ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం | Windshield crack grounds Air India flight in Mangaluru | Sakshi
Sakshi News home page

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం

Published Sat, Jan 3 2015 10:50 AM | Last Updated on Fri, Aug 17 2018 6:15 PM

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం - Sakshi

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం

మంగళూరు: 103 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పింది. మంగళూరు నుంచి న్యూఢిల్లీ బయలుదేరిన విమానం రెక్కల్లో పగుళ్లు ఏర్పడినట్లు విమాన పైలట్ గుర్తించి.... మంగళూరు విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. అధికారుల సూచన మేరకు పైలట్ విమానాన్ని వెంటనే విమానాశ్రయంలో దింపివేశారు.

న్యూఢిల్లీ నుంచి సాంకేతిక సిబ్బందిని రప్పించి... విమానంలో ఏర్పడిన లోపాన్ని సరి చేశారు. అనంతరం 47 మంది ప్రయాణికులతో విమానం న్యూఢిల్లీ పయనమైంది. అయితే విమానంలోని ముంబై వెళ్లవలసిన ప్రయాణికులను అప్పటికే మరో విమానంలో వారివారి  గమ్యస్థానాలకు తరలించారు. అసలైతే ఈ విమానం మంగళూరు నుంచి ముంబై మీదగా ఢిల్లీ చేరవలసి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement