చిరిగిన సీటు ఇస్తారా..?ఎయిర్‌ఇండియాపై మంత్రి ఆగ్రహం | Central Minister Shivraj Singh Chouhan Slams Air India | Sakshi
Sakshi News home page

చిరిగిన సీటు ఇస్తారా..? ఎయిర్‌ఇండియాపై కేంద్ర మంత్రి ఆగ్రహం

Published Sat, Feb 22 2025 12:17 PM | Last Updated on Sat, Feb 22 2025 12:30 PM

Central Minister Shivraj Singh Chouhan Slams Air India

న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియాపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు.ఈ మేరకు ఆయన ఎక్స్‌(ట్విటర్‌)లో ఒక పోస్టు పెట్టిన చౌహాన్‌ తర్వాత దానిని డిలీట్‌ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.ఎయిర్‌ఇండియా ప్రయాణికులను మోసం చేస్తోంది.

ఇటీవల తాను భోపాల్‌ నుంచి ఢిల్లీ రావడం కోసం ఎయిర్‌ఇండియా విమానం ఏఐ436లో ఒక సీటు బుక్‌ చేసుకున్నాను.తీరా విమానం ఎక్కి చూస్తే ఆ సీటు చినిగిపోయి కిందకు నొక్కుకొనిపోయి ఉంది. ఈ విషయమై విమానం సిబ్బందిని అడిగితే ఈ సమస్య ఇప్పటికే మేనేజ్‌మెంట్‌ దృష్టిలో ఉందని, ఆ సీటు ఎవరికీ విక్రయించొద్దని సమాచారమిచ్చినట్లు చెప్పారు’అని శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వెల్లడించారు.ఈ వ్యవహారంపై ఎయిర్‌ఇండియా సంస్థ వెంటనే స్పందించింది. మంత్రి చౌహాన్‌కు క్షమాపణలు చెప్పింది.

కాగా ఎయిర్‌ఇండియా విమానయాన సంస్థ గతంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేది. ఈ సంస్థను టాటా గ్రూపు టేక్‌ఓవర్‌ చేసి ప్రస్తుతం నిర్వహిస్తోంది. తమ ఆధ్వర్యంలో నడిచే మరో విమానయాన సంస్థ ఎయిర్‌ విస్తారాను కూడా టాటాలు ఇటీవలే ఎయిర్‌ఇండియాలో విలీనం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement