Bigg Boss OTT 2: Akanksha Puri Opens Up On Controversial Lip Lock - Sakshi
Sakshi News home page

అక్కడ మరొకరు ఉన్నా లిప్‌లాక్ చేసేదాన్ని:నటి

Jul 4 2023 6:59 AM | Updated on Jul 4 2023 8:29 AM

Akanksha Puri Speaks On Lip Lock In Bigg Boss Ott 2 - Sakshi

బాలీవుడ్‌ టాప్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ బిగ్‌బాస్‌ ఓటీటీ-2 కోసం హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ షోలో చుట్టూ కెమెరాలున్న విషయాన్నే మర్చిపోయి ఓ జంట లిప్‌లాక్‌ ఇచ్చుకుంది. ప్రేక్షకులకు ఇది ఏమాత్రం నచ్చలేదు. దీంతో ఆయన వారిద్దరిపై సీరియస్‌ అయ్యారు. ఆపై సండే ఎపిసోడ్‌లో ప్రేక్షక లోకానికి క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది. దీనిలో భాగంగానే వారిద్దరిలో  మొదటి వేటు నటి ఆకాంక్ష పూరిపై పడింది. 

(ఇదీ చదవండి: 4 ఏళ్ల కూతురిని పెట్టుకుని.. బిగ్‌బాస్‌ హౌస్‌లో లిప్‌ లాక్‌ సీనా?: సల్మాన్‌ ఫైర్‌)

తాజాగా షో నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆకాంక్ష తన లిప్‌లాక్ గురించే కాకుండా ఎలిమినేషన్‌పై తన అభిప్రాయం చెప్పింది. ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షో నుంచి ఇలా బయటకు వచ్చినందుకు చాలా బాధగా ఉందని ఆకాంక్ష తెలిపింది. అయితే ఆమె లిప్‌లాక్ సీన్‌ గురించి చింతించలేదని చెప్పింది. హౌస్‌లో ఓ టాస్క్ సందర్భంగా ఇదంతా చేశానని, అందులో తప్పేమీ లేదని పేర్కొంది. షోలో టాస్క్ ముఖ్యమైంది. ఒక టాస్క్ కింద తనకు ఈ 30 సెకన్ల ఛాలెంజ్ ఇచ్చారని, దీన్ని టాస్క్‌గా మాత్రమే పరిగణించానని ఆకాంక్ష తెలిపింది.

ఈ లిప్‌లాక్‌పై తనకు వ్యక్తిగతంగా మాత్రం ఆసక్తి లేదని, జైద్ స్థానంలో మరొకరు ఉన్నప్పటికీ, తాను ఈ పనిని అదే విధంగా చేసేదానినని స్పష్టం చేసింది.  ఇదేమీ పెద్ద ఇష్యూ కాదని ఆకాంక్ష చెప్పింది. లిప్‌లాక్‌ వ్యవహారం ఎంత పెద్దదైందో, సల్మాన్‌ ఖాన్‌కి ఎందుకు అంత కోపం వచ్చిందో కూడా బయటికి వచ్చిన తర్వాతే తెలిసిందని పేర్కొంది. ఇది ఇంత పెద్ద సమస్య అవుతుందన్న ఆలోచన కూడా తనకు ఆ సమయంలో లేదని తెలిపింది. ఈ వారం నామినేషన్ కత్తి జైద్‌పై కూడా వేలాడుతోంది. అతను కూడా మరో నాలుగు రోజుల్లో బిగ్‌ బాస్‌ నుంచి బయటకు రావచ్చని తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: 100 మిలియన్ వ్యూస్‌ వచ్చిన ఈ పాటను చూశారా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement