lying
-
సీఎం మమతా అబద్దం చెబుతున్నారు: కోల్‌కతా వైద్యురాలి తల్లి
కోల్‌కతా: కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు దర్యాప్తును అణచివేసేందుకు ప్రయత్నించారంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నించారని, తమకు లంచం ఇవ్వాలని చూశారని ఆరోపించారు.అయితే ఈ ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. బాధితురాలి తల్లిదండ్రుల వ్యాఖ్యలను దీ కొట్టిపారేశారు. తమ ప్రభుత్వంపై అపనిందలు వేసే ప్రయత్నమంటూ మండిపడ్డారు.‘బాధితురాలి తల్లిదండ్రులకు మేము ఎప్పుడూ డబ్బు ఇవ్వలేదు. ఒక నిండు జీవితాన్ని డబ్బు ఎప్పటికీ భర్తీ చేయలేదు. కానీ, వారి కుమార్తె జ్ఞాపకార్థం ఏదైనా మంచి పని చేయాలని భావిస్తే.. వారికి మా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చా. ఆ విషయంలో వారు నన్ను ఎప్పుడైనా సంప్రదించవచ్చు. ఎప్పుడు ఏం మాట్లాడాలో నాకు తెలుసు’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.ఇదిలా ఉండగా సీఎం దీదీ వ్యాఖ్యలను హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ తల్లి ఖండించారు. మమతా బెనర్జీ అబద్దం చెబుతున్నారని ఆరోపించారు. వారికి డబ్బులు ఇవ్వాలని చూశారని మరోసారి పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘సీఎం మమతా అబద్ధాలు చెబుతున్నారు. నష్టపరిహారం ఇప్పిస్తానని, మీ కుమార్తె జ్ఞాపకార్థం ఏదైనా నిర్మించుకోవచ్చని మాతో చెప్పారు. నా కుమార్తెకు న్యాయం జరిగినప్పుడు నేను మీ ఆఫీసుకు వచ్చి పరిహారం తీసుకుంటానని చెప్పాను’ అని తెలిపారు.అదే విధంగా హత్యాచారం అనంతరం చేపట్టిన నిరసనలను అణచివేసేందుకు సీఎం మమతా ప్రయత్రించారని ఆమె ఆరోపించారు. తమ నిరసనలు ఆపాలని, రాబోయే దుర్గా పూజ ఉత్సవాలకు సిద్దం కావాలని సూచించారని పేర్కొన్నారు. అయితే దీదీ అలా మాట్లాడటం అమానవీయమని అన్నారు. తాను ఒక ఆడపిల్లకు తల్లినైనందున ఇది అమానుషంగా భావిస్తున్నట్లు చెప్పారు. -
ఓసినీ వేషాలో..! ఉడుత చేష్టలకు నెటిజన్స్ ఫిదా.. వీడియో వైరల్
సాధారణంగా జంతువులు యజమాని దృష్టిని ఆకర్షించడానికి రకరకాల తిక్క పనులు చేస్తుంటాయి. ఇటు.. అటు.. దూకుతుంటాయి. పక్క జంతువులతో ఊరికే గొడవ పడుతుంటాయి. కొన్ని సార్లు దెబ్బతగిలినట్లు యాక్టింగ్ కూడా చేస్తుంటాయి. ఇలాంటి చేష్టలను మన పెంపుడు కుక్కల్లో చూస్తుంటాం. కానీ ఉడుతలు కూడా ఈ కొవలోకి వచ్చేశాయా? అని అనిపిస్తుంది మీరు ఈ వీడియో చూస్తే..! ఇంతకూ ఓ నల్లని ఉడత ఏ చేసిందో తెలుసా..? ఉడుతలు కూడా యాక్టింగ్ చేస్తాయా? అంటే అవుననే అనాలి. దానికి ఏం అనిపించిందో తెలియదు కానీ ఇంట్లో చీపురుతో కాసేపు ఆటలాడింది. అనంతరం ఆ చీపురును మీద వేసుకుని గది ఫ్లోర్‌పై బోర్లా పడుకుంది. చీపురు దాని పొట్టపై పడి ఉండడంతో.. ఉడుతపై చీపురు పడి గాయపడినట్లుందే అని అనిపించాల్సిందే సదరు వీక్షకునికి. దాని నటనకు ఆస్కార్ ఇవ్వొచ్చనుకోండి..! ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఉడుత కొంటె చేష్టలకు వ్యూవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు కామెంట్ పెట్టారు. (ఫ్లైయింగ్ ఉండుత.. లైయింగ్ ఉడుత) 'ఎగిరే ఉడుత.. అబద్దాల ఉడుత' అని మరొకరు కామెంట్ చేశారు. Squirrel fakes an injury pic.twitter.com/5xXeTFUv7U — Crazy Clips (@crazyclipsonly) June 3, 2023 ఉడుతలు చాలా చురుకుగా ఉంటాయని ఓ జంతు నిపుణుడు తెలిపారు. నిత్యం ఎగురుతూ, దూకుతూ ఆటలాడుతుంటాయని చెప్పారు. పట్టణాల్లోని గదులు వాటికి చాలా చిన్న ప్రదేశం కావున ఆడుకోవడానికి కావాల్సిన ప్రదేశం ఉండదని అన్నారు. నల్లని ఉడుతలను పెంచడానికి అనుమతి లేదని చెప్పారు. వాటికి ప్రత్యేకమైన కేర్ అవసరమని పేర్కొన్నారు. వెటర్నరీ సెంటర్లలో లభించవని తెలిపారు. సాధారణంగా ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాల్లో ఉంటాయని చెప్పారు. ఇదీ చదవండి: వార్నీ..! కుక్కకు ఇంత పెద్ద నాలుకా..! గిన్నీస్ రికార్డ్ -
శతక నీతి – సుమతి: అద్దం... అబద్ధం
‘బలవంతుడనాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా/బలవంతమైన సర్పము చలిచీమల చేతి చిక్కి చావదే సుమతీ !’ అన్న సుమతీ శతకకారుడి నీతి సూత్రాన్ని చర్చించుకుంటున్నాం... నిజానికి ఏ కాలానికి ఆ కాలంలో పెద్దలు పిల్లలను మంచి మార్గంలో పెట్టడానికి ఇటువంటి హితోక్తులు చాలా చెబుతుంటారు. వాటిని విని అనుసరించిన వారు విచక్షణతో, వివేకంతో వారి జీవితాలను సుఖమయం చేసుకుంటుంటారు. నందుల చరిత్ర తెలిసే ఉంటుంది. కేవలం పొగరుబోతు తనంతో, అతిశయంతో నిష్కారణంగా వైరం పెట్టుకొని మలయకేతు, పర్వతకుడు, వైరోచకుడు..ఇలా ఎంతో మంది రాజులను అవమానించారు. ఆ క్రమంలోనే అన్నశాలలోకి అన్నం తినడానికి కూర్చొన్న చాణక్యుడిని అవమానకరంగా మాట్లాడారు. ఆయన చాలా గొప్పవాడు, మహావిద్వాంసుడు, మహా మేధావి అంటూ అందరూ చెబుతున్నా వినకుండా జుట్టుపట్టి ఈడ్పించారు నందులు. పిలక ఊడిపోయింది.. మిమ్మల్ని పదవీచ్యుతుడిని చేసేదాకా ఈ పిలక ముడి వేయను.. అని అక్కడే శపథం చేసాడు చాణక్యుడు. చంద్రగుప్తుణ్ణి ముందు నిలబెట్టి నందుల చేతిలో అవమానం పొందిన రాజులందరినీ ఏకం చేసిన చాణక్యుడు వ్యూహరచన చేసిన యుద్ధంలో ఇంత గొప్ప నందులు ఏమయిపోయారు. మొత్తం వంశమే మిగలకుండా పోయింది. నందుల మీద అపార ప్రేమ కలిగిన మహా మేధావి ఒకాయన ఉండేవాడు. ఆయన పేరు రాక్షసుడు. చాణక్యుడికి ప్రతిభకు లొంగిపోయి చంద్రగుప్తుడికి ప్రధానమంత్రి అయ్యాడు. చంద్రగుప్తుడు తన అభిరుచి మేరకు ఒక రాజభవనం కట్టించుకున్నాడు. మొత్తం సిద్ధమయిన తరువాత దానిలో ఉండడానికి చాణక్యుడి అనుమతి కోరాడు. ‘వీల్లేదు’ అని శాసించాడు రాజగురువు. చంద్రగుప్తుడు చిన్నాచితకా రాజేమీ కాదు... అప్పట్లో భారత దేశంలో వైభవంగా వెలిగిన మగధ సామ్రాజ్యాధిపతి. అంత గొప్ప రాజ్యానికి తిరుగులేని మహారాజయి ఉండి తను ఇష్టపడి కట్టించుకున్న ఇంట్లోకి పోవడానికి అనుమతి అడగడం, దాన్ని చాణక్యుడు తిరస్కరించిన వెంటనే సమ్మతించడం... సాధారణ విషయమేమీ కాదు. వినయం అంటే అదీ. చెప్పినంత సులువు కాదు అలా ఉండడం. మీరెప్పుడు అనుమతిస్తే అప్పుడే గృహప్రవేశం చేస్తానన్నాడు. చాణక్యుడు కొంతమంది సైనికులను వెంటపెట్టుకుని ఆ మహాసౌధాన్ని అణువణువూ గాలిస్తున్నాడు. ఆంతరంగిక మందిరం వంటి ఒకగది నిండా పెద్ద పెద్ద అద్దాలు బిగించి ఉండడం చూసి అనుమానించాడు. పిలిచి అడిగాడు అక్కడివారిని.. అలంకారం కోసం పెట్టామని చెప్పారు. అంతకంటే గొప్ప అలంకారం రావడానికి నేను చిట్కా చెబుతానంటూ వాటిని తొలగించి చిత్తరువులు పెట్టమన్నాడు. అద్దాలు తొలగిస్తుంటే వాటి వెనుక గదులు, వాటిలో సాయుధులైన సైనికులు కనబడ్డారు. వెంటనే తన సైనికులతో వారిని తుదముట్టించాడు. చంద్రగుప్తుడు నిర్ఘాంతపోయాడు. అద్దాలు గదినిండా ఉన్నప్పుడు లోనికి ప్రవేశించిన వారు తమ ప్రతిబింబాన్ని భిన్నకోణాలలో చూసుకుంటూ మురిసిపోతూ ఆదమరిచి ఉంటారు. ఆ క్షణాల్లో వెనుకనుంచి చంపేయడానికి రాక్షసుడు అనే మంత్రి చేసిన కుట్ర బట్టబయలయిపోయింది. చంద్రగుప్తుడు మహారాజయినా వినయంతో ప్రవర్తించినందుకు క్షేమంగా బయటపడ్డాడు. వాళ్లెంత, వీళ్ళెంత ...అని గర్వాతిశయంతో ధిక్కరించి నడుచుకొన్నందుకు నంద రాజులలో ఒక్కడంటే ఒక్కడూ మిగలలేదు. వీటిలో నీతిని గ్రహించాలి. మనకంటే గొప్పవాళ్లుంటారనే సత్యాన్ని గ్రహించి ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా ...అంటూ బద్దెన గారిస్తున్న సందేశం కూడా అదే. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
బిడ్డకు తండ్రెవరో తప్పు చెప్పినందుకు.....
సాక్షి, న్యూఢిల్లీ : తన బిడ్డకు తండ్రి ఎవరో తప్పు చెప్పినందుకు తల్లికి, అవును ఆ బిడ్డకు తండ్రిని తానేనంటూ నాటకమాడిన ఆ తల్లి కొత్త బాయ్ ఫ్రెండ్‌కు వెస్ట్ వేల్స్‌లోని స్వాన్సీ క్రౌన్ కోర్టు జైలు శిక్ష విధించింది. వారిద్దరు జైలు శిక్ష పూర్తి చేసుకొని వచ్చేవరకు బిడ్డ సంరక్షణ బాధ్యతలను స్వయంగా చూసుకోవాల్సిందిగా ఆ బిడ్డ అసలు తండ్రి ఆశ్లే సేస్ని కోర్టు ఆదేశించింది. వెస్ట్ వేల్స్‌లోని మాన్సెల్టన్కు చెందిన లూజీ బాయిస్ (30) మూడు నెలల క్రితం ప్రసవించింది. అప్పటికే తన మొదటి బాయ్‌ఫ్రెండ్ ఆశ్లీసేస్తో ఆమె గొడవపడి విడిపోయింది. పుట్టిన బిడ్డకు బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి. వెస్ట్ వెల్స్ నిబంధనల ప్రకారం బిడ్డ తల్లిదండ్రులు ఇద్దరు బర్త్ రిజిస్టార్ ఆఫీసుకు వెళ్లి బిడ్డ పేరిట సర్టిఫికెట్ తీసుకోవాలి. మొదటి బాయ్ ఫ్రెండ్‌తో గొడవ పడి విడిపోయినందున ఇక అతనితో ఎలాంటి సంబంధాలు ఉండరాదని భావించిన లూజీ బాయిస్, తాను ప్రస్తుతం ప్రేమిస్తున్న 34 ఏళ్ల నాథన్ లెగట్తో కలిసి బిడ్డ సర్టిఫికెట్ కోసం వెళ్లింది. అక్కడ అధికారుల ముందు బిడ్డకు తల్లిగా సంతకం చేసింది. ఆ తర్వాత అధికారులు బిడ్డకు తండ్రి మీరేనా? అంటూ నాథన్ లెగట్ను అడిగారు. అందుకు ఆయన అవునంటూ సంతకం చేస్తూ భోరుమని ఏడ్చారు. దీంతో అధికారులకు సందేహం వచ్చింది. వారిని విచారించి అసలు తండ్రి ఎవరో కనుక్కోవాల్సిన బాధ్యతను అధికారులు ఓ ఎన్జీవో సంస్థకు అప్పగించారు. ఎన్జీవో సంస్థ డీఎన్ఏ పరీక్షల ద్వారా నాథన్ లెగట్ తండ్రి కాదని, లూజీ బాయిస్ మొదటి బాయ్ ఫ్రెండే ఆశ్లే లేస్ తండ్రని తేల్చింది. అబద్ధమాడిన రెండో బాయ్‌ఫ్రెండ్ నాథన్, లూజీ బాయిస్, మొదటి బాయ్‌ఫ్రెండ్ ఆశ్లే సేస్ ఇందులో తల్లి బాయిస్, తండ్రిగా నాథన్ లెగట్లు అబద్ధామాడినందుకు వారిపై పోలీసులు కేసు పెట్టి కేసు విచారణను స్వాన్సీ కోర్టుకు అప్పగించారు. బిడ్డ విషయంలో అబద్ధమాడినందుకు కోర్టు తల్లికి ఎనిమిది నెలల జైలు శిక్ష, తాజా బాయ్ ఫ్రెండ్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ రెండు రోజుల క్రితం తీర్పు చెప్పింది. తన మాజీ ప్రియురాలు లూజీ బాయిస్ అన్నా, తమ ఇద్దరికి పుట్టిన బిడ్డ అన్నా ఇప్పటికీ తనకు ఇష్టమేనని విచారణ సందర్భంగా అంగీకరించిన బిడ్డ అసలు తండ్రి ఆశ్లే లేస్కే వారు విడుదలై వచ్చే వరకు బిడ్డ సంరక్షణ బాధ్యతలను కోర్టు అప్పగించింది. అయితే శిక్షపడే నాటికి బాయిస్ రెండోసారి గర్భంతో ఉంది. మరి ఆ బిడ్డకు తండ్రి ఎవరో కోర్టు ప్రశ్నించలేదు, తల్లి కూడా ఎవరికి చెప్పలేదు. -
అబద్ధం చెప్పడం
జీవన కాలమ్ అబద్ధానికి విశాలం ఎక్కువ. ధైర్యం ఎక్కువ. అబద్ధం చెప్పేవాడిని ప్రత్యేకంగా గమనించండి. ఎప్పుడూ చేతిలో పది కిలోల బంగారమున్నట్టు ప్రకాశిస్తూ ఉంటాడు. కుచేలుడిలాగా, నడుం వంగి బొత్తిగా కుంచించుకుపోయి ఉండడు. మనం చేసే పనుల్లోకెల్లా అబద్ధం చెప్పడం చాలా కష్టతరమైన పని. అబద్ధానికి ముందు కావలసినంత పరి శ్రమ కావాలి. ఫలానా అబద్ధం వల్ల కథ అడ్డం తిరిగితే తప్పిం చుకునే దారులో, సమర్థిం చుకునే మార్గాలో అప్పటికప్పుడు కరతలామలకంగా సిద్ధంగా ఉండాలి. అబద్ధం చెప్పడంలో సూపర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ప్రముఖ నటుడు, నా అనుంగు మిత్రుడు, మహానటుడు కె. వేంకటేశ్వరరావుకి ఇస్తాను. ‘‘ఏరా! మొన్న నాకోసం లీలా మహల్ జంక్షన్ దగ్గర కలుస్తాను అన్నావు? రాలేదేం?’’ అన్నామనుకోండి. రాలేకపోవడానికి వెయ్యి కారణాలు చెప్పవచ్చు. కానీ చెప్పడు. ‘లీలా మహల్ జంక్షన్ దగ్గర ఏ వేపు నిలబడ్డావు?’ ‘సోడా కొట్టు దగ్గర’ అంటే ‘అదీ.. నేను లేడీస్ గేటు దగ్గర ఒక్క అరగంట పైగా నిలబడి వెళ్లిపోయా’ నంటాడు. వాడిని ఏడిపించాలని ‘అవునవును. ఈ చారల చొక్కాతో ఓ మనిషిని చూశాను. నువ్వనుకోలేదు’ అన్నామనుకోండి. తను అబద్ధం ఆడి దొరికిపోనందుకు సిగ్గుపడాలి కదా? పడడు. ‘మరి నన్ను పలుకరించలేదేం’ అని ఎదుటి ప్రశ్న వేస్తాడు. రెండు అబద్ధాల మధ్య నిజం ఎక్కడో చచ్చిపోయి, నిజాన్ని పెట్టుబడిగా పెట్టిన మన ఆవేశం నీరు కారిపోతుంది. అబద్ధానికి చాలా ఒరిజినాలిటీ కావాలి. గొప్ప సమయస్ఫూర్తి కావాలి. తను చెప్తున్నది అబద్ధమని ఎదుటివాడికి అర్థమవుతుందని తెలిసినా ‘సిగ్గులేని తనం’ కావాలి. ఒక్క ఉదాహరణ. ‘నిన్న పొద్దుట ఎక్కడరా? ఎంత వెతికినా దొరకలేదు?’ ‘ఎక్కడ బ్రదర్ ఏకామ్రేశ్వరరావుగారు చంపేశారు’ ‘ఎవరు? ఉపముఖ్యమంత్రిగారే! ఏమిటి విశేషాలు?’ ‘వచ్చే కేబినెట్లో విద్యామంత్రిని ఎవరిని పెట్టాలని నా సలహా కోసం కబురు పంపించాడు’.. ‘అదేమిట్రా? ఆయన మొన్న టంగుటూరు ఫ్లై ఓవర్ దగ్గర యాక్సిడెంట్లో పోయారు కదా? వెంటనే సమాధానం వస్తుంది. ‘అదే నీతో చిక్కు. నేను చెప్పేది 1997 మంత్రి గురించి...’ ‘ఆయనెప్పుడూ మంత్రి కాలేదు కదా?’ ‘అందుకే రాజకీయాలు తెలీని వారితో మాట్లాడటం కష్టం. ఆయనే విద్యామంత్రని కనీసం 20 రోజులు మా సర్కిల్సులో అనుకునేవాళ్లం. అతను మీ అందరికీ ఏకామ్రేశ్వరరావు. మాకు మాత్రం విద్యేశ్వరరావు’. అబద్ధానికి విశాలం ఎక్కువ. ధైర్యం ఎక్కువ. అబద్ధం చెప్పేవాడిని ప్రత్యేకంగా గమనించండి. ఎప్పుడూ చేతిలో పది కిలోల బంగారమున్నట్టు ప్రకాశిస్తూ ఉంటాడు. కుచేలుడిలాగా మూలుగుతూ, నడుం వంగి బొత్తిగా కుంచించుకుపోయి ఉండడు. నిజం నీరసమయినది. అది వన్ వే ట్రాఫిక్. నిజాయితీపరుడిని నిద్రలో లేపినా ఒక్కటే చెప్పగలడు– దిక్కుమాలిన నిజం. అబద్ధం అక్షయపాత్ర. సత్య హరి శ్చంద్రుడిలాంటి వెర్రిబాగులవారు ఈ దేశంలో బొత్తిగా కనిపించరు. నా జీవితంలో అబద్ధం బాధపెట్టినట్టు, తలుచుకున్నప్పుడల్లా, డబ్బు కంటే సులువుగా మోసపోయినందుకూ ఇప్పటికీ విలవిలలాడతాను. రేడియోలో పనిచేస్తున్న రోజులు. సినీమా ధర్మమాంటూ కొన్ని వేలు అదనంగా దాచుకున్నాను. ఎందుకు? వెస్పా కొనుక్కోవాలని. మా ఆఫీసుకి ఓ తమిళ ఆఫీసరులాంటి వ్యక్తి వచ్చేవాడు. ఎప్పుడూ పెద్ద కబుర్లు చెప్పేవాడు. అతని వెస్పా పచ్చగా నిగనిగలాడుతూ కనిపించేది. అది నా కల. తెలిసి ‘ఓస్! అదెంతపని ఆరు నెలలు తిరగకుండా– చవకలో కొనిపిస్తాను’ అన్నాడు. అతని మాటలు, చెప్పే ధోరణీ అరచేతిలో వైకుంఠాన్ని చూపుతున్నట్టుగా ఉండేవి. ఒకసారి కన్సైన్మెంట్ వచ్చింది. దాన్ని చూపించడానికీ నాకిష్టపడలేదు. ‘చూడగానే నవనవలాడే అమ్మాయిని మీకు అప్పజెప్తాను’ అన్నాడు. ఎట్టకేలకు మరో కన్సైన్మెంట్ వచ్చింది. తనే ఎగిరి గంతేశాడు. మా ఆవిడకీ నాకూ కరచరణాలు ఆడలేదు.. అన్నీ గోడౌన్‌లోకి వచ్చాక మిమ్మల్నిద్దరినీ తీసికెళ్తానన్నాడు. ఒక మధ్యాహ్నం ఉన్నట్టుండి ఫోన్ చేశాడు. ‘ఈసారి రెండు రకాల ఆకుపచ్చలు కలిపాడు సార్! బాడీ చిలక పచ్చ. హాండిల్బార్లో చిన్న రంగు కలిపాడు’ అన్నాడు. ఫోన్లో వెనుక వెస్పాల శబ్దాలు వినిపిస్తున్నాయి. ‘చూడ్డానికి వచ్చేదా?’ అన్నాను. నవ్వాడు. ‘వద్దు సార్ రాతకోతలన్నీ పూర్తి చేయించేశాను. రేప్పొద్దుట మీ ఇంటి ముందుం టుంది. సంతకాలు అక్కడే. నేను రాలేను. ఓ మనిషిని పంపుతున్నాను. నుదుటిమీద కాల్చిన మచ్చ. పేరు రామానుజం. అతనికి 4,220 ఇవ్వండి. రూపాయి ఎక్కువ వద్దు. వెంటనే పంపండి. ఎవరీ రామానుజం? ఆలోచన కూడా రాలేదు. అరగంటలో రామానుజం రావడం, డబ్బు ఇవ్వడం జరిగిపోయింది. ఆ రాత్రి మా ఇద్దరికీ నిద్దుర లేదు. ఆ ఉదయమే కాదు. ఆరు నెలలైనా వెస్పా ఛాయ లేదు కదా.. ఈ ఆర్ముగం అయిపు లేదు. అసలు ఎవరు ఈ రామానుజం? ఏం కంపెనీలో ఉద్యోగి? డబ్బు పుచ్చుకున్నది ఎవరు? రుజువేమిటి? ఆకర్షణని అద్భుతంగా మలచిన గొప్ప సంఘటన ఇది. తర్వాత 4,220 రూపాయలు చూడలేదు. ఆకుపచ్చ వెస్పా చూడలేదు. అబద్ధం అద్భుతమైన ఆభరణం. అది రాణించినట్టు నిజం రాణించదు. ప్రతీ రోజూ ఎన్ని అద్భుతాలు మన మధ్య రాణిస్తున్నాయో పేపరు తెరిస్తే చాలు. అబద్ధం నీడ. నిజం గొడుగు. అబద్ధం అలంకరణ. నిజం నిస్తేజమైన వాస్తవం. అబద్ధం కల. నిజం నిద్ర. - గొల్లపూడి మారుతీరావు -
చిన్నారిపై కన్నతండ్రి కిరాతకం
పాపం, పుణ్యం ఎరుగని పసివాళ్లను చూస్తే ముద్దులాడాలనిపిస్తుంది.. వారి ముద్దు మాటలు విన్నకొద్దీ వినాలనిపిస్తుంది. ఇవన్నీ మరిచిన ఒక తండ్రి.. తన బిడ్డపై అమానుషంగా ప్రవర్తించాడు.. సెల్‌ఫోన్ చార్జర్ వైర్‌తో, బెల్టుతో గొడ్డును బాదినట్టు బాదాడు.. బెడ్రూమ్లో కొడుకును ఎత్తి విసిరిపారేశాడు.. ఫుట్‌బాల్‌ను తన్నినట్టు తన్నాడు. చిన్నారి తల్లి వారించకపోగా భర్తకే వంతపాడింది. ఈ దారుణం బెంగళూరులో జరిగింది. యశవంతపుర (బెంగళూరు): యశవంతపుర నియోజకవర్గం కెంగేరి గ్లోబల్ విలేజ్ సమీపంలో మహేంద్ర అనే వ్యక్తి కుటుంబంతో ఉంటున్నాడు. సమీపంలోని ఓ పాఠశాలలో అతని కొడుకు ఐదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల ఇంట్లో అల్లరి చేశాడని కొడుకును మొబైల్ చార్జర్ వైర్, బెల్టుతో తీవ్రంగా కొట్టాడు. ఇంకోసారి అలా చేయను డాడీ అని చిన్నారి ప్రాధేయపడుతున్నా ఆ బండరాయి మనసు కరగలేదు. బెడ్రూంలో కొడుకును ఎత్తి విసిరేయడం, కాళ్లతో ఫుట్‌బాల్‌ను తన్నినట్టు తన్నడం చేశాడు. పైగా ఇదేదో ఘనకార్యమన్నట్లు తన ఫోన్లో వీడియో తీశాడు. ఇటీవల ఫోన్ చెడిపోగా దాన్ని ఒక మొబైల్‌షాప్‌లో రిపేరుకు ఇచ్చాడు. మెకానిక్ అందులోని వీడియోను చూసి తీవ్ర ఆవేదనకు గురై దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో మహేంద్ర క్రూరత్వం బయటపడింది. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కెంగేరి పోలీసులు సుమోటోగా పోక్సో కేసును నమోదు చేసి మహేంద్రను అరెస్టు చేశారు. కాగా, కొడుకును కొడుతున్న వీడియోను తన భార్యతో తీయించినట్టు పోలీసుల ఎదుట మహేంద్ర ఒప్పుకున్నాడు. ఇంకోసారి అల్లరి చేస్తే ఈ వీడియోను చూపించి కొడుకును భయపెట్టడానికే రికార్డు చేయించినట్టు చెప్పాడు. -
పెద్దలే అబద్ధాలు చెబితే!
క్రైమ్ పేరెంటింగ్ నిజం గడపదాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగొస్తుందంటారు. నిప్పులాంటి నిజాన్ని కూడా మింగేసేటంత నోరెలా వచ్చింది. పెద్దల వల్లే వచ్చింది. ఊరి పెద్ద అబద్ధాలు చెబితేఆ ప్రభావం ఊరి మీద ఉండదా? అలాగే... ఇంటిపెద్ద అబద్ధం చెబితే ఆ ప్రభావం పిల్లల మీద ఉండదా? ఈ సమాజంలో అబద్ధాన్ని కాలరాసి నిజాన్ని నిలబెట్టే శక్తి ఎక్కడైనా ఉందంటే అది... మనలోనే ఉంది. మనం నిజాన్ని నిలబెట్టలేకపోతే భావి తరమే ఒక అబద్ధమైపోతుంది. ‘ఒరేయ్... చింటూ.. నిజం చెప్పు.. ఆ రోజు అక్క, రాహుల్ సినిమాకు వెళ్లారు కదూ. వాళ్లతోపాటు నువ్వూ వెళ్లావ్ కదా?’తల అడ్డంగా ఊపాడు చింటు. ‘వీడు అబద్ధం చెప్తున్నాడు పిన్నీ... ఇప్పుడు కూడా తేజస్వీ క్లాస్‌మేట్స్‌తో పిక్నిక్ అని వెళ్లడం నిజం కాదు. రాహుల్, వాడి ఫ్రెండ్స్‌తో ఔటింగ్‌కి వెళ్లింది. వీడికి ఆ విషయం తెలుసు. మనకు చెప్పట్లేదు’ ఆవేశం, బాధ, ఆవేదనతో అరిచాడు సంజయ్. అతడు చింటూకు కజిన్. తేజస్వీ అన్నయ్య. చింటు తల్లిదండ్రులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. తల వంచుకొని గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్న చింటూ దగ్గరకొచ్చి అడిగింది వాళ్ల పెద్దమ్మ అనునయంగా. ‘చెప్పు నాన్నా... తేజక్కయ్య నిజంగానే వాళ్ల ఫ్రెండ్స్‌తో వెళ్లిందా?’ చింటూ తలెత్తి హాల్లో ఉన్న పెద్దవాళ్లందరి వైపు చూశాడు. మళ్లీ తలదించుకుని గోళ్లు గిల్లుకోవడం మొదలుపెట్టాడు. వాడి ఆ చర్యతో అందరికీ చిర్రెత్తుకొచ్చింది చింటూ తల్లిదండ్రులతో సహా. సంజయ్ అయితే కోపంతో ఊగిపోయాడు.‘ఒరేయ్.. పెద్దమ్మ అడిగినదానికి సరిగ్గా జవాబు చెప్పు. ఆ నిర్లక్ష్యం ఏంటి?’ గదమాయించింది చింటూ వాళ్లమ్మ.‘నాకు తెలీదు.. తెలీదు.. తెలీదు’ అని అరుస్తూ గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు చింటూ.‘అన్నీ అబద్ధాలే పిన్నీ. వాడికి తెలుసు. వీడే తేజస్వీని బైక్ మీద బస్‌స్టాప్ పక్క గల్లీలో దింపాడట. అక్కడున్న సూపర్‌మార్కెట్ కుర్రోడు చెప్పాడు. అరే అన్నా. చింటూకి బైక్ ఎందుకు ఇస్తున్నరు. పొద్దున తేజక్కను ఎక్కించుకొని ఒచ్చిండు. కొద్దిగల పొయింది. లేకుంటే ఈడ్నే ఈ గల్లిల యాక్సిడెంట్ చేస్తుండే. మేమంతా ఉరికొచ్చినం. తేజక్క బండి దిగి ఆగంమాగం ఉరికి ఎవరి కార్లోనో ఎక్కింది. ఏంది చింటూ గంత స్పీడ్ అంటే.. అక్క ఫ్రెండ్స్‌తో బయటకు పోతుంది.. లేట్ అయితుందని స్పీడ్‌గా వచ్చిన అంతే అన్నడు... జెర భద్రం.. బండి ఇయ్యకుండ్రి.. అని చెప్పాడు ఆ కుర్రాడు. అంటే చింటూకి అన్నీ తెలిసినట్టే కదా. వీడు అబద్ధం చెప్తున్నాడు. ఆ రోజు మూవీలో కూడా మా ఫ్రెండ్ చూశాడట. చింటూ చెప్తేనే తేజస్వీ ఎక్కడుందో తెలుస్తుంది. ఆ రాహుల్ గాడు రాస్కెల్. ప్లీజ్ పిన్నీ నువ్వయినా అడుగు వాడిని’ ఏడిచినంత పనిచేశాడు సంజయ్.చింటూ వాళ్లమ్మకు చింటూ మీద కోపం... సిట్యుయేషన్ పట్ల భయమూ... అందరిలో పరువు తీస్తున్నాడన్న అవమానమూ కలుగుతున్నాయ్. ‘అక్కయ్యా. ఎలాగైనా వాడితో నిజం చెప్పించి తేజస్వీని పదిలంగా తీసుకొచ్చే బాధ్యత మాది. కంగారు పడకండి. అది క్షేమంగానే ఉంటుంది. ఇంటికెళ్లి కాస్త రెస్ట్ తీసుకో. ఈలోపు నేను వాడితో మాట్లాడ్తా. అందరూ ఉంటే కూడా నోరు విప్పడు. వాడి మొండితనం నాకు తెలుసు’ అంది చింటూ వాళ్లమ్మ తన అక్క మాలతితో.‘కొంచెం నువ్వే బుజ్జగించాలి కల్పన.. నాకు భయంగా ఉంది. దానికి ఏం మాయమాటలు చెప్పాడో. ఎటు తీసుకెళ్లాడో. తేజస్వీ ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా రాహుల్ గురించి మంచిగా చెప్పట్లేదు. అసలు వాళ్లంతా దాన్ని వారించినా అది వినలేదనే అంటున్నారు. దాన్నెంత మత్తులో పెట్టాడో చూడు వాడు. ప్లీజ్ కల్పన.. చింటూ నిజం చెప్తే వెంటనే పోలీస్ కంప్లయింట్ ఇవ్వచ్చు’ బతిమాలింది మాలతి. ‘అయ్యో అక్కయ్యా. తేజు నాకూ కూతురే కదా. నాకు మాత్రం బెంగా, భయం ఉండవా? నేను మాట్లాడతాను’ అని అక్కకి అభయ మిచ్చి సంజయ్ వంక చూసింది కల్పన.అర్థమైనట్టుగా అందరూ లేచారు మాలతి, వాళ్లాయన, సంజయ్...వాళ్లను గేట్ దాకా సాగనంపి లోపలికి వచ్చారు కల్పన దంపతులు.చింటూ సోఫాలో కూర్చుని కనిపించాడు.వంటింట్లోకి వెళ్లి కార్న్‌ఫ్లేక్స్ కలుపుకొచ్చి చింటూకిస్తూ వాడి పక్కన కూర్చున ఉంది.‘చింటూ.. రోజూ టీవీల్లో , పేపర్లలో చూస్తున్నాం కదా. బ్యాడ్ బాయ్స్ అమ్మాయిలను తీసుకెళ్లి వాళ్లను ఎలా ఇబ్బంది పెడుతున్నారో. రాహుల్ కూడా అంతే. నీకు తెలిసింది చెప్తే తేజూను మనం జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకోవచ్చు’ అని ఆపి వాడిని చూసింది కల్పన.ఉదయం నుంచి జరుగుతున్న సీన్లో ఇప్పడు ఫస్ట్ టైమ్ వాడి కళ్లల్లో భయం కనిపించింది.‘తెలుసు’.. అన్నాడు నెమ్మదిగా. ఆ మాటకు ఒక్క ఉదుటున వాడి దగ్గరకు వచ్చి ‘చెప్పు ఎక్కడికి తీసుకెళ్లాడో’ అంటూ వాడి భుజాలు ఊపేస్తూ ఆవేశంగా అడిగాడు చింటూ తండ్రి.‘రాహుల్ వాళ్ల ఫామ్‌హౌజ్‌కే వెళ్లారు. ముందు రోజు రాత్రి తేజక్కయ్య రాహుల్‌తో ఫోన్లో ప్లాన్ చేసుకుంటుంటే విన్నాను’ అన్నాడు అమాయకంగా.‘మరెందుకురా అబద్ధం చెప్పావ్ తెలీదని. ఈ ముక్క అప్పుడే చెప్తే ఈ పాటికి వెళ్లేవాళ్లం కదా’ అన్నాడు కోపంగా చింటూ వాళ్ల నాన్న. ‘తేజక్కయ్య ఎవరికీ చెప్పొద్దంది. రాహుల్‌ని అడిగి ట్యాబ్ ఇప్పిస్తానంది. డ్రాప్ చేస్తే పాకెట్ మనీ ఇస్తానంది. అందుకే చెప్పలేదు’.‘తప్పు కదరా. అబద్ధం చెప్పడం. అబద్దానికి అలా డబ్బులు, గిఫ్ట్స్ తీసుకోవడం’ అంది కల్పన.‘నువ్వూ చాలాసార్లు అబద్ధం చెప్పమన్లేదా? సారీస్ అమ్మే ఆంటీ వస్తే లేనని చెప్పు కేఎఫ్‌సీ చికెన్‌కు మనీ ఇస్తా అని చెప్పలేదా? నాన్న అబద్ధం చెప్పలేదా? ప్రభాకర్ అంకుల్ వస్తే ఇంట్లో లేనని నాతో చెప్పించ లేదా? మొన్న నాన్న హెల్మెట్ లేకుండా వెళ్తుంటే పోలీస్ ఆపితే వైఫ్ హాస్పిటల్లో ఉంది... అర్జెన్సీలో హెల్మెట్ మరిచిపోయానని అబద్ధం చెప్పి తప్పించుకోలేదా. పైగా పోలీస్ అంకుల్ని ఎలా బురిడీ కొట్టించానో చూడు అని నాకు ఐస్‌క్రీమ్ కొనిపెట్టారు. మీరు అబద్ధం చెప్పినప్పుడు, నన్ను చెప్పమన్నప్పుడు డబ్బులిచ్చారు. తేజక్కయ్య కూడా అంతే చేసింది. నన్నెందుకు తప్పు పడుతున్నారు?’‘నీ వల్ల అక్కయ్య డేంజర్లో పడింది. నీకు ఆ మాత్రం తెలీదా?’‘రాహుల్ ఏం భయం లేదని చెప్పాడు. కాసేపు పార్టీ చేసుకొని వచ్చేస్తాం అన్నాడు’‘అది అబద్ధం’‘ఏమో.. నాకు మూవీకి డబ్బులిచ్చాడు’తల్లిదండ్రులిద్దరికీ కోపం వచ్చింది.‘ఇదంతా నీ వల్లే’ భార్య మీదకు తోయబోయాడు.అరచేతిని అడ్డం పెట్టి ‘ముందు బావగారికి కాల్ చేయండి. తేజు రాహుల్ వాళ్ల ఫామ్‌హౌజ్‌లో ఉన్నట్టు’ అంది. తేజస్వీ ఇంటికి చేరింది.సమయానికి తేజస్వీ అన్నయ్య ఫామ్ హౌస్‌కు వెళ్లి తేజస్వీని తేగలిగాడు. లేకుంటే ఏం జరిగేదో. తనొక్కర్తే బయటకు వెళ్లలేక చింటూ సాయం తీసుకుంది తేజస్వీ. ఇంటర్ చదువుతున్న చింటూ తన తెలిసీ తెలియని తనంతో తేజస్వీకి ప్రమాదం తెచ్చి పెట్టాడు.ఒకవేళ తేజస్వీకి ఏదైనా జరిగి ఉంటే?దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి? చింటూ తల్లిదండ్రులు ఈ నిందను ఒకరి మీద ఒకరు తోయడంలో బిజీ అయిపోయారు.‘నువ్వే నేర్పావ్ వాడికి అబద్దాలు’ అని తండ్రి అంటే ‘ఇందులో మీ తప్పేం లేదా’ అని భర్తతో వాదులాటకు దిగింది తల్లి.‘నేను మగాడిని... నాకు సవాలక్ష పనులుంటాయ్... వాటి కోసం ఏవో చిన్నచిన్న అబద్ధాలు ఆడాను.. ఆడాల్సి వస్తుంది.. నీకు నాకు తేడా లేదా?’ ‘‘చిన్నదైనా.. పెద్దదైనా.. అబద్ధం అబద్ధమే. మీరు చేస్తే నిజం అవదు. నేను చేస్తే తప్పుగా మారదు. ప్రతిదానికి నా మీద పడి ఏడ్వకండి. అన్నిటికీ నన్ను తçప్పు పట్టకండి’‘పట్టకా? ఎవరని అనాలి? పిల్లలు చెడిపోతే తల్లులనే అంటారు గుర్తుంచుకో’‘మరి మీ చెడుకి మీ అమ్మను అనొచ్చా’‘నోర్ముయ్ మా అమ్మనంటావా? అసలు వాడికన్నీ నీ బుద్ధులే. అబద్ధాలు కూడా నీవే వంట బట్టాయి’ఈ వివాదం అలా సాగుతూనే ఉంది .పిల్లలు అబద్దాలకోరులుగా మారకుండా ఉండాలంటే భిన్నమైన పేరెంటింగ్ కావాలి. ఎలా ఉండాలో సైకియాట్రిస్ట్‌ని అడుగుదాం! అబద్ధాల కథలు చెప్పొద్దు అన్ని విషయాల్లో పేరెంట్స్‌ని పిల్లలు అనుకరిస్తారు. అబద్ధాల విషయంలోనూ అంతే. పరిస్థితిని తప్పించడానికో, తప్పించుకోవడానికో పెద్దలు అబద్ధం అడుతారు. అదో టెండెన్సీగా మారింది. పిల్లలు వాటిని అలవాటు చేసుకుంటారు. అందుకే పెద్దలే జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఉండీ లేమని చెప్పించడం, ఎవరైనా అవసరానికి ఏదైనా అడిగితే.. అది తమ దగ్గరుందన్న విషయం పిల్లలకు తెలిసినా వాళ్లతోనే లేదని చెప్పించడం వంటివి అస్సలు చేయకూడదు. వీటిని పిల్లలు అవలీలగా అనుకరిస్తారు. పైగా అలా చేయడం తప్పుకాదని అనుకునే ప్రమాదమూ ఉంది. అంతేకాదు బయటి నుంచి మన పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారనే కంప్లయింట్స్ వస్తే.. విషయమేంటో పిల్లలనే నేరుగా అడిగి తెలుసుకోవాలి. పిల్లల వివరణను బట్టే పరిస్థితిని తెలుసుకోవాలి. అలాగే పిల్లల ఎదురుగా పెద్దవాళ్లు తాము ఆడిన అబద్ధాల విషయంలో ఒకరి మీద ఒకరు తప్పుతోసుకోవడం ఆపాలి. దీనిల్ల.. ‘ఓహో.. అబద్ధం ఆడి.. ఆ తప్పును ఇలా ఎదుటివాళ్ల మీదకు తోసేయొచ్చన్నమాట’ అని నేర్చుకుంటారు. అబద్ధం ఆడి.. దాంట్లోంచి బయటపడడాన్ని ఓ రిలీఫ్‌లా భావిస్తుంటారు. పేరెంట్స్ పిల్లలకు చిన్నప్పుడు ఒక ఊహను.. అంటే అబద్ధాన్ని ఆధారం చేసుకుని చెప్పే కథలను బాల్యానికే పరిమితం చేయాలి. పిల్లలు పెద్దాయ్యాక నిజానికి దగ్గరగా ఉన్నవాటినే చెప్పాలి. పిల్లలు ముందు తల్లిదండ్రులు ఒకరినొకరు నిందించుకోకుండా పిల్లలు లేనప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇంట్లో కార్డియల్ అండ్ ట్రాన్స్పరెంట్ వాతావరణాన్ని కల్పించాలి. అప్పుడే పిల్లలు ఏ విషయాన్నయినా పెద్దవాళ్లతో నిర్భయంగా షేర్ చేసుకోగలరు. దీని వల్ల అబద్ధాలు ఆడే చాన్సెస్ చాలా తగ్గుతాయి. – డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ – శరాది -
నిజమో.. అబద్ధమో... కళ్లు చెబుతాయి
లండన్: మాటలతో వర్ణించలేని అనేక భావాలను కళ్లు పలికిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కన్నుల కదలికలను బట్టి ఓ వ్యక్తి మాటలు నిజమా..? అబద్ధమా..? అన్నది కూడా తెలుసుకోవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. తనకు తెలిసిన వ్యక్తుల గురించి ఎవరైనా తెలియదని చెప్పే సందర్భంలో అతని కనుల కదలికలను బట్టి అతడు అబద్ధం చెబుతున్నాడా లేదా అన్నది తెలుసుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు. యూకేలోని పోర్ట్స్మౌత్ యూనివర్సిటీకి చెందిన ఐ ట్రాకింగ్ సాంకేతికతను ఉపయోగించి కొందరు వ్యక్తులపై పరిశోధన నిర్వహించారు. దీనిలో పాల్గొన్న వ్యక్తులకు తెలిసిన వారివి, సెలబ్రిటీలు, అపరిచితుల ఫొటోలు చూపించి తెలుసా అని అడిగారు. కొంతమంది తమకు తెలిసిన వారి ఫొటోలను కూడా తెలియదని చెప్పారు. అయితే అబద్ధం చెప్పేటప్పుడు వాళ్ల కళ్ల కదలికలు మారుతున్నాయని, దీన్ని బట్టి వారు అబద్ధం చెబుతున్నట్లు అర్థమవుతుందని పరిశోధకులు తెలిపారు. ఉగ్రవాదులు, నేరస్తుల విచారణలో ఈ పద్ధతి బాగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
చైనాలో కనిపిస్తున్న వెరైటీ వైద్యం!
గ్జియాన్ః ఆరోగ్యంకోసం ప్రకృతి వైద్యాన్ని ఆశ్రయించడం ఆధునిక కాలంలోనూ చూస్తూనే ఉన్నాం. చెట్ల బెరళ్ళు, మూలికలు, కషాయాలను వాడి వ్యాధులు తగ్గించుకునే పాత పద్ధతులు పెద్దగా కనిపించకపోయినా... ఆయుర్వేదం, హోమియో, అలోపతితోపాటు.. అనేక ప్రకృతి వైద్యాలను ఆశ్రయిస్తున్నవారు లేకపోలేదు. సాంకేతికంగా అత్యంత అభివృద్ధి చెందిన చైనా దేశం కూడా అటువంటి వైద్యాలను ఆశ్రయించడంలో ముందే ఉంది. ఇప్పుడక్కడ కనిపిస్తున్న దృశ్యాలే అందుకు పెద్ద నిదర్శనం. ఎండలో కాలే కాలే రాళ్ళపై పడుకుంటే ఎన్నో రకాల రోగాలు నయమౌతాయంటున్నారు అక్కడి మహిళలు. చైనా నగరం గ్జియాన్ కు చెందిన మహిళలు ఇప్పుడు ప్రకృతి వైద్యం బాట పట్టారు. తీక్షణమైన ఎండలో.. కాలే కాలే రాళ్ళపై పడుకొనే వెరైటీ వైద్యం చేసుకుంటున్నారు. అంతేకాదు అదో కొత్త హెల్గ్ ట్రెండ్ గా చెప్తున్నారు. ముఖాలపై చిన్నపాటి టవల్ నో, గుడ్డనో కప్పుకొని, ఎండలో ఉన్న అతిపెద్ద రాళ్ళను కౌగలించుకునో, వెల్లకిలానో పడుకొన్న మహిళలు కనిపించడం గ్జియాన్ ప్రాంతంలో ఇప్పుడు మామూలైపోయింది. వారికోసం పార్కుల్లోనూ, ఎండ తగిలే ఖాళీ ప్రదేశాల్లోనూ ప్రత్యేకంగా పెద్ద పెద్ద రాళ్ళను ఏర్పాటు చేస్తున్నారు. మొదట్లో అలా రాళ్ళపై పడుకున్న మహిళలను చూసి, అంతా అదో వ్యాయామం అనుకున్నారు. కానీ స్థానిక రిపోర్టర్లు వారిని కలిసిన తర్వాతే అసలు విషయం తెలిసింది. అదో ప్రాచీన వైద్య పద్ధతి అని, ముఖ్యంగా మహిళల్లో అనేక రోగాలను నయం చేస్తుందని చెప్పారు. సైనోవిటిస్, కండరాలు గట్టిపడటం వంటి వ్యాధులు వచ్చిన తన బంధువు ఒకరు ఇలా రాళ్ళ వైద్యాన్ని పాటించారని, కొన్నాళ్ళకు ఆమెకు పూర్తిగా నయం అయిపోవడంతో తాను కూడ ఈ వైద్యాన్ని అనుసరిస్తున్నట్లు 'లో' అనే మహిళ చెప్పింది. సుమారు సాయంత్రం 3, 4 గంటల మధ్య ప్రాంతంలో ఇలా రాళ్ళపై పడుకుంటే ఎంతో ఉపయోగం అని తెలిపింది. అలాగే లైంగిక శక్తి లోపించినవారికి సైతం ఈ వైద్యం అత్యంత ఉపయోగంగా ఉంటుందని చెప్తున్నారు. అయితే గ్జియాన్ లో కనిపిస్తున్న వేడి రాళ్ళ వైద్యాన్ని డాక్టర్లు ఎంతమాత్రం సమర్థించడం లేదు. పైగా ఈ ప్రయత్నం అనేక ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంటుందంటున్నారు. అధిక ఉష్ణోగ్రత శరీరానికి తగలడంవల్ల ప్రమాదాలు తలెత్తుతాయంటున్నారు. చర్మం బొబ్బలెక్కడం నుంచీ వడదెబ్బ తగలడం వరకూ ఏదైనా ప్రమాదమేనంటున్నారు. వైద్యులు వారించిన అనంతరం ఓ 70 ఏళ్ళ మహిళ తనకు అటువంటి అనుభవమే అయినట్టు స్థానిక మీడియాకు తెలిపింది. అలా రాళ్ళపై పడుకున్న తర్వాత, కాలిన వేడికి కడుపులో తీవ్రమైన నొప్పి ప్రారంభమైనట్లు చెప్పింది. అయితే చాలాశాతం మంది మీడియా చెప్పిన మాటలనూ వినడం లేదు. ఇప్పటికీ గ్జియాన్ నగరంలో రాళ్ళపై మహిళలు కనిపిస్తూనే ఉన్నారు. రాళ్ళపై పడుకోవడం ఒక్కటే కాదు.. అనేక వైద్యాలకు రాళ్ళను వినియోగించడం ఇటీవలి కాలంలో తరచుగా చూస్తున్నాం. ఓ వ్యక్తి తన ఒంట్లో అధికంగా ఉన్న 30 కేజీల బరువును తగ్గించుకునేందుకు తలపై 40 కేజీల బరువు రాయిని పెట్టుకొని వాకింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అనుకొని ఊరుకోవడం తప్పించి వినని మనుషులకు ఎవరు మాత్రం ఏం చెప్తారు? -
కాశీకి పోయాను రామాహరి...
అబద్ధంలో ఆకర్షణ ఉంటుంది. అందుకే మనుషులు అబద్ధాల మాయలో పడిపోతారు. ఏ కొందరో ఆ అబద్ధాల నిగ్గు తేలుస్తారు. ‘ఇదీ నిజం’ అని చెప్పడానికి దీక్ష పూనుతారు. అబద్ధాలపై సమరశంఖం పూరిస్తారు.అబద్ధాల్లోని డొల్లతనాన్ని కనిపెట్టి చెప్పేవారు పక్కన లేకపోతే ఎంతటివారైనా బొక్కబోర్లా పడవలసిందే. ‘అప్పు చేసి పప్పు కూడు’ (1958) సినిమాలో పాట ఒకటి ఉంది. అందులో రేలంగి చెప్పేవన్నీ అబద్ధాలే. ఆయన శిష్యురాలు పక్కనే ఉండి నిజం చెప్పబట్టి అమాయక ప్రజలు ఆ మాయ నుంచి బైటపడతారు. ‘కాశీకి పోయాను రామాహరి... గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరి’ అంటాడు రేలంగి. ‘కాశీకి పోలేదు రామాహరి... ఊరి కాల్వలో నీళ్లండి రామాహరి’ అని గిరిజ చెబుతుంది. అంతటితో ఊరుకోడు రేలంగి. ‘శ్రీశైలం వెళ్లాను రామాహరి... శివుని విభూతి తెచ్చాను రామాహరి’ అంటాడు. గిరిజ మాత్రం ఊరుకుంటుందా! ‘శ్రీశైలం పోలేదు రామాహరి... ఇది కాష్ఠంలోని బూడిద రామాహరి’ అంటుంది. రేలంగి అబద్ధాలు అక్కడితో ఆగవు. ‘అన్నమక్కరలేదు రామాహరి... నేను గాలి భోంజేస్తాను రామాహరి’ అంటాడు. ‘గాలితోపాటు రామాహరి... వీరు గారెలే తింటారు రామాహరి... నేతి గారెలే తింటారు రామాహరి’... అని గిరిజ అంటుంది. రేలంగి గుర్రున చూస్తాడు. ఇక లాభం లేదనుకుని... ‘కైలాసం వెళ్లాను రామాహరి... శివుని కళ్లార చూశాను రామాహరి’ అంటాడు.‘కైలాసం వెళితేను రామాహరి... నంది తన్ని పంపించాడు రామాహరి’ అని గిరిజ అసలు సంగతి బయటపెడుతుంది. 57 ఏళ్ల క్రితం పింగళి నాగేంద్రరావు రాసిన ఈ పాట... ఇప్పుడున్న కొందరు లీడర్ల అబద్ధాలకూ చక్కగా సూట్ అవుతుంది! -
అబద్ధం రాజ్యమేలుతుంటే
‘‘ఇదిగో రెండు నిమిషాల్లో వస్తున్నా’’ అని పది నిమిషాల తర్వాత వచ్చినా ఎవరికీ మనస్సు చివుక్కుమనడం లేదు. రుణమాఫీ అని చెప్పి చేయక పోయినా, ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకపోయినా, సాయం చేస్తామని చేయకపోయినా... ‘ఆఁ... అబద్ధం మామూలేలే’ అన్న ధోరణి మన ఇంట్లోకి కూడా వచ్చేసింది. పిల్లలు అబద్ధం చెప్పినా క్షమించేస్తున్నాం. పరస్పరం అబద్ధాలను సహిస్తున్నాం. మొత్తానికి అబద్ధం రాజ్యమేలుతోంది. యథా రాజా... తథా కుటుంబం. లీడర్లను మార్చే శక్తి మనకు ఉందో, లేదో చెప్పలేము కానీ... కుటుంబాన్ని మాత్రం మార్చుకునే అవకాశం ఉంది. ఏమో ఇంట గెలిస్తే రచ్చ గెలుస్తామేమో! మోసం చేయాలనో, లాభం కోసమో, భయంతోనో చెప్పే అబద్ధాలు చేటు చేసే అబద్ధాలు. అలా చేయకుండా ఉండాలంటే... ముందు చేటు చేయని అబద్ధాలు కూడా మానేద్దాం. అదే ‘అబ్బా... ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావే’’ లాంటివి. అప్పుడు మెల్లగా నిజం చెప్పడం అలవాటవుతుంది. మీ అందమైన కుటుంబం ‘నిజంగానే’ విల్ లివ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. సమాజాన్ని కుటుంబం అనుకునే వ్యక్తి గొప్ప లీడర్.కుటుంబాన్ని సమాజం అనుకునే వ్యక్తి గొప్ప పేరెంట్. ఆ లీడరు, ఈ పేరెంట్ ఎప్పుడూ సత్యమే పలకాలి. సత్యాన్ని నిలబెట్టాలి. కానీ మనం అబద్ధానికి అలవాటు పడిపోయాం. అబద్ధాన్ని సహించడానికి, భరించడానికీ అలవాటు పడ్డాం. అబద్ధాన్ని క్షమించేస్తున్నాం కూడా. లీడర్ అబద్ధం ఆడితే ‘మన ఖర్మింతే’ అని సరిపెట్టుకుంటున్నాం. ఇంట్లో చిన్నారి అబద్ధం చెబితే, మురిసిపోయి బుగ్గలు పుణుకుతున్నాం. ఈ ‘టాలరెన్స్’ మంచిది కాదు. ఇంతకీ మనం అబద్ధాన్ని ఎందుకు సహిస్తున్నాం? మన ఇంట్లో, సమాజంలో నిజానికి ‘రివార్డు’ ఉండడం లేదనా? చిన్న ఉదాహరణ: కాలేజీ ఎగ్గొట్టి సినిమాకు వెళ్లానని నిజం చెబితే పనిష్మెంట్. సినిమాకు వెళ్లి, స్పెషల్ క్లాసుకు వెళ్లొచ్చానని అబద్ధం చెబితే రివార్డు. అంత తేలికా! లోకంలో తేలికైన పని అబద్ధం చెప్పడం అని అంటారు. ఎంతో కష్టమైన పనిని కూడా ఒక్క అబద్ధంతో నమ్మించేయొచ్చు. ఎదుటివారిని ఏమార్చవచ్చు. అబద్ధాలు చెప్పి పవర్లోకి వచ్చిన వారు చరిత్రలో ఉన్నారు. వర్తమానంలోనూ ఉన్నారు. తలెత్తి సూర్యుణ్ణి చూస్తే మనకు కిరణం తాకాలి. శిరస్సెత్తి శిఖరాన్ని చూస్తే మనకు స్ఫూర్తి అందాలి. కాని కళ్లు తెరిచినా మూసినా అబద్ధమే కనిపిస్తుంటే... అబద్ధమే నిజమైన రూపంలా ప్రచారం పొందుతుంటే.... ఆ ధోరణి పై నుంచి కిందకు దిగుతుంది. కుటుంబాలలోకి కూడా పాకేంతగా బలపడుతుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి! మార్పు ఎక్కడ మొదలవ్వాలి? ముందు మన ఇంట్లో అబద్ధాన్ని సహించడం మానేస్తే, నిజాన్ని గౌరవిస్తే, నిజం చెప్పడాన్ని ప్రోత్సహిస్తే, నిజం చెప్పే ధైర్యాన్ని మెచ్చుకుంటే మన ఇంటి నుంచి ఒక నిజమైన సమాజం నిర్మితమవుతుంది. అలా కాకుండా అబద్ధాన్ని ప్రోత్సహించి, అబద్ధం చెప్పేవాళ్ళని గౌరవించి, అబద్ధపు బతుకుని ఆరాధిస్తే, అబద్ధాల లీడర్లు నిజాన్ని తేలిగ్గా తీసుకుంటారు. ఇష్టానుసారంగా రాజ్యమేలతారు. ‘మార్పును నీతోనే మొదలుపెట్టు’ అన్నాడు గాంధీ మహాత్ముడు. ఆయన అందించి సత్యం అనే చేతికర్రను ఇవాళ ప్రతి చిన్నారి పట్టుకుని ముందుకు నడపాలి. ఆయన ఆదర్శాన్ని ముందుకు నడిపించాలి. అప్పుడు నిలదీయొచ్చు! అబద్ధం చెపితే కష్టాల నుంచి సులువుగా తప్పించుకోవచ్చు. అయితే అది కొద్ది సమయమే. కాని, ఒకసారి నిజం రుచి ఎరిగితే అబద్ధమే చేదు అనిపిస్తుంది. తర్వాత మన చుట్టూ, మన ఎదుట నిజమే ఉండాలన్న ఆకాంక్ష పెరుగుతుంది. అప్పుడు నిజం చెప్పని వారిని నిలదీయాలనిపిస్తుంది. నిజం మనలో అలాంటి శక్తిని ఇస్తుంది. మన పిల్లలకు ఒక నిజమైన సమాజాన్ని అందిస్తుంది. అబద్ధాల వెనుక అసలు కారణాలు అవసరమున్నా, లేకపోయినా... అతి తేలిగ్గా ఆడే అబద్ధాల వెనుక కూడా కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఆ కారణాల్లో కొన్ని... ‘నిజం చెప్పే ధైర్యం లేకపోవడం’ వల్ల చాలాసార్లు అబద్ధాలు చెబుతుంటాం. నిజం చెబితే - అవతలి వ్యక్తి ఏమనుకుంటాడో, ఎక్కడ తప్పుగా అనుకుంటాడో అని భయపడి అబద్ధాన్ని ఆశ్రయిస్తుంటాం. ‘బాధ్యత తీసుకోవడం ఇష్టలేకపోవడం’ వల్ల అబద్ధాలు చెబుతుంటాం. ‘అవతలి వాళ్లను మంచి చేసుకోవడం కోసం... వాళ్ల నుంచి మంచి మార్కులు కొట్టేయడం కోసం...’ లేనిది కూడా ఉన్నట్లు చెప్పేస్తుంటాం. చేసిన తప్పుకు శిక్ష నుంచి తప్పించుకోవడం కోసం... అబద్ధాన్ని ఆశ్రయిస్తుంటాం. అది స్కూల్లో హోమ్ వర్క్ చేయకపోవడం కావచ్చు. బాస్ ఇచ్చిన పని టైమ్‌కు చేయకపోవడం కావచ్చు. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం అబద్ధాలు ఆడేస్తుంటాం. ఇతరులను హర్ట్ చేయకుండా ఉండడం కోసం... లాభం పొందడం కోసం... అసత్యాన్ని ఆశ్రయిస్తుంటాం. ఉద్యోగానికి పెట్టే అప్లికేషన్లో అర్హతలు, అనుభవం దగ్గర నుంచి చేసిన, చేయని పనుల దాకా... లేని గొప్పలు ఎంత చెప్పుకుంటే అంత బెటరని తప్పుగా అనుకుంటూ ఉంటాం.మన మాటే కరెక్టని ఒప్పించడం కోసం... అవతలి వ్యక్తి నిర్ణయాన్ని ప్రభావితం చేయడం కోసం... అబద్ధాల్ని కూడా నిజం అన్నంతగా చెప్పేస్తుంటాం. నాన్నా పులి ఒక్కసారి ఆలోచించండి. ఈ అబద్ధాలు ఆడకపోతే ప్రాణాపాయం ఉందా? నిజం చెప్పలేనప్పుడు కనీసం అబద్ధాన్ని అవాయిడ్ చేయవచ్చు కదా. అంతరాత్మ ఒక శుభ్రమైన అద్దం లాంటిది. అబద్ధం ఆడిన ప్రతిసారీ దాని మీద ఒక గీత పడుతుంది. ఇప్పుడు ఈ అబద్ధాలన్నీ నిండిన అంతరాత్మను ఊహించుకోండి. ఎలా ఉంది? నిజం స్వేచ్ఛనిస్తుంది. ఆరోగ్యాన్నిస్తుంది. మంచి జీవితాన్ని ఇస్తుంది. సరదా అబద్ధాలు నిజం చెప్పులు వేసుకునేలోపు, అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందని సామెత. ఏదో ఒక చిన్న వెసులుబాటు కోసం ఒక అనవసరమైన అబద్ధం చెబుతూ ఉంటాం. ఇవిగో... కొన్ని డెయిలీ లైస్...అయిదు నిమిషాల్లో వచ్చేస్తా.... ట్రాఫిక్‌లో ఉన్నా...సార్! ఒంట్లో బాగా లేదు... జ్వరంగా ఉంది. ఇవాళ ఆఫీస్‌కు రాలేను. సెలవు కావాలి...ఈ డ్రెస్‌లో మీరెంత అందంగా ఉన్నారో... నువ్వు లేకుండా నేను బతకలేనుమీరు ఫోన్ చేసినప్పుడు చూసుకోలేదు. మొబైల్ ఇంట్లో పెట్టి మర్చిపోయా ‘ఆఫీస్‌లో పని ఉంది, మీటింగ్ ఉంది. లేటవుతుంది’ నేనెక్కడ కొన్నా. ఇది మా పుట్టింటివాళ్ళు పెట్టిన చీర ‘మీరు చెప్పింది (రాసింది) అద్భుతం. మీ లాగా చెప్పేవాళ్ళను, రాసేవాళ్ళను ఇంకొకరిని చూడలేదు’ నిన్ననే మీ గురించి అనుకున్నాం... మీకు ఫోన్ చేశా... దొరకలేదుమొన్ననేగా నాకు... 28 వెళ్లి 29 వచ్చింది...నాకేం బ్రహ్మాండంగా ఉన్నా. ఉద్యోగం, సంసారం - అంతా జాలీగా సాగిపోతున్నాయినేనస్సలు అబద్ధమే ఆడను. ఉన్నమాటే చెబుతాను సత్యాసత్యాలు అక్కచెల్లెళ్లు.. మహాభారతంలో వినత, కద్రువ అనే అక్కచెల్లెళ్లు ఉన్నారు. వినతకు అబద్ధం చెప్పడం తెలియదు. కద్రువకు నిజం చెప్పడం తెలియదు. ఒకనాడు సముద్రతీరానికి విహారానికి వెళితే అల్లంత దూరంలో ఒక గుర్రం కనిపిస్తుంది. ‘అక్కా! గుర్రం తోక నల్లగా ఉంది కదూ’ అంటూంది కద్రువ. ‘లే దే! తెల్లగా ఉందే’ అంటుంది వినత. ఇద్దరూ పందెం వేసుకుంటారు. అప్పటికే చీకటి పడుతుండటంతో, మరుసటి రోజు సాయంత్రం అదే సమయానికి వచ్చి పరిశీలిద్దామనుకుంటారు. ఆ రాత్రి కద్రువ తన నాగ సంతానాన్ని పిలిచి, ‘మీలో ఎవరో ఒకరు వెళ్లి ఆ గుర్రం తోకకు చుట్టుకోవాలి’ అని ఆజ్ఞాపిస్తుంది. క ర్కోటకుడు అనే కుమారుడు అందుకు అంగీకరిస్తాడు. మరుసటి రోజు ఇద్దరూ సముద్ర తీరానికి వెళతారు. గుర్రం తోక నల్లగా కనపడుతుంది. వినత తన చెల్లెలు కద్రువకు సేవకురాలిగా మారుతుంది. కద్రువ తాత్కాలిక లాభం పొందింది. కాని తరవాత నష్టపోయింది. వినతకు దాస్యవిముక్తి కలుగచేయడం కోసం ఆమె కుమారుడు గరుత్మంతుడు అమృతం సాధిస్తాడు. పాములకు శాపం కలిగి యజ్ఞకుండంలో పడి మరణిస్తాయి. అబద్ధం చెప్పిన కద్రువ తాత్కాలికంగా రాణివాసం అనుభవించిందే కాని, శాశ్వతంగా సంతానాన్ని కోల్పోయింది. -
ప్రతి అబద్ధమూ మోసం కాదు!!
అబద్ధం మంచిది... అబద్ధం చెడ్డది... మన పూర్విక తాత్వికులకూ తెలుసు అందుకే వారన్నారు... సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. న బ్రూయాత్ సత్యమప్రియమ్. అంటే... ఎదుటివాళ్లకు ప్రియంగా ఉంటేనే సత్యం చెప్పమన్నారు. లేకపోతే వద్దన్నారు. అంతమాత్రాన వాళ్లు మోసం చేయమని చెప్పలేదు కదా! అబద్ధం మంచిది... అబద్ధం చెడ్డది... ఈ రెండు స్టేట్మెంట్లలో ఏది కరెక్టు? రెండూ కరెక్టే. అందుకే ప్రతి ఇంట్లో ముగ్గురు కచ్చితంగా ఉంటారు... భార్య, భర్త, ఒక అబద్ధం! ఒక మనిషి అన్నీ నిజాలే చెప్పి బతకడం చాలా కష్టం. దాన్ని కొందరు మూర్ఖత్వం అంటారు. అలా నిత్యం నిజాలు మాట్లాడే వ్యక్తి అంటే ఈ సమాజం భయపడుతుంది కూడా. నిజం ఎంత ప్రమాదమో అబద్ధాలు అంతే ప్రమాదం. కాపురాలు నిలబెట్టే అబద్ధాలుంటాయి, కాపురాలు కూల్చే అబద్ధాలుంటాయి. పెళ్లికి ముందు ముగిసిపోయిన ప్రేమకథ దాచితే అబద్ధం గాని పెళ్లయ్యాక నెరపే అక్రమ సంబంధం దాయడం అబద్ధం కాదు మోసం. వెయ్యి అబద్ధాలు చెప్పి అయినా ఒక పెళ్లి చేయమన్నారు. దాని అంతరార్థం మోసం చేసి పెళ్లి చేసుకోమని కాదు. జీవితంలో సంతోషం సర్దుకుపోవడంలోనే ఉంది. ప్రతి మనిషిలో లోపాలుంటాయి. వాటినే వెతుక్కుంటూ ఉంటే ఎవరికీ పెళ్లిళ్లు కావు. పైగా పెళ్లపుడు చెప్పే చాలా అబద్ధాలు దాగవు. అయితే, తెలిసినా ఇరువైపులా సర్దుకుపోవాలి. అలా సర్దుకుపోగలిగిన అబద్ధాలే చెప్పాలి. జీతం ఓ ఐదు వేలు ఎక్కువ చెప్పి పెళ్లి చేసుకుంటే సర్దుకుపోవచ్చు కానీ ఉద్యోగమే అబద్ధం అయితే సర్దుకుపోయేదేమీ ఉండదు. అంటే, ఈ అబద్ధాలు మంచి చేసేవి కావాలి గాని హాని చేసేవి కాకూడదు అన్నది పెద్దల సిద్ధాంతం. ఇలాంటిదే పాశ్చాత్య దేశాల్లో కాస్త పద్ధతిగా ఉంటుంది. అదే ‘వైట్లైస్ థియరీ’. దీని ప్రకారం కాపురం కాపాడుకోవడానికి చెప్పే ప్రతి అబద్ధమూ మంచిదే. ‘అతడు’ సినిమా చూసి ఉంటే మీకు ఓ డైలాగు గుర్తుండే ఉంటుంది... ‘నిజం దాచాలనుకోవడం అబద్ధం. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం’. అంటే కాపురంలో అబద్ధాలు ఉండొచ్చు గాని మోసాలు ఉండకూడదు. సమస్య ఎక్కడ వస్తుందంటే... భర్త చెప్పే ప్రతి అబద్ధమూ మోసమే అనే భావన భార్యలో ఉంటుంది. అది నిజం కాదు. ఎందుకంటే భర్త చెప్పే అబద్ధాల్లో కొన్ని భాగస్వామిని బాధ పెట్టకూడదని చెప్పేవి ఉంటాయి. కొన్ని కాపురంలో కలతలను నివారించడానికి అయి ఉంటాయి. ఇంకొన్ని మోసం చేయడానికే చెప్పి ఉండొచ్చు. నిజాలు తెలియకుండా/తెలుసుకోకుండా మనిషిని అపార్థం చేసుకోవడం వల్ల జీవితం ముళ్ల బాట అవుతుంది. ఈ విషయం మన పూర్విక తాత్వికులకూ తెలుసు అందుకే వారన్నారు... సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. న బ్రూయాత్ సత్యమప్రియమ్. అంటే... ఎదుటివాళ్లకు ప్రియంగా ఉంటేనే సత్యం చెప్పమన్నారు. లేకపోతే వద్దన్నారు. అంతమాత్రాన వాళ్లు మోసం చేయమని చెప్పలేదు కదా. అందుకే ప్రతి అబద్ధమూ మోసం కాదు. ప్రాణ, మాన, విత్త భంగంలో ముందు బొంకే ప్రతి అబద్ధమూ ఆపద్ధర్మమే. ఆమోదయోగ్యమే. అది మోసం కానే కాదు. ఈ విషయం గ్రహిస్తే అబద్ధానికీ, మోసానికీ తేడా తెలుస్తుంది. అది ప్రతి జీవిత భాగస్వామీ తెలుసుకుంటే వాళ్లదిక పండంటి కాపురమే. అయితే కొన్ని విషయాలు గ్రహించాలి సాధారణంగా భారతీయ పురుషులు తల్లీపెళ్లాల గొడవలు తగ్గించడానికి, భార్యకోపం నుంచి తప్పించుకోవడానికి అబద్ధాలు చెబుతారట. కొన్నిసార్లు నొప్పించకూడదన్న మంచి కారణంతో చెప్పిన అబద్ధాలు కూడా పెద్ద చిక్కులు తెచ్చిపెడుతుంటాయట. అబద్ధం చెప్పిన విషయం కన్నా భర్త అబద్ధమాడాడన్న బాధే మహిళలను ఎక్కువగా బాధిస్తుందట. హద్దుల్లో ఉండే అబద్ధాల గురించి తెలిసినా కారణాలు అడిగి ఒకరినొకరు క్షమించుకుంటే కాపురం పండుతుంది. - ప్రకాష్ చిమ్మల