flying
-
3 ఎయిర్‌లైన్స్‌పై డీజీసీఏ చర్యలు
న్యూఢిల్లీ: వివిధ నిబంధనల ఉల్లంఘనలకు గాను మూడు విమానయాన సంస్థలు, 1 ఫ్లయింగ్ ట్రైనింగ్ సంస్థపై విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ చర్యలు తీసుకుంది. రద్దయిన ఫ్లయిట్లకు సంబంధించి ప్రయాణికులకు పరిహారం చెల్లించనందుకు గాను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు రూ. 10 లక్షల జరిమానా విధించింది. అలాగే సంక్షోభంలో చిక్కుకున్న స్పైస్‌జెట్‌పై పర్యవేక్షణ స్థాయిని పెంచడంతో పాటు పలు ఉల్లంఘనలకు గాను ఆకాశ ఎయిర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫ్లయిట్స్ తరచుగా రద్దవుతున్న వార్తల నేపథ్యంలో ఆగస్టు 7, 8 తేదీల్లో కంపెనీ ఇంజినీరింగ్ యూనిట్ల స్పెషల్ ఆడిట్ నిర్వహించగా, నిర్దిష్ట లోపాలు తమ దృష్టికి వచ్చినట్లు డీజీసీఏ తెలిపింది. ఈ నేపథ్యంలోనే సంస్థపై పర్యవేక్షణను మరింతగా పెంచినట్లు పేర్కొంది. అటు, ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదంపై ఆడిట్ నిర్వహించిన మీదట అల్కెమిస్ట్ ఏవియేషన్ అనుమతులను డీజీసీఏ సస్పెండ్ చేసింది. -
గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
ఫుల్లు ట్రాఫిక్.. ఐదారు కిలోమీటర్లు వెళ్లాలన్నా అరగంట పట్టేస్తోంది.. హాయిగా గాల్లో ఎగిరెళితే బాగుండు అనిపిస్తుంటుంది కదా..నిజంగానే అలా ఉన్నచోటు నుంచి గాల్లో ఎగిరెళ్లిపోయే..ఫ్లయింగ్ కార్ రెడీ అయింది. దాని పేరు హెక్సా.అమెరికాకు చెందిన ‘లిఫ్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్ కార్పొరేషన్’ సంస్థ దీనిని అభివృద్ధి చేసింది. తాజాగా జపాన్‌లోని టోక్యో నగరంలో జరిగిన ‘సుషి టెక్ టోక్యో–2024’ కార్యక్రమంలో దీన్ని ప్రదర్శించారు. పది మీటర్ల ఎత్తులో తిప్పుతూ.. షోలో ఈ ఫ్లయింగ్ కార్‌ను కేవలం బొమ్మలా పెట్టడం కాదు.. గాల్లో తిప్పి మరీ చూపించారు. కారులో కూర్చున్న వ్యక్తి.. దాన్ని పది మీటర్ల ఎత్తులో అటూ ఇటూ తిప్పాడు. ఈ ‘హెక్సా’ ఫ్లయింగ్ కార్ వెడల్పు 4.5 మీటర్లు, ఎత్తు 2.6 మీటర్లు, 196 కిలోల బరువు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. గాల్లో ఎగిరేందుకు 18 ప్రొపెల్లర్లు (మోటార్లు, రెక్కలు) బిగించారు. సెకన్లలోనే ఎటు కావాలంటే అటు తిప్పగలిగేలా ఏర్పాట్లు చేశారు. ఇది రీచార్జబుల్ బ్యాటరీలతో నడుస్తుంది. ఇది గంటకు 100 కిలోమీటర్ల వరకు వేగంతో వెళ్లగలదని కంపెనీ తెలిపింది. నేల మీదేకాదు.. నీటిలోనూ సురక్షితంగా ల్యాండ్ అవుతుందని పేర్కొంది. త్వరలోనే వీటిని అమ్మకానికి పెట్టనున్నట్టు వెల్లడించింది. ఇంతకీ ధరెంతో తెలుసా.. రూ.4.12 కోట్లు మాత్రమే.భవిష్యత్తు ఫ్లయింగ్ కార్లదే.. కిక్కిరిసిపోయి, అడుగు కూడా కదలని ట్రాఫిక్ సమస్యతో అల్లాడుతున్న నగరాల్లో భవిష్యత్తులో ఇలాంటి ఫ్లైయింగ్ కార్లు దూసుకుపోవడం ఖాయమని సుషి టెక్ షోలో పాల్గొన్న నిపుణులు పేర్కొన్నారు. అత్యవసరమైన మందులు, ఇతర సామగ్రి రవాణాకూ ఇవి అద్భుతంగా తోడ్పడతాయని చెప్పారు. ముఖ్యంగా ప్రమాదాలు, విపత్తులు సంభవించినప్పుడు.. ఫ్లయింగ్ కార్లతో ఎంతో ప్రయోజనం ఉంటుందని టోక్యో గవర్నర్ యురికో కోయికే పేర్కొన్నారు. - సాక్షి, సెంట్రల్‌డెస్క్ -
పతంగుల పోటీలో ఘోరం.. గొంతు తెగి ఆరుగురు విలవిల.. 35 మందికి గాయాలు!
రాజస్థాన్‌లో అక్షయ తృతీయ వేళ విషాదం చోటుచేసుకుంది. ఈ పండుగను రాష్ట్రంలో అఖా తీజ్ అని కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా బికనీర్‌లో గాలిపటాలు ఎగురవేసే సంప్రదాయం ఉంది. అయితే వీటిని ఎగువేసేందుకు వినియోగించే చైనీస్ మాంజాలు పలువురిని గాయాలపాలు చేస్తున్నాయి.చైనీస్ మాంజా తగలడంతో 35 మంది గాయపడ్డారు. ఆరుగురి గొంతులు కోసుకుపోయాయి. మాంజా బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బికనీర్ జిల్లా ఆరోగ్య యంత్రాంగం బాధితులకు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసింది. బికనీర్‌లోని పీబీఎం ఆస్పత్రిలో కూడా గాలి పటాల బాధితులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.గాలిపటాల మాంజాల కారణంగా గాయపడిన 35 మందికి పీబీఎం ఆస్పత్రిలోని ట్రామా సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. గొంతు తెగిన ఆరుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ట్రామా సెంటర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎల్ కపిల్ తెలిపారు. మరోవైపు నగరానికి చెందిన పలువురు తమ ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి గాలిపటాలు ఎగరవేయడంతో ఆకాశం నిండా గాలిపటాలు కనిపిస్తున్నాయి. చైనా మాంజా కారణంగా పక్షులు కూడా చనిపోతున్నట్లు తెలుస్తోంది. आखातीज और बीकानेर स्थापना दिवस पर आइए कभी हमारे बीकानेर और देखिए यहां कि पतंगबाजी इतनी धूप में 🔥🎉#Bikaner pic.twitter.com/QdvPW0R66q— MAHENDARA GODARA (@MAHENDRAJAAT010) May 10, 2024 -
గాలిపటాలతో డ్రోన్లను నిర్వీర్యం చేస్తున్న రైతులు!
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న కిసాన్ ఆందోళన్ 2.0కు బుధవారం రెండవ రోజు. ప్రస్తుతం హర్యానాలోని అంబాలాలోగల శంభు సరిహద్దు దగ్గర రైతులు కాపుగాశారు. గత 36 గంటలుగా రైతులు ఇక్కడి నుంచే తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. మరోవైపు పోలీసులు నిరంతరం రైతులపై టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగిస్తున్నారు. రైతులు తమ ఆందోళనల్లో భాగంగా ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసుల డ్రోన్లకు ఆటంకం కలిగించేందుకు గాలిపటాలను ఎగురవేయడం ప్రారంభించారు. ఇందుకోసం రైతులు లెక్కలేనన్ని గాలిపటాలను తీసుకువచ్చి, ఎగురవేయడం ప్రారంభించారు. దీంతో ఆ డ్రోన్లు గాలిపటాల దారాలకు చిక్కుకుని కింద పడిపోతున్నాయి. కాగా శంభు సరిహద్దులో పంజాబ్ నుంచి వస్తున్న రైతులపై హర్యానా పోలీసులు నిరంతరం నిఘా సారిస్తున్నారు. ఆందోళనలకు కొనసాగిస్తున్న రైతులు డ్రోన్లపై రాళ్లు రువ్వే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ రాళ్లు డ్రోన్లను తాకలేకపోతున్నాయి. మరోవైపు హర్యానాలోని జింద్‌లోని చక్కెర మిల్లును తాత్కాలిక జైలుగా మార్చారు. ఇక్కడ ఒక వైద్యుడు, ఫార్మాసిస్టును నియమించారు. అలాగే గాయపడిన రైతులకు ఇక్కడే చికిత్స అందిస్తున్నారు. ఈ చక్కెర కర్మాగారం జింద్-పాటియాలా-ఢిల్లీ రహదారిలోని ఝంజ్ గ్రామానికి సమీపంలో ఉంది. -
వాయుసేనలో శిక్షణాధికారిగా రైతు బిడ్డ
చోడవరం: రైతు బిడ్డ భారతదేశ యుద్ధ విమానాల్లో శిక్షణ ఇచ్చే అధికారిగా ఎదిగారు. తండ్రి వ్యవసాయం చేసుకుంటూ కుమారుణ్ణి భారత సైన్యంలో చేర్పించగా.. తండ్రి కష్టానికి, ఆశయానికి అనుగుణంగా ఆ కుమారుడు 21 ఏళ్లప్రాయంలోనే ఉన్నత స్థానాన్ని అందిపుచ్చుకున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బెన్నవోలు గ్రామానికి చెందిన సాధారణ రైతు మజ్జి గౌరీశంకర్, లక్ష్మి దంపతులకు వెంకటసాయి, దుర్గాప్రసాద్ ఇద్దరు కుమారులు. చిన్నతనం నుంచి ఇద్దరూ చదువులో ముందంజలో నిలిచారు. పెద్ద కుమారుడు ప్రాథమిక విద్య చోడవరంలో చదివి, 6వ తరగతిలో విజయనగరం సైనిక్ స్కూల్లో చేరారు. అక్కడ ఇంటర్మిడియెట్ చదువుతూ భారతదేశ సైనిక విభాగంలో చేరేందుకు శిక్షణ కూడా పొందారు. దేశ రక్షణ విభాగంలో అత్యంత కీలకమైన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్షల్లో 2019లో ఉత్తమ స్థానం సాధించి ఎన్డీఏలో చేరారు. మూడేళ్లపాటు పుణెలో, ఏడాదిపాటు హైదరాబాద్ దుండిగల్ ఎయిర్‌పోర్టులో యుద్ధ విమానాల్లో శిక్షణ పొందారు. ఎన్డీఏతోపాటు ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో బీటెక్ ఇంజినీరింగ్ (ఈసీఈ) కూడా పూర్తిచేశారు. శిక్షణ అనంతరం దేశ రక్షణ విభాగంలో కీలకమైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ యుద్ధ శిక్షణలో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా భారత రక్షణ శాఖ నియమించింది. మజ్జి వెంకటసాయిని అనకాపల్లి కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి మంగళవారం అభినందించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకులకు వెంకటసాయి మంచి స్ఫూర్తిగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. దేశానికి సైన్యాన్ని అందిస్తున్న బెన్నవోలు మారుమూల గ్రామంగా పెద్దేరు నది ఒడ్డున ఉన్న బెన్నవోలు గ్రామం దేశానికి ఎందరో సైనికులను అందించింది. ఆరు దశాబ్దాలుగా గ్రామానికి చెందిన అనేక మంది యువకులు త్రివిధ దళాల్లో చేరి దేశానికి సేవలందించారు. పూర్తిగా వ్యవసాయాధారిత గ్రామమైనప్పటికీ దేశ రక్షణకు ఈ గ్రామం చేస్తున్న సేవ అందరి ప్రశంసలు అందుకుంటోంది. నా మొదటి ఆశయం ఇదే చిన్నప్పటి నుంచీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా చేరాలని అనుకునేవాణ్ణి. మా అమ్మ, నాన్న కష్టపడి పనిచేస్తూ నా చదువుకు కావలసినవన్నీ సమకూర్చారు. వారి సహకారంతో నా జీవితాశయాన్ని సాధించగలిగాను. దేశానికి సేవ చేయాలన్న నా ఆశయానికి ఫ్లయింగ్ ఆఫీసర్ పోస్టు మరింత దోహదపడుతుంది. – మజ్జి వెంకటసాయి, ఫ్లయింగ్ ఆఫీసర్ -
జై భజరంగ భళీ!
ఆకాశంలోకి చూస్తే గాల్లో ఎగురుతున్న హనుమంతుడు కనిపిస్తే ఎంత వింత! ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఇలాంటి దృశ్యమే కనిపించి ప్రజలను ఆశ్చర్యానందాలకు గురి చేసింది. ఆ నగరంలోని ఒక ఉత్సవ కమిటీ వాళ్లు గాల్లో ఎగురుతున్నట్లు ఉండే హనుమాన్ రూపాన్ని డ్రోన్‌కు బిగించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. కొన్ని సంవత్సరాల క్రితం పంజాబ్‌లోని లుథియానాలో ఇలాంటి దృశ్యమే కనువిందు చేసింది. దానినుంచి స్ఫూర్తి పొంది ఈ వీడియో చేశారేమో తెలియదుగానీ ప్రజలు మాత్రం ఆకాశానికేసి చూస్తూ ‘జై భజరంగభళీ’ అంటూ నినదించారు. -
తిరుమల ఆలయంపై విమానం సంచారం...తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన టీటీడీ
-
600 ఏళ్ల నాటి నృత్యం..రెప్పవాల్చడం మర్చిపోవాల్సిందే!
ఒక్కో దేశంలో ఒక్కో రకరమైన సాంస్కృతిక సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని విభిన్న సంప్రదాయాలు, కళలు ఆయా ప్రాంతాలకే పెట్టింది పేరుగా కూడా ఉంటాయి. ఆయా దేశాల్లో ఉన్న విద్య, వైజ్ఞానికి సాంస్కృతకి కళలు, శాస్త్రలను ప్రోత్సహింస్తూ కనుమరుగవ్వకుండా కాపాడేందుకు కృషి చేస్తున్న యునెస్కో 600 ఏళ్ల నాటి ఓ అద్భుత అనితర సాధ్యమైన నృత్య కళకు సంబంధించిన వీడియోని నెటిజన్లతో పంచుకుంది. ఆ నృత్యకళ మన కళ్లను ఆర్పడమే మర్చిపోయాలా కట్టిపడేస్తుంది. ఈ కళను ప్లయింగ్ మెన్ డ్యాన్స్‌గా వ్యవహరిస్తారు. ఇది మెక్సికో, మధ్య అమెరికాలో తూర్పు రాష్ట్రమైన వెరాక్రూజ్‌లోని టోటోనాక్ సముహ ప్రజలు ఈ నృత్యాన్ని చేస్తుంటారు. దీన్ని వారు సంతానోత్పత్తి డ్యాన్స్‌గా పిలుస్తారు. ఆచార వ్యవహారాలు, ప్రకృతి పట్ల తమకున్న గౌరవం, సామరస్యతను తెలియజేసేందుకు చేసే ఫెర్టిలిటీ డ్యాన్స్ ఇది. ఈ నృత్యం చేసేటప్పడూ కొంతమంది పురుషులు బృందం ఓ పొడవాటి స్థంభంపై గుంపుగా కూర్చొంటారు. అందులో వ్యక్తి స్థంభంపై బ్యాలెన్స్ చేసుకుంటూ..ఒక విధమైన సాధనంతో ఊదుతూ.. గాల్లో డ్యాన్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి సెంటర్ పొజిషన్ని ఆక్రమించి కూర్చోగానే మిగతా వ్యక్తులు తలకిందులుగా..ఆ స్థంభం చుట్టూ వేలాడుతూ..నలు దిశల్లో తిరుగుతారు. ఆ తర్వాత క్రమంగా కిందకి దిగిపోతారు. అద్భతంగా కనిపిస్తుంది ఆ దృశ్యం. ఈ మేరకు యునెస్క్ ఇన్‌స్టాగ్రాంలో అందుకు సంబందించిన వీడియోని షేర్ చేస్తూ..వారు ఏవిధంగా నృత్యం చేశారో వివరించింది. View this post on Instagram A post shared by UNESCO (@unesco) (చదవండి: టీవి స్టార్‌గా పేరు తెచ్చుకుంటూనే.. ఎంట్రపెన్యూర్‌గా రాణిస్తున్న ఆష్క) -
కుర్చీలతో వీరంగం చేసిన కాంగ్రెస్ నేతలు.. వీడియో వైరల్
ముంబై: ముంబైలో జరిగిన యూత్ కాంగ్రెస్ మీటింగులో మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కునాల్ నితిన్ రౌత్ మద్దతుదారులకు వ్యతిరేక వర్గానికి మధ్య వివాదం చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్ ముందే కుర్చీలు విసురుకుంటూ దాడులకు దిగారు. దీంతో బి.వి.శ్రీనివాస్ సభలో ఏమీ మాట్లాడకుండానే అక్కడినుండి వెళ్లిపోయారు. చాలాకాలంగా మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కునాల్ నితిన్ రౌత్ ను ఆ బాధ్యతల నుండి తప్పించమని ఒక వర్గం కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తూనే ఉంది. మరో వర్గం మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తూ వస్తోంది. దీంతో ఈ రెండు వర్గాల మధ్య సమన్వయాన్ని కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది మహారాష్ట్ర కాంగ్రెస్. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా యూత్ కాంగ్రెస్ సమావేశాన్ని ఏర్పాటుచేసింది అధిష్టానం. తీరా చూస్తే ఈ రెండు వర్గాలు ఆ వేదికను రణరంగంలా మార్చి పరస్పర దాడులకు తెగబడ్డారు. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్ ముందే కుర్చీలు విసురుకుంటూ వీరంగం సృష్టించారు. దీంతో బి.వి.శ్రీనివాస్ సభలో మాట్లాడకుండానే వెనుదిరిగారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. BREAKING: A meeting of the Youth Congress in a fight between two groups over the demand to remove Maharashtra Youth Congress chief Kunal Nitin Raut.pic.twitter.com/AWW7qhF2fP — ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) June 17, 2023 ఇది కూడా చదవండి: ఎన్నికలకు ఫార్ములా రెడీ చేశాం, ఇక రంగంలోకి దూకడమే.. -
ఓసినీ వేషాలో..! ఉడుత చేష్టలకు నెటిజన్స్ ఫిదా.. వీడియో వైరల్
సాధారణంగా జంతువులు యజమాని దృష్టిని ఆకర్షించడానికి రకరకాల తిక్క పనులు చేస్తుంటాయి. ఇటు.. అటు.. దూకుతుంటాయి. పక్క జంతువులతో ఊరికే గొడవ పడుతుంటాయి. కొన్ని సార్లు దెబ్బతగిలినట్లు యాక్టింగ్ కూడా చేస్తుంటాయి. ఇలాంటి చేష్టలను మన పెంపుడు కుక్కల్లో చూస్తుంటాం. కానీ ఉడుతలు కూడా ఈ కొవలోకి వచ్చేశాయా? అని అనిపిస్తుంది మీరు ఈ వీడియో చూస్తే..! ఇంతకూ ఓ నల్లని ఉడత ఏ చేసిందో తెలుసా..? ఉడుతలు కూడా యాక్టింగ్ చేస్తాయా? అంటే అవుననే అనాలి. దానికి ఏం అనిపించిందో తెలియదు కానీ ఇంట్లో చీపురుతో కాసేపు ఆటలాడింది. అనంతరం ఆ చీపురును మీద వేసుకుని గది ఫ్లోర్‌పై బోర్లా పడుకుంది. చీపురు దాని పొట్టపై పడి ఉండడంతో.. ఉడుతపై చీపురు పడి గాయపడినట్లుందే అని అనిపించాల్సిందే సదరు వీక్షకునికి. దాని నటనకు ఆస్కార్ ఇవ్వొచ్చనుకోండి..! ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఉడుత కొంటె చేష్టలకు వ్యూవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు కామెంట్ పెట్టారు. (ఫ్లైయింగ్ ఉండుత.. లైయింగ్ ఉడుత) 'ఎగిరే ఉడుత.. అబద్దాల ఉడుత' అని మరొకరు కామెంట్ చేశారు. Squirrel fakes an injury pic.twitter.com/5xXeTFUv7U — Crazy Clips (@crazyclipsonly) June 3, 2023 ఉడుతలు చాలా చురుకుగా ఉంటాయని ఓ జంతు నిపుణుడు తెలిపారు. నిత్యం ఎగురుతూ, దూకుతూ ఆటలాడుతుంటాయని చెప్పారు. పట్టణాల్లోని గదులు వాటికి చాలా చిన్న ప్రదేశం కావున ఆడుకోవడానికి కావాల్సిన ప్రదేశం ఉండదని అన్నారు. నల్లని ఉడుతలను పెంచడానికి అనుమతి లేదని చెప్పారు. వాటికి ప్రత్యేకమైన కేర్ అవసరమని పేర్కొన్నారు. వెటర్నరీ సెంటర్లలో లభించవని తెలిపారు. సాధారణంగా ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాల్లో ఉంటాయని చెప్పారు. ఇదీ చదవండి: వార్నీ..! కుక్కకు ఇంత పెద్ద నాలుకా..! గిన్నీస్ రికార్డ్ -
Viral Video: ప్రాణాలను కాపాడిన వ్యక్తితో కొంగ స్నేహం.. అతడు ఎక్కడికి వెళ్తే అక్కడికెళ్తోంది
-
ట్రాఫిక్ సమస్యకి చెక్.. జుయ్‌మంటూ ఎగిరే బైకులు రాబోతున్నాయ్!
ప్రస్తుత రోజుల్లో నగరవాసులకు అతి పెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది ట్రాఫిక్ జామ్. దీని వల్ల వాళ్ల సమయం వృథా కావడంతోపాటు వారి ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఇక సిటీ లైఫ్‌లో ట్రాఫిక్ సమస్య కూడా ఓ భాగమే అనుకుని ప్రజలు ముందుకు సాగిపోతున్నారు. అయితే త్వరలో ఈ సమస్యకు చెక్ పెడుతూ ట్రాఫిక్ చిక్కులు లేకుండా త్వరగా గమ్యం చేరుకోవచ్చట. ఎలా అంటారా.. జపనీస్ కంపెనీ తాజాగా గాల్లో ఎగిరే బైకును తయారు చేసింది. ఇటీవలే ఆ బైక్‌ను మీడియా ముందు ప్రదర్శించింది. జుయ్‌మంటూ వచ్చేస్తోంది ఎగిరే బైక్.. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే బైక్. దీనికి XTURISMO hoverbike అని పేరు పెట్టారు. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్( AERWINS) టెక్నాలజీస్ తయారు చేసిన ఈ ఫ్లయింగ్ బైక్ గురువారం యునైటెడ్ స్టేట్స్‌లోని డెట్రాయిట్ నందు జరిగిన ఆటో షోలో ప్రదర్శించారు. ఈ హోవర్‌బైక్ ప్రముఖ స్టార్ వార్స్ సినిమాలోని బైక్‌లతో పొలిక ఉండడంతో అందరినీ ఆకర్షించింది. ఈ బైక్ గరిష్టంగా 100 kph (గంటకు 62 మైళ్లు) వేగంతో 40 నిమిషాల పాటు ప్రయాణించగలదు.ఈ బైకుపై ఒకరు కూర్చుని ప్రయాణం చేయవచ్చు. వచ్చే ఏడాది ఈ బైక్ అమెరికన్ మార్కెట్లోకి రానుంది. జపాన్‌లో ఇప్పటికే ఈ బైక్‌లు అమ్మకంలో ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ చెబుతున్న దాని ప్రకారం ఈ బైక్ ధర చాలా ఎక్కువగా ఉంది. ఈ హోవర్‌బైక్ ధర $7,77,000 (భారత కరెన్సీ ప్రకారం 6 కోట్లు) ఉంటుంది. అయితే కంపెనీ సీఈఓ మాట్లాడుతూ.. ఈ మోడల్ ధరను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని అందుకోసం కంపెనీకి మరో 2-3 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. This is the world's first flying bike. The XTURISMO hoverbike is capable of flying for 40 minutes and can reach speeds of up to 62 mph pic.twitter.com/ZPZSHJsmZm — Reuters (@Reuters) September 16, 2022 చదవండి: భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు! -
అమెరికాలో ప్రమాదం.. ప్రకాశం జిల్లాలో విషాద ఛాయలు
సాక్షి, ప్రకాశం జిల్లా: అమెరికాలో విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో ప్యారాచూట్ ఫ్లయింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం మక్కేనవారిపాలెం గ్రామానికి చెందిన సుప్రజ అక్కడికక్కడే మృతి చెందింది. సుప్రజ కుమారుడు అఖిల్ స్వల్పగాయాల బారిన పడ్డాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం వేకువజామున మూడున్నర గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద ఘటనతో మక్కేనవారిపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
అదో విచిత్రం!...సముద్రం పై కదిలే కాంతి చుక్కలు!!
మనం ప్రకృతిలో ఉండే కొన్ని రకాల వింతలను మన కళ్లతో నేరుగా చూడగలుగుతాం. అయితే ఒక్కొసారి అవి మనం నేరుగా కాకుండా వీడియోలో రికార్డు చేసినప్పుడు గమనిస్తూ ఉంటాం. అచ్చం అలానే ఇక్కడొక పైలెట్ విమానంలో ప్రయాణిస్తుండగా ఒక వీడియో తీసినప్పుడు ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. (చదవండి: అక్కడ చెట్లను తొలగిస్తే.... బహుమతులు ఇస్తారట!) అసలు విషయంలోకెళ్లితే...పసిఫిక్ మహాసముద్రం మీదుగా విమానంలో ప్రయాణిస్తున్న ఒక పైలెట్ వీడియో తీసినప్పుడు ఒక వింత సంఘటన చూశాడు. ఒక మూడు కాంతి చుక్కలు ఒకేరీతీలో కదులుతు ఉంటాయి. ఈ మేరకు కొంత దూరం వరకు వెళ్లి ఆ తర్వాత కనుమరుగవ్వడం గమినించాడు. ఈ మేరకు ఈ కదులుతున్న యూఎఫ్ఓ ఫ్లీట్‌ని కెమరాలో బంధించడమే కాక సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా ఈ వీడియోని 39,000 అడుగుల ఎత్తులో తీశారు. దీంతో నెటిజన్లు ఇది ఇప్పటి వరకు వచ్చిన యూఎఫ్ఓ ఫ్లీట్ వీడియోలో అత్యుత్తమమైనదంటూ ఆ విచిత్రాన్ని చూసి అవాక్కవుతూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: బాప్రే!.... నెపోలియన్ ఖడ్గం వేలంలో రూ. 21 కోట్లు పలికిందట!) A pilot claims he saw a fleet of #UFOs over the Pacific Ocean. The video was shot at around 39,000 feet. 🛸👽 The suspected #alien aircraft took the form of ‘weird’ rotating lights moving across the sky. 😳 What are your thoughts on the footage? 👀🤔 pic.twitter.com/N0I2WS2kYq — Chillz TV (@ChillzTV) December 7, 2021 -
ఈ పడవ నీటిలోనే కాదు..గాల్లో కూడా నడుస్తుంది...!
ఔను మీరు చూసింది నిజమే...ఈ పడవ నీళ్లలోనూ గాలిలోనూ నడుస్తోంది. స్టాక్‌హోమ్‌కు చెందిన పడవల తయారీ సంస్థ కాండెలా ప్రత్యేకమైన పడవను ఆవిష్కరించింది. గత నెలలో సీ -8 ఎలక్ట్రిక్ హైడ్రోఫాయిల్ బోట్ పేరిట కాండెలా లాంచ్ చేసింది. ఈ పడవ పూర్తిగా విద్యుత్ శక్తితో నడవనుంది. ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ బోట్ లాంచ్ అయిన ఆరు వారాల్లో ఇప్పటికే 60 యూనిట్లకు పైగా కాండెలా విక్రయించింది. చదవండి: ఎలోన్ మస్క్ దెబ్బకు రాకెట్ వేగంతో పెరిగిన గృహ ధరలు గాల్లో ఎలా ఎగురుతుందంటే...! కాండెలా రూపొందించిన బోట్ నీటి ఉపరితలానికి కొంత ఎత్తులో హైడ్రోఫాయిల్స్ సహయంతో గాలిలో నడుస్తోంది. పడవ దిగువ భాగంలో హైడ్రోఫాయిల్స్ను ఏర్పాటు చేశారు. ఈ హైడ్రోఫాయిల్స్కు మోటార్లను అమర్చడంతో నీటి ఉపరితలం నుంచి 3 నుంచి 4 అడుగుల ఎత్తులో బోట్ ప్రయాణిస్తుంది. ఈ బోట్స్ అలలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఉపయోగకరంగా ఉంటుందని కాండెలా పేర్కొంది. పడవలో లగ్జరీ ఫీచర్లు..! ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ బోట్ పూర్తిగా నలుగురు వ్యక్తులు విలాసవంతంగా ప్రయాణించవచ్చును. పడవలో సోఫాతో కూడిన దిగువ డెక్ క్యాబిన్ వంటి ఫీచర్లు మరిన్ని సౌకర్యాలతో నిండి ఉంది. ఇందులో ఉండే సోఫాను బెడ్‌గా కూడా వాడుకోవచ్చును. ప్రీమియం సౌండ్ సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్, 15.4-అంగుళాల హై-రిజల్యూషన్ టచ్‌స్క్రీన్‌ను క్యాబిన్లో అమర్చారు. కాండెలా రూపొందించిన సీ-8 పడవ గరిష్టంగా 30 నాట్ల వేగంతో ప్రయాణించనుంది. 45 kWh బ్యాటరీ సహాయంతో గరిష్టంగా 50 నాటికల్ మైళ్లు (92 కిమీ) ఈ పడవ ప్రయాణిస్తోంది. Just had the most amazing experience in Stockholm where @CandelaBoat let me take out one of their flying electric boats. So easy to fly, it makes me look like a pro. It doesn’t get any cooler than this! Full article and video soon on @ElectrekCo pic.twitter.com/RhrIIckYig — Micah Toll (@MicahToll) September 14, 2021 చదవండి: -
నరకయాతన: విమానం నుంచి కిందపడిన ఇద్దరు అఫ్గన్లు
Shocking Videos from Kabul Airport:: కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో అఫ్గనిస్తాన్ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారం తాలిబన్ల వశం కావడంతో అఫ్గన్ నుంచి బయట పడేందుకు నానాతంటాలు పడుతున్నారు. అఫ్గన్ మీదుగా విమానాల రాకపోకలపై నిషేధం విధించడంతో కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. రన్‌వేపై కదులుతున్న విమానం ఎక్కేందుకు వందలాది మంది ప్రయత్నించారు. విమానం డోర్ క్లోజ్ చేసినా వేలాడుతూ ప్రయాణించేందుకు సాహసించారు. ఈ క్రమంలో టేకాఫ్ అయిన విమానం నుంచి ఇద్దరు అప్గన్లు ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. దీనికి సంబంధించిన భయానక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా అఫ్గనిస్తాన్ తాలిబన్ల వశం కావడం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే తాలిబన్లు మొత్తం అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించడం గమనార్హం. ఇక పూర్తి అధికారాన్ని దక్కించుకొనే దిశగా అడుగులేస్తున్నారు. అందరూ ఊహించనట్లుగానే తాలిబన్లు ఆదివారం అఫ్గన్ రాజధాని కాబూల్‌లోకి దర్జాగా ప్రవేశించారు. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ఈ చారిత్రక నగరంలో పాగా వేశారు. తాము ఎవరిపైనా దాడులు చేయబోమని, ప్రభుత్వం బేషరతుగా లొంగిపోవాలని తాలిబన్లు నిర్దేశించారు. దీంతో అఫ్గన్ కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. శాంతియుతంగా అధికార మార్పిడి కోసం ప్రయత్నిస్తున్నట్లు తాలిబన్ ప్రతినిధులు వెల్లడించారు. అఫ్గన్ తాలిబన్ల వశం కావడంతో అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేసి, తన బృందంతో కలిసి దేశం విడిచి వెళ్లిపోయారు. తజకిస్తాన్‌కు వెళ్లి తలదాచుకుంటున్నారు. -
రెక్కలు విప్పి ఎగిరే తాబేళ్లను చూశారా?
మీరు ఎప్పుడైనా తాబేలు ఈగను చూశారా. ఈగ పరిమాణంలో ఉండే తాబేలును చూశారా. అప్పుడు చూడకపోయినా పరవాలేదు, ఇప్పుడు చూడండి.. తాబేలు, ఈగ రెండూ కలిసిన తాబేళ్లు కనువిందు చేస్తున్నాయి. అతి చిన్నగా ఉండే ఈ తాబేళ్లు, ఒక్కసారిగా రెక్కలు విప్పి ఎగురుతున్నాయి. సోషల్ మీడియాలో తాజాగా విడుదలైన ఈ బంగారు రంగు తాబేలు ఈగను అందరూ వింతగా చూస్తున్నారు. కుమ్మరిపురుగు పరిమాణంలో ఈగలా ఎగిరే ఈ బంగారు తాబేళ్లను ముచ్చటగా చూస్తూ, మురిసిపోతున్నారు నెటిజన్లు. సుశాంత్ నందా అనే ఐఎఫ్ఎస్ ఆఫీసరు, ఈ వీడియోను ట్విటర్లో పెట్టారు. ఒక చేతిలో ఉన్న మూడు బంగారు ఈగ తాబేళ్ల తో ఉన్న ఈ వీడియోను అందరికీ చూపాలనుకున్న ఉద్దేశంతో నందా ఇలా చేశారు. ‘‘కొన్నిసార్లు మెరిసేదంతా బంగారమే’’ అంటూ ట్వీట్ చేశారు. మొట్టమొదట ఈ వీడియోను మణిపూర్‌కి చెందిన థాకమ్ సోనీ అనే ఆర్టిస్టు అందరికీ షేర్ చేశారు. ఈ వీడియోను నందా ట్వీట్ చేయటంతో బాగా వైరల్ అవుతోంది. ఇవి 5–7 మి..మీ. పరిమాణంలో ఉంటాయి. ఒక్కోసారి వీటి ఒంటి మీద మచ్చలుంటాయి. ఇవి దక్షిణ తూర్పు ఆసియాలో సాయంత్రం సమయంలో అందరికీ కనిపిస్తూ కనువిందు చేస్తాయి. ఇప్పుడు ఇవి బంగారంగా కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. ఈ వీడియోను చూసినవారంతా, వారి ప్రాంతాలలో కనిపించే ఇటువంటి తాబేళ్ల గురించి రీట్వీట్ చేస్తున్నారు. చదవండి: పులులు ఈదితే, మొసళ్లు ఒడ్డున సేద తీరుతాయి -
తగ్గిన విమాన ప్రయాణికుల సంఖ్య
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన రంగంపై కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. దేశీయంగా ఈ సెప్టెంబర్‌లో మొత్తం 39.43 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. గతేడాది ఇదే నెలలో పోలిస్తే ఇది 66 శాతం తక్కువని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. అయితే జూలై, ఆగస్ట్లతో పోలిస్తే సెప్టెంబర్‌లో విమాన ప్రయాణికులు పెరిగారు. సమీక్షించిన నెలలో అత్యధికంగా ఇండిగో లో 22.6 లక్షల మంది తర్వాతి స్థానంలో స్పెస్‌జెట్‌లో 5.3 లక్షలమంది ప్రయాణించారు. అలాగే ఎయిరిండియా, ఎయిర్ఏషియా, విస్తరా, గోఎయిర్ విమానాల్లో వరుసగా 3.72 లక్షలు, 2.35 లక్షలు, 2.58 లక్షల మంది ప్రయాణించినట్లు డీజీసీఏ గణాంకాలు చెబుతున్నాయి. ఆక్యుపెన్సీ రేటు 57–73 శాతం: భారతీయ విమాన సంస్థల ఆక్యుపెన్సీ రేటు సెప్టెంబర్‌లో 57 నుండి 73 శాతం మధ్యలో ఉంది. అత్యధికంగా స్పైస్‌జెట్‌లో ఆక్యుపెన్సీ రేటు 70 శాతంగా ఉంది. ఇతర ప్రధాన సంస్థలైన విస్తరా, ఇండిగో, ఏయిర్ ఏషియా ఇండియా, గోఎయిర్, ఎయిరిండియాల ఆక్యుపెన్సీ రేట్లు వరుసగా 66.7 శాతం, 65.4 శాతం, 58.4 శాతం, 57.9 శాతం, 57.6 శాతంగా నమోదైనట్లు డీజీసీఏ తెలిపింది. సైకిళ్లకు గిరాకీ పెంచిన కరోనా న్యూఢిల్లీ: కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టాలతో అల్లాడుతుండగా భారత్‌లో సైకిళ్ల అమ్మకాలు మాత్రం స్పీడందుకున్నాయి. గడిచిన 5 నెలల్లో సైకిళ్ల అమ్మకాలు రెండింతల వృద్ధిని సాధించాయి. ఎలాంటి ఖర్చు లేకుండా తక్కువ, మధ్యస్థాయి గమ్యస్థానాలను చేరుకోవచ్చనే అభిప్రాయంతో పాటు ఆరోగ్య భద్రత, ఫిట్నెస్ తదితర అంశాల దృష్ట్యా ప్రజలు వీటి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో మొత్తం 41,80,945 సైకిళ్లు అమ్ముడుపోయినట్లు అఖిల భారత సైకిల్ తయారీ సమాఖ్య(ఏఐసీఎంఏ) తెలిపింది. కరోనా సంక్షోభంతో ప్రజలకు ఆరోగ్య భద్రత, రోగనిరోధశక్తి పెంపు ఆవశ్యకతల పట్ల అవగాహన పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సైకిళ్ల వాడకమనేది ఆశాజనకంగా మారింది. డిమాండ్ ఒక్కసారిగా ఉపందుకోవడంతో పలు నగరాల్లో సైకిళ్ల కొరత ఏర్పడింది. వినియోగదారులు కొత్త సైకిళ్ల రాక కోసం ఎదురుచూసే పరిస్థితులు నెలకొన్నాయి. ‘‘దేశవ్యాప్తంగా సైకిళ్లకు అనూహ్యరీతిలో డిమాండ్ పెరిగింది. ఈ 5 నెలల్లో అమ్మకాలు 100 శాతానికి వృద్ధిని సాధించాయి. ఈ స్థాయిలో డిమాండ్ నెలకొనడం ఇదే మొదటిసారి కావచ్చు’’ అని ఏఐసీఎంఏ సెక్రటరీ జనరల్ కేబీ థాకూర్ తెలిపారు. 40శాతం క్షీణించనున్నలగ్జరీ కార్ల మార్కెట్! న్యూఢిల్లీ: భారత లగ్జరీ కార్ల తయారీ మార్కెట్ ఈ ఏడాదిలో 40 శాతం క్షీణించే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. పరిశ్రమ డిమాండ్ ఇప్పటికే ఒత్తిడిలో కూరుకుపోయిన నేపథ్యంలో మొత్తం తయారీ పరిమాణం 40 శాతానికి పైగా తగ్గుతాయని ఇక్రా తెలిపింది. గతేడాది అమ్ముడుపోయిన 35 వేల లగ్జరీ కార్లతో పోలిస్తే ఈ ఏడాదిలో 21వేల కార్లు మాత్రమే అమ్ముడుపోయే అవకాశం ఉందని ఇక్రా అంటుంది. ఇదే ఏడాదిలో పాసింజర్ వాహన (పీవీ) విభాగపు డిమాండ్ నెమ్మదిగా సాధారణ స్థాయికి చేరుకుంటుందని రేటింగ్ సంస్థ పేర్కొంది. -
అభినందన్ ఆకాశయానం..!
న్యూఢిల్లీ: భారత వాయుసేనలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మళ్లీ విమానాలను నడపడం ప్రారంభించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న పాకిస్తాన్ యుద్ధ విమానాలతో జరిగిన పోరులో వర్ధమాన్ నడుపుతున్న మిగ్–21 విమానం కూలిపోయి ఆయన గాయాలపాలై పాకిస్తాన్లో పడిపోవడం తెలిసిందే. తన విమానం కూలిపోవడానికి ముందే వర్ధమాన్ పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్–16 యుద్ధవిమానాన్ని కూల్చేశారు. ఆ తర్వాత ఆయన పాకిస్తాన్లో పడిపోయినా ఎంతో ధైర్యం ప్రదర్శించి అందరి మన్ననలూ అందుకున్నారు. ఇటీవలే కేంద్రం ఆయనకు వీరచక్ర అవార్డును కూడా ప్రకటించింది. మార్చి 1న రాత్రి వర్ధమాన్‌ను పాక్ భారత్‌కు అప్పగించాక, దాదాపు రెండు వారాలపాటు వర్ధమాన్ చికిత్స అందుకుంటూ భద్రతా సంస్థల పర్యవేక్షణలో ఉన్నారు. వారి విచారణను ఎదుర్కొన్నారు. వీలైనంత త్వరగా మళ్లీ యుద్ధ విమానాన్ని నడపాలని తాను కోరుకుంటున్నట్లు అప్పట్లో వర్ధమాన్ చెప్పారు. బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ వర్ధమాన్‌కు వైద్య పరీక్షలన్నీ చేసి, ఆయన మళ్లీ విమానం నడిపేందుకు అన్ని రకాలుగా సిద్ధమేనని మూడు వారాల క్రితం వెల్లడించింది. దీంతో వర్ధమాన్ మళ్లీ యుద్ధ విమానాలు నడుపుతున్నారు. ప్రస్తుతం రాజస్తాన్‌లోని వైమానిక స్థావరంలో విధులు నిర్వర్తిస్తున్నారు. -
ఎగిరే మోటర్‌బైక్.. ద స్పీడర్!
ట్రాఫిక్ పెరిగిపోతోందని చికాకు పడుతున్నారా? ఎంచక్కా గాల్లో ఎగురుకుంటూ ఆఫీసుకు వెళ్లగలిగితే భలే ఉంటుందని అనుకుంటున్నారా? అయితే మీ ఆశలు నెరవేరే రోజు దగ్గరలోనే ఉంది. అమెరికన్ కంపెనీ జెట్ప్యాక్ ఏవియేషన్ ‘ద స్పీడర్’ పేరుతో ఎగిరే మోటర్‌బైక్‌ను అభివృద్ధి చేయడం దీనికి కారణం. కొన్నేళ్ల క్రితం వెన్నుకు తగిలించుకునే జెట్‌ప్యాక్‌ను తయారు చేసిన కంపెనీ కూడా ఇదే కావడం విశేషం. ద స్పీడర్ విషయానికి వస్తే.. ఇది చూడ్డానికి మోటర్‌బైక్ మాదిరిగా ఉంటుంది. కానీ నిట్టనిలువుగా పైకి ఎగరగలదు. కాకపోతే దాదాపుగా బొక్కబోర్లా పడుకుని నడపాల్సి ఉంటుంది. మొత్తం నాలుగు టర్బోజెట్ ఇంజిన్లు ఉంటాయి. గరిష్టంగా 15000 అడుగుల ఎత్తులో ఎగరగల సామర్థ్యం దీని సొంతం. దాదాపు 125 కిలోల బరువు మోసుకెళ్లగలదు. కిరోసిన్ లేదా విమాన ఇంధనం సాయంతో 22 నిమిషాలపాటు ఎగురగలదు. అది కూడా గరిష్టంగా గంటకు 241 కిలోమీటర్ల వేగంతో! ఇంకోలా చెప్పాలంటే 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చునన్నమాట. ప్రస్తుతానికి తాము 20 నమూనా బైక్‌లను మాత్రమే తయారు చేస్తున్నామని కంపెనీ చెబుతోంది. ఐదు టర్బోజెట్ల ఇంజిన్లతో పైలట్ అవసరం లేని మైక్‌ల తయారీకి జెట్ప్యాక్ మిలటరీ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అంతా బాగుంది కానీ.. ధర ఎంత అంటారా? ఒక్కో ‘ద స్పీడర్’ ఖరీదు రెండు కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. మిలటరీ వెర్షన్ ఎంతన్నది మాత్రమే తెలియదు. -
తొలి గగన విహారి ‘శ్రీమతి ఎన్సీ సేన్’
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో తొలి విమానం గాల్లోకి ఎప్పుడు ఎగిరింది? దాన్ని ఎవరు నడిపారు? అన్న ప్రశ్నలకు టక్కున సమాధానం చెప్పడానికి ఎన్నో రికార్డులు అందుబాటులో ఉన్నాయి. అయితే అవన్నీ కూడా భారత్‌లో తొలి విమానాలు ‘ఎగ్జిబిషన్’లో భాగంగా 1910లో ఎగిరాయి అని చెబుతున్నాయి తప్పించి. వాటిలో ఫలానా విమానం ముందు ఎగిరింది, ఫలానాది తర్వాత ఎగిరింది అని కచ్చితంగా చెప్పడం లేదు. బ్రిటీష్ వైమానికుడు వాల్టర్ విండమ్ 1910, డిసెంబర్ పదవ తేదీన అలహాబాద్‌లో ఎగ్జిబిషన్ నిర్వహించారని, అందులో భాగంగా కొంత మంది ప్రయాణికులను తన విమానంలో ఎక్కించుకొని ఆయన గగన విహారం చేశారని కొన్ని రికార్డులు తెలియజేస్తున్నాయి. కాదు, కాదు, అంతకుముందే, అంటే 1910 మార్చి నెలలోనే ఇటలీ హోటల్ యజమాని, వైమానికుడు గియాకోమో డీ ఏంజెలిస్ 1910, మార్చి నెలలో మద్రాస్‌లో తన విమానాన్ని ప్రదర్శించారని, అందులో ప్రయాణికులను ఎక్కించుకొని గగన విహారం చేశారని మరికొన్ని రికార్డులు చెబుతున్నాయి. కచ్చితంగా ఇది ముందు, అది వెనక అని రుజువు చేయడానికి భారత వైమానికి సంస్థ వద్ద కూడా ఎలాంటి చారిత్రక రికార్డులు లేవు. కానీ సరిగ్గా ఈ రోజుకు 108 ఏళ్ల క్రితం, అంటే 1910, డిసెంబర్ 19వ తేదీన తొలి మహిళా ప్రయాణికురాలు కోల్‌కతా నుంచి గగన విహారం చేసినట్లు రుజువులు దొరికాయి. కోల్‌కతాలోని టోలిగంజ్ క్లబ్లో నిర్వహించిన వైమానిక ఎగ్జిబిషన్లో భాగంగా శ్రీమతి ఎన్సీ సేన్ తొలి వైమానిక ప్రయాణికురాలిగా 1910, డిసెంబర్ 19వ తేదీన గగన విహారం చేసినట్లు ముంబైకి చెందిన ఔత్సాహిక వైమానిక అధ్యయన వేత్త దేబాశిష్ చక్రవర్తి కనుగొన్నారు. ఆయన ఏడాది కాలంగా అధ్యయనం చేస్తుండగా ఈ విషయం తేలింది. అది సరే, శ్రీమతి ఎన్సీ సేన్ ఎవరు? ఆమె ఫొటోను ప్రచురించిన నాటి ఏవియేషన్ మాగజైన్లో కూడా ఆమె పేరును ఎన్‌షీ సేన్‌గా పేర్కొన్నారు తప్ప, ఆమె గురించి ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. ఆ నాటికి చెందిన రక రకాల మేగజైన్లను మన చక్రవర్తి తిరిగేయగా, ఆమె బెంగాల్‌కు చెందిన ప్రముఖ తత్వవేత్త, సంఘ సంస్కర్త కేశబ్ చంద్రసేన్ కోడలని తేలింది. కేశబ్ చంద్రసేన్‌కు ఐదుగురు కొడుకులు ఉన్నారు? వారిలో ఏ కోడలు అన్న సమస్య వచ్చింది. వారిలో ముగ్గురు కొడుకులు విదేశీయులను పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఆ కోడళ్లకు బెంగాల్ సంప్రదాయం ప్రకారం మామ ఇంటి పేరు రాలేదు. కానీ ఇద్దరికి వచ్చింది. దేబాశిష్ చక్రవర్తి వారిలో నిర్మలా సేన్ ఒక కోడలుకాగా, మృణాలిని దేవీ సేన్ మరొకరు. మృణాలిని దేవీ సేన్‌ను కూడా నీ లుద్దీ అని పిలుస్తారు. కనుక వీరిలో ఎవరైనా ఒకరు కావచ్చని, నిర్మలా సేన్‌నే కావచ్చని అధ్యయనవేత్త చక్రవర్తి భావిస్తున్నారు. 1910, డిసెంబర్ 28వ తేదీన టోలిగంజ్ క్లబ్లో ఏవియేషన్ మీటింగ్‌కు సంబంధించిన ఆహ్వాన పత్రం ‘ఈబే’లో వేలం వేసిన విషయం చక్రవర్తికి అధ్యయనంలో తేలడంతో ఆరోజే గగన విహారం జరిగినట్లు ముందుగా ఆయన పొరపొటు పడ్డారు. అదే వేలం పాటలో ఆ నాటి ప్రయాణికులకు టిక్కెట్లు విక్రయించి, వారి పేర్లను నోటు చేసుకొన్న నాటి ఎయిర్ హోస్టెస్ మాబెల్ బేట్స్ రాసుకున్న కాగితాన్ని కూడా విక్రయించారు. దాని ప్రతిని సాధించడంతో డిసెంబర్ 19వ తేదీన తొలి మహిళా ప్రయాణికురాలు గగన విహారం చేసినట్లు రూఢీ అయింది. ఈ విషయాన్ని ఫ్రెంచ్ వార్తా పత్రికలు ‘ఫిగారో’ డిసెంబర్ 22, 1920 నాటి సంచిక, ‘లీ టెంప్స్’ డిసెంబర్ 23, 1910, ‘గిల్ బ్లాస్’ డిసెంబర్ 26, 1910 నాటి సంచికలు రుజువు చేస్తున్నాయి. నాడు టోలిగంజ్ క్లబ్లో బెల్జియంకు చెందిన వైమానికులు బారన్ పిర్రే డీ కేటర్స్, జూలెస్ టైక్లు ఇద్దరూ తమ బైప్లేన్స్ (అంటే రెక్క మీద రెక్క నాలుగు రెక్కలు ఉంటాయి) నడిపారు. వారిలో ఎవరి విమానాన్ని శ్రీమతి ఎన్సీ సేన్ ఎక్కారో ఈ నాటికి ప్రశ్నే. -
చిన్న రోబో.. పెద్ద సాయం!
బోస్టన్: సీరియస్‌గా చదువుతుండగా ఎవరో డోర్‌బెల్ కొట్టారు.. వెంటనే లేచి డోర్ తీయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైన వెళ్లి తీస్తే బాగుండనిపిస్తుంది కదూ! అందుకే మీలాంటి వారి కోసమే ఓ రోబోను తయారు చేశామంటున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా వారు అభివృద్ధి చేసిన ఎగిరే రోబో.. రిమోట్‌తో ఆదేశిస్తే చాలు సహాయకుడిలా అన్ని చేసేస్తుందంటున్నారు. డోర్ లాక్ తీసి తలుపును తెరుస్తుంది. అంతేకాదు, దాహం వేస్తే ఫ్రిడ్జ్‌లో వాటర్ బాటిల్‌ను సైతం తీసుకొచ్చి చేతికందిస్తుంది. ఆహారం తేవడం, కెమెరాతో వీడియో తీయడం వంటి ఎన్నో చిన్న చిన్న పనులు చేసేలా ఈ రోబోలను అమెరికాలోని స్టాన్ఫోర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఫ్లైక్రో టగ్స్గా పిలిచే వీటిని తొలుత తొండలు, కీటకాల నుంచి ప్రేరణ పొంది తయారు చేశారు. గోడలపై పాకుతూ బూజు తొలగించడం, ఫ్లోర్‌పై చెత్తను తీసేయడం లాంటివి చేసేవి. తాజాగా పక్షిలా ఎగిరేలా వీటికి రెక్కలు జోడించడంతో పాటు, వాటి బరువు కంటే 40 రెట్లు ఎక్కువ బరువును మోసేలా సాంకేతికత సాయంతో సామర్థ్యాన్నీ పెంచారు. ఉపరితలానికి తగ్గట్టుగా ల్యాండ్ అయ్యేందుకు వీటికి 32 మైక్రోస్పైన్స్ కూడా అమర్చారు. ఇవి ఎక్కువ బరువును మోయడమే కాకుండా చాలా వేగంగా పని చేస్తాయని శాస్త్రవేత్త మార్క్ కట్కోస్కై తెలిపారు. భవిష్యత్తులో ఈ రోబోల్లో స్వీయనియంత్రణ వ్యవస్థను ప్రవేశపెట్టేలా పరిశోధనలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
సంధ్యా వేళ.. విహంగాల హేల
ఆత్మకూరురూరల్ : సాయం సంధ్యా వేళ పచ్చటి పొలాలపై విహంగాల విహారం ప్రకృతి ప్రేమికులను పరవశింపజేసింది. వేసవి తాపంతో పలు రకాల పక్షిజాతులు మధ్యాహ్నం వేళ నీడపట్టున తలదాచుకుంటున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ఆహార అన్వేషణ చేస్తూ విహరిస్తున్నాయి. మండలంలోని కరటంపాడులో పచ్చని పంట పొలాలపై ఆదివారం సూర్యాస్తమయ వేళలో పలు రకాల విహంగాలు, గుంపులు, గుంపులుగా విహారం చేస్తూ ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేశాయి. -
యువీ గాల్లో తేలిపోతున్నాడు...
-
యువీ గాల్లో తేలిపోతున్నాడు...
గాల్లో తేలినట్టుందే...గుండె పేలినట్టుందే అని యువరాజ్ సింగ్ పాడుకుంటున్నాడేమో. చాపర్‌ను నడుపుతూ గాల్లో తేలిపోతున్నాడు. అతను బ్యాటింగ్‌తో బంతిని గాల్లో ఎగిరేలా చేయడం మనం ఎన్నోసార్లు చూశాం. కానీ ఇప్పుడు యువీనే గాల్లో ఎగురుతూ ఉంటే చూస్తున్నాం. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే యువీ, తాజాగా ఏవియేటర్ అవతారమెత్తి పైలట్ సీట్లో కూర్చొని చాపర్ నడుపుతున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. లైక్స్, షేర్లతో ఆ వీడియో వైరల్‌గా మారింది.