men
-
లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన లిఫ్ట్ టెక్నీషియన్
-
World Cancer Day 2025: కేన్సర్‌ని ముందే పసిగట్టేద్దాం ఇలా..!
కేన్సర్ ఉందని కనుగొనడమే క్యాన్సర్‌ను నయం చేసుకోవడం. ఒకప్పుడు దాదాపు 10 శాతం కేన్సర్లకే చికిత్స అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు 10 శాతం క్యాన్సర్లు మాత్రమే చికిత్సకు లొంగనివి అని చెప్పవచ్చు. మిగతా అన్ని కేన్సర్లనూ దాదాపు నయం చేయవచ్చు. కాకపోతే కేన్సర్‌ను వీలైనంత త్వరగా అంటే... దాని నాలుగు దశల్లో... మొదటి లేదా కనీసం రెండోదశలోనైనా కనుక్కోవాలి. అప్పుడే ‘కేన్సర్ ఉందని కనుగొనడమే... కేన్సర్‌ను నయం చేసుకోవడం’ అనే మాట వర్తిస్తుంది. అయితే కేన్సర్ అంటూ గుర్తించడానికి ప్రత్యేకంగా లక్షణాలుండకపోయినప్పటికీ... ఏయే లక్షణాలను బట్టి కేన్సర్‌ను అనుమానించవచ్చు? అలా ఆ కేన్సర్స్ను ముందుగానే గుర్తించడమెలా? మహిళలకూ, పురుషులకూ లేదా ఈ ఇద్దరిలోనూ వచ్చే సాధారణ కేన్సర్లేమిటి? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోడానికి ఉపయోగపడే ప్రత్యేక కథనమిది.కొన్ని కేన్సర్ లక్షణాలే... మామూలు ఇతర జబ్బుల్లోనూ కనిపిస్తాయి. ఉదాహరణకు బరువు తగ్గడం, దగ్గు లాంటి మామూలు లక్షణాలే కనిపించడం. మరి ముందే... అంటే ప్రారంభ దశల్లోనే కేన్సర్‌ను పసిగట్టడానికి స్క్రీనింగ్ పరీక్షలేమిటి,అవి ఎవరెవరికి ఎప్పుడు చేయించాలో చూద్దాం. మహిళలకే అవసరమైన స్క్రీనింగ్స్ పరీక్షలివి... సర్వికల్ కేన్సర్:... సర్వికల్ రూన్సర్కే ఉన్న ఓ ప్రత్యేకత ఏమిటంటే... ఇది వచ్చేందుకు కనీసం పదేళ్ల ముందుగానే రాబోతోందని గుర్తించవచ్చు. అంటే సుదీర్ఘమైన ప్రీ–కేన్సరస్ దశ దీనికి ఉంటుంది. అందుకే దీన్ని రాకముందే పసిగట్టవచ్చు. అందుకు చేయించుకోవాల్సిందల్లా పాప్ స్మియర్ అనే ఓ మామూలు పరీక్ష. ప్రతి మహిళా 25 ఏళ్లు దాటిన నాటి నుంచి ప్రతి మూడేళ్లకోసారి ఈ పరీక్ష చేయించుకుంటూ ఉండటమే సర్వైకల్ కేన్సర్‌కు స్క్రీనింగ్.రొమ్ము కేన్సర్:(నిజానికి రొమ్ము కేన్సర్ మహిళలతోపాటు పురుషులలోనూ కనిపించినప్పటికీ వారిలో కాస్త అరుదు) రొమ్ము క్యాన్సర్ విషయంలో వయస్సుకూ వ్యాధికీ సంబంధం ఉంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ వ్యాధి వచ్చే అవకాశాలు (రిస్క్) పెరుగుతుంటాయి.రొమ్ము క్యాన్సర్ రిస్క్ ఎవరెవరిలోనంటే... పిల్లలు లేనివాళ్లు ముప్ఫయి ఏళ్లు దాటాక మొదటి బిడ్డను కన్న మహిళలు తమ కుటుంబం ఈ వ్యాధి వచ్చిన వారున్నప్పుడు... పైన పేర్కొన్న వాళ్లంతా రొమ్ము క్యాన్సర్‌కు రిస్క్ గ్రూప్. ఈ రిస్క్ గ్రూపులు ప్రతి నిత్యం మూడు పరీక్షలు చేసుకుంటూ ఉండాలి. అవి... మొదటిది... ఎవరికి వారే చేసుకునే రొమ్ము పరీక్ష. ప్రతి మహిళా తమ రుతుక్రమం ముగిసిన వారం తర్వాత ఎడమరొమ్మును కుడిచేత్తో, కుడిరొమ్మును ఎడమచేత్తో తాకుతూ పరీక్ష చేసుకోవాలి. దాంతో రొమ్ములో ఏ చిన్నమార్పు వచ్చినా డాక్టర్ కంటే ముందే... తమకే తెలిసిపోతుంది. ఫలితంగా ముందస్తు లక్షణాలేమైనా కనిపిస్తుంటే త్వరగా కనిపెట్టగలరు. ఇతరత్రా కాస్తంత తేడా ఏమైనా ఉంటే దాన్ని డాక్టర్/గైనకాలజిస్ట్ దృష్టికి తీసుకెళ్తే అదేమైనా ప్రమాదకారా లేక మామూలు గడ్డా అన్నది చెబుతారు. రెండోది... మామోగ్రఫీ అనే మరో పరీక్షతోనూ రొమ్ము క్యాన్సర్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు.ఇది ఎవరికి అవసరం అంటే... ముప్ఫయి ఏళ్లప్పుడు ఓసారి మామోగ్రామ్ చేయించాలి ఆ తర్వాత 35 ఏళ్లప్పుడు ఒకసారి, 40 ఏళ్ల వయసప్పుడు మరోసారి చేయించాలి. ఆ తర్వాత 40 ఏళ్ల నుండి 50వ ఏటి వరకూ ప్రతి రెండేళ్లకోసారి చొప్పున చేయిస్తుండటం మంచిది. ఇక 50 ఏళ్లు వచ్చాక ఏడాది కోమారు చేయించడం మంచిది మరీ ఎక్కువ రిస్క్ ఉన్నవారు తమ డాక్టర్ సలహా మేరకు ఇంకా త్వర త్వరగానే పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. ఇక మూడో రకానికి చెందిన ఈ పరీక్షలు... చాలా చాలా హై రిస్క్ గ్రూపువాళ్లకు... ఈ వ్యాధి వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ అని భావించిన మహిళలకు వాళ్ల డాక్టర్లు... బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే జీన్ మ్యూటేషన్స్ తాలూకు జన్యుపరీక్షలు చేయిస్తుంటారు. తల నుంచి కాలివరకు తొలి దశలోనే గుర్తించేందుకు కొన్ని ప్రాథమిక లక్షణాలివి... తల భాగంలో... ఈ కేన్సర్స్ నోట్లో, దవడ, నాలుక మీద లేదా చిగుళ్లు (జింజివా) మీద ఎక్కడైనా రావచ్చు. ఎరుపు, తెలుపు రంగుల ప్యాచెస్ ఉన్నా, దీర్ఘకాలంగా మానని పుండు (సాధారణంగా నొప్పి లేని పుండు, కొన్ని సందర్భాల్లో నొప్పి ఉండవచ్చు కూడా) ఉంటే క్యాన్సర్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ. కొన్నిసార్లు పుండ్లు కూడా ఉండవచ్చు. అదే నాలుక మీద అయితే నాలుక కదలికలు తగ్గవచ్చు. నాలుక వెనక భాగంలో అయితే స్వరంలో మార్పు. మరింత వెనకనయితే మింగడంలో ఇబ్బంది. ఇక స్వరపేటిక ప్రాంతంలో అయితే స్వరంలో మార్పు. మెడ దగ్గరి లింఫ్ గ్రంథుల వాపు.బ్రెయిన్ కేన్సర్‌లో... శరీరంలోని అన్ని భాగాలకు లాగే మెదడుకూ కేన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. తలనొప్పి, అకస్మాత్తుగా మతిమరపు రావడం, విషయాలు గుర్తుంచుకోకపోవడం, కొన్నిసార్లు సాంఘిక, సామాజిక సభ్యత మరచి ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మనిషి మెదడులో మాటకూ, చేతలకు, దృష్టికీ, వినికిడికీ, కాళ్లూ, చేతుల కదలికల నియంత్రణకు... ఇలా వేర్వేరు ప్రతిచర్యలకు వేర్వేరు కేంద్రాలు (సెంటర్స్) ఉంటాయన్న విషయం తెలిసిందే. మెదడులో... కేన్సర్ అభివృద్ధి చెందిన సెంటర్ ఏ అవయవానికి సంబంధించినదైతే ఆ అవయవం చచ్చుబడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.గొంతు భాగంలో... దీన్ని ఓరో ఫ్యారింజియల్ భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గొంతులో ఏదో ఉన్న అనుభూతి ఉంటుంది. అన్నవాహిక మొదటి భాగంలో అయితే మింగడంలో ఇబ్బంది. కడుపు (స్టమక్)లో... అదే కడుపు (స్టమక్)లో అయితే మంట పుడుతున్నట్లుగా ఉండే నొప్పి. పొట్టలో మంట. పొట్టలో రక్తస్రావం అవుతుంది కాబట్టి ఆ రక్తం వల్ల విసర్జన సమయంలో మలం నల్లగా కనిపిస్తుంది. రక్తస్రావం వల్ల రక్తహీనత (ఎనీమియా) కూడా కనిపించవచ్చు. దాంతోపాటు కొన్నిసార్లు కొంచెం తినగానే కడుపు నిండిపోయిన ఫీలింగ్. పేగుల్లో... మల మూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు రావడం జరుగుతుంది. రెక్టమ్ కేన్సర్‌లో... మలద్వారం (రెక్టమ్) క్యాన్సర్ విషయంలోనూ మల విసర్జన తర్వాత కూడా ఇంకా లోపల మలం మిగిలే ఉందన్న ఫీలింగ్ ఉంటుంది. దీనికో కారణం ఉంది. విసర్జించాల్సిన పదార్థం మామూలుగా మలద్వారం వద్దకు చేరగానే అక్కడి నాడులు స్పందించి అక్కడ మలం ఉన్నట్లుగా మెదడుకు సమాచారం చేరవేస్తాయి. దాంతో విసర్జించాల్సిందిగా మెదడు ఆదేశాలిస్తుంది. అయితే విసర్జన తర్వాత కూడా అక్కడ క్యాన్సర్ ఓ గడ్డలా ఉండటంతో ఏదో గడ్డ మిగిలే ఉందన్న సమాచారాన్ని నాడులు మెదడుకు చేరవేస్తాయి. దాంతో ఇంకా ఏదో అక్కడ మిగిలి ఉందన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. దాంతోపాటు బంక విరేచనాలు, రక్తంతోపాటు బంక పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఊపిరితిత్తుల్లో... ఊపిరితిత్తుల కేన్సర్ విషయంలో పొగతాగేవారికి అది వచ్చేందుకు అవకాశం ఎక్కువ. ఈ కేన్సర్ ఉన్నవాళ్లలో దగ్గు, కళ్లెలో రక్తం పడటం వంటì లక్షణాలు కనిపిస్తాయి. ఎక్స్–రే, సీటీస్కాన్ పరీక్ష ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. ఒవేరియన్ కేన్సర్‌లో... దాదాపు 50, 60 ఏళ్ల మహిళల్లో పొట్ట కిందిభాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఈ భాగానికి కేన్సర్ వస్తే ఏ లక్షణాలూ చూపించకుండానే ప్రమాదకరమైన పరిస్థితులకు తీసుకెళ్తుంది కాబట్టి దీన్ని ‘సైలెంట్ కిల్లర్’గానూ అభివర్ణిస్తుంటారు. టెస్టిస్ కేన్సర్‌లో... పురుషుల్లో వచ్చే ఈ కేన్సర్‌లో వృషణాల సైజ్ పెరగడం, దాన్ని హైడ్రోసిల్‌గా పొరబాటు పడి పెద్దగా సీరియస్‌గా తీసుకోక΄ోవడంతో అది సైజ్‌లో పెరిగి ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలు ఎక్కువ. కిడ్నీ అండ్ బ్లాడర్ కేన్సర్స్‌లో... మూత్ర విసర్జన సమయంలో రక్తం కనిపించడం, మాటిమాటికీ మూత్రం రావడం మూత్రపిండాలు, మూత్రాశయ కేన్సర్లలో కనిపించే సాధారణ లక్షణం. బ్లడ్ కేన్సర్‌లో... రక్తం కూడా ద్రవరూపంలో ఉండే కణజాలమే కాబట్టి... బ్లడ్ కేన్సర్ కూడా రావచ్చు. రక్తహీనత, చర్మం మీద డ, చిగుళ్లలోంచి రక్తం రావడం, బరువు తగ్గడం, జ్వరం రావడం వంటివి బ్లడ్‌కేన్సర్ లక్షణాలు. లింఫ్ గ్లాండ్స్ అన్నవి బాహుమూలాల్లో, దవడల కిందిభాగంలో మెడకు ఇరువైపులా, గజ్జల్లో ఉండే ఈ గ్రంథులకూ క్యాన్సర్ రావచ్చు. దాన్ని లింఫోమా అంటారు. చర్మం కేన్సర్‌లో... చర్మం కేన్సర్‌ను ఏ, బీ, సీ, డీ అనే నాలుగు లక్షణాలతో తేలిగ్గా గుర్తించవచ్చు. శరీరంపై ఏదైనా మచ్చ తాలూకు ఏ– అంటే... ఎసిమెట్రీ (అంటే మచ్చ సౌష్టవం మొదటికంటే మార్పు వచ్చినా, బీ– అంటే... బార్డర్ అంటే అంచులు మారడం, మందంగా మారడం జరిగినా, సీ– అంటే కలర్ రంగు మారినా, దాన్ని చర్మం కేన్సర్ లక్షణాలుగా భావించవచ్చు.హెడ్ అండ్ నెక్ కేన్సర్స్ స్క్రీనింగ్ కోసం... మన దక్షిణ భారతదేశంలోని పురుషుల్లో కోలోరెక్టల్ కేన్సర్ తర్వాత చాలా ఎక్కువగా కనిపించేవి హెడ్, నెక్ కేన్సర్లే. పురుషుల్లో పొగాకు, ఆల్కహాల్ అలవాట్లు చాలామందిలో ఉంటాయి కాబట్టి ఈ క్యాన్సర్లు మగవారిలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి.ఒకసారి హెడ్ అండ్ నెక్ రూన్సర్ వచ్చిన వారు ఏడాదికోసారి డాక్టర్‌ను కలిసి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఒకసారి వచ్చి తగ్గినవాళ్లు ఆ మొదటి ఏడాదిలో ప్రతి మూడు నెలలకొకసారి, ఆ తర్వాత నాలుగేళ్ల వరకు ప్రతి ఆర్నెల్లకు ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి. హెడ్ అండ్ నెక్ స్క్రీనింగ్ కోసం పరీక్షల్లో కొన్ని: సాధారణంగా తలకు చేసే ఎమ్మారై, సీటీలతో పాటు కొన్ని రక్తపరీక్షలు, పనోరమిక్ డెంటల్ ఎక్స్–రే, డెంటల్ కోన్ బీమ్ సీటీ, అవసరాన్ని బట్టి పెట్/సీటీ పరీక్షలతోపాటు ఎండోస్కోపీ, బయాప్సీ (తలలో అనుమానం ఉన్నచోటి నుంచి చిన్న ముక్క తీసి పరీక్షించడం). ఊపిరితిత్తుల కేన్సర్... ఇది ముఖ్యంగా మనదేశంలోని పురుషుల్లో చాలా ఎక్కువ. ఇక సిగరెట్ / బీడీ/ చుట్ట / ఇతరత్రా పొగ తాగే అలవాటు ఉన్నవాళ్లలో మరీ ఎక్కువ. తమ పొగతాగే అలవాటునే ఈ క్యాన్సర్‌కు హైరిస్క్‌గా పరిగణించాలి. ఈ అలవాటున్నవాళ్లు తమలో ఎలాంటి అసౌకర్యంగాని, దగ్గు వంటి లక్షణాలుగాని కనిపిస్తే తక్షణం పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ చెస్ట్ ఎక్స్–రే, స్ఫూటమ్ సైటాలజీ పరీక్షతోపాటు హై రెజల్యూషన్ సీటీ స్కాన్ ద్వారా దీన్ని కనుగొంటారు. స్టమక్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం... ఈ కింద పేర్కొన్న గ్రూపులు స్టమక్ క్యాన్సర్ రావడానికి మరింత ఎక్కువ ముప్పు కలిగి ఉంటారు. ఈ హైరిస్క్ వర్గాలవారు ఎవరంటే... ‘పర్నీసీయస్ ఎనిమియా’ అనే ఒక తరహా రక్తహీనతతో బాధపడుతూ, కాస్తంత వయసు పైబడ్డవారు. గతంలో అల్సర్‌కు ఆపరేషన్ (గ్యాస్ట్రెక్టమీ) చేయించుకున్నవారు. ‘ఫెమీలియల్ అడెనోమేటస్ పాలింపోసిస్’ తరహా పాలిప్స్ (కండ పెరిగిన) వాళ్లు హెలికోబాక్టర్ పైలోరీ (హెచ్ పైలోరీ) అనే సూక్ష్మజీవి వల్ల ఇన్ఫెక్షన్ వచ్చినవాళ్లు... అవసరమైన స్క్రీనింగ్ పరీక్ష : పైన పేర్కొన్నవాళ్లంతా కడుపులో కేన్సర్ కనుక్కోవడానికి తరచూ ‘డబుల్ కాంట్రాస్ట్ బేరియం’ పరీక్ష, ఎండోస్కోపీ చేయించుకుంటూ ఉండాలి. పై రిస్క్ గ్రూపులతో పాటు ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకునేవాళ్లు, పొగతాగే అలవాటున్నవాళ్లూ, ఆహారంలో విటమిన్ ఏ, విటమిన్ సీ తక్కువగా తీసుకునేవారితో పాటు రబ్బరు పరిశ్రమల్లో, బొగ్గుపని చేసేవాళ్లు ఎక్కువగా తరచూ ఈ పరీక్షలు చేయించుకోవడం మంచిది. కేన్సర్లను గుర్తించేందుకు కొన్ని సాధారణ లక్షణాలు ... కారణం తెలియకుండానే అకస్మాత్తుగా బాగా బరువు తగ్గడం ఆకలి తగ్గడం ఎడతెరిపి లేకుండా దగ్గు లింఫ్ గ్లాండ్స్ (బాహుమూలాల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర) వాపు ∙ఆయా అవయవాల్లోంచి రక్తస్రావం... ఇవి సాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే ఈ లక్షణాలన్నీ చాలామందిలో సాధారణ సమస్యలకూ కనిపిస్తాయి కాబట్టి ఇవి కనిపించగానే అది క్యాన్సరేనేమో అంటూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాక΄ోతే స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకుని, అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాత నిశ్చింతగా ఉండవచ్చు. -
వీడియో: అమ్మాయిల కారును ఛేజ్ చేసి మరీ..
తిరువొత్తియూరు: తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. అమ్మాయిలను కారులో ఛేజ్ చేసి మరీ వేధించారు కొందరు ఆకతాయిలు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే.. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.చైన్నె సమీపంలోని ముట్టుకాడు ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో గత 25వ తేదీన యువతులు కారులో వెళుతున్నారు. ఆ సమయంలో 2 కార్లలో వచ్చిన 8 మంది యువకులు రోడ్డుకు అడ్డంగా కారును ఆపి మహిళల కారును అడ్డగించారు. తరువాత వారిని వెంబడించి బెదిరించారు. యువతులను కారుతో ఢీ కొని బెదిరించిన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మేరకు కానత్తూరు పోలీసులు 5 కేసు లు నమోదు చేసి, మహిళలపై అత్యాచారం సహా 5 సెక్షన్లుగా విచారణ చేపట్టారు. ఈస్ట్‌కోస్ట్ రోడ్డు లోని నిఘా కెమెరాలు తనిఖీ చేసేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసు కున్నారు. ఒక కారు చంద్రు (26)కి చెందినది. పొత్తే రి నుంచి వచ్చిన కార్లను స్వాధీనం చేసుకుని కానత్తూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే యువతులను బెదిరించిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిలో కొందరు కాలేజీ విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది. ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న వారు ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో స్నేహితులతో కలిసి ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో చంద్రుపై చాలా కేసులు ఉన్నట్లు విచారణలో వెలుగు చూసింది. అరెస్టు చేసినవారిని శుక్రవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. యువతులను బెదిరించిన వారి పూర్తి పేర్లను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.இசிஆர் சாலையில் காரில் கை குழந்தையுடன் பயணித்த குடும்பத்தினரை விரட்டி விரட்டி பின் தொடர்ந்துகாரை வழிமறித்த திமுக கொடியுடன் காரில் வந்த காம அரக்கன்கள் அராஜகம் போலீஸ் வருகிறார்கள் என்ற கூறியும் வீடு வரை பின்தொடர்ந்த ரவுடிக்கும்பல்..#Women #carchasing #Ecr #Muttukadu #DMDKITWING pic.twitter.com/mlFPKIqEZo— Senthil kumar, EXMLA ,(DMDK IT WING secretary) (@SSivan73049) January 29, 2025 -
మీసాలు.. గడ్డాలకు భేషైన తైలాలు
మింగ మెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె అని మనకో సామెత ఉంది. స్తోమతకు మించి డాబులొలికే దిలాసారాయుళ్ల తీరును ఎద్దేవా చేయడానికి పుట్టిన సామెత అది. ఆనాటి సమాజంలో సంపన్నులైన పెద్దమనుషులు మీసాలకు సంపెంగ నూనెలు, ఇతరేతర సుగంధ తైలాలను పూసుకుంటూ, దర్జా ప్రదర్శించేవారు. ఇదివరకు కాస్త వయసు మళ్లినవాళ్లే ఏపుగా గడ్డాలు పెంచేవాళ్లు. ఇటీవలి కాలంలో కుర్రాళ్లు కూడా ఎడాపెడా గడ్డాలు పెంచేసుకుంటున్నారు. కొందరు అడ్డదిడ్డంగా గడ్డాలు పెంచుకుంటూ, చిరిగిన జీన్స్ తొడుక్కుని వీథుల్లో ఆవారాగా తిరుగుతుంటే, ఇంకొందరు సూటు బూట్లు ధరించి, పద్ధతిగా గడ్డాలను రకరకాల తీరుల్లో కత్తిరించుకుంటూ, గడ్డాలు దట్టంగా పెరగడానికి నానా రకాల పోషక తైలాలు వాడుతున్నారు. గడ్డాల మీద యువతరం మోజు గమనించిన మార్కెట్ శక్తులు ఊరుకుంటాయా? యువకుల మోజును సొమ్ము చేసుకోవడానికి గడ్డాల పోషణకు ప్రత్యేకంగా రూపొందించిన రకరకాల తైలాలను మార్కెట్లో ముంచెత్తుతున్నాయి. బియర్డ్ ఆయిల్స్, బియర్డ్ క్రీమ్స్ పురుషుల సౌందర్య ఉత్పత్తులలో కీలకంగా మారి΄ోయాయి. తలకు రాసుకునే హెయిరాయిల్స్, బ్రిలియంటైన్స్, జెల్స్‌తో పోల్చుకుంటే మీసాలు గడ్డాలకు పూసుకునే బీర్డ్ ఆయిల్స్, క్రీమ్స్ ధరలు నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటున్నా, గడ్డాలరాయుళ్లు ఏమాత్రం వెనుకాడటం లేదు. గడ్డం సంరక్షణ, పద్ధతులుగడ్డం వేగంగా పెరగాలంటే ముఖాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోండిమంచి చర్మ సంరక్షణ నియమాన్ని పాటించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండి, జుట్టు పెరుగుదలకు మెరుగైన వాతావరణం ఉంటుంది.టీనేజర్లు రోజుకు రెండుసార్లు తేలికపాటి క్లెన్సింగ్ జెల్ లేదా సబ్బు, గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. దీంతో రంధ్రాలు ఓపెన్ అవుతాయి.అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం, బోర్డు-సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ ప్రకారం గడ్డాన్ని మాయిశ్చరైజింగ్, బీర్డ్ ఆయిల్‌తో మసాజ్ చేయడం ఆరోగ్యంగా ఉంచడానికి కీలకం. ముఖం,గడ్డాన్ని సున్నితమైన క్లెన్సర్‌తో శుభ్రపరచడం, మాయిశ్చరైజర్‌ను ఉపయోగించడం ముఖ్యం.అలాగే గ్రూమింగ్ కోసం మంచి నూనె లేదా కండిషనర్ను పూయడం లాంటివి పాటించాలి.చనిపోయిన చర్మ కణాలను ఎక్స్ఫోలియేట్ చేయాలి.వారానికి కనీసం రెండుసార్లు మృతచర్మ కణాలను తొలగించడానికి ,చర్మాన్ని క్లియర్ చేయడానికి మంచి ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్‌ను ఉపయోగించాలి. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది చర్మాన్ని తేమగా , హైడ్రేట్ గా ఉండాలి. ఇందకు తగినన్ని నీళ్లు తాగడం చాలా అవసరం.కీలక సూచనలుతాజాపండ్లు, కూరగాయలు , మాంసకృత్తులు, సమతులమైన ఆరోగ్యకరమైన తీసుకోవాలి. B1, B6 , B12 వంటి విటమిన్ లోపాలు టీనేజర్లలో మీసాలు, గడ్డాల పెరుగుదలను ఆలస్యం కావచ్చు. దీన్ని గమనించుకోవాలి.రోజువారీ వ్యాయామం చేయడం, ముఖం శుభ్రంగా ఎప్పటికపుడు కడుక్కోవడం, ఎక్స్ఫోలియేట్ చేయడం లాంటివి చేయాలి. యూకలిప్టస్ బేస్డ్ మాయిశ్చరైజరింగ్, కనీసం 8 గంటల నిద్ర కచ్చితంగా పాటించాలి.చదవండి : తేగలతో ఎన్ని ప్రయోజనాలో! ఇన్ని రకాలు ఎపుడైనా ట్రైచేశారా?గోవాబీచ్లో, సాయం సంధ్యలో.. మలైకా సన్‌బాత్ -
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో YSRCP కార్యకర్తపై దుండగుడు హత్యాయత్నం
-
జీన్స్ తొడుక్కుని స్క్వాటింగ్ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్
ఆధునిక కాలంలో జీన్స్ ప్యాంట్లు లేనిదే కాలం గడవదు. ట్రెండ్‌కు,ఫ్యాషన్‌కు తగ్గట్టు అనేక రకాల జీన్స్ ప్యాంట్లు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. మహిళలతో పోల్చితే పురుషులే ఎక్కువగా జీన్ ప్యాంట్లను వినియోగిస్తారు. ఆఫీసులకు, బయటికి వెళ్లినప్పుడు, పార్టీలకు ఇలా ఏదైనా జీన్స్ ప్యాంట్లకే ప్రాధాన్యత ఉంటుంది. అన్ని వయసుల వారికి ఫిట్ అయ్యే జీన్స్ అనేవి చాలా పాపులర్. అనేక రకాల మోడల్స్‌లో ఇవి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ధరించడం వలన చాలా కంఫర్ట్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. వీటిని ఉతుక్కోవడం ఈజీ కావడం కూడా వీటికి ఆదరణ ఎక్కువ. కానీ జీన్స్పాంట్లు వేసుకున్నపుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.జీన్స్ వేసుకొని కింద కూర్చోవడం, అందునా జీన్స్ ప్యాంట్లు తొడిగి బాసిపట్లు వేయడం (సక్లముక్లం వేసి కూర్చోవడం) ఆరోగ్యానికి అంత మేలు కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. జీన్స్ ప్యాంట్ తొడుక్కొని ఇలా కూర్చోవడం వల్ల కండరాలు, నరాలు దెబ్బతింటాయనీ, ఇది మరీ విషమిస్తే ఒక్కోసారి జీన్స్ ప్యాంట్లతో బాసిపట్లు వేసుకుని కూర్చునేవారు పైకి లేవగానే నడవలేని పరిస్థితి వచ్చేందుకూ అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఇక వ్యాయామం చేసే సమయంలోనూ జీన్స్ అస్సలు తొడుక్కోవద్దనీ, వాటిని తొడిగి ‘స్క్వాటింగ్’ ఎక్సర్సైజ్ చేయడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఈ అంశాలన్నింటినీ ‘జర్నల్ ఆఫ్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సైకియాట్రీ’ అనే మెడికల్ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి. అవే కాకుండా బాగా బిగుతుగా ఉండే జీన్స్ వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశముందని కూడా మరికొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.జీన్స్ ప్యాంట్లు బాగా టైట్‌గా ఉండే జీన్స్ ప్యాంట్ ధరించి పడుకుంటే చర్మంపై బ్యాక్టీరియా పెరుగుతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీంతో దురదలు, చర్మంపై ర్యాషెస్, దద్దుర్లు వస్తాయి. రక్తప్రసరణకు కష్టం : జీన్స్ ప్యాంట్ బిగుతుగా ఉండటంతో రక్తప్రసరణకు ఇబ్బంది కలుగుతుంది. దీంతో కొన్ని అవయవాలకు రక్తం సరిగా అందదు. జీన్స్ ప్యాంట్ ధరించి నిద్రించడం వల్ల శరీరంలోని వేడీ పెరుగుతుంది. పేగుల కదలికకు ఇబ్బందిగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియపై దుష్ప్రభావం పడుతుంది. -
రాష్ట్ర ఓటర్లు 4,14,40,447
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,40,447 అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రకటించారు. ముసాయిదా ఓటర్ల జాబితాకు సవరణ అనంతరం తుది జాబితాను ఆయన సోమవారం విడుదల చేశారు. రాష్ట్రంలో పురుషులకన్నామహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. సర్విసు ఓటర్లతో కలిపి పురుష ఓటర్లు 2,03,52,816 మంది ఉండగా మహిళా ఓటర్లు 2,10,84,231 మంది ఉన్నారు.3,400 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ముసాయిదా జాబితాలో 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఓటర్ల సంఖ్య 4,86,226 కాగా, తుది జాబితాలో 5,14,646కు పెరిగింది. దివ్యాంగ ఓటర్లు 5,18,383 మంది ఉన్నారు. ఓటర్లు, జనాభా నిష్పత్తి 719గా ఉంది. లింగ నిష్పత్తి 1039గా ఉంది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20,64,184 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,73,388 మంది ఓటర్లు ఉన్నారు. సర్విసు ఓటర్లు ముసాయిదా జాబితాలో 67,143 ఉండగా తుది జాబితాలో 66,690 మంది ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 46,397. -
హైదరాబాద్ లో బయటపడ్డ నిత్య పెళ్లికొడుకు బండారం
-
అవును... ఆమెకు కొంచెం ఎక్కువ నిద్ర అవసరం
అందరికీ 7–8 గంటల నిద్ర అవసరమని అందరికీ తెలిసిందే. అయితే ఎనిమిది గంటలసేపు నిద్రపోయిన తర్వాత కూడా, ఉదయం ఇంకా రిఫ్రెషింగ్‌గా లేకుండా, ఇంకా అలసటగా... బద్ధకంగా ఉన్నట్లయితే నిద్ర సరిపోలేదని అర్థం. అయితే స్త్రీల విషయంలోనే! అందరికీ కాదు. వినడానికి విడ్డూరంగా ఉన్నా, ఇది అక్షరాలా నిజం. వైద్య పరిశోధకులు వివరణాత్మకంగా చెప్పిన విషయమే.పురుషులు 7–8 గంటల నిద్రలో బాగా పని చేయగలిగినప్పటికీ, మహిళలకు నిద్రకు మరికాస్త ఎక్కువ సమయం అవసరం. మహిళలకు ఎక్కువ నిద్ర ఎందుకు అవసరమో తెలుసుకునే ముందు, నిద్ర గురించి మరికొంత అర్థం చేసుకుందాం.మంచి నిద్ర ఎందుకు ముఖ్యం?మంచి నిద్ర మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మెరుగైన గుండె ఆరోగ్యం, జీవక్రియలు, చర్మం, జుట్టు నాణ్యతను, దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది. నాణ్యమైన నిద్ర మీ భావోద్వేగాలను మెరుగ్గా నిర్వహించడానికి కూడా మిమ్మల్ని సన్నద్ధం చేస్తుంది. కంటినిండా నిద్రపోయేవారికి ఆందోళన, డిప్రెషన్ స్థాయులు తక్కువ గా ఉండటం వల్ల వారు కార్యాలయాల్లో మెరుగైన పనితీరును కనబరుస్తున్నట్లు రుజువైంది. నాణ్యమైన నిద్ర చాలా ముఖ్యం ఆర్టెమిస్ హాస్పిటల్‌లోని పల్మోనాలజీ అండ్ స్లీప్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ అరుణ్ కొటారు, నిద్ర సమయంలో శరీరం కణజాల మరమ్మత్తు, కండరాల పెరుగుదల, హార్మోన్ నియంత్రణ వంటి ముఖ్యమైన ప్రక్రియలకు లోనవుతుందని అంగీకరిస్తున్నారు. ‘దీర్ఘకాలిక నిద్ర లేమి శారీరక, మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఇది మన మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను దెబ్బతీస్తుంది, ఉత్పాదకత తగ్గుతుంది. ప్రమాదాల ప్రమాదాన్ని పెంచుతుంది‘ అని ఆయన చెప్పారు.పురుషుల కంటే మహిళలకు 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవసరమని ఇటీవలి పరిశోధనలో తేలింది. ‘మెదడు కోలుకోవడానికి, రిపేర్ చేసుకోవడానికి నిద్ర చాలా ముఖ్యం. మహిళల్లో నిద్ర, నిద్ర రుగ్మతలకు సంబంధించి తక్కువ డేటా అందుబాటులో ఉన్నప్పటికీ, రోజువారీ కార్యకలాపాల నుండి కోలుకోవడానికి పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర అవసరమని పరిశోధనలు సూచిస్తున్నాయి‘ అని డాక్టర్ చెప్పారు.నిద్రకు సంబంధించి స్త్రీ పురుషులలో వ్యత్యాసం చాలా ఎక్కువని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కానీ వివిధ కారణాల రీత్యా పురుషుల కన్నా స్త్రీలకు కేవలం 11 నుంచి 13 నిమిషాల అధిక నిద్ర సరిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగని వారికి కావలసిన అధిక నిద్రను సమస్యలా చేసి చూపడం లేదా వారికి ఎక్కువ నిద్ర కావాలనడాన్ని అంగీకరించకపోవడం వల్ల అసలే నిద్రలేమితో సతమతమవుతున్న మహిళలు మరింత ఒత్తిడికి గురవుతారు. దీని గురించి ఆలోచిస్తూ వారు సరిగ్గా నిద్రపోలేరు. దీంతో సమస్య మళ్లీ మొదటికొస్తుంది. ఇది చాలా సమస్యలను కొనితెస్తుంది. ఏది ఏమైనప్పటికీ పురుషుల కన్నా స్త్రీలకు ఎక్కువ నిద్ర అవసరమే అన్నది నిర్వివాదాంశం. అయితే వారు మరికాసేపు ప్రశాంతంగా పడుకునేందుకు పురుషుల సహకారం పూర్తిగా అవసరం. వయసును బట్టి నిద్ర అవసరాలు నవజాత శిశువులు, పసిబిడ్డలకు ఎక్కువ నిద్ర అవసరం. సరైన ఆరోగ్యం, పనితీరు కోసం సగటున, పెద్దలకు సాధారణంగా రాత్రికి 7–9 గంటల నిద్ర అవసరం. వయస్సుతో ΄ాటు నిద్ర అవసరాలు కొద్దిగా తగ్గవచ్చు, వృద్ధులకు ఇప్పటికీ రాత్రికి 7–8 గంటల నిద్ర అవసరం. -
రైలుకే ఎదురెళ్తే..
-
ఆర్టీసీ బస్సులో విషాదం
-
ట్రైన్ లో తాగుతూ.. తూగుతూ..
-
శతాబ్దాల శాప భయం : చీర సింగారించుకుని మరీ పురుషుల గర్భా నృత్యం
దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఉత్సాహంగా ప్రారంభమైనాయి. భక్తులు తొమ్మిది రోజుల పాటు, ఆ జగన్మాతను భక్తితో ఆరాధిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, వారి వారి ఆచారాలు, పద్ధతుల ప్రకారం అత్యంత ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ వడోదరలో ఒక ప్రత్యేకమైన నవరాత్రి సంప్రదాయం గురించి తెలుసుకుందాం.నవరాత్రి వేడుకల్లో భాగంగా గుజరాత్లో పురుషులు ఆనాదిగా ఒక ఆచారాన్ని పాటిస్తున్నారు. 200 సంవత్సరాల నాటి శాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నవమిరోజు సంప్రదాయ బద్ధంగా మహిళల్లా దుస్తులు ధరిస్తారు. అంతేకాదు చీర కట్టుకొని అష్టమి రోజు రాత్రం జానపద నృత్యమైన షేరీ , గర్బా నృత్యం చేస్తారు. ‘సాదుబా మాత’ను పూజిస్తారు. ( Dussehra 2024 నవదుర్గా నమోస్తుతే!)తరతరాలుగా ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం 200 ఏళ్ల క్రితం, ‘సదుబెన్’ అనే మహిళను ఒక మొఘల్ కులీనుడు లైంగికంగా లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తాడు. దీంతో బారోట్ సమాజంలోని పురుషులను రక్షణ కోరింది. దీనికి సదరు పురుషులు సాయం చేసేందుకు నిరాకరిస్తారు. ఫలితంగా ఆమె బిడ్డను కోల్పోతుంది. ఈ బాధ, దుఃఖం, ఆవేదనతో భవిష్యత్ తరాల పురుషులు పిరికిపందలుగా మారతారని శపించి 'సతీ'ని పాటించింది. (మహిళ తనలోని ఖాళీలను కనుక్కోవాలి!)ఇదీ చదవండి: శతాబ్దాల శాప భయం : చీర సింగారించుకుని మరీ పురుషుల గర్భా నృత్యంఆ శాపం చాలా శక్తివంతమైందిగా అక్కడి వారు ఇప్పటికీ నమ్ముతారు. అందుకే ఈ ఈ ఆచారాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారు. సాదుమాను శాంతింప చేసేందుకు, ఆమెను గౌరవించుకునేందుకు ఒక ఆలయాన్ని నిర్మించారు. నవమి రోజు ప్రత్యేక పూజలు చేసి భవిష్యత్తరాన్ని కాపాడాలని వేడుకుంటారు. -
ప్రాణాలు తెగించి యువకుడిని కాపాడిన YSRCP ఎమ్మెల్యే
-
సహజీవనానికో అగ్రిమెంట్.. కోర్టు మెట్లెక్కిన యువతి
ముంబై : వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. సహజీవనం చేసేందుకు సిద్ధమయ్యారు. హద్దులు దాటకూడదని నిబంధన పెట్టుకున్నారు. ఇందుకోసం ఒప్పందం కుదర్చుకున్నారు. కానీ ఏమైందో ఏమో ఉన్నట్లుండి ఆ యువతి కోర్టు మెట్లెక్కింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది.పెళ్లి చేసుకుంటానని తన భాగస్వామి మోసం చేయడమే కాకుండా తనపై పలు మార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..దీంతో సదరు వ్యక్తి శిక్ష నుంచి అతన తమ ఇద్దరి మధ్య జరిగిన అగ్రిమెంట్‌ను కోర్టుకు అందించాడు. ఆ తర్వాత ఏమైందటే? ముంబైలో కేర్ టేకర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ యువతి (29).. ప్రభుత్వ ఉద్యోగి (42)ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ముందుగా సహ జీవనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇబ్బందులు రాకూడదని అగ్రిమెంట్ రాసుకున్నారు. అన్నట్లుగానే కొన్ని రోజులు కలిసి జీవించారు. ఈ నేపథ్యంలో తన భాగస్వామి తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని,సహజీవనం చేస్తున్న సమయంలో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని యువతి కోర్టులో ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి తరుఫు న్యాయవాది సైతం తమకు న్యాయం చేయాలని కోర్టుకు విన్నవించుకున్నాడు.‘తనని తప్పుడు కేసులో ఇరికించారు. ఇద్దరూ రిలేషన్షిప్లో ఉండేందుకు అంగీకరించినట్లు అగ్రిమెంట్లో తేలింది. ఆమె సంతకం కూడా చేసింది’ అని ఆ వ్యక్తి తరఫు న్యాయవాది సునీల్ పాండే తెలిపారు. అందుకు ఒప్పంద పత్రాలు చూపించగా.. అందులో ఉన్న సంతకాలు తనవి కాదని బాధిత యువతి ఆరోపిస్తుంది.వారి మధ్య జరిగిన సహజీవనం ఒప్పందం.. ఇరువురి మధ్య జరిగిన ఏడు అంశాల ఒప్పందం ప్రకారం 2024 ఆగస్టు 1 నుంచి 2025 జూన్ 30 వరకు కలిసి ఉండాలని నిర్ణయించారు.ఈ కాలంలో ఒకరిపై మరొకరు లైంగిక వేధింపుల కేసు పెట్టుకోరని, శాంతియుతంగా ఉండాలి. ఆమె ఇంట్లోనే అతడితో కలిసి ఉండాలి. అతని ప్రవర్తన సరిలేదంటే ఒక నెల నోటీసు ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా విడిపోవచ్చు.మహిళ అతనితో ఉంటున్నప్పుడు బంధువులు ఆమె ఇంటికి రాకూడదు.స్త్రీ పురుషుడికి ఎలాంటి వేధింపులు, మానసిక వేదన కలిగించకూడదు. అదే సమయంలో స్త్రీ గర్భం దాల్చితే పురుషుడు బాధ్యత వహించకూడదు. మానసిక ప్రశాంతత భంగం వాటిల్లకుండా చూసుకోవడం వంటి పాయింట్లు అగ్రిమెంట్లో చేర్చడంతో పాటు దాన్ని నోటరీ చేయించడం గమనార్హం. దీనిపై నెట్టింట చర్చ మొదలైంది. -
కాకినాడ జిల్లాలో మందుబాబు హల్చల్
-
డైవింగ్ రాదు.. కానీ అంబులెన్స్ కొట్టేశాడు
-
పీకలదాకా తాగి పాముతో ఆటలు..
-
అనకాపల్లిలో మైనర్ బాలిక హత్య కేసులో ముమ్మర దర్యాప్తు
-
అనకాపల్లిలో ప్రేమోన్మాది ఘాతుకం..
-
జైలుకు పంపిందనే కోపంతో బాలికపై దాడి
-
పాఠ్యపుస్తకాల్లో లింగసమానత్వ చిత్రాలు
కొచ్చి: వంటగది అనగానే అమ్మ వండుతున్నట్లు చూపే ఫొటోలు పాఠ్యపుస్తకాల్లో ముద్రిస్తుంటారు. ఇలాంటి ధోరణికి చెల్లుచీటి ఇస్తూ కేరళ ప్రభుత్వం లింగసమానత్వ చిత్రాలకు పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చోటు కలి్పంచింది. అమ్మ అంటే ఉద్యోగం చేయదని, ఇంట్లోనే ఉంటుందనే భావన బడిఈడు పిల్లల్లో నాటుకుపోకుండా ఉండేందుకు, సమానత్వాన్ని వారి మెదడులో పాదుకొల్పేందుకు కేరళ సర్కార్ కృషిచేస్తోంది. ఈ ప్రయత్నానికి ఉపాధ్యాయుల నుంచి మద్దతు లభిస్తోంది. మూడో తరగతి మలయాళం మాధ్యమం పాఠ్యపుస్తకం పేజీలను కేరళ సాధారణ విద్యాశాఖా మంత్రి వి.శివాన్కుట్టి సోషల్‌మీడియాలో షేర్చేశారు. తండ్రి వంటింట్లో కూర్చుని పచ్చి కొబ్బరి తురుము తీస్తున్నట్లు ఒక పేజీలో డ్రాయింగ్ ఉంది. తన కూతురు కోసం తండ్రి అల్పాహారం సిద్ధంచేస్తున్నట్లు మరో పేజీలో డ్రాయింగ్ ఉంది. ఇంటి పనిలో పురుషులు ఎంత బాధ్యతగా ఉండాలని ఈ చిత్రాలు చాటిచెబుతున్నాయని నెటిజన్లు మెచ్చుకున్నారు. -
మంచిర్యాల బస్టాండ్ లో ఓవర్ యాక్షన్
-
మహిళా ఓటర్లు తలచుకుంటే.. గత ఐదేళ్లలో జరిగిందిదే!
దేశంలోని మహిళలు ఓటు వేసేందుకు అమితమైన ఉత్సాహం చూపిస్తున్నారు. గత ఐదేళ్లలోని గణాంకాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని పలు నివేదికలు చెబుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధనా నివేదికలోని వివరాల ప్రకారం గత ఐదేళ్లలో ఎన్నికలు జరిగిన 23 రాష్ట్రాల్లోని 18 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని తేలింది. ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం కూడా ఉంది. ఈ 18 రాష్ట్రాల్లోని 10 రాష్ట్రాల్లో తిరిగి అదే ప్రభుత్వం ఏర్పడటం విశేషం. దేశ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్‌గా మారుతున్న మహిళా ఓటర్లు 2029 ఎన్నికల్లో పురుషుల కంటే అధికంగా ఉండనున్నారు. 17వ లోక్‌సభలో మొత్తం ఎంపీల్లో 15 శాతం మంది మహిళలు ఉన్నారు. మొదటి లోక్‌సభలో ఈ సంఖ్య ఐదు శాతంగా ఉంది. నివేదిక ప్రకారం రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 96.8 కోట్లు. వీరిలో 68 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారనే అంచనాలున్నాయి. వీరిలో 33 కోట్ల మంది అంటే 49 శాతం మంది మహిళా ఓటర్లు ఉండనున్నారు. 85.3 లక్షల మంది మహిళలు తొలిసారిగా ఓటు వేయనున్నారు. 2047 నాటికి (2049లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది) మహిళా ఓటర్ల సంఖ్య 55 శాతానికి (50.6 కోట్లు) పెరుగుతుందని, పురుషుల సంఖ్య 45 శాతానికి (41.4 కోట్లు) తగ్గనుందని నివేదిక పేర్కొంది. 2047 నాటికి 115 కోట్ల మంది ఓటర్లు ఉంటారని, వీరిలో 80 శాతం మంది అంటే 92 కోట్ల మంది ఓటు వేస్తారని నివేదిక అంచనా వేసింది. ప్రభుత్వ పథకాలు అందుకోవడంలో మహిళా లబ్ధిదారులు ముందంజలో ఉన్నారు. స్టాండప్ ఇండియాలో వారి వాటా 81 శాతం. ముద్రా లోన్‌లో మహిళలకు 68 శాతం, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో 37 శాతం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో 27 శాతం వాటా ఉంది. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, తెలంగాణలలో మహిళా ఓటర్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని నివేదిక చెబుతోంది. -
అక్కడ ఇద్దరమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాల్సిందే!..లేదంటే జైలు శిక్ష!
వివాహాలకు సంబంధించి పలు దేశాల్లో పలు ఆచారాలు ఉంటాయి. కొన్ని చూడటానికి, వినటానికి చాలా వింతగా ఉంటాయి. ఎంతలా అంటే..ఇదేం ఆచారం రా ! బాబు అని నోటిపై వేలేసుకునేలా ఉంటాయి. పైగా వాళ్లు ఆ ఆచారాలను చాలా నిబద్ధతతో ఆచరించడం మరింత విస్తుపోయేలా ఉంటుంది. ఇంతకీ ఈ గమ్మతైన వింత ఆచారం ఏదేశంలో ఉంది? ఏంటా వింత ఆచారం అంటే..? ఇలాంటి వింత ఆచారాలు ఎక్కువగా ఆఫ్రికాలోనే ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ ఏరిత్రియ అనే తెగ ఒకటి ఉంది. ఈ తెగల ప్రజలు వివాహ సమయంలో చాలా వింతైన ఆచారాలను సంప్రదాయాలను పాటిస్తారు. సాధారణంగా ఒక పురుషుడు ఒక మహిళను పెళ్లి చేసుకునే ఆచారమే ఏ సంప్రదాయంలోనైనా ఉంటుంది. కానీ ఇక్కడ సంప్రదాయంలో మాత్రం ఇద్దరు మహిళలను తప్పనిసరిగా వివాహం చేసుకోవాలట. ఏంటీ బై వన్ గెట్ వన్ ఆఫర్ అనుకుంటున్నారా..? కానీ ఆఫ్రికా ఖండంలోని ఈ ఎరిత్రియ తెగ మాత్రం ఈ సంప్రదాయన్ని నేటికి పాటిస్తోంది. ఒక వేళ అలా గనుకు ఎవరైన చేయకపోతే దాన్ని అతిపెద్ద నేరంగా పరిగణించి వారిని జైల్లో వేయిస్తారట. అందేకాదండోయ్ ఏకంగా జీవత ఖైదు శిక్ష విధించే అవకాశం కూడా ఉంటుందట. అందువల్లే అక్కడ ప్రాంతంలోని ప్రతి స్త్రీ కూడా తన భర్తను మరో స్త్రీతో పంచుకునేందుకు రెడీ అవుతుందట. అయితే ఈ తెగలో దశాబ్దకాలంగా పురుషుల కంటే స్త్రీ జనాభానే ఎక్కువగా ఉటుందట. దీంతో ఆ తెగ పెద్దలు స్త్రీ-పురుషుల నిష్పత్తి సమానంగా ఉండేలా ఇలాంటి గట్టి నిర్ణయం తీసుకున్నారట. (చదవండి: ప్రంచంలోనే అత్యంత సంపన్న శునకం!ఆస్తుల జాబితా వింటే షాకవ్వుతారు!) -
మహిళలు లేకపోతే పురుషులతో భర్తీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో హారిజాంటల్ రిజర్వేషన్ల అమలు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. మహిళలకు హారిజాంటల్ పద్ధతి (రోస్టర్ పాయింట్ల పట్టికలో ఎలాంటి ప్రత్యేకంగా ఎలాంటి మార్కింగ్ లేకుండా)లో 33 1/3 (33.3) శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయిస్తూ గతంలో జీఓ ఎంఎస్ 3ను జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఉద్యోగాల భర్తీ క్రమంలో నిర్దేశించిన పోస్టులకు సరైన అభ్యర్థులు లేనిపక్షంలో వాటిని క్యారీఫార్వర్డ్ చేసే పద్ధతి (ఖాళీని అలాగే ఉంచడం) ఇకపై ఉండబోదు. దీనికి అనుగుణంగా తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–1996 లోని రూల్ 22, 22ఏలో ప్రభుత్వం మార్పులు చేసింది. తాజా సవరణలో భాగంగా ప్రస్తుతం మహిళలకు 33.3 శాతం రిజర్వు చేస్తున్నప్పటికీ.. కమ్యూనిటీ రిజర్వేషన్ల కేటగిరీల్లో అర్హులైన మహిళా అభ్యర్థులు లేనప్పుడు ఆయా ఉద్యోగాలను పురుషులతో భర్తీ చేసే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీఓఎంఎస్ 35 జారీ చేశారు. ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలకు, ఉద్యోగ నియామక సంస్థలైన టీఎస్పీఎస్సీతో పా టు ఇతర బోర్డులకు పంపించారు. దీంతో ఏదైనా నోటిఫికేషన్లో నిర్దేశించిన అన్ని ఖాళీలను అదే సమయంలో తప్పనిసరిగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ తదితర కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హులైన మహిళా అభ్యర్థులు లేని సందర్భంలో, అదే కమ్యూనిటీకి చెందిన పురుషులతో భర్తీ చేయ డం వల్ల పోస్టులు ఖాళీగా ఉండే పరిస్థితి ఉత్పన్నం కాదు. మహిళలకు నిర్దేశించిన పోస్టులు పురుషులతో భర్తీ చేస్తే... మహిళలకు దక్కాల్సిన 33.3% దక్కకుండా పోతాయనే అభిప్రాయం వ్యక్తమవు తోంది. నియామకాల ప్రక్రియలో దీర్ఘకాలికంగా ప రిస్థితిని పరిశీలిస్తే మహిళలకు అతి తక్కువ సంఖ్య లో పోస్టులు దక్కుతాయనే వాదన వినిపిస్తోంది. -
‘కణా’కష్టం!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యం క్షీణిస్తోందా? 4.85 కోట్ల జంటలు సంతానలేమితో బాధ పడటానికి ఇదే కారణమా? ఐదారు వందల సంవత్సరాల తర్వాత పరిస్థితి మరింత తీవ్రం కానుందా? అంటే... అంతర్జాతీయ అధ్యయనాలు అవుననే అంటున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్లే ఈ పరిస్థితి నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పురుషుల్లో శుక్రకణాలు తగ్గడమే సంతానోత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణమని చెబుతున్నాయి. సమాజంలో సాధారణంగా స్త్రీల పునరుత్పత్తి సామర్థ్యంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంటుందని, పురుషులకు సంబంధించి పెద్దగా చర్చ జరగడం లేదని పలు నివేదికలు చెబుతున్నాయి. పితృస్వామ్య వ్యవస్థ కారణంగానే ఇలా జరుగుతోందని అంటున్నాయి. ఆఫ్రికా, ఆసియా వంటి దేశాల్లోనైతే సంతానలేమికి స్త్రీనే కారణంగా పేర్కొంటూ నిందిస్తారు. కాగా కొన్ని ప్రాంతాల్లో బహు భార్యత్వం ఇప్పటికీ కొనసాగుతుండటానికి గల కారణాలలో సంతానలేమిని అధిగమించాలన్నది ఒకటని అంటున్నారు. 51 శాతం తగ్గిన శుక్రకణాలు ప్రపంచ వ్యాప్తంగా సంతానలేమిపై ‘çహ్యూమన్ రిప్రొడక్షన్ అప్డేట్–2023’నివేదిక వెలువడింది. 20, 21 శతాబ్దాలలో ఏం జరిగిందనేది దీని సారాంశం. 1973 నుంచి 2020 వరకు 50 ఏళ్ల కాలంలో పరిస్థితిని నివేదిక వివరించింది. 1970లో 20–30 వయస్సు గల ఒక యువకుడికి వంద మిలియన్ల శుక్రకణాలు ఉన్నాయనుకుంటే.. 2020 వచ్చే నాటికి అదే వయస్సుగల వారు కొందరిలో 50 శాతం వరకు తగ్గిపోయాయి. అంటే 50 మిలియన్లకు శుక్రకణాలు తగ్గిపోయాయన్న మాట. అలాగే 1972లో ఒక వ్యక్తికి శుక్రకణాలు 101 మిలియన్లు ఉంటే... 2018లో అదే వయస్సు గల వారిలో శుక్రకణాల సంఖ్య 49 మిలియన్లకు పడిపోయాయి. ఇలా గడిచిన ఐదు దశాబ్దాలలో మానవ శుక్రకణాల సాంద్రత 100 మిలియన్ల నుంచి 49 మిలియన్లకు పడిపోయింది. అంటే సుమారుగా 51 శాతం తగ్గిందన్న మాట. అంటే పునరుత్పత్తి సామర్థ్యం ఆ మేరకు తగ్గిపోయిందన్నమాట. ప్రతి ఆరు జంటల్లో ఒకరు సంతానలేమి సమస్యతో బాధపడుతుండటం గమనార్హం. భారత్‌లో 2.75 కోట్ల మంది.. సంతానలేమితో బాధపడేవారిలో 80 శాతం మందికి ప్రధానంగా శుక్రకణాలు తక్కువగా ఉంటాయి. ఒక్కోసారి జీరో కూడా ఉండొచ్చు. జీరో శుక్రకణాలు ఉండేవారు జనాభాలో 7 నుంచి 10 శాతం మంది ఉంటారని అంచనా. ఇక ఇండియాలో 2.75 కోట్ల మంది సంతాన లేమితో బాధపడుతున్నారు. 48 శాతం మందిలో స్త్రీలు కారణం కాగా, 20.4 శాతం ఇద్దరిలో సమస్యల వల్ల, 31.6 శాతం మందిలో పురుషుల కారణంగా సంతాన సమస్య ఏర్పడింది. ఇక ప్రపంచవ్యాప్తంగా సంతానలేమితో బాధపడే జంటలు 4.85 కోట్లు ఉన్నట్లు అంచనా. సంతానలేమితో బాధపడేవారిలో శుక్రకణాల సంఖ్య 15 మిలియన్ల నుంచి 20 మిలియన్ల కంటే తక్కువగా ఉంటుంది. పురుషులలో హార్మోన్ల లోపం, మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో పుట్టుకతో వచ్చే లోపాలు, పురుష ప్రత్యుత్పత్తి అవయవాల్లో ఇన్ఫెక్షన్లు, మారుతున్న జీవన విధానం, మానసిక, శారీరక, వృత్తిపరమైన ఒత్తిడులు, ఆలస్యంగా జరుగుతున్న వివాహాలు, ఆహార కల్తీలు, ధూమ మద్యపానానికి అలవాటు పడడం, మాదకద్రవ్యాలకు బానిసలవటం, వాతావరణ కాలుష్యం, మొబైల్స్ విపరీత వినియోగం లాంటివి సంతానలేమికి కారణాలుగా చెబుతున్నారు. వైద్య చికిత్సలతోసమస్యను అధిగమించొచ్చు సంతానోత్పత్తి సవ్యంగా జరగాలంటే ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. శుద్ధిచేసిన ఆహారాన్ని తీసుకోకూడదు. ధూమ, మద్యపానానికి దూరంగా ఉండాలి. నిత్యం వ్యాయామం చేయడం, ధ్యానం లాంటివి అలవరుచుకోవాలి. ఏడెనిమిది గంటల నిద్ర ఉండాలి. అయితే శుక్రకణాల సంఖ్యను పెంచాలన్నా, పునరుత్పత్తి సామర్థ్యం పెంచాలన్నా అనేక వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సరైన చికిత్స చేయించుకుంటే సంతానోత్పత్తి సమస్యలను అధిగమించవచ్చు. ఎజోస్పెర్మియా (జీరో స్పెర్మ్ కౌంట్) లోపాన్ని సరిదిద్దేందుకు ఆధునిక చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. రెండు రకాలైన (నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా, అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా) ఎజోస్పెర్మియా లోపాలను వైద్యపరంగా సరిదిద్దేందుకు అవకాశం ఉంది. ఇక వ్యారికోసి సమస్య కారణంగా శుక్రకణాలు తగ్గిన పురుషులకు మైక్రోసర్జికల్ వ్యారోకోసిలెక్టమీ చేయడం ద్వారా వాటిని పెంపొందించవచ్చు. – డాక్టర్ రాఘవేంద్ర కోస్గి, సీనియర్ కన్సల్టెంట్యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్,అపోలో ఆస్పత్రి, హైదరాబాద్ -
మగవాళ్లు రోజూ వేడినీటి స్నానాలు చేయకూడదా?
చలికాలం వచ్చినా లేదా కొందరి మగవాళ్లకు వేడినీటితోనే స్నానం చేయడం నచ్చుతుంది. అంతేగాదు కొందరికి అలా వేడినీటితో స్నానం చేస్తే హాయిగా రిలీఫ్ ఉంటుంది. నిద్ర కూడా గమ్మున పడుతుందన్న భావన కూడా ఎక్కువ. ముఖ్యంగా మగవాళ్లు రోజంతా బయట తిరిగి అలసటతో ఇంటికి వస్తారు కాబట్టి.. కాసేపు అలా వేడినీటితో స్నానం చేస్తే ప్రాణం హాయిగా ఉన్నట్లు ఫీలవ్వుతారు. కానీ ఇలా ఎట్టి పరిస్థితుల్లో చెయొద్దని శాస్త్రవేత్తలు గట్టిగా హెచ్చరిస్తున్నారు. పైగా రోజూ మగవాళ్లు వేడినీటి స్నానాలు చేయకపోవడమే మంచిదని చెబతున్నారు. ఎందుకని? రీజన్ ఏంటీ? వేడినీటి స్నానం ఇష్టపడే పురుషులకు సంతానోత్పత్తి అవకాశాలను తక్కువగా ఉంటుందని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. దీని కారణంగా స్పెర్మ్ కౌంట్ తగ్గడం లేదా వాటి నాణ్యత తగ్గి సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తోందని చెప్పారు. వారానికి కనీసం 30 నిమిషాల పాటు అధిక ఉష్ణోగ్రతతో కూడిన నీటితో స్నానం చేసిన పురుషుల వీర్యాన్ని నమనాలను పరీక్షించగా..వాటి చలనశీలత రేటు పేలవంగా ఉండటమే గాక తక్కువ స్పెర్మ్ ఉత్పత్తి అవుతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు యూనివిర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా యూరాలజిస్ట్లు సంతోనోత్పత్తి సమస్యలతో బాధపడుతున్న పురుషులు వేడినీటితో ఎక్కువగా స్నానం చేయడం కారణంగానే ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు నిర్థారించారు. ఇదేలా స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందంటే.. పరిశోధనల్లో ఉష్ణోగ్రత, టెస్టోస్టెరాన్, వృషణాలు, స్క్రోటమ్తో బంధన సంబధాన్ని కలిగి ఉంటుందని తేలింది. బాహ్యంగా ఉండే వృషణాలు సుమారు 35 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు సెర్మ్ , ఇతర హార్మోనలను విడుదల చేయగలదు. అయితే శరీర ఉష్ణోగ్రత కంటే కొంచెం తక్కువ ఉష్ణోగ్రతలోనే ఈ వృషణాల్లోని జెర్మ్ కణాలు ఉంటాయి. కాబట్టి కొద్ది మోతాదులోని ఉష్ణోగ్రత పెరుగుదలే స్పెర్మ్, టెస్టోస్టెరాన్‌ల రెండింటిపే గణనీయమైన ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎప్పుడైతే అధిక వేడికి వృషణాలు గురవ్వుతాయో అప్పుడూ..డీఎన్ఏ నిర్మాణం, స్పెర్మ్ నాణ్యతపై ప్రభావం చూపి వాటి పరిమాణాలలో అసాధారణతలకు దారితీస్తుంది. దీంతో స్పెర్మ్ సమర్థవంతంగా కదలక ఫలదీకరణం చెందించలేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఒకవేళ ఫలదీకరణం చెంది గర్భం దాల్చినా..పుట్టబోయే సంతానంలో జన్యుపరమైన లోపాలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు. అందువల్లో వేడినీటితో పదే పదే స్నానం చేయడం మగవాళ్లలోని వృషణాలపై అధిక ప్రభావం చూపి సంతానోత్పత్తి సమస్యను ఎదుర్కొనాల్సి ఉంటుందని అన్నారు. అంతేగాదు మగవాళ్లలోని వంధ్యత్వం అనే సమస్యకు పూర్తిస్థాయిలో చికిత్స లేనప్పటికీ ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తి అయ్యేలా చేసేందుకు మార్గాలు మాత్రం ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. వాటిలో కొన్ని.. క్రమం తప్పకుండా వ్యాయామం విటమిన్ సీ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వంటివి చేయాలి. ఒత్తిడి మీ లైంగిక సామర్థ్యంపై అధికంగా ప్రభాం చూపిస్తుంది కాబట్టి సాధ్యమైనంతవరకు ఒత్తిడిని తగ్గించుకోవాలి. జింక్ ఉండే మాంసం, చేపలు, గుడ్లు, షెల్ఫిష్ వంటి వాటిని అధికంగా తీసుకోవాలి. ముఖ్యంగా టెస్టోస్టెరాన్ స్థాయిలను , స్పెర్మ్ కౌంట్ పెంచే జింక్ సప్లిమెంట్లను తీసుకోవాలి. అధిక బరువు కూడా వంధ్యత్వానికి ప్రధాన కారణమని హెచ్చరిస్తున్నారు వైద్యులు మద్యం, సిగరెట్లు తాగడం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. తదితర జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను అధిగమించగలరిని వైద్యులు చెబుతున్నారు. (చదవండి: అక్కినేని ఫ్యామిలీ కిచెన్ గార్డెన్..వాళ్ల గ్లామర్ రహస్యం ఇదేనా!) -
ఈ పప్పు ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు మిస్ కారు!
దక్షిణ భారతంలో మినపప్పు (బ్లాక్ గ్రామ్) లేదా ఉరద్ దాల్ గురించి తెలియని వారుండరు. ప్రముఖ అల్పాహారాలు, ఇడ్లీలు, దోసెలు, వడలు లాంటి తయారీలో ఈ గింజ ధాన్యం కీలక మైంది. అంతేకాదు వంటగదిలో ఇదిలేకుండా పోపుల పెట్టె సంపూర్ణమే కాదు. అలాగే జబ్బు పడిన వారు త్వరగా కోలుకోవాలంటే మినపగారెలు, సున్నుండలు పెట్టడం బాగా అలవాటు. ఇందులోని ఐరన్ కంటెంట్ శరీరానికి త్వరగా శక్తిని ఇస్తుందని ఆహార నిపుణులు చెబుతారు. ఇందులో రుచితోపాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయజనాలు కూడా ఉంటాయి. ప్రోటీన్లు మెండుగా ఈ పప్పులో విటమిన్ బీ కూడా పుష్కలంగా ఉంటుంది. ఆయుర్వేదలో మాషా అని పిలుస్తారు. ఆయుర్వేదంలో ఆర్థరైటిస్, ఆస్తమా, పక్షవాతం లాంటి జబ్బుల నివారణలో వాడతారట. అలాగే మినపప్పు తీసుకోవడం వల్ల తల నొప్పి, జ్వరం, ఇంఫ్లమేషన్ వంటి సమస్యలనుంచి దూరం కావచ్చట. సౌందర్య పోషణలో మహిళల సౌందర్యపోషణలో కూడా దీని ప్రయోజనాలు తక్కువేమీ కాదు. మినరల్స్ , విటమిన్లు పుష్కలంగా ఉన్న మినపప్పు సన్ టాన్స్ ను వదలగొడుతుంది. ఆరోగ్యవంతమైన, సూపర్ మెరిసే జుట్టును పెరుగుదలకు తోడ్పడుతుంది. మొటిమల సమస్యతో బాధపడేవారు మినపప్పుని కొద్దిగా పాలల్లో వేసి మెత్తగా నూరి, ఈ మిశ్రమానికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి అప్లై చేసుకుని, ఆ తర్వాత చల్లని నీళ్లతో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు పురుషుల లైంగిక సమస్యలను తొలగించడంలో బాగా సహాయపడుతుందట. మినపప్పు - లాభాలు ►ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్ , కాల్షియం అధికంగా ఉన్నాయి. దీనిని తరచుగా తీసుకుంటే ఎముకలకు సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు. ►పేగు ఆరోగ్యాన్ని (గట్ హెల్త్) మెరుగుపరుస్తుంది: ►బాడీలోని ఐరన్ లెవల్స్‌పెరిగేందుకు తోడ్పడుతుంది ►గుండెను హెల్దీగా, దృడంగా ఉంచేలా చేస్తుంది. ►నాడీ వ్యవస్థను బలపరుస్తుంది, నాడీ బలహీనత, పాక్షక పక్షవాతం, ముఖ పక్షవాతం ,ఇతర రుగ్మతల నివారణకు వివిధ ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు. ►మినపప్పు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది.. సో మధుమేహం ఉన్నవారికి కూడా మంచిదే ►వెయిట్ లాస్లో మినప పప్పు ఉపయోగపడుతుంది, ఎముకలను దృఢంగా ఉంచుతుంది. ►కిడ్నీలను కాపాడటంలో కూడా మినపప్పు ఉపయోగపడుతుంది. -
మహిళ కనిపిస్తే.. వేధింపులేనా? మీరేం మనుష్యులు
మహిళలకు సంబంధించి ఓ ముఖ్యమైన విషయాన్ని సోషల్‌మీడియాలో ప్రస్తావించారు డాక్టర్ శ్రీకాంత్ మిరియాల. ఆయన ట్విట్టర్ వేదికగా రాసిన పోస్టు యథాతధంగా.. నేను వైద్యం చేసిన ఎంతోమంది ఆడవాళ్లు (వయసు నిమిత్తం లేకుండా), నా స్నేహితురాళ్ల అనుభవాలు ఇవి. ఈ దురదృష్ట అనుభవాలు అన్ని దేశాల్లో ఉన్నప్పటికీ మనదేశంలో బాగా ఎక్కువ. ఏమిటివి? వీధుల్లో, బస్సుల్లో,రైళ్లలో, ఇళ్లలో,ఆడుకునే స్థలాల్లో, పనిచేసే ప్రదేశాల్లో, గుళ్లలో సమయం సందర్భం ఏదైనాగానీ ఆడవాళ్ళ వెంటబడటం, తేరిపార చూడటం, సైగలు చెయ్యటం, ఫోటోలు తీయటం మాత్రమే కాకుండా కావాలని రాసుకుని వెళ్ళటం, ఇంకా మితిమీరి తాకటం, ముట్టటం, పట్టుకోవడం, కొట్టటం, హఠాత్తుగా మీద పడడం లాంటివి చేసి చాలా ఇబ్బంది పెడతారు. ఇలా ఎందుకు చేస్తారు అన్నదానికి మానసిక శాస్త్ర పరంగా చాలా కారణాలున్నప్పటికీ ఇది చెడ్డ ప్రవర్తన. ఒకసారి చేసి పట్టుబడనప్పుడు వీళ్లలో ధైర్యం పెరిగి మళ్లీ మళ్లీ చేస్తూ, వారి చర్యల తీవ్రత కూడా పెరుగుతుంది. ముందు భయంతో చేసి, చేశాక ఆనందాన్ని పొందే వీళ్లు తర్వాత తర్వాత దాడికి గురైన ఆడవాళ్ల ముఖంలో ఉండే భయాన్ని, షాక్ ని చూసి ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. వీళ్లని నియంత్రించే ఒకే ఒక్క మార్గం ఎదిరించటం, పట్టుకుని ప్రశ్నించడం. అలా జరిగిన చాలా సందర్భాల్లో అందరూ కలిసి దేహశుద్ధి చేస్తారు. ఒకసారి పట్టుబడ్డాక చాలామంది మానేస్తారు కానీ కొంతమంది కొనసాగిస్తారు. వీళ్లని కఠినంగా శిక్షించటం ద్వారా ఈ నేరాల తీవ్రత కొంతవరకు తగ్గించవచ్చు. ఈమధ్య వచ్చే కొన్ని సినిమాలు కూడా ఇటువంటి ప్రవర్తనని ఎగదోస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పెడతాయి. వాళ్లని చాలా బాధకి గురిచేస్తాయి. కోపం, దిగులు, బయటికెళ్లాలంటే భయం, వణుకు, నిస్సహాయత మొదలైన అనుభూతులకి గురవ్వటమే కాకుండా ఆత్మన్యూనత, తమనితాము నిందించుకోవడం, తమ వస్త్రాలంకరణని ప్రశ్నించుకోవడం, తోడు లేనిదే బయటికి వెళ్లకపోవడం చేస్తుంటారు. పైగా ఈబధని ఎవరితో చెప్పుకోలేక సతమతమౌతుంటారు. చెప్పినా కూడా కొన్నిసార్లు వీళ్లే నిందలకు గురవుతుంటారు. కొన్ని గుర్తుపెట్టుకోండి. 1. ఈ అనుభవాలు మీ ఒక్కరికే కాదు, దాదాపు అందరి ఆడవాళ్లలో ఉంటాయి. ఒకసారి మీ అమ్మాయి/సోదరి/భార్య/స్నేహితురాళ్లతో చర్చించండి. వారికి సాంత్వన చేకూర్చి ధైర్యాన్ని ఇచ్చినవాళ్లవుతారు. 2. తప్పు ఎప్పుడూ దాడి చేసినవాళ్లదే. మీరు ఒంటరిగా బయటికి వెళ్ళటం, మీ వస్త్రాలంకరణ, మీ మాటలు ఇవేవీ కూడా వారు మీతో అలా ప్రవర్తించడానికి పచ్చజెండా కాదు. 3. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. రోడ్డుపై వెళ్ళేటప్పుడు జాగరూకతతో ఉండండి, ఎదుటివాళ్లపై అనుమానం ఉంచి వాళ్లు మిమ్మల్ని దరి చేరేటప్పుడు బ్యాగ్ ఒక చేతి నుంచి ఇంకో చేతికి మార్చటం, చేతులు విదల్చటం వంటి హఠాత్చర్యల వలన దాడిచేసేవాళ్లు దూరం జరుగుతారు. 4. దాడి జరిగినప్పుడు వెంటనే పట్టుకుని ప్రశ్నించండి. వాళ్లు హెడ్లైట్ల కింద దొరికిన కుందేలులా స్థాణువైపోతారు. 5. ఇటువంటి అనుభవాలు మిమ్మల్ని తీవ్ర మానసిక ఇబ్బందికి గురిచేసినా లేక మీ లైంగిక జీవితాన్ని అస్తవ్యస్తం చేసినా మానసిక నిపుణుల్ని కలవండి. డాక్టర్ శ్రీకాంత్ మిరియాల -
మగువ కన్నీళ్లకు ఇంత శక్తి ఉందా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
ఎంతవారైనా కాంత దాసులే అంటాడు త్యాగరాజు. ఆడదాని ఓరచూపులో చిత్తుకానీ మగాడు లేడు అంటాడు ఓ సినీ కవి. అవన్నీ నిజమే అనేలా శాస్త్రవేత్తల అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఆడవాళ్ల కంటి నుంచి వచ్చే కన్నీళ్లకు ఉన్న శక్తిని చూసి ఆశ్చర్యపోయారు. దెబ్బకి మగాడిలో ఉన్న దూకుడుతునానికి కళ్లెం పడుతుందని ప్రూవ్ చేసి చూపించారు కూడా. ఈ మేరకు ఇజ్రాయెల్‌లోని వీజ్ మాన్ ఇన్స్టిట్యూట్ ఆప్ సైన్స్ నిర్వహించిన పరిశోధనలో మానవ కన్నీళ్లలో రసాయన సంకేతం ఉందని, మెదడు కార్యకలాపలను ప్రభావితం చేస్తుందని కనుగొన్నారు. స్త్రీల నుంచి వచ్చే కన్నీళ్ల వాసన పురుషుల కోపాన్ని నియంత్రిస్తుందని వెల్లడించారు. అందుకోసం పరిశోధకులు ఆడ ఎలుకలపై పరిశోధన చేశారు. ఆ అధ్యయనంలో ఆడ ఎలుకల కన్నీళ్లు మగ ఎలుకల దాడిని నియంత్రించినట్లు తెలిపారు. అంతేగాదు ఈ మగ ఎలుకలు కూడా తమ కన్నీళ్లతో ఆల్పా అనే జాతి ఎలుకల దాడిని నివారిస్తాయిని పేర్కొన్నారు. అలాగే ఇద్దరు వాలంటీర్ మహిళలపై కూడా ప్రయోగం చేశారు. వాళ్లికి ముందుగానే ఇద్దరు మగావాళ్లతో కొన్ని రకాల గేమ్‌లు ఆడమన్నారు. అలాగే వారి డబ్బులను లాక్కునేలా మోసం చేయమన్నారు. ఆ తర్వాత వెంటనే కన్నీళ్లు పెట్టుకుని క్షమాపణలు చెప్పమన్నారు. ఇలా చేయంగానే సదరు మగవాళ్లలో ప్రతికార చర్యలు నెమ్మదిగా తగ్గిపోయినట్లు గమనించారు. ఈ అధయనంలో ప్రతీకారం తీర్చుకోవాలనే పురుషుల కోరిక 43.7% వరకు తగ్గిపోయిందన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న సదరు పురుషులను బ్రెయిన్‌ను ఎమ్మారై స్కాన్ చేయగా మహిళ కన్నీళ్ల వాసన వారి మెదడును ప్రభావితం చేసి ఆయా ప్రాంతాల్లో ప్రిఫ్రంటల్ కార్టెక్స్, పూర్వ ఇన్సులాలో చురుకుదనం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ కొన్ని విషయాలను గమనించాలి. శిశువులు పుట్టగానే ఏడుస్తారు. ఇక్కడ వారికి వచ్చే హానిని నియంత్రించడానికి కన్నీళ్లు పెట్టేలా ఏడవడం జరుగుతుందన్నారు. ఇక్కడ శిశువులు నిస్సహాయులు కాబట్టి తమ పట్ల కోపంగా ప్రవర్తించొద్దని ఏడుపు రూపంలో తెలియజేస్తారని, అందుకు తగ్గట్టుగానే మానవ మెదడు ఆటోమెటిక్‌గా కరిగి కోపాన్ని తమాయించుకుంటుంది. ఇదే మాదిరిగా నిజజీవితంలో కొన్ని సందర్భాల్లో ఈ కన్నీళ్లు వాసన ప్రభావంతంగా కనిపించదని కూడా చెప్పారు. గృహహింస, ఆడవాళ్లపై అకృత్యాలు లేదా టార్చర్ పెట్టే నేరగాళ్లలో దూకుడుని ఈ కన్నీళ్ల వాసన పెద్దగా ప్రభావం చేయకలేకపోయిందని అన్నారు ఇక్కడ కాస్త దీన్ని నిశితంగా గమనిస్తే.. వాళ్లది హింసా ప్రవృత్తి. సాధారణంగా సున్నితమైన మనస్సు గలవాళ్లకే మహిళ కన్నీళ్లకు ఇలా ప్రతిస్పందిస్తారని శాస్త్రవేత్తలు ధీమాగా చెబుతున్నారు. ఇక్కడ మహిళ కన్నీళ్ల వాసన మగవాడి కోపానికి కళ్లేం వేయగలిగినప్పుడు, స్త్రీ పట్ల అమానుషింగా ప్రవర్తించే నేరగాళ్ల బ్రెయిన్‌ని ఎందుకు ప్రభావితం చేయలేకపోతుందనేది శాస్త్రవేత్తలకు అర్థంకానీ చిక్కు ప్రశ్న. ఈ మిస్టరీని చేధించగలిగితే మహిళల పట్ల జరిగే ఎన్నో అమానుషాలను సులభంగా నియంత్రించొచ్చని చెప్పింది పరిశోధకుల బృందం. (చదవండి: సర్జరీ చేసే టైంలో పేషెంట్‌పై డాక్టర్ తోడి! వీడియో వైరల్) -
పుట్టుకతో వచ్చే లోపాలకు కారణం మద్యపానమే!వెలుగులోకి షాకింగ్ విషయాలు
ప్రెగ్నెన్సీ లేదా ఫ్యామిలీ ప్లాన్ చేసుకుంటే మాత్రం పురుషులు మద్యం సేవించడం మానేయాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. లేదంటే గర్భధారణ సమస్యలు లేదా పిల్లల్లో సరైన పెరుగుదల లేకపోవడం లేదా పుట్టుకతో వచ్చే లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువుగా ఉటాయంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. కనీసం ఓ వారం రెండు వారాల నుంచి మద్య మానేయడం కాదని బాంబు పేల్చారు. సేవించిన మద్యం ప్రభావం స్పెర్మ్‌పై ఎలా ఉంటుందో కూడా సవివరంగా వివరించారు. మద్య సేవించే పురుషులకు పుట్టే పిల్లల్లో ఎలాంటి సమస్యలొస్తాయో తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఇంతవరకు గర్భధారణ, పిల్లల అభివృద్ధి విషయాల్లో తల్లి ఆరోగ్యాన్ని కీలకంగా పరిగణించేవారు పరిశోధకులు. ఆ దిశగానే పరిశోధనలు చేయడం జరిగింది. అయితే గర్భధారణకు ముందు ఆల్కహాల్ తీసుకోవడం కారణంగా ఆ మహిళకు పిల్లలు కనడంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అనే దిశగా పరిశోధనలు జరగలేదు. తొలిసారిగా ఆవైపుగా అధ్యయనం సాగించారు శాస్త్రవేత్తలు. ఆ పిండానికి ఆల్కహాల్ సిండ్రోమ్(ఎఫ్ఏఎస్)తో సంబంధం ఉండే అవకాశాలు ఉంటాయా? అనే దిశగా సరికొత్త ప్రయోగాలు చేశారు. ఆ అధ్యయనంలో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీని కారణంగా బరువు తక్కువుగా జననాలు, హైపర్ యాక్టీవిటీ సమస్యలు, సరైన ఎదుగుదల లేని పిల్లలు పుట్టడానికి కారణమని తేలింది. పిల్లలను లేదా ఫ్యామీలిని ప్లాన్ చేసుకుంటే మగవాళ్లని మద్యం సేవించకుండా మహిళలే చూసుకోవాలని లేదా బాధ్యత తీసుకోవాలని సూచించారు పరిశోధకులు. మద్యం సేవించిన ఎంతకాలం వరకు స్పెర్మ్‌పై ఆల్కహాల్ ప్రభావం ఉంటుందనే దానిపై కూడా పరిశోధనలు నిర్వహించారు. తండ్రి ఆల్కహాల్ అలవాట్లు పిండం అభివృద్ధిలో బలమైన ప్రభావం ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు. దీంతో తాము స్పెర్మ్‌పై ఆల్కహాల్ ప్రభావం తగ్గడానికి ఎంత సమయం పడుతుందో అనే దిశగా కూడా అధ్యయనం చేసినట్లు తెలిపారు. అందుకోసం మగ ఎలుకలపై ప్రయోగాలు చేయగా..కొన్నింటి ఆల్కహాల్‌కు గురిచేసి మరికొన్నింటికి ఆల్కహాల్ ఇవ్వకుండా చూడగా వాటి జన్యువుల్లో సంభించిన పలు మార్పులను గమనించినట్లు తెలిపారు. ఈ పరిశోధనల్లో కనీసం మూడు, నాలుగు వారాలు కాకుండా ఏకంగా మూడు నెలల పాటు ఆల్కహాల్‌కి దూరంగా ఉంటేనే వారి శరీరంలో ఉత్పత్తి అయ్యే స్పెర్మ్‌పై ప్రభావం ఉండదని అధ్యయనంలో వెల్లడయ్యిందని అన్నారు. అలాగే మగవారిలో స్పెర్మ్ 60 రోజుల వ్యవధిలో తయారవుతుందని మాకు తెలుసు. కానీ మద్యం మానేసిన ఒక నెలకు గానీ సెర్మ్పై ఆల్కహాల్ ప్రభావం తగ్గటం ప్రారంభమవ్వదని అన్నారు. అందువల్ల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పడూ కనీసం రెండు నుంచి మూడు నెలల వరకు మద్యం మానేయాల్సిందేనని సూచించారు. అప్పటి వరకు ఆగి ఫ్యామిలీని ప్లానే చేసుకోకతప్పదని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు మద్యం మానేసినప్పటికీ దాని తాలుకా రసాయనా ప్రభావం శరీరంలో అలా కొనసాగుతు ఉంటుందని అందువల్ల మూడు నెలల సమయం విరామం తీసుకోవాల్సిందేనని అన్నారు. లేదంటే తల్లిదండ్రులు ఆల్కహాలిక్ సంబంధిత పుట్టుకతో వచ్చే లోపాలను ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు పరిశోధకులు. (చదవండి: భర్త చనిపోయిన రెండేళ్లకు ప్రెగ్నెంట్! ఆమె ధైర్యాన్ని కొనియాడుతున్న వైద్యులు) -
అతడి గుండె చెదురుతోంది!
సాక్షి, హైదరాబాద్: అస్థిరమైన జీవనశైలి, హార్మోన్ల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా అన్ని ప్రధాన రాష్ట్రాల్లోనూ మహిళల కంటే మగవాళ్లే ఎక్కువ గుండెపోటుతో మరణిస్తున్నారు. గతేడాది తెలంగాణ రాష్ట్రంలో 284 మంది గుండెపోటుతో మరణించగా.. ఇందులో 257 మంది పురుషులు కాగా.. 27 మంది స్త్రీలున్నారు. ఆంధప్రదేశ్‌లో 176 మంది మృత్యువాత పడగా.. 162 మంది మగవాళ్లు, 14 మంది ఆడవారున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇండియా (ఏడీఎస్‌ఐ)–2022 నివేదికలో బహిర్గతమైంది. గుండెపోట్లు ఎందుకంటే.. గుండె జబ్బులకు ప్రధాన కారణం జన్యు సంబంధమైనవే. బలహీన గుండె కండరాలు ఉంటే హార్ట్ ఎటాక్‌లకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మహిళలకు మెనోపాజ్ దశ వరకు శరీరంలో హార్మోన్లు భద్రత కల్పింస్తాయి. కానీ, పురుషులకు అలా ఉండదు కాబట్టి యుక్త వయసులో కూడా మగవారికి గుండెపోటు ప్రమాదం ఎక్కువ.అతిగా మాంసం వినియోగం, కొవ్వు, జంక్ ఫుడ్ వంటి ఆహారపు అలవాట్లతో పాటు శారీరక, మానసిక ఒత్తిడి, అస్థిరమైన జీవనశైలి వల్ల గుండెపోటు వస్తుంటుంది. గుండె ఆగుతున్న వారిలో యువకులే ఎక్కువ గతేడాది దేశంలో 32,410 మంది గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించగా.. ఇందులో 28,005 మంది పురుషులు, 4,405 మంది మహిళలు ఉన్నారని. 2021లో 28,413 మంది హార్ట్ ఎటాక్‌తో మృత్యువాత పడ్డారు. అంటే ఏడాదిలో 12.5 శాతం పెరిగింది. గతేడాది 289 మంది మైనర్లకు హార్ట్ ఎటాక్ రాగా.. ఇందులో 185 మంది బాలురు, 104 మంది బాలికలున్నారు. 18 నుంచి 45 ఏళ్ల 12,759 మంది యువత గుండెపోటుకు గురికాగా.. 11,210 మంది పురుషులు, 1,549 మంది స్త్రీలు, 45–60 ఏళ్ల వయసు ఉన్న 12,290 మంది గుండె పోటుతో మరణించగా.. మగవాళ్లు 10,854 మంది, సమహిళలు 1,436 మంది ఉన్నారు. అలాగే 60 ఏళ్ల పైబడిన వాళ్లు 7,069 మంది మరణించగా.. 5,756 మంది పురుషులు, 1,313 మంది మహిళలున్నారు. ఏం చేయాలంటే... ► సాధ్యమైనంత వరకు మానసిక, పని ఒత్తిడిని తగ్గించుకోవాలి. ► ఉదయం, సాయంత్రం వ్యాయామం తప్పనిసరి. ► స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చే ప్రాంతంలో ప్రతి రోజు కొంత సమయం గడపాలి. ► ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవాలి. ఇందుకోసం నిత్యం యోగా, ధ్యానం వంటివి చేయాలి. ► 35 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకోవాలి. ► స్వీయ సంతృప్తి అత్యవసరం. లేనిపోని ఆర్భాటాలకు, డాబులకు పోయి మానసిక ఒత్తిడి తెచ్చుకోకూడదు. డాక్టర్ ఏజీకే గోఖలే గుండె శస్త్ర చికిత్స నిపుణులు, అపోలో ఆసుపత్రి -
మగాళ్లు.. తగ్గట్లే!
సాక్షి, అమరావతి: ఫ్యాషన్.. ప్రపంచానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫ్యాషన్ పేరు చెప్పి మన దేశంలో ఏటా రూ.వేల కోట్ల వ్యాపారం సాగుతోంది. ముఖ్యంగా మహిళలు సౌందర్యం, అలంకరణ వస్తువుల కోసం విపరీతంగా ఖర్చు చేస్తుంటారు. ఈ విషయంలో మగవారు మగువలకు ఏమాత్రం తక్కువ కాదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా పురుషుల ఫ్యాషన్ మార్కెట్ 11 శాతం వృద్థి చెందడమే దీనికి నిదర్శనంగా చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మార్కెట్ టర్నోవర్ ఏటా రూ.31 వేల కోట్లు అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇంతలా మగాళ్లు తగ్గట్లేదంటే మారుతున్న సామాజిక ధోరణులు (ట్రెండ్స్) దీనికి కారణమంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ, గడ్డం గ్రూమింగ్, ఫెర్ఫ్యూమ్స్కు సంబంధించి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల వినియోగం పురుషులు ప్రపంచ ట్రెండ్లను అనుసరించేలా చేస్తోంది. అలా మొదలై.. ఇలా పెరిగింది పురుషులు వస్త్రధారణ, అలంకరణలో ప్రత్యేకత చూపించడమేది కొత్తగా వచ్చిన ట్రెండ్ కాదు. పూర్వకాలం నుంచీ రాజసాన్ని, దర్పాన్నీ ప్రదర్శించే విధంగా దుస్తులను ధరించే అలవాటు ఉండేది. మహారాణి, యువరాణుల మెడలో బంగారం, వజ్రాల నగలు వేసుకుంటే.. వారికి సమానంగా రాజు, యువరాజులు కూడా హారాలు, కిరీటాలు ధరించే వారు. రాజుల తరువాత మండలాధీశులు, వ్యాపారులు కొంతవరకూ ఇలాంటి అలంకరణలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే సామాన్య ప్రజల్లో ఇలాంటివి చాలా అరుదుగా ఉండేవి. వారంతా సాధారణ వస్త్రాలు, మామూలు నగలు ధరించే వారు. కానీ.. కాలంతో పాటు పేద, ధనిక అనే తేడా లేకుండా ఎవరి స్థాయిలో వారు ఫ్యాషన్‌గా కనిపించేందుకు తాపత్రయపడటం ప్రారంభించారు. కేవలం విలువైన వస్తువులు ధరించడమే ఫ్యాషన్ అనుకునే స్థాయి నుంచి తాము ఏది ధరిస్తే అదే ఫ్యాషన్ అనే స్థితికి వచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏది ట్రెండింగ్‌లో ఉందో చూసుకుని ఆ ఫ్యాషన్ మోడల్‌ను ఫాలో అయిపోతున్నారు. కొందరు సినిమా, క్రికెట్ స్టార్లు తమ ప్రత్యేక వస్త్రధారణ, అలంకరణతో ట్రెండ్ సెట్ చేస్తూ, యూత్‌కి మార్గదర్శకం అవుతున్నారు. దీనికి తగ్గట్టుగానే కార్పొరేట్ దిగ్గజాలు వారి రిటైల్ అవుట్లెట్లలో మగవారి కోసం ప్రత్యేకంగా బ్రాండెడ్ వస్త్రాలు, వస్తువులను అందుబాటులో ఉంచుతున్నారు. దుస్తుల తర్వాత ప్రాధాన్యం వాటికే.. పురుషులు ఎక్కువగా ఖర్చు చేస్తున్న వాటిలో మొదటి స్థానంలో దుస్తులున్నాయి. అంతర్జాతీయ ఫ్యాషన్లను యథాతథంగా అనుసరిస్తున్నారు. ఆన్లైన్ ఈ–కామర్స్ సైట్లలో ఆర్డర్ పెడితే ఎక్కడి నుంచైనా కావాల్సిన దుస్తుల్ని ఇంటికి తెప్పించుకునే వెసులుబాటు రావడంతో దుస్తుల ఫ్యాషన్‌లో సరిహద్దులు చెరిగిపోయాయి. మారుతున్న సాంస్కృతిక ప్రమాణాలు ఇందుకు దోహదపడుతున్నాయి. ఎండ ప్రభావం నుంచి మొహాన్ని.. చర్మాన్ని రక్షించే సన్‌బ్లాక్ క్రీమ్‌లు రాసుకోవడాన్ని మగవారు ఒకప్పుడు వింతగా భావించే వారు. కానీ.. ఇప్పుడు క్రీమ్‌లతో పాటు సువాసనలు వెదజల్లే ఫెర్ఫ్యూమ్స్ వాడకం పెరిగింది. పురుషులు మునుపెన్నడూ లేనివిధంగా వ్యక్తిగత సంరక్షణ పద్ధతులను పాటిస్తున్నారు. అంతర్జాతీయ ఫ్యాషన్, జీవనశైలి ధోరణులకు మన దేశంలో పురుషులు ఆకర్షితులవుతున్నారు. అందుబాటులో ఉన్న అనేక మాధ్యమాల ద్వారా తమకు అవసరమైన వాటిపై వారు అవగాహన పెంచుకుంటున్నారు. ఆరోగ్య స్పృహ పెరగడం కూడా ఇందుకు మరో కారణమని చెప్పవచ్చు. ఆడవారితో పాటు పురుషులకు కూడా జుట్టు సంరక్షణ ముఖ్యమని భావిస్తున్నారు. దీనికి తగ్గట్టు మెన్స్ బార్బర్ షాప్‌లు విపరీతంగా పెరిగాయి. ఇవి హెయిర్ కట్లతో పాటు గడ్డం ట్రిమ్మింగ్, మానిక్యూర్, పెడిక్యూర్, షేవ్, ఫేషియల్స్ వంటి సేవలను అందిస్తున్నాయి. అంతేకాదు ఇలాంటి చోటనే పురుషులు ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటున్నారు. వివిధ వస్త్రధారణ పద్ధతులు, సౌందర్య ఉత్పత్తుల గురించి తెలిపే సామాజిక సమావేశ స్థలాలుగా సెలూన్స్ పరిణామం చెందాయి. -
తాగుబోతు చేత ప్రమాణం
-
పవర్‌గ్రిడ్ చెస్ టోర్నీ విజేత కార్పొరేట్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇంటర్ రీజినల్ చెస్ టోర్నమెంట్లో మహిళల టీమ్ విభాగంలో కమలేశ్ భూరాణి, హిమాన్షిలతో కూడిన కార్పొరేట్ సెంటర్ (సీసీ) జట్టు విజేతగా నిలిచింది. కార్పొరేట్ సెంటర్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి అజేయంగా నిలిచింది. పవర్‌గ్రిడ్ సదరన్ రీజియన్–1 ఆధ్వర్యంలో మూడు రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన ఈ టోర్నీ ఆదివారం ముగిసింది. మహిళల టీమ్ విభాగంలో ఈస్టర్న్ రీజియన్–1కు రెండో స్థానం, నార్తర్న్ రీజియన్–2కు మూడో స్థానం లభించాయి. పురుషుల టీమ్ విభాగంలో బిశ్వజ్యోతి దాస్, అరుణ్ తివారీ, హృషికేశ్ సింగ్, బిజిత్ శర్మలతో కూడిన నార్త్ ఈస్టర్న్ రీజియన్ చాంపియన్‌గా నిలిచింది. నార్తర్న్ రీజియన్–1కు రెండో స్థానం, కార్పొరేట్ సెంటర్‌కు మూడో స్థానం దక్కాయి. పురుషుల వ్యక్తిగత విభాగంలో అంజన్ సేన్ (కార్పొరేట్ సెంటర్), బిశ్వజ్యోతి దాస్, గౌరవ్ కుమార్ (నార్తర్న్ రీజియన్–1) వరుసగా తొలి మూడు స్థానాల్లో... మహిళల వ్యక్తిగత విభాగంలో మీనాక్షి మలిక్ (నార్నర్త్ రీజియన్–1), హిమాన్షి, కమలేశ్ భూరాణి వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. పవర్‌గ్రిడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.శ్రీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సదరన్ రీజియన్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ, అలోక్ కుమార్ శర్మ (సీజీఎం–అసెట్ మేనేజ్మెంట్), సంజయ్ కుమార్ గుప్తా (సీజీఎం–ప్రాజెక్ట్స్), హరినారాయణన్ (సీజీఎం–హ్యూమన్ రిసోర్సెస్) తదితరులు పాల్గొన్నారు. -
తాలిబాన్ సంచలన నిర్ణయం.. వాటిపై నిషేధం, అలా జరిగితే ఇదే మొదటి సారి
2021 ఆగస్టులో అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. ఆ దేశ ప్రజలపై పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహిళలపై అనేక ఆంక్షలు విధించారు. అందులో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరి, యూనివర్సిటీ విద్యను అభ్యసించడాన్ని నిషేధించడంతోపాటు పాఠశాల విద్యపైనా అనేక ఆంక్షలు విధించారు. చివరికి మహిళలు బ్యూటీ పార్లర్లను నిషేధించారు. తాజాగా పురుషుల దుస్తులపై కూడా నిషేధాన్ని విధించేందుకు సిద్దమయ్యారు తాలిబన్లు. వివరాల్లోకి వెళితే.. పురుషులు ధరించే నెక్టైలపై నిషేధం విధించేందుకు తాలిబన్లు సిద్ధమయ్యారు. నెక్‌టైలు క్రైస్తవ శిలువను పోలి ఉండటమే ఇందుకు కారణంగా చెప్పారు. ఈ విషయాన్ని ‘ది ఇన్విటేషన్ అండ్ గైడెన్స్ డైరెక్టరేట్’ డైరెక్టర్ మొహమ్మద్ హషిమ్ షాహీద్ వ్రార్ వెల్లడించారు. అఫ్గాన్‌లో మతపరమైన విధానాలను నిర్ణయించే స్వతంత్ర సంస్థ ది ఇన్విటేషన్ అండ్ గైడెన్స్ డైరెక్టరేట్. ఆయన దీనిపై మాట్లాడుతూ.. "కొన్నిసార్లు, నేను ఆసుపత్రులకు, ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు, ఆఫ్ఘన్ ముస్లిం ఇంజనీర్ లేదా డాక్టర్ నెక్‌టైని ఉపయోగించడం చూశాను. నెక్టైకి మూలం ఏంటి.. క్రిస్టియన్ శిలువను పోలి ఉందని, వీటిని నిషేధించాల్సి ఉందని" అని పేర్కొన్నాడు. నెక్టీలపై నిషేధం విధించినట్లయితే, తాలిబాన్ అధికారులు పురుషుల దుస్తులపై ఆంక్షలు విధించడం ఇదే మొడటి సారి అవుతుంది. Video: Mohammad Hashim Shaheed Wror, General Director of the Invitation and Guidance Directorate (an independent body that determines religious policies within the interim govt), said that the necktie originated from the Christian cross and that it is “ordered in Shariah that you… pic.twitter.com/UMHesWX6TM — TOLOnews (@TOLOnews) July 26, 2023 చదవండి US Woman Got 100 Amazon Orders: ఆర్డర్ పెట్టకుండానే ఆమె ఇంటికి 100కు పైగా పార్సిళ్లు.. ఆరా తీస్తే.. -
నువ్వే నా ఫస్ట్ లవ్ అని చెబితే అస్సలు నమ్మకండి.. అంతా అబద్దమట
అబద్దం..ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అబద్దాలు చెబుతూనే ఉంటారు. ఎంత నిజాయితీగా ఉందామనుకున్నా అవసరం కొద్దీ కొన్నిసార్లు అబద్దాలు చెప్పాల్సి వస్తుంది. కొంతమంది సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అబద్దాలు చెబితే, మరికొందరు ప్రతి చిన్న విషయానికి కూడా అబద్దాలు చెబుతూ ఉంటారు. వీళ్లలో మగవాళ్లే, ఆడవాళ్ల కంటే ఎక్కువగా అబద్దాలు చెబుతున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది.మహిళలు రెండింతలు అబద్దాలు చేపితే పురుషులు వారికన్నా ఆరు రెట్లు ఎక్కువగా అబద్దాలు చెబుతున్నట్లు పరిశోధకులు తేల్చేశారు. మన దేశంలో ఎక్కువగా ఎవరు ఏఏ సందర్భాల్లో అబద్దాలు చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.. ►ఎక్కువగా జీవిత భాగస్వామితో అబద్దాలు చెబుతున్నారని సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా మహిళలతో షాపింగ్ చేసేందుకు తప్పించుకోవడానికి రకరకాల కారణాలు చెబుతుంటారని తేలింది. ► సారీ.. పనిలో ఉన్నాను,ఫోన్ చూసుకోలేదు. అందుకే లిఫ్ట్ చేయలేదు అని ఎక్కువగా అబద్దాలు చెబుతుంటారు. ► నువ్వే నా ఫస్ట్ లవ్ అని ఎవరైనా చెబితే అస్సలు నమ్మకండి. చాలామంది మగవాళ్లు ఈ అబద్దాన్ని తమ గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేయడానికి ఎక్కువగా ఈ అబద్దం చెబుతారట. ► కొంతమంది మగవాళ్లు రేపట్నుంచి సిగరెట్ మానేస్తాను అని చెప్పి ప్రతిరోజు అదే రిపీట్ చేస్తారట. ► ఏదైనా ఒక ప్లేస్‌కి వెళ్దామని అడిగితే, ఇష్టం లేకపోతే పని ఉందని అబద్దం చెబుతారట. ► చాలామంది తమ దగ్గర చేతులో డబ్బులు ఉన్నా ఇవ్వడానికి ఇష్టపడరట. అప్పు అడిగితే ఇప్పుడు లేవు అని అబద్దాలు చెబుతున్నారట. ► కొంతమంది నోరు తెరిస్తే అబద్దాలు చెబుతుంటారు. అలా దొరికిపోతారు కూడా..అయినా సరే, ఇప్పుట్నుంచి అబద్దాలు చెప్పను అని మళ్లీమళ్లీ చెబుతుంటారు. ► అనుకున్నా టైం కంటే ఆలస్యమైతే, సారీ ట్రాఫిక్‌లో చిక్కుకున్నాను అని ఈజీగా అబద్దాలు ఆడేస్తారట. ► ఆడవాళ్లలో చాలామందికి పొసెసివ్ ఫీలింగ్ ఎక్కువ. తమకు అటెష్టన్ ఉండాలని ఆరాటపడతారట.వేరే అమ్మాయిలు అందంగా రెడీ అయినా జస్ట్ ఓకే, పర్లేదు, ఈ డ్రెస్ నీకంత నప్పలేదు అని అబద్దాలు చెబుతారట. ► నా బైక్ పంక్చర్ అయ్యింది, లేదా పెట్రోల్ అయిపోయింది అని చెబుతుంటారట ఒకవేళ బైక్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ► అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి రకరకాల ఫీట్లు చేసి అబద్దాలు చెబుతుంటారట. ఇందులో 58% మంది తమకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే అబద్దాలు చెబుతారని, 42% మంది తమ సీక్రెట్‌ను రహస్యంగా ఉంచేందుకు అబద్దాలు చెబుతారని తేలింది. 40శాతం మంది తాము నలుగురిలో చులకన అవ్వకుండా ఉండేందుకు అబద్దాలు చెబుతారని పరిశోధనలో వెల్లడైంది. మొత్తంగా చూసుకున్నా ఆడవాళ్లకంటే మగవాళ్లే ఎక్కువగా అబద్దాలు చెబుతారని తేలిపోయింది. రోజుకు కనీసం ఒక్కసారైనా అబద్ధం చెప్పే వారి సంఖ్య మగవారిలోనే అధికంగా ఉంటుందట.కొందరి బాడీ లాంగ్వేజీని బట్టి కూడా అబద్దాలు చెబుతున్నారా లేదో తెలుసుకోవచ్చట. మూడేళ్ల వయసు నుంచే అబద్దాలు చెప్పడం ప్రారంభమవుందని చెబుతున్నారు నిపుణులు. -
పురుషులకు జాతీయ కమిషన్.. పిల్ కొట్టేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: పురుషుల హక్కుల పరిరక్షణకు ‘జాతీయ కమిషన్ ఫర్ మెన్’ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గృహ హింస కారణంగా ఆత్మహత్యలకు పాల్పడే పురుషుల కేసులపై విచారణకు మార్గదర్శకాలను రూపొందించాలని పిటిషనర్ న్యాయవాది మహేశ్ కుమార్ తివారీ కోరారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2021లో 1,64,033 ఆత్మహత్యలు చేసుకోగా వారిలో 81,063 మంది వివాహితులైన పురుషులున్నారని, 28,680 మంది వివాహిత మహిళలని వివరించారు. వీరిలో కుటుంబ సమస్యలతో బలవన్మరణాలకు పాల్పడిన వారు 33.2% కాగా, వివాహ సంబంధిత సమస్యలతో 4.8% మంది తనువు చాలించినట్లు తెలిపారు. వివాహమైన పురుషుల ఆత్మహత్యల సమస్యను పరిష్కరించేందుకు, గృహ హింసకు గురవుతున్న పురుషుల ఫిర్యాదులను స్వీకరించడానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ)ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఈ పిల్‌పై సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘మీరు నాణేనికి ఒక వైపునే చూపించాలనుకుంటున్నారు. పెళ్లవగానే చనిపోతున్న యువతుల డేటాను మీరివ్వగలరా? చనిపోవాలని ఎవరూ అనుకోరు. అది వ్యక్తిగతంగా వారు ఎదుర్కొనే పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొంది. పిల్ ఉపసంహరించుకునేందుకు పిటిషనర్‌కు అవకాశం ఇచ్చింది. -
600 ఏళ్ల నాటి నృత్యం..రెప్పవాల్చడం మర్చిపోవాల్సిందే!
ఒక్కో దేశంలో ఒక్కో రకరమైన సాంస్కృతిక సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని విభిన్న సంప్రదాయాలు, కళలు ఆయా ప్రాంతాలకే పెట్టింది పేరుగా కూడా ఉంటాయి. ఆయా దేశాల్లో ఉన్న విద్య, వైజ్ఞానికి సాంస్కృతకి కళలు, శాస్త్రలను ప్రోత్సహింస్తూ కనుమరుగవ్వకుండా కాపాడేందుకు కృషి చేస్తున్న యునెస్కో 600 ఏళ్ల నాటి ఓ అద్భుత అనితర సాధ్యమైన నృత్య కళకు సంబంధించిన వీడియోని నెటిజన్లతో పంచుకుంది. ఆ నృత్యకళ మన కళ్లను ఆర్పడమే మర్చిపోయాలా కట్టిపడేస్తుంది. ఈ కళను ప్లయింగ్ మెన్ డ్యాన్స్‌గా వ్యవహరిస్తారు. ఇది మెక్సికో, మధ్య అమెరికాలో తూర్పు రాష్ట్రమైన వెరాక్రూజ్‌లోని టోటోనాక్ సముహ ప్రజలు ఈ నృత్యాన్ని చేస్తుంటారు. దీన్ని వారు సంతానోత్పత్తి డ్యాన్స్‌గా పిలుస్తారు. ఆచార వ్యవహారాలు, ప్రకృతి పట్ల తమకున్న గౌరవం, సామరస్యతను తెలియజేసేందుకు చేసే ఫెర్టిలిటీ డ్యాన్స్ ఇది. ఈ నృత్యం చేసేటప్పడూ కొంతమంది పురుషులు బృందం ఓ పొడవాటి స్థంభంపై గుంపుగా కూర్చొంటారు. అందులో వ్యక్తి స్థంభంపై బ్యాలెన్స్ చేసుకుంటూ..ఒక విధమైన సాధనంతో ఊదుతూ.. గాల్లో డ్యాన్స్ చేస్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి సెంటర్ పొజిషన్ని ఆక్రమించి కూర్చోగానే మిగతా వ్యక్తులు తలకిందులుగా..ఆ స్థంభం చుట్టూ వేలాడుతూ..నలు దిశల్లో తిరుగుతారు. ఆ తర్వాత క్రమంగా కిందకి దిగిపోతారు. అద్భతంగా కనిపిస్తుంది ఆ దృశ్యం. ఈ మేరకు యునెస్క్ ఇన్‌స్టాగ్రాంలో అందుకు సంబందించిన వీడియోని షేర్ చేస్తూ..వారు ఏవిధంగా నృత్యం చేశారో వివరించింది. View this post on Instagram A post shared by UNESCO (@unesco) (చదవండి: టీవి స్టార్‌గా పేరు తెచ్చుకుంటూనే.. ఎంట్రపెన్యూర్‌గా రాణిస్తున్న ఆష్క) -
కిక్కిరిసిన మెట్రో.. ఏమైందో తెలియదు.. తన్నుకున్న యువకులు..
ఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. అప్పటికే కిక్కిరిసిపోయిన మెట్రోలో యువకులు పిడిగుద్దుల కురిపించుకున్నారు. దీంతో తోటి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. ఢిల్లీ మెట్రో రైలు ప్రారంభమైంది. ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. నిలబడటానికి కూడా సరిగా స్థలం దొరకని పరిస్థితి. ఇంతలోనే మెట్రోలో ఇద్దరు యువకుల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. అదీ కాస్త ఘర్షణకు దారి తీసింది. కోపంతో ఇద్దరు యువకులు ఒకరిపై ఇంకొకరు రెచ్చిపోయారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. కొందరు ప్రయాణికులు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. వారి గొడవ నుంచి మరికొందరు దూరంగా జరిగారు. దీంతో రైలులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. A fight broke out between two people on @OfficialDMRC Violet Line. #viral #viralvideo #delhi #delhimetro pic.twitter.com/FbTGlEu7cn — Sachin Bharadwaj (@sbgreen17) June 28, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయాణికులు మెట్రో యాజమాన్యాన్ని విమర్శించారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా చర్యలు శూన్యమని కామెంట్లు పెట్టారు. ఘర్షణకు దిగిన ఇద్దరు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీ మెట్రో కూడా స్పందించింది. నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. మెట్రోలో ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని సూచనలు చేసింది. ఇదీ చదవండి: వీడేం లవర్‌రా బాబు..! దొంగకే సానుభూతి కలిగింది.. -
రెచ్చిపోయిన దొంగలు.. టన్నెల్లో కారును అడ్డగించి.. వీడియో వైరల్..
ఢిల్లీ: ఢిల్లీలో పట్టపగలే దోపిడి దొంగలు రెచ్చిపోయారు. నడి రోడ్డుపై కారును అడ్డగించి రూ.2 లక్షలను ఎత్తుకుపోయారు. 1.5 కిలోమీటర్ల పొడవు ఉండే ప్రగతి మైదాన్ టన్నెల్లో గన్‌తో బెదిరించి దుండగులు ఈ దురాఘాతానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకుని గుర్‌గ్రామ్ వెళుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ప్రగతి మైదాన్ టన్నెల్లోకి ఎంట్రీ ఇచ్చారు. నలుగురు యువకులు రెండు బైక్‌లపై వచ్చి టన్నెల్ మధ్య భాగంలో నడి రోడ్డుపై కారును అడ్డగించారు. గన్‌తో బెదిరిపంచి రూ.2 లక్షల బ్యాగ్‌ను ఎత్తుకుపోయారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. LG shud resign. Make way for someone who can provide safety n security to the people of Delhi. If Central govt is unable to make Delhi safe, hand it over to us. We will show u how to make a city safe for its citizens. https://t.co/oPtqnAWlgJ — Arvind Kejriwal (@ArvindKejriwal) June 26, 2023 ఇదీ చదవండి: పిల్లాడి టైమ్ టేబుల్.. చదువుకు కేటాయించిన టైమ్ చూస్తే నవ్వాపుకోలేరు! ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. దేశ రాజధానిలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యమయిందని ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వినెయ్ కుమార్ సక్సేనాకు చేతకాకపోతే తమకు ఆ బాధ్యతను అప్పగించవలసిందిగా కోరారు. ఢిల్లీని కాపడటంలో కేంద్రం విఫలమయిందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. టన్నెల్‌ను పర్యవేక్షించడానికి 15 మంది పోలీసులను రక్షణగా ఉంచినట్లు వెల్లడించారు. ఘటన జరిగినప్పుడు టన్నెల్ మొదట్లో, చివర్లో ఇద్దరు చొప్పున పోలీసులు ఉన్నట్లు పేర్కొన్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఇదీ చదవండి: వార్నీ..! రద్దీ రోడ్డులో స్కూటీపై ఏడుగురు పిల్లలతో ప్రయాణం..వీడియో వైరల్.. -
కంటి నిండా నిద్ర కరువు
సాక్షి, అమరావతి: మారిన జీవన విధానాలు, చుట్టుముడుతున్న ఆర్థిక, కుటుంబ సమస్యల నడుమ మధ్య వయస్కులు, వృద్ధుల్లో కంటి నిండా నిద్ర కరవు అవుతోంది. ముఖ్యంగా మధ్య వయసు్కలు పగలంతా కష్టం చేసి రాత్రి అయ్యాక కంటి నిండా నిద్రపోవడం ఒక కలగా మారుతోంది. ఏజ్‌వెల్ ఫౌండేషన్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 40 నుంచి 64 ఏళ్లు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇలా రెండు వర్గాలుగా మే నెలలో దేశవ్యాప్తంగా 5 వేల మంది నుంచి ఫౌండేషన్ వివరాలు సేకరించింది. వీరిలో 40 నుంచి 64 ఏళ్ల వారు 2245 (పురుషులు 1102, మహిళలు 143)మంది, 65 ఏళ్లు పైబడిన వారు 2,755 (పురుషులు 1,336, మహిళలు 1,419) మంది ఉన్నారు. ఆరు గంటలు కూడా నిద్రపోలేకున్నాం 70 శాతం మంది రోజులో కనీసం ఆరు గంటలు కూడా కంటి నిండా నిద్ర పోలేకపోతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 24 శాతం మంది మాత్రం 7 నుంచి 8 గంటలు, 6 శాతం మంది 8 గంటలకు పైగా నిద్రపోతున్నట్టు తెలిపారు. మధ్య వయసు్కల్లో 60 శాతం ఆరు గంటలలోపు, 31 శాతం 7 నుంచి 8 గంటలు, 9 శాతం మంది 8 గంటలకుపైగా నిద్రపోతున్నామన్నారు. అదే వృద్ధుల్లో 78 శాతం మంది ఆరు గంటల్లోపు, 19 శాతం మంది 7 నుంచి 8 గంటలు, 3 శాతం మంది 8 గంటలకుపైగా నిద్ర పోతున్నట్టు వెల్లడైంది. ఆర్థిక ఇబ్బందులు ప్రధాన కారణం నిద్ర లేమికి ప్రధాన కారణం ఆర్థిక పరమైన అంశాలేనని సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య లేకపోవడం, ఇతర కలహాలు కారణమని పేర్కొంది. యాంత్రిక జీవనం, మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు, మద్యం సేవించడం, ఇతర సమస్యలతో సరైన నిద్ర ఉండటంలేదని కూడా ఫౌండేషన్ తెలిపింది. వయోభారం రీత్యా చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలు, ఒంటరి జీవనం నిద్రలేమికి కారణంగా వృద్ధులు పేర్కొన్నారు. పురుషులే అధికం నిద్రలేమితో సతమతం అవుతున్న వారిలో పురుషులే అధికం. పురుషుల్లో 81 శాతం మంది కనీసం ఆరు గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని వెల్లడించారు. అదే మహిళల విషయానికి వస్తే 60 శాతం మంది ఆరు గంటలలోపు నిద్రపోతున్నామని చెప్పారు. మరో 15 శాతం మంది పురుషులు, 32 శాతం మంది మహిళలు 7 నుంచి 8 గంటలు, 4 శాతం పురుషులు, 8 శాతం మహిళలు 8 గంటలకు పైగా నిద్రపోతున్నట్టు తెలిపారు. సర్వేలో పాల్గొన్న మొత్తం వ్యక్తుల్లో 55.08 శాతం మంది ప్రస్తుతం నిద్ర విధానంతో అసంతృప్తిగా ఉన్నామని తెలిపారు. ఇలా చేయండి.. నిద్ర పడుతుంది సర్వేలో భాగంగా నిద్ర లేమి సమస్య నివారణకు పలు సలహాలు, సూచనలు కూడా ఫౌండేషన్ తెలియజేసింది. అవి.. ♦ నిద్రకు ఉపక్రమించే 4 గంటల ముందు నుంచి కాఫీ, టీలు తాగకూడదు. ధూమపానం, మద్యపానం చేయకూడదు. వేడి పాలను తాగాలి ♦ ఆందోళన, ఒత్తిడి, నిరాశ నిద్రకు పెద్ద అవరోధం. వాటిని అధిగమించడానికి చర్యలు తీసుకోవాలి ♦ పగటిపూట నిద్ర మానుకోవాలి ♦టీవీ, సెల్‌ఫోన్ చూడకూడదు ♦ పడక గదిలో స్లీప్ ఫ్రెండ్లీ వాతావరణం ఉండేలా చూసుకోవాలి -
ఏపీ సీఎం జగన్ పై అభిమానాన్ని చాటుకున్న తెలంగాణ యువకుడు
-
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ప్రేమోన్మాది ఘాతుకం
-
ప్రపంచంలోని టాప్ - 10 అందమైన పురుషులు
-
వింత తెగ: పళ్లను చూసి పెళ్లాడేస్తారు...
గిరిజన తెగలలో జరిగే వివిధ వేడుకలు చాలా విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా పెళ్లిపేరుతో జరిగే తంతు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇదేకోవలో నైజీరియాలోని ఒక గిరిజన తెగలో జరిగే ఒక వింత వేడుక అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నైజీరియాలోని వోడబె గిరిజనులలో ప్రతీయేటా ఒక పోటీ జరుగుతుంటుంది. దీనిలో పురుషులు విచిత్రమైన మేకప్‌తో పాల్గొంటారు. అయితే వీరిని మేకప్ చేసే పని స్త్రీల చేతుల్లో ఉంటుంది. ఈ విధంగా ఎందుకు మేకప్ చేస్తారో, దీని వెనుకనున్న కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నైజీరియాలో ఉండే వోడబె గిరిజనులు ప్రతీయేటా గుయెరోవెల్ అనే పోటీని నిర్వహిస్తారు. ఇది పురుషుల సౌందర్యాన్ని ప్రతిబింబించే ఉత్సవం. దీనిలో ఈ గిరిజన జాతికి చెందిన స్త్రీలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ పోటీలో భాగంగా పురుషుల ముఖంపై సంప్రదాయ రీతిలో మేకప్ చేస్తారు. Vodabe tribe, where men spend hours doing hair and makeup to impress women https://t.co/4w8Kukzj8r pic.twitter.com/2mSeG4n7GJ— Life's Prism (@LifesPrism) April 25, 2020 భాగస్వామి ఎంపిక కోసం.. మేకప్ చేసుకున్న పురుషులు సంప్రదాయ దుస్తులు ధరించడంతోపాటు వివిధ ఆభరణాలు కూడా ధరిస్తారు. ఈ మేకప్ కార్యక్రమం పూర్తయిన తరువాత పెళ్లికాని యువతులు వారిముందు నిలుచుంటారు. వారు పురుష సౌందర్యాన్ని గుర్తిస్తారు. మేకప్ చేసిన పురుషుల కళ్లను, దంతాలను పరిశీలిస్తారు. ఎవరి కళ్లు, దంతాలు మిలమిలా మెరుస్తాయో వారిని అత్యంత ఆకర్షణీయమైన పురుషునిగా గుర్తిస్తారు. ఈ పోటీలో పాల్గొన్న పురుషులు తమ ఎదురుగా ఉన్న పెళ్లికాని యువతులను ఆకర్షించేందుకు వివిధ హావభావాలను పలికిస్తారు. యువతులు ఈ పురుషులలో తమకు నచ్చిన ఒకరిని తమ భాగస్వామిగా స్వీకరిస్తారు. Vodabe (Wodaabe) plemeOvo pleme naseljava prostor saharskih predela države Niger. Karakteristično za ovo pleme jeste pojam lepote, koji se naviše odnosi na muškarce. Na ovim prostorima zastupljen je princip kontrasta - muškarci se sređuju da bi udovoljili ženama, a ne obrnuto. https://t.co/UJIwsplOPT pic.twitter.com/vnHRinNcXE— mårinå (مارينا) 🌵 (@rapunzel_arsic) December 15, 2020 ఇది కూడా చదవండి: హెల్మెట్లు చాలావరకూ నలుపు రంగులోనే ఎందుకుంటాయంటే.. -
విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీకి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, వైవా హర్ష, ప్రియాంక శర్మ, బ్రహ్మాజి, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం మెన్‌టూ (#MenToo). బీయింగ్ ఏ మ్యాన్ ఈజ్ నాట్ ఈజీ. అనేది ఉపశీర్షిక. శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. హీరోగా నటించిన మౌర్య సిద్ధవరం నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం ఓటీటీకి రానుంది. (ఇది చదవండి: Mentoo Movie: #మెన్‌టూ మూవీ రివ్యూ) ఈ మూవీ జూన్ 9 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సినిమా స్టిల్‌ని షేర్ చేస్తూ.. ప్రపంచ పురుషోత్తములారా.. ఈ బిగ్ అనౌన్స్మెంట్ మీ కోసమే అంటూ క్యాప్షన్ పెట్టింది. పురుషుల కష్టాలు ఎలా ఉంటాయో చూపించే కథతో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం కామెడీతో మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించేందుకు వచ్చేస్తోంది. థియేటర్లలో చూడలేనివారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. (ఇది చదవండి: టీవీ షోలో నాపై చవకబారు కామెంట్లు.. యాంకర్ విరగబడి నవ్వింది) Prapancha Purushothhamulaara...!🙋♂️ A Big Announcement for you....👉#MENTOO Antu vachesthunnaru ee frustrated front uu...!😛#MenTooOnAHA Premiers June 9th!@nareshagastya @kaushikghan @PriyankaOffl @IRiyaSuman @MouryaSIddavar1 @SrizTweets @harshachemudu pic.twitter.com/fQHDbnvosK — ahavideoin (@ahavideoIN) June 2, 2023 -
నా లవర్ బర్త్‌డే రోజునే చనిపోతున్నా.. సెల్ఫీ వీడియో తీసుకుని..
-
వీడియో: నడిరోడ్డుపై కారుని ఆపి దౌర్జన్యం
-
వైరల్ వీడియో : రిషికేష్‌లో ఎద్దుపై యువకుడి స్వారీ.. ప్రభుత్వం సీరియస్
-
మందుబాబు చెంప చెల్లుమనిపించిన ఎస్ఐ రాజు
-
ఎత్తయిన భవనం కిటికి నుంచి వేలాడిన చిన్నారి, తల ఇరుక్కుని..
-
అబ్బో.. గాల్లో చపాతి చేసిన మాస్టర్ చెఫ్!
-
నిర్ణయాత్మక శక్తి ఏపీ మహిళ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మహిళలు తిరుగులేని శక్తిగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతానికి పైగా వారికే పదవులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నిర్ణయాత్మక స్థానాలు, కీలకమైన పదవుల్లో ఏపీ మహిళలది దేశంలోనే అగ్రస్థానం. కేంద్ర కార్యక్రమాల అమలు, గణాంకాల మంత్రిత్వ శాఖ ‘భారతదేశంలో వివిధ రంగాల్లో మహిళలు, పురుషులు–2022’ అనే నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. నివేదిక ముఖ్యాంశాలు ఇవే.. ♦ సాధారణ హోదా, సీనియర్ అధికారులు, మేనేజర్లు, శాసనసభ్యుల హోదాల్లో నిర్ణయాలు తీసుకోవడంతో దేశ సగటుతో పాటు దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు. ♦సీనియర్ అధికారులు, మేనేజర్లు, ఎమ్మెల్యేల వంటి నిర్ణయాత్మక పదవుల్లో రాష్ట్ర మహిళల హవా కొనసాగుతోంది. ♦ శాసనసభ్యులు, సీనియర్ అధికారులు, మేనేజర్ల హోదాల్లో మహిళల భాగస్వామ్యం దేశ సగటు 22.2 శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో అది అత్యధికంగా 43.4 శాతం ఉంది. ♦ సీనియర్, మిడిల్ మేనేజ్మెంట్ స్థానాల్లో మహిళల భాగస్వామ్యం దేశ సగటు 18.1 శాతం ఉండగా ఏపీలో 30.3 శాతం ఉంది. మరే ఇతర పెద్ద రాష్ట్రాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఏపీలో ఉన్నంత స్థాయిలో లేదు. ♦ మొత్తం కార్మికుల్లో మేనేజర్ హోదాలో ఏపీలో 30.4 శాతం మహిళలే ఉండగా ఇదే దేశం మొత్తం చూస్తే కేవలం 18.0 శాతమే. ♦అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీరాజ్ సంస్థల్లో 50 శాతం మంది మహిళలు (78,025 మంది) ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ♦అదే సాధారణ కార్మికులు, నిర్ణయాత్మక హోదాల్లోనూ, శాసనసభ్యులు, సీనియర్ అధికారులు, మేనేజర్ల స్థాయిలో మహిళల భాగస్వామ్యం బీహార్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూకశ్మీర్ తదితర రాష్ట్రాల్లో అత్యల్పంగా ఉంది. ♦ సమాజంలో సగభాగమైన మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ♦మంత్రిమండలితో పాటు స్థానిక సంస్థల్లోనూ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా చట్టాలు చేసింది. ♦ అంతేకాక.. రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల స్థలాలిస్తే వాటిని మహిళల పేరు మీదే పంపిణీ చేశారు. సాధారణ హోదాలోనూ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఎక్కువమంది మహిళలున్నారని.. వీరంతా నిర్ణయాలు తీసుకోవడంలో ముందున్నట్లు నివేదిక వెల్లడించింది. -
వైరల్ వీడియో: సరుకులు ఇలా కూడా తీసుకెళ్తారా?
-
మహిళలు అమితంగా ఇష్టపడే యాప్స్ ఏంటో తెలుసా?
మొబైల్ వినియోగ పోకడలు, భారతీయ వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న ఆలోచనలను విశ్లేషిస్తూ 2022- 2023 డేటా ఆధారంగా భారతీయ మహిళలు, పురుషుల అభిరుచులపై ప్రముఖ బొబ్బల్ ఏఐ (Bobble AI) అనే కీ బోర్డ్ సంస్థ నివేదికను విడుదల చేసింది. అందులో మహిళలు స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా ఆహారం, మెసేజింగ్ యాప్స్‌ను అమితంగా ఇష్టపడతున్నారని, మగవారు ఫోన్లలో గేమింగ్ యాప్స్‌ను వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తన నివేదికలో పేర్కొంది. దేశ వ్యాప్తంగా 85 మిలియన్ల ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల డేటా ఆధారంగా బొబ్బల్ ఏఐ ఈ సర్వేను వెలుగులోకి తెచ్చింది. ఇక ఆ రిపోర్ట్‌లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది స్మార్ట్ఫోన్లపై వెచ్చించే సమయం 50 శాతం పెరిగింది. ఉద్యోగం చేసే మహిళల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. స్మార్ట్ఫోన్ల నుంచి ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు కేవలం 11.3శాతమే జరుగుతున్నాయని హైలెట్ చేసింది. మహిళలు, పురుషులు ఆన్లైన్లో గేమ్స్ ఆడేందుకు మక్కువ చూపిస్తున్నారని, వారిలో 6.1శాతం మంది మహిళలు గేమ్స్ ఆడడంలో యాక్టీవ్‌గా ఉన్నట్లు తెలిపింది. ఇక వివిధ యాప్స్ వినియోగంలోనూ మహిళలు వెనకబడినట్లు తెలుస్తోంది. ఏయే యాప్స్‌ను ఎంత శాతం ఉపయోగిస్తున్నారో ఒక్కసారి గమనిస్తే.. వాటిలో కమ్యూనికేషన్ అప్లికేషన్లు (apps) 23.3శాతం, వీడియో అప్లికేషన్లు 21.7 శాతం, ఫుడ్ అప్లికేషన్లు 23.5 శాతం ఉన్నాయి. మగవారితో పోలిస్తే పేమెంట్ అప్లికేషన్లు 11.3శాతం, గేమింగ్ అప్లికేషన్లు 6.1 శాతం తక్కువగా ఉపయోగిస్తున్నారు. కాగా, మొబైల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ విభాగం ‘గోప్యత-అనుకూల’ పద్ధతిలో 85 మిలియన్ల కంటే ఎక్కువ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను కవర్ చేసే ఫస్ట్ పార్టీ డేటాను ఉపయోగించి పరిశోధన చేసినట్లు బొబ్బల్ ఏఐ నివేదిక పేర్కొంది. చదవండి👉 ఉద్యోగులకు షాకిస్తున్న కంపెనీలు.. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు! -
ఈయన టైపింగ్ స్కిల్స్ చూస్తే వావ్ అనాల్సిందే
-
జస్ట్ మిస్.. చెట్టు ఎక్కి షాకిచ్చిన ఎలుగుబంటి
-
యాక్సిస్ బ్యాంకు అధికారులకు టోకరా వేసిన కేటుగాడు
-
వైరల్ వీడియో: ఇద్దరమ్మాయిలతో బైక్‌పై యువకుడి స్టంట్
-
ఎగిరి దూకిన సింహాలు..వచ్చాడండి రాకీ భాయ్
-
ఆఫీసులుకు వస్తాం, ఆ సెలవులు మాకొద్దు బాబోయ్!.. వణికిపోతున్న తండ్రులు
జపాన్ దేశం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ అంశంపై ఫోకస్ పెట్టిన అక్కడి ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పితృత్వ సెలవులకు చట్టబద్ధత కల్పించింది. ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల రానున్న దశాబ్ది కాలంలో జనాభా క్షీణతను నివారించవచ్చని భావిస్తోంది. ప్రస్తుత విధానం ప్రకారం, పురుషులు 80 శాతం జీతంతో నాలుగు వారాల పితృత్వ సెలవులకు అర్హులుగా జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇదిలా ఉండగా.. తండ్రులు మాత్రం వాటిని తీసుకునేందుకు భయపడుతున్నారట. పురుష ఉద్యోగులకు పితృత్వ సెలవుల విషయంలో నూతన విధానాలను తెరపైకి తీసుకొచ్చింది కిషిదా ప్రభుత్వం. దీని ప్రకారం సెలవులు తీసుకుంటున్న 14 శాతం ఉద్యోగుల సంఖ్యను 2025 నాటికి 50 శాతానికి, 2030 నాటికి 85 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం నిర్ణయం బాగానే ఉన్నా పితృత్వ సెలవులు తీసుకోవడం వల్ల తాము పని చేస్తున్న సంస్థ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందేమోనని చాలా వరకు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఎందుకంటే అన్ని రోజులు ఉద్యోగులు సెలవు తీసుకోవడం ద్వారా.. అది వారి ప్రమోషన్ అవకాశాలు దెబ్బతీయడంతో పాటు వారి కెరీర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని, అంతేకాకుండా సెలవుల అనంతరం వారికి ఇతర బాధ్యతలు అప్పజెప్పే ప్రమాదం ఉందని భావించడమే ఇందుకు ప్రధాన కారణమట. జపాన్‌లో కొంతకాలంగా జననాల రేటు గణనీయంగా పడిపోతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. -
జనాభా పెరుగుదల కోసం ఆ దేశం పాట్లు.. నిబంధనను బ్రేక్ చేసి మరీ..
దక్షిణ కొరియాలో గత నెలలో దేశంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు నమోదయ్యింది. దీంతో అక్కడి పాలక సంప్రదాయ పీపుల్ పవర్ పార్టీ జనన రేటుని పెంచే సంప్రదాయేతర మార్గాలపై దృష్టిసారించింది. వాస్తవానికి దక్షిణ కొరియాలో 18 నుంచి 28 ఏళ్ల వయసులోపు పురుషులు తప్పనసరిగా మిలటరీ సేవ చేసేలా కఠినమైన నిబంధన ఒకటి ఉంది. ఐతే అక్కడి ప్రభుత్వం ఆ నిబంధనను సైతం బ్రేక్ చేసేందుకు రెడీ అయిపోయింది. ఈ మేరకు అక్కడ పురుషులకు 30 ఏళ్లు వచ్చేలోపు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే తప్పనిసరి అయిన మిలటరీ సేవ నుంచి మినహాయింపు ఇస్తానని చెబుతోంది. ఈ మేరకు సియోల్ ఆధారిత మిలటరీ హ్యుమన్ రైట్స్ సెంటర్ కో ఆర్డినేటర్ చో క్యు సుక్ మాట్లాడుతూ..ఈ ప్రతిపాదన యువకులు ఇష్టపడతారని, పైగా జననాలకు అడ్డంకి తొలుగుతుందని చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యుక్త వయస్కులను పిల్లలను కనమని ప్రోత్సహిస్తున్నారా అని మండిపడుతున్నారు. అయినా మిటలటరీకి వెళ్లకుండా ఉండేందుకు ముగ్గురు పిల్లలను ఎవరు కలిగి ఉంటారు, ఆ ఖర్చులను ఎలా భరిస్తారు అని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. మరికొంత మంది నిపుణులు ఇది చాలా ప్రమాదకరం, హాస్యస్పదమైనది అని చెబుతున్నారు. ఈ క్రమంలో సియోల్ విశ్వవిద్యాలయంలోని పబ్లిక్ అడ్మినస్ట్రేషన్ అసోసియేట్ ప్రోఫెసర్ ఎరిక్ హై వాన్ కిమ్ మాట్లాడుతూ..జాతీయ ఆర్థిక వృద్ధి లేదా దేశ స్థిరత్వం కోసం పిల్లలను కనమని ప్రజలను అడగలేం. సంతానోత్పత్తిని అలాంటి సాధనంగా భావించకూడదు. అలాగే ముసాయిదా మినహాయింపు విధానం కూడా ప్రమాదకరమేనని ప్రొఫెసర్ జెఫ్రీ రాబర్ట్సన్ హెచ్చరించారు. దీని వల్ల ఉద్యోగం చేసే తల్లులకు ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణ వంటివి మరింత భారమయ్యే అవకాశం ఉంది. అలాగే ఆ ఖర్చులను భరించగలిగేలా మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు పొందడం కూడా కష్టమే అని నిపుణులు చెబుతున్నారు. కాగా, దక్షిణ కొరియా ఇంకా ఈ నిబంధనను ఖరారు చేయలేదని, అమలు చేయాలా? లేదా అని అంశంపై సమీక్షిస్తున్నట్లు సమాచారం. (చదవండి: అమెరికాలోని గురుద్వార్‌లో కాల్పులు..ఇద్దరికి తీవ్ర గాయాలు) -
భయ్యా మరి ఇంత బలుపా! మొసలి నోటికే నేరుగా..
-
Viral Video: భయపెట్టిన వడగండ్ల వాన.. రండి బాబు రండి.. రూ. 100 కిలో!
-
InternationalWomen's Day 2023: మహిళల నిజాయితీపై సంచలన రిపోర్ట్
సాక్షి,ముంబై: రుణాలు చెల్లింపులో మహిళలే ముందు ఉన్నారని తాజా రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. రుణాలను తిరిగి చెల్లించడంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ నిజాయితీగా ఉన్నారని క్రెడిట్ డేటా సంస్థ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తాజా నివేదిక వెల్లడించింది. స్త్రీలకు రుణాలు ఇవ్వడం పురుషుల కంటే తక్కువ ప్రమాదకరమని ఈ డేటా వెల్లడించింది. అందుకే గత ఐదేళ్లలో మహిళలకిచ్చే రుణాల సంఖ్య బాగా పెరిగిందని వ్యాఖ్యానించింది. ప్రతి ఏటా మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన నివేదికను ప్రకటిస్తుంది తన రుణ చెల్లింపుపై ఒక నివేదికను తాజాగా విడుదల చేసింది. బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీల నుండి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే విషయంలో భారతదేశంలోని స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ మనస్సాక్షిగా ఉంటారని వెల్లడించింది. గత ఐదేళ్లలో మహిళలకిచ్చే రుణాల సంఖ్య పెరగడానికి వారి మరింత నిజాయితీగా తిరిగి చెల్లించే ప్రవర్తనే కారణమని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ నివేదిక ప్రకారం గత ఐదేళ్లలో భారతదేశంలో మహిళా రుణగ్రహీతల సంఖ్య వార్షిక రేటు 15 శాతం పెరిగింది, పురుషులతో పోలిస్తే ఇది 11 శాతం. 2017లో 25 శాతం మంది మహిళలు రుణాలు తీసుకోగా, 2022లో ఈ సంఖ్య 28 శాతానికి పెరిగింది. దేశ ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది ఈ గణాంకాలు సూచిస్తున్నాయని పేర్కొంది. ప్రస్తుతం, దేశీయ అంచనా జనాభా 1.4 బిలియన్లలో దాదాపు 454 మిలియన్ల వయోజన మహిళలు ఉన్నారు. వీరిలో 2022 వరకు దాదాపు 6.3 కోట్ల మంది మహిళలు రుణాలు తీసుకున్నారు. మహిళలకు రుణ సదుపాయం 2017లో 7 శాతంగా ఉంది, ఇది 2022లో 14 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు సాధించిన పురోగతి ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ ఇంకా మెరుగు పడాల్సి ఉందనికూడా తెలిపింది. మహిళా రుణగ్రహీతల సంఖ్య పెరగడం ప్రభుత్వ ఆర్థిక సమ్మేళనానికి సానుకూల సంకేతమని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ సీవోవో హర్షలా చందోర్కర్ అభిప్రాయపడ్డారు. వివిధ సామాజిక-ఆర్థిక వర్గాలు, ఏజ్ గ్రూపులు,, భౌగోళిక ప్రాంతాలలో మహిళలకు అనుగుణంగా రుణాలను అందించడం వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో వారికి సహాయపడుతుందని కూడా ఆమె సూచిస్తున్నారు. దీని వల్ల మహిళలకే కాకుండా సంప్రదాయంగా వెనుకబడిన రంగాలకు కూడా ప్రయోజనం కలుగుతుందన్నారు. -
హైదరాబాద్ : దుండిగల్ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్య
-
డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు
-
నెల్లూరు నగరంలో దారుణ హత్య
-
వ్యాయామం చేస్తూ కుప్పకూలిన విశాల్
-
తల్పగిరిలో వ్యక్తి దారుణ హత్య కలకలం
-
అర్థరాత్రి రెండు గంటలకు దాడులు..భయాందోళనలో చిన్నారి పెళ్లికూతుళ్లు..
అస్సాంలో బాల్య వివాహాలను అణిచివేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర కేబినేట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు ఆ దిశగా దాడులు నిర్వహించారు. ఆఖరికీ అర్థరాత్రి రెండు గంటలకు తలుపు కొట్టడంతో ప్రారంభమైన దాడులు ఆ చిన్నారును తీవ్ర విషాదంలోకి నెట్టేశాయి. ఈ ఘటనలో చిన్నారులను పెళ్లి చేసుకున్న పలువురు వ్యక్తులను అరెస్టు చేశారు. దీంతో ఏం జరుగుతోందో తెలియని ఆ చిన్నారి పెళ్లి కూతుళ్లు భయందోళనలతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ నెల రోజుల్లోనే పోలీసులు సుమారు 4 వేలకు పైగా కేసులు నమోదు చేశారు. ఈ దాడుల కారణంగా కొత్తగా మాతృత్వంలో అడుగు పెడుతున్న నిమి అనే బాల వధువు కన్నీళ్లతో చెక్కిళ్లు తడిచిపోయాయి. అప్పటి వరకు సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తున్న రెజీనా ఖాతున్ అనే మరో చిన్నారి నిస్సత్తువుగా చూస్తోంది. అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ఈ దాడుల్లో భర్తల అరెస్టుతో బాల వధువులు ఆవేదనతో అక్కడి వాతావరణం అంతా విషాదంగా మారిపోయింది. ఒక్క శనివారమే పోలీసులు సుమారు రెండు వేల మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఆ వివాహాలు జరిపించిన పూజారులను, ముస్లీం మత పెద్దలు కూడా ఉండటం గమనార్హం. వారిలో కొంతమంది పారిపోయి పెళ్లి చేసుకున్న మైనర్లు కూడా ఉన్నారు. అయితే ఆ బాల వధువలంతా ఇప్పుడూ మా పరిస్థితి ఏంటి మా పిల్లలను ఎవరూ పోషిస్తారు, ఎక్కడ తలదాచుకోవాలంటూ ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. అలాగే వారిలో కొంతమంది పెళ్లి సమయానికి మైనర్లు కాదు, ఆధార్‌కార్డులో తప్పుగా నమోదు చేయడం జరిగిందని కొందరూ వాపోతున్నారు. ఆరోగ్య కార్యకర్తల నుంచి సేకరించిన ఆధార్ కార్డులకు సంబంధించిన డేటా సాయంతో పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో అనాధలుగా మారిన బాల వధువుల్లో కొందరికి తల్లిదండ్రుల మద్దతు లభించగా మరికొందరు అధికారుల సంరక్షణలో ఉన్నారు. బాల్యవివాహాలకు చెక్‌పెట్టడం కోసం జరిపిన దాడుల కారణంగా కొందరూ చిన్నారులు గర్భవతులుగా మరికొందరూ తమ పిల్లలతో అనాధలుగా రోడ్డున పడాల్సి వచ్చింది. ప్రస్తుతం వారంతా ప్రభత్వ షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారు. అంతేగాదు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖలో జెండర్ స్పెషలిస్ట్ అయిన పరిమితా డేకా మాట్లాడుతూ..ఆ మహిళల పట్ల మాకు బాధ్యత ఉంది. ఇది సున్నితమైన వ్యవహారం అని, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి శాంతించేలా చేయాలి. ఆ తర్వాత వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచేలా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. (చదవండి: పెళ్లీడు వచ్చినా పెళ్లి చేయటం లేదన్న కోపంతో అన్నని..) -
నిర్జన ప్రదేశంలో.. ఏకంగా రూ. 10 లక్షల నోట్ల కట్టలు
సాక్షి, బనశంకరి: అనుమానాస్పదంగా కారు నిలిపి నగదు లెక్కిస్తున్న సమయంలో పోలీసులు దాడిచేసి రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హెబ్బగోడి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిర్జీన ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు శుక్రవారం ఇన్నోవా కారును రోడ్డు పక్కన నిలిపి కరెన్సీనోట్లు లెక్కిస్తున్నారు. గస్తీలో ఉన్న పోలీసులు అనుమానంతో ఆరా తీశారు. వారిద్దరూ హుసూ్కరు గ్రామపంచాయతీ బిల్‌కలెక్టర్ మల్లేశ్, నెలమంగల రాజేశ్‌గా తేలింది. లెక్కిస్తున్న నగదుకు సంబంధించి వివరాలు చెప్పాలని పోలీసులు కోరగా నీళ్లు నమిలారు. దీంతో నగదును స్వా«దీనం చేసుకొని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. హెబ్బగోడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి కోర్టుకు నగదు అప్పజెప్పారు. (చదవండి: వాళ్లు పుట్టెడు దుఃఖంలో ఉంటే అక్కడకు వెళ్లి నవ్వుతావా? ఇదేం పద్ధతి? రాహుల్‌పై బీజేపీ ఫైర్..) -
ఎంబీబీఎస్ విద్యార్థినిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి చేసిన జ్ఞానేశ్వర్
-
ముంబైలో నడిరోడ్డు పై కొరియన్ యూట్యూబర్ తో అసభ్య ప్రవర్తన
-
'లివ్-ఇన్ రిలేషన్, పెళ్లి కాదు.. మగాళ్ల మనస్తత్వంలోనే అసలు సమస్య..'
శ్రద్ధ వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. ఆమెను 35 ముక్కలు చేసిన అత్యంత క్రూరమైన ఈ అనాగరిక చర్య సర్వత్రా చర్చనీయాంశమైంది. లివ్-ఇన్ రిలేషన్ల కారణంగానే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కౌశల్ కిశోర్ గురువారం అన్నారు. చదువుకున్న అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని, లివ్ ఇన్ రిలేషన్ల జోలికి వెళ్లకుండా నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని సూచించారు. అయితే కేంద్రమంత్రి వ్యాఖ్యలకు వివాదాస్పద రచయిత్రి తస్లీమా నజ్రీన్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్లో ఈ విషయంపై స్పందిస్తూ ఓ సందేశం రాసుకొచ్చారు. 'లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌ను హత్య చేస్తే.. అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలి.. లివ్ ఇన్ రిలేషన్ల వల్లే నేరాలు జరుగుతున్నాయని మీరు చెబుతున్నారు. కానీ పెళ్లైన పురుషులు తమ భార్యలను చంపినప్పుడు.. పెళ్లిళ్ల వల్లే నేరాలు జరుగుతున్నాయి, అందుకే పెళ్లి చేసుకోవద్దు.. లివ్ ఇన్ రిలేషన్లే ఎంచుకోండి అని ఎందుకు చెప్పడం లేదు. పెళ్లిళ్లు, లివ్ ఇన్ రిలేషన్లు కాదు.. అసలు సమస్య మగాళ్ల మనస్తత్వంలోనే ఉంది.' అని నజ్రీన్ రాసుకొచ్చారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. When a man kills his girlfriend in a live-in relationship,u ask girls to get married coz live-in encourages crimes. But when men kill their wives,u don't ask girls to go for live-in relationships coz marriage encourages crimes!! Not marriage or live-in,problem is men's mentality. — taslima nasreen (@taslimanasreen) November 17, 2022 మరోవైపు కౌషల్ కిశోర్ వ్యాఖ్యలపై శివసేన నేత ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని కౌషల్ కిశోర్‌ను పదవి నుంచి తప్పించాలని కోరారు. ఇలాంటి హేయమైన నేరాళ్లో మహిళలనే నిందించడం క్రూరం, నిర్దాక్షిణ్యంగా అభివర్ణించారు. చదవండి: శ్రద్ధ హత్య కేసు విచారణలో షాకింగ్ నిజాలు.. గంజాయి మత్తులో క్రూరంగా -
ప్రమాదంలో ‘పునరుత్పత్తి’.. జీవనశైలిలో మార్పులే కారణమా?
సాక్షి, హైదరాబాద్: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో శుక్ర కణాలు భారీ సంఖ్యలో తగ్గుతున్నాయి. వీర్యకణాల చిక్క దనం తగ్గిపోతోంది. నలభై ఐదేళ్ల కిందటి పరిస్థితులతో పోల్చితే...పురుషుల్లో వీర్యకణాల చిక్కదనంలో 50 శాతానికి పైగా, స్పెర్మ్‌కౌంట్ (శుక్ర కణాలు)లో 62.3% క్షీణత నమోదైనట్టు పేర్కొంటున్నాయి. తగ్గుదల రేటు గత కొన్నేళ్లుగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. కాగా జీవనశైలిలో చోటుచేసుకున్న మార్పులే ఇందుకు కారణమని పరిశోధనలు స్పష్టం చే స్తున్నాయి. రాత్రివేళ పని, అధిక ఉష్ణోగ్రతలు, మారుతున్న అలవాట్లు ఇందుకు దోహదపడుతున్నాయని నిపుణులు అంటున్నారు. 53 దేశాల సమాచారాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ఏడాదికి 1.16% చొప్పున..! 1972 నుంచి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఖండాల్లో నిర్వహించిన పరిశోధనల్లో ఏడాదికి 1.16 శాతం చొప్పున శుక్రకణాల చిక్కదనంలో తగ్గుదల నమోదైనట్టు గుర్తించారు. ఇక 2000 సంవత్సరం తర్వాత సేకరించిన డేటాను మాత్రమే పరిశీలించినపుడు ఆ తగ్గుదల ఏడాదికి 2.64 శాతంగా ఉన్నట్టు తేలింది. దీనికి సంబంధించి తాజా పరిశోధన ‘హ్యుమన్ రీ ప్రొడక్షన్ అప్డేట్’ జర్నల్‌లో ప్రచురితమైంది. గతంలో వీర్యకణాల చిక్క దనం, కౌంట్ ఒక మిల్లీగ్రామ్ (ఎంఎల్)లో 40 మిలియన్ల కంటే తగ్గితే పునరుత్పత్తికి దోహదపడవని అంచనా వేశారు. అయి తే తాజా అంచనాలు, డేటా చూశాక దీని కంటే కూడా కౌంట్ పడిపోయిన వారి సంఖ్య భారీగా పెరిగినట్టు స్పష్టమైంది. పునరుత్పత్తి సామర్ధ్యంలో తగ్గుదల స్పెర్మ్‌కౌంట్ తగ్గుదల జనాభా పునరుత్పత్తి సామర్ధ్యం తగ్గుదలను స్పష్టం చేస్తోందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన జెరూసలెం హిబ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ హగాయ్ లీవైన్ పేర్కొన్నారు. స్పెర్మ్‌కౌంట్ అనేది ‘హ్యుమన్ ఫెర్టిలిటీ’కే కాకుండా మగవారి ఆరోగ్యంతో ముడిపడిన అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. వీర్యకణాల తగ్గుదల దీర్ఘకాలిక వ్యాధులకు, టెస్టిక్యూలర్ (వృషణాల) కేన్సర్లకు దారితీయడంతో పాటు ఆయురార్దం తగ్గుదలకూ దోహదపడుతుందని తేలింది. వయసు, శృంగార సామర్థ్యం ఇతర అంశాల ప్రాతిపదికగా వివిధ కేటగిరీలుగా విభజించి ఈ పరిశోధన నిర్వహించారు. భారత్‌లో సుస్పష్టం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన పరిశోధనల్లో భాగంగా మన దేశంలోనూ దీనిపై పరిశీలన నిర్వహించారు. భారత్‌లో వివిధ కేటగిరీల వారీగా డేటా సేకరించారు. ‘భారత్‌లోని మగవారిలో శుక్రకణాల తగ్గుదల అనేది స్పష్టంగా గమనించాం. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే ఒకేవిధమైన పరిస్థితి ఉంది. అత్యాధునిక సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పుచేర్పులు, జీవనశైలి మార్పులు, పర్యావరణంలో రసాయనాల వ్యాప్తి వంటివి దీనికి ›ప్రధానకారణం’ అని లీవైన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోనూ తక్కువగా.. హైదరాబాద్ మహానగరంలో ఐటీతో పాటు వివిధరంగాల్లో ముఖ్యంగా రాత్రి పూట పనిచేసే వారిని, 30 ఏళ్లు ఆ పై వయసు పైబడ్డాక పెళ్లి చేసుకున్న వారిని, జీవనశైలిలో మార్పులు చోటుచేసుకున్న రోగుల్ని డాక్టర్లు పరిశీలించారు. వారికి తగిన పరీక్షలు చేసి, పునరుత్పత్తికి సంబంధించిన సమస్యలపై ట్రీట్మెంట్ ఇచ్చారు. ►పెళ్లి అయిన రెండేళ్ల తర్వాత 32 ఏళ్ల వయసున్న సురేష్ కుమార్, 30 ఏళ్ల వయసున్న లక్ష్మీ (పేర్లు మార్చాం) తమకు పిల్లలు పుట్టడం లేదంటూ డాక్టర్ వద్దకు వెళ్లారు. వారికి ఇన్ఫెర్టిలిటీ ఎవల్యూయేషన్ చెకప్‌లు నిర్వహించారు. ఇందులో భాగంగా వారికి విడివిడిగా క్లినికల్ ఎగ్జామినేషన్, బ్లడ్ టెస్ట్‌లు నిర్వహించి సెమన్ అనాలిసిస్‌కు (వీర్యకణాల విశ్లేషణ) పంపించారు. సురేష్‌లో శుక్రకణాలు ఉండాల్సిన దాని కంటే చాలా తక్కు వగా ఉన్నట్టు ‘వలిగొ స్పెర్మటోజువా’ ద్వారా గుర్తించారు. జీవనశైలి అలవాట్లను మార్చుకోవాలని సూచించారు. సరైన సమయానికి ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లు, సరైన నిద్ర, ఒత్తిళ్లను దూరం చేసే విధానాలు, తగిన వ్యాయామం వంటి వాటితో గణనీయమైన మార్పులు సాధించవచ్చునని సూచించారు. ►29 ఏళ్ల వెంకటేశ్వరరావు (పేరు మార్చాం)కు రెండేళ్ల క్రితమే పెళ్లి అయినా పిల్లలు పుట్టలేదు. ఇతను ప్రతిరోజూ రాత్రి 10, 11 గంటల దాకా వ్యాపారరీత్యా పనిలోనే ఉంటారు. ఆ తర్వాత అలసటకు గురికావడం, ఆలస్యంగా తిండి తిన డం, నిద్రపోవడం వల్ల వీర్యకణాలు అవసరమైన వాటికంటే చాలా తక్కువగా ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం ముఖ్యమని సూచించారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో వీర్యకణాల సంఖ్య తగ్గుతున్నందువల్ల వీలైనంత మేర ఆ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఎక్కువగా.. సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఎక్కువగా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. మిగతా వారితో పోల్చితే 30 ఏళ్ల తర్వాత వివాహాలు చేసుకుంటున్నవారిలో వీర్యకణాల కౌంట్ బాగా తక్కువగా ఉంటోంది. వీరు నైట్ డ్యూటీల్లో పనిచేస్తుండడం, ఆహార అలవాట్లు మారడం వల్ల శరీరంలోని హార్మోన్లు సమతూకం కోల్పోయి మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో స్పెర్మ్‌కౌంట్ తగ్గడాన్ని మా పరిశీలనల్లో గమనించాం. ఒకవేళ కౌంట్ కావాల్సినంత ఉన్నా చురుకైన కదలికలు లేని వీర్యకణాలే ఎక్కువగా ఉండడం వల్ల ప్రయోజనం ఉండడం లేదు. – డా.కేవీ భార్గవ్‌రెడ్డి, మంగళగిరి ఎయిమ్స్. ఒత్తిళ్లు..ఊబకాయం అన్ని రంగాలు, వర్గాలకు చెందిన వారు తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య జీవితం గడుపుతున్నారు. జంక్ ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడడంతో ఊబకాయం బారిన పడుతున్నారు. 30 ఏళ్లలోపు వారికే షుగర్, బీపీ వస్తున్నాయి. దీనివల్ల రానురాను ఇన్ఫెర్టిలిటీ కేసులు పెరుగుతున్నాయి. ఇంట్లో, బయటా, పనిప్రదేశాల్లో వివిధ రూపాల్లో రేడియేషన్, యూవీ రేస్, కాలుష్య ప్రభావాలు పెరిగిపోయి కావాల్సిన సంఖ్యలో వీర్యకణాల ఉత్పత్తి జరగడం లేదు. – డా.ప్రభుకుమార్ చల్లగాలి, జనరల్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్ -
యుపిఎస్ సి పరీక్షలో సఫలం కాలేదన్న మనస్తాపంతో సూసైడ్
-
వరంగల్ : ఆన్ లైన్ గేమ్స్ కు యువకుడు బలి
-
యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది
-
వైరల్.. చెప్పులతో చితక్కొట్టుకున్న అంకుల్స్.. నీ అవ్వ తగ్గేదేలే!
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కొన్ని వందల వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఇందులో ఫన్నీ, సందేశాత్మకం, డ్యాన్స్, జంతువులు.. ఇలా చాలా రకాలైనవి ట్రెండింగ్‌గా నిలుస్తుంటాయి. ఎప్పుడు, ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా ఇద్దరు వ్యక్తులు ఓ బిల్డింగ్ సమీపంలో కొట్టుకుంటున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో ఒకరు వృద్ధుడిలా కనిపిస్తుంటే మరొకరు మధ్య వయసు ఉన్నారు. ఇద్దరి మధ్య గొడవ ఎలా మొదలైందో తెలియదు కానీ బద్ద శత్రువుల కంటే దారుణంగా తగువులాడుకున్నారు. ఒకరిని మించి ఒకరు ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటూ చితకొట్టుకున్నారు. ఇంతలో ముసలాయన తన చెప్పు తీసి ఎదుటి వ్యక్తిని కొట్టేందుకు ప్రయత్నింస్తుండగా మరో వ్యక్తి సైతం చెప్పుతో దాడి చేశాడు. ఇలా కాసేపు వీరిద్దరూ చెప్పులతో ముఖాలను వాయించుకున్నారు.ఎవరూ తగ్గకుండా సాగిన వీరి పోరాటం చివరికి హింసాత్మకంగా మారింది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు కానీ నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: Viral Video: అదృష్టం బాగుండి బతికిపోయాడు.. లేకుంటే ఎంత ఘోరం జరిగుండేది -
ఖమ్మంలో ఫైనాన్స్ వేధింపులకు మరో ప్రాణం బలి
-
స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో విషాదం
-
నల్లగొండలో కలకలం రేపిన ప్రేమోన్మాది దాడి ఘటన
-
వెసక్టమీ చేయించుకుంటే పురుషులు శక్తిహీనులవుతారా?
అరసవల్లి(శ్రీకాకుళం జిల్లా): వెసక్టమీ.. ఈ పేరు వింటేనే మగవారు పరుగులు తీస్తున్నారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల్లో భాగంగా చేసుకోవాల్సిన ఈ ఆపరేషన్లకు వెనకంజ వేస్తున్నారు. కేవలం అపోహలే దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వెసక్టమీ ఆపరేషన్ల గణాంకాలు పరిశీలిస్తే ఇదే విషయం తేటతెల్లమవుతోంది. వెసక్టమీకి తాము దూరమంటూ.. భారం బాధ్యతంతా ఇల్లాలిదే అన్నట్లుగా కొందరు ప్రదర్శిస్తున్న ధోరణి ఈ లెక్కలకు కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. దీంతో ఒకరిద్దరు పిల్లల్ని కనగానే ఆడవాళ్లకు ట్యుబెక్టమీ ఆపరేషన్లు చేయించేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గత నాలుగున్నరేళ్లులో కేవలం 559 మంది పురుషులు మాత్రమే వెసక్టమీ ఆపరేషన్లు చేయించుకోవడం గమనార్హం. చదవండి: స్టార్టప్ కలలు కంటున్నారా.. ఈ స్కూల్ మీకోసమే..! సింగిల్ డిజిట్‌కే పరిమితం.. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకోవడంలో మగవారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండేవారు. క్రమేణా వారిలో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ ఆపరేషన్లు చేయించుకునే బాధ్యత మహిళలదే అన్న భావనలో ఉంటున్నారు. వంద మంది మహిళలు ట్యుబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటుంటే.. వెసక్టమీ చేయించుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. ప్రభుత్వ లక్ష్యాలు వేలల్లో ఉంటే అమలు సింగిల్ డిజిట్లు దాటడం లేదు. ప్రస్తుత సమాజంలో దాదాపుగా విద్యావంతులు అన్నింట్లో అవగాహన కలిగిఉన్నప్పటికీ.. వెసక్టమీ వంటి ఆపరేషన్ల విషయంలో ముందుకు రావడం లేదు. పైగా ఇలాంటి వాటిపై ఎలాంటి చర్చలకు ఆస్కారమివ్వడం లేదు. ఎక్కడో భార్య ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటేనే కొందరు భర్తలు వెసక్టమీలకు అంగీకరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అపోహలే కారణమా.. వెసక్టమీ చేయించుకుంటే పురుషుల శక్తిహీనులవుతారని, పనులు సమర్ధంగా చేయలేరన్న అపోహ చాలా మందిలో ఉంది. ♦భర్త కంటే తామే శస్త్రచికిత్సలు చేయించుకుంటామంటున్న మహిళలే అధికంగా ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. ♦ప్రస్తుతం ప్రసవానంతరం మహిళలే ట్యుబెక్టమీ చేయించుకోవడం రివాజుగా మారిపోయింది. ♦అపోహలు తొలగించేందుకు వైద్యారోగ్య శాఖ బుర్రకథలు, వీధి నాటకాల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా...ఫలితం మాత్రం కనబడడం లేదు. ♦మహిళలకు ట్యుబెక్టమీ చేయడం మేజర్ ఆపరేషన్ లాంటిదే అని వైద్యులు చెబుతున్నారు. అదే పురుషుల విషయంలో వెసక్టమీ మాత్రం చాలా సులువైన, సులభమైన ప్రక్రియ అని అంటున్నారు. ఎటువంటి కోతలు, కుట్లు అవసరం లేకుండానే సాంకేతిక పరిజ్ఞానంతో వెసక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో జిల్లా వైద్యారోగ్య శాఖ విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో నాలుగున్నరేళ్లుగా ఈ శస్త్రచికిత్సల లెక్కలు చూస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది. తాజాగా 2022–23 (జూన్ నాటికి)లో వెసక్టమీ సర్జరీలు 654, ట్యుబెక్టమీ సర్జరీలు 12,430 వరకు లక్ష్యంగా నిర్ణయించగా ప్రస్తుత జూన్ నెలాఖరు నాటికి కేవలం ఆరు వెసక్టమీ, 840 ట్యుబెక్టమీ సర్జరీలు నమోదయ్యాయి. లక్ష్య శాతాలను పరిగణనలోకి తీసుకుంటే 3.67 శాతం వెసక్టమీ, 27.03 శాతం ట్యుబెక్టమీ లక్ష్యాలను మాత్రమే సాధించారు. అవగాహన కల్పిస్తున్నాం.. కుటుంబ నియంత్రణకు వీలుగా పురుషులకు వెసక్టమీ, మహిళలకు ట్యుబెక్టమీ ఆపరేషన్లు చేయించుకునేలా ఎప్పటికప్పుడు అవగాహన కలి్పస్తున్నాం. అయినప్పటికీ అపోహలతో పురుషులు ముందుకు రావడం లేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో సాధించిన లక్ష్య శాతం సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతోంది. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎలాంటి అపోహలు లేకుండా వెసక్టమీకి పురుషులు సిద్ధం కావాలి. అన్ని పీహెచ్‌సీలు, ప్రభుత్వ వైద్యశాలల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేస్తాం. చాలా మంది వైద్యులు ఈ సర్జరీలపై దృష్టి సారించడం లేదన్నది వాస్తవం. – డాక్టర్ బి.మీనాక్షి, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి -
ప్రయోగాత్మకంగా ప్రారంభం.. పురుషుల కోసం ప్రత్యేకంగా ఆరోగ్యకేంద్రాలు
శివాజీనగర(బెంగళూరు): అనారోగ్యాలతో బాధపడే పురుషులకు వైద్య పరీక్షల కోసం త్వరలోనే మల్లేశ్వరంలో, రామనగర జిల్లాసుపత్రిలో ఆరోగ్య కేంద్రాలను ప్రయోగాత్మకంగా ఆరంభించనున్నట్లు మంత్రి సీ.ఎన్.అశ్వత్థ్‌నారాయణ తెలిపారు. మంత్రి మాట్లాడుతూ పురుషులు పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు, అయితే వీరిలో ఎక్కువమంది ఆసుపత్రికి రావటం లేదు. ఈ సమస్యను అధిగమించేలా వారి కోసమే ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి లభించే స్పందనను బట్టి మునుముందు రోజుల్లో అన్నిచోట్లకు విస్తరించే ఆలోచన ఉందన్నారు. మధుమేహం, క్యాన్సర్, నరాల వ్యాధులు పురుషులను ఎక్కువగా పీడిస్తున్నాయని తెలిపారు. వీటికి తోడుగా ఒత్తిడి జీవితం, మద్యం, పొగ, అశాస్త్రీయ ఆహార సేవనం తదితరాలు పురుషులకు పెను ముప్పుగా మారాయన్నారు. ఈ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. చదవండి: వివాహమైనా ప్రియుడితో సన్నిహితంగా.. ఆహారంలో విషంపెట్టి.. -
మహిళా సాధికారత.. 135.6 ఏళ్లు దూరం!
ఆకాశంలోసగం.. కానీ అవకాశాల్లో మాత్రం ఎంతో దూరం.. ఇక్కడ, అక్కడ అని కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా మహిళల పరిస్థితి ఇదే. దీనిపై విస్తృతంగా అధ్యయనం చేసిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఇటీవల ‘ప్రపంచ లింగ అసమానత్వ నివేదిక (గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టు)–2021’ను విడుదల చేసింది. పురుషులతో పోలిస్తే మహిళలు ఎంతగా వెనుకబడ్డారన్న వివరాలను పొందుపర్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయని, కానీ ఈ వేగం చాలదని డబ్ల్యూఈ ఎఫ్ స్పష్టం చేసింది. ఇప్పుడున్నట్టుగానే కొనసాగితే.. మహిళలు పురుషులతో సమానంగా నిలిచేందుకు ఏకంగా 135.6 ఏళ్లు పడుతుందని పేర్కొంది. –సాక్షి, సెంట్రల్‌డెస్క్ 156 దేశాల్లో.. 4 అంశాలపై డబ్ల్యూఈఎఫ్ ప్రపంచవ్యాప్తంగా 156 దేశాల్లో మహిళల పరిస్థితిని పరిశీలించింది. ముఖ్యంగా నాలుగు అంశాల (ఉద్యోగ, ఉపాధి అవకాశాలు; విద్య; వైద్యం–ఆరోగ్యం; రాజకీయ సాధికారత)ను పరిగణనలోకి తీసుకుంది. వీటన్నింటినీ కలిపి ఒక శాతానికి స్కోర్‌ను నిర్ణయించింది. ఒకటి వస్తే మహిళల సాధికారత బాగున్నట్టు.. సున్నా స్కోర్ వస్తే మహిళల పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నట్టు లెక్కించారు. భారత్ స్థానం140 ♦మహిళా సాధికారతలో మొత్తం 156 దేశాలకుగాను భారతదేశం ♦62 స్కోర్‌తో 140వ స్థానంలో నిలిచినట్టు డబ్ల్యూఈఎఫ్ నివేదిక పేర్కొంది. ♦దక్షిణాసియాలో బంగ్లాదేశ్ (65వ స్థానం), నేపాల్ (106), శ్రీలంక (16), భూటాన్ (130) మన దేశం కన్నా ముందుండగా.. పాకిస్తాన్ (153) వెనుక నిలిచింది. ♦2020 నివేదికలో మొత్తం 153 దేశాలకుగాను భారత్ 112వ స్థానంలో నిలవగా.. తర్వాతి ఏడాదికి వచ్చేసరికి ఏకంగా 140వ స్థానానికి పడిపోయింది. ప్రాంతాల వారీగా మహిళా సాధికారత తీరు(స్కోరు) ఊహించలేనంత సంపద! డబ్ల్యూఈఎఫ్ నివేదిక ప్రకారం.. పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తే ప్రపంచ ఎకానమీకి అదనంగా సమకూరే మొత్తం ఎంతో తెలుసా? ♦28 ట్రిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 22,22,66,240 కోట్లు (సులువుగా చెప్పుకోవాలంటే 22.22 కోట్ల కోట్లు అన్నమాట) -
మహిళా సీఈవోలకు జీతం పెరిగింది కానీ..
న్యూయార్క్: ఎస్అండ్పీ 500 కంపెనీలను నడిపించే మహిళా సారథులకు (సీఈవోలు) 2021లో వేతన ప్యాకేజీలు గణనీయంగా పెరిగాయని ఈక్విలర్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ అవడానికితోడు, స్టాక్ ధరలు, లాభాలు పెరగడం ఇందుకు అనుకూలించినట్టు తెలిపింది. మహిళా సీఈవోలకు మధ్యస్థ వేతన చెల్లింపులు 26 శాతం వృద్ధితో 16 మిలియన్ డాలర్లకు (రూ.123 కోట్లు) చేరుకున్నట్టు చెప్పింది. ఇప్పటికీ కార్పొరేట్ ర్యాంకులు, వేతన చెల్లింపుల్లో స్త్రీ, పురుషల మధ్య వ్యత్యాసం ఉందని.. లింగ వైవిధ్యం కోసం మరింత కృషి చేయాల్సి ఉందని ఈ నివేదిక పేర్కొంది. ‘‘మహిళా సీఈవోల వేతనం పెరగడం మంచిది. కానీ, ఇంకా ఎంతో చేయాల్సింది ఉంది. అయితే, ఎక్కువ ఆర్జన పొందుతున్న మహిళా సీఈవోలవైపు చూడడం కాకుండా.. వేతన అంతరాన్ని సునిశితంగా చూడాల్సి ఉంది’’అని కార్న్ ఫెర్నీ సీఈవో జేన్ స్టెవెన్సన్ పేర్కొన్నారు. ఎస్అండ్పీ 500 కంపెనీల్లో.. 340 సీఈవోలను ఈ సర్వే కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ఎస్అండ్పీ 500 కంపెనీల లాభాలు 50 శాతం పెరిగాయి. సూచీలు 27 శాతం వరకు లాభపడ్డాయి. ఈ పనితీరుతోనే ఎక్కువ మంది సీఈవోల పారితోషికం ముడిపెట్టి ఉండడం వల్ల.. ఏళ్ల పాటు మోస్తరు వృద్ధికే పరిమితమైన వేతన ప్యాకేజీలు ఒక్కసారిగా పెరగడానికి దోహదపడింది. మహిళా సీఈవోలకు ప్యాకేజీ పెంపు 26.4 శాతంగా ఉండి 15.8 మిలియన్ డాలర్లకు చేరుకోగా.. ఇదే కాలంలో పురుష సీఈవోలకు పెంపు 17.7 శాతంగా ఉండి 14.4 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. -
‘అదిరేటి డ్రెస్ మేమేస్తే.. బెదిరేటి లుక్కు మీరిస్తే దడ..’
సాక్షి, అమలాపురం(కోనసీమ జిల్లా): ‘అదిరేటి డ్రెస్ మేమేస్తే.. బెదిరేటి లుక్కు మీరిస్తే దడ..’ అంటూ అమ్మాయిలు పాడటం ఇప్పుడు కొత్త కాదు. అందం, ఆకట్టుకునే లుక్కు, డ్రెస్సింగ్ వంటి విషయాల్లో మగువలతో మగమహారాజులూ పోటీ పడుతున్నారు. ఒకప్పుడు దసరా బుల్లోడు డ్రెస్సు వేస్తే గొప్ప. తరువాత ఎన్టీ రామారావు బెల్‌బాటమ్ ఫ్యాంట్.. దానికి అడుగున జిప్పులో ఒక భాగం కుట్టడం ప్యాషన్. కొంతమంది శోభన్‌బాబు స్టైల్లో తలలో ఓ పాయ తీసి నుదుటి మీదకు రింగులా పెట్టుకొని మురిసిపోయేవారు. ఆ తరువాత చిరంజీవి స్టెప్పు కటింగ్, బ్యాగీ ఫ్యాంట్లు, జర్కిన్లు.. పంక్ హెయిర్ స్టైల్.. ఇలా ఎన్నో.. 1996లో వచ్చిన ప్రేమదేశం సినిమా యువతను ఉర్రూతలూగించింది. చదవండి: సిద్ధవ్వ దోసెలు సూపర్.. రోడ్డు పక్కన హోటల్లో టిఫిన్ తిన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి కొత్త ఫ్యాషన్ వైపు పరుగు తీయించింది. ఆ సినిమాలో హీరో అబ్బాస్ తన హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్‌తో యువతను మెప్పించాడు. యువకుల దృష్టిని సౌందర్యం వైపు మళ్లించాడు. యువత ఆహార్యంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా ఐదేళ్లుగా వస్తున్న మార్పులు అన్నీ ఇన్నీ కావు. రకరకాల హెయిర్ స్టైల్స్.. జుట్టుకు రంగులు.. ఫేస్ ప్యాక్‌లు అన్నీ ఇన్నీ కావు. పనిలో పనిగా నాజూకైన శరీరాకృతి కోసం కొందరు.. సల్మాన్‌ఖాన్‌లా కండలు పెంచేందుకు మరికొందరు.. ఇలా యువత మంచి లుక్కు కోసం సమయం, ధనం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. ఒకప్పుడు బ్యూటీ పార్లర్లంటే కేవలం మహిళల కోసమే. కానీ ఇప్పుడు పురుషుల బ్యూటీ పార్లర్లకు సైతం ఆదరణ పెరిగింది. నగరాలు, పట్టణాలే కాదు.. చివరకు ఒక మోస్తరు పల్లెల్లో సైతం మెన్స్ బ్యూటీ పార్లర్లు ఏర్పడుతున్నాయి. జిల్లాలోని అమలాపురం, మండపేట, రామచంద్రపురం వంటి పట్టణాలతో పాటు రావులపాలెం, కొత్తపేట, మలికిపురం, రాజోలు, తాటిపాక, అంబాజీపేట, పి.గన్నవరం వంటి గ్రామాల్లో కూడా ఇటువంటి బ్యూటీ పార్లర్లకు డిమాండ్ ఏర్పడింది. హెయిర్ స్టైల్‌కే తొలి ప్రాధాన్యం యువకులు హెయిర్ స్టైల్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకప్పుడు సెలూన్‌కు వెళ్తే రెండు రకాల స్టైల్స్‌లో హెయిర్ కటింగ్ చేయించుకోవడం, గెడ్డం గీయించుకోవడం లేదా ట్రిమ్మింగ్‌తో సరి. ఇప్పుడలా కాదు. పార్లర్లలో మూడు నాలుగు గంటలు పైగా గడుపుతున్నారు. రకరకాల హెయిర్ స్టైల్స్.. అందుకు తగినట్టుగా రంగులు వేయిస్తున్నారు. వారం వారం ఫ్యాషన్ మారిపోతోంది. పాశ్చాత్య దేశాలను అనుకరిస్తున్నారు. చేతిలో సెల్‌ఫోన్.. గూగుల్‌లో వెతికితే ఎన్నో ఫొటోలు, ఇంకెన్నో వీడియోలు. ఇంకేముంది! పుర్రెకో బుద్ధి అన్నట్టు యువత చెలరేగిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా 210 పాపులర్ హెయిర్ స్టైల్స్ ఉండగా, వీటిలో సుమారు 35కు పైగా మన వద్ద ఆదరణ ఉందని బ్యూటీ పార్లర్ల యజమానులు చెబుతున్నారు. రంగుల విషయానికి వస్తే పల్పీ, ఫ్రంక్ కలర్స్‌కు ఆదరణ ఎక్కువగా ఉంది. పనిలో పనిగా ఫేస్‌ప్యాక్, ఫేషియల్‌ను కూడా వదలడం లేదు. ఒక్కో ఫేషియల్కు రకాన్ని బట్టి రూ.2 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఇక మొత్తం బాడీ న్యూలుక్ కోసం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ ఖర్చవుతోందంటే వీటికి ఉన్న డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జిమ్‌లకు పెరుగుతున్న ఆదరణ మరోవైపు జిమ్‌లకు సైతం యువకులు క్యూ కడుతున్నారు. ఒకప్పుడు కేవలం బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనేవారు మాత్రమే ఎక్కువగా జిమ్‌లకు వచ్చేవారు. కరోనా తరువాత ఆరోగ్య స్పృహ పెరగడంతో పాటు అందమైన ఆకృతి కోసం జిమ్‌లకు వస్తున్నారు. పెద్దపెద్ద బరువులు ఎత్తి, సిక్స్‌ప్యాక్, ఎయిట్ ప్యాక్‌ల కోసం ప్రయాసపడే వారి కన్నా అందమైన బాడీ షేప్‌లకు వచ్చేవారే ఎక్కువగా ఉంటున్నారు. 60లో 20ల్లా ఉండాలని.. నడియవస్సు వారు సైతం యువకుల్లా కనిపించేందుకు తాపత్రయపడుతున్నారు. జట్టుకు, మీసాలకు రంగులు వేయించడం ఒక్కటే కాదు.. రకరకాల హెయిర్ స్టైల్స్ చేయించుకుంటున్నారు. ఫేస్‌ప్యాక్‌ల విషయంలో కూడా రాజీ పడటం లేదు. శుభకార్యానికి వెళ్లాల్సి ఉంటే ముందుగా బ్యూటీ పార్లర్లు, సెలూన్ల వైపు పరుగు తీస్తున్నారు. నడివయస్సులో జిమ్‌లకు వెళ్లే వారు తక్కువే అయినా ఉదయం నడక, చిన్నచిన్న కసరత్తులతో నాజూకుగా మారిపోతున్నారు. విభిన్నంగా ఉంటేనే గుర్తింపు విభిన్నంగా ఉంటేనే మమ్మల్ని నలుగురూ గుర్తిస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకే హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఐటీ సెక్టార్లో అవకాశాలు పెరిగాక, చాలామంది యువత అందానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. డ్రెస్సింగ్ స్టైల్ వల్ల కూడా మాకు ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయి. – గాదిరాజు హరీష్‌వర్మ, అంబాజీపేట కొత్త ఫ్యాషన్ నేర్చుకుంటున్నాం మా పెద్దలు సెలూన్లు నిర్వహించేటప్పుడు కటింగ్, గెడ్డం గీయడంతో సరిపోయేది. మహా అయితే ట్రిమ్మింగ్ చేసి, రంగు వేసేవారు. ఇప్పుడు సెలూన్ల నిర్వహణ మొ త్తం మారిపోయింది. కొత్త ఫ్యాషన్లకు అనుగుణంగా హెయిర్ కటింగ్ స్టైల్స్ నేర్చుకుంటున్నాం. ఫేషియల్‌లో కూడా మార్పులు వస్తున్నాయి. ఒక్కోసారి హైదరాబాద్ వెళ్లి శిక్షణ పొందుతున్నాం. షాపుల్లో కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నాం. – అనిల్‌కుమార్, సెలూన్ యజమాని, అమలాపురం నాజూకుతనానికి.. ఒకప్పుడు జిమ్‌లకు ఎక్కువగా బాడీ బిల్డర్లు వచ్చేవారు. కానీ ఇప్పుడు నాజూకుతనం కోసం ఎక్కువ మంది వస్తున్నారు. మజిల్స్, బాడీ కటింగ్ కోసం చిన్నచిన్న కసరత్తులు ఎక్కువగా చేస్తున్నారు. కరోనా తరువాత, యువతలో వస్తున్న ఫ్యాషన్ మార్పుల కారణంగా జిమ్‌కు వచ్చేవారి సంఖ్య పెరిగింది. – కంకిపాటి వెంకటేశ్వరరావు, హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ కోచ్, అమలాపురం -
రైటింగ్ టేబుల్
మగవాడు రాసేటప్పుడు తాను ఒక్కడే ఉంటాడు. స్త్రీ రాసేటప్పుడు ఆమె వెనుక ఇంకా ఆర్పాల్సిన గ్యాస్‌స్టవ్, పిల్లవాడికి పట్టాల్సిన పాలు, ఆరేయగా లోపలికి తేవాల్సిన బట్టలు, కరెంటు మనిషి మీటర్ కట్ చేసి వెళ్లకుండా కట్టాల్సిన బిల్లు, పెద్దగా కదలికలు లేని అత్తగారికి ఇవ్వాల్సిన మందులు, సంతరోజు తప్పిపోకుండా తేవాల్సిన కూరగాయలు... ఇన్ని ఉంటాయి. మగవాడు– రాసుకోవాలి అనంటే ఆ ఇల్లు నిశ్శబ్దం అయిపోతుంది. ఒక గది ఇవ్వబడుతుంది. ముఖ్యం అతనికి ఒక రైటింగ్ టేబుల్ ఉంటుంది. ‘కాని నాకు తెలిసి మన దేశంలో రాయాలనుకున్న స్త్రీలకు ఒకే ఒక టేబుల్ ఉంటుంది. అది డైనింగ్ టేబుల్. దానిని శుభ్రం చేసుకుని కూచుని రాసుకోవడమే’ అంది ప్రఖ్యాత రచయిత్రి కమలాదాస్. వర్జీనియా ఊల్ఫ్ కూడా ఇదే మాట అంది– రాయాలనుకున్న స్త్రీలు తాము ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేని ఆదాయం కలిగి ఉండాలి... వారికి సొంత గది ఉండాలి. ఆసియాలోనే అతి పెద్దదైన ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’ ఇటీవల జరిగితే అందులో వర్తమాన భారతీయ రచయిత్రులు ఎందరో పాల్గొని ‘తాము రాస్తున్నాము’ అని గొప్ప ప్రకటన చేస్తే, మగవారు పాల్గొన్న వేదికలపై రాని చర్చ ఈ రచయిత్రులు పాల్గొనే వేదికపై వచ్చింది. అది– రాయడానికి సమయం, కావలసిన మద్దతు గురించి! ‘మీరు ఎన్నయినా చెప్పండి... భారతీయ స్త్రీ రాయాలంటే భర్త సహకారం తప్పదు. మన స్త్రీలు అనేక బాధ్యతల మధ్య సమయం వెతుక్కుని రాయాలి. ఆ సమయానికి భర్త ఆటంకం కలిగిస్తే రాయడం కష్టం’ అంది అనుకృతీ ఉపాధ్యాయ్ అనే రచయిత్రి. ‘నేను ఒక నవల మొదలెట్టాను. లాక్డౌన్ వచ్చింది. రెండేళ్ల పాటు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. నవల పని మూలపడింది. మళ్లీ స్కూళ్లు తెరిచి వాళ్లు స్కూలుకు, భర్త ఆఫీసుకు వెళితే తప్ప రాయడానికి వీలవలేదు’ అంది సిమ్రన్ ధిర్ అనే ఢిల్లీ రచయిత్రి. ‘ఈ గొడవంతా ఎందుకని నేను ఉదయం నాలుగ్గంటలకు లేచి ఆరు వరకు రాస్తాను. రోజుకు 200 పదాలు రాస్తే చాలు అనుకుంటూ నా నవల పూర్తి చేశాను’ అంది శివానీ సిబాల్ అనే మరో రచయిత్రి. స్త్రీల కల్పనాశక్తి వందల ఏళ్ల పాటు మన దేశంలో మౌఖికంగా ఉండిపోయింది. వారు ఆటల్లో, పాటల్లో, పిల్లల్ని నిద్ర పుచ్చడానికి చెప్పిన కథల్లో తమ సృజనను చూపించి సంతృప్తిపడాల్సి వచ్చింది. మరో రకంగా చెప్పాలంటే మన దేశ పురాణ జ్ఞానం, జానపద సంపద వాళ్ల నాలుక చివరల నుంచే ఒక తరం నుంచి మరో తరానికి అందింది. కానీ వారు విద్యకూ, కలం పట్టి రాయడానికీ శతాబ్దాలు దూరం ఉన్నారు. రాయడం మొదలెట్టాక, ఇంతకాలం గడిచాక కూడా వారి ఎదుట ఉండాల్సిన సవాళ్లు ఉండనే ఉంటున్నాయి. ‘నేను నా మొత్తం కల్పనా సామర్థ్యాన్ని నా కుటుంబ మర్యాదకు లోబడి కుదించుకోవడానికి అవస్థలు పడ్డాను’ అంది కమలా దాస్. స్త్రీలు రాయవచ్చుగాని అన్నీ రాయకూడదు. కొన్ని కథాంశాలు ముట్టుకోవడం నిషిద్ధం. కొన్ని వర్ణనలు చేయడం నిషిద్ధం. కొన్ని మాటలు వాడటం నిషిద్ధం. స్త్రీలు పాపులర్‌గా రాసినా, గాఢమైన మానవ ప్రవర్తనలు రాసినా ‘ఇవన్నీ ఈమెకు ఎలా తెలుసు... ఈ కథలోని పాత్ర అనుభవం ఈమె అనుభవమే కాబోలు’ అనే భావనలో మన ఎదగని పాఠకులు, కుటుంబాలు ఉంటాయి. కనుక ఇప్పటి వరకూ మన దేశంలో రాసిన స్త్రీలు తమ పూర్తి శక్తితో రాశారని అనుకోవడానికి లేదు. ఇక మీదట రాస్తారనీ చెప్పలేము. కనపడని సెన్సార్షిప్ ప్రభావం అది. పురుషులకు వృత్తి ఉంటుంది. రాయడం వారి ప్రవృత్తి (ఆప్టిట్యూడ్). అదే స్త్రీలకు అభిరుచి (హాబీ)గా చెప్పబడుతుంది. రాసే స్త్రీలను భర్తలు పరిచయం చేస్తూ ‘ఆ.. ఏవో గిలుకుతుంటుంది లేండి’ అని చిన్నబుచ్చుతారు. కార్టూనిస్టులు రచయిత్రుల తిరిగొచ్చిన రచనలు మోయలేక పారిపోయే పోస్ట్మేన్లను వేసి నవ్విస్తారు. సినిమాల్లో రచయిత్రులవి హాస్యపాత్రలు. నాణ్యత లేని రచన పురుషుల్లోనూ, స్త్రీలలోనూ ఉంటుంది. కానీ స్త్రీలు హేళనకు సాధనాలవుతారు. 1965 నుంచి మన దేశంలో జ్ఞానపీఠ్ ఇస్తుంటే ఇప్పటికి 62 మందికి ఆ పురస్కారం దక్కితే వారిలో కేవలం 9 మందే స్త్రీలు ఉన్నారు. ఎన్నో ప్రతిబంధకాలను దాటి, సవాళ్లను ఎదుర్కొని, మగ రచయితల రాజకీయాలను జయించి రాగలిగారు కాబట్టే ఈ 9 మందైనా! ‘నేను చెన్నై కన్నెమరా లైబ్రరీలో పని చేశాను. వందల రచయిత్రుల పుస్తకాలు అక్కడ చూశాను. కానీ వారంతా ఒకటీ రెండూ పుస్తకాల వారు. అంటే 18 నుంచి 24 ఏళ్లలోపు రాసిన వారు. బహుశా పెళ్లయిన తర్వాత వాళ్లందరూ రాయడం మానేసి ఉండాలి’ అంది పరమేశ్వరి అనే తమిళ కవయిత్రి ఒక వ్యాసంలో! ఇదే సూత్రాన్ని ప్రతి భాషకూ అప్లై చేస్తే పెళ్లికి ముందు రాసి ఆ తర్వాత ఆగిపోయిన రచయిత్రుల రాయబడని కావ్యాలను హతం చేసినదే మన సమాజం. వెలుతురు అర్థం కాకపోతే చీకటి అర్థం కాదు. స్త్రీ రాయకపోతే పురుషుడు రాసిందీ సంపూర్ణం కాదు. మానవ చిత్తవృత్తులనూ, సంక్షోభ సమయాలలో వారి దిటవునూ, సందర్భాలకు తగినట్టు మారే కపట విన్యాసాలనూ స్త్రీ గమనించినంత సూక్ష్మంగా పురుషుడు గమనించలేడు. ఈ ప్రపంచం అర్థం కావాలంటే స్త్రీ రచన విస్తృతం కావాలి. రాసే స్త్రీలున్న ఇళ్లలో వారికంటూ తప్పక ఒక రైటింగ్ టేబుల్ ఉండాలి. అది లేనంత కాలం మనం పూర్తిగా నాగరికం కానట్టే! స్త్రీలు రాయాలి. స్త్రీ రచనలు వర్ధిల్లాలి. -
వాష్‌రూమ్ వాడి సరిగ్గా నీళ్లు కొట్టరు.. ఎలా చెప్తే మారతారు మగాళ్లు?
హైదరాబాద్ మూసాపేటలో రెండు రోజుల క్రితం గృహిణి ఆత్మహత్య చేసుకుంది. కారణం? వాష్‌రూమ్‌ను వాడిన భర్త నీళ్లు కొట్టకపోవడంపై ఆమె విసుక్కుంది. భర్త వాదనకు దిగాడు. అంతే. స్త్రీలకు మగవారి దురలవాట్లు కొన్ని ససేమిరా నచ్చవు. వారు ఆ సంగతి చెప్పినప్పుడు వాటిని మానుకోవడం మగవాళ్ల కనీస సంస్కారం. ఎన్ని విధాలుగా చెప్తే మారుతారు మగవారు? నాన్నకు అమ్మ చెప్పలేదు. భర్తకు భార్య చెప్పలేదు. తండ్రికి కూతురు చెప్పలేదు. ఒకసారి చెప్పి ఉంటారు. విని ఉండరు. మరోసారి చెప్పి ఉంటారు. లెక్క చేసి ఉండరు. ఇంకోసారి చెప్పడం మానుకుని ఉంటారు. మానుకున్నారు కదా అని అలవాటు కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పుడు దీనిని తిరగేద్దాం. నాన్నకు స్కూటర్ ఉదయాన్నే శుభ్రంగా తుడిచి కనపడకపోతే కోపం వస్తుందనుకుందాం. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది. ఆయనకు కోపం వస్తుందని తనో పిల్లల చేతో ఆ పని చేయిస్తుంది. నాన్న ఆఫీసుకు వెళ్లే ముందు ఇస్త్రీ చేసిన బట్టలు లేకపోతే విసుగొస్తుందనుకుందాం. అమ్మ ఎంత అలెర్ట్‌గా ఉంటుంది. నాన్నకు ఫలానా సామ్రాణికడ్డి వాసన పడదనుకుందాం. అప్పుడు అమ్మ ఆ సామ్రాణి కడ్డీలను బయట పారేస్తుంది. నాన్నకు ఇష్టం లేనివి ఇంట్లో ఉండవు. కాని అమ్మకు ఇష్టం లేనివి? బాల్యం నుంచి ప్రభావాలు అమ్మ ఒక ఇంటి నుంచి వస్తుంది. నాన్న ఒక ఇంటి నుంచి వస్తాడు. ఇద్దరూ కలిసి ఒక చోట చేరి జీవితం మొదలెడతారు. నాన్నకు ఎలాగైతే బాల్యం నుంచి కొన్ని అలవాట్లు, అభిరుచులు ఉంటాయో అమ్మకు కూడా అలాగే ఉంటాయి. కొన్ని తీవ్రమైన ఇష్టాలు అయిష్టాలు ఏర్పడి ఉంటాయి. కాని వాటికి నాన్న విషయంలో చెల్లుబాటయినట్టుగా అమ్మ విషయంలో కాదు. ఆ... ఏముందిలే.. అనే భావన. ఈ భావన ఇంకా ఎంత కాలం. అసలు అమ్మకు, భార్యకు, కుమార్తెకు ఇష్టం లేని అలవాట్లను మగవాళ్లు ఎందుకు కొనసాగించాలి. చదవండి: వాష్‌రూమ్ వాడి సరిగా నీళ్లు కొట్టరు.. విడిచిన బట్టలు హ్యాంగర్‌కు తగిలించరు. పైగా! చిన్న చిన్నవే అన్నీ... మనుషులు వైముఖ్యం కావడానికి ఎదుటి వారి మీద తీవ్రమైన అసహనం పెంచుకోవడానికి యుద్ధాలు రానక్కర్లేదు. చిన్న చిన్న దురలవాట్లు చాలు. ఉదాహరణకు స్త్రీలు ఇష్టపడని ఈ దిగువ విషయాలు ఎంత మంది పురుషులు ఇళ్ళల్లో కొనసాగిస్తారో గమనించండి. ►బయట నుంచి రాగానే చెప్పులు కుదురుగ్గా విడవరు. ►విడిచిన బట్టలు హ్యాంగర్‌కు తగిలించరు. లేదా వాష్ ఏరియాలో పడేయరు. లోదుస్తులు బాత్రూమ్లోనే వదిలేస్తారు. తడి టవల్ కుర్చీ మీద ఆరేస్తారు. ►సిగరెట్ డ్రాయింగ్‌రూమ్‌లో తాగి యాష్‌ట్రే క్లీన్ చేయకుండా వదిలేస్తారు. ►ఇయర్ బడ్స్ వాడి ఇంట్లో ఏదో ఒక మూలకు పడేస్తారు. ►వాష్‌రూమ్ వాడి సరిగ్గా నీళ్లు కొట్టరు. ►షేవింగ్ చేసుకుని ఆ రేజర్ సింక్ మీదే వదిలిపెడతారు. ►అన్నం తిని ప్లేట్లోని చెత్తను డస్ట్‌బిన్‌లో వేయకుండానే సింక్‌లో పడేస్తారు. ►పెద్ద పెద్దగా కేకరిస్తూ పండ్లు తోముతారు. ►నిద్ర లేచాక దుప్పట్లు మడిచిన పాపాన పోరు ►బాత్రూమ్లోకి న్యూస్‌పేపర్ తీసుకెళ్లి తడి చేసి పట్టుకొస్తారు ►ఫోన్ ఎప్పుడూ చార్జింగ్ పెట్టుకోరు, పైపెచ్చు ఇంట్లోవాళ్లు ఛార్జింగ్ పెట్టలేదని తిడతారు. ►గీజర్, ఫ్యాన్లు, లైట్లు ఆఫ్ చేయరు. ►వీటిలోని ఏ ఒక్కటి కొనసాగించినా స్త్రీలకు కష్టం. అలాంటిది ఇవన్నీ కొనసాగించేవారు ఉంటే ఆ స్త్రీలు ఎంత రోత అనుభవించాలి. అయినా సరే వారు భర్తలతో ఇంటి మగవారితో నవ్వుతూ వ్యవహరించాలని ఆశించడం ఏం భావ్యం. తప్పు చేస్తూ దబాయింపు ఇవన్నీ పురుషులు మానుకోగల అలవాట్లే. ఇంటి స్త్రీల మీద గౌరవం, ప్రేమ ఉంటే వెంటనే మానుకోవాలి కూడా. ఎప్పుడో ఒకసారి బద్దకించవచ్చు. కాని నిత్యం ఇదే పని అంటే అది ఏం సంస్కారం. ఏదో ఒకనాడు భరించలేక స్త్రీలు మందలిస్తే పురుషులు పౌరుషానికి పోయో, అహం కొద్దో, గిల్ట్తోటో స్త్రీలపై ఎదురుదాడి చేస్తే వాటి వల్ల కలిగే ఫలితాలు ఏమీ బాగుండవు. వ్యక్తుల బయట ప్రవర్తనలు ఇబ్బందిగా ఉంటే సమాజం ఇబ్బంది పడుతుంది. ఇంటి ప్రవర్తనలు ఇబ్బందిగా ఉంటే స్త్రీ మాత్రమే ఆ బాధ అనుభవిస్తుంది. ‘ఎన్నిసార్లు చెప్పినా వినడే’ అని స్త్రీల లోలోపల విరక్తి గూడుకట్టుకోవడం ఏమీ మంచిది కాదు. కనుక మారడం పురుషుల విధి. వారికి నేరుగా చెప్పడం స్త్రీలకు వీలు కాకుంటే ఈ వ్యాసం చూపిస్తే సరి. -
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ పీఎస్ లో తాగుబోతు వీరంగం
-
తగ్గదేలే: పురుషులకు సమానంగా,రూ.100లో రూ.85 మహిళలే సంపాదిస్తున్నారు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎం-ఏ) నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ అధ్యయనం ప్రకారం మనదేశంలోని మహిళా ఎగ్జిక్యూటివ్‌లు వారి పురుష సహచరులు సంపాదించే ప్రతి రూ.100కి సగటున రూ.85 సంపాదిస్తున్నట్లు తేలింది. ఇంటికే పరిమితం.. భర్త, పిల్లలు, కుటుంబ పోషణ మాత్రమే ఆమె విధి...అంటూ కొన్నేళ్ల క్రితం మహిళలకు సంబంధించి పరిచయ వాక్యాలు ఉండేవి. కానీ ఇప్పుడు..ఇంటా మేమే,బయటా మేమే అన్నట్లుగా అన్ని రంగాల్లోనూ మహిళలు ప్రతిభ కనబరుస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక, ఉద్యోగ రంగాల్లోనే కాదు..వృత్తి, వ్యాపారాల్లోనూ మహిళలు సాధిస్తున్న విజయాలు అన్నీ ఇన్నీ కావు. అంతెందుకు ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో మనదేశంలో మహిళా ఎగ్జిక్యూటివ్‌లు వారి పురుష సహచరులు సంపాదించే ప్రతి రూ.100కి సగటున రూ.85 సంపాదిస్తున్నట్లు తేలింది. ►ఇక్రా చైర్పర్సన్ అరుణ్ దుగ్గల్ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎం-ఏ) హెచ్ ఆర్ అసోసియేట్ప్రొఫెసర్ ప్రొమిలా అగర్వాల్ 'ది గ్లాస్ సీలింగ్- లీడర్షిప్ జెండర్ బ్యాలెన్స్ ఇన్ ఎన్ఎస్ఈ 200 కంపెనీస్ పేరిట సర్వే నిర్వహించారు. ►గతేడాది నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్‌లో నమోదు చేసుకున్న 200 కంపెనీల్లోని 109కంపెనీలకు చెందిన సుమారు 4వేల కంటే ఎక్కువ మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయం ఆధారంగా నివేదికను తయారు చేశారు. ఆ నివేదికలో దేశంలోని కంపెనీల టాప్, సీనియర్ మేనేజ్మెంట్లో మహిళల ప్రాతినిధ్యం డైరెక్టర్ల బోర్డులలో ఉండాల్సిన మహిళల శాతం కంటే గణనీయంగా తక్కువగా ఉందని తేలింది. ►సంస్థల సీనియర్ మేనేజ్మెంట్లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 7 శాతం మాత్రమేనని, ఇది టాప్ మేనేజ్మెంట్ స్థాయిలో కేవలం 5 శాతానికి దిగజారింది. అయితే, సర్వే ప్రకారం.. నియంత్రణ అవసరాల కారణంగా ఎన్ఎస్ఈలో నమోదైన 500 కంపెనీల్లో ఉన్నత స్థాయిలో ఉన్న మహిళా డైరెక్టర్ల సంఖ్య 2014లో 4.5 శాతం నుండి 2022 నాటికి 16 శాతానికి పెరిగింది. ►200 సంస్థలలో 21 సంస్థల్లో టాప్ మేనేజ్మెంట్లో ఒక మహిళ మాత్రమే ఉండగా, 76 సంస్థల్లో టాప్ మేనేజ్మెంట్లో ఒక్క మహిళ కూడా లేరని కూడా ఇది హైలైట్ చేసింది. ►మహిళా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య అత్యధికంగా ఉన్న పరిశ్రమలు వినియోగదారుల సేవలు, వినియోగ వస్తువులు, ఆర్థిక సేవలు, ఔషధాలు, సమాచార సాంకేతికత విభాగాలు ఉన్నాయని సర్వేలో తేలింది. ►నివేదికలో మహిళా ఎగ్జిక్యూటివ్‌లకు తీసుకునే జీతాలు రూ.1.91 కోట్లుగా ఉండగా.. అదే స్థాయి హోదాలో ఉన్న వారి పురుష సహచరులు ఆర్జిస్తున్న జీతం రూ. 2.24 కోట్లుగా ఉంది. -
పాదాలను చూసి ఆ సీక్రెట్స్ కనిపెట్టేయ్యొచ్చట!!
కాళ్ల వేళ్లను బట్టి, చేతి రేఖలను బట్టి ఎటువంటి జీవిత భాగస్వామి దొరుకుతారో కొంతమంది అంచనా వేస్తారు. ఒక్కోసారి అంచనాలు బోల్తాకొట్టి, అటుఇటు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఐతే తాజాగా ఓ డేటింగ్ సైట్ నిర్వహించిన సర్వే ప్రకారం ఈ పాదాలు ఉన్న పురుషులకు వివాహేతర సంబంధాలు అధికంగా ఉంటాయని చెప్పింది. ‘మిర్రర్’ ఆన్లైన్ సైట్ ప్రచురించిన కథనాల ప్రకారం.. ‘ఇల్లిసిట్ ఎన్కౌంటర్స్’అనే డేటింగ్ సైట్ పురుషులపై నిర్వహించిన సర్వే ప్రకారం మగవారి కాలి పరిమాణాన్ని బట్టి అనేక విషయాలు తెలుసుకోవచ్చని వెల్లడించింది. దాదాపుగా రెండువేల మంది పురుషులపై నిర్వహించిన ఈ సర్వే ప్రకారం మగవారి కాలి సైజును బట్టి జీవిత భాగస్వామిపట్ల వారు ఎంత నమ్మకంగా ఉంటారో వివరించింది. పెద్ద పాదాలు ఉన్న పురుషులు తమ భాగస్వామిని మోసం చేసే అవకాశం ఎక్కువని ఈ సర్వే తెల్పింది. చదవండి: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..! ముఖ్యంగా 11 అంగుళాల పాదాలు ఉన్న పురుషులు 29 శాతం చీటింగ్ చేసే అవకాశం ఉందని, 10 అంగుళాల వారు 25 శాతం, 12 అంగుళాలుంటే 22 శాతం, 13 అంగుళాలుంటే మోసం చేసే అవకాశాలు 21 శాతం ఉంటుందని ఈ డేటింగ్ సైట్ సర్వేలో తేలింది. అంతేకాకుండా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వందలాది మంది పురుషులు స్వయంగా వివాహేతర సంబంధం కలిగి ఉన్నారని సర్వేలో అంగీకరించారట కూడా. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! ‘ఇల్లిసిట్ ఎన్కౌంటర్స్’ సీఈవో జెస్సికా లియోనీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సర్వేపై ప్రజలు విభిన్న ప్రశ్నలు వేస్తున్నప్పటికీ మా లెక్కలు అబద్ధాలు చెప్పలేదని అన్నారు. కొంతమంది పురుషులు దీనిని కొట్టిపారేశారు కూడా. తమకు పెద్ద పాదాలు ఉన్నప్పటికీ తమ భాగస్వామిని ఎప్పుడూ మోసం చేయలేదని, నిజాయితీగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఏదిఏమైనప్పటికీ చేతి రేఖలనుబట్టి, కాలి పరిమాణాలను బట్టి ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేము. ఎందుకంటే ఏ కొద్దిమందినో ప్రామాణికంగా తీసుకుని మొత్తం పురుషులు ఇలాగే ఉంటారని సైన్స్ కూడా చెప్పలేదు. ఏమంటారు? చదవండి: 2 కిలోమీటర్లమేర మృతదేహాలతో గోడ.. మిస్టీరియస్.. -
దీపావళి పండుగ ముగింపు... ఒక వింతైన ఆచారం
గుమటాపుర: చాలా ప్రాంతాలలో పండుగల సందర్భంగా కొన్ని వింతైన ఆచారాలు ఉంటాయి. వాటి వెనుక ఎంతో కొంత ప్రయోజనాల దృష్ట్య కూడా మన పూర్వీకులు ఇలాంటి వాటిని మన దైనందిన జీవితంలో భాగం చేస్తారని చెప్పక తప్పదు. అదేవిధంగా కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో ఉన్న గుమటాపుర గ్రామంలో దీపావళి పండుగ ముగింపు సందర్భంగా ఒక వింతైన ఆచారం ఉంది. (చదవండి: అమ్మ బాబోయ్ వీడేంట్రా వేడి వేడి నూనెలో డైరెక్ట్‌గా చేతులు పెట్టేస్తున్నాడు!) అంతేకాదు వారు మొదట ఆలయానికి వెళ్లి గుడిలోని పూజారితో ఆశీర్వాదం తీసుకునేముందు స్థానిక చుట్టుపక్కల గ్రామాలలోని ఇళ్లలో నుంచి పెద్ద ఎత్తున ఆవుపేడను ట్రాక్టర్ల సాయంతో దేవలయానికి తరలిస్తారు. ఆ తర్వాత అబ్బాయిలంతా జరగబోయే కార్యక్రమానికి కావల్సిన బాణసంచా వంటి మందు గుండు సామాగ్రిని సిద్ధం చేసుకుంటారు. ఈ మేరకు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా మగవాళ్లంతా ఒకరి నొకరు ఆవుపేడతో కొట్టుకుంటారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి సుదూర నగరాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున గుమటాపురానికి తరలి వస్తుంటారు. అంతేకాదు ఈ వేడుక చిన్న పాటి యుద్ధ వాతావరణాన్ని తలపించేలా సరదా సరదాగా సాగుతుంటుంది. పైగా ఆ గ్రామంలోని ప్రజలు ఇది ఆరోగ్య ప్రయోజని నిమిత్తం ఇలా చేస్తుంటామని చెబుతుండం విశేషం. ఈ మేరకు ఆ గ్రామంలోని రైతు ఈ ఆవు పేడతో ఇలా కొట్టించుకుంటే ఏదైనా వ్యాధి ఉన్న అది త్వరగా తగ్గిపోతుందని చెబుతున్నారు. (చదవండి: పునీత్‌కు పద్మ శ్రీ ఇవ్వాల్సిందే !!) #WATCH | Villagers of Gumatapura on the Tamil Nadu-Karnataka border throw cow dung on each other as part of Deepavali celebrations, marking the end of the festival. (06.11.2021) pic.twitter.com/w1fhrp0na5 — ANI (@ANI) November 8, 2021 -
మగవారు బతుకమ్మ ఆడతారు.. ఎక్కడో తెలుసా..!
సాక్షిప్రతినిధి, వరంగల్ః హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామం ఇది. ఇక్కడ దీపావళి పర్వ దినాన్ని పురస్కరించుకొని బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. నేతకాని కులానికి చెందిన వారు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. నేతకాని కులానికి చెందిన మహిళలే కాకుండా పురుషులు కూడా బతుకమ్మ ఎత్తడం ఆచారం. 200 సంవత్సరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతూ వస్తుందని స్థానికులు తెలిపారు. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. గురువారం తొలి రోజు చెరువు నుంచి మట్టిని సేకరించి దేవతల ప్రతిమలను తయారుచేసి ఓ ప్రత్యేక గదిలో ప్రతిష్టించి నైవేద్యం సమర్పించారు. అనంతరం విశేష పూజలు నిర్వహించారు. శుక్రవారం రెండో రోజు దేవతల ప్రతిమలను పురుషులు భారీ ప్రదర్శనగా వెళ్లి స్థానిక చెరువులో నిమజ్జనం చేస్తారు. అనంతరం దీక్ష విరమిస్తారు. అనంతరం చెరువు నుంచి జలాన్ని తీసుకొచ్చి ప్రత్యేక గది లో పెట్టి పూజలు నిర్వహిస్తారు. శనివారం మూడవరోజు మహిళలు బతుకమ్మలను తయారు చేసి భారీ ఊరేగింపుగా బయలుదేరుతారు. మహిళలతో పాటు పురుషులు కూడా బతుకమ్మలను ఎత్తుకొని ముందుకు సాగడం విశేషం. సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు ప్రదర్శన సాగనుంది. ఈ వేడుకలను చుట్టుపక్కల గ్రామాల వారు తండోపతండాలుగా వచ్చి తిలకిస్తారు. కోలాటాల మధ్య ఉత్సవాలు దీపావళి బతుకమ్మ వేడుకలు కోలాటాల మధ్య కొనసాగనున్నాయి. యువకులు కోలాటాల మధ్య బతుకమ్మను సాగనంపుతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన నేతకాని కులస్తులు ఈ వేడుకలను తిలకించడానికి ఇక్కడికి వస్తారు. -
సినీ ఫక్కీలో డీబీ జ్యువెలర్స్ షాప్‌లో మోసం
-
మనలో కరువైంది ఇదే.. ఆవును చూసి నేర్చుకోవాల్సిందే!
కొందరు వ్యక్తులు మూగజీవాలపట్ల కఠినంగా ప్రవర్తిస్తుంటారు. జంతువులను రాళ్లతో, కర్రలతో కొడుతూ.. పైశాచికానందాన్ని పొందుతుంటారు. ఇలాంటి ఘటనలు తరచుగా మన చుట్టు జరుగుతుంటాయి. చాలా వరకు.. మూగజీవాలపై ఎవరైన దాడిచేస్తుంటే..పక్కనున్నవారు వద్దని వారిస్తుంటారు. అయితే, ఒక్కొసారి ఇలాంటి దుర్మార్గులకు కాలం, కర్మ తగిన గుణపాఠం చెబుతాయి. తాజాగా, ఇలాంటి ఆసక్తికర వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిలో ఒక వ్యక్తి.. వీధిలో ఉన్న శునకాన్ని పట్టుకుని పైకి లాగి అమానుషంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత దాని రెండు చెవులు పట్టుకుని గట్టిగా లాగుతున్నాడు. పాపం.. ఆ బాధకు తాళలేక కుక్క గట్టిగా విలవిల్లాడిపోయింది. శునకం.. బాధతో అరుస్తుంటే.. ఆ దుర్మార్గుడు మాత్రం పైశాచికానందాన్ని పొందుతున్నాడు. ఏ ఒక్కరు కూడా... అతగాడి చర్యలను ఆపటానికి ప్రయత్నం చేయడంలేదు. శునకం అరుపులు విన్న ఒక ఆవు అటుగా వచ్చింది. వెంటనే కుక్కను పట్టుకుని హింసిస్తున్న వ్యక్తిపై కొమ్ములతో దాడికి తెగబడింది. అతడిని.. తన రెండు కొమ్ములతో లేపి కిందపడేసి కుమ్మింది. ఆ శునకాన్ని దుర్మార్గుడి బారి నుంచి తప్పించింది. ఈ ఘటనతో అక్కడివారంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. దీన్ని అటవీశాఖాధికారి సుషాంత్ నందా.. ‘కర్మ ఫలం’ అనుభవించాల్సిందే.. అంటూ తన ట్విటర్ ఖాతాలో కామెంట్‌ను జతచేసి పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు..‘పాపం.. శునకం.. ఎంత బాధతో అరుస్తుంది.. ’, ‘ నీకు చేతులేల వచ్చాయి.. ’,‘మనుషుల కన్నా.. నోరులేని జీవులే నయం..’,‘ కర్మఫలం.. అనుభవించాల్సిందే..’, ‘ఒక నోరులేని జీవి బాధ.. మరో మూగ జీవికే అర్థం అవుతోంది’ అంటూ ఆవుపై ప్రశంసలు కురిపిస్తూ... కామెంట్లు పెడుతున్నారు. Karma 🙏🙏 pic.twitter.com/AzduZTqXH6 — Susanta Nanda IFS (@susantananda3) October 31, 2021 -
నీ ఆయువు గట్టిది కాబట్టే తప్పించుకున్నావ్!
బ్రస్సీలియా: సాధారణంగా చాలా మంది కొత్త ప్రదేశాలకు వెళ్లగానే నీటిని చూసి సంబరపడిపోతుంటారు. నీటిలో దిగి స్విమ్మింగ్ చేయడానికి ఇష్టపడతారు. అయితే, ఇలాంటి సమయాల్లో ఒక్కొసారి షాకింగ్ సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి బ్రెజిల్‌లోని క్యాంపో గ్రాండెలోని లాగో డో అమోర్ సరస్సులో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మిస్టర్ కెటానో అనే వ్యక్తి.. గత శనివారం(అక్టోబరు 23)న సాయంత్రం సరదాగా అమోర్ సరస్సులో స్విమ్మింగ్ చేయడానికి దిగాడు. అతగాడు.. స్విమ్ చేస్తూ నిషేధిత ప్రదేశం దాటి నీటిలోపలికి వెళ్లిపోయాడు. కాగా, విల్యాన్ కెటనో అనే మరో వ్యక్తి గట్టుపై నుంచి సరస్సును వీడియో తీస్తున్నాడు. సరస్సులో ఒక వ్యక్తి నిషేధిత ప్రాంతంను దాటి లోపలికి వెళ్లడంను గమనించాడు. అతడిని కదలికలను వీడియో తీస్తున్నాడు. ఆ సరస్సు మొసళ్లకు ప్రసిద్ధి. అక్కడ.. చాలా మొసళ్లు ఉన్నాయి. అందులో ఒక మొసలి.. మిస్టర్ కెటానోవైపు వేగంగా వచ్చి దాడిచేసింది. నీటిలో ఏదో అలజడి రావడంతో వెంటనే వెనక్కు చూశాడు. ఒక మొసలి తన వైపుకు వేగంగా రావడాన్ని గమనించాడు. అతను కూడా.. వేగంగా స్విమ్మింగ్ చేస్తూ సరస్సు ఒడ్డుకు చేరుకున్నాడు. అప్పటికి అతని చేతికి, శరీర భాగాలను మొసలి గాయపర్చింది. వెంటనే మిస్టర్ కెటానోను.. స్థానికులు మొబైల్ ఎమర్జెన్సీ అంబూలెన్స్కి సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మిస్టర్ కెటానో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వెంట్రుక వాసిలో తప్పించుకున్నావు..’, ‘నీ ఆయువు గట్టిదే..’ ‘వామ్మొ... ఎంత భయంకరంగా ఉందో? అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: మందు.. సోడా.. మంచింగ్.. ఆ కోతే వేరబ్బా! -
బ్యూటీ పార్లర్ల చుట్టూతిరిగే సమస్యను పోగొట్టే గాడ్జెట్ ఇదే
లోలోపల ఆరోగ్య సమస్యల సంగతి పక్కనపెడితే.. పైకి కనిపించే అవాంఛిత రోమాల సమస్య 15 రోజులకోసారి బ్యూటీ పార్లర్ల చుట్టూతిరిగేలా చేస్తుంది. ఇలాంటి అన్ని సమస్యలకు చెక్ పెట్టేదే ఈ డివైజ్ (9,99,000 ఫ్లాషెస్ ఆటో మాన్యువల్ మోడ్స్ 5 ఎనర్జీ లెవెల్ హోమ్ యూజ్ పర్మినెంట్ హెయిర్ రిమూవల్). ఇది స్త్రీలకే కాదు పురుషులకూ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ అల్ట్రా–ఫాస్ట్ పర్మినెంట్ హెయిర్ రిమూవల్.. అధునాతనమైన ఇంటెన్స్ ప్లస్డ్ లైట్ టెక్నాలజీతో అవాంఛిత రోమాలను కుదుళ్ల నుంచి తొలగించి క్రమంగా తిరిగి రాకుండానూ నివారిస్తుంది. నొప్పి తెలియకుండా సమస్యను రూపుమాపుతుంది. ఇందులో 2 ప్రత్యేకమైన మోడ్స్, 5 ఎనర్జీలెవెల్స్ ఉంటాయి. స్కిన్ కలర్, హెయిర్ కలర్‌ని బట్టి మోడ్స్ సహకరిస్తాయి. మాన్యువల్ మోడ్‌తో సున్నితమైన భాగాల్లో అంటే బికినీ లైన్‌కి 4 నిమిషాలు, పైపెదవికి నిమిషం ఇలా ఒక్కోదానికి ఒక్కో సమయం పడుతుంది. ఇక చేతులు, కాళ్లు, వీపు భాగాలకు ఆటోమెటిక్ మోడ్ అప్లై చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ తీసుకునే ప్రతి భాగంపై ముందుగానే షేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖానికి, మొత్తం బాడీకి ఈ ట్రీట్మెంట్ అందించేందుకు సుమారుగా 30 నిమిషాల సమయం పడుతుంది. 8 నుంచి 12 వారాలు క్రమం తప్పకుండా చేస్తే 90 శాతం హెయిర్ గ్రోత్ తగ్గుతుంది. 13వ వారం నుంచి ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. దీని నుంచి ఒక్కసారికి వెలువడే కాంతి (9,99,000 ఫ్లాషెస్) మానవశరీరానికి ఎలాంటి హానీ కలిగించదని నిరూపితమైంది. ప్రొఫెషనల్ ట్రీట్మెంట్ అందించే ఈ డివైజ్.. చాలా కంఫర్టబుల్‌గా పని చేస్తుంది. దీన్ని కళ్ల సమీపంలో ఉపయోగిస్తున్నప్పుడు కళ్లకు డివైజ్‌తో పాటు లభించిన ప్రత్యేకమైన గాగుల్స్ తప్పకుండా పెట్టుకోవాలి. అయితే ఈ హెయిర్ రిమూవర్ డార్క్ స్కిన్‌ను, వైట్ హెయిర్‌ను గుర్తించలేదు. -
మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. పోలీసులకు ఫిర్యాదు
లక్నో: తన ఇంటి పక్కన ఉండే కొంత మంది వ్యక్తులు తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని లక్నోకి చెందిన ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, సెప్టెంబరు 25న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నోలోని జంకిపురంలో ఉండే మహిళ పట్ల ఆమె ఇంటి పక్కన నివసించే రోహిత్ యాదవ్, హర్నామ్ యాదవ్ అనే యువకులు గత కొన్ని రోజులుగా వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బాధిత మహిళ సెప్టెంబరు 25న ఇంటి నుంచి బయటకు వచ్చింది. దీంతో ఇద్దరు యువకులు ఆమె వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా సైగలు చేస్తూ.. బాధిత మహిళపై దాడిచేసి దుస్తులను తీసేశారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరింపులకు కూడా పాల్పడ్డారు . దీంతో బాధిత మహిళ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సహయంతో జరిగిన దారుణాన్ని పోలీసులకు ఫోన్ చేసి తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించినట్లు జంకిపూరం పోలీసు అధికారి కుల్దీప్ సింగ్ తెలిపారు. కాగా, ప్రస్తుతం తనకు పోలీసు భద్రత కావాలని బాధిత మహిళ పోలీసు అధికారులను కోరినట్లు తెలిపింది. చదవండి: చెప్పుల్లో బ్లూటూత్ పెట్టుకుని పరీక్షలు.. ధర రూ.6 లక్షలు! -
అనంతపురం జిల్లా గుత్తిలో విషాదం
-
పురుషుల్లో కంటే మహిళల్లోనే ఉబకాయం పెరుగుతోంది..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మహిళల్లో ఊబకాయం పెరిగిపోతోంది. పురుషుల్లో కన్నా మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉందని ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. నాలుగవ జాతీయ కుటుంబ సర్వేతో పోలిస్తే అయిదవ సర్వేలో మహిళల్లో ఈ సమస్య పెరిగింది. నాలుగవ సర్వేలో 33.2 శాతం మహిళల్లోనే ఉండగా ఆ తర్వాతి సర్వేకు వచ్చేసరికి ఇది 36.3 శాతానికి పెరిగింది. అయితే.. అదే సమయంలో పురుషుల్లో మాత్రం ఈ తీవ్రత 33.5 శాతం నుంచి 31.3 శాతానికి తగ్గింది. చదవండి: ఇలా చేస్తే.. ఎంత వయసొచ్చినా యంగ్‌గా.. పట్టణాల్లోనే ఊబకాయులు ఎక్కువ నిజానికి వయస్సు, ఎత్తు ఆధారంగా ప్రతీ మనిషి ఎంత బరువు ఉండాలన్నది నిర్దేశిస్తారు. ఇలా నిర్దేశిత బరువు కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఊబకాయంగా గుర్తిస్తారు. ప్రధానంగా.. గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణ ప్రాంతాల్లోని మహిళలు, పురుషుల్లోనే ఎక్కువ ఊబకాయం ఉన్నట్లు ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. పట్టణ మహిళల్లో 44.4 శాతం, గ్రామీణ మహిళల్లో 32.6 శాతం ఊబకాయ సమస్య ఉంది. అదే పురషుల విషయానికొస్తే.. పట్టణాల్లో 37.7 శాతం, పల్లెల్లో 28.0 శాతంగా ఉంది. ఒక్క కృష్ణా, విశాఖపట్నం జిల్లాలు మినహా మిగిలిన అన్ని చోట్ల గతం కన్నా మహిళల్లో ఊబకాయ సమస్య పెరిగినట్లు సర్వే పేర్కొంది. చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా.. కొబ్బరి ప్రయత్నించండి! అవగాహన లేకపోవడమే.. వ్యాయామంపై చాలామంది మహిళలకు అవగాహన తక్కువ. దీంతో పాటు బిడ్డలను కన్నాక వారిలో శారీరక మార్పులు చోటు చేసుకుంటాయి. హార్మోన్ల లోపాలు వంటివి సమస్యలుగా మారతాయి. ఇలాంటి సమయంలో వారి శరీరంలో మార్పువచ్చి బరువు పెరుగుతుంటారు. దీన్ని అధిగమించాలంటే శారీరక వ్యాయామం చేయాల్సిందే. కొత్త తరం అమ్మాయిలు, మహిళలు వ్యాయామంపై అవగాహనతో ఉంటున్నారు. – డా. విద్యాసాగర్, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్, కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
పెళ్లి అయిన మూడు రోజులకే.. ‘నవ వరుడి’ ఆత్మహత్యాయత్నం..
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): జగిత్యాల జిల్లా కేంద్రంలోని మార్కండేయనగర్కు చెందిన బాబా పెళ్లి అయిన మూడు రోజులకే కత్తితో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. బాబాకు మూడు రోజుల క్రితం ఓ యువతితో వివాహం జరిగింది. అప్పటినుంచి వీరద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ విషయమై యువకుడు గురువారం జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు.. ఇద్దరికీ సర్దిచెప్పి ఇంటికి పంపించారు. శుక్రవారం మళ్లీ ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన బాబా పదునైన కత్తితో చెయ్యి, వీపు భాగాల్లో కోసుకున్నాడు. కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దూషించిన వ్యక్తిపై చర్య తీసుకోండి కథలాపూర్(వేములవాడ): అటవీశాఖకు చెందిన భూమిని కబ్జా చేశాడని ప్రశ్నించినందుకు ఓ వ్యక్తి తనను దూషించాడని సెక్షన్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కథలాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన పిట్టల రాజం అటవీశాఖకు చెందిన భూమిని కబ్జా చేసి, చెట్లు నాటాడు. దీనిపై ప్రశ్నించి, వాటిని తొలగించిన అటవీశాఖ సెక్షన్ అధికారి శ్రీనివాస్‌ను అతను దూషించాడు. ఈ మేరకు బాధితుడు శుక్రవారం ఠాణాలో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై చర్య తీసుకోవాలని కోరారు. చదవండి: అదనపు కట్నం కోసం వేధింపులు.. ఎనిమిది నెలల నిండు గర్భిణి పై.. -
హృదయ విదారకం.. కళ్లు పీకేసిన ఎలుగుబంటి
సాక్షి, రాజన్నసిరిసిల్ల(కరీంనగర్): రాజన్న సిరిసిల్లలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. రుద్రంగి మండల కేంద్రంలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. దేగావత్ తండాకు చెందిన గంగాధర్ అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడిచేసి అతడి కళ్లను పీకేసింది. స్థానికులు పెద్ద ఎత్తున అరుపులు,కేకలు వేయడంతో ఎలుగుబంటి అక్కడినుంచి అడవిలోకి పారిపోయింది. దీంతో తీవ్రగాయాలపాలైన వ్యక్తిని స్థానికులు నీళ్లు తాగించి మెరుగైన చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
రైల్వేలో ఉద్యోగాల పేరుతో 40 మందికి టోకరా
తిరువళ్లూరు(తమిళనాడు): రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 40 మందిని మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులను తిరువళ్లూరు క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు తాలుకా బొమ్మరాజుపేటకి చెందిన సత్యరాజ్(29). ఇతనికి రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి 2.50 లక్షల రూపాయలను చిత్తూరు జిల్లా నగరి తాలుకా మేలప్పేడు గ్రామానికి చెందిన చిత్రయ్య కుమారుడు నాగరత్నం(53), అరక్కోణంకు చెందిన బాలాజీ (27) నగదు వసూలు చేశారు. అయితే ఉద్యోగం ఇప్పించకపోవడంతో తమ డబ్బు తిరిగి ఇవ్వాలని సత్యరాజ్ కోరాడు. అయినా వారు పట్టించు కోలేదు. దీంతో బాధితుడు తిరువళ్లూరు ఎస్పీ వరుణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు నాగరత్నం, బాలాజీని అరెస్టు చేశారు. విచారణలో సుమారు 40 మందికి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.1.93 కోట్లు మోసం చేసినట్లు తేలింది. దీంతో వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కాగా ఉద్యోగాల పేరుతో డబ్బులు దండుకునే వారిపట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. -
విషాదం: మేమెలా బతికేది నాయనా..?
నగరి(చిత్తూరు జిల్లా): మునిసిపల్ పరిధి, సత్రవాడ దళితవాడకు చెందిన ఇద్దరు యువకులు విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. దీంతో స్థానికంగా విషాదం అలుముకుంది. సీఐ మద్దయ్య ఆచారి కథనం మేరకు.. దళితవాడు చెందిన సుధాకర్ (25), దళపతి (25) రోజు వారి కూలీలు. బుధవారం రాత్రి అడవికొత్తూరు దళితవాడలో జరిగిన వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో భారీ వర్షం వచ్చింది. తలదాచుకోవడానికి అక్కడే ఉన్న షెడ్డు వద్దకు వెళ్లారు. అప్పటికే వర్షానికి షెడ్డు పక్కనే ఉన్న స్టే వైరులో విద్యుత్ సరఫరా అవుతోంది. ఆ తీగ తగలడంతో షాక్‌కు గురయ్యారు. కొంతసేపటి తర్వాత వారు అక్కడే పడిపోయారు. గుర్తించిన స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సుధాకర్‌కు భార్య, నలుగురు కుమారులు, దళపతికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరు యువకులు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో విషాదం అలుముకుంది. ఎలా బతికేది..? రోజూ కూలికెళ్లినా మహరాజుల్లాగా చూసుకున్నారు. కుటుంబానికి ఏ లోటూ రాకుండా ఆదుకుంటున్నారు. కరోనా కష్టకాలంలోనూ ఏ ఇబ్బందీ లేకుండా తోడుగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. ఇక మాకు దిక్కెవరు దేవుడా.. అంటూ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. విగత జీవులుగా పడి ఉన్న తండ్రులను చూసి పిల్లల మనసు చలించి పోయింది. ఇక మేమెలా బతికేది నాయనా..? అంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. -
చితక్కొడుతున్న మహిళలు : హోలీ ఇలా కూడా
సాక్షి,లక్నో : ఉత్తరప్రదేశ్‌లో రంగుల పండుగ హోలీ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతున్న తరుణంలో యూపీ మథుర జిల్లాలో హోళీ సంబరాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో లడ్డూమార్ హోలీ సంబరాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కరోనా మార్గనిర్దేశనాలను పాటించకుండా వేలాదిమంది ఈ సంబరాల్లో సందడి చేయడం వివాదం రేపింది. అయితే తాజాగా లాఠ్మార్ హోలీ సంబరాలు వార్తల్లో నిలిచాయి.. రంగులు జల్లుకుంటూ ఆడుకోవడంతోపాటు ఆడవారు మగవారిని కర్రలతో కొట్టడం ఈ లాఠీమార్ హోలీ ప్రత్యేకత. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లుకొడుతోంది. దేశవ్యాప్తంగా మార్చి 29న హోలీ వేడుక జరుపుకోనుండగా యూపీలో మధుర-బృందావన్-బర్సానాలో వారం ముందుగానే ఈ సంబరం ప్రారంభమవుతుంది. ప్రపంచ ప్రఖ్యాత లాఠీమార్ హోలీ మంగళవారం నిర్వహించారు. రెండు రోజులపాటు ఈ వేడుకను నిర్వహిస్తారు. మంగళవారం బర్సానాలో నిర్వహించగా, బుధవారం బర్సానా, నందగావ్‌లో హోలీ ఆడనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. శ్రీకృష్ణుడు గోపికలతో హోలీ ఆడుతుండగా, ప్రతిగా రాధ తదితరులు కృష్ణుడ్ని లాఠీలతోనూ, కర్రలతోనూ కొడతారట. ఈ లాఠీమార్ దాడినుంచి తప్పించుకునేందుకు పురుషులు కవచాలను కూడా ధరిస్తారట. మరోవైపు ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కమెంట్లతో సందడి చేస్తున్నారు. కరోనా విస్తరిస్తోంటే...కనీస జాగ్రత్తలు పాటించడంలేదుని, మాస్క్‌లు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించడం లేదంటూ మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అప్పు తిరిగివ్వాలని వాటర్ ట్యాంక్ ఎక్కి...
సాక్షి, కరీంనగర్ : అప్పు తీసుకున్న మహిళ డబ్బులు వెనక్కివాలని డిమాండ్ చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కారు ఏడుగురు వ్యక్తులు. ఈ సంఘటన కరీంనగర్లో సోమవారం చోటుచేసుంది. వివరాల్లోకి వెళితే.. అంబేద్కర్ నగర్లో నివాసం ఉండే ఓ మహిళ స్థానికంగా ఉండే పలువురి వద్ద అప్పు క్రింద డబ్బులు తీసుకుని ఇవ్వక పోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో అప్పు తీసుకున్న మహిళ త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించి బాధితులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేయడంతో, తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ బాధితులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించారు. అప్పుగా తీసుకున్న డబ్బులు వెంటనే ఇప్పించాలని లేకుంటే ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. స్థానిక కార్పోరేటర్తో పాటు పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు. డబ్బులు ఇప్పించే వరకు దిగమని బాధితులు ససేమిరా అన్నారు. చివరకు ఎస్ఐ ట్యాంక్ పైకి ఎక్కి డబ్బులు ఇప్పించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు కిందికి దిగారు. దాదాపు రెండు గంటలపాటు రాత్రిపూట బాధితులు ట్యాంక్ పై హంగామా చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం!
సంతబొమ్మాళి: దేశంకాని దేశంలో చిక్కుకున్న తమ వాళ్లు ఎప్పుడొస్తారో అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని లిబియా బాధితుల కుటుంబాల కల ఎట్టకేలకు ఫలించింది. రాష్ట్ర ప్రభుత్వం కృషి, చొరవతో ఆఫ్రికా దేశం లిబియాలో చిక్కుకున్న ముగ్గురు జిల్లా యువకులకు విముక్తి కలిగింది. గురువారం స్వగ్రామమైన సీతానగరంలో అడుగుపెట్టిన బాధితులు తీవ్ర భావోద్వేగానికి లోనై తమ కుటుంబ సభ్యులను హత్తుకొని ఆనందభాష్పాలు కార్చారు. వివరాల్లోకి వెళ్తే.. సంతబొమ్మాళి మండలం నౌపడ పంచాయతీ సీతానగరం గ్రామానికి చెందిన బత్సల వెంకటరావు, బత్సల జోగారావు, బొడ్డు దానయ్య ఉపాధి కోసం గతేడాది అక్టోబర్ 30న లిబియా వెళ్లారు. అక్కడ కంపెనీలో 11 నెలలపాటు పనిచేశారు. తిరిగి భారత్ వచ్చేందుకు సెపె్టంబర్ 14న లిబియా రాజధాని ట్రిపోలి ఎయిర్‌పోర్టుకు కారులో వస్తుండగా మార్గమధ్యంలో దుండగులు కిడ్నాప్ చేశారు. బాధితుల కుటుంబసభ్యులు ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టికి తెచ్చారు. వారు వెంటనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమాచారాన్ని చేరవేశారు. సీఎం చొరవ, కృషితో లిబియాలోని భారత రాయబార కార్యాలయం.. కంపెనీ ప్రతినిధులతో చర్చించి కిడ్నాపర్ల నుంచి వారిని విడుదల చేసేందుకు అన్ని విధాలా ప్రయతి్నంచింది. దీంతో 28 రోజుల తర్వాత కిడ్నాపర్ల చెర నుంచి యువకులు బయటపడ్డారు. బుధవారం స్వదేశానికి ప్రత్యేక విమానంలో చేరిన యువకులు గురువారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కి విశాఖపట్నం చేరారు. అక్కడి నుంచి కారులో స్వగ్రామమైన సీతానగరం చేరుకున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యుల ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. మార్గమధ్యంలో యువకులు ఎస్పీ అమిత్ బర్దార్‌ను కలిసి జరిగిన ఘటనను వివరించారు. మళ్లీ చూస్తామనుకోలేదు.. బతుకుతెరువుకు లిబియా వెళ్లి కిడ్నాప్‌కు గురయ్యాం. ఎన్నో అవస్థలు పడ్డాం. మళ్లీ మావారిని చూస్తామనుకోలేదు. సీఎం వైఎస్ జగన్ చొరవతో మళ్లీ స్వగ్రామంలో అడుగుపెట్టాం. – బత్సల జోగారావు, బొడ్డు దానయ్య, బత్సల వెంకటరావు, లిబియా బాధితులు సీఎం వైఎస్ జగన్‌కు మా కృతజ్ఞతలు దేశం కాని దేశం వెళ్లి తిరిగి వస్తుండగా కిడ్నాప్ కావడంతో చాలా భయపడ్డాం. ఏమైందో అని ఆందోళన చెందాం. వెంటనే ప్రభుత్వం స్పందించి విముక్తికి సహకరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి సీదిరి అప్పలరాజుకు రుణపడి ఉంటాం. – బొడ్డు దానయ్య, కుటుంబ సభ్యులు, సీతానగరం -
మగువలే చక్కబెడుతున్నారు..
సాక్షి, అమరావతి: భారతీయుల జీవనశైలిపై వారు నివసిస్తున్న ప్రాంతాలు, ఆదాయం, కులాలు గణనీయ ప్రభావాన్ని చూపిస్తున్నాయని జాతీయ గణాంకాల సంస్థ (ఎన్ఎస్వో) తాజాగా విడుదల చేసిన సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా ఉద్యోగం, ఇంటి పని విషయంలో పూర్తి స్థాయిలో లింగ వివక్ష కనిపిస్తోందని సర్వే స్పష్టం చేసింది. దేశంలో రూపాయి ఆదాయం ఆశించకుండా 84 శాతం మంది మహిళలు రోజంతా ఇంటి పనికే పరిమితమవుతున్నారని తేలింది. కేవలం 16 శాతం మంది పురుషులు మాత్రమే ఆదాయం ఇవ్వని ఇంటి పనుల్లో భాగస్వాములవుతున్నారని స్పష్టమైంది. జాతీయ సగటుతో పోలిస్తే మన రాష్ట్రంలో ఇంటి పనిచేస్తున్న పురుషుల శాతం కొద్దిగా ఎక్కువగా ఉండటం విశేషం. మన రాష్ట్రంలో ఆదాయం ఇవ్వని ఇంటి పనుల్లో 81.7 శాతం మంది మహిళలు, 18.3 శాతం మంది పురుషులు పాలుపంచుకుంటున్నారు. తొలిసారిగా దేశవ్యాప్తంగా ప్రజలు తమ సమయాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నారన్న అంశంపై గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 4,50,000 మందిపై ఈ సర్వే నిర్వహించారు. ఇందులో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఇంటి పనుల్లో పురుషులు కొద్దిమందే.. ► 6% మంది పురుషులు వంటింటిలో గరిట తిప్పుతుండగా, 8% మంది మాత్రమే ఇంటి గదులను శుభ్రపరుస్తున్నారు. ► పేదరికంలో ఉన్నవారు సంపాదన కోసం ఎక్కువ సమయం వెచ్చిస్తుంటే ధనవంతులు నిద్రపోవడానికి వినియోగిస్తున్నారు. ► ఉన్నత కులాల వాళ్లు ఖాళీ సమయాన్ని స్వీయ సంరక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. అలాగే మతపరమైన కార్యక్రమాలు, టీవీ, మీడియా వంటివాటికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ► ఎస్సీ, ఎస్టీలు ఖాళీ సమయాన్ని సామాజిక బృందాలను ఏర్పాటు చేసుకోవడానికి వినియోగిస్తున్నారు. ఉన్నత కులాలకు చెందిన పురుషులు సంపాదన లేని పనులు చేయడానికి తక్కువ ఆసక్తి చూపుతున్నారు. ► వెనుకబడిన కులాల్లో 40 శాతం మంది ప్రధాన ఆదాయ వనరు.. కూలి పనులే. మన రాష్ట్రానికి సంబంధించిన సర్వే వివరాలిలా.. ► ఆదాయ సంపాదన వంటి కార్యక్రమాల్లో 61 శాతం మంది పురుషులు, 28.9 శాతం మంది మహిళలు ఉన్నారు. ► లాభాపేక్ష లేకుండా ఇంటి సభ్యుల సంరక్షణ పనులు చేయడానికి 10.8 శాతం మంది పురుషులు, 24 శాతం మంది మహిళలు ఆసక్తి చూపారు. ► స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనడానికి 2.6 శాతం మంది పురుషులు, 1.8 శాతం మంది మహిళలు ముందుకొచ్చారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి 20.3 శాతం మంది పురుషులు, 16 శాతం మంది మహిళలు ఆసక్తి చూపారు. సామాజిక, సాంఘిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో 92.2 శాతం మంది పాల్గొంటున్నారు. -
ఫ్యామిలీ మ్యాన్గారూ ఇది వినండి
ఆఫీసుకు వెళ్లి టైముకు ఇల్లు చేరుకుని భార్య ఇచ్చిన కాఫీ తాగుతూ కూచునే వారిని ‘ఫ్యామిలీ మ్యాన్’ అని కితాబిస్తారు. కాని స్త్రీ ఉద్యోగానికి వెళ్లి కష్టపడితే ‘కెరీర్ ఓరియెంటెడ్ ఉమన్’ అంటారు. మగవారు ‘డబ్బు సంపాదించని పని’ చేయరని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) తాజా నివేదిక తెలిపింది. అంటే డబ్బు రాని ఇంటి పని వారు చేయరు. దాంతో భారతదేశంలో స్త్రీలు రోజుకు ‘విలువ లేని’ 5 గంటల ఇంటి చాకిరీ చేస్తున్నారు. దేశంలో కేవలం 27 శాతం స్త్రీలనే ఉద్యోగాలు చేయనిస్తున్నారు. ఈ అసమానతపై గొంతెత్తే హక్కు స్త్రీలకు ఉంది. ‘ఆడవాళ్లకు పనేం ఉంటుందండీ. చాడీలు చెప్పుకోవడం తప్ప. టీవీ సీరియల్స్ చూడటం తప్ప’ అని అంటూ ఉంటారు మగవారు. పూర్వం అనేవారు. రోజులు మారాయి అనుకుంటున్నారా? ఇప్పుడూ అంటున్నారు. భవిష్యత్తులోనూ అనకుండా అడ్డుకోవాలి. ‘స్త్రీలకు పనేముంటుందండీ.. ఒక అన్నం ఒక కూర వండేసి హాయిగా కూచోవడమే కదా’ అని కూడా అంటూ ఉంటారు. ఆ ఒక అన్నం, ఒక కూర ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి ఒకరోజు చేయమనాలి ఈ మగవారిని. వారంలోని ఏడురోజులు, నెలలోని ఐదు వారాలు, సంవత్సరంలోని పన్నెండు నెలలు వంట చేయడం... చేసి చూపించడం ఇలా అనేవారికి సాధ్యమా? స్త్రీలు చేస్తున్నారు. చేయలేకపోయినా చేస్తున్నారు. కుటుంబం మీద ప్రేమతో చేస్తున్నారు. వారు దానిని తప్పించుకోవాలని నిలదీస్తే పురుషుడి కాళ్ల కింద భూకంపం వస్తుందని వారికి తెలుసు. అంతమాత్రాన చేస్తూ పోనివ్వడమేనా? వంటగది భారతం నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్.ఎస్.ఓ) దేశంలోని స్త్రీ పురుషుల ఉపాధి, ఇంటిపనికి సంబంధించి 2109 జనవరి నుంచి డిసెంబరు వరకు నిర్వహించిన సర్వేలో స్త్రీలు ఎదుర్కొంటున్న అసమానత మరోసారి తేటతెల్లం అయ్యింది. దేశవ్యాప్తంగా లక్షా ముప్పైతొమ్మిది వేల ఇళ్లని, నాలుగున్నర లక్షల మంది వ్యక్తులను సర్వే చేసి ఇచ్చిన ఈ నివేదిక ప్రకారం దేశంలో 70 శాతం మంది పురుషులు ఉద్యోగ, ఉపాధుల్లో తమ వాటా ఆక్రమించుకున్నారు. 21 శాతం మంది మహిళలే ఉద్యోగ, ఉపాధుల్లో చోటు సంపాదించుకుంటున్నారు. ఇక దేశంలో 90 శాతం మంది స్త్రీలు ఇంటి పనిలో తలమునకలుగా ఉన్నారు. కాని పురుషులు మాత్రం 27 శాతం మంది మాత్రమే ఇంటి పనులు చేస్తున్నారు. ఈ సర్వేలో ఎక్కువ మంది పురుషులు (15–59 వయసు మధ్యవారు) తాము ‘డబ్బు రాని పని’ చేయము అని చెప్పారు. ఇలా చెప్పే వీరంతా ‘డబ్బు రాని’ ఇంటి పని గురించి తమకు ఎటువంటి బాధ్యత లేదని చెప్పినట్టే అయ్యింది. దాంతో స్త్రీలు ఉద్యోగం చేసినా చేయకపోయినా రోజుకు ఐదు గంటల పాటు ఇంటి పనికి నడుము విరుచుకోవాల్సి వస్తోందని ఈ నివేదిక తెలియచేసింది. పురుషుడు ఉద్యోగం కోసం 8 గంటలు పని చేసి 30 వేలు సంపాదిస్తే స్త్రీ ఇంట్లో అందులోని అరవై శాతం జీతానికి సమానమైన శ్రమ చేస్తోంది. ఇది కాకుండా భర్తకు సేవ, పిల్లలకు సేవ అదనం. ఈ నివేదిక ప్రకారం దేశంలో పురుషులు ఇంటి పని కోసం రోజుకు 97 నిమిషాలు, పిల్లల కోసం 1 గంట 16 నిమిషాలు కేటాయిస్తున్నారు. మిగిలిన సమయమంతా తల్లులదే అని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. గౌరవం అవసరం నలుగురుకి అవసరమైన పప్పుచారు శ్రద్ధగా వండాలంటే అందుకోసం కనీసం పదిహేను రకాల పనులను సమన్వయం చేసుకోవాలి. కాని అది పని కాదు మగవారి దృష్టిలో. ఒక రోజులో సరుకుల షెల్ఫ్‌ను స్త్రీలు ఎన్నిసార్లు తెరిచి మూస్తారో అన్నిసార్లు ఒక వ్యాయామం కోసం పురుషులను తెరిచి మూయమంటే వారికి అందులోని శ్రమ అర్థమవుతుంది. విచారించాల్సిన విషయం ఏమిటంటే తమ మేధను, చదువును, భిన్నమైన అభిరుచులను, సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని స్త్రీ భావిస్తే కనుక బయట ఎంత పని చేయాలో అంత పని చేసి ఇంటి పనిని కూడా’ తప్పించుకోవడానికి వీల్లేకుండా’ చేస్తేనే పురుషుడు సంతృప్తి చెందుతాడు. ఆమె వాటి నుంచి తప్పించుకుంటే కొద్దిగా ఇంటికి దూరమైతే ‘కెరీర్ ఓరియెంటెడ్’ అని ముద్ర వేస్తాడు. తాను మాత్రం ఆఫీసులో చేసిన శ్రమ చాలు అని ఇంటికి చేరుకుని పైజమా, టీషర్ట్ వేసుకుని టీవీ ముందు కూచుంటే ‘ఫ్యామిలీ మ్యాన్’ అనిపించుకుంటాడు. అతను ఇంటికి దూరమై కష్టపడినా ప్రశంసే, ఇంట్లో కూచున్నా ప్రశంసే. స్త్రీకి ప్రత్యేకంగా ఇవి దక్కవు. పని చేయని పురుషుణ్ణి ఏ ఆఫీసూ ఉంచుకోదు. పని చేయకపోయినా పురుషుడు హాయిగా ఇంట్లో ఉండొచ్చు. పని చేస్తున్నవారి శ్రమపై ఆధారపడొచ్చు. దీని గురించి ఆలోచించండి ఫ్యామిలీ మ్యాన్ గారు. దీనిని న్యాయంగా, ప్రజాస్వామికంగా ఎలా మార్చవచ్చో చూడండి. అప్పుడే మీరు నిజమైన ఫ్యామిలీ మ్యాన్ అవుతారు. – సాక్షి ఫ్యామిలీ -
‘మేల్’కోండి!
సాక్షి, హైదరాబాద్: పేరుకు మగమహారాజులే అయినా..కరోనా విషయానికొచ్చేసరికి బలహీనులే అట. ఎందుకంటే కోవిడ్ మహమ్మారి బారిన పడుతున్నవారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువ. త్వరగా కోలుకోవడంలో మహిళలు ముందంజలో ఉండగా, మరణిస్తున్నవారిలో పురుషులే అధికంగా ఉంటున్నారు. కోవిడ్ సోకకుండా తట్టుకునే రోగనిరోధశక్తి మహిళల్లో అధికంగా ఉండడంతోపాటు పురుషులతో పోల్చితే మహిళల్లోనే మెరుగైన ‘ఇమ్యూన్ రెస్పాన్స్’ ఉన్నట్టు తాజాగా అమె రికా యేల్ యూనివర్సిటీ ఉమెన్స్ హెల్త్ రీసె ర్చ్‌లో వెల్లడైంది. కోవిడ్ పాజిటివ్ మహిళా పేషెంట్లలో పురుషుల కంటే టీ–సెల్ యాక్టివేషన్ చురుకుగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తిం చారు. మానవశరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మలచుకోవడంలో టీ–లింపోసైట్స్‌గా నూ పిలిచే ఈ–సెల్స్ ప్రధాన భూమికను పో షిస్తాయి. శరీరంలోని వైరస్ సోకిన కణాలను ప్రత్యక్షంగా చంపడంతోపాటు ఇతర రోగనిరోధక కణాలను యాక్టివేట్ చేయడంలోనూ టీ–సెల్స్ పాత్ర నిర్వహిస్తాయి. టీ–సెల్స్ నెమ్మదిగా లేదా బలహీనంగా స్పందించిన సందర్భాల్లో మహిళా పేషెంట్ల కంటే మగవారిలోనే తీవ్రప్రభావం చూపడం తోపాటు మరణాలకు కారణమవుతున్నట్టుగా తాము జరిపిన పరిశోధనల్లో వెల్లడైందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వారు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. పేషెంట్లపై యేల్ పరిశీలన యేల్ న్యూహెవెన్ హాస్పిటల్లో స్వల్ప లక్షణాలతోపాటు ఒక మోస్తరు వ్యాధి సోకిన కోవిడ్–19 పేషెంట్లపై అధ్యయనం నిర్వహించారు. కోవిడ్–19 ఇన్ఫెక్షన్ల విషయంలో మహిళలు, పురుషుల్లో తేడాలున్నట్టు, పెద్ద వయసున్న మగవారు ఎక్కువగా ప్రభావితమైనట్టు సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ‘ఇమ్యూన్ రెస్పాన్స్’ అనేది లింగభేదాలపై ఎలాంటి ప్రభావం చూపుతోందన్న దానిపై మరింత లోతైన పరిశీలన నిర్వహించాల్సిన అవసరముందని అభిప్రాయపడుతున్నారు. కోవిడ్ పేషెంట్లలో రోగనిరోధక విధానం మహిళలు, పురుషుల్లో భిన్నంగా ఉన్నట్టు, ఈ కారణంగా మగవారిలో ఈ వ్యాధి తీవ్రత ప్రభావం ఎక్కువయ్యేందుకు అవకాశాలున్నట్టుగా వారు అంచనా వేస్తున్నారు. కరోనా బారిన పడని వారితోపాటు పాజిటివ్ రోగుల రక్తనమూనాలు, ముక్కులు, నోళ్లలోంచి ఇతర నమూనాలను సేకరించి వారిలో తొలుత రోగ నిరోధక స్పందనలు ఎలా ఉన్నాయి. వ్యాధి తీవ్ర దశకు చేరుకుంటున్నవారిలో, కోలుకుంటున్న వారిలో ఎలా ఉన్నాయన్న దాన్ని ఈ పరిశోధకులు పరిశీలించారు. ఇమ్యూన్ రెస్పాన్స్ భిన్నం వ్యాధి సోకిన తొలిదశల్లో మహిళలు, పురుషుల్లో ‘ఇమ్యూన్ రెస్పాన్స్’లు భిన్నంగా ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు. కోవిడ్ సోకిన సందర్భంగా వైరస్‌తో పోరాడి వాటి నిర్మూలనకు కృషి చేసే టీ–సెల్, తెల్లరక్తకణాల యాక్టివేషన్ రోగనిరోధక వ్యవస్థగా పురుషుల కంటే మహిళల్లోనే వేగంగా ఏర్పడుతున్నట్టు అంచనా వేస్తున్నారు. టీ–సెల్స్ స్పందన బలహీనంగా ఉన్న మగవారిలో కోవిడ్ తీవ్రత పెరగడంతోపాటు మృత్యువాత పడే పరిస్థితులు ఎదురుకావొచ్చని చెబుతున్నారు. వయసు పైబడిన మహిళల కంటే పురుషుల్లోనే టీ–సెల్ స్పందన తక్కువగా ఉందని కూడా ఈ పరిశోధనలో తేలింది. -
కరోనా వైరస్: ఆ విషయంలో మహిళలే బెటర్
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్‌ను నివారించేందుకు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. కాగా వైరస్‌ను తట్టుకునేందుకు రోగనిరోధకశక్తి చాలా కీలకమని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో పురుషుల కన్న మహిళలకే రోగనిరోధకశక్తి ఎక్కువని, అందువల్ల కరోనాను మహిళలు సులభంగా జయిస్తున్నారని యేల్ యూనివర్సిటీకి(యూఎస్ఎ) చెందిన నేచర్ జర్నల్ నివేదికలో తెలిపింది. కాగా కరోనాను ఎదుర్కొనే టీసెల్స్ మహిళలకు ఎక్కువగా ఉంటాయని నివేదిక పేర్కొంది. అయితే మానవుల్లో టీసెల్స్ సమృద్ధిగా ఉంటే క్రిమికారక వైరస్‌లను సులభంగా ఎదుర్కొంటాయి. అయితే పురుషుల్లో టీసెల్స్ నామమంత్రంగా పనిచేస్తున్నట్లు నివేదిక తెలిపింది. కాగా 98 మంది కరోనా బాధితులను పరీక్షించి నివేదికను రూపోందించారు. మరోవైపు రోగనిరోధక శక్తికి బలం చేకూర్చే సైటోకైన్స్ వ్యవస్థ మహిళల్లో అత్యద్భుతంగా పనిచేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. చదవండి: ఈ టెక్నిక్‌తో కరోనా వైరస్‌కు చెక్! -
బాలురే అధికం.. మరణాల్లోనూ పురుషులే..
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఉమ్మడి జిల్లాలో బాల, బాలికల నిష్పత్తి మధ్య భారీగా అంతరం కనిపిస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నమోదవుతున్న జనన, మరణాలు బాల, బాలికల నిష్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. పుడుతున్న వారిలో బాలురే అధికంగా ఉంటున్నట్లు సివిల్ రిజిస్ట్రేషన్ శాఖ వెల్లడించింది. ఆయా మున్సిపాలిటీలు, ప్రణాళిక శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా గణాంకాలను క్రోడికరించి ప్రతీ రెండు సంవత్సరాలకోసారి ఒక ఏడాదికి సంబంధించిన జనన, మరణాల లెక్కలను సివిల్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విడుదల చేస్తుంది. అందులో భాగంగా 2018 ఏడాదికి సంబంధించి గణాంకాలను తాజాగా ప్రకటించింది. ఈ లెక్కల ప్రకారం బాలికల కంటే బాలుర సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తేలింది. సివిల్ రిజిస్ట్రేషన్ శాఖ వివరాల ప్రకారం.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2018లో 75,344 మంది జన్మించగా, 10,596 మంది మరణించారు. అయితే, జన్మిస్తున్న వారిలో బాలురే అధికంగా ఉన్నారు. ఇటు మరణిస్తున్న వారిలోనూ మహిళల కన్నా పురుషులు అధికంగా ఉండటం గమనార్హం. అందుబాటులో ఉన్న 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లా జనాభా మొత్తం 25,43,647 కాగా, పురుషులు 12,46,875 మంది, మహిళలు 12,96,781 మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే జననాలు ఎక్కువ.. ఉమ్మడి జిల్లాలో 2018 సంవత్సరంలో మొత్తం 75,344 మంది జన్మించారు. ఇందులో 37,972 మంది బాలురు జన్మిస్తే, 36,154 మంది బాలికలు ఉన్నారు. అంటే బాలికల కంటే 1,818 మంది బాలురు ఎక్కువ జన్మించారు. గ్రామీణ ప్రాంతాల్లోనే జననాల సంఖ్యలో ఎక్కువ ఉంది. జీవన ప్రమాణాలు పెరగడం, కుటుంబ నియంత్రణ అమలు కాకపోవడంతో జననాల సంఖ్య ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. ఇక నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 2018 సంవత్సరంలో 10,596 మంది మృతి చెందారు. ఇందులో 4,939 మంది మహిళలుంటే, 5,657 మంది పురుషులున్నారు. మరణాల రేటులోనూ పురుషులే అధికంగా ఉన్నారు. శిశు మరణాలు కూడా ఎక్కువగానే సంభవించినట్లు సివిల్ రిజిస్ట్రేషన్ శాఖ వెల్లడించింది. 2018లో 480 శిశు మరణాలు నమోదైనట్లు పేర్కొంది. -
కరోనాకు భారతీయ మహిళలే ఎక్కువగా బలి!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో కరోనా బారిన పడిన వారిలో స్త్రీలకన్నా పురుషులు ఎక్కువగా మరణిస్తున్నారని మొన్నటి వరకు అంతర్జాతీయ విశ్లేషణలు తెలియజేశాయి. భారత్‌లో ఆ విశ్లేషణలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. కరోనా బారిన పడిన భారతీయ మహిళల్లో మృతుల సంఖ్య 3.3 శాతం ఉండగా, పురుషుల్లో మృతుల సంఖ్య 2.9 శాతం ఉంది. కరోనా బారిన పడిన మహిళల్లో 40 నుంచి 49 మధ్య వయస్కులే ఎక్కువ మంది మరణిస్తున్నారు. మృతుల్లో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండడానికి కారణం కూడా ఈ వయస్కులే. మిగతా వయస్కుల్లో స్త్రీలు ఎంత మంది మరణిస్తున్నారో, పురుషులు కూడా దాదాపు అంతే సంఖ్యలో మరణిస్తున్నారు. (కరోనా: రెమ్డిసివిర్ మొదట ఆ అయిదు రాష్ట్రాలకే) కరోనా బారిన పడుతున్న వారిలో పురుషులే ఎక్కువగా ఉంటున్నారు. అందుకని మొత్తంగా మరణాల సంఖ్యలో కూడా పురుషులే ఎక్కువగా ఉంటున్నారు. 2020, జనవరి 30, ఏప్రిల్ 30, జూన్ నెలాఖరు వరకు సేకరించిన డేటా ప్రకారం కరోనా వైరస్ వైద్య పరీక్షలు నిర్వహించిన పురుషుల్లో 3.8 శాతం మందికి పాజిటివ్ రాగా, మహిళల్లో 4.2 శాతం మందికి పాజిటివ్ వచ్చింది. కరోనా బారిన పడుతున్న వారిలో మహిళలు తక్కువగా, పురుషులు ఎక్కువగా ఉండడానికి సామాజిక కారణాలుకాగా, మృతుల్లో మహిళలు ఎక్కువగా ఉండడానికి ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయి. పురుషులు మిత్రుల వెంట తరచుగా విందు, వినోద కార్యక్రమాలకు హాజరవుతుండడం, పబ్‌లకు , బార్లకు వెళ్లడం, సామూహికంగా సిగరెట్లు తాగడం లాంటి సామాజిక కారణాల వల్ల పురుషులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. స్త్రీలలో ఎక్కువ మంది ఇళ్లకు పరిమితం అవడం వల్ల వారు ఎక్కువగా మృత్యువాత పడడం లేదు. అయితే కరోనా బారిన పడిన భారతీయ మహిళల్లో ఎక్కువ మంది మరణించడానికి కారణం పౌష్టికాహార లోపం, బలహీనతలే కారణం. కొంత మేరకు కరోనా బాధితుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ పీడితులు ఉండడం కూడా ఓ కారణం. భారత్‌లోని స్త్రీలలో 15–49 మధ్య వయస్కుల్లో 53.1 శాతం పౌష్టికాహార లోపం వల్ల బాధ పడుతున్నారని, అదే పురుషుల్లో, అదే వయస్కుల్లో 22. 5 శాతం మంది బాధ పడుతున్నారని ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే’ తెలియజేస్తోంది. (పతంజలి ‘కరోలిన్’పై పెను దుమారం) -
కరోనా: మగవాళ్లలోనే ఎందుకు మరణాలు ఎక్కువ?
సాక్షి, న్యూఢిల్లీ : చైనాలో కరోనా వైరస్ (కోవిడ్–19) బారిన పడి మరణిస్తున్న వారిలో స్త్రీలకన్నా పురుషులే ఎక్కువగా ఉంటున్నారని ‘గ్లోబల్ హెల్త్ 50–50 రిసర్చ్ ఇన్షియేటివ్’ మొదట్లో ప్రకటించింది. స్త్రీలకన్నా పురుషులే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు కనుక సహజంగా మరణాలు కూడా ఎక్కువగా వారివే ఉంటాయన్న వాదన వచ్చింది. పురుషులే ఎక్కువగా కరోనా బారిన పడడానికి సామాజిక కారణాలు ఉన్నాయి. స్త్రీలకన్నా పురుషులు ఎక్కువగా బయట తిరగడం, వారు సామూహికంగా సిగరెట్లు తాగడం, మందు కొట్టడం, స్త్రీలలాగా ఎప్పటికప్పుడు లేదా ఎక్కువ సార్లు శుభ్రంగా చేతులు కడుక్కోక పోవడం కారణాలు. జూన్ నాలుగవ తేదీ నాటికి అందుబాటులో ఉన్న కరోనా బాధితుల జాబితా నుంచి కరోనా బారిన పడిన ఎంత మంది స్త్రీలలో ఎంత మంది మరణిస్తున్నారో, కరోనా బారిన పడిన పురుషుల్లో ఎంత మంది మరణిస్తున్నారో ? అన్న అంశాన్ని వైద్య నిపుణులు విశ్లేషించగా పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారన్న విషయం సుస్పష్టంగా తేలింది. అన్ని వయస్కుల స్త్రీ, పురుషుల కేసుల్లో కూడా పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారు. అంటే 30 ఏళ్లు కలిగిన స్త్రీ, పురుషుల్లో, 80 ఏళ్లు కలిగిన స్త్రీ, పురుషుల్లో పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారు. (24 గంటల్లో 10,667 కేసులు.. 380 మరణాలు) మాస్ట్ కణాలు కారణమే పురుషుల్లోనే ఎందుకు ఎక్కువగా మరణిస్తున్నారు ? లేదా స్త్రీలే ఎందుకు ఎక్కువగా బతికి బయట పడుతున్నారు ? అందుకు సామాజిక, వైద్య కారణాలతోపాటు ఎక్కువగా లింగ పరంగా శారీరక నిర్మాణ వ్యవస్థలో ఉన్న తేడాలే కారణమని వైద్య పరిశోధనాంశాల ప్రాతిపదికగా స్పష్టమవుతోంది. స్త్రీ, పురుషుల రోగ నిరోధక శక్తిలో మాస్ట్ కణాలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. అంటురోగాలను ఎదుర్కోవడంలో మాస్ట్ కణాలు పురుషుల్లో కన్నా స్త్రీలలోనే ఎక్కువ క్రియాశీలకంగా పనిచేస్తాయి. మహిళలే ఎక్కువగా జలుబు, దగ్గు లాంటి అలర్జీలకు గురవుతుండడం వల్ల వారిలో మాస్ట్ కణాలు క్రియాశీలకంగా మారి ఉండవచ్చు. సెక్స్ హార్మోన్స్ పాత్ర స్త్రీ, పురుషుల్లో ఈస్ట్రోజెన్‌తోపాటు టెస్టోస్టెరోన్ అనే రెండు సెక్స్ హార్మోన్స్ ఉంటాయి. స్త్రీలలో ఈస్ట్రోజెన్లు ఎక్కువగా ఉంటే పురుషుల్లో టెస్టోస్టెరోన్‌లు ఎక్కువగా ఉంటాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్స్ ఎక్కువ సంఖ్య కారణంగా స్త్రీలలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంది. స్త్రీలలో రెండు రకాల ఎక్స్–క్రోమోజోమ్స్ ఉంటాయి. అందులో ఒక క్రోమోజోమ్‌లో రోగ నిరోధక శక్తిని పెంచాల్సిన జన్యువులు స్తబ్దుగా ఉంటాయి. దాంతో మరో కోమోజోమ్‌లోని జన్యువులు మరింత క్రియాశీలకంగా పని చేస్తాయి. అదే పురుషుల్లో ఉండే ఒకే ఒక్క ఎక్స్–క్రోమోజోన్‌లోని జన్యువులకు అంత శక్తి లేదు. సామాజిక, వైద్య కారణాలు స్త్రీలకన్నా పురుషులు ఎక్కువగా పాగ తాగడం, మద్యం సేవించడం, జబ్బును నిర్లక్ష్యం చేయడం, తద్వారా తక్షణమే వైద్య సేవలు అందుకోకపోవడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం పురుషల మరణాలకూ కారణం అవుతోంది. స్థూలకాయం, డయాబెటీస్, గుండె జబ్బుల్లో ఉన్న తేడాలు కూడా మరణాల మధ్య తేడాకు కారణం కావచ్చు. అమెరికాలోని ప్రతిష్టాకరమైన ‘నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్’ గత ఐదేళ్లలో జరిపిన పరిశోధనల ఫలితాల ప్రాతిపదికన అమెరికా ప్రొఫెసర్లు కరోనాపై ఈ అభిప్రాయలను వెలిబుచ్చారు. (నిత్యం లక్షకు తక్కువ కాకుండా కేసులు) -
భార్యల నుంచి కాపాడండి..
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘బాబోయ్..భార్యల గృహహింసను భరించలేకున్నాం..హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి రక్షించండి’..లాక్డౌన్ వేళ తమిళనాడులోని భర్తల గోడు ఇది. ఇళ్లకే పరిమితమైన భర్తలను భార్యల గృహహింస నుంచి కాపాడాల్సిందిగా తమిళనాడు పురుషుల రక్షణ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది అరుళ్ తమిళన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామికి ఒక వినతిపత్రం పంపారు. ఉత్తరంలోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘కరోనావైరస్ కారణంగా ఇంటికే పరిమితమైన మగవారి పరిస్థితి దయనీయంగా మారింది. భార్యల వల్ల ఎదుర్కొంటున్న గృహహింస భౌతికంగానే కాక మానసికంగా కూడా బాధపెడుతోంది. మహిళా సంరక్షణ, సంక్షేమ చట్టాలను చూపి భర్తలను బెదిరిస్తున్నారు. మరోవైపు గృహహింసకు పాల్పడే మగవారిని వెంటనే అరెస్ట్ చేస్తామని అదనపు డీజీపీ రవి విడుదల చేసిన ఒక ప్రకటన మగవారిని మరింత అవేదనకు గురిచేస్తోంది. మగవారి బాధలు తెలుపుకునేందుకు కనీసం ఒక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని అరుళ్ తమిళన్ అందులో పేర్కొన్నారు. -
ప్రతి పది మంది పురుషుల్లో ఒకరింతే..
న్యూయార్క్ : పురుషుల్లో సంతాన సాఫల్య సమస్యలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. ప్రతి పది మంది పురుషుల్లో ఒకరు తండ్రి అయ్యేందుకు సమస్యలు ఎదుర్కొంటున్నారని తాజా అథ్యయనం బాంబు పేల్చింది. తక్కువ వీర్యకణాల సంఖ్యతో పెద్దసంఖ్యలో పురుషులు సంతాన లేమితో సతమతమవుతున్నారని పేర్కొంది. ఈ లక్షణం పురుషుల్లో తర్వాతి దశల్లో క్యాన్సర్ రిస్క్కూ దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ చేపట్టిన సర్వేలో రెడ్, ప్రాసెస్డ్ మాంసాహారం, తీపి పానీయాలు, కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారాన్ని అధికంగా తీసుకునే పురుషుల్లో సగటు వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నట్టు తేలింది. వీరిలో వీర్యకణాల సంఖ్య సగటు 25.6 మిలియన్లు తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. సహజంగా సంతానోత్పత్తికి వీర్యకణాల సంఖ్య 39 మిలియన్లు ఉండాలని వారు తెలిపారు. మరోవైపు చాలామంది పురుషులు తల్లిగర్భంలో ఉన్నప్పుడే ఈ లోపంతో పుడుతున్నారని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తొలి నెలల్లోనే శిశువులు తండ్రులుగా మారే అవకాశాలు దెబ్బతింటున్నాయని, వారి పునరుత్పత్తి అవయవాలు ప్రతికూల ప్రభావానికి లోనవుతున్నాయనేందుకు ఆధారాలు లభించాయని చెబుతున్నారు. ఇది వీర్యకణాలు తగ్గడానికే పరిమితం కాదని, వారు వయసు పెరిగేకొద్దీ హృద్రోగాలు, క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. -
మగాళ్లు షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు..
ప్రపంచంలో ఆడవాళ్లతో పోలిస్తే మగవాళ్లే ఎక్కువ ఒంటరితనంతో బాధ పడుతున్నారు. ఇటీవల జరిపిన ఓ సర్వేలో బ్రిటన్ విషయంలో కూడా ఇదే రుజువైంది. అక్కడ ప్రతి ఐదుగురిలో ఒక పురుషుడు ఒంటరితనంతో బాధ పడుతున్నారు. సన్నిహిత మిత్రులు ఒక్కరు కూడా లేరని 18 శాతం మంది, మంచి మిత్రులే లేరని 32 శాతం మంది చెప్పగా, 12 శాతం మహిళలు సన్నిహిత మిత్రులు లేరని, 24 శాతం మంది మహిళలు మంచి మిత్రులు లేరని ‘యూగౌ’ జరిపిన సర్వేలో తెలిపారు. పిల్లల స్కూళ్లకు వెళ్లినప్పుడో, వారి కోసం క్రీడా క్లబ్బులు, మైదానాలకు వెళ్లినప్పుడు ఇతర పిల్లల తల్లులు తమకు ఎక్కువగా స్నేహితులు అవుతున్నారని తేలింది. ఈ విషయంలో తండ్రులకు ఎక్కువగా స్నేహితులు కావడం లేదు. కారణం వారు తరుచుగా పిల్లల కోసం స్కూళ్లకుగానీ స్పోర్ట్స్ క్లబ్బులకుగానీ వెళ్లకపోవడం. మగవాళ్లకు ఎక్కువగా ఆఫీసుల్లోనే స్నేహితులు అవుతున్నారు. అందుకనే వారిలో ఎక్కువ మంది పదవీ విరమణ తర్వాత ఒంటరితనంతో బాధపడాల్సి వస్తోంది. సమాజంలో పురుషులకన్నా మహిళలనే సోషల్ నెట్వర్క్ ఎక్కువగా ఉంటుందని, వారు జీవితాంతం కొత్తవారిని స్నేహం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని, అదే మగవాళ్లలో లేదని, వారితో మనకేం పనిలే అనుకోవడం అందుకు కారణమని బ్రిటన్‌లో ఒంటరితనాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తున్న పరిశోధనా సంస్థ డైరెక్టర్ రాబిన్ హెవింగ్స్ విశ్లేషించారు. పైగా మహిళలు సొంత విషయాలు మిత్రులు, కుటుంబాలతో పంచుకోవడానికి ఎక్కువ చొరవ చూపుతారని, అదే మగవాడు ఒంటరితనంతో బాధ పడుతున్న విషయాన్ని మరొకరితో పంచుకోవడానికి ఇష్టపడరని, అలా పంచుకోవడం ఆత్మ న్యూన్యతా భావంగా భావించడమేనని హెమింగ్స్ వివరించారు. కొత్త వారిని పరిచయం చేసుకోవాలనే ఉత్సాహం కూడా మగవాళ్లలో తక్కువ. అలాంటి ఉత్సాహం ఉన్న వాళ్లు కేవలం 18 శాతం మాత్రమేనని తేలింది. ఒంటరితనంతో బాధపడడం వల్ల జీవితం మీద విరక్తి పుడుతుంది. అది పెరిగితే బతుకు భారం అనిపిస్తుంది. ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. కొంతమంది ఆ తీవ్రమైన చర్యకు కూడా పాల్పడతారు. అందుకని పురుషుల్లో ఒంటరితనం పోవాలంటే పాత మిత్రులతో స్నేహాన్ని పునరుద్ధరించుకోవాలి. అందుకు నేడు సోషల్ మీడియా ఎంతగానో తోడ్పడుతుంది. ఉదయం పూట వాకింగ్ అలవాటు చేసుకొని అలా వచ్చేవారితో స్నేహం చేసుకోవాలి. లేదా పెంపుడు కుక్కలను అలా తిప్పడానికి తీసుకెళ్లినప్పుడు తోటి వాళ్లతో స్నేహం చేయాలి. వ్యాయామం లేదా ఇతర కాలక్షేప క్లబ్బుల్లో సభ్యత్వం తీసుకోవడం ద్వారా స్నేహాన్ని పెంచుకోవచ్చు. స్వచ్ఛంద సంస్థల్లో లేదా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలి. అన్నింటికన్నా ముందు ఇరుగు, పొరుగు వారితో స్నేహం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. -
వనమంత మానవత్వం
‘మన మధ్యే పెరగినా వాడికీ జీవితం ఉండాలి. మనుషుల మధ్య జీవించాలి’ అని అడవిలోని జంతువులన్నీ అనుకున్నాయి.‘మీలోనే మనుషులు కనపడుతున్నారు. నాకు మీరే జీవితం’ అని అడవిలోనే ఉండిపోయాడు మోగ్లీ.వనమంత మానవత్వాన్ని మన కళ్లకు కట్టింది ‘ది జంగిల్ బుక్’. మీరు 90ల కాలం నాటి పిల్లలా? అయితే, జంగల్ బుక్ అని పేరు వినగానే మీ చెవుల్లో ఓ పాట సందడి చేస్తుండాలి. ‘జంగిల్ జంగిల్ బాత్ చలీ హై పతా చలా హై... అరె చడ్డీ పెహన్‌కే ఫూల్ కిలాహై..’ అంటూ ఓ కుర్రాడు అటవీ జంతువులతో కలిసి చేసే విన్యాసాలూ కళ్ల ముందు మెదులుతూ ఉండాలి. ఆ విన్యాసాలను అప్పటి పిల్లలందరూ కళ్లప్పగించి చూశారు. ఇప్పటికీ కిడ్స్ చానెల్స్‌లో నాటి జంగిల్‌బుక్ వీరుడు మోగ్లీ అల్లరి చేస్తూనే ఉన్నాడు. 90 ల కాలంలో దూరదర్శన్‌లో ఏడాది పాటు వచ్చిన ఈ సీరియల్ అప్పటి పిల్లలకు ఓ మంచి ఫ్రెండ్ అయ్యింది. వన్యమృగాలున్న అడవిలో ఒంటరిగా ఒక పిల్లవాడు, ఆ పిల్లవాడు అక్కడి జంతువుల్లో ఒకడిగా పెరగడం.. అబ్బురంగా చూశారు. ఆ అటవీ ప్రపంచంలో తామూ తిరిగారు. వన్యప్రాణులతో దోస్తీ కట్టారు. ఆటలు ఆడారు. పాటలు పాడారు. నాటి–నేటి పిల్లల ప్రియనేస్తం మోగ్లీని మరో మారు పరిచయం చేసుకుందాం. మొట్టమొదటి యానిమేషన్ సీరియల్ అప్పట్లో పిల్లల కోసం ప్రత్యేక ఛానళ్లేవీ లేవు. పిల్లల కోసం ప్రత్యేకించి ప్రోగ్రాములూ లేవు. అప్పుడొచ్చింది జంగిల్‌బుక్. దూరదర్శన్‌లో సోప్ సీరియల్స్ స్టార్ట్ అయిన తొమ్మిదేళ్లకు ఎంటర్ అయ్యింది ఈ యానిమేషన్ సీరియల్. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు పిల్లలతో పాటు పెద్దలనూ తన ముందు కూచోబెట్టింది. మూలం రడ్ యార్డ్ ఆంగ్ల రచయిత్ రడ్ యార్డ్ కిప్లింగ్ జంగిల్‌బుక్ సృష్టికర్త. రడ్యార్డ్ ఇండియాలో పుట్టి, ఇంగ్లండ్‌లో పెరిగిన వ్యక్తి. 1894లో ‘ది జంగిల్ బుక్’ రాశాడు. ఈ పుస్తకం ఆధారంగా మోగ్లీ స్టోరీస్‌ను వాల్ట్ yì స్నీ అంతర్జాతీయంగా అన్ని దేశాలకూ పరిచయం చేసింది. 1989లో జపాన్‌లో మొదటిసారి వచ్చిన ఈ యానిమేషన్ సీరియల్ అదే సంవత్సరం హిందీ డబ్బింగ్‌తో మన దేశంలో ప్రసారమై ఎంతగానో ప్రాచుర్యం పొందింది. 52 ఎపిసోడ్లతో ఏడాది పాటు పెద్దలనూ, పిల్లలను అలరించింది ఈ సీరియల్. మోగ్లీ అనే పిల్లవాడి కథ చాలా చిన్నగా ఉన్నప్పుడు తల్లితండ్రి నుంచి తప్పిపోయి దట్టమైన అడవికి చేరుకుంటాడు మోగ్లీ. ఒకచోట పడి ఉన్న మోగ్లీని బగీరా అనే నల్ల పులి కనిపెడుతుంది. మోగ్లీని అకెలా, అలెగ్జాండర్ అనే తోడేళ్ల దగ్గరికి తీసుకెళ్తుంది బగీరా. అకేలాకి చిన్న చిన్నపిల్లలు ఉంటారు. తన పిల్లలతో పాటు మోగ్లీని కూడా పెంచుతుంటుంది. రోజూ తోడేలు పిల్లలతో ఆడుకుంటూ పెరుగుతుంటాడు మోగ్లీ. బగీరా అనే నల్ల పులి, బాలూ అనే ఎలుగుబంటి, కా అనే పైథాన్..లు మోగ్లీ స్నేహితులు. జంతువులతో ఆడుకుంటూ, జంతువుల మధ్య ఉండటంతో త్వరగానే అడవి జీవులతో కలిసిపోతాడు మోగ్లీ. ‘కా’ టీచర్‌గా మోగ్లీకి కొండలు, చెట్లు ఎక్కడం, ఊడలు పట్టుకొని ఊగడం.. వంటి ఎన్నో విషయాల్లో తర్ఫీదు ఇస్తుంది. ఒక రోజు అర్ధరాత్రి అడవిలోని జంతువులన్నీ గాఢనిద్రలోకి జారుకుంటాయి. రాత్రిపూట మనుషుల్ని తినే షేర్‌ఖాన్ అనే పులి అడవిలోకి చొరపడుతుంది. ముందుగానే పసిగట్టిన బగీరా మోగ్లీ గురించి ఆలోచిస్తుంది. అడవిలో ఉంచడం మంచిది కాదని, మనుషులున్న చోటుకు చేర్చాలని మోగ్లీని తీసుకొని బయల్దేరుతుంది. మోగ్లీని తినాలనే ప్రయత్నం చేస్తున్న షేర్‌ఖాన్ నుంచి బగీరా కాపాడుతుంది. ఒకానొక సమయంలో మోగ్లీకి అడవిలో గుర్తింపు సమస్య ఎదురవుతుంది. విలన్లయిన జంతువుల నుంచి ప్రమాదం ఉంటుందని, మనుషులు ఉన్న చోటుకి చేరుస్తామని మోగ్లీ స్నేహితులు చెబుతారు. ఎవరు ఎంత నచ్చజెప్పినా అడవిలోనే ఉంటానంటాడు మోగ్లీ. అడవి జంతువులతోనే జీవిస్తుంటాడు. ఆ తరం నుంచి ఈ తరం వరకు, హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూనే ఉంటుంది ది జంగిల్‌బుక్. మోగ్లీ వయసు సుమారు 6 నుంచి 10 ఏళ్ల మధ్యన ఉంటుంది. అడవిలో ఎన్నో సాహసవిన్యాసాలు చేస్తుంటాడు. మోగ్లీ పనులు ఒక్కోసారి ఆలోచించేలా, మరోసారి నవ్వు తెప్పించేలా ఉంటాయి. జంతువుల పట్ల ప్రేమగా ఉంటాడు. ఇవన్నీ ఆ వయసు పిల్లలను బాగా కట్టిపడేశాయి. పెద్దలను కూడా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. కల్మషం లేని ప్రేమకు ముగ్దులవనిది ఎవరు. ఒక్క మన దేశంలోనే కాదు, ‘ది జంగిల్ బుక్’ ప్రపంచ దేశాల్లోని పిల్లలందరికీ పరిచయమే. -
ఇది మా ఊరు
కోమల్ హదాలా... ఇరవై రెండేళ్ల అమ్మాయి. పేరుకు తగ్గట్టే కోమలంగా ఉంది. అంతే కోమలంగా ఓ సామాజికోద్యమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ‘ఇది మా ఊరు’ అంటూ గర్వంగా చెబుతోందిప్పుడు. కోమల్ మొదలు పెట్టిన విప్లవానికి తొలి అడుగు ఇంటి నుంచే పడింది. భర్త మీద ఒత్తిడి తెచ్చింది. అత్తకు, ఆడపడుచుకు నచ్చచెప్పింది. తన వాదనతో అత్తగారి అత్తగారిని కూడా మెప్పించింది. ఇంట్లో టాయిలెట్ కట్టాలనే ఆమె డిమాండ్ ఇంటితోనే ఆగిపోలేదు. ఊరంతటికీ టాయిలెట్లు వచ్చాయి. కోమల్ హదాలా ఢిల్లీలో పుట్టి పెరిగింది. పెళ్లితో ఉత్తరప్రదేశ్‌లోని నిథోరా గ్రామానికి వచ్చింది. ఆ మర్నాడే తెల్లవారి నాలుగు గంటల సమయంలో ఎవరో కుదుపుతూ ఉంటే మెలకువ వచ్చింది. ‘నిద్ర లేచి త్వరగా రా, అందరూ ఎదురు చూస్తున్నారు’ అని అత్తగారు నిద్రలేపారు. ఇంకా చీకటి వదల్లేదు, ఇప్పుడు లేవడం ఎందుకు, తన కోసం ఎదురు చూస్తున్నది ఎవరు... ప్రశ్నలను గొంతులోపలే మింగేసి అత్తగారి వెంట బయటకు వచ్చింది. పక్కిళ్ల మహిళలు, ఆ ఇంటి ఆడవాళ్లు కూడా సిద్ధంగా ఉన్నారు కొత్తకోడలి కోసం ఎదురు చూస్తూ. ‘చీకట్లో ఎక్కడికి’ అడిగింది. ‘మరి చీకటి వదలక ముందే వెళ్లి రావాల్సిన పనికి చీకటి వదిలాక వెళ్తావా’ పరాచికాలాడిందొకామె. ‘మగవాళ్లు నిద్రలేవక ముందే వెళ్లి రావాలి’ అంటూ మరొకామె హెచ్చరించింది. అంతా కలిసి కిలోమీటరు దూరానున్న పొలాల్లోకి వెళ్లారు. ఎక్కడ అడుగు పెడుతోందో తెలియట్లేదు కోమల్‌కి. కీచురాళ్ల రొద, తుప్పల్లో కాలు పెట్టాలంటే భయమేసింది. పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆమె భర్తను డిమాండ్ చేసింది. ‘ఇంట్లో టాయిలెట్ కట్టాల్సిందే’ అని. రెండంతస్తుల ఇంట్లో డబుల్ సిలిండర్ గ్యాస్ కనెక్షన్ ఉంది, వాటర్ ప్యూరిఫయర్ కూడా ఉంది. కానీ టాయిలెట్ మాత్రం లేదు. ఇంట్లో వాళ్లందరినీ తన వాదనతో సమాధానపరిచింది కోమల్. అనుకున్నది సాధించుకుంది. ఏడాది తిరిగే సరికి ఊళ్లో 250 టాయిలెట్లు కట్టించింది. ఎలా సాధ్యమైంది? అందరూ కలిసి గ్రామపెద్ద చహాత్ రామ్‌ను కలిశారు. టాయిలెట్ కట్టుకుంటామని వచ్చిన వాళ్లను చూసేసరికి చహాత్ రామ్‌కు ప్రాణం లేచి వచ్చింది. ప్రభుత్వం నుంచి నిధులున్నాయి. ప్రతి ఇంటికీ కట్టించమనే ఆదేశమూ ఉంది. ఎంత చెప్పినా టాయిలెట్ కట్టించుకోవడానికి ముందుకు వచ్చే వాళ్లే కరువయ్యారు. ఒక అమ్మాయి అలా చొరవ చూపడంతో గ్రామ పెద్ద ఆ అవకాశాన్ని వదులుకోలేదు. ఆ అమ్మాయితోనే మిగిలిన ఆడవాళ్లకు నచ్చ చెప్పిస్తే పనవుతుందనుకున్నాడు. పైగా నగరం అమ్మాయి, చదువుకున్న అమ్మాయి. తెలివితేటలతో ఊరిని ఒక తాటి మీదకు తెస్తుందని ఆశించాడు. అలా కోమల్ తన ఇంటి నుంచి మొదలు పెట్టిన టాయిలెట్ విప్లవాన్ని ఊరంతటికీ విస్తరించింది. మహిళలందరినీ కూర్చోబెట్టి తెల్లవారు జామున నాలుగింటికి, రాత్రి తొమ్మిది తర్వాత పొలాల్లోకి వెళ్లడం వల్ల మహిళలకు ఎదురయ్యే ప్రమాదాల గురించి హెచ్చరించింది. బహిరంగ విసర్జన వల్ల వచ్చే అనారోగ్యాలను వివరించింది. ప్రమాదాలు వాళ్లకు అర్థమయ్యాయి, కానీ బహిరంగ విసర్జన అనారోగ్యాలకు ఎలా కారణమవుతుందో వాళ్లకు ఎంత చెప్పినా అర్థం కాలేదు. స్కూలు పిల్లలను సమీకరించింది, వాళ్ల పుస్తకాల్లో ఉన్న పాఠాలను పెద్దవాళ్లకు అర్థమయ్యేలా చెప్పింది. మొత్తానికి ఊరందరి చేత మరుగుదొడ్డి కట్టించింది కోమల్. కట్టించడం వరకు ఓకే! ఊరందరినీ సమాధాన పరిచి ఇంటింటికీ టాయిలెట్ కట్టడం పూర్తయింది. కానీ వాటిని వాడుకలోకి తేవడం మరో ఘట్టమైంది. టాయిలెట్ గదుల్లో సామాను భద్రపరిచారు కొందరు. ‘అది ఆడవాళ్ల కోసం, మగవాళ్లం మేమెందుకు వాడాలి’ అని వాదించారు మరికొందరు. చివరికి బహిరంగంగా విసర్జన చేసే వాళ్లను పిల్లల చేత విజిల్ ఊదించి ఎగతాళి చేయించడం అనే టెక్నిక్ పూర్తి ఫలితాలనిచ్చింది.‘మోదీ ప్రభుత్వం టాయిలెట్ ఫస్ట్, టెంపుల్ లేటర్.. అనే నినాదంతో 2014 నుంచి తొమ్మిది కోట్లకు పైగా టాయిలెట్లను కట్టించినప్పటికీ, ఆ స్ఫూర్తితో మా నిథోరాలో ఒక్కటీ కట్టించలేకపోయాను. కోమల్ తెచ్చిన విప్లవంతోనే ఇది సాధ్యమైంది’ అని ప్రశంసించాడు గ్రామపెద్ద. – మంజీర -
అభేదాన్ని తెలిపేదే అద్వైతం
సమస్త జీవరాశుల్లో ఆత్మను సందర్శించగల జీవి కేవలం మానవుడు మాత్రమే. మనకు తెలిసినంత వరకూ ఆత్మ పరిణామ క్రమంలో మానవునిది ఒకానొక ఉత్కృష్ట స్థాయి. మానవుడు తన దేహంలో ఉన్న మనసును ఆసరాగా చేసుకుని మాత్రమే ఆత్మను సందర్శించగలడు. దేహం అనేదొక ఒక పదార్థం. ఈ పదార్ధం, ఆత్మ లేక అనంతశక్తి పరిణామం చెందగా ఏర్పడింది. అంతర్లీనంగా చూస్తే పదార్థమే శక్తి, శక్తే పదార్థం. అదే అభేదం, ఆ అభేదాన్ని తెలిపేదే అద్వైతం. ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడమే ‘ప్రజ్ఞానం బ్రహ్మ’. పంచభూతాల మేలిమి సమ్మేళనమైన శరీరం చైతన్యరాహిత్యం అయినప్పుడు మాత్రమే తిరిగి పంచభూతాల రూపంలోకి మారడం ప్రారంభిస్తుంది. శరీరం స్త్రీపురుషుల సంగమంతో పిండరూపంగా ప్రారంభమవుతుంది. ఐతే, ఇక్కడ సూక్ష్మమైన రూపంలో ఉన్న పిండం మానవ ఆకృతిని ఎలా పొందుతుందనే ప్రశ్న వేసుకుంటే, తల్లి తీసుకునే ఆహారం ద్వారా అనే జవాబు వస్తుంది. తల్లి స్వీకరించే ఆహారపదార్థాలన్నీ ప్రకృతిలో రూపుదిద్దుకున్నాయి. అంటే శక్తి రూపాలైన పంచభూతాలు అనుకూల పరిస్థితుల్లో అత్యద్భుతంగా కలిస్తే ఏర్పడేదే జీవపదార్థం. తొలుత బీజరూపంగా ఉన్న పదార్థం, ఇతర జీవపదార్థాలను స్వీకరించి వివిధ పూర్ణరూపాలుగా పరిణమిస్తాయి. బీజరూపంగా ఏర్పడినది మొదలుకుని, చైతన్యరహితంగా ఏర్పడే వరకూ ఆ పదార్థాన్ని ప్రాణిగా చూస్తాం. ప్రయాణం మొత్తాన్ని జీవ ప్రయాణంగా పరిగణిస్తాం. ఈ ప్రయాణం ప్రారంభమవడమంటే, అనంతశక్తి లేక ఆత్మలో కొంత భాగం జీవశక్తిగా మారటమే. అందుకే, ‘ఛాందోగ్యోపనిషత్తు’ ఈ దేహాన్ని భగవంతుడు నివసించే పురం(బ్రహ్మ పురం)గా అభివర్ణించింది. ఆత్మ శరీరరూపంలోకి మారి, నివసించే గృహం ఈ దేహం. మరణానంతరం ప్రాణం ఏమవుతుందని నచికేతుడనే జ్ఞానపిపాసి, యముడు అనే జ్ఞానిని ప్రశ్నిస్తాడు. అందుకు ఆ జ్ఞాని, ఒకే అగ్ని ప్రపంచంలో వివిధ ఆకృతుల్లో ఏవిధంగానైతే విరాజిల్లుతుందో, ఒకే వాయువు వివిధ ఆకృతులలో ఏవిధంగానైతే పరిఢవిల్లుతోందో, అలాగే ఆత్మ వివిధ జీవుల్లో ఆయా ఆకృతుల్లో విరాజిల్లుతుందని ‘కఠోపనిషత్తు’లో తెలుపుతాడు. – రావుల గిరిధర్ -
సంసార బంధానికి నీళ్లొదిలారు..
వారణాసి : సమాజం తమపట్ల ప్రదర్శిస్తున్న వివక్షను నిరసిస్తూ ఫెమినిజానికి వ్యతిరేకంగా పురుష సమాజం సభ్యులు ఇక్కడి మణికర్ణికా ఘాట్‌లో వివాహ బంధానికి శాస్ర్తోక్తంగా వీడ్కోలు పలికారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన 150 మంది పురుషులు ఘాట్ వద్ద భేటీ అయ్యారు. పవిత్ర గంగా నదిలో మునిగి తమ వైవాహిక సంబంధాలకు ముగింపు పలికారు. పురుషులు మహిళలకు సంరక్షకులుగా, వారికి సకల సౌకర్యాలను సమకూర్చే యంత్రాలుగా ఉన్న ప్రస్తుత సంప్రదాయ సమాజంలోకి తాము తిరిగి వెళ్లదలుచుకోలేదని ఈ కార్యక్రమానికి హాజరైన సామాజిక కార్యకర్త అమిత్ దేశ్‌పాండే పేర్కొన్నారు. తాము సమానత్వాన్ని కోరుతున్నామని, కానీ ప్రస్తుత ఫెమినిజం అందుకు అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పురుషుల పట్ల వివక్షకు తాము నీళ్లొదిలామని చెప్పారు.తాము పురుషుల హక్కుల కోసం పోరాడుతున్నామని, స్త్రీవాద ఉద్యమంతో పలు కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, తాము సమానత్వాన్ని కోరుతున్నామని సేవ్ ఇండియన్ ఫ్యామిలీ, దామన్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన అనుపమ్ దూబే అన్నారు. దేశవ్యాప్తంగా వరకట్న వేధింపులు, లైంగిక వేధింపుల పేరుతో పురుషులపై తప్పుడు కేసులు నమోదవుతున్నాయని, మధ్యప్రదేశ్‌లో ఈ తరహా కేసులు ఎక్కువగానమోదయ్యాయ ని ఆవేదన వ్యక్తం చేశారు. -
మహిళ అంటే.. మరింత పొదుపు!!
మగ, ఆడ తేడా లేకుండా ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కాకపోతే ఆర్థిక అవసరాల పరంగా చూస్తే పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగులకే ఇవి ఎక్కువనేది నిపుణుల మాట. పురుషులతో పోలిస్తే తక్కువ వేతనం, సగటు ఉద్యోగ కాలం తక్కువగా ఉండటం, జీవన కాలం ఎక్కువగా ఉండటం వంటి అంశాలను దీనికి కారణాలుగా వారు చెబుతున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవన అవసరాల కోసం ఎక్కువగా పొదుపు చేయాల్సిన అవసరం మగవారితో పోలిస్తే మహిళలకే ఉంటుంది. జీవిత భాగస్వామి ఉన్నప్పటికీ ఆర్థికంగా స్వతంత్రులైన మహిళలు జీవిత లక్ష్యాలు, అవసరాల విషయంలో ఓ ప్రణాళిక వేసుకుని దాన్ని ఆచరణలో పెట్టడం శ్రేయస్కరమనేది ఆర్థిక నిపుణుల సూచన. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం మనదేశంలో స్త్రీ, పురుషుల మధ్య వేతన చెల్లింపుల్లో వ్యత్యాసం 20 శాతం మేర ఉంటోందని ‘మాన్స్టర్’ శాలరీ ఇండెక్స్ సూచిస్తోంది. మధ్య స్థాయిలో చూస్తే పురుషులు సగటున ఓ గంట పనికి రూ.231 పొందుతుంటే, మహిళలకు లభిస్తున్నది రూ.184.80 మాత్రమే. ఇక అనుభవం పెరుగుతున్న కొద్దీ ఈ అంతరం ఇంకా అధికమవుతోంది. ఏడేళ్ల సీనియారిటీ కలిగిన వారి మధ్య అంతరం 7.8 శాతం అయితే, 11 ఏళ్లు అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న స్త్రీ, పురుషుల మధ్య వేతనం చెల్లింపుల్లో అంతరం 25 శాతంగా ఉండటం గమనార్హం. ఈ గణాంకాలను చూసిన తర్వాతయినా మహిళలు తమ అవసరాలపై కొంచెం అధిక శ్రద్ధ వహించక తప్పదు. అందుకే వీరు పురుషులతో పోలిస్తే అదనంగా పొదుపు, మదుపు చేయడం అవసరం. ఉద్యోగ కాలం కూడా తక్కువే... పై గణాంకాలను చూస్తే మహిళలకు తక్కువ వేతనాలు వస్తున్నాయని అర్థమవుతోంది. అలాగే, మహిళల ఉద్యోగ కాలం కూడా పురుషులతో పోలిస్తే తక్కువే. ఎందుకంటే పిల్లల సంరక్షణ కోసం మధ్యలో విరామం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సగటున కనీసం ఓ ఏడేళ్ల పాటు వారు ఉద్యోగానికి దూరంగా ఉంటారు. అంటే ఆ కాలంలో వారు పొదుపు, పెట్టుబడులు చేయలేరు. అంతకాలం పాటు సీనియారిటీ కూడా కోల్పోయినట్టుగానే భావించాలి. దీంతో తిరిగి ఉద్యోగంలో చేరితే వారికొచ్చే వేతనం తక్కువగా ఉంటుంది. దీనివల్ల పదవీ విరమణ సమయంలో వారికొచ్చే ప్రయోజనాల్లోనూ ఆ మేరకు కోత పడుతుంది. జీవన కాలం.. కాస్త అధికం పురుషులతో పోలిస్తే మహిళల సగటు జీవన కాలం కొంచెం ఎక్కువ. మహిళల సగటు జీవన కాలం 70 ఏళ్లు, మగవారి సగటు జీవన కాలం 67గా అంచనా. అంటే రిటైర్ అయిన తర్వాత మహిళలకు ఎక్కువ కాలం పాటు జీవన అవసరాలు ఉంటాయి. దాంతో వారికి అధిక నిధులు అవసరం అవుతాయి. కొందరు ఇంకా దీర్ఘకాలం పాటు జీవించొచ్చు. అప్పుడు ఆ అవసరాలు ఇంకా ఎక్కువ అవుతాయి. వైద్య సంరక్షణ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితుల్లో నిధుల అవసరం ఎంతో ఉంటుంది. మరింత పొదుపు చేయాల్సిందే.. మహిళలు మగవారితో పోలిస్తే కనీసం రెట్టింపు పొదుపు చేయాలి. విశ్రాంత జీవనం కోసం వేతనంలో 10 శాతానికి బదులు 20– 25 శాతం వరకూ ఇన్వెస్ట్ చేయాలనేది ఫైనాన్షియల్ ప్లానర్ పంకజ్ మాల్దే సూచన. ఒకవేళ ఉద్యోగం వచ్చిన కొత్తలో అవసరాలకు అధికంగా ఖర్చవుతూ పొదుపు చేయలేకపోతుంటే బ్యాంకు ఖాతా నుంచి పెట్టుబడులకు వెళ్లేలా ఈసీఎస్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అలాగే, ప్రావిడెంట్ ఫండ్‌లో మరింత ఇన్వెస్ట్ చేయాలి. ఇందుకోసం వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్‌ను ఎంచుకోవచ్చు. అంటే ఉద్యోగి తన ఈపీఎఫ్ వాటాకు సొంతంగా మరికొంత జోడించడం. దీనివల్ల మీ వేతనం నుంచి ఆటోమేటిగ్గా భవిష్యనిధికి జమ అవుతుంది. దీనిపై ఈపీఎఫ్‌కు సమానంగా వడ్డీ రేటు, పన్ను ప్రయోజనాలు లభించడం అదనపు ఆకర్షణ. మెరుగ్గా ఇన్వెస్ట్మెంట్... పొదుపు చేయడంతోనే ఆగిపోతే లాభం ఉండదు. తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి. దీర్ఘకాల లక్ష్యాల కోసం డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం తక్కువ పొదుపు చేయడం కంటే ప్రమాదమన్నది ఆర్థిక సలహాదారుల మాట. తక్కువ భాగమే డెట్‌లో ఇన్వెస్ట్‌చేసి అధిక భాగాన్ని ఈక్విటీ లేదా బ్యాలన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా, దీర్ఘకాలంలో డెట్ కంటే అధిక రాబడులను పొందొచ్చు. ఇంకో విషయం మీ లక్ష్యానికి తగ్గట్టుగానే ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. రిటైర్మెంట్కు ఎంత అవసరం అన్నది లెక్కవేసుకోవాలి. ద్రవ్యోల్బణం, పన్ను పరమైన అంశాల ప్రభావాన్ని విశ్లేషించిన తర్వాత ఆ మేరకు ఇన్వెస్ట్ చేయాలి. హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి... ఇక రిటైర్మెంట్ నిధి కరిగిపోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యమైనది వైద్య బీమా పాలసీ ఒకటి. వైద్య ఖర్చుల విషయంలో ద్రవ్యోల్బణం 12–15 శాతంగా ఉంటోంది. వృద్ధాప్యంలో జీవనశైలి వ్యాధుల ముప్పు పెరిగిపోతోంది. అందుకని పెద్ద వయసులో వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉండచ్చు. బీమా పాలసీ ఉంటే విశ్రాంత జీవన అవసరాల కోసం కష్టపడి కూడబెట్టిన నిధులు కరిగిపోకుండా ఉంటాయి. మెరుగైన వేతనం... ఇక ఉద్యోగంలో ఎదుగుదల చూసుకోవడం కూడా ముఖ్యమైన అంశాల్లో ఒకటి. అధిక వేతనం కోసం ఉద్యోగం మారడం, ఎదుగుదల లేని సంస్థను వీడటం ద్వారా అధిక ఆర్జనకు బాటలు వేసుకోవచ్చు. ఎక్కువ ఆర్జన ఉంటే పొదుపు, మదుపులకు ఎక్కువ కేటాయించుకోవచ్చు. ఇక రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక ఉద్యోగంలో కొనసాగడం అవసరమవుతుంది ఈ రోజుల్లో. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత కనీసం 15–20 ఏళ్ల పాటు జీవన కాలం ఉంటోంది. -
మగవారికి మద్యం మంచిదే !
రోమ్ : పురుషులు తగిన మోతాదులో మద్యం తీసుకోవటం వల్ల వీర్యోత్పత్తి మెరుగ్గా ఉంటుందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. వీర్యోత్పత్తి, వీర్యకణాల సంఖ్యను మద్యం ప్రోత్సహిస్తుందని తేలింది. 323మంది రోగులపై జరిపిన ఈ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. మద్యం తాగని వారిలో కంటే.. వారానికి 4-7యూనిట్ల మద్యం తీసుకున్న వారిలో వీర్యోత్పత్తి బాగా ఉన్నట్లు గుర్తించారు. ఇటలీకి చెందిన పోలీక్లినికో ఆస్పత్రి వైద్యుడు ‘‘ఎలెనా రిచి’’ మాట్లాడుతూ.. చిన్న చిన్న మోతాదుల్లో మద్యం సేవించేవారిలో వీర్యోత్పత్తి చక్కగా ఉంటుందన్నారు. అతిగా మద్యం సేవించటం వల్ల అది విషంగా మారుతుందన్నారు. మద్యం ఎక్కువగా సేవించే మగవారిలో వీర్యోత్పత్తి క్షీణించటమే కాకుండా వ్యంధత్వం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. -
అబ్బాయిలూ జాగ్రత్త!
తమతో హోమో సెక్స్‌లో పాల్గొనలేదని ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని తోటి యువకులు చెట్టుకు కట్టేసి కొట్టి చంపారు. కర్నూలు నగరంలోని కొత్తపేటకు చెందిన 8 ఏళ్ల బాలుడిపై స్థానికంగా ఉండే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ రెండు సంఘటనలపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కానీ ఇలాంటి సంఘటనలు సమాజంలో ప్రతి చోటా రోజూ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఫిర్యాదు చేయడానికి 99 శాతం ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ కారణంగా దాడికి పాల్పడిన వారు యథేచ్ఛగా ఈ సమాజంలో తిరుగుతూ మరికొన్ని అఘాయిత్యాలు చేస్తున్నారు. సమాజంలో అమ్మాయిలపైనే కాదు అబ్బాయిలపైనా లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. సాక్షి, కర్నూలు(హాస్పిటల్): సమాజంలో అమ్మాయిలపై దాడులు జరిగితే గతంలో ఫిర్యాదులు చేయడానికి తల్లిదండ్రులు ముందుకు వచ్చేవారు కాదు. ఈ విషయం పది మందికి తెలిస్తే ఆడపిల్లకు పెళ్లి కాదని, సమాజం చీత్కరించుకుంటుందని భయపడేవారు. దాడి కంటే సమాజంలో ప్రతి ఒక్కరూ చూసే చూపులు, అడిగే ప్రశ్నలు వారిని మరింత కుంగుబాటుకు గురిచేసేవి. అయితే ఇటీవల కాలంలో చట్టాలపై అవగాహన పెరగడంతో కొంత మంది ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ విషయంలో అమ్మాయి పేరు, ఆమె తల్లిదండ్రుల పేర్లను బహిర్గతం చేయకపోవడంతో ఫిర్యాదులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు పెరిగాయి. ఇందుకు తగ్గట్లు నేరం రుజువైతే నిందితులకు శిక్షలూ పడుతున్నాయి. అయితే నేరం చేసిన వారు పలుకుబడి గల వారైతే మాత్రం చేసిన తప్పు నుంచి యథేచ్ఛగా తప్పించుకుంటున్నారన్న భావన ఇప్పటికీ ప్రజల్లో ఉంది. ఇప్పుడు అబ్బాయిలపైనా లైంగిక దాడులు జరుగుతున్నాయి. చిన్నపిల్లల నుంచి యువకుల వరకు ఈ దాడులు కొనసాగుతున్నాయి. అది కూడా మెతకవైఖరి ఉన్న వారిపైనే అధికంగా దాడులు జరుగుతున్నాయి. లైంగిక దాడి జరిగిన విషయాన్ని చాలా మంది పిల్లలు భయంతో ఇంట్లో చెప్పడం లేదు. వారి ప్రవర్తనను బట్టి తల్లిదండ్రులు కనుక్కొని సదరు వ్యక్తిని కొట్టడమో, తిట్టడమో చేసి వస్తున్నారు తప్ప పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. దీనికి కారణం పరువు పోతుందన్న భయం వారిని వెంటాడుతోంది. ఫిర్యాదు చేసిన తర్వాత సమాజంలో తిరిగే టప్పుడు ‘మీ అబ్బాయికి ఇలా జరిగిందట కదా’ అని ఇరుగుపొరుగు వారు, బంధువులు అనే మాటలకు తట్టుకోలేమని వారు వెనక్కి తగ్గుతున్నారు. కర్నూలుకు చెందిన విష్ణుతేజ అనే యువకుడు మగ పిల్లలపై జరుగుతున్న దాడులను చూసి తట్టుకోలేక, ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించక పోవడంతో ఏకంగా రాష్ట్రపతికి లేఖ రాశాడు. ‘దాడులు చూసే ఓపిక నాకు లేదు.. నన్ను నొప్పి లేకుండా చంపేయండి’ అంటూ వేడుకున్నాడు. దీంతో జిల్లా అధికారులు కదిలారు. అతనితో మాట్లాడి ఫిర్యాదులకు స్పందిస్తామని హామీ ఇస్తున్నారు. అరచేతిలో అశ్లీలత.. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత పెద్దలు, పిల్లలు అతిగా వినియోగిస్తున్నారనడంలో సందేహం లేదు. సోషల్ మీడియా, ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. కొందరు యువకులు విచ్చలవిడిగా సెల్ఫోన్లో అశ్లీలత వీడియోల వీక్షిస్తున్నారు. ఈ కారణలతో లైంగిక దాడుల ఆలోచనలు వస్తుంటంతో ప్రతిఘటించలేని వారిపైనే దాడులు జరుగుతున్నాయి. అమ్మాయిలపైనే గాక అబ్బాయిలపైనా విశృలంఖ దాడులు చేస్తున్నారు. అమ్మాయిల విషయాలు ఎలా గోలా బయటకు వస్తాయి, కానీ అబ్బాయిల విషయంలో బయటకు రావడం లేదు. పిల్లలు సెల్ ఫోన్ వినియోగించే సమయంలో ఎటువంటి సైట్లు చూస్తున్నారనే విషయంపై తల్లిదండ్రులు దృష్టి సారించకపోతే పిల్లల భవిష్యత్‌లో అంధకారం అలుముకునే అవకాశం ఉంది. అలాగే చుట్టు పక్కల ఉండే యువకుల ప్రవర్తనపై చిన్నారుల తల్లిదండ్రు లు ఓ కన్నేసి ఉండాల్సిన అవసరం ఉంది. మంచి స్పర్శ.. చెడు స్పర్శ మంచి స్పర్శ...చెడు స్పర్శ (గుడ్ టచ్, బ్యాడ్ టచ్)కు సంబంధించి పిల్లలకు తేడా తెలిసి ఉండాలి. ఈ మేరకు వారికి తల్లిదండ్రులతో పాటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి. దుస్తులతో దాచిన శరీర భాగాలను వేటిని స్పర్శించినా అది లైంగిక దాడి కిందకే వస్తుంది. పిల్లల విషయంలో అది ఆడైనా, మగైనా నేరమే. పిల్లలను చెడు ఉద్దేశంతో స్పర్శించినా, పిల్లలకు అంగాలను చూపించినా, ప్రదర్శించినా నేరమే. దీనికి మూడు నుంచి ఏడేళ్ల వరకు శిక్షలు ఉంటాయి. గతంలో దాడికి గురైన వారే ఇలా చేస్తున్నారు గతంలో లైంగిక దాడికి గురైన వారే పెద్దయ్యాక ఇతరులపై అలాంటి దాడులకు దిగుతున్నారు. నేను 6వ ఏట, ఆ తర్వాత 8, 9, 10 తరగతుల్లో వేధింపులకు గురయ్యాను. నాతో పాటు సమాజంలో చాలా మంది పిల్లలు లైంగిక దాడులకు, వేధింపులకు గురవుతున్నారు. ఈ విషయమై నేను పలు మార్లు పోలీసులకు, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. వారు స్పందించకపోవడంతో రాష్ట్ర ఉన్నతాధికారులకు, మహిళా కమిషన్ చైర్మన్‌కు, తాజాగా రాష్ట్రపతికి సైతం లేఖ రాశాను. నా లేఖకు స్పందించి జిల్లా కలెక్టర్ నన్ను పిలిపించారు. నా పోరాటానికి సపోర్ట్‌గా ఉంటారనని చెప్పారు. ఆయనే కాదు డీఎస్పీ, ఎస్ఐ, జువైనల్ హోమ్ సూపరింటెండెంట్ కూడా నాకు ఫోన్ చేసి ధైర్యాన్నిచ్చారు. – విష్ణుతేజ, బాధితుడు, కర్నూలు పిల్లలపై లైంగిక దాడి చేస్తే కఠిన శిక్ష ప్రొటెక్షన్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 ప్రకారం అమ్మాయిలు, అబ్బాయిలపై లైంగిక అత్యాచారానికి పాల్పడితే శిక్షార్హులు. దాడి తీవ్రతను బట్టి మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు, కొన్నిసార్లు జీవితఖైదు కూడా పడే అవకాశం. అయితే లైంగిక దాడికి గురైన వారిని 24 గంటల్లో వైద్యుని వద్దకు తీసుకెళ్లి పరీక్ష చేయించాలి. వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలి. సరైన ఆధారాలు చూపించగలిగితే నేరస్తులు తప్పించుకోలేరు. – రామ్మోహన్‌రెడ్డి, జువైనల్ హోమ్ సూపరింటెండెంట్ బాధితులకు కౌన్సిలింగ్ తల్లిదండ్రులు వలస వెళ్లిన సమయంలో, పిల్లలు వసతి గృహాల్లో ఉండే సమయాల్లో, పేరెంట్ నిఘా లేనప్పుడు మగ పిల్లలపై కూడా లైంగిక దాడులు జరుగుతుంటాయి. దాడికి గురైన పిల్లలను కౌన్సిలింగ్ ద్వారా ఆ సంఘటన తాలూకు బాధ నుంచి బయటకు తీసుకురావచ్చు. దాడి వల్ల మరింత భయాందోళనకు గురై డిప్రెషన్లో ఉన్న వారికి కౌన్సిలింగ్‌తో పాటు మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాడికి గురైన పిల్లల్లో అపరాద భావం పోగొట్టే బాధ్యతను ఇటు వైద్యులతో పాటు అటు తల్లిదండ్రులు, పెద్దలు తీసుకోవాల్సి ఉంటుంది. – డాక్టర్ కాటం రాజశేఖర్‌రెడ్డి, మానసిక వ్యాధుల నిపుణులు, కర్నూలు పాఠశాల నుంచే పిల్లలకు అవగాహన పెంచాలి గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌ల గురించి పిల్లలకు పాఠ శాల దశ నుంచే అవగాహన పెంచాలి. సూర్యరశ్మి తగలని భాగాలను ఎవరైనా తాకినట్లు తెలి స్తే వెంటనే పెద్దలకు చెప్పే విధంగా ఉండాలి. అమ్మాయిలు, అబ్బాయిల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. లైంగిక దాడులు అబ్బాయిలపై వసతి గృహాలు, జువైనల్ హోమ్స్, కారాగారాల్లో అబ్బాయిలు, మగవారిపై ఎక్కువగా జరుగుతుంటాయి. విష్ణుతేజ ఒక్కరే కాదు ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ వెలుగులోకి తీసుకురావాలి. – డాక్టర్ జేవీవీఆర్‌కే ప్రసాద్, డీఎంహెచ్ఓ, కర్నూలు -
పురుషులకే ఆ ముప్పు అధికం
లండన్ : మహిళలతో పోలిస్తే గుండె జబ్బులతో మరణించే అవకాశాలు పురుషుల్లో 64 శాతం అధికమని తాజా అథ్యయనం పేర్కొంది. డిలేటెడ్ కార్డియోమయోపతి కారణంగా మహిళల్లో మరణాలు అతితక్కువగా ఉన్నాయని, పురుషుల్లో ఈ ముప్పు అధికమని ఆ అథ్యయనం వెల్లడించింది. గుండె కండరాలు పెళుసుబారి శరీరానికి రక్తసరఫరా చేసే సామర్థ్యం కోల్పోయే ప్రమాదం కూడా పురుషుల్లో అధికమని ఈ సర్వే పేర్కొంది. గుండె కండరాలు పెళుసుగా మారి శరీరానికి అవసరమైన రక్తాన్ని సరఫరా చేసే సామర్థ్యం తగ్గడాన్ని మహిళల హార్మోన్లు సమర్థంగా నివారిస్తాయని పరిశోధకులు చెప్పారు. తమ పరిశోధనలో వెల్లడైన అంశాలు నూతన చికిత్సా పద్ధతులకు దారితీస్తాయని వారు పేర్కొన్నారు. డిలేటెడ్ కార్డియోమయోపతి వ్యాధి ఇటీవల ప్రబలంగా ఎదురవుతూ ఏటా వేలాదిమంది మృత్యువాతకు గురవుతున్నారని ఈ అథ్యయనం వెల్లడించింది. ఈ వ్యాధితో ఐదేళ్లుగా బాధపడుతున్న 591 మంది పురుషులు, 290 మంది స్ర్తీల వైద్య రికార్డులను ఇంపీరియల్ కాలేజ్ లండన్ పరిశోధకులు విశ్లేషించారు. ఈ వ్యాధితో బాధపడే వారిలో మహిళా హార్మోన్లు వ్యాధి తీవ్రత నుంచి రోగులను కాపాడటంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయనే దానిపైనా పరిశోధకులు దృష్టిసారించారు. మహిళలతో పోలిస్తే కార్డియోమయోపతితో బాధపడే పురుషుల్లో మరణాల రేటు అధికంగా ఉందని తమ పరిశోధనలో వెల్లడైనట్టు అథ్యయన రచయిత డాక్టర్ సంజయ్ ప్రసాద్ పేర్కొన్నారు. మహిళలను హృద్రోగాల నుంచి ఏయే అంశాలు కాపాడుతున్నాయనే దానిపై తాము నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. -
రెండు నెలలు ఒత్తిడికి గురైతే..
లండన్ : కేవలం రెండు నెలలు తీవ్ర ఒత్తిడికి గురైతే పురుషులు సంతాన సాఫల్యతను ప్రమాదకర స్థాయిలో కోల్పోతారని తాజా అథ్యయనం హెచ్చరించింది. ఒత్తిడితో సహవాసం చేస్తే పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడమే కాకుండా వీర్యకణాలు బలహీనమయ్యే ముప్పు 47 శాతం అధికమవుతుందని వెల్లడించింది. 11,000 వీర్య నమూనాలను పరిశీలించిన మీదట ఇజ్రాయెల్ పరిశోధకులు ఈ విషయాలు నిగ్గుతేల్చారు. కేవలం రెండు నెలల పాటు ఒత్తిడికి లోనైన పురుషుల వీర్యకణాలు బలహీనమవుతాయని, వారికి పిల్లలు పుట్టే అవకాశాలు సన్నగిల్లుతాయని పరిశోధనలో వెల్లడైంది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న సందర్భాల్లో, ఒత్తిడి లేని సమయాల్లో సేకరించిన వీర్య నమూనాలను విశ్లేషిస్తూ నెగెవ్‌కు చెందిన బెన్ గురియన్ యూనివర్సిటీ, సొరొక యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు ఈ అథ్యయనం చేపట్టారు. తొలిసారి తండ్రయ్యే పురుషుల సగటు వయసు 32 ఏళ్ల ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు. మానసిక ఒత్తిడి సంతాన సాఫల్యతపై తీవ్ర ప్రభావం చూపుతుందని తమ అథ్యయనంలో వెల్లడైందని, దీర్ఘకాలం ఒత్తిడికి లోనైతే వీర్యకణాల నాణ్యతపై దుష్ర్పభావం చూపుతుందని తేలిందని అథ్యయన రచయిత డాక్టర్ లెవిటాస్ పేర్కొన్నారు. -
ఒకే అర్హత ఉంది, కానీ వేతనం మాత్రం...
మహిళలకు పనిప్రదేశాల్లో సమప్రాధాన్యం ఇవ్వాలి. మహిళలు, పురుషులు ఒకే అర్హతతో ఉంటే, ఇద్దరికీ సమాన వేతనం ఇవ్వాలి. బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో కచ్చితంగా మహిళలుండాలి. ఇవన్నీ ఎన్నో రోజులుగా పనిప్రదేశాల్లో వెల్లువెత్తుతున్న డిమాండ్లు. కానీ మగవారికి, ఏ మాత్రం తీసిపోకుండా మహిళలు చదువుకున్నా.. వారికి తగిన గౌరవమే కాదు, కనీసం తగిన వేతనం కూడా లభించడం లేదు. తాజాగా ప్రభుత్వం వెల్లడించిన సర్వేలో మగవారితో సమానంగా ఒకే విద్యార్హత ఉన్నప్పటికీ, మహిళలు 30 శాతం తక్కువ వేతనమే పొందుతున్నట్టు తెలిసింది. పట్టణ ప్రాంతంలో గ్రాడ్యుయేట్ డిగ్రీలు కలిగి ఉన్న మహిళలు రోజుకు రూ.690.68 పొందుతుంటే, వారి కంటే 30 శాతం అధికంగా మగవారు రూ.902.45 ఆర్జిస్తున్నట్టు తాజా రిపోర్టు వెల్లడించింది. వ్యవసాయరంగంలో కూడా మగవారికి తగ్గస్థాయిలో మహిళలు పనిచేస్తున్నప్పటికీ, వారికి తగిన ప్రాధాన్యం లభించడం లేదని సర్వే తెలిపింది. గ్రామాల్లో చదువుకోని మహిళలు రోజుకు రూ.88.2 వేతనం పొందుతుంటే, వారి కంటే 45 శాతం అధికంగా చదువుకోని మగవారు రూ. 128.52ను ఆర్జిస్తున్నట్టు వెల్లడైంది. అయితే కొన్ని రంగాల్లో మాత్రం మగవారి కంటే అధికంగా మహిళలే సంపాదిస్తున్నట్టు తెలిసింది. గ్రామీణ ప్రాంతంలో నిర్మాణ రంగంలో పనిచేసే మహిళలు రోజుకు రూ.322 ఆర్జిస్తుంటే, వారి కంటే 13 శాతం తక్కువగా మగవారు రూ.279.15 పొందుతున్నట్టు తాజా రిపోర్టు వెల్లడించింది. పట్టణ ప్రాంతంలో రవాణా, స్టోరేజ్ రంగాల్లో కూడా మహిళలే అధికంగా వేతనం పొందుతున్నారట. 15 నుంచి 59 ఏళ్ల మహిళలు, పురుషులుకు చెందిన సగటు రోజువారీ వేతనాలను తీసుకొని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ‘మెన్ అండ్ ఉమెన్ ఇన్ 2017’ రిపోర్టును రూపొందించింది. ఈ రిపోర్టులోనే చదువుకోని వారి, చదువుకున్న వారి సంపాదనలను కూడా వెలువరించింది. చదువుకున్న మహిళలు, చదువుకోని మహిళల కంటే 5.8 సార్లు ఎక్కువగా సంపాదిస్తున్నారని రిపోర్టు పేర్కొంది. అలాగే చదువుకున్న మగవారు, చదువుకోని వారికంటే 3.6 సార్లు ఎక్కువగా ఆర్జిస్తున్నారని తెలిపింది. ఆశ్చర్యకరంగా చదువుకున్న తర్వాత కూడా మహిళలకు, పురుషులకు మధ్య వేతన చెల్లింపుల్లో చాలా వ్యత్యాసముంటుందని ఈ రిపోర్టు వెల్లడించింది. గ్రాడ్యుయేట్లు ఉన్నప్పటికీ మగవారి కంటే 24 శాతం తక్కువగా మహిళలు వేతనం పొందుతున్నారని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఎక్కువ వేతనం చెల్లించే రంగం నిర్మాణ రంగమని పేర్కొంది. మైనింగ్, క్వారింగ్‌లో మగవారికి ఎక్కువ వేతనాలు ఉంటున్నాయని రిపోర్టు చేసింది. అదే పట్టణ ప్రాంతాలకు వచ్చే సరికి మైనింగ్, క్వారింగ్ రంగాల్లో మగవారు ఎక్కువగా సంపాదిస్తుంటే, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ యుటిలిటీస్‌లో మహిళలు ఎక్కువ వేతనం పొందుతున్నారని తెలిపింది. -
నన్నపనేని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పురుషుల రక్షణ కోసం ఒక కమిషన్ ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు. రాజకుమారి బుధవారం మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలోని విజయనగరంలో భర్తను చంపించిన భార్య ఘటన, శ్రీకాకుళం జిల్లాలో భర్తపై హత్యాయత్నం వంటి సంఘటనలు విస్తుగొలిపాయని అన్నారు. మహిళల బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని ఆమె తెలిపారు. శ్రీకాకుళంలో భార్య చేతిలో దాడికి గురైన వ్యక్తికి అండగా ఉంటామన్నారు. టీవీ సీరియల్స్ల ప్రభావం వల్లనే మహిళల్లో నేర ప్రవృత్తి పెరుగుతోందని పేర్కొన్నారు. సీరియల్స్ మీద సెన్సార్ పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళల నుంచి పురుషులకు రక్షణ కోసం పురుష కమిషన్ ఏర్పాటు చేయాలని నన్నపనేని డిమాండ్ చేశారు. -
మరణభయం?
మనిషికి ఉన్న భయాలన్నింటిలోకి అతి పెద్దది మరణభయం. సరిగా చెప్పాలంటే ఉన్న ఒకే ఒక భయం ఇది అని చెప్పవచ్చు. ఎన్నిటికో భయపడుతున్నామని అనుకుంటారు. అవన్నీ మరణంతో ముడిపడి ఉంటాయి. ఆ ఒక్క భయం లేకపోతే ఇక భయాలే ఉండవు. నాకు పామంటే భయం అన్నారనుకోండి. అది కాటు వేస్తే చనిపోతామన్నది అసలు భయం. అది కాటు వేసినా ఏమీ కాదు అని నిశ్చయంగా తెలిసినపుడు భయపడరు. అలాగే చాలామందికి రోగమంటే భయం. రోగం వస్తే చనిపోతామని భయం. ఆస్పత్రులకి వెళ్ళటానికి భయపడే వాళ్ళకి ఉన్నది కూడా మరణభయమే. అక్కడ కనపడే దృశ్యాలు చాలావరకు అటువంటివే కదా! ఇక ఎవరైనా చనిపోయారంటే ఆ చాయలకే వెళ్లరు ఎంతో మంది. ఇలా చూస్తే ఏ భయానికైనా అసలైన కారణం మరణం. మరణం అంటే భయం ఎందుకు? అది తెలుసుకోటానికన్నా ముందు అసలు భయం అంటే ఏమిటి? అన్నది తెలియాలి? తెలియకపోవటమే భయహేతువు. చీకటిలోకి వెళ్లటానికి ఎందుకు భయపడతాం? అక్కడ ఏమున్నదో తెలియదు కనుక. అనుకోకుండా విద్యుత్తు పోయి చిమ్మచీకటి అయిపోతే, సొంత ఇల్లు అయినప్పుడు తడుముకుంటూ వెళ్ళి దీపం వెలిగించే ప్రయత్నం చేస్తాం. భయపడం. కారణం? మన ఇంట్లో ఏవి ఎక్కడ ఉంటాయో తెలుసు. అదే కొత్తచోటు అయితే అడుగు ముందుకి వెయ్యటానికి ధైర్యం ఉండదు. ఈ రెండు రకాల ప్రవర్తనలకి కారణం – అక్కడ ఉన్నది తెలియటం, తెలియక పోవటం మాత్రమే. మరణం విషయం కూడా అంతే! శరీరం వదిలిన తరువాత ఏం జరుగుతుంది? అన్నది సూచన మాత్రంగానైనా తెలిస్తే భయానికి అవకాశం తక్కువ. అది రహస్యంగా ఉండటం ఎన్నో ఊహలకి కారణం అవుతోంది. ఆ రహస్యం ఛేదించటానికే ప్రపంచంలోని అందరు తత్త్వవేత్తలు, సాధకులు ప్రయత్నం చేశారు. తర్వాత ఏమిటి? అన్నది తెలిస్తే ఉత్కంఠ ఉండదు. ఉత్సాహం నీరుగారి, నిర్లిప్తత చోటు చేసుకుంటుంది. అరమరుగు ఉంటేనే దేనికైనా అందం. మరణం దానికి అపవాదం కాదు. అందుకే దానిపై ఎన్నో ఊహపోహలు. భయాలు. -డాక్టర్ ఎన్. అనంతలక్ష్మి -
పట్టపగలు అందరూ చూస్తుండగానే.. కర్రలతో దాడి
-
లైంగిక దాడి కేసులో.. 12మంది అరెస్ట్
అశ్వారావుపేట : దమ్మపేట మండలం రాచూరపల్లి గ్రామంలో గిరిజన బాలికపై సామూహికంగా లైంగిక దాడి చేసిన 12మందిని పాల్వంచ డీఎస్పీ శ్రీనివాసులు అరెస్ట్ చేసి, కోర్టుకు శుక్రవారం అప్పగించారు. దమ్మపేట పోలీస్ స్టేషన్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించిన వివరాలు.. ఠీకుక్కునూరు మండలం నల్లకుంట గ్రామానికి చెందిన గిరిజన బాలిక, ఈ నెల 21 దమ్మపేట మండలం రాచూరపల్లి గ్రామంలోని తన స్నేహితురాలి ఇంటికి వచ్చింది. స్నేహితురాలి తాత మందలించడంతో మరుసటి రోజున గ్రామ శివారులోని చెరువు వద్దకు వెళ్లింది. అక్కడ మధ్యాహ్నం 12 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన కోర్సా మహేష్, జారే శివరాజు, సరియం నర్సయ్య, నరసింహారావు, సరియం లక్ష్మణరావు, మడివి నగేష్, కొర్సా అర్జునరావు, సమీపంలోగల చెరువు కట్ట వద్దనున్న వాగులోకి బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. అక్కడి నుంచి ఆమె ఏడ్చుకుంటూ గ్రామంలోకి వస్తోంది. మార్గమధ్యలోగల జామాయిల్ తోట వద్దకు రాగానే, అశ్వారావుపేట మండలం నందిపాడు గ్రామానికి చెందిన పద్దం నవీన్, సోడే ముత్తేష్, డేరంగుల దివాకర్, మత్తుల మధు, ఓ బాలుడు కలిసి రెండు మోటార్ సైకిళ్లపై వచ్చి అడ్డగించారు. వారు కూడా ఆమెపై లైంగిక దాడికి దిగి వెళ్లిపోయారు. కొంతసేపటి తరువాత ఆమె కోలుకుంది. ఏడ్చుకుంటూ రోడ్డు పైకి వచ్చింది. అటుగా బైక్‌పై వెళుతున్న గుర్తు తెలియని వ్యక్తి గమనించాడు. వివరాలు తెలుసుకున్నాడు. ఆమెను కుక్కునూరు మండలం నల్లకుంటలోని ఇంటి వద్దకు తీసుకెళ్లి అప్పగించాడు. తనపై జరిగిన దారుణాలను ఆమె తన తల్లిదండ్రులకు తెలిపింది. మేనమామ శీలం దూలయ్య సహాయంతో గురువారం దమ్మపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి, సత్తుప్లలి కోర్టుకు అప్పగించారు. వెనుకబడిన తరగతి(బీసీ)కి చెందిన నిందితులు దివాకర్, మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో అశ్వారావుపేట సీఐ ఎం.అబ్బయ్య, అశ్వారావుపేట, దమ్మపేట ఎస్ఐలు వేల్పుల వెంకటేశ్వర్లు, జలకం ప్రవీణ్‌కుమార్ సహరించినట్టు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. -
మహిళలపై కాదు, మగాళ్లపై దృష్టి పెట్టాలి!
-
మహిళలపై కాదు, మగాళ్లపై దృష్టి పెట్టాలి!
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్‌లో ఇటీవల ముక్కుపచ్చలారని ఏడేళ్ల పసిపాపపై సామూహిక అత్యాచారం జరిపి అనంతరం అగ్నికి ఆహుతి చేసిన మృగాల పైశాచిక చర్య లేదా భారత్‌లోని కురుక్షేత్రలో 15 ఏళ్ల దళిత బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ గురించి వార్తలు వెలుగులోకి వచ్చినప్పుడల్లా......‘చీకటవుతోంది..... సురక్షితం కాదు..... అక్కడికి ఒంటరిగా వెళ్లకు.... .అలాంటి దుస్తులు ధరించినట్లయితే సమస్యలు కోరి తెచ్చుకోవడమే.. ..ఇంత రాత్రి వేళ నీవు బయటకు వెళ్లడం మంచిది కాదు...’ అంటూ అమ్మాయిలను సమాజం హెచ్చరించడం వింటుంటాం. తరాలు మారినా ఈ మాటలు మారలేదు. ఇలాంటి దారుణ కీచక చర్యలకూ తెరపడలేదు. ఎందుకు? ఇప్పటివరకూ మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడల్లా సమాజం మహిళలపై దృష్టిని కేంద్రీకరించి ఇలాంటి మాటలతో హెచ్చరిస్తోంది. నీతి సూక్తులు చెబుతోంది. అందుకే పరిస్థితిలో మార్పులేదు. అయితే ఇక్కడ దృష్టిని కేంద్రీకరించాల్సింది దారుణాలకు పాల్పడుతున్న మగవాళ్లపై. నీతి బోధలు చేయాల్సింది, హెచ్చరికలు చేయాల్సింది వారికే. మగవాళ్లు చిన్న పిల్లల నుంచి ఎదుగుతున్నప్పుడే ఇంట్లో తల్లిదండ్రుల దగ్గరి నుంచి గురువుల వరకు వారికి సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పాలి. మహిళలను గౌరవపరిచే సంస్కతిని నేర్పించాలి. ఇలాంటి అభిప్రాయాలను పాకిస్థాన్ నుంచి వెలువడుతున్న ప్రత్యామ్నాయ సాంస్కృతిక పత్రిక ‘మోస్కీ’, సామాజిక కార్యకర్త అల్వీనా జాడూన్, బాలీవుడ్ హిందీ సినిమా ‘హిందీ మీడియం’లో నటించిన పాకిస్థాన్ సినీ తార సారా ఖబర్లు వ్యక్తం చేశారు. వాళ్లు వ్యక్తం చేసిన అభిప్రాయల వీడియోలో సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. ‘సమాజంలో జరుగుతున్న దారుణాలను ఎదుర్కోవడం సమష్టి బాధ్యత. మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే అందుకు కారకులు ఎవరు? మగవాళ్లు. ఆడవాళ్లకు కాదు, ప్రవర్తనా నియమావళి మగవాళ్లకు ఉండాలి. ఆడవాళ్ల మీది నుంచి దృష్టిని మగవాళ్లవైపు మళ్లించనప్పుడే మార్పు వస్తుంది. ‘మా ఆడవారు మంచివారు. గౌరవనీయులు. పవిత్రులు’ అని ఈ సమాజంలో చాలా మంది చెబతూ ఉంటారు. అవును, మీ ఆడవారు మంచి వారు, పూజ్యులే. మరి మీ మగపిల్లల సంగతేమిటీ? వారు మంచివారు కాదా? వారికి మంచీ, మర్యాదలు నీర్పలేదా? ముఖ్యంగా మహిళల పట్ల ఎలా నడుచుకోవాలో ప్రవర్తనా నియమావళిని ఎందుకు నిర్దేశించలేదు?’ అంటూ మోస్కీ వీడియో కొత్త వాదనను ముందుకు తీసుకొచ్చింది. పాక్ సామాజిక కార్యకర్త అల్వీనా జండూన్ అదే తరహాలో మాట్లాడారు. ‘ఇలాంటి దారుణాలను ఎవరు అరికడతారు? ఏటేటా చెప్పిన మాటలనే చెబుతూ, చేసిన వాగ్దానాలనే చేస్తూ ఓట్లు అడుక్కునే రాజకీయ నాయకులు మారుస్తారా? మహిళల మీది నుంచి దృష్టిని మగవాళ్లపైకి మళ్లించి సమస్యను పరిశీలించినప్పుడే పరిష్కారం దొరకుతుంది’ అని ఆమె అభిప్రాయపడ్డారు. జైనాబ్ ఘటనపై టీవీలో పాకిస్థాన్ తార సారా ఖబర్ కన్నీళ్లపర్యంతమవుతూనే కఠినంగా మాట్లాడారు. ‘ఈ ఘోర కృత్యాలను ఆపాల్సిందిగా నేను ఎవరికి విజ్ఞప్తి చేయాలో కూడా అర్థం కావడం లేదు. ప్రజలారా! ఎవరో వస్తారని, సాయం చేస్తారని ఎదురు చూడకండీ. మీరే కార్యరంగంలోకి దూకండి. మీ రక్షణ కోసం మీరే పోరాడండీ. మీ పిల్లలకు నేర్పండి, వారిని వారు ఎలా రక్షించుకోవాలో’ అని ఖబర్ పిలుపునిచ్చారు. జైనాబ్‌కు న్యాయం జరగాలంటూ వేలాది మంది పాకిస్థాన్ ప్రజలు ప్రతి రోజూ వీధుల్లోకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. -
పురుషుల కోసం ప్రత్యేక పూజలు
సాక్షి, చెన్నై: తై మాసం ఆవిర్భావంతో పురుషులకు ప్రమాదం పొంచివున్నట్లు వదంతులు వ్యాపించడంతో విళ్లుపురం పరిసర ప్రాంతాల మహిళలు తమ ఇళ్ల ముంగిట దివ్వెలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తై మాసం మొదటి రోజు, తమిళుల పొంగల్ పండుగ రోజున ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. దీంతో ఆదివారం పొంగల్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆరోజు సాయింత్రం 5.09 గంటలకు ఉభయ లగ్నంలో సూర్యుడు అస్తమించే సమయాన తై మాసం అవిర్భవించింది. ఇది ఘోర అనే దేవత ద్వారా రాజగోపలంలో తూర్పు వైపుగా పుట్టిందని, ఈ కారణంగా ఇళ్లలోని పురుషులకు ప్రమాదమని, దీంతో మహిళలు పరిహార పూజలు చేయాలన్న వదంతులు విళ్లుపురం పరిసర ప్రాంతాల్లో ప్రాంతంలో గత రెండు రోజులుగా వ్యాపించాయి. దీంతో ఈ ప్రాంతాల మహిళలు తమ ఇళ్ల ముంగిట దివ్వెలను వెలిగించి ఇళ్లలో పరిహార పూజలు చేస్తున్నారు. -
శుక్రకణం శ్రేష్టమైతేనే కలయిక
వాషింగ్టన్ : పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి విడుదలై వేల సంఖ్యలో అండం వద్దకు చేరుకునే శుక్ర కణాలు దానిలోకి చొచ్చుకెళ్లేందుకు పోరాడి విజయం సాధించి ఫలదీకరణం చెందుతాయనే థియరీ కొన్ని దశాబ్దాలుగా మనకు తెలుసు. కానీ, ఆ థియరీ తప్పని తాజా పరిశోధనల్లో తేలింది. స్త్రీ జీవి అండానికి శ్రేష్టమైన శుక్ర కణాన్ని తనంతట తాను ఎంచుకొని పునరుత్పత్తి చేయగల సామర్ధ్యం ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. వేల సంఖ్యలో వచ్చే శుక్ర కణాల్లో ‘శ్రేష్టమైన’ ఒక కణాన్ని మాత్రమే ఎన్నుకుని అండం ఫలదీకరణం చెందుతుందని వెల్లడించారు. దీంతో ఇప్పటివరకూ ఫలదీకరణం సూత్రాన్ని వివరిస్తున్న ‘మెండెల్స్ సూత్రం’ సరైంది కాదని తేలింది. మెండెల్స్ సూత్రం ఏం చెబుతుంది.. వేల నుంచి లక్షల సంఖ్యలో తన వద్దకు చేరుకునే శుక్ర కణాల్లో ఏదో ఒకదానితో (ప్రత్యేకంగా ఎంపిక చేసుకోకుండా) అండం ఫలదీకరణం చెందుతుందని మెండెల్స్ సూత్రం చెబుతుంది. అండం ఎలా ఎన్నుకుంటుంది అండం ఒక శుక్ర కణాన్ని శ్రేష్టమైనదిగా ఎలా గుర్తిస్తుందన్న విషయాన్ని మాత్రం పరిశోధకులు క్షుణ్ణంగా వివరించలేకపోయారు. అయితే, ఎలుకల మీద ఈ దిశగా చేసిన పరిశోధనల్లో అండం అనారోగ్యంగా ఉన్న శుక్రకణాలతో ఫలదీకరణానికి నిరాకరిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా మరికొన్ని శుక్ర కణాలు అండాన్ని చేరుకోకముందే చనిపోతున్నట్లు పరిశోధకులు చెప్పారు. ఫోలిక్ యాసిడ్ది కీలకపాత్ర అండం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి విడుదలైన శుక్ర కణాల్లో ఎలా ఎంపిక చేసుకుంటుందన్న ప్రక్రియపై స్మిత్ సోనియన్ ట్రాపికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డా. నెడెయూ మరో రెండు ప్రక్రియలను ప్రతిపాదించారు. 1. శుక్ర కణం, అండాల్లో ఉండే బీ విటమిన్(ఫోలిక్ యాసిడ్) సూచనలతోనే ఫలదీకరణ ప్రక్రియ జరగుతుంది. బలహీనంగా లేదా అనారోగ్యంగా ఉన్న శుక్ర కణాన్ని ఫలదీకరణానికి ఎన్నుకోకుండా ఉండటానికి ఫోలిక్ యాసిడ్ అండానికి సాయపడుతుంది. 2. అండం పూర్తిగా తయారవకముందే శుక్ర కణానికి చెందిన రూపు అందులో ఉంటుంది. అండంలో ఉన్న శుక్ర కణాన్ని బట్టి ఫలదీకరణకు దాన్ని సరిపోలే శుక్రకణాన్ని అండం ఎంచుకుంటుంది. అయితే, ఈ ప్రక్రియ పూర్తిగా ఊహాజనితమని డా. నెడెయూ తెలిపారు. ఇందుకు సంబంధించి పరిశోధనలు చేయాల్సివుందని వెల్లడించారు. -
ఆ విషయంలో మహిళలే బెటర్
లండన్ : రహదారులు రక్తమోడుతున్నాయి.. అనే శీర్షికలు నేడు ప్రపంచమంతా సహజమయ్యాయి. ప్రతిరోజూ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పరధ్యానంలో డ్రైవింగ్ చేయడం ఒకటి. డ్రైవింగ్ విషయంలో పురుషలకంటే మహిళలే బెటరని తాజాసర్వే ఒకటి స్పష్టం చేసింది. మహిళల డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు చాలా తక్కువగా జరుగుతున్నాయని కూడా సర్వే ప్రకటించింది. పురుషులతో పోలిస్తే మహిళలు ఏకాగ్రతగా, ఆందోళన లేకుండా, మనసును స్థిమితంగా ఉంచుకుని డ్రైవింగ్ చేస్తారని సర్వే పేర్కొంది. యువకుల వేగంతో ప్రజలు బెంబేలు ఎత్తుతున్నట్లు సర్వే తెలిపింది. నార్వేకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎకనామిక్స్ సంస్థ యువతీయువకులు, ఉద్యోగస్తుల డ్రైవింగ్‌పై సర్వే నిర్వహించింది.టీ సర్వేలో డ్రైవింగ్ చేసే సమయంలో వారి మానసిక స్థితి, ఆందోళనలు, రహదారిపై ఏకాగ్రత వంటి అంశాలపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో మూడింట రెండొంతుల మంది మహిళలు.. తాము డ్రైవింగ్ చేసే అసమయంలో ఎటువంటి ఆందోళనలు పెట్టుకోమని వెల్లడించారు. ఈ సర్వేలోనే మహిళల డ్రైవింగ్‌లో ప్రమాదాలు చాలా తక్కువగా జరిగాయని తేలింది. -
డాక్టర్‌కు తుపాకీ ఎక్కు పెట్టి..
-
పురుషులు ఇంట్లో.. మహిళలు పనుల్లో
బెర్లిన్: ఇప్పుడైతే పురుషులు, మహిళలు ఉద్యోగరీత్యా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు. కొంతకాలం క్రితం వరకు ఉద్యోగరీత్యా పురుషులే వలస జీవులుగా మారేవారు. అయితే ఇదంతా ఇప్పటి మాట. ఈ రెండింటిలా కాకుండా రాతియుగం చివర్లో, శిలాయుగం మొదట్లో మహిళలే ఇంటి బాధ్యతలు, సమాజ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆ కాలంలో యూరప్‌లోని మహిళలు తాము ఉన్న ప్రాంతాల నుంచి వలస వెళ్లి కుటుంబాలను ఏర్పాటు చేయటం, సంస్కృతి, ఆలోచనలు, విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం వంటివి చేశారని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇదే సమయంలో పురుషులు మాత్రం ఇంటికే పరిమితమయ్యేవారని అధ్యయనంలో బయటపడింది. రాతియుగం చివరల్లో శిలా యుగం మొదట్లో జర్మనీలో ఆశ్చర్యకరంగా కుటుంబాల ఏర్పాటు జరిగిందని పరిశోధకులు వెల్లడించారు. ఈ సమయంలో పురుషులు తాము పుట్టిన ఊరులోనే ఉండగా.. మహిళల్లో ఎక్కువ శాతం మంది బొహేమియా, సెంట్రల్ జర్మనీ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు తెలిపారు. అయితే క్రీ.పూ.2500–1650 మధ్య కాలంలో ఇలా వలస వచ్చిన మహిళలను ఖననం చేసిన ప్రదేశంలో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఇలా వలస వచ్చిన మహిళలు చనిపోయే నాటికి స్థానిక సమాజంలో కలిసిపోయారని వారు గుర్తించారు. ఈ పరిశోధన ఫలితాలు ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
ఈ ఉత్సవం.. పురుషులకు మాత్రమే..!
చెన్నై: స్త్రీలు మాత్రమే పూజలు జరపడం ఆనవాయితీగా ఉండే తమిళనాడులో ఏటా జరిగే విడ్డూరమిదీ. నామక్కల్ జిల్లా పొంగలాయి ఆలయంలో పూజలకు పురుషులు మాత్రమే అర్హులు. రాశిపురం సమీపంలో మలైయాంపట్టి గ్రామంలో 500 పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ ప్రసిద్ధి చెందిన పొంగలాయి అమ్మవారి ఆలయం ఉంది. మర్రి చెట్టు కింద స్వయంభువుగా వెలసిన అమ్మవారి ఆలయంలో ఏటా ఆడి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో పురుషులు మాత్రమే పాల్గొని పొంగలి వండి మేకలు బలి ఇచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది ఉత్సవాలు గత 21వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి అళంగతాయ్ అమ్మన్‌కు ప్రత్యేక పూజలు జరిపారు. సోమవారం ఆలయం సమీపంలో గల కరుప్పు స్వామికి ప్రత్యేక పూజలు జరిపి మేకలను బలిచ్చారు. ఆలయ నిర్వాహకుల సమక్షంలో ముందుగా ఆడ మేకను బలి ఇచ్చారు. అనంతరం భక్తుల మొక్కుల ప్రకారం 140 మేకలను బలి ఇచ్చారు. అనంతరం సోమవారం సాయంత్రం సమబంతి విందు జరిపారు. ఇందులో ఐదు వేల మందికి పైగా భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలను స్వీకరించారు. పురుషులు మాత్రమే జరిపే ఈ పూజల వలన ప్రజలు ఎటువంటి శారీరక బాధలు లేకుండా ఆరోగ్యంతో ఉండాలని పంటలు బాగా పండాలని, సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలగాలని కోరుకున్నారు. -
గొలుసుల దొంగ అరెస్టు
రూ.6.5 లక్షల చోరీసొత్తు స్వాధీనం యానాం : నిర్జనప్రదేశాన్ని ఎన్నుకుంటాడు. ఒంటరిగా వెళుతున్న మహిళలను వెంబడిస్తాడు.. అంతే క్షణంలో మెడలోని బంగారు గొలుసులు అపహరించి ఉడాయిస్తాడు. యానాంలోని వివిధ ప్రదేశాల్లో కొన్నేళ్లుగా బంగారు గొలుసులు దొంగిలిస్తూ తప్పించుకు తిరుగుతున్న దొంగను యానాం పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌చేశారు. యానాం ఎస్పీ నితి¯ŒS గౌహల్ శుక్రవారం ఈ ఘటనకు సంబంధించి వివరాలును విలేకరులకు వివరించారు. యానాంలోని కనకాలపేటలోని ఆదిఆంధ్ర పేటకు చెందిన మందపల్లి రాంబాబు అలియాస్ రమేష్ (29) 2014 నుంచి సుమారు 7 బంగారు నగల దొంగతనాల కేసుల్లో నిందితుడిగా వున్నాడు. శుక్రవారం అతనిని యానాంలోని త్యాగరాయవీధిలోని భవానిబ్యాంకర్స్ ఎదురుగా తచ్చాడుతుండగా ఎస్సై శివకుమార్, క్రైమ్‌పార్టీ అరెస్ట్‌చేసి, అతని వద్దనుంచి రూ.6.5 లక్షల విలువచేసే 210.57గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. యానాంలోని బెజవాడాగార్డె¯Œ్స, కురసాంపేట, యూకేవీ నగర్, గణపతినగర్, హనుమా¯ŒS డాబా, కనకాలపేట, సుభద్రనగర్ ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళలను వెంబడించి వారిమెడలోని విలువైన బంగారు ఆభరణాలను తెంచి పారిపోతుంటాడు. నాలుగేళ్లుగా అతడు దొంగిలించిన వాటిలో ఎక్కువగా మంగళసూత్రాలు, గొలుసులు తదితరమైనవి వున్నాయి. తాము స్వాధీనం చేసుకున్న బంగారాన్ని బాధితులకు అందజేస్తామని పోలీసులు తెలిపారు. రాంబాబు గతంలో మల్లాడి సత్తిబాబు అనే వ్యక్తి వద్ద కారుడ్రైవర్‌గా పనిచేసేవాడని అతని వద్ద కూడా ఈ విధంగానే బంగారాన్ని దొంగిలించాడని తెలిపారు. నిందితుడ్ని పట్టుకోవడంలో కృషిచేసిన ఎస్ఐ శివకుమార్‌ను, కానిస్టేబుళ్లు సతీష్, దుర్గారావు, ప్రతాప్‌లను ఎస్పీ అభినందించారు. -
ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య
అంబాజీపేట (పి.గన్నవరం) : ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతోన్న ఒక వ్యక్తి అంబాజీపేట బస్టాండ్ సమీపంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం అమలాపురం రూరల్ మండలం బండారులంకకు చెందిన పిచ్చిక సత్య సింహద్రిఅప్పన (48) అంబాజీపేటలో ఒక స్వీటు షాపులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.రెండు రోజులుగా ఆ షాపును మూసివేశారు. బుధవారం రాత్రి షాపు వద్ద పని ఉందని ఇంటిలో చెప్పిన అతడు.. స్వీట్లు తయారు చేసే ప్రాంతంలో ఉరి వేసుకున్నాడు. గురువారం ఉదయం షాపు తీసేందుకు వచ్చిన కార్మికులు విషయాన్ని షాపు నిర్వాహకులకు తెలియజేశారు. దీంతో వారు పోలీసులకు, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ప్రేమ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఆ తిండి విషయంలో మహిళలే ఎక్కువ
న్యూఢిల్లీ: ‘గోమాంసం లేదా మేక మాంసం కలిసిన తేనేరు (పోషక విలువల పేరిట గ్రీన్ టీలో గోమాంసం కలుపుతున్న విషయం తెల్సిందే) సేవించపోతే చనిపోతావని ఎవరైన వైద్యుడు సలహా ఇచ్చినా నేను చనిపోవడానికి ఇష్టపడతాను. అది శాకాహారం పట్ల నాకున్న కట్టుబాటు’ అని జాతిపిత మహాత్మాగాంధీ లండన్ విజిటేరియన్ సొసైటీతో 1931, నవంబర్ 20న చేసిన వ్యాఖ్య. శాఖాహారాన్ని అంతగా ప్రేమించే గాంధీ కూడా ఎన్నడూ గోమాంసాన్ని తినే వారిని ద్వేశించలేదు. వారిని అంటరాని వారిగా చూడలేదు. నేడు గోమాంసం పేరిట హత్యలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లాంటి దేశంలో మాంసాహారులు ఎంత మంది ఉన్నారో, శాకాహారాలు ఎంత మంది ఉన్నారో పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. దేశంలో ‘రిజిస్ట్రేషన్ సిస్టమ్ బేస్‌లైన్’ 2014లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం దేశంలో 29 మంది శాకాహారాలుండగా, 71 శాతం మంది మాంసాహారులు ఉన్నారు. జీవ హింస కూడదంటూ పెటా లాంటి సంస్థలు చేసిన ప్రచారం, శాకాహారం ఉత్తమమైనదంటూ శాకాహార ప్రోత్సాహక సంస్థలు చేసిన విస్తత ప్రచారం కారణంగా 2004 నుంచి 2014 వరకు, పదేళ్ల కాలంలో దేశంలో నాలుగు శాతం శాకాహారులు పెరిగారు. అంటే మాంసాహారుల సంఖ్య 75 నుంచి 71కి తగ్గింది. శాకాహారులు వాయువ్య రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే శాకాహారులు ఎక్కువ మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా అగ్రవర్ణాల్లోనే శాకాహారులు ఎక్కువగా ఉండగా, వారిలో బ్రాహ్మణలు ఎక్కువగా ఉన్నారు. బ్రాహ్మణుల్లో యాభై శాతం మంది శాకాహారులు ఉన్నారు. మొత్తం మాంసాహారుల్లో ఎస్సీ, ఎస్టీలే ఎక్కువ. వారిలో శాకాహారులు తక్కువ. మగవారితో పోలిస్తే ఇటు మాంసాహారుల్లోగానీ, శాకాహారుల్లోగానీ మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీల్లోని మాంసాహారుల్లోనూ మహిళదే పైచేయి. దేశంలో మొత్తం మాంసాహారుల్లో మహిళలు 71.6 శాతం కాగా, మగవాళ్లు 70.7 శాతం ఉన్నారు. ఎస్సీలో మాంసహారులు పురుషులు 76. 1 శాతంకాగా, మహిళలు 77.9శాతం, ఎస్టీల్లో పురుషులు 75.9 శాతంకాగా, మహిళలు 76 శాతం మంది ఉన్నారు. మాంసాహారంలో పోషక విలువలు ఎక్కువగా ఉండడం, తక్కువకు లభిస్తుండడం వల్ల ఎస్సీ,ఎస్టీలు, దిగువ కులాల వారు ఎక్కువగా మాంసహారాన్ని ఆశ్రయిస్తున్నారు. -
నవవరుడి ఆత్మహత్య!
కడియం : వివాహమైన రెండో రోజే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కడియం మండలం మురమండలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని మురమండ గ్రామానికి చెందిన బంటు శ్రీనివాసరావు (27) మహబూబాబాద్‌లో స్వీట్‌స్టాల్ నిర్వహిస్తున్నాడు. అతడికి ఈనెల 2వ తేదీన వివాహం జరిగింది. 3వ తేదీన నూతన వధూవరులు అన్నవరం కూడా వెళ్లి వచ్చారు. అయితే తెల్లవారుజామున మురమండలో సదరు యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతడి ఆత్మహత్యకు కారణాలేంటన్నది తెలియడం లేదని పోలీసులు చెప్పారు. ఇరువైపుల వారు ఎందుకు మృతి చెందాడన్నదానిపై సమాధానం చెప్పలేకపోతున్నారని వారు చెబుతున్నారు. శ్రీనివాసరావు తండ్రి బంటు చిన్నబ్బాయి ఫిర్యాదు మేరకు కడియం ఎస్ఐ ఎల్. గౌరీనాయుడు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. -
ఉసురు తీసిన మత్తు
పరస్పర దాడిలో ఒకని మృతి నిబంధనలు పట్టించుకోని మద్యం వ్యాపారులపై స్థానికుల ఆగ్రహం కాకినాడ క్రైం : మద్యం మత్తులో ఇద్దరి మధ్య తలెత్తిన వాగ్వాదం కత్తిపోట్లకు దారి తీసి ఒకరిని పొట్టనపెట్టుకోగా ఒకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలయ్యాడు. కాకినాడలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. టూటౌ¯ŒS పోలీస్‌స్టేçÙ¯ŒS సమీపంలోని చినమార్కెట్కు చెందిన బోరా వెంకట యల్లయ్య (30) పెయింటర్‌గా పని చేస్తుంటాడు. స్థానిక కొత్తపేట మార్కెట్ ఎదురుగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్‌కు అప్పుడప్పుడు వెళ్లి మద్యం సేవిస్తుంటాడు. మంగళవారం బార్‌కు వెళ్లాడు. అక్కడకు జగన్నాథపురం అన్నమ్మఘాటీ సెంటర్‌కు చెందిన వడ్డాది సుధీర్ (28) కూడా వచ్చి మద్యం తాగాడు. మద్యం మత్తులో వీరిద్దరి మధ్య చోటుచేసుకున్న స్వల్ప వాగ్వాదం కత్తిపోట్లకు దారి తీసింది. దీంతో నిర్వాహకులు ఇరువురికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపేశారు. బుధవారం రాత్రి కూడా యల్లయ్య, సుధీర్ అక్కడకు వచ్చి మద్యం తాగి తిరిగి వెళ్లిపోతున్న క్రమంలో రాత్రి 11.30 గంటల మధ్య వాగ్వాదం చేసుకుని శృతి మించి వెంట తెచ్చుకున్న కత్తులతో ఒకరిపై మరొకరు దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో యల్లయ్య తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే జీజీహెచ్‌కు తరలించగా వైద్యం పొందుతూ అదే రోజు మృతి చెందాడు. సుధీర్‌కు చేతి, పొట్టమీద కత్తిపోట్లు పడడంతో వైద్యం కోసం జీజీహెచ్‌లోకి చేర్చారు. యల్లయ్యకు భార్య లోవలక్ష్మి, ఆరేళ్ల పాప, ఏడేళ్ల బాబు ఉన్నారు. భర్త మరణంతో నడిరోడ్డున పడ్డామని, తమను ఎవరు ఆదుకుంటారని విలపించారు. సుధీర్ డిగ్రీ చదువుకుని ఖాళీగా ఉండి స్నేహితులతో కలసి తిరుగుతూంటాడు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఉమర్ తెలిపారు. నిందితుడు సు«ధీర్ డిశ్చార్జి కాగానే అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. నిబంధనల మేరకు రాత్రి 10 గంటలకు బార్ అండ్ రెస్టారెంట్ మూసివేయాల్సి ఉండగా, ఎక్సైజ్‌శాఖ, పోలీస్‌లు పట్టించుకోకపోవడంతో నిర్వాహకులు వాటిని తెరిచి ఘర్షణలకు కారణమవుతున్నారని స్థానికులు ఆరోపించారు. -
బాలిక కిడ్నాప్ కేసులో యువకుడి అరెస్టు
మలికిపురం : తూర్పుపాలెం గ్రామానికి చెందిన బాలిక గంటా సోనిని కిడ్నాప్ చేసిన కేసులో అదే గ్రామానికి చెందిన రొక్కం సురేష్‌ను అరెస్టు చేసి కోర్టుకు పంపినట్లు ఎస్సై వి. విజయబాబు గురువారం తెలిపారు. బుధవారం రాత్రి అమలాపురం డీఎస్పీ ఎల్. అంకయ్య సమక్షంలో అరెస్టు చేశామన్నారు. ముద్దాయికి రిమాండ్ విధించారని ఆయన తెలిపారు. -
జీవితంపై విరక్తితో యువకుడి ఆత్మహత్య
కాకినాడ వైద్యం : దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి జీవితంపై విరక్తితో వంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం అర్థరాత్రి కాకినాడ జీజీహెచ్‌లో చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఐ.పోలవరం మండలం కేసనకుర్రు గ్రామానికి చెందిన సాలిగ్రామ త్రిమూర్తులు (30) ఫిట్స్ వ్యాధితో కొన్నేళ్లుగా బాధపడుతున్నాడు. కొంతకాలంగా అతడు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. అతని సమస్య ఎంతకీ తగ్గకపోవడంతో శనివారం రాత్రి సర్జికల్ వార్డు ఎదురుగా ఉన్న సుభోజనం హŸటల్ వద్దనున్న రోగుల వెయిటింగ్ బ్లాక్ వద్దకు చేరుకుని, కొంతసేపు పడుకుని, అందరూ వెళ్లిపోయాకా తన వెంట తెచ్చుకున్న పెట్రోలును వంటిపై పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంటల్లో కాలిపోతూ హాహాకారాలు చేస్తున్న మృతుడ్ని గుర్తించిన స్థానికులు దుప్పట్లతో మంటలు ఆర్పి చికిత్స కోసం అత్యవసర విభాగంలో చేర్చారు. శరీరం 96 శాతానికి పైగా కాలిపోవడంతో కొద్దిసేపటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరచినట్లు తెలిపారు.