Akanksha Dubey Death: Sperm Found On Late Bhojpuri Actress Underwear: Report - Sakshi
Sakshi News home page

Akanksha Dubey: బుల్లితెర నటి సూసైడ్ కేసు.. దర్యాప్తులో కీలక ఆధారాలు!

Published Tue, May 30 2023 4:00 PM | Last Updated on Tue, May 30 2023 4:23 PM

Sperm found on late Bhojpuri actress Akanksha Dubey underwear - Sakshi

బుల్లితెర నటి ఆకాంక్ష దూబే ఈ ఏడాది మార్చి 25న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. భోజ్‌పురి నటి ఆకాంక్ష యూపీలోని వారణాసిలో గతనెలలో బలవన్మరణానికి పాల్పడింది. హోటల్‌లోని తన గదిలో విగతజీవిగా కనిపించింది. ఆమె సూసైడ్‌ ఘటనపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అయితే నటి ప్రియుడు, సింగర్ సమర్‌ సింగ్‌పై అనుమానం వ్యక్తం చేయగా.. అతనితో పాటు అతని సోదరుడు సంజయ్‌ను ఘజియాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

(ఇది చదవండి:వెకేషన్‌లో శ్రద్ధా దాస్ హోయలు.. జిమ్‌లో యాంకర్‌ సుమ కసరత్తులు)

ఇదిలా ఉండగా ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా ఈ కేసులో పోలీసుల దర్యాప్తులో ఓ షాకింగ్ విషయం తెలిసింది. ఆత్మహత్య చేసుకున్న నటి ఆకాంక్ష లో దుస్తులపై స్పెర్మ్‌ను గుర్తించినట్లు తెలిపారు. పరీక్షల కోసం ఆమె దుస్తులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో నిందితులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దీనికోసం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. కాగా.. ఇప్పటికే ఈ కేసులో పోలీసుల దర్యాప్తుపై ఆకాంక్ష కుటుంబ సభ‍్యులు అనుమానాలు వ్యక్తం చేశారు.  కాగా.. 25 ఏళ్ల ఆకాంక్ష దూబే  ముజ్సే షాదీ కరోగి , వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.

(ఇది చదవండి: రాధికా శరత్‌కుమార్‌కు గోల్డ్‌ రింగ్‌ గిఫ్టుగా ఇచ్చిన లారెన్స్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement