా డాక్టర్లు నిర్వహిస్తున్నారు. సాధారణ చెకప్‌ల ద్వారా వారిలో తగిన పోషక విలువలు ఉన్నాయా, వారు బలహీనంగా ఉన్నారా అనేవి కూడా చూస్తారు. ఏమైనా డాక్టర్ల పరిశీలన ఆ వయసు పిల్లలకు ప్రతి మూడు నెలలకు అవసరం. మంగుళూరు స్కూళ్లలో ఇదే జరుగుతూ ఉంది. మిగతా రాష్ట్రాల్లో కూడా పల్లెల్లో చిన్నారులకు ఈ ‘బొమ్మల ఆస్పత్రు’లు నడపడం చాలా బాగుంటుంది. పల్లె పిల్లలు డాక్టర్లకు చూపించుకునే వీలుండదు చాలాసార్లు. తల్లిదండ్రులు తీసుకెళ్లరు. ఆస్పత్రులంటే భయపడేవారు కూడా ఎక్కువ మందే ఉంటారు. అందుకోసమే బొమ్మల ఆస్పత్రుల ఐడియాను ప్రభుత్వాలు అందిపుచ్చుకుంటే చిన్నపిల్లల ఆరోగ్యస్థాయి, వారి సాధారణ అనారోగ్య సమస్యలు అంచనాకొస్తాయి. -
చేదు అనుభవం.. బస్సులో ప్రయాణికురాలిపై యువకుడి మూత్ర విసర్జన
సాక్షి బెంగళూరు: విమానంలో ఓ వృద్ధురాలిపై బెంగళూరుకు చెందిన బడా కంపెనీ ఉన్నతాధికారి మద్యం మత్తులో మూత్రం పోయడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. తాజాగా కర్ణాటక ఆర్టీసీ బస్సులో అటువంటి పాడు పని చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి విజయపుర నుంచి మంగళూరుకు వెళుతున్న కేఎస్ఆర్టీసీ స్లీపర్ బస్సులో ఈ దారుణం జరిగింది. మార్గమధ్యంలో కిరేసూరు వద్ద భోజనం కోసం డ్రైవర్ బస్సును ఆపితే కొందరు దిగిపోయారు. 28వ సీటులో ఉన్న రామప్ప (25) అనే యువకుడు తన సీటు నుంచి లేచి వచ్చి 3వ నంబరు సీటులో కూర్చున్న ఒక యువతిపై మూత్ర విసర్జన చేశాడు. భయపడిన ఆ యువతి కిందకు దిగి డాబాలో భోజనం చేస్తున్న డ్రైవర్, కండక్టర్‌కు విషయం తెలిపింది. డ్రైవర్, కండక్టర్ అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తానని అతడు చెప్పాడు. మద్యం మత్తులో ఇలా చేసి ఉంటాడని అనుమానించారు. అతన్ని అక్కడే వదిలేసి బస్సు బయల్దేరింది. -
ఎన్ఐఏ మెరుపు దాడులు.. మూడు రాష్ట్రాల్లో 60 చోట్ల సోదాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ బుధవారం మెరుపు దాడులు చేపట్టింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని 60 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. గత ఏడాది కోయంబత్తూరు, మంగళూరు నగరాల్లో జరిగిన రెండు వేరువేరు పేలుళ్ల ఘటనల నేపథ్యంలో మూడు రాష్ట్రాల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ సానుభూతిపరులుగా అనమానిస్తున్న వారిని అదుపులోకి తీసుకునేందుకు ఈ దాడులు చేపట్టింది. కాగా గతేడాది అక్టోబర్ 23న తమిళనాడులోని కోయంబత్తూరులో కొట్టె ఈశ్వరన్ ఆలయం ముందు కారులో సిలిండర్ పేలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అనుమానిత ఉగ్రవాది జమేషా మబీన్ మరణించాడు. దీనిపై అక్టోబర్ 27న ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించగా.. ఇప్పటి వరకు ఈ కేసులో 11 మంది నిందితులను అరెస్ట్ చేసింది. జమీజా ముబీన్ తన సహచరులతో కలిసి దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఐసిస్‌తో కలిసి ఆలయ సముదాయాన్ని దెబ్బతియాలనే ఉద్ధేశంతో ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. దీంతో అతనితో సంబంధాలున్న వారిని ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. అదే విధంగా 2022 నవంబర్ 19న కర్ణాటకలోని మంగళూరులో ఆటో రిక్షాలో ప్రెషర్ కుక్కర్ బాంబు పేలింది. ఈ పేలుడులో ఆటో డ్రైవర్‌తోపాటు ప్రెషర్ కుక్కర్ తీసుకెళ్తున్న నిందితుడు మహ్మద్ షరీక్ కూడా గాయపడ్డాడు. ఈ కేసుపై డిసెంబర్లో ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. పలు కేసుల్లో నిందితుడు షరీక్ రాష్టరాంష్ట్రంలోని కోస్తా ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా పెద్ద ఎత్తున దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే ఐఎస్ఐఎస్కు చెందిన అనుమానితుల కదలికలు ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించిన ఎన్ఐఏ ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: IT Raids on BBC: బీబీసీపై ఐటీ సర్వే -
మంగళూరు అబ్బాయి, నెదర్లాండ్స్ అమ్మాయి
సాక్షి, యశవంతపుర: నెదర్లాండ్‌కు చెందిన అమ్మాయితో మంగళూరుకు చెందిన యువకుడు పెళ్లి చేసుకున్నాడు. సురత్కల్‌కు చెందిన ముస్లిం యువకుడు నెదర్లాండ్స్ అమ్మాయిని ప్రేమించటంతో ఇద్దరి వివాహం ఇటీవల సురత్కల్‌లో జరిగింది. ముస్లిం సంప్రదాయం ప్రకారం ఇద్దరూ ఒక్కటయ్యారు. (చదవండి: బిడ్డలతో సెల్ టవర్ ఎక్కిన తండ్రి ) -
బుర్ఖా ధరించి బాయ్స్ డ్యాన్స్.. కాలేజీ ఈవెంట్‌పై దుమారం!
బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం మరోమారు తెరపైకి వచ్చింది. మంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో బుర్ఖా ధరించి నలుగురు విద్యార్థులు బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు. బుర్ఖా ధరించి నలుగురు బాయ్స్ నృత్యం చేస్తున్న వీడియో వైరల్‌గా మారిన క్రమంలో వారిని సస్పెండ్ చేసింది కాలేజీ యాజమాన్యం. ప్రస్తుతం ఈ సంఘటన కర్ణాటకలో వివాదాస్పదంగా మారింది. సెయింట్ జోసెఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో నలుగురు బాయ్స్ బుర్ఖా ధరించి నృత్యం చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారిన క్రమంలో కళాశాల యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మతపరమైన సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా ఇలాంటి డ్యాన్సులకు అనుమతి ఇవ్వటమేంటని పలువురు ప్రశ్నించారు. మరోవైపు.. బాలీవుడ్ సాంగ్‌కు తాము అనుమతించలేదని, విద్యార్థులు తమకు తెలియకుండా స్టేజ్ పైకి వెళ్లారని కాలేజీ అధికారులు తెలిపారు. తమ కళాశాల మార్గదర్శకాలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ‘కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ముస్లిం వర్గానికి చెందిన విద్యార్థులు స్టేజ్‌పైకి వెళ్లి డ్యాన్స్ చేశారు. అప్పుడు తీసిన వీడియో వైరల్‌గా మారింది. అది కళాశాల ఆమోదించిన కార్యక్రమంలో భాగం కాదు. వేదికపైకి వెళ్లి డ్యాన్స్ చేసిన నలుగురు విద్యార్థులను సస్పెండ్ చేశాం. దర్యాప్తు జరుగుతోంది.’ అని కళాశాల ప్రిన్సిపాల్ ఓ ప్రకటన చేశారు. మతసామరస్యాలను దెబ్బతీసే కార్యక్రమాలను తాము ప్రోత్సహించమని స్పష్టం చేశారు. This is from #Mangaluru, #Karnataka. In an Event at St.Joseph Engineering College, Mangaluru students seen wearing #Burkha and performing obscene steps for a item song mocking #Burqa & #Hijab.#DakshinKannada #Mangalore #StJosephEngineeringCollege pic.twitter.com/Q6jmN5p77F — Hate Detector 🔍 (@HateDetectors) December 7, 2022 ఇదీ చదవండి: ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు.. ఐదేళ్లలో ఖర్చు ఎంతో తెలుసా? -
Bengaluru: షారిఖ్‌పై ఉగ్ర ముఠాల గురి?.. రహస్యాలన్నీ చెప్పేస్తాడని భయం
రేవు నగరిలో బాంబు విస్ఫోటం దేశమంతటా చర్చనీయాంశమైంది. ఈ పేలుడులో ప్రాణాలతో దొరికిపోయిన ఉగ్ర అనుమానితుడు షారిఖ్ వద్ద విలువైన సమాచారం పోలీసులకు లభిస్తోంది. బడా ఉగ్రవాదుల నెట్వర్క్ తాళం అతని వద్ద ఉందని ఎన్ఐఏ కూడా విచారిస్తోంది. ఇక షారిఖ్ వల్ల తమకు నష్టమే తప్ప లాభం లేదనుకున్న ఉగ్రవాద ముఠాలు అతన్ని హతమార్చాలని కుట్రలు చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. సాక్షి, బెంగళూరు(యశవంతపుర): మంగళూరు కుక్కర్ బాంబ్ పేలుడు నిందితుడు షారిఖ్‌ను అంతమొందించాలని ఉగ్రవాద ముఠాలు ప్లాన్ వేసినట్లు అనుమానాలు వచ్చాయి. దీంతో సోమవారం నుంచి షారిఖ్ చికిత్స పొందుతున్న ఆస్పత్రి చుట్టూ భద్రతను మరింత పెంచారు. ఓ ఉగ్రవాద సంస్థ చేసిన పోస్ట్‌లో షారిఖ్‌ను హత్య చేయాలనేలా కొన్ని ఆధారాలు పోలీసులకు చిక్కాయి. స్లీపర్ సెల్స్ ఉగ్రవాదులు ఈ దాడి చేసే అవకాశం ఉంది. షారిఖ్ వల్ల తమ రహస్యాలన్నీ పోలీసులకు చేరిపోతాయని, అందరూ ఇబ్బందుల్లో పడతామని, కాబట్టి అతన్ని హతమారిస్తే ఈ సమస్య ఇంతటితో అయిపోతుందని ఉగ్రవాదుల ఆలోచనగా పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఆస్పత్రి గదుల వద్ద మెటల్ డిటెక్టర్‌ను ఏర్పాటు చేసి వచ్చి వెళ్లేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. షారిఖ్ కోలుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఫోన్లో బాంబుల తయారీ, ఐసిస్, అల్‌ఖైదా వీడియోలు నిందితుడు షారిఖ్ మొబైల్లో 12 వందల వీడియోలు బయట పడ్డాయి. ఇందులో బాంబ్‌ను ఎలా తయారు చేయాలనే వీడియోలతో పాటు ఐసిస్, అల్‌ఖైదా ఉగ్రవాదుల వీడియోలు ఉండటం పోలీసు వర్గాలను ఆందోళన కలిగిస్తోంది. ఇతడు అనేక చోట్ల భారీ మొత్తాల్లో నగదు వ్యవహారం చేశాడు. నాలుగేళ్ల నుంచి బాంబ్ తయారీ కోసం తపించేవాడని, కొన్నిసార్లు ఉన్మాదంగా ప్రవర్తించేవాడని షారిఖ్ కుటుంబసభ్యులు పోలీసులకు వివరించారు. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకాలోని తన స్వగ్రామంలో బాంబ్‌ను తయారు చేసి పేల్చిన సంగతి బయట పడింది. చిన్నవయస్సులోనే దారి తప్పి ఇలాంటి ఘటనలకు పాల్పడటంపై గ్రామస్థులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేలుడు రోజున షారిఖ్‌తో పాటు బ్యాగ్ తగిలించుకొని వచ్చిన యువకుడు అదృశ్యమయ్యాడు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నా జాడ లేదు. వలస కార్మికులపై నిఘా దక్షిణ కన్నడ జిల్లాలో పోలీసులు వలస కార్మికుల వివరాలను సేకరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కారి్మకుల వివరాలను సేకరించేపనిలో ఉన్నారు. ఇసుక తరలింపు, రబ్బర్, వక్కతోటలు, సిమెంట్, టైల్స్, గ్రానైట్, హోటల్, బార్లు, ఎస్టేట్లలో పని చేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కారి్మకుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: స్వామీజీ తీరప్రాంతంలో అనుమానాస్పదమైన కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తులపై నిఘా పెట్టాలని ఉడుపి పేజావర విశ్వప్రసన్నతీర్థ స్వామి ప్రజలను హెచ్చరించారు. అయన సోమవారం మంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. కుక్కర్ బాంబ్ పేలుడు తరువాత కరావళిలో జరుగుతున్న ఉగ్రవాదుల కార్యకలాపాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనుమానంగా కనిపించేవారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కరావళి ప్రాంతాలలో అనేక జాతర, తిరునాళ్లు జరుగుతున్నాయి. ఇలాంటి రద్దీ ప్రదేశాలలో ఏదైనా జరిగితే పెద్ద ముప్పు ఏర్పడుతుందన్నారు. -
బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు: సద్గురు
సాక్షి, చెన్నై: పలుమార్లు తనకు బెదిరింపులు వచ్చాయని, అయితే వాటికి తాను భయపడే ప్రసక్తే లేదని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. మంగళూరు కుక్కర్ బాంబు పేలుడు కేసు నిందితుడు సారిక్ తన మొబైల్ డీపీగా ఈషా యోగా కేంద్రంలోని ఆది యోగి విగ్రహం ఫొటోను కలిగి ఉన్నట్లు బయటపడిన విషయం తెలిసిందే. ఇతడు ఈషాయోగా కేంద్రాన్ని సందర్శించి రెక్కీ నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఓవైపు మంగళూరు పోలీసులు, మరోవైపు తమిళ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కోయంబత్తూరు, మదురై, కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ కేంద్రంగా ఈ విచారణ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆంగ్ల మీడియాతో జగ్గీ వాసుదేవ్ మాట్లాడారు. వాట్సాప్ డీపీగా సారిక్ ఆదియోగి విగ్రహాన్ని భక్తితో పెట్టుకున్నాడో లేదా.. తన మతాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశాడో స్పష్టంగా తెలియ లేదన్నారు. బెదిరింపులు తనకు కొత్త కాదని, ప్రాణానికి హాని కల్గిస్తామనే బెదిరింపులు ఎన్నోసార్లు వచ్చాయన్నారు. అయినా తాను ఇంకా జీవించే ఉన్నానని చమత్కరించారు. చదవండి: జయలలితకు సరైన చికిత్స అందలేదు.. ఆర్ముగ స్వామి సంచలన వ్యాఖ్యలు -
మంగళూరు పేలుడు: షరీఖ్ కళ్లు తెరవాలని పోలీసులు..
బెంగళూరు: శనివారం సాయంత్రం మంగళూరు మైసూర్ శివారులో ఓ ఆటోలో ఉన్నట్లుండి పేలుడు సంభవించిన ఘటన.. ప్రమాదం కాదని, ఉగ్రకోణం ఉందని తేలడంతో కర్ణాటక ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పైగా అంతర్జాతీయ ఉగ్రసంస్థ ప్రమేయం బయటపడడంతో.. విస్తృత దర్యాప్తు ద్వారా తీగ లాగే యత్నంలో ఉంది కర్ణాటక పోలీస్ శాఖ. ఈ క్రమంలో.. పేలుడులో గాయపడ్డ మొహమ్మద్ షరీఖ్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. కర్ణాటక పోలీసుల కథనం ప్రకారం.. శివమొగ్గ జిల్లా తీర్థాహల్లికి చెందిన షరీఖ్.. ఆటోలో డిటోనేటర్ ఫిక్స్ చేసిన ప్రెషర్‌కుక్కర్ బాంబుతో ప్రయాణించారు. మంగళూరు శివారులోకి రాగానే అది పేలిపోయింది. దీంతో ఆటో డ్రైవర్‌తో పాటు షరీఖ్ కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం నగరంలోని ఓ ఆస్పత్రిలో అతనికి చికిత్స అందుతోంది. ఇక ఇది ముమ్మాటికీ ఉగ్ర చర్యగానే ప్రకటించిన కర్ణాటక పోలీసు శాఖ.. కేంద్ర సంస్థలతో కలిసి దర్యాప్తు చేపడుతోంది. నగరంలో విధ్వంసం సృష్టించే ఉద్దేశంతోనే షరీఖ్ యత్నించినట్లు భావిస్తున్నామని అదనపు డీజీపీ అలోక్ తెలిపారు. 24 ఏళ్ల వయసున్న షరీఖ్‌పై ఓ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ప్రభావం ఉందని శాంతి భద్రతల అదనపు డీజీపీ అలోక్ కుమార్ సోమవారం వెల్లడించారు. అంతేకాదు.. కర్ణాటక బయట అతనికి ఉన్న లింకులను కనిపెట్టేందుకు పోలీస్ శాఖ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. బెంగళూరు సుద్ధాగుంటెపాళ్యాకు చెందిన అబ్దుల్ మాటీన్ తాహా.. షరీఖ్‌కు గతంలో శిక్షకుడిగా వ్యవహరించాడు. అంతేకాదు అతనిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఐదు లక్షల రివార్డు ప్రకటించింది అని అడిషినల్ డీజీపీ వెల్లడించారు. అతను(షరీఖ్) ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని, తద్వారా అతన్ని విచారించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన అంటున్నారు. సుమారు 45 శాతం కాలిన గాయాలతో.. మాట్లాడలేని స్థితిలో చికిత్స పొందుతున్నాడు ఆ యువకుడు. ఇక.. మైసూర్లో షరీఖ్ అద్దెకు ఉంటున్న ఇంట్లో అగ్గిపెట్టెలు, పాస్పరస్, సల్ఫర్, గీతలు, నట్లు-బోలట్లు లభించాయి. ఆ ఇంటి ఓనర్ మోహన్ కుమార్‌కు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధారించారు. ఇక ప్రేమ్ రాజ్ అనే పేరుతో ఫేక్ ఆధార్‌కార్డు తీసి.. ఆ గుర్తింపుతో దాడులకు యత్నించి ఉంటాడని, ఇంట్లోనే ప్రెషర్ కుక్కర్ బాంబ్ తయారుచేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మంగళూరు, శివమొగ్గ, మైసూర్, తీర్థహల్లితో పాటు మరో మూడు చోట్ల ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. #Mangaluru மங்களூர் ஆட்டோவில் குண்டு வெடிப்பு பயங்கரவாத செயல் என்று டிஜிபி அறிவிப்பு pic.twitter.com/rPDLRHgLMY — E Chidambaram. (@JaiRam92739628) November 20, 2022 మరికొందరికి బ్రెయిన్‌వాష్..? ఇదిలా ఉంటే 24 ఏళ్ల షరీఖ్.. ఓ బట్టల దుకాణంలో పని చేసేవాడు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు గానూ UAPA కింద అతనిపై కేసు కూడా నమోదు అయ్యింది. మంగళూరులో గతంలో మత సంబంధిత అభ్యంతరకర రాతలు, బొమ్మలు గీసి.. జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడు. శివమొగ్గలో పంద్రాగష్టున జరిగిన మత ఘర్షణల్లోనూ ఇతని పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ సమయంలో ఒకతన్ని కత్తితో పొడిచిన కేసులో సహ నిందితుడిగా ఉండడమే కాదు.. ఆ కేసులో పరారీ నిందితుడిగా ఉన్నాడు షరీఖ్. ఈ కేసులో అరెస్ట్ అయిన యాసిన్, ఆమాజ్‌లు.. షరీఖ్ తమకు బ్రెయిన్‌వాష్ చేశాడని వెల్లడించారు. అంతేకాదు.. అతనికి సంబంధాలు ఉన్న ఉగ్ర సంస్థ కోసం ఇక్కడా షరీఖ్ పని చేశాడని వాంగ్మూలం ఇచ్చారు. బ్రిటిష్ వాళ్ల నుంచి భారత్‌కు సిద్ధించింది నిజమైన స్వాతంత్రం కాదని..ఇస్లాం రాజ్య స్థాపనతోనే అది పూర్తవుతుందని ఇతరులకు షరీఖ్ బోధించేవాడని పోలీసులు వెల్లడించారు. Karnataka | Mangaluru Police displays the material recovered from the residence of Mangaluru autorickshaw blast accused, Sharik. pic.twitter.com/y3Atxfi96p — ANI (@ANI) November 21, 2022 సిరియాకు చెందిన ఆ మిలిటెంట్ సంస్థ నుంచి ఓ మెసేజింగ్ యాప్ ద్వారా సందేశం అందుకున్న షరీఖ్.. అందులోని పీడీఎఫ్ ఫార్మట్ డాక్యుమెంట్ ద్వారా బాంబు ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాడని కర్ణాటక పోలీసులు ట్రేస్ చేయగలిగారు. అంతేకాదు తుంగ నది తీరాన బాంబు పేలుడు తీవ్రతను తెలుసుకునేందుకు.. ట్రయల్‌ను సైతం నిర్వహించారని పోలీసులు తెలిపారు. -
రోడ్డుపై పేలిన ఆటో రిక్షా.. భయంతో జనం పరుగులు
మంగళూరు: రహదారిపై ఒక్కసారిగా ఆటో రిక్షా పేలిపోయింది. దట్టమైన పొగ కమ్ముకోవటంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, పాదచారులు భయంతో పరుగులు పెట్టారు. ఈ సంఘటన కర్ణాటకలోని మంగళూరులో శనివారం మధ్యాహ్నం జరిగింది. ఈ పేలుడులో ఆటో డ్రైవర్‌తో పాటు ఓ ప్రయాణికుడు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలని, పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు మంగళూరు పోలీస్ చీఫ్ ఎన్ శశికుమార్ తెలిపారు. ‘ప్రమాదానికి గల కారణాలను అంచనా వేయటం తొందరపాటు అవుతుంది. ఆటోలో మంటలు వచ్చినట్లు డ్రైవర్ తెలిపాడు. డ్రైవర్, ప్రయాణికుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. రూమర్స్ వ్యాప్తి చేయకూడదని ప్రజలను కోరుతున్నాం. ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలి. బాధితులతో మాట్లాడిన తర్వాత వివరాలను వెల్లడిస్తాం.’ ఎని తెలిపారు శశికుమార్. రోడ్డుపై ఆటో రిక్షా పేలిపోయిన సంఘటన స్థానికంగా ఉండే ఓ దుకాణం సీసీటీవీ కెమెరాలో నమోదైంది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒక్కసారిగా పేలుడుతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగ అలుముకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. మరోవైపు.. ఆటోలోని ప్రయాణికుడు ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకెళ్తున్నాడని, ముందుగా దానికి మంటలు అంటుకుని వ్యాపించాయని భావిస్తున్నారు. Blast reported inside an auto rikshaw in #Mangaluru City, reportedly two people injured. Investigations ON. pic.twitter.com/6yureZ5n7D — Sumit Chaudhary (@SumitDefence) November 19, 2022 ఇదీ చదవండి: నెల ఆగితే పండంటి బిడ్డకు జన్మనిచ్చేది.. ఇంతలోనే ఘోర ప్రమాదం.. -
ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు.. పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్..!
బెంగళూరు: కర్ణాటక మంగళూరుకు చెందిన ఓ వ్యక్తి దివాళీ సేల్ సందర్భంగా అక్టోబర్ 15న ఫ్లిప్‌కార్ట్‌లో 'ఏసస్ టఫ్' గేమింగ్ ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు. అక్టోబర్ 20న ఇంటికి పార్సిల్ వచ్చింది. అయితే అది ఓపెన్ చేసిన అతనికి షాక్ తగిలింది. పార్సిల్ బాక్స్‌లో ల్యాప్‌టాప్‌కు బదులు పెద్ద రాయి, ఈ-వేస్ట్ వచ్చింది. దీంతో అతడు ఫ్లిప్‌కార్డ్ కస్టమర్ కేర్‌ను సంప్రదించాడు. దాన్ని రిటర్న్ తీసుకునేందుకు వారు నిరాకరించారు. ల్యాప్ ఆర్డర్ చేసిన వ్యక్తి చిన్మయ రమణ ఈ విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేశాడు. తనకు వచ్చిన పార్సిల్లో ల్యాప్‌టాప్ బాక్స్‌పై ప్రోడక్ట్ డీటేయిల్స్‌ను చింపేశారని, అది ఓపెన్ చేసి చూస్తే రాయి, కంప్యూటర్ వేస్టేజ్ ఉందని వాపోయాడు. ఈ విషయంపై ఫ్లిప్‌కార్ట్‌ను సంప్రదించినా సరైన స్పందన లేదని, ఈ-మెయిల్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశాడు. తాను సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేసినా.. మూడు రోజుల తర్వాత వారు స్పందించారని రమణ వాపోయాడు. రీఫండ్ ఇచ్చేందుకు సెల్లర్ నిరాకరించాడని, పార్సిల్ డెలీవరీ సమయంలో ఎలాంటి డ్యామేజీ కూడా జరగలేదని చెప్పారని తెలిపాడు. ఫ్లిప్‌కార్ట్ సర్వీసు అస్సలు బాగాలేదని రమణ ఆరోపించాడు. తన ఫిర్యాదు అనంతరం మళ్లీ అప్డేట్ ఇస్తామని చెప్పారని, కానీ ఆ తర్వాత ఎన్నిసార్లు ఈమెయిల్ పంపినా ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నాడు. తాను చెప్పేది అబద్దమని ఎవరికైనా అన్పిస్తే, తన ఖాతా పాత ఆర్డర్లు చెక్‌చేసుకోవచ్చని చెప్పాడు. 2015 నుంచి తాను ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌గా ఉన్నానని, చాలా ఆర్డర్లు పెట్టానని వివరించాడు. Ordered for laptop and recived a big stone and E-waste ! During Diwali sale on Flipkart!@VicPranav @geekyranjit @ChinmayDhumal @GyanTherapy @Dhananjay_Tech @technolobeYT @AmreliaRuhez @munchyzmunch @naman_nan @C4ETech @r3dash @gizmoddict @KaroulSahil @yabhishekhd @C4EAsh pic.twitter.com/XKZVMVd4HK — Chinmaya Ramana (@Chinmaya_ramana) October 23, 2022 చదవండి: ఫోన్ రిపైర్ చేసేలోపే ఒక్కసారిగా బ్లాస్ట్: వీడియో వైరల్ -
భార్య వేధింపులు తాళలేక...
యశవంతపుర: భార్య వేధింపులను తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కమగళూరు జిల్లా కొప్ప తాలూకా జయపుర గ్రామంలో జరిగింది. అరవింద్ (42) తన తోటలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు డెత్‌నోట్ రాసి తన మరణానికి భార్య, ఆమె బంధువులు, పోలీసుల పేర్లు రాశాడు. 12 ఏళ్ల క్రితం అరవింద్‌తో రేఖనిచ్చి వివాహం చేశారు. రోజు ఏదో విషయంపై గొడవ పడేవారు. ఇద్దరి మధ్య గొడవలు జరగటంతో రేఖ బంధువులు ఇటీవల జయపుర స్టేషన్‌కు పిలిపించి విచారించారు. దీంతో విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకున్నాడు. జయపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త చేతిలో భార్య హతం : కుటుంబ కలహాలతో భర్త భార్యను హత్య చేసిన ఘటన హాసన జిల్లా బేలూరు తాలూకా చీకనహళ్లి గ్రామంలో మంగళవారం జరిగింది. ఇంద్రమ్మ (48)ను ఆమె భర్త చంద్రేగౌడ నలుగురితో కలిసి హత్య చేసి పరారయ్యాడు. అడ్డుపడిన మహిళలపై కూడా నిందితులు దాడి చేశాడు. ఆరు నెలల క్రితం చంద్రమ్మను హత్య చేయటానికి పథకం వేయగా ఆమె తప్పించుకుంది. పుట్టినిల్లు చీకనహళ్లిలో ఉంటూ కూలీ పనులకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: హెలికాప్టర్ సర్వీస్ రూ. 17 వేలు టోపి) -
యువతి చేష్టలతో విమానంలో గందరగోళం
సాక్షి, బెంగళూరు: మంగుళూరు విమానాశ్రయంలో ప్రయాణికురాలు మొబైల్ ఫోన్లో మాట్లాడడంతో గందరగోళం ఏర్పడి విమానం ఆలస్యమైంది. విమానాన్ని నిలిపివేసి తనిఖీలు చేశారు. మంగుళూరుకు చెందిన ఓ యువతి ఆదివారం మధ్యాహ్నం బెంగళూరుకు వెళ్లే విమానం ఎక్కారు. ముంబైలో ఉన్న తన స్నేహితుడికి ఫోన్ చేసి మంగుళూరు విమానాశ్రయంలో ఉన్న భద్రత లోపాలను తమాషాగా చెబుతూ ఉంది. దీనిని గమనించిన పక్క సీటులోని ప్రయాణికుడు అనుమానంతో విమాన సిబ్బందికి సమాచారమిచ్చాడు. దీంతో ఆ విమానంలోని ప్రయాణికులను బయటకు పంపించి, విమానంలో తనిఖీలు చేసి అనంతరం ప్రయాణానికి అనుమతించారు. -
ప్రియురాలితో మొబైల్ చాటింగ్ ... దెబ్బకు ఆగిపోయిన విమానం
బెంగళూరు: ఒక వ్యక్తి మొబైల్‌కి సందేశం రావడంతో మంగళూరు నుంచి ముంబైకి వెళ్లాల్సిన విమానం ఆరుగంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఇండిగో విమానాన్ని ముంబై బయలుదేరడానికి అనుమతించే ముందు పోలీసులు ప్రయాణికులందర్నీ విమానం నుంచి దించి హఠాత్తుగా తనీఖీలు చేయడం మొదలు పెట్టారు. పోలీసులు ఇంత అకస్మాత్తుగా తనీఖీలు చేయడానికి కారణం అందులో ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలు. ఆమె తన సహా ప్రయాణికుడి మొబైల్‌కి అనుమానాస్పద సందేశం రావడంతో ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని అప్రమత్తం చేసింది. దీంతో సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ని అప్రమత్తం చేయడంతో టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న విమానం కాస్త ఆగిపోయింది. తిరిగి ఎయిర్ పోర్టు బేకు చేరుకుంది. ఇంతకీ ఆ వ్యక్తి తన మొబైల్లో ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నాడు. అదే విమానాశ్రయం నుంచి బెంగళూరుకు విమానం ఎక్కేందుకు వచ్చిన తనప్రియురాలితో మొబైల్లో చాటింగ్ చేస్తున్నాడు. తన స్నేహితురాలు కర్ణాటక రాజధాని వెళ్లే విమానం మిస్సైందని చెప్పుకొచ్చాడు. ఐతే పోలీసులు అతన్ని చాలా సేపు విచారించిన తర్వాత గానీ ప్రయాణించేందుకు అనుమతించ లేదు. ఈ మేరకు ప్రయాణికులందర్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత దాదాపు 185 మంది ప్రయాణికులను ముంబై వెళ్లే విమానంలోకి తిరిగి అనుమతించారు. దీంతో విమానం సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరింది. ఐతే ఇది భద్రతల నడుమ ఇద్దరి వ్యక్తుల మధ్య స్నేహ పూర్వక సంభాషణే కావడంతో ఆ వ్యక్తి పై ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని నగర పోలీస్ కమిషనర్ ఎన్ శశికుమార్ అన్నారు. (చదవండి: కాల్చేస్తాం, జరిమానా కట్టేస్తాం ) -
కర్ణాటకలో ముసుగు దుండగుల దాడి కలకలం
బెంగళూరు: కర్ణాటకలో గుంపు హత్య కలకలం రేగింది. గురువారం సాయంత్రం మంగళూరు సురత్కల్‌లోలో నల్ల మాస్కుల్లో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడ్డ బాధితుడు చికిత్స పొందుతూ.. కన్నుమూశాడు. సీసీటీవీ ఫుటేజీలో ఈ దాడి ఘటన రికార్డు అయ్యింది. కారులో వచ్చిన దుండగులు.. అప్పుడే ఓ బట్టల దుకాణం నుంచి బయటకు వచ్చిన బాధితుడి వైపు దూసుకొచ్చారు. భయంతో అతను పరుగులు తీసే ప్రయత్నం చేయగా.. ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కర్రలతో, కత్తులతో దాడికి పాల్పడ్డారు. అనంతరం వాళ్లు పారిపోగా.. బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తొలుత పోలీసులు వెల్లడించారు. ఆపై అతను మరణించినట్లు తెలుస్తోంది. Karnataka | Last rites of man hacked to death by an unidentified group yesterday being performed in Surathkal near Mangaluru pic.twitter.com/40mIW4SleD — ANI (@ANI) July 29, 2022 ఘటన తర్వాత సురత్కల్‌ను తమ అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు నగర కమిషనర్. 144 సెక్షన్ విధించి.. జనాల్ని గుమిగూడకుండా చూస్తున్నారు పోలీసులు. దాడికి గల కారణాల గురించి తెలియాల్సి ఉంది. బాధితుడిని 25 ఏళ్ల ఫాజిల్‌గా గుర్తించారు. దీంతో మత కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా.. మంగళవారం సాయంత్రం జరిగిన బీజేవైఎం నేత ప్రవీణ్ నెట్టారు హత్య దక్షిణ కన్నడ జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది కూడా. ఇదీ చదవండి: ఘోరం.. కుప్పకూలిన మిగ్–21.. ఇద్దరు పైలట్ల దుర్మరణం -
కాలేజీ విద్యార్థుల కిస్సింగ్ కాంపిటీషన్.. పోలీసుల అదుపులో ఒకరు
మంగళూరు: యూనిఫామ్‌లో.. కౌగిలింతలు, ముద్దులతో రెచ్చిపోయారు విద్యార్థులు. ఆ వీడియో కాస్త వాట్సాప్ ద్వారా విపరీతంగా వైరల్ అయ్యింది. తల్లిదండ్రులతో పాటు కాలేజీ యాజమాన్యం దృష్టికి వెళ్లింది. ఇంకేం.. పోలీసులు రంగంలోకి దిగారు. మంగళూరులో ఓ ప్రముఖ కాలేజీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థుల వీడియో ఒకటి వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా విపరీతంగా వైరల్ అయ్యింది. పరువు పోవడంతో తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యం ఈ వీడియో మీద ఫిర్యాదు చేయకుండానే పోలీసులను ఆశ్రయించారు. ఓ ప్రైవేట్ అపార్ట్మెంట్లో స్టూడెంట్స్ మధ్య ముద్దుల పోటీలో Kissing Competition భాగంగా.. ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను చిత్రీకరించిన విద్యార్థినిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరిన్ని వివరాల కోసం ప్రశ్నిస్తున్నారు. వీడియోలు తీసే టైంలో డ్రగ్స్ తీసుకున్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. అయితే కిస్సింగ్ కాంపిటీషిన్ ఘటన జరిగి ఆరు నెలలు అవుతోందని, ఓ ప్రైవేట్ ప్లాట్‌లో అది చోటు చేసుకుందని.. అయితే వారం కిందట వాట్సాప్ ద్వారా ఓ స్టూడెంట్ దానిని వైరల్ చేశాడని సిటీ పోలీస్ కమిషనర్ శశి కుమార్ వైరల్ వీడియో వివరాలను వెల్లడించారు. కిస్సింగ్ కాంపిటీషన్లో పాల్గొన్న విద్యార్థులను గుర్తించి.. వాళ్లపై సస్పెన్షన్ వేటు వేసినట్లు కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. -
భయంకరమైన యాక్సిడెంట్: మహిళ పైకి దూసుకుపోయిన బీఎండబ్ల్యూ కారు
Speeding Car In Mangaluru Jumps Divider: రోడ్ల పై ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ఎన్నిరకాలుగా చర్యలు తీసుకున్నప్పటికీ జరుగుతూనే ఉండటం బాధకరం. ఆఖరికి పరిమితికి మించి స్పీడ్‌గా వెళ్లకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నా ఏదో ఒక చిన్న తప్పిదంతో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. డ్రింక్ అండ్ డ్రైవ్ వద్దని చెప్పిన యువత పెడచెవిన పెట్టి మరీ థ్రిల్లింగ్ అంటూ డ్రైవ్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అచ్చం అలాంటి ఘటనే మంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మంగళూరులో రహదారికి ఒకవైపు వాహానాలన్ని ట్రాఫిక్‌లో నెమ్మదిగా ఒక దాని తర్వాత ఒకటి వెళ్తున్నాయి. అయితే రహదారికి కుడివైపు నుంచి స్పీడ్‌గా వస్తున్న ఒక బీఎండబ్ల్యూ కారు గాల్లోకి ఎగిరి డివైడర్ అవతల వైపున ఉన వాహనాలని ఢీ కొట్టింది. అదే సమయంలో రోడ్డు దాటేందుకు డివైడర్ పై నిలబడి ఉన్న మహిళ, అవతల వైపు స్కూటీ నడుపుతున్న మరో మహిళ పైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు, ఒక మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అయితే ఆ డివైడర్ పై ఉన్న మహిళ మాత్రం కొద్దిలో ప్రమాదాన్ని తప్పించుకుంది. ఈ ప్రమాదం మంగళూరులోని బల్లాల్‌బాగ్ జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కారు డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. #Karnataka A 2 wheeler rider critically injured after a BMW car jumped over a divider and crashed into another car and two wheeler in #Mangaluru @IndianExpress pic.twitter.com/tuTouAg6FP — Kiran Parashar (@KiranParashar21) April 9, 2022 (చదవండి: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు తప్పించుకోబోయి.. చుట్టుపక్కల గమనించకపోడంతో..) -
హిజాబ్ ధరించారని క్లాస్‌లోకి రానివ్వలేదు
మంగళూరు (కర్ణాటక): హిజాబ్(తలపై ధరించే వస్త్రం)ను ధరించారనే కారణంగా కర్ణాటకలోని ఒక ప్రభుత్వ ప్రీ–యూనివర్సిటీ కాలేజీలో ఆరుగురు ముస్లిం విద్యార్థినులను తరగతి గదిలోకి అనుమతించ లేదు. ఈ ఘటన ఉడుపిలోని గవర్నమెంట్ ఉమన్స్ పీయూ కాలేజీలో జరిగింది. తమను ఉర్దూ, అరబిక్ భాషల్లో మాట్లాడేందుకు కాలేజీ ప్రిన్సిపాల్ అనుమతించట్లేదని, క్లాస్‌లోకి రానివ్వలేదని ఆరోపించారు. కాలేజీ ప్రాంగణంలో హిజాబ్‌ను అనుమతిస్తామని, క్లాస్‌రూమ్‌లో కుదరదని ప్రిన్సిపల్ రుద్ర గౌడ స్పష్టం చేశారు. -
ఫోన్ కొట్టేశాడని ఏకంగా తలకిందులుగా వేలాడదీశారు...ఐతే చివరికి!!
కొంతమంది చేసే పనులు అత్యంత హేయమైనవిగా ఉంటాయి. అసలు స్వతహాగా వాళ్లు మంచి వాళ్లైనప్పటికీ వారి జోలికి వచ్చిన లేక వారి సంబంధించిన వస్తువులు పోయినప్పుడు అపరిచితుడిలా మారిపోయి అత్యంత ధారుణానికి వడిగడుతుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఎంత ధారుణమైన పని చేశాడో చూడండి. (చదవండి: పారా సెయిలింగ్ మళ్లీ ఫెయిల్ !... ఇద్దరు మహిళలకు చేదు అనుభవం!!) అసలు విషయంలోకెళ్లితే....మొబైల్ ఫోన్ దొంగిలించాడనే ఆరోపణతో ఒక మత్స్యకారుడిని తోటి మత్స్యకారుల బృందం చేపల వేట బోటుకు తలకిందులుగా వేలాడదీసి దాడి చేసింది. అయితే ఈ ఘటన బందూర్లోని మంగళూరు ఫిషింగ్ హార్బర్లో లంగరు వేసిన ఫిషింగ్ బోట్లో చోటు చేసుకుంది. అంతేకాదు దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిపై మత్స్యకారుల బృందం దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పైగా మత్స్యకారులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు సెల్‌ఫోన్‌ను దొంగిలించాడనే ఆరోపణతో దాడి చేసిన మత్స్యకారుడిని వైలా శీనుగా గుర్తించి అరెస్టు చేశాం అని చెప్పారు. అతేకాదు ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: పంజాబ్ కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు) -
మాజీ ఎమ్మెల్యే కుమారుడికి ఐసిస్‌తో లింక్?
సాక్షి, బనశంకరి: సిరియాలోని ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో మాజీ ఎమ్మెల్యే బీఎం ఇదినబ్బ కుమారుడి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. మంగళూరులోని మస్తికట్టెలో ఉన్న బీఎం బాషా నివాసంపై బుధవారం ఎన్ఐఏ ఐజీపీ ఉమా నేతృత్వంలో 25 మంది బృందం దాడి చేసింది. స్థానిక పోలీసులతో కలిసి సోదాలతో పాటు విచారణ ప్రారంభించారు. బాషా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, అతని ఇద్దరు కుమారులు విదేశాల్లో స్థిరపడ్డారు. అతడి కుమార్తె కొన్నేళ్ల క్రితం కేరళ నుంచి అదృశ్యమైంది. ఆమె సిరియాలో ఐసిస్‌లో చేరినట్లు అనుమానాలున్నాయి. బాషా కుటుంబసభ్యులు ఐసిస్ నిర్వహించే యుట్యూట్ చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసినట్లు తెలి సింది. దీంతో ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానం వ్యక్తమైంది. అంతేగాక జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్న యువకులతో బాషా కుటుంబీకులు ఫోన్లో సంభా షించినట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఉళ్లాల నియోజకవర్గంలో మూడుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న బీఎం.ఇదినబ్బ పాత్రికేయుడు, స్వాతం త్య్ర సమరయోధుడు, కన్నడ సాహితీవేత్త, కన్నడ ఉద్యమకారునిగా పేరుగాంచారు. ఆయన 2009లో కన్నుమూశారు. ఆయన కుమారుడు బాషా ఉగ్రవాద ఆరోపణల్లో చిక్కుకోవడం గమనార్హం. -
బాప్రే.. రేవ్ పార్టీలో మహిళా పోలీసు
యశవంతపుర: చట్టాన్ని కాపాడాల్సినవారే అతిక్రమించారు. కర్ణాటకలో హాసన్ జిల్లాలో జరిగిన రేవ్ పార్టీలో కొందరు పోలీసులు కూడా మజా చేసినట్లు సమాచారం. ఇటీవల ఆలూరు తాలూకాలో ఒక రిసార్టులో పెద్దఎత్తున రేవ్ పార్టీ జరిగింది. ఇది తెలిసి పోలీసులు దాడి చేసి 130 మందిని అదుపులోకి తీసుకుని పదుల సంఖ్యలో కార్లను సీజ్ చేశారు. ఇందులో శ్రీలత అనే మహిళా పోలీసు కూడా ఉన్నారు. ఆమె మంగళూరు జిల్లాలో క్రైం విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. రేవ్ పార్టీలో పాల్గొనడానికి సెలవు పెట్టి వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీలతను సస్పెండ్ చేసినట్లు మంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎన్.శశికుమార్ తెలిపారు. మరికొందరు పోలీసులపై వేటు పడే అవకాశముంది. ‘తన కుమారుడితో కలిసి ఆమె రేవ్ పార్టీకి వెళ్లారు. పోలీసులు సోదాలు జరిపినప్పుడు ఆమె తన అధికారాలను దుర్వినియోగం చేశారు. నగర క్రైం విభాగంలో పనిచేస్తున్నానని కూడా స్వయంగా చెప్పార’ని మీడియాకు కమిషనర్ శశికుమార్ వెల్లడించారు. కాగా, కరోనా భయంతో రాష్ట్రం అల్లాడుతుంటే కొంతమంది బాధ్యతారహితంగా జల్సాలు చేయడం పట్ల జనం మండిపడుతున్నారు. ఈనెల 10న ఆలూరు తాలూకా పరిధిలోని రిసార్ట్‌లో ఈ రేవ్ పార్టీ జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారికిలో బెంగళూరు, మంగుళూరు, గోవా తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. మద్యం, నిషేధిత మత్తు పదారార్థాలతో పాటు 50 టూవీలర్లు, 20 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది వాహనాలపై అత్యవసర సర్వీసుల సిక్టర్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా యువకులను రేవ్ పార్టీకి ఆహ్వానించారని, లోకేషన్‌ను చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచారని వెల్లడించారు. రిస్టార్ యజమాని గగన్‌ను అదుపులోకి తీసుకుని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అరెస్ట్ చేసిన వారి నుంచి రక్తనమూనాలు సేకరించామని, ఇంకా విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. ఇక్కడ చదవండి: కరోనా ఉగ్రరూపం; లాక్డౌన్ ఉండదన్నా సొంతూళ్లకు.. విజృంభిస్తున్న కరోనా: కర్ణాటకలో నిమిషానికి 10 కొత్త కేసులు -
భళా రజని.. సాహసోపేతంగా కుక్కను కాపాడిన మహిళ
యశవంతపుర: కుక్క బావిలో పడిపోతే అయ్యో అని చూసి వెళ్లిపోయేవారే అందరూ. కష్టమైనా సరే బావిలోకి దూకి రక్షించాలని తాపత్రయపడేవారు తక్కువగా ఉంటారు. అందులోనూ ఒక మహిళ ప్రాణాలకు తెగించి బావిలోకి దిగి శునకాన్ని రక్షించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన కర్ణాటకలో మంగళూరు నగరంలోని బల్లాళ్ బాగ్‌లో జరిగింది. రజని శెట్టి అనే మహిళకు శునకాలంటే ఎంతో ప్రేమ. వీధి కుక్కలకు ఆహారం అందిస్తూ ఉంటారు. సమీపంలో ఇంటి వద్దనున్న 45 అడుగుల లోతైన బావిలోకి శుక్రవారం రాత్రి ఒక పెంపుడు కుక్క పడిపోయింది. కుక్క యజమాని రజనికి విషయం చెప్పారు. రజని వెంటనే కుక్కను కాపాడాలని నిర్ణయించుకున్నారు. నడుముకి తాడు కట్టుకుని బావిలోకి దిగి కుక్కను భద్రంగా పైకి తీసుకొచ్చారు. ఆమె గతంలో కూడా అనేకసార్లు బావిలో పడిన కుక్కలను రక్షించినట్లు స్థానికులు తెలిపారు. చదవండి: మళ్లీ స్టార్ట్: సైకిల్‌పై చక్కర్లు కొట్టిన స్టాలిన్! -
భాగ్యమిత్ర లాటరీ.. సెక్యూరిటీ గార్డు కరోడ్‌పతి
సాక్షి, యశవంతపుర: కర్ణాటకలోని మంగళూరులో సెక్యూరిటీ గార్డుకు లాటరీలో రూ.కోటి వరించింది. వారానికి ఐదుగురికి రూ.కోటి చొప్పున బహుమతి మొత్తం లభించే కేరళ భాగ్యమిత్ర లాటరీ అతనికి తగిలింది. మంగళూరులో ఓ భవనం వద్ద సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్న మోయిద్దీన్ కుట్టి స్వస్థలం కేరళ. కుటుంబంతో కలిసి ఉపాధి కోసం ఏళ్ల కిందట వచ్చాడు. అతనికి రోజూ లాటరీ టికెట్ కొనే అలవాటు ఉంది. ఏప్రిల్ 4న రూ.100కు కేరళ భాగ్యమిత్ర లాటరీ టికెట్ కొన్నాడు. అదృష్టం వరించి ఐదు మందికి రూ.కోటి చొప్పున లాటరీ తగిలింది. అందులో మోయిద్దీన్ ఒకరు. డబ్బులు చేతికి రాగానే భార్య, పిల్లలతో కలిసి కేరళకు వెళ్లిపోయి హాయిగా జీవిస్తానని చెప్పాడు. -
చిన్నారి ప్రాణం తీసిన పబ్జీ గేమ్ గొడవ!
బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో పిల్లల చేతికి సెల్‌ఫోన్ ఇవ్వడంతో ఓ విషాద సంఘటన జరిగింది. పబ్జీ గేమ్ విషయంలో ఇద్దరు చిన్నారుల మధ్య జరిగిన గొడవ వల్ల 12 ఏళ్ల చిన్నారి ప్రాణం బలైపోయింది. స్నేహితుడిని కలవాలని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన 10 గంటల తర్వాత ఇంటి నుంచి 500 మీటర్ల దూరంలో శవమై కనిపించాడు. ఇండియాలో నిషేధించిన పబ్జీ వీడియో గేమ్ బాలుడు మరణానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రశ్నించేందుకు 17 ఏళ్ల మైనర్ బాలుడైన నిందితుణ్ని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చనిపోయిన మహ్మద్ అకీఫ్ లారీ డ్రైవర్ హనీఫ్ కుమారుడుగా గుర్తించారు. అకీఫ్ ఎప్పుడు కొంతమంది పరిచయస్తులతో పబ్జీ గేమ్ ఆడేవాడు. ఫలా స్కూల్లో 6వ తరగతి చదువుతున్న బాలుడు శనివారం రాత్రి 8.45 గంటల సమయంలో ఇంటి నుంచి ఫోన్లో మాట్లాడుతూ బయటికి వెళ్ళాడు. ఎంతసేపటికి బాలుడు తిరిగి రాకపోయేసరికి వారు పోలీసులకు పిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఉల్లాల్ పోలీస్ స్టేషన్ పరిమితిలో ఉన్న స్కూల్ అరటి ఆకులు, కొబ్బరి ఫ్రాండ్లతో కప్పబడిన ఒక బాలుడి మృతదేహాన్ని పోలీసు బృందం గుర్తించింది. ఆ బాలుడి మృతదేహాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వెన్లాక్ ఆసుపత్రికి తరలించారు. అకీఫ్ అనే చిన్నారిని ఇంటి పక్కన ఉండే మరో బాలుడు తనతో పాటు పబ్జీ ఆడాల్సిందిగా కోరాడు. అయితే ఆట మధ్యలో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. అకీఫ్ తోటి బాలుడిపై రాళ్లు విసిరాడు. దానికి కోపోద్రిక్తుడైన ఆ బాలుడు ఓ పెద్ద రాయిని అకీఫ్‌పై వేశాడు. దీంతో అతడికి తీవ్రంగా రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. భయపడ్డ ఆ బాలుడు మృతదేహాన్ని అరిటాకులతో కప్పేసి అక్కడి నుంచి పారిపోయాడని పోలీసు అధికారి తెలిపారు. నిందితుడు మైనర్ కావడంతో అతడికి ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై నగర పోలీస్ కమిషనర్ ఎన్.శశి కుమార్ స్పందిస్తూ చిన్నారులకు ఫోన్లు ఇచ్చినప్పుడు పెద్దలు ఓ కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు. చదవండి: తల్లి టీవీ ఆఫ్ చేసిందని కొడుకు ఆత్మహత్య మయన్మార్‌లో ఆగని అరాచకం.. 550 మంది మృతి -
‘లష్కరే ఉగ్రవాదులను పిలిచే దాకా తేకండి’
బెంగళూరు: లష్కరే ఉగ్రవాదులు భారత వాణిజ్య రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించి నిన్నటికి 12 సంవత్సరాలు పూర్తయ్యింది. నాటి మారణకాండను తల్చుకుంటూ దేశవ్యాప్తంగా ప్రజలు నివాళులర్పించగా.. కర్ణటకలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. బహిరంగ ప్రదేశాల్లోని గోడ మీద లష్కరే తోయిబా ఉగ్రవాదులకు మద్దతిచ్చే రాతలు కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రాతల వెనక ఉన్న వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. వివరాలు మంగళూరులోని బహిరంగ ప్రదేశంలోని ఓ గోడ మీద గుర్తు తెలియని వ్యక్తులు ‘సంఘీలు, మన్వేదిలను నియంత్రించడానికి లష్కరే తోయిబా ఉగ్రవాదులను, మిలిటెంట్లను రంగంలోకి దించే పరిస్థితులు తీసుకురాకండి’ అంటూ నలుపు రంగు పెయింట్‌తో గోడ మీద వివాదాస్పద రాతలు రాశారు. దీని గురించి తెలిసిన వెంటనే పోలీసుల అక్కడికి చేరుకున్నారు. పెయింటర్లను పిలిచి ఈ రాతలను కవర్ చేయించే పని ప్రారంభించారు. సమీప ప్రాంతంలోని సీసీటీవీ కెమరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక మత విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నం చేసినందుకు గాను ఈ గుర్తు తెలియని వ్యక్తుల మీద కేసు నమోదు చేశామన్నారు. ఇక గోడ మీద రాసిన సంఘీలు.. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని సూచిస్తుంది. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో గో వధను నిషేధించే చట్టంతో పాటు వివాహం కోసం మాత్రమే జరిగే మత మార్పిడిలను నిషేధించే చట్టం తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు నిర్ణయాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోడల మీద ఇలాంటి రాతలు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. అది కూడా ముంబై ఉగ్రదాడి జరిగిన నాడే చోటు చేసుకోవడంతో పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ( 26/11 ఉగ్రదాడి : రియల్ హీరోలు వీళ్లే..) ఇక 12 సంవత్సరాల క్రితం ముంబైలో ఉగ్రవాదుల మారణ కాండ కొనసాగించారు. దీనిలో ప్రధాన సూత్రధారి లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందినవాడు. నాటి ఘటనలో 166 మంది చనిపోయారు.. 300 మందికిపైగా గాయపడ్డారు. సముద్ర మార్గం ద్వారా భారత్‌లో ప్రవేశించిన ముష్కరులు తాజ్‌మహల్ హోటల్ సహా పలు చోట్ల దాడులకు తెగబడ్డారు. -
‘ఎవరూ ముందుకు రాలేదు.. నేనే దిగాను’
బెంగళూరు: మ్యాన్‌హోల్ లాంటి వాటిలో అడ్డంకులు ఏర్పడితే.. అధికారులకో.. ప్రజా ప్రతినిధులకు ఫోన్ చేస్తాం. వారు పారిశుద్ధ్య కార్మికులను పంపించి శుభ్రం చేయించి సమస్యను పరిష్కరిస్తారు. అయితే స్వయంగా ఓ ప్రజాప్రతినిధే మ్యాన్హోల్లోకి దిగి శుభ్రం చేసిన సంఘటన గురించి ఇంతవరకు ఎప్పుడు వినలేదు. కానీ బీజేపీ కార్పొరేటర్ మనోహర్ శెట్టి ఈ సంఘటనను నిజం చేసి చూపారు. మనోహర్ శెట్టి స్వయంగా మ్యాన్హోల్లోకి దిగి.. శుభ్రం చేశారు. ఆయనను అనుసరించి మరో నలుగురు బీజేపీ కార్యకర్తలు మ్యాన్హోల్లోకి దిగారు. అందరూ కలిసి ఆ మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసి నీరు సాఫీగా పోయేలా చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. ఆ వివరాలు.. మంగళూరు సిటీ కార్పొరేషన్ పరిధిలోని కద్రీ-కంబాలా వార్డు వద్ద చెత్త కుప్పలుగా బయట వేయడంతో ఆ పక్కనే ఉన్న మ్యాన్‌హోల్‌లో చెత్త అడ్డుపడి.. నీరు బయటకు పొంగిపోయింది. రహదారిపై నీరు ప్రవహిస్తూ ట్రాఫిక్‌కు, రోడ్డు మీద నడిచేవారికి ఇబ్బంది కలిగించింది. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ మనోహర్ శెట్టి అక్కడికి చేరుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులను పిలిచి మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేయాలని కోరారు. అయితే రుతుపవనాల సమయంలో ఇది చాలా ప్రమాదకరమని, మ్యాన్‌హోల్ లోపలికి వెళ్లడానికి వారు నిరాకరించారు. దాంతో మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు హై స్పీడ్ వాటర్ జెట్ అమర్చిన వాహనాన్ని పంపాలని మనోహర్ శెట్టి నగర కార్పొరేషన్‌ను ఆదేశించారు. ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. ఇక లాభం లేదనుకున్న మనోహర్ శెట్టి తానే స్వయంగా 8 అడుగుల లోతులో ఉన్న మ్యాన్హోల్లోకి దిగి నీటి ప్రవాహానికి అడ్డుపడిన చెత్తను తొలగించారు. (పిండికొద్దీ ప్లేటు) ఈ సందర్బంగా కార్పొరేటర్ మనోహర్ శెట్టి మీడియాతో మాట్లాడుతూ.. ‘మ్యాన్‌హోల్‌లో ఏదో అడ్డుపడి నీరు బయటకు పొంగిపొర్లుతుంది. పారిశుద్ధ్య కార్మికులను శుభ్రం చేయమని అడిగితే.. ప్రస్తుత పరిస్థితుల్లో దిగలేమని చెప్పారు. మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక లాభం లేదనుకుని.. నేనే మ్యాన్హోల్లోకి ప్రవేశించి.. పైపుకు అడ్డుగా ఉన్న చెత్తను తొలగించాను. ఇది చూసి బీజేపీ పార్టీ కార్యకర్తలు నలుగురు నన్ను అనుసరించారు. ఆ మ్యాన్‌హోల్ ఎనిమిది అడుగుల లోతులో ఉంది.లోపలంతా చీకటిగా ఉంది. టార్చ్ లైట్లు వేసుకుని శుభ్రం చేశాము’ అని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అన్నారు. మరో సారి మ్యాన్హోల్లోకి దిగడానికి కూడా తాను వెనకాడనని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరలవ్వడమే కాక.. మనోహర్ శెట్టిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. (నిప్పుల గుండంలో యోగా చేసిన ఎంపీ) -
కరోనా మృతుడి అంత్యక్రియలు: పీపీఈ కిట్ లేకుండానే
మంగళూరు: పీపీఈ కిట్ ధరించకుండా అంత్యక్రియలకు హాజరై ఓ ఎమ్మెల్యే కోవిడ్ నిబంధనలను అతిక్రమించారు. కోవిడ్ సూచనలు పాటిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిదే నిబంధనలను తుంగలో తొక్కుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మంగళూరులో కరోనా బారిన పడ్డ డెబ్భై యేళ్ల వృద్ధుడు మంగళవారం మరణించాడు. బొలరా మసీదులో బుధవారం అతని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబసభ్యులందరూ దాదాపు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ (పీపీఈ కిట్లు) ధరించే హాజరయ్యారు. కానీ మాజీ మంత్రి, మంగళూరు ఎమ్మెల్యే యూటీ ఖదేర్ మాత్రం పీపీఈ కిట్ ధరించకుండానే దహన సంస్కారాల్లో పాల్గొన్నారు. (కోవిడ్‌తో డీఎంకే ఎమ్మెల్యే మృతి ) దీనిపై సంబంధిత అధికారులు అతడిని ప్రశ్నించగా "మనిషికి శాశ్వత వీడ్కోలు తెలపడం ప్రాథమిక బాధ్యత. చనిపోయిన వారికి గౌరవ మర్యాదలతో దహన సంస్కారాలు చేయాల"ని ఎమ్మెల్యే సెలవిచ్చారు. కాగా కర్ణాటకలో ఇప్పటివరకు 9,721 మంది కరోనా బారిన పడగా 150 మంది మరణించారు. ఇక మంగళవారం ఒక్కరోజే దేశంలో గణనీయంగా 15,968 కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. బుధవారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 4,56,183కు చేరింది. (పోలింగ్‌లో పాల్గొన్న కరోనా సోకిన ఎమ్మెల్యే) -
ఈ సాయం చేస్తే పది లక్షలు మీ సొంతం
తిరువంతపురం: లాక్డౌన్ వల్ల కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కలిసి ఉండే అవకాశం దక్కింది. అయితే లాక్డౌన్ ప్రకటించడానికన్నా ముందు వేరు వేరు ప్రదేశాలకు వెళ్లినవారు మళ్లీ ఒక్కచోటుకు చేరలేకపోతున్నారు. ఇప్పటికే ఈ నిర్బంధం విధించి సుమారు రెండు నెలలు కావస్తున్నందున ఓ వ్యక్తి తన కుటుంబాన్ని స్వస్థలానికి చేర్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. దీంతో ఈసారి వారిని కలిపితే పారితోషకం ఇస్తానంటూ సోషల్ మీడియాలో నజరానా ప్రకటించి వార్తల్లో నిలిచాడు. కేరళకు చెందిన శ్రీకుమార్ పని రీత్యా దుబాయ్‌కు వెళ్లి ఇప్పుడక్కడే చిక్కుకుపోయాడు. మరోవైపు అతని భార్య, చిన్న కొడుకు మంగళూరులో, పెద్ద కొడుకు తిరుచ్చిరాపల్లిలో ఉన్నారు. (కరుణ లేని కరోనా!) వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న వారిని ఒకచోటికి చేర్చేందుకు అతడెన్నో ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా ఎంతో మంది అధికారులను సంప్రదించగా వారి నుంచి కనీస స్పందన కరువైంది. దీంతో అతనే సొంతంగా ఓ హెలికాప్టర్‌ను మాట్లాడుకున్నాడు. కానీ అది ఎగరడానికి అధికారులు అనుమతించలేదు. దీంతో అతను చివరి ప్రయత్నంగా సోషల్ మీడియా ఏమైనా సాయం చేస్తుందేమో చూద్దామనుకున్నాడు. తన ఫ్యామిలీ మెంబర్స్‌ను ఇంటికి సురక్షితంగా చేర్చినవారికి రూ.10 లక్షల నజరానా ప్రకటించాడు. అయితే మంగళవారంలోగా చేర్చాలని గడువు విధించాడు. మరి కళ్లు చెదిరే పారితోషాకాన్ని చూసి ఎంతమంది ముందుకొస్తారో? ఎవరి ప్రయత్నం ఫలిస్తుందో? చూడాలి! (లాక్డౌన్: రికార్డు స్థాయిలో జనాభా పెరుగుదల) -
బోర్ కొడుతుందని ఫ్రెండ్‌ని సూట్‌కేసులో..
మంగళూరు : దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉండడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. 24 గంటలు ఇంట్లో ఉండి ఏం చేయాలో తెలియక నానా అవస్థలు పడుతున్నారు. ఇక టీనేజర్ల బాధలు అయితే చెప్పలేనివి. ప్రతి రోజు ఫ్రెండ్స్‌ని కలవడం, సినిమాలు, షికార్లు అంటూ జాలీగా తిరిగే వారు.. ఇప్పుడు ఇంటికే పరిమతమయ్యారు. కనీసం స్నేహితులను కలవడానికి కూడా వీల్లేకపోవడంతో పిచ్చిపిచ్చి ప్లాన్లు వేసి అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ టీనేజర్ తన ఫ్రెండ్‌ను ఇంటికి తీసుకురావడానికి వెరైటీ ప్లాన్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. మంగళూరులోని సుమారు 90 ఫ్లాట్లు ఉన్న అపార్ట్మెంట్లో ఓ టీనేజర్ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అతని కుటుంబ సభ్యులకు ఆ అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. లాక్‌డౌన్‌తో కుటుంబ సభ్యులంతా ఒకే ఇంట్లో ఉంటుంటే.. అతను మాత్రం సెపరేట్‌గా రెండో ఫ్లాట్‌లో ఉంటున్నాడు. అయితే కరోనా కారణంగా ఆ అపార్టమెంట్లోకి ఫ్లాట్ల యజమానులందరూ.. బయటవారిని లోనికి అనుమతిచ్చేది లేదని ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో టీనేజర్‌కి ఫోన్ చేసిన అతని స్నేహితుడు ఇంట్లో ఒంటరిగా బోర్ కొడుతోందని.. తాను కూడా ఫ్లాట్‌కి వస్తానని అడిగాడు. ఈ విషయం అపార్ట్మెంట్ పెద్దలకు చెప్పగా..దానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో అతడు ఎవ్వరికీ అనుమానం రాకుండా ఓ పెద్ద సూట్‌కేసులో తన స్నేహితుడిని దాచి.. తన ఫ్లాట్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే సూట్‌కేసు లాగేందుకు అతడు పడుతున్న అవస్థ, ఆ సూట్‌కేసు కదలికలు ఇతరులకు అనుమానం కలిగించాయి. దీంతో అపార్ట్మెంట్ సెక్యూరిటీ సిబ్బంది ఆ సూట్‌కేసును తెరచి చూడగా అసలు విషయం బయటపడింది. దీంతో ఈ విషయాన్ని అపార్ట్మెంట్ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా..వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఇద్దరు టీనేజర్లను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. వారి వారి తల్లిదండ్రులను కూడా స్టేషన్‌కు పిలిపించినట్టు తెలిసింది. అయితే పోలీసులు ఎటువంటి కేసులూ నమోదు చేయలేదు. -
కర్ణాటకలో కరోనా కలకలం.. అతడి కోసం గాలింపు
మంగళూరు : కర్ణాటకను కరోనా వైరస్ భయం వెంటాడుతోంది. విదేశాల నుంచి కరోనా లక్షణాలతో వచ్చిన ఓ వ్యక్తి హాస్పిటల్లో చేరకుండా తప్పించుకుని పారిపోయాడు. దీంతో అతని ఆచూకీ కోసం అధికారులు గాలింపు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ప్రపంచవ్యాప్తంగా కరోనాపై భయాందోళనల నేపథ్యంలో భారత్‌లోని ప్రతి ఎయిర్‌పోర్ట్‌లో విదేశాల నుంచి వచ్చేవారకి స్ర్కీనింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం దుబాయ్ నుంచి మంగళూరుకు వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో అతన్ని మంగళూరు జిల్లా ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. అక్కడ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. అయితే అతను మాత్రం కనిపించకుండా పోయాడు. దీంతో అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటనపై కర్ణాటక ఆరోగ్య శాఖ స్పందిస్తూ.. ప్రస్తుతం అతడు హాస్పిటల్లో చేరలేదని తెలిపింది. వైద్య సూచనను అతిక్రమించి అతను ఎక్కడికో వెళ్లిపోయినట్టు చెప్పింది. ‘ప్రయాణికుడు కనిపించకుండా పోవడంపై పోలీసులకు సమాచాం అందింది. ఓ బృందం అతని ఇంటి వద్ద నిఘా ఏర్పాటు చేసింది. త్వరలోనే అతన్ని పట్టుకుని హాస్పిటల్లో చేర్పిస్తాం’ అని ఓ అధికారి తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి గత రాత్రి నుంచి పలు రకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. సదరు వ్యక్తి హాస్పిటల్ చేరిన తర్వాత సిబ్బందితో గొడవపడి అక్కడి నుంచి వెళ్లిపోయాడని కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడి 3 వేల మందికి పైగా మరణించారు. భారత్‌లో ఇప్పటివరకు 43 మందికి కరోనా సోకినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. చదవండి : కరోనా భయం వీడి.. మానవత్వం చాటారు కరోనా జయించాడు.. రికార్డు సాధించాడు! -
సైనైడ్ పదార్థమిచ్చి అమ్మాయిలను దారుణంగా..
మంగళూరు : 20 మంది యువతులను దారుణంగా రేప్ చేసి ఆపై హత్య చేసిన సీరియల్ కిల్లర్' సైనైడ్' మోహన్‌కు జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నట్లు మంగళూరు సెషన్స్ కోర్టు మంగళవారం పేర్కొంది. కాగా 2006లో కేరళలోని కస్రాగోడ్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతిని రేప్ చేసి హతమార్చినందుకుగానూ మోహన్‌కు జీవిత ఖైదుతో పాటు రూ. 25వేల జరిమానా విధిస్తున్నట్లు సెషన్స్ కోర్టు జడ్జి సయీదున్నిసా తన తీర్పులో వెల్లడించారు. వివరాలు.. సైనైడ్ మోహన్.. ఒంటరిగా ఉన్న అమ్మాయిలను ట్రాప్ చేసి ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానంటూ మాయ మాటలు చెప్పి మొదట రూంకు తీసుకెళతాడు. ఆ తర్వాత సైనైడ్ పూసిన పదార్థాలను వారికి అందించి రేప్ చేస్తాడు. తర్వాత వారు చనిపోయారని నిర్దారించుకొని మెల్లగా అక్కడినుంచి జారుకుంటాడు. ఇలా ఇప్పటివరకు 20మంది యువతులను ట్రాప్ చేసి హతమార్చాడు. కాగా ఇదే విధంగా 2006 జనవరి 3న మంగళూరులోని క్యాంప్కో యూనిట్‌కు పని నిమ్మిత్తం వచ్చిన 23ఏళ్ల కేరళ యువతితో మోహన్ పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి మైసూరులోని లాడ్జికి తీసుకెళ్లి రాత్రంతా అక్కడే గడిపారు. తెల్లవారుజామున బస్టాండ్‌కు చేరుకొని యువతి ఒంటిపై ఉన్న నగలన్ని తీసుకొని గర్భనిరోధక మాత్ర అని నమ్మించి సైనైడ్ పూసిన పదార్థాన్ని అందించాడు. పదార్థాన్ని మింగిన ఆమె చనిపోయిందని నిర్థారించుకొని అక్కడే వదిలిపెట్టి వెళ్లాడు. కాగా 2009లో బంట్వాల్లో పోలీసులకు పట్టుబడిన మోహన్ 20 మంది యువతుల్ని తానే చంపినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. -
ఆదిత్యరావు బ్యాగులో సెనైడ్ లభ్యం
సాక్షి బెంగళూరు: మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పెట్టిన ఆదిత్యరావుకు సంబంధించి పోలీసులు తనిఖీ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ఆదిత్యరావు బ్యాగులో సెనైడ్ లభ్యం కావడం, అంతేకాకుండా కర్ణాటక బ్యాంకులో ఓ లాకర్ బాంబు తయారీ వస్తువులన్నీ భద్రపరిచినట్లు తెలిపాడు. ఈక్రమంలో ఉడుపిలోని కర్ణాటక బ్యాంకుకు తీసుకెళ్లారు. తనిఖీ చేయగా బ్యాగులో తెల్లటి రంగులో ఉన్న పొడిని సెనైడ్‌గా పోలీసులు భావించారు. (‘అందుకే ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టాను’) మంగళూరు విమానాశ్రయంలో బాంబు పెట్టే సమయంలో ఎవరైనా అడ్డు వస్తే సెనైడ్ టచ్ చేసి వెళ్లేందుకు సిద్ధమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గత ఆరు నెలలుగా సెనైడ్‌ను బ్యాంకు లాకర్లో ఉంచినట్లు ఆదిత్యరావు తెలిపాడు. అదేవిధంగా మంగళూరులో బాంబు పెట్టిన రోజున అతడు ఉడుపిలోని వడాభండేశ్వర ఆలయానికి వెళ్లాడు. ఈక్రమంలో తనిఖీల్లో భాగంగా నిన్న ఆదిత్యరావును ఉడుపి తీసుకెళ్లారు. ఆలయం నుంచి జిమ్ మాస్టర్‌కు తన సిమ్ నుంచి కాల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఎంత ప్రయత్నించినా నిందితుడు ఉపయోగించిన సిమ్ లభ్యం కాలేదు. (మంగళూరు ఎయిర్‌పోర్టులో బాంబు) -
‘అందుకే ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టాను’
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు లభించిన ఘటనలో అనుమానితుడిగా భావిస్తున్న వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఉద్యోగం రాలేదనే మనస్తాపంతోనే తాను ఈ చర్యకు పాల్పడ్డట్లు పేర్కొన్నాడు. ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ.. మంగళూరు ఎయిరుపోర్టు ఘటనకు బాధ్యత వహిస్తూ మణిపాల్‌కు చెందిన ఆదిత్య రావు(36) అనే వ్యక్తి తమకు లొంగిపోయాడని తెలిపారు. అతడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం అతడిని మంగళూరు టీంకు అప్పగించనున్నట్లు వెల్లడించారు. కాగా సోమవారం ఉదయం 10 గంటల సమయంలో టికెట్ కౌంటర్ వద్ద విమానాశ్రయ పోలీసులు అనుమానాస్పద బ్యాగ్‌ను కొనుగొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న నగర పోలీసు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సదరు బ్యాగులో పేలుడు పదార్థం ఉన్నట్టుగా అనుమానించారు. బ్యాగ్‌లోని మెటల్ కాయిన్ బాక్స్‌లో పేలుడు పదార్థం, లోహపు ముక్కలు నింపినట్లుగా గుర్తించారు. దీంతో ఆ బ్యాగ్‌ను బాంబు తరలింపు వాహనం ద్వారా కిలోమీటరు దూరంలో ఉన్న ఖాళీ స్థలానికి తీసుకెళ్లారు. కట్టుదిట్టమెన భద్రత నడుమ సాయంత్రం 5.30 గంటలకు పేల్చారు. ఇక ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు సీసీ కెమెరా ఆధారంగా నిందితుడి ఫొటోలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం అతడు పోలీసులకు లొంగిపోయాడు. -
‘నా కళ్ల ముందే మా నాన్నను చంపారు’
సాక్షి, మంగళూరు : తన కళ్ల ముందే తమ తండ్రిని పోలీసులు కాల్చి చంపారని జలీల్(42) కూతురు(14) పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో తమ తండ్రి పాల్గొనలేదని స్పష్టంచేశారు. సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సందర్భంగా గత శుక్రవారం మంగళూరు చెందిన దినసరి కూలి జలీల్(42) పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే నిరసనకారులను అదుపు చేసే క్రమంలో కాల్పులు జరిపామని, ఈ సందర్భంగా జలీల్ మృతి చెందారని పోలీసులు పేర్కొనగా.. తమ తండ్రికి సీఏఏ అంటేనే తెలియదని ఆయన కూతుళ్లు చెబుతున్నారు. ఆదివారం వారు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తమ తండ్రిని కళ్ల ముందే కాల్చి చంపేశారని వాపోయారు. ‘మేము రోజు మాదిరి పాఠశాలకు వెళ్లాం. మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లేందుకు నాన్న పాఠశాలకు వాచ్చాడు. మేమంతా ఇంట్లోకి వెళ్తున్న క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ వచ్చి మా నాన్న ఎడమ కంట్లోకి దూకెళ్లింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా మృతి చెందారని వైద్యులు తెలిపారు. మా కళ్ల ముందే మా నాన్న చనిపోయారు.. కాదు చంపేశారు’ అని జలీల్ పెద్ద కూతురు కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు చెబుతున్నట్లు కాల్పులు జరిపిన చోట 7000 మంది లేరని ఆరోపించారు. దాదాపు 100 మంది మాత్రమే ఉన్నారని, వారిని కూడా పోలీసులు అదుపు చేయలేకపోయారని విమర్శించారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో ఇప్పటి వరకు 15 మంది చనిపోగా పలువురు బుల్లెట్ల దాడిలో గాయాలతో బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలతో పాటు కర్ణాటక, కేరళ సరిహద్దుల్లో ఇంటర్నెట్, ఎస్సెమ్మెస్ సేవలను నిలిపేశారు. -
సిద్ధార్థ అంత్యక్రియలకు ఎస్ఎం కృష్ణ
బెంగళూరు : ఆర్థిక ఒత్తిళ్లతో అదృశ్యమై విగత జీవిగా మారిన కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ అంత్యక్రియలకు ఆయన మామ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ బయలు దేరారు. బెంగళూరులో తన స్వగృహం నుంచి అంత్యక్రియలు జరిగే బేళూరుకు పయనమయ్యారు. సిద్ధార్థ మృతికి సంతాపంగా దేశ వ్యాప్తంగా ఉన్న కేఫ్ కాఫీ డేలు ఈ రోజు (బుధవారం) బంద్‌ను పాటిస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి అదృశ్యమైన వీజీ సిద్ధార్థ మృతదేహం నేత్రావతి నదిలో ఈ ఉదయం లభ్యమైన విషయం తెలిసిందే. ఆర్థికసమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరుకి 375 కిలోమీటర్ల దూరంలో మంగళూరుకి సమీపంలో ఉన్న నేత్రవతి బ్రిడ్జి వద్ద కారు దిగి ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్లిన ఆయన ఆ తర్వాత కనిపించలేదు. ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందిన కారు డ్రైవర్.. కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన కోసం తీవ్రంగా గాలించారు. చివరకు ఓ జాలరి ఇచ్చిన సమాచారంతో నేత్రానది వద్ద సిద్ధార్థ మృతదేహాన్ని కనుగొన్నారు. వీజీ సిద్ధార్థ మృతి పట్ల ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. సిద్ధార్థ మరణం షాక్‌కు గురిచేసిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘వీజీసిద్ధార్థ మరణించిన తీరు దిగ్భ్రాంతికి గురిచేసింది. కొన్నేళ్ల క్రితం ఆయనను కలిసే అవకాశం నాకు దక్కింది. స్నేహపూర్వకంగా ఉండే జెంటిల్మెన్. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, కాఫీ డేకు ఈ కఠిన సమయాన్ని తట్టుకునే ధైర్యాన్నివ్వాలని కోరుకుంటున్నాను.’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘సిద్ధార్థ ఎవరో నాకు తెలియదు. ఆయన ఆర్థిక సమస్యల గురించి కూడా అవగాహన లేదు. నాకు తెలిసింది ఒక్కటే పారిశ్రామికవేత్తలు వ్యాపార నష్టాలతో బలవన్మరణం పొందడం సరైంది కాదు. ఎందుకంటే ఇది పారిశ్రామికరంగాన్నే చచ్చిపోయేలా చేస్తుంది’- ఆనంద్ మహింద్ర. -
కాఫీ డే ‘కింగ్’ కథ విషాదాంతం
సాక్షి, బెంగళూరు : సౌమ్యుడు, వివాదరహితునిగా పేరుపొందిన కేఫె కాఫీ డే (సీసీడీ) అధినేత వీజీ సిద్ధార్థ కథ చివరకు విషాదాంతమైంది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త, కెఫే కాఫీడే యజమాని, మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్థ మృతదేహం బుధవారం ఉదయం నేత్రావతి నది వద్ద లభ్యమైన విషయం తెలిసిందే. వీజీ సిద్ధార్థ సొంతూరు కాఫీ సీమ చిక్కమంగళూరు అయితే ముంబైలో వ్యాపార మెళుకువల్ని ఒంటబట్టించుకున్నారు. కాఫీ ఎస్టేట్ల సామ్రాజ్యాన్ని విస్తరించి ఆ రంగంలో మేటిగా నిలిచారు. వీజీ సిద్ధార్థ తనకు ఇష్టమైన కెఫె కాఫీ డేను మొదట బెంగళూరు నగరంలో ప్రారంభించి ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాలలతో పాటు పలు దేశాల్లో కూడా ఏర్పాటు చేశారు. దేశ, విదేశాల్లో 1800 పైగా కాఫీడేలు ఉన్నాయి. అనేక వ్యాపార రంగాల్లో వేలకోట్ల లావాదేవీలు చేసే స్థాయికి ఎదిగారు. ఇంతలో అనూహ్యమైన ఆటుపోట్లు వచ్చాయో, ఏమో.. ఆకస్మాత్తుగా కనిపించకుండాపోయారు. సోమవారం సాయంత్రం మంగళూరు సమీపంలో నేత్రావతి నది వంతెన వద్ద అదృశ్యమైన సిద్ధార్థ చివరకు శవమై తేలారు. చదవండి: నేత్రావతి నదిలో సిద్ధార్థ మృతదేహం లభ్యం ఎస్ఎం కృష్ణ నివాసంలో విషాదం వీజీ సిద్ధార్థ మృతదేహం లభ్యం కావడంతో మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ నివాసంలో విషాదం నెలకొంది. ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎస్ఎం కృష్ణ పెద్ద కుమార్తె మాళవిక భర్తే సిద్ధార్థ. సదాశివనగరలోని ఉన్న ఎస్ఎం కృష్ణ నివాసానికి నాయకులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. సిద్ధార్థ ఆత్మహత్యతో నగరంలోని రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు ఎస్ఎం కృష్ణ ఇంటికి క్యూ కట్టారు. మరోవైపు సిద్ధార్థ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. సిద్ధార్థ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి సిద్ధార్థ మృతదేహానికి మంగళూరులోని వెన్లాక్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం పూర్తయింది. పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా మంగుళూరు పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ మాట్లాడుతూ ఇవాళ ఉదయం నేత్రానదిలో ఓమృతదేహం లభ్యమైందని, దాన్ని అదృశ్యమైన వీజీ సిద్ధార్థగా గుర్తించినట్లు చెప్పారు. ఇప్పటికే ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందించామన్నారు. సిద్ధార్థ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నామని, ఆర్థిక సమస్యలతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామన్నారు. ఈ సంఘటనపై విచారణ కొనసాగుతున్నట్లు సీపీ వెల్లడించారు. ‘ట్రాజిక్ ఎండ్ టూ ది కాఫీ కింగ్’ మరోవైపు ఈ విషాద సంఘటనపై ‘ట్రాజిక్ ఎండ్ టూ ది కాఫీ కింగ్’ అని బీజేపీ మహిళా నేత శోభ ట్వీట్ చేశారు. అలాగే సిద్ధార్థ ఆత్మహత్యపై శృంగేరి ఎమ్మెల్యే టీడీ రాజేగౌడ మాట్లాడుతూ..‘ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఒత్తిడితో సిద్ధార్థ కొంచెం అప్సెట్ అయ్యాడు. ఆస్తులు అమ్మి సెటిల్ చేద్దామనుకున్నాడు. అతడికున్న అప్పుల కన్నా ఆస్తులే ఎక్కువ. ఇంతలో ఈ దారుణం జరిగింది.’ అని అన్నారు. సిద్ధార్థ ఆత్మహత్య సంఘటన దురదృష్టకరమని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ఎస్ఎం కృష్ణను నిన్న (మంగళవారం) పలువురు ప్రముఖులు పరామర్శించారు. ముఖ్యమంత్రి యడియూరప్ప, మాజీ ప్రధాని దేవెగౌడ, డీకే శివకుమార్, మాజీ సీఎం కుమారస్వామి, సిద్దరామయ్య, నటులు శివరాజ్‌కుమార్, పునీత్‌రాజ్‌కుమార్, రాఘవేంద్రరాజ్‌కుమార్, మాజీమంత్రులు ఆర్.వి.దేశ్‌పాండే, శివశంకర్‌రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్.అశోక్, కట్టా సుబ్రమణ్యం నాయుడు, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లిఖార్జున ఖర్గే, హెచ్‌కే. పాటిల్ తదితరులు ఎస్ఎం కృష్ణను పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
సిద్ధార్థ మృతదేహం లభ్యం
సాక్షి, బెంగళూరు : కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్దార్థ మిస్సింగ్ కేసు విషాదాంతం అయింది. ఆయన మృతదేహం నేత్రావతి నదిలో లభ్యమైంది. ఆర్థికసమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సిద్ధార్థ సోమవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. బెంగళూరుకి 375 కిలోమీటర్ల దూరంలో మంగళూరుకి సమీపంలో ఉన్న నేత్రవతి బ్రిడ్జి వద్ద కారు దిగి ఫోన్ మాట్లాడుతూ అలా నడుచుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత కనిపించలేదు. ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందిన కారు డ్రైవర్.. ఆయన కోసం వెతికినా కనిపించలేదు. కుటుంబసభ్యులకు కారు డ్రైవర్ సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన కోసం తీవ్రంగా గాలించారు. చివరకు ఓ జాలరి ఇచ్చిన సమాచారంతో నేత్రానది వద్ద సిద్ధార్థ మృతదేహాన్ని కనుగొన్నారు. (చదవండి : కాఫీ కింగ్ అదృశ్యం) (చదవండి : వ్యాపారవేత్తగా విఫలమయ్యా... ) -
కాఫీ కింగ్ అదృశ్యం
సాక్షి, బెంగళూరు : దేశ కార్పొరేట్ ప్రపంచమంతా మంగళ వారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాఫీ కింగ్‌గా పేరొందిన ప్రముఖ వ్యాపారవేత్త, కెఫే కాఫీ డే(సీసీడీ) వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ అదృశ్యమయ్యారన్న వార్త తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే, వ్యాపారవేత్తగా తాను విఫలమయ్యానని పేర్కొంటూ సిద్ధార్థ సంతకంతో ఒక లేఖ బయటపడింది. అందులో ఆదాయపు పన్ను అధికారులు, పీఈ భాగస్వామ్య సంస్థ నుంచి తీవ్రమైన వేధింపులు ఉన్నాయంటూ ఆయన పేర్కొనడం పారిశ్రామిక వర్గాలను నివ్వెరపోయేలా చేసింది. సిద్ధార్థ అదృశ్య వార్తలతో కాఫీ డే షేరు ధర 20 శాతం కుప్పకూలింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సిద్ధార్థ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారా? ప్రమాదవశాత్తు పడిపోయారా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఇలా అదృశ్యమయ్యారు ‘సోమవారం సాయంత్రం సకలేశపురకు అని చెప్పి డ్రైవర్ బసవరాజు దేశాయితో కలసి వీజీ సిద్ధార్థ బయలుదేరారు. కానీ సకలేశపురకు చేరుకోగానే, అక్కడి నుంచి మంగళూరుకు వెళ్లు అని డ్రైవర్‌కు సూచించారు. మంగళూరు సమీపంలోని ఉల్లాల్ వద్దనున్న నేత్రావతి నది వద్దకు చేరుకోగానే కారు నిలపమని డ్రైవర్‌ను ఆదేశించారు. ఆ తర్వాత కారును వంతెనకు అటువైపు చివరకుతీసుకెళ్లి నిలిపి ఉండు, నేను నడుచుకుంటూ కారు దగ్గరికి వస్తాను అని చెప్పి దిగేశారు. అయితే వంతెనపై నడుచుకుంటూ ఎంతసేపటికీ రాకపోవడంతో డ్రైవర్ వెనక్కి వచ్చి చూడగా చుట్టుపక్కల ఎక్కడా సిద్ధార్థ కనిపించలేదు. ఫోన్ చేస్తేనేమో స్విచ్చాఫ్ అయింది. దీంతో డ్రైవర్ పోలీసులకు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు’ అని దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్ సెంథిల్ శశికాంత్ సెంథిల్ పేర్కొన్నారు. అదృశ్య వార్తను సిద్ధార్థ కుమారుడికి ఫోన్ చేసి డ్రైవర్ వెల్లడించాడు.. వారు కూడా స్థానిక కాఫీడే సిబ్బందికి తెలియజేసి గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగి గాలింపు ప్రారంభించింది. సిద్ధార్థ అదృశ్యంపై అతని కారు డ్రైవర్ని మంగళూరు పోలీసులు ప్రశ్నించారు. సిద్ధార్థ కాల్ డేటా ఆధారంగా అన్ని కోణాల్లోనూ విచారణ సాగిస్తున్నారు. మంగళూరులో సిద్ధార్థ బస చేసే హోటళ్లు, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లోని హోటల్లు, బంధువుల ఇళ్లలోనూ గాలింపు చేపట్టారు. ఆత్మహత్యా అనుమానాలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఆయన వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరు నుంచి మంగళూరుకు కారులో వెళుతున్నంత సేపు తన స్నేహితులకు ఫోన్లు చేసి ‘నన్ను క్షమించండి’ అంటూ భాగోద్వేగానికి లోనవడంతో ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా, మంగళూరు నగరంలోని డీసీపీలు హనుమంతరాయ, లక్ష్మి గణేశ్‌ల నేతృత్వంలోని సుమారు 200 మందికి పైగా పోలీసు సిబ్బంది, అధికారులు సోమవారం రాత్రి నుంచి సిద్ధార్థ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సిద్ధార్థ అదృశ్యమైన నేత్రావతి నదిలో గజ ఈతగాళ్లు, 25 బోట్లు ఉపయోగించి గాలింపు చర్యలు చేపట్టారు. నది చుట్టుపక్కల కూడా వెతుకుతున్నారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు సంఘటన స్థలంలో మకాం వేసి శోధిస్తున్నారు. అలాగే వీరికి కోస్టుగార్డు సిబ్బంది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అగ్నిమాపక సిబ్బంది కూడా సాయపడుతున్నారు. స్థానిక మత్స్యకారుల సాయం కూడా తీసుకుంటున్నామని, చివరిగా ఆయన ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారో కూడా చెక్ చేస్తున్నామని మంగళూరు పోలీస్ కమిషనర్ సందీప్ పాటిల్ వెల్లడించారు. ఎస్ఎం కృష్ణకు నేతల పరామర్శ సిద్ధార్థ అదృశ్యంతో బెంగళూరు సదాశివనగరలో ఆయన మామ ఎస్ఎం కృష్ణ ఇంటి వద్ద విషాద వాతావరణం నెలకొంది. శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు తరలివచ్చారు. మాజీ ప్రధాని దేవెగౌడ, సీఎం యడియూరప్ప, మాజీ సీఎం కుమారస్వామి, సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య తదితరులు కృష్ణకు ధైర్యం చెప్పారు. సిద్ధార్థ నదిలో దూకడాన్ని చూశా కాఫీ డే యజమాని సిద్ధార్థ నేత్రావతి నదిలో దూకడాన్ని తాను ప్రత్యక్షంగా చూసినట్లు సైమన్ డిసోజా అనే స్థానిక జాలరి తెలిపారు. తను చేపలకు వల వేస్తుండగా నీటిలోకి ఎవరో దూకిన శబ్దం వినిపించిందని మంగళవారం స్థానిక మీడియాకు తెలిపారు. తను అక్కడికి వెళ్లేలోపు దూకిన వ్యక్తి నీటి ప్రవాహానికి కొట్టుకుపోతూ లోపలికి మునిగిపోయాడని చెప్పారు. రాత్రి 7 నుంచి 7:30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందన్నారు. ఇలాంటి సంఘటనలు ఇక్కడ అనేకం జరిగినట్లు తెలిపారు. దేశీ కాఫీ కింగ్ సిద్ధార్థ .. దాదాపు 140 ఏళ్లుగా కాఫీ వ్యాపారంలో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సిద్ధార్థ జీవితంలో పలు మలుపులు ఉన్నాయి. ఆయన ముందుగా భారతీయ ఆర్మీలో చేరాలనుకున్నారు. కానీ ఎకనమిక్స్‌లో మాస్టర్స్ పట్టా తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకరుగా మారారు. 1984లో సొంతంగా శివన్ సెక్యూరిటీస్ పేరిట ఇన్వెస్ట్మెంట్, వెంచర్ క్యాపిటల్ సంస్థను ప్రారంభించారు. దాన్నుంచి వచ్చిన లాభాలతో కర్ణాటకలోని చిక్మగళూర్ జిల్లాలో కాఫీ తోటలను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో కుటుంబ కాఫీ వ్యాపారంపై మరింత ఆసక్తి పెంచుకున్నారు. 1993లో అమాల్గమేటెడ్ బీన్ కంపెనీ (ఏబీసీ) పేరిట కాఫీ ట్రేడింగ్ కంపెనీ ప్రారంభించారు. అప్పట్లో రూ. 6 కోట్లుగా ఉన్న ఈ సంస్థ వార్షిక టర్నోవరు ఆ తర్వాత రూ. 2,500 కోట్ల స్థాయికి చేరింది. దేశీయంగా ఇది ప్రస్తుతం అతి పెద్ద గ్రీన్ కాఫీ ఎగుమతి సంస్థ. ఇక, జర్మన్ కాఫీ చెయిన్ ’చిబో’ స్ఫూర్తితో సొంత కెఫేలను కూడా సిద్ధార్థ ప్రారంభించారు. తేనీటిప్రియులను కూడా ఘుమఘుమలాడే కాఫీ వైపు మళ్లేలా చేశారు. 1994లో బెంగళూరులో తొలి కెఫే కాఫీ డే ప్రారంభమైంది. ప్రస్తుతం వియన్నా, ప్రాగ్, కౌలాలంపూర్ తదితర 200 పైచిలుకు నగరాల్లో ప్రపంచవ్యాప్తంగా 1,750 కెఫే కాఫీ డే అవుట్‌లెట్స్ ఉన్నాయి. 2015లో కాఫీ డే పబ్లిక్ ఇష్యూకి కూడా వచ్చింది. బ్లాక్‌మనీ ఉన్నట్లు సిద్ధార్థ అంగీకరించారు: ఐటీ శాఖ అదృశ్యమైన కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థను తాము గతంలో దర్యాప్తు సందర్భంగా వేధించామన్న ఆరోపణలను ఆదాయపు పన్ను శాఖ ఖండించింది. లేఖలోని సిద్ధార్థ సంతకం, తమ దగ్గరున్న సంతకానికి చాలా తేడా ఉందని ఐటీ శాఖ వర్గాలు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. గతంలో తాము జరిపిన సోదాల్లో తనవద్ద బ్లాక్‌మనీ ఉన్నట్లు సిద్ధార్థ అంగీకరించారని కూడా ఐటీ శాఖ తెలిపింది. భారీ మొత్తంలో పన్ను ఎగవేతలకు పాల్పడినట్లు తగిన ఆధారాలు దొరకడంతోనే షేర్లను అటాచ్ చేశామని, 2017లో కాఫీ డే గూపు కంపెనీల్లో సోదాలను కూడా చేశామని ఐటీ అధికారులు చెప్పారు. ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారమే తాము చర్యలు తీసుకున్నామని కూడా స్పష్టం చేశారు. కాగా, మైండ్ ట్రీ షేర్ల విక్రయం ద్వారా సిద్ధార్థకు దాదాపు రూ.3,200 కోట్లు వచ్చాయని.. ఈ డీల్ విషయంలో కనీస ప్రత్యామ్నాయ పన్నుగా రూ.300 కోట్లను సిద్ధార్థ చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.46 కోట్లను మాత్రమే కట్టారని కూడా ఐటీ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా కాఫీ డే ఎంటర్ప్రైజెస్ వద్ద రూ.362.11 కోట్ల లెక్కలో చూపని ఆదాయం(బ్లాక్ మనీ) తో పాటు, తన వద్ద రూ.118.02 కోట్ల నగదు ఉన్నట్లు సిద్ధార్థ ఒప్పకున్నారని ఐటీ వర్గాలు వివరించాయి. సీసీడీడీలో 6% వాటా ఉంది: కేకేఆర్ సీసీడీ వ్యవస్థాపకుడు సిద్దార్థ అదృశ్యం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం కేకేఆర్ పేర్కొంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయన కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉండాలని ఒక ప్రకటన విడుదల చేసింది. సిద్దార్థపైన నమ్మకంతో సీసీడీలో తాము తొమ్మిదేళ్ల క్రితం చేసిన పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని గతేడాది విక్రయించామని.. దీంతో తమ వాటా 10.3 శాతం నుంచి ప్రస్తుతం 6 శాతానికి పరిమితమైనట్లు కేకేఆర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఒక పీఈ ఇన్వెస్టర్ నుంచి షేర్ల బైబ్యాక్ కోసం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నానంటూ సిద్దార్థ రాసినట్లు చెబుతున్న లేఖలో బయటపడిన నేపథ్యంలో కేకేఆర్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా పీఈ ఫండ్స్ ఏడాది నుంచి ఏడేళ్ల కాలానికి మాత్రమే పెట్టుబడులు పెట్టి వైదొలగుతుంటాయని, అయితే తాము మాత్రం సీసీడీ వృద్ధి చెందేంతవరకూ సహకారం అందించి కొంత వాటాను మాత్రమే విక్రయించామని కేకేఆర్ వివరించింది. బకాయిలేమీ లేవు: హెచ్డీఎఫ్సీ సిద్ధార్థతో సంబంధం ఉన్న కంపెనీల నుంచి తమకు రుణ బకాయిలు ఉన్నట్లు వచ్చిన వార్తలను హెచ్డీఎఫ్సీ తోసిపుచ్చింది. ‘సీసీడీకి చెందిన టాంగ్లిన్ డెవలప్మెంట్స్ బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్‌పార్క్ ప్రాజెక్టు కోసం గతంలో మేం రుణాలిచ్చాం. అయితే, 2019 జనవరిలో ఈ మొత్తం రుణాన్ని సంబంధిత సంస్థ చెల్లించేసింది. ప్రస్తుతం కాఫీడే ఎంటర్ ప్రైజెస్ గ్రూపు నుంచి మాకు ఎలాంటి బకాయిలూ లేవు’ అని హెచ్డీఎఫ్సీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. పరిస్థితిని సమీక్షిస్తున్నాం: సీసీడీ సిద్ధార్థ అదృశ్యంతో సీసీడీ డైరెక్టర్ల బోర్డు మంగళవారం అత్యవసరంగా సమావేశమైంది. సిద్దార్థ రాసినట్లు బయటికొచ్చిన లేఖలోని అంశాలను సమీక్షించడంతోపాటు లేఖ కాపీలను సంబంధిత అధికారులకు అందజేసినట్లు కంపెనీ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. కాగా, వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం లేకుండా తగిన చర్యలపై దృష్టిపెట్టినట్లు వెల్లడించింది. ‘సిద్దార్థ అదృశ్య సంఘటనతో మేం షాక్‌కు గురయ్యాం. ఆయన కుటుంబ సభ్యులు, ఆప్తులకు మా పూర్తి మద్దతను తెలియజేస్తున్నాం. ఆయన ఆచూకీ కోసం మేం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. నిపుణులైన నాయకత్వంలో కంపెనీ నడుస్తున్నందున వ్యాపార కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయి’ అంటూ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. మైండ్‌ట్రీ డీల్‌తో రూ.3,200 కోట్లు కాఫీ దగ్గరే ఆగిపోకుండా సిద్ధార్థ కొంగొత్త వ్యాపారాల్లోకి కూడా అడుగుపెట్టారు. ఇటు ఆర్థిక సేవల నుంచి అటు ఐటీ దాకా వివిధ రంగాల్లో కార్యకలాపాలు విస్తరించారు. ఐటీ రంగంలో ప్రవేశించి గ్లోబల్ టెక్నాలజీ వెంచర్స్‌ని ఏర్పాటు చేశారు. అటు ఆర్థిక సేవలు అందించే శివన్ సెక్యూరిటీస్ కింద చేతన్ ఉడ్ ప్రాసెసింగ్, బేర్‌ఫుట్ రిసార్ట్స్ (ఆతిథ్య రంగం), డార్క్ ఫారెస్ట్ ఫర్నిచర్ (కలప వ్యాపారం) పేరిట మరో మూడు అనుబంధ సంస్థలు ఏర్పాటు చేశారు. 1999లో సుబ్రతో బాగ్చీ, కేకే నటరాజన్, రోస్టో రవనన్‌లు మైండ్‌ట్రీ సంస్థను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు సిద్ధార్థను కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా తీసుకొచ్చారు ఐటీ రంగంలో సీనియర్ అయిన అశోక్ సూతా. ఒక దశలో మైండ్‌ట్రీలో ఆయన అతి పెద్ద వాటాదారు కూడా. ఈ ఏడాది మార్చిలోనే తనకున్న 20.41 శాతం వాటాలను లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ)కి విక్రయించారు. ఈ వివాదాస్పద డీల్ ద్వారా రూ. 3,200 కోట్లు వచ్చాయి. దాదాపు రూ. 2,900 కోట్ల రుణభారాన్ని ఈ నిధులతో తగ్గించుకున్నారు. అప్పుల కుప్ప.. కాఫీ డే కాఫీ డే చెయిన్ మాతృ సంస్థ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌కు ఈ ఏడాది మార్చి నాటికి రూ. 6,550 కోట్ల మేర రుణభారం పేరుకుపోయింది. రుణాలతో పాటు నష్టాలు కూడా భారీగా పెరిగిపోయాయి. దేశీయంగా కాఫీ ఉత్పత్తి తగ్గినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో కాఫీ ధరలు 13 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం కీలకమైన సిద్ధార్థ వ్యాపారాన్ని గట్టిగానే దెబ్బతీసింది. అయితే, రుణాల భారాన్ని తగ్గించుకునేందుకు మైండ్‌ట్రీలో వాటాలు విక్రయించేసిన సిద్ధార్థ.. ఇతర వ్యాపారాల్లో కూడా వాటాలను విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నారు. రూ. 10,000 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువతో కెఫే కాఫీ డే (సీసీడీ)లో కొంత వాటాలను కోక కోలా సంస్థకు అమ్మేసేందుకు చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వచ్చాయి. రియల్టీ రంగంలో సిద్ధార్థ నెలకొల్పిన టాంగ్లిన్ డెవలప్‌మెంట్స్‌లో దాదాపు రూ. 2,800 కోట్లతో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్ కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. -
మాజీ సీఎం అల్లుడు అదృశ్యం
మంగళూరు : కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ అదృశ్యమయ్యారు. సోమవారం రాత్రి నుంచి ఆయన కనిపించకుండా పోయారు. అయితే సిద్దార్థ దక్షిణ కన్నడ జిల్లాలోని ఉల్లాల్ బ్రిడ్జిపై నుంచి నేత్రావతి నదిలోకి దూకి ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. అతని డ్రైవర్ చెప్పిన కథనం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఉంది. దీంతో పోలీసులు నదిలో బోట్ల సాయంతో గాలింపు చేపట్టారు. అయితే గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నదిలో భారీగా నీటి ప్రవాహం ఉంది. దీంతో పోలీసుల గాలింపుకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు సిద్దార్థ ఆచూకీ లభించలేదు. మరోవైపు అతని ఫోన్ కూడా అందుబాటులో లేనట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ‘సిద్దార్థ సోమవారం బెంగళూరు నుంచి సకలేశ్‌పూర్‌కు కారులో బయలుదేరారు. కానీ డ్రైవర్‌ను మంగళూరుకు పోనివ్వమన్నాడు. అక్కడికి చేరుకున్న తర్వాత ఉల్లాల్ బ్రిడ్జ్ వద్దకు తీసుకెళ్లమని డ్రైవర్‌కు తెలిపాడు. అయితే సాయంత్రం ఏడు గంటల సమయంలో బ్రిడ్జి సమీపంలో కారును పార్క్ చేయమని డ్రైవర్‌కు చెప్పిన సిద్దార్థ.. తాను బ్రిడ్జిపై వాకింగ్‌కు వెళ్తున్నట్టు చెప్పాడు. చాలా సేపయిన సిద్దార్థ తిరిగి రాకపోవడంతో డ్రైవర్ అతని కుటుంబసభ్యులకు, పోలీసులకు ఈ సమాచారం అందించాడ’ని తెలిపారు. ఈ విషయం తెలిసుకున్న కర్ణాటక సీఎం యడియూరప్ప, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్, బీఎల్ శంకర్లు బెంగళూరులోని ఎస్ఎం కృష్ణ నివాసానికి చేరుకున్నారు. మరోవైపు సిద్దార్థ ఆచూకీ కోసం నేత్రావతి నదిలో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు 200 మంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. అలాగే స్థానిక మత్య్సకారుల సాయం కూడా తీసుకుంటున్నారు. -
ప్రేమ నిరాకరించిందని యువతిని..
సాక్షి, బెంగళూరు : ఓ పిచ్చి ప్రేమికుడు తన ప్రియురాలిని చాకుతో పొడిచి, తాను ఆత్మహత్యకు యత్నించిన ఘటన మంగళూరులో చోటు చేసుకొంది. ఈ ఘటనతో స్థానికులు భయందోళనకు గురయ్యారు. మంగళూరు శక్తినగరకు చెందిన సుశాంత్ బగంబిలా గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. సుశాంత్ హైస్కూల్లో డ్యాన్స్ మాస్టర్‌గా పని చేస్తున్నాడు. ఇద్దరి మధ్య హైస్కూల్ నుండి ప్రేమ ఉంది. దీంతో ఇటీవల జరిగిన సదరు యువతి పుట్టిన రోజుకు సుశాంత్ రూ. 50 వేలు ఖర్చు చేశాడు. అయితే ఇటీవల కాలంలో యువతి యువకుడికి దూరంగా ఉంటోంది. దీంతో ప్రేమికుడు యువతిని మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. దీంతో యువతి వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కక్ష పెంచుకున్న సుశాంత్ తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ ఆగ్రహంతో ఉన్నాడు. శుక్రవారం సదరు యువతిని హత్య చేయడానికి మంగళూరు నుంచి బగంబిలా గ్రామానికి వెళ్లాడు. సాయంత్రం కాలేజీ నుండి ఆమె వచ్చేవరకు ఆమె ఇంటి వద్దనే ఉన్నాడు. యువతి రాకను గమనించి ముందుగానే తెచ్చుకున్న చాకుతో ఆమె కడుపుపై 12 సార్లు పొడిచాడు. బాధితురాలు ప్రాధేయపడినా కనికరించలేదు. అనంతరం అదే చాకుతో తాను గొంతు కోసుకున్నాడు. హఠాత్ పరిణామాన్ని గుర్తించిన స్థానికులు ఇద్దరి ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉండటంతో దృశ్యాలు మొత్తం రికార్డయ్యాయి. దాడికి ముందు సుశాంత్ గంజాయి సేవించినట్లు సమాచారం. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే ఆస్పత్రిలో కొద్దిగా తేరుకున్న సుశాంత్, తన ప్రియురాలు ఎలా ఉందని వాకాబు చేశాడు. అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
కాలేజీ బ్యాగ్‌లో కోటి రూపాయలు
సాక్షి, బెంగళూరు: కాలేజీ బ్యాగులో ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక కోటి రూపాయల నగదు తరలిస్తున్న బెంగళూరు వ్యక్తిని శుక్రవారం మంగళూరు ఉత్తర పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని మంజునాథ్‌గా గుర్తించారు. ఉదయం 6.30 సమయంలో మంగళూరులో బస్ దిగిన మంజునాద్ విద్యార్థులు వేసుకునే బ్యాగ్ వేసుకుని అనుమనాస్పదంగా వెళుతున్నాడు. ఇతని తీరుపై పోలీసులకు అనుమానం రావడంతో మంగళూరు ఉత్తర పోలీసులు మంజునాథ్‌ను అడ్డుకుని అతడి వద్ద ఉన్న బ్యాగ్ ను పరిశీలించగా అందులో రూ.2000, రూ.500 నోట్ల కట్టలు బయటపడ్డాయి. లెక్కించగా రూ. కోటిగా తేలింది. హవాలా డబ్బు? వెంటనే అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా, నగదు ఎక్కడిది, ఎలా వచ్చిందనే వివరాలను చెప్పలేకపోయాడు. పోలీసులు అతని పేరు అడుగగా ఒక్కోసారి ఒక్కోటి చెబుతూ వచ్చాడు. చివరికి బెంగళూరుకి చెందిన మంజునాథ్ అని తెలిపాడు. ప్రస్తుతం అతని వద్ద లభించిన నగదుపై ఎలాంటి సమాచారం, ఆధారాలు అతడి వద్ద లబించలేదు. ఇది హవాలా డబ్బుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేసి ఆ దిశగా విచారణ తీవ్రతరం చేశారు. -
బస్సాపి...ఓటేసొచ్చాడు
కర్ణాటకలోని మంగళూరు–శివమొగ్గ రూట్లో వెళుతోంది ఆ బస్సు. రోజులాగే ప్రయాణికులతో బస్సు నిండుగా ఉంది. వెళుతున్న బస్సు ఒకసారిగా రోడ్డు పక్కకొచ్చి ఆగిపోయింది. వెంటనే డ్రైవర్ బస్సులోంచి దిగి పక్కనున్న కేంద్రానికి పరుగెత్తాడు. కొన్ని నిమిషాల తర్వాత వచ్చి బస్సు స్టార్ట్ చేసి యథాప్రకారం ముందుకు సాగాడు. దారి మధ్యలో బస్సు ఆగడం, డ్రైవరు ఎక్కడికో పరుగెత్తుకెళ్లడం చూసి ప్రయాణికులు ముందు కంగారుపడ్డారు. ఏం జరిగిందోనని ఆందోళన చెందారు. అయితే, తిరిగొచ్చిన డ్రైవర్ చేతి చూపుడు వేలు మీదున్న సిరా చుక్క చూశాక జరిగిందేమిటో వారికి అర్థమయింది. విధి నిర్వహణలో ఉంటూ కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటేసి వచ్చిన ఆ డ్రైవరును అంతా అభినందించారు. ఆ డ్రైవరు పేరు విజయ్ శెట్టి. జయరాజ్ ట్రావెల్స్‌లో గత పదేళ్లుగా డ్రైవరుగా పని చేస్తున్నాడు. ఇటీవల అతని నియోజకవర్గంలో పోలింగు జరిగింది. ఆరోజు సెలవయినా కూడా జయరాజ్ డ్యూటీ చేశాడు. అలాగే, ఓటు కూడా వేశాడు. ప్రయాణికులతో గమ్య స్థానం వెళుతూ దారిలో బెలువాయిలో తన ఓటున్న పోలింగు కేంద్రం దగ్గర బస్సాపి ఓటేసొచ్చాడు. కొన్ని నిమిషాల్లోనే పని ముగించుకురావడంతో ప్రయాణికులు కూడా చిరాకుపడలేదు. శెట్టి ఓటు వేసిరావడాన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టారు. వందల మంది దాన్ని షేర్ చేశారు. దాంతో ఆ వీడియో వైరల్ అయింది. అందరూ ఓటు విలువ తెలిసిన మనిషంటూ శెట్టిని అభినందించారు. ప్రజలకు ఓటు విలువ తెలియజేసిన ఈ డ్రైవరును సన్మానించనున్నట్టు దక్షిణ కర్ణాటకకు చెందిన సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ కమిటీ ప్రకటించింది. -
ఆ చిన్నారి కోసం.. సీఎం కూడా!
