
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘లింక్డ్ ఇన్’లో క్రియేటర్‌గా పని చేసేది దిల్లీకి చెందిన ఆకాంక్ష మొంగా. తన పాషన్, ప్రాణం ట్రావెలింగ్. అయితే ఉద్యోగ బాధ్యతల వల్ల ‘ఇంటి నుంచి ఆఫీసుకు–ఆఫీసు నుంచి ఇంటికి’ మాత్రమే జీవితం పరిమితమైపోయింది. రొడ్డకొట్టుడు జీవనశైలితో విసిగిపోయిన ఆకాంక్ష తన పాషన్‌కు తిరిగి ప్రాణం పోసింది.
ఉద్యోగానికి రాజీనామా చేసి బ్యాగు సర్దుకొని బయలుదేరింది. కంటెంట్ క్రియేటర్‌గా మారింది. సోషల్ మీడియాలో వందల మందితో తనదైన కమ్యూనిటీని సృష్టించుకుంది. పన్నెండు దేశాలు తిరిగిన ఆకాంక్ష ఆరుమంది సభ్యులతో ‘ట్రావెల్ ఏ మోర్’ పేరుతో ఒక గ్రూప్‌ను క్రియేట్ చేసింది.
తాజాగా... ట్విట్టర్‌లో ఆమె చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఎంతోమందికి ఇన్‌స్పైరింగ్‌గా నిలిచింది. ‘ఒక విషయంపై పాషన్ ఉండి కూడా దానికి దూరం అవుతూ, మనసులోనే కుమిలిపోయేవారు ఎందరో. అలాంటి వారికి ఆకాంక్ష కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కొత్త దారి చూపించింది’ ‘డెస్క్ టు డెస్టినేషన్స్’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment