ప్రెగ్నెన్సీ లేదా ఫ్యామిలీ ప్లాన్ చేసుకుంటే మాత్రం పురుషులు మద్యం సేవించడం మానేయాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. లేదంటే గర్భధారణ సమస్యలు లేదా పిల్లల్లో సరైన పెరుగుదల లేకపోవడం లేదా పుట్టుకతో వచ్చే లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువుగా ఉటాయంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. కనీసం ఓ వారం రెండు వారాల నుంచి మద్య మానేయడం కాదని బాంబు పేల్చారు. సేవించిన మద్యం ప్రభావం స్పెర్మ్‌పై ఎలా ఉంటుందో కూడా సవివరంగా వివరించారు. మద్య సేవించే పురుషులకు పుట్టే పిల్లల్లో ఎలాంటి సమస్యలొస్తాయో తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడించారు.
ఇంతవరకు గర్భధారణ, పిల్లల అభివృద్ధి విషయాల్లో తల్లి ఆరోగ్యాన్ని కీలకంగా పరిగణించేవారు పరిశోధకులు. ఆ దిశగానే పరిశోధనలు చేయడం జరిగింది. అయితే గర్భధారణకు ముందు ఆల్కహాల్ తీసుకోవడం కారణంగా ఆ మహిళకు పిల్లలు కనడంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అనే దిశగా పరిశోధనలు జరగలేదు. తొలిసారిగా ఆవైపుగా అధ్యయనం సాగించారు శాస్త్రవేత్తలు. ఆ పిండానికి ఆల్కహాల్ సిండ్రోమ్(ఎఫ్‌ఏఎస్)తో సంబంధం ఉండే అవకాశాలు ఉంటాయా? అనే దిశగా సరికొత్త ప్రయోగాలు చేశారు.
ఆ అధ్యయనంలో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీని కారణంగా బరువు తక్కువుగా జననాలు, హైపర్ యాక్టీవిటీ సమస్యలు, సరైన ఎదుగుదల లేని పిల్లలు పుట్టడానికి కారణమని తేలింది. పిల్లలను లేదా ఫ్యామీలిని ప్లాన్ చేసుకుంటే మగవాళ్లని మద్యం సేవించకుండా మహిళలే చూసుకోవాలని లేదా బాధ్యత తీసుకోవాలని సూచించారు పరిశోధకులు. మద్యం సేవించిన ఎంతకాలం వరకు స్పెర్మ్‌పై ఆల్కహాల్ ప్రభావం ఉంటుందనే దానిపై కూడా పరిశోధనలు నిర్వహించారు. తండ్రి ఆల్కహాల్ అలవాట్లు పిండం అభివృద్ధిలో బలమైన ప్రభావం ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు.
దీంతో తాము స్పెర్మ్‌పై ఆల్కహాల్ ప్రభావం తగ్గడానికి ఎంత సమయం పడుతుందో అనే దిశగా కూడా అధ్యయనం చేసినట్లు తెలిపారు. అందుకోసం మగ ఎలుకలపై ప్రయోగాలు చేయగా..కొన్నింటి ఆల్కహాల్‌కు గురిచేసి మరికొన్నింటికి ఆల్కహాల్ ఇవ్వకుండా చూడగా వాటి జన్యువుల్లో సంభించిన పలు మార్పులను గమనించినట్లు తెలిపారు. ఈ పరిశోధనల్లో కనీసం మూడు, నాలుగు వారాలు కాకుండా ఏకంగా మూడు నెలల పాటు ఆల్కహాల్‌కి దూరంగా ఉంటేనే వారి శరీరంలో ఉత్పత్తి అయ్యే స్పెర్మ్‌పై ప్రభావం ఉండదని అధ్యయనంలో వెల్లడయ్యిందని అన్నారు.
అలాగే మగవారిలో స్పెర్మ్ 60 రోజుల వ్యవధిలో తయారవుతుందని మాకు తెలుసు. కానీ మద్యం మానేసిన ఒక నెలకు గానీ సెర్మ్‌పై ఆల్కహాల్ ప్రభావం తగ్గటం ప్రారంభమవ్వదని అన్నారు. అందువల్ల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పడూ కనీసం రెండు నుంచి మూడు నెలల వరకు మద్యం మానేయాల్సిందేనని సూచించారు. అప్పటి వరకు ఆగి ఫ్యామిలీని ప్లానే చేసుకోకతప్పదని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు మద్యం మానేసినప్పటికీ దాని తాలుకా రసాయనా ప్రభావం శరీరంలో అలా కొనసాగుతు ఉంటుందని అందువల్ల మూడు నెలల సమయం విరామం తీసుకోవాల్సిందేనని అన్నారు. లేదంటే తల్లిదండ్రులు ఆల్కహాలిక్ సంబంధిత పుట్టుకతో వచ్చే లోపాలను ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు పరిశోధకులు.
(చదవండి: భర్త చనిపోయిన రెండేళ్లకు ప్రెగ్నెంట్! ఆమె ధైర్యాన్ని కొనియాడుతున్న వైద్యులు)
Comments
Please login to add a commentAdd a comment