తిరువనంతపురం : మంగళూరు నుంచి తిరువనంతపురం వెళ్లే ఓ అంబులెన్సుకు దారి ఇవ్వాలంటూ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఓ ఎన్జీవో చేస్తున్న కార్యక్రమానికి నెటిజన్లు అండగా నిలుస్తున్నారు. కేఎల్ 60 జె 7739 నంబరుల గల ఆ అంబులెన్సు ప్రయాణం సాఫీగా సాగాలంటూ లొకేషన్ షేర్ చేస్తూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. పదిహేను రోజుల వయస్సున్న ఓ పసిపాపను కాపాడేందుకు నెటిజన్లు చేస్తున్న ఈ కార్యక్రమంలో కేరళ సీఎం పినరయి విజయన్ కూడా భాగస్వాములు కావడం విశేషం. అసలు విషయమేమిటంటే... కేరళలోని కసరగోడ్కు చెందిన సనియా, మిథా దంపతుల బిడ్డ గుండెలో లోపంతో జన్మించింది. ఈ క్రమంలో మంగళూరులోని ఓ ఆస్పత్రిలో ఆ చిన్నారికి చికిత్స నిర్వహిస్తున్నారు. అయితే హార్ట్ వాల్వ్ సర్జరీ నిమిత్తం తిరువనంతపురంలోని ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. విమానంలో తీసుకెళ్తే శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుందనే కారణంగా అంబులెన్సులో తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాపాయి తల్లిదండ్రులకు సహాయం చేసేందుకు చైల్డ్ ప్రొటెక్ట్ టీమ్ అనే ఎన్జీవో ముందుకు వచ్చింది. మంగళవారం నాటి ప్రయాణానికి సంబంధించిన వీడియోను ఫేస్బుక్లైవ్లో టెలికాస్ట్ చేయడం ద్వారా వాహనదారులను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించింది. అంబులెన్సు ఎక్కడ ఉన్నది ఎన్ని నిమిషాల్లో ఏ పాయింట్‌కు చేరుతుంది తదితర విషయాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించింది. ఈ విషయం గురించి ఎన్జీవో సభ్యుడు సునీల్ మలిక్కల్ మాట్లాడుతూ... ‘ రెండేళ్ల క్రితం ఇటువంటి ఘటనే జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో సోషల్ మీడియాలో రూట్‌కు సంబంధించిన మెసేజ్ అందించడం ద్వారా అంబులెన్సు గమ్యస్థానానికి చేర్చడంలో సఫలమయ్యాం. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అవలంబిస్తున్నాం. ఈరోజు 12 జిల్లాల గుండా దాదాపు 600 కిలోమీటర్లకు పైగా అంబులెన్సు ప్రయాణించాల్సి ఉంది. 10 నుంచి 15 గంటల్లోగా ఆస్పత్రికి చేరాల్సి ఉంటుంది. అంబులెన్సు లొకేషన్ షేర్ చేయడం ద్వారా ఈ కార్యక్రమంలో సీఎం పినరయి విజయన్ కూడా మాకు అండగా నిలిచారు. అంతేకాదు చిన్నారి వైద్యానికి సహాయం చేస్తామని కేరళ ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది’ అని పేర్కొన్నారు. కాగా సర్జరీ తర్వాత చిన్నారి పరిస్థితి గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Attention to drivers in Kerala. An Ambulance (KL-60 - J 7739) is travelling from Mangalore to Trivandrum with a 15 day old small baby. The ambulance is headed for Sree Chitra hospital in Tvm. So please make way for that Ambulance. The ambulance has left Mangalore at 10am. pic.twitter.com/rRF7HF4sc1 — Advaid (@Advaidism) April 16, 2019 -
భారీ వర్షాలు రోడ్డుపై షార్క్, పాము
-
కర్ణాటకలో మెకును తుఫాను భీభత్సం
-
నడి రోడ్డుపై షార్క్, 5 అడుగుల పాము
మంగళూరు : మంగళూరు రోడ్లపై ప్రమాదకరమైన జంతువులు దర్శనమిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కర్ణాటకలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వీధులు నీటితో నిండిపోయాయి. దీంతో జనావాసాలకు దూరంగా ఉండాల్సిన పాములు, షార్క్‌లు రోడ్డుపైకి వచ్చేస్తున్నాయి. వర్షాల కారణంగా అరేబియన్ సముద్రంలో భారీ అలలు ఎగసిపడటంతో సముద్రపు నీటితో పాటు ఆరు అడుగుల పొడవైన షార్క్ ఒకటి మంగళూరు వీధుల్లోకి వచ్చి పడింది. ఇది గమనించిన ఓ వ్యక్తి దాన్ని ఇనుప కొక్కెంతో రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లటంతో అది ప్రాణాలు విడిచింది. అంతేకాకుండా 5 అడుగుల పాము ఒకటి రోడ్డుపై నిల్వ ఉన్న నీటిలో అలా ఈదుకుంటూ వెళ్లటం అక్కడి వారిని కొంత భయానికి గురిచేసింది. పాము తమ పక్కనుంచి వెళ్లేంత వరకూ అలా చూస్తూ ఉండి పోయారు. విషపూరిత జంతువులు నీటిలో తిరుగుతుండటంతో జనాలు వీధుల్లో నిల్వ ఉన్న నీటిలోకి దిగి నడవటానికి భయపడతున్నారు. సముద్రంలో భారీ అలలు ఎగసి పడుతుండటంతో జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. కర్నాటక బెళ్తంగడి తాలూకా మిత్తబాగిలులోని ఎర్మయ్ ఫాల్స్‌లో షూటింగ్ కోసం వెళ్లిన కన్నడ వర్ధమాన దర్శకుడు సంతోష్ శెట్టి అధిక వర్షాల కారణంగా నీటి ఉధృతిలో కోట్టుకొనిపోయి మరణించిన విషయం తెలిసిందే. -
ప్రముఖ జర్నలిస్టు టీవీఆర్ కన్నుమూత
మంగళూరు : ప్రముఖ జర్నలిస్టు టీవీఆర్ షెనాయ్ నిన్న (మంగళవారం) కన్నుముశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేరళలోని ఎర్నాకుళంలో జనించిన ఆయన ఐదు దశాబ్దాల పాటు పాత్రికేయ రంగంలో విశిష్ట సేవలు అందించారు. జర్నలిజంలో షెనాయ్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2003లో ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించింది. షెనాయ్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలియజేశారు. వృత్తిలో భాగంగా ఎక్కువ కాలం ఢిల్లీలోనే గడిపిన షెనాయ్ కేరళకు ఢిల్లీలో ప్రతినిధిగా వ్యవహరించారని విజయన్ అన్నారు. కాగా షెనాయ్ కుమార్తె సుజాత యూఎస్‌లో జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. -
ముస్లిం యువకుడితో ఫొటో దిగిందని..
సాక్షి, బెంగళూరు: ముస్లిం యువకుడితో కలిసి దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిందనే కారణంగా ఎస్ఎఫ్ఐ మహిళా కార్యకర్తను బెదిరించిన ఘటనలో ఆదివారం మంగళూరు పోలీసులు ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ఎస్ఎఫ్ఐ కార్యరకర్త మాధురి.. ముస్లిం మతానికి చెందిన స్నేహితుడితో కలిసి దిగిన సెల్ఫీని తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది గమనించిన బెళ్తంగడి తాలూకా కక్కిరిచి ప్రాంతానికి చెందిన హరీశ్ దేవాడిగ అనే యువకుడు మాధురిని బెదిరిస్తూ ఆమె ఫేస్బుక్ ఖాతాలో సందేశాలు పంపాడు. యువతి ఫిర్యాదు మేరకు పాండేశ్వర పోలీసులు యువకుడు హరీశ్‌ను అరెస్ట్ చేశారు. అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చట్టప్రకారం నిందితుడిపై చర్య తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ‘ఐ లవ్ ముస్లిమ్స్’ అని వాట్సాప్‌లో మెసేజ్ చేసినందుకు 20 ఏళ్ల అమ్మాయిని వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా చేసిన ఘటన చిక్‌మంగుళూరులో ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నేపథ్యంలో మాధురి కేసుపై పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశారు. -
‘రోడ్డు పేరు మార్పు’ పై మాజీ ప్రధాని లేఖ
మంగళూరు: కర్ణాటకలో ‘రోడ్డు పేరు మార్పు’ వివాదంపై మాజీ ప్రధాని దేవేగౌడ.. సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. మంగళూరు పట్టణంలోని ఓ రోడ్డుకు విజయా బ్యాంక్ మాజీ చైర్మన్, దివంగత సుందర్ రామ్శెట్టి పేరును ప్రతిపాదించిన కర్ణాటక ప్రభుత్వం.. ఆ మేరకు జీవో కూడా జారీ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని కొన్ని వర్గాలు తప్పుపట్టాయి. మంగళూరులోని అంబేద్కర్ సర్కిల్ నుంచి క్యాథలిక్ క్లబ్ వరకు ఉన్న లైట్ హౌజ్ హిల్ రోడ్డు ను ‘సుందర్ రామ్ శెట్టి మార్గ్’ గా మార్చవద్దంటూ ఆ వర్గాలు నిరసనలు చేపట్టాయి. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం పేరు మార్పు ఆదేశాలను తాత్కాలికంగా నిలిపేసింది. దీనిపై మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఓ లేఖ రాశారు. ‘అన్ని వర్గాల పురోగతి కోసం పాటుపడిన ఆయన(సుందర్ శెట్టి) విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. పేరు వెనక్కి తీసుకోలన్న మీ(ప్రభుత్వ) నిర్ణయం ఆయన్ని అవమానించినట్లే అవుతుంది’ అని దేవగౌడ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. సంబంధిత అధికారులతో చర్చించి దీనిపై త్వరగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. మొన్నామధ్యే యూపీలో మొగల్‌సరై రైల్వేస్టేషన్ పేరును దీన్ దయాల్ ఉఫాధ్యాయ్ పేరిట మార్చేందుకు సీఎం యోగి ఆదిత్యానాథ్ యత్నించటం, దానిపై అసెంబ్లీలో దుమారం రేగటం తెలిసిందే. ఆ వివాదం ఇంకా సర్దుమణగకముందే తాజాగా కర్ణాటకలోనూ పేరు వివాదం రాజుకోవడం గమనార్హం. -
కొండ చిలువతో పోరాడిన బాలుడు
బెంగళూరు(బనశంకరి): మింగబోయిన కొండచిలువతో వీరోచితంగా పోరాడి ఓ బాలుడు ప్రాణాలు దక్కించుకున్నాడు. కర్ణాటకలోని మంగళూరు జిల్లా బంట్వాళ గ్రామానికి చెందిన 11 ఏళ్ల వైశాఖ్ ఏడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి కాలినడకన ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో పొదల్లో నుంచి 11 అడుగుల కొండచిలువ వచ్చి బాలుణ్ని పెనవేసుకొని మింగేందుకు యత్నించింది. బాలుడు ధైర్యంగా పక్కనే ఉన్న రాయి తీసుకొని కొండచిలువ నోటిభాగంలో బలంగా బాది గాయపరిచాడు. దీంతో కొండచిలువ పట్టు సడలించడంతో ప్రాణాలు దక్కించుకొని ఇంటికి చేరాడు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు గాయపడిన బాలుణ్ని ఆస్పత్రిలో చేర్పించగా ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. -
అమర్-అక్బర్-ఆంటోనీ మళ్లీ పుట్టారు!
అమర్.. అక్బర్.. ఆంటోని.. అన్నదమ్ముల ఆత్మీయ అనుబంధానికి అద్దంపట్టిన వెండితెర దృశ్యరూపం. సినిమా విడుదలై, హిట్టై 39 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు ఆ ముగ్గురూ మరో రూపంలో పునర్జన్మ పొందారు. పులి కూనలుగా భూమి మీదకు పాదంమోపి, గురువారం నామకరణ మహోత్సవం జరుపుకొన్నారు. మంగళూరు శివారులోని పిలికులా జాతీయ పార్కు పులలకు ఫేమస్. అక్కడి నేత్రావతి, విక్రమ్ అనే జంటకు మార్చిలో జన్మించిన కూనలే ఈ అమర్, అక్బర్, ఆంటోనీ, నిషాలు. నిధుల కొరతతో సతమతమవుతోన్న పార్క్ నిర్వాహకులు.. పులులను దత్తత తీసుకోవాల్సిందిగా(నిర్వహణా బాధ్యతలు తీసుకోవాల్సిందిగా) చేసిన అభ్యర్థనలకు మంచి స్పందన లభించింది. అబుదాబికి చెందిన మిచెల్ డిసౌజా అనే వ్యక్తి నాలుగు పులి పిల్లల సంరక్షణార్థం ఏడాదికి రూ.5 లక్షల వితరణ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. దీంతో పులి పిల్లలకు పేరుపెట్టే అవకాశం ఆయనకు లభించింది. బాలీవుడ్ హిట్ సినిమా అమర్- అక్బర్- ఆంటోనీ పేర్లను మూడు మగ పులి పిల్లలలకు, ఆడ పిల్లకేమో నిషా అని పేరు పెట్టాయన. ప్రస్తుతం పిలికులా పార్క్ లో 11 పులులు ఉన్నాయని, సంరక్షణా బాధ్యతలు స్వీకరించాలనుకునేవారు తమను సంప్రదించవచ్చని చెబుతున్నారు జూ డైరెక్టర్ హెచ్ జే భండారి. మీరూ pilikulazoo.com ను దర్శించి, ఏదేని జంతువునో, పక్షినో దత్తత తీసుకుని ఇష్టమైన పేరు పెట్టుకోండిమరి! -
'ఇంటి ముందు కాపుకాసి హత్య చేశారు'
మంగళూరు(కర్ణాటక): సమాచార కార్యకర్త వినాయక బాలిగ(51) హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హంతకులను పట్టుకునేందుకు మూడు బృందాలు ఏర్పాటు, కొన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని మంగళూరు పోలీసు కమిషనర్ ఎం. చంద్రశేఖర్ తెలిపారు. మంగళూరులోని పీవీఎస్ కళాకుంజ్ రోడ్డులో సోమవారం వినాయక బాలిగ హత్యకు గురయ్యారు. దుండగులు ఆయనను కత్తులతో నరికి చంపారు. ఈ నెల 21న ఉదయం 5.30 గంటల ప్రాంతంలో గుడి వెళ్లేందుకు తన ఇంటి నుంచి వినాయక బాలిగ బయలుదేరారని, అదే సమయంలో దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేశారని కమిషనర్ చెప్పారు. ఆయన ఇంటి ముందు కాపుకాసి ఈ కిరాతకానికి పాల్పడ్డారని తెలిపారు. తీవ్రగాయాలపాలైన ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. వినాయక బాలిగ హత్యకు కారణమైన వారిని చట్టం ముందు నిలబెడతామని ప్రకటించారు. -
కట్నం కోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీచం..
సాక్షి, బెంగళూరు: కట్నం కోసం తను కట్టుకున్న భార్య నగ్న చిత్రాలను ఫేస్బుక్లో అప్లోడ్ చేయడమే కాక ఆ చిత్రాలతో కూడిన సీడీని ఆమె తండ్రికి పంపించాడు సాఫ్ట్ వేర్ ఇంజరీగ్ గా పనిచేస్తోన్న ఓ నీచుడు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకుంది. కాసరగోడుకు చెందిన 27 ఏళ్ల యువకుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల కిందట అతనికి చేర్తళ(కేరళ)కు చెందిన 20 ఏళ్ల యువతితో ఫేస్బుక్ స్నేహం కుందిరింది. స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో వీరిద్దరూ ఏడాది కిందట గురువాయూర్ దేవస్థానంలో వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొద్ది నెలలకే పుట్టింటినుంచి కట్నం తీసుకురావాలంటూ భార్యను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడా నీచుడు. వేధింపులు తట్టుకోలేక ఆ యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో క్రూరంగా మారిపోయిన భర్త.. గతంలో భార్యకు తెలియకుండా తీసి భద్రపరుచుకున్న ఆమె నగ్న చిత్రాలను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. అంతేకాక ఆ ఫొటోల సీడీని యువతి తండ్రికి పంపాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కాసరగోడు పోలీసులు నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. -
యువతిని రేప్ చేసిన ఆలయ పూజారి!
మంగళూరు: కర్ణాటక మంగళూరులోని ప్రముఖ కతీల్ దుర్గపరమేశ్వరి ఆలయంలో అసిస్టెంట్ పూజారిగా పనిచేస్తున్న హరిశ్చంద్రరావు (56)ను పోలీసులు అరెస్టు చేశారు. 19 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం జరిపినట్టు హరిశ్చంద్రరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ అత్యాచార ఘటన ఏడాది కిందట జరిగింది. దాంతో గర్భవతి అయిన బాధితురాలు తాజాగా అబార్షన్ కోసం స్థానిక ఆస్పత్రికి వెళ్లడంతో ఈ ఘటన వెలుగుచూసింది. 2015 ఆగస్టులో తన ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయిపై హరిశ్చంద్రరావు అలియాస్ అప్పు భట్టా అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భవతి అయింది. అయితే తనకు ఉన్న పలుకుబడితో పూజారి ఈ ఘటనను వెలుగులోకి రాకుండా చూశాడు. స్థానిక పెద్దలతో పరిష్కారం జరిపించి.. బాధితురాలికి పరిహారంగా కొంత డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయితే మొదట బాధితురాలు అబార్షన్ చేయించుకోవడానికి నిరాకరిచింది. గత నవంబర్‌లో ఆమె అబార్షన్ కోసం స్థానిక ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు అబార్షన్‌కు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చేందుకు అప్పు భట్టా ప్రయత్నించాడు. దీంతో వారు ఈ ఘటనను పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బాధితురాలు కూడా తాజాగా బాజ్పే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అప్పు భట్టాను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. -
ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం
మంగళూరు: 103 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పింది. మంగళూరు నుంచి న్యూఢిల్లీ బయలుదేరిన విమానం రెక్కల్లో పగుళ్లు ఏర్పడినట్లు విమాన పైలట్ గుర్తించి.... మంగళూరు విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. అధికారుల సూచన మేరకు పైలట్ విమానాన్ని వెంటనే విమానాశ్రయంలో దింపివేశారు. న్యూఢిల్లీ నుంచి సాంకేతిక సిబ్బందిని రప్పించి... విమానంలో ఏర్పడిన లోపాన్ని సరి చేశారు. అనంతరం 47 మంది ప్రయాణికులతో విమానం న్యూఢిల్లీ పయనమైంది. అయితే విమానంలోని ముంబై వెళ్లవలసిన ప్రయాణికులను అప్పటికే మరో విమానంలో వారివారి గమ్యస్థానాలకు తరలించారు. అసలైతే ఈ విమానం మంగళూరు నుంచి ముంబై మీదగా ఢిల్లీ చేరవలసి ఉంది.