చిన్నారిపై కన్నతండ్రి కిరాతకం | Father beats his son heavily | Sakshi
Sakshi News home page

చిన్నారిపై కన్నతండ్రి కిరాతకం

Published Sun, Jan 28 2018 4:02 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

Father beats his son heavily - Sakshi

కొడుకును బెడ్‌ రూమ్‌లో విసిరేçస్తూ.. కాలితో తన్నుతూ (ఇన్‌సెట్‌లో) మహేంద్ర

పాపం, పుణ్యం ఎరుగని పసివాళ్లను చూస్తే ముద్దులాడాలనిపిస్తుంది.. వారి ముద్దు మాటలు విన్నకొద్దీ వినాలనిపిస్తుంది. ఇవన్నీ మరిచిన ఒక తండ్రి.. తన బిడ్డపై అమానుషంగా ప్రవర్తించాడు.. సెల్‌ఫోన్‌ చార్జర్‌ వైర్‌తో, బెల్టుతో గొడ్డును బాదినట్టు బాదాడు.. బెడ్‌రూమ్‌లో కొడుకును ఎత్తి విసిరిపారేశాడు.. ఫుట్‌బాల్‌ను తన్నినట్టు తన్నాడు. చిన్నారి తల్లి వారించకపోగా భర్తకే వంతపాడింది. ఈ దారుణం బెంగళూరులో జరిగింది.

యశవంతపుర (బెంగళూరు): యశవంతపుర నియోజకవర్గం కెంగేరి గ్లోబల్‌ విలేజ్‌ సమీపంలో మహేంద్ర అనే వ్యక్తి కుటుంబంతో ఉంటున్నాడు. సమీపంలోని ఓ పాఠశాలలో అతని కొడుకు ఐదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల ఇంట్లో అల్లరి చేశాడని కొడుకును మొబైల్‌ చార్జర్‌ వైర్, బెల్టుతో తీవ్రంగా కొట్టాడు. ఇంకోసారి అలా చేయను డాడీ అని చిన్నారి ప్రాధేయపడుతున్నా ఆ బండరాయి మనసు కరగలేదు. బెడ్‌రూంలో కొడుకును ఎత్తి విసిరేయడం, కాళ్లతో ఫుట్‌బాల్‌ను తన్నినట్టు తన్నడం చేశాడు. పైగా ఇదేదో ఘనకార్యమన్నట్లు తన ఫోన్‌లో వీడియో తీశాడు.

ఇటీవల ఫోన్‌ చెడిపోగా దాన్ని ఒక మొబైల్‌షాప్‌లో రిపేరుకు ఇచ్చాడు. మెకానిక్‌ అందులోని వీడియోను చూసి తీవ్ర ఆవేదనకు గురై దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో మహేంద్ర క్రూరత్వం బయటపడింది. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కెంగేరి పోలీసులు సుమోటోగా పోక్సో కేసును నమోదు చేసి మహేంద్రను అరెస్టు చేశారు. కాగా, కొడుకును కొడుతున్న వీడియోను తన భార్యతో తీయించినట్టు పోలీసుల ఎదుట మహేంద్ర ఒప్పుకున్నాడు. ఇంకోసారి అల్లరి చేస్తే ఈ వీడియోను చూపించి కొడుకును భయపెట్టడానికే రికార్డు చేయించినట్టు చెప్పాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement