
సాధారణంగా జంతువులు యజమాని దృష్టిని ఆకర్షించడానికి రకరకాల తిక్క పనులు చేస్తుంటాయి. ఇటు.. అటు.. దూకుతుంటాయి. పక్క జంతువులతో ఊరికే గొడవ పడుతుంటాయి. కొన్ని సార్లు దెబ్బతగిలినట్లు యాక్టింగ్ కూడా చేస్తుంటాయి. ఇలాంటి చేష్టలను మన పెంపుడు కుక్కల్లో చూస్తుంటాం. కానీ ఉడుతలు కూడా ఈ కొవలోకి వచ్చేశాయా? అని అనిపిస్తుంది మీరు ఈ వీడియో చూస్తే..! ఇంతకూ ఓ నల్లని ఉడత ఏ చేసిందో తెలుసా..?
ఉడుతలు కూడా యాక్టింగ్ చేస్తాయా? అంటే అవుననే అనాలి. దానికి ఏం అనిపించిందో తెలియదు కానీ ఇంట్లో చీపురుతో కాసేపు ఆటలాడింది. అనంతరం ఆ చీపురును మీద వేసుకుని గది ఫ్లోర్‌పై బోర్లా పడుకుంది. చీపురు దాని పొట్టపై పడి ఉండడంతో.. ఉడుతపై చీపురు పడి గాయపడినట్లుందే అని అనిపించాల్సిందే సదరు వీక్షకునికి. దాని నటనకు ఆస్కార్ ఇవ్వొచ్చనుకోండి..! ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఉడుత కొంటె చేష్టలకు వ్యూవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు కామెంట్ పెట్టారు. (ఫ‍్లైయింగ్ ఉండుత.. లైయింగ్ ఉడుత) 'ఎగిరే ఉడుత.. అబద్దాల ఉడుత' అని మరొకరు కామెంట్ చేశారు.
Squirrel fakes an injury pic.twitter.com/5xXeTFUv7U
— Crazy Clips (@crazyclipsonly) June 3, 2023
ఉడుతలు చాలా చురుకుగా ఉంటాయని ఓ జంతు నిపుణుడు తెలిపారు. నిత్యం ఎగురుతూ, దూకుతూ ఆటలాడుతుంటాయని చెప్పారు. పట్టణాల్లోని గదులు వాటికి చాలా చిన్న ప్రదేశం కావున ఆడుకోవడానికి కావాల్సిన ప్రదేశం ఉండదని అన్నారు. నల్లని ఉడుతలను పెంచడానికి అనుమతి లేదని చెప్పారు. వాటికి ప్రత‍్యేకమైన కేర్ అవసరమని పేర్కొన్నారు. వెటర్నరీ సెంటర్లలో లభించవని తెలిపారు. సాధారణంగా ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాల్లో ఉంటాయని చెప్పారు.
ఇదీ చదవండి: వార్నీ..! కుక్కకు ఇంత పెద్ద నాలుకా..! గిన్నీస్ రికార్డ్