Sperm
-
World IVF Day ఎగ్ ఫ్రీజింగ్‌పై మహిళల్లో ఆసక్తి : అటు పురుషుల్లో కూడా!
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ సంతానోత్పత్తి కేంద్రాల్లో ఒకటైన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ పదేళ్లు పూర్తిచేసుకుంది. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, మారుతున్న జీవనశైలి లాంటివి సంతానలేమి పెరగడానికి కారణమని ఫెర్టిలిటీ నిపుణులు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి చికిత్స కోసం 35 ఏళ్లు పైబడిన మహిళలు వస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల సగటు వయస్సు 22-23 సంవత్సరాలే ఉండటం ఆందోళనకరంగా ఉంది. అయితే, గత దశాబ్దంలో పురుషులలో సంతానరాహిత్య సమస్యను అంగీకరించడంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది.తెలంగాణలోనూ పురుషులు, మహిళల్లో సంతానరాహిత్యం పెరుగుతోంది. సంతానసాఫల్య రేటు రాష్ట్రంలో తగ్గుతోంది. ఒక్కో మహిళకు సగటున 2.1 మంది పిల్లలు ఉండాలి గానీ, 1.8 మంది ఉంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలో ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ లక్ష్మీ చిరుమామిళ్ల మాట్లాడుతూ. “పదేళ్ల క్రితం కొంతమంది పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గడం చూసేవాళ్లం. కానీ ఇప్పుడు ఇది తీవ్రంగా మారింది. పురుషుల్లో వీర్యకణాల నాణ్యత, పరిమాణం చాలా తక్కువగా ఉంటోంది. మహిళల్లో, అండం నాణ్యతలో తగ్గుదల గమనించినా, అడెనోమైయోసిస్ కేసులు కూడా ఉంటున్నాయి. ఇది పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం కలిగించే సమస్య. ఒక దశాబ్దం క్రితం, సమాజానికి భయపడి సంతానసాఫల్య చికిత్్లకు అంతగా ముందుకు వచ్చేవారు కారు, ప్రజలను ఒప్పించలేకపోయేవాళ్లం. ఇప్పుడు మా వద్దకు వచ్చేవారిలో 30% మంది ఈ చికిత్సకు ఆమోదం తెలుపుతున్నారు. పదేళ్లతో పోలిస్తే ఇది మంచి మార్పు. గత పదేళ్లలో సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా అభివృద్ధి చెందింది. ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ (పీజీటీఏ) లాంటి పరీక్షలను ఉపయోగించి ఇప్పుడు జన్యుపరమైన సమస్యలను పరీక్షించవచ్చు. పిండం ఎంపికలో డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆవిష్కరణలు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ పెరగడానికి దోహదపడతాయి.సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి వల్ల సంతానసాఫల్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పిల్లలు పుట్టని జంటలకు కొత్తఆశ, మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. దాంతోపాటు.. క్రియోప్రిజర్వేషన్ వల్ల ఇప్పుడు అండాలు, వీర్యం, పిండాలను కూడా సమర్థంగా నిల్వచేయగలుగుతున్నాం. దీనివల్ల ఎవరైనా కొంత వయసు తర్వాత పిల్లలు కావాలనుకున్నా అది సులభమే అవుతుంది” అని వివరించారు.నోవా ఐవీఎఫ్‌లో మరో ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ హిమదీప్తి మాట్లాడుతూ, “సంతానసాఫల్య చికిత్సలో సాంకేతికపరమైన అభివృద్ది చాలా వచ్చింది. తమ జీవ గడియారం గురించి, సంతానసాఫల్యంలో దాని పాత్ర గురించి మహిళలకు అవగాహన పెరుగుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో ఎగ్ ఫ్రీజింగ్ గురించి అడిగేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ప్రస్తుతం సంవత్సరానికి 50 నంచి 100 మంది దీనికోసం అడిగేందుకు వస్తున్నారు. కొన్నేళ్ల క్రితం అస్సలు అడిగేవారే కారు. పిల్లలు తర్వాత కావాలనుకుంటే, తమ అండాలు, వీర్యం, లేదా పిండాలను కూడా ఫ్రీజ్ చేసుకునేందుకు అవకాశం ఉంది” అని తెలిపారు.పురుషుల సంతానరాహిత్య అంగీకారంలో మార్పుసంతానరాహిత్య సమస్యలకు పరీక్షలు చేయించుకోవడంలో పురుషుల ఆలోచనా విధానం గణనీయంగా మారిందని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలోని సంతానసాఫల్య నిపుణులు చెబుతున్నారు. ఒక దశాబ్దం క్రితం పురుషులు వీర్యం విశ్లేషణ చేయించుకోవడానికి వెనకాడేవారు. పురుషుల వల్ల కూడా సంతానరాహిత్య సమస్యలు వస్తాయని గుర్తించడానికే ఇష్టపడేవారు కారు. కానీ ఇప్పుడు వీర్యం విశ్లేషణ విషయంలో పురుషులు ధైర్యంగా ముందుకొస్తున్నారు. తద్వారా పురుషుల సంతానసాఫల్య ఆరోగ్య ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రయోగశాలలతో, సంతాన సాఫల్య చికిత్సలను అందించడంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్న సమగ్ర సంతాన సాఫల్య చికిత్సా కేంద్రం. -
భర్త చనిపోయిన 15 నెలలకు బిడ్డకు జన్మనిచ్చిన మోడల్.. ఎలాగో తెలుసా?
భార్యభర్తల్లో ఒకరు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోతే ఈ విషాదాన్ని తట్టుకోవడం, దాన్నుంచి బయటపడటం రెండో వారికి చాలా కష్టం. తమ దాంపత్యానికి గుర్తుగా పుట్టిన పిల్లల్ని చూసుకుంటూ, వారికోసం జీవితాన్ని గడిపేసే వారు ఎక్కువగా ఉంటారు కదా. కానీ ఒక ఆస్ట్రేలియన్ మహిళ తన జీవిత భాగస్వామి చనిపోయిన 15 నెలలకు బిడ్డకు జన్మనిచ్చింది. ఏంటీ అర్థం కాలేదా? అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే.ఆస్ట్రేలియన్ మోడల్ ఎల్లిడీ పుల్లిన్ స్పెర్మ్ రిట్రీవల్ ద్వారా బిడ్డను కన్నది. తన పోడ్కాస్ట్లో తన ప్రయాణాన్ని పంచుకుంది. మరణానంతరం భర్త వీర్యం ద్వారా గర్భం దాల్చడం, బిడ్డను కనడం గురించి పోడ్కాస్ట్లో వివరించింది. ఈ స్టోరీ ఇపుడు వైరల్‌గా మారింది. 2022లోనే ఇన్‌స్టాలో ఈ వివరాలను షేర్ చేసింది కూడా. View this post on Instagram A post shared by El Pullin (@ellidy_) 2020 జూలైలో ఎల్లిడీ పుల్లిన్ భర్త అలెక్స్ చుంప్ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. స్పియర్ ఫిషింగ్‌లో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు విడిచిన తన భర్తకు గుర్తుగా బిడ్డను కనాలని ఆశపడింది. ఇందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ, పద్ధతుల గురించి స్డడీ చేసింది. భర్త నుంచి పోస్ట్‌మార్టం స్పెర్మ్ రిట్రీవల్ చేయాలని వైద్య నిపుణులను కోరింది. డాక్టర్లు మరణించిన భర్త నుంచి స్మెర్మ్ కలెక్ట్ చేశారు. తర్వాత ఐవీఎఫ్ విధానంలో ఎల్లిడీ గర్బం దాల్చింది.అలా భర్తను కోల్పోయిన 15 నెలలకు ఎల్లిడీ ఒక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అక్టోబర్ 2021లో మిన్నీ అలెక్స్ పుల్లిన్కు జన్మనిచ్చింది. తన పాప అచ్చం తన భర్తలానే ఉంది అంటూ మురిసిపోయింది. ఎల్లిడీ షేర్ చేసుకున్న వివరాల ప్రకారం. 2020 ఉదయం మాజీ వింటర్ ఒలింపియన్ అలెక్స్ స్పియర్ ఫిషింగ్‌కు వెళ్లాడు. ఎల్లిడీ అప్పుడు తమ కుక్కను బయటకు వాకింగ్‌కి తీసుకెళ్లింది. కానీ ఆమె భర్తను చూడటం అదే చివరిసారి అవుతుందని అస్సలు ఊహించలేదు. చివరికి ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తన భర్త చనిపోయినట్టు గుర్తించింది. ఇంతలోనే పోస్ట్‌మార్టం స్పెర్మ్ రిట్రీవల్ గురించి తన స్నేహితులు చర్చించు కోవడం ఆమెను ఆకర్షించింది. ఎందుకంటే వారు ఒక బిడ్డను కనేందుకు అప్పటికే చాలా ఆశపడడ్డారు. చివరికి ఆరు నెలల తర్వాత ఐవీఎఫ్ ద్వారా తన కలను సాకారం చేసుకుంది. -
కొడుకు డ్రీమ్ : బిడ్డను ‘కన్న’తల్లి టీవీ నటి, క్యూట్ బేబీ (ఫోటోలు)
-
Russia-Ukraine war: చేజారిన తోడే.. బొడ్డుతాడై...
ఉక్రెయిన్. ఒకప్పటి అందాల దేశం. ఇప్పుడు రష్యా రక్త దాహానికి బలైన శిథిల చిత్రం. యుద్ధం మిగిల్చే బీభత్సానికి సాక్షి. పోరులో ప్రాణాలొదిలిన వేలాది మంది ఉక్రెయిన్ యువ సైనికుల జీవిత భాగస్వాములది మాటలకందని దైన్యం. వారిలోనూ అసలు సంతానమే లేనివారిదైతే చెప్పనలవి కాని వ్యథ. ఎవరి కోసం బతకాలో తెలియని నైరాశ్యం. అయితే తమ జీవిత భాగస్వాములు ముందుజాగ్రత్తగా భద్రపరిచి వెళ్లిన వీర్యం/అండాలు వారిలో కొత్త ఆశలు నింపుతున్నాయి. వాటి సాయంతో బిడ్డలను కంటున్నారు. తమను శాశ్వతంగా వీడి వెళ్లిన తోడు తాలూకు నీడను వారిలో చూసుకుంటున్నారు. భవిష్యత్తుపై ఆశలు పెంచుకుంటున్నారు... ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలై రెండేళ్లవుతోంది. 2022 ఫిబ్రవరి 24న ఆ దేశంపై రష్యా సైన్యం హఠాత్తుగా విరుచుకుపడింది. రోజుల్లో తల వంచుతుందనుకున్న ఉక్రెయిన్ దీటుగా పోరాడుతోంది. దాంతో రెండేళ్లయినా పోరు కొనసాగుతూనే ఉంది. యుద్ధమంటేనే ప్రాణనష్టం! ఇప్పటిదాకా ఏకంగా 70,000 మంది ఉక్రెయిన్ జవాన్లు మరణించినట్లు అంచనా. మరో లక్షన్నర మందికి పైగా క్షతగాత్రులుగా మారారు. యుద్ధంలో జవాను వీరమరణం పొందితే అతడి/ఆమె వంశం అంతమైపోవాల్సిందేనా? బతికుండగానే అండాలు, వీర్యం భద్రపర్చుకొని, తాము లేకపోయినా జీవిత భాగస్వామి ద్వారా సంతానం పొందే వెసులుబాటును ఎందుకు ఉపయోగించుకోవద్దు? ఇలాంటి ప్రశ్నలు ఉక్రెయిన్ సైన్యం నుంచి గట్టిగా వినిపించాయి. దీనిపై ప్రభుత్వమూ సానుకూలంగా స్పందించింది. పార్లమెంటులో ఇటీవలే ఒక బిల్లును ఆమోదించింది. అధ్యక్షుడు వొలిదిమిర్ జెలెన్స్కీ సంతకం చేస్తే చట్టంగా మారనుంది. ఇదొక విప్లవాత్మక చట్టం కానుందని నిపుణులు ప్రశంసిస్తున్నారు. యుద్ధంలో మరణించినవారి వీర్యం/అండాలతో సంతానం పొందే అవకాశం ఇప్పటిదాకా ఉక్రెయిన్‌లో చట్టపరంగా లేదు. ఇక ఈ పరిస్థితి మారనుంది... ► ఉక్రెయిన్ పార్లమెంట్లో ఆమోదించిన బిల్లు ప్రకారం జవాన్లు తమ వీర్యం, అండాలు భద్రపర్చుకోవచ్చు. వారు యుద్ధంలో అమరులైతే వాటి సాయంతో జీవిత భాగస్వాములు సంతానం పొందవచ్చు. ► ఈ కొత్త చట్టాన్ని అంతా స్వాగతిస్తున్నారు. దీని ద్వారా అమర సైనికుల కుటుంబ వారసత్వం కొనసాగుతుందంటున్నారు. ► జవాన్ల వీర్యం/అండాలు ఉచితంగా భద్రపరుస్తామని ఉక్రెయిన్‌లో పలు సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. యుద్ధం మొదలైనప్ప టి నుంచే ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నాయి. ► ఇందుకు వీలుగా యుద్ధంలో మృతి చెందిన జవాన్ల వీర్యం/అండాలను మూడేళ్ల పాటు భద్రపరుస్తారు. ఇందుకు ప్రభుత్వమే ఆర్థిక సాయం అందిస్తుంది. ► వీర్యం/అండాలు భద్రపర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్న సైనికుల సంఖ్య ఇటీవల కాలంలో భారీగా పెరిగింది. ప్రభుత్వం అనుమతితో పాటు ఆర్థిక సాయమూ అందిస్తుందని స్పష్టత రావడమే కారణమని తెలుస్తోంది. ► యుద్ధంలో క్షతగాత్రులై, ఆరోగ్యం దెబ్బతిని సంతానోత్పత్తికి, బిడ్డలకు జన్మనిచ్చే సామర్థ్యానికి దూరమైన సైనికులు కూడా వీర్యం/అండాలను భద్రపర్చుకుని సంతానం పొందవచ్చు. ► యుద్ధంలో గాయపడిన పలువురు జవాన్లు ఈ సేవలు ఉపయోగించుకుంటున్నారు. ► ఇలా భద్రపర్చిన వీర్యం/అండాలతో పుట్టే పిల్లలకు చట్టబద్ధంగా అన్ని హక్కులూ ఉంటాయి. అమర వీరులైన తల్లి/తండ్రి పేరును వారి బర్త్ సరి్టఫికెట్లో ముద్రిస్తారు! ► ఇప్పటికే ఒక బిడ్డ ఉన్నవారు కూడా మరో బిడ్డను కనడానికి ముందుకొస్తున్నారు. ఇలా భద్రపర్చుకుంటున్న జవాన్లలో మహిళల కంటే పురుషుల సంఖ్య అధికంగా ఉంది. మన పాప నవ్వుల సాక్షిగా... నువ్వెప్పటికీ నాతోనే... మనసుతో చూడగలిగితే లక్ష భావాలను, కోటి ఊసులను కళ్లకు కట్టే ఫొటో ఇది. ఇందులో నేపథ్యంలోని పోస్టర్లో కనిపిస్తున్నది రష్యాతో పోరులో మరణించిన ఉక్రెయిన్ సైనికుడు విటాలీ. బుల్లి పాపాయిని ఎత్తుకున్నది అతని భార్య విటాలినా. భర్త మరణానంతరం ఆయన వీర్యంతో గర్భం దాల్చి ఈ పండంటి పాపాయికి జన్మనిచి్చందామె. కూతురిని భర్త ఫొటోకు చూపిస్తూ ఇలా భావోద్వేగానికి గురైంది. రష్యాతో యుద్ధం మొదలయ్యే కొద్ది నెలల ముందే విటాలీ ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు. ఫ్రంట్ లైన్లో పోరాడుతూ యుద్ధం మొదలైన తొలి నాళ్లలోనే మరణించాడు. అప్పటికే విటాలినా 13 వారాల గర్భవతి. కానీ ఆ గర్భం నిలవలేదు. భర్త క్షేమం తాలూకు ఆందోళనే అందుకు ప్రధాన కారణమని ఇప్పటికీ కన్నీళ్లపర్యంతం అవుతుంటుంది విటాలినా. ‘‘అటు జీవితాంతం తోడుండాల్సిన భర్తను, ఇటు ఇంకా లోకమే చూడని మా కలల పంటను కొద్ది రోజుల తేడాతో శాశ్వతంగా కోల్పోయా. బతుకంతా ఒక్కసారిగా శూన్యంగా తోచింది’’ అంటూ అప్పటి రోజులను గుర్తు చేసుకుందామె. ‘‘ఇలాంటి పరిస్థితిని ఊహించే నా భర్త వీర్యాన్ని భద్రపరిచి వెళ్లాడు. దాని సాయంతో తల్లిని కావాలని నిర్ణయించుకున్నా. అలా ఈ చిట్టి తల్లి ఈ లోకంలోకి అడుగు పెట్టింది. తన రాకతో నాకు నిజంగా సాంత్వన చేకూరింది. పాప వాళ్ల నాన్న పోలికలనే గాక హావభావాలను కూడా ముమ్మూర్తులా పుణికి పుచ్చుకుంది. దైవ కృప అంటే బహుశా ఇదేనేమో. నిజానికి గంపెడు సంతానాన్ని కనాలని, మాది పెద్ద కుటుంబం కావాలని పెళ్లికి ముందు నుంచీ ఎన్నెన్నో కలలు కన్నాం. కానీ విధి రాత మరోలా ఉంది. అయినా తను ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం ఈ చిట్టితల్లి రూపంలో ఇలా ఫలించింది’’ అంటుంటే విని చెమర్చని కళ్లు లేవు. కాస్త అటూ ఇటుగా ఉక్రెయిన్ సైనిక వితంతువులందరి గాథ ఇది...! – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘కణా’కష్టం!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యం క్షీణిస్తోందా? 4.85 కోట్ల జంటలు సంతానలేమితో బాధ పడటానికి ఇదే కారణమా? ఐదారు వందల సంవత్సరాల తర్వాత పరిస్థితి మరింత తీవ్రం కానుందా? అంటే... అంతర్జాతీయ అధ్యయనాలు అవుననే అంటున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్లే ఈ పరిస్థితి నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పురుషుల్లో శుక్రకణాలు తగ్గడమే సంతానోత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణమని చెబుతున్నాయి. సమాజంలో సాధారణంగా స్త్రీల పునరుత్పత్తి సామర్థ్యంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంటుందని, పురుషులకు సంబంధించి పెద్దగా చర్చ జరగడం లేదని పలు నివేదికలు చెబుతున్నాయి. పితృస్వామ్య వ్యవస్థ కారణంగానే ఇలా జరుగుతోందని అంటున్నాయి. ఆఫ్రికా, ఆసియా వంటి దేశాల్లోనైతే సంతానలేమికి స్త్రీనే కారణంగా పేర్కొంటూ నిందిస్తారు. కాగా కొన్ని ప్రాంతాల్లో బహు భార్యత్వం ఇప్పటికీ కొనసాగుతుండటానికి గల కారణాలలో సంతానలేమిని అధిగమించాలన్నది ఒకటని అంటున్నారు. 51 శాతం తగ్గిన శుక్రకణాలు ప్రపంచ వ్యాప్తంగా సంతానలేమిపై ‘çహ్యూమన్ రిప్రొడక్షన్ అప్డేట్–2023’నివేదిక వెలువడింది. 20, 21 శతాబ్దాలలో ఏం జరిగిందనేది దీని సారాంశం. 1973 నుంచి 2020 వరకు 50 ఏళ్ల కాలంలో పరిస్థితిని నివేదిక వివరించింది. 1970లో 20–30 వయస్సు గల ఒక యువకుడికి వంద మిలియన్ల శుక్రకణాలు ఉన్నాయనుకుంటే.. 2020 వచ్చే నాటికి అదే వయస్సుగల వారు కొందరిలో 50 శాతం వరకు తగ్గిపోయాయి. అంటే 50 మిలియన్లకు శుక్రకణాలు తగ్గిపోయాయన్న మాట. అలాగే 1972లో ఒక వ్యక్తికి శుక్రకణాలు 101 మిలియన్లు ఉంటే... 2018లో అదే వయస్సు గల వారిలో శుక్రకణాల సంఖ్య 49 మిలియన్లకు పడిపోయాయి. ఇలా గడిచిన ఐదు దశాబ్దాలలో మానవ శుక్రకణాల సాంద్రత 100 మిలియన్ల నుంచి 49 మిలియన్లకు పడిపోయింది. అంటే సుమారుగా 51 శాతం తగ్గిందన్న మాట. అంటే పునరుత్పత్తి సామర్థ్యం ఆ మేరకు తగ్గిపోయిందన్నమాట. ప్రతి ఆరు జంటల్లో ఒకరు సంతానలేమి సమస్యతో బాధపడుతుండటం గమనార్హం. భారత్‌లో 2.75 కోట్ల మంది.. సంతానలేమితో బాధపడేవారిలో 80 శాతం మందికి ప్రధానంగా శుక్రకణాలు తక్కువగా ఉంటాయి. ఒక్కోసారి జీరో కూడా ఉండొచ్చు. జీరో శుక్రకణాలు ఉండేవారు జనాభాలో 7 నుంచి 10 శాతం మంది ఉంటారని అంచనా. ఇక ఇండియాలో 2.75 కోట్ల మంది సంతాన లేమితో బాధపడుతున్నారు. 48 శాతం మందిలో స్త్రీలు కారణం కాగా, 20.4 శాతం ఇద్దరిలో సమస్యల వల్ల, 31.6 శాతం మందిలో పురుషుల కారణంగా సంతాన సమస్య ఏర్పడింది. ఇక ప్రపంచవ్యాప్తంగా సంతానలేమితో బాధపడే జంటలు 4.85 కోట్లు ఉన్నట్లు అంచనా. సంతానలేమితో బాధపడేవారిలో శుక్రకణాల సంఖ్య 15 మిలియన్ల నుంచి 20 మిలియన్ల కంటే తక్కువగా ఉంటుంది. పురుషులలో హార్మోన్ల లోపం, మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో పుట్టుకతో వచ్చే లోపాలు, పురుష ప్రత్యుత్పత్తి అవయవాల్లో ఇన్ఫెక్షన్లు, మారుతున్న జీవన విధానం, మానసిక, శారీరక, వృత్తిపరమైన ఒత్తిడులు, ఆలస్యంగా జరుగుతున్న వివాహాలు, ఆహార కల్తీలు, ధూమ మద్యపానానికి అలవాటు పడడం, మాదకద్రవ్యాలకు బానిసలవటం, వాతావరణ కాలుష్యం, మొబైల్స్ విపరీత వినియోగం లాంటివి సంతానలేమికి కారణాలుగా చెబుతున్నారు. వైద్య చికిత్సలతోసమస్యను అధిగమించొచ్చు సంతానోత్పత్తి సవ్యంగా జరగాలంటే ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. శుద్ధిచేసిన ఆహారాన్ని తీసుకోకూడదు. ధూమ, మద్యపానానికి దూరంగా ఉండాలి. నిత్యం వ్యాయామం చేయడం, ధ్యానం లాంటివి అలవరుచుకోవాలి. ఏడెనిమిది గంటల నిద్ర ఉండాలి. అయితే శుక్రకణాల సంఖ్యను పెంచాలన్నా, పునరుత్పత్తి సామర్థ్యం పెంచాలన్నా అనేక వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సరైన చికిత్స చేయించుకుంటే సంతానోత్పత్తి సమస్యలను అధిగమించవచ్చు. ఎజోస్పెర్మియా (జీరో స్పెర్మ్ కౌంట్) లోపాన్ని సరిదిద్దేందుకు ఆధునిక చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. రెండు రకాలైన (నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా, అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా) ఎజోస్పెర్మియా లోపాలను వైద్యపరంగా సరిదిద్దేందుకు అవకాశం ఉంది. ఇక వ్యారికోసి సమస్య కారణంగా శుక్రకణాలు తగ్గిన పురుషులకు మైక్రోసర్జికల్ వ్యారోకోసిలెక్టమీ చేయడం ద్వారా వాటిని పెంపొందించవచ్చు. – డాక్టర్ రాఘవేంద్ర కోస్గి, సీనియర్ కన్సల్టెంట్యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్,అపోలో ఆస్పత్రి, హైదరాబాద్ -
చనిపోయిన భర్త నుంచే పిల్లలు పొందాలని.. ఆమె ఏకంగా..!
ఇటీవల కాలంలో చనిపోయిన భర్త నుంచే పిల్లలను కన్న ఓ మహిళ గురించి విన్నాం. ఆకేసులో ఆ దంపతులు పిల్లలు పుట్టకపోవడంతో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) ఆస్పత్రిని ఆశ్రయించారు. ఆ పద్ధతిలో పిల్లను కనాలనుకునేలోపు కరోనా మహమ్మారి రావడం భర్త చనిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. ఒంటిరిగా అయిపోయిన ఆ భార్య తన భర్త ఉన్నప్పుడు పిల్లలను కనాలనుకున్న ఘటన గుర్తొచ్చి ఆస్పత్రికి వెళ్లి తన నిర్ణయాన్ని తెలిపి మరీ సాహసోపేతంగా బిడ్డను కని వార్తల్లో నిలిచింది. అది మరువక మునుపే అదే మాదిరి ఘటన కాకపోతే కొద్ది తేడా ఉంది. అక్కడ బతికుండగానే భర్త నుంచి స్పెర్మ్ తీసుకున్నారు. ఇక్కడ ఈ జంట కనాలనుకునేలోపే భర్త అకాల మరణం పొందాడు. అయినా తన భర్త నుంచే పిల్లలను కనాలనుకుంటున్నా అంటూ అందుకు పర్మిషన్ ఇమ్మని ఏకంగా సుప్రీం కోర్టునే ఆశ్రయించి అనుమతి తెచ్చుకుంది. ఈ ఆశ్చర్యకర ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..వెస్ట్ ఆస్ట్రేలియాకు చెందిన 62 ఏళ్ల మహిళ ఆమె భర్త తమ ఇద్దరు పిల్లలను వేర్వేరు ఘటనలు పోగొట్టుకున్నారు. దీంతో ఇరువురు పిల్లను కనాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే అనుకోకుండా ఇటీవలే డిసెంబర్ 17న భర్త ఆకస్మికంగా మరణించారు. దీంతో ఆమె తన భర్త బతికుండగానే పిల్లలను కనాలనుకున్న దాన్ని నిజం చేయాలనుకుంది. చనిపోయినప్పటికీ తన భర్త నుంచే పిల్లలను కనాలనుకుంది. అందుకోసం అని చనిపోయిన భర్త నుంచి స్పెర్మ్‌ని సేకరించాలనుకుంది. దీనికి సుప్రీం కోర్టు అనుమతివ్వాలంటూ అభ్యర్థించింది. తన భర్త బతికున్నప్పుడే తామిరువురం అనుకున్నామని, తన భర్త కోరికని అనుమతిమ్మని కోర్టుని వేడుకుంది. దీంతో ధర్మాసనం చనిపోయిన భర్త నుంచి స్పెర్మ్‌ని తీసుకునేందు అనుమతి మంజూరుచేసింది. ఇక్కడ ఓ చనిపోయిన వ్యక్తి స్పెర్మ్ ఫలదీకరణం చెందించేలా ఉపయోగించడం అనేది వైద్యశాస్త్రంలో మరింత పురోగతికి నాంది పలుకుతుందనే చెప్పాలి. ఇక ఆ జంట పిల్లలు 2013లో కుమార్తె(29) ఫిషింగ్ ట్రిప్‌లో మరణించగా, కుమారుడు(30) కారు ప్రమాదంలో మరణించాడు. దీంతో ఆ జంట ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లను కనాలని అనుకుంది. అయితే పిల్లలను కనే వయసు సదరు మహిళకు దాటిపోవడంతో సరోగసి ద్వారా పిల్లలను పొందాలనుకున్నారు. ఈలోగా అనుకోకుండా భర్త దూరమవ్వడంతో ఆ కోరిక కలగా మిగిలిపోకూడదని ఆ మహిళ స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించి చనిపోయిన భర్త నుంచే స్పెర్మ్‌ని సేకరించేలా అనుమతి పొందింది. కాగా, మరణాంతర ఫలదీకరణంపై వెస్ట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. అందువల్ల ఆమె సరోగసి ద్వారా బిడ్డను పొందాలనుకుంటే..ముందుగా సదరు మహిళ స్త్రీ పునరుత్పత్తి సాంకేతిక పరిజ్ఞాన మండలికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆమె దివగంత భర్త తండ్రి కావాలనుకున్నాడా? అలాగే సదరు మహిళ చెబుతోంది అంతా నిజమేనా? అన్నది నిర్థారణ చేసుకుని ఆస్ట్రేలియా వైద్యాధికారులు అనుమతి ఇస్తేనే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక అధికారులు సదరు మహిళ వివరాలను చాలా గోప్యంగా ఉంచారు. (చదవండి: ఒక లీటర్ బాటిల్లో ఎన్ని నానో ప్లాస్టిక్ కణాలు ఉంటాయో తెలుసా! వెలుగులోకి షాకింగ్ విషయాలు!) -
పుట్టుకతో వచ్చే లోపాలకు కారణం మద్యపానమే!వెలుగులోకి షాకింగ్ విషయాలు
ప్రెగ్నెన్సీ లేదా ఫ్యామిలీ ప్లాన్ చేసుకుంటే మాత్రం పురుషులు మద్యం సేవించడం మానేయాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. లేదంటే గర్భధారణ సమస్యలు లేదా పిల్లల్లో సరైన పెరుగుదల లేకపోవడం లేదా పుట్టుకతో వచ్చే లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువుగా ఉటాయంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. కనీసం ఓ వారం రెండు వారాల నుంచి మద్య మానేయడం కాదని బాంబు పేల్చారు. సేవించిన మద్యం ప్రభావం స్పెర్మ్‌పై ఎలా ఉంటుందో కూడా సవివరంగా వివరించారు. మద్య సేవించే పురుషులకు పుట్టే పిల్లల్లో ఎలాంటి సమస్యలొస్తాయో తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఇంతవరకు గర్భధారణ, పిల్లల అభివృద్ధి విషయాల్లో తల్లి ఆరోగ్యాన్ని కీలకంగా పరిగణించేవారు పరిశోధకులు. ఆ దిశగానే పరిశోధనలు చేయడం జరిగింది. అయితే గర్భధారణకు ముందు ఆల్కహాల్ తీసుకోవడం కారణంగా ఆ మహిళకు పిల్లలు కనడంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అనే దిశగా పరిశోధనలు జరగలేదు. తొలిసారిగా ఆవైపుగా అధ్యయనం సాగించారు శాస్త్రవేత్తలు. ఆ పిండానికి ఆల్కహాల్ సిండ్రోమ్(ఎఫ్ఏఎస్)తో సంబంధం ఉండే అవకాశాలు ఉంటాయా? అనే దిశగా సరికొత్త ప్రయోగాలు చేశారు. ఆ అధ్యయనంలో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీని కారణంగా బరువు తక్కువుగా జననాలు, హైపర్ యాక్టీవిటీ సమస్యలు, సరైన ఎదుగుదల లేని పిల్లలు పుట్టడానికి కారణమని తేలింది. పిల్లలను లేదా ఫ్యామీలిని ప్లాన్ చేసుకుంటే మగవాళ్లని మద్యం సేవించకుండా మహిళలే చూసుకోవాలని లేదా బాధ్యత తీసుకోవాలని సూచించారు పరిశోధకులు. మద్యం సేవించిన ఎంతకాలం వరకు స్పెర్మ్‌పై ఆల్కహాల్ ప్రభావం ఉంటుందనే దానిపై కూడా పరిశోధనలు నిర్వహించారు. తండ్రి ఆల్కహాల్ అలవాట్లు పిండం అభివృద్ధిలో బలమైన ప్రభావం ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు. దీంతో తాము స్పెర్మ్‌పై ఆల్కహాల్ ప్రభావం తగ్గడానికి ఎంత సమయం పడుతుందో అనే దిశగా కూడా అధ్యయనం చేసినట్లు తెలిపారు. అందుకోసం మగ ఎలుకలపై ప్రయోగాలు చేయగా..కొన్నింటి ఆల్కహాల్‌కు గురిచేసి మరికొన్నింటికి ఆల్కహాల్ ఇవ్వకుండా చూడగా వాటి జన్యువుల్లో సంభించిన పలు మార్పులను గమనించినట్లు తెలిపారు. ఈ పరిశోధనల్లో కనీసం మూడు, నాలుగు వారాలు కాకుండా ఏకంగా మూడు నెలల పాటు ఆల్కహాల్‌కి దూరంగా ఉంటేనే వారి శరీరంలో ఉత్పత్తి అయ్యే స్పెర్మ్‌పై ప్రభావం ఉండదని అధ్యయనంలో వెల్లడయ్యిందని అన్నారు. అలాగే మగవారిలో స్పెర్మ్ 60 రోజుల వ్యవధిలో తయారవుతుందని మాకు తెలుసు. కానీ మద్యం మానేసిన ఒక నెలకు గానీ సెర్మ్పై ఆల్కహాల్ ప్రభావం తగ్గటం ప్రారంభమవ్వదని అన్నారు. అందువల్ల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పడూ కనీసం రెండు నుంచి మూడు నెలల వరకు మద్యం మానేయాల్సిందేనని సూచించారు. అప్పటి వరకు ఆగి ఫ్యామిలీని ప్లానే చేసుకోకతప్పదని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు మద్యం మానేసినప్పటికీ దాని తాలుకా రసాయనా ప్రభావం శరీరంలో అలా కొనసాగుతు ఉంటుందని అందువల్ల మూడు నెలల సమయం విరామం తీసుకోవాల్సిందేనని అన్నారు. లేదంటే తల్లిదండ్రులు ఆల్కహాలిక్ సంబంధిత పుట్టుకతో వచ్చే లోపాలను ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు పరిశోధకులు. (చదవండి: భర్త చనిపోయిన రెండేళ్లకు ప్రెగ్నెంట్! ఆమె ధైర్యాన్ని కొనియాడుతున్న వైద్యులు) -
బుల్లితెర నటి సూసైడ్ కేసు.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!
బుల్లితెర నటి ఆకాంక్ష దూబే ఈ ఏడాది మార్చి 25న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. భోజ్‌పురి నటి ఆకాంక్ష యూపీలోని వారణాసిలో గతనెలలో బలవన్మరణానికి పాల్పడింది. హోటల్లోని తన గదిలో విగతజీవిగా కనిపించింది. ఆమె సూసైడ్ ఘటనపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అయితే నటి ప్రియుడు, సింగర్ సమర్ సింగ్‌పై అనుమానం వ్యక్తం చేయగా.. అతనితో పాటు అతని సోదరుడు సంజయ్‌ను ఘజియాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. (ఇది చదవండి:వెకేషన్లో శ్రద్ధా దాస్ హోయలు.. జిమ్‌లో యాంకర్ సుమ కసరత్తులు) ఇదిలా ఉండగా ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా ఈ కేసులో పోలీసుల దర్యాప్తులో ఓ షాకింగ్ విషయం తెలిసింది. ఆత్మహత్య చేసుకున్న నటి ఆకాంక్ష లో దుస్తులపై స్పెర్మ్‌ను గుర్తించినట్లు తెలిపారు. పరీక్షల కోసం ఆమె దుస్తులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో నిందితులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దీనికోసం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. కాగా.. ఇప్పటికే ఈ కేసులో పోలీసుల దర్యాప్తుపై ఆకాంక్ష కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా.. 25 ఏళ్ల ఆకాంక్ష దూబే ముజ్సే షాదీ కరోగి , వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. (ఇది చదవండి: రాధికా శరత్‌కుమార్‌కు గోల్డ్ రింగ్ గిఫ్టుగా ఇచ్చిన లారెన్స్) -
వైద్య చరిత్రలో సంచలనం.. రోబో సాయంతో ఐవీఎఫ్.. ఆడ పిల్లల జననం!
వైద్య రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఓ రోబో సాయంతో చేసిన ఐవీఎఫ్ విజయవంతమైంది. పండంటి ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. స్పెయిన్ దేశం బార్సిలోనా నగరానికి చెందిన ఇంజినీర్ల బృందం రోబోటిక్స్ సాయంతో మానవ అండంలోకి శుక్రకణాలను ప్రవేశపెట్టింది. ఈ రోబోటిక్ ఐవీఎఫ్ టెక్నాలజీ వినియోగాన్ని అమెరికా న్యూయార్క్ సిటీకి చెందిన న్యూహోప్ ఫర్టిలిటీ సెంటర్లో జరిపారు. ఫలితంగా పండంటి ఇద్దరు ఆడపిల్లలు జన్మించినట్లు ఎంఐటీ టెక్నాలజీ రివ్యూ తెలిపింది. సోనీ ప్లేస్టేషన్ 5 కంట్రోలర్ సాయంతో రిపోర్ట్ ప్రకారం.. రోబోటిక్ ఐవీఎఫ్ విధానంపై ఏ మాత్రం అనుభవం లేని ఓ ఇంజినీర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అండంలోకి శుక్రకణాల్ని పంపించేందుకు సోనీ ప్లేస్టేషన్ 5 కంట్రోలర్‌ను వినియోగించారు. కెమెరా ద్వారా మానవ అండాన్ని చూసిన రోబో.. తనంతట తానే ముందుకు చొచ్చుకెళ్లి.. అండంపై స్పెర్మ్‌ను జారవిడిచినట్లు నివేదిక తెలిపింది. 9 నెలల తర్వాత ఇద్దరు ఆడపిల్లలు జన్మించినట్లు ఎంఐటీ టెక్నాలజీస్ తన నివేదికలో పేర్కొంది. ఖర్చు తగ్గుతుంది ఇక అత్యాధునిక టెక్నాలజీ కారణంగా ప్రస్తుతం వైద్యులు చేసే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ఖర్చు గణనీయంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. రోబోట్‌ను అభివృద్ధి చేసిన స్టార్టప్ కంపెనీ ఓవర్చర్ లైఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. రోబోట్ సాయంతో ఐవీఎఫ్ పరీక్ష ప్రారంభ దశలో ఉందని తెలిపారు. పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే ఈ విధానంతో ఖర్చు సైతం తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఐవీఎఫ్ ద్వారా 5 లక్షల మంది పిల్లలు ప్రతి సంవత్సరం దాదాపు 5,00,000 మంది పిల్లలు ఐవీఎఫ్ ద్వారా పుడుతున్నారు. కానీ చాలా మందికి సంతానోత్పత్తి కోసం ఉపయోగించే సరైన మెడిసిన్ అందుబాటులో లేకపోవడంతో పాటు చాలా ఖర్చుతు కూడుకున్నది. చదవండి👉 అప్పుల్లో తమిళనాడు టాప్.. ఏ రాష్ట్రానికి ఎంత అప్పు ఉందంటే? -
మా ఆయనకు స్పెర్మ్‌కౌంట్ నిల్.. డోనర్ స్పెర్మ్ వల్ల సైడ్ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా?
►నా వయసు 26 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లవుతోంది. ఇంతవరకు పిల్లల్లేరు. ఇటీవల పరీక్షలు చేయించుకుంటే, నాకు అంతా నార్మల్‌గా ఉన్నట్లు తేలింది. మా ఆయనకు స్పెర్మ్‌కౌంట్ నిల్ అని వచ్చింది. డోనర్ స్పెర్మ్ ద్వారా ప్రెగ్నెన్సీ పొందవచ్చని డాక్టర్ చెప్పారు. దీనివల్ల సైడ్ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? – వందన, చోడవరం స్పెర్మ్‌కౌంట్ నిల్ అంటే వీర్యంలో వీర్యకణాలు అసలు లేవు అని అర్థం. దీనినే అజోస్పెర్మియా అంటారు. ఆయనకు అన్ని పరీక్షలు చేసిన తర్వాతే డాక్టర్ కౌంట్ నిల్ అని నిర్థారించారని అనుకుంటున్నాను. కొందరిలో వృషణాలలో తయారయ్యే వీర్యకణాలు,అక్కడి నుంచి యురెత్రా ద్వారా బయటకు వచ్చే దారిలో ఎక్కడైనా అడ్డంకులు ఉండటం వల్ల వీర్యంలో వీర్యకణాలు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వృషణాల నుంచే వీర్యకణాలు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వృషణాల నుంచే టీసా, మీసా వంటి పద్ధతి ద్వారా టెస్టిక్యులార్ బయాప్సీ చేసి అసలు వీర్యకణాలు ఉత్పత్తి అవుతున్నాయా లేదా అనేది నిర్ధారిస్తారు. ఒకవేళ కొన్ని అయినా వీర్యకణాలు ఉంటే, వాటిని ఐసీఎస్ఐ, ఐవీఎఫ్ టెస్ట్‌ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా గర్భం కోసం ప్రయత్నించవచ్చు. కానీ ఇది ఖర్చుతో కూడిన చికిత్స. అన్ని విధాల స్పెర్మ్‌కౌంట్ నిల్ ఉన్నప్పుడు, డోనర్ స్పెర్మ్ ద్వారా గర్భం కోసం ప్రయత్నించవచ్చు. ఇందులో స్పెర్మ్ బ్యాంక్ నుంచి డోనర్ నుంచి సేకరించిన వీర్యకణాలను శుభ్రపరచి, వేరుచేసి, భద్రపరచిన వాటిని తెప్పించుకుని, ఆడవారిలో అండం విడుదలయ్యే సమయంలో యోని భాగంలో నుంచి గర్భాశయంలోకి ఈ డోనర్ వీర్యకణాలను చిన్న ప్లాస్టిక్ కెన్యూలాలో ఐయూఐ పద్ధతి ద్వారా ప్రవేశింపబడుతాయి. అలా ప్రవేశించిన వీర్యకణాల ఫెలోషియన్ ట్యూబ్‌లోకి ఈదుకుంటూ వెళ్లి అక్కడ అండాశయం నుంచి విడుదలైన అండంలోకి చొచ్చుకుపోయి దానిని ఫలదీకరణ చెయ్యడం వల్ల పిండం ఏర్పడుతుంది. ఆ పిండం ట్యూబ్‌లో నుంచి గర్భాశయంలోకి చేరి అక్కడ అడ్డుకుని నిలబడటం ద్వారా గర్భం మొదలవుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కడైనా లోపాలు జరిగితే గర్భం రాదు. డోనర్ స్పెర్మ్‌ని తీసుకునేటప్పుడు, స్పెర్మ్ బ్యాంకులో డోనర్‌కు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని హెచ్ఐవీ, వీడీఎఫ్సీ, హెచ్‌సీవీ వంటి అనేక పరీక్షలు చేయడం జరుగుతుంది. కాబట్టి డోనర్ ఐయూఐ పద్ధతి ద్వారా పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ►గత ఏడాది చివర్లో నాకు లెప్ట్ సైడ్ ట్యూబ్ ప్రెగ్నెన్సీ లాపరోటమీ ఆపరేషన్ అయింది. ఆపరేషన్ జరిగిన మూడు నెలల తర్వాత ఎడమవైపు– అంటే ఎడమ కంటి నుంచి ఎడమ కాలి వరకు విపరీతంగా నొప్పి, మంట సెగలుగా వస్తే గైనకాలజిస్టుకి చూపించుకున్నాను. అన్ని పరీక్షలూ చేసి, ఇది గైనిక్ సమస్య కాదన్నారు. కొద్దిరోజులు బాగానే ఉన్నా, తర్వాత పీరియడ్స్‌లో సమస్యలు మొదలయ్యాయి. పదిరోజులు వరుసగా బ్లీడింగ్, మళ్లీ పదిహేను రోజులకు పీరియడ్స్ రావడం జరుగుతోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – రమణి, చిత్తూరు మీ లాపరోటమీ ఆపరేషన్‌కు మీ లక్షణాలకు ఏ సంబంధం లేదు. పదిరోజులు వరుసగా బ్లీడింగ్ అవ్వటానికీ అండాశయంలో నీటి కంతులు, నీటి బుడగలు, ఇన్ఫెక్షన్, గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, థైరాయిడ్ వంటి హోర్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి వంటి ఎన్నో కారణాలు కావచ్చు. పదిరోజుల బ్లీడింగ్ తర్వాత పదిహేను రోజులకు పీరియడ్స్ రావటం అంటే 25 రోజులకొకసారి పీరియడ్స్ వస్తున్నాయి అన్నమాట. మీ ఎత్తు, బరువు రాయలేదు. కొన్నిసార్లు ఆపరేషన్ తర్వాత ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి కారణాల వల్ల బరువు పెరగవచ్చు. బరువు పెరగటం వల్ల కూడా హార్మోన్ల అసమతుల్యత, పీరియడ్స్‌లో సమస్యలు రావచ్చు. కాబట్టి బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గడానికి, యోగా, వాకింగ్, వ్యాయామాలు చేయడం, ఆహార నియమాలను పాటించడం మంచిది. అలాగే ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, సలహా మేరకు థైరాయిడ్ వంటి రక్తపరీక్షలు, పెల్విక్ అల్ట్రాసౌండ్ చెయ్యించుకుని గర్భాశయంలో అండాశయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుని.. కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. ►నా వయసు 23ఏళ్లు. ఎత్తు 5.3 అడుగులు, బరువు 76 కిలోలు. నాకు థైరాయిడ్, పీసీఓడీ సమస్యలు ఉన్నాయి. విపరీతంగా జుట్టు ఊడిపోతోంది. డాక్టర్ సలహా మేరకు థైరాయిడ్ మందులు వాడుతున్నాను. థైరాయిడ్ మందులతో పాటు హెయిర్‌ఫాల్ తగ్గడానికి మందులు వాడొచ్చా? హోమియో మందులు వాడొచ్చా? – అనుపమ, బలిజిపల్లి థైరాయిడ్ సమస్య వల్ల, పీసీఓడీ సమస్య వల్ల, ఆండ్రోజన్ హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్ల, రక్తహీనత వల్ల, పోషకాహార లోపాలు, మానసిక ఒత్తిడి, జన్యుసమస్యలు వంటి అనేక కారణాల వల్ల విపరీతంగా జుట్టు ఊడిపోవచ్చు. థైరాయిడ్ మాత్రలు వాడుతున్నారు కాబట్టి, దానివల్ల సమస్య లేదు. మీకు పీసీఓడీ ఉండటం వల్ల మగవారిలో ఉండే టెస్టోస్టిరాన్ హార్మోన్ పీసీఓడీ ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక హార్మోన్ ప్రభావం వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోవడం, మొటిమలు రావడం, అవాంఛిత రోమాలు ఉండటం జరుగుతుంది. మీ ఎత్తు 5.3 అడుగులకు గరిష్ఠంగా 60 కిలోల వరకు బరువు ఉండవచ్చు. కానీ మీరు 76 కిలోల బరువు ఉన్నారు. పీసీఓడీ వల్ల జుట్టు ఊడుతుంటే, వాకింగ్, వ్యాయామాలతో పాటు మితమైన పోషకాహారం తీసుకుంటూ, జంక్‌ఫుడ్ తీసుకోకుండా, సరైన ఆహార నియమాలు పాటిస్తూ, బరువు తగ్గడం వల్ల పీసీఓడీ వల్ల జరిగే హార్మోన్ల అసమతుల్యత సరిగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే థైరాయిడ్ సమస్య కూడా అదుపులో ఉంటుంది. దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది. బరువు తగ్గడంతో పాటు గైనకాలజిస్టు, డెర్మటాలజిస్టుల పర్యవేక్షణలో మందులు వాడుకుంటూ, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయడం, అవసరమైతే బయోటిన్‌తో కూడిన మల్టీవిటమిన్ మాత్రలు వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. మొదట బరువు తగ్గే ప్రయత్నం చేస్తూ, పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ , హోమియో మందులు వాడుకోవచ్చు. -డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్. చదవండి: ఒళ్లు నొప్పులా? తక్కువగా అంచనా వేయకండి.. -
వీర్యం కావాలని కోర్టుకెక్కిన భార్య.. సేకరించిన కాసేపటికే భర్త మృతి
అహ్మదాబాద్: కరోనా సోకి చావుబతుకుల మధ్య ఉన్న తన భర్త వీర్యం కావాలని కోర్టుకెక్కిన భార్య వార్త గుర్తుందా? అయితే, కోర్టు అనుమతితో వీర్యం సేకరించిన కొద్ది గంటల్లోనే అతను ప్రాణాలు వదిలాడు. ఈ విషయాన్ని మృతుడి భార్య తరపు న్యాయవాది తెలిపారు. ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లలను కంటానని ఆ మహిళ తెలపగా, ఆ విధానానికి అనుమతి ఇవ్వడంపై తదుపరి విచారణను శుక్రవారం జరగాల్సి ఉంది. వివరాల ప్రకారం.. కోర్టు అనుమతి పొందాక ఆస్పత్రి సిబ్బంది తన క్లయింట్ భర్త వీర్యాన్ని సేకరించారని, అనంతరం అతడు గురువారం కన్నుమూశారని మహిళ తరఫు న్యాయవాది చెప్పారు. కాగా గుజరాత్‌కు చెందిన దంపతులకు సంతానం లేదు. ఇటీవల సదరు మహిళ భర్త కరోనా కారణంగా పలు అవయవాలు దెబ్బతిని స్టిర్లింగ్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడి పరిస్థితి క్షీణిస్తోందని వైద్యులు తెలపడంతో, తన భర్త ప్రతిరూపాన్నైనా చూసుకునేందుకు వీలుగా బిడ్డను కంటానని, అందుకు భర్త వీర్యం కావాలని ఆమె కోరింది. అయితే ఐవీఎఫ్ కోసం అతని స్పెర్మ్ సేకరించాలని, అందుకు కోర్టు అనుమతి ఉండాలని ఆస్పత్రి సిబ్బంది స్పష్టం చేసింది. ఈ క్రమంలో సదరు మహిళ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. వైద్యుల అభిప్రాయం ప్రకారం, తన భర్త బతికే అవకాశాలు అతి తక్కువగా ఉన్నాయని పిటిషన్లో విన్నవించింది. ఈ నేపథ్యంలో.. సదరు కరోనా రోగి ఆరోగ్య పరిస్థితిని, మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని వీర్య సేకరణకు కోర్టు అత్యవసర అనుమతులు జారీ చేసింది. కానీ, వీర్యం సేకరించిన కొన్ని గంటల్లోనే అతడు మృతిచెందడం విషాదకరం. -
కోవిడ్ రోగి నుంచి వీర్యం సేకరణ
అహ్మదాబాద్: గుజరాత్‌లోని వడోదరలో కోవిడ్ కారణంగా పలు అవయవాలు దెబ్బతిని వెంటిలేటర్‌పై ఉన్న ఓ వ్యక్తి నుంచి వైద్యులు వీర్యాన్ని సేకరించారు. వీర్యాన్ని తనకు ఇప్పించాల్సిందిగా ఆ వ్యక్తి భార్య హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఓకే చెప్పింది. వీర్య సేకరణకు వ్యక్తి అనుమతి అవసరమే అయినప్పటికీ, ఆ ప్రక్రియకు అనుమతి తెలిపే స్థితిలో రోగి లేనందున అత్యవసర అనుమతులు మంజూరు చేస్తున్నట్లు జస్టిస్ అశుతోశ్ జే శాస్త్రి స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలు జారీ చేసిన వెంటనే వెంటిలేటర్‌పై ఉన్న వ్యక్తి నుంచి వీర్యం సేకరించినట్లు వైద్యులు తెలిపారు. కృత్రిమ పద్ధతిలో గర్భధారణ పొందేందుకు ఆమె తన భర్త వీర్యాన్ని కోరారు. -
ఏడాది క్రితం లవర్ మృతి.. ప్రస్తుతం ఆమె కడుపులో అతని బిడ్డ
కాన్బెర్రా: ప్రస్తుత కాలంలో పిల్లలు కలిగే అవకాశం లేని వారు.. పెళ్లి, భాగస్వామితో పని లేకుండా.. బిడ్డకు జన్మనివ్వాలనుకునే వారు ఎక్కువగా ఎంచుకుంటున్న పద్దతులు ఐవీఎఫ్(ఇన్ వెట్రో ఫెర్టిలైజేషన్), సరోగసి(అద్దె గర్భం). మన దగ్గర బాలీవుడ్ బాద్ షా షారుక్, ఆమిర్ ఖాన్ మొదలు తుషార్ కపూర్ వరకు పలువురు ప్రముఖులు ఐవీఎఫ్ పద్దతి ద్వారా బిడ్డను పొందారు. తాజాగా ఈ జాబితాలోకి ఆస్ట్రేలియాకు చెందిన దివంగత ఒలింపిక్ స్నోబోర్డర్ అలెక్స్ పుల్లిన్ చేరారు. గతేడాది ఆయన మరణించారు. కానీ ప్రస్తుతం అలెక్స్ గర్ల్‌ఫ్రెండ్ ఆయన బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇదేలా సాధ్యం అంటే ఐవీఎఫ్ ద్వారా. ఆ వివరాలు... ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ పుల్లింగ్ గతేడాది క్వీన్స్లాండ్ పామ్ బీచ్‌లోని రీఫ్లో స్పియర్ ఫిషింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదశావత్తు అందులో ముగినిపోయాడు. రెస్క్యూ టీం ఆయనను వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే అతడు మరణించాడు. విషయం తెలిసి అలెక్స్ గర్ల్‌ఫ్రెండ్ ఎల్లిడి వ్లగ్ ఎంతో బాధపడింది. ప్రమాదానికి కొన్ని రోజుల ముందే వారు బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. దాంతో అలెక్స్ మరణించిన విషయం తెలిసిన వెంటనే ఆమె అతడి నుంచి వీర్యం సేకరించి భద్రపరిచారు. ఆ తర్వాత ఐవీఎఫ్ విధానం ద్వారా, అలెక్స్ వీర్యంతో ఎల్లిడి గర్భం దాల్చారు. త్వరలోనే తాను అలెక్స్ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు ఎల్లిడి. ఈ సందర్భంగా ఎల్లిడి మాట్లాడుతూ.. ‘‘అలెక్స్‌కి ప్రమాదం జరగడానికి కొన్ని రోజుల ముందే మేం పిల్లలను కనాలని ప్లాన్ చేసుకున్నాం. ఆ నెలలలో నేను గర్భవతిని అవుతానని ఆశించాను. కానీ కుదరలేదు. అదే సమయంలో తాను ప్రమాదానికి గురై మరణించాడు. దాంతో వేరే మార్గం లేక అతడి వీర్యాన్ని సేకరించి.. ఇలా ఐవీఎఫ్ ద్వారా గర్భవతిని అయ్యాను. నేను ఈ విధానాన్ని ఆశ్రయిస్తానని.. అది కూడా అలెక్స్ లేకుండా ఒంటరిగా ఇలా చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఇది అంత సులభమైన పనేం కాదు. పుట్టబోయే బిడ్డకు నేనే తల్లితండ్రి. ఇద్దరి బాధ్యతలను నేను ఒక్కదానే నేరవేర్చాల్సి ఉంటుంది’’ అని తెలిపారు. క్వీన్స్లాండ్ చట్టం ప్రకారం, మరణించిన వ్యక్తి అభ్యంతరం చెప్పలేడని ప్రభుత్వం చేత నియమించబడిన అధికారి ప్రకటించిన తర్వాత మాత్రమే వీర్యాన్ని సేకరిస్తారు. ఇలా చేయడానికి ముందు సదరు వ్యక్తి కుటుంబం అనుమతి అవసరం తప్పనిసరి. ఐవీఎఫ్ స్పెషలిస్ట్ వీర్యం తీసే ప్రక్రియకు సహాయం చేస్తారు. మరణం తరువాత 24 మరియు 36 గంటల వ్యవధిలో వీర్యం సేకరించాల్సి ఉంటుంది. చదవండి: మాతృత్వం కోసం తన వీర్యాన్ని దాచుకున్న ‘దయారా’ -
చనిపోయిన భర్త వీర్యంపై భార్యకే హక్కు
కోల్‌కతా : చనిపోయిన భర్త వీర్యంపై పూర్తి హక్కులు విధవరాలైన భార్యకు మాత్రమే ఉంటాయని కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చనిపోయిన వ్యక్తి వీర్యం కోసం దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తాజాగా తుది తీర్పును వెలువరించింది. 2020 మార్చిలో ఓ తండ్రి.. ఢిల్లీలోని స్పెర్మ్ బ్యాంకులో దాచిన చనిపోయిన కుమారుడి తాలూకూ వీర్యాన్ని కోడలు తమకు దక్కకుండా చేస్తోందంటూ కోర్టును ఆశ్రయించాడు. ఆ వీర్యం ధ్వంసమైనా లేదా నిరుపయోగమైనా తమ వంశం నాశనం అవుతుందని పిటిషన్లో పేర్కొన్నాడు. జస్టిస్ సభ్యసాచి భట్టాచార్య జనవరి 19న దీనిపై విచారణ చేపట్టారు. ‘‘ తండ్రీ కొడుకుల సంబంధం ఉన్నంత మాత్రాన పిటిషనర్( చనిపోయిన వ్యక్తి తండ్రి) వీర్యాన్ని పొందటానిక ఎలాంటి ప్రాథమిక హక్కులను కలిగిలేరు. చనిపోయిన వ్యక్తి వీర్యం కేవలం అతడి భార్యకు మాత్రమే సొంతం. ఆమెకు మాత్రమే దానిపై పూర్తి హక్కులు ఉంటాయి. ఈ విషయంలో కోర్టు ఆమెను ఏ విధంగానూ ఆదేశించలేదు’’ అని స్పష్టం చేశారు. ( ఈ సమయంలో పేమెంట్స్ చేయొద్దు ) కాగా, కోల్‌కతాకు చెందిన పిటిషనర్ కుమారుడు తలసేమియాతో బాధపడేవాడు. ఢిల్లీ హాస్పిటల్లో ఇందుకు చికిత్స కూడా తీసుకునేవాడు. 2015లో ఢిల్లీకి చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. 2018లో అతడు మరణించాడు. అయితే మరణానికి ముందే ఢిల్లీలోని స్పెర్మ్ బ్యాంకులో అతడి వీర్యాన్ని దాచారు. ఈ నేపథ్యంలో స్పెర్మ్ బ్యాంకులోని తమ కుమారుడి వీర్యాన్ని రెండేళ్ల ఒప్పందకాలం ముగిసేవరకు భద్రంగా ఉంచాలని తల్లిదండ్రులు బ్యాంకుకు లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన స్పెర్మ్ బ్యాంక్.. వీర్యాన్ని అతడి భార్య గర్బం దాల్చడానికి ఉపయోగించాలన్నా.. లేక, వేరే వాళ్ల కోసం వాడాలన్నా.. పాడేయాలన్నా అది కేవలం భార్య అనుమతితోటే సాధ్యమవుతుందని తెలిపింది. దీంతో వారు తమ కోడల్ని వీర్యం విషయమై నో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వవల్సిందిగా కోరారు. ఇందుకు ఆమె తిరస్కరించింది. ఈ నేపథ్యంలో వారు కోర్టును ఆశ్రయించారు. -
ఏడేళ్ల క్రితం స్పెర్మ్‌తో పండంటి బిడ్డ
సాక్షి, హైదరాబాద్ : ఏడేళ్ల క్రితం ముందు జాగ్రత్తతో ఆ దంపతులు భద్రపరుచుకున్న స్పెర్మ్.. ఇప్పుడు వారికి పండంటి బిడ్డను ప్రసాదించింది. కేన్సర్ చికిత్సకు వెళ్లే ముందు వైద్యుల సలహా మేరకు ఆయన తన వీర్యాన్ని స్పెర్మ్ బ్యాంకులో భద్రపరుచుకున్నాడు. దాన్ని వినియోగించిన ఐసీఎస్ఐ (ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజక్షన్) ద్వారా ఇప్పుడు వారు తల్లిదండ్రులయ్యారు. 2012లో 23 ఏళ్ల కార్తీక్ (పేరు మార్చాం)కు వివాహం జరిగింది. కొద్ది రోజులకే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఛాతీ, ఊపిరితిత్తుల మధ్య మెడియాస్టినల్ ట్యూమర్ (కేన్సర్)తో బాధపడుతున్నట్లుగా వైద్యులు గుర్తించారు. పెళ్లైన కొద్ది రోజుల్లోనే ఇలా జరగడంతో ఆ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చికిత్సలో ఎదురయ్యే దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని.. అతడి వీర్యాన్ని స్పెర్మ్ బ్యాంకులో భద్రపరుచుకోమని వైద్యుడు సలహా ఇచ్చారు. దీంతో 2012లో కేన్సర్ చికిత్స ప్రారంభానికి ముందు కార్తీక్ తన వీర్యాన్ని ఒయాసిస్ ఫెర్టిలిటీ బ్యాంకులో భద్రపరిచాడు. సంవత్సరం క్రితం ఆయన కేన్సర్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అయితే.. కిమోథెరపీ, రేడియోథెరపీ మోతాదుల కారణంగా తండ్రి అయ్యే సామర్థ్యాన్ని కోల్పోయాడు. ఈ క్రమంలో భద్రపరిచిన వీర్యం ద్వారా సంతానం పొందాలని నిర్ణయించుకున్న ఆ దంపతులు.. ఒయాసిస్ ఫెర్టిలిటీని సంప్రదించారు. ఐసీఎస్‌ఐను మాక్స్(మాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ సార్టింగ్) వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 2019లో పిండాన్ని తయారుచేసి.. మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెట్టారు. అలా గర్భం దాల్చిన ఆ మహిళ గత వారం పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఇటీవలే ఆస్పత్రి నుంచి తల్లిబిడ్డలు డిశ్చార్జయ్యారు. -
కరోనా వైరస్: మరో నమ్మలేని నిజం
మహమ్మారి కరోనా వైరస్‌కు సంబంధించి మరో నమ్మలేని నిజం వెలుగుచూసింది. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈ వైరస్ గురించి ప్రజల్లో ఇప్పటికీ చాలా అనుమానేలే ఉన్నాయి. కరోనా బారిన పడిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్లతో కరోనా వ్యాప్తి చెందుతుందనే అక్షర సత్యం. అందుకే ప్రజలు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని నిపుణులు, ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి. అయితే ఈ వైరస్ గాలి ద్వారా కూడా సోకుతుందని వార్తలు వచ్చినా తగిన ఆధారాలు లేవు. అయితే తాజాగా శృంగారం ద్వారా కూడా కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది చైనాకు చెందిన ఓ అధ్యయన బృందం. షాంగిక్యూ మున్సిపల్ ఆస్పత్రిలో కరోనా నుంచి కోలుకుంటున్న 38 మంది కరోనా బాధితులపై పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరిలో ఆరుగురి వీర్యంలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. అయితే మహమ్మారి కరోనా వైరస్ వీర్యంలో ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేకపోయారు. ఈ ఆరుగురిలో ఇద్దరు కోలుకోగా.. నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. అయితే శృంగారం ద్వారా వ్యాప్తి చెందుతుందా అనేదానిపై పరిశోధకులు ఏ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ‘వీర్యంలో కరోనా ఉన్నంత మాత్రానా శృంగారం ద్వారా మరొకరికి వస్తుందని చెప్పలేం. ఒకవేళ అదే రుజువైతే శృంగారానికి దూరంగా ఉండటమో, కండోమ్ వాడటమో చేయాలి. కరోనా లక్షణాలు కనిపిస్తే శృంగారానికి దూరంగా ఉంటేనే మంచిది’ అని చైనా పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆ అంశంపై అధ్యయంన చేసి రూపొందించిన నివేదికను జామా నెట్వర్క్ వెల్లడించింది. ఇక ఎబోలా, జికా వంటి వైరస్లు శృంగారాం ద్వారా కూడా వ్యాపిస్తాయన్న విషయం తెలిసిందే. చదవండి: కరోనా వస్తే.. కనిపెట్టేస్తుంది మాస్క్ లేకుంటే బుక్కయినట్టే..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అండం లేదు.. శుక్ర కణమూ లేదు.. పిండం మాత్రం రెడీ!
కౌరవులు పుట్టిందెలా? మట్టికుండలో అని మహాభారతం చెబుతోంది. అండం.. శుక్రకణం లేకుండా బిడ్డలెలా పుడతారు? అంతా పుక్కిటి పురాణం.. ట్రాష్..! ఇప్పటివరకూ అందరూ ఇలాగే అనుకున్నారు. కానీ.. తమ ప్రయోగశాలలో అచ్చంగా ఇదే చేసి చూపారు శాస్త్రవేత్తలు. కొందరికి గర్భం ఎందుకు నిలవదన్న అంశం మొదలుకొని.. ఏకరీతిలో ఉండే వందలాది మంది బిడ్డలను అభివృద్ధి చేయడం వరకూ.. అనేక సమస్యలను ఈ పరిశోధన పరిష్కరిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వినేందుకు కొంత ఆశ్చర్యకరంగానే ఉంటుంది ఈ విషయం. మహాభారతంలో ఏముంది? దాని వాస్తవికతలపై చర్చ కూడా అవసరం లేదు. అయితే బెల్జియంలోని మాస్ట్రిచ్ వర్సిటీ శాస్త్రవేత్తలు కేవలం మూలకణాలను ఉపయోగించి ప్రయోగశాలలో పిండాల్ని (పైచిత్రంలో) అభివృద్ధి చేశారు. పరిశోధనల కోసం ఒకే రకమైన పిండాలను అభివృద్ధి చేసేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని అంచనా. కొంతమందిలో గర్భం ఎందుకు నిలవడం లేదన్న అంశాన్ని అర్థం చేసుకునేందుకు తద్వారా ఈ సమస్యను అధిగమించేందుకు కూడా ఈ పరిశోధన పనికొస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ టెక్నిక్‌ను దుర్వినియోగం చేసి క్లోనింగ్ కోసం వాడుకోవచ్చని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మూలకణాలతో పిండా న్ని అభివృద్ధి చేసే ప్రక్రియ చాలా ప్రాథమిక దశలోనే ఉందని.. పిండాన్ని అభివృద్ధి చేయగలిగామేగానీ.. దాన్ని గర్భసంచిలో స్థిరంగా ఉంచలేకపోయామని.. దీన్ని సాధించేందుకు దశాబ్దాల సమయం పడుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు అంటున్నారు. క్లోనింగ్‌కు అవకాశం.. అండం, శుక్రకణాల అవసరం లేకుండా జీవా న్ని సృష్టించడం ఆషామాషీ కాదు. ప్రస్తుతానికి పిండం పూర్తిస్థాయిలో అభివృద్ధి కానప్పటికీ ఇంకో మూడేళ్లలోనే తాము ఈ పద్ధతి ద్వారా ఎలుకలను పుట్టించగలమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది మానవ క్లోనింగ్‌కు దారి తీయవచ్చని.. ఇంకో 20 ఏళ్లలోనే ఒకే రకమైన రూపురేఖలు, లక్షణాలున్న మానవులను తయారు చేసే వీలు ఏర్పడుతుందని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కావాల్సినన్ని ఎలుకలను తయారు చేసుకుంటే కొత్త మందులను పరీక్షించడం సులువు అవుతుందని, సంతానలేమి సమస్య పరిష్కారానికి ఉపయోగపడుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ నికొలస్ రివ్రాన్ అంటున్నారు. పిండాలపై పరిశోధనలకు అనేక ఆంక్షలు ఉన్నాయని, పైగా తగిన సంఖ్యలో పిండాలను పొందడం కూడా సాధ్యం కాదని.. కొత్త టెక్నాలజీతో సమస్యలను అధిగమించవచ్చని రివ్రాన్ వివరించారు. బ్లాస్టోసిస్ట్ స్థాయికి ఎదిగిన పిండం ఆ తర్వాత గర్భాశయానికి ఎందుకు అతుక్కోలేదన్నది తమకు తెలియదని, తాము అభివృద్ధి చేసిన పిండం..సాధారణ పిండాన్ని పోలి ఉందని వివరించారు. బహుశా కృత్రిమ పిండంలో కణాల అమరిక సక్రమంగా ఉండకపోవడమే కారణం కావచ్చన్నారు. మూలకణాలతో బ్లాస్టోసిస్ట్ను తయారు చేయడం ఇదే మొదలు కాబట్టి.. మరిన్ని పరిశోధనలు ఏం జరుగుతోందన్న విషయంపై స్పష్టత ఇవ్వవచ్చని చెప్పారు. పిండం అభివృద్ధి ఇలా.. మూలకణాల గురించి మీకు తెలిసే ఉంటుంది. శరీరంలోని ఏ కణంగానైనా మారిపోగల సత్తా వీటి సొంతం. ఫలదీకరణమైన నాలుగైదు రోజులకు పిండంలో ఏర్పడతాయి ఇవి. పిండం ఎదిగే క్రమంలో వీటిల్లో కొన్ని గుండె కణాలుగా మారితే.. ఇంకొన్ని నాడీ కణాలుగా.. మరికొన్ని రక్తకణాలుగా మారిపోతాయి. మాస్ట్రిచ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎలుకలకు సంబంధించిన రెండు రకాల మూలకణాలను ప్రయోగశాలలోని గాజు పాత్రలో కలిపారు. అంతే.. ఆశ్చర్యకరంగా అవి నాలుగైదు రోజుల పిండం స్థాయికి ఎదిగాయి. దీన్ని గర్భాశయంలోకి జొప్పించినప్పుడు గర్భధారణ జరిగే సమయంలో జరిగే మార్పులకు గురైనా కొంత సమయం తర్వాత నిర్వీర్యమైపోయింది. గర్భాశయానికి అతుక్కోలేకపోయింది. – సాక్షి, హైదరాబాద్ -
హోలీ పేరిట విద్యార్థినులపై వికృత చేష్టలు
-
హోలీ పేరిట విద్యార్థినులపై వికృత చేష్టలు
సాక్షి, న్యూఢిల్లీ : హోలీ వేడుకల పేరుతో విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడిన ఘటనలు దేశ రాజధానిలో చోటు చేసుకున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థినులపై కొందరు ఆగంతకులు వీర్యంతో నింపిన బెలూన్లను విసిరి పరారయ్యారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి కథనం ప్రకారం... ఫిబ్రవరి 24వ తేదీన ఈశాన్య ప్రాంతానికి చెందిన ఓ యువతి అమర్ కాలేనీ మార్కెట్లోని ఓ కేఫ్‌కు వెళ్లింది. బైకులపై వచ్చిన ఐదుగురు యువకులు ఆమెపై బెలూన్లను విసిరారు. ఆపై హోలీ శుభాకాంక్షలు చెబుతూ అక్కడ నుంచి వేగంగా వెళ్లిపోయారు. హస్టల్‌కు వచ్చిన యువతి దుస్తులను పరిశీలించిన యువతికి అవి రంగులు కావని అర్థమైంది. ఈ వికృత చేష్టలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇక ఢిల్లీ యూనివర్సిటీకే చెందిన మరో యువతికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. హస్టల్ బయట నడుచుకుంటూ వెళ్తున్న తనపై కొందరు వ్యక్తులు బెలూన్లు విసిరారని... ఆపై రంగులు పూస్తూ అసభ్యంగా తాకినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యూనివర్సిటీ వద్ద పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. మరోవైపు హోలి వేడుకల నేపథ్యంలో ఢిల్లీలోని కాలేజీలు, హాస్టళ్ల వద్ద సెక్యూరిటీని అప్రమత్తంగా ఉండాలంటూ యూనివర్సిటీ అధికారులు సూచిస్తున్నారు. -
చనిపోయిన వ్యక్తి వీర్యంతో కవలలు!
పుణె : చనిపోయిన కూమారుని వీర్యంతో సరోగసి పద్దతి ద్వారా వారసులను పొందారు మహారాష్ట్రాలోని ఓ తల్లి. అమ్మతనానికి నోచుకోని ఎందరో తల్లులు ఆధునిక వైద్య పద్దతుల ద్వారా పిల్లలను కంటున్న విషయం తెలిసిందే. అయితే ఇలా చనిపోయిన వారి వీర్యంతో పిల్లలను కనడం ఇదే తొలిసారి కావచ్చు. తన కొడుకు మరణాన్ని తట్టుకోలేని ఓ తల్లి ఇదే పద్దతిలో వారుసులను పొందారు. పుణెకు చెందిన 27 ఏళ్ల ప్రథమేష్ పాటిల్ పైచదవుల కోసం జర్మనీ వెళ్లాడు. 2013లో ఏదో ఆరోగ్య సమస్యతో పరీక్షలు చేయించుకుంటే తనకు బ్రేయిన్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. వైద్యులు కీమోథెరపీ చికిత్సను అందించాలన్నారు. ఈ చికిత్స కారణంగా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్న డాక్టర్లు అతడి అనుమతితో వీర్యం శాంపిళ్లను తీసి భద్రపరిచారు. తొలుత తగ్గినట్లు కనిపించిన క్యాన్సర్ ఒక్కసారిగా తిరగబెట్టింది దీంతో ప్రథమేష్ 2016లో మరణించాడు. అప్పటికి అతనికింకా పెళ్లి కూడా కాలేదు. కొడుకంటే అతని తల్లి రాజ్ శ్రీ పాటిల్‌కు విపరీతమైన ప్రేమ. కొడుకు మరణాన్ని తట్టుకోలేకపోయింది. ఎలాగైనా తన కొడుకు తిరిగి పొందాలనుకుంది. ఈ తరుణంలో వీర్యం దాచిన విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే పుణెలోని సహ్యాద్రి ఆసుపత్రి వైద్యులను సంప్రదించి ఈ విషయం తెలియజేసింది. ఆమె సాయంతో జర్మనీలో భద్రపరిచిన వీర్యాన్ని తెప్పిచ్చిన వైద్యులు ప్రథమేశ్ కుటుంబ సభ్యులలోని ఓ మహిళ నుంచి అండాలు సేకరించి, వాటితో నాలుగు పిండాలను రూపొందించారు. వీటిని తన గర్భంలో ఉంచుకోవటానికి ప్రథమేశ్ తల్లి రాజ్ శ్రీ(49) ముందుకొచ్చినప్పటికి ఆమె శరీరం అనుకూలించదని వైద్యులు పేర్కొన్నారు. దీంతో రాజ్ శ్రీ సోదరి గర్భంలో రెండు పిండాలను గతేడాది మే నెలలో ప్రవేశపెట్టారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో గత సోమవారం ఇద్దరు మగ పిల్లలు(కవలలు) జన్మించారు. దీంతో ప్రథమేశ్ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇలాంటి పద్ధతిన పిల్లల్ని కనడం ఇదే మొదటిసారి కాదని, ఇప్పటివరకు రెండు, మూడు జరిగాయని ఇండియన్ సరోగసీ లా సెంటర్ వ్యవస్థాపకుడు హరిరామసుబ్రమణియన్ తెలిపారు. రాజ్ శ్రీ పాటిల్, ఆమె కూతురు ప్రిషా( పిల్లలు పట్టుకున్నవారు), ప్రథమేష్ ( ఫొటో,ఇన్ సెట్లో) -
శుక్రకణం శ్రేష్టమైతేనే కలయిక
వాషింగ్టన్ : పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి విడుదలై వేల సంఖ్యలో అండం వద్దకు చేరుకునే శుక్ర కణాలు దానిలోకి చొచ్చుకెళ్లేందుకు పోరాడి విజయం సాధించి ఫలదీకరణం చెందుతాయనే థియరీ కొన్ని దశాబ్దాలుగా మనకు తెలుసు. కానీ, ఆ థియరీ తప్పని తాజా పరిశోధనల్లో తేలింది. స్త్రీ జీవి అండానికి శ్రేష్టమైన శుక్ర కణాన్ని తనంతట తాను ఎంచుకొని పునరుత్పత్తి చేయగల సామర్ధ్యం ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. వేల సంఖ్యలో వచ్చే శుక్ర కణాల్లో ‘శ్రేష్టమైన’ ఒక కణాన్ని మాత్రమే ఎన్నుకుని అండం ఫలదీకరణం చెందుతుందని వెల్లడించారు. దీంతో ఇప్పటివరకూ ఫలదీకరణం సూత్రాన్ని వివరిస్తున్న ‘మెండెల్స్ సూత్రం’ సరైంది కాదని తేలింది. మెండెల్స్ సూత్రం ఏం చెబుతుంది.. వేల నుంచి లక్షల సంఖ్యలో తన వద్దకు చేరుకునే శుక్ర కణాల్లో ఏదో ఒకదానితో (ప్రత్యేకంగా ఎంపిక చేసుకోకుండా) అండం ఫలదీకరణం చెందుతుందని మెండెల్స్ సూత్రం చెబుతుంది. అండం ఎలా ఎన్నుకుంటుంది అండం ఒక శుక్ర కణాన్ని శ్రేష్టమైనదిగా ఎలా గుర్తిస్తుందన్న విషయాన్ని మాత్రం పరిశోధకులు క్షుణ్ణంగా వివరించలేకపోయారు. అయితే, ఎలుకల మీద ఈ దిశగా చేసిన పరిశోధనల్లో అండం అనారోగ్యంగా ఉన్న శుక్రకణాలతో ఫలదీకరణానికి నిరాకరిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా మరికొన్ని శుక్ర కణాలు అండాన్ని చేరుకోకముందే చనిపోతున్నట్లు పరిశోధకులు చెప్పారు. ఫోలిక్ యాసిడ్ది కీలకపాత్ర అండం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి విడుదలైన శుక్ర కణాల్లో ఎలా ఎంపిక చేసుకుంటుందన్న ప్రక్రియపై స్మిత్ సోనియన్ ట్రాపికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డా. నెడెయూ మరో రెండు ప్రక్రియలను ప్రతిపాదించారు. 1. శుక్ర కణం, అండాల్లో ఉండే బీ విటమిన్(ఫోలిక్ యాసిడ్) సూచనలతోనే ఫలదీకరణ ప్రక్రియ జరగుతుంది. బలహీనంగా లేదా అనారోగ్యంగా ఉన్న శుక్ర కణాన్ని ఫలదీకరణానికి ఎన్నుకోకుండా ఉండటానికి ఫోలిక్ యాసిడ్ అండానికి సాయపడుతుంది. 2. అండం పూర్తిగా తయారవకముందే శుక్ర కణానికి చెందిన రూపు అందులో ఉంటుంది. అండంలో ఉన్న శుక్ర కణాన్ని బట్టి ఫలదీకరణకు దాన్ని సరిపోలే శుక్రకణాన్ని అండం ఎంచుకుంటుంది. అయితే, ఈ ప్రక్రియ పూర్తిగా ఊహాజనితమని డా. నెడెయూ తెలిపారు. ఇందుకు సంబంధించి పరిశోధనలు చేయాల్సివుందని వెల్లడించారు. -
చనిపోయిన ప్రియుడి వీర్యంతో తల్లి కావాలని..
ఈ ప్రపంచంలో ఎన్నో ప్రేమ కథలున్నాయి. అందులో లైలా మజ్ను, దేవదాసు పార్వతి, సలీం అనార్కలి, రోమియో జులియట్ మనం ఇలాంటి ప్రేమ కథలు ఇప్పటివరకు ఎన్నో చూసుంటాం. ప్రస్తుత జనరేషన్లో ప్రేమ అనేది కామన్. నిజమైన ప్రేమకు ఎప్పుడు ఓటమి అనేది ఉండదు. నిజమైన ప్రేమకు ఏదైనా ఆటంకం కలిగితే ప్రేమికులిద్దరు సూసైడ్ చేసుకోవడం చూసి ఉంటాం. ప్రేమ గుర్తుగా ఎన్నో కట్టడాలను చూసి ఉంటాం. కానీ వీటన్నింటికీ భిన్నంగా కంట తడి పెట్టించే ఓ ప్రేమ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువతి ప్రమాదవశాత్తు తన ప్రియుడు చనిపోయినా.. ఆయన ప్రతిబింబాన్ని తన బిడ్డ రూపంలో చూసుకోవాలనుకుంది. చనిపోయిన ప్రేమికుడి కోరికను తీర్చడం కోసం ఏకంగా అతని వీర్యంతో తల్లి కావాలనుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. బ్రిస్‌బేయిన్ జోషువా డేవిస్, ఐలా క్రాస్‌వెల్‌లు ప్రేమికులు. అయితే ఓ రోజు ప్రమాదవశాత్తు రోడ్డుయాక్సిడెంట్‌లో హఠాత్తుగా జోషువా మరణించాడు. మరణించిన గంటలో 24 ఏళ్ల ఐలా బ్రిస్‌బేయిన్ సుప్రీం కోర్టును సంప్రదించింది. తన బాయ్‌ప్రెండ్ వీర్యాన్ని వాడుకొని తాను గర్భం దాల్చేందుకు అనుమతివ్వాలని కోరింది. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు ఆమెకు అనుమతినిచ్చింది. కృత్రిమ విధానంలో గర్భం దాల్చే విధానం అంతా ఒక ఇన్విట్రో ఫెటిలిటి క్లీనిక్‌లో జరపాలని కోర్టు సూచించింది. అటు ఆమె తల్లిదండ్రులు, ఇటు జోషువా కుటుంబం, వారి స్నేహితులు బంధువులు కూడా ఆమెకు పూర్తి మద్దతు తెలిపారు. జోషువా చనిపోయే ముందు తామిద్దరికి ఒక పాపనో, బాబునో కావాలనే గట్టి కోరిక ఉండేదని ఆధారాలతో సహా కోర్టుకు విన్నవించుకుంది. వారిద్దరు ప్రేమలో ఉన్నపుడు పెళ్లిచేసుకొని కలకాలం జీవించాలని జాషువాకు ఉండేదని, ఎప్పుడు పిల్లల గురించే మాట్లాడేవారని ఐలా కోర్టుకు తెలిపింది. ఓ బిడ్డకు తండ్రి కావాలన్నది ఆయన కోరిక అని, ఆయన చివరి కోరిక తీర్చడమే ఐలా జీవిత లక్ష్యమని కోర్టులో విన్నవించుకుంది. వీరి ప్రేమ కథపై పలువురి నుంచి మిశ్రమంగా స్పందనలోచ్చాయి. కొంతమంది వీరికి మద్దతు తెలుపుతూ ఆమె కోరుకున్నట్టుగా కోర్టు తీర్పునివ్వాలని నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మరికొందరు దీనికి నిరాకరించారు. అయితే ఐలా కోర్టుతో పాటు సమాజాన్ని ఒప్పించే ప్రయత్నం చేసింది. రెండు నెలల కిందట జరిగిన వాదనల తర్వాత నుంచి ఆమె సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది. మొత్తానికి ఐలా కోరుకున్నట్టుగానే తనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. పుట్టబోయే బిడ్డకు తండ్రిలేడనే లోటును తమ ఇరు కుటుంబసభ్యులు తీరుస్తారనే నమ్మకాన్ని కోర్టు వ్యక్తపరిచింది. ఇరుకుటుంబ సభ్యులు ఐలా పట్ల చూపించిన ప్రేమకు, మద్దతుకు కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చనిపోయిన ప్రియుడి వీర్యం ఉపయోగించుకునేందుకు ఆమెకు కోర్టు అనుమతించింది.జాషువా ఈ లోకంలో లేకపోయినా పుట్టబోయే బిడ్డ బాగోగులు ఐలా ఒక్కరే సమర్ధవంతంగా చూసుకోగలదని ఇరు కుంటుబాలవారు విశ్వసించారు. -
అవి వాడితే వీర్యకణాలు 70 శాతం పెరుగుతాయట
సంతానం మానవునికి జీవితంలో అత్యంత తృప్తిని కలిగించే విషయం. స్త్రీ మాతృత్వాన్ని పొందడం, అలాగే పురుషుడు పితృత్వాన్ని పొందడం ఈ కాలంలో చాలా పెద్ద విషయంగా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మానవ జీవన విధానంలో అనేక మార్పులు, మానసిక ఒత్తిడి అనే విషయాల వల్ల మనిషి జీవన ప్రక్రియలలో అనేక మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో సంతానలేమి అనే సమస్య వైద్యులకు పెనుసవాలుగా మారింది. పురుషులలో సంతాన సామర్థ్యాన్ని కాలుష్యం మింగుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పురుషుల్లో వీర్యకణాలలో నాణ్యత, కణాల సంఖ్యలో తగ్గుదల అనే సమస్యలు ఎక్కువగా ఈమధ్యకాలంలో వింటున్నాం. 30 సంవత్సరాల క్రితం పురుషులలో సాధారణంగా 1 మి.లీ. వీర్యంలో 6 కోట్ల వీర్యకణాలు ఉండేవి. ఇప్పుడు గణనీయంగా 2 కోట్లకు పడిపోయింది. అలాగే వాటి కదలికలు, సహజత్వం కోల్పోతున్నాయి. ఈ మార్పుకి ప్రధాన కారణాలు - వాతావరణ కాలుష్యం, ఆహారంలో రసాయనాలు, గ్లోబల్ వార్మింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పై కారణాలతోపాటు మద్యపానం, ధూమపానం, హర్మోన్లలో లోపాలు, సుఖవ్యాధులు, గవద బిళ్లలు, వేరికోసిల్, అధిక బరువు, మధుమేహం కూడా ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. అయితే 'టమాట పిల్'లతో పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తి సామర్థ్యం పెంచవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని టమాట పిల్లతో 70 శాతం వృద్ధి చేయవచ్చని శిఫిల్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. పుచ్చకాయలో లభించే లైకోపెన్, టమాటలో ఉండే ఎరుపు రంగులోనూ గుర్తించారు. లైకోపెన్‌తో మరిన్ని సప్లిమెంట్లను కలిపి ఈ టమాట పిల్ తయారు చేస్తారు. వీటిని పరిశీలించడానికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న 60 మంది ఆరోగ్యవంతులైన పురుషులపై మూడు నెలలపాటూ పరిశోధనలు జరిపారు. ఈ విధానం ద్వారా వీర్యకణాల్లో నాణ్యతతో పాటూ, వీర్యకణాల సంఖ్య కూడా ఘననీయంగా పెరిగినట్టు గుర్తించారు. వీర్యకణాల ఉత్పత్తికి 3నెలల సమయం పడుతోందని వీరు తెలిపారు. టమాట పిల్ల వాడకంతో సైడ్ ఎఫెక్ట్స్‌లాంటివి కూడా ఉండవని వీరంటున్నారు. -
మీటింగ్స్‌లోనూ నిద్రపోతున్నారా?
హోమియో కౌన్సెలింగ్ నాకు 28 ఏళ్లు. మా వారికి 34 ఏళ్లు. మా పెళ్లయి నాలుగేళ్లయింది. ఇంతవ రకూ సంతానం కలగలేదు. మాకెంతో నిరాశగా ఉంది. సంతాన లేమికి హోమియోలో మందులు ఏమైనా ఉంటే సూచించగలరు. - హైమ, ఆదోని సంతానలేమి సమస్య స్త్రీ పురుషులిరువురిలోనూ 30 శాతం వరకు కొద్దిపాటి లోపాల వల్ల ఏర్పడుతుంది. మగవారిలో సంతానలేమికి కారణాలు శుక్రకణాలు లేకపోవడం లేదా శుక్రకణాల ఉత్పత్తి జరగకపోవడం, శుక్రకణాలు ఉత్పత్తి అయినప్పుడు వాటి కదలికలు సాధారణంగా లేకపోవడం, శుక్రకణాల నిర్మాణంలో తేడాలు, హైడ్రోసీల్ లేదా వెరికోసీల్ వల్ల శుక్రకణాలు దెబ్బతిని సంతానలేమికి కారణం కావచ్చు. స్త్రీలలో సంతానలేమికి కారణాలు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లోపాలు, గర్భసంచీ చిన్నగా ఉండటం, అసలు గర్భసంచి లేకపోవడం, గర్భసంచి రెండు గదులుగా ఉండటం, ఫెలోపియన్ ట్యూబ్స్ లేకపోవడం లేదా ట్యూబ్స్ మూసుకుపోవడం, అండాశయంలో ఎదుగుదల లేకపోవడం, యోనిమార్గం చిన్నదిగా ఉండటం లేదా మూసుకుపోవడం, వీటితోపాటు థైరాయిడ్ సమస్యలు, పి.సి.ఒ.డి, ఎఫ్.ఎస్.హెచ్, ఎల్.హెచ్, ప్రొలాక్టిన్ హార్మోన్ల అసమతుల్యత, రుతుక్రమంలో అపసవ్యతలు, ఎండోమెట్రియాసిస్, గర్భసంచిలో కణుతులు ఏర్పడి ఫెలోపియన్ ట్యూబ్స్‌కు అడ్డుపడటం వల్ల సంతానలేమి ఏర్పడుతుంది. నిర్ధారణ: మగవారిలో: సీబీపీ, ఇ.ఎస్.ఆర్, సీయూఈ, ఎఫ్.ఎస్.హెచ్, ఎల్.హెచ్, థైరాయిడ్ ప్రొఫైల్, యూ.ఎస్.ఎస్. అబ్డామిన్, యూ.ఎస్.జి. స్క్రోటమ్, కంప్లీట్ సెమెన్ ఎనాలిసిస్, సీరమ్ టెస్టోస్టీరాన్, థైరాయిడ్ ప్రొఫైల్, ఎఫ్.ఎస్.హెచ్, ఎల్. టెస్టిక్యూలార్ బయాప్సీ. ఆడవారిలో: సీబీపీ, ఇ.ఎస్.ఆర్, సీయూఈ, హెచ్.ఎస్.జి, లాప్రోస్కోపీ, థైరాయిడ్ ప్రొఫైల్, సీరం ప్రోలాక్టిన్, ఫాలిక్యులార్ స్టడీ హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యం: సంతానలేమికి హోమియోపతిలో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా స్త్రీ పురుషులలో లోపాలను సరిచేస్తూ శాశ్వత పరిష్కారం అందించటమే కాకుండా రెండవ మూడవ సంతానానికి మార్గం సుగమం చేస్తుంది. వైద్యవిధానం ద్వారా 50-60 శాతం వరకు సత్ఫలితాలను అందుకోవచ్చు. న్యూరో కౌన్సెలింగ్ నా భర్త వయసు 50. ఇటీవల ఆయనకు మెదడులో కణితి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అది పరిమాణంలో చాలా పెద్దగా ఉండి, అత్యంత సున్నితమైన భాగంలో ఉందని డాక్టర్ చెప్పారు. న్యూరోనావిగేషన్ విధానంలో శస్త్రచికిత్స చేయాలని అంటున్నారు. న్యూరోనావిగేషన్ అంటే ఏమిటి? ఆపరేషన్ అంటే మాకు చాలా ఆందోళనగా ఉంది. మీరిచ్చే సలహాపైనే మా నిర్ణయం ఆధారపడి ఉంటుంది. - ప్రభావతి, నిజామాబాద్ మీరు తెలిపిన వివరాలను బట్టి మీ భర్తకు అత్యంత కీలకమైన భాగంలో పెద్ద కణితి ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యూరోనావిగేషన్ ద్వారా శస్త్రచికిత్స చేయడం రోగికి ఎంతో ఊపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల రోగికి భవిష్యత్తులో ఎదురయ్యే దుష్ర్పభావాలు తగ్గుతాయి. మెదడులోని భాగాలను 3-డీ ఇమేజ్‌లో చూస్తే సరిగ్గా కణితి ఎక్కడ ఉందో నిర్ధారణ చేసుకొని, అక్కడికి మాత్రమే చేరేందుకు అధునాతనమైన ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. మీ భర్తకు మెదడులోని అత్యంత సున్నితమైన భాగంలో, పెద్ద పరిమాణంలో కణితి ఉన్నందున ఈ ప్రక్రియ ద్వారా శస్త్రచికిత్స చేయడమే ఉత్తమం. ఈ విధానంలో మిగతా మెదడు భాగాలు దెబ్బతినకుండా శస్త్రచికిత్స చేయడానికి వీలువుతుంది. తక్కువ కోతతో శస్త్రచికిత్స చేయడం వల్ల నొప్పి కూడా తక్కువగా ఉండటంతో పాటు, రోగి కోలుకునే వ్యవధి కూడా తక్కువ. బ్రెయిన్ ఆపరేషన్స్ చేసే సమయంలో వైద్యులు శస్త్రచికిత్స వల్ల ఎదురయ్యే రిస్క్‌లను అంచనావేసి, రోగి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. అలాంటప్పుడు అత్యంత సున్నితమైన భాగాల్లో శస్త్ర చికిత్స చేసే సమయంలో రోగి సురక్షితంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. న్యూరోనావిగేషన్ ప్రక్రియ వల్ల మెదడు లోపలి భాగాలను స్పష్టంగా చూడటం సాధ్యమవుతుంది. కాబట్టి క్లిష్టమైన ప్రాంతాలకు సర్జన్ తేలిగ్గా చేరేందుకు అవకాశం ఉండటం వల్ల న్యూరో నావిగేషన్ విధానంలో సర్జరీ అంటే మీరు గానీ, మీ భర్తగానీ అందోళన పడాల్సిన అవసరం లేదు. పైగా న్యూరోనావిగేషన్ ప్రక్రియను అనుసరించడం వల్ల కలిగే ఫలితాలు మరింత మెరుగ్గానూ ఉంటాయి. స్లీప్ కౌన్సెలింగ్ నా వయసు 35. సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నా నిద్రపై నాకు ఎలాంటి నియంత్రణా ఉండటం లేదు. మీటింగ్స్‌లో ఉంటున్నప్పుడూ, తింటున్నప్పుడు కూడా నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోతున్నాను. దీనివల్ల నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నా సమస్యకు పరిష్కారం చూపండి. - నవీన్, హైదరాబాద్ మీరు చెబుతున్న దాన్ని బట్టి మీరు నార్కొలెప్సీ అనే నిద్ర సంబంధమైన రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నార్కొలెప్సీ అనే సమస్యలో నిద్ర, మెలకువ రావడం... ఈ రెండూ ప్రభావితమవుతాయి. ఇలాంటి సమస్య ఉన్నవారు పగటివేళ కూడా నిద్రలోకి జారిపోతుంటారు. ఏ పని చేస్తున్నా ఆ సమయంలో తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు. సాధారణంగా నిద్రలో దశలు కొన్ని సైకిల్స్‌లో నడుస్తుంటాయి. అంటే ప్రారంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కదిలే దశ... ఇలాగ. కనుపాపలు వేగంగా కదిలే దశను ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎమ్) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఆర్ఈఎమ్ నిద్ర దశ వేగంగా వచ్చేస్తుంది. ఈ ఆర్ఈఎమ్ దశలోనే మనకు కలలు వస్తుంటాయి. ఈ దశలో కనుపాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ తప్ప మిగతా అన్ని కండరాలు పూర్తిగా అచేతన స్థితిలో ఉంటాయి. నార్కొలెప్సీ సాధారణంగా 15 నుంచి 25 ఏళ్ల వయసులో మొదలవుతుంది. అయితే అది ఏ వయసువారిలోనైనా కనిపించే అవకాశం ఉంది. నార్కొలెప్సీ ఎందుకు వస్తుందనే అంశం ఇంకా తెలియదు. ఇది జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి పిల్లల్లో ఇది కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. మరికొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నదాని ప్రకారం మెదడులోని హైపోక్రెటిన్ అనే రసాయన లోపం వల్ల ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో ఆర్ఈఎమ్ దశకు సంబంధించిన సైకిల్‌ను కొనసాగించే మెదడులోపాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ లోపాల వల్లనే మెలకువగా ఉండగానే అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే లక్షణాలు కనిపిస్తాయని వారి పరిశోధనల్లో తేలింది. అయితే నాడీవ్యవస్థకు చెందిన ఒకటి కంటే ఎక్కువ అంశాలు నార్కొలెప్సీని కలగజేస్తాయని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. నార్కొలెప్సీ వచ్చినప్పుడు మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనం అయిపోతాయి. మాటకూడా ముద్దముద్దగా వస్తుంది. బాధితులు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. దీనికి పూర్తిగా చికిత్స లేకపోయినా కొన్ని యాంటీ డిప్రసెంట్స్, యాంఫిటమైన్ మందులతో చికిత్స చేయవచ్చు. -
పురుషులవి పిచ్చివేషాలా?
అమ్మాయి మెప్పు కోసం ఏదైనా చేస్తే చాలు... పిచ్చివేషాలు అన్న టైటిల్ మాకు ష్యూరు! ఏం చేస్తాం! తప్పదు. ప్రకృతి అలా రాసిపెట్టింది మాకు. మగాళ్లు చేసే నిర్వాకాలకు ప్రకృతిని ఎందుకు నిందిస్తావ్ అంటారా? నిజాలు మాట్లాడక తప్పడం లేదు. వాస్తవాల గుట్టు విప్పక తప్పడం లేదు. కటిల్‌ఫిష్ అనే ఒక చేప కాని చేప ఉంది. నిజానికి మన తెలుగువాళ్లే దానికి ‘కుటిల’ ఫిష్ అని పేరు పెట్టారేమో! ఇంగ్లిషు వాళ్లు దాన్ని తమ ధోరణిలో కటిల్ అని చదివారేమో!! ప్రకృతిలోని ఓ అమాయకపు ప్రాణికి కుటిల చేప అని పేరు పెట్టడానికి నీకు సిగ్గులేదా అని తిట్టకండి. దాని నైజం మన మగాళ్ల లాంటిదే. దాన్ని తిట్టడమంటే మనల్ని తిట్టుకోవడమే. మనల్ని మనం తిట్టుకోగలమా! కటిల్‌ఫిష్ జాతిలోని అమ్మాయిని ఆకర్షించడానికి మగవన్నీ కిందామీదా పడతాయి. ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. ఈ పోటీలో భాగంగా పిచ్చివేషాలన్నీ వేస్తాయి. తప్పదు మరి. అలా పిచ్చివేషాలు వేయకపోతే ఛాన్సులన్నీ బలమైన కటిల్ఫిష్కే. రాజ్యం వీరభోజ్యంలాగా... ఏది శక్తిమంతమో దానికే ఆడది సొంతం. పైగా చిన్నవి పోరాటంలో పెద్దవాటిని గెలవలేవు. అందుకే ఈ పిచ్చివేషాలు. చిన్న కుటిల చేపలు చిన్నదాని వేషం వేస్తాయి. ఆడవేషంలో కులుకులొలుకుతూ, హొయలుపోతూ, సొగసులీనుతూ, సోలిపోతూ అమ్మాయిలా వేషం కడతాయి. మగ కటిల్చేపకు నాలుగు జతల చేతులు. ఆడ చేపకు మూడే. అందుకే ఆడ చేప మనసు దోచేందుకు ఆ ఎగస్ట్రా చేతుల్ని దాచేసి, ఎగస్ట్రా వేషాలు వేస్తాయవి. పొందుకోసం తెగ ట్రై చేస్తాయవి. అందుకే మానవుల్లో మగాళ్ల వేషాలను పిచ్చివేషాలన్నట్టే... ‘కడలి ఊసరవెల్లి... ఆ కటిల్ చేప... ఈ కుటిల చేప’ అంటూ పేరు పెట్టాయి. మీకో విచిత్రం చెప్పనా... వీరత్వంతో, ధీరత్వంతో, జబర్దస్తిత్వంతో, జబ్బబలతత్వంతో ఆడదాన్ని సొంతం చేసుకున్న పెద్దచేప చేసిన శుక్రదానాన్నీ, కుటిలంతో జటిలమైన సమస్యను ఎదుర్కొని తనను చేరి తనకు కాన్కగా ఇచ్చిన వీర్యదానాన్నీ... ఇలా పలు పలు వీర్యాలన్నింటినీ సేకరిస్తుంది ఆడచేప. తన వద్ద ఉన్న అన్ని వీర్యాలనూ వరసగా నిలబెట్టి ఏదో ఒకదాన్నే స్వీకరిస్తుందా గడుసు ఆడ చేప. వీర్యాల స్వయంవరంలో ఒకే ఒక దానికి పట్టం కడుతుంది. ఆ వీర్యంతోనే తన అండం ఫలదీకరణం అయ్యేలా చూస్తుంది. విచిత్రం ఏమిటంటే... ఆడవేషంలో తన వద్దకు వచ్చి శుక్రకణాలను దానం చేసిన కుటిల చేప వీర్యానికే తొలి ప్రాధాన్యం ఇస్తుంది. తన గర్భసంచీలో స్థానం ఇస్తుంది. ఎందుకంటే... అది రౌడీయిజమ్స్ కంటే ఇంటెలి‘జెమ్స్’కే ప్రాముఖ్యమిస్తుందది. మహామహాకవి గాలీబ్ ఏం రాశాడు? ‘‘అందగత్తెలతో ముచ్చటాడు కొరకు చిత్రలేఖన విద్య నేర్చితిని నేను’’ అన్నాడు. కుంచె పట్టడం కుదరకపోయినా, రంగువేయడం రాకపోయినా, బొమ్మగీయడానికి అలనాడు ఆయన సిద్ధపడ్డట్టే... లెక్కలు చేయలేకపోయినా ఎంపీసీలూ, రికార్డులు వేయలేకపోయినా బైపీసీలంటూ ఇప్పటికీ పిచ్చివేషాలకు మేం సిద్ధమే. ఏం చేస్తాం. ఆడువారి కోసమే పాడుబుద్ధి... ఈ మగబుద్ధి. మత్స్యావతారంలోనే కాదు... మానవావతారంలోనూ ఇంతే. కటిల్ చేపలైనా... కుటిల మానవులైనా మగాళ్లు మగాళ్లే. వారి వేషాలు వేషాలే. పిచ్చివేషాలైనా తప్పదు మరి... అతివను ఆకర్షించడం కోసం... బహుకృత వేషం! ఆడవారి దృష్టిలో అది ఓ పిచ్చివేషం!!