బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎన్నో సినిమాలు చేశాడు, కానీ ఇంతవరకు ముద్దు సన్నివేశాలకు ఓకే చెప్పలేదు. ఆమధ్య దిశాపటానీతో లిప్‌లాక్ సీన్‌లో నటించి నో కిస్ సీన్ పాలసీని బ్రేక్ చేశాడంటూ వార్తలు వచ్చాయి. అయితే సల్మాన్ ఆ సన్నివేశంలో నటించిన విషయం నిజమే కానీ దిశా మూతికి ప్లాస్టర్ వేశాకే సదరు సీన్‌లో నటించాడట!
ఇన్ని సంవత్సరాలుగా ఒకటే పాలసీకి కట్టుబడి ఉన్నాడు సల్మాన్. అయితే అతడు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షోలో మాత్రం చుట్టూ కెమెరాలున్న విషయాన్నే మర్చిపోయి ఓ జంట లిప్‌లాక్ ఇచ్చుకుంది. ప్రేక్షకులకు ఇది ఏమాత్రం మింగుడు పడలేదు. ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూసే షోయేనా? లేదంటే బూతు బొమ్మల షోనా? అని మండిపడ్డారు. సండే ఎపిసోడ్‌లో ప్రేక్షక లోకానికి క్షమాపణలు చెప్పిన సల్మాన్ కెమెరా ముందే ముద్దులిచ్చుకున్న జద్ హదీద్, ఆకాంక్ష పూరిలపై ఫైర్ అయ్యాడు. మొదట కవర్ చేసుకునేందుకు ప్రయత్నించిన వాళ్లిద్దరూ యాక్టింగ్ ఫీల్డ్‌లో ఇది సర్వసాధారణమే కదా అని బుకాయించారు.
దీంతో మండిపోయిన సల్లూ భాయ్.. మీరేమీ ఇక్కడ సినిమా రోల్సో, వెబ్ సిరీస్ రోల్సో చేయడం లేదు. ఇదేమీ స్క్రిప్ట్ కాదు, ఇలా చేయమని మీకెవరూ ఆదేశాలివ్వలేదు అని కోప్పడ్డాడు. దీంతో దారికొచ్చిన జద్.. సల్మాన్‌కు క్షమాపణలు తెలిపాడు. 'కొందరికి మీరు చేసే పని నచ్చొచ్చేమో కానీ చాలామందికి మాత్రం నచ్చదు. ఈ వారం ఇదే హైలైట్ అవుతుందనుకుంటున్నావేమో.. కుటుంబ విలువలు, పెంపకం, సంస్కృతి ఇదేనా మనకు నేర్పింది.
ఈ దేశం సాంప్రదాయాలకు విలువనిస్తుందన్న విషయం మర్చిపోకండి. ఇంకోసారి ఇదే జరిగితే నిన్ను డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేస్తా' అని వార్నింగ్ ఇచ్చాడు సల్మాన్. కాగా జద్ తనకు నాలుగేళ్ల కూతురు ఉందని చెప్పడంతో సల్మాన్ షాకవడమే కాక మరింత సీరియస్ అయ్యాడు. ఏదైనా పని చేసేముందు దాని పర్యవసానాలు కూడా ఆలోచించుకోమని హెచ్చరించాడు. ఇకపోతే ఆదివారం ఎపిసోడ్‌లో ఆకాంక్ష పూరి బిగ్‌బాస్ ఓటీటీ షో రెండో సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది.
చదవండి: నయనతార ఆశలన్నీ ఆ 75 పైనే
Comments
Please login to add a commentAdd a comment