Bigg Boss OTT 2: Akanksha Puri Clarifies Bigg Boss Was Rude, Not Salman Sir - Sakshi
Sakshi News home page

Akanksha Puri: బిగ్‌బాస్‌ హౌస్‌లో ముద్దులాట.. 'తప్పేముంది? దానికే అంత ఓవరాక్షనా?'

Published Fri, Jul 7 2023 4:03 PM | Last Updated on Fri, Jul 7 2023 6:13 PM

Bigg Boss OTT 2: Akanksha Puri Clarifies Bigg Boss Was Rude, Not Salman Sir - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌.. ఇక్కడ ఏదైనా చేయొచ్చు, హద్దుల్లేవ్‌.. సరిహద్దుల్లేవ్‌ అన్నట్లుగా విచ్చలవిడిగా చెలరేగిపోవచ్చు అనుకుంటే పొరపాటే! హౌస్‌లో జరిగే అన్ని విషయాలను బిగ్‌బాస్‌ ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. తప్పు జరిగిందంటే బిగ్‌బాస్‌ లేదా వీకెండ్‌లో హోస్ట్‌ కంటెస్టెంట్లను ఉతికారేస్తుంటారు.

హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ రెండో సీజన్‌లో కూడా ఇదే జరిగింది. ఇద్దరు కంటెస్టెంట్లు కెమెరాల ముందే లిప్‌లాక్‌ ఇచ్చుకున్నారు. వీకెండ్‌లో సల్మాన్‌ ఖాన్‌ ఇదేం పనికిమాలిన పని అని తిట్టిపోశాడు. దీంతో జైద్‌ తప్పు ఒప్పుకున్నాడు కానీ ఆకాంక్ష మాత్రం అందులో తప్పే లేదన్నట్లుగా మాట్లాడింది. హౌస్‌ నుంచి బయటకు వచ్చాక కూడా అదే మాటపై నిలబడింది. అయితే ఈ విషయంలో ఆగ్రహించిన సల్మాన్‌ తనతో దురుసుగా వ్యవహరించాడంటూ బీటౌన్‌లో ఓ వార్త వైరలయింది. తాజాగా దీనిపై ఆకాంక్ష పూరీ సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది.

'బిగ్‌బాస్‌ నాతో రూడ్‌గా మాట్లాడాడని చెప్పాను. సల్మాన్‌ సర్‌ను నేను ఏమీ అనలేదు. వీకెండ్‌ కా వార్‌ ముందు బిగ్‌బాస్‌ నన్ను జైలుకు పంపించాడు. ఇక్కడ నేను సల్మాన్‌ సర్‌ గురించి ఏం మాట్లాడలేదు. దయచేసి నా వ్యాఖ్యలను వక్రీకరించొద్దు. ఇలా పదాలు మార్చేస్తే నేను మాట్లాడినదానికి అర్థమే మారిపోతోంది. సల్మాన్‌ సర్‌ కేవలం వీకెండ్‌ కా వార్‌ ఎపిసోడ్‌లో మాత్రమే ఈ విషయం గురించి మాట్లాడాడు' అని క్లారిటీ ఇచ్చింది.

ఇక ఈ ముద్దు సంఘటన గురించి ఆమె ఇంకా ఏం మాట్లాడిందంటే.. 'నేను టాప్‌ 3లో ఉండాల్సినదాన్ని. నన్నెందుకు బయటకు పంపించారు? ఇది ఓటీటీ షో. ఇక్కడ మీకు ఆ లిప్‌లాక్‌ అంత తప్పుగా అనిపించిందా? అలాంటప్పుడు ఎందుకు డైరెక్ట్‌గా ప్రసారం చేశారు. దాన్ని కట్‌ చేయొచ్చు కదా, లేదంటే బ్లర్‌ చేయొచ్చుగా! మీరు కావాలనే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లి చివరికి తప్పు నా మీద వేస్తున్నారు. ఇక్కడ నేను బాధితురాలిని. రెండు నాలుకల పాములా ప్రవర్తిస్తున్నారు. మీకంత ఇబ్బంది అనిపిస్తే ఆ టాస్కు సమయంలోనే కలగజేసుకోవాల్సింది' అని ఆగ్రహించింది ఆకాంక్ష పూరి.

చదవండి: అమ్మకు బ్రెయిన్‌ క్యాన్సర్‌.. నన్ను కూడా మర్చిపోయింది. మూడేళ్లు బెడ్‌పైనే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement