anger
-
మీ బుర్రలో ఇంత చెత్త ఉందా?.. యూట్యూబర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: పబ్లిక్‌గా అశ్లీల వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. పాపులారిటీ కోసం అంత అసభ్య భాష మాట్లాడతారా? అంటూ మండిపడింది. ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోలో అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు అతని వికృతమైన, చెత్త మనస్తత్వానికి నిదర్శనమని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు అలాంటి భాష ఎవరైనా మాట్లాడతారా అని కోర్టు అసహనం వ్యక్తం చేసింది.‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోలో తాను చేసిన వ్యాఖ్యలపై వేరు వేరు ప్రాంతాల్లో నమోదైన కేసులను కలిపి విచారించేలా ఆదేశాలివ్వాలని అల్హాబాదియా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను మంగళవారం(ఫిబ్రవరి 18) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటిశ్వర్‌సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బుర్రలో ఇంత చెత్త ఉందా అని తీవ్రంగా మందలించారు. కొంత కాలం పాటు ఎలాంటి షోలలో పాల్గొనరాదని అల్హాబాదియాను ఆదేశించారు. అయితే వ్యాఖ్యలకుగాను నమోదైన కేసుల్లో అల్హాబాదియాకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఊరటనిచ్చింది. ఈ కేసుల్లో అతడిని అరెస్టు చేయకుండా స్టే విధించింది. బీర్‌బైసెప్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పాలపులర్ అయిన అల్హాబాదియా అతని స్నేహితుడు సమయ్ రైనాషోలో పాల్గొన్నప్పుడు నోరు జారారు. అతని అశ్లీల వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. పలు చోట్ల కేసులు నమోదయ్యాయి.ఏకంగా మహారాషష్ట్ర,అస్సాం సీఎంలు ఈ విషయమై స్పందించారంటే పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. యూట్యూబ్‌లో అశ్లీల కంటెంట్‌పై కేంద్రానికి నోటీసులు..యూట్యూబ్‌లో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించేందుకు నిబంధనలు రూపొందించాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రణ్వీర్ అల్హాబాదియా కేసు విచారణ సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అలాంటి నిబంధనలేవైనా రూపొందిస్తే తాము సంతోషిస్తామని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. -
కోపాన్ని దిగమింగినవాడే సిసలైన శూరుడు
కోపం మానవుల ఆగర్భ శతృవు. అది అనేక అనర్ధాలకు హేతువు. కోపం అభివృధ్ధి నిరోధకం. కోపంలో మనిషి తనపై తాను అదుపును కోల్పోతాడు. కోపంలో మనిషి దుర్భాషలాడతాడు. కొట్లాటకు దిగుతాడు. భార్యా బిడ్డలపై చేయి చేసుకుంటాడు. అసభ్య పదజాలం ప్రయోగిస్తాడు. చిన్నాపెద్దా వయోభేదాన్ని కూడా పాటించడు. కోపంలో మనిషి ఎవరి మాటా వినే పరిస్థితిలో ఉండడు. హత్యలు చేయవచ్చు. ఆత్మహత్యకూ పాల్పడవచ్చు. కోపస్థితిలో సరైన నిర్ణయం తీసుకోలేడు. క్షణికావేశానికి లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. రెప్పపాటులో చేసే ఆ చిన్న తప్పువల్ల జీవిత కాలానికి సరిపడా చేదు అనుభవాలు మిగిలినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.అసలు ఒకటనేమిటి? నేడు సమాజంలో జరుగుతున్న అనేక అనర్ధాలకు కోపమే కారణమంటే అతిశయోక్తికాదు. మరి ఈ కోపమనే శత్రువును పారద్రోలాలంటే ఏం చెయ్యాలి? దీనికి దైవప్రవక్త ముహమ్మద్ (స) ఒక ఉపాయం చెప్పారు. కోపం వచ్చినప్పుడు నియంత్రించుకోవాలంటే, మనిషి తాను ఉన్నచోటునుండి పక్కకు జరగాలి. అంటే ఆ చోటును వదిలేయాలి. నిలబడి ఉంటే కూర్చోవాలి. కూర్చొని ఉంటే పడుకోవాలి. ఇలా చేయడంవల్ల కోపం అదుపులోకొస్తుంది. అంతకూ ఇంకా కోపం తగ్గకపోతే, వజూ చేయాలి. అంటే నియమబద్ధంగా చేతులూ, ముఖమూ, కాళ్ళు కడుక్కోవాలి. ఎందుకంటే, ఆగ్రహం షైతాన్ ప్రేరణ వల్ల కలుగుతుంది. షైతాన్ సృజన అగ్నితో జరిగింది. అగ్ని నీటితో ఆరుతుంది. కనుక షైతాన్ ప్రేరణతో కలిగిన ఆగ్రహం చల్లారాలంటే నీటిని ఉపయోగించాలి. వజూచేయాలి. ఇలాచేస్తే తప్పకుండా కోపం మటుమాయమవుతుంది.వాస్తవానికి, కోపం రావడమన్నది మానవ సహజమే. మానవమాత్రులెవరూ దీనికి అతీతులు కాదు. కాని కోపంలో విచక్షణ కోల్పోకపోవడమే గొప్పతనం. కోపానికి లోనై జుట్టుపీక్కోవడం, చిర్రుబుర్రు లాడడం, అయిందానికీ, కానిదానికి ఎవరిపైబడితే వారిపై విరుచుకుపడడం, చేతిలో ఏముంటే అది విసిరి కొట్టడం, నోటికొచ్చినంత మాట్లాడడం, బూతులు లంకించుకోవడం ఇవన్నీ ఉన్మాదపు చేష్టలు. మానవ ఔన్యత్యానికి ఏ మాత్రం శోభించని లక్షణాలు. అసలు ఏకోశానా ఇది వీరత్వమూకాదు, ధీరత్వమూకాదు. మానవత్వమూ కాదు. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ (స)’కుస్తీలో ప్రత్యర్ధిని మట్టికరిపించే వాడు వీరుడు కాదు. తనకు కోపం వచ్చినప్పుడు విచక్షణ కోల్పోకుండా నిగ్రహించుకున్నవాడే అసలైన వీరుడు, శూరుడు’.అన్నారు.ఇదీ చదవండి: Damerla Ramarao అద్వితీయ చిత్రకళా తపస్వికనుక, కోపం మానవ సహజమే అయినప్పటికీ, దానిపై అదుపుకలిగిఉండాలి. విచక్షణ కోల్పోయి ఉన్మాదిగా ప్రవర్తించకూడదు. తాను కోపగించుకొని, కస్సుబుస్సులాడి ఏం సాధించగలనని ఆలోచించ గలగాలి. అందరికంటే బలవంతుడు దైవం ఉన్నాడని, ఏదో ఒకరోజు ఆయన ముందు హాజరు కావలసిందేనని, ఆయన అందరి మనోస్థితులూ తెలిసిన సర్వజ్ఞాని అని తెలుసుకొని, విచక్షణాజ్ఞానంతో మసలుకుంటే ఎటువంటి అనర్ధాలూ ఉండవు. కోపానికి దూరంగా ఉంటే జీవితమంతా సంతోషమే. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఆగ్రహం.. ఆరోగ్యానికి అనర్థం
సాక్షి, హైదరాబాద్: భావోద్వేగాల పరంగా చూస్తే.. ఆయా సందర్భాలు, సంఘటనలను బట్టి కోపం రావడాన్ని సహజ లక్షణంగానే పరిగణిస్తుంటారు. కానీ కోపాన్ని నియంత్రించుకోవడంలో విఫలమైతే మాత్రం.. దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటున్నాయనేది అనేక ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఎవరైనా తమ కోపాన్ని ఆపుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటే.. దాని ప్రతికూల ప్రభావం వారి ఆరోగ్యంపై పడుతోందని స్పష్టమౌతోంది.ఆగ్రహాన్ని ఆపుకోలేకపోతే వివిధ రూపాల్లో ఆరోగ్యంపై ప్రభావంపడడంతో పాటు, ఏదైనా ధ్వంసం చేయాలనే ఆలోచన లేదా ఎవరిపై దాడికి పాల్పడటం, స్వీయ నియంత్రణ కోల్పోవడం, తదితర రుగ్మతలకు దారితీయడం, వ్యక్తుల మధ్య సంబంధాలు దెబ్బ తినడానికి కారణమౌతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. చిన్నచిన్న విషయాలకే కోపం రావడం వంటివి దీర్ఘకాలం కొనసాగితే.. వ్యక్తిగతంగా ఆరోగ్యంపై, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపి.. అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోనాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు.ట్రాఫిక్‌లో ఇరుక్కుని వెళ్లాల్సిన ముఖ్యమైన సమావేశానికి లేదా ఫంక్షన్‌కు ఆలస్యం కావడం, చిన్న విషయానికే చిరాకు పడటం, అపరాధ భావం, కొందరిపై లేదా పరిస్థితులపై వ్యతిరేక భావం, ఏదైనా విషయమై తోటివారు, స్నేహితులు, బంధువులు, సహచరులతో భిన్నాభిప్రాయాలు ఎదురుకావడం, మానసికంగా కుంగుబాటు, కూడా కోపం రావడానికి కారణాలుగా విశ్లేష్టిస్తున్నారు. పలు ప్రతిష్టాత్మక సంస్థలు నిర్వహించిన అధ్యయనాల్లోనూ కోపం వల్ల ఆరోగ్యంపై పడే ప్రభావం, ఇతర అంశాలను పరిశీలించారు. కోపోద్రిక్తులు కావడం వల్ల వెంటనే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. రక్తపోటు పెరగడం వల్ల గుండెపై (కార్డియోవాసు్క్యలర్ స్ట్రెయిన్) ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. గుండెజబ్బుల ముప్పు కూడా 19 శాతం పెరుగుతుందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తన పరిశీలనలో పేర్కొంది. ఏదైనా సంఘటన లేదా కారణంతో అధికంగా ఉద్రేక పడితే.. ఆ తర్వాత రెండుగంటల వ్యవధిలోనే గుండెపోటు వచ్చే అవకాశం ఎనిమిదన్నర రెట్లు పెరుగుతుందని యూరోపియన్ హార్ట్ జనరల్ వెల్లడించింది. రక్తపోటు పెరిగిపోయి ‘క్రానిక్ హైపర్‌టెన్షన్’గా మారితే హార్ట్‌స్ట్రోక్‌తో పాటు మూత్రపిండాల వ్యాధులకు దారితీయొచ్చని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కోపంపై నియంత్రణ కోల్పోతే రోగనిరోధక సామర్థ్యం 30 శాతం తగ్గిపోతుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కోపానికి గురైనపుడు కొన్ని గంటల పాటు రోగనిరోధక వ్యవస్థ బలహీనమౌతుందని వెల్లడిస్తున్నాయి. 24 గంటల పాటు ‘స్లీప్ సైకిల్స్’లో ఇబ్బందులు, కేవలం రెండు నిమిషాల కోపం అనేది 7 గంటల పాటు ‘కోర్టిసోల్’స్థాయిల్లో పెరుగుదలకు కారణమౌతుందని హెచ్చరిస్తున్నాయి.ఆగ్రహం నియంత్రణకు ఏం చేయాలంటే.. ⇒ కోపం వచ్చే సూచనలను ముందుగానే గమనించి.. దాని నియంత్రణకు అవసరమైన విధంగా స్పందించాలి ⇒ వెంటనే ప్రతిస్పందించకుండా.. ఏం చేయాలనే దానిపై కొంత సమయమిచ్చి ఆలోచించాలి. ఒకటి నుంచి పది దాకా లెక్క పెట్టడంతో పాటు కామింగ్ బ్రీథింగ్ ఎక్సర్సైజులు చేయాలి ⇒ కోపానికి కారణం ఏమిటో తెలియజేయాలి. అందుకు కారణమైన వ్యక్తితో కాకుండా మిత్రుడు లేదా ఆప్తులతో మాట్లాడాలి ⇒ పరుగు, నడక, ఈత, యోగ వంటి ఒత్తిళ్లను తగ్గించే కార్యకలాపాలు చేయాలి ⇒ ఏదైనా సంఘటనకు వెంటనే ప్రభావితమై స్పందించకుండా.. ఏం చేయాలన్న దానిపై దృష్టి పెట్టాలి.యాంగర్ మేనేజ్మెంట్ కేసులే ఎక్కువమా దగ్గరకు ‘యాంగర్ మేనేజ్మెంట్’కు సంబంధించిన కేసులు ఎక్కువగానే వస్తున్నాయి. వైవాహిక బంధంలో తలెత్తే సమస్యలతో దంపతులిద్దరిలో ఎవరో ఒకరు కోపోద్రిక్తులు కావడం, రోడ్డుపై వెళ్తునపుడు ఎదురయ్యే ఘటనలతో, వ్యక్తిత్వాల్లో వచ్చిన మార్పులతో ఆవేశాలు, ఇలా వివిధ కారణాలు, సంఘటనలతో ప్రభావితమై తమ ఆగ్రహాన్ని నియంత్రించుకోలేని వారు వస్తున్నారు. వారికి ఆయా సమస్యలకు అనుగుణంగా మందులు ఇవ్వడం, కౌన్సెలింగ్, యాంగర్ మేనేజ్మెంట్ క్లాసెస్ తీసుకుంటున్నాం. అప్పుడప్పుడు ఏదైనా సందర్భంలో లేదా ఏదైనా అనుకోని ఘటన జరిగినప్పుడు ఆగ్రహానికి గురైతే మంచిదే.కానీ ఏ చిన్న సంఘటనకైనా, చిన్నపాటి వాగ్వాదానికి ఇతరులపై కోపగించుకోవడం, రుస రుసలాడటం వంటివి చేస్తే మాత్రం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కోపం అనేది ‘నెగిటివ్ ఎమోషన్’అయినప్పటికీ.. ఆగ్రహం రావడానికి భావోద్వేగపరమైన అంశాలు మెదడుపై ప్రభావం చూపి (నెర్వస్ సిస్టమ్‌పై) శరీరంలోని అన్ని భాగాలను ప్రభావితం చేసి ఒక్కసారిగా రక్తప్రసారం పెరిగిపోతుంది. వెంటనే ఏదో రూపంలో శరీరం స్పందించేలా చేస్తుంది. మామూలుగా చూస్తే ఇదొక రక్షణ వ్యవస్థ (డిఫెన్న్ మెకానిజం)గా ఉన్నా.. ఒకస్థాయి దాటాక కోపాన్ని నియంత్రించుకోలేకపోతే దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. అందువల్ల కోపంపై నియంత్రణ ఎంతైన అవసరం. – డాక్టర్ ఎమ్మెస్ రెడ్డి, సీనియర్ సైక్రియాట్రిస్ట్–డైరెక్టర్, ఆశా హాస్పటల్స్చేయకూడనివి..⇒ అన్నింటినీ ఒకేసారి చేయా లని ప్రయత్నించొద్దు. అందుకోగలిగే చిన్న లక్ష్యాలను ముందు నిర్దేశించుకోవాలి ⇒ మనం మార్చలేని వాటిపై దృష్టి కేంద్రీకరించొద్దు. సమయాన్ని, శక్తియుక్తులను నిర్దేశిత లక్ష్యంపై పెట్టాలి. ఎవరికి వారు స్వాంతన చేకూర్చుకుంటే మంచిది ⇒ ఏకాకిగా ఉన్నాననే భావన రానివ్వొద్దు. మిత్రులు, సహచరుల సహకారం, మద్దతు తీసుకోవాలి ⇒ కోపాన్ని తగ్గించుకునేందుకు మద్యం, సిగరెట్, గ్యాంబ్లింగ్, డ్రగ్స్ వంటి వాటిని ఎప్పటికీ ఆశ్రయించవద్దు. ఇవన్నీ కూడా మానసికంగా మరింతగా క్షీణించేలా చేస్తాయి. -
బంగ్లాదేశ్ సోషల్‌మీడియా పోస్టుపై భారత్ ఆగ్రహం
న్యూఢిల్లీ:ఇటీవల భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ సన్నిహితుడు మహఫుజ్ ఆలం సోషల్ మీడియా వేదికగా ఇటీవల భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.‘బంగ్లాదేశ్ ప్రభుత్వం వద్ద మేం ఈ విషయాన్ని లేవనెత్తాం. ఆలం పోస్టును తర్వాత తొలగించారు. బహిరంగ వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. బంగ్లా ప్రజలు, తాత్కాలిక ప్రభుత్వంతో సంబంధాలను పెంపొందించుకునేందుకు భారత్ ఆసక్తితో ఉన్నప్పటికీ ఇలాంటి చర్యలు నిరాశ కలిగిస్తున్నాయి’ అని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. భారత్‌లోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలంటూ ఆలం కొన్ని రోజుల క్రితం ఫేస్బుక్లో పోస్టు పెట్టి కొన్ని రోజుల తర్వాత తొలగించాడు.బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు..2200 కేసులు కాగా, బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్కడ హిందువులపై దాడులకు సంబంధించి ఏకంగా 2200 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. షేక్‌హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత హిందువులపై దాడులు పెరిగిన విషయం తెలిసిందే. -
శాంతమే సౌఖ్యం..
తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్షాకవచంగా నిలుస్తుందని సుమతీ శతకకారుని సుధామయ ప్రబోధం.. శాంతం అనేది మానవులు అలవోకగా, అలవాటుగా అలంకరించుకోవలసిన గొప్ప ఆభరణం. క్రోధం కలిగినపుడు మనలో ప్రజ్వరిల్లే తక్షణ ఆవేశానికి లోను కాకుండా మదిని శాంతపర్చుకోవడం ఎంతైనా అవసరం. శాంతాన్ని ఆశ్రయించిన అతికొద్ది నిమిషాల్లోనే మనలోని వివేకం మేలుకొంటుంది.జంతుజాలానికీ, మనకూ ఉన్న భేదమే శాంతాన్ని కలిగించే వివేకం. జంతుకోటికి శాంతం వహించడం అంత సాధ్యం కాదు. వాటికి పక్కనే ఉన్న జంతువులతో తేడా వస్తే, ముందుగా గుర్తుకు వచ్చేది పోరాటం. తమను బాధపెట్టిన జంతువు బలాన్ని బేరీజు వేసుకుంటాయి. వాటితో పోరాటానికి సిద్ధమవుతాయి. అదే జంతువు బలం ఎక్కువైతే, అప్పటికప్పుడే పలాయనం చిత్తగిస్తాయి. వాటికి ఉన్న వివేకసంపద పరిమితి అంతే. కానీ, జంతుకోటికి భిన్నంగా జనించి, సమస్త జీవకోటిలోనూ అత్యంత తెలివైనవాడైన మానవుడు కోపంతోనూ, క్రోధంతోనూ చరించరాదు. బహుళ ప్రయోజనకరమైన శాంతాన్ని అన్నివేళలా ఆశ్రయించాలి. రంగస్థలంమీద పాత్రధారులు నవరసాలను పోషించి, అలరిస్తారు. అవి వరుసగా– శృంగారం, వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, భీభత్సం, రౌద్రం, శాంతం. ఈ రసాల్లో హృదయానికి ఎటువంటి ఉద్వేగాన్ని కలగనీయకుండా అలరించే ఏకైక రసం శాంతరసం. రంగస్థలం మీద కొందరే పాత్రధారులుంటారు. జీవన రంగస్థలం మీద మానవులంతా పాత్రధారులే. అంటే, ఒకరితో ఒకరు ఏదో ఒక పనిమీద సంభాషించుకుంటూ ఉంటారు, కార్యకలాపాలను నెరపుతూ ఉంటారు. అటువంటి కార్యాలకు జయాన్ని సిద్ధింపజేయడంలో శాంతం ప్రధానపాత్ర పోషిస్తుంది. అనవసరంగా కేకలు పెడుతూ, హడావుడి చేసే మనిషి దగ్గరకు చేరడానికి ఎవరూ ఇష్టపడరు. ప్రశాంత చిత్తంతో, శాంతంతో మాట్లాడే వారి దగ్గరకు అందరూ చేరతారు. తీయగా మాట్లాడే అటువంటి వ్యక్తులకు ఏ రంగంలోనైనా జయాన్ని సాధించే అవకాశమూ మిగిలినవారితో పోలిస్తే బాగా ఎక్కువే..!! శాంతికరమైన వ్యవహారశైలి సొంతమైన వీరు జీవితంలో ఎంతగానో సుఖిస్తారు, వారితో చరించేవారినీ ఆనందపరుస్తారు. అత్యుత్తమమైన శాంత గుణానికున్న ప్రత్యేకతను తేటపరుస్తూ,‘‘శాంతములేక సౌఖ్యము లేదు’’ అన్నాడు వాగ్గేయకారుడు త్యాగయ్య.అయితే.. మనం ఆలోచించవలసిన ప్రశ్న ఒకటుంది. మనిషికి శాంతమనేది ఏ రకంగా లభిస్తుంది? కొంతమందికి అందమైన భార్య, ప్రయోజకులైన సంతానం, కావలసినంత సంపద.. ఈ విధంగా అన్నీ అమరినట్లే ఉంటాయి. కానీ, జీవితంలో మాత్రం నిరంతరం వారికి ఏదో అసంతృప్తి, అశాంతి..!! దానికి కారణం ఒక్కటే.. తాను కోరుకునే వస్తువులు, లేదా సుఖాల మీద అంతులేని వ్యామోహం నీడలా వెన్నాడడమే..!! మనిషిని సర్వకాల సర్వావస్థల్లో శాంతపరచేది తృప్తి మాత్రమే..!!ఆనందకరమైన మానవ జీవనానికి నిత్య వసంతాన్ని నింపే ఆమని.. శాంతమనే సంజీవని..పరిస్థితులవల్ల వచ్చిన ఉద్వేగాలకూ, ఉద్రేకాలకూ లోను కాకుండా స్వభావానికి దగ్గరగా ఉండడమే శాంతంగా వర్తించడమనే నిర్వచనం చెప్పుకోవచ్చు’’ ఇదీ ఓ ఆంగ్ల సిద్ధాంతకర్త వాక్కు. వినగానే, ఒకింత కఠినమైన సూత్రంగా ఈ వాక్యం అనిపించినా, అంతర్లీనమైన భావం మాత్రం సర్వకాల సర్వావస్థల్లో శాంతియుతంగా మానవులను ప్రవర్తించమన్నట్లుగా, శాంతంగా ఎదుటివారితో వర్తించమన్నట్లుగా భావించాలి.ఇంద్రియాలను జయించినవాడికైనా, సకల శాస్త్రాలను క్షుణ్ణంగా చదివినవాడికైనా శాంతగుణం అవసరమే. ధన కనక వస్తు వాహనాలెన్ని ఉన్నా, భోగభాగ్యాల్లో తేలియాడామని తలపోసినా, మనిషి ప్రశాంతచిత్తుడు కాకపోతే, అతనికి కలిగే ‘ప్రయోజనం సున్నా’. ఇది వాస్తవం. స్వప్రయోజనాల కోసమో, పదవుల కోసమో వెంపర్లాడుతూ పంచకళ్యాణిలా పరుగెత్తే ఆశలతో సతతమూ నలిగిపోయే వాళ్లకు శాంతమనేది ఒక అందని ద్రాక్ష. జీవితకాలంలో వాళ్లు ఎప్పుడూ స్థిమితంగా ఉండరు. మరొకరిని ఉండనివ్వరు. ఏదో ఒక రూపంలో అసహనం, అశాంతి వాళ్లకు చుట్టంలా చుట్టుకుని ఉంటుంది. పక్కవాళ్లకూ వీళ్ళ సాహచర్యం ఒకింత భరింపరానిదిగానే ఉంటుంది. – వెంకట్ గరికపాటి‘‘వ్యాఖ్యాన విశారద’’ -
తన కోపమె తన శత్రువు
కోపం తెచ్చుకోవటం అంటే ఎవరో చేసిన తప్పుకి తనను తాను శిక్షించుకోవటం అని ఒక ఆంగ్ల సామెత ఉంది. దీనికి సమానార్థకంగా తెలుగులో కూడా ఒక సామెత ఉంది. ‘‘ఏ కట్టెకి నిప్పు ఉంటే ఆ కట్టే కాలుతుంది’’ అని. ఆలోచిస్తే రెండు ఎంత నిజమో కదా అనిపించక తప్పదు. సుమతీ శతకకారుడు కూడా అదే విషయాన్ని నిర్ధారించాడు – ‘‘తన కోపమె తన శత్రువు’’ అని. గొప్ప గొప్ప శాస్త్రీయమైన సత్యాలని సామాన్యమైన మాటల్లో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పటం అన్ని సమాజాలలో ఉన్న పెద్దలు చేసిన పని. వారికి రాబోయే తరాల మీద ఉన్న ప్రేమకి అది నిదర్శనం. గమనించండి! కోపం తెప్పించిన వారిని కానీ, పరిస్థితులని కానీ ఎవరైనా మార్చ గలరా? కో΄ానికి కారణమైన వారు బాగానే ఉంటారు. సమస్య కోపం తెచ్చుకున్న వారిదే. ఎవరికైనా కోపం ఎందుకు వస్తుంది? తనని ఎవరయినా తప్పు పట్టినా, నిందించినా, దెబ్బకొట్టినా (శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, భావోద్వేగాలపరంగా, సామాజికంగా), తాను అనుకున్నది సాధించలేక ΄ోయినా ఇలా ఎన్నో కారణాలు. ఒక్క క్షణం ఆలోచించండి! వీటిలో ఏ ఒక్కటి అయినా మన అధీనంలో ఉన్నదా? లేనప్పుడు అనవసరంగా ఆయాస పడటం ఎందుకు? కోపపడి, ఆవేశ పడితే ఎడ్రినల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దానివల్ల ముందుగా శరీరంలో ఉన్న శక్తి అంతా ఖర్చు అయి΄ోతుంది. కోపంతో ఊగి΄ోయినవారు తగ్గగానే నీరసపడటం గమనించ వచ్చు. ఇది పైకి కనపడినా లోపల జరిగేది జీవప్రక్రియ అస్తవ్యస్తం కావటం. దానికి సూచనగా కళ్ళు ఎర్ర బడతాయి. కాళ్ళు చేతులు వణుకుతాయి, మాట తడబడుతుంది. ఆయాసం వస్తుంది. రక్త ప్రసరణలో మార్పు తెలుస్తూనే ఉంటుంది. పరీక్ష చేసి చూస్తే రక్త ΄ోటు విపరీతంగా పెరిగి ఉంటుంది. ఇది తరచుగా జరిగితే ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తక తప్పదు. కోపం తెప్పించిన వారు మాత్రం హాయిగా ప్రశాంతంగా ఉంటారు. కో΄ాన్ని వ్యక్త పరిస్తే వచ్చే వాటిలో ఇవి కొన్ని. లోపలే అణుచుకుంటే వచ్చేవి మరెన్నో! ఎసిడిటీ, విరేచనాలు, మలబద్ధకం నుండి మధుమేహం, గుండె ΄ోటు వరకు. తాను చేయని తప్పుకి ఈ శిక్ష ఎందుకు? మరేం చేయాలి? ఆలోచించి, కోపకారణాన్ని తెలుసుకోవాలి. మనని ఎవరైనా తప్పు పడితే – అది నిజంగా త΄్పా? కాదా? అని తెలుసుకోవాలి. తప్పు అయితే సరిదిద్దుకోవాలి. (ఎత్తి చూపినవారికి మనసులోనైనా కృతజ్ఞతలు తెలుపుకుంటూ) తప్పు కాక΄ోతే, మనకి అనవసరం. అనుకున్నది సాధించ లేక తన మీద తనకే కోపం వస్తే, చేయలేక ΄ోవటానికి ఉన్న కారణాలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఈ రకమైన విశ్లేషణ చేయటానికి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటం అవసరం. అందుకే అంటారు ఆవేశంలో నిర్ణయాలు తీసుకో కూడదు అని. మానవ మాత్రులం కనక కోపం రావటం సహజం. కానీ దానిని అదుపులో ఉంచుకుని, దానినే ఆయుధంగా ఉపయోగించుకుంటే అదే ఉపకరణంగా మారి లక్ష్యసాధనకి సహకరిస్తుంది. శ్రీరామచంద్రుడు కో΄ాన్ని అదుపులో ఉంచుకున్నాడు. అది ఆయన చెప్పు చేతల్లో ఉంది. రమ్మంటే వస్తుంది. ΄÷మ్మంటే ΄ోతుంది. అందుకే ఆయనని ‘జితక్రోధుడు’ అన్నాడు వాల్మీకి. అవసరానికి కోపం వచ్చినట్టు కనపడాలి. దాని ప్రయోజనం దానికీ ఉంది. పిల్లలు అల్లరి చేస్తుంటే తల్లి కేకలు వేస్తుంది. అమ్మకి కోపం వచ్చింది అనుకుంటారు. నిజానికి అది కోపమా? ఇంతలో అత్తగారో, భర్తో పిలిస్తే మామూలుగానే మాట్లాడుతుంది. అమ్మవారి చేతిలో క్రోధము అనే అంకుశం ఉంది అని లలితారహస్యనామసాహస్రంలో ఉంది. అంటే తన అశక్తత మీద కోపం తెచ్చుకుని అనుకున్నది సాధించాలి అని అర్థం. ఇది కో΄ాన్ని ఆయుధంగా వాడటం. శత్రువుని సాధనంగా మలచుకుని ముల్లుని ముల్లుతోనే తీయటం. – డా.ఎన్. అనంతలక్ష్మి -
Pakistan: పాక్ సైనికులపై నిరసనకారుల దాడి.. ఒక జవాను మృతి
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఆ దేశ సైన్యంపై నిరసనకారులు తిరగబడ్డారు. పాక్ సైన్యం కొనసాగిస్తున్న అరాచకాలను వ్యతిరేకిస్తూ బలూచిస్తాన్‌లోని ఆందోళనకారులు దాడులకు దిగారు. ప్రావిన్స్‌లోని గ్వాదర్ జిల్లాలో జాతీయవాద బలూచ్ ఉద్యమంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.బలూచ్ యక్జేతి సమితికి చెందిన నిరసనకారులు ర్యాలీలో పాక్ భద్రతా దళాలతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో పాక్ ఆర్మీ జవాన్ ఒకరు మృతి చెందగా, ఓ అధికారితో సహా 16 మంది గాయపడ్డారు. అక్రమంగా నిర్బంధించిన తమ కమిటీ సభ్యులను వెంటనే విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. తమ సభ్యులను విడుదల చేసే వరకు నిరసన కొనసాగుతుందని కమిటీ నాయకుడు మెహ్రంగ్ బలోచ్ తెలిపారు.నిరసనకారుల ధైర్యాన్ని ప్రశంసిస్తూ మెహ్రాంగ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు ‘ఈ రోజు మీరంతా పాకిస్తాన్‌కు మాత్రమే కాకుండా ప్రపంచం అంతటికీ సందేశం ఇచ్చారు. మీ ఆందోళనల ముందు తుపాకులు, అధికారం విలువలేనివని అన్నారు. కాగా పాకిస్తాన్ భద్రతా దళాలు బలూచిస్తాన్ విశ్వవిద్యాలయం ముందు నిరసనకారులపై దాడి చేసి, 12 మంది మహిళలు, 50 మందికి పైగా పురుషులను తమతో పాటు తీసుకుపోయి నిర్బంధించాయి. -
‘అది ప్రమాదం కాదు.. ఆప్ చేసిన హత్యలు’
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఒక ఇనిస్టిట్యూట్ భవనం బేస్మెంట్లోకి భారీగా వరద నీరు చేరడానికి, ఆ నీటిలో చిక్కుకుని ముగ్గురు విద్యార్థినులు మృతి చెందడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వమే కారణమని, ఇది ప్రమాదం కాదని, ఆ పార్టీ చేసిన హత్యలని బీజేపీ ఆరోపించింది.బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షాజాద్ పూనావాలా మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో జరిగినది ప్రమాదం కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన హత్యలు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే జరిగింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఇటీవల పటేల్ నగర్లో విద్యుదాఘాతంతో యూపీఎస్సీకి సిద్ధమవుతున్న విద్యార్థి మృతి చెందిన ఘటనను ప్రస్తావిస్తూ.. ఈ విధంగా చాలా మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీలు విలేకరుల సమావేశాలు నిర్వహించడం, ప్రకటనలు ఇవ్వడం, ఆరోపణలు చేయడం తప్ప మరో పనిచేయడం లేదని పూనావాలా ఆరోపించారు.ఢిల్లీలో ఎక్కడ చూసినా నీటి మడుగులు కనిపిస్తున్నాయని, ఇవి ప్రాణాంతకంగా మారాయన్నారు. దీనికి పూర్తి బాధ్యత ఆమ్ ఆద్మీ పార్టీదేనన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి మంజీందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ ఈ ఘటన ఆమ్ ఆద్మీ పార్టీ నిర్లక్ష్య పూరిత పనితీరుకు ఉదాహరణ అని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అతని సహచరులంతా కలసి కాలువలు శుభ్రం చేయడానికి కేటాయించిన డబ్బును కూడా తిన్నారని అరోపించారు. ఢిల్లీలో ఒక్క గంట వర్షం కురిస్తే చాలు వరదలు సంభవిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
బెంగాల్: యువతిని చితకబాదిన ఘటనపై దుమారం
కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్‌లో ఓ వీడియో దుమారం రేపుతోంది. ఓ యువతిని రోడ్డుపై పడేసి కర్ర విరిగేలా చితకబాదుతున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.యువతిని కొడుతుండగా చుట్టూ నిలబడిన వారంతా చూస్తూ ఉండిపోయారు తప్ప ఆపడానికి ఎవరూ ప్రయత్నించలేదు. ఈ ఘటన బెంగాల్లో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితి తెలియజేస్తోందని మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటనపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశారు. ‘ఈ వీడియోలో యువతిని దారుణంగా కొడుతున్నది చోప్రా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న తృణమూల్ ఎమ్మెల్యే హమిదుర్ రెహ్మాన్ అనుచరుడు తేజ్ముల్ అనే వ్యక్తి. ఇతను తన ‘ఇన్సాఫ్’ సభల ద్వారా పంచాయితీలు చేసి అక్కడికక్కడే శిక్షలు విధిస్తుంటాడు. This is the ugly face of Mamata Banerjee’s rule in West Bengal.The guy in the video, who is beating up a woman mercilessly, is Tajemul (popular as JCB in the area). He is famous for giving quick justice through his ‘insaf’ sabha and is a close associate of Chopra MLA Hamidur… pic.twitter.com/fuQ8dVO5Mr— Amit Malviya (@amitmalviya) June 30, 2024తృణమూల్ కాంగ్రెస్ పాలనలో ఈ తరహా షరియా కోర్టులున్నాయని భారత ప్రజలు మొత్తం గుర్తించాలి. బెంగాల్లో ప్రతి గ్రామంలో ‘సందేశ్‌ఖాలీ’తరహా ఘటనలు జరుగుతున్నాయి. మమత పాలన వెస్ట్‌బెంగాల్‌కు ఒక శాపం’అని మాలవ్య ట్వీట్లో ఫైర్ అయ్యారు. మరోపక్క సీపీఎం నేతలు కూడా యువతిని కొడుతున్న వీడియోపై స్పందించారు. బెంగాల్లో బుల్డోజర్ జస్టిస్ రాజ్యమేలుతోందని సీపీఎం స్టేట్ సెక్రటరీ ఎండీ సలీమ్ ఎక్స్(ట్విటర్)లో విమర్శించారు. కాగా, యువతిని చితకబాదిన ఘటన ఈ వారాంతంలోనే జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఏ కారణంతో కొడుతున్నారనేది తెలియరాలేదు. Not even #KangarooCourt ! Summary trial and punishment handed out by d @AITCofficial goon nicknamed JCB.Literally bulldozer justice at Chopra under @MamataOfficial rule. pic.twitter.com/TwJEThOUhi— Md Salim (@salimdotcomrade) June 30, 2024 -
రాజ్‌కోట్ అగ్నిప్రమాదం.. గుజరాత్ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుజరాత్‌లోని రాజ్‌కోట్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఆ రాష్ట్ర అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక మునిసిపల్ అధికారుల తీరుపై కోర్టు మండిపడింది. అమాయకుల ప్రాణాలు కోల్పోయిన తర్వాత చర్యలు చేపడతామని చెబుతోన్న రాష్ట్ర అధికారులపై తమకు నమ్మకం లేదని పేర్కొంది. అగ్నిప్రమాదం కేసును గుజరాత్ హైకోర్టు సోమవారం(మే27) విచారించింది. ఈసందర్భంగా రాజ్‌కోట్ మునిసిపల్ కార్పొరేషన్ (ఆర్ఎంసీ) అధికారులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. రెండున్నరేళ్లుగా మీ పరిధిలో ఇంత పెద్ద భవనం ఉందని.. అది కూడా ఫైర్‌సేఫ్టీ లేకుండా ఉందన్న విషయం కూడా తెలియదని ఎలా చెబుతారని జస్టిస్ బైరెన్ వైష్ణవ్, జస్టిస్ దేవాన్‌దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఆ భవనం ప్రారంభ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ కూడా పాల్గొన్నట్లు మీడియా కథనాలను బెంచ్ చూపించింది. ఈ అధికారులు ఎవరు.. వాళ్లంతా ఆడుకోవడానికి అక్కడికి వెళ్లారా అని మండిపడింది. ఏడుగురు అధికారుల సస్పెన్షన్ ..కాగా, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత గుజరాత్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇద్దరు పోలీసులు సహా మొత్తం ఏడుగురు అధికారులను సస్పెండ్ చేసింది. వీరిలో రాజ్‌కోట్ మునిసిపల్ అధికారులు కూడా ఉన్నారు. -
Supreme Court: న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం
న్యూఢిల్లీ: కోర్టు హాల్లో ఎలా ప్రవర్తించాలన్నదానిపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ సోమవారం సుప్రీంకోర్టులో ఓ న్యాయవాదికి క్లాస్ పీకారు. ఏ రైలు పడితే అది ఎక్కేయడానికి ఇది రైల్వేస్టేషన్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు రూమ్‌లో ఎలా మెలగాలన్నదానిపై ముందు మీరు వెళ్లి ఎవరైనా సీనియర్ న్యాయవాది వద్ద శిక్షణ తీసుకోండని సూచించారు. జ్యుడిషీయల్ సంస్కరణలపై తాను వేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సోమవారం సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది ఒక్కసారిగా లేచి సీజేఐ బెంచ్‌ను అడగడం ప్రారంభించాడు. కేసు లిస్ట్ కాకుండా మీ వంతు రాకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఇలా మెన్షన్ చేయడమేంటని ఆ న్యాయవాదిని సీజేఐ ప్రశ్నించారు. అయినా వినిపించుకోని ఆ న్యాయవాది న్యాయవ్యవస్థలో సంస్కరణలు అత్యంత త్వరగా తీసుకురావాల్సి ఉందని చెప్పసాగాడు. న్యాయవాది ప్రవర్తన పట్ల ఆగ్రహించిన సీజేఐ అసలు మీరెక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారని అడిగారు. దీనికి ఆయన సమాధానమిస్తూ హైకోర్టు, దిగువ కోర్టుల్లో చేస్తా అని చెప్పాడు. దీనికి స్పందించిన సీజేఐ మీరు త్వరగా ఒక సీనియర్ వద్ద జాయిన్ అయి కోర్టు రూమ్‌లో ఎలా మెలగాలో నేర్చుకోండని చురకంటించారు. ఈ నెల ప్రారంభంలోనూ ఓ అడ్వకేట్ సుప్రీం కోర్టులో గొంతు పెంచి మాట్లాడుతుండగా సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతు తగ్గించి వాదించాలని సూచించారు. ఇదీచదవండి.. ఈడీ ఎదుటకు లాలూ -
నీ స్థాయి ఎంత? నువ్వేం చేయగలవు?
భోపాల్: నీ స్థాయి ఎంత? నువ్వేం చేయగలవు? అంటూ ట్రక్కు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్‌పై బదిలీ వేటు పడింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం షాజాపూర్ జిల్లాలో జరిగింది. న్యాయ సంహిత బిల్లులోని హిట్ అండ్ రన్ నిబంధనలను వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో డ్రైవర్ల సంఘం ప్రతినిధులతో షాజాపూర్ కలెక్టర్ కిశోర్ కన్యాల్ మంగళవారం సమావేశమయ్యారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదని, విధుల్లో చేరాలంటూ వారిని హెచ్చరించారు. తమతో సక్రమంగా మాట్లాడాలని ఓ ప్రతినిధి చెప్పగా, కలెక్టర్ ఆగ్రహానికి గురయ్యారు. నీ స్థాయి ఎంత? అంటూ మండిపడ్డారు. తమకు ఏ స్థాయి లేదు కాబట్టే ఈ పోరాటం చేస్తున్నామని ఆ ప్రతినిధి బదులిచ్చాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహారం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాల మేరకు కలెక్టర్ కిశోర్ కన్యాల్‌ను ఆ పదవి నుంచి తొలగింగి, రాష్ట్ర డిప్యూటీ సెక్రెటరీగా బదిలీ చేసినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. -
లోకేశ్ పాదయాత్ర వెలవెల
నరసాపురం రూరల్/పాలకొల్లు అర్బన్: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో నారా లోకేశ్ గురువారం నిర్వహించిన పాదయాత్రకు జనస్పందన కరువైంది. నరసాపురం నియోజకవర్గంలో జనం లేక పాదయాత్ర వెలవెలబోయింది. దీంతో స్థానిక టీడీపీ నేతలపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. పాలకొల్లు మండలం దిగమర్రు నుంచి పెదమామిడిపల్లి వరకు నిర్వహించిన పాదయాత్రకు జన స్పందన కరువైంది. దిగమర్రు మూడు రోడ్ల కూడలిలో ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మహిళలతో ఖాళీ బిందెలు ప్రదర్శించి మంచినీటి సమస్య ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. దిగమర్రు గ్రామంలో కల్లుగీత కార్మికులతో మాట్లాడారు. పెదమామిడిపల్లి చేరుకునేసరికి చీకటి పడింది. దీంతో టీడీపీ కార్యకర్తలు కాగడాలు వెలిగించి ఆగస్టులో కూడా విద్యుత్ కోతలంటూ దుష్ప్రచారం చేశారు. కార్యకర్తలకు పెట్రోల్ కోసం రూ.100, మగవారికి రూ.500, ఆడవారికి రూ.300 చెల్లించి పాదయాత్రకు తరలించినట్టు సమాచారం. పాదయాత్రలో జై బాలయ్య, జై జై నిమ్మల అనే నినాదాలే వినిపించాయి. ఎక్కడా లోకేశ్‌కు అనుకూల నినాదాలు చేయకపోవడం గమనార్హం. లోకేశ్ టీమ్ నిర్లక్ష్యంతో దంపతులకు గాయాలు యువగళం బృందం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పాదయాత్ర సందర్భంగా ఓ దంపతులు గాయాల పాలయ్యారు. నరసాపురం మండలం చిట్టవరం వద్ద లోకేశ్ టీమ్‌కు చెందిన కారు డోరు ఒక్కసారిగా తెరవడంతో నరసాపురం వైపు వస్తున్న మోటార్ బైక్‌కు బలంగా తగిలింది. బైక్‌పై ప్రయాణిస్తున్న కడలి మోహనరావు, సరోజిని దంపతులు కిందపడిపోయి గాయాలపాలయ్యారు. పోలీసులు వెంటనే వారిద్దరినీ వాహనంలో తీసుకెళ్లి పాలకొల్లులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. -
కృష్ణా బోర్డు & తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న కొద్దిపాటి నిల్వల పంపిణీ విషయంలో..తెలంగాణ రాష్ట్రం, కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) మధ్య వివాదం తీవ్రమైంది. తాగునీటి అవసరాల కోసం సెప్టెంబర్ 30 వరకు ఏపీకి 25.29 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 6.04 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయాలని ప్రతిపాదిస్తూ గత నెలలో ‘త్రిసభ్య కమిటీ’ పేరుతో రూపొందించిన వివాదాస్పద ముసాయిదా మినిట్స్‌ను ఆమోదించాలని తాజాగా కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలను కోరినట్టు తెలిసింది. ఈ మేరకు ముసాయిదా మినిట్స్‌ను తాజాగా రెండు రాష్ట్రాలకూ కృష్ణా బోర్డు పంపించింది. ఇప్పటికే తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినా బేఖాతరు చేస్తూ మినిట్స్‌ను కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు పంపించడం గమనార్హం. కృష్ణా బోర్డుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం... గత నెల 21న హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగ్గా తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ గైర్హాజర య్యారు. కమిటీ కన్వీనర్ డీఎం రాయిపూరే, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి హాజ రై నీటి కేటాయింపులపై చర్చించారు. ఈ సమా వేశా న్ని వాయిదా వేయాలని అంతకుముందే తెలంగాణ లేఖ రాసినా, కృష్ణా బోర్డు సమావేశాన్ని నిర్వహించింది. సమావేశం నిర్ణయాల మేరకు ఏపీకి 25.29 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 6.04 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించాలని ప్రతిపాదిస్తూ.. ముసాయిదా మినిట్స్‌ను కృష్ణా బోర్డు రూపొందించింది. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ గైర్హాజరైనా, రాష్ట్రానికి అవసరమైన నీటి కేటాయింపులను కోరు తూ గతంలో ఆయన రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. తెలంగాణకు నామమాత్రంగా నీటి కేటాయింపులు జరుపుతూ మినిట్స్‌ను రూపొందించినట్టు పత్రికల్లో వార్తలు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. దీంతో ఈఎన్సీ సి.మురళీధర్ కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ కన్వీనర్ డీఎం రాయి పూరేను కలిసి మినిట్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు త్రిసభ్య కమిటీ సమావేశమే జరగలే దని, నీటి కేటాయింపులపై ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని, ఒకవేళ చేసినా తెలంగాణ సమ్మతి తెలపలేదని స్పష్టం చేస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. త్రిసభ్య కమిటీ సమావేశాన్ని సత్వరంగా నిర్వహించి నీటికేటాయింపులపై నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డును కోరినట్టు వెల్లడించింది. మొత్తంగా.. తెలంగాణ అభ్యంతరాలను పట్టించుకోకుండా నీటి కేటాయింపుల ప్రతిపాదనలను కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు పంపించడం వివాదాస్పదంగా మారింది. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి తిట్ల పురాణం
సాక్షి, మహూబూబ్‌నగర్: నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. సహనం కోల్పోయి ప్రజలపై చిందులు వేశారు. కోపం తట్టుకోలేక కాల్చిపడేస్తానంటూ ఊగిపోయారు. ఇదంతా విన్న ప్రజలు నిస్తుపోయారు. గత మూరు రోజులుగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 10 ఏళ్ల ప్రజాప్రస్థానం పేరుతో నియోజకవర్గంలో యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తెలకపల్లి మండలం బొబ్బిలిలో యాత్ర కొనసాగింది. రాత్రి 9 గంటలకు గ్రామంలో రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే ప్రసంగం సందర్భంగా అల్లరి చేశారు. ప్రసంగాన్ని అడ్రుకునే ప్రయత్నం చేశారు. దీనితో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఒక్క సారిగా ఆవేశానికి గురయ్యారు. ప్రత్యర్థి వర్గాన్ని దూషిస్తూ వేదికపై నుండి విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తే కాల్చిపడేస్తానంటూ ఊగిపోయారు. తిట్ల పురాణంతో దూషణలతో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే ఆవేశపూరిత మాటలతో గందరగోళం నెలకొంది. చదవండి: దిశా కేసులో కీలక మలుపు.. వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న విచారణ అధికారి -
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసుపై ప్రజా ప్రతినిధుల కోర్టు ఆగ్రహం..
హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసుపై ప్రజా ప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్‌కు సంబంధించిన కేసులో శ్రీనివాస్ గౌడ్‌తోపాటు మిగిలిన అధికారులపై కేసు నమోదు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల అఫిడమిట్ ట్యాంపరింగ్ సందర్భంగా మొత్తం పదిమందిపై కేసు నమోదు చేయాలని ఇటీవల ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా కేసు నమోదు చేయలేదని రాఘవేందర్ రాజు అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిపై ప్రజాప్రతినిధులు కోర్టు నేడు విచారణ జరిగింది. ఈ అంశంపై కేసు నమోదు చేశారో లేదో ఈ రోజు 4 గంటల లోపు చెప్పాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ కేసు నమోదు చేయని పక్షంలో కోర్టు ధిక్కరణ నేరం కింద పరిగణిస్తామని వాఖ్యానించింది. కేసు నమోదు చేసి ఉంటే ఎఫ్ఐఆర్ కాపీని అందించాలని ఆదేశించింది. ఇదీ చదవండి: Telangan Floods: 'ఇదేం నివేదిక..?' వరదలపై ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు.. -
నాకు కోపం వచ్చిందటే క్షమించరాని తప్పు చేసారని అర్థం అందుకే...
-
ఎంత పనిచేశాడు.. హెయిర్ స్టయిల్ నచ్చలేదని బాత్రూమ్లోకి వెళ్లి..
ముంబై: ఇటీవల టీనేజర్లు చిన్న విషయాలకు కలత చెందడం, గొడవలకు దిగడం, అంతెందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. క్షణికావేశంలో నిండు నూరేళ్లు జీవితాన్ని అర్థంతరంగా ముగించుకుంటున్నారు. ఇంట్లో తమ తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. తాజాగా ఓ టీనేజర్ హెయిర్‌కట్ నచ్చలేదని బిల్డింగ్‌పై నుంచి దూకేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహరాష్ట్రలోని భయాందర్ నగరానికి చెందిన 13 ఏళ్ల బాలుడికి కుటుంబ సభ్యులు హెయిర్ కట్ చేయించారు. అయితే షాపు అతను చేసిన హెయిర్ కటింగ్ ఆ బాలుడికి అసలు నచ్చలేదు. ఇంటికి వెళ్లాక అద్దంలో పదే పదే ఆ హెయిర్ స్టైల్‌ను చూసుకుంటూ తనకు నచ్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ దశలో కోపోద్రిక్తుడైన ఆ బాలుడు అపార్ట్మెంట్ భవనం 16వ అంతస్తులోని బాత్రూంలోకి వెళ్లి అక్కడ ఉన్న కిటికీ నుంచి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న నవ్ఘర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. -
ఉన్నట్టుండి ఉద్యోగం ఊడిందని పిచ్చెక్కుతోందా? ఈ గదిలోకి వెళ్లాల్సిందే!
ఎంత చదివినా అర్థం కావట్లేదని చిర్రెత్తుకొస్తోందా? మీ కలల కొలువు ఉన్నట్టుండి ఊడిందేమిటని పిచ్చెక్కుతోందా? ఆఫీస్‌లో గొడ్డులా చాకిరీ చేసినా బాస్ ఏమాత్రం పట్టించుకోవట్లేదని మనసు రగులుతోందా? ప్రేయసి హ్యాండ్ ఇచ్చిందని తెగ ఫీలవుతున్నారా? అయితే వెంటనే టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, గాజు గ్లాసులు, ట్యూబ్లైట్ల వంటి వస్తువులను విరగ్గొట్టండి!! ఏమిటీ పిచ్చి సలహా అనుకుంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ట్రెండ్ ఇదే మరి.. అదేమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. సాక్షి, హైదరాబాద్: మనలో ఎవరికైనా ఏదో ఒక సందర్భంలో ఏదైనా విషయంపై పట్ట లేని ఆగ్రహావేశాలు, కసి, కోపం వంటివి కలి గే సందర్భాలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు ఎవరికీ చెప్పుకోలేక, ఏం చేయాలో అర్థంకాక చాలా మంది కుమిలిపోయే పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలాంటి కోపం, ఫ్రస్ట్రేషన్‌ను తీర్చుకొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చిన గదులే రేజ్ రూమ్స్. వీటిని రేజ్ రూమ్స్, బ్రేక్ రూమ్స్, యాంగర్ రూమ్స్, డిస్ట్రక్షన్ రూమ్స్, స్మాష్ రూమ్స్... ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఇలాంటి గదులు ఆవేశంతో రగిలిపోతున్న వారికి సాంత్వన చేకూర్చి శాంతపరుస్తున్నాయి. అసలేమిటీ రేజ్ రూమ్‌లు...? కోపం, కసి, ఫ్రస్ట్రేషన్ వంటి వాటితో బాగా ఇబ్బంది పడుతున్న వారిలో కొందరుఏదైనా పగులగొట్టడమో, ధ్వంసం చేయడమో చేస్తే ప్రశాంతత వస్తుందని అనుకోవడం పరిపాటి. ఎలాంటి వస్తువులను ధ్వంసం చేయడం ద్వారా స్థిమిత పడతామని భావిస్తారో అలాంటి వాటిని ఒక గదిలో ఉంచి ధ్వంసం చేయించడమే ఈ రేజ్ రూమ్‌ల ఏర్పాటు ఉద్దేశం. ఈ జాబితాలో హాళ్లలోని వస్తువులు, వంటిగది వస్తువుల నమూనాలు, ఫర్నీచర్, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, డెస్‌్కలు, ఫోన్లు మొదలైనవి ఉంటాయి. ఎప్పుడు మొదలైందీ ట్రెండ్... 2008 ప్రారంభంలో జపాన్, అమెరికాలోనిటెక్సాస్లలో ఇది మొదలైంది. ముఖ్యంగా జపాన్‌లో 2008లో ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడటంతో ప్రజల్లో పెరిగిన ఒత్తిళ్లు, ఫ్ర్రస్టేషన్ను తగ్గించేందుకు ఈ పద్ధతిని కనుగొన్నారు. అమెరికా, జపాన్‌తోపాటు సెర్బియా, యూకే, అర్జెంటీనా వంటి దేశాల్లో వందలాది రేజ్రూమ్లు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. మన దేశంలోనూ షురూ... 2017లో ఢిల్లీ శివార్లలోని గుర్‌గ్రామ్‌లో ‘బ్రేక్రూమ్’పేరుతో ప్రారంభం. అదే ఏడాది మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ‘భద్దాస్’–యాంగర్ రూమ్ అండ్ కేఫ్ ఏర్పాటైంది. తాజాగా ఈ నెలలోనే బెంగళూరులోని బసవనగుడిలో రేజ్రూమ్ను ఐఐటీ మద్రాస్ పట్టభద్రుడు అనన్యశెట్టి ప్రారంభించాడు. 2022 అక్టోబర్ హైదరాబాద్‌లో తొలి రేజ్రూమ్కు 25 ఏళ్ల సూరజ్ పూసర్ల శ్రీకారం చుట్టాడు. గదిలో ఏముంటాయి? పాడైపోయిన లేదా పనికిరాని వస్తువులను సేకరించి రేజ్ రూమ్‌లో ఉంచుతారు. తమ కోపాన్ని తీర్చుకోవాలనుకొనే వ్యక్తులు ఈ గదిలోకి వెళ్లి వారి ఆవేశం చల్లారే దాకా వస్తువులను చితక్కొట్టొచ్చన్నమాట. అయితే ఇదేమీ ఊరికే కాదండోయ్... వస్తువులను విరగ్గొట్డడమో లేదా పగలగొట్టడమో చేయాలంటే డబ్బు ముట్టజెప్పాల్సిందే. ఇవీ ప్యాకేజీలు.. ఉదాహరణకు హైదరాబాద్‌లోని రేజ్ రూమ్‌లో ‘క్వికీ’ప్యాకేజీ కింద రూ.1,300 చెల్లిస్తే గాజు సీసాలు పెట్టే ఒక ఫైబర్ బుట్ట (బాటిల్ క్రేట్), ఓ కంప్యూటర్ కీ బోర్డు, మౌస్, స్పీకర్లు ధ్వంసం చేయొచ్చు. అలాగే ‘రఫ్ డే’కి రూ.1,500 కడితే రెండు క్రేట్లలో 15 బాటిళ్లు, ప్టాస్టిక్, ఎల్రక్టానిక్ వస్తువులు విరగ్గొట్టొచ్చు. అదే ‘రేజ్ మోడ్’కు అయితే రూ. 2,800 చెల్లించి ఓ మైక్రోవేవ్ ఓవెన్, వాషింగ్ మెషీన్, టీవీ సెట్, రిఫ్రిజిరేటర్, ప్రింటర్, ల్యాప్‌టాప్‌లను విరగ్గొట్టొచ్చు. ఇవేకాకుండా పంచింగ్ బ్యాగ్, బాక్సింగ్ ఉపకరణాలు, గురిచేసి కొట్టే డార్ట్‌లు ఇంకా రేజ్ బాల్స్ ఉన్నాయి. ఈ ప్యాకేజీలు ఉపయోగించుకొనే వారికి ఇండస్ట్రియల్ సూట్, హెల్మెట్, గ్లౌస్, షూస్ వంటివి ఇస్తారు. ఒక్కొక్కరూ లేదా ఏడుగురు సభ్యులతో కూడిన బృందం 20 నిమిషాలపాటు ఆ గదిలో ఉండి వస్తువులను ధ్వంసం చేయొచ్చు. పనికి రానివే.. పనికి రాని వస్తువులు, పాడైన వస్తువులను తుక్కు వ్యాపారుల నుంచి కొనుగోలు చేసి రేజ్ రూమ్‌లో ఉంచుతాం. కోపంతో ఉన్న వారు విరగ్గొట్టిన వివిధ వస్తువులను రీసైక్లింగ్ కేంద్రాలకుతరలిస్తాం. –నిర్వాహకులు -
కేటీఆర్ ప్రశంసపై కొండారెడ్డిపల్లివాసుల ఆగ్రహం
కేశంపేట: సినీనటుడు ప్రకాశ్‌రాజ్ తన దత్తత గ్రామమైన రంగారెడ్డి జిల్లా కేశంపేట పరిధిలోని కొండారెడ్డిపల్లిని బాగా అభివృద్ధి చేశారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసించడంపై ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులతో కలసి సర్పంచ్ పల్లె స్వాతి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిపై కేటీఆర్ పూర్తి సమాచారం తెలుసుకొని మాట్లాడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రకాశ్‌రాజ్ 2019 వరకే తమ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని, ఆయన చేసిన అభివృద్ధి కంటే తాము సొంత నిధులతో చేసిన అభివృద్ధి ఎక్కువగా ఉందని ఆమె స్పష్టం చేశారు. మూడేళ్లుగా సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్న తమను అభినందించాల్సి పోయి.. ప్రకాశ్‌రాజ్ అభివృద్ధి చేశారని చెప్పడం ఎంతవరకు సమంజసమని సర్పంచ్ స్వాతి ప్రశ్నించారు. పనిచేసింది మేమైతే.. ప్రశంసలు ప్రకాశ్‌రాజ్‌కా? అంటూ కేటీఆర్‌కు ప్రశ్న సంధించారు ఆ ఊరి ప్రజలు. This is the village adopted by @prakashraaj Great progress made in tandem with local MLA @AnjaiahYTRS Garu 👏 https://t.co/yGfYdloaFT — KTR (@KTRTRS) September 20, 2022 -
వదినతో గొడవ.. పల్సర్ బైకుకు నిప్పు.. ఆపై పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి..
కళ్యాణదుర్గం(అనంతపురం జిల్లా): వదినపై కోపంతో ఓ యువకుడు తన ద్విచక్ర వాహనానికి తానే నిప్పు పెట్టాడు. ఈ ఘటన కళ్యాణదుర్గంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని కోట వీధిలో నివాసముంటున్న నవీన్ శనివారం తన అన్న భార్యతో గొడవపడ్డాడు. ఆమెపై కోపంతో అర్ధరాత్రి సమయంలో తన పల్సర్ బైకుకు నిప్పు పెట్టాడు. తర్వాత బంధువులు తన బైకును తగులబెట్టారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి విచారణ చేసిన తర్వాత అసలు నిజం ఒప్పుకున్నాడు. చదవండి👉: కాలాంతకురాలు: భర్త హత్యకు ప్రియుడితో కలిసి ప్లాన్.. కానీ.. -
కోడలిపై కోపం.. మూడు రోజుల తర్వాత ఏం జరిగిందంటే?
తుమకూరు(కర్ణాటక): కొడుకు–కోడలిపై కోపంతో ఓ మహిళ మనవరాలి చావుకు కారణమైంది. వివరాలు.. కుణిగల్ తాలూకా సాసలు గ్రామానికి చెందిన జయమ్మ కుమారుడు పుట్టరాజుకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల కూతురు త్రిషా ఉంది. ఈ పెళ్లి పుట్టరాజ తల్లి జయమ్మకు ఇష్టం లేదు. దీంతో తరచూ కోడలుతో గొడవ పడేది. ఇటీవల జయమ్మ త్రిషాను బయటకు తీసుకెళ్లినప్పుడు బాలికను పిచ్చి కుక్క కరిచింది. చదవండి: రన్నింగ్ బస్సులు ఎక్కి.. యువతులపై వికృత చేష్టలు అయితే కోడలుపై కోపంతో జయమ్మ విషయం ఎవరికీ చెప్పలేదు. మూడు రోజుల తర్వాత చిన్నారి అస్వస్థతకు గురైంది. తర్వాత నాలుగు రోజులకు రేబీస్ వ్యాధితో మరణించింది. కుక్క కరిచినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు జయమ్మను నిలదీయగా విషయం చెప్పింది. కుణిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని జయమ్మపై విచారణ చేపట్టారు. -
‘క్రోధం’తో వస్తుంది విరోధం
క్రోధమనే చెడ్డగుణం రూపం లేని అరిషడ్వర్గాలనే ఆరు శత్రువుల్లో రెండవది. దానిని కోపంగా, కినుకగా, అలుకగా సందర్భానుసారం వాడుతూ ఉంటారు. క్రోధానికి గురయినవారు ఎదుటివారి మనస్సును నిష్కారణం గా బాధిస్తారు. మనిషి చేసే ఆలోచన, మాట్లాడే మాట ప్రయత్నించే పని క్రోధపూరితంగా ఉండకూడదు. క్రోధంతో ఇంటా బయటా గౌరవాన్ని కోల్పోవడమే కాక శారీరకంగా మానసికంగా వచ్చే భయంకరమైన దీర్ఘరోగ బాధలను కూడా భరించవలసి వస్తుంది. కామం, క్రోధం, లోభం ఆదిగాగల చెడ్డగుణాలు పాప కార్యాలను స్పష్టించే పరమశత్రువులని మనస్సు ను కలుషితం కావించి బుద్ధివికాసాన్ని చెరచి జ్ఞానమనే చక్కని సంపదను నశింప చేస్తాయని వేదాంతసారమైన భగవద్గీత, ఇతర ఆత్మజ్ఞాన గ్రంథాలు బోధిస్తున్నాయి. తనమాట వినలేదని వినుగుచెంది కోపాన్ని ఆపుకోలేక హిరణ్యకశిపుడు పుత్రుడయిన ప్రహ్లాదుణ్ణి నానాహింసలు పెట్టి ఉగ్రనరసింహుని చేతిలో హతుడయ్యాడు. తన వికృతచేష్టలను చూసి సీతమ్మ నవ్విందని కోపించిన శూర్పణఖ ఆమెను మింగబోయి లక్ష్మణుని వల్ల ముక్కు చెవులు కోల్పోయింది. ఇలా ఎంతోమంది క్రోధావేశాలకు గురయి మానప్రాణాలకు ముప్పు తెచ్చుకొన్నారు. అందుకే మృదువుగా సంభాషించడం, ఇతరులను హింసించకుండా ఉండటం సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవడం, తొందరపాటును నివారించుకొనడం, సత్పురుషుల సావాసం చేయడం, మనస్సును నియంత్రించుకోవడానికి యోగసాధన సల్పడం వల్ల జీవితాన్ని బంగారు మయంగా గడపగలం. – విద్వాన్ వల్లూరు చిన్నయ్య -
కోపంగా ఉన్నారా.. ఈ సమస్య ఉన్నట్లే
న్యూఢిల్లీ: మన శరీర నిర్మాణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే వేళకు నిద్రిపోవడం ఎంతో అవసరం. ఎన్ని కోట్లున్న నిద్ర కరువయితే జీవితం వ్యర్థం అనే విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిద్ర కరువయి, చాలా మంది సతమవుతున్నారు. కాగా ప్రతి ఒక్కరికీ కనీసం ఏడు గంటల నుంచి 9గంటల సంతృప్తికరమైన, నాణ్యమైన నిద్ర అవసరం అని డాక్టర్ శ్రేయా గుప్తా చెబుతున్నారు. ఆమె నిద్ర అవసరాన్ని వివరించారు. మనం నాణ్యమైన నిద్ర పోగలితే హార్మోన్లు, గుండె, మెదడు తదితర అవయవాలలో రోగనిరోధక శక్తి పెరిగి మరుసటి రోజు ఉత్సాహంగా ఉంటామని డాక్టర్ చెబుతున్నారు. కాగా ఏకారణంతోనైన సరియైన నిద్ర పోనప్పుడు విపరీతమైన కోపం, ఓపిక లేకపోవడం, భావోద్వేగ నియంత్రణ కోల్పోవడం తదితర చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంది. నిద్ర సరిగ్గా లేకపోతే మెదడులో కీలకంగా ఉన్న ‘అమిగ్డాలా’ అనే రసాయన పనితనం మందగిస్తుందని ఇటీవలే జర్నల్ ఆఫ్ రీసెర్చ్ తెలిపింది. కోపానికి, నిద్రకు సంబంధం ఉన్నట్లు ఆధారాలతో నిరూపించింది. నిద్ర సమస్యలను అధిగమించాలంటే పౌష్టికాహారం, వ్యాయాయం, మానసిక ప్రశాంతత మూడు కచ్చితంగా పాటించాలని డాక్టర్ ప్రజలకు సూచిస్తున్నారు. -
బడుగు జీవులపై అటవీ అధికారుల ప్రతాపం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గల్ఫ్‌లో ఉపాధి కోల్పోయి తిరిగి వచ్చిన బాధితుడు గూడు లేక గ్రామశివారులోని అటవీ ప్రాంతంలో గుడిసె ఏర్పాటు చేసుకుని జీవిస్తుండగా అటవీ శాఖ అధికారులు తమ ప్రతాపం చూపారు. గుడిసె తీసివేయాలని ఆ కుటుంబాన్ని హెచ్చరించడంతో దానిని తొలగిస్తున్న క్రమంలో కర్రలు మీద పడి గృహిణి తీవ్రగాయాలకు గురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం లాల్‌సింగ్ తండా గ్రామపంచాయతీకి చెందిన వేముల దేవయ్య స్వగ్రామంలో పనులు లేక ఉపాధి కోసం రూ.5 లక్షలు అప్పు చేసి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాడు. అక్కడ కూడా సరిగా పని దొరక్క ఏడాది క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో రిజర్వ్ అటవీ ప్రాంతంలో తాత్కాలికంగా గుడిసె వేసుకున్నాడు. అటవీ సిబ్బంది సెక్షన్ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం గుడిసె తొలగించే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో దేవయ్య భార్య లక్ష్మిపై కర్రలు పడి గాయాలకు గురైంది. ఆమెను ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నాకు ఈ యుద్ధం వద్దు బావా!
దానవీరశూరకర్ణుడి ముందు దానం కోసం నిలుచున్నాడు విప్రోత్తముడు.‘‘ఏమి విప్రోత్తమా సందేహించుచుంటిరి! ఈ మణులు మిమ్మల్ని తృప్తిపరచకున్న నా రత్నభాండగారాన్నే సమర్పించెదను’’ అన్నాడు కర్ణుడు.‘‘ఆ రాళ్లతో మాకు నిమిత్తం లేదు’’ అని మణిమాణిక్యాలను తేలిగ్గా తీసేశాడు విప్రుడు.‘‘మరి, చతురంగ బలగములా? నృత్యగీత వాద్య వినోదములా? అప్సరసల వంటి విలాసినులా?’’ అడిగాడు కర్ణుడు.‘‘అట్టి అల్పమైన కోరికలు సాధించుకొనుటకు ఈ దానకర్ణుడిని యాచించుట అర్థం లేదు’’ అన్నాడు విప్రుడు.‘‘అయినచో ఇంకేమి కావలెను. మడులా మాన్యములా? సర్వసుభిక్షమగు నా రాజ్య సర్వస్వమా?’’ మళ్లీ అడిగాడు కర్ణుడు.‘‘స్వర్గసుఖములనే తృణప్రాయంగా భావించే మా బోంట్లకు ఈ మహారాజ్య సుఖాలపై ఆశ ఉండునా కర్ణా!’’ అన్నాడు విప్రుడు.‘‘అయినచో తమ మనసులో ఏమి కలదో సంకోచించకుండా వెల్లడింపుడు. ప్రాణములైనా ఇచ్చెదను’’ అన్నాడు కర్ణుడు.‘‘నాకు కావల్సింది నీ ప్రాణములు కాదు. ప్రాణసమానములై ఈ కవచకుండలాలు’’ చివరికి తన మనసులో ఉన్న కోరికను వెల్లడించాడు విప్రుడు.కర్ణుడు ఆశ్చర్యపోయాడు.‘‘ఈ కవచకుండలాలు నాకు పుట్టుకతో వచ్చినవి. నా శరీరం నుండి వేరు చేసినచో తక్షణమే ఇవి జీవరహితమగును. ఈ నిర్జీవముల వలన తమకు కలుగు ప్రయోజనం ఏమిటి?’’ అడిగాడు కర్ణుడు. ‘‘మాకు కలిగే ప్రయోజనం మాట ఎటుల ఉన్నను...నీవు ఇచ్చెదనంటివి...ఇచ్చుట ధర్మం’’ అన్నాడు విప్రుడు.‘‘సరే’’ అన్నాడు కర్ణుడు. కొద్దిసేపట్లోనే తన శరీరం నుంచి రక్తమోడుతుండగా కవచకుండలాలను తీసి ఇచ్చాడు కర్ణుడు.ఇదెలా ఉన్నా...విప్రుడి రూపంలో వచ్చింది ఎవరో కర్ణుడికి అర్థమైంది.‘‘పుత్రరక్షణకై యాచనకు సిద్ధపడితివా మహాత్మా! ఈ మాత్రం దానికి విప్ర వేషం ఏల? స్వస్వరూపమున వచ్చినను ఈ కర్ణుడు లేదనేవాడు కాదు. త్రిలోకాధిపతివి సర్వ దివిజ పూజ్యుడవు. నీవంటి యాచకుడు నాకెక్కడ లభించును మహేంద్రా’’ అన్నాడు కర్ణుడు.‘‘కర్ణా నీకు శుభమగుగాక’’ అని ఆశీర్వదించబోయాడు మహేంద్రుడు.‘‘దానము స్వీకరించు హస్తము కింద అగును మహేంద్రా’’ నవ్వుతూ అన్నాడు కర్ణుడు.‘‘నిజం, శూరాగ్రేసరుడిగా మాత్రమే కాక దానవీరునిగా నీ కీర్తి చిరస్థాయి కాగలదు. కర్ణా...కవచం ఒలుచుటచే నీ శరీరం వికృతమైనదని విచారించకు. సూర్యకాంతితో తేజరిల్లగలదు’’ అని ఆశీర్వదించాడు మహేంద్రుడు.‘‘ధన్యుడను’’ అన్నాడు కర్ణుడు.‘‘నీ ధర్మదీక్షా, దానపరత్వమును మెచ్చితిని. ఏమి కావలయునో కోరుకో’’ అడిగాడు మహేంద్రుడు.‘‘ఇచ్చుటయే గాని పుచ్చుకొనుట యెరుగని వాడను. ఏమి కోరగలను మహేంద్ర’’ అన్నాడు కర్ణుడు.‘‘నీవు కోరకున్నా నేను ఇచ్చెదను. ఇదిగో అద్భుతమైన నా శక్తి. దీనిని ప్రాణపాయ సమయమున మాత్రమే ప్రయోగించుము’’ అని అడగకుండానే కర్ణుడికి వరాన్ని ఇచ్చాడు ఇంద్రుడు. దుర్యోధన సార్వభౌముడు అవమానాగ్నితో దహించుకుపోతున్నాడు...‘‘మా దేహము బడబాగ్నివలె దహించుచున్నది. నేను భరింపజాలను. ఈ దారుణఘాతం నా హృదయం భరింపజాలదు’’ అవమానం, ఆవేశం, ఆవేదను కలగలిసిన గొంతుతో అంటున్నాడు దుర్యోధనుడు.‘‘కేవలం ఒక్క ఆడుదాని హాసం కోసం ఇంత పరితపించాలా!’’ అన్నాడు శకుని మామ.‘‘ఒక్క ఆడుదాని హాసం మాత్రమే కాదు మామా! ఈ సమస్త ప్రకృతి నన్ను అవహేళన చేయుచున్నది. ఆ వికటాట్టహాసం సమస్త భూగోళమున పరిభ్రమించుచున్నది. ఈ పరిభ్రమణంతో నా మతి పరిభ్రమించుచున్నది. పౌరుషం పటాపంచలై, అభిమానం అవమానితమై, బతుకు భారమైన ఈ వ్య«థాభరిత వదనాన్ని ప్రజలకు ఎలా చూపించాలి! నా సోదరుల నడుమ మనలేను. నాకు ప్రాయోపవేశమేశరణ్యం’’ అన్నాడు దుర్యోధనుడు.‘‘సుయోధనా...ఏమి చేసిననను నీవు మరణించజాలవు’’ అంటూ వారించాడు శకుని.‘‘అవమానము ప్రతీకారం చేయుట చేతకాకున్నాను, మా మరణం మా చేతనే ఉన్నది’’ అన్నాడు దుర్యోధనుడు.‘‘లేదు. నీ మరణం నా చేతనే ఉన్నది. నా మరణాంతరం నీ మరణం. పాండవ లక్ష్మిని హరించి నీ కైవసం చేసిన అనంతరం, అహంకరించి నిన్ను అవమానించిన పాంచాలి పదింతలు పరాభవం పాలై రోదించిన అనంతరం...’’ అని చెప్పుకుంటూ పోతున్నాడు శకుని మామ. యుద్ధరంగం.అర్జునుడి కళ్లలో శౌర్యం కాదు వైరాగ్యం కనిపిస్తోంది.దిగులుగా ఉన్నాడు.ఏదో కోల్పోయినట్లుగా ఉన్నాడు.గాండీవాన్ని జారవిడుచుకున్నాడు.‘‘అర్జునా గాండీవాన్ని జారవిడుచుకున్నావేమిటి?’’ అడిగాడు కృష్ణుడు.‘‘నాకీ యుద్ధం వద్దు బావా! బాల్యం నుంచి ఎంతో ప్రేమగా పెంచాడు తాత. భీష్మాచార్యుడు మా వంశానికి ప్రతిష్ఠ. అలాంటి మహానుభావుడి మీద బాణాలు ఎలా వేయమంటావు? కన్నబిడ్డ కంటే మిన్నగా ఆదరించి ధనుర్విద్యా రహస్యాలను బోధించిన గురువును ఎలాధిక్కరించగలను! తాతలు, తండ్రులు, గురువులు, అన్నలు, తమ్ముళ్లు, మామలు, కొడుకులు, స్నేహితులు...ఈ స్వజన సంహారం నావల్ల కాదు బావా!మా సౌఖ్యం కోసం బంధురక్తం చిందించలేను.రాజ్యం కొరకు ఆత్మీయులను అంతం చేయలేను...’’ వైరాగ్య స్వరంతో వాపోతున్నాడు అర్జునుడు.‘‘ఎవరు ఆత్మీయులు? ఎవరు ఎవరికి బంధువులు?ఈ మమతానుబంధాలు శరీరమునకేగానీ ఆత్మకు లేవు అర్జునా!ఒక పరి నా అసలు స్వరూపమును దర్శించుము’’ అని తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపాడు శ్రీకృష్ణుడు. -
చక్రపాణి ఇంద్రలోక యాత్ర
దేవేంద్రుని మందిరం.ఇంద్రుడు కోపంతో బుసలు కొడుతూ అటు ఇటూ పచార్లు చేస్తుంటాడు.రంభ చెంపకు చేయి చేర్చి విచారంగా ఆసనాన్ని ఆనుకుని నిలబడి ఉంటుంది.‘‘అసలు నిన్ను భూలోకం పంపడం నా బుద్ధితక్కువ...నారదుడి మాట విని ఇంత అనర్థం తెచ్చుకున్నాను...ఎక్కడ దేవేంద్రలోకం! ఎక్కడ నీచ మానవలోకం! ఛీఛీ...చెప్పడానికైనా నీకు సిగ్గు లేదా రంభా! నీవేనా ఈవిధంగా మారావు! ఎంత అవివేకం! ఎంత అవమానం!’’‘‘ఇందులో అవమానం ఏమున్నది ప్రభూ! మానవులు కూడా ఎంతటి ప్రతిభావంతులో మీకు తెలియక అలా మాట్లాడుతున్నారు...నిజమైన కళాసేవ చేసి తరించాలంటే మానవలోకంలోనే సాధ్యమవుతుంది. సరస్వతిదేవి అక్కడే స్థిరనివాస మేర్పరచుకున్నది. మానవలోకంలోని సుఖఃదుఃఖాలు మనకు లేవనిపిస్తోంది...అన్నీ ఉంటేనే జీవితం అనీ, మనం అమృతం తాగి ఎప్పుడూ మత్తుగా పడి ఉంటామనీ, మన జీవితాలు ఎందుకూ పనికిరావనీ చక్రపాణిగారు చెప్తుండేవారు’’‘‘బుద్ధిహీనురాలా! అతడి పేరు నా దగ్గిర ఎత్తకు. నా విరోధిని మెచ్చుకుని నన్ను అవమానిస్తావా?’’ ‘‘ఇందులో అవమానించడం ఏమున్నది ప్రభూ!...మీ విరోధుల్ని ఎంతమందిని నేను లొంగతీసి మీ పాదాల ముందు పడవేయలేదు! ఎంతమందిని తపోభ్రష్టులను చేయలేదు. కాని చక్రపాణిగారి విషయం అలా కాలేదు’’‘‘అంటే చక్రపాణి మానవాతీతుండటావా!’’‘‘అనుకోవాల్సిందే! ఆయన మనిషి కాడు...అయితే నా ఓటమికి అర్థం లేదుకదా ప్రభూ!’’‘‘మూర్ఖురాలా– ఆ సామాన్య మానవుడికి నీవు దాసోహం అన్నది చాలక నన్ను కూడా ఓటమిని ఒప్పుకోమంటావా!’’ ‘‘అది ఓటమిగా నేను భావించడం లేదు ప్రభూ...చక్రపాణిగారి మంచితనం చూసి నా అంతట నేనే ఆయన దగ్గిర ఉండి కళాసేవ చేసి తరిద్దామనుకున్నాను. నిజంగా నాది ఓ జీవితమేనా అనిపించింది. నా మీద నాకు రోత పుట్టింది. ఎప్పుడూ మీ దర్బారులో నాట్యం చేయడం తప్ప నా జీవితానికి ఏ విధమైన అర్థం లేకుండా పోయింది...అక్కడ అనేక విధాలయిన పాత్ర పోషణలో నవరసాలు నటనలూ చిందించే కళాజీవుల్ని గురించి విని నా మనసు ఉప్పొంగిపోయింది. చక్రపాణిగారిని వేషమిప్పించమని నేనే అడిగాను. అందులోనూ మంచి బరువువైన పతివ్రత పాత్ర ఇచ్చారు...నా కోసం రాయించారు పాపం... నేను ఎంత పాపిని! చిత్రం పూర్తి చేయకుండా మధ్యలోనే వచ్చేశాను. ఆయన నా వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో!’’‘‘ఛీ! జ్ఞానహీనురాలా! ఇంకా నీ వా భూలోకం మరచి పోలేకపోతున్నావా! పైగా ఇక్కడికి వచ్చినందుకు బాధపడుతున్నావా! నీవల్ల నారదాదుల దగ్గిర నాకెంత అవమానం. ఆ నారదుడు ఊరుకోడే! ముల్లోకాలలోనూ నా ఈ అపజయాన్ని చాటుతాడే! నీ వా భూలోకం సంగతి మర్చిపోయి నీ నిత్యవిధులు నిర్వర్తించు...’’‘‘నావల్ల కాదు ప్రభూ! ఇక నేనే మీ దర్బారులో ఆడలేను. నేను భూలోకానికి పోతాను. నా కక్కడ కొత్తజీవితం కనిపించింది. నన్ను క్షమించండి. నన్ను వెళ్లనివ్వండి...’’ రంభ కదుల్తుందిముందుకు...ఇంద్రుడు తటాలున అడ్డు నిలిచి ‘‘రంభా’’ అంటూ పెద్ద రంకె వేస్తాడు.రంభ నిశ్చలంగా నిలబడి, ‘‘మీరు కేకలు వేసి ప్రయోజనం లేదు ప్రభూ! నా నిశ్చయం మారదు. నేను చలనచిత్రాల్లో నటించి తీరాలి. నన్నాకపండి’’ రెండడుగులు వేస్తుంది.ఇంద్రుడు మళ్లీ అడ్డునిలిచి కోపంతోనూ, అవమానంతోనూ కంపించిపొతూ, ‘‘నీ నిశ్చయం మారదా, నీ పట్టు విడవ్వా?’’‘‘విడవలేను. నా ఆశయం నెరవేరాలి. నేను ఒక గొప్ప నటిననిపించుకుని–అటు భూలోకానికి, ఇటు ఇంద్రలోకానికి కీర్తిప్రతిష్ఠలు తీసుకురావాలి. రంభ కేవలం నాట్యకత్తే కాదు అనిపించుకోవాలి. అలాంటి పాత్రఇచ్చారు ‘‘ఛీ,దౌర్భాగ్యురాలా! ఆ సన్యాసి పేరెత్తుకు నా దగ్గిర’’‘‘నారాయణ’’ అంటూ నారదుడు ప్రవేశిస్తాడు.‘‘ఏమిటి ఇంద్రా, రంభతో ఘర్షణ పడుతున్నట్లున్నావు. ఏమైంది రంభ?’’ఇంద్రుడు కాస్త చల్లబడి, ‘‘చూడు నారదా! భూలోకం నుండి వచ్చినప్పటి నుంచి నే వెళతాను భూలోకానికి అంటుంది’’‘‘నారాయణ...అందాకా వచ్చిందీ కథ. నేనప్పుడే చెప్పాను గదయ్యా! ఆ మానవులు అసాధ్యులు. అందులోనూ ఆ సినిమాజీవులు అఖండులని...అయితే ఇంతకూ రంభ మళ్లీ ఎందుకు వెళతానంటూందీ!’’‘‘ఎందుకా! నా విరోధి చక్రపాణి తీసే చిత్రంలో నటించడానికట...’’‘‘నిజమే. మరి పాపం సగంలో మనిద్దరం వెళ్లి రంభను తీసుకొచ్చామాయే–అయినా మళ్లీ వెళ్లి లాభం ఏమిటి! రంభకు బదులు ఎవరిచేతనో ఆ పాత్ర వేయించి చిత్రం పూర్తి చేస్తున్నట్టున్నాడే’’‘‘ఆ! నిజంగానా! హతవిధి...నే నెంతగా ఆశపడ్డానే! ఎంతో కష్టపడి నటించానే...మీ వల్ల నా నటనా జీవితం నాందిలోనే ఈవిధంగా అయిందే! ఇక నేను జీవించి ప్రయోజనం లేదు. నేను ఆత్మహత్య చేసుకుంటాను’’ అంటూ రంభ వెక్కివెక్కి ఏడుస్తుంది.ఇంద్రుడు ఖంగారు పడిపోతూ ‘‘నారదా! ఇప్పుడేది దారి! రంభకు పిచ్చి ఎలా వదుల్తుంది?’’‘‘నీవు పిక్చరు తీస్తే వదుల్తుంది...’’ ‘‘పిక్చరా! అంటే?’’‘‘అంటే ఏముంది ఇంద్రా...ఆ మానవులు చలనచిత్రాలు ఎలా తీస్తున్నారో అలాగే ఇంద్రలోకంలో నవ్వూ ఒక చిత్రశాల కట్టించు...’’‘‘చిత్రశాల నేను కట్టించడమా! ఏమిటి నారదా మీరనేది! అది మనకెలా సాధ్యం!’’‘‘ఆ వివరాలన్నీ చక్రపాణిని కనుక్కుంటే సరి...’’‘‘నేనంటే కిట్టనివాడిని రంభ కోసం ‘అన్యధా శరణం నాస్తి’ అంటూ అర్థించమంటావా!’’‘‘ఏంచేస్తాం ఇంద్రా! మనకు తెలియని విషయాలు తెలిసిన వాళ్లను అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు’’ఇంద్రుడు బరువుగా నిట్టూర్పు విడిచి, ‘‘అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు నారదా?’’‘‘ఏంలేదు...తక్షణం ఆ చక్రపాణిని పిలిపించి ఇక్కడే ఒక చిత్రశాల కట్టించే ఏర్పాట్లు చేయి...రంభ కోసం నీవే ఇక్కడ చలనచిత్రాలు తీయవచ్చు. అందుకు కావలసిన పరికరాలూ, ఇతర వివరాలూ చక్రపాణి చెప్తాడు. అతడు ఎలా చెప్తే అలా చేయి...ఏం రంభా!’’‘‘అవును స్వామీ...మీరు చెప్పింది చాలా బాగున్నది. చక్రపాణిగారు మన ఇంద్రలోకానికి రావాలేగాని, వస్తే వారు మన కన్ని వివరాలు చెప్తారు’’ అంటూ సంతోషంగా చెప్తుంది రంభ.కోపం దిగమింగుకుని కొరకొర చూస్తాడు ఇంద్రుడు‘‘నారాయణ!...ఆ ఏర్పాట్లేవో వెంటనే చూడు ఇంద్రా!’’‘‘సరే ప్రారబ్దం మహామహులకే తప్పలేదు. ఇంతకూ ఆ మానవుడిని ఇక్కడికి ఎలా తీసుకురావడం! అతడు ఒట్టి మొండివాడే! పిలిస్తే రాడే!’’‘‘నిజమే! పిలిస్తే వచ్చేమనిషికాడు–నిద్రపోతూండే సమయంలో మంత్రశక్తితో తీసుకురావలసిందే. నేను వెళ్లొస్తాను...నారాయణ’’భూలోకంచక్రపాణిగారి గది...చక్రపాణిగారు నిద్రపోతుంటారు. నిద్దట్లో కలవరిస్తాడు...‘‘ఏంకదది! ఆడి కద ఈడు కాపీ గొట్టాడు...అసలు కద ఛండాలం...గుండమ్మకద బాగ లేదన్నాడు గదాడు!...’’ అని గొణుగుతూ ఒత్తిగిలి పడుకుంటాడు...మంచం కదుల్తుంది...మరుక్షణం అదృశ్యమౌతుంది.ఇంద్రలోకం చక్రపాణిగారికి మెలకువ వస్తూనే కండ్లుకూడా తెరవకుండా మంచం పక్క టీపాయి ఉందనుకుని సిగరెట్ డబ్బా కోసం చెయ్యి చాస్తడు. పండ్లూ ఫలహారాలు చేతికి తగుల్తాయి...గొణుక్కుంటూ లేచికూర్చుంటాడు...ఎదురుగా ఒక పెద్ద వెలుగల్లే ఇంద్రుడు కనిపిస్తాడు...అంత వెలుగు చూడలేక ఒక చేయి కండ్ల కడ్డుంచుకుని విసుగ్గా...‘‘ఎవర్నువ్వు!’’ అంటాడు.‘‘నేను ఇంద్రుడిని’’‘‘అట్టనా! అద్సరేగానీనాసిగరెట్ డబ్బా చూశావా!’’ఇంద్రుడు వెలవెలబోతాడు.మరుక్షణం రత్నాలపెట్టెలో బంగారుచుట్టలు తెచ్చి చక్రపాణిగారికి అందించబోతాడు సేవకుడు.‘‘అబ్బే! ఇందేంటి ఛండాలం! నాకు స్టేటెక్స్ప్రెస్ కావాల...’ఇంద్రుడు ‘‘చిత్తం’’ అంటూ అర్థం కాక సేవకుడి వైపు చూస్తాడు...సేవకుడు అదృశ్యమౌతాడు...‘‘అద్సరే. నే నెక్కడున్నా నిప్పుడూ?’’‘‘చిత్తం. ఇంద్రలోకంలో...’’‘‘అట్టనా!...అయినా నన్నెందుకు తెచ్చావ్ ఇక్కడికి. అస్సలు నువ్వు ఇంద్రుడివేనా లేక వేషం వేశావా?’’ఇంద్రుడు చిన్నబుచ్చుకొని, ‘‘వేషం కాదు... నేనుదేవేంద్రుణ్ణి...’’‘‘పైన ఆ ‘దేవ’ ఎందుకులే...ఒట్టి ఇంద్రుడంటే చాల్దూ!...అస్సరేగానీ నా సిగరెట్ డబ్బా ఏదీ!’’‘‘చిత్తం. ఇదుగో’’ అంటూ సేవకుడు చక్రపాణిగారికి సిగరెట్ డబ్బా అందిస్తాడు.‘‘అగ్గిపెట్టేదీ?’’‘‘తమరు ధూమపానం చేయండి. నా శక్తితో దానంతట అదే వెలుగుతుంది’’ అంటాడు ఇంద్రుడు.‘‘దీనికి నీ బోడిశక్తెందుకూ?’’ అగ్గిపుల్లతో పోయేదానికి!అగ్గిపుల్లెలిగించకపోతే సిగరెట్ తాగినట్టుండదు...అగ్గిపెట్టొకటి తెప్పిచ్చు...చిత్తం...మరుక్షణం అగ్గిపెట్టె చక్రపాణిగారి చేతి కందిస్తాడు సేవకుడు. చక్రపాణిగారు సిగరెట్ వెలిగిస్తూ, ‘‘అవునుగానీ, నా క్కాఫీ కావాల్నే! దొరుకుద్దా!’’‘‘చిత్తం...తెప్పిస్తాను’’ అంటూ ఇంద్రుడు సేవకుని వైపు చూస్తాడు.‘‘అద్సరేగానీ, బాత్రూమెక్కడా. అసలుందా బాత్రూము!’’‘‘చిత్తం’’ ఇంద్రుడు తిరిగి చూస్తాడు. ఇద్దరు సేవకులు వస్తారు.చక్రపాణిగారు మంచం దిగి కాళ్లు కిందపెడతాడు. ‘‘అరెరె? నా చెప్పులేయి! ఇదేంటి కాళ్లకింద ఇంత మెత్తగుంది!’’‘‘అది పూలరెక్కల రత్నకంబళం’’‘‘కాళ్లకింద పూల్రెక్కల కార్పేట్టేంటి ఛండాలం...గొర్రెబొచ్చుది దొరకదు మీకూ’’ఇంద్రుడు చక్రపాణిగారి వేపు అయోమయంగా చూస్తాడు.‘‘అన్నట్లు రంభేదీ! బాగుందా!’’ అని చక్రపాణిగారు అడుగుతుండగానే రంభ ఒక స్తంభం చాటు నుండి పరుగెత్తుకొచ్చి ఏడుస్తూ చక్రపాణిగారి పాదాల మీద పడుతుంది. ఇంద్రుడు అవమానంతో ముఖం తిప్పుకుంటాడు. చక్రపాణిగారు కాస్త ఇబ్బందిపడుతూ, కాళ్లు వెనక్కి లాక్కుని ‘‘ఇదేంటి సినిమాలో సీనులాగా...లేలే...బాగున్నావా...పతివ్రతేషం కావాలని కోరికోరి ఏసిందానివిసగంలోనే రంభ లేచి నిలబడి ‘‘అందుకే క్షమించమంటున్నాను. నా తప్పులేదు చక్కన్నగారూ. తప్పంతా వారిది’’ అంటూ ఇంద్రుణ్ణి చూపిస్తుంది. ఇంద్రుడు కోపాన్ని దిగమింగి తలవంచుకుంటాడు.‘‘సరేలే, దానికి నువ్వేడవడం ఎందుకూ...ఎనకటికి ఎవతో మొగుణ్ణి గొట్టి ఏడ్చిందట...పిచ్చెరు సగంలో నువ్వొచ్చినందుకు ప్రొడ్యూసరేడవాలిగాని నువ్వేడుస్తావేం! బాతురూమ్ కెళ్తొస్తా’’ అంటూ సేవకుల వెంటనడుస్తాడు.పారిజాతవనంఇంద్రుడు, రంభ, చక్రపాణిగారూ ఆసీనులై ఉంటారు. సేవకుడు నవరత్నాలు పొదిగిన పాన పాత్రల్లో అమృతం నింపి తీసుకొచ్చి వారి ముందుంచుతాడు. ఇంద్రుడు ఒక అమృతపాత్ర అందివ్వబోతాడు. అది చూస్తూనే ‘‘ఇదేమిటి ఛండాలం...ఇదెవుడు తాగుతాడు. నాకిదొద్దు. స్కాచ్‌విస్కీ ఉంటే తెప్పిచ్చు’’ అని నసుగుతాడు చక్రపాణిగారు.ఇంద్రుడు వెలవెలబోతాడు.‘‘అవును ప్రభూ! చక్కన్నగారికి అమృతం అంటేనే అసహ్యం’’ అంటుంది రంభ. ఇంద్రుడు రంభను మింగేట్లుచూస్తాడు. మరుక్షణం ‘స్కాచ్‌విస్కీ బాటిల్’ గ్లాసుతో సహా చక్రపాణిగారి పక్కనున్న టేబిల్ మీదకనిపిస్తుంది. ఒక చేత్తో సిగరెట్ కాలుస్తూ మరొక చేత్తో విస్కీగ్లాస్ తీసుకుంటాడు. ఇంద్రుడు అమృతం సేవిస్తూ, రంభను కూడా తీసుకోమంటాడు. చక్రపాణిగారు కొప్పడతారు ఒద్దని సౌంజ్ఞతో చెప్తుంది రంభ...ఇంద్రుడి కండ్లునిప్పుకణాల్లా ఎర్రబడతాయి.‘‘ఇంతకీ నన్నెందుకు తీసుకొచ్చినట్లు?’‘‘మీతో ఒక గొప్ప పనివుండే తీసుకొచ్చాం చక్కన్నగారూ!’’ అంటుంది రంభ. ‘‘నాతో మీకేం పని! అన్నట్లుగా నాకవతల షూటింగుందే. పదిగంటలకే నే నక్కడుండాల్నే...’’రంభ కంగారు పడిపోతూ ‘‘చక్కన్నగారూ! త్వరగా వెళ్లడానికి వీల్లేదు. మీరు కొంతకాలం ఉండి ఇక్కడ నా కోసం చిత్రం తీసే ఏర్పాట్లు చేయించాలి. ఏది కావాలన్నా...క్షణంలో సమకూర్చగల ఇంద్రలోకం ఇది’’‘‘క్షణంలో మీరేం జేసినా, కథనీ, టెక్నిషియన్లనీ క్షణంలో తయారుజేయలేరే.... మాయం చెయ్యడం, మాయం గావడంలా తేలికపన్లు గావియ్యన్నీ... అయినా మీ కెందుకుకా స్టూడియోల పిక్చెర్లూ...పన్లేనిపనిగాకపోతే’’ఇంద్రుడు తలపట్టుకొని ఒక్క నిట్టూర్పు విడుస్తాడు.రంభ అనునయంగా కాస్త చక్రపాణిగారి దగ్గరకు జరిగి–‘‘నా కోసమే చక్కన్నగారూ! భూలోకం నుంచి వచ్చినప్పటి నుంచి నాకు నటించాలనే కోరిక తీవ్ర రూపం దాల్చింది. మీ చిత్రంలో మీరు చెప్పినట్లు విని ఎంతో ఉత్సాహంతో నటించాను...ఎన్ని కలలుకన్నాను. కాని ఆ చిత్రం పూర్తి చేసే భాగ్యం లేకుండా పోయింది’’‘‘దానికింత గొడవెందుకూ! మళ్లీ నువ్వే అక్కడి పో! అక్కడే ఏదో ఒకేషం ఏస్తే పోయేదానికి. నీ ఒక్కదాని కోసం ఇంతదూరంలోవేరేస్టూడియో ఎందుకూ...’’ఫర్వలేదు చక్కన్నగారూ! నా కోసం దేవేంద్రులు ఏంకావాలన్నా సమకూరుస్తారు...ఒక్క స్టూడియో ఏమిటి...’’‘అద్సరేలే...ఇంద్రుడు నీ చేతిలో ఉన్నాడని నువ్వు స్టూడియోలు కట్టించొచ్చు. కాని ఇక్కడికొచ్చి పిక్చెరు తీసేవాడుండొద్దూ! పైగా ఇక్కడ ఏంగావాలన్నా అక్కణ్ణించి రావాలాయె...ఎందుకొచ్చింది...ఏదోవషం ఇప్పిస్తా’’రంభ సంతోషపడిపోతూ ‘‘మీరెలా చెప్తేఅలాచేస్తాను చక్కన్నగారూ’’ అంటుంది.ఇంద్రుడు గాభరపడిపోతూ...‘‘అదికాదు చక్రపాణిగారూ! రంభ లేకపోతే ఇంద్రలోకంలో ఏముంటుంది’’‘‘లేకపోతే పోద్దీ...కళ కోసం నీ పరువు పోగొట్టుకుంటావానీలాంటోళ్లు పిక్చెర్లనీ, స్టూడియోలని మొదలెలెడితే అది కాస్తా కంపౌద్ది...గవర్నమెంటోళ్లు సినిమాలు తీయించినట్టుంది’’ఇంద్రుడు ఏం సమాధానం చెప్పాలో తోచక రంభ వైపు ‘నాకక్కడషూటింగుందే! వాళ్లంతా ఏం కంగారు పడుతున్నారో! ఇదంతా ఒక్కరోజులో జరిగేది కాదే! అయినా ఇప్పుడుడెంటనే పిక్చెరు తీయడానికి ఇక్కడ మీకేం ఉంది? ఎట్ట దీస్తారంట!’’రంభ, ఇంద్రుడు ఒకరిముఖాలు ఒకరు చూసుకుంటారు అర్థం గాక.‘అంటే చిత్రశాల లేదని అంటున్నారా?’’ అని అడుగుతుంది రంభ....‘‘మీరే చెప్పండి చక్కన్నగారూ ఏంకథ బావుంటుందో!’’ అంటూ ఉత్సాహంగా ముందుకువంగి కూర్చుంటుంది రంభ.‘‘బాగానే ఉంది. మాకే మంచి కథల్దొరక్క అవస్తగా ఉంటే నీకేం చెప్పేది...మీరే చెప్పండి’’రంభ ముభావంగా ఇంద్రుడి వైపు చూస్తుంది...ఇంద్రుడు లేని ఉత్సాహం తెచ్చుకుని‘‘మూమూలు కథల కంటే పురాణగా«థలే మేలంటాను చక్రపాణిగారూ...ఎందువల్లంటే వాటివల్ల పుణ్యమూ, పురుషార్థమూ లభిస్తుంది. దేవదానవ వైరమనేది యుగయుగాల సమస్య. అటువంటి కథా వస్తువు తీసుకొని, రాక్షసులు దేవతలను పెట్టే బాధలతో కథ ఉంటుంది’’‘‘చెత్త చేస్తానంటావ్. అంతేగా! అసల్నువ్వు ఎటువంటోడివంట! ఆ తల్లేని రాక్షసులు అరణ్యాలూ, కొండలూ, గుహలు పట్టుకుని బ్రతుకుతుంటే, వాళ్లని చూసి నువ్వు ఇంత దూరాన్నించే ఒణుకుతుంటివి...వాళ్లొచ్చి నిన్నేం అవస్తలు పెడుతున్నారంట! అసలు వాళ్లు తల్చుకుంటే నిన్నిక్కణ్ణుంచి ఎప్పుడో పీకేసేవాళ్లంటా నేను’’ఇంద్రుడు చిన్నబుచ్చుకుని వెనక్కి జరుగుతాడు. రంభ సంభాషణ మార్చడానికి ప్రయత్నిస్తూ...‘‘పోనీ మన బృహస్పతులవారి చేత వ్రాయిద్దామా’’ అంటుంది.‘‘ఏంటి! నీ జాతకమా! సినిమా కథ ఆయనేం రాస్తాడు! ఆయన్రాస్తే ఆయనలాంటోళ్లు జూడాల్సిందే’’ఇంద్రుడు కాస్త భయపడుతూనే ‘‘చూడండి చక్రపాణిగారూ! భూలోకంలో కత్తియుద్ధాలూ, నాట్యాలు ఉంటే చిత్రాలు రాణిస్తాయని రంభ చెప్పింది...మరి మనకు రంభతో బాటు ఊర్వశీ, మేనక, తిలొత్తమాదినాట్యకత్తె లెందరో ఉన్నారు’’‘‘వాళ్ళాడితే ఎవుడు జూస్తాడు నువుదప్పితే...ఏనాటి మేనక! ఏనాటి తిలోత్తమ! నీ దగ్గిర ‘పెన్షన్’ తీసుకుని బతికే ఆ ముసలొళ్ల చేత ఏం ఆడిస్తావులే...ఏదన్నా సెంటిమెంటుండాలో కథలో...లేదంటేగుండమ్మకథలాగానన్నా ఉండాలా...అయ్యన్నీ మీరేం తీస్తారుగానీ,ఏదన్నాగొప్పోడి కథ తీస్తే బాగుంటది’’ఇంద్రుడు కోపంతో, అవమానంతో కంపించిపోతాడు లోలోపలే. రంభ కాస్త గాభరపడుతూ...‘‘అదికాదు చక్కన్నగారూ, గొప్ప గుణాలు రాక్షసుల్లో ఎలా ఉంటాయి! దేవతల్లో ఉంటాయి’’‘‘అని మీరు చెప్పుకోవాల్సిపందే. గొప్పగుణాలుండే రాక్షసుల్లేరూ? చెప్పమంటావా! బలి న్దీసుకో! బలి ఎట్టాంటోడు! ఎంత గొప్పోడు! ఆడి కాలిగోటికి పోల్డే మీ ఇంద్రుడు! వాడుతన కంటే గొప్పోడవుతున్నాడనంగానే వాన్ని పాతాళానికి తొక్కించిందాకా నిదురబోలేదే ఇతను. బలిని పాతాళానికి తొక్కినా అతని కీర్తి ఆకాశానికి ఎగిసింది. ఈరోజు బలి గొప్ప దాతంటారుగాని, ఇంద్రుణ్నెవురుజెప్పుకుంటారు! సోదిలో గూడారాడే!’’రంభ ఇంద్రుడి ముఖం చూస్తుంది. ఇంద్రుడు అగ్నిపర్వతంలా కుములుతుంటాడు లోలోపలే. రంభ చూపులు కిందికి దించుకుని ‘‘మరి బలిచక్రవర్తి కథకు మాటలూ, పాటలూ కావలిగా!...వాళ్లంతా...’’‘‘అక్కణ్ణించి రావాల్సిందే...అంతేగాదు ఇంకా శానమంది రావాలి. టెక్నిషియన్సూ, మ్యూజికోళ్ళూ, కెమెరా, సౌండ్ ఎక్విప్‌మెంటూ, లైట్లు, లైట్ బాయిసూ, ప్లేబేక్ వాళ్లూ్ల, మిగతా ఆర్టిస్టులందరూ అక్కణ్ణించి రావల్సిందే...ఇక్కడోళ్లెవరూ పనికిరారు’’‘‘ఎందకని చక్కన్నగారూ! ఇక్కడ కూడా ఎందరో కళాకారులున్నారే’’ అంటుది రంభ కాస్త రోషంతో...‘‘ఉంచొచ్చుగానీ, మా ‘నేటివిటీ’ రాదుగా! అట్టనుకుంటే మద్రాసులో ఆర్టిస్టులూ, టెక్నిషియన్లూ లేకనా–ఎక్స్ట్రా దగ్గర్నుంచి బొంబాయినించే రావాలంటారు–మెడ్రాసులో హిందీ పిక్చర్ తీసే బొంబాయోళ్లంతా...ఎవడి భాషవాడికిగొప్ప...రంభ తప్ప మిగతా అంతా మా వోళ్లు రావాల్సిందే’’ అని చక్రపాణిగారు అంటుండగానే అయిదుగురు గంధర్వులు ‘ఆర్క్ లైట్లు’లా కండ్లు చెదిరేంత వెలుగుతో అక్కడ ప్రత్యక్షమై ఇంద్రుడిచెవిలో ఏదో చెప్తారు.వెంటనే ఇంద్రుడు రౌద్రాకారంతో చివాల్న లేచి నిలబడి ‘‘ఔరా! నే నెంత మూర్ఖుణ్ణి! మతి లేని రంభ కోసం నా వివేకాన్ని కోల్పోయాను. అజ్ఞానంలో పడి అంతా మర్చిపోయాను. నా ఇంద్రత్వాన్నే కోల్పోయే పరిస్థితికి జారిపోయాను. ఈ అనర్థం అంతా ఈ దౌర్భాగ్యురాలు రంభ వల్ల జరిగింది’’ అని ఇంద్రుడు ఆవేశంతో అంటుంటే చక్రపాణిగారు తాపీగా మిగిలిన విస్కీ చివరిగుటక తాగి గ్లాసు టేబిల్ మీద పెడతారు.ఇంద్రుడు శపిస్తాడోనని రంభ గజగజా వణుకుతూ నిలబడుతుంది.‘‘దేవేంద్రా, మానవులంటే వానరజాతి, ఇంద్రలోకం ధ్వంసం కాకముందే ఇతడిని తక్షణం పంపివెయ్యండి’’ అంటూ గంధ్వర్వులుచెప్తుండగానే....‘‘ఇదుగో ఈ క్షణమే’’ అంటూ ఇంద్రుడి ముందు మత్తుగా కూర్చున్న చక్రపాణిగారి చెయ్యి పట్టుకొని లాగి కింద పడేస్తాడు.తన గదిలో మంచం మీద నిద్రపోతున్న చక్రపాణిగారు దుబుక్కున మంచం మీద నుంచి కిందపడి గొణుక్కు కూచుంటాడు. ∙ భానుమతీ రామకృష్ణ -
కోహ్లి కోపం... నాకు భయం: పంత్
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి కోపానికి గురైతే తనకు భయమేస్తుందని యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ అన్నాడు. ఇటీవలి కాలంలో మూడు ఫార్మాట్లలోనూ అతను రాణిస్తున్నాడు. దీంతో ధోని స్థానాన్ని భర్తీ చేయగలడనే కితాబు అందుకున్నాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పంత్ ఓ వీడియోలో ‘సహజంగా నేనెవరికీ భయపడను. కానీ... విరాట్ భయ్యాకు కోపమొస్తే మాత్రం భయపడతాను. అయినా తప్పుచేయకుంటే కోహ్లి ఎందుకు కోపగించుకుంటాడు? ఎవరైనా మనపై ఆగ్రహించాడంటే అది మన మంచికే. మనం చేసిన పొరపాట్లను గుర్తించి సరిదిద్దుకోవచ్చు’ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను ఢిల్లీ ఫ్రాంచైజీ తమ అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేసింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో రిషభ్ పంత్... ధోని శైలీలో వికెట్లను చూడకుండా రనౌట్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. వికెట్ పడకపోగా ఓ పరుగు వచ్చింది. దీంతో కోహ్లి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
శ్రీ సౌమ్యరామ
ఎంత కోపం వచ్చినప్పటికీ, రాముడు విచక్షణ కోల్పోయిన సందర్భాలు లేవు. తనను అరణ్యవాసం చేయమన్న కైకను ఎందరు ఎన్ని విధాల దూషించినప్పటికీ, తాను మాత్రం తూలనాడలేదు రాముడు. దశరథుడు, కౌసల్య, లక్ష్మణుడు, అయోధ్యాపురవాసులు ఆఖరికి కన్నకొడుకయిన భరతుడు కూడా కైకను నిందిస్తారు. అయినా రాముడు వారందరినీ వారిస్తూ ‘‘ఇప్పటివరకూ కైక నన్ను కన్నకొడుకు కన్నా ఎక్కువగా ఆదరించింది. ఇప్పుడు మాత్రమే ఆమె ఇలా ప్రవర్తిస్తోందంటే దైవ నిర్ణయమే తప్ప వేరు కాదు. దశరథుడు కూడా ధర్మానికి, ఇక్ష్వాకువంశ రాజుల సత్యనిష్ఠకు కట్టుబడి కైక కోరికలకు తలవంచాడే తప్ప, వాంఛకు వశుడై కాదు. తల్లిదండ్రుల మాటను గౌరవించాల్సిన ధర్మం నా మీద ఉంది కాబట్టి తనకు పెద్దకొడుకుగా రాజ్యాధికారం ఉన్నా, అరణ్యవాసమే మిన్న’’ అని అడవులకు వెళ్లాడు. భరతుడు రాముని అయోధ్యకు తీసుకురావడానికి తన మాతలతో, వశిష్టాది గురువులతో, పెద్ద సైన్యంతో అడవికి వస్తున్నప్పుడు, లక్ష్మణుడు అనుమానించి, కోపోద్రిక్తుడై భరతుడి మీద యుద్ధానికి సిద్ధపడినప్పుడు, రాముడు భరతుని పట్ల కోపం తెచ్చుకోకుండా అతని నిజాయితీని సరిగ్గా అంచనా వేశాడు. అధర్మం ఎవరు చెప్పినా రామునికి కోపం వస్తుంది. ‘తండ్రి అయినా సరే, చనిపోయిన దశరథుని మాట మన్నించనక్కరలేదు’ అని జాబాలి అనే పురోహితుడు చెప్పినప్పుడు, రామునికి కోపం వచ్చింది. కానీ తొందరపడకుండా శాంతవాక్యాలతోనే జాబాలిని ఖండించాడు.ఇక సుగ్రీవుడు తనకు రాముడిచ్చిన గడువు పూర్తయినప్పటికీ, భోగాలలో మునిగి తేలుతూ, సీతాన్వేషణ ఇంకా మొదలుపెట్టక పోవడంతో రామునికి కోపం వస్తుంది. కానీ దానిని అణచుకుంటాడు. ‘‘మిత్రుడు కాబట్టి మెల్లగా చెప్దాము, ఒక అవకాశం ఇద్దాము. అయినా వినకపోతుంటే అప్పుడు ‘వాలి వెళ్లిన దారిలోనే నిన్నూ పంపిస్తాము’ అని’’ చెప్పి రమ్మని లక్ష్మణుని పంపిస్తాడు. అదే వాలి విషయానికి వచ్చేసరికి అతడు అధర్మాన్నే అనుసరించాడు కాబట్టి హెచ్చరికలు లేకుండా శిక్షిస్తాడు. ఇక్కడ సుగ్రీవునిది కర్తవ్య నిర్వహణా లోపం, వాలిది అధర్మం. కర్తవ్య నిర్వహణలో పొరపాటు సహించవచ్చు కాని, అధర్మాన్ని మాత్రం సహించకూడదని రాముడు తన చేతల ద్వారా చెప్పాడు. పై మూడు సంఘటనలలో రాముడు ఎవరిమీద కోపం తెచ్చుకోకూడదో, కోపం వచ్చినా దాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో చెప్తున్నాడు. మనం శ్రీరామచంద్రమూర్తి నుండి నేర్చుకోవలసినది అదే. – డి.వి.ఆర్. -
నేను చచ్చిన తర్వాత రా
జనక మహారాజు గొప్ప వేదాంతి. అలాంటి జనకుడి దగ్గర వేదాంత విషయాలు నేర్చుకుని రావలసిందిగా ఓ గురువు, తన శిష్యుడైన ఓ యువకుడిని పంపించాడు. ఆ యువకుడు ఎంతో దూరం ప్రయాణం చేసి, జనకుడిని వెదుక్కుంటూ వచ్చాడు. అతను వచ్చే సమయానికి జనకుడు కొలువులో ఉన్నాడు. ఆ సమయంలో లోనికి వెళ్లడం భావ్యం కాదు కనుక ఈ యువకుడు, బయట ద్వారం దగ్గర ఉన్న కావలి వారికి ఒక చీటీ మీద ‘మీ వద్ద వేదాంత విషయాలను నేర్చుకుని రమ్మని మా గురువు గారు పంపించగా నేను వచ్చాను’ అని రాసి లోపలకు పంపించాడు. జనకుడు ఆ చీటీ చూసి, దాని వెనకాల ‘నేను చచ్చిన తర్వాత రండి’ అని రాసి తిరిగి పంపించాడు. ఆ యువకుడికి మతిపోయినంత పనైంది. ‘ఇదేంటి, నేను ఈయన దగ్గర వేదాంత రహస్యాలను తెలుసుకుందామని వస్తే ఈయనేమో తాను చచ్చిన తర్వాత రమ్మని అంటున్నాడు... అనుకుని నిరాశతో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అక్కడ ఒక చెట్టు కనిపిస్తే ప్రయాణ బడలిక, ఆకలి, దప్పికలతో సొమ్మసిల్లినట్లు పడుకున్నాడు. కాసేపటి తర్వాత మెలకువ వచ్చి ఒక సత్రం కనిపిస్తే అక్కడికి వెళ్లాడు. కొంత సొమ్ము చెల్లించి, ఆకలి దప్పికలు తీర్చుకున్నాడు. మరునాడు మళ్లీ రాజు దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ రాజ దర్శనం కాలేదు. ప్రతిసారీ తాను వచ్చానని కావలి వారితో కబురు పెట్టడం, రాజు ఏదో ఒకటి చెప్పి వెనక్కి పంపెయ్యడం... అలా కొన్ని రోజులు గడిచాయి. కుటుంబ సభ్యులు గుర్తుకు వస్తున్నారు. దేని మీదా ధ్యాస నిలవడం లేదు. తనలో తానే ఏదో మాట్లాడుకుంటున్నాడు. ఒక్కోసారి తనను అంత దూరం పంపించినందుకు గురువు మీద కోపం వచ్చి పెద్దగా తిట్టుకుంటున్నాడు. గొణుక్కుంటున్నాడు. చివరికి తెచ్చుకున్న సొమ్మంతా అయిపోయింది. ఆకలితో నకనకలాడుతూ చెట్టుకింద కూర్చున్నాడు. అతని పరిస్థితి చూసి జాలిపడి ఎవరో తినడానికి ఏదో పెట్టబోయారు. అతనికి కోపం వచ్చింది. ‘నేనేమైనా అడుక్కునేవాడినా’ అని కసిరి పంపించేశాడు. అలాగే మునగదీసుకుని పడుకున్నాడు. ఆకలితో నిద్ర పట్టలేదతనికి. మరునాడు మళ్లీ ఎవరో ఏదో పెట్టడానికి ప్రయత్నించారు. ఈసారి కాదనలేదు. చేతులు చాచి ఆత్రంగా అందుకుని తినేశాడు. ఈసారి అతనికి ఆకలి తీర్చుకోవాలన్న ఆరాటం తప్ప తానెవరో, ఎక్కడినుంచి వచ్చాడో, ఎందుకు వచ్చాడో గుర్తురాలేదు. ఆకలి తీరాక దుస్తులు తడుముకుంటుంటే చీటీ ఏదో చేతికి తగిలింది. తెరిచి చూశాడు. అప్పుడు స్ఫురించిందతనికి రాజు గారు చెప్పిన మాటల్లోని భావం... ‘నేను చచ్చిన తర్వాత’ అంటే ‘నేను’ అనే భావన నశించిపోవాలన్న సంగతి. దాంతో అతనికి ఇక రాజుగారి దగ్గరకు తిరిగి వెళ్లవలసిన అవసరం కలగలేదు. గొప్ప వేదాంతి అయ్యాడు. – డి.వి.ఆర్. -
రోహిల్లా కథ ‘లోవిషయం’
మహనీయులకి సంబంధించిన ఏ కథ విన్నా, ఆ కథని ఓ నవలలానో, ఆధునిక కథలానో కేవలం కాలక్షేపం కోసం చదివేసి అవతల పడెయ్యకూడదు. మనం చెప్పుకోబోయే కథలన్నీ ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించే కథలు కాబట్టి, ఎవరి ఆత్మల్లో వారికి మాత్రమే కనిపించే భగవంతునికి సంబంధించిన కథలు ఈ కథలన్నమాట. ఊరికే పై కథని వినేసి ‘కథని వినేశా’ అనుకుంటే అది ఓ రమణీయమైన భవనాన్ని వెలుపలి నుంచి అలా చూసి, అక్కడి నుంచి కదిలిపోయిన దాంతో సమానమే. నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే ఎందరో భక్తులు దైవ కథలని కేవలం పై దృష్టితోనే వినడం, చదువుకోవడం చేస్తుంటారు. ఆ కథలో దాగిన అంతరార్థాన్ని గానీ కొద్దిగా పరిశీలించి, గ్రహించినట్లయితే ఇక ఆ కథని కథగా ఏనాడూ భావించం. ఈ దృష్టితో బాబా సచ్చరిత్రలో కనిపించే రోహిల్లా కథని చదువుకుందాం! రోహిల్లా కథ రోహిల్లా అనే పహిల్వాన్ ఉంటూండేవాడు. అతను ఆ నోట ఈ నోట సాయి గుణ గణాలను విని, ఆయన్ని ఒక్కసారి దర్శించాలని షిరిడీకొచ్చాడు.సాయిని దర్శించి కొన్ని రోజులపాటు షిరిడీలోనే ఉండిపోయాడు. సాయి కూడా ఇతణ్ని బాగా ఆదరిస్తూ ఉండేవాడు. రోహిల్లా కూడా సాయిని దాదాపు భగవంతునిగానే భావించేవాడు.ఇతనికి ఓ చిత్రమైన లక్షణముండేది. మహమ్మదీయుడూ అల్లాహ్ భక్తుడైన రోహిల్లా అకస్మాత్తుగా పెద్దగొంతుతో ‘అల్లాహ్ హో అక్బర్’ అని చెవులు పగిలిపోయేంత శబ్దంతో అరుస్తుండేవాడు. పగలైతే పెద్దగా ఎవరికీ పట్టదుగానీ, రాత్రివేళ షిరిడీ మొత్తం ప్రశాంతంగా ఉండే వేళ,అందరూ శ్రమించి శ్రమించి ఇంటికొచ్చి పరుండే వేళ ‘అల్లాహ్ హో అక్బర్’ అని అరుస్తూ ఉండేవాడు. ఆ అరుపుకి గుండెలు పగిలిపోతాయా? అనిపించేది చుట్టూ ఉన్నవారికి. ఒకట్రెండు సార్లు అతనికి తాము పడుతున్న ఇబ్బందిని గురించి సామూహికంగా వెళ్లి చెబ్దామని షిరిడీ ప్రజలు భావించారు. కానీ, మెడ నుంచి పాదాల వరకూ కఫనీ వేసుకుని, దృఢంగా ఉండి, అతని పెద్ద గొంతుక పగిలిపోతుందా? అనే స్థాయిలో మాట్లాడే అతణ్ని సమీపించలేక వెనక్కి తిరిగొచ్చేశారు. అతను ఎవరితోనైనా వివాదపడే సందర్భాన్ని చూస్తే కూడా, భయం వేస్తుండేది. ఎవరైనా, తనని అభ్యంతరపెడతారేమో అనే ఆలోచన కూడా లేకుండా విపరీతమైన అహంకారంతో ఉండేవాడు రోహిల్లా. అయితే అదంతా బయట మాత్రమే. సాయి దగ్గర మాత్రం పిల్లాడిలా ఉండేవాడు. ఒక రాత్రివేళ ఖురాన్‌లోని కల్మాలని పెద్దగొంతుతో అరుపులా వినిపించేలా చదువుతూండేవాడు. షిరిడీ ప్రజలంతా ఈ అర్ధరాత్రి నిద్రాభంగం కారణంగా మర్నాడు పనుల్ని చేసుకోలేకపోతూండేవాళ్లు. ఒకసారి షిరిడీ ప్రజలందరికీ ఒక ఆలోచన వచ్చింది. మనకీ, అతనికీ సంరక్షకుడు సాయి భగవానుడే కాబట్టి, ఆయనకే మన బాధని చెప్పుకుని ఆయన ద్వారానే సమస్యని పరిష్కరించుకోవడం బాగుంటుందని నిర్ణయించుకున్నారు. అందరూ సాయి వద్దకి కలిసికట్టుగా వెళ్లి విషయాన్ని వివరించి రక్షించవలసిందని కోరారు.షిరిడీవాసులంతా చెప్పింది విన్న సాయి ఆశ్చర్యపడలేదు. అయ్యో! అనలేదు. తప్పక మీ సమస్యని తీరుస్తానని హామీ ఇవ్వలేదు. పైపెచ్చు ‘రోహిల్లా నాకు మంచి భక్తుడు. నాకెంతో ఇష్టుడు కూడా. అతనిదో చిత్రమైన జీవితగాథ. అతనికో భార్య ఉంది. అమెని నిరంతరం ప్రేమిస్తూ ఉండేవాడు రోహిల్లా. అయినప్పుటికీ అమె విసుగ్గా, కోపంగా, చిరాగ్గా ఉంటూ నిరంతరం సూటిపోటి మాటలతో అతణ్ని మానసికంగా హింసిస్తుండేది. కొంతకాలం పాటు రోహిల్లా ఆమెని ‘శరీరంలో ప్రవేశించిన వ్యాధి’లా భరించాడు. కానీ ఇక కొంతకాలానికి అతనికి ఆమెతో కలిసి ఉండటం భరింపశక్యం కానిదైంది. దాంతో ఆమెని తరిమేశాడు రోహిల్లా. ఆ దుర్మార్గురాలికి సిగ్గూ, అభిమానం, బిడియం.. వంటివేమీ లేవు సరికదా సంస్కారానికీ, సంప్రదాయానికీ ఎంతో దూరంగా ఉంటూ.. తనని బలవంతాన తరిమేసినా ఏదో ఒక వంక పెట్టుకుని ఇంట్లోకి దూసుకొస్తుండేది. ఆమె వచ్చి ఉన్న ఆ గంటో, రెండుగంటల కాలమో కూడా రోహిల్లాకి పరమ నరకంలా అనిపిస్తుండేది. ఈమె రాకని ఎలా నివారించాలా? ఎలా బుద్ధి చెప్పాలా? అనుకుంటూ ఒకసారి ఎందుకో ఆమె చేసే పనులకి తీవ్రకోపం వచ్చి పెద్దగొంతుతో ఆమెని నిందించడం మొదలెట్టాడు. ఆ పెద్దగొంతుకీ, అరుపులకీ భయపడి ఆమె రోహిల్లా వద్దకి రావడం మానేసింది. ఎప్పుడు రోహిల్లా అరుపులు మానితే అప్పుడు అక్కడికి ప్రత్యక్షమౌతుండేది. ఇప్పుడిలా అరుపులు, కేకలు పెద్దగొంతుతో ఖురాన్‌లోని ధర్మవాక్యాలైన కల్మాలనీ రోహిల్లా చదవడం మొదలెట్టేసరికి రావడం మానేసింది. ఈయన అరుపుల్ని విని పారిపోవడం చేస్తోంది.ఒక్కమాటలో చెప్పాలంటే రోహిల్లా నా దగ్గరకి వచ్చాక నాకూ శాంతంగా ఉంది. రాత్రిపూట పరమ ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను. రోహిల్లాని తరిమేస్తే, అతని భార్య నా వద్దకొచ్చి నన్నూ బాధపెడుతుంది. ఇంత ఉపకారి అయిన రోహిల్లానీ, అతని అరుపుల్నీ ఆనందంగా భరించండి. కొన్నాళ్లకి మీకూ నాలా అలవాటైపోతుంది. ఆ గయ్యాళి భార్య మీతో, అతనితో, నాతో కూడా వివాదపడదు’ అన్నాడు బాబా.బాబానే ఇలా మాట్లాడేసరికి గ్రామస్థులంతా నివ్వెరబోయారు. మారు మాట్లాడకుండా తిరిగి వెళ్లిపోయారు. అసలు విషయం ఇదీ... రోహిల్లా... బాబా షిరిడీకి వచ్చేనాటికే వచ్చి ఉన్నవాడు కాడు. పోనీ షిరిడీ గ్రామవాసి అస్సలు కాడు. అక్కడక్కడి జనమంతా సాయిని గురించి చెప్తూ చెప్తూ ఉంటే సాయి సమక్షానికొచ్చాడు. దర్శనంచేసుకుని వెళ్లిపోదామనుకున్నవాడు కాస్తా ఆయన దగ్గరే ఉండిపోయాడు కూడా.రోహిల్లా మొదటిసారిగా సాయి వద్దకి వచ్చి, దర్శించగానే అతనికి కలిగిన అనుభూతి అతణ్ని షిరిడీ నుంచి పోనీయకుండా ఆపేసింది. అంతేకాదు. సాయి క్షేత్రపంక్తుల్లో ఉండే యధార్థమైన అనుభూతిని రోహిల్లా పొందగలిగాడు కూడా. దాంతో షిరిడీలో, అదీ సాయి సమక్షంలోనే ఉండి పోవాలనే దృఢనిశ్చయానికి వచ్చేశాడు. అంతే! ఉండిపోసాగాడు.నిజానికి రోహిల్లాకి భార్యలేదు. ఆమె గయ్యాళీ కాదు. ఆ మాటకొస్తే, అసలు రోహిల్లాకి వివాహమే కాలేదు. ఈ విషయం సాయికీ తెలుసు.ఇదేమిటి? మరి సాయిబాబానే రోహిల్లా భార్య గురించి గ్రామస్థులకి అంత ఉపన్యాసాన్ని ఉపదేశ రూపంగా ఎందుకిచ్చాడనేగా మన సంశయం..?సాయిమాటల్లో అంతరార్థం ఉండి తీరుతుంది. రోహిల్లాకున్న భార్య మరెవరో కాదు ‘దుర్బుద్ధి’. ప్రతివ్యక్తీ దుఃఖిస్తూ ఉండాలనీ, అందరూ దుఃఖిస్తూ మనల్ని ఆశ్రయిస్తుంటే వాళ్లని మనం ఓదార్చాలనుకునే ఆ తీరు బుద్ధి దుర్బుద్ధి. ఈ దుర్బుద్ధి నిరంతరం రోహిల్లానే కాదు, మనల్ని కూడా పీడిస్తూనే ఉంటుంది. మన పిల్లవాడు పరీక్షలో ఉత్తమ విజేత అయినందుకు కలిగిన ఆనందం, పక్కింటి పిల్లవాడికి కూడా దాదాపు మనవాడితో సమానంగా వచ్చిన ఉత్తీర్ణతాశాతం కారణంగా పల్చబడిపోతుంది. ఇదే రోహిల్లా భార్య అంటే. ఈర్ష్య, ద్వేషం, పగ, అసూయ... ఇవన్నీ రోహిల్లా భార్య లక్షణాలే. దురదృష్టవశాత్తూ మనం సంస్కృతంలో కనిపించే కొన్ని కొన్ని పదాలకి అర్థాలన్నీ సమానమని భావిస్తూ ఉంటాం. ఈర్ష్య అంటే అసూయ అనేది అర్థం కాదు. ఈ రెండూ సమానమూ కాదు.ఇతరుల ఉన్నతినీ క్రమక్రమాభివృద్ధినీ సహించలేకపోవడం ఈర్ష్య. ఇతరులకున్న గొప్పగుణాల్లో వంకల్ని వెదికివెదికి దోషాల్ని ఆరోపించడం అసూయ.‘ఫలానావాళ్లు, ఎక్కడికెళ్లినా దంపతిగానే (భార్యాభర్తలిద్దరూ కలిసి మాత్రమే) వెళ్తారు’ అని ఎవరైనా చెప్తే ‘ఎంతదృష్టం!’ అనుకోకుండా ‘ఆయనకి ఆమె మీద అనుమానం! అందుకే ఒంటరిగా ఆమెని పోనియ్యడు. ఎప్పుడూ తోకలా వెళ్తూనే ఉంటాడు’ అనడం అసూయ.ఇదుగో ఈ తీరు ఈర్ష్య, అసూయ, పగ, ద్వేషం వంటి అన్ని దుర్లక్షణాల సమూహమే రోహిల్లా భార్య స్వరూపం. అందుకే, అలాంటి ఆలోచన రోహిల్లాకి రాబోతోందనగానే, పెద్దగొంతుతో ఆ తీరు ఆలోచనలని తరిమికొట్టగల శక్తి ఉన్న కల్మాలని ఖురాన్ తీసి పెద్దగా చదువుతుంటాడన్నమాట! అంటే ఖురాన్ గాని సరైన తీరులో అర్థం చేసుకుని ఉన్నవాడయినట్లయితే, కల్మాని ఆ సందర్భానికి సరిపోయేలా పఠించగలమన్నమాట! ఆ శక్తి రోహిల్లాకి ఉందని అర్థం కూడా. కథని వినడం వేరు, చదవడం వేరు. దానిలో దాగిన తత్త్వార్థాన్ని తెలుసుకోవడం వేరు. తత్త్వార్థం తెలియనప్పుడు దైవాన్ని ఎంతసేపు, ఎంతకాలం, ఎన్నిమార్లు ఆరాధించినా అది కాలక్షేపం కిందికే వస్తుంది. ఉదాహరణకి వందరూపాయల కాగితం మనకి శీఘ్రప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇది నిజం. ఈ కాగితానికింతటి శక్తి ఉందని గ్రహించి ఆ వంద రూపాయల నోటుని పెద్ద విగ్రహంగా చేసి పూజలు పురస్కారాలు చేస్తున్నామా? ఆ నోటుని సంపాదించగల తీరుతెన్ను ఎలాగని మాత్రమే ఆలోచిస్తున్నాం. శ్రమిస్తున్నాం. సాధించుకోగలుగుతున్నాం. దైవవిషయం కూడా అంతే. ఎంత ఎత్తుగా విగ్రహాన్ని స్థాపించామనేది లెక్క కాదు. ఆ విగ్రహం యేడుందో, ఆయనని గురించిన తత్త్వం ఎవరికెంత బోధపడిందనేది గ్రహించుకోవడం, వ్యాప్తి చేయడం ముఖ్యం. బాబా దగ్గరికొచ్చే అందరు భక్తులూ భక్తులు కాదని ఆయనకీ తెలుసు. చూడ్డానికొచ్చేవారూ, నమ్మకం కుదిరితే మరోమారు వద్దామనుకునేవారూ, ఎలాగూ వచ్చాం కాబట్టి చూసేసి పోదాంలే అనుకునే వారూ, ఇంత ద్రవ్యం వస్తుంటే చక్కని సౌధాల్లో ఉండకుండా ఈ మసీదు గోడ ఏమిటని అనుకునే వారూ, ఎందరో ఉన్నారనీ ఉంటారనీ ఆయనకి తెలుసు. కేవలం ఇనుముని మాత్రమే అయస్కాంతం ఎలా ఆకర్షిస్తుందో అలా.. ఎవరు ప్రశాంత హృదయులై ఉంటారో, దుర్బుద్ధి లేకుండా ఉంటారో, వాళ్లు మాత్రమే సూదుల్లా అవుతూ బాబా అనే అయస్కాంతానికి ఆకర్షింపబడి, ఇక ఆయనతోనే తన జీవితమనుకుంటూ ఉండిపోతారు. అలాంటి బలమైన సూదిలాంటివాడు ‘హేమాడ్ పంత్’. మరో సూది రోహిల్లా.ఈ సూదికీ, అయస్కాంతానికీ మధ్య ఏది ఉన్నా ఆకర్షణ శక్తి పనిచేయదు. ఆ అడ్డుగా ఉండే దుర్బుద్ధికి సంకేతమైన రోహిల్లా భార్య వంటి దాన్ని తీసెయ్యండంటూ సాయి ఉపదేశించాడు షిరిడీ ప్రజలకనేది రోహిల్లా కథలోని దివ్యోపదేశ సారాంశం. దుర్బుద్ధివల్ల నష్టం ఎవరికి? ముగింపులో ఒక్క మాటనుకుందాం. బుద్ధి అనేది ఎప్పుడుందో, ఒక్కోసారి దుర్బుద్ధి అనేది కూడా ఉండి తీరుతుంది. నీళ్లున్నప్పుడు ఏ దుమ్మో, ధూళో.. పడ్డప్పుడు ఆ నీళ్లు అపరిశుభ్రం కావడం సర్వసాధారణం. అలాగే, బుద్ధి కూడా వ్యక్తి స్వభావాన్ని బట్టి ఒక్కోసారి దుర్బుద్ధిగా కావడం, లేదా ఎవరో ఒకరి ప్రభావం తీవ్రాతి తీవ్రంగా మన బుద్ధి మీద పనిచేసిన సందర్భంలో దుర్బుద్ధిగలవాళ్లుగా మారడమనేది అసహజం, అసాధారణమైన అంశం కానే కాదు.ఒక్క అంశాన్ని చూసి ముగిద్దాం! భారతంలో ధర్మరాజుదే రాజ్యం నిజానికి. కారణం ధర్మరాజు తండ్రి పాండురాజునే రాజ్యం అనువంశికంగా సంక్రమించింది కాబట్టి. ధృతరాష్ట్రుడు పెద్దవాడే అయినప్పటికీ పుట్టుకతో వచ్చిన గుడ్డితనమనేది రాజుగా పట్టాభిషేకానికి అర్హతని కలిగించలేదు కాబట్టి. పైగా ధర్మరాజుకి పట్టాభిషేకం జరిగిపోయింది కూడా. ఇంతవరకూ సద్బుద్ధే కథని నడిపింది. దుర్బుద్ధి ప్రవేశించింది (రోహిల్లా భార్య) దుర్యోధనునిలో. అధర్మంగా రాజ్యాన్ని చేజిక్కించుకోవలసిందేనని. దాని కోసం తండ్రి మెడల్ని వంచి జూదానికొప్పించాడు. ఇక్కడ కూడా రోహిల్లా భార్య ప్రవేశించింది. అధర్మంగా జూదాన్ని ఆడాక ద్రౌపది వస్త్రాపహరణ మెందుకు? దానివల్ల రాజ్యం వస్తుందా? వాళ్లందరినీ ఇంకా అవమానపరచాలి (రోహిల్లా భార్య మళ్లీ ప్రవేశించింది).12 సంవత్సరాల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తూ చివరి అజ్ఞాతవాసంలో గాని పాండవుల జాడ తెలిస్తే మళ్లీ 12+1 చేయాల్సిందేననే తీర్మానం మీద మళ్లీ జూదం. పాండవులు ఆ శిక్షని కూడా పూర్తి చేసుకుని 13 ఏళ్ల పిమ్మట విజయవంతంగా తిరిగొస్తే... రాజ్యం ఇచ్చి తీరాలి కదా మాట ప్రకారం(మళ్లీ రోహిల్లా భార్య ప్రవేశం). అయినా రాజ్యాన్నియ్యం అని మొండికేస్తే భగవంతుడు కూడా ఇది తప్పని వారిస్తే కూడా వినని స్థాయికెళ్లి వంశనాశనాన్ని చేసుకున్నారు కౌరవులు.దుర్బుద్ధికి సంకేతమైన రోహిల్లా భార్యవల్ల, ఆమె ఎవరిలో ప్రవేశిస్తే వాళ్లే నాశనమౌతారు తప్ప మరెవరూ నష్టపోరు, ఇదీ సాయి మాట్లలోని సారాంశం. కాబట్టి సద్బుద్ధి కలవాళ్లై జీవించండి, అని చెప్పడం ఆయన బోధనలోని దివ్యోపదేశం. ఇక సాయినాథుని అవతరణ గురించి త్రివేణి సంగమ స్నానాన్ని ఎలా దాసగణు అనే భక్తునికి చేయించాడో ఆ విశేషాన్ని చూద్దాం. -
ఈగ
ఖురాసాన్ రాజు వేటనుంచి తీవ్ర అలసటతో తిరిగి రాజభవనానికి చేరుకుని తన రాజదర్బారులో విశ్రాంతి తీసుకునేందుకు కునుకు తీశాడు. అంతలోనే ఒక ఈగ తన ముక్కుపై వాలింది. అంతే ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. కోపంతో ఈగను అల్లించాడు. తేరుకొని ముంచుకొస్తున్న నిద్రతో కళ్లు మూతలుపడుతుండగా ఆ ఈగ మళ్లీ అతని ముక్కుపై వాలింది. రాజు గారికి ఈగ మీద చిర్రెత్తుకొచ్చింది. ఈగను నరికి పోగులేయాలన్న కోపంతో ఊగిపోయాడు. మాటిమాటికీ ఇదే పునరావృతమైంది. రాజుగారు తన పక్కనే ఉన్న తన సైనిక భటునితో ‘‘దేవుడు ఈగను ఎందుకు సృష్టించాడు. దీన్ని పుట్టించడం వెనుక ఉద్దేశమేమిటి’’ అని కోపంతో అడిగాడు. ‘‘రాజులు, చక్రవర్తుల అధికార మదాన్ని, అహంకారాన్ని అణిచివేసేందుకే ఈగను సృష్టించాడు. ఎంత గొప్ప చక్రవర్తులైనా చిన్న ఈగపై కూడా ఎలాంటి ఆధిపత్యాన్ని చెలాయించలేరన్న విషయాన్ని తెలిపేందుకే ఈగను సృష్టించాడు. తమకు తిరుగులేదని విర్రవీగే చక్రవర్తులు చిన్న ఈగపై కూడా అధికారం చెలాయించలేనప్పుడు మన విలువ ఏపాటిదో గుర్తుంచుకోవాలి’’ అని సైనిక భటుడు రాజుగారి కళ్లు తెరిపించాడు. అతని మాటలకు ఎంతో మెచ్చుకున్న రాజుగారు అతన్ని తన మంత్రిగా నియమించుకున్నాడు. – తహీరా సిద్ధఖా -
తొండనూరులో వెల్లివిరిసిన వైష్ణవం
బ్రహ్మరాక్షసిని పారద్రోలి రాజును ఆకర్షించి అందరి మతం మార్చాడని జైనులకు రామానుజుని మీద విపరీతమైన కోపం వచ్చింది. జైన గురువులు రామానుజుడు నరసింహాలయంలో ఉన్నారని తెలిసి అక్కడికి దండెత్తి వెళ్లారు. ఒకేసారి పన్నెండు వేలమంది రామానుజుడిని శాస్త్ర చర్చకు రమ్మన్నారు. ముందు తమను జయించాలని, ఆ తరువాతే రాజుతో మాట్లాడాలని సవాలు చేశారు. ఓడిపోతే తమ మార్గాన్ని, మతాన్ని అనుసరించాలన్నారు. రామానుజులు వారి సవాల్‌ను స్వీకరించారు. ‘మేమంతా ఒకేసారి ప్రశ్నిస్తాం. అన్నింటికీ సమాధానాలు చెప్పాల’ని వారు నిబంధన విధించారు. వచ్చిన జైనులలో దిగంబరులూ ఉన్నారు. శ్వేతాంబరులూ ఉన్నారు. రామానుజ యతీంద్రుడికి ఒక కట్టుబాటు ఉంది. దిగంబరులను చూడరు, మాట్లాడరు. కనుక ‘‘నా చుట్టూ తెర కట్టండి, మీరు చుట్టూ చేరి ప్రశ్నలు అడగండి. నా నుంచి సమాధానాలు వినిపిస్తాయి వినండి. నా తెరలోకి తొంగి చూస్తే మీకే నష్టం జాగ్రత్త’’ అన్నారు. రామానుజులు కనిపించకుండా తెర కట్టారు. చర్చ మొదలైంది. వాదప్రతివాదాలు జరుగుతున్నాయి. వేలాది గొంతులు వినిపిస్తున్నాయి. ఒక్కో జైనుడికి ఒక్కో గొంతుక వినిపిస్తున్నది. సూటిగా ఒక్కో ప్రశ్న వేసిన వ్యక్తికే వినిపించే సమాధానం దూసుకుని వస్తున్నది. జైన మునులు ఆశ్చర్యపోతున్నారు. ఏం జరుగుతున్నదో తెలియడం లేదు. ప్రశ్నించడమో ప్రతిపాదించడమో జరిగిందో లేదో, సమాధానాలు శరాల్లా వస్తున్నాయి. శరవేగంగా ప్రతివాదాలు, ఖండన మండనలు వెలువడుతున్నాయి. శాస్త్ర, పురాణ ప్రమాణాలు, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తుల వాక్యాలు, ఈటెల్లా వస్తున్నాయి. రాను రాను జైనుల ప్రశ్నాస్త్రాలు వడిసిపోతున్నాయి. నిరస్త్రమై నిస్తేజమై పడిపోతున్నాయి. అడగడానికేమీలేక జైనుల నోళ్లు మూతబడుతున్నాయి. కొందరికి అనుమానం వచ్చింది. తెరలోపల ఏం జరుగుతున్నది? ఒక్కవ్యక్తి ఇన్ని గొంతులతో ఏవిధంగా మాట్లాడుతున్నారు? ఇది వాస్తవమా లేక కనికట్టా? అని తెరతీసి చూశారు. చూసిన వారు వెంటనే మతిభ్రమించినట్టు పడిపోయారు. పిచ్చిబట్టినట్టు పరుగెత్తిపోయారు. ‘‘ఏమైంది.. ఏం కనిపించింది..’’ అని వారిని అడిగితే ‘‘అక్కడ రామానుజ వీర వైష్ణవ తేజం ప్రజ్వరిల్లుతున్నది. వేలాది పడగల ఆదిశేషుడై రామానుజుడు విజృంభించి వాదనా కదన రంగంలో వీరవిహారం చేస్తున్నాడు. ఆ భయానక దృశ్యం చూడగానే మాకు మతిపోయింది. నాతోపాటు చూసిన వారు, తెరతీయడానికి భయపడేవారు, తెరతీసి భయపడి పారిపోయినారు. వేలాది ప్రశ్నల వేగాన్ని బట్టి సమాధాన సహస్రాలు మహాగ్ని జ్వాలలై వచ్చాయి’’ అని చెప్పుకున్నారట. న్యాయనిర్ణేతగా ఉన్న రాజు వాద ప్రతివాదాలు వినడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రశ్నలూ ప్రతిపాదనలూ ముగియగానే తెరవెనుక ఆదిశేషుని అవతారమైన యతిరాజు ప్రత్యక్షమైనాడు. తెరతొలగగానే దివిలో జ్ఞాన సూర్య సహస్ర కాంతులతో రామానుజుడు దుర్నిరీక్షుడై కనిపించాడు. కాసేపటి తరువాత జైన శాస్త్రవేత్తలు, పండితులు, తర్కశాస్త్రజ్ఞులు మౌనం పాటించారు. ఆ మౌనం పరాజయానికి ప్రతీక కనుక జైనులు పరాజితులని రాజు ప్రకటించారు. తొండనూరులో జైనుల ఆధిక్యం సమసిపోయి వైష్ణవం వెల్లివిరిసింది. జలాశయ నిర్మాణ నిపుణ రామానుజ ఆ ప్రాంతంలో అనావృష్టిని నివారించడానికి యోగ్యమైన స్థలంలో కరకట్ట నిర్మించి జలాశయాన్ని ఏర్పాటు చేయాలని రామానుజులు సంకల్పించారు. సహజమైన పరిసరాల్లో తటాకానికి అనుకూలమైన స్థలాన్ని ఎంపిక చేశారు. అటూ ఇటూ సహజంగా ఉన్న కొండలు కొన్ని బండరాళ్లు పేర్చితే ఆనకట్ట సులువుగా తయారవుతుందని, అందుకు సాంకేతికంగా ఏం చేయాలో కూడా రామానుజుడు వివరించారు. రాజు విష్ణువర్ధనుడు ఆశ్చర్యపోయారు. యతిరాజులు గొప్ప సాంకేతిజ్ఞులు కూడా అని అర్థమైంది. రామానుజుడు ఆ తటాకానికి తిరుమల రాయ సాగరం అని నామకరణం చేశారు. ఆ ప్రాంతంలో ఈ చెరువు ద్వారా ఏ మేరకు పంట పొలాలకు నీరు చేరుతుందో రామానుజులు అంచనాను వివరించారు. ఆనకట్ట నిర్మాణమై జలాశయంలో నీరు నిండిన తరువాత ఆశయం నెరవేరి ఆ ప్రాంతమంతా సుభిక్షమైంది. తిరునారాయణుని పునఃప్రతిష్ఠ ఓరోజు ఉదయాన్నే రామానుజులు అనుష్టానం కోసం ఊర్థ్వ పుండ్రాలను దిద్దుకోవడానికి తిరుమణి పెట్టె తెరిస్తే తిరు (శ్రీ)మణి (మన్ను) నిండుకుంది. ఎలా అని చింతిస్తున్న రామానుజులకు తిరునారాయణుడి మాట వినిపించింది.... ‘‘నేను ఓ పదిమైళ్ల దూరంలో ఉన్నాను. నా సన్నిధి మూతబడిపోయి ఉంది. నన్ను బయటకు తీసి నిలబెట్టవయ్యా యతిరాజా’’ అని. వెంటనే బయలుదేరి ఆ కీకారణ్యంలో చెట్లను కొట్టిస్తూ దారి చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలోనే అటూ ఇటూ కొమ్మలు గీరుకుపోయి శరీరమంతా నెత్తుటి గాయాల రేఖలు ఏర్పడ్డాయి. (ఈనాటికీ శ్రీరామానుజుని ఉత్సవ విగ్రహానికి చారలు గీతల మచ్చలు, అభిషేక తిరుమంజనాల సమయంలో కనిపిస్తాయంటారు.) స్వామికోసం వెతుకుతూనే ఉన్నారు. ఎంతకూ కనిపించడం లేదు. ‘‘ఇక్కడే ఓ పుట్టలోపల సరిగా చూడు అక్కడ ఉన్నాను’’ అని మళ్లీ అశరీర వాణి వినిపించింది. సంపెంగ చెట్టు, దానికి ఉత్తరాన కొన్ని అడుగులదూరంలో బదరీ వృక్షము (రేగు చెట్టు) దానికి పడమరలో పుట్ట కనిపించింది. పుట్టను గునపాలతో కొడితే పాములకు దెబ్బ తగులుతుందన్న భయంతో పాలు పెరుగు తెప్పించి పుట్టపై పోయించారాయన. మన్ను కరిగి తిరునారాయణుడి దివ్యమంగళ విగ్రహం బయటపడింది. ఆ ప్రాంతంలో ‘మేలుకోట’ (ఈనాటి మేల్కోటే, కర్ణాటక) అనదగిన స్థలంలో భవ్యమైన ఆలయాన్ని రామానుజుని ఆలోచనలకు అనుగుణంగా శాస్త్రబద్ధంగా రాజు నిర్మింపజేశాడు. తిరునారాయణమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. రాజుగారు తన కోశాగారంలో ఉన్న ఒక ప్రాచీన వజ్రకిరీటం ఆ మూర్తికి అలంకరించాలనుకున్నారు. కాని శ్రీవారి శిరస్సుకు సరిపోలేదు. అయితే ఆ కిరీటానికి తగిన విగ్రహం ఒకటి ఉండి ఉండాల్సిందే అని రామానుజులు అన్నారు. ప్రాచీనాలయాలు విధ్వంసం చేసి శత్రువులు కొందరు విగ్రహాల్ని ఎత్తుకుపోయి ఉంటారని కాలక్రమంలో చేతులు మారి ఆ విగ్రహం ఉత్తరాన దెహలీ (దిల్లీ) సుల్తానుల చేతికి చిక్కిందని జనం చెప్పుకుంటున్న విషయం రామానుజులకు తెలిసింది. విగ్రహ రహస్యం ఛేదించడానికి రామానుజులు ప్రార్థన చేశారు. ఏకాగ్ర చిత్తంతో సాగిన ధ్యానంలో ఆయన చతుర్భుజుడై శంఖ చక్రధారియైన శ్రీరామపిళ్లై మూర్తి అనీ రామానుజులకు స్ఫురించింది. శ్రీరామపిళ్లైని తిరిగి రప్పించడానికి రామానుజులు కొందరు శిష్యులతో దిల్లీ నగరానికి బయలుదేరారు. పాదుషాను కలిశారు. తాము నిత్యమూ ఆరాధించే భగవంతుని మూర్తి సుల్తాన్ కోశాగారంలో ఉందని, దానికి తమకు తిరిగి ఇప్పించాలని కోరారు. ‘మా దగ్గరే ఉన్నట్టు మీకే విధంగా తెలిసింది?’ అని అడిగారు. తిరునారాయణ మూలమూర్తి పుట్టలోంచి ఆవిష్కారమైన విషయం, తనకు ధ్యానంలో శ్రీరామపిళ్లై కనిపించిన సంగతి వివరంగా సుల్తాన్‌కు చెప్పారు ఆచార్యులు. రామానుజుని తేజస్సుకు సుల్తాను అబ్బురపడ్డారు. విగ్రహం కోసం తన భాండాగారాన్ని రామానుజులకు చూపమన్నారు. కాని అందులో ఈ విగ్రహం కనిపించలేదు. రామానుజాచార్యులు మరోసారి మహాధ్యానంలోకి వెళ్లిపోయారు. స్వామీ ఎక్కడున్నారు అని పరితపించారు. మనసులో సాక్షాత్కరించారు. పాదుషా కూతురితో ఆడుకుంటున్నానని చెప్పారు స్వామి. మరునాడు ఆ విషయం పాదుషాకు తెలిపారు. ‘‘ఇక్కడే మీ దేవుడు ఉన్నట్టు మీకు ఏవిధంగా తెలిసింది?’’ అని అడిగారు. ‘‘మాకు ధ్యానంలో స్ఫురించింది’’ అన్నారు. ‘‘ధ్యానంలో దైవం స్ఫురించిన మాట నిజమే అయితే మీరే పిలుచుకోండి. మేం అంతఃపురానికి వెళ్లం, మిమ్మల్ని వెళ్లనివ్వం. మీ దేవుడు కదా వస్తాడేమో చూద్దాం’’ అని నవ్వాడు సుల్తాన్. ‘‘వస్తే మాతో పంపిస్తారు కదా’’ అని రామానుజులు అడిగారు. నడిచి రావడం జరగనే జరగదనే నమ్మకంతో నిశ్చింతగా సుల్తాన్ ‘‘తప్పకుండా’’ అని హామీ ఇచ్చారు. సుల్తాన్ దర్బారులో పద్మాసనం వేసుకుని రామానుజుడు తదేక ధ్యానం చేశారు. శ్రీరామపిళ్లైని ప్రార్థించారు. ‘శ్రీరామపిళ్లై రా నాయనా’ అని మనసారా పిలిచారు. శ్రీకృష్ణుని యశోద ఆప్యాయత నిండిన స్వరంతో ‘‘వరుగ వరుగ విజ్ఞేవామననమ్బీ వరుగ విజ్ఞే’’ అని రామానుజుడు భక్తితో పిలిచినాడు. అంతఃపురంలో ఉన్న ఆ రమణీయ విగ్రహం తనంత తానే ఛెంగు ఛెంగున వచ్చి రామానుజుని ఒడిలో చేరింది. సుల్తాన్ ఆశ్చర్యంలో మునిగిపోయాడు. రామానుజుల కన్నులు ఆర్ద్రతతో జలమయమైపోయాయి. సరిగ్గా అదే సమయానికి అంతఃపురంలో విగ్రహం మాయం కావడం కలకలం రేపింది. యువరాణి ఆడుకునే ప్రియమైన విగ్రహం అదృశ్యమైందని ఫిర్యాదు అందింది. ఆయనకు అర్థమైపోయింది– రామానుజులు ఒడిచేరిన అత్యంత సుందరమైన ఆ విగ్రహం తన కూతురు మనసు హరించిందని ఇన్నాళ్లూ ఆడుకున్నదని. రాణికి ఆ విషయం చెప్పి, ఒక యతికి ఇచ్చిన విగ్రహం మళ్లీ వాపస్ తీసుకోవడం జరగదని, మాట తప్పలేనని కనుక దాని గురించి మరిచిపొమ్మని ఆదేశించాడు సుల్తాన్. సుల్తాన్ యంత్రాంగం చేసిన సాయంవల్ల శ్రీరామపిళ్లైతో రామానుజ పరివారం మళ్లీ దక్షిణానికి తిరుగు ప్రయాణం ప్రారంభించింది. మేల్కోట చేరుకున్నారు. సంపత్ కుమారుడని, శెల్వపిళ్లై (గారాబు తనయుడు) అని నామకరణం చేశారు. దివ్యసుందర చెలువ నారాయణ (తిరునారాయణ) ఆలయంలో ఒక ప్రత్యేక సన్నిధానాన్ని సంపత్ కుమారుడి కోసం నిర్మింపజేశారు రామానుజులు. తన ధ్యానంలో రామానుజాచార్యుల వారికి సజ్జెహట్టి బావిలో శ్రీదేవి భూదేవి (ఉభయ నాచ్చియార్లు) విగ్రహాలు, సంపెంగ చెట్టుకింద యదుగిరి అమ్మవారు కనిపించారు, వారిని రప్పించారు. నరసింహుని కొండలో పాండవ గుహలో విష్ణువర్ధనునికి దొరికిన పురాతనమైన వజ్రకిరీటం (వైరముడి) తెప్పించారు. ఆ కిరీటం శ్రీరామపిళ్లైకి సరిగ్గా సరిపోయింది. (ఆ విధంగా వజ్రకిరీటధారణ చేసిన ఆ రోజున ఇప్పడికీ వైరముడి ఉత్సవం ఏటేటా చాలా వైభవంగా నిర్వహిస్తున్నారు.) సుదర్శనచక్రాన్ని పదిమంది ఆళ్వార్లను, తిరుక్కచ్చినంబి (కాంచీ పూర్ణులు), శ్రీమన్నాథమునులు, శ్రీ ఆళవందార్ (యామునాచార్యుల) విగ్రహాలను ప్రతిష్టించి తిరునారాయణపురం ఆలయాన్ని అత్యంత ప్రామాణికమైన నారాయణ క్షేత్రంగా నిలబెట్టారు రామానుజులు. మూలవరులు తిరునారాయణుడని, ఉత్సవమూర్తి శెల్వనారాయణుడని, తిరుమంజన బేరం (మూర్తి) నకువణ్ పుగళ్ నారాయణన్ అని, బలిబేరానికి వాళ్ పుగళ్ నారాయణన్ అనీ, శయనబేరానికి ననేఱళిల్ నారాయణన్ అని నమ్మాళ్వార్ల పాశురాల్లో ఉన్న నామాలను నిర్ధారించారు. తను చిన్నతనం నుంచి చాలా ఇష్టపడిన శెల్వపిళ్లైని విడిచి తానుండలేనని చెప్పింది యువరాణి. భోజనం చేయక మంచినీళ్లు తాగక నిరశన వ్రతం పట్టింది. ఓ విగ్రహం మీద ఇంత ప్రేమ ఏమిటని పాదుషా ఎంత చెప్పినా వినలేదు. యతిరాజును ప్రార్థించి ఆ విగ్రహం తిరిగి తెచ్చుకుంటానని యువరాణి పట్టుబట్టింది. ఏమీ చేయలేక పాదుషా పల్లకీలో అమ్మాయిని భద్రతాదళంతో పంపించాడు. తిరునారాయణ పురం చేరేనాటికి శెల్వపిళ్లై ప్రతిష్ఠ, వారికి వజ్రకిరీట ధారణ జరగడం, అత్యంత వైభవంగా దైనందిన తిరువారాధనలతో మంగళ తూర్యరావాలతో, తిరువాయిమొళి తదితర ప్రబంధ పాశురాల అనుసంధానంతో శెల్వప్పిళ్లై అలరారుతున్న విషయం గమనించింది. శాస్త్రప్రకారం ప్రాణ ప్రతిష్ఠ చేసి నిత్యసేవలు అందుకున్న స్వామిని దరిచేరడం తీసుకుపోవడం సాధ్యం కాదని యువరాణికి అర్థమైంది. ఆ స్వామి విరహాన్ని తట్టుకోలేక ఆమె అక్కడే అసువులు బాసింది. రామానుజులు ఆమెలో విగ్రహం పట్ల ఉన్న అపరిమితమైన ఆర్తిని, ప్రగాఢ ప్రేమను గమనించి, ఆమె సామాన్యురాలు కాదని, గోదాదేవి అంతటి భక్తురాలని నిర్ధారించి, ఆమెకు లక్ష్మీదేవితో సమాన స్థానం కల్పించి బీబీ నాంచియార్ అనీ తులుక్కనాచ్చియార్ అని నామకరణం చేసి మేల్కోటే నిత్యపూజలలో ఆమె ప్రతిరూపాన్ని నిలబెట్టారు. ఆమెకు రొట్టెల నైవేద్యంతో ఆరాధనా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినారు రామానుజులు. అక్కడే తిరునారాయణుడి నిత్యారాధనోత్సవాలలో పాల్గొంటూ రామానుజులు నిత్యారాధనలో పాల్గొంటూ, నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, రుతోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవ, కళ్యాణోత్సవ, అభిషేకోత్సవ, పఞ్చపర్వతోత్సవ, బ్రహ్మోత్సవ, పవిత్రోత్సవ, తిరునక్షత్రోత్సవాలను జరిపిస్తూ 12 సంవత్సరాలు గడిపారు. - ఆచార్య మాడభూషి శ్రీధర్ -
తన కోపమే తన శత్రువు
రమేశ్ చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు తనకు దక్కని ఆటవస్తువును సాధించుకునేందుకు కోపం అనే ఆయుధాన్ని వాడాడు. తనకా ఆటవస్తువు దక్కింది. అంతే... కోపం అనేదాన్ని ఒక పనిముట్టుగా వాడుకుంటే దక్కనివి చాలా దక్కుతాయని అతడిలో ఒక అభిప్రాయం ముద్రించుకుపోయింది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ ధోరణితోనే తాను సాధించుకుంటున్న ప్రయోజనాల జాబితా కూడా పెరుగుతూ పోయింది. రమేశ్‌లో కోపం అనేది తనకు ప్రయోజనకారి అనే ధోరణీ పెరిగిపోయింది. ఒకనాడు అదే కోపంతో ఒకరిని బలంగా వెనక్కు నెట్టేశాడు. ఎదుటివారిని గాయపరచడం రమేశ్ ఉద్దేశం కాదు. కేవలం కోపంతో ఎదుటివాడిపై ఆధిపత్యాన్ని సాధించడమే అప్పటికి అతడి లక్ష్యం. కానీ విధి వేరేగా తలచింది. ఎదుటివాడు తీవ్రంగా గాయపడ్డాడు. రమేశ్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. అతడు ప్రస్తుతం అండర్ ట్రయల్ ఖైదీగా కాలం వెళ్లదీస్తున్నాడు. ఇదీ తనపై తనకు అదుపులేనంత కోపం తేగల అనర్థం అని చెప్పే ఒక కేస్ స్టడీ. కోపం అనే భావోద్వేగం ఎప్పుడూ మన అదుపులోనే ఉండటం అవసరం. సమాజంలో మనం బతుకుతున్నప్పుడు అది మరింతగా అవసరం. మనల్ని మనం అదుపులో ఉంచుకోకపోతే... మనల్ని మనం సామాజికంగా వెలివేసుకున్నట్లే. లేదా కోపం మరింత మితిమీరితే మనల్ని మనమే బలితీసుకున్నట్లే. మనలో ఎన్ని మంచి గుణాలు ఉన్నా క్షణికావేశంలో చేసే ఒకే ఒక తప్పు మొత్తం జీవితాన్నే మసకబార్చవచ్చు. ఆ కోపం తాలూకు క్షణికాగ్రహం వల్ల కొందరు కుటుంబాల్నీ, ఇంకొందరు జీవితాల్నీ, మరికొందరు సాక్షాత్తూ తమ ప్రాణాలనే పోగొట్టుకున్నారు. ఇవాళ్ల మనకు తెలిసీ... జైల్లో ఉన్న చాలామంది కేవలం తమ కోపం వల్ల చేసిన భౌతిక దాడులతో శిక్షార్హులై... ఆ క్షణాన్ని వెనక్కుతేలేక పశ్చాత్తాపంలో మగ్గిపోతున్నారంటే అది అవాస్తవం కాదు. అలాంటి కోపం గురించి, దాన్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం గురించి, అందుకు అందుబాటులో ఉన్న మార్గాల గురించి వివరిస్తున్న ప్రత్యేక కథనం ఇది. కోపం అంటే... అసలు కోపం అంటే ఏమిటి? ఒక సహజమైన ఉద్వేగం. ఒక సహజాతం. ఇంగ్లిష్‌లో చెప్పాలంటే ఇన్స్టింక్ట్. అందుకే నెలల పిల్లల్లోనూ అది ఉంటుంది. కావాల్సింది దొరకనప్పుడు, అసౌకర్యంగా ఉన్నప్పుడు పిల్లలు కోపాన్ని ఏడుపు ద్వారా వ్యక్త పరుస్తారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఇది కొత్త రూపాలను పొందుతుంటుంది. కొత్త మార్గాల్లో వ్యక్తమవుతుంటుంది. నిర్వచన రూపంలో చెప్పుకోవాలంటే... ‘కోపం అనేది మనకు ఇష్టం లేనివి జరుగుతున్నప్పుడు లేదా సౌకర్యంగా లేనిది చోటుచేసుకుంటున్నప్పుడు రేగే ఒక ప్రతికూల భావోద్వేగం’. ఈ భావోద్వేగం కలిగినప్పుడు అదుపు కోల్పోతే మర్యాదాకరం కానివిధంగా రియాక్ట్ అవుతాం. అర్థం లేకుండా, నిర్లక్ష్యంగా, బెదిరింపు ధోరణితో ప్రవరిస్తాం. కట్టలు తెంచుకున్న కోపంలో అనర్థాలు చేసి కూర్చుంటాం. ఇలా కోపం వల్ల జీవితాలే నాశనం చేసుకున్నవారు ఉన్నారు. తీవ్రమైతే అనర్థమే... కోపం కొందరిలో చాలా తీవ్రంగా ఉంటుంది. ఇందుకు మన పూర్వ గ్రంథాల్లో ఉదాహరణలు కూడా ఉన్నాయి. దూర్వాసుడు మహామునే అయినా కోపం అనే గుణం కారణంగానే కోపిష్టి అనే మచ్చ పొందాడు. అంటే వ్యక్తిత్వాన్ని, శీలాన్ని దెబ్బతీసే దుర్గుణం కోపానికి ఉందని అర్థం. పొరుగువారిపై ద్వేషాలతో పుట్టిన కోపమే ప్రపంచ వ్యాప్తంగా చాలా యుద్ధాలకు కారణం. అయితే దేనికైనా మితం ఉంటుంది. మితిమీరిన కోపం తనకూ సమాజానికీ నష్టం చేసే స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని తప్పకుండా ఒక మానసిక సమస్యగానే మానసికవేత్తలు పరిగణిస్తారు. కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది... మనలో ఉత్పన్నమయ్యే భావోద్వేగాలకు మెదడులోని బాదం షేపులో ఉండే ‘అమిగ్దలా’ కారణం. మనకు ఏదైనా అప్రియమైన ఘటన జరుగుతుందని తెలిసిన వెంటనే ఈ అమిగ్దలా ప్రేరేపితమవుతుంది. అయితే మనకు జరగబోయే అసలు నష్టాన్ని తార్కికంగా ఆలోచించే భాగం ‘కార్టెక్స్’. ఈ కార్టెక్స్ కంటే ముందుగానే అమిగ్దలా రంగంలోకి దిగిపోవడంతో ఒంట్లో అడ్రినలీన్, కార్టిసోల్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్లు స్రవిస్తాయి. అడ్రినలిన్ రక్తంలోకి చాలా ఎక్కువ మోతాదులో పంప్ అవుతుంది. అడ్రినలిన్ ఎంత ఎక్కువగా ఉంటే కోపం తీవ్రత అంత ఎక్కువన్న మాట. అదే సందర్భంలో ఆ కోప సమయాన్ని ఎదుర్కునేందుకు అవసరమైన శక్తి కోసం రక్తంలోకి గ్లూకోజ్ కూడా ఎక్కువగా పంప్ అవుతుంది. అంతేకాదు అన్ని కణాలకూ ఆ శక్తి చేరడానికి వీలుగా రక్తనాళాలూ విప్పారతాయి. ఇలా విప్పారడం వల్ల రక్తం జివ్వున ఎగజిమ్మడం వల్లనే కొందరిలో కోపం వచ్చినప్పుడు ముఖం, శరీరం ఎర్రబారతాయి. అయితే సమన్వయ వ్యవస్థలో భాగంగా మెదడులోని విచక్షణాæ కేంద్రమైన కార్టెక్స్ రంగంలోకి దిగి క్రమంగా పరిస్థితిని అవగతం చేసి పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా వ్యక్తిని క్రమంగా నార్మల్ స్థితికి తెస్తుంది. ఇదీ కోపంలో జరిగే మెకానిజమ్. ఆగ్రహ వ్యక్తీకరణల్లో అనేక రకాలు కోపం వ్యక్తమయ్యే తీరును బట్టి దానికి పేరు పెట్టారు మానసిక నిపుణులు. కోపం యొక్క లక్షణాలు, వాటి పేర్లు ఇలా ఉన్నాయి. షౌటింగ్ స్పెల్స్ : తీవ్రస్వరంతో గొంతు చించుకుని అరవడం. ఇలా అదుపు కోల్పోయి అరవడం వల్ల కొన్నిసార్లు కొందరిలో స్వరపేటిక దెబ్బతింటుంది. గొంతు బొంగురుబోతుంది. చాలా రోజులు మామూలుగా మాట్లాడలేరు కూడా. ఇలాంటి కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘షౌటింగ్ స్పెల్స్’గా చెప్పవచ్చు. బ్యాంగింగ్ ఆఫ్ హెడ్ : తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోతూ తలను గోడకేసి బాదుకోవడాన్ని ‘బ్యాంగింగ్ ఆఫ్ హెడ్’ అని అంటారు. డెలిబరేట్ సెల్ఫ్ హార్మ్ (డీఎస్‌హెచ్) : ఇది కోపంలో తమకు తాము హాని చేసుకునే స్థితి. ఉదాహరణకు బైక్‌పై వెళ్తున్నప్పుడు రాయి అడ్డం పడి బండి పక్కకు ఒరిగిపోయిందనుకోండి. కోపంతో వాహనదారుడు కాలు చిట్లి రక్తం వచ్చేంత తీవ్రతతో ఆ రాయిని తంతాడు. గాయపడతాడు. ఆత్మహత్యకంటే ఒక మెట్టు తక్కువ స్థాయి ఆగ్రహప్రకటన ఇది. డెలిబరేట్ ఇన్సామ్నియా : కొందరు తమ ఆగ్రహాన్ని నిద్ర మీద చూపిస్తారు. తమకు ఎంతగా నిద్రవస్తున్నా నిద్రపోకుండా తమను తాము హింసించుకుంటారు. దీన్ని వైద్యపరిభాషలో ‘డెలిబరేట్ ఇన్సామ్నియా’గా చెబుతారు. డెలిబరేట్ నాన్ కో–ఆపరేషన్: గాంధీమార్గంలో కోపం వ్యక్తం చేసే రూపమిది. బాగా కోపం వచ్చిన వారు దాన్ని తమ రోజువారీ కార్యకలాపాల మీద చూపిస్తారు. పిల్లలు స్కూల్‌కు వెళ్లరు. పెద్దలైతే ఆఫీసుకు వెళ్లరు. బాస్ పిలిచినా ఆఫీసు సమావేశాలకు అటెండ్ కారు. చేతిలోని వస్తువు విసిరి కొట్టడం : టీవీలో మనం సపోర్ట్ చేస్తున్న టీమ్ ఓడిపోయిందనుకోండి. టీవీని బద్దలు కొట్టేస్తాం. అలాగే కొందరు కళ్లజోడునూ, చేతిలోని మొబైల్‌నూ విసిరివేయడం చాలా కుటుంబాల్లో చూసే దృష్టాంతమే. ఇది ఆర్థికంగా చేసుకునే హాని. జుట్టు పీకేసుకోవడం : ఆగ్రహంతో జుట్టుపీకేసుకోవడం చేస్తారు. కేవలం తలపైని జుట్టు కాకుండా కొందరు కనురెప్పల్లోని వెంట్రుకలు మీసంలోని వెంట్రుకలు పీకేసుకుంటుంటారు. ఇలా జుట్టు పీకేసుకునే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘ట్రైకోటిల్లోమేనియా’ అంటారు. – డా.కళ్యాణ్ చక్రవర్తి, సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, లూసిడ్ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్ ఆగ్రహాన్ని అదుపు చేసుకొనే మార్గాలు (యాంగర్ మేనేజ్మెంట్) కోపం ఎప్పుడూ మన అదుపులోనే ఉండాలి. దాని అదుపులోకి మనం వెళ్లకూడదు. కోపాన్ని నివారించుకునేందుకు అనుసరించదగిన కొన్ని మార్గాలివి... ►కోపంతో ఏదైనా పనికి పూనుకునే ముందు దానిని వాయిదా వేయాలి. ఒకటికి రెండు సార్లు చేయబోయే పని మంచిదేనా అని ఆలోచించాలి. ఆ పని చేసే ముందర శ్రేయోభిలాషితో తప్పక సంప్రదించాలి. ►జీవితంలో అన్నీ తాత్కాలికమైన పరిణామాలే. కోపం ఒక ఉద్వేగం. అది క్షణికం మాత్రమే. ఆ స్థితి దాటిన తర్వాత పరిస్థితి మామూలైపోతుంది అని గ్రహించాలి. ►ప్రతిసారీ మనదే గెలుపు కాదు. కొన్నిసార్లు అవతలి వాళ్లూ గెలవవచ్చు. ఇది చాలా సహజం. క్రీడాస్ఫూర్తితో ఈ వాస్తవాన్ని ఆమోదించాలి. ►మీరు ఎంతగా మన శ్రేయోభిలాషుల మాటలు వింటుంటే, మీలోని ఆగ్రహం అంతగా తగ్గుతుంది. ► జీవితంలో ప్రతిదీ మీకు తెలిసి ఉండాలనే లేదు. మీకు తెలియని అంశాలూ ఉండవచ్చు. అందుకోసం చిన్నబుచ్చుకోవడం, కోపం తెచ్చుకోవడం తగదు. ►నిద్రపోవడం, విశ్రాంతి తీసుకోవడం, రిలాక్స్ కావడం... జీవితంలో ఇవీ చాలా ప్రధానమైనవే అని గుర్తుంచుకోండి. ►కోపాన్ని సమర్థంగా నియంత్రించగలవాడు అని మీరు నమ్మినవాళ్లను మీ రోల్‌మోడల్‌గా ఎంచుకోండి. వాళ్లను అనుసరించడానికి ప్రయత్నించండి. వారంలో కనీసం కొద్దిసేపు వాళ్లతో గడపండి. ►మీకు కోపం వచ్చినప్పుడు మీరు గెలవవచ్చు. కానీ మీ కుటుంబ సభ్యులు ఓడిపోతుంటారన్న విషయాన్ని గ్రహించండి. ► మీ మాట నెగ్గుతోందా, మీ పంతం నెరవేరుతోందా, లేక మీరు గెలుస్తున్నారా అన్న అంశంపై స్పష్టత తెచ్చుకోండి. ►ఏయే సమయాల్లో మీకు కోపం వస్తుందో గ్రహించి, మీ వృత్తి బాధ్యతలలో కోపం వల్ల మీరేమి కోల్పోతున్నారో, దానిని అధిగమించడం వల్ల మీరు గెలవగలిగేదేమిటో రాసుకొండి. దాన్ని మాటిమాటికీ చదువుకోండి. కోపంతో కొన్ని ప్రయోజనాలివి... కోపం అన్నది ఎప్పుడూ ప్రతికూలం మాత్రమే కాదు. కొన్నిసార్లు ఉపయోగకరమైన మోతాదులో మంచి కూడా చేస్తుంది. అలా దాన్ని పాజిటివ్‌గానూ ఉపయోగించవచ్చు. కోపాన్ని సద్వినియోగం చేసుకోగల పరిస్థితులివే... ►మీరు ఒక మంచి వ్యాపకాన్ని ఎంచుకోండి. మీకు కోపం వచ్చినప్పుడల్లా ఆగ్రహాన్ని ఆ వ్యాపకంలో ప్రదర్శించండి. ►ఏదైనా ఒక ఆటను ప్రాక్టీస్ చేయండి. ఆగ్రహ సమయంలో మీకు ఇష్టమైన ఆట ఆడండి. ►వేర్వేరు రంగాలకు చెందిన అనేక రకాల వ్యక్తులతో మీకు సత్సంబంధాలు ఉండేలా చూసుకోండి. కోపం రాగానే, మీరున్న చోటి నుంచి పక్కకు వెళ్లి, మీ స్నేహితులను కలవండి. ► కోపాన్ని నియంత్రించుకోవడంలో ఇతరులకు శిక్షణ ఇవ్వండి. ఇలాంటప్పుడు ఇతరులకు బోధించే మీరే... కోపాన్ని నివారించుకోవాలన్న స్పృహను అభివృద్ధి చేసుకుంటారు. ► సేవా కార్యకలాపాల్లో ఉన్నప్పుడు కోపం కలగదు సరికదా... సంతోషం మరింత ఎక్కువవుతుంది. ► మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇతరులు మిమ్మల్ని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్లను ముందుగా వెళ్లనీయండి. వెళ్లనిచ్చేలా మనసుకు శిక్షణ ఇచ్చుకోండి. మన జీవననైపుణ్యాలకు ఈ గుణాన్ని అలవరిస్తే దీనితో జీవితంలోనూ చాలా మార్పులు వస్తాయి. ఫిలసాఫికల్‌గా మీరు చాలా ఉన్నత స్థానంలోకి చేరుతారు. మిమ్మల్ని అభిమానించేవారూ పెరుగుతారు. ► మంచి సంగీతం, పాటలూ మిమ్మల్ని ఆహ్లాదపరుస్తాయి. ► కోపం వచ్చినప్పుడల్లా మరిన్ని అదనపు బాధ్యతలు తీసుకోండి. కసితో వాటిని పూర్తి చేయండి. ► మనస్తత్వ శాస్త్రానికి చెందిన కొత్త పుస్తకాలను వెతకండి. చదవండి. ఆసక్తికరమైన ఇతర మంచి పుస్తకాలూ చదవచ్చు. ►హాస్యసంఘటనలు, హ్యూమర్ వీడియోలు, కార్టూన్లు, కామెడీ సినిమాలు చూడండి. -
అగ్గిపెట్టె
బెంగాలీ మూలం : ఆశాపూర్ణా దేవి అనువాదం: టి. లలితప్రసాద్ నేను మహిళలను ఎప్పుడూ అగ్గిపెట్టెతో పోలుస్తూంటాను. ఎందుకంటే, అగ్గిపెట్టెలానే వంద లంకల్ని తగలెయ్యగల శక్తి వున్నప్పటికీ, చాలా అమాయకంగా, వంటింట్లో, పడగ్గదిలో, అక్కడా ఇక్కడాఎక్కడయినాసరే మహిళలు అలా మౌనంగా ఉంటారు. ఉదాహరణ కావాలా?మా ఇంటిముందు మూడంతస్తుల భవనాన్ని జాగ్రత్తగా గమనించండి. అది ఆదివారం ఉదయం.చాకలి వచ్చి వున్నాడు. అజిత్ భార్య చాకలి ముందు బట్టలు కుప్పగా వేసింది. అతను అవి తీసికెళ్లేలోగా చివరగా మరోసారి అజిత్ ప్యాంటు జేబులు వెతికింది. వెతగ్గా వెతగ్గా ఒక వుత్తరం దొరికింది. నలిగిపోయిన ఒక వైపు చిరిగిన ఓ కవర్. దాని మీద నమితా పేరే ఉంది. అంతే బట్టలన్నీ అలా వదిలేసి ఆ వుత్తరం పట్టుకుని గదికి వెళ్లి మంచం మీద కూలబడింది. ఎప్పుడొచ్చిందీ తేదీ చూసింది. అది వచ్చిమూడు రోజులయింది. అజిత్ వుత్తరాన్ని తెరిచి చదివి ఇలా మడతలుపెట్టి జేబులో వేసుకుని అలానే వుంచేసి వుంటాడు. నమితకి ఆ వుత్తరం సంగతి చెప్పాలని అనిపించలేదతనికి. మంటలు ఎగిసిపడుతున్నాయి, అది ఆమె ఆలోచనల్ని కూడా అంటుకుంది. దీన్ని అంత సులభంగా తీసుకునే సంగతిగా ఆమె భావించడం లేదు. కావాలని చేసిందే అనుకుంది. అజిత్ అలాంటివాడే. పెద్ద కుటుంబంలో యాభైరెండు చేతులు దాటించి మరీ లెటర్‌బాక్స్ తాళం తీశాడు. కవర్ మీద నమితా పేరుంటే అతనే తెరిచి ముందుగా చదివేస్తుంటాడు. ఆ తర్వాతే ఆమెకి ఇస్తాడు. అలాగని ఆమెకి వచ్చిన వుత్తరాలన్నీ ఆమెకి ఇస్తాడనీ కాదు! ఇదుగో అతని ఈ తత్వమే ఆమె మనసులో అనుమానాన్ని బలపరచింది. ఈరోజుకీ, తాను వుత్తరాలు ముందుగా తీసి చూస్తానన్నది కనుగొనడానికి ఏమాత్రం రుజువు లేకుండా జాగ్రత్తపడతాడు. ఆమెకి అనుమానం. అతనిది చెడ్డ అలవాటు. ఇప్పటికీ రెండూ పోవు. అందుకే ఆమె ఎత్తిపొడుపులూ, అతను కోపం ప్రదర్శించడం ఆ పెద్ద ఇంట రోజువారీ కార్యక్రమంలా సాగుతూంది. సరే ఇవాళ ఆమె చూసినది తన తల్లి నుంచి వచ్చినది. దాన్నిండా ఎపుడూ ఉండే అనేక ఫిర్యాదులు, కష్టాల పరంపరే. అటక పాడయిందని, దూలం ఏ క్షణాన్నయినా విరిగి పడితే తాను చావడం ఖాయమని, ఎవరూ దాన్ని బాగుచేయించడంలేదని, తన కూతురు రాకుమార్తె, అల్లుడు రాకుమారుడని, అందువల్ల తనను ఆదుకుంటారన్న ధైర్యంతో ఎన్ని కష్టాలనైనా భరించేస్తున్నానని యింకా ఏవేవో ఇలానే చాలా..! భర్తను కోల్పోయిన ఆవిడ తన వొక్క కూతురిని కాస్త పెద్ద కుటుంబంలోనే ఎలాగో ఇవ్వగలిగింది. అందుక్కారణం అమ్మాయి చూడచక్కనిది గనుక. వాళ్లు మంచివాళ్లు కావడం వల్ల ఈమె తను లేని కష్టనష్టాలను ఆరోపిస్తూ ప్రతీ చిన్న పని అమ్మాయి ద్వారా చక్కగా చేయించుకుంటూ జీవితాన్ని గడిపేస్తోంది. అందుకే ఆమె నుంచి నమితకు ఉత్తరం వచ్చిన ప్రతీసారీ, ‘ఎందుకు చదవడం? మనీఆర్డర్ చేయడమే ఉత్తమం’ అని నవ్వి వూరుకుంటుంటాడు. నమిత అవమానంతో తలొంచుకుంటూంటుంది. ఇక ఇది ఏమాత్రం భరించలేక తన తల్లిని కార్డు మీద రాయడం మాన్పించింది. అప్పటినుంచీ నమిత తను దాచుకున్న డబ్బులోంచి కొంత తల్లికి పంపడమూ చేస్తోంది. కవర్లోని వుత్తరం కథ కూడా అదే. ఆ ఆదివారం హఠాత్తుగా తల్లిమీద ఆగ్రహంతో వూగిపోయింది. ఎందుకిలా ఎప్పుడూ ప్రాధేయపడుతూంటుంది? కూతురు ఆత్మగౌరవాన్ని ఆలోచించలేదా? అత్తవారింట్లో పరువేంగావాలి? లాభంలేదు. ఈసారి తానే సమాధానం రాయాలనుకుంది నమిత. ‘ఇక నా వల్ల కాదు. నా నుంచి ఎలాంటి సాయంకోరి ఎదురుచూడవద్దు’ అని రాసింది. అజిత్ తలస్నానం చేసి అపుడే గదిలోకి వచ్చాడు. అప్పటివరకూ తల్లి మీది కోపం అతని మీదా ప్రదర్శించింది, ‘ఈ వుత్తరం ఎప్పుడు వచ్చింది?’ అని అడిగింది.ఆమెను పరికించి చూసి, తన తప్పు ప్రభావం గ్రహించి ‘చేతికి వచ్చినంత ఇమ్మని వుంది’ అందుకే నమితకి ఆ వుత్తరం ఇవ్వకూడదనుకున్నాడు; వుత్తరాన్ని తీసుకుని ముక్కలు చేసి పారేయాల్సింది. అలా చేయలేదు, పొరపాటే చేశాడు. అందువల్ల అతనేమీ భంగపడలేదు. ఏదో ఆలోచిస్తున్నట్టు నటించి, ‘వుత్తరమా? ఏం వుత్తరం? ఓహ్, అవునవును! మీ అమ్మగారి నుంచి వచ్చింది, ఇవాళే నీకు ఇద్దామనుకున్నాను’ అన్నాడు.‘వెంటనే ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు? సమాధానం చెప్పండి, ఎందుకు మీ దగ్గరే పెట్టుకున్నారు?’ ‘అబ్బా, ఏంటీ గోల? ఏదో మర్చిపోయానులే’ ‘అబద్ధం’ కోపంతో అన్నది.‘నోటికి వచ్చినట్టు అంటావేమిటి? మనిషి అన్న తర్వాత మర్చిపోడా?’‘లేదు. మర్చిపోరు. కవర్ చించి వుత్తరం ఎందుకు చూశారు?’ అదేమీ పట్టనట్టు అజిత్, ‘చూస్తే ఏమయింది? నా భార్యకి వచ్చినదేకదా..’ అన్నాడు.‘అలా అనొద్దు. లక్షసార్లు చెప్పాను నా వుత్తరాలు చూడొద్దని, చెప్పానా లేదా?!’నమిత కోపానికి అజిత్ భయపడలేదు. చక్కగా నవ్వుతూ, ‘నువ్వు కాదంటే అదేదో చూడాల్సిందేగదా. ఎవరైనా రహస్యంగా ప్రేమలేఖలు రాస్తున్నారేమో!’ అన్నాడు కవ్వింపుగా.‘ఆపుతారా? ఎంత దారుణమైన మనిషివి!’ ఇక అజిత్ తన దొంగ నవ్వును నిజంగానే బయటకి నవ్వేశాడు. తాను కత్తి ఝళిపించాడు. ‘అలాగయితే రాత్రింబవళ్లూ కష్టాల్ని చెప్పుకుంటూ చేతులు చాచి సాయం అడుగుతున్న వాళ్లనేమనాలి? పేడకళ్లులెత్తుకునే వాళ్లమ్మాయి రాణి అయితే ఇలానే ఉంటుంది సుమా..’ అన్నాడు.‘ఇంక ఆపుతారా?’ గట్టిగా అరిచింది నమిత.వాళ్ల గది మూడో అంతస్తులో వుంది నయం. లేకుంటే ఈ అరుపులు అందరికీ వినిపించి పైకే చూస్తుండేవారు!‘ఎందుకు నోరుముయ్యాలి? నీ ఉత్తరాలు చూస్తాను. ఏదనుకుంటే అది చేస్తాను, నా యిష్టం. ఏం చేస్తావ్? ఏమన్నా చేయగలవా?’‘ఏం? నేనేంచేయలేనా? నేనేం చేయగలనో చూస్తారా?’ ఉక్రోషంతో ఊగిపోయింది నమిత.అంతే, పరుగున వెళ్లి అక్కడ టేబుల్ మీదున్న అజిత్ సిగరెట్ పెట్టె, అగ్గిపెట్టె తీసింది. అగ్గిపుల్ల వెలిగించి చీరకు అంటించుకుంది. ఆ ధనికుని భార్య ఖరీదయిన చీర అంటుకుంది.ఒక్క ఉదుటన దగ్గరికి వెళ్లి చీర కాలుతున్న భాగాన్ని చేతులతో పట్టి మంటలు ఆర్పి ‘నీకేమైనా పిచ్చా?’ అని తిట్టాడు అజిత్. నిజానికి అతను ఎంతో భయపడిపోయాడు. భయంతో ఆమె వంక చూశాడు. ఇంకా సరిగా ఆరని మంటలపై నీళ్లు పోసాడు. అతి కష్టంమీద మళ్లీ మాట్లాడగలిగాడు. ‘ఆ కోపమేమిటి? బుద్ధిలేకపోతే సరి? ఆడమనిషికి ఇంత కోపమా ఓహ్!’ అనగలిగాడు. ఆ వెంటనే నమిత ఏమన్నదో ఎవరికి తెలుసు. కానీ అప్పటికే ఆమె మేనకోడలు రీని వచ్చింది. గుమ్మంలోనే ‘అయ్యో అత్తా, చాకలివాడు ఇంకా ఎంతసేపు వుండాలి? నీ బట్టలేవీ ఇవ్వకుంటే చెప్పు వెళ్లిపోతాడుగదా!’ అని అరిచింది. క్షణంపాటు నమిత అలా ఉండిపోయింది. తన కోసం కింద హాల్లో వున్న చాకలివాడి మొహం గుర్తుకువచ్చింది. వెంటనే మాసిన బట్టలు లెక్కబెడుతూ ‘నువ్వెళ్లు కిందకి వస్తున్నా, బట్టలు తెస్తున్నాలే!’ అన్నది.నమిత ఏదయినా మనస్ఫూర్తిగానే చెబుతుంది. అందుకే ఇంట్లో ఎవరూ ఆమెను వ్యతిరేకించరు. అపుడపుడు తోడికోడళ్లు వెనకనుంచీ ఎత్తిపొడుపుతూ పొడుస్తూనే వుంటారు. ఇప్పుడు కూడా. నమిత మెట్లు దిగి వచ్చింది. ‘నీకు క్షణం దొరికితే చాలు చడీచప్పుడూ చేయకుండా గదిలోకి దూరతావు, ఎప్పుడూ మొగుడిదగ్గరే వుండిపోతూంటావ్, సమయం, సందర్భం ఏమీ లేవు మీ ప్రేమకబుర్లకి!!’ అన్నది వెక్కిరింపుగా వదినగారు. నమిత ఒక్కసారి చుట్టుపక్కల చూసింది. ఉదయం పనుల్లో అంతా హడావుడిగా తిరుగుతున్నారు. తాను ఏమీ జరగనట్టే ఉండాలనుకుంది. సన్నగా నవ్వి మెల్లగా ‘అబ్బే అదేంలేదు, కావాలంటే వచ్చి చూడవచ్చు, మేమేదో మాట్లాడుకుంటున్నాం, అంతే.’ మిజో ఆహాహా అంటూ గట్టిగా నవ్వి, ‘చాల్లే, మాకు తెలీదనుకున్నావా? అయినా మీ గదిలోకి తొంగిచూడడానికి మాకు వేరే పనేమీ లేదనుకున్నావా? మా కళ్లకు కనపడుతోంది, ఇరవై నాలుగ్గంటలూ ఏం చేస్తున్నావో!’ అన్నది వెటకారంగా. నమిత నవ్వింది. నవ్వుతూనే, ‘మీకు మామూలేగా, తమాషాగా అనడం!’ అన్నది. ‘నువ్వింకా కూరలు తరగనే లేదా? కథలు ఇలా చెబుతూనే వుంటావా?’ అన్నది తోడికోడలు పరుగున వచ్చి. మరో గదిలోకి వెళ్లబోతూ వెనక్కి తిరిగి నమిత కాలిన చీర అంచు చూసి, ‘ఏమయిందే?ఇంతమంచి చీరను ఎలా కాల్చుకున్నావే?’ అని ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది.నమిత ఆశ్చర్యాన్ని నటించింది. కానీ ఒక్క నిమిషమే. మరుక్షణం కాలిన కొంగు భాగాన్ని వెంటనే మడిచి పట్టుకుని, నవ్వుతూ, ‘అదా! గుర్తు చేయకు. నన్ను హెచ్చరిస్తూనే వున్నావు. నేను విననే లేదు. చూడు ఇపుడేమయిందో! స్టవ్ మీంచి వేడినీళ్ల గిన్నె దించబోయాను. అపుడు చీర అంటుకుంది!’ అన్నది. నమిత బంగాళాదుంపలు బుట్ట దగ్గరికి లాక్కుని తొక్కు తీయడానికి కూర్చుంది. కానీ ఆమె మనసులో మాత్రం తన తల్లికి రహస్యంగా డబ్బులు ఎలా పంపాలా అనే ఆలోచిస్తోంది. ఉత్తరం రాయలేదు. ‘నా నుంచి ఏమీ ఆశించకని, ఆశ పెట్టుకోవద్దనీ’ ఎలా రాయగలదు? అక్కడ ఊళ్లో నమిత రాణీభోగం అనుభవిస్తోందన్నది ప్రతీ ఒక్కరికీ తెలుసు. నమిత భర్త కూడా చాలా మంచివాడు, విశాలహృదయుడు. ఇందుకే, నేను మహిళలను అగ్గిపెట్టెలతో పోల్చేది. దేన్నయినా కాల్చి బూడిద చేయగల శక్తిసామర్థ్యాలున్నప్పటికీ, ఇంతటి మంచి మనసు, విశాలహృదయం వున్నట్టు బయటికి కనిపించే మగాళ్ల ముసుగులను మాత్రం ఏమీ చేయవు. ఎన్నటికీ. ఈ సంగతి మగవాళ్లకీ తెలుసు.అందుకనే వంటింట్లోనూ స్వేచ్ఛగా ఉండనిస్తూంటారు, పెరట్లో, పడకగదిలోనూ. అక్కడా, ఇక్కడా, ఎక్కడయినా సరే. భయం లేకుండా జేబుల్లోనూ పెట్టుకుంటారు. -
మధ్యలో ఎక్కడినుంచి వచ్చింది?
ఒక ఊళ్లో ఒకాయన ఉండేవాడు. ఆయనకు విపరీతమైన కోపం. ప్రతిదానికీ ఇంట్లోవాళ్ల మీదా, బయటివాళ్ల మీదా అరిచేవాడు. ఈ కోపగొండి స్వభావం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. దాన్ని తగ్గించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు ఒక స్నేహితుడి సలహా మీద, ఒక ఊళ్లో ఒక గురువును సంప్రదించడానికి వెళ్లాడు. గురువు శాంతంగా కూర్చునివున్నాడు. చేతులు జోడించి నమస్కరించి, ‘గురూజీ, నన్ను నేను నియంత్రించుకోలేనంత కోపం వస్తుంటుంది నాకు. అది తగ్గడానికి ఏమైనా పరిష్కారం సూచించండి’ అని అడిగాడు. గురువు ఎంతో మృదువుగా, ‘నీ సమస్య విచిత్రంగా ఉన్నదే! ఏదీ, నన్నో సారి చూడనీ’ అన్నాడు. అతడికి అర్థం కాలేదు. అయోమయంగా ముఖం పెట్టి, ‘అంటే నేను దాన్ని ఇప్పుడు మీకు చూపలేను’ అని చెప్పాడు. ‘మరి నాకు ఎప్పుడు చూపగలుగుతావు?’ అడిగాడు గురువు అంతే మెత్తగా. ఆయన ముఖంలో ఏ వ్యంగ్యమూ లేదు. ‘అంటే... అది నాకు అనూహ్యంగా వస్తుంది’ అన్నాడతను. ‘ఊహూ. అట్లా అయితే అది నీ అసలైన స్వభావం కాదన్నమాట’ వివరించే ధోరణిలో చెప్పాడు గురువు. ‘అది నీ అసలైన స్వభావమే అయితే నాకు ఎప్పుడంటే అప్పుడు చూపగలిగేవాడివి. ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడు అది నీ దగ్గర లేదు. దీని గురించి ఆలోచించు’. -
కన్నకొడుకుపై తండ్రి కిరాతకం
-
చిన్నారిపై కన్నతండ్రి కిరాతకం
పాపం, పుణ్యం ఎరుగని పసివాళ్లను చూస్తే ముద్దులాడాలనిపిస్తుంది.. వారి ముద్దు మాటలు విన్నకొద్దీ వినాలనిపిస్తుంది. ఇవన్నీ మరిచిన ఒక తండ్రి.. తన బిడ్డపై అమానుషంగా ప్రవర్తించాడు.. సెల్‌ఫోన్ చార్జర్ వైర్‌తో, బెల్టుతో గొడ్డును బాదినట్టు బాదాడు.. బెడ్రూమ్లో కొడుకును ఎత్తి విసిరిపారేశాడు.. ఫుట్‌బాల్‌ను తన్నినట్టు తన్నాడు. చిన్నారి తల్లి వారించకపోగా భర్తకే వంతపాడింది. ఈ దారుణం బెంగళూరులో జరిగింది. యశవంతపుర (బెంగళూరు): యశవంతపుర నియోజకవర్గం కెంగేరి గ్లోబల్ విలేజ్ సమీపంలో మహేంద్ర అనే వ్యక్తి కుటుంబంతో ఉంటున్నాడు. సమీపంలోని ఓ పాఠశాలలో అతని కొడుకు ఐదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల ఇంట్లో అల్లరి చేశాడని కొడుకును మొబైల్ చార్జర్ వైర్, బెల్టుతో తీవ్రంగా కొట్టాడు. ఇంకోసారి అలా చేయను డాడీ అని చిన్నారి ప్రాధేయపడుతున్నా ఆ బండరాయి మనసు కరగలేదు. బెడ్రూంలో కొడుకును ఎత్తి విసిరేయడం, కాళ్లతో ఫుట్‌బాల్‌ను తన్నినట్టు తన్నడం చేశాడు. పైగా ఇదేదో ఘనకార్యమన్నట్లు తన ఫోన్లో వీడియో తీశాడు. ఇటీవల ఫోన్ చెడిపోగా దాన్ని ఒక మొబైల్‌షాప్‌లో రిపేరుకు ఇచ్చాడు. మెకానిక్ అందులోని వీడియోను చూసి తీవ్ర ఆవేదనకు గురై దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో మహేంద్ర క్రూరత్వం బయటపడింది. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కెంగేరి పోలీసులు సుమోటోగా పోక్సో కేసును నమోదు చేసి మహేంద్రను అరెస్టు చేశారు. కాగా, కొడుకును కొడుతున్న వీడియోను తన భార్యతో తీయించినట్టు పోలీసుల ఎదుట మహేంద్ర ఒప్పుకున్నాడు. ఇంకోసారి అల్లరి చేస్తే ఈ వీడియోను చూపించి కొడుకును భయపెట్టడానికే రికార్డు చేయించినట్టు చెప్పాడు. -
చీటికి మాటికీ కోపం వస్తోందా..?
‘తన కోపమె తన శత్రువు... తన శాంతమె తనకు రక్ష...’ అని సుమతీ శతకకారుడు ఏనాడో చిలక్కు చెప్పినట్లు చెప్పాడు. ప్రతి చిన్న కారణానికీ భగ్గున మండిపడే అపర దుర్వాసులు ఆ నీతిని ఏమాత్రం పట్టించుకోకుండా నిత్యం ఎదుటివారి మీద ధుమధుమ లాడుతూనే ఉంటారు. చీటికి మాటికి చిర్రుబుర్రులాడే కోపాల్రావులు ఇకపై ఇతరులపై కోపించే ముందు కాస్త ఆలోచించి, కోపానికి కళ్లాలు వేయడం మంచిది. ఎందుకంటే, తరచుగా కోప తాపాలకు గురయ్యేవారు త్వరగానే బాల్చీ తన్నేసే ప్రమాదం ఉందని అమెరికన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం 25–40 ఏళ్ల వయసులో ఉన్నవారు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోతే, వాళ్లు మరో 35 ఏళ్లకు మించి బతికే అవకాశాలు ఉండవని అయోవా స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు మెదడు నుంచి ‘అడ్రినలిన్’ విడుదలవుతుంది. ‘అడ్రినలిన్’ విడుదల ఎంత తక్కువగా ఉంటే అంత క్షేమం. చీటికి మాటికి కోపంతో మండిపడే వారిలో తరచుగా అడ్రినలిన్ విడుదలవుతుంది. ఇలా తరచు విడుదలయ్యే అడ్రినలిన్ డీఎన్ఏను దెబ్బతీసి, ‘మల్లిపుల్ స్కెలరోసిస్’ సహా పలు ప్రాణాంతక దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. -
తొందరపాటు... అనర్థదాయకం!
ఆత్మీయం తొందరపాటు, తొందరపడి ఇతరుల మీద ఒక అభిప్రాయానికి రావడం అందరికీ ఉండే అలవాటే. రామాయణ కాలం నుంచి ఉన్నదే. లక్ష్మణుడు కైక మీద కోపంతో ఆమెను నిందిస్తుంటే ‘వివేకం కలవారెవరయినా తమకు ఎవరిమీద అభిమానం ఉంటుందో వారిని ప్రశంసించాలే కాని ఇతరులను నిందించడం ధర్మం కాదు’ అని శ్రీరాముడు లక్ష్మణునికి హితవు చెబుతాడు. అలాగే మేనమామల ఇంటి నుంచి వచ్చిన భరతుడు... రాముడు అరణ్యానికి వెళ్లాడని తెలుసుకుని, పరుగుపరుగున అన్నగారికోసం అడవికి పరివారంతో బయలుదేరాడు. అల్లంత దూరాన్నుంచే వారిని చూసిన లక్ష్మణుడు తమను అడవుల నుంచి కూడా వెళ్లగొట్టడానికే భరతుడు వస్తున్నాడని భ్రమతో విల్లెక్కుపెట్టబోయాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడిని శాంతింపచేసి, భరతుడు వచ్చిన తరవాత వివరాలు అడిగి తెలుసుకున్నాడు. భరతుడు... రాముడిని అయోధ్యకు తీసుకువెళ్లడానికి వచ్చాడనే విషయం తెలుసుకున్న లక్ష్మణుడు తల దించుకున్నాడు. రామరావణ సంగ్రామ సమయంలో విభీషణుడు రాముని శరణుకోరి వచ్చినప్పుడు లక్ష్మణుడు విభీషణుడిని నమ్మవద్దని, ఇక్కడికి కేవలం గూఢచారిగానే వచ్చాడని అంటాడు. కాని విభీషణుడి పలుకులతో లక్ష్మణుడు తప్పు తెలుసుకుంటాడు. తొందరపాటు వద్దనీ, ఇతరులను అనవసరంగా నిందించవద్దనీ హితవు పలుతాడు రాముడు. వీటన్నిటిని బట్టి చూస్తే తొందరపాటు ఎంత అనర్థదాయకమో అర్థం అవుతుంది. -
కోపమూ ఉపకరణమే!
ఆత్మీయం నవరసాలలో కోపం ఒకటి. కోపం లేని మనిషి ఉండడు. రుషులలో కూడా కోపం ఉంటుంది. అందుకు దుర్వాస మహర్షే మంచి ఉదాహరణ. కోపానికి ప్రధాన కారణం ఓరిమి లేకపోవడం, అవతలివారి అవగుణాలు వెతుక్కుంటూ పోవడమే! అయితే అలా వెతికే ముందు ‘‘నేను ఎన్నో తప్పులు చేసాను, కాబట్టి ఇతరుల మీద కోప్పడడానికి నాకేం అధికారం ఉంది ? అసలు నేను ఏ తప్పూ చేయనివాడినా?’’ అన్న ప్రశ్న వేసుకుంటే కోపం రాదు. ఒక్కొక్కసారి కోపం రావడానికి ఏదో పరిస్థితి కారణమవుతుంది. అది మాటామాటా పెరిగి పోయి ఎంతదూరమైనా వెళుతుంది. దానిని అదుపు చేసుకోలేకపోతే చాలా తీవ్ర పరిణామాలు సంభవిస్తాయి. అయితే కోపమే లేకపోతే వ్యవస్థను చక్కబెట్టడం కుదరదు. రేపు మీరు ఒక పెద్ద అధికారి అవుతారు. మీకు కోపమే లేదనుకోండి. వ్యవస్థను చక్కబెట్టడం సాధ్యం కాదు. దాన్ని చక్కదిద్దడానికి ఒక్కోసారి కోపాన్ని నటించాలి. దాన్ని ఒక ఉపకరణంగా, సాధనంగా వాడుకోవాలి. అలాకాకుండా అనవసర సందర్భాల్లో కోప్పడితే అది వినాశనానికి కారణమవుతుంది. ఒక్కోసారి మనం కోపం అవతలి వారి మీద ప్రభావం చూపినా, చూపకపోయినా, ఆ కోపాన్ని ప్రదర్శించిన మన మీద మాత్రం తప్పక ప్రభావం చూపిస్తుంది. అందుకే కోపమంత శత్రువు లోకంలో మరొకటిలేదు. లోపలినుంచి ఉబికి వస్తున్న కోపాన్ని తీసేయడం చేతకాకపోతే దాన్నుంచే ఎన్నో అవగుణాలు పుడతాయి. మానసిక పరమైన ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం వంటివే గాక, బీపీ, యాంగ్జయిటీ వంటి జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కోపం అనే అవలక్షణాన్ని ఓర్పు, సహనం, వివేకం, శాంతం అనే మంచి లక్షణాలతో అదుపులో ఉంచుకోవాలని పెద్దలు చెబుతారు. -
ఆ కోపం... వెన్నెల కిరణం!
అమ్మానాన్నల కోపం అమృతం పొంగులాంటిది. దానిలో అక్కసు, కార్పణ్యం వంటివి ఉండవు. తల్లిదండ్రులు కోపంతో మాట్లాడినప్పుడు అర్థం చేసుకోలేని పిల్లలు ఘాతకులు. అమ్మానాన్నల కోపం వెనుక ఉన్న ఆర్తిని అర్థం చేసుకోవాలి. వారి కోపం వారి స్వార్థ ప్రయోజనాలకోసం కాదు. బిడ్డలు వృద్ధిలోకి రావాలని తప్ప మరో ప్రయోజనం వారికుండదు. అందుకే కోప్పడినా కూడా దానిని ప్రసాదంగా తీసుకోవలసింది ఒక్క అమ్మానాన్నల కోపం విషయంలోనే. అది దిద్దుబాటుకే తప్ప బిడ్డల నాశనం కోరి మాత్రం కాదు. అందుకే అమ్మకు బిడ్డల విషయంలో ఎంత కోపమొచ్చినా, నోటివెంట ఒక్క అపశకునపు, అమంగళకరమైన మాటలు వారి నోటివెంట రానేరావు. బిడ్డల విషయంలో వారి హృదయాలు అంత పవిత్రంగా ఉంటాయి. వారి కోపం అమృతపు చిలకరింతే. లోకంలో ఏతల్లి అయినా, ఏ తండ్రి అయినా బిడ్డల విషయంలో ఒకే ఆర్తితో ఉంటారు, సర్వకాలాల్లో వాళ్ళ క్షేమమే ఆకాంక్షిస్తారు. అటువంటిది ఈ మధ్య వారి కోపాన్ని వక్రీకరించి చూపి ‘‘మేం పెద్ద వాళ్ళమయ్యాం. మీరెవరు మమ్మల్ని కోప్పడ్డానికి’’ అనే పెడసరపు ధోరణిని సాహసంగా చిత్రీకరించి జనంలోకి వదలడం సమాజానికి చాలా ప్రమాద హేతువు. ఎంత వయసొచ్చినా తండ్రి తండ్రే, తల్లి తల్లే. అమ్మ మాటల్లో తప్పుపట్టడానికి, ఆ మాటల్లోని అధికారాన్ని ప్రశ్చించడానికి బిడ్డలకు అర్హత , అధికారం, హక్కు లేనే లేవు. ఆమె అంతటి దైవస్వరూపం కాబట్టే ఉద్ధరణ హేతువుగా ఆమెకు తొలి నమస్కారంచేయించింది వేదం. అటువంటి అమ్మలు ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులే. కాబట్టి తల్లిని సంతోష పెట్టడం, ప్రేమతో, గౌరవంతో పూజించుకోవడం కన్నామించిన దేవతార్చన లేదు. జీవితంలో అభ్యున్నతిని పొందడానికి అంతకన్నా మార్గంలేదు. యశోదా దేవి కోరిక మేరకు ఆమెకు కుమారుడిగా వచ్చిన శ్రీ వేంకటేశ్వరుడు ఎక్కడుంటాడో వకుళమాత కూడా అక్కడే ఉంటుంది. అమ్మ ఎప్పుడూ బిడ్డ దగ్గరే ఉండాలి. అమ్మ మురిసిపోవాలి. ఆ అమ్మ తన చేతి అన్నం తింటాడని వంటశాలలోకి చూస్తూ ఉంటుంది. ఆ అమ్మకు పరబ్రహ్మం అంతటివాడు కట్టుబడిపోయాడు. రాముడు కట్టుబడిపోయాడు. ’కౌసల్యా సుప్రజారామా, పూర్వాసంధ్యా ప్రవర్తతే...’’ అంటే చాలు చటుక్కున లేచి కూర్చుంటున్నాడు. అమ్మ అన్నమాట అంత గొప్పది. మళ్ళీ ఆ అమ్మ వైభవం ప్రకాశించి అమ్మని పరమ పూజనీయంగా చూసుకునే రోజులు రావాలి. వృద్ధాశ్రమాల్లోకి అమ్మలని పంపడమన్నమాటే లేకుండా బిడ్డల దగ్గరే అమ్మలు, అమ్మల దగ్గరే బిడ్డలు ఉండి అందరూ సుఖసంతోషాలతో ఉండాలి. అదే ఆ బిడ్డలకు, ఆ కుటుంబానికి, సమాజానికి కూడా శ్రేయస్కరం. (వచ్చే భాగం నుండి పితృదేవోభవ...) - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కౌలుకు ఇవ్వలేదని.. కాటికి పంపారు
భార్యతో కలిసి తమ్ముడు, మరదలును చంపిన అన్న అనాథలైన పిల్లలు... పోలీసుల అదుపులో నిందితులు తమకు పొలాన్ని కౌలుకు ఇవ్వలేదన్న కోపంతో తమ్ముడిని, మరదలిని అన్న, వదిన కలిసి చంపేశారు.. దీంతో వారి ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.. ఈ సంఘటనతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కేసులో నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మక్తల్ : మండలంలోని రుద్రసముద్రానికి చెందిన చిన్న లింగప్ప (35), నడిపి లింగప్ప సొంత అన్నదమ్ములు. వీరికి శివారులో నాలుగెకరాల చొప్పున పొలం ఉంది. కాగా, పదిరోజుల క్రితం తమ్ముడు తన భూమిని ఇతరులకు కౌలు ఇవ్వటానికి నిర్ణయించుకున్నాడు. దీంతో అన్న తనకు కాకుండా వేరే వారికి ఇవ్వొద్దని మందలించడమేగాక తుదముట్టిస్తానని హెచ్చరించాడు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం భారీగా ఈదురుగాలులు రావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంతా చీకటిమయంగా మారింది. అదే రాత్రి భోజనం చేశాక చిన్న లింగప్ప ఆరుబయట, భార్య మణెమ్మ (30) అలియాస్ పద్మమ్మ, కుమారుడు రాకేష్, కూతురు మహేశ్వరి ఇంట్లోనే నిద్రకు ఉపక్రమించారు. ఇదే అదనుగా భావించిన అన్న నడిపి లింగప్ప, వదిన లక్ష్మి అర్ధరాత్రి దాటాక వచ్చి గొడ్డలితో తమ్ముడు, మరదలిని నరికి చంపేసి పారిపోయారు. కొద్దిసేపటికి మేల్కొన్న చిన్నారులు తమ తల్లిదండ్రులు హత్య కు గురైనట్టు తెలుసుకుని చుట్టుపక్కలవారికి రోదిస్తూ చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో సంఘటన స్థలాన్ని నారాయణపేట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక సీఐ శ్రీనివాస్ పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి జాగిలాన్ని రప్పించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం ఊట్కూర్‌లో నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇక మాకెవరు దిక్కు? అభం, శుభం తెలియని చిన్నారుల దీనస్థితి చూసి గ్రామస్తులు చలించి పోయా రు. ప్రాథమిక పాఠశాలలో రాకేష్ నాలుగో, మహేశ్వరి ఒకటో తరగతి చదువుతోంది. ‘మా అమ్మ, నాన్నలను పెద్దమ్మ, పెద్దనాయనలే చంపేశారు..’ అంటూ చిన్నారులు రోదిస్తూ పోలీసులకు చెప్పడం అక్కడి వారిని కలచివేసింది. ఇక మాకెవరు దిక్కు ఎవరంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఈ సంఘటనతో వారిద్దరూ అనాథలుగా మారా రు. అలాగే సంఘటన స్థలాన్ని డీసీఎంఎస్ చైర్మన్ నిజాంపాషా, జెడ్పీటీసీ సభ్యుడు వాకిటి శ్రీహరి, డీసీసీ ఉపాధ్యక్షుడు అక్కల సత్యనారాయణ తది తరులు పరిశీలించారు. అనంతరం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. -
నా కోపాన్ని అక్కడ కక్కేస్తా!
కోపం వస్తే మీద పడి కరిచినంత పని చేస్తారు కొంతమంది. కొట్టేంత పని చేస్తారు ఇంకొంత మంది. మరి కొంతమంది సెలైంట్‌గా ఉండిపోతారు. మరి.. సమంత ఏం చేస్తారో తెలుసా? జిమ్ చేస్తారు. ‘‘ఔను.. నా కోపాన్ని జిమ్ సెంటర్లో కక్కేస్తా. మామూలుగా నాకు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఎక్కువ. క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేస్తా. కాకపోతే కోపంగా ఉన్నప్పుడు ఎక్కువ చేస్తా. ఆ తర్వాత శాంతిస్తా’’ అని నవ్వుతూ అన్నారు సమంత. తెలుగు, తమిళ భాషల్లో నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారామె. ఆ విషయం గురించి సమంత చెబుతూ - ‘‘ఈ మధ్య నాన్‌స్టాప్‌గా షూటింగ్స్ చేస్తున్నా. అయినప్పటికీ వర్కవుట్స్‌ని దాదాపు మిస్ కాను. ఆడవాళ్లు ఇలాంటి వర్కవుట్సే చేయాలనే నియమం పెట్టుకోను. ఎంత కష్టమైనవాటినైనా చేసి, అమ్మాయిని అయినప్పటికీ స్ట్రాంగే అని నిరూపించుకోవాలన్నది నా ఆశయం’’ అన్నారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ హోదాలో ఉన్నారు కదా.. నంబర్ గేమ్‌ని నమ్ముతారా? అనే ప్రశ్నను సమంత ముందుంచితే - ‘‘నేను నమ్మను. కానీ, నేను చేసే సినిమాల జయాపజయాలను మాత్రం సీరియస్‌గా తీసుకుంటా. సినిమాలో ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకుంటా. నా నటనలో ఏమైనా లోపాలున్నాయేమో అని ఎనలైజ్ చేసుకుంటా’’ అని చెప్పారు. -
కంప్యూటర్ పిచ్చి... వదిలించేదెలా?!
కిడ్స్ మైండ్ సెట్ మా బాబు మూడో తరగతి చదువు తున్నాడు. ఈ మధ్య మేం ఏదైనా కాదన్నా, కోపంతో ఓ మాట అన్నా ఉక్రోషం వచ్చేస్తోంది వాడికి. ఓ మూలకు పోయి నిలబడుతున్నాడు. పైకి ఏడవడం లేదు కానీ దుఃఖపడుతున్నాడని అర్థమవుతోంది. అలాంటప్పుడు మాట్లాడిస్తే నత్తి వచ్చేస్తోంది. ఇంతకుముందు ఇలా వచ్చేది కాదు. ఈ మధ్యనే అలా అవుతోంది. ఎందుకు? ఇదేమైనా మానసిక సమస్యా? - రాజ్యలక్ష్మి, నంద్యాల బాబుకు ఈ మధ్య స్ట్రెస్ ఏమైనా ఎక్కువైందా? ఒకవేళ స్కూల్లో చదువు వల్ల కానీ, ఫ్రెండ్స్ టీజ్ చేయడం వల్ల కానీ తనకు ఏమైనా ఇబ్బందిగా ఉందేమో గమనించండి. వీలైతే తననే బుజ్జగించి అడగండి. చెబితే సరే. లేదంటే ఒత్తిడి చేయకుండా మరో మార్గంలో తెలుసుకోడానికి ట్రై చేయండి. ఏదీ లేకపోతే తనని మార్చడానికి మీరే మెల్లగా ప్రయత్నించాలి. తను చెప్పినట్టే ప్రతిసారీ వినడం ఎందుకు సాధ్యం కాదో వివరించండి. వీలైనంత వరకూ కసురు కోవడం, తిట్టడం లాంటివి చేయకండి. సాధ్యమైనంత నెమ్మదిగానే డీల్ చేయండి. అలా అని బాధపడతాడేమోనని అడిగినవన్నీ ఇచ్చెయ్యకండి. మీ ప్రయత్నాలన్నీ చేసినా బాబు మారకపోతే కౌన్సెలర్‌కు చూపించండి. వాళ్లే చూసుకుంటారు. నత్తికి మాత్రం ఓసారి స్పీచ్ థెరపిస్ట్‌ను సంప్రదించండి. స్ట్రెస్ వల్లే ఇలా వస్తోందా లేక ఇంకేదైనా సమస్య ఉందా అనేది వాళ్లే చెప్పగలరు. మా బాబు పదో తరగతి చదువుతున్నాడు. చిన్నప్పట్నుంచీ చదువులో చాలా చురుకు. ఎక్కువ చదువుతాడు. బాగా నాలెడ్జ్ ఉంది. క్విజ్ ప్రోగ్రాముల్లో కూడా పాల్గొని బోలెడు ప్రయిజులు తెచ్చుకున్నాడు. అందుకే వాడికి పనికి వస్తుందని కంప్యూటర్ కొనిచ్చాం. కానీ ఈమధ్య ఓసారి వాడి గదిలోకి వెళ్లినప్పుడు... వాడు పిచ్చి పిచ్చి వీడియోలు, ఫొటోలు చూడటం కనిపించింది. గమనించనట్టే వచ్చే శాను. ఇలాంటివి చేస్తే వాడి భవిష్యత్తు ఏమవు తుందోనని భయంగా ఉంది. మాకు విషయం తెలిసిందని తెలిస్తే ఎలా రియాక్టవుతాడోనని మరో భయం. ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలి? - పి.స్వర్ణ, హైదరాబాద్ బాబుతో తప్పకుండా ఈ విషయం మాట్లాడండి. ఈ వయసులో ఇటువంటివి జరిగితే మౌనంగా ఉండటం మంచిది కాదు. తప్ప కుండా తనకి తప్పొప్పులు తెలిసేలా చేయాలి. కాబట్టి కూర్చోబెట్టి వివరిం చండి. అవసరమైతే పనిష్మెంట్గా ఒక వారం పది రోజుల పాటు కంప్యూటర్ తీసేసుకోండి. తిరిగి ఇచ్చేటప్పుడు అన్ని రూల్స్ పెట్టి ఇవ్వండి. తప్పితే కంప్యూటర్ పూర్తిగా తీసేసుకుంటానని చెప్పండి. ఇంటర్నెట్ కూడా అవసరం మేరకే ఉండేలా జాగ్రత్తపడండి. ఓ సమయం దాటాక ఇంటర్నెట్ రాకుండా చేసేయండి. కంప్యూటర్లు, ల్యాప్‌టాపుల్లో పేరెంటల్ కంట్రోల్స్ ఉంటాయి. వాటిని యాక్టివేట్ చేయండి. పిల్లలు తప్పు చేసినప్పుడు వాళ్లని కరెక్ట్ చేయడం మన బాధ్యత. కానీ అది వాళ్లలో మార్పు తీసుకు వచ్చేలా ఉండాలి తప్ప అవమానించేలా, సిగ్గు పరిచేలా ఉండకూడదు. కాబట్టి కాస్త కూల్‌గానే డీల్ చేయండి. మా పాప ఆరో తరగతి చదువుతోంది. తెలివితేటల వరకూ ఎటువంటి సమస్యా లేదు. అయితే పాప ప్రవర్తనతోనే కాస్త ఇబ్బంది. ఎందుకో తెలియదు కానీ తనకు స్వార్థం చాలా ఎక్కువ. ఎవరితోనూ ఏదీ షేర్ చేసు కోడానికి ఇష్టపడదు. చివరికి తన తమ్ముడితో కూడా ఇది నీది, ఇది నాది అని వాదిస్తూ ఉంటుంది. ఎవరికీ ఏమీ పెట్టదు, ఇవ్వదు. అలా ఉండకూడదని, అందరితోనూ పంచు కోవడం చాలా గొప్ప లక్షణమని నా భార్య, నేను చాలాసార్లు చెప్పాం. కానీ తన తీరు మారలేదు. ఎందుకిలా చేస్తోంది? చిన్నప్పుడే ఇలా ఉంటే తను మంచి వ్యక్తి ఎలా అవుతుంది? సలహా ఇవ్వండి. - ప్రవీణ్‌రెడ్డి, విజయవాడ చాలామంది పిల్లలు ఈ వయసులో ఇలాంటివి చేస్తారు. కానీ మరీ ఇలా మాత్రం ఉండకూడదు. షేర్ చేసుకోవాలని మీరు ఆల్రెడీ చెప్పారు. కానీ తను అలా చేయడం లేదు. కాబట్టి ఈసారి బలవంతంగానైనా ఆ పని చేయించండి. దగ్గరుండి వాళ్లకీ వీళ్లకీ తనతోనే ఏమైనా ఇప్పించండి. తను ఒప్పుకోకపోయినా, కోపం వచ్చినా వదిలి పెట్టవద్దు. అలాగే, షేర్ చేసుకోవడం వల్ల వచ్చే మంచి ఫలితాలేమిటో కూడా తనకి చెప్పండి. మనం ఇవ్వడం వల్ల ఎదుటివాళ్లు ఎలా సంతోషపడతారు, వాళ్లు కూడా తమకున్న వాటిని ఎలా పంచుతారు, ఎలా దీవిస్తారు వంటివన్నీ తనకు అనుభవమయ్యేలా చేయండి. అప్పుడు తనకే అలవాటవు తుంది. అప్పటికీ మార్పు రాకపోతే మంచి సైకాలజిస్టు సాయం తీసుకోండి. డా॥పద్మ పాల్వాయ్ చైల్డ్ - అడల్ట్ సైకియాట్రిస్ట్, రెయిన్బో హాస్పిటల్, హైదరాబాద్ -
జుకర్ బర్గ్ పై ఇరుగు పొరుగుల ఆగ్రహం..!
ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు... బిలియనీర్ మార్క్ జుకర్ బర్గ్ పై ఇరుగు పొరుగులు విరుచుకు పడుతున్నారు. ఆయన చట్టవిరుద్ధంగా పార్కింగ్ ను వాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతిపెద్ద కార్లను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి, కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బంది కలుగజేస్తున్నారంటూ వారు రాసిన లేఖ ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది. శాన్ ఫ్రాన్సిస్కో లో నివసిస్తున్న ముఫ్ఫై ఏళ్ళ వ్యాపారవేత్త, ప్రపంచ ధనికుల్లో ఒకరైన మార్క్ జుకర్ బర్గ్ ఇప్పుడు స్థానికుల ఆగ్రహానికి గురౌతున్నారు. లిబర్టీ హిల్ కమ్యూనిటీలోని ఆయన ఇంటికి దగ్గరగా నివసిస్తున్న కొందరు.. జుకర్ వాహనాల పార్కింగ్ తీరును తప్పుబడుతున్నారు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది... ఎప్పుడూ దారికి అడ్డంగా, చట్ట విరుద్ధంగా అతి పెద్ద రెండు సిల్వర్ కార్లను నిలిపి అత్యంత సమస్యను తెచ్చి పెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. రాంగ్ పార్కింగ్ తో తెచ్చిపెడుతున్న సమస్యను నగర రవాణా ఏజెన్సీకి, జుకర్ బర్గ్ ఇంటి భద్రతా మేనేజర్ టిప్ వెన్జెల్ కు ఫిర్యాదు చేశారు. అంతేకాక ఆయన లగ్జరీ హోమ్ కు సుదీర్ఘ కాలంపాటు పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టడం కూడ కాలనీవాసులకు తలనొప్పిగా మారిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. జుకర్ బర్గ్ చాలాకాలంపాటు తమ ఇంటి నిర్మాణం కొనసాగించడంతో తీవ్రమైన శబ్దం, చెత్తతోపాటు, వీధుల్లో స్థలాన్ని ఆక్రమించడం స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, ఇప్పటికే పౌరులుగా తాము సాధ్యమైనంత ఓపిక పట్టామని, చివరికి తమకిదో పరీక్షగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వీధిని ఆక్రమిస్తున్న ఆ రెండు ఎస్ యూ వీ (స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్) కార్లను తగిన పార్కింగ్ స్థలంలో ఉంచాలని వారు డిమాండ్ చేశారు. డాలర్స్ పార్క్ కు దగ్గరలోని జిల్లాలో ఆయనకు ఇంతకుముందే రాంగ్ పార్కింగ్ సమస్య వచ్చిందని, ఇప్పుడు అది స్ట్రీట్ పార్కింగ్ కు పాకిందని అంటున్నారు. జుకర్ బర్గ్ చట్ట విరుద్ధంగా పార్కింగ్ ఆక్రమణలకు పాల్పడుతున్నారని, ఇంతకు ముందుకూడ ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సమస్యకు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రోడ్డెక్కిన క్రోధం
రోడ్డు మీద ఇడియట్స్‌కి కొదవలేదు. ఇదొక టైర్ కంపెనీ యాడ్‌లోని వాయిస్ ఓవర్. స్టీరింగ్ ముందున్న కూతురికి, వెనుక సీట్లో కూర్చొని ఉన్న తల్లి... లడ్డూ తినిపిస్తూ బైక్ ఆక్సిడెంట్‌కి కారణం కాబోతుంది. అ సమయంలో వినిపిస్తుంది ఈ మాట... ‘రోడ్లపై ఇడియట్స్‌కి కొదవలేదు’ అని. రోడ్లపై ఇడియట్స్కే కాదు, రోడ్ రేజ్‌కు లోనయ్యేవారికీ కొదవలేదు. నగర జీవితంలో ట్రాఫిక్ జామ్ నిరీక్షణలు, వ్యక్తిగత జీవితంలోని అనేక విధాలైన సమస్యలు రోడ్ రేజ్‌కు కారణం అవుతుంటే, మరోవైపు ప్రవర్తనలలోని అపసవ్యతల వల్ల కూడా రోడ్ రేజ్‌కు గురయ్యేవారి సంఖ్యా పెరిగిపోతోంది! ‘రోడ్ రేజ్’ అనే మాటను మీరు విని ఉండవచ్చు. ఉండకపోవచ్చు. కానీ ‘రోడ్ రేజ్’ ను మాత్రం తప్పకుండా ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. మీరు రోజూ రాకపోకలు సాగించేది మహానగరంలో కనుకైతే రోడ్ రేజ్ మీకొక నిత్య దృశ్యం. రోడ్డు మీద బండి నడుపుతున్నప్పుడు ఏ కారణం వల్లనో అకస్మాత్తుగా ప్రదర్శించే ఆగ్రహమే రోడ్ రేజ్. అది అగ్ని పర్వతం పేలినట్లుగా ఉంటుంది. ఇంగితాన్ని మరచినట్లుగా ఉంటుంది. ఒక్కోసారి సంస్కార హీనంగా, అసభ్యంగా కూడా ఉంటుంది. మీరు సిటీ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు మీ బస్సుకు ఎవరైనా మనిషిగానీ, మరో వాహనంగానీ హఠాత్తుగా అడ్డువచ్చినప్పుడు మీ బస్సు డ్రైవర్ పట్టలేనంత కోపంతో పెద్దగా అరచి, తిట్టడమే రోడ్ రేజ్. మీరున్న ఆటో మీదకు ఏ బస్సో రాబోతుంటే మీ ఆటో డ్రైవర్ తన బండిని తీసుకెళ్లి బస్సుకు అడ్డంగా నిలిపి బస్సు డ్రైవ ర్ను కొట్టబోవడమే రోడ్ రేజ్. మీరు టూ వీలర్‌పై వెళుతున్నప్పుడు ఇంకో వాహనం మిమ్మల్ని చికాకు పెడితే తిక్కరేగి మీరు తిట్లకు లంఘించుకోవడమే రోడ్ రేజ్. రోడ్ రేజ్‌లో ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తారు. చంపేస్తానన్నట్లు మీదికి దూకుతారు. తిట్లతో అవమానిస్తారు. ఇవి కాకుండా కొందరు తమ డ్రైవింగ్‌తోనే... దారంతా అడ్డదిడ్డంగా నడుపుతూ, రాంగ్ రూట్లో వెళుతూ, పరిమితి దాటిన వేగంతో తక్కిన వాహనదారులను, పాదచారులను భయకంపితులను చేస్తుంటారు. రోడ్ రేజ్ ఘర్షణకు, కొట్లాటకు, తగవులకు, వాదులాటలకు, వాగ్యుద్ధానికి, చివరికి పెద్ద ట్రాఫిక్ జామ్‌కు దారి తీస్తుంది. కొన్ని సార్లు భౌతిక దాడులకు, హత్యలకు కూడా కారణం కావచ్చు. రోడ్డు మీద అడ్డదిడ్డంగా బండి నడిపేవాళ్లు ఉన్నప్పటి నుంచీ రోడ్ రేజ్ ఉన్నప్పటికీ, అసలిలాంటి ప్రవర్తనకు ‘రోడ్ రేజ్’ అనే పేరు వచ్చింది మాత్రం సుమారుగా ఓ ముప్పై ఏళ్ల క్రితమే. 1987లో అమెరికా ఈ మాటను కనిపెట్టింది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే కె.టి.ఎల్.ఎ. అనే అమెరికన్ టీవీ చానల్ తొలిసారి రోడ్ రేజ్ అనే మాటకు రూపకల్పన చేసింది. ఎందుకిలా చేస్తారు? ‘రోడ్ రేజ్’ అనేది ఒక విధమైన మానసిక రుగ్మత అని డి.ఎస్.ఎం. (డయాగ్నొస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్) పరిగణిస్తోంది. ఈ విధమైన ప్రవర్తనల్ని ‘ఇంటర్మింటెంట్ ఎక్స్‌ప్లోజివ్ డిజార్డర్’ గా పేర్కొంది. 2001- 03 సంవత్సరాల మధ్యకాలంలో అమెరికాలోని 9,200 మంది వాహనదారులను సర్వే చేసి డి.ఎస్.ఎం. ఈ నిర్థరణకు వచ్చింది. రోడ్ రేజ్ ఇలా కూడా ఉంటుంది అరవడం, తిట్టడం, దురుసుకుగా మీదకు వెళ్లడం... ఇవి మాత్రమే రోడ్ రేజ్ కాదు. కింద ఉదహరించిన ప్రవర్తనలు కూడా రోడ్ రేజ్ కిందికే వస్తాయి. దూకుడుగా డ్రైవ్ చెయ్యడం అకస్మాత్తుగా యాక్సిలేటర్ పెంచడం సడెన్ బ్రేక్ కొట్టడం ముందున్న వాహనాన్ని తాకుతున్నట్లుగా నడపడం (టెయిల్‌గేటింగ్) కట్లు కొట్టడం మరో వాహనానికి దారివ్వకపోవడం ఛేస్ చెయ్యడం గట్టిగా హారన్ కొట్టడం / అలా కొడుతూనే ఉండడం వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగేలా బండి నిలపడం వేలితో అసభ్య సంకేతాలు చూపడం కావాలని ఇతర వాహనాలు డీకొనేలా చెయ్యడం ముందున్న వాహనం బంపర్‌ని తాకించడం. రోడ్ రేజ్‌కు కారణాలు ప్రధానంగా వ్యక్తిగతమైన సమస్యలు, ఇబ్బందులు, బాధించే ఆలోచనలు రోడ్ రేజ్‌కు కారణం అవుతుంటాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సంస్థ నిర్థరించింది. ఇంట్లో కుటుంబ సభ్యులతో, ఆఫీస్‌లో పై అధికారితో సంత్సంబంధాలు లేనివారు, అర్థికపరమైన ఇబ్బందుల్లో కూరుకుని ఉన్నవారు అతి తేలిగ్గా రోడ్ రేజ్‌కు లోనవుతారని ఆ సంస్థలోని అధ్యయనాల అధికార ప్రతినిధి ఫిలిప్ వాంగ్ అంటున్నారు. రోడ్ రేజ్ సెలబ్రిటీలు రోడ్ రేజ్‌ను ప్రదర్శించిన అంతర్జాతీయ ప్రముఖులలో చాలామంది సృజనాత్మక రంగాలలో ఉన్నవారే కావడం ఆసక్తికరమైన విషయం. టాప్-10 రోడ్ రేజ్ సెలబ్రిటీల జాబితా ఇది. మైక్ టైసన్, బాక్సింగ్ క్రీడాకారుడు. మెల్ గిబ్సన్, హాలీవుడ్ నటుడు. గ్యారీ బ్యూసీ, హాలీవుడ్ నటుడు. డ్యానీ బ్యునాడ్యూస్, టీవీ ఆర్టిస్ట్. {Mిస్ బ్రౌన్, రికార్డింగ్ ఆర్టిస్ట్. రస్సెల్ క్రోవ్, హాలీవుడ్ నిర్మాత. చార్లీ షీన్, హాలీవుడ్ నటుడు. నిక్ నోల్టే, హాలీవుడ్ నటుడు. హోవార్డ్ స్టెర్న్, రేడియో ఆర్టిస్ట్. Mిస్టియన్ బాలే. బ్రిటిష్ యాక్టర్. మనవాళ్లు 1. సల్మాన్‌ఖాన్ 2. నవ జోత్ సింగ్ సిద్ధు 3. రామ్ చరణ్ బాడీగార్డులు 4. జాన్ అబ్రహాం 5. వసీమ్ ఆక్రమ్ (రోడ్ రేజ్ బాధితుడు) -
అయ్యో... పాపం!
కోపం మనుషులకు కోపం సహజ గుణం. అయితే కోపం ఎంత మానవ సహజ గుణమైనా, దీనిని అవలక్షణంగానే పరిగణించారు పెద్దలు. ‘తన కోపమె తన శత్రువు... తన శాంతమె తనకు రక్ష...’ అన్నాడు శతకకారుడు. కోపాన్నే సంస్కృతంలో క్రోధం అంటారు. దీనిని అరిషడ్వర్గాలలో ఒకటిగా పరిగణించాయి పురాణాలు. ‘శతకాలు, పురాణాలు ఎన్ని చెబితేనేం..? మా స్వభావం ఇంతే... మేమింతే’ అంటూ నిరంతరం ధుమధుమలాడుతూ కనిపించే అపర దుర్వాసులు లోకంలో తక్కువేమీ కాదు. కోపం ఆరోగ్యానికి హానికరం అంటూ ఆధునిక వైద్యులు కూడా చెబుతున్నారు. కోపం వల్ల రక్తపోటు పెరుగుతుంది. రక్తపోటు పెరిగితే గుండెకు ముప్పు వాటిల్లుతుంది. గుండె గుటుక్కుమన్నాక ఇక సాధించేది ఏముంటుంది? అలాగే కోపంతో కూడా... ‘పాపము శమించు గాక...’ అని అంటారు గానీ, ‘కోపము శమించు గాక’ అనాలి. నిజానికి లోకంలో చాలా పాపాలు అదుపు తప్పిన కోపం వల్లనే అసంకల్పితంగా జరిగిపోతూ ఉంటాయి. అందువల్ల... కోపము శమించు గాక... కోపం గురించి చెప్పుకునేటప్పుడు కొన్ని వాస్తవాలు కూడా తెలుసుకోవాలి. లోకంలోని కోపిష్టులందరూ పాపిష్టులు కాదు. చాలామందికి కోపం ఒక బలహీనత. కొందరిలో అది ఏదైనా ఒక వ్యాధి లక్షణం కూడా కావచ్చు. కొందరి కోపం తాటాకు మంటలాంటిది. ఎగసిపడినంత వేగంగానే చప్పున చల్లారిపోతుంది. ఇలాంటి కోపంతో ఎలాంటి డేంజర్ ఉండదు. ఇంకొందరి కోపం నిద్రాణమైన అగ్నిపర్వతంలాంటిది. లోలోపల సలసల కాగుతూ ఉంటుంది. ఒత్తిడి తారస్థాయికి చేరుకున్న స్థితిలో అది ఒక్కసారిగా పేలుతుంది. ఇలాంటిది కొంచెం డేంజరస్ కోపం. చాలాసార్లు ఎదుటి వారికి ప్రమాదకరం కూడా. ఇలాంటి కోపం వల్లే ఒక్కోసారి హత్యలు, హత్యాయత్నాల వంటి ఘోరనేరాలు జరిగిపోతూ ఉంటాయి. ఇంతటి పెనుకోపం అనర్థదాయకం. దాని నియంత్రణకు సత్వర చర్యలు ఎంతైనా అవసరం. స్వీయ ప్రయత్నంతో కోపాన్ని అదుపు చేసుకోవడం సాధ్యం కాకుంటే మానసిక వైద్యాన్ని ఆశ్రయించక తప్పదు. క్రోధపురాణం... కోపానికి ఎవరూ అతీతులు కాదు. చివరకు మన దేవుళ్లు, పురాణపాత్రలు కూడా. కోపమే విశేషణంగా పేరుపొందిన దేవతలు, దేవుళ్లు మనకు లేకపోలేదు. హిరణ్యకశిపుడిని సంహరించిన ఉగ్రనరసింహుడు, దక్షయజ్ఞాన్ని ధ్వంసంచేసి రుద్రతాండవమాడిన శివుడు, మహిషాసురుడిని సంహరించిన దుర్గమ్మ... ఇందుకు కొన్ని ఉదాహరణలు. ముముక్షువులుగా పేరుపొందిన మహర్షులలోనూ కోపిష్టులు లేకపోలేదు. మహర్షులలో పరమకోపిష్టిగా దుర్వాసుడి పేరు జగద్విదితం. ఆయనకు ఎప్పుడు ఎందుకు కోపం వస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే, ఆయన రాక గురించిన సమాచారం అందితేనే చాలు... దేవతలు, దేవుళ్లు కూడా భయంతో వణికిపోయేవారు. కోపం వస్తే మానవమాత్రులెవరైనా ఎదుటి వారిని చడామడా తిట్టడమో, కాస్త చేయిజోరు ఉంటే కొట్టడమో చేస్తారు. దుర్వాసుడు మహర్షి కదా! కోపం వస్తే తిట్టడమో కొట్టడమో గాక, శపించే వాడు. కోపానికి గురైన వారు తప్పు తెలుసుకుని లెంపలేసుకుని వేడుకుంటే, శాపానికి విరుగుడు కూడా చెప్పేవాడనుకోండి. అయితే, దుర్వాసుడి కోపజనిత శాపాల పర్యవసానంగా లోకకల్యాణమే జరిగేది. అది వేరే విషయం. ఇక శ్రీకృష్ణ పరమాత్ముల వారి అన్నయ్య బలరాముడు కూడా ముక్కోపిగా ప్రసిద్ధుడు. ఆయనగారు ముక్కోపి మాత్రమే కాదు, మదిరోన్మత్తుడు కూడా. తప్పతాగిన బలరాముడికి తనకు దారి ఇవ్వని యమునా నదిపై ఒకసారి కోపం వచ్చింది. అసలే హలాయుధుడు. కోపం ఆపుకోలేక, చేతిలోని హలాయుధానికి పని చెప్పాడు. యమునా నది ప్రవాహ గతినే మార్చి పారేశాడు. లోకంలోని క్షత్రియులను పలుమార్లు తెగటార్చిన పరశురాముడు, ఆదమరచి నిద్రిస్తున్న ఉపపాండవులను, ధృష్టద్యుమ్నుడిని తెగటార్చిన అశ్వత్థామ కూడా పురాణ పురుషుల్లో పరమ కోపిష్టులుగా పేరుమోసిన వారే. కారణాలు కోటాను కోట్లు కోపానికి కారణాలేంటని అడిగితే ఎన్నని చెప్పగలం? కోటాను కోట్ల కారణాలు ఉంటాయి. కొన్ని కారణాలు చిన్న చిన్నవిగానే కనిపిస్తాయి. అలాంటి చిన్నా చితకా చిల్లర కారణాలు కూడా కొందరికి పెనుకోపం తెప్పిస్తాయి. నానా అనర్థాలకు దారితీస్తాయి. కోపం వల్ల వాటిల్లే అతిపెద్ద అనర్థం మనశ్శాంతి లోపించడం. కోప్పడిన వారే కాదు, కోపానికి గురైన వారు కూడా మనశ్శాంతిని కోల్పోతారు. కోపాన్ని అమితంగా ఇష్టపడే కోపిష్టులను ఎవరూ ఇష్టపడరు. కోపంతో అందరినీ భయాందోళనలకు గురిచేయడం ద్వారా క్రమశిక్షణను చెక్కుచెదరకుండా కాపాడగలం అనుకుంటారు కొందరు. అది కేవలం భ్రమ మాత్రమే. క్రమశిక్షణ పేరుతో ఆఫీసుల్లో ధుమధుమలాడే బాస్‌లను చూసి ఉద్యోగులు భయపడితే భయపడవచ్చు గాక... వాళ్లను ఇష్టపడటం మాత్రం కల్ల. అలాంటి బాస్‌లను మనసులో ద్వేషిస్తూనే ఉంటారు. ఈ కోపం వర్సెస్ ద్వేషం ఈక్వేషన్ ఆఫీసులో మొత్తం పని వాతావరణాన్నే దెబ్బతీస్తుంది. ఇంట్లో కోపిష్టి యజమాని ఉంటే, ఇంట్లో ఆయన ఉన్నంతసేపు ఇల్లాలు, పిల్లలు భయంతో బిక్కుబిక్కుమంటూనే ఉంటారు. ఎదుటి వాళ్లు తమను చూసి భయపడుతున్నంత సేపు వాళ్లు తమను గౌరవిస్తున్నారనే భ్రమలో ఉంటారు కొందరు. అలాంటి భ్రమలో ఉన్నవాళ్లే తరచు కోపతాపాలు ప్రదర్శిస్తూ, కోపిష్టులుగా ముద్రపడతారు. కోపిష్టులు మనశ్శాంతిని మాత్రమే కాదు, అయిన వారి ప్రేమాభిమానాలనూ కోల్పోతారు. ఇలాంటి వాళ్లు ‘తన కోపమె తన శత్రువు...’ అనే హితోక్తిని మననం చేసుకుంటూ, కోపాన్ని అదుపు చేసుకునేందుకు ప్రయత్నించాలి. శాంతమే శరణ్యం కోపానికి విరుగుడు శాంతి మాత్రమే. ‘శాంతము లేక సౌఖ్యము లేదు’ అన్నాడు త్యాగరాజు. అందువల్ల చిత్తశాంతి కోరుకునే వారు శాంతమే శరణ్యం అనక తప్పదు. కోపిష్టులు దేశ నాయకులైతే, ప్రపంచంలో యుద్ధాలకు కరువుండదు. అలాంటి కోపిష్టి నేతలను ద్వేషించే జనాభాకూ కరువుండదు. శాంతిదూతలుగా పేరుపొందిన వారి వెంట జనాలు స్వచ్ఛందంగా నడుస్తారు. కోపిష్టుల వెంట కొంతకాలం అనివార్యంగా నడిచినా, అదను దొరికితే వాళ్లను అంతం చేయడానికైనా వెనుకాడరు. అలవిమాలిన కోపం కూడా ఆత్మవిధ్వంసక హేతువు కాగలదు. అందువల్ల ఎంతటి వారైనా కోపానికి శీఘ్రమే స్వస్తి పలకడం క్షేమం. - పన్యాల జగన్నాథ దాసు -
ఆర్టీసీ చార్జిల పెంపు దుర్మార్గం
హైదరాబాద్: ప్రయాణికుడి నడ్డి విరిగేలా ఆర్టీసీ చార్జిలు పెంచిన చంద్రబాబు సర్కార్ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. చార్జిల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకించింది. పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ చర్యను దుర్మార్గంగా పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఎడాపెడా పన్నులతో ఆర్టీసీని దివాలా తీయించిన ఘనత చంద్రబాబుదేనని, ఇప్పుడు మళ్లీ ఒకేసారి 10 శాతం ధరలు పెంచడం దారుణమని వైఎస్సార్ సీపీ విమర్శించింది. ఓ వైపు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు సగానికి తగ్గినా, ఆర్టీసీ చార్జిలు పెంచడం ఏమిటని ప్రశ్నించింది. ప్రైవేట్ రవాణాను అరికట్టి డీజిల్ పై వ్యాట్ ఎత్తివేయాలని, ఒక్కపైసా చార్జీ పెంచకుండా సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించాలని సూచించింది. -
ఎంపీ బాల్క సుమన్ ఆగ్రహావేదన..
-
ఎంపీ బాల్క సుమన్ ఆగ్రహావేదన..
- దళితుడినైనందుకే లెక్కచేయడం లేదా? - కరీంనగర్ జిల్లా అదికారులపై యువ ఎంపీ మండిపాటు కరీంనగర్: 'నేను ఈ జిల్లా ఎంపీనే. పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలోనే ఉంది. అయినా జిల్లాలో జరిగే చాలా కార్యక్రమాల గురించి నాకు సమాచారం ఇవ్వడం లేదు. మొన్న జాబ్‌మేళా జరిగితే పిలవనేలేదు. జిల్లాస్థాయి సమీక్షలకు సరైన సమాచారం లేదు. మొన్న కేంద్ర మంత్రి ఒకరు వచ్చిపోతే చెప్పలేదు. ఈరోజు కూడా మధ్యాహ్నం 2గంటలకు రమ్మని చెప్పి ముందే సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక అభివృద్ధి పనులపై సమాచారమే లేదు. శిలాఫలకాలు పెడుతున్నచోట తాటికాయంత అక్షరాలతో ఇతరుల పేర్లు పెడుతూ, నా పేరును మాత్రం చివరన చేరుస్తున్నారు? అసలు ఎంపీ అనే పదానికి గౌరవం కూడా ఇవ్వరా? పేరు చివరన శర్మ, రావు, రెడ్డి అని తగిలించుకుంటనే పిలిచి గౌరవిస్తారా? నా పేరు పక్కన అవేమీ లేవని పిలవడం లేదా? అసలేట్లా కన్పిస్తున్నాం మీకు... పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ద్వారా నోటీస్ ఇస్తే మీరంతా ఢిల్లీలో నిలబడాల్సి వస్తుంది... ఏమనుకుంటున్నారో... జాగ్రత్త' ఇదీ.. టీఆర్ఎస్ యువ ఎంపీ బాల్క సుమన్ ఆగ్రహావేశం. శుక్రవారం కరీంనగర్ కలెక్టర్ సమావేశ మందిరంలో వివిధ పథకాలపై జరిగిన జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పై విధంగా స్పందించారు. తనను పట్టించుకోవడంలేదంటూ జిల్లా అధికారులపై మండిపడ్డారు. అధికార పార్టీ ఎంపీగా ఉన్న తాను ఇట్లా మాట్లాడాల్సి వస్తున్నందుకు బాధగా ఉందని, అధికారుల తీరుకు నిరసనగా వాకౌట్ చేసి వెళ్దామని వచ్చానని, కానీ మంత్రి ఈటల, ఎంపీ వినోద్‌లను చూశాక ఆ పని చేయలేకపోతున్నానని దగ్ధస్వరంతో అన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, ఎంపీలు బి.వినోద్‌కుమార్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సోమారపు సత్యనారాయణ, బొడిగె శోభ, దాసరి మనోహర్‌రెడ్డి, కలెక్టర్ నీతూప్రసాద్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, అదనపు జేసీ డాక్టర్ నాగేంద్ర తదితరులు హాజరయ్యారు. -
నిద్రా సమయం
షవర్ ఆన్ చేశాక నీళ్లు తల మీద పడుతుంటే దొంగ వెధవ జడ్డి వెధవ ముష్టి వెధవ అని తిట్టుకుంది. పైకి తిట్టుకుందా లోపల తిట్టుకుందా తెలియలేదు. కాని ఆ కోపం ఈ రాత్రికి దిగదు. మొన్నొక రోజు ఒక సబార్డినేట్‌ని పిలిచి చెడామడా తిడితే తిట్టించుకున్నామె బాగానే ఉంది. పక్కన ఉన్న నలుగురూ చేరి పైకి కంప్లయింట్ చెయ్ ఈవిణ్ణి ఇక్కణ్ణుంచి జిల్లాలకు సాగనంపుదాం అని ఎక్కించారు. జిల్లాలకు? అదీ సిటీని వదిలి. ఆ తలనొప్పి నుంచి బయట పడాల్సి వచ్చింది. టైమ్‌కి వచ్చారా లేదా అని మొన్న సర్ప్రైజ్ విజిట్ చేసింది. అదీ కరెక్ట్ కాదట. ఈమెకెందుకు.. పనయ్యిందా లేదా అని చెప్పమనండీ అని నలుగురైదుగురు క్యాంటీన్లో రంకెలు వేశారని తెలిసింది. ఇవాళ ఒకణ్ణి పిలిచి ఫైల్ పుటప్ చేయవయ్యా మగడా అంది. వాడి ఇంగ్లిష్ నిండా తప్పులే. రెడ్డింక్తో రౌండప్ చేసి పంపితే- అవి టైపింగ్ మిస్టేక్స్... ఫైల్ పుటప్ చేయడంలో ఇలాంటి తప్పులు మామూలే... అవి సరి చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని వాడే రివర్స్‌లో కామెంట్ రాసి పంపాడు. ఏమనడానికి ఏముంది? ఇంటికొచ్చి ఇదిగో ఈ పని. లేడీ ఆఫీసరంటే అన్నింటికీ అటెన్షన్. డ్రస్సు సరిగ్గా ఉన్నా అటెన్షన్. లేకపోయినా అటెన్షన్. గట్టిగా మాట్లాడితే అటెన్షన్. మాట్లాడకపోయినా అటెన్షన్. ఆఖరుకు ఆకలికి రెండు మూడు అరలున్న లంచ్‌బాక్స్ తెచ్చుకున్నా అటెన్షన్. మేడం... మేడం.. అందరూ గౌరవం నటించే మగాళ్లే మళ్లీ. కాని ఎంత కిందకు లాగుదామా అని చూట్టంలో ఒక్కడూ తక్కువ కాదు. మమ్మల్నీ వేధిస్తారండీ అంటాడు పక్క సెక్షన్ ఆఫీసరు. కాని అతడు సాయంత్రానికి ఫ్రెండ్స్‌తో చేరి బార్‌కు వెళ్లి హాయిగా బూతులు తిట్టుకొని రెండు గుటకలు పుచ్చుకుని డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరక్కుండా పది లోపలే ఇల్లు చేరి భోం చేసి నిద్ర పోతాడట. తనేం చేయాలి? బూతులు రావు. బార్‌కు వెళ్లలేదు. రాత్రి పదికి వెళ్లి భోం చేసి పడుకుందామంటే ఆ భోజనం అనే మాటను మళ్లీ తయారు చేయాల్సింది తనే. ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది. లోలోపల ఏదో కోపంగా ఉంటుంది. బలవంతంగా నిశ్శబ్దంగా ఉండబుద్ధేస్తోంది. అలాగే ఉంటోంది. మొన్న పెద్దది కనిపెట్టి అంది- నువ్వు చాలా మారిపోయావ్ మమ్మీ అని. ఎనిమిది చదువుతోంది. ఎంత గమనింపో బంగారానికి. ఇంతకు మునుపైతే ఆఫీసు నుంచి రావడమే దానితో చాలా కబుర్లు చెప్పేది. కాలనీ వీధిలోకి తీసుకెళ్లి దీపాల వెలుతురులో షటిల్ ఆడేది. చిన్నాడు సైకిల్ తొక్కుతుంటే సీట్ పట్టుకుని వెనుక పరుగు తీసేది. ఇరుగు పొరుగు వాళ్లతో బోలెడు బోలెడు కబుర్లు చెప్పేది. ఇప్పుడు అవన్నీ మెల్లమెల్లగా గడ్డకట్టి పోయినట్టుగా అనిపిస్తున్నాయి. నిర్లిప్తమైన ముఖం. కోపంతో ముడతలు పడ్డ నుదురు. స్నానం ముగించి నైటీ జార్చుకుని బయటకు వచ్చింది. ఇక వంట. పిల్లలు టీవీ ముందు పుస్తకాలు వేసుకుని కూచుని ఉన్నారు. మామూలుగా అయితే వాళ్లతో కూచుని కబుర్లు చెప్పి... భర్త ఇంటికొస్తే తను పడుతున్న ఇబ్బందులేవో చెప్పుకుని... ఏం చెప్పుకున్నా ఏం ప్రయోజనం? గవర్నమెంట్ వ్యవహారాలు అర్థం కావు. పాడిందే పాడరా అన్నట్టుగా ఉద్యోగం మానేయరాదా అంటాడు. లేదంటే అవన్నీ పట్టించుకోకు అంటాడు. రెండూ సాధ్యం కాదు. చాలాసార్లు ఆ మాటే చెప్పింది. ఏం అని రెట్టిస్తాడు. వివరంగా చెప్పాలా? ఆడవాళ్లు పుట్టిల్లు అనే మాటను తీసేశారు. మంచైనా చెడ్డైనా తమ బతుకేదో తాము బతకాలని నిశ్చయించుకున్నారు. నీకు అనువుగా ఉన్నంత కాలమే నువ్వు భద్రత ఇస్తావు. తేడా వస్తే బ్యాగు సర్ది చేతికిస్తావు. అప్పుడు నా ఉద్యోగమే నాకు దిక్కు. కనుక దానిని నేను వదులుకోను. పైగా ఇది నా చదువుకీ తెలివితేటలకీ సామర్థ్యానికీ వచ్చిన ఉద్యోగం. వదిలేసి నన్ను నేను చిన్నబుచ్చుకోలేను. ఇక పట్టించుకోకపోవడం గురించి. ఒకసారి రెండుసార్లైతే పర్లేదు. అనునిత్యం ముల్లులాగా పదే పదే గుచ్చుతుంటే పట్టించుకోకుండా ఎలా ఉండమంటావ్? అంతటితో వాదన ముగుస్తుంది. ఇది కూడా ఈ మధ్య ఆపేసింది. ఒక్క ఊరడింపు మాట కూడా లేకపోతే ఏం చేసేది? నా గోల నేను పడుతున్నాను... నన్నెవరు బుజ్జగిస్తున్నారు... నాకెవరు జోల పాడుతున్నారు... ఎంత సేపూ నీవైపు నుంచే చూస్తున్నావ్ అంటాడు. ఈ మధ్య గమనిస్తోంది. ప్రతి మనిషీ సాటి మనిషంటే మంటెత్తి పోతున్నాడు. ఇక టీమ్ లీడర్ అంటే ఊరుకుంటారా? ఏమేం పడుతున్నాడో? అవన్నీ పడి అలో లక్ష్మణా అని ఇల్లు చేరితే కాసిని పూలు పెట్టుకుని ఎదురు రాకుండా ముఖం గంటు పెట్టుకుని ఉంటే... అప్పటికీ ట్రై చేస్తోంది. కాని కుదరడం లేదే. బెల్ మోగింది. పిల్లలు నాన్నా.. నాన్నా.. అని పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్ తీశారు. వాళ్లతో ఒకటి రెండు మాటలు... తనకు కళ్లతో పలకరింపు... ముఖం చూడగానే అర్థమైపోయుంటుంది... మాట్లాడకుండా షవర్‌కి వెళ్లిపోయాడు. లోపల ఎవర్ని తిట్టుకుంటున్నాడో. ఆ పూట మునగాకు పప్పు చేసింది. నలభైకి చేరుకున్నాక ఆడవాళ్లకు ఆకుకూరలు తప్పనిసరి అని ఎక్కడో చదివింది. కాదు భర్త చేష్టలు తప్పనిసరి అని స్నేహితురాలు జోక్ చేసింది. అయితే అలా జోక్ చేసే రోజులన్నీ ఎప్పుడో పోయాయి. పిల్లలతో తప్ప ఎదురూ బొదురూ కూచుని నవ్వుకుని ఎన్నాళ్లయ్యిందని. ఒకోరోజు ఈవైపు మూడ్ బాగోదు. లేకుంటే ఆ వైపు మూడ్ బాగోదు. భోజనాల దగ్గర కొంచెం పితలాటకం అయ్యింది. పిల్లలు మునగాకు తినం అని మారాం చేస్తే- నేను వండగలిగింది ఇంతే తింటే తినండి లేకుంటే పోండి అని పెద్దగా గద్దించింది. ఉలిక్కిపడ్డాడు. పిల్లలు కూడా. చివరికి మామిడిపండు కోసి వారికి పెరుగన్నం తినిపించింది. కాసేపు టీవీ టైం. నలుగురూ కూచున్నాక కాస్త మంచి మూడ్ సెట్ చేసే ప్రోగ్రామ్ చూద్దామంటే అన్నీ చావు వార్తలు... దుర్మార్గపు సంఘటనలు. చూసి చూసి లేచింది. పిల్లల్ని పడుకోబెడతాను అని వాళ్లను వాళ్ల గదికి బయల్దేరదీసి అరగంట తర్వాత బయటకు వచ్చింది. నేను నిద్ర పోతున్నాను- ప్రకటించింది. తల ఊపాడు. తొందరగా నిద్ర పోడు. పదకొండు దాకా టీవీ చూస్తాడు. తనకు పొద్దున్నే లేవక తప్పదు. పైగా మరుసటిరోజు ఆఫీస్ పనులను ఒకసారి మననం చేసుకోవాలి. వ్యూహాలతో సిద్ధం కావాలి. లోపలికి వెళ్లి పడుకుంది. సిక్స్ బై సిక్స్ కింగ్ సైజ్ బెడ్ అది. అరవై డెబ్బై వేలు పెట్టి కొన్నారు. అందులో ఏం తక్కువ లేదు. ఇద్దరూ కలిసి ఇంటి నిండా ఖరీదైనవన్నీ నింపారు. బాంటియాలో ఇది డిజైనర్ బెడ్ అంటే సింగిల్ పేమెంట్‌తో ఇంటికి తెచ్చుకున్నారు. మెత్తగా ఉంటుంది. పడుకుంటే చక్కగా నిద్ర పడుతుంది. స్లిప్పర్స్ వదిలి ఒక పక్కకు వాలి దిండుకు చెంపను ఆనించి నిద్ర పోయింది. ఆ తర్వాత ఎప్పుడొచ్చి పడుకున్నాడో పడుకున్నాడు. ఇలా వాళ్ల కాపురం గడిచిపోతూ ఉంది. బంధువుల్లో ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ జరిగినా, కాలనీలో కారు వేసుకుని వెళుతూ వాళ్లు కనిపించినా అందరూ వాళ్లకేమీ అని అంటూ ఉంటారు. అవును. వాళ్లకేమి? మహమ్మద్ ఖదీర్‌బాబు -
తన కోపమే తన శత్రువు
కోపం నిప్పులాంటిది.. దానిని జీర్ణించుకుని వాడుకుంటే... దీపాలను వెలిగించవచ్చు. రాకెట్లను ఎగరేయవచ్చు. ఆకలిని చల్లార్చవచ్చు. కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోలేకపోతే... కొంపలు కాల్చుకోవచ్చు. బంధాలను బూడిదలో పోసుకోవచ్చు. జీవితాలని బుగ్గిపాలు చేసుకోవచ్చు. ఈ బర్నింగ్ ప్రాబ్లమ్‌ని ఎలా డీల్ చేయాలి? రేణుక, రాజ్యలక్ష్మి తోడికోడళ్లు. హైదరాబాద్, చందానగర్‌లో ఇళ్లు పక్కపక్కనే. వీళ్ల మధ్య ఒక రోజు చిన్న విషయమై వివాదం చెలరేగింది. ఆ కోపంతో రాజ్యలక్ష్మి రేణుక కూతురు ఏడాదిన్నర వయసుండే జ్యొత్స్నను ఒక్కసారిగా తీసుకెళ్లి నీటి డ్రమ్ములో పడేసింది. ఆ చిన్నారి ఊపిరాడక చనిపోయింది. ఉప్పల్ సమీపంలోని రామంతాపూర్‌లో అత్త వీరమణి వేణ్నీళ్లు పెట్టమందని గొడవపెట్టుకున్న కోడలు భార్గవి కోపంతో బాత్రూమ్లో కుర్చీలో కూర్చున్న అత్త తలను నల్లాకేసి కొట్టింది. అత్త అక్కడికక్కడే చనిపోయింది. అంబర్‌పేటలో నివాసముండే లండన్ రిటర్న్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూర్యప్రకాష్... కొన్ని నెలలుగా ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాడు. ఈ విషయంలో అత్త, భార్య కలిసి అతణ్ణి హేళనగా మాట్లాడారు. అంతే కోపం తెచ్చుకున్న అతను విసురుగా గదిలోకి వెళ్లి, ఉరేసుకుని చనిపోయాడు. పంజాగుట్ట చౌరాస్తాలో కారు అడ్డం తీయమంటూ హారన్ మోగించాడనే కోపంతో మోటార్‌సైక్లిస్ట్‌ను ఎడా పెడా కొట్టేసిందో కార్పొరేట్ ఉద్యోగిని. ఇప్పటికీ ఆ కేసు విషయమై పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. ఇవేనా! కాలాలకతీతంగా, సంస్కృతులకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా అకారణంగా, అసహనంతో, అనవసర కోపాలు పెరిగిపోతున్నాయి. వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన మహిళల్ని తూలనాడి చిక్కుల్లో పడిన మంత్రి... ఆటోగ్రాఫ్ అడిగిన అభిమాని చెంప పగలగొట్టిన హీరో... రిమోట్ కంట్రోల్ ఇవ్వలేదని అక్కని చంపిన తమ్ముడు... రూ.10 అప్పు తీర్చలేదని రోకలి బండతో మోది హత్య... పండగకి భర్త చీర కొనలేదని నిప్పంటించుకున్న భార్య... ఒకటేమిటి... ఇంతకన్నా సిల్లీ రీజన్స్ కూడా కోపానికి కజిన్స్ అవుతున్నాయి!పెద్ద పెద్దవాళ్లను సైతం చిక్కుల్లో పడేసి, చిన్నవయసు వాళ్లను సైతం చిదిమేసే గుణం కోపం. కచ్చితంగా ఎందుకొస్తుందో చెప్పలేం. సరిగ్గా ఎలా వస్తుందో చెప్పలేం. అది వచ్చాక ఏం చేస్తామో చెప్పలేం... అది వచ్చి పోయిన తర్వాత అదెంత కీడు మిగిల్చి పోయిదో మాత్రం చెప్పగలం. అలాంటి అనూహ్యమైన శతృవుని, అనుక్షణం అంటిపెట్టుకుని ఉండే ‘స్నేహాన్ని’... ఎలా మ్యానేజ్ చేయాలి? ముహూర్తం చూడకుండా ముంచుకొచ్చేయవచ్చు. ముక్కు మీదే కాపురం పెట్టవచ్చు. అదే కోపం అంటే. అపరకుబేరుడికీ, అన్నం దొరకని పేదకీ చుట్టమది. అందరం ఎపుడో ఒకపుడు చవిచూస్తాం. కొందరం మాత్రం దాన్ని అణుచుకోలేక అనూహ్యమైన ఆపదల్లో ఇరుక్కుంటాం. విధినిర్వహణలో కావచ్చు, వ్యక్తిగత సంబంధాల్లో కావచ్చు కంట్రోల్ తప్పితే కాటేసే గుణం కోపానికుంది. దీన్నెలా నియంత్రించాలి? కారణం...సర్వసాధారణం కోపం సర్వసాధారణం. ఆరోగ్యకరమైన, మానవ సహజ భావోద్వేగం. శారీరక, మానసిక మార్పులతో కలిసి వస్తుంది. రక్తపోటుని పెంచి, అంతర్గతంగానూ, బాహ్యంగానూ ఒత్తిడిని పెంచుతుంది. నిర్ధుష్టంగా ఓ వ్యక్తి మీద రావచ్చు, లేదా ఓ పరిస్ధితి వల్ల రావచ్చు. చివరికి మనల్ని వదలక వెంటాడే కొన్ని జ్ఞాపకాలు కూడా కోపానికి కారణం కావచ్చు. మీరనంత వరకు మేలే కోపం అనేది ఓ సహజమైన ప్రతిస్పందన అది మితిమీరినట్లయితేనే శరీరానికీ, మనసుకు హాని చేస్తుంది. అలాగని కోపాన్ని అణచుకున్నా ప్రమాదమేనని, హైపర్‌టెన్షన్, హైబ్లడ్ప్రెషర్, డిప్రెషన్ వంటివి తలెత్తే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతకోపం ఎందుకు? మిగిలినవారితో పోలిస్తే కొంతమందికి అసాధారణ కోపం ఉంటుంది. చాలా సులభంగా ఆగ్రహానికి గురవుతుంటారు. ఈ తరహా తత్వానికి జెనెటిక్, సైకలాజికల్ అంశాలే కారణం. ఈ లక్షణాలను చిన్న వయసునుంచే గుర్తించవచ్చు. కోపిష్టులు అన్ని విషయాలూ తమ కనుకూలంగా జరగాలని కోరుకుంటారు. కోరడం కన్నా డిమాండ్ చేయడం పట్ల మాత్రమే వారికి ఆసక్తి ఎక్కువ.అందరూ కోరుకునేవే వీరూ ఆశిస్తారు. అయితే అవి అందనపుడు ఈ దుర్వాసుల ప్రవర్తన పూర్తి భిన్నంగా మారిపోతుంది. తలెత్తే సమస్యల్ని గుర్తించాలి ఆలోచనా విధానంలో సమూలమైన మార్పుని తెచ్చే శక్తి కోపానికుంది. చాలా సమయాల్లో కోపం మన లోపలి మనిషిని వెల్లడి చేస్తుంది. కోపంలో ఆలోచనాధోరణి అన్ని పరిమితులు దాటేసి నాటకీయంగా మారిపోతుంది. దీని వల్ల తలెత్తే సమస్యల్ని ముందుగా గుర్తిస్తే పరిష్కరించుకోవడం సులభమవుతుంది. వ్యక్త పరచడంలో వ్యత్యాసం ప్రదర్శించడం, అణుచుకోవడం, నిశ్శబ్దమైపోవడం ఇవన్నీ కోప వ్యక్తీక రణలే. ఉద్రేకంగా కాకుండా దృఢంగా కోపాన్ని వ్యక్తపరచడం ఆరోగ్యకరమైన పద్ధతి. ఇతరులను బాధించకుండా ఈ మానవసహజమైన భావోద్వేగాన్ని చూపాలి. ఇలా ఉండడమంటే మనల్ని మనం తగ్గించుకోవడం కాదు. ఎదుటివార్ని గౌరవిస్తూ మన గౌరవాన్ని నిలబె ట్టుకోవడం. కోపం వల్ల కలిగే అలోచనను పుట్టకుండానే చంపేయనక్కర్లేదు. అలా చేయకూడదు కూడా. దాని ప్రభావం వల్ల కలిగే ఉద్రేకపూరితమైన ఆలోచనని కలగనిచ్చి దానితో పాటు స్వీయ వివేకంతో వెంటనే మరో మంచి ఆలోచనకి చోటివ్వడం అవసరం. అలాగే లాజిక్‌గా ఆలోచించే అలవాటు కోపాన్ని ఓడిస్తుంది. విభిన్నరకాలుగా ఆలోచించడం ద్వారా ఆగ్రహం కారణంగా ఉత్పన్నమైన పరిస్ధితులు మరింత జటిలం కాకుండా చేసుకోవచ్చు. ‘నేను కేవలం జీవితంలోని కొన్ని అననుకూలతలను అనుభవిస్తున్నానంతే’ అనే విషయాన్ని ఎపుడూ గుర్తుంచుకుంటే, ఆలోచనాధోరణిలో ఇలాంటి మార్పు చేర్పులు తెచ్చుకుంటే సమయోచిత ప్రవర్తనకు అది దోహదం చేస్తుంది. ‘నాకిదే కావాలి’ అనుకోవడానికి భిన్నంగా ‘ అదుంటే బాగుంటుంది’ అనే ధోరణికి మళ్లాలి. వదిలించుకునే దారి ఉంది ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందనేది నిజమే. అయితే సమస్యకు పరిష్కారం వెదకడం పైన మాత్రమే దృష్టి పెడితే అది ఆలస్యం అయి మరింత కోపానికి గురవ్వడం జరగొచ్చు. పరిష్కారం వెతకడం ముఖ్యమే. అయితే ముందు దానివల్ల ఏర్పడిన పరిస్ధితిని మ్యానేజ్ చేయడం మరింత ముఖ్యం. కోపిష్టి మనస్తత్వం ఉన్న వాళ్లు ఒక్కసారిగా ముగింపులోకి గెంతుతారు. వీరిచ్చే ముగింపులు కొన్నిసార్లు చాలా అనుచితమైనవి అవుతాయి. ఏదైనా వేడి వాదనల్లో ఉన్నపుడు నొటికొచ్చినదేదో అనేయకుండా పర్యవసానాల్ని ముందే అంచనా వేయాలి. ఎదుటి వ్యక్తి చెప్పేదాన్ని ఎంత సావధానంగా, శ్రద్ధగా, నిదానంగా, ప్రశాంతంగా వినగలిగితే అంత చక్కగా అర్ధంచేసుకుని అంతే సబబుగా ప్రతిస్పందించగలుగుతారు. సమాధానం ఇవ్వడానికి సమయం తీసుకోవడంలో తప్పులేకపోగా అది అవసరం కూడా. సో.. లెట్స్ సే గుడ్ బై టు యాంగర్. - ఎస్. సత్యబాబు, సాక్షి లైఫ్‌స్టైల్ ప్రతినిధి నవ్వితే కోపం హుష్‌కాకి సిల్లీగా అన్పించే చాలా విషయాలు అనూహ్యమైన రీతిలో ఆగ్రహావేశాలకు చెక్ చెప్తాయి.ఉదాహరణకు మీరు మీ కొలీగ్‌పై అంతులేని కోపంతో ఉన్నపుడు మీకు బాగా నవ్వు తెప్పించే విషయాన్ని గుర్తు చేసుకోండి. ఎవరిదైనా బల్లమీద తల పెట్టి నిద్రపోయే స్వభావం కావచ్చు, సెల్ఫోన్లో మాట్లాడుతూ గూని వచ్చినట్టు వంగిపోయే భంగిమ కావచ్చు. ఇలాంటివే ఏదో ఒకటి గుర్తు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నిక్‌నేమ్స్ కూడా ఈ కోవలోకే వస్తాయి. చిన్న నవ్వు నవ్వితే బోలెడంత కోపం కూడా ఇట్టే ఎగిరిపోతుంది అనేది తెలిసిందే కదా. దీన్ని మీరు ముందునుంచే ప్రాక్టీస్ చేయండి. కోపం స్పీ.. డ్డ్డ్గా.. వస్తే..!! సుదీర్ఘ శ్వాస తీసుకొని, వదలాలి. ఇలా కనీసం 5-6 సార్లు అయినా చేయాలి. వేగంగా నడవాలి. బ్రిస్క్ వాకింగ్, జాగింగ్ చేయాలి. పది నుంచి ఒకటి వరకు లెక్కపెట్టాలి. ఇలా రెండు మూడు సార్లు చేయవచ్చు. ‘నాదే కరెక్ట్... ఎదుటివారిదే తప్పు’ అనే భావన నుంచి బయటకు రావాలి. కోపానికి - ప్రవర్తనకు మధ్య కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్‌లోనే తమకు తాము సర్దిచెప్పుకోవాలి. కోపం తరచూ వస్తుందా?! సామాజిక బంధాలను పెంచుకోవాలి. అందుకు ఎక్కువమందితో స్నేహాలు చేయడం వల్ల మానసిక పరిణతి పెరుగుతుంది. కోప స్వభావం తగ్గుతుంది. అనవసర వాదన వల్ల కోపం స్థాయి పెరుగుతుంది అనిపిస్తే దాన్నుంచి తప్పుకోవాలి. వారానికి ఒకసారి ఒంటరిగా కాసేపు కూర్చొని ‘ఈ వారంలో ఎన్ని సార్లు కోపం వచ్చింది, ఏయే సందర్భాలలో వచ్చింది?’ అంటూ సమీక్షించుకోవాలి. ఆత్మ పరిశీలన ఎప్పుడూ అనవసర కోపాలను కంట్రోల్లో ఉంచుతుంది. సన్నిహితులతో తమ భావావేశాలను వెలిబుచ్చుకోగలగాలి. - డాక్టర్ చెరుకూరి రమణ, సైకియాట్రిస్ట్ చిన్న చిన్న కోపాలు... రోజూ అదే ట్రాఫిక్. భరించలేని రద్దీ. ఆ రూట్లో ప్రయాణం చెయ్యడం మీకు చాలా చిరాకుగా అన్పిస్తోంది. వెంటనే అంతగా రద్దీ లేని దారిని ఎంచుకోవాలి. మరికొంత దూరం పెరిగినా సరే. అది మీకు మానసికంగా ఇచ్చే లాభంతో పొలిస్తే అది ఏపాటి కోపం పరిధి దాటి వ్యక్తిగత సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టుగా ఉంటే సైకాలజిస్ట్‌లు, మానసిక ఆరోగ్య నిపుణులు సహకరిస్తారు. చాలా కేసులలో 8 - 10 వారాలలో కోప స్వభావాన్ని తగ్గించవచ్చని వారు చెప్తున్నారు. -
శబ్దకాలుష్యంపై హైకోర్టు ఆగ్రహం
ముంబై: నగరంలో నానాటికీ అధికమవుతోన్న శబ్దకాలుష్యాన్ని నివారించేవిషయంలో నిర్లక్ష్య వైఖరి కనబరుస్తున్నారంటూ మహారష్ట్ర ప్రభుత్వంపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శబ్ధకాలుష్య నియంత్రణకు గతంలో తాను ఇచ్చిన ఆదేశాలు అమలు కావడంలేదని అసహనం వ్యక్తం చేసిన జస్టిస్ అభయ్ ఓకా.. ఇందుకు సంబంధిచి బాధ్యులైన అధికారులను గుర్తించి జులై 3లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. -
బీ కంట్రోల్
పొద్దున్నే ప్రశాంతంగా నిద్రలేస్తాం! నిన్నటి చిరాకునంతా మరిచి అద్దంలోకి ముఖం చూసి ఈరోజు బాగుండాలని కోరుకుంటాం. బయటికి రాగానే న్యూస్ పేపర్ ఇంకా రాదు! అబ్బా అని అసహనం మొదలవుతుంది. అయినా ఓపికగా పేపర్ బాయ్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసి.. అతగాడు వచ్చాక.. ఇంత లేటేంటని కసురుకుంటేగానీ ఆత్మారాముడి అసహనం తగ్గదు. కాఫీలో షుగర్ తక్కువైందని ఓసారి.. ఉప్నాలో ఉప్పు ఎక్కువైందని మరోసారి ఇల్లాలిని కసిరి.. రోడ్డు మీదికి వచ్చిపడతాం. రోడ్డెక్కగానే ‘జర దేఖ్కే చలో భాయ్!’ అని ఓ హెచ్చరిక. పక్క వాడి డ్రైవింగ్, మన డ్రైవింగ్ రెండూ మనమే చేస్తుండగా వచ్చిన ఆ హెచ్చరిక చిరాకు తెప్పిస్తుంది. ‘నువ్వే చూసుకుని నడవరా’ అని అనాలనిపిస్తుంది! మన లోపలి మనిషి ‘కంట్రోల్’ అని హెచ్చరిస్తాడు! సిగ్నల్ వరకూ రాగానే అప్పటిదాకా పచ్చగా వెలిగిన లైట్ ఎర్రగా మారి మనవైపు వెక్కిరించినట్టు చూస్తుంది. ముందు వెహికిల్స్ కదలవు! వెనుక నుంచి హారన్స్ మోత. పైన ఎండ, ఒంటిపై చెమట.. చిరాకు రెట్టింపవుతుంది. ముందున్న బైక్ వాడిపై మనసులో గొణుగుతూ.. వెనుకున్న బండి వైపు కోపంగా చూస్తాం. మనది బైక్ అయ్యి.. వెనుకున్నది కార్ అయితే ఆ కోపం ఇంకాస్త ముదురుతుంది. ఆఫీస్‌కు లేటవుతుంటే బాస్ గుర్తొస్తాడు. ఆ టైమ్‌లో ఎవరైనా కదిలిస్తే కస్సుమనాలనిపిస్తుంది. కానీ లోపల ఉన్న బుద్ధిమంతుడు ‘కంట్రోల్ రే’ అంటూ భుజం తడతాడు. ఆఫీస్కొచ్చాక మన పార్కింగ్ ప్లేస్‌లో మరొకరి వెహికిల్ కనిపిస్తుంది.. క్షణాల్లో నియంత్రణ కోల్పోతాం. నోటికొచ్చినట్టు తిట్టాలనిపిస్తుంది! ఎంతైనా సావాసగాడని గుర్తొచ్చి మరోసారి కంట్రోల్ అనుకుంటాం! సాయంత్రం ఇంటికెళ్లేముందు టార్గెట్ పూర్తవలేదని బాస్ చివాట్లు పెడతాడు! చెడామడా నాలుగు మాటలు అనేయాలనిపిస్తుంది. ప్చ్.. భక్తితో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవమేదో ‘కంట్రోల్... కంట్రోల్’ అని హెచ్చరిస్తుంది! మళ్లీ ట్రాఫిక్‌లో చచ్చీ చెడీ.. ఇంటికి చేరుకున్నాక.. ‘ఇది నిండుకుంది’ అని గృహమంత్రి, ‘నాన్నా నేను చెప్పిన బుక్ తెచ్చావా..?’ అని కూతురో, కొడుకో అడగ్గానే.. పొద్దంతా లోపల రగిలిన లావా బయటికి తన్నుకొస్తుంది! ఇంట్లోవాళ్ల మీద ఇంతెత్తున లేస్తాం! సదరు గొడవలన్నీ రోజూ ఉండేవే.. ఇలా చిన్న చిన్న విషయాలకు చిరాకు పెంచుకుంటూ సహనాన్ని కోల్పోతే.. మానసిక ప్రశాంతత దూరమై బీపీ, షుగర్స్ దరి చేరుతాయే తప్ప మరే ప్రయోజనం ఉండదు. ఈ సహనోపాఖ్యానం ఎందుకంటే ఈ రోజు ‘వరల్డ్ ఐయామ్ ఇన్ కంట్రోల్ డే!’ కాబట్టి... ‘బి ఇన్ కంట్రోల్ ఎవ్రీ డే’ అండ్ సే ‘ఐయామ్ ఇన్ కంట్రోల్’! ..:: కట్ట కవిత -
అన్నదాతతో ఆడుకున్నారు...
జమ్మికుంట : జమ్మికుంట పత్తి మార్కెట్లో అధికారులు అన్నదాతతో ఆడుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పత్తిని అమ్ముకునేందుకు మార్కెట్ కొస్తే గాలికి వదిలేస్తున్నారు. సకాలంలోని ఇంటికెళ్లాల్సిన వారిని మార్కెట్లోనే జాగారం చేయూల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నారు. పొదం్దతా కొనుగోళ్ల కోసం ఎదురుచూసినా పత్తిబస్తాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో రైతుల కోపం కట్టలు తెంచుకుంది. దీంతో మార్కెట్‌ను ముట్టడించి లోనికి చొచ్చుకెళ్లడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు గొడవ జరగకుండా అడ్డుకున్నారు. జమ్మికుంట మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి రైతులు సోమవారం నాలుగువేల బస్తాల్లో పత్తిని అమ్మకానికి తీసుకొచ్చారు. మూడువేల క్వింటాళ్ల లూజ్ పత్తి వచ్చింది. సీసీఐ అధికారులు మొదట లూజ్ పత్తిని కొనుగోలు చేశారు. ఎడ్లబండి కార్మికుల ఆందోళన మూడుగంటల అనంతరం సమస్య సద్దుమణిగింది. అయితే రైతులు తీసుకొచ్చిన పత్తి బస్తాలను కొనుగోలు చేసేందుకు అటు సీసీఐ అధికారులు, ఇటు వ్యాపారులు ముందుకురాలేదు. పొద్దంతా ఎదురుచూసిన రైతులు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ఆగ్రహంతో మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో కార్యాలయంలో ఉన్న ఇన్చార్జి కార్యదర్శి అశోక్, సీసీఐ అధికారులు, అడ్తిదారులు బయటకు వచ్చి సీసీఐ పత్తిని కొనుగోళ్లు చేస్తుందని నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. ‘మాతో ఆడుకుంటున్నారా... పొద్దుగాల వస్తే ఇప్పటి వరకు ధరలు, కొనుగోళ్లు ఉండవా..’ అంటూ రైతులు ప్రశ్నించారు. రైతులు లోనికి ప్రవేశించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావారణం ఏర్పడింది. కరీంనగర్‌కు చెందిన ఏఆర్ పోలీసులు కార్యాలయానికి చేరుకుని రైతులను నిలువరించారు. తిండి ఠికానా లేకుండా యార్డులో ఎప్పటి వరకు ఉండాలంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మద్దతు ధరలతో ప్రతీ రైతు సరుకును కొంటామని సీసీఐ అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.అయితే అప్పటికే చీక టి పడడం, కార్మికులు వెళ్లిపోవడంతో రాత్రంతా రైతులు మార్కెట్లో జాగారం చేయూల్సి వచ్చింది. -
కోపమొస్తే.. కీబోర్డుపైనే..
ఆఫీసులో బాస్ తిట్టాడు.. కోపమొచ్చింది.. చాలా మంది దాన్ని కీబోర్డుపై ప్రదర్శిస్తారు.. కొందరు అదేమైనా అయితే.. మళ్లీ మనకే బాధ అని కోపాన్ని దిగమింగేస్తారు. అలాంటోళ్ల కోసమే జర్మనీకి చెందిన బ్లెస్ అనే సంస్థ ఈ వర్కవుట్ కంప్యూటర్ను తెచ్చింది. ఇందులో వివిధ కీల స్థానంలో పంచ్బ్యాగులుంటా యి. కోపమొస్తే.. వాటిని ఎడాపెడా బాదేయడమే.. కోపం తీర్చుకోవడంతోపాటు అదే సమయంలో మీ పని కూడా చేసుకోవచ్చు. పంచ్బ్యాగుల్లో ఉండే సెన్సర్లు మీరే కీ ఉన్న పంచ్బ్యాగును కొడితే.. అది స్క్రీన్‌పై ప్రదర్శితమయ్యేలా చేస్తాయి. అంటే.. డియర్ సార్ అని కొట్టాలంటే.. దానికి సంబంధించిన అక్షరాలు ఉన్న పంచ్బ్యాగులపై కొడితే.. అది స్క్రీన్‌పై ప్రింట్ అవుతుంది. ఇది ఒక్క కోపాన్ని తీర్చుకోవడానికే కాదు.. ఈ బిజీబిజీ జీవితంలో వర్కవుట్ చేయడం సాధ్యం కాని వారికి చక్కని కసరత్తునూ అందిస్తుంది. ఇటు వర్కవుట్ చేసుకోవచ్చు.. అటు ఆఫీసు పనీ పూర్తయిపోతుంది. -
వెంకయ్యనాయుడుకు కోపమొచ్చింది!
న్యూఢిల్లీ: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడికి కోపమొచ్చింది. లోక్‌సభలో కాంగ్రెస్‌నేత మల్లిఖార్జున్ ఖర్గే వ్యాఖ్యలపై సోమవారం వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రంటైసెస్ సవరణ బిల్లును స్థాయీసంఘానికి పంపించాలని డిమాండ్ చేస్తున్న సందర్భంలో ఖర్గే.. ‘ఇలా ప్రతీ విషయంలో మొండిగా ముందుకెళ్తుంటే(బుల్డోజింగ్) ఇక పార్లమెంటు అవసరమే ఉండదు’ అని వ్యాఖ్యానించారు. వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘మీరు పదేపదే ఆ పదాలు(బుల్డోజింగ్) వాడుతున్నారు. అలాంటి పదాలు ఉపయోగించడం మంచిది కాదు.’అన్నారు -
ద్వేషం మనసుని బలహీనం చేస్తుంది
ధ్యాన భావనలు మనసు నిండా ద్వేషం నింపుకున్న వ్యక్తి ఎన్నటికీ విశ్రాంతిగా గానీ, ప్రశాంతంగా గానీ ఉండలేడు. మనలో ద్వేష భావం ఉన్నదంటే, ఎవరో చేస్తున్న తప్పుకు మనం శిక్ష అనుభవిస్తున్నామని! ఎవరైనా ఒక వ్యక్తి గానీ, ఏదైనా ఒక వస్తువు గానీ మనకు అశాంతిని కలుగజేస్తే, ముందు మనకు కలిగేది చిరాకు లేదా కోపం. ఈ చిరాకు, కోపం నిముషంలోనే ద్వేషంగా మారుతుంది. అయితే ఆ చిరాకు లేదా కోపం కాసేపే ఉంటుంది కానీ, వాటి నుంచి పుట్టిన ద్వేషం మాత్రం శాశ్వతంగా తిష్టవేసుకుని కూర్చుంటుంది మనసులో. అలా ఎందరి మీదో, ఎన్ని వస్తువుల మీదో, ఎన్ని పరిస్థితుల మీదో మనం ద్వేషం పెంచుకుంటూ పోతే మన మనసు పూర్తిగా దెబ్బతింటుంది. ఇక ఎన్నటికీ దాని ఆరోగ్యం బాగుండదు. అంటే మానసిక అనారోగ్యం ఏర్పడుతుంది. అందువల్ల సాధకులుగా మనం ద్వేషాన్ని చిన్న సమస్యగా తీసి పారేయకూడదు. అది ఒక తీవ్రమైన, శాశ్వతమైన సమస్య. దాన్ని ప్రత్యేకంగా ఒక పట్టుపట్టాలి. అది కూడా చాలాకాలం పాటు. లేకపోతే ద్వేషం ఎన్నటికీ పోదు. ఏదో ఆషామాషీగా తీసిపారేయకూడదు. అతి ముఖ్యమైన అంశంగా చేసుకోవాలి. అసలు ద్వేషం ఎందుకు కలుగుతుంది? నాకు అశాంతి కానీ, అవస్థ గానీ కలిగితే తట్టుకోలేను కాబట్టి. అంటే మనసు బలహీనంగా ఉన్నట్టన్నమాట. బలహీనమైన మనసు ప్రతి చిన్నదానికీ రుసరుసలాడుతుంది. ద్వేషాన్ని పెంచుతుంది. ఈ ద్వేషాన్ని దరిచేరనీయకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం మనసును దృఢపరచుకోవడం. శరీరానికి దెబ్బ తగిలితే ఏం చేస్తాం? చికిత్స చేస్తాం. అది బాధాకరంగా ఉండొచ్చు. అంతమాత్రాన శరీరాన్ని ద్వేషించము. అలాగే కొంతమందితో కఠినంగా వ్యవహరించాల్సి రావచ్చు. అందరినీ ఒకేలాగ చూడలేకపోవచ్చు. కానీ వాళ్ల మీద ద్వేషం పెంచుకోకుండా జాగ్రత్త పడాలి నేను. అంతేకాదు, వాళ్లు బాగుండాలని కోరుకోవాలి. వాళ్ల ఉన్నతి కోసం, పరిణతి కోసం దేవుని ప్రార్థించాలి. నా మనసు దృఢంగా ఉంటేనే అది సాధ్యమౌతుంది. ప్రార్థన ద్వారా, నాకు నేను సూచనలు ఇచ్చుకోవడం ద్వారా నేను నా మనసుని దృఢపరచుకోగలను. ప్రతి ప్రార్థన ముగిశాక నేను మరింత దృఢం అయినట్లు భావిస్తాను. నేను మరింత దృఢంగా ఉన్నానని నాకు నేను చెప్పుకుంటాను. దేవుని కృప వల్ల, నేను మానసికంగా దృఢంగా ఉన్నాను. ప్రపంచంలో ఎవరినీ ద్వేషించను. కేవలం నాకు హాని చేయడమే తన జీవిత ధ్యేయంగా భావించే, నా అత్యంత భయంకరమైన శత్రువుని సైతం ద్వేషించను. ఆ శత్రువు పరిణతి చెందనందుకు అతని మీద జాలి పడతాను. అతని ఉన్నతి కోసం కూడా దేవుని ప్రార్థిస్తాను. అతని వల్ల నేను అవస్థ పడినప్పటికీ నేను అతన్ని ద్వేషించాలనేం లేదు. అతన్ని నేను ప్రేమించలేకపోవచ్చు. అలా ప్రేమించగలగడానికి మరింత శక్తి కావాలి కానీ, ముందుగా ద్వేషాన్నయితే మనసులోకి రానీయకూడదు. ఎప్పుడైతే మనసులో ద్వేషానికి చోటులేదో, అప్పుడు ప్రేమించడానికి అవకాశాలు మెరుగవుతాయి. - స్వామి పరమార్థానంద (తెలుగు: మద్దూరి రాజ్యశ్రీ) -
అడగక ఇచ్చిన వరం
దైవికం దేవుడిని వరంఇమ్మని అడక్కుండానే ఆయన ఇచ్చిన వరమే చెట్లు. అలాంటి చెట్లను మనం నరికేస్తున్నాం! ‘‘ఆవులకు మేత లేదు. వెళ్లి గడ్డి కోసుకురా’’ అని భక్త కబీరు తన కొడుకును ఊరి చివరున్న పొలాలకు పంపించాడు. కానీ ఎంతసేపైనా కొడుకు రాలేదు. సాయంత్రం అవుతోంది. అయినా రాలేదు. సహనం కోల్పోయిన కబీరు కొడుకు ఎక్కడున్నాడో చూద్దామని బయలుదేరాడు. తనయుడు నిగనిగలాడుతున్న పచ్చికబయలుపై తదేకంగా నిల్చుని కనిపించాడు! పిల్లగాలులు వీస్తున్నాయి. పచ్చిగడ్డి గాలిని ఆస్వాదిస్తూ అటూ ఇటూ రమ్యంగా ఊగుతున్నాయి. ఆ సన్నివేశాన్ని చూసిన కబీరు కుమారుడు పచ్చిక ఆనందంతో మమేకమైపోయాడు. ఆనందంలో మునిగితేలుతున్నాడు. తన తండ్రి వచ్చిన విషయాన్ని కూడా అతను గమనించలేదు. దాంతో క బీరుకు కోపం వచ్చింది. ‘‘నీకేమైనా పిచ్చా? నేనేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు?’’ అని గట్టిగా కోప్పడ్డాడు. ‘‘నేనిక్కడికి వచ్చేసరికి ఈ పచ్చగడ్డి... గాలి స్పర్శకు పరవశించిపోయి ఆనందంతో నృత్యం చేస్తుండటం చూస్తూ నన్ను నేను మరచిపోయాను. నా మనసెంతో ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మరచిపోయాను. ఇప్పుడు చెప్పండి నాన్నగారూ, నన్ను ఇక్కడికి ఎందుకు పంపారు?’’ అని నిదానంగా అడిగాడు కుమారుడు. దాంతో కబీరు కోపం రెట్టింపైంది. ‘‘నిన్ను ఇక్కడికి గడ్డి కోసుకు రమ్మని పంపాను’’ అన్నాడు. ‘‘మన్నించండి నాన్నగారూ... నేను ఎంతో సంతోషంగా నృత్యం చేస్తున్నట్లున్న ఈ పచ్చగడ్డిని నేను నా చేతులతో నరకలేను. మీరు నన్ను ఎంత తిట్టినా ఈ విషయంలో మాత్రం నేను ఏమీ చెయ్యలేను. నేనిప్పటి వరకు ఓ ఆనంద జగత్తులో ఉన్నాను. అది కాస్తా మీ రాకతో చెదరిపోయింది. ఆ ప్రపంచాన్ని మాటల్లో వర్ణించలేను. ఆ సౌందర్య సన్నివేశం ఎవరికి వారు చూసి తరించాల్సిందే. ఒకరు చెప్తే పొందేది కాదు’’ అన్నాడు కబీరు పుత్రుడు. కబీరు అతని మాటలు విని నిశ్చేష్టుడయ్యాడు. అప్పుడే ఆ క్షణంలోనే తన కుమారుడికి కమాల్ అని పేరు పెట్టాడు. అందరూ అతనిని ఆ క్ష ణం నుంచి కమాల్ అని పిలవడం మొదలుపెట్టారు. తన కొడుకు పచ్చికతో ఓ గాఢమైన బంధాన్ని ఊహించుకుని చెప్పడం కబీర్‌కు ఆనందమేసింది. తన సుపుత్రుడిలో ఒక గొప్ప వ్యక్తిని చూశాడు. నిజమాలోచిస్తే మనిషికీ, పచ్చగడ్డికీ అనుబంధముంది. పరిణామక్రమంలో తొలుత పచ్చికై, పురుగై, చెట్టై, పక్షై, జంతువై ఆ తర్వాత రకరకాల వాటి తర్వాత మనం పుట్టాం. ఈ పరిణామక్రమాన్ని మనం మరిస్తే మరచిపోవచ్చు కానీ చెట్లనూ, మనుషులనూ ఒకే దేవుడు సృష్టించాడన్న విషయాన్ని మరచిపోకూడదు. కనుక చెట్లకూ, మనుషులకూ మధ్య విడదీయరాని బంధముంది. దేవుడు మనకన్నా ముందు చెట్లను పుట్టించాడు. ఆ తర్వాత మనిషి పుట్టాడు. అంటే చెట్లు మనకన్నా పూర్వం నుంచే ఉన్నాయి. కానీ మనుషులు ఈ సంగతి మరచిపోతున్నారు. కమాల్‌కు పచ్చగడ్డితో అనుబంధం యాదృచ్ఛికంగా వచ్చిన గొప్ప జ్ఞాపకం. అది అద్భుత విషయం. చెట్లతో మనకున్న బంధాన్ని తెలుసుకోవడం జ్ఞానానికి సంకేతం. కనుక చెట్లను నరికే వ్యక్తి తన బంధాన్ని తానే తెంచుకుంటున్నాడని అర్థం. ఆదివాసీలను మనం చిన్న చూపు చూశాం. కానీ వాళ్లే మనకన్నా జ్ఞానవంతులు. వాళ్లు చెట్లను ప్రాణప్రదంగా చూసుకున్నారు. ఆస్ట్రేలియాలోని ఆదివాసీలు చెట్లను నరకరు, అవి చనిపోయిన తర్వాతే వాటిని ఉపయోగిస్తారు. నాగరికులమని తలచే మనం చెట్లను నరుకుతున్నాం. కనుక ఎవరు ఆటవికులో తెలుసుకోవాలి. చెట్ల కొమ్మలు మేఘాలను చూసి మనిషి కోసం వర్షాన్ని యాచిస్తాయి. అలాంటి చెట్లను మనం నరికేస్తుంటాం. చెట్లు శిశుప్రాయంలో ఉయ్యాలలవుతున్నాయి. నడిచే ప్రాయంలో వాహనాలవుతున్నాయి. విశ్రమించేటప్పుడు మంచాలవుతున్నాయి. వృద్ధాప్యమొచ్చినప్పుడు చేతికర్రలవుతున్నాయి. ఇలా చేదోడువాదోడుగా ఉన్న చెట్లను స్వార్థానికి నరకడం ఎంత వరకు సబబో ఆలోచించాలి. దేవుణ్ణి వరమివ్వు అని అడక్కుండానే ఆయనిచ్చే వరమే చెట్లు. అలాంటి వరాన్ని నాశనం చేసే మనిషి నాగరికుడా? చెట్లను నరికే మనిషి నిజానికి వాటిని హత్య చేయడం లేదు. ఆత్మహత్య చేసుకుంటున్నాడని అర్థం. ఎందుకంటే చెట్లు నశిస్తే మనిషి మనుగడా క్రమేపీ క్షీణిస్తుంది. - అంబడిపూడి శర్వాణి -
కోపాన్ని నియంత్రించుకుంటే మనల్ని ఎవరూ గెలవలేరు
ధ్యాన భావన మనలో చాలామంది ఎదుర్కొనే ఒక తీవ్రమైన సమస్య... కోపం. జీవితంలో బాహ్యమైన సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. అవన్నీ చాలావరకు తాత్కాలికమైనవే. కానీ కోపం అన్నది అంతర్గతమైన సమస్య. అది ఎప్పుడూ మనతోనే ఉంటుంది. మన చివరి క్షణం వరకు. కోపం ఒక తీవ్రమైన సమస్య. ఎందుకంటే దాని వల్ల ఎన్నో దుష్ఫలితాలు కలిగే ప్రమాదం ఉంది. ఇటు కోపగించుకున్న వ్యక్తికీ బాధ కలుగుతుంది. అటు కోపానికి గురైన వ్యక్తికీ బాధ కలుగుతుంది. ఆ బాధ చేత్తో తీసేస్తే పోయేది కాదు. చాలాకాలం తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అది మనల్ని చలనం లేకుండా చేయడంతో ఎక్కువ సేపు పని చేయలేకపోతాము. కోపం వల్ల ద్వేషం కలుగుతుంది. ద్వేషం కారణంగా చక్కటి అనుబంధాలు కూడా వీగిపోతాయి. ఈ అనుబంధాలు, స్నేహ సంబంధాలు ఎన్నో ఏళ్ల సాంగత్యం వల్ల బలపడేవి. అలాంటివి, కొన్ని క్షణాల కోపంతో చిటికెలో మాయమైపోతాయి. ఒకసారి అనుబంధం వీగిపోతే, మళ్లీ దాన్ని భర్తీ చేసుకోవడం అసాధ్యం. కోపంలో ఎంత మాట పడితే అంతమాట అనేస్తాం. ముందూ వెనుకా ఆలోచించం. తర్వాత, అలా అనకుండా ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సింది అనుకుంటూ బాధపడిపోతుంటాం. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం? అదీకాక, కోపం ఉన్నచోటుకు ప్రశాంతత రాలేదు. ప్రశాంతత లేని చోట ఆధ్యాత్మిక ఎదుగుదల కుంటుపడుతుంది. స్పష్టంగా చెప్పాలంటే కోపం మనలో దూరే ఒక శక్తిమంతమైన శత్రువు. కోపం వచ్చిందంటే అర్థం, మన మనసు బలహీనపడిందని! క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం మనకు లేదని చెప్పకనే చెప్పినట్లు. అంటే కోపం ఒక వ్యాధి లక్షణం. మనసు బలహీనంగా ఉందని సూచించే లక్షణం. క్లిష్టమైన పరిస్థితులను మనసు ఎదుర్కోలేదని చెప్పే లక్షణం. అందుకని నేను కోపాన్ని అధిగమించాలంటే ముందుగా నాలోని ఈ బలహీనతలను అంగీకరించాలి. నాకు శక్తి లేదని ఒప్పుకోవాలి. కానీ, దురదృష్టవశాత్తూ నేను నా కోపాన్ని సమర్థించుకుంటూ వస్తున్నాను. ఎలా? ఎదుటివాళ్లను తప్పుపట్టడం ద్వారా. అంటే వాళ్ల ప్రవర్తనని, వాళ్ల మాటలని నిందించడం ద్వారా. ఎప్పుడైతే నా బలహీనతను నేను సమర్థించుకుంటానో, అప్పుడే నన్ను నేను మెరుగు పరుచుకోడానికి వీలు లేకుండా తలపులు మూసేస్తున్నాను. నా బలహీనత నుంచి నేను బయటికి వచ్చే మార్గాన్ని కోల్పోతున్నాను. అదే నేను నా బలహీనతను ఒప్పుకుంటే గనుక, ఒప్పుకునేంత సంకల్పశక్తి నాకు ఉంటే గనుక... నాకు నేను సలహా ఇచ్చుకోవడం ద్వారా నా మనసును నేను క్రమేపీ దృఢపరచుకోగలను. అలా నన్ను నేనే ఒక దృఢమైన వ్యక్తిగా, ఎటువంటి పరిస్థితి వచ్చినా కలత చెందకుండా ఉండే వ్యక్తిగా ఊహించుకుంటాను. నన్ను నేనే ఒక క్షమాగుణం ఉన్న వ్యక్తిగా భావించుకుంటాను. కోపానికి మందు క్షమ. అది చూపించి నన్ను నేను శాంతమూర్తిగా మార్చుకుంటాను. నేను దృఢంగా ఉన్నాననీ, ఎట్టి పరిస్థితుల్లోనూ చికాకు పడననీ, ఎవరూ నన్ను రెచ్చగొట్టలేరని; ఎదుటివారి ప్రవర్తన మీద నాకు అధికారం లేని మాట నిజమే కానీ, నన్ను నేను మాత్రం ప్రశాంతంగానే ఉంచుకుంటాననీ గట్టిగా నిర్ణయించుకుంటాను. - స్వామి పరమార్థానంద (తెలుగు: మద్దూరి రాజ్యశ్రీ) -
మగ కోపమే మగకు శత్రువు!
అత్తమీద కోపం దుత్త మీద చూపితే నష్టం. బయటి విషయాలపై కోపం ఇంట్లో చూపితే నష్టం, కష్టం రెండూ కలుగుతాయి. అదేమీ పట్టించుకోకుండా మగాళ్లలో చాలామంది ఉత్తిపుణ్యానికే తెగ కోపం చూపుతుంటారు. కానీ, ఇప్పుడు తన కోపమే తనకు శత్రువన్న సుభాషితాన్ని మగాళ్లందరూ ‘మన కోపమే మనకు శత్రువ’ని అర్థం చేసుకోవాల్సిన రోజులు వచ్చేశాయి. మేము చేయాల్సిందంతా చేసినా అసలు మగాడి కోపాన్ని ఎందుకు భరించాలన్న ఆలోచన స్త్రీలలో కలుగుతోంది. ుగాళ్ళలో చాలామందికి కోపమెందుకు ఎక్కవనే విషయాన్ని లోతుగా పరిశీలిస్తే స్థూలంగా బయట పడిన కారణాలివీ. 1. పెంపకం నుంచే... ఓ ఇంట్లో అన్నా-చెల్లెలి మధ్య ఓ చిన్న గొడవ జరిగితే ‘అన్న ఒక మాట అంటే ఏమైందమ్మా వాడు మగపిల్లాడు’ అనేయడం పెద్దవాళ్లకు ఒక అలవాటుగా ఉండేది. దీనివల్ల కోపం తప్పేమీ కాదేమోనన్న భావనతో మగాళ్లు, దానిని భరించాల్సిందే అన్న ఆలోచనతో స్త్రీలు పెరిగారు. అందుకే ‘మగాడి’ కోపంపై అంత తీవ్రమైన వ్యతిరేకత లేదు. కానీ ఇపుడు పెరుగుతోంది. 2. పరిస్థితుల ప్రభావం సుమారు 70 శాతం మగాళ్లకు కోపం ఎక్కువట. మగాడికే కోపం ఎందుకు వస్తుందని చేసిన పరిశీలనలు, పరిశోధనల్లో ఎడ్రినలిన్ పాత్ర కనిపించింది. ఇది ఇద్దరిలో ఉన్నా కూడా మగాళ్లలో ఈ హార్మోను అతిగా విడుదలవడం వల్ల కోపం విపరీతంగా పెరుగుతుందట.మగ పిల్లల పెరుగుదలపై ఇంటితో పాటు అనేక విషయాలు ఎక్కువ పాత్ర పోషిస్తాయి. స్నేహాలు, సినిమాలు, మీడియా ముందు నుంచి కాస్త సోషల్ లైఫ్ గడుపుతున్న అబ్బాయిలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధాలున్న ఇంటి వాతావరణంలో పెరిగిన మగ పిల్లలకు ఇతరుల కంటే కోపం తక్కువని కొన్ని పరిశీలనలు చెబుతున్నాయి. 3. కోపానికి గాంభీర్యానికీ తేడా గుర్తించకపోవడం భారతీయ సమాజంలో ఇంటి యజ మాని అయిన పురుషుడు గాంభీర్యం -కోపం ఈ రెండింటికి పెద్దగా తేడా గుర్తించడం లేదు. కోప్పడటాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఉపయోగించే సాధనంగా భావిస్తూ వచ్చారు. అందుకే కుటుంబ సభ్యులను గాడిలో పెట్టడానికి గాంభీర్యాన్ని ప్రదర్శించాల్సిన సమయంలోనూ కోపాన్ని ప్రదర్శించడం అలవాటుగా ఉంది. మరి కొందరిలో కోపాన్ని మేల్ ఐడెంటిటీగా భావించే దుర్లక్షణం ఉంటుంది. 4. చనువును తప్పుగా చూడటం అమెరికాకు చెందిన పరిశోధక ప్రొఫెసర్లు మాథ్యూ మెక్కీ, పీటర్ డి రాబర్ట్స్, జుడీత్ మెక్కీలు కోపం గురించి చేసిన వ్యాఖ్యలు చూడండి ‘‘కొన్ని కోపాలు ఆరోగ్యకరం. ఇంకొన్ని కోపాలు అవసరం. కొన్ని సార్లు విపరీతంగా వచ్చే కోపాన్ని వెంటనే బయటపెడితే మనసుకు సాంత్వన కలుగుతుంది. అయితే, సాధారణంగా దీని విపరిణామాలే ఎక్కువ. అవి ఎంత దారుణంగా ఉంటాయంటే ఇక వాటికి శాశ్వతంగా బంధాలను దూరం చేసే ప్రమాదం కూడా ఉంది’’. ఇక్కడ ఉదాహరించడం సరి కాదేమో గాని అత్తారింటికి దారేది.. సినిమాలో కూతురి (నదియా) మీద తండ్రి చూపిన కోపం వారి సంబంధాలను శాశ్వతంగా తెంపేస్తోంది. అది తండ్రి జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. భార్యకు అయినా, పిల్లలకు అయినా చనువిస్తే చెడిపోతారన్న భావన ఒకప్పుడు మగ వారిలో పెచ్చు. అది ఎంత సాధారణం అయిందంటే నాన్నకు కోపం మామూలే అన్న విషయం సినిమాలలో ఎన్నో పాత్రలలో ప్రతిబింబిస్తూనే ఉంది. రోజులు మారాయి... వ్యవసాయరంగం ప్రభావం తగ్గి సేవారంగం రాజ్యమేలుతోంది. ఇపుడు స్త్రీలు పురుషులతో ఎందులోనూ తీసిపోవడం లేదు. ఇంకా చెప్పాలంటే కుటుంబానికి మీకంటే ఎక్కువ సేవ చేస్తున్నపుడు మీ అనవసరమైన కోపాలను భరించాల్సిన అవసరం లేదంటున్నారు. అంతే కాదు, కోపాలు మనస్పర్థలను పెంచుతున్నాయి. భార్య అయినా, పిల్లలు అయినా కోపంతో చెప్తే వినే పరిస్థితులు లేవు. అది మనసుల మధ్య దూరం పెంచుతుంది. ప్రేమాభిమానాలు పలుచబడి బంధాలు బలహీనపడతాయి. ఈ తరం పిల్లలు చనువు లేకపోతేనే చెడిపోతారు. కోపం తగ్గించకునే క్రమంలో మీరు చేయాల్సిన మొదటిపని మూడో వ్యక్తి ఉన్నపుడు ఎవరి మీద కోప్పడవద్దు. అది మనసుకు చాలా బాధ కలిగిస్తుంది. తొలుత దీనిని మానేసి ఆ తర్వాత పూర్తిగా కోపాన్ని తొలగించుకోండి. మీరు కోప్పడే భర్త/తండ్రి/బాస్ అయితే మీకో శుభవార్త. ఎందుకంటే మీరు కనుక మీ కోపాన్ని తగ్గించుకుని అందరికీ దగ్గరయితే వారి నుంచి లభించే ఆదరణ, ప్రేమాభిమానాలు మిమ్మల్ని అపరిమిత ఆనందానికి గురిచేస్తాయి. అసలు మీ జీవితమే చాలా కొత్తగా మారిపోతుంది. ఎపుడూ కోప్పడని వారికి దక్కే ప్రేమ కంటే కూడా మారిన మనిషికి ముఖ్యంగా కుటుంబం నుంచి దక్కే ప్రేమాభిమానాలు చాలా ఎక్కువట.