ఒక్కో దేశంలో ఒక్కో రకరమైన సాంస్కృతిక సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని విభిన్న సంప్రదాయాలు, కళలు ఆయా ప్రాంతాలకే పెట్టింది పేరుగా కూడా ఉంటాయి. ఆయా దేశాల్లో ఉన్న విద్య, వైజ్ఞానికి సాంస్కృతకి కళలు, శాస్త్రలను ప్రోత్సహింస్తూ కనుమరుగవ్వకుండా కాపాడేందుకు కృషి చేస్తున్న యునెస్కో 600 ఏళ్ల నాటి ఓ అద్భుత అనితర సాధ్యమైన నృత్య కళకు సంబంధించిన వీడియోని నెటిజన్లతో పంచుకుంది.
ఆ నృత్యకళ మన కళ్లను ఆర్పడమే మర్చిపోయాలా కట్టిపడేస్తుంది. ఈ కళను ప్లయింగ్ మెన్ డ్యాన్స్‌గా వ్యవహరిస్తారు. ఇది మెక్సికో, మధ్య అమెరికాలో తూర్పు రాష్ట్రమైన వెరాక్రూజ్‌లోని టోటోనాక్ సముహ ప్రజలు ఈ నృత్యాన్ని చేస్తుంటారు. దీన్ని వారు సంతానోత్పత్తి డ్యాన్స్‌గా పిలుస్తారు. ఆచార వ్యవహారాలు, ప్రకృతి పట్ల తమకున్న గౌరవం, సామరస్యతను తెలియజేసేందుకు చేసే ఫెర్టిలిటీ డ్యాన్స్ ఇది. ఈ నృత్యం చేసేటప్పడూ కొంతమంది పురుషులు బృందం ఓ పొడవాటి స్థంభంపై గుంపుగా కూర్చొంటారు. అందులో వ్యక్తి స్థంభంపై బ్యాలెన్స్ చేసుకుంటూ..ఒక విధమైన సాధనంతో ఊదుతూ.. గాల్లో డ్యాన్స్ చేస్తాడు.
ఆ తర్వాత ఆ వ్యక్తి సెంటర్ పొజిషన్‌ని ఆక్రమించి కూర్చోగానే మిగతా వ్యక్తులు తలకిందులుగా..ఆ స్థంభం చుట్టూ వేలాడుతూ..నలు దిశల్లో తిరుగుతారు. ఆ తర్వాత క్రమంగా కిందకి దిగిపోతారు. అద్భతంగా కనిపిస్తుంది ఆ దృశ్యం. ఈ మేరకు యునెస్క్ ఇన్‌స్టాగ్రాంలో అందుకు సంబందించిన వీడియోని షేర్ చేస్తూ..వారు ఏవిధంగా నృత్యం చేశారో వివరించింది.
(చదవండి: టీవి స్టార్‌గా పేరు తెచ్చుకుంటూనే.. ఎంట్రపెన్యూర్‌గా రాణిస్తున్న ఆష్క)
Comments
Please login to add a commentAdd a comment