akanksha
-
విజేత తనీషా
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ15 టోర్నమెంట్లో భారత్‌కు చెందిన తనీషా కశ్యప్ విజేతగా నిలిచిది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో అస్సాంకు చెందిన 22 ఏళ్ల తనీషా మూడు సెట్ల పోరాటంలో విజయాన్ని అందుకుంది. భారత్‌కే చెందిన ఆకాంక్ష నిట్టూరేతో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో తనీషా 6–7 (5/7), 6–1, 6–1తో గెలుపొందింది. తద్వారా తన కెరీర్లో తొలి ఐటీఎఫ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ తుది పోరులో తనీషా 10 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో చేజార్చుకున్న తనీషా ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. కేవలం రెండు గేమ్‌లను మాత్రమే కోల్పోయి మ్యాచ్‌ను దక్కించుకుంది. తన సర్విస్‌ను నాలుగుసార్లు కోల్పోయిన తనీషా ప్రత్యర్థి సర్విస్‌ను తొమ్మిదిసార్లు బ్రేక్ చేసింది. చాంపియన్ తనీషాకు 2,352 డాలర్లు (రూ. 1 లక్షా 97 వేలు), రన్నరప్ ఆకాంక్షకు 1,470 డాలర్లు (రూ. 1 లక్షా 23 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
Akanksha Kumari: తాను.. రొటీన్ ఐటీ కాదు.. మైనింగ్ మేటి!
‘ద్వారాలు మూసే ఉన్నాయి’ అని వెనక్కి తిరిగేవారు కొందరు. ఆ ద్వారాలను తెరిచి ముందుకు వెళ్లేవారు కొందరు. ఆకాంక్ష కుమారి రెండో కోవకు చెందిన మహిళ. తొలి భారతీయ మహిళా మైనింగ్ ఇంజినీర్‌గా చరిత్ర సృష్టించింది. ఉద్యోగంలో చేరిన రోజు ఎంత ఉత్సాహం, వృత్తి నిబద్ధతతో ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ‘నో రిగ్రెట్స్.. ఫీల్ గ్రేట్’ అంటుంది. మైనింగ్ ఫీల్డ్‌లోకి రావాలనుకునే మహిళలకు ధైర్యాన్ని ఇస్తోంది.ఝార్ఖండ్‌లోని మైనింగ్ప్రాంతంలో పెరిగిన ఆకాంక్ష కుమారి బొగ్గు గనుల్లో ‘పై కప్పు కూలిపోవడం’ అనే మాటను ఎన్నోసార్లు విని ఉన్నది. మైనింగ్ ఇంజినీర్‌గా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టిన తరువాత ‘పై కప్పు కూలిపోవడం’ అనే మాటను వినడం కాదు ప్రత్యక్షంగా చూసింది. ‘ఇది పురుషులు మాత్రమే చేసే కఠినమైన ఉద్యోగం అనుకునే వృత్తిని ఎంచుకోవడానికి కారణం ఏమిటి?’ అనే ప్రశ్నకు ఆమె స్పందన ఇది...‘బొగ్గు తవ్వకాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో పుట్టి పెరిగాను. ఇక్కడి ప్రజలు ఏ మైనింగ్ కంపెనీలో పని చేయకపోయినా వాళ్లకు మైనింగ్ గురించి చాలా విషయాలు తెలుసు. స్కూల్ హాస్టల్లో నా స్నేహితులు పై కప్పు కూలిపోవడం గురించి మాట్లాడడం నేను ఎన్నోసార్లు విన్నాను. అదెలా? ఎందుకు?’ అనేది నాకు ఆశ్చర్యంగా అనిపించేది. మైనింగ్‌కు సంబంధించి రకరకాల విషయాలు వినడం వల్ల నాకు తెలియకుండానే ఆ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే కలకు బీజం పడింది’ గతాన్ని గుర్తు చేసుకుంది ఆకాంక్ష.‘పదవ తరగతి పూర్తయిన తరువాత ఏం చేయాలి?’ అనుకున్నప్పుడు ఆటల గురించి ఆలోచించింది. తాను జాతీయస్థాయి అథ్లెట్లిక్స్‌లో కూడా పాల్గొంది. ఆటలపై దృష్టి పెట్టాలా, చదువు కొనసాగించాలా అనే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు తాను ఉన్న పరిస్థితిల్లో ఉద్యోగం అనివార్యం కావడంతో చదువుకే ్రపాధాన్యత ఇచ్చింది. ఇంటర్మీడియెట్ పూర్తి అయిన తరువాత ‘ఐటీ రంగంలో ఉద్యోగంపై దృష్టి పెట్టు’ అని కొందరు తనకు సలహా ఇచ్చారు. అయితే ‘ఐటీ’ అనేది ఆకాంక్షకు ఆసక్తికరమైన సబ్జెక్ట్ కాదు. ఆ సమయం లోనే తన మనసులో దాగిన కల బయటికి వచ్చింది. ‘కోల్ మైనింగ్ ఫీల్డ్‌లో ఉద్యోగం చేయాలి’ అని నిర్ణయించుకుంది. ఉపాధ్యాయుడైన తండ్రి, అంగన్వాడీ వర్కర్ అయిన తల్లిని ఒప్పించడం కష్టం కాలేదు.‘మా అమ్మాయి మైనింగ్ జాబ్ చేయాలనుకుంటుంది’ అని ఆకాంక్ష తండ్రి మైనింగ్ కంపెనీలో పనిచేసే తన స్నేహితుడిని సలహా అడిగితే...‘చాలా కష్టం. మధ్యతరగతికి చెందిన ఆడపిల్లలు ఈ రంగంలో పనిచేయలేరు. ఆ పనిభారం తట్టుకోవడం ఆడపిల్లలకు చాలా కష్టం’ అన్నాడు. స్నేహితుడు చెప్పిన విషయాలను కూతురితో పంచుకున్నాడు. అయినా సరే, ఆకాంక్ష వెనక్కి తగ్గలేదు. ఇంజినీరింగ్ కోర్స్ అడ్మిషన్ సమయంలో కౌన్సెలర్ ఆమెకు మైనింగ్ ఇంజినీరింగ్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. వాదోపవాదాల తరువాత ఆకాంక్ష కల నెరవేరింది. ఝార్ఖండ్, ధన్‌బాద్‌లోని బిర్సా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సింద్రీలో బీటెక్ పాసైంది. వొకేషనల్ ట్రైనింగ్‌లో భాగంగా అండర్‌గ్రౌండ్ మైన్‌లో కూడా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.‘ఇక్కడికి నిన్ను ఎవరు పంపించారు? ఎలా పంపిస్తారు? ఇక్కడ మహిళలకు సౌకర్యాలు, సదుపాయాలు లేవన్న విషయం మీ డిపార్ట్మెంట్ హెడ్‌కు తెలియదా?’ అని విసుక్కున్నాడు జనరల్ మేనేజర్. ఆ తరువాత మాత్రం గెస్ట్‌హౌజ్‌లో ఒక రూమ్ కేటాయించారు. అమ్మ, మేనత్తలతో కలిసి ఆ గదిలో ఉండేది ఆకాంక్ష. చదువు పూర్తయిన తరువాత హిందుస్థాన్ జింక్‌లో ఆకాంక్షకు ఉద్యోగం వచ్చింది. మూడు సంవత్సరాలు గనులలో పనిచేసింది. ఆ తరువాత సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్‌కు చెందిన బొగ్గు గనుల్లో పనిచేసింది. కనీస సౌకర్యాలు లేకపోయినప్పటికీ భూగర్భ గనుల్లో గరిష్ఠంగా ఆరు గంటలు పనిచేసింది.2021లో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)లో ఆకాంక్ష చేరిన తరువాత ఇప్పటి వరకు మరో ముగ్గురు మహిళలు మాత్రమే పబ్లిక్ విభాగంలో చేరారు. అయినా సరే ఆకాంక్ష కుమారిలో ఆశాభావం తొలగిపోలేదు. మైనింగ్ ఫీల్డ్‌లో రావాలనుకుంటున్నవారికి సలహాలు ఇవ్వడం, దారి చూపడం మానడం లేదు. ‘సౌకర్యాలు లేకపోవచ్చు. శ్రమతో కూడిన ఉద్యోగం కావచ్చు. అయినా సరే చేస్తాను అనే పట్టుదల మీలో ఉంటే మైనింగ్ ఫీల్డ్‌లోకి తప్పకుండా రావచ్చు’ అంటుంది ఆకాంక్ష కుమారి. తొలి అడుగు వేసి మాత్రమే ఊరుకోలేదు. మరిన్ని అడుగుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూనే తన వంతు ప్రయత్నం చేస్తోంది ఆకాంక్ష.ఇవి చదవండి: ఈ ప్రాణం ఖరీదెంత? -
Akanksha: ఇన్నోవేషన్.. పర్యావరణ హితం!
తండ్రి సైన్యంలో పనిచేస్తుండడంతో ఆకాంక్ష ప్రియదర్శిని బాల్యం దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో గడిచింది. పచ్చదనం అంటే చెప్పలేనంత ఇష్టం. రూర్కెలాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చేసిన ఆకాంక్షకు కాలుష్య సమస్య గురించి ఆందోళనగా ఉండేది.వాయు కాలుష్య ప్రభావంతో తన బంధువులు, కాలేజి స్నేహితులలో కొందరికి శ్వాసకోశ సమస్యలు రావడం ఆమెను కలవరపరిచింది. వాయు కాలుష్యంకు సంబంధించి ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనాలనే లక్ష్యంతో క్లైమెట్ టెక్ స్టార్టప్ ‘ఆరాసుర్’ప్రారంభించింది. ఒడిషాలోని భువనేశ్వర్ కేంద్రంగా ఎన్విరాన్మెంటల్ కన్సల్టెంట్ ‘ఆరాసుర్’ ప్రయాణం మొదలైంది.వైర్లెస్, సెన్సర్ ఆధారిత సాంకేతిక సహాయంతో ప్రభుత్వం, ప్రజలకు మధ్య ఉన్న సమాచార అంతరాన్ని తగ్గించడానికి కంపెనీ చురుగ్గా పనిచేస్తోంది. హైపర్–లోకల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ అభివృద్ధి చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించిన సందేహాలకు సమాధానం చెప్పడానికి మా హార్డ్‌వేర్ పరికరాల నుంచి సేకరించిన డేటా ఉపయోగపడుతుంది.ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి, రెవెన్యూ ఎలా జెనరేట్ చేయాలి....అనే విషయాలకంటే పర్యావరణ విషయాలకేప్రాధాన్యత ఇచ్చాం’ అంటుంది ఆకాంక్ష. హార్డ్‌వేర్ డిజైనింగ్, సప్లైచైన్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్, ఇన్స్టాలేషన్... మొదలైన వాటిలో ప్రావీణ్యం సాధించిన ఆకాంక్ష ‘మల్టీటాలెంటెడ్’గా గుర్తింపు పొందింది.ఇవి చదవండి: Arpan Kumar Chandel: తొలి ఆల్బమ్‌తోనే.. రాగాల రారాజుగా.. -
Akanksha Gupta: మొక్కవోని ఆకాంక్ష
ఈ రోజుల్లో ఇంట్లో కూర్చోనే షాపింగ్ చేసి లక్షలు ఖరీదు చేసే వస్తువులను సైతం క్షణాల్లో కొనేస్తున్నారు. వంట చేయడం కుదరనప్పుడో, తినడానికి ఏమీ లేనప్పుడో, బయటకు వెళ్లే ఓపిక లేనప్పుడో వెంటనే ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తున్నారు. ఆర్డర్ ఇచ్చిన అరగంటలోపు వేడివేడి ఆహారం ఇంటి గుమ్మం ముందుకు వచ్చేస్తుంది. ఈ డెలివరీ యాప్‌లను ఆధారంగా చేసుకుని మొక్కల వ్యాపారం ప్రారంభించింది ఆకాంక్ష గుప్తా. ఫుడ్ డెలివరీ అయినట్టుగానే మొక్కలు, విత్తనాలు, ఎరువులను ఆర్డర్ ఇచ్చిన గంటల వ్యవధిలో కస్టమర్లకు అందిస్తోంది. కంపెనీ ప్రారంభించిన రెండేళ్లలో కోట్ల టర్నోవర్‌తో నడుస్తోంది. మొక్కలను ఎలా డెలివరీ చేస్తోందో ఆకాంక్ష మాటల్లోనే..... ఢిల్లీలోని మోడల్ టౌన్లో నివసించే సాంప్రదాయ ఉమ్మడి కుటుంబం మాది. నాన్న వ్యాపారి. అమ్మ ఇంటిపనులు చూసుకునేది. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో బీకామ్ హానర్స్ పూర్తయ్యాక...ఉద్యోగం చేస్తాను అని ఇంట్లో వాళ్లకు చెప్పాను. అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మాయిలు ఇంట్లో ఉండి పనులు చూసుకుంటుంటే, అబ్బాయిలు బయటకు వెళ్లి పనిచేసి సంపాదించడం పద్ధతి అనేది వాళ్ల నమ్మకం. దీంతో వాళ్లను ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. నేను ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నానో అన్నివిధాలుగా వివరించాను. అందుకు వాళ్లు సమ్మతించి ప్రోత్సహించారు. దీంతో ఈఎక్స్ఎల్ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. ఇక్కడ రెండేళ్లు పనిచేశాక, 2016లో అహ్మదాబాద్ ఐఐఎమ్‌లో ఎమ్బీఏ పూర్తిచేశాను. తర్వాత ‘డెలాయిట్’ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా చేరాను. ► లాక్డౌన్ మార్చేసింది... డెలాయిట్‌లో పనిచేస్తున్నప్పుడు... తెలిసిన వాళ్ల అబ్బాయి సంభవ్ జైన్ పరిచయమయ్యాడు. సంభవ్ కూడా ఎమ్ఎన్సీలో పనిచేస్తుండడం, ఇరుకుటుంబాలకు నచ్చడంతో 2019లో మా పెళ్లి జరిగింది. పెళ్లి అయిన కొన్నినెలలకే లాక్డౌన్ విధించారు. ఇంట్లో ఉండి పనిచేస్తున్నప్పటికీ వారాంతపు సెలవుల్లో చాలా సమయం దొరికేది. మొక్కలు పెంచడం అంటే ఎంతో ఆసక్తి చూపే సంభవ్ సమయం మొత్తం గార్డెనింగ్‌కు కేటాయించేవాడు. సంభవ్ నిర్వహించే వర్క్‌షాపుల్లో ‘‘మొక్కలు ఎలా పెంచాలి? మొక్కలు బాగా పెరిగేందుకు సలహాలు సూచనలు’’ సంభవ్తో కలిసి నేను చెప్పేదాన్ని. ఆరేడు నెలల్లోను మేము నిర్వహించిన వర్క్‌షాపులకు మూడువేల మందికి పైగా హాజరై గార్డెనింగ్ గురించి తెలుసుకున్నారు. ఇలా లాక్డౌన్లో మా జీవితాలు గార్డెనింగ్ వైపు మళ్లాయి. ఈ మార్పే మమ్మల్ని వ్యాపార వేత్తలుగా మార్చింది. ► సమస్యల నుంచి... వర్క్‌షాపుల్లో చాలా మంది.. మొక్కలు పెంచాలని ఉంది కానీ, మంచి మొక్కలు, కుండీలు, ఎక్కడ కొనాలో తెలియడం లేదు. ఆన్లైన్లో కూడా మంచి స్టోర్లు ఏవీ లేవు. అరకొర ఆన్లైన్ స్టోర్లు కస్టమర్లకు నచ్చడం లేదు’’ అని చెప్పారు. దీంతో 2020లో సంభవ్ ఉద్యోగం వదిలేసి ‘ది బన్యన్ కంపెనీ’ పెట్టాడు. తనకి నేను సాయంగా ఉన్నాను. ఒక దగ్గర నర్సరీ పెంచుతూ అక్కడ నుంచి కస్టమర్లకు ఆర్డర్లు ఇవ్వడానికి రవాణా ఖర్చు ఎక్కువ అవడంతోపాటు, కొన్నిసార్లు రవాణాలో మొక్కలు పాడైపోయేవి. దీంతో మా కంపెనీ బాగా నష్టపోయింది. ► ఫుడ్ లా మొక్కలు కూడా... కంపెనీ అనేక నష్టాలను చూశాక ఎలా కంపెనీని నిర్వహించాలని తీవ్రంగా ఆలోచించాను. అప్పుడే నాకు ఫుడ్ డెలివరీ యాప్స్ గుర్తుకొచ్చాయి. ఫుడ్‌ను డెలివరీ చేసే యాప్స్‌లా మొక్కలను ఎందుకు డెలివరీ చేయకూడదు... అనిపించింది. దీనివల్ల సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయి అనుకుని వెంటనే 2021లో ‘ఉర్వాన్.కామ్’ కంపెనీని ప్రారంభించాను. అర్బన్, ఫారెస్ట్ ల నుంచి పదాలను తీసుకుని ఉర్వాన్ పేరు పెట్టాను. ఈ కంపెనీ ప్రారంభించిన వెంటనే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాను. కుటుంబ సభ్యులంతా షాక్ అయ్యారు. ‘‘ఉద్యోగం వదిలేసి సంభవ్ చేసిన వ్యాపారంలో నష్టం వచ్చింది. మళ్లీ ఆకాంక్ష కూడా అదే పనిచేస్తోంది. ఈ వ్యాపారం కూడా నష్టపోదని గ్యారెంటీ ఏంటీ? సంభవ్ నువ్వు అయినా ఉద్యోగం చెయ్యి’’ అందరు సలహాలు ఇచ్చారు. కొంతమంది అయితే ఈ వ్యాపారం ఎప్పటికీ విజయవంతం కాదన్నారు. కానీ నేను, సంభవ్ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు సాగాం. చివరకు ఒక బిజినేస్ అడ్వైజర్ దగ్గరకు వెళ్లి సలహా అడిగితే... ‘‘ఇది అంత మంచి వ్యాపారం కాదు. దీనివల్ల ఆదాయం ఏమీ రాదు. మీ ఇద్దరూ ఉద్యోగాలు చేసుకోవడం మంచిది’’ అని సలహా ఇచ్చారు. వెబ్సైట్ క్రియేట్ చేసిన తరువాత నర్సరీ నిర్వాహకులను కలిసి వెబ్సైట్లో యాడ్ చేశాము. కొంతమందికి కనీసం వాట్సాప్ మెస్సేజ్‌లు కూడా పంపడం రాదు. ఆన్లైన్లో మొక్కలు విక్రయించిన అనుభవం ఎవరికీ లేదు. దీంతో అందరికి దీనిలో శిక్షణ ఇచ్చాము. ప్రారంభంలో పెద్దగా ఆదాయం ఏమీ రాలేదు. కానీ రెండు వారాల తరువాత మేము పెట్టిన పెట్టుబడికి తగిన ఆదాయం రావడం మొదలైంది. కస్టమర్లు పెరగడంతో..స్నేహితులు, బంధువులు మా కంపెనీలో పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టారు. ఆర్డర్ ఇచ్చిన మరుసటిరోజుకల్లా దగ్గర్లోని నర్సరీల నుంచి కస్టమర్లకు మొక్కలు డెలివరీ ఇస్తున్నాం. దీనికి అదనపు ప్యాకింగ్ చార్జీలు లేకపోవడం, బయటి రేటుకే ఆన్లైన్లో దొరుకుతుండడంతో ఎక్కువమంది మా దగ్గర కొనడం ప్రారంభించారు. తొలినాళ్లల్లో నెలకు ఐదువందల మొక్కలు విక్రయించడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు నెలకు మూడులక్షలకు పైగా మొక్కలను డెలివరీ ఇస్తున్నాము. ఇద్దరితో ప్రారంభమైన మా వ్యాపారం నేడు పాతిక మందికి చేరింది. మూడు నర్సరీల నుంచి నలభై నర్సరీలు అయ్యాయి. ఢిల్లీ, ఎన్సీఆర్లోనేగా బెంగళూరులోనూ మా మొక్కలు డెలివరీ ఇస్తున్నాము. వచ్చే సంవత్సరం వందకోట్ల టర్నోవర్ లక్ష్యంగా పనిచేస్తున్నాము. ‘‘కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు ఎవరికీ నచ్చకపోవచ్చు. కానీ ఆ నిర్ణయం మీద, మన మీద మనకు నమ్మకం ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొని విజయం సాధించవచ్చు’’ అని ఆకాంక్ష గుప్తా నిరూపించి చూపిస్తోంది. -
ఇవిగివిగో... అవిగవిగో!
తాజాగా ఫోర్బ్స్ ఇండియా ‘డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించింది 24 సంవత్సరాల ఆకాంక్ష మోంగ. కన్సల్టెన్సీ జాబ్‌ను వదిలేసి ఫుల్‌టైమ్ ట్రావెలర్‌గా మారింది. పుణెకు చెందిన ఆకాంక్ష ట్రావెల్ అండ్ ఫొటోగ్రఫీ విభాగంలో మంచి పేరు తెచ్చుకుంది. ‘కంటెంట్‌ను ప్రేక్షకులకు వేగంగా చేరువ చేయడానికి సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయం లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలి’ అంటుంది ఆకాంక్ష. డిజిటల్ క్రియేటర్లు నిలువ నీరులా, గోడకు కొట్టిన మేకులా ఉండకూడదు అనే స్పృహతో యువ క్రియేటర్లు ఎప్పటికప్పుడు కొత్త టాపిక్స్‌పైనే కాదు టూల్స్ గురించి కూడా అవగాహన చేసుకుంటున్నారు. క్రియేటర్–ఫ్రెండ్లీ టూల్స్‌కు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల అప్డేట్స్ను వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. కంటెంట్ మేకింగ్‌లో మరింత క్రియేటివిటీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.... రెండు నెలల క్రితం ‘మీ షార్ట్స్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకు వెళ్లండి’ అంటూ యూట్యూబ్ కొత్త క్రియేషన్ టూల్స్‌ను తీసుకువచ్చింది. అందులో ఒకటి కొలాబ్. ఈ టూల్‌తో సైడ్–బై–సైడ్ ఫార్మట్‌లో ‘షార్ట్’ను రికార్డ్ చేయవచ్చు. క్రియేటర్లు తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవడానికి మల్టిపుల్ లే ఔట్ ఆప్షన్లు ఉంటాయి.గత నెలలో జరిగిన ‘మేడ్ ఆన్ యూట్యూబ్’ కార్యక్రమంలో క్రియేటర్స్‌కు ఉపకరించే కొత్త టూల్స్‌ను ప్రకటించింది కంపెనీ. ‘క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్కు కొత్త టూల్స్ తీసుకురానున్నాం. క్లిష్టం అనుకునే వాటిని సులభతరం, అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసే టూల్స్ ఇవి. క్రియేటివ్ పవర్‌కు దగ్గర కావడానికి ఉపకరిస్తాయి’ అన్నాడు యూ ట్యూబ్ సీయీవో నీల్ మోహన్.యూ ట్యూబ్ ప్రకటించిన కొన్ని టూల్స్.... డ్రీమ్ స్క్రీన్ యూట్యూబ్ షార్ట్స్ కోసం రూపొందించిన న్యూ జెనరేటివ్ ఫీచర్ ఇది. దీని ద్వారా తమ షార్ట్స్‌కు ఏఐ జనరేటెడ్ వీడియో లేదా ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేయడానికి వీలవుతుంది. పెద్దగా కష్టపడనక్కర్లేకుండానే పాప్ట్ ఇస్తే సరిపోతుంది. ‘డ్రీమ్ స్క్రీన్’ ద్వారా క్రియేటర్లు తమ షార్ట్స్‌కు న్యూ సెట్టింగ్స్ జ నరేట్ చేయవచ్చు. యూట్యూబ్ క్రియేట్ వీడియోలు క్రియేట్ చేయడానికి షేర్ చేయడానికి ఉపకరిస్తుంది. యూట్యూబ్ క్రియేట్ యాప్ ద్వారా ఖచ్చితత్వం, నాణ్యతతో కూడిన ఎడిటింగ్, ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ కాప్షనింగ్, వాయిస్ వోవర్, యాక్సెస్ టు లైబ్రరీ ఆఫ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, రాయల్టీ–ఫ్రీ మ్యూజిక్... మొదలైనవి క్రియేటర్లకు ఉపయోగపడతాయి. ఒక్క ముక్కలో చె΄్పాలంటే కాంప్లెక్స్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌తో పని లేకుండానే ప్రేక్షకులను ఆకట్టుకునేలా వీడియోలను సులభంగా క్రియేట్ చేయవచ్చు. క్రియేటర్ల నోట ‘హిట్ లైక్ అండ్ సబ్‌స్క్రైబ్’ అనే మాట తరచుగా వినిపిస్తుంటుంది. ప్రస్తుతం దీన్ని ఫీచర్‌గా మలచనున్నారు. ‘హిట్ లైక్ అండ్ సబ్‌స్క్రైబ్’ వినిపిస్తున్నప్పుడు ఈ బటన్లను సింక్‌లోని విజువల్ క్యూతో హైలైట్ చేస్తుంది. ఏఐ ఇన్సైట్స్ యూట్యూబ్‌లో ప్రేక్షకులు చూస్తున్న కంటెంట్ ఆధారంగా వీడియో ఐడియాలను తయారు చేసుకోవడానికి వీలవుతుంది. అలౌడ్ ఆటోమేటిక్ డబ్బింగ్ టూల్ ద్వారా కంటెంట్‌ను ఎక్కువ భాషల్లో క్రియేట్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ కూడా క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అప్డేట్స్తో ముందుకు వస్తోంది. వాటిలో ఒకటి క్రియేటర్లు ‘రీల్స్’లో టాప్ ట్రెండింగ్ సాంగ్స్ గురించి తెలుసుకునే అవకాశం. ఆ ఆడియోనూ ఎన్నిసార్లు ఉపయోగించారో తెలుసుకోవచ్చు. సేవ్ చేసి అవసరమైన సందర్భంలో వాడుకోవచ్చు. ట్రెండింగ్ టాపిక్స్ ఏమిటో కూడా తెలుసుకోవచ్చు. ‘ప్రస్తుతం పాపులర్ ఏమిటి?’ అనేది తెలుసుకోవడానికి కొత్త డెడికేటెడ్ సెక్షన్ క్రియేటర్లకు ఉపకరిస్తుంది’ అని చెబుతుంది కంపెనీ.‘రీల్స్’ను ఎడిట్ చేయడాన్ని సులభతరం చేయడానికి వీడియో క్లిప్‌లు, ఆడియో, స్టిక్కర్స్, టెక్ట్స్‌ను ఒకేచోటుకు తీసుకువచ్చింది. తమ కంటెంట్ పెర్ఫార్మెన్స్ గురించి తెలుసుకోవడానికి కొత్తగా తీసుకువచ్చిన ‘రీల్స్ ఇన్సైట్స్’తో యాక్సెస్ కావచ్చు. ఇన్స్టాగ్రామ్ కొత్తగా యాడ్ చేసిన ‘టోటల్ వాచ్ టైమ్’ మెట్రిక్, ‘యావరేజ్ టైమ్’ మెట్రిక్‌తో క్రియేటర్లు యాక్సెస్ కావచ్చు. రీల్స్‌లో ‘స్ట్రాంగర్ హుక్’ క్రియేట్ చేసి వీడియోను ఆకట్టుకునేలా చేయడానికి ఇది ఉపకరిçస్తుంది. అయిననూ... టెక్నాలజీ మాత్రమే సర్వస్వం, విజయ సోపానం అనుకోవడం లేదు యువ క్రియేటర్లు. ‘టెక్నాలజీ అంటే టూల్స్ మాత్రమే కాదు క్రియేటర్ పనితీరు. ప్రత్యేకత. సృజనాత్మకత’ అనే విషయంపై అవగాహన ఉన్న యువ క్రియేటర్లు నేల విడిచి సాము చేయడం లేదు. కంటెంట్, టెక్నాలజీని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. -
యువతి ఆత్మహత్య!
భద్రాద్రి: గిరిజన యువతి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. సీఐ అశోక్ కథనం ప్రకారం.. ఉంజుపల్లికి చెందిన పాయం భూదేవి భర్త మరణానంతరం చర్లలోని గొల్లగట్టలో నివాసముంటోంది. ఆమె రెండో కుమార్తె పాయం ఆకాంక్ష (21) హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. కాగా, చర్లకు చెందిన దొడ్డా పృథ్వీరాజు, ఆకాంక్ష కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పృథ్వీరాజ్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేందుకు హైదరాబాద్‌కు వెళ్లాడు. తిరిగి రాగానే ఆకాంక్ష, పృథ్వీరాజు కలిసి చర్లలో ఇంటిని అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. కాగా, పాయం భూదేవి నెల రోజుల కిందట వారి వద్దకు వెళ్లి ఆకాంక్షను ఇంటికి రావాలని కోరినా ఆమె నిరాకరించింది. శనివారం సాయంత్రం పృథ్వీరాజు ఇంట్లో లేని సమయంలో ఆకాంక్ష కలుపుమందు తాగింది. దీంతో పృథ్వీరాజుతో పాటు అతడి తల్లిదండ్రులు ఆమెను భద్రాచలంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహిస్తుండగా మృతి చెందింది. అయితే, చికిత్స పొందుతున్న సమయంలో తన కుమార్తెతో తాను మాట్లాడానని, భర్త, అత్తమామలు వేధిస్తున్నారని, అందువల్లే కలుపుమందు తాగానని చెప్పినట్లు తల్లి భూదేవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీఐ అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆకాంక్ష మృతదేహానికి పృథ్వీరాజు కుటుంబ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించారు. -
బిగ్‌బాస్ హౌస్‌లో ముద్దులాట.. తప్పు మీది.. నన్నెందుకు పంపించేశారు?
బిగ్‌బాస్ హౌస్.. ఇక్కడ ఏదైనా చేయొచ్చు, హద్దుల్లేవ్.. సరిహద్దుల్లేవ్ అన్నట్లుగా విచ్చలవిడిగా చెలరేగిపోవచ్చు అనుకుంటే పొరపాటే! హౌస్‌లో జరిగే అన్ని విషయాలను బిగ్‌బాస్ ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. తప్పు జరిగిందంటే బిగ్‌బాస్ లేదా వీకెండ్లో హోస్ట్ కంటెస్టెంట్లను ఉతికారేస్తుంటారు. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ రెండో సీజన్లో కూడా ఇదే జరిగింది. ఇద్దరు కంటెస్టెంట్లు కెమెరాల ముందే లిప్‌లాక్ ఇచ్చుకున్నారు. వీకెండ్లో సల్మాన్ ఖాన్ ఇదేం పనికిమాలిన పని అని తిట్టిపోశాడు. దీంతో జైద్ తప్పు ఒప్పుకున్నాడు కానీ ఆకాంక్ష మాత్రం అందులో తప్పే లేదన్నట్లుగా మాట్లాడింది. హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా అదే మాటపై నిలబడింది. అయితే ఈ విషయంలో ఆగ్రహించిన సల్మాన్ తనతో దురుసుగా వ్యవహరించాడంటూ బీటౌన్‌లో ఓ వార్త వైరలయింది. తాజాగా దీనిపై ఆకాంక్ష పూరీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 'బిగ్‌బాస్ నాతో రూడ్‌గా మాట్లాడాడని చెప్పాను. సల్మాన్ సర్‌ను నేను ఏమీ అనలేదు. వీకెండ్ కా వార్ ముందు బిగ్‌బాస్ నన్ను జైలుకు పంపించాడు. ఇక్కడ నేను సల్మాన్ సర్ గురించి ఏం మాట్లాడలేదు. దయచేసి నా వ్యాఖ్యలను వక్రీకరించొద్దు. ఇలా పదాలు మార్చేస్తే నేను మాట్లాడినదానికి అర్థమే మారిపోతోంది. సల్మాన్ సర్ కేవలం వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో మాత్రమే ఈ విషయం గురించి మాట్లాడాడు' అని క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ ముద్దు సంఘటన గురించి ఆమె ఇంకా ఏం మాట్లాడిందంటే.. 'నేను టాప్ 3లో ఉండాల్సినదాన్ని. నన్నెందుకు బయటకు పంపించారు? ఇది ఓటీటీ షో. ఇక్కడ మీకు ఆ లిప్‌లాక్ అంత తప్పుగా అనిపించిందా? అలాంటప్పుడు ఎందుకు డైరెక్ట్‌గా ప్రసారం చేశారు. దాన్ని కట్ చేయొచ్చు కదా, లేదంటే బ్లర్ చేయొచ్చుగా! మీరు కావాలనే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లి చివరికి తప్పు నా మీద వేస్తున్నారు. ఇక్కడ నేను బాధితురాలిని. రెండు నాలుకల పాములా ప్రవర్తిస్తున్నారు. మీకంత ఇబ్బంది అనిపిస్తే ఆ టాస్కు సమయంలోనే కలగజేసుకోవాల్సింది' అని ఆగ్రహించింది ఆకాంక్ష పూరి. చదవండి: అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్.. నన్ను కూడా మర్చిపోయింది. మూడేళ్లు బెడ్‌పైనే.. -
అక్కడ మరొకరు ఉన్నా లిప్‌లాక్ చేసేదాన్ని:నటి
బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ ఓటీటీ-2 కోసం హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ షోలో చుట్టూ కెమెరాలున్న విషయాన్నే మర్చిపోయి ఓ జంట లిప్‌లాక్ ఇచ్చుకుంది. ప్రేక్షకులకు ఇది ఏమాత్రం నచ్చలేదు. దీంతో ఆయన వారిద్దరిపై సీరియస్ అయ్యారు. ఆపై సండే ఎపిసోడ్లో ప్రేక్షక లోకానికి క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది. దీనిలో భాగంగానే వారిద్దరిలో మొదటి వేటు నటి ఆకాంక్ష పూరిపై పడింది. (ఇదీ చదవండి: 4 ఏళ్ల కూతురిని పెట్టుకుని.. బిగ్‌బాస్ హౌస్‌లో లిప్ లాక్ సీనా?: సల్మాన్ ఫైర్) తాజాగా షో నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆకాంక్ష తన లిప్‌లాక్ గురించే కాకుండా ఎలిమినేషన్‌పై తన అభిప్రాయం చెప్పింది. ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షో నుంచి ఇలా బయటకు వచ్చినందుకు చాలా బాధగా ఉందని ఆకాంక్ష తెలిపింది. అయితే ఆమె లిప్‌లాక్ సీన్ గురించి చింతించలేదని చెప్పింది. హౌస్‌లో ఓ టాస్క్ సందర్భంగా ఇదంతా చేశానని, అందులో తప్పేమీ లేదని పేర్కొంది. షోలో టాస్క్ ముఖ్యమైంది. ఒక టాస్క్ కింద తనకు ఈ 30 సెకన్ల ఛాలెంజ్ ఇచ్చారని, దీన్ని టాస్క్‌గా మాత్రమే పరిగణించానని ఆకాంక్ష తెలిపింది. ఈ లిప్‌లాక్‌పై తనకు వ్యక్తిగతంగా మాత్రం ఆసక్తి లేదని, జైద్ స్థానంలో మరొకరు ఉన్నప్పటికీ, తాను ఈ పనిని అదే విధంగా చేసేదానినని స్పష్టం చేసింది. ఇదేమీ పెద్ద ఇష్యూ కాదని ఆకాంక్ష చెప్పింది. లిప్‌లాక్ వ్యవహారం ఎంత పెద్దదైందో, సల్మాన్ ఖాన్‌కి ఎందుకు అంత కోపం వచ్చిందో కూడా బయటికి వచ్చిన తర్వాతే తెలిసిందని పేర్కొంది. ఇది ఇంత పెద్ద సమస్య అవుతుందన్న ఆలోచన కూడా తనకు ఆ సమయంలో లేదని తెలిపింది. ఈ వారం నామినేషన్ కత్తి జైద్పై కూడా వేలాడుతోంది. అతను కూడా మరో నాలుగు రోజుల్లో బిగ్ బాస్ నుంచి బయటకు రావచ్చని తెలుస్తోంది. (ఇదీ చదవండి: 100 మిలియన్ వ్యూస్ వచ్చిన ఈ పాటను చూశారా?) -
కెమెరాల ముందు ముద్దులు, సారీ చెప్పిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎన్నో సినిమాలు చేశాడు, కానీ ఇంతవరకు ముద్దు సన్నివేశాలకు ఓకే చెప్పలేదు. ఆమధ్య దిశాపటానీతో లిప్‌లాక్ సీన్లో నటించి నో కిస్ సీన్ పాలసీని బ్రేక్ చేశాడంటూ వార్తలు వచ్చాయి. అయితే సల్మాన్ ఆ సన్నివేశంలో నటించిన విషయం నిజమే కానీ దిశా మూతికి ప్లాస్టర్ వేశాకే సదరు సీన్లో నటించాడట! ఇన్ని సంవత్సరాలుగా ఒకటే పాలసీకి కట్టుబడి ఉన్నాడు సల్మాన్. అయితే అతడు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షోలో మాత్రం చుట్టూ కెమెరాలున్న విషయాన్నే మర్చిపోయి ఓ జంట లిప్‌లాక్ ఇచ్చుకుంది. ప్రేక్షకులకు ఇది ఏమాత్రం మింగుడు పడలేదు. ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూసే షోయేనా? లేదంటే బూతు బొమ్మల షోనా? అని మండిపడ్డారు. సండే ఎపిసోడ్లో ప్రేక్షక లోకానికి క్షమాపణలు చెప్పిన సల్మాన్ కెమెరా ముందే ముద్దులిచ్చుకున్న జద్ హదీద్, ఆకాంక్ష పూరిలపై ఫైర్ అయ్యాడు. మొదట కవర్ చేసుకునేందుకు ప్రయత్నించిన వాళ్లిద్దరూ యాక్టింగ్ ఫీల్డ్‌లో ఇది సర్వసాధారణమే కదా అని బుకాయించారు. దీంతో మండిపోయిన సల్లూ భాయ్.. మీరేమీ ఇక్కడ సినిమా రోల్సో, వెబ్ సిరీస్ రోల్సో చేయడం లేదు. ఇదేమీ స్క్రిప్ట్ కాదు, ఇలా చేయమని మీకెవరూ ఆదేశాలివ్వలేదు అని కోప్పడ్డాడు. దీంతో దారికొచ్చిన జద్.. సల్మాన్‌కు క్షమాపణలు తెలిపాడు. 'కొందరికి మీరు చేసే పని నచ్చొచ్చేమో కానీ చాలామందికి మాత్రం నచ్చదు. ఈ వారం ఇదే హైలైట్ అవుతుందనుకుంటున్నావేమో.. కుటుంబ విలువలు, పెంపకం, సంస్కృతి ఇదేనా మనకు నేర్పింది. ఈ దేశం సాంప్రదాయాలకు విలువనిస్తుందన్న విషయం మర్చిపోకండి. ఇంకోసారి ఇదే జరిగితే నిన్ను డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేస్తా' అని వార్నింగ్ ఇచ్చాడు సల్మాన్. కాగా జద్ తనకు నాలుగేళ్ల కూతురు ఉందని చెప్పడంతో సల్మాన్ షాకవడమే కాక మరింత సీరియస్ అయ్యాడు. ఏదైనా పని చేసేముందు దాని పర్యవసానాలు కూడా ఆలోచించుకోమని హెచ్చరించాడు. ఇకపోతే ఆదివారం ఎపిసోడ్లో ఆకాంక్ష పూరి బిగ్‌బాస్ ఓటీటీ షో రెండో సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) చదవండి: నయనతార ఆశలన్నీ ఆ 75 పైనే -
బుల్లితెర నటి సూసైడ్ కేసు.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!
బుల్లితెర నటి ఆకాంక్ష దూబే ఈ ఏడాది మార్చి 25న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. భోజ్‌పురి నటి ఆకాంక్ష యూపీలోని వారణాసిలో గతనెలలో బలవన్మరణానికి పాల్పడింది. హోటల్లోని తన గదిలో విగతజీవిగా కనిపించింది. ఆమె సూసైడ్ ఘటనపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అయితే నటి ప్రియుడు, సింగర్ సమర్ సింగ్‌పై అనుమానం వ్యక్తం చేయగా.. అతనితో పాటు అతని సోదరుడు సంజయ్‌ను ఘజియాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. (ఇది చదవండి:వెకేషన్లో శ్రద్ధా దాస్ హోయలు.. జిమ్‌లో యాంకర్ సుమ కసరత్తులు) ఇదిలా ఉండగా ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా ఈ కేసులో పోలీసుల దర్యాప్తులో ఓ షాకింగ్ విషయం తెలిసింది. ఆత్మహత్య చేసుకున్న నటి ఆకాంక్ష లో దుస్తులపై స్పెర్మ్‌ను గుర్తించినట్లు తెలిపారు. పరీక్షల కోసం ఆమె దుస్తులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో నిందితులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దీనికోసం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. కాగా.. ఇప్పటికే ఈ కేసులో పోలీసుల దర్యాప్తుపై ఆకాంక్ష కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా.. 25 ఏళ్ల ఆకాంక్ష దూబే ముజ్సే షాదీ కరోగి , వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. (ఇది చదవండి: రాధికా శరత్‌కుమార్‌కు గోల్డ్ రింగ్ గిఫ్టుగా ఇచ్చిన లారెన్స్) -
Aakanksha Monga: ఆమె ఊరి పేరు... ప్రపంచం
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘లింక్డ్ ఇన్’లో క్రియేటర్‌గా పని చేసేది దిల్లీకి చెందిన ఆకాంక్ష మొంగా. తన పాషన్, ప్రాణం ట్రావెలింగ్. అయితే ఉద్యోగ బాధ్యతల వల్ల ‘ఇంటి నుంచి ఆఫీసుకు–ఆఫీసు నుంచి ఇంటికి’ మాత్రమే జీవితం పరిమితమైపోయింది. రొడ్డకొట్టుడు జీవనశైలితో విసిగిపోయిన ఆకాంక్ష తన పాషన్‌కు తిరిగి ప్రాణం పోసింది. ఉద్యోగానికి రాజీనామా చేసి బ్యాగు సర్దుకొని బయలుదేరింది. కంటెంట్ క్రియేటర్‌గా మారింది. సోషల్ మీడియాలో వందల మందితో తనదైన కమ్యూనిటీని సృష్టించుకుంది. పన్నెండు దేశాలు తిరిగిన ఆకాంక్ష ఆరుమంది సభ్యులతో ‘ట్రావెల్ ఏ మోర్’ పేరుతో ఒక గ్రూప్‌ను క్రియేట్ చేసింది. తాజాగా... ట్విట్టర్లో ఆమె చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా నిలిచింది. ‘ఒక విషయంపై పాషన్ ఉండి కూడా దానికి దూరం అవుతూ, మనసులోనే కుమిలిపోయేవారు ఎందరో. అలాంటి వారికి ఆకాంక్ష కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కొత్త దారి చూపించింది’ ‘డెస్క్ టు డెస్టినేషన్స్’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. -
బుల్లితెర నటి సూసైడ్ కేసు.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో!
బుల్లితెర నటి ఆకాంక్ష దూబే హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. భోజ్‌పురికి చెందిన నటి వారణాసిలో షూటింగ్‌కు వెళ్లి అక్కడే బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆమె ఆత్మహత్యపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో బయటకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నటి ఆకాంక్ష దూబే తాను చనిపోవటానికి కొన్ని క్షణాల ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకుంది. ఆ వీడియోలో తన చావుకు కారణమైన వ్యక్తి వివరాలను వెల్లడించింది. ఆకాంక్ష దూబే ఏడుస్తూ.. 'నాకు ఏం జరిగినా దీనంతటికీ సమర్ సింగే కారణం. నా చావుకు కారణం అతడే' అంటూ తన బాధను వెల్లడించింది. కాగా.. 25 ఏళ్ల ఆకాంక్ష దూబే ముజ్సే షాదీ కరోగి , వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. సింగర్ సమర్ సింగ్‌తో ప్రేమలో పడిన ఆమె.. ఆ తర్వాత మనస్పర్థలతో విడిపోయారు. కొన్నాళ్ల పాటు డిప్రెషన్‌కు గురైన ఆకాంక్ష చాలా రోజుల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. भोजपुरी एक्ट्रेस आकांक्षा दुबे का एक नया वीडियो आया सामने.इसमे वह रोते हुए अपने साथ कुछ भी गलत होने पर समर सिंह को जिम्मेदार बता रही.#AkanshaDubeySuicide #UPPolice #SamarSingh #Jaunpur #Varanasi #akanshadubey #CMYogi pic.twitter.com/tcP5fzSjqF — Sri Kant Chaturvedi (@SriChatur007) April 19, 2023 -
నటి అనుమానాస్పద మృతి కేసు.. పోలీసుల అదుపులో సింగర్
ప్రముఖ బుల్లితెర నటి ఆకాంక్ష దూబే మృతి కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు ప్రముఖ సింగర్ సమర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో హోటల్లోని సీసీటీవీ దృశ్యాలు మరింత కీలకంగా మారాయి. చనిపోయే కొన్ని నిమిషాల ముందు ఆమె ఓ వ్యక్తితో ఉన్న దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలేం జరిగిందంటే? భోజ్‌పురి నటి ఆకాంక్ష ఓ సినిమా షూటింగ్ కోసం వారణాసి వెళ్లారు. అక్కడే ఆమె ఓ హోటల్లో ఉంటూ షూటింగ్లో పాల్గొన్నారు. మార్చి 26న షూటింగ్ ముగిసిన వెంటనే హోటల్‌కు తిరిగొచ్చిన ఆకాంక్ష దూబే అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. చనిపోవటానికి కొన్ని నిమిషాల ముందు ఓ గుర్తు తెలియని వ్యక్తితో ఆమె మాట్లాడినట్లు తెలుస్తోంది. సీసీటీవీలో ఆకాంక్షతో పాటు కనిపించిన ఆ వ్యక్తి ఎవరో ఇంకా వివరాలు తెలియరాలేదు. ఆకాంక్ష మరణంతో అతడికి ఏదైనా సంబంధముందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆకాంక్ష మరణం హత్య అని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రముఖ సింగర్ సమర్ సింగ్ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. ఆమెకు గతంలో సమర్ సింగ్ అనే సింగర్‌తో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆత్మహత్యకు కొద్ది గంటల ముందు వెక్కివెక్కి ఏడ్చిన నటి
యువ నటి ఆకాంక్ష దూబే(25) ఆత్మహత్యతో భోజ్‌పురి చిత్రసీమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఓ సినిమా షూటింగ్ కోసం వారణాసి వెళ్లిన ఆమె ఆదివారం అక్కడి హోటల్ గదిలో ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. ఇంత చిన్నవయసులో బలవన్మరణానికి పాల్పడేంత కష్టం ఏమొచ్చిందంటూ అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు. అయితే తను ఆత్మహత్య చేసుకోవడానికి ఒక రోజు ముందు రాత్రి ఇన్స్టాగ్రామ్ లైవ్‌కి వచ్చింది నటి. ఆ సమయంలో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయిన ఆమె దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తూ కంటతడి పెట్టుకుంది. ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని వెక్కివెక్కి ఏడ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ఇది సూసైడ్ కాదని తనను మెంటల్ టార్చర్ చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆకాంక్ష కొంతకాలంగా సహనటుడు సమర్ సింగ్‌తో ప్రేమలో ఉంది. తనతో ఉన్న ఫోటోలను కూడా తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తన కెరీర్ విషయానికి వస్తే.. మేరీ జంగ్ మేరా ఫైస్లా అనే చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది ఆకాంక్ష. ముజ్సే షాదీ కరోగి (భోజ్‌పురి), వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్, కసమ్ పైడా కర్నే కేఐ 2 ప్రాజెక్టుల్లో నటించింది. Bhojpuri actress Akanksha Dubey committed suicide in a hotel in Banaras.. Last night live video viral on #socialmedia..#Varanasi #Bhojpuri #AkankshaDubey #akankshadubey #viral #viralnews #Sarnath #bhojpuriactress #bhojpuri #varanasipolice #Varanasi #UPPolice pic.twitter.com/yuwt6v6Kdg — BOBBY UPPAL 🇮🇳🛡⚔️⚖️ (@ibobbyuppal) March 26, 2023 This is Bhojpuri actress Akanksha Dubey, She committed suicide in a hotel in Varanasi today morning Yesterday late night Akanksha came live on Instagram, at that time she was crying What’s even happening? Why people are giving their life on petty things?pic.twitter.com/RZUyoOwJRE — Dr Nimo Yadav (@niiravmodi) March 26, 2023 NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. యువనటి ఆత్మహత్య
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. శనివారం కన్నడ డైరెక్టర్ కిరణ్ గోవి గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆ విషాదం మరవకముందే మరో నటి సూసైడ్ చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్యకు పాల్పడింది. వారణాసిలోని ఓ హోటల్లో ఆమె విగతజీవిగా కనిపించింది. ఈ ఘటనతో భోజ్‌పురి చిత్రసీమ విషాదంలో మునిగిపోయింది. ప్రస్తుతం నటి వయస్సు 25 సంవత్సరాలు. కొన్ని గంటల ముందే సాంగ్ రిలీజ్ ఆత్మహత్యకు కొన్ని గంటలముందే పవన్ సింగ్‌తో కలిసి ఆమె చేసిన మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో డ్యాన్స్ రీల్స్ చేస్తూ అభిమానులతో పంచుకునేవారు. ఆకాంక్ష దూబే 21 అక్టోబర్ 1997న ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో జన్మించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఆకాంక్ష ఇన్‌స్టాగ్రామ్‌లో రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించింది. తన సహనటుడు సమర్ సింగ్‌తో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. అయితే ఆకాంక్ష 2018లో డిప్రెషన్‌తో బాధపడి.. కొన్ని రోజులు సినిమాల నుంచి విరామం తీసుకుంది. ఆ తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆమె 17 ఏళ్ల వయసులోనే మేరీ జంగ్ మేరా ఫైస్లా అనే చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆకాంక్ష ముజ్సే షాదీ కరోగి (భోజ్‌పురి), వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్, కసమ్ పైడా కర్నే కేఐ 2 ప్రాజెక్ట్‌లలో కూడా కనిపించింది. View this post on Instagram A post shared by Prashant Photography Deoria (@prashant_photography_deoria) -
‘అయ్యో!’లకు ఆస్కారం ఇవ్వకుండా సమస్యకు పరిష్కారం చూపే సిక్స్ సెన్స్!
అంతా అయిపోయాక ‘అయ్యో!’ అనుకుంటాయి కొన్ని సంస్థలు. ‘అయ్యో!’లకు ఆస్కారం ఇవ్వకుండా సమస్యకు పరిష్కారం చూపుతుంది సిక్స్ సెన్స్. ఇది ఏ.ఐ ఆధారిత డిఫెక్ట్ ఎనాలటిక్స్ ప్లాట్‌ఫామ్. ఇద్దరు స్నేహితులు ఆకాంక్ష జగ్వానీ, అవ్నీ అగర్వాల్‌లు ప్రారంభించిన ఈ స్టార్టప్ విజయపథంలో దూసుకుపోతోంది. సాంకేతిక లోపాలను, కారణాలను ముందుగానే తెలియజేయడం ద్వారా ఈ టెక్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశ్రమలకు ఉపయోగపడుతుంది. తమ ప్రాజెక్ట్‌పై నమ్మకం కలిగించేలా, పెట్టుబడి పెట్టేలా చేయడం స్టార్టప్ ఫౌండర్లకు సవాలు. ఇక పురుషాధిక్య రంగాలుగా ముద్రపడిన వాటిలో మహిళా స్టార్టప్ ఫౌండర్లకు ఇది మరింత పెద్ద సవాలు. కానీ ఈ అతిపెద్ద సవాలును ఎలాంటి అవరోధాలు లేకుండానే అధిగమించారు ఆకాంక్ష జగ్వానీ, అవ్నీ అగర్వాల్. సింగపూర్ కేంద్రంగా వీరు శ్రీకారం చుట్టిన స్టార్టప్ ‘సిక్స్‌సెన్స్’ (ఎస్ఎస్)కు లీడింగ్ వెంచర్ క్యాపిటల్స్ నుంచి నైతిక,ఆర్థిక మద్దతు లభించింది. ఇద్దరు ఉద్యోగులతో మొదలైన ఈ స్టార్టప్ విజయపథంలో దూసుకుపోతుంది. ‘సిక్స్‌సెన్స్’ అనేది ఏ.ఐ ఆధారిత డిఫెక్ట్ ఎనాలటిక్స్ ప్లాట్‌ఫామ్. సాంకేతికలోపాలను గుర్తించడంలో ఉపయోగపడే క్లాసిఫికేషన్ సాఫ్ట్వేర్ ఇది. ఏ.ఐ సాంకేతికతను ఉపయోగించి ‘ఎస్ ఎస్’ టెక్ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వందలాది ప్రాడక్ట్స్‌ను స్కాన్ చేస్తోంది. ఎక్కువ నష్టం జరగక ముందే మాన్యుఫాక్చరింగ్ ఎక్విప్‌మెంట్‌లో లోపాలను గుర్తిస్తోంది. ఆపరేషనల్ మిస్టేక్స్‌లో అధిక ఆర్థిక నష్టం జరగకుండా చూస్తోంది. లోపాలను గుర్తించడం మాత్రమే కాదు, అవి ఎందుకు తలెత్తుతున్నాయో ఇంజనీర్లకు ఈ ప్లాట్‌ఫామ్ వివరిస్తుంది. ‘ఎస్ ఎస్’ కో–ఫౌండర్, సీటివో అవ్నీ అగర్వాల్ అలహాబాద్‌లోని ‘మోతిలాల్ నెహ్రు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో కంప్యూటర్ సైన్స్ చదువుకుంది. డాటా సైన్స్‌లో మంచి పట్టు ఉంది. చదువు పూర్తయిన తరువాత ఒక ప్రముఖ సంస్థలో పనిచేసి ‘బ్రిలియెంట్’ అనిపించుకుంది అగర్వాల్. ఈ సంస్థలో పనిచేయడం ద్వారా లాంచింగ్ ప్రాడక్ట్స్ నుంచి మెనేజింగ్ కంపెనీ కల్చర్ వరకు ఎన్నో విషయాలను ప్రాక్టికల్‌గా తెలుసుకుంది. ఆ సమయంలో తాను ప్రధానంగా గమనించిన విషయం ఏమిటంటే, టెక్నాలజీ పరంగా సంస్థలు ఏ మేరకు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయని. డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సిన అనివార్యత ఉన్నప్పటికీ ఎన్నో పరిశ్రమలు దానికి దూరంగా ఉండడాన్ని అగర్వాల్ గమనించింది. పరిశ్రమలకు ఆధునిక సాంకేతికతను పరిచయం చేసే బాధ్యతను తానే తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించింది. దీనికి ఎంతో అధ్యయనం అవసరం. కొత్త విషయాలు నేర్చుకోవడం అవసరం. తాను అందుకు రెడీ అయింది. అయితే ఏ అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టాలనే విషయంలో అగర్వాల్‌లో స్పష్టత లోపించింది. దీంతో తన స్నేహితురాలు ఆకాంక్షను కలుసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ...ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్న తరువాత తమ ప్రధాన టార్గెట్ ‘మాన్యుఫాక్చర్ ఇండస్ట్రీ’ అని తేల్చుకున్నారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు మాన్యుఫాక్చరింగ్ రంగం అన్ని రకాలుగా అనుకూలమైనది అనే అంచనాకు వచ్చారు. అది పరీక్ష సమయం. మానసికంగా ఎంత బలంగా ఉన్నాసరే, ఏమవుతుందో ఏమో! అనే సందేహం చెవిలో జోరీగలా డిస్టర్బ్ చేస్తున్న సమయం. ఆ జోరీగను దగ్గర రాకుండా చేసి ‘ఎస్. మేము తప్పకుండా విజయం సాధిస్తాం’ అని ఒకటికి రెండుసార్లు గట్టిగా అనుకున్నారు ఇద్దరు మిత్రులు. ఒక ఫైన్‌మార్నింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎంటర్ప్రెన్యుర్ ఫస్ట్ టాలెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి సింగపూర్ విమానం ఎక్కింది అవ్నీ అగర్వాల్. అలా సింగపూర్ కేంద్రంగా ‘సిక్స్ సెన్స్’ స్టార్టప్ పట్టాలకెక్కింది. సింగపూర్‌ను కేంద్రంగా ఎంచుకోవడానికి కారణం అక్కడ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలు ఎక్కువగా ఉండడమే. ‘మ్యాథ్స్ ప్రాబ్లం నుంచి టెక్నికల్ ప్రాబ్లం వరకు రకరకాల సమస్యలను పరిష్కరించం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. అందులో చెప్పలేనంత సంతోషం దొరుకుతుంది. ఆ సంతోషమే నన్ను ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యేలా చేసింది’ అంటుంది అవ్నీ అగర్వాల్. ‘ఎస్ ఎస్’ కో–ఫౌండర్, సీయివో ఆకాంక్ష జగ్వానీ(ముంబై) మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుంది. ఆమెకి ప్రముఖ సంస్థలో పనిచేయడం కంటే ఒక సంస్థను ప్రారంభించి దాన్ని ప్రముఖ సంస్థల జాబితాలో కనిపించేలా చేయాలనేది కాలేజీ రోజుల నాటి కల. ‘ఎస్ ఎస్’ ద్వారా తన కోరిక నెరవేరింది. విజయపథంలో దూసుకుపోతున్న ‘సిక్స్ సెన్స్’ తాజాగా వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘టిన్‌మెన్’ నిధులతో మరింత విస్తరించే పనిలో ఉంది. ఆల్ ది బెస్ట్. -
శెబ్బాష్ ఆకాంక్ష.. అండర్మైన్ తొలి మహిళా ఇంజనీర్‌గా!
బొగ్గు గనుల్లో ఒక వజ్రం మెరిసింది. చీకటి గుయ్యారం వంటి లోలోపలి గనుల్లో ఇక మీద ఒక మహిళ శిరస్సున ఉన్న లైట్ దిశను చూపించనుంది. ఇది మొదటిసారి జరగడం. ఇది చరిత్ర లిఖించడం. కోల్ ఇండియా మొట్టమొదటిసారిగా అండర్మైన్ ఇంజనీర్‌గా ఒక యువతిని నియమించింది. ఆడవాళ్లు కొన్ని పనులకు పనికి రారు అనేది గతం. ‘మేము ఏమైనా చేయగలం’ అని ఆకాంక్ష కుమారి దేశానికి సందేశం పంపింది. అత్యంత శ్రమ, ప్రమాదం ఉన్న ఈ పనిలో సాహసంతో అడుగుపెట్టిన ఆ ఆకాంక్ష ఎవరు? గనులు మగవారి కార్యక్షేత్రాలు. గనులు తవ్వడం, ఆక్సిజన్ అందనంత లోతుకు వెళ్లి ఖనిజాన్ని బయటకు తేవడం, దానిని రవాణా చేయడం... ఇవన్నీ శ్రమ, బలంతో కూడుకున్న పనులు కనుక అవి మగవాడి కార్యక్షేత్రాలు అయ్యాయి. అందుకే కాదు... గనుల్లో 24 గంటలు పని జరుగుతుంది. రాత్రింబవళ్లు చేయాలి. భద్రత గురించి జాగ్రత్తలు ఎలా ఉన్నా ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకని కూడా స్త్రీలకు ఆ ప్రాంతాలు నిరోధించబడ్డాయి. గని కార్మికుడు అంటే మగవాడే. ఆ కార్మికుడు గనికి బయలుదేరితే స్త్రీ క్యారేజీ కట్టి ఇచ్చి ఇల్లు కనిపెట్టుకుని ఉండటం ఇప్పటి వరకూ సాగిన ధోరణి. అయితే గత దశాబ్ద కాలంలో మైనింగ్ ఇంజనీరింగ్ చదివేందుకు యువతులు ముందుకు వచ్చారు. మైనింగ్ చదివితే ఉపాధి గనులలోనే దొరుకుతుంది కనుక తల్లిదండ్రులు ఆ చదువును నిరుత్సాహపరుస్తూ వచ్చినా ఈ కాలపు యువతులు మేము ఆ చదువు చదవగలం... భూమి గర్భం నుంచి ఖనిజాన్ని బయటకు తీయగలం అని ముందుకొచ్చారు. దేశంలో ఆ విధంగా ఫస్ట్‌క్లాస్ మైనింగ్ ఇంజనీర్లుగా గుర్తింపు పొందిన మొదటి మహిళలు సంధ్య రసకట్ల... మన తెలంగాణ అమ్మాయి, మరొకరు యోగేశ్వరి రాణె (గోవా). వీళ్లిద్దరూ హిందూస్తాన్ జింక్‌లో ఉపరితల మేనేజర్ స్థాయిలో పని చేసి ఇప్పుడు వేదాంత రిసోర్స్ తరఫున కార్యకలాపాలు సాగిస్తున్నారని సమాచారం. అయితే వీరి తర్వాత నేరుగా అండర్‌గ్రౌండ్ మైనింగ్ విధులను స్వీకరించిన తొలి మహిళ మాత్రం ఆకాంక్ష కుమారి. 50 ఏళ్లలో తొలిసారి కేంద్ర బొగ్గుగని శాఖ ఆధ్వర్యంలో 50 ఏళ్లుగా నడుస్తున్న ‘కోల్ ఇండియా లిమిటెడ్’కు అనుబంధ సంస్థ అయిన ‘సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్’ సెప్టెంబర్ 1న తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆకాంక్ష కుమారి నియామకాన్ని వెల్లడి చేసింది. ‘చురి మైన్స్’ లో ఆమెను అండర్‌గ్రౌండ్ కార్యకలాపాలకు నియమించి మైనింగ్ చరిత్రలో కొత్త పుటకు చోటు కల్పించామని చెప్పింది. రాంచీకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే చురీలో అండర్‌గ్రౌండ్ గనుల్లో ఆకాంక్ష పని చేయాల్సి ఉంటుంది. ఆమె తన ట్రయినింగ్‌ను ముగించుకుని విధులు మొదలెట్టింది కూడా. అంత సులభం కాలేదు భారత గనుల చట్టం 1952లోని సెక్షన్ 46 ప్రకారం బొగ్గు గనుల్లో స్త్రీలకు అండర్‌గ్రౌండ్ కార్యకలాపాలు నిరోధించబడ్డాయి. 2017 వరకూ ఈ చట్టం ఇలా సాగినా అదే సంవత్సరం జరిగిన చట్ట సవరణ వల్ల స్త్రీలకు భూగర్భ కార్యకలాపాలలో ఉద్యోగం పొందే హక్కు ఏర్పడింది. కాని ఆ తర్వాత కూడా కోల్ ఇండియాలో స్త్రీలు ఉపరితల కార్యకలాపాలలో ఉద్యోగాలు పొందుతూ ఇప్పటికి తమ శాతాన్ని కేవలం 7.5కు మాత్రమే పెంచగలిగారు. కాని వారికే కాదు, దేశంలోని ఇతర యువతులకు, విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా మొదటిసారి ఆకాంక్ష భూగర్భ విధులను స్వీకరించింది. భిన్న విద్యార్థి జార్ఘండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన ఆకాంక్ష చిన్నప్పటి నుంచి చురుకైన భిన్న విద్యార్థి. ఇద్దరు తోబుట్టువులు, ఒక సోదరుడు ఉన్నారు. జవహర్ నవోదయ విద్యాలయాలలో హైస్కూల్ వరకూ చదివి సింద్రి (జార్ఖండ్) బిట్స్‌లో మైనింగ్ ఇంజనీరింగ్ చదివింది. ఆ వెంటనే ఆమెకు హిందూస్థాన్ జింక్ రాజస్థాన్ శాఖలో ఉద్యోగం దొరికింది. మూడేళ్లు అక్కడ ఉద్యోగం చేసి కోల్ ఇండియా లిమిటెడ్‌లో మేనేజ్మెంట్ ట్రైనీగా ఉద్యోగం పొంది తాజాగా అండర్‌గ్రౌండ్ మైనింగ్ ఇంజనీరుగా డిజిగ్నేషన్ పొందింది. అయినా జాగ్రత్తలే ఆకాంక్ష కుమారి అండర్‌గ్రౌండ్ మైనింగ్ డ్యూటీని స్వీకరించినా గనుల చట్టం ప్రకారం మహిళా ఉద్యోగులకు సంబంధించిన షరతులు ఆమెకు వర్తిస్తాయి. వాటిలో ముఖ్యమైనవి ఆకాంక్ష ఉదయం 6 నుంచి రాత్రి 7 లోపు ఉండే షిఫ్టుల్లో మాత్రమే పని చేయాలి. ఏ ఫిష్ట్ చేసినా ఆమెకు 11 గంటల రెగ్యులర్ విశ్రాంతి ఇవ్వాలి. రాత్రి ఆమె పని చేయడానికి వీల్లేదు. రాత్రి 10 నుంచి ఉదయం 5 మధ్య ఒక్కోసారి ఎమర్జన్సీ డ్యూటీ పడవచ్చు. అయినా సరే ఆమెకు డ్యూటీ వేయకూడదు. ఇవన్నీ మహిళా ఉద్యోగుల రక్షణ కోసం తీసుకున్న జాగ్రత్తలు. ఈ జాగ్రత్తలు ఆమె వొత్తిడిని తగ్గిస్తాయి. కాని సాహసం యథాతథమే. హెడ్‌లైట్ ధరించి ఆమె గనుల్లోకి దిగే సన్నివేశం, అజమాయిషీ చేసే సన్నివేశం ఇప్పటికిప్పుడు ఒక పెద్ద ధైర్యం, తేజం... నల్ల బొగ్గు మధ్యలో ఏర్పడిన వెలుగు దారి. ఆమెకు శుభాకాంక్షలు. -
ఐరాసకు అరోరా ఎందుకీ ఆకాంక్ష
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ ఐదేళ్ల పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగుస్తుంది. అంతకు రెండు నెలల ముందే అక్టోబర్‌లో ఆ పదవికి ఎన్నికలు జరుగుతాయి. అనుభవజ్ఞుడైన 71 ఏళ్ల గ్యుటెరస్ మళ్లీ పోటీ చేస్తే కనుక మళ్లీ గెలిచే అవకాశాలే ఎక్కువ. అయితే అంతటి అత్యున్నతస్థాయి పదవికి తాను పోటీ చేయబోతున్నట్లు ఏ మాత్రం అనుభవం లేని అరోరా ఆకాంక్ష అనే 34 ఏళ్ల మహిళ హటాత్తుగా ప్రకటించారు! ‘గెలుస్తానా.. లేదా తర్వాతి సంగతి. నేనైతే పోటీ చేస్తాను’ అంటున్నారు. అంతేకాదు, ఐక్యరాజ్య సమితి డబ్బంతా మీటింగ్‌లకు, పేపర్వర్క్లకు ఎలా వృథా అవుతోందో చెబుతూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు! చూస్తుంటే సమితి ప్రధాన కార్యదర్శి అభ్యర్థిగా ఒక సాధారణ మహిళ అయిన ఆకాంక్ష ఎన్నికల ప్రచారం మొదలైనట్లే ఉంది! అరోరా ఆకాంక్షకు తన ఇంటిపేరుతో ‘అరోరా’ అని పిలిపించుకోవడమే ఇష్టం. గతంలో నాలుగేళ్లు ఆమె ఐక్యరాజ్య సమితిలోనే ఒక కంపెనీ తరఫున ఆడిటర్‌గా పని చేశారు. అది తప్ప దౌత్యవేత్తగా ఆమెకు ఏ అనుభవమూ లేదు. ఇప్పుడు సమితికే చీఫ్‌గా పోటీ పడటానికి సిద్ధం అయ్యారు! ‘‘ఒకప్పటి శరణార్థుల మనవరాలిని. కష్టం అంటే ఏమిటో నాకు తెలుసు. కనుక దేశాల కష్టాలను గట్టెక్కించే ఈ పదవికి నేను అర్హురాలిననే అనుకుంటున్నాను’’ అని ఆమె చెబుతున్నారు. ప్రచారం కోసం ఆమె ఎక్కువగా తన సొంత పొదుపు నుంచే ఖర్చుచేయబోతున్నారు. ఆ మొత్తం 30 వేల డాలర్లు. రూపాయల్లో సుమారు 22 లక్షలు. అరోరా కెనడా పౌరురాలు. పుట్టింది ఇండియాలో. 2022–26 పదవీ కాలానికి జరిగే సమితి ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసేందుకు ఆమోదం కోసం ఈ నెల 17నే ఆమె తన దరఖాస్తు పత్రాన్ని సమితికి సమర్పించారు. ఆ వెంటనే ‘‘పేద దేశాల కోసం ఏదైతే చేయాలో దాన్ని చేయడం లో సమితి విఫలమయింది’’ అనే వ్యాఖ్యతో తన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు! పోటీకి ఆమె పేరును ఏదో ఒక దేశం ప్రతిపాదించాలి. 193 దేశాలు సభ్యులుగా ఉన్న సమితి నుంచి ఇంతవరకూ అలాంటి సమర్థన ఏదీ రాలేదు. పోటీ చేయలేకపోయినా, పోటీ చేయాలన్న ఆమె ప్రయత్నం వైపు మాత్రం ప్రపంచ దేశాల తలలన్నీ తిర గనయితే తిరిగాయి. చిన్న దేశాలను సమితి చిన్న చూపు చూస్తోందని అరోరా ఆరోపణ. ఏటా సమితికి వచ్చే 56 బిలియన్ డాలర్ల రాబడిలో డాలరుకు 29 సెంట్లు మాత్రమే సకారణంగా ఖర్చువుతుండగా, మిగతా అంతా సమావేశాలకు, నివేదికల తయారీకి వృథా అవుతోందన్నది ఆమె చేస్తున్న మరో ఆరోపణ. అందుకే తను ఎంపికైతే ఇలాంటి దుర్వినియోగం జరగకుండా చూస్తానని ఆమె హామీ ఇస్తున్నారు. ‘అయినా సరే, తను గెలుస్తుంది అని ఎలా అనుకుంటోంది..’ అని పరిహసించేవాళ్ల ఉండొచ్చు. అయితే ఆమెను సమర్థించేవారూ లేకపోలేదు. ‘ఫియర్లెస్’ అని కొందరు. ‘ఎందుకు పోటీ చేయకూడదు?’ అని ఇంకొందరు. దీనికి భిన్నంగా.. ‘75 ఏళ్ల చరిత్ర గల ఐక్యరాజ్య సమితి ఏ పరిస్థితుల్లో ఏర్పడిందో ఈమెకు ఏం తెలుసు?’ అనేవారు ఎలాగూ ఉంటారు. సమితి లో శాశ్వత సభ్యత్వం గల దేశాలైన బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, అమెరికాలు వీటో చేస్తే ఏ నిర్ణయమైనా వీగిపోక తప్పని స్థితిలో ఈమె వచ్చి ఏం మారుస్తుంది అని మరో మాట! అవేవీ పట్టించుకోవడం లేదు ఆరోరా. రానున్న ఒకటి రెండు నెలల్లో ఆమె సమితి రాయబారులను కలిసి తన లక్ష్యం ఏమిటో వివరించే ఆలోచనలో కూడా ఉన్నారు. ఒకప్పటి ఆమె సహోద్యోగుల నుంచి కూడా అరోరాకు మద్దతు లభిస్తోంది. ‘నాకేమీ గెలుపు వ్యూహాలు, రాజకీయ ధ్యేయాలు లేవు. సమితి పనితీరును మెరుగు పరిచేందుకు నిజాయితీగా పోటీలోకి దిగుతున్నాను’’ అని చెబుతున్నారు అరోరా. ∙∙ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి దగ్గర్లోనే నివాసం ఉంటున్నారు అరోరా ఆకాంక్ష. ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. జీతాన్ని పొదుపుగా వాడుకుంటారు. తల్లిదండ్రులూ ఆమెతోనే ఉంటారు. సమితికి పోటీ చేసే విషయంలోనూ వారు ఆమె వైపే ఉన్నారు. అరోరాకు హ్యారీపొట్టర్ నవలలంటే ఇష్టం. ఒత్తిడుల నుంచి అవి ఆమెను సేద తీరుస్తాయట. ఆమె వార్డ్రోబ్ నిండా అన్నీ ముదురు వర్ణాల దుస్తులే. సమితి ఫీల్డ్ వర్క్ మీద 2017లో ఉగాండా వెళ్లినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్న ఆరు సూట్లు కూడా వాటిల్లో ఉన్నాయి. ఉగాండా వెళ్లినప్పుడు అక్కడ ఆమె చూసిన ఘోరం గురించి ఇక్కడ చెప్పాలి. అరోరా హర్యానాలో జన్మించారు. తర్వాత కొంతకాలం సౌదీ అరేబియాలో పెరిగారు. తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. తొమ్మిదో యేట నుంచి 18 ఏళ్ల వయసు వరకు అరోరా ఇండియాలోని బోర్డింగ్ స్కూల్లో చదివారు. తర్వాత కెనడా వెళ్లి అక్కడ డిగ్రీ పూర్తి చేశారు. అక్కడే ఒక ప్రేవేట్ కంపెనీలో ఆడిటర్‌గా చేరారు. ఆ కంపెనీ తరఫున 2016 లో ఐక్యరాజ్య సమితిలో ఉద్యోగం రాగానే ఎగిరి గంతేసి చేరిపోయారు. ఐక్యరాజ్య సమితి అంటే అంత గొప్ప ఆమెకు. అయితే ఆ గొప్ప లోపలికి వెళ్లాక కనిపించలేదు! తర్వాతి ఏడాది వేసవిలోనే అరోరాకు ఉగాండా వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడో చిన్నారి.. ఆకలి బాధ తట్టుకోలేక బురద ముద్దల్ని తినడం ఆమె మనసును కలచి వేచింది. ఆ దృశ్యం ఆమె మనసులో అలా ఉండిపోయింది. డ్యూటీకి తిరిగొచ్చాక సమితిలోని తన సీనియర్ ఆఫీసర్‌తో ఆ సంగతి ని ఆమె ఎంతో ఆవేదనగా చెప్పినప్పుడు ఆ ఆఫీసర్ స్పందించిన తీరు ఆమెను మరింతగా బాధించింది. ‘బురద మంచిదేలే. ఐరన్ ఉంటుంది’ అని అన్నారట! అది తట్టుకోలేక పోయారు అరోరా. క్రమంగా సమితిలోని అలక్ష్యాలు, సమితి నిరాదరణలు ఒక్కోటీ ఆమె కంటబడటం మొదలైంది. ఆ అనుభవాలన్నీ ఇప్పుడు ఆమెను సమితి ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసేందుకు బలంగా ప్రేరేపిస్తున్నాయి. అరోరా గెలుస్తారా లేదా అనేది పక్కన పెడితే పోటీ చేయాలన్న ఆలోచననే ఒక గెలుపుగా భావించాలని ఆమెను సమర్థించేవారు అంటున్నారు. -
అరె అచ్చం అలాగే ఉన్నారే!!
మోడల్, సోషల్ మీడియా ఫేమ్ ఆకాంక్ష రంజన్కపూర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. తన ప్రాణ స్నేహితురాలు ఆకాంక్షతో బాల్యంలో దిగిన ఫొటోను షేర్ చేసిన అలియా..‘ నా సర్వస్వానికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ క్యాప్షన్ జతచేశారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు ముద్దగుమ్మల ఫొటో.. నెటిజన్లతో పాటు సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంటోంది. ఆకాంక్షకు విషెస్ చెప్పిన నటి జరీన్ ఖాన్...‘ చాలా అందంగా ఉన్నారు. చిన్నపుడు ఎలా ఉన్నారో..ఇప్పుడు కూడా అచ్చం అలాగే ఉన్నారు. ఏమాత్రం మారలేదు. సో క్యూట్’అంటూ కామెంట్ చేశారు. ఇక మంగళవారం రాత్రి నుంచే పుట్టినరోజు వేడుకలు ప్రారంభించిన ఆకాంక్ష..తన సెలబ్రిటీ స్నేహితులందరినీ పార్టీకి ఆహ్వానించింది. ఈ పార్టీకి హాజరైన ప్రేమపక్షులు అలియా భట్-రణ్‌బీర్ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వాణీ కపూర్, అతియా శెట్టి, ఆదిత్య సీల్, రకుల్ ప్రీత్ సింగ్ సహా ఇతర సెలబ్రిటీలు కూడా పార్టీలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. View this post on Instagram happy birthday my everything 💓 A post shared by Alia 🌸 (@aliaabhatt) on Sep 17, 2019 at 11:54pm PDT -
ఆకాంక్ష, కౌశిక్‌లకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం (టీఎస్‌టీఏ) మాస్టర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో కౌశిక్ కుమార్ రెడ్డి, ఆకాంక్ష సత్తా చాటారు. నేరెడ్‌మెట్‌లోని సెయింట్ థామస్ హైస్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో బాలబాలికల విభాగాల్లో విజేతలుగా నిలిచి టైటిల్స్‌ను దక్కించుకున్నారు. ఆదివారం జరిగిన బాలికల ఫైనల్లో ఆకాంక్ష 8–3తో సౌమ్య జైన్‌ను ఓడించగా... బాలుర విభాగంలో వల్లంరెడ్డి కౌశిక్ 8–7 (1)తో ప్రతినవ్పై విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన బాలుర సెమీస్ మ్యాచ్‌ల్లో ప్రతినవ్ 8–1తో జిహర్పై, కౌశిక్ 8–2తో హేమంత్ సాయి ప్రభపై గెలుపొందారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో టీఎస్‌టీఏ కోశాధికారి చంద్రశేఖర్ పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
ఆకాంక్ష, సిద్ధాంత్లకు టైటిల్స్
టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్-4 టెన్నిస్ టోర్నమెంట్లో సిద్ధాంత్, ఆకాంక్ష విజేతలుగా నిలిచారు. ఎల్బీ స్టేడియంలోని శాట్స్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో శనివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో సిద్ధాంత్ 6-1, 6-4తో ధ్రువ్ సునీశ్పై గెలుపొందగా... ఆకాంక్ష 2-6, 7-5, 6-0తో శివాని అమినేనిపై విజయం సాధించి చాంపియన్లుగా నిలిచారు. అంతకుముందు జరిగిన బాలుర సెమీఫైనల్లో ధ్రువ్ 6-7 (5), 6-2, 7-6 (3)తో నితిన్ కుమార్‌పై, సిద్ధాంత్ 6-1, 6-4తో సునీల్ జగ్త్యానిపై నెగ్గారు. బాలికల విభాగంలో ఆకాంక్ష 6-4, 6-1తో శివాని స్వరూప్‌పై విజయం సాధించింది. బాలికల డబుల్స్ విభాగంలో హర్షసారుు- వైదేహి జోడి 6-4, 7-6తో ఆకాంక్ష- ఆర్జ చక్రభర్తిపై గెలుపొంది టైటిల్‌ను దక్కించుకుంది. బాలుర డబుల్స్ విభాగంలో సునీల్ జగ్త్యాని- అలెక్స్ సోలెంకి జోడి 6-2, 6-2తో సిద్ధాంత్- ధ్రువ్ జంటపై నెగ్గి చాంపియన్లుగా నిలిచారు. డబుల్స్ సెమీఫైనల్ ఫలితాలు బాలురు: సునీల్- అలెక్స్ సోలెంకి జోడి 6-3, 6-3తో రోహిత్- కై వల్య జంటపై, సిద్ధాంత్-ధ్రువ్ జోడి0-6, 6-3తో మేఘ్ భార్గవ్- పరీక్షిత్ సోమనిపై గెలుపొందారు. బాలికలు: ఆకాంక్ష- ఆర్జ చక్రభర్తి జోడి 6-3, 6-4తో శివాని- లాస్య పట్నాయక్ జంటపై, హర్షసారుు- వైదేహి జోడి 6-4, 4-6, 10-8తో ఆనంద్ ముదళియార్- దేదీప్య జంటపై నెగ్గారు. -
ఆకాంక్ష గ్రామానికే ఆదర్శం
హర్యానా: హర్యానా రాష్ట్రం, గుర్గావ్ జిల్లా, బాజ్ఘెరా గ్రామానికి చెందిన ఆకాంక్ష ఇప్పుడు గ్రామానికే ఆదర్శంగా నిలిచింది. ఏడో తరగతి చదువుతున్న ఈ బాలిక గ్రామంలో కనీస సౌకర్యాలు లేక పోవడం వల్ల ఎప్పుడూ చికాకు పడేది. రోజు వెళ్లే స్కూల్‌కు కూడా సరైన రోడ్డు లేక మురుగునీరు పారుతుంటే బాధ పడేది. ఓ రోజు ‘వియ్ ది పీపుల్’ అనే సంస్థ గ్రామంలో నిర్వహించిన ఓ పౌర కార్యక్రమానికి హాజరైంది. పౌరుల హక్కులే మిటో, బాధ్యతలు ఏమిటో, వారికి రాజ్యాంగం కల్పిస్తున్న భద్రత ఏమిటో ఆ కార్యక్రమంలో అవగాహన చేసుకొంది. ఊరి సమస్యలపై ఉద్యమించాలని నిర్ణయించుకుంది. అందుకు తోటి విద్యార్థులను తోడు చేసుకుంది. ఊరికి రోడ్లు వేయడం ఎవరి బాధ్యతో టీచర్లను అడిగి తెలుసుకొంది. తోటి విద్యార్థులతో కలసి పంచాయతీ కార్యాలయానికి వెళ్లి సరైన రోడ్లు వేయాల్సిందిగా కోరింది. ఆ సర్పంచ్ పట్టించుకోలేదు. ఆమె మాట వినలేదు. గుర్గావ్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లింది. గ్రామ రోడ్ల దుస్థితి గురించి వివరించింది. రోడ్లు వేయడం పంచాయతీ బాధ్యతంటూ రోడ్లు వేయాల్సిందిగా పంచాయతీని కోరుతూ ఓ సిఫారసు లేఖను తీసుకొచ్చింది. మళ్లీ సర్పంచ్‌ను కలిసింది. అయినా సర్పంచ్ పట్టించుకోలేదు. అయినా నిరుత్సాహ పడకుండా తోటి విద్యార్థులతో కలసి జిల్లా కలెక్టర్‌ను కలసుకుంది. విద్యార్థుల వివరించిన సమస్యలకు స్పందించిన జిల్లా కలెక్టర్ గ్రామానికి 20 లక్షల రూపాయలను మంజూరు చేయడమే కాకుండా రోడ్ల పనులను వెంటనే చేపట్టాల్సిందిగా గ్రామ పంచాయతీని ఆదేశిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను తీసుకొని వచ్చి మళ్లీ సర్పంచ్‌ను ఆకాంక్ష కలిసింది. కలెక్టర్ ఆదేశాలవడంతో సర్పంచ్ ఈసారి స్పందించారు. ఆగమేఘాల మీద రెండు నెలల్లో స్కూల్‌కు మంచి సిమ్మెంట్ రోడ్డు వేయించారు. ఆ తర్వాత గ్రామంలోని అన్ని రోడ్లను వేయించారు. ఊరు కళనే మారిపోయింది. ఎక్కడ మురుగు నీరు నిల్వకుండా కాల్వను కూడా తవ్వించడంతో గ్రామానికి కనీస సౌకర్యాలు సమకూరాయి. ఆకాక్ష కృషిని మెచ్చుకున్న గ్రామస్థులు ఆమెను ఆదర్శంగా తీసుకొని గ్రామానికి ఏ సమస్య వచ్చినా కలిసి పోరాడి సాధించుకుంటున్నారు. ‘మన హక్కులేమిటో తెలుసుకున్నాక నాకో విషయం అర్థమైంది. పనులు చేయడం లేదని ప్రభుత్వాన్ని నిందించడంకన్నా మన పనులను ప్రభుత్వంతో చేయించుకోవాలని. ముందుగా మన బాధ్యతలను నిర్వహిస్తే ప్రభుత్వం తన బాధ్యతను గుర్తిస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా మనం గళం విప్పితేనే ప్రభుత్వం కదులక తప్పదు’ అన్న సందేశం ఆకాంక్ష ఇస్తోంది. ఆకాంక్ష పోరాటంతో గ్రామ సర్పంచ్ వైఖరి కూడా మారింది. -
ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
హైదరాబాద్: కాలేజీకి వెళ్ళిన ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కుషాయిగూడలోని శ్రీ చైతన్య కాలేజీలో సీనియర్ ఇంటర్ చదువుతున్న అకాంక్ష అనే విద్యార్థిని మంగళవారం కళాశాలకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. సాయంత్రం ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కాలేజీలో, ఆకాంక్ష స్నేహితులను విచారించారు. అయినా ఫలితం కనపడకపోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు బుధవారం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.