-
కొత్త ఉద్యోగం కోసం నిపుణులు పడిగాపులు
భారతదేశంలో 82 శాతం మంది నిపుణులు 2025లో కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారని లింక్డ్ఇన్(LinkedIn) ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడించింది. ఉద్యోగం(new job) సంపాదించడం గతంలో కంటే ప్రస్తుతం మరింత సవాలుగా మారినట్లు తెలియజేసింది. గతేడాది కంటే ఈసారి ఉద్యోగం సంపాదించడం మరింత కష్టతరం కానుందని 55% ఉద్యోగార్థులు నమ్ముతున్నట్లు లింక్డ్ఇన్ తెలిపింది.లింక్డ్ఇన్ తెలిపిన వివరాల ప్రకారం..2024లో జాబ్ మార్కెట్ మందకొడిగా ఉంది. దాంతో ఉద్యోగం మారాలనుకున్న చాలా మంది తాము చేస్తున్న కంపెనీల్లోనే కొనసాగుతున్నారు.గతేడాది నుంచి కొత్త అవకాశాల కోసం వెతుకుతున్నవారు, ఇప్పటికే ఉద్యోగం మారాలనుకుంటున్నవారు అధికమయ్యారు.2025లో 82 శాతం మంది నిపుణులు కొత్త ఉద్యోగం కోసం చేస్తున్నారు.ఇదీ చదవండి: ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ పయనంకఠినమైన జాబ్ మార్కెట్ ఉన్నప్పటికీ, ఉద్యోగార్థుల్లో కొలువు సంపాదిస్తామనే ఆశావాదం పెరుగుతోంది.58% మంది జాబ్ మార్కెట్ మెరుగుపడుతుందని, 2025లో కొత్త అవకాశాలు వస్తాయని నమ్ముతున్నారు.గతేడాది కంటే ఈసారి ఉద్యోగం సంపాదించడం మరింత కష్టతరం కానుందని 55% ఉద్యోగార్థులు నమ్ముతున్నారు.ఉద్యోగులను అన్వేషించడంలో హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ కూడా ఒత్తిడిని అనుభవిస్తున్నారు.అర్హత కలిగిన ప్రతిభావంతులను(professionals) కనుగొనడం మరింత సవాలుగా మారిందని 69% మంది తెలిపారు. దీంతో 2025లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధానంలో మార్పు వచ్చింది. -
‘ఇన్ఫోసిస్‌లో ఇదీ పరిస్థితి.. అందుకే జాబ్ మానేశా’
దేశంలో టాప్ 2 ఐటీ కంపెనీలో ఉద్యోగం.. ఇంట్లో సంపాదించే వ్యక్తి తనొక్కడే.. చేతిలో మరో జాబ్ ఆఫర్ లేదు.. అయినా ఇన్ఫోసిస్‌లో (Infosys) చేస్తున్న ఉద్యోగాన్ని మానేశాడు పుణేకు చెందిన ఒక ఇంజనీర్ (Pune techie). ఇంత కఠిన నిర్ణయం తాను ఎందుకు తీసుకున్నాడు.. ఇన్ఫోసిస్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి.. జాబ్ వదులుకునేందుకు దారితీసిన కారణాలు ఏమిటి.. అన్నది ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో పంచుకోగా ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.మరో ఆఫర్ చేతిలో లేకుండానే ఇన్ఫోసిస్‌లో తన ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశాడో లింక్డ్ఇన్ పోస్ట్‌లో పంచుకున్నారు పుణేకు చెందిన భూపేంద్ర విశ్వకర్మ. తాను రాజీనామా చేయడానికి ఆరు కారణాలను పేర్కొన్నారు. నారాయణ మూర్తి స్థాపించిన టెక్ దిగ్గజంలోని వ్యవస్థాగత లోపాలను, అనేక మంది ఉద్యోగులు నిశ్శబ్దంగా భరించే సవాళ్లను వెలుగులోకి తెచ్చారు."నేను ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నప్పుడు అనేక వ్యవస్థాగత సమస్యలను ఎదుర్కొన్నాను. చివరికి చేతిలో ఎటువంటి ఆఫర్ లేకపోయినా నిష్క్రమించాలనే కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. కార్పొరేట్ వర్క్‌ప్లేస్‌లలో చాలా ఎదుర్కొంటున్న ఈ సవాళ్ల గురించి నేను బహిరంగంగా మాట్లాడాలనుకుంటున్నాను" అని భూపేంద్ర తన పోస్ట్‌లో పేర్కొన్నారు.జాబ్ మానేయడానికి భూపేంద్ర పేర్కొన్న కారణాలు» ఆర్థిక వృద్ధి లేదు: జీతం పెంపు లేకుండా సిస్టమ్ ఇంజనీర్ నుండి సీనియర్ సిస్టమ్ ఇంజనీర్‌గా ప్రమోషన్ వచ్చింది. మూడేళ్లు కష్టపడి నిలకడగా పనిచేసినా భూపేంద్రకు ఎలాంటి ఆర్థిక ప్రతిఫలం కనిపించలేదు.» అన్యాయమైన పనిభారం: భూపేంద్ర బృందాన్ని 50 నుండి 30 మంది సభ్యులకు కుదించబడినప్పుడు అదనపు పనిభారం మిగిలిన ఉద్యోగులపై పడింది. అయినా పరిహారం, గుర్తింపు లేవు. కేవలం పని ఒత్తిడి మాత్రం పెరిగింది.» అస్పష్టంగా కెరీర్ పురోగతి: నష్టం తెచ్చే పనిని అప్పగించారు. ఇందులో భూపేంద్ర ఎదుగుదలకు అవకాశం కనిపించలేదు. పరిమిత జీతాల పెంపుదల, అస్పష్టమైన కెరీర్ పురోగతి వృత్తిపరమైన డెడ్వెయిట్గా భావించేలా చేసింది.» టాక్సిక్ క్లయింట్ వాతావరణం: తక్షణ ప్రతిస్పందనల కోసం అవాస్తవిక క్లయింట్ అంచనాలు అధిక ఒత్తిడి వాతావరణాన్ని సృష్టించాయి. చిన్నపాటి సమస్యలపైనా పదేపదే ఒత్తిడి పెరగడం వల్ల ఉద్యోగి శ్రేయస్సును దెబ్బతీసే విషపూరితమైన పని సంస్కృతికి దారితీసింది.» గుర్తింపు లేకపోవడం: సహోద్యోగులు, సీనియర్ల నుండి ప్రశంసలు పొందినప్పటికీ, ఇది ప్రమోషన్లు, జీతం పెంపు, లేదా కెరీర్ పురోగతి రూపంలోకి మారలేదు. భూపేంద్ర తన కష్టానికి ప్రతిఫలం కాకుండా దోపిడీకి గురవుతున్నట్లు భావించారు.» ఆన్సైట్ అవకాశాల్లో ప్రాంతీయ పక్షపాతం: ఆన్సైట్ అవకాశాలు మెరిట్ ఆధారంగా కాకుండా మాట్లేడే భాష ఆధారంగా ఇస్తున్నారు. నిర్దిష్ట భాషలు మాట్లాడే ఉద్యోగులు తనలాంటి హిందీ మాట్లాడే ఉద్యోగులను పక్కన పెట్టారని ఆరోపించారు.ఇదీ చదవండి: ముప్పు అంచున మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు.. కలవరపెడుతున్న కంపెనీ ప్లాన్కంపెనీల్లో పని సంస్కృతి, పని ఒత్తిడి పెంచే కార్పొరేట్ అధిపతుల వ్యాఖ్యల నడుమ విస్తృత చర్చలు సాగుతున్న తరుణంలో తాజాగా భూపేంద్ర పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఆన్లైన్లో మరింత చర్చకు దారితీసింది. ఈ పోస్ట్‌పై చాలా మంది యూజర్లు ప్రతిస్పందిస్తున్నారు. భూపేంద్రను సమర్థిస్తూ కొందరు, విభేదిస్తూ మరికొందరు కామెంట్లు పెట్టారు. -
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. లింక్డిన్ కో-ఫౌండర్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్ : ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్కింగ్ సంస్థ లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ట్రంప్ విజయంతో రీడ్ హాఫ్మన్ అమెరికా వదిలేందుకు సిద్ధమైనట్లు అమెరికా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. BREAKING: Democratic Mega-Donor, Reid Hoffman tells friends he is considering leaving the United States following President Trump’s Election Win. Bye! ✌🏻 pic.twitter.com/g2olDLGVR8— Ian Jaeger (@IanJaeger29) December 2, 2024అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపుతో డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థుల్లో భయం మొదలైందని అమెరికా స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. అందుకు ఊతం ఇచ్చేలా లింక్డిన్ కో-ఫౌండర్ హాఫ్మన్ దేశాన్ని వదిలి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హాఫ్మన్ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతు పలికారు. ఆమె ఎన్నికల ప్రచారానికి 10 మిలియన్ డాలర్లు విరాళం అందించారు.దీనికి తోడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ట్రంప్ మరణాన్ని కోరుకున్నట్లు పరోక్షంగా వ్యాఖ్యానించారు.అయితే,వీటన్నింటికి కంటే ట్రంప్‌పై మాజీ న్యూయార్క్ మ్యాగజైన్ రచయిత ఇ.జీన్ కారోల్ పరువు నష్టం దావా వేశారు. అందుకు హాఫ్మన్ సహకరించారు. ఈ భయాలతో హామ్‌మన్ అమెరికాను వదిలేయాని నిర్ణయానికి వచ్చినట్లు అమెరికన్ మీడియా కథనాలు చెబుతున్నాయి. -
‘వారంలో ఏడు రోజులు ఫ్రీగా పని చేస్తాను’
యూకేలో ఉండడానికి ఉచితంగా పని చేయాడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ఓ భారతీయ విద్యార్థిని తెలిపింది. గ్రాడ్యుయేషన్ చేసేందుకు యూకే వెళ్లిన ఆమె అక్కడే ఉండేందుకు ఉచితంగా పని చేస్తానని లింక్డ్ఇన్ పోస్ట్‌లో తెలియజేశారు. 2022లో గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పటి నుంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు శ్వేత చెప్పారు. తాను రోజు 12 గంటలపాటు వారంలో ఏడు రోజులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈపోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.‘నా పేరు శ్వేత. నేను గ్రాడ్యుయేషన్ చేసేందుకు యూకే వచ్చాను. నా గ్రాడ్యుయేట్ వీసా మూడు నెలల్లో ముగియనుంది. నేను యూకేలో వీసా అందించే కంపెనీల్లో ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 2022లో నా గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పటి నుంచి 300 కంటే ఎక్కువగానే ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను. యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్సీ పట్టా పొందాను. వీసా స్పాన్సర్డ్ డిజైన్ ఇంజినీర్ ఉద్యోగాల కోసం చూస్తున్నాను. మీరు యూకేలో కంపెనీ నిర్వహిస్తూ డిజైన్ ఇంజినీర్ల కోసం వెతుకుతున్నట్లయితే నన్ను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోండి. వారంలో ఏడు రోజులపాటు రోజువారీ 12 గంటలు పని చేస్తాను. ఒక నెలపాటు నాకు ఎలాంటి జీతం అవసరం లేదు. నా పనితీరు గమనించండి. నచ్చితే కొనసాగించండి. లేదంటే ఎలాంటి వివరణ ఇవ్వకుండా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించండి. ఈ పోస్ట్‌ను అంతర్జాతీయ విద్యార్థులు చదువుతుంటే దీన్ని రీపోస్ట్ చేయండి’ అని తెలుపుతూ దానికి సంబంధించిన ఇమేజ్ను కూడా శ్వేత షేర్ చేశారు.ఇదీ చదవండి: ‘నవంబర్ 8న సెలవులో ఉంటాను.. బై’!మిమ్మల్ని మీరు నమ్మండిఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘మీరు వెళ్లిన దేశంలో ఉండటానికి ఉచితంగా పని చేయడం లేదా అన్నేసి గంటలు పనిచేయడం అసంబద్ధం. మీకు ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను’ అంటూ ఒకరు కామెంట్ చేశారు. ‘యూకేలో ఉండడం కోసం ఇలా చేయనవసరం లేదు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు తెలివైనవారు. ప్రపంచంలో ఎక్కడైనా గుర్తింపు పొందుతారు’ అని మరొకరు రిప్లై ఇచ్చారు. -
రక్షణ ఉత్పత్తుల్లో మన ప్రయాణం గర్వకారణం
న్యూఢిల్లీ: దేశంలో రక్షణ ఉత్పత్తులు, వాటి ఎగుమతులు భారీగా పెరుగుతుండడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. రక్షణ ఉత్పత్తుల్లో మన దేశ ప్రయాణం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని చెప్పారు. రక్షణ రంగంలో పాలుపంచుకోవాలని కావాలని స్టార్టప్‌లు, తయారీదారులు, వ్యాపారవేత్తలకు, యువతకు పిలుపునిచ్చారు. ఈ రంగంలో నవీన ఆవిష్కరణలు సృష్టించేందుకు ముందుకు రావాలని సూచించారు. చరిత్రలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ మేరకు మోదీ బుధవారం ‘లింక్డ్ఇన్’లో పోస్టు చేశారు. ‘‘మీ అనుభవం, శక్తి సామర్థ్యాలు, ఉత్సాహం దేశానికి అవసరం. నవీన ఆవిష్కరణకు ద్వారాలు తెరిచి ఉన్నాయి. మన ప్రభుత్వ విధానాలు మీకు అనుకూలంగా పని చేస్తున్నాయి. రక్షణ రంగంలో లెక్కలేనన్ని అవకాశాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. మనమంతా కలిసి రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధిద్దాం. అంతేకాదు రక్షణ ఉత్పత్తుల తయారీలోని భారత్‌ను గ్లోబల్ లీడర్‌గా మార్చాలి. బలమైన, స్వయం సమృద్ధితో కూడిన ఇండియాను నిర్మిద్దాం. గతంలో మనం విదేశాల నుంచి రక్షణ పరికరాలు, ఆయుధాలు దిగుమతి చేసుకొనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మనమే విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఈ అద్భుత ప్రయాణం దేశంలో ప్రతి పౌరుడికీ గర్వకారణమే. ఇండియా రక్షణ ఉత్పత్తుల విలువ 2023–24లో రూ.1.27 లక్షల కోట్లకు చేరింది. ఇక ఎగుమతి విలువ 2014లో కేవలం రూ.1,000 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.21,000 కోట్లకు చేరుకుంది. 12,300 రకాల పరికరాలు, ఆయుధాలు దేశీయంగానే తయారు చేసుకుంటున్నాం. రక్షణ రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలు రూ.7,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. రక్షణ పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ) నిధుల్లో 25 శాతం నిధులను ఇన్నోవేషన్కే ఖర్చు చేస్తున్నాం. ఉత్తరప్రదేశ్, తమిళనాడులో రెండు అధునాతన డిఫెన్స్ కారిడార్లు రాబోతున్నాయి’’అని ప్రధాని మోదీ వెల్లడించారు. భారతీయ యువతకు తిరుగులేదు నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికతలో భారతీయ యువతకు తిరుగులేదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. వారు అత్యుత్తమ నైపుణ్యాలు ప్రదర్శిస్తున్నారని కొనియాడారు. గ్లోబల్ టెక్నాలజీ లీడర్‌గా భారత్ నిరి్వరామ ప్రగతి సాధిస్తోందంటూ గిట్‌హబ్ సంస్థ సీఈఓ థామస్ డోహ్మ్కే ‘ఎక్స్’లో చేసిన పోస్టుకు ప్రధాని మోదీ బుధవారం స్పందించారు. కృత్రిమ మేధ(ఏఐ) వినియోగంలో అమెరికా తర్వాత భారత్ ముందంజలో ఉందని థామస్ పేర్కొన్నారు. -
కొత్త హోదాలతోనే ఉద్యోగాలు.. ఇదే సరికొత్త ట్రెండ్
టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో.. దానికి తగ్గట్లే వ్యాపార ధోరణి మారుతోంది. ముఖ్యంగా ఉత్పత్తి, సేవా రంగాల్లో పుట్టగొడుగుల్లా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. అలాగే.. ఉద్యోగాలలోనూ విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2024లో పలు ఉద్యోగాలలో నియామకాలు పొందిన ప్రతి 10 మందిలో ఒకరు.. గత పాతికేళ్లలో వినిఎరుగని కొత్త హోదాలతో ఉద్యోగాలు పొందినట్లు లింక్డ్ఇన్ సర్వే వెల్లడించింది. గత 25 ఏళ్లలో ఏనాడూ వినని పొజిషన్లను పలువురు ఉద్యోగులకు ఆ కంపెనీలు అప్పగించాయని, వాటిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంజనీర్, సస్టైనబిలిటీ మేనేజర్.. లాంటివి ఉన్నాయని లింక్డ్ఇన్ విభాగం ‘వర్క్ చేంజ్ స్నాప్‌షాట్’ తెలిపింది.‘‘ఉద్యోగాలలో మార్పులు వేగంగా పెరుగుతున్నాయని యూకేకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొత్త పొజిషన్లు, నైపుణ్యాలు, సాంకేతికతలకు ఎక్కువ డిమాండ్ ఉందని.. ప్రతీ నలుగురిలో ముగ్గురు ఉద్యోగులు నమ్ముతున్నారు. అలాగే కంపెనీలు సైతం ఆ కొత్త హోదా ఉద్యోగులపైనే అధికంగా అంచనాలు పెంచుకుంటున్నాయి’’ అని ఆ నివేదిక తెలిపింది. ఇందుకోసం చేపట్టిన అధ్యయనంలో.. సుమారు 51 శాతం మంది హెచ్ఆర్ నిపుణులు ఈ అభిప్రాయం వెల్లడించారట. ఇక ఏఐతో సహా కొత్త టెక్నాలజీల వేగంగా అభివృద్ధి చెందటంతో.. యూకే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు 2016 నుంచి 2030 వరకు 65 శాతం వరకు మారవచ్చని లింక్డ్ఇన్ సర్వే డేటా తెలియజేస్తోంది. ఏఐని ఉపయోగిస్తూ బిజినెస్ చేయడానికి సిద్ధమైనవారికి భారీ అవకాశాలు ఉన్నాయని చెప్పింది. తమ సర్వేలో పాల్గొన్న యూకే వ్యాపారవేత్తల్లో అత్యధికులు (80 శాతం) మంది టీం పనితీరును మెరుగుపరచటంలో ఏఐ సామర్థ్యాన్ని గుర్తించారని తెలిపింది. అయితే.. కేవలం 8 శాతం కంపెనీలను మాత్రామే ఏఐ తమను ముందువరసలో ఉంచుతోందని అభిప్రాయపడినట్లు పేర్కొంది. మరోవైపు.. హెచ్ఆర్ నిపుణులపై ఒత్తిడి మేరకు ప్రతి ముగ్గురిలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు ప్రతిరోజూ వారు తీసుకోవలసిన నిర్ణయాల పట్ల నిరుత్సాహంగా ఉన్నారని తెలిపింది. 15శాతం మంది.. వారంలో పావు వంతు వరకు అవసరమైన తమ పని చేస్తున్నారని వెల్లడించింది.‘‘ప్రస్తుతం సమయంలో వర్క్ ప్లేస్‌లో మార్పులు వస్తున్నాయి.నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఏఐ వంటి కొత్త సాంకేతికతలు మన రోజువారీ వర్క్‌ను మెరుగుపరచడానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఏఐ సామర్థ్యాన్ని వాడుకోవటం ఎలా పెంచుకోవాలో కొన్ని బిజినెస్‌లు పరిశీలన చేస్తున్నాయి’ అని లింక్డ్ఇన్ (యూకే) మేనేజర్ జానైన్ చాంబర్లిన్ అభిప్రాయడ్డారు. -
ఇండియన్ రైల్వే నుంచి స్పేస్ఎక్స్ వరకు..
SpaceX Sanjeev Sharma: అమెరికాకు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ఇటీవల చేసిన అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది. స్టార్ఫిష్ రాకెట్‌తో పాటు స్పేస్‌లోకి దూసుకెళ్లిన బూస్టర్ తిరిగి యథాస్థానానికి వచ్చేలా చేసిన ప్రయోగం అందరి దృష్టిని ఆకర్షించింది. స్పేస్ రీసెర్చిలో అత్యద్భుతంగా పేర్కొంటున్న ఈ ప్రయోగాన్ని సౌత్ టెక్సాస్‌లోని స్టార్‌బేస్ నుంచి స్పేస్ఎక్స్ శాస్త్రవేత్తలు విజయవంతం చేశారు. ఈ సెంటిస్టుల బృందంలో మనదేశానికి చెందిన సంజీవ్ శర్మ కీలకపాత్ర పోషించారు. ఆయనకు సంబంధించిన లింక్డిన్ ప్రొఫైల్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.అంచెలంచెలుగా ఎదిగి..శ్రీసాయి దత్తా అనే యూజర్ సంజీవ్ శర్మకు సంబంధించిన విద్యా, ఉద్యోగ వివరాలు ఎక్స్‌లో షేర్ చేశారు. ఫ్రం ఇండియన్ రైల్వేస్ టు స్పేస్ఎక్స్’ పేరుతో ఈ వివరాలను వెల్లడించారు. ఒకప్పుడు ఇండియన్ రైల్వేలో పనిచేసిన ఆయన పస్తుతం స్పేస్ఎక్స్ సంస్థలో ప్రిన్సిపల్ ఇంజనీర్‌గా పనిచేస్తూ రోదసి ప్రయోగాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. భారతీయ రైల్వేలో 11 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదివి.. అంచెలంచెలుగా ఎదిగి అంతరిక్ష ప్రయోగాల్లో పాలుపంచుకుంటున్నారు.అమెరికాలో ఉన్నత విద్యరూర్కీ ఐఐటీలో మెకానికల్ ఇంజనీర్ చదువు పూర్తైన తర్వాత సంజీవ్ శర్మ 1990లో ఇండియన్ రైల్వేలో డివిజినల్ మెకానికల్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించారు. 1994లో డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్‌గా ఆయన ప్రమోషన్ లభించింది. 2001 వరకు ఈ జాబ్‌లో ఆయన కొనసాగారు. తర్వాత రైల్వే ఉద్యోగం వదిలిపెట్టి అమెరికా వెళ్లి కొలరాడో యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ సాధించారు. 2003లో సీగేట్ టెక్నాలజీ కంపెనీలో స్టాఫ్ మెకానికల్ ఇంజనీర్‌గా చేరారు. ఇదే సమయంలో మిన్నెసోటా యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్ ఆఫ్ టెక్నాలజీలో మరో మాస్టర్ డిగ్రీ చేశారు. 2013లో స్పేస్ఎక్స్ సంస్థలో స్ట్రక్చర్స్ గ్రూప్ డైనమిక్స్ ఇంజినీర్‌గా జాబ్ సంపాదించారు. అక్కడ ఐదేళ్లు పనిచేసిన తర్వాత 2018లో మ్యాటర్నెట్ కంపెనీకి మారారు. మళ్లీ 2022లో స్పేస్ఎక్స్కు తిరిగొచ్చారు. ‘బూస్టర్’ ప్రయోగం సక్సెస్ నేపథ్యంలో సంజీవ్ శర్మ పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది."From Indian Railways to SpaceX, From Building Trains to building Starships & catching them"Podcast of Sanjeev Sharma- Principal Engineer for #Starship Dynamicshttps://t.co/mzD2QEQTWa pic.twitter.com/fbDXXJf8sx— SRI SAIDATTA (@nssdatta) October 15, 2024ఓపిక అంటే ఇది..ఇండియన్ రైల్వే నుంచి స్పేస్ఎక్స్ వరకు సాగిన సంజీవ్ శర్మ విజయ ప్రస్థానంపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతీయ రైల్వేలో 11 సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత ప్రైవేట్ సంస్థకు మారడం అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే సౌలభ్యాలు, సౌకర్యాలను వదులుకోవడానికి చాలా మంది ఇష్టపడరని నెటిజన్ ఒకరు పేర్కొన్నారు. ‘ఓపిక అంటే ఇది. స్పేస్ఎక్స్లో చేరడానికి ముందు సంజీవ్ శర్మకు 20 సంవత్సరాల కెరీర్ ఉంద’ని మరొకరు కామెంట్ చేశారు. 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ సంజీవ్ శర్మ ప్రమోషన్ సంపాదించారంటే ఆయన ఎంత ప్రతిభావంతుడో అర్థమవుతోందని మరో నెటిజన్ మెచ్చుకున్నారు. చదవండి: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఏపీ వాసుల మృతి -
'అప్పుడు రతన్ టాటా ముఖంలో చిరునవ్వు కనిపించింది'
భారత దేశ పారిశ్రామిక రంగంపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, పరోపకారి 'రతన్ టాటా' ఇటీవలే కన్నుమూశారు. ఈయన మరణం ప్రతి ఒక్కరినీ బాధించింది. తాజాగా టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ లింక్డ్ఇన్లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.రతన్ టాటాతో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయనను కలిసిన ప్రతి ఒక్కరూ భారతదేశం పట్ల అతని దయ, ఆప్యాయతను తప్పకుండా తెలుసుకుంటారు. ప్రారంభంలో వ్యాపార అంశాలను గురించి ప్రారంభమైన మా పరిచయం.. కొంతకాలానికి వ్యక్తిగత పరిచయంగా మారిపోయింది. కార్లు, హోటల్స్ గురించి చర్చ ప్రారంభమైనప్పటికీ.. ఆ తరువాత ఇతర విషయాల గురించి చర్చించేవాళ్ళం. అయితే రతన్ టాటా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనించేవారు.2017లో టాటా మోటార్స్, దాని ఎంప్లాయీస్ యూనియన్ మధ్య చాలా కాలంగా ఉన్న వేతన వివాదం పరిష్కరించే సమయంలో చంద్రశేఖరన్ కూడా పాల్గొన్నట్లు వెల్లడించారు. సమస్యలను పరిష్కరించడంలో జరిగిన ఆలస్యానికి చింతిస్తూ.. దానిని వెంటనే పరిష్కరించనున్నట్లు రతన్ టాటా హామీ ఇచ్చారు. ఉద్యోగుల కుటుంబ శ్రేయస్సు గురించి కూడా ఆయన ఆలోచించేవారని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.ముంబైలోని టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న బాంబే హౌస్ పునరుద్దరణ అంశం గురించి కూడా చంద్రశేఖరన్ ప్రస్తావించారు. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ భవనానికి మరమ్మతులు చేయాల్సి వచ్చింది. ఇందులోని ప్రతి వస్తువును దగ్గరలో ఉండే కార్యాలయానికి తరలిస్తామని రతన్ టాటాతో చెప్పాము. అప్పుడు అక్కడున్న కుక్కల పరిస్థితిపై ఆరా తీశారు. వాటికోసం కెన్నెల్ తయారు చేస్తామని చెప్పాము. ఆ తరువాత రతన్ టాటా ముఖంలో చిరునవ్వు కనిపించింది.బాంబే హౌస్ రేనోవేషన్ పూర్తయిన తరువాత నేను మొదటి కెన్నెల్ చూస్తానని రతన్ టాటా చెప్పారు. ఆ తరువాత కుక్కల కోసం కెన్నెల్ తయారు చేశాము. రతన్ టాటా ఎంతగానో సంతోషించారు. ఇలా ఎప్పుడూ కుక్కల శ్రేయస్సు గురించి ఆలోచిస్తూ ఉండేవారని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: మస్క్.. టికెట్ ఎక్కడ కొనాలి?: ఆనంద్ మహీంద్రారతన్ టాటాకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. ఏదైనా ప్రదేశాన్ని సందర్శిస్తే.. ఏళ్ళు గడిచినా అక్కడున్న ప్రతిదాన్ని గుర్తుంచుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే రతన్ టాటా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఇప్పుడు లేరు అన్న విషయం జీర్ణించుకోలేని అంశం. కానీ పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగటానికి ప్రయత్నిస్తున్నట్లు చంద్రశేఖరన్ చెప్పారు. -
నిపుణులమైనా నేర్చుకుంటాం..
వృత్తిలో ఎంత అనుభవం సంపాదించినా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోకుంటే వెనుకబడిపోతాం. రోజువారీ విధుల్లో నెగ్గుకురాలేం. ఈ ఆవశ్యకతను హైదరాబాద్‌లో ప్రొఫెషనల్స్ గుర్తించారు. పనిలో ముందుకెళ్లేందుకు తోడ్పాటు కోసం అన్వేషిస్తున్నారు.ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన లింక్డ్ఇన్ కొత్త పరిశోధన ప్రకారం, మునుపెన్నడూ లేని విధంగా హైదరాబాద్‌లో 93 శాతం మంది ప్రొఫెషనల్స్ తమ వృత్తిలో ముందుకెళ్లేందుకు మరింత మార్గదర్శకత్వం, తోడ్పాటు కోసం చూస్తున్నారు. కొత్త కొత్త మార్పుల నేపథ్యంలో ఉద్యోగులకు తమ విధుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను మిలితం చేసుకునే అవకాశం ఉంది. దీంతో 63 శాతం మంది తమ కెరీర్లో ముందుకు సాగడం కోసం ఏఐపై ఆధారపడటం సౌకర్యంగా ఉంటుందని నమ్ముతున్నారు.ఫలితంగా ఏఐ ఆప్టిట్యూడ్‌తో కూడిన లింక్డ్ఇన్ లెర్నింగ్ కోర్సుల వినియోగం గత సంవత్సరంలో నాన్-టెక్నికల్ ప్రొఫెషనల్స్‌లో 117 శాతం పెరిగింది. అనుభవం ఒక్కటే సరిపోదని నిపుణులు గుర్తిస్తున్నారు. నగరంలోని 69 శాతం మంది ప్రొఫెషనల్స్ నిరంతరం నేర్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు. 41 శాతం మంది కెరీర్ వృద్ధికి నైపుణ్యం అవసరమని నమ్ముతున్నారు. వర్క్ ప్లేస్ మార్పును ఎదుర్కొంనేందుకు 60 శాతం మంది అవసరమైన నైపుణ్యాలపై మార్గదర్శకత్వం కోసం వెతుకుతున్నారు.ఇదీ చదవండి: వచ్చే ఏడాది ఎవరి జీతాలు పెరుగుతాయి?చాలా మంది సాంకేతిక పురోగతి (51 శాతం), సెక్టార్-నిర్దిష్ట మార్కెట్ విశ్లేషణ (42 శాతం), సామాజిక పోకడలు (34 శాతం) గురించి తెలుసుకొని భవిష్యత్తు అవకాశాల కోసం సిద్ధంగా ఉన్నారు. విషయ పరిజ్ఞానం కోసం హైదరాబాద్‌లోని 46 శాతం మంది నిపుణులు షార్ట్-ఫామ్ వీడియోలను ఆశ్రయిస్తున్నారు. 45 శాతం మంది నిర్దిష్ట నైపుణ్యాలను అందించే లాంగ్-ఫామ్ వీడియో కోర్సులను అత్యంత సహాయకరంగా భావిస్తున్నారు. -
లింక్డ్ఇన్ ఇండియా ప్రొడక్ట్ హెడ్‌గా కుమరేష్ పట్టాభిరామన్
మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ 'లింక్డ్ఇన్' ఆగస్టు 23న లాంగ్ టైమ్ ఎగ్జిక్యూటివ్ 'కుమరేష్ పట్టాభిరామన్'ను ఇండియా మేనేజర్ & ప్రొడక్ట్ హెడ్‌గా నియమించింది.135 మిలియన్లకు పైగా సభ్యులతో లింక్డ్ఇన్ భారతదేశం రెండవ అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా నిలిచింది. ఈ కంపెనీలో 11 సంవత్సరాలు పని చేసిన అశుతోష్ గుప్తా బయటకు వెళ్లిన తరువాత పట్టాభిరామన్ బాధ్యతలు స్వీకరించారు.పట్టాభిరామన్ జూలై 2013లో లింక్డ్ఇన్లో కంపెనీ సెర్చ్ అండ్ డిస్కవరీ బృందానికి గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరారు. ఆ తరువాత కంపెనీ సభ్యుల అనుభవాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు. ప్రొడక్ట్ అండ్ ఇంజనీరింగ్ రంగాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న పట్టాభిరామన్ ఇప్పుడు ఇండియా మేనేజర్ & ప్రొడక్ట్ హెడ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. -
మరో పదేళ్లలో ఈ ఉద్యోగాలు ఉండవు!.. లింక్డ్ఇన్ కో-ఫౌండర్
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కారణంగా ఇప్పటికే పలు కంపెనీల్లో ఎంతోమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. రాబోయే పదేళ్లలో చాలా సంస్థల్లో 9 టూ 5 ఉద్యోగాలు (ఉదయం ఆఫీసుకు వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్లే ఉద్యోగాలు) కనుమరుగయ్యే అవకాశం ఉందని లింక్డ్ఇన్ కో ఫౌండర్ రీడ్ హాఫ్మన్ పేర్కొన్నారు.ఏఐ కారణంగా కంపెనీలు మనుషులతో చేయించుకునే పనిభారం తగ్గించుకుంటాయి. పని వేగాన్ని పెంచుకుంటాయి. వర్క్‌ఫోర్స్ విధానంలో గణనీయమైన మార్పులు ఏర్పడతాయి. అయితే డేటా భద్రతకు సమ్వబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని రీడ్ హాఫ్మన్ వెల్లడించారు.రీడ్ హాఫ్మన్ గతంలో అంచనా వేసిన చాలా అంశాలు నిజమయ్యాయి. చాట్‌జీపీటీ వంటి సాధనాలు రాకముందే.. 1997లోనే సోషల్ మీడియా, షేరింగ్ ఎకానమీ, ఏఐ విప్లవం పెరుగుదలను హాఫ్మన్ ఊహించినట్లు తపారియా పేర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పిన విషయాలు కూడా తప్పకుండా జరుగుతాయని పేర్కొన్నారు. 1934 నాటికి ప్రతి రంగంలోనూ ఏఐ ప్రవేశిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. ఇదే నిజమైతే ఉద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పలువురు నిపుణులు భావిస్తున్నారు. -
నో లెర్నింగ్.. నో అప్డేట్
సాక్షి, హైదరాబాద్: చేసే పనిలో అప్డేట్ కావాలంటే...తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. కొత్త విషయాలను నిరంతరం నేర్చుకోవాలి. కానీ తొంభైశాతం మంది భారత వృత్తి నిపుణులు అందుకు పూర్తిస్థాయిలో సిద్ధం కావడం లేదు. కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత కమిట్మెంట్లు, బిజీ వర్క్‌షెడ్యూళ్లు తదితర కారణాలతో వెనుకడుగు వేస్తున్నట్టు స్పష్టమైంది. తాము పనిచేస్తున్న సంస్థలు, కంపెనీల యాజమాన్యాలు వివిధ రూపాల్లో నైపుణ్యాలు పెంచేందుకు సానుకూల దృక్పథంతోనే ఉన్నా, దీనికి సంబంధించి తమ ప్రాధాన్యతలను నిర్ధారించుకోవడంలో దేశంలోని దాదాపు 80 శాతందాకా వృత్తి నిపుణులు విఫలమవుతున్నారు. కుటుంబ బాధ్యతలు, ఇతర రూపాల్లోని ప్రతిబంధకాలు అధిగమించి కొత్తవి నేర్చుకునే విషయంలో అత్యధికుల అనాసక్తి కనబరుస్తున్నారు. 2030 సంవత్సరం నాటికల్లా ప్రపంచస్థాయిలోనే కాకుండా భారత్‌లోనూ ప్రస్తుతమున్న ఉద్యోగాలు, బాధ్యతలు, విధుల స్వరూపం 64 శాతం మేర మారిపోయే అవకాశాలున్నాయని నిపుణులు, కంపెనీవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వృత్తినిపుణులు, ఉద్యోగులు తమ నైపుణ్యాలను తప్పనిసరిగా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త విషయాలు నేర్చుకోవడం, చేసే పని పద్ధతులు, విధానాల్లో మార్పులపై అధిక దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా నెట్వర్కింగ్ సంస్థ ‘లింక్డ్ ఇన్’ విడుదల చేసిన నివేదికలో వివిధ అంశాలు వెల్లడయ్యాయి. వెనుకబాటుకు కారణాలు.. వృత్తి నిపుణులు కొత్త విషయాలు నేర్చుకోవడం, నైపుణ్యాలు పెంచుకోవడంలో వెనుకబాటుకు పలు కారణాలు నివేదికలో పొందుపరిచారు. 34 శాతం మంది కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగతంగా నిర్దేశించుకున్న లక్ష్యాలు 29 శాతం మంది చేస్తున్న పనిలో బిజీ వర్క్ షెడ్యూ ల్26 శాతం మంది నేర్చుకునేందుకు వనరులు, విధానాలు లెక్కకు మించి ఉండడంతో ఏదీ తేల్చుకోలేకపోవడంఈ పరిస్థితిని అధిగమించాలంటే ‘లౌడ్ లెర్నింగ్’» పని ప్రదేశాల్లో లేదా ఆఫీసుల్లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో అక్కడే మౌఖికంగా లేదా ఇతర కొత్త విషయాలను అర్థమయ్యేలా చేయగలిగితే అధిక ప్రయోజనం ఉంటుందన్నారు. » తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు ఈ విధానం తమకు ఉపయోగపడుతుందని 81 శాతం మంది చెప్పారు. » ఈ విధానంలో నిమగ్నమై కొత్త విషయాలను నేర్చుకుంటున్నవారు 64 శాతం ఉన్నట్టుగా నివేదిక చెబుతోంది.» ‘లౌడ్ లెర్నింగ్’లో భాగంగా తమ టీమ్ సభ్యుల నుంచి మెళకువలు నేర్చుకోవచ్చునని 40 శాతం మంది చెప్పగా, 35 శాతంమంది తాము నేర్చుకునే విషయాలకు సంబంధించి టీమ్ సభ్యులకు వివరించడం ద్వారా అంటున్నారు. » అనుభవజ్ఞులైన వృత్తినిపుణుల గైడెన్స్‌లో నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా 28 శాతం మంది తమ కెరీర్లో ముందుకెళ్లేందుకు దోహదపడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. » నైపుణ్యాల మెరుగుదలతో కొత్త వృత్తుల్లో అవకాశాలు లభిస్తాయని 27 శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. » తమతో పనిచేస్తున్న వృత్తినిపుణులు, ఉద్యోగుల అనుభవసారం, ఆయా అంశాలపై వారికున్న విషయ దృష్టిని గ్రహించడం ద్వారా ప్రయోజనం చేకూరుతోందంటున్న 26 శాతం మంది చెప్పారు. -
‘లౌడ్ లర్నింగ్’.. స్కిల్స్ నేర్చుకునేందుకు ఇదే మంత్రం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ప్రొఫెషనల్స్ తమ కెరీర్లో ముందుకు వెళ్లాలంటే కొత్త నైపుణ్యాలు పెంపొందించుకోవడం అత్యంత ఆవశ్యకరం. అయితే అందరూ కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నారా.. ఇందులో ఎదురవుతున్న అడ్డంకులు ఏంటి.. అన్నదానిపై ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ ఓ పరిశోధన చేసింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.భారత్‌లో 80 శాతం మంది నిపుణులు తమ సంస్థ అభ్యసన సంస్కృతిని పెంపొందించడానికి తగినంత కృషి చేస్తోందని చెప్పారు. అయితే 10లో 9 మందికి పైగా (94%) పని, కుటుంబ కట్టుబాట్ల కారణంగా నైపుణ్యాలు నేర్చుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం కష్టపడున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. కుటుంబ బాధ్యతలు లేదా ఇతర వ్యక్తిగత కట్టుబాట్ల కారణంగా సమయం లేకపోవడం (34 శాతం), బిజీ వర్క్ షెడ్యూల్స్ (29 శాతం), అభ్యాస వనరులు అందుబాటులో లేవపోవడం (26 శాతం) వంటి ప్రధాన అవరోధాలు ఎదురవుతున్నాయి.ఏంటీ 'లౌడ్ లెర్నింగ్'? అప్ స్కిల్లింగ్ కు అడ్డంకులను అధిగమించడానికి ప్రొఫెషనల్స్ లౌడ్ లర్నింగ్ అనే మంత్రాన్నిపాటిస్తున్నారు. పని చేసే చోట అభ్యసన ఆకాంక్షల గురించి బయటకు చెప్పడమే 'లౌడ్ లెర్నింగ్'. అప్ స్కిల్లింగ్ అడ్డంకులకు ఒక ఆశాజనక పరిష్కారంగా ఉద్భవించింది. భారత్‌లో 10లో 8 మంది (81 శాతం) ప్రొఫెషనల్స్ ఈ అభ్యాసం వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి సమయాన్ని కేటాయించడానికి సహాయపడుతుందని చెప్పారు.'లౌడ్ లెర్నింగ్'లో మూడు ప్రధాన మార్గాలను భారత్‌లోని ప్రొఫెషనల్స్ పాటిస్తున్నారు. తమ అభ్యసనలను సహచరులతో పంచుకోవడం (40 శాతం), అభ్యసన ప్రయాణం లేదా విజయాలను లింక్డ్ఇన్లో షేర్ చేయడం (40శాతం), తమ లర్నింగ్ టైమ్ బ్లాక్‌ల గురించి వారి టీమ్ సభ్యులకు తెలియజేయడం (35శాతం) ఇందులో ఉన్నాయి. భారత్ లో ఇప్పటికే 64 శాతం మంది ప్రొఫెషనల్స్ ఈ 'లౌడ్ లెర్నింగ్ 'లో నిమగ్నమయ్యారు. -
డిగ్రీ ఉన్నా..లేకపోయినా భారీ ఉద్యోగాలు.. లింక్డ్ఇన్ నివేదిక
డిజైన్, అనలిటిక్స్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలున్న ఫ్రెషర్లకు అధిక ఉద్యోగావకాశాలున్నట్లు లింక్డ్ఇన్ కెరీర్ స్టార్టర్ 2024 నివేదిక వెల్లడించింది.నివేదికలోని వివరాల ప్రకారం..2024లో కంపెనీలు పనిప్రదేశాల్లో సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆఫీస్ నుంచి పనిచేసే ఉద్యోగాలు 15% తగ్గాయి. ఎంట్రీలెవల్ ఉద్యోగాల కోసం కంపెనీలు హైబ్రిడ్ వర్క్‌కల్చర్‌ను 52% పెంచాయి. దాంతో ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు పనిచేసేందుకు వీలుగా కంపెనీలు మార్పులు చేస్తున్నాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యుటిలిటీస్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసినవారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చమురు, గ్యాస్, మైనింగ్, రియల్ ఎస్టేట్, కస్టమర్ సర్వీస్ రంగాల్లో ఫెషర్లను ఎక్కువగా నియమించుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ , సిస్టమ్ ఇంజినీర్, ప్రోగ్రామింగ్ అనలిస్ట్ వంటి ఉద్యోగాల్లో ఫ్రెషర్లను ఎంపికచేస్తున్నారు. కమ్యూనిటీ, సోషల్ సర్వీసెస్, లీగల్, మార్కెటింగ్, కమ్యూనికేషన్ వంటి రంగాల్లో బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. డిగ్రీ పూర్తిచేయని వారికి విద్య, సాంకేతికత, సమాచారం, మీడియా, మానవ వనరులు, మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగంలో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. డిగ్రీలేనివారు సైతం సాఫ్ట్వేర్ ఇంజినీర్, సెక్రటరీ, డిజైన్ ఇంజినీర్ వంటి ఉద్యోగాల్లో తమ కెరియర్ ప్రారంభించవచ్చు.ఇదీ చదవండి: సముద్రంలో పెళ్లివేడుకలకు బయలుదేరిన తారలులింక్డ్ఇన్ కెరీర్ ఎక్స్పర్ట్ అండ్ ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నిరజితా బెనర్జీ మాట్లాడుతూ..‘కంపనీల్లో ఏఐ వాడకం పెరుగుతోంది. దాంతో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. విభిన్న విద్యా నేపథ్యాలు కలిగిన నిపుణులను ఎంచుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఉద్యోగంకోసం చూస్తున్నవారు నిత్యం తమ నైపుణ్యాలను పెంచుకోవాలి’ అని చెప్పారు. -
సత్య నాదెళ్లకు షాక్.. కార్పొరేట్ వ్యవహారాల శాఖ కొరడా!
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు గట్టి షాక్ తగిలింది. కంపెనీల చట్టం, 2013 ప్రకారం ముఖ్యమైన బెనిఫిషియల్ ఓనర్ (SBO) నిబంధనలను ఉల్లంఘించినందుకు లింక్డ్ఇన్ ఇండియా, దాని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్, సీఈవో సత్య నాదెళ్ల, ర్యాన్ రోస్లాన్స్కీతో సహా పలువురు కీలక వ్యక్తులపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూ.27 లక్షల జరిమానా విధించింది.ఈ మేరకు జరిమానాలు వివరిస్తూ 63 పేజీల ఆర్డర్‌ను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC) జారీ చేసింది. లింక్డ్ఇన్ ఇండియాతోపాటు ప్రమేయం ఉన్న వ్యక్తులు ఎస్బీఓ రిపోర్టింగ్ నిబంధనలను పాటించడంలో విఫలమయ్యారని ఆర్ఓసీ ఆర్డర్ పేర్కొంది. ప్రత్యేకించి, చట్టంలోని సెక్షన్ 90(1) ప్రకారం అవసరమైన లాభదాయకమైన యజమానులుగా తమ స్థితిని మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల, లింక్డ్ఇన్ కార్పొరేషన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ నివేదించలేదని పేర్కొంది.రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ప్రకారం, లింక్డ్ఇన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (లింక్డ్ఇన్ ఇండియా), సత్య నాదెళ్ల, రోస్లాన్స్కీ, మరో ఏడుగురు వ్యక్తులపై మొత్తంగా రూ.27,10,800 జరిమానా విధించింది. ఇందులో లింక్డ్ఇన్ ఇండియాపై రూ.7 లక్షలు, సత్య నాదెళ్ల, రోస్లాన్స్కీ ఒక్కొక్కరికీ రూ. 2 లక్షల చొప్పున జరిమానా ఎదుర్కొంటున్నారు. ఇక జరిమానా విధించిన ఇతర వ్యక్తుల్లో కీత్ రేంజర్ డాలివర్, బెంజమిన్ ఓవెన్ ఒర్న్‌డార్ఫ్, మిచెల్ కాట్టి లెంగ్, లిసా ఎమికో సాటో, అశుతోష్ గుప్తా, మార్క్ లియోనార్డ్ నాడ్రెస్ లెగాస్పి, హెన్రీ చినింగ్ ఫాంగ్ ఉన్నారు. -
భవిష్యత్తులో ఏఐ ప్రభావం ఎలా ఉండబోతుందంటే..
మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, లింక్డ్ఇన్ సంయుక్తంగా వర్క్ ట్రెండ్ ఇండెక్స్-2024ను విడుదల చేశాయి. 31 దేశాల్లోని దాదాపు 31వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఫార్చున్ 500 కంపెనీల కస్టమర్లు కూడా ఇందులో భాగమైనట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. భారత్‌లో 92 శాతం మంది ప్రొఫెషనల్స్ తమ పనిలో ఏఐని వాడుతున్నారని నివేదికలో తెలిపారు. 91 శాతం కంపెనీలు ఏఐను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు.గడిచిన ఏడాది కాలంలో ఉద్యోగాల కల్పనలో, నిత్యం చేస్తున్న పనిలో, నాయకత్వంలో కృత్రిమమేధ ప్రభావం ఎలాఉందో ఈ సర్వే ద్వారా తెలియజేశామని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ‘గత ఆరునెలల్లో జనరేటివ్ ఏఐ వల్ల పనిలో ఉత్పాదక దాదాపు రెండింతలు పెరిగింది. ఉద్యోగాలకోసం వెతికే వారి ప్రొఫైల్‌లో ఏఐ నైపుణ్యాలు తోడైతే వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అవి లేనివారిని చాలా కంపెనీలు చేర్చుకోవడం లేదు. అయితే కొన్ని సంస్థలు ఏఐని అందిపుచ్చుకోవడంలో వెనకబడ్డామని భావిస్తున్నాయి. కొంతమంది ఉద్యోగులు తమ సొంత ఏఐ టూల్స్‌ను వాడుతున్నారు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తి దాన్ని పరిష్కరించాలంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో వారి వ్యాపారంపై ప్రభావం పడుతుంది. ఏఐ ఆర్థిక వ్యవస్థతోపాటు ఇప్పటికే చాలా రంగాలను మారుస్తుంది. వినియోగదారులకు అందించే ఉత్పత్తుల్లో నాణ్యత మెరుగుపరిచి యూజర్ల ఆసక్తులను ప్రోత్సహిస్తే 2030 నాటికి దాదాపు సగంకంటే ఎక్కువ లాభాలు పొందవచ్చని పీడబ్ల్యూసీ పరిశోధన విడుదల చేసింది. ఏఐ ప్రభావంతో 2030 నాటికి దక్షిణ యూరప్ జీడీపీ 11.5% వరకు పెరుగుతుంది. ఇది 700 బిలియన్ డాలర్లకు సమానం’ అని నివేదికలో తెలిపారు.కంపెనీ యాజమాన్యాలు, లేబర్ మార్కెట్‌కు సంబంధించి కృత్రిమమేధ ఏమేరకు ప్రభావం చూపుతుందో నివేదికలో తెలిపారు. ఈ వివరాలు కింద తెలియజేశాం.అధికశాతం ఉద్యోగులు తాము చేస్తున్న పనిలో ఏఐను వాడాలనుకుంటున్నారు. 75 శాతం వర్కర్లు ప్రస్తుతం పనిలో ఏఐను ఉపయోగిస్తున్నారు. అయితే దీన్ని వాడకంతో పనిలో వేగాన్ని పెంచడానికి కష్టపడుతున్నారు. ఏఐ తమ సమయాన్ని ఆదా చేస్తుందని, సృజనాత్మకతను పెంచుతుందని, ముఖ్యమైన పనిపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. 79 శాతం మంది తమ పనిలో ఏఐ కీలకంగా ఉంటుందని అంగీకరించినప్పటికీ, అందులో 60 శాతం మంది తమ కంపెనీలో కృత్రిమమేధ వినియోగానికి సంబంధించి సరైన ప్రణాళిక లేదని తెలిపారు. 78 శాతం మంది తమ పనిలో సొంత ఏఐటూల్స్‌ను వాడుతున్నారు. కానీ ఎలాంటి ప్రణాళిక, నియంత్రణ లేకుండా వాడుతున్న ఈ టూల్స్ వల్ల కంపెనీ డేటా ప్రమాదంలో పడుతుందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: త్వరలో అందరికీ ఉచితంగా జీపీటీ-4ఓ.. ప్రత్యేకతలివే..కృత్రిమమేధ వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే భయం చాలా మందికి ఉన్నప్పటికీ, డేటా భిన్నమైన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. ఏఐ నైపుణ్యాలను నేర్చుకునే వారికి సైబర్ సెక్యూరిటీ, ఇంజినీరింగ్, క్రియేటివ్ డిజైన్..వంటి రంగాల్లో అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 46 శాతం మంది రాబోయే సంవత్సరంలో తాము చేస్తున్న ఉద్యోగం మారాలని చూస్తున్నారు. 66 శాతం కంపెనీలు ఏఐ నైపుణ్యాలు లేనివారిని నియమించుకోవడం లేదు. కోపైలట్, చాట్‌జీపీటీ వంటే ఏఐ నైపుణ్యాలు కలిగిన వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. మొత్తం కంపెనీల్లో 39శాతం మాత్రమే వారి ఉద్యోగులకు ఏఐ శిక్షణ అందించాయి. కేవలం 25 శాతం కంపెనీలు మాత్రమే ఈ సంవత్సరం ఏఐ ట్రెయినింగ్ అందిస్తున్నాయి. -
‘నేనెవరో మీకు తెలియదు’..మైక్రోసాఫ్ట్‌కి షాకిచ్చిన భవిష్ అగర్వాల్
ప్రముఖ దేశీయ క్యాబ్ సర్వీస్ దిగ్గజం ఓలా.. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు షాకిచ్చింది. లింక్డిన్లో దొర్లిన తప్పిదం కారణంగా మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్ అజ్యూర్‌కు గుడ్‌బై చెప్పింది. ఇకపై అజ్యూర్‌ను వినియోగించేది లేదని తేల్చి చెప్పింది. ప్రత్యామ్నాయంగా ఓలా గ్రూప్‌నకే చెందిన కృత్రిమ్ ఏఐ క్లౌడ్ సేవలను వినియోగించుకోనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ ప్రకటించారుఇటీవల భవీష్ అగర్వాల్ తన గురించి తాను తెలుసుకునేందుకు లింక్డిన్ ఏఐ బాట్లో భవీష్ అగర్వాల్ ఎవరు? అని సెర్చ్ చేశారు. దీనికి బాట్ అతడు/ ఆయన ఉండాల్సిన చోటు వారు/ వాళ్లు ఉండడం చూసి.. అనే సమాధానం ఇచ్చింది. ఈ సమాధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన భవీష్ పాశ్చాత్య విధానాల్ని గుడ్డిగా అనుసరిస్తే ఇలాగే ఉంటుందంటూ కామెంట్ చేశారు.ఆ కామెంట్లతో లింక్డిన్ తమ నిబంధనలకు విరుద్దంగా భవిష్ పోస్ట్ ఉందంటూ దానిని లింక్డిన్ డిలీట్ చేసింది. దీంతో లింక్డిన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన భవీష్.. మైక్రోసాఫ్ట్ అజ్యూర్‌కు గుడ్ బై చెప్పారు. లింక్డిన్ చర్యతో మైక్రోసాఫ్ట్ అజ్యూర్‌ను వినియోగించుకోబోమని స్పష్టం చేశారు. ఇటీవలే కృత్రిమ్ క్లౌడ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆ సేవల్ని వినియోగించుకుంటామని ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్ ప్రకటించారు. -
దేశంలోనే అత్యుత్తమ కంపెనీ ఇదే.. లింక్డ్ఇన్ నివేదిక
దేశంలో 25 అత్యుత్తమ సంస్థల జాబితాను ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ఇన్ సంస్థ విడుదల చేసింది. అందులో ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ముందువరుసలో నిలిచింది. గత కొద్దికాలంగా టాప్‌లో నిలుస్తున్న టీసీఎస్ సంస్థ ఈసారీ తన సత్తా చాటుకుంది. దాంతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. పనిచేయడానికి ఉద్యోగులకు అత్యంత అనువైన కంపెనీగా లింక్డ్ఇన్ టీసీఎస్‌కు ఈస్థానం కల్పించింది. విదేశీ ఐటీ కంపెనీలైన యాక్సెంచర్, కాగ్నిజెంట్ వరుస స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో టెక్ కంపెనీలే ఉండడంతో వాటి హవా స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారంటే.. ఈ జాబితాను తయారుచేసేందుకు సంస్థ కింది అంశాలను పరిగణలోకి తీసుకుంటోంది. కెరియర్ గ్రోత్ నైపుణ్యాభివృద్ధి సంస్థ స్థిరత్వం అవకాశాలు ఉద్యోగుల సంతృప్తి వైవిధ్యం ఉద్యోగుల విద్యార్హతలు దేశవ్యాప్తంగా కంపెనీ కార్యకలాపాలు టాప్-15 మధ్యశ్రేణి కంపెనీల జాబితానూ లింక్డ్ఇన్ విడుదల చేసింది. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్) సేవలందిస్తున్న లెంత్రా.ఏఐ సంస్థ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. మేక్మైట్రిప్, నైకా, డ్రీమ్11 సంస్థలూ ఈ లిస్టులో ఉన్నాయి. ఇదీ చదవండి: యాపిల్‌కు ఆదాయం సమకూర్చడంలో భారత్ టాప్ లింక్డ్ఇన్ జాబితాలోని టాప్-25 సంస్థలు టీసీఎస్ యాక్సెంచర్ కాగ్నిజెంట్ మాక్వెరీ గ్రూప్ మోర్గాన్ స్టాన్లీ డెలాయిట్ ఎండ్రెస్ప్లస్ హోసర్ గ్రూప్ బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్ జేపీమోర్గాన్ చేజ్అండ్కో పెప్సీకో డీపీ వరల్డ్ హెచ్‌సీఎల్ టెక్ ఈవై ష్నైడర్ ఎలక్ట్రిక్ అమెజాన్ కాంటినెంటల్ మాస్టర్‌కార్డ్ ఇంటెల్ కార్పొరేషన్ ఐసీఐసీఐ బ్యాంక్ మిషెలిన్ ఫోర్టివ్ వెల్స్ ఫార్గో గోల్డ్‌మన్ సాక్స్ నోవో నోర్డిస్క్ వియాట్రిస్ -
మీలో ఈ స్కిల్స్ ఉంటే చాలు.. ‘AI’ కూడా మిమ్మల్ని ఏం చేయలేదు!
ప్రపంచ దేశాల్లో కృత్తిమ మేధ (ఏఐ) ఉద్యోగులకు ఓ సవాల్ విసురుతోంది. ఇందులో ప్రావిణ్యం ఉంటేనే ఉద్యోగిగా రాణించాల్సిన అవసరం ఏర్పడింది. ఫలితంగా సంస్థలన్నీ ఇప్పుడు ఏఐలో నిపుణులైన ఉద్యోగుల కోసం అన్వేషిస్తున్నాయి. ఏఐతో పాటు పలు విభాగాల్లో నిష్ణాతులైన వారు మాత్రమే కోరుకున్న ఉద్యోగంలో, కోరుకున్న జీతంతో సెటిల్ అవుతున్నారు. లేదంటే పోటీ ప్రపంచంతో పోటీ పడలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా కంపెనీలు ప్రకటిస్తున్న లేఆప్స్లో ముందు వరసలో ఉంటున్నారు. ఈ తరుణంలో ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కి చెందిన ఎంప్లాయిమెంట్ సోషల్ నెట్వర్క్ లింక్డిన్ కంటెంట్ స్ట్రాటజీ గ్లోబుల్ హెడ్ డాన్ బ్రాడ్నిట్జ్ ఉద్యోగార్ధుల కోసం కీలక అంశాలను లింక్డిన్లో పోస్ట్ చేశారు. ఈ పనులు ఏఐ కూడా చేయలేదు సంస్థలు ఏఐ నిపుణులను ఏరికోరి ఉద్యోగాలిస్తుంటే.. కృత్తిమ మేధ అవసరంలేని, కేవలం మనుషులు మాత్రమే చేసే కొన్ని ప్రత్యేక ఉద్యోగాలున్నాయి. ఆ ఉద్యోగాలకు ఆయా స్కిల్స్ ఉన్న వర్క్ ఫోర్స్ అవసరం. కానీ డిమాండ్‌కు తగ్గట్లు ఉద్యోగులు లేకపోవడంతో ఈ స్కిల్స్‌కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు తెలిపారు. ప్రతి 10 మంది సీఈఓల్లో 9 మంది అంతేకాదు సంబంధిత స్కిల్స్‌లో ఇప్పటికే నిష్ణాతులైన నిపుణులతో ఓ సర్వే నిర్వహించారు. ఆ సర్వే ఆధారంగా ఉద్యోగిలో స్కిల్స్ ఉంటే మాత్రం ఉద్యోగానికి తిరుగుడుందని డాన్ బ్రాడ్నిట్జ్ వెల్లడించారు. బ్రాడ్నిట్జ్ పేర్కొన్న స్కిల్స్ వ్యక్తిగత కెరీర్ వృద్ధికి ఉపయోగపడే నైపుణ్యాల జాబితాలో తొలిస్థానంలో ఉన్నాయని లింక్డిన్ వైస్ ప్రెసిడెంట్ అనీష్ రామన్ అంచనా వేస్తున్నారు. ఇక లింక్డిన్ సర్వే ఆధారంగా ప్రతి 10 మంది సీఈఓల్లో 9 మంది సీఈఓలు తప్పని సరిగా ప్రతి ఉద్యోగిలో ఈ నైపుణ్యాలు ఉండాలని చెప్పారు. భవిష్యత్‌కు భరోసా వాటిల్లో కమ్యూనికేషన్, కస్టమర్ సర్వీస్, లీడర్షిప్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్, అనలిటిక్స్, టీమ్ వర్క్, సేల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, రీసెర్చ్ ఈ నైపుణ్యాలు ఉంటే సంస్థల్లో ఉద్యోగులకు ఢోకా ఉండదని, ఈ ఏడాదిలో అత్యధికంగా డిమాండ్ ఉన్న స్కిల్స్గా ప్రసిద్ధి చెందాయని లింక్డిన్ కంటెంట్ స్ట్రాటజీ గ్లోబుల్ హెడ్ డాన్ బ్రాడ్నిట్జ్ చెబుతున్నారు. -
భవిష్యత్తు అంతా ఇందులోనే.. లింక్డ్ఇన్ సంచలన రిపోర్ట్!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ 'లింక్డ్ఇన్' (LinkedIn) ఇటీవల స్టేట్ ఆఫ్ AI @ వర్క్ రిపోర్ట్ ప్రారంభించింది. 2022 డిసెంబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకు గ్లోబల్ ఏఐ కన్వర్జేషన్ ఏకంగా 70 శాతం పెరిగినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికే అభివృద్ధి చెందిన చాలా దేశాలు ఏఐ మీద ఆధారపడుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ వ్యాప్తంగా 11 శాతం మంది, భారతదేశంలో 5.6 శాతం మంది ఈ రంగంలో ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటున్నారు. కంపెనీలు కూడా ఇలాంటి వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నాయి. అధికా వేతనాలు ఏఐ నైపుణ్యాలు కలిగిన వ్యక్తుల డిమాండ్ ప్రస్తుతం భారతదేశంలోని ప్రొఫెషనల్ సర్వీసెస్, టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్, మీడియా అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి రంగాల్లో అధికంగా ఉందని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ రంగాల్లో ఏఐ నైపుణ్యం కలిగిన వ్యక్తులకు అధికా వేతనాలు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నాయి. భారతదేశంలో ఏఐ వర్క్‌ఫోర్స్ లెర్నింగ్ వేగవంతమవుతుంది. ఏఐ సంబంధిత కోర్సులను చూసే సభ్యలు సంఖ్య ఈ త్రైమాసికంలో 80% పెరిగినట్లు లింక్డ్ఇన్ వెల్లడించింది. ప్రపంచంలోని చాలామంది నిపుణులు ఏఐ టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని మేనేజ్మెంట్, పర్సనల్ ఎఫెక్టివ్‌నెస్, పర్సనల్ డెవలప్మెంట్ వంటి సాఫ్ట్ స్కిల్స్‌లో పెట్టుబడి పెడుతున్నారు. నిజానికి ఏఐ నెపుణ్యాలను పెంచుకోవడంపై దృష్టి సారించే వారు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్'కి చెందిన సాధారణ పనులు మాత్రమే కాకుండా.. సాఫ్ట్ స్కిల్స్ అవసరమయ్యే ఇతర రకాల అర్థవంతమైన సృజనాత్మక పనులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ రాబోయే రోజుల్లో మీ ప్రధాన్యతను పెంచడంలో సహాయపడతాయి. కంపెనీల ప్రాధాన్యత రాబోయే రోజుల్లో ఏఐకి సంబంధించిన హబ్రిడ్ ఉద్యోగాలు పుట్టుకురానున్నాయి. హైబ్రిడ్ వర్క్ సెట్టింగ్‌ల పరిధిని పెంచడంలో భాగంగా ఏఐ ఉద్యోగాలు 2023 ఆగస్టులో నుంచి 2023 ఆగస్టు నాటికి 13.2 శాతం నుంచి 20.1 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ టెక్నాలజీలకు కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: ఏ ప్రశ్నకైనా సమాధానం 'చాట్‌జీపీటీ' - ఇంటర్వ్యూకి ఇలా సిద్దమైపోండి! లింక్డ్ఇన్ ఇండియా కంట్రీ మేనేజర్ అశుతోష్ గుప్తా మాట్లాడుతూ.. 90 దశకంలో ఇంటర్నెట్ ద్వారా జరిగిన వృద్ధికి సమానమైన అభివృద్ధి ఏఐ ద్వారా జరగనుంది. 2024లోకి అడుగుపెడుతున్న తరుణంలో కొత్త టెక్నాలజీలకు డిమాండ్ పెరుగుతుంది.. ఇందులోనే అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. ఈ టెక్నాలజీలో అవగాహన కలిగిన వారు భవిష్యత్తులో నాయకులుగా ఉంటారని అన్నారు. -
ఉద్యోగం పోయి చాలా రోజులైంది.. అప్పటి నుంచి.. మెటా మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్!
కరోనా మహమ్మారి ఎంతోమంది ఉద్యోగుల జీవితాలను తలకిందులు చేసింది. ఈ ప్రభావం ఇప్పటికి కూడా కొంతమంది మీద ఉంది అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లేఆప్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఒక ఉద్యోగి ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ ఏడాది ప్రారంభం నుంచి వేలమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. మెటా సైతం ఇప్పటి వరకు సుమారు 20వేలమందిని ఇంటికి పంపింది. ఇందులో ఒక ఉద్యోగి లేఆప్స్ మీద తన అసహనం ప్రదర్శిస్తూ లింక్డ్ఇన్లో పోస్ట్ పెట్టింది. జాబ్ పోయి 201 రోజులు (ఆరు నెలల కంటే ఎక్కువ) అవుతోంది, ఇప్పటికి ఒక్క అవకాశం కూడా లభించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మనుషులతో కలవడం పూర్తిగా తగ్గిపోయిందని, పని వాతావరణం మిస్ అవుతున్నట్లు వెల్లడించింది. రెండు సంవత్సరాలు ఫేస్బుక్లో టెక్నికల్ రిక్రూటర్‌గా పని చేసిన యువతి ఈ పోస్ట్ చేసింది. ఆగిపోయిన చోటే నిలిచిపోయానని, త్వరలోనే కొత్త ఉద్యోగం వస్తుందనే ఆశతో ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: కంపెనీలకు వణుకు పుట్టిస్తున్న 'రిలయన్స్' కొత్త ఆవిష్కరణ ఉద్యోగం కోల్పోయిన వ్యక్తులు ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా చాలామంది లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తూ తమ అసహనం, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయితే మెటా సంస్థ మాత్రం ఇప్పటికి తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు 21,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. -
LinkedIn ranking: చేస్తే ఈ స్టార్టప్ కంపెనీలోనే పని చేయాలి..
ఇటీవల యునికార్న్‌గా మారిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో (Zepto) భారత్‌లో అత్యధిక మంది ప్రొఫెషనల్స్ ఇష్టపడే వర్క్‌ప్లేస్ పరంగా అగ్ర స్టార్టప్‌గా అవతరించింది. ప్రముఖ రిక్రూటింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ఇన్ 'టాప్ 20 ఇండియన్ స్టార్టప్‌ల జాబితా'ను తాజాగా విడుదల చేసింది. తమకున్న దాదాపు కోటి మంది సభ్యుల డేటా ఆధారంగా నిపుణులు పని చేయాలనుకునే అభివృద్ధి చెందుతున్న కంపెనీల వార్షిక ర్యాంకింగ్ లింక్డ్ఇన్ రూపొందించింంది. ఉద్యోగుల వృద్ధి, ఉద్యోగార్థుల ఆసక్తి, కంపెనీలో మెంబర్ ఎంగేజ్మెంట్ తదితర అంశాల్లో పురోగతి సాధించి జెప్టో టాప్ ప్లేస్‌లో నిలిచింది. గతేడాది ఇదే లింక్డ్ఇన్ టాప్ కంపెనీల జాబితాలో 4వ స్థానంలో ఉన్న ఈ కంపెనీ ఈ ఏడాది మూడు స్థానాలు మెరుగుపర్చుకుని టాప్ ర్యాంక్‌ను సాధించింది. ఇక ఈ ర్యాంకింగ్‌లో జెప్టో తర్వాతి స్థానాలలో వరుసగా ఈవీ క్యాబ్ అగ్రిగేటర్ బ్లూస్మార్ట్, ఫిన్‌టెక్ కంపెనీ డిట్టో ఇన్సూరెన్స్, ఆడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్ పాకెట్ ఎఫ్ఎం, స్కైరూట్ ఏరోస్పేస్ ఉన్నాయి. ఈ సంవత్సరం జాబితాలో ఉన్న 20 స్టార్టప్‌లలో 14 కొత్తగా చోటు దక్కించుకోవడం విశేషం. -
లింక్డిన్కు బ్యాడ్ న్యూస్: కొత్త ఫీచర్ ప్రకటించిన మస్క్
స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ (ట్విటర్) ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ లింక్డ్ఇన్కు భారీ షాకిచ్చింది. తన ప్లాట్‌ఫారమ్‌లో ఉద్యోగాలను ప్రకటించేలా సంస్థలు, కంపెనీలను అనుమతించే కొత్త ఫీచర్ ‘హైరింగ్’ను అధికారికంగా ప్రకటించింది. లింక్డ్ఇన్, ఇండీడ్లాంటి సంస్థల తరహాలో ఎక్స్ కూడా కొత్త ఫీచర్నుతీసుకురానుందని వార్తలొచ్చిన నెల తరువాత సంస్థ ఎట్టకేలకు అధికారికంగా దీన్ని ధృవీకరించింది. జాబ్-మ్యాచింగ్ టెక్ స్టార్టప్ Laskieని ఇటీవల కొనుగోలు చేసిన సంగతి గమనార్హం. దీనిపై చాలామంది ఎక్స్ యూజర్లు సంతోషం ప్రకటిస్తున్నారు. ఆర్ఐపీ లింక్డ్ఇన్, ఇండీడ్ జిప్క్రూటర్, గ్లాస్డో అంటూ కమెంట్ చేశారు. (సేఫ్టీని ‘గాలి’ కొదిలేసిన ఎయిరిండియా: డీజీసీఏ షాకింగ్ రిపోర్ట్) ప్రస్తుతం బీటాలో ఉన్న హైరింగ్ ఫీచర్ ప్లాట్‌ఫారమ్‌లో ఓపెన్ పాత్రలను పోస్ట్ చేయడానికి కంపెనీలను అనుమతిస్తుంది. ధృవీకరించబడిన సంస్థలకు హైరింగ్ బీటా ముందస్తు యాక్సెస్ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. తొందరగా దీనికి సంబంధించిన లింక్‌ను కూడా ట్వీట్లో పొందు పర్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఎక్స్‌లో (పరిమితంగా) ఉద్యోగులను వెతుక్కోవడం, ఉద్యోగ అవకాశాలను ప్రకటించడం లాంటివి అందుబాటులో ఉంటాయి. ధృవీకరించిన సంస్థలు తమ ప్రొఫైల్‌లకు గరిష్టంగా ఐదు ఉద్యోగ స్థానాలను మాత్రం లిస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. కాగా గత నెలలో యాప్ పరిశోధకురాలు నిమా ఓవ్జీ జాబ్ లిస్టింగ్ ఫీచర్‌ను వివరించే స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిమిత కంపెనీలతో జాబ్ సెర్చ్ ర్ ఫీచర్‌పై టెస్ట్ రన్ చేస్తోంది. Unlock early access to the X Hiring Beta — exclusively for Verified Organizations. Feature your most critical roles and organically reach millions of relevant candidates. Apply for the Beta today 🚀: https://t.co/viOQ9BUM3Y pic.twitter.com/AYzdBIDjds #Twitter will let verified organizations import all of their jobs to Twitter by connecting a supported ATS or XML feed! 🚀 "Connect a supported Applicant Tracking System or XML feed to add your jobs to Twitter in minutes." pic.twitter.com/TSVRdAoj3h — Nima Owji (@nima_owji) July 20, 2023 — Hiring (@XHiring) August 25, 2023 -
భారత నిపుణుల్లో ఏఐ పట్ల మక్కువ
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/ఏఐ)కు ప్రాధాన్యం పెరగడంతో, భారత నిపుణులు ఈ నైపుణ్యాలను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఏఐ నైపుణ్యాలు కలిగిన వారి సంఖ్య 2016 జనవరి తర్వాత 14 రెట్లు పెరిగినట్టు ప్రొఫెషనల్ సోషల్ మీడియా నెట్వర్క్ ‘లింక్డిన్’ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. దీంతో ఏఐ నైపుణ్యాల పరంగా టాప్–5 దేశాల్లో సింగపూర్, ఫిన్లాండ్, ఐర్లాండ్, కెనడాతోపాటు భారత్ ఒకటిగా ఉందని తెలిపింది. 2016 జనవరి నాటికి నిపుణుల ప్రొఫైల్స్, తాజా ప్రొఫైల్స్‌ను లింక్డెన్ విశ్లేషించింది. కనీసం రెండు రకాల ఏఐ నైపుణ్యాలు పెరిగిన ప్రొఫైల్స్‌ను పరిగణనలోకి తీసుకుంది. ‘‘గడిచిన ఏడాది కాలంలో పని ప్రదేశాల్లో ఏఐ వినియోగం పెరిగింది. దీంతో ఏఐ నైపుణ్యాలను సొంతం చేసుకుంటే కెరీర్ అవకాశాలు మరింత మెరుగుపడతాయని భారత్‌లో 60 శాతం మంది ఉద్యోగులు, 71 శాతం జనరేషన్ జెడ్ నిపుణులు గుర్తించారు’’అని లింక్డిన్ తెలిపింది. ఏఐ, ఎంఎల్‌కు ప్రాధాన్యం ప్రతి ముగ్గురిలో ఇద్దరు 2023లో కనీసం ఒక డిజిటల్ స్కిల్ నేర్చుకుంటామని లింక్డ్ఇన్ నిర్వహించిన సర్వేలో చెప్పారు. ముఖ్యంగా ఏఐ, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్న నైపుణ్యాల్లో అగ్రభాగాన ఉన్నా యి. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు సైతం ఏఐ నైపుణ్యాలపై శిక్షణ, నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వచ్చే ఏడాది తమ సంస్థల్లో ఏఐ వినియోగాన్ని పెంచే ప్రణాళికతో 57 శాతం మంది ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. మార్పులు స్వీకరించే విధంగా తమ ఉద్యోగులకు తిరిగి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి కంపెనీలు చురుగ్గా పనిచేస్తున్నాయి. ‘‘భవిష్యత్ పనితీరు విధానాన్ని ఏఐ మార్చనుంది. భవిష్యత్‌కు అనుగుణంగా ప్రపంచస్థాయి మానవ వనరుల అభివృద్ధికి వీలుగా నైపుణ్యాల ప్రాధాన్యం, ఉద్యోగుల సామర్థ్యాలను భారత్ గుర్తించింది’’అని లింక్డిన్ ఇండియా కంట్రీ మేనేజర్ అశుతోష్ గుప్తా తెలిపారు. -
సీఈవో అండదండలున్న నో జాబ్ గ్యారెంటీ!
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం భయాలు, తగ్గిపోతున్న ప్రాజెక్ట్‌లతో పాటు ఇతర కారణాల వల్ల చిన్న చిన్న స్టార్టప్‌ల నుంచి అంతర్జాతీయ టెక్ సంస్థలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. లేఆఫ్స్ తెగుబడుతున్న సంస్థలు సామర్ధ్యం పేరుతో వారిని బలి చేస్తున్నాయి. అయితే, తాజాగా పనితీరు బాగున్నా ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మేలో మెటా సంస్థ సుమారు 6000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. వారిలో ఓ ఉద్యోగి మెటాలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని లింక్డిన్లో పోస్ట్ చేశారు. మెటాలో ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తూ టాప్ పెర్మార్లలో ఒకరిగా నిలిచారు. పనితీరు విషయంలో సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రశంసలు సైతం అందుకున్నారు. కానీ కంపెనీలో చేరిన ఏడాదిన్నర తర్వాత విధుల నుంచి తొలగించినట్లు వాపోయారు. టాప్ పెర్ఫామర్, సీఈవో మార్క్ జుకర్బర్గ ప్రశంసలతో మెటాలో తన జాబ్‌కు ఢోకా ఉండదని భావించారు. కానీ అనూహ్యంగా 6,000 లేఆఫ్స్‌లో తాను ఒకరిగా ఉండటాన్ని నమ్మలేకపోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం, వేరే జాబ్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు లింక్డిన్ పోస్ట్‌లో తన ఆవేదనను వ్యక్తం చేశారు. -
ఏఐ కోచ్.. మీకు త్వరగా జాబ్ వచ్చేలా చేస్తుంది!
ప్రముఖ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్ లింక్డ్ఇన్.. జాబ్ కోసం వెతుకుతున్న యూజర్లకు సహాయం చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సాధనంపై పని చేస్తోంది. ‘ఏఐ కోచ్’ పేరుతో పిలుస్తున్న ఈ కొత్త టూల్ ఉద్యోగార్థులకు మరింత సమర్థవంతమైన పద్ధతిలో ఉద్యోగాలను కనుగొని దరఖాస్తు చేసుకోవడానికి సహాయం చేస్తుంది. ఈ విషయాన్ని లింక్డ్ఇన్ యాప్ రీసెర్చర్ నిమా ఓవ్జీ ట్విటర్లో షేర్ చేశారు. లింక్డ్ఇన్ ఏఐ కోచ్‌పై పని చేస్తోందని, ఇది జాబ్లకు దరఖాస్తు చేయండం, నైపుణ్యాన్ని పెంచుకోవడం, వృత్తిపరమైన నెట్‌వర్క్‌ను విస్తరించే మార్గాలను అన్వేషించడంలో ఉద్యోగార్థులకు సహాయపడుతుందని అందులో రాసుకొచ్చారు. ఓవ్జీ షేర్ చేసిన లింక్డ్ఇన్ ఏఐ కోచ్ స్క్రీన్‌షాట్‌ను చూస్తే ఇంచుమించు మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్‌బాట్‌ను పోలి ఉంది. ఇందులో ఏఐ కోచ్ ఎలా పని చేస్తుంది.. కంపెనీల వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది.. తదితర వివరాలను మీరు ఏఐ కోచ్ నుంచి ఆరా తీయవచ్చు. ఇది మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని కంపెనీ అయినందున దాని ఏఐ సాంకేతికతతోనే దీన్ని రూపొందించే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి ➤ బ్యాంకు ఉద్యోగాలు చేదయ్యాయా? అలా చేరుతున్నారు.. ఇలా మానేస్తున్నారు! ప్రస్తుతం అన్నింట్లోనూ ఏఐ ఆధారిత సాధనాలు వస్తున్నాయి. వివిధ పనుల కోసం ప్రత్యేకంగా వీటిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ అన్వేషణలోనూ ఇవి సహాయం చేయనున్నాయి. ఈ దిశలో ‘ఏఐ కోచ్’ ఒక ప్రధాన అడుగు కాబోతోంది. ఇది ఉద్యోగార్థుల సమయం, శ్రమను ఆదా చేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఇప్పటివరకు తన బింగ్ చాట్‌ను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ యాప్‌లు, ఎడ్, గిట్హబ్లకు పరిచయం చేసింది. మైక్రోసాఫ్ట్ ముఖ్యమైన ఉత్పత్తులలో లింక్డ్ఇన్ కూడా ఒకటి కావడం వల్ల ‘ఏఐ కోచ్’ ద్వారా ఇందులోనూ ఏఐ టెక్నాలజీని పరిచయం చేయబోతోందని చెప్పవచ్చు. #Linkedin is working on LinkedIn Coach! It's an AI ASSISTANT that helps you apply for JOBS, learn new SKILLS, and find more ways to CONNECT with your network! pic.twitter.com/jKBrPmEFJt — Nima Owji (@nima_owji) July 27, 2023 -
15 ఏళ్ల స్టార్టప్ సీఈవోకి లింక్డ్ఇన్లో నిషేధమా? ట్వీట్ వైరల్
అమెరికాలో చిన్నవయసులోనే స్టార్టప్‌కి సీఈవో, 15 ఏళ్ల ఎరిక్ ఝూకు వ్యాపార నెట్వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ లింక్డ్ఇన్లో చోటు దక్కలేదు. లింక్డ్ఇన్లో తననుఎందుకు బ్యాన్ చేసిందో, అకౌంట్ ఎందుకు లేదో తెలుపుతూ స్వయంగా అవియాటో సీఈవో ఎరిక్ తన ట్విటర్ హ్యాండిల్లో ప్రకటించారు. దీంతో 6 లక్షలకు పైగా వ్యూస్, దాదాపు 4వేలకు పైగా లైక్స్‌తో ఈ ట్వీట్ వైరలయింది. విషయం ఏమిటంటే... హైస్కూల్లో చదువుతున్న ఎరిక్ ‘ఎవియాటో’ అనే స్టార్టప్‌ని ఏర్పాటు చేశాడు. బాచ్మానిటీ క్యాపిటల్‌లో పెట్టుబడిదారుడిగా కూడా ఉన్నాడు. ఈ కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన ఒక ఉద్యోగి “హే ఎరిక్, నేను మీ కంపెనీతో నా ఉద్యోగంపై సంతోషిస్తున్నా. కానీ లింక్డ్ఇన్ పోస్ట్‌లో మిమ్మల్ని ట్యాగ్ చేయలేకపోయాను, కానీ.. అంటూ వచ్చిన ఒక స్క్రీన్ షాట్‌ను ట్విటర్లో పోస్ట్ చేస్తూ అసలు విషయం చెప్పారు. దీంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దాదాపు ఇదే కారణంతో స్పేస్ఎక్స్ కైరన్ క్వాజీకి లింక్డ్ఇన్ ప్రొఫైల్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. లింక్డ్ఇన్ ఖాతాను తెరవాలంటే కనీసం 16 ఏళ్ల వయసుండాలి. ఈ విషయాన్ని తన కంపెనీ కొత్త ఉద్యోగికి చెప్పాల్సి వచ్చిందంటూ ట్వీట్ చేశారు. అలాగే దీనికి సంబంధించి వయసు నిబందనపై లింక్డ్ఇన్ ప్రతినిధి ఫోటోను కూడా షేర్ చేశారు. దీంతో ఇది ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. I had to tell my new employee that I got banned from linkedin for being 15 years old today… pic.twitter.com/fskiVDnpWw — Eric Zhu (@ericzhu105) June 15, 2023 -
హిట్లర్‌ను పొగిడాడు.. దిగ్గజ టెక్ కంపెనీలో మంచి ఉద్యోగం పోగొట్టుకున్నాడు!
అడాల్ఫ్ హిట్లర్.. ప్రపంచాన్ని వణికించిన నియంత. కొన్ని లక్షల మంది ప్రజలను పొట్టన బెట్టుకున్న క్రూరుడు. అతడి చెరలో పడితే చావే తప్పితే పునర్జన్మ ఉండదు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, మిత్ర రాజ్యాల దళాలు నాజీలను ఓడించడానికి ఆరేళ్లు ప్రయత్నించాయంటే..హిట్లర్ ఎంతటి గట్టివాడో అర్థం చేసుకోవచ్చు. అలాంటి నియంతను పొగిడాడంటూ ప్రముఖ టెక్ దిగ్గజం డెలాయిట్ ఓ ఉద్యోగుని విధుల నుంచి తొలగించింది. నీరభ్ మెహ్రోత్రా డెలాయిట్‌లో అసోసియేట్ డైరెక్టర్, రిస్క్ అడ్వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, తాజాగా నీరభ్ ‘ఫ్రైడే ఇన్స్పిరేషన్’ అనే కొటేషన్‌తో అడాల్ఫ్ హిట్లర్ ఆకర్షణీయమైన వ్యక్తి అంటూ నియంతపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘‘ఇటీవల నేను ది డార్క్ చార్మ్ ఆఫ్ అడాల్ఫ్ హిట్లర్ బుక్ కొనుగోలు చేశా. ఆ బుక్ చదివే కొద్దీ ఇంకా ఇంకా చదవాలని అనిపిస్తుంది. ముఖ్యంగా అందులో హిట్లర్ గురించి, వరల్డ్ వార్ 2 పై ఈ బుక్ నాకు సరైన అవగాహన ఇచ్చింది’’ అని మెహ్రోత్రా సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. దీంతో పాటు ఆకర్షణీయమైన అడాల్ఫ్ హిట్లర్‌లోని కొన్ని లక్షణాల్ని మనం ఆకళింపు చేసుకోవాలి. తన మాటలతో ప్రజల్ని ఆకర్షించే మాగ్నెటిక్ స్పీకర్, కాన్ఫిడెంట్ ఎక్కువ’అని పేర్కొన్నాడు. అంతే అడాల్ఫ్ హిట్లర్‌ను పొగుడుతావా? అంటూ నెటిజన్లు మెహ్రోత్రాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్ల వర్షం కురిపించారు. నెటిజన్ల కామెంట్లపై మెహ్రోత్రా స్పందిస్తూ బహిరంగ లేఖలో ఇలా రాశారు. ‘‘నేను ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. క్షమించండి అంటూ అభ్యర్థించాడు. ‘నేను తప్పు చేస్తే దానిని అంగీకరించే ధైర్యం ఉండాలని నా గురువులు, బాస్‌లు, కోచ్‌లు నాకు సలహా ఇచ్చారు. వారి మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాను. నేను చేసిన పోస్ట్‌పై క్షమాణలు కోరుతున్నాను అని అందులో రాశాడు. మరోవైపు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన కొద్ది సేపటికే డెలాయిట్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. మెహ్రూత్రా ఇకపై తమ కంపెనీలో పనిచేయడం లేదని పేర్కొంది. గత నెలలో మా సంస్థలో చేరిన ఉద్యోగి సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు మా భాగస్వామ్య విలువలకు అనుగుణంగా లేవు.మా అంతర్గత విధానాలను ఉల్లంఘించారు. ఈ ఉద్యోగి ఇకపై డెలాయిట్ ఇండియాలో పని చేయడు’ అని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు ఆ ప్రటకనలో తెలిపారు. -
Aakanksha Monga: ఆమె ఊరి పేరు... ప్రపంచం
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘లింక్డ్ ఇన్’లో క్రియేటర్‌గా పని చేసేది దిల్లీకి చెందిన ఆకాంక్ష మొంగా. తన పాషన్, ప్రాణం ట్రావెలింగ్. అయితే ఉద్యోగ బాధ్యతల వల్ల ‘ఇంటి నుంచి ఆఫీసుకు–ఆఫీసు నుంచి ఇంటికి’ మాత్రమే జీవితం పరిమితమైపోయింది. రొడ్డకొట్టుడు జీవనశైలితో విసిగిపోయిన ఆకాంక్ష తన పాషన్‌కు తిరిగి ప్రాణం పోసింది. ఉద్యోగానికి రాజీనామా చేసి బ్యాగు సర్దుకొని బయలుదేరింది. కంటెంట్ క్రియేటర్‌గా మారింది. సోషల్ మీడియాలో వందల మందితో తనదైన కమ్యూనిటీని సృష్టించుకుంది. పన్నెండు దేశాలు తిరిగిన ఆకాంక్ష ఆరుమంది సభ్యులతో ‘ట్రావెల్ ఏ మోర్’ పేరుతో ఒక గ్రూప్‌ను క్రియేట్ చేసింది. తాజాగా... ట్విట్టర్లో ఆమె చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా నిలిచింది. ‘ఒక విషయంపై పాషన్ ఉండి కూడా దానికి దూరం అవుతూ, మనసులోనే కుమిలిపోయేవారు ఎందరో. అలాంటి వారికి ఆకాంక్ష కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కొత్త దారి చూపించింది’ ‘డెస్క్ టు డెస్టినేషన్స్’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. -
‘ఉద్యోగం విసుగొచ్చింది’.. జాబ్ వదిలేసి దేశాలు తిరుగుతున్న యువతి!
ఉద్యోగం విసుగొచ్చిందంటూ.. జాబ్ వదిలేసి దేశాలు తిరుగుతోంది ఢిల్లీకి చెందిన ఓ యువతి. లింక్డ్ఇన్ సంస్థలో పనిచేసిన ఆకాంక్ష మోంగా ట్రావెలింగ్‌ను ఫుల్ టైమ్ వృత్తిగా ఎంచుకుంది. ఇందు కోసం ఉద్యోగాన్ని విడిచిపెట్టింది. ఆమె ఉద్యోగాన్ని విడిచిపెట్టి మే 17వ తేదీకి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆకాంక్ష ట్విటర్లో ఓ పోస్ట్ చేసింది. ఇదీ చదవండి: ChatGPT false: క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేసిన ప్రొఫెసర్.. చాట్‌జీపీటీ చేసిన ఘనకార్యం ఇది! అప్పటి నుంచి ఆమె తన ట్రిప్‌లను డాక్యుమెంట్ చేయడం ప్రారంభించింది. అలాగే ట్రావెల్ హ్యాక్‌లను షేర్ చేయడం, ఆఫ్‌బీట్ గమ్యస్థానాలను అన్వేషించడం ద్వారా సోషల్ మీడియా మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఏడాది క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకున్న ఫాలోవర్లు 2.5 లక్షల మంది. ఇప్పుడామె ఫాలోవర్ల సంఖ్య 7 లక్షలకు పెరిగింది. I quit my job at LinkedIn. Last year, on this very date. When I left, I promised to give myself 1 year to focus on my passion and travel the world full time. When I left I was burnt out,had 250k followers on IG, worked alone. Want to know how it’s going now? 🌻 pic.twitter.com/NJzNgKrOjQ — Aakanksha Monga (@Aakanksha_99) May 17, 2023 2020లో ఢిల్లీలోని హిందూ కళాశాల నుంచి కామర్స్‌లో పట్టా పొందిన ఆకాంక్ష ఆ తరువాత ఒక సంవత్సరం పాటు బైన్ అండ్ కంపెనీలో అనలిస్ట్‌గా పనిచేసింది. అనంతరం లింక్డ్ఇన్లో క్రియేటర్ మేనేజర్ అసోసియేట్‌గా చేరింది. అక్కడ చేరిన ఆరు నెలలకే ఆ ఉద్యోగంలో సంతృప్తి లేదని భావించి దానికి రాజీనామా చేసి ట్రావెలింగ్ చేస్తోంది. ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు! -
ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే?
వారానికి ఐదురోజులే పని. ఐదంకెల జీతం. లగ్జరీ జీవితం. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్. కరోనాలోనూ తరగని ఆదాయం. ఛాన్సుంటే రెండు కంపెనీల్లో జాబ్. బిటెక్ చేశామా? బోనస్‌గా ఏదో ఒక కోర్స్ చేశామా? ఐటీ జాబ్‌లో చేరిపోయామా? అంతే! లైఫ్ సెటిల్ బిందాస్‌గా బ్రతికేయొచ్చు. కొంచెం టెన్షన్ ఎక్కువే అయినా దానికి తగ్గట్లు ఇన్ కమ్ ఉంటుంది. ఇతర ఫెసిలిటీస్ ఎలాగూ ఉంటాయి. ఇంకాస్త అదృష్టం తోడైతే విదేశాలకు వెళ్లొచ్చు. డాలర్లను జేబులో వేసుకోవచ్చు. అందుకే యూత్‌కు ఐటీ జాబ్స్ అంటే వెర్రీ. కాలు కదపకుండా కంప్యూటర్ ముందు చేసే ఉద్యోగమంటే క్రేజ్. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విభిన్నంగా ఉన్నాయి. ఉద్యోగులు అనుభవిస్తున్న ఆ భోగభాగ్యాల వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన క్షణాలున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ కంపెనీలు చెల్లించే లక్షలకు లక్షలు ప్యాకేజీలు ఏం చేసుకోను. మనసు విప్పి నాలుగు మాటలు మాట్లాడే వారు లేకపోతే’ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఐటీ ఉద్యోగులు. చదవండి👉 పాక్ అభిమాని గూబ గుయ్‌మనేలా..గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ రిప్లయ్ అదిరింది లక్షలు ప్యాకేజీ ఏం చేసుకోను? ఇటీవల బెంగళూరుకు చెందిన 24 ఏళ్ల ఐటీ ఉద్యోగి తన వ్యక్తి గత జీవితం గురించి నెటిజన్లతో పంచుకున్నారు. ‘నేనో ప్రముఖ టెక్ కంపెనీలో జాబ్ చేస్తున్నా. శాలరీ రూ.58 లక్షలు. అయినా సరే సంతృప్తిగా లేను. ఎప్పుడూ ఒంటరిగా ఫీలవుతున్నాను. ప్రేమగా మాట్లాడేందుకు ప్రేమికురాలు లేదు. స్నేహితులేమో క్షణం తీరిక లేకుండా ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమయ్యారు’ అంటూ తన బాధను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు. దీంతో అయ్యో పాపం! అనడం నెటిజన్ల వంతైంది. ఐటీ ఉద్యోగుల్ని మరో ప్యాండమిక్ ముంచేస్తుందా? ఐటీ ఉద్యోగుల్లో ఈ తరహా ధోరణికి కారణం కంపెనీల్లో మారిపోతున్న వర్క్ కల్చరేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్-19 కారణంగా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో రిమోట్ వర్క్ కల్చర్‌ని అమలు చేశాయి. అది కాస్త సుదీర్ఘ కాలంగా కొనసాగుతుంది. దీంతో ఉద్యోగులు నెలల తరబడి ఇంటికే పరిమితం కావాల్సి వస్తుంది. కానీ ఇలాగే కొనసాగితే వర్క్ కల్చర్‌లో కోవిడ్ కాకుండా మరో ప్యాండమిక్ సైతం ఆవహించేస్తుందని, ఆ ప్యాండమిక్ పేరే ఒంటరితనమని అంటున్నారు టెక్ నిపుణులు. చదవండి👉 ‘ఇక చాలు.. దయ చేయండి’.. గూగుల్ ఉద్యోగులకు సీఈఓ ఈ మెయిల్ ఎంఐటీ ఏం చెబుతోంది ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు అనేక లాభాలున్నాయి. వర్క్ ప్రొడక్టివిటీ పెరగడం, ప్రయాణం, ఖర్చులు, డబ్బులు ఆదా చేసుకోవడం, కుటుంబ సభ్యులతో గడపం వంటి స్వల్ప కాలంలో బాగుంటాయి. కానీ సూదీర్ఘంగా ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ఉద్యోగుల్లో ఒంటరి తనం పెరిగిపోతుంది. ఇదే విషయాన్ని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైతం తెలిపింది. రిమోట్ వర్క్‌తో సహచర ఉద్యోగులతో గడపలేకపోవడం, ఇతరులపై నమ్మకం పెరగడం, శరీరాన్ని కష్టపెట్టకపోవడం వల్ల శారీరక ప్రతిస్పందనలు తగ్గిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు న్యూరో సైన్స్ అధ్యయనంలో తేలింది. అందరి మధ్యలో ఉన్నా ఒంటరిగా ఆఫీస్‌లో పనిచేస్తూ సహచరులతో మాట్లాడడం, క్యాంటీన్లలో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడం, వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకోవడంతో పాటు ఉత్పాదకత పెరుగుతుంది. మహమ్మారి ప్రారంభ నెలల్లో రిమోట్‌గా పని చేస్తున్నప్పుడు ఐదుగురిలో ముగ్గురు (60శాతం) భారతీయ ఐటీ నిపుణులు ఏదో ఒక సమయంలో అందరి మధ్యలో ఉన్న ఒంటరిగా ఉన్నామని భావించారు. 16,199 మంది భారతీయ టెక్ నిపుణులపై లింక్డిన్ సంస్థ వర్క్‌ఫోర్స్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ పేరుతో నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో ఇదే అంశం వెలుగులోకి వచ్చింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కే మా ఓటు ఈ ఏడాది మార్చి నెలలో లింక్డిన్ సర్వేలో 78 శాతం మంది ఇండియన్ ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వెళుతున్నారు. ఆరోగ్యకరమైన పని-జీవిత సమతుల్యతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి అవగాహన ఉన్నప్పటికీ, వారిలో చాలా మంది ఇంట్లో ఉండి పనిచేయడం కంటే ఆఫీస్‌లో పనిచేయడం వల్ల ఉత్పాదక పెరగుతున్నట్లు సర్వే పేర్కొంది. చివరిగా.. మహమ్మారితో ఆకస్మికంగా పనిలో వచ్చిన మార్పులు ఆనందాన్ని దూరం చేసినట్లు 62శాతం మంది ఉద్యోగులు భావిస్తుండగా.. రిమోట్/హైబ్రిడ్ వర్క్ కల్చర్ రానున్న రోజుల్లో ఉద్యోగులపై ఏ విధమైన ప్రతికూల ప్రభావం చూపిస్తాయోనని టెక్నాలజీ నిపుణులు చర్చించుకుంటున్నారు. చదవండి👉 రాత్రికి రాత్రే ఐటీ ఉద్యోగాలు ఊడుతున్న వేళ..టీసీఎస్ గుడ్‌న్యూస్! -
లింక్డిన్నూ తాకిన లేఆఫ్‌ల సెగ.. 700 మంది ఉద్యోగుల తొలగింపు!
ఆర్ధిక ఆనిశ్చితి, డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో చిన్న చిన్న కంపెనీల నుంచి అంతర్జాతీయ సంస్థల వరకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎంప్లాయిమెంట్ సోషల్ నెట్వర్క్ లింక్డిన్కు లేఆఫ్స్ సెగ తగిలింది. తాజాగా, 716 మందికి పింక్ స్లిప్‌లు జారీ చేయగా.. అదే సంస్థ చైనా కేంద్రంగా సేవలందిస్తున్న జాబ్ అప్లికేషన్‌ను షట్‌డౌన్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లింక్డిన్ గత సంవత్సరంలోని ప్రతి త్రైమాసికంలో ఆదాయాన్ని గడించింది. కానీ, దాని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్ కొనసాగిస్తుంది. లింక్డిన్ దాదాపు 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో దాదాపు 3.5 శాతం ఉద్యోగాల కోతలకు దారి తీసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. చదవండి👉సుందర్ పిచాయ్‌పై సొంత ఉద్యోగులే ఆగ్రహం.. జీతం తిరిగి వెనక్కి ఇచ్చేస్తారా? ఆరు నెలల్లో 2,70,000 మంది తొలగింపు గత ఆరు నెలల్లో, ప్రపంచవ్యాప్తంగా 2,70,000కి పైగా ఐటీ ఉద్యోగులు ఉపాది కోల్పోయారు. అమెజాన్, ఫేస్బుక్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ వంటి దిగ్గజ సంస్థ ఉద్యోగుల్ని ఇంటికి పంపించాయి. కాగా, 2016లో లింక్డిన్ 26 బిలియన్లకు కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్, ఇటీవలి కాలంలో దాదాపు 10,000 ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపిన విసయం తెలిసిందే మైక్రోసాఫ్ట్ సైతం మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 10,000 మంది ఉద్యోగులను ఫైర్ చేసింది. వారిలో సప్లయి చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌తో పాటు అమెజాన్, మెటా, గూగుల్ వంటి ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఉద్యోగులపై వేటు వేశాయి. గత ఏడాది చివరి నుంచి మెటా 21,000 మందిని తొలగించింది. జనవరి 2023లో గూగుల్ 12,000 మంది ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. అమెజాన్ ఇప్పటివరకు రెండు దఫాలుగా 27,000 మందిని తొలగించడం ఆందోళనలకు దారి తీసింది. టెక్ పరిశ్రమలో చాలా మంది తొలగింపులు కంపెనీ ఆర్థిక స్థితికి కారణమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి👉 ఇద్దరు ఉద్యోగుల కోసం.. యాపిల్, గూగుల్ సీఈవోల పోటీ.. చివరికి ఎవరు గెలిచారంటే? -
లింక్డ్ఇన్ టాప్ కంపెనీలు: ఉద్యోగులకు ఆకర్షణీయ సంస్థగా విటెస్కో టెక్నాలజీస్
న్యూఢిల్లీ: పవర్ ట్రెయిన్ టెక్నాలజీస్ కంపెనీ ‘విటెస్కో టెక్నాలజీస్’ లింక్డ్ఇన్ 2023 అగ్రగామి కంపెనీల జాబితాలో చోటు సంపాదించుకుంది. ఈ విషయాన్ని విటెస్కో టెక్నాలజీస్ ప్రకటించింది. భారత్‌తో పాటు, ఫ్రాన్స్, అమెరికాలోనూ ఏక కాలంలో ఉత్తమ కంపెనీగా నిలిచినట్టు తెలిపింది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 38 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. మూడు ఖండాల్లోనూ ఎక్కువ మంది ఉద్యోగులకు ఆకర్షణీయ కంపెనీగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఈ అవార్డు రావడం పట్ల గర్విస్తున్నాం. ఉద్యోగుల వృత్తిపరమైన, వ్యక్తిగత అభివృద్ధి పట్ల మా అంకిత భావానికి ఇది నిదర్శనం’’అని విటెస్కో టెక్నాలజీస్ సీహెచ్ఆర్వో ఇంగో హోల్స్టీన్ ప్రకటించారు. ఇదీ చదవండి: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్.. 44 వేల జాబ్ ఆఫర్లు.. అందరికీ ఉద్యోగాలు! ఉద్యోగులకు అత్యుత్తమ కెరీర్ అవకాశాలను కల్పించి ప్రోత్సహించే కంపెనీలను లింక్డ్ఇన్ గుర్తించి టాప్ కంపెనీస్ ర్యాంకింగ్ ఇస్తుంది. ఇందుకు వృత్తిపరమైన అభివృద్ధితో పాటు పని-జీవిత సమతుల్యత, అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించే, నిలుపుకునే సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఇదీ చదవండి: 23 దేశాల్లో జీతాలు రూ.లక్షకుపైనే.. మరి భారత్‌లో...? -
ఇది మామూలు దండయాత్ర కాదు! 150కిపైగా కంపెనీలకు అప్లై చేశాడు.. మొత్తానికి...
టెక్ కంపెనీల్లో లేఆఫ్స్‌ల కారణంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి నానా తంటాలు పడుతున్నారు. కొంత మంది నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొత్త ఉద్యోగం చేసిన దండయాత్ర గురించి తెలుసుకుంటే విస్తుపోవడం ఖాయం.. ఇదీ చదవండి: పీఎఫ్‌ను ముందస్తుగా వెనక్కి తీసుకోవచ్చా? ఢిల్లీకి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎనిమిది నెలల సుదీర్ఘ శోధన తర్వాత ఇటీవల ఒక టెక్ సంస్థలో ఉద్యోగం పొందాడు. ఆ ఎనిమిది నెలల సమయంలో అతను 150 కంటే ఎక్కువ కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాడు. తన ఉద్యోగ వేట కథను లింక్డ్ఇన్లో పోస్టు చేశాడు. సాఫ్ట్వేర్ డెవలపర్‌గా అనుభవం ఉన్నప్పటికీ కొత్త ఉద్యోగాన్ని పొందడం సవాలుగా మారిందన్నాడు. వందలాది కంపెనీలు తనను రిజెక్ట్ చేశాయన్నాడు. ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! 150 కంపెనీలకు అప్లై చేస్తే 10 కంపెనీల నుంచి మాత్రమే రెస్పాన్స్ వచ్చిందని, వాటిలో కేవలం ఆరింటికి మాత్రమే ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యాయని వివరించాడు. అమెజాన్ స్కాట్లాండ్తో ఇంటర్వ్యూలో అన్ని రౌండ్లు పూర్తయ్యాయని, కానీ చివరి దశలో నియామకం నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. గూగుల్ సంస్థలో అయితే డీఎస్ఏ రౌండ్లలో రిజెక్ట్ అయిందన్నారు. ఈ పోస్టు రాయడం వెనుక ఉద్దేశం.. పరిస్థితులు గతంలో మాదిరిగా లేవని, ఉద్యోగం కావాలంటే తీవ్రంగా కష్టపడాల్సిందేనని తెలియజేయడమేనని వివరించాడు. ఉద్యోగ వేటలో ఉన్నవారు నిరుత్సాహపడకుండా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండాలని, నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించాడు. ఇదీ చదవండి: ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా? -
గుండె ఆగిపోయినంత పనైంది! నాకే ఎందుకిలా? గూగుల్ ఉద్యోగి భావోద్వేగం
సాక్షి, ముంబై: టెక్ దిగ్గజం గూగుల్‌లో ఉద్యోగాల తీసివేత ఆందోళన రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా 12 వేల ఉద్యోగాలకు ఉద్వాసన పలికిన సంస్థలో తాజా ఆకస్మిక తొలగింపులు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఉద్యోగాన్ని కోల్పోయిన ఉద్యోగాలదీ ఒక్కొక్కరిదీ ఒక్కోగాథ. సోషల్ మీడియాలో గుండెల్ని పిండేస్తున్న కథనాలు, పంచుకుంటున్న అనుభవాలు వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన గూగుల్ ఉద్యోగి ఆవేదన ఆ కోవలో నిలిచింది. తాను స్టార్ పెర్ఫామర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచినా కూడా ఉద్యోగంనుంచి తొలగించారంటూ హర్ష్ విజయ్ వారిగ్య తన ఆవేదనను పంచుకున్నారు. (91 ఏళ్ల వయసులో.. ఎనర్జిటిక్ షీనా లవ్‌లో బిజినెస్ టైకూన్) గూగుల్ ఆపరేషన్స్ సెంటర్లో డిజిటల్ మీడియా సీనియర్ అసోసియేట్‌గా పనిచేస్తున్నారు హర్ష్ విజయ్ వారిగ్య. ఇటీవలే స్టార్ పెర్ఫామర్ ఆఫ్ ది మంత్ అవార్డును కూడా అందుకున్నారు. అయితే ఈ సంతోషంనుంచి తేరుకోకముందే కంపెనీ షాక్ ఇచ్చింది. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ మెయిల్ చూసి నివ్వెరపోయిననాయన లింక్డ్ఇన్ సుదీర్ఘమైన పోస్ట్‌లో తన అనుభవాన్ని షేర్ చేశారు. పాప్-అప్ ఇమెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు తన గుండె ఆగినంత పని అయిపోయిందనీ, ''స్టార్'' పెర్ఫార్మర్‌ని బహుమతిగా ఇచ్చిన తర్వాత కూడా గూగుల్ తనను తొలగించింది. ఎందుకిలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు సంస్థలోని తొలగింపు ప్రభావం ఎలా ఉండబోతోందో వెల్లడించారు. ఇకపై వచ్చే రెండు నెలలు తనకు సగం జీతమే.. ఫైనాన్షియల్ ప్లాన్స్ అన్నీ ఆగమైపోయాయని పేర్కొన్నారు, ఈ షాక్‌నుంచి తేరుకుని లింక్డ్ఇన్లో పోస్ట్ పెట్టేందుకు తనకు రెండు రోజులు సమయం పట్టిందని, ఇపుడిక తన మనుగడ కోసం పోరాడాల్సి ఉందని పేర్కొన్నారు హర్ష్ విజయ్ వారిగ్య. కాగా గురుగ్రామ్‌లోని గూగుల్ క్లౌడ్ ప్రోగ్రామ్ మేనేజర్ ఆకృతి వాలియా ఇటీవలే తొలగించింది సంస్థ. సంస్థలో తన 5 సంవత్సరాల-గూగుల్వర్సరీ వేడుకలను జరుపుకున్న సంతోషంలో ఉండగానే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు మెసేజ్ దర్శనమిచ్చింది. మీటింగ్‌కు కేవలం 10 నిమిషాల ముందు యాక్సెస్ నిరాకరించారని, తనను ఎందుకు తొలగించారో అర్థంకావడం లేదంటూ లింక్డ్ ఇన్‌లో పోస్ట్‌లో భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. -
Layoffs: నా చిన్నారి పాపకు నేనేం చెప్పను? తొలగించిన గూగుల్ ఉద్యోగిని ఆవేదన!
టెక్ దిగ్గజం గూగుల్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇలా తొలగించిన వారిలో కింది స్థాయి ఉద్యోగి నుంచి మేనేజర్ స్థాయి వరకు ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో ఆవేదన. ఇటీవల తొలగింపునకు గురైన ఓ ఉద్యోగిని తన ఆవేదనను లింక్డ్ఇన్లో రాసుకొచ్చారు. (ఇదీ చదవండి: సీఈవో జీతం తెలిసి యూజర్లు షాక్! దీంతో ఎలా బతుకుతున్నారు సార్?) ఆకృతి వాలియా.. గూగుల్ క్లౌడ్‌లో ప్రోగ్రామ్ మేనేజర్‌గా పనిచేసేవారు. ఈ మధ్యనే ఆమె సంస్థలో ఐదో వార్షికోత్సవం పూర్తి చేసుకున్నారు. గూగుల్ ఇటీవల ప్రకటించిన లేఆఫ్స్‌లో ఆమె కూడా ఉద్యోగం కోల్పోయారు. తాను ఇంకో పది నిమిషాల్లో మీటింగ్‌లో పాల్గొనాల్సి ఉండగా తన కంప్యూటర్లో ‘యాక్సిస్ డినైడ్’ అని కనిపించడంతో ఆమె నిర్ఘాంతపోయారు. మొదట్లో నమ్మలేకపోయిన ఆమె తర్వాత విషయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె గూగుల్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గూగుల్‌లో ఉద్యోగం తన కలలన్నింటినీ సాకారం చేసిందని, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదగడానికి కంపెనీ తనకు సహాయపడిందని వివరించారు. (ఇదీ చదవండి: సూపర్ ఉంది కార్! విడుదలకు ముందే రోడ్డెక్కిన కియా ఈవీ9) అయితే తాను ఉద్యోగాన్ని కోల్పోవడాన్ని తన ఆరేళ్ల కూతురుకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను దీని బయట పడి ముందుకు వెళ్లగలను. అయితే ప్రస్తుతం అమ్మా నువ్వు ఎందుకు వర్క్ చేయడం లేదని నా చిన్నారి పాప అడిగితే వివరించడం చాలా నాకు చాలా కష్టతరమైనది’ అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. -
Layoffs: లింక్డ్ఇన్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్
సాక్షి, ముంబై: కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి ప్రపంచ దేశాలలో పేరు మోసిన చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. ఇందులో గూగుల్ వంటి బడా సంస్థలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలో ఉన్న లింక్డ్ఇన్ కూడా చేరిపోయింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'లింక్డ్ఇన్' రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ నుండి ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం ఇందులో ఎంత మంది ఉద్యోగులను తొలగించింది అనే దాని మీద ఎటువంటి స్పష్టమైన సమాచారం అందివ్వలేదు. నిజానికి 2023 ప్రారంభంలో టెక్ రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన చాలామందికి ఉద్యోగావకాశాలు కల్పించిన లింక్డ్ఇన్ (LinkedIn) ఇప్పుడు ఉద్యోగులను తొలగించి అందరికీ షాక్ ఇచ్చింది. 2023 ప్రారంభంలోనే 10 వేల మందిని తొలగించినట్టుగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్వయంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం తొలగించిన ఉద్యోగుల సంఖ్య, తొలగించడానికి గల కారణాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. -
అమెజాన్ ఉద్యోగంకోసం ఇల్లు,కార్లు అమ్మేశా, మీరు ఈ తప్పులు చేయకండి!
సాక్షి,ముంబై: టెక్ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు కలకలం రేపుతోంది. గ్లోబల్ ఆర్థికమాంద్యం ముప్పు, ఖర్చుల నియంత్రణలో భాగంగా దిగ్గజాల నుంచి స్టార్టప్లదాకా వందలాది ఉద్యోగులను ఇంటికి పంపిస్తుండటం ఆయా కుటుంబాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తోంది. తాజాగా కెన్యాకు చెందిన టెకీ టామ్ ఎంబోయా ఒపియో సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. మరో నాలుగు రోజుల్లో యూరప్‌కు మకాం మార్చాల్సి ఉండగా అమెజాన్ ఉద్యోగాన్ని కోల్పోయిన వైనాన్ని ఒపియో లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. అంతేకాదు కొన్ని గ్లోబల్ ఐటీ ఉద్యోగాలకు సంబంధించి చిట్కాలను షేర్ చేయడం విశేషంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే అమెజాన్ భారీ తొలగింపుల వల్ల ప్రభావితమైన 18వేల ఉద్యోగుల్లో తానూ ఒకడినని, ఐరోపా వెళ్లడానికి నాలుగు రోజుల ముందు తాను ఉద్యోగాన్ని కోల్పోయానంటూ కెన్యా టెకీ ఒపియో తెలిపారు. కుటుంబంతో సహా వెళ్లేందుకు, ఉన్న ఇల్లును, కార్లను అమ్మేశా. అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉండి ఉంటే ఈ సోమవారం (జనవరి16) అమెజాన్‌లో ఉద్యోగంలో చేరేవాడిని. కానీ పరిస్థితి తారుమారైంది. తర్జన భర్జన పడి, 6 నెలల నుంచి ఎంతో కష్టపడి ప్లాన్ చేసుకొని, ప్రయాణానికి సిద్ధమవుతుండగా, ఇంతలోనే ఉద్యోగాన్ని కోల్పోడంతో తన ఫ్యామిలీ కుప్పకూలి పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భారీ షాక్‌నుంచి తేరుకుని మళ్లీ కొత్తగా జీవితాన్ని ప్రారంభించాల్సి ఉందని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా టెకీలకు కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. (రెండు దశాబ్దాల ప్రయాణం.. ఇండియన్ టెకీ భావోద్వేగం) ‘‘వేరే దేశానికి ఉద్యోగ నిమిత్తం వెళ్లాలనుకుంటే..ముందు మీరు వెళ్లి..ఆ తరువాత ఫ్యామిలీని తీసుకెళ్లడం గురించి ఆలోచించండి...వీసా వచ్చే వరకు తమ ప్రస్తుత జాబ్‌కు రాజీనామా చేయకండి’’ (మాకు వీసా రావడానికి 5 నెలలకు పైగా పట్టింది. ఫ్యామిలీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, పోలీస్ క్లియరెన్స్, కొత్త పాస్‌పోర్ట్‌లు, EU వర్క్ ఆథరైజేషన్ అప్రూవల్స్, డాక్యుమెంట్ల నోటరైజేషన్ పొందడానికి చాలా సమయం పట్టింది). కరీయర్లో ఈ టైంలో ఇంతటి కష్టమైన పరిస్థితి వస్తుందని మాత్రం అస్సలు ఊహించ లేదు. కానీ జీవితం అంటే అదేకదా? మనకెదురైన అనుభవాలు, పరిస్థితులు, ఇతరులకు ఉదాహరణలుగా, పాఠాలుగా నిలుస్తాయంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా గత కొన్ని నెలల్లో ఉద్యోగాల కోతలను ప్రకటించిన పలు దిగ్గజ కంపెనీలలో అమెజాన్ కూడా ఒకటి. ట్విటర్, మెటా మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్న సంగతి తెలిసిందే. -
‘నా ఉద్యోగం ఊడింది..జీవితం తలకిందులైంది’
ఆర్ధిక మాంద్యం భయాలు,మార్కెట్లో నెలకొన్న అనిశ్చితులు కారణంగా ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. తాజాగా ఇన్వెస్ట్మెంట్ బ్యాకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ సాచ్స్ (జీఎస్) గ్రూప్ దాదాపు 3,200 ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. వారిలో ఖరగ్ పూర్లో ఐఐటీ పూర్తి చేసి, బెంగళూరు కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న శుభం సాహు ఒకరు. అయితే తన పుట్టిన రోజు జరుపుకున్న కొన్ని రోజుల తర్వాత ఊహించని విధంగా గోల్డ్‌మన్ సాచ్స్ పింక్ స్లిప్‌లు జారీ చేసింది. దీంతో సాహు.. గోల్డ్ మన్ సాచ్స్‌లో జాబ్ ఎక్స్పీరియన్స్, తొలగింపులపై లింక్డిఇన్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు. అందులో.. ‘వావ్ ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకంగా ప్రారంభమైంది. సుమారు 6 నెలల క్రితం అనుకుంటా జీఎస్‌లో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా జాయిన్ అయ్యా. నా బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్న కొన్ని రోజులకే ఫైర్ చేసినట్లు తెలిసింది. ఉద్యోగం చేసింది కొద్ది కాలమే అయినా జీఎస్‌కు కృతజ్ఞతలు. నేర్చుకోవడానికి, కెరియర్లో ఎదిగేందుకు అనువైన ప్రదేశం’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఉన్న జాబ్ పోయింది కాబట్టి.. కొత్త జాబ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించానంటూ లింక్డ్ఇన్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇలా సాహూయే కాదు.. గోల్డ్ మెన్ సాచ్స్ విధుల నుంచి తొలగించిన అనేక మంది హెచ్1 బీ వీసా హోల్డర్ ఉద్యోగులు కొత్త జాబ్ కోసం ప్రయత్నిస్తూ సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. మన దేశానికి చెందిన శిల్పి సోనీ టెక్సాస్ ప్రాంతంలో ఉన్న జీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌గా ఏడాదిన్నర పాటు పని చేసింది. త్వరగానే జీవితం తలకిందులు అయ్యిందంటూ తన మనసులో మాట బయట పెట్టింది. ‘నా కుటుంబంలో విదేశాలలో మాస్టర్స్ పూర్తి చేసిన మొదటి వ్యక్తిగా నేను గర్వపడుతున్నారు. నేను గ్రామీణ కుటుంబం నుండి వచ్చాను. కాబట్టి సామాజిక, ఆర్థిక పరిమితులను అధిగమించి ఇక్కడకు రావడానికి ఇది ఒక రోలర్ కోస్టర్‌గా మారింది. నేను ఎక్కడ నుండి జీవితాన్ని ప్రారంభించానో.. అక్కడే ఉద్యోగం పోగొట్టుకోవడం బాధగా ఉంది. కానీ యూఎస్‌లో నా ప్రయాణం ముగిసిపోలేదు.ఇంకా ఉంది. కాబట్టి ఉద్యోగ వేటను కొనసాగిస్తా’. కొత్త ఉద్యోగ అన్వేషణలో నా పరిమిత సమయాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు లింక్డిఇన్ పోస్ట్‌లో చెప్పారు. చదవండి👉 ఉద్యోగులకు దిగ్గజ కంపెనీ భారీ షాక్.. ఇక వేలాది మంది ఇంటికే -
కాళ్లకు చెప్పులు లేవ్.. ‘కుటుంబం ఆకలి తీర్చాలిగా!’
వైరల్: మంచి కంటే చెడునే తొందరగా మనిషి దృష్టిని ఆకర్షిస్తుంది. అందునా సోషల్ మీడియాలోనూ అదే తరహా కంటెంట్‌పై ఎక్కువగా చర్చ నడుస్తుంటుంది కూడా. అలా చేశారు.. ఇలా చేశారు అంటూ డెలివరీ బాయ్‌లు/ఏజెంట్ల గురించి రకరకాల కథనాలు వైరల్ అవుతుంటాయి. ఎంతసేపు నెగెటివ్ విషయాలేనా? అప్పుడప్పుడు మంచిపై కూడా ఓ లుక్కేద్దాం. తారిఖ్ ఖాన్ అనే వ్యక్తి.. లింకెడ్ఇన్లో ఈమధ్య ఓ పోస్ట్ షేర్ చేశారు. ఎలివేటర్లో ఉండగా ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్ ఆయన దృష్టిని ఆకర్షించారట. అతని కాళ్లకు చెప్పులు, షూస్ లేకుండా కనిపించాడట. ఎందుకలా వచ్చావ్? అని అడిగితే.. దారిలో చిన్నయాక్సిడెంట్ అయ్యిందని, చెప్పులు ఎక్కడో పడిపోయాయని, పైగా కాలికి గాయంతో వాపు వచ్చిందని, అందుకే వేసుకోలేదని చెప్పాడు ఆ డెలివరీబాయ్. అలాంటప్పుడు పని ఆపి కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని అతనికి సూచించాడు తారిఖ్. దానికి అతను నవ్వుతూ.. ‘నాకంటూ ఓ కుటుంబం ఉంది సార్. ఆ కుటుంబాన్ని పోషించుకోవాలి కదా’’ అంటూ లిఫ్ట్ బయటకు వెళ్లిపోయాడు. పోతూ పోతూ మర్యాదపూర్వకంగా శుభసాయంత్రం సార్ అని చెప్పివెళ్లిపోయాడు అని తారిఖ్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. కష్టపడి పనిచేయడానికి, అవసరమైన వేళలో నన్ను నేను ముందుకు వెళ్లడానికి ఇతనిలాంటి వ్యక్తులే నాకు స్ఫూర్తి అంటూ తారిఖ్ ఖాన్ లింకెడ్ఇన్లో ఆ పోస్ట్ షేర్ చేశారు. అంతేకాదు.. అతనికి సాయం కూడా అందించాడు. సదరు కంపెనీ కూడా ఆ డెలివరీ బాయ్ లాంటి వాళ్ల కష్టాన్ని గుర్తించాలని కోరాడు తారిఖ్. అతనికి ఎవరైనా సాయం చేయాలని అనుకుంటే.. తనకు సందేశం పంపాలని, ఆ డెలివరీ ఏజెంట్ పేటీఎం నెంబర్ ఇస్తానని చెప్పాడు తారిఖ్. ఎక్కడ జరిగిందో క్లారిటీ లేకపోయినా.. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంది. -
క్రెడ్, అప్‌గ్రాడ్, గ్రో.. స్పీడ్
న్యూఢిల్లీ: అనిశ్చిత పరిస్థితుల్లోనూ దేశీయంగా 25 స్టార్టప్‌లు నిలకడను ప్రదర్శించినట్లు ఆన్లైన్ ప్రొఫె షనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ పేర్కొంది. ఈ ఏడాది (2022)కి లింక్డ్ఇన్ తాజాగా రూపొందించిన స్టా ర్టప్ల జాబితాలో మూడు కంపెనీలు టాప్ ర్యాంకు ల్లో నిలిచాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సంస్థ క్రెడ్, ఆన్లైన్ హైయర్ ఎడ్యుకేషన్ సంస్థ అప్ గ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ గ్రో అగ్రస్థానాన్ని పొందినట్లు జాబితా తెలియజేసింది. 6.4 బిలియన్ డాలర్ల విలువతో క్రెడ్ తొలి టాప్ చైర్‌ను కైవసం చేసుకోగా.. అప్‌గ్రాడ్, గ్రో తదుపరి ర్యాంకుల్లో నిలిచాయి. కొత్త కంపెనీలు ప్రస్తుత ఏడాది జాబితాలో కొత్తగా ఈ గ్రోసరీ కంపెనీ జెప్టో(4వ ర్యాంకు), ఫుల్‌స్టాక్ కార్ల కొనుగోలు ప్లాట్‌ఫామ్ స్పిన్నీ(7వ ర్యాంకు), ఇన్సూరెన్స్ స్టార్టప్ డిటో ఇన్సూరెన్స్(12వ ర్యాంకు)కు చోటు లభించినట్లు లింక్డ్ఇన్ వెల్లడించింది. ఈ బాటలో ఫిట్నెస్ ప్లాట్‌ఫామ్ అల్ట్రాహ్యూమన్ 19వ స్థానాన్ని పొందగా, ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ లివింగ్ ఫుడ్ 20వ ర్యాంకులో నిలిచినట్లు పేర్కొంది. వినియోగదారులు ఇటీవల ఆరోగ్యకర జీవన విధానాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ సంస్థలు జాబితాలో కొత్తగా చోటు సాధించినట్లు వివరించింది. కాగా.. టాప్–10లో స్కైరూట్ ఏరోస్పేస్(5వ ర్యాంకు), ఎంబీఏ చాయ్ వాలా(6), గుడ్ గ్లామ్ గ్రూప్(8), గ్రోత్స్కూల్(9), బ్లూస్మార్ట్(10) చోటుచేసుకున్నాయి. ఇతర సంస్థలలో షేర్‌చాట్, సింపుల్, రేపిడో, క్లాస్‌ప్లస్, పార్క్‌ప్లస్, బ్లిస్‌క్లబ్, డీల్‌షేర్, ఫామ్‌పే, అగ్నికుల్ కాస్మోస్, స్టాంజా లివింగ్ పాకెట్ ఎఫ్ఎం, జిప్ ఎలక్ట్రిక్‌కు చోటు దక్కింది. ఇందుకు 2021 జులై నుంచి 2022 జూన్ వరకూ ఉద్యోగ వృద్ధి, నిరుద్యోగుల ఆసక్తి తదితర నాలుగు అంశాలను పరిగణించినట్లు లింక్డ్ఇన్ తెలియజేసింది. ఇక టాప్–25 స్టార్టప్‌లలో 13 బెంగళూరుకు చెందినవికావడం గమనార్హం! -
భారత్‌లో డిమాండ్ ఉన్న టాప్-10 నైపుణ్యాలేవో తెలుసా మీకు?
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో మారుతున్న అవసరాలకు అనుగుణంగా డిమాండ్ కలిగిన నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలకు వీలుంటుందని లింక్డ్ఇన్ నివేదిక తెలిపింది. ఈ తరహా నైపుణ్యాల విషయంలో ఉద్యోగార్థులకు సాయం చేయడం, వారి కెరీర్‌కు రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో.. ‘స్కిల్స్ ఎవల్యూషన్ 2022’, ‘ఫ్యూచర్ ఆఫ్ స్కిల్స్ 2022’ డేటాను లింక్డ్ఇన్ విడుదల చేసింది. లింక్డ్ఇన్కు భారత్‌లో 9.2 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. వారి నైపుణ్యాల డేటా ఆధారంగా.. వృద్ధి చెందుతున్న టాప్10 నైపుణ్యాలు, భవిష్యత్ నైపుణ్యాల వివరాలను తెలియజేసింది. గడిచిన ఐదేళ్ల కాలంలో అంతర్జాతీయంగా ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాల్లో 25 శాతం మార్పు చోటు చేసుకుందని.. 2025 నాటికి 41 శాతం మార్పు చోటు చేసుకుంటుందని తెలిపింది. భారత్‌లో వీటికి డిమాండ్.. భారత్‌లో డిమాండ్ ఉన్న టాప్-10 నైపుణ్యాల వివరాలను లింక్డ్ఇన్ తెలియజేసింది. బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఇంజనీరింగ్, ఎస్‌క్యూఎల్, సేల్స్, జావా, సేల్స్ మేనేజ్మెంట్, మైక్రోసాఫ్ట్ అజూర్, స్ప్రింగ్‌బూట్ డిమాండ్ నైపుణ్యాలుగా ఉన్నాయి. 2015 నుంచి చూస్తే కార్పొరేట్ సేవల పరంగా నైపుణ్యాల్లో 41.6 శాతం మార్పు చోటు చేసుకుంది. ఫైనాన్షియల్ రంగంలో.. జీఎస్టీ, టీడీఎస్, స్టాట్యుటరీ ఆడిట్, ఇన్కమ్ ట్యాక్స్‌కు సంబంధించి నైపుణ్యాలకు డిమాండ్ నెలకొంది. సాఫ్ట్వేర్, ఐటీ సేవల పరంగా పదింటికి గాను ఆరు నైపుణ్యాలు కొత్తవే ఉన్నాయి. మీడియా ఆన్లైన్ మాధ్యమంలో విస్తరిస్తున్న క్రమంలో.. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ (ఎస్ఈవో), వెబ్ కంటెంట్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, బ్లాగింగ్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. బ్రాంచ్ బ్యాంకింగ్, బ్రాంచ్ ఆపరేషన్స్ నైపుణ్యాలకు ఫైనాన్షియల్‌లో డిమాండ్ నెలకొంది. అంటే ఆఫ్‌లైన్ బ్యాంకింగ్ సేవలకు ఇప్పటికీ ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. హెల్త్‌కేర్ రంగంలో నైపుణ్యాల పరంగా 2015 తర్వాత 30 శాతం మార్పు చోటు చేసుకుంది. -
ఉపాధి, ఉత్పత్తులే లక్ష్యంగా... ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి
ప్రపంచాన్ని పట్టి పీడించిన కోవిడ్ సంక్షోభం తగ్గుముఖం పట్టడంతో పారిశ్రామికాభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఇప్పటికే రాష్ట్రంలో పెట్టిన యూనిట్లను త్వరిత గతిన పూర్తి చేసి ఉత్పత్తి ప్రారం భించేలా చర్యలు చేపట్టింది. ప్రతి నెలా రాష్ట్రంలో పరిశ్రమల ప్రారంభోత్స వాలు, శంకు స్థాపనలు నిర్వహించేలా పరిశ్రమల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది సత్ఫలితాల నిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు అంటే ఆర్నెల్ల వ్యవధిలో రాష్ట్రంలో 22 భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించగా, వీటి ద్వారా రూ. 20,682 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లు డీపీఐఐటీ తన తాజా నివేదికలో వెల్లడించింది. తొలి ఆరు నెలల్లో ఉత్పత్తి ప్రారంభించిన ప్రధాన కంపెనీల్లో గ్రాసిం ఇండస్ట్రీస్, పానా సోనిక్ లైఫ్ సైన్స్ సొల్యూషన్స్, కాప్రికాన్ డిస్టిలరీ, ఆంజనేయ ఫెర్రో అల్లాయిస్, నోవా ఎయిర్, తారక్ టెక్స్టైల్స్, టీహెచ్‌కే ఇండియా, కిసాన్ క్రాఫ్ట్, తారకేశ్వర స్పిన్నింగ్ మిల్ లాంటివి ఉన్నాయి. కోవిడ్ సంక్షోభం కుదిపివేసిన 2020, 2021తో పోలిస్తే ఈ ఏడాది తొలి ఆర్నెల్లలో రెట్టింపు పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. 2019లో 42 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా రూ. 9,840 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రాగా... 2021లో రూ. 10,350 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత రెండున్నరేళ్లలో మొత్తం 111 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా మొత్తం రూ. 40,872 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. పారిశ్రామికవేత్తల నుంచి కంపెనీ ఏర్పాటు ప్రతిపాదన అందిన నాటి నుంచి యూనిట్లో ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో చేయూత అందించేలా ‘వైఎస్సార్ ఏపీ వన్’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సదుపాయాలు, సేవలు అందిస్తోంది. తాజాగా విశాఖ వద్ద ప్రముఖ జపాన్ కంపెనీ యకహోమా గ్రూపు సంస్థ ఏటీసీ టైర్స్ యూనిట్ ప్రారంభం సందర్భంగా సంస్థ సీఈవో నితిన్... మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటును కొనియాడారు. సాధారణంగా అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుందనీ, రాష్ట్రంలో మాత్రం ‘సింగిల్ డెస్క్’ విధానంలో వేగంగా మంజూరయ్యాయనీ తెలిపారు. దీంతో రికార్డు సమయంలో 15 నెలల్లోనే తొలిదశ యూనిట్‌ను ప్రారంభించడమే కాకుండా రెండో దశ పనులు మొదలుపెట్టినట్లు చెప్పారు. కోవిడ్ సమయంలో లాక్డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించినట్లు నోవా ఎయిర్ ప్రతినిధులు వెల్లడించారు. 2020 డిసెంబర్లో నిర్మాణం ప్రారంభించి 11 నెలల్లోనే పనులు పూర్తి చేశామనీ, దీనివల్ల 250 టన్నుల ఆక్సిజన్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చిందనీ తెలిపారు. గత రెండున్నర ఏళ్లలో రాష్ట్రంలోకి కొత్తగా రూ. 24,956 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చినట్లు డీపీఐఐటీ నివేదిక పేర్కొంది. 2020 జనవరి నుంచి 2022 జూన్ నాటికి కొత్తగా 129 భారీ యూనిట్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఏడాది ఆరునెలల కాలంలో కొత్తగా 23 కంపెనీలు రూ. 5,856 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. పారిశ్రామికీకరణ విధానాలను పునఃసమీక్షిస్తూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) ఆధునిక సాంకే తిక పరిజ్ఞానాన్ని అందిస్తూ, ఉత్పత్తి పెంచుతూ, ఆర్థిక చేయూతను ఇస్తూ ఉద్యోగ, ఉపాధులు కల్పిస్తోంది ప్రభుత్వం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లలో 28,343 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించాయి. వీటిద్వారా రూ. రూ. 47,490.28 కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే కాకుండా 2,48,122 మందికి ఉపాధి లభించింది. ఇందులో 28,247 ఎంఎస్ఎంఈలు ఉండగా 96 భారీ యూనిట్లు ఉన్నాయి. ఇవి కాకుండా మరో రూ. 1,51,372 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 61 యూనిట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి ఉత్పత్తిని ప్రారంభిస్తే మరో 1,77,147 మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏడాది కొత్తగా 1.25 లక్షల ఎంఎస్ఎంఈలను ‘ఉదయం’ పోర్టల్‌లో నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటికే 40,000 యూనిట్లు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రతి విద్యార్థినీ అత్యుత్తమ నైపుణ్యాలతో ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి. ఉద్యోగాన్వేషణలో అత్యంత కీలకమైన సాఫ్ట్‌స్కిల్స్ పెంపొందించడంపై 1.62 లక్షల మంది విద్యార్థులకు ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ అందజేస్తోంది. రూ. 465 కోట్ల వ్యయమయ్యే ఈ శిక్షణను మైక్రోసాఫ్ట్ సంస్థ రాష్ట్ర విద్యార్థులకు దాదాపు రూ. 32 కోట్లకే అందిస్తోంది. అది కూడా విద్యార్థులపై నయాపైసా భారం లేకుండా ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ కోర్సులే కాకుండా ‘లింక్డిన్’ ప్లాట్‌ఫాంతో అనుసంధానం చేస్తున్నారు. దీని ద్వారా లింక్డిన్లోని టెక్నాలజీ, క్రియేటివిటీ, బిజినెస్ విభాగాల్లో 8 వేలకు పైగా కోర్సులు విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. (క్లిక్: చదువుల్లో ‘వివక్ష’ తొలగింపు కోసమే!) వచ్చే ఏడాది విశాఖపట్నంలో నిర్వహించే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు–2023లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా పటిష్ఠ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేలా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) భాగస్వామ్యంతో భారీస్థాయి పెట్టుబడి దారులతో జనవరి తర్వాత ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ ప్రయత్నం విజయవంతమైతే మరిన్ని ఉద్యోగాలు అందు బాటులోకి వస్తాయి. (క్లిక్: ఇంగ్లిష్ వెలుగులు చెదరనివ్వొద్దు) - డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ -
పని ప్రదేశంలో సరదాగా ఉండటంలో మనోళ్లే తోపులు!
ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉండదంటూ ఓ సినీ కవి ఎప్పుడో చెప్పాడు. కొత్తగా అదే విషయాన్ని లింక్డ్ఇన్ తేల్చి చెప్పింది. ఇందు కోసం ఇండియాతో పాటు వివిధ దేశాల్లో ఉన్న వృత్తి నిపుణుల నుంచి అభిప్రాయాలను సవివరంగా తీసుకుంది. వాటిని క్రోడీకరించి తాజాగా ఫలితాలు ప్రకటించింది. పని ప్రదేశాల్లో నవ్వుతూ జోకులేస్తూ తమ ఎమోషన్స్‌ని ప్రకటిస్తూ పని చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడతామంటూ ఇండియాలో 76 శాతం మంది ప్రొఫెషనల్స్ తేల్చి చెప్పారు. ముఖ్యంగా కరోనా తర్వాత ఆడుతూ పాడుతూ పని చేయడాన్ని ఇంకా ఆస్వాదిస్తున్నట్టు 86 శాతం మంది తెలిపారు. ఇలా చేయడం వల్ల ప్రొడక్టివిటీ ఇంకా పెరుగుతున్నట్టు తాము గుర్తించామన్నారు. సరదగా జోకులేస్తూ ఫన్నీ ఎన్విరాన్మెంట్లో పని చేయడాన్ని ఇష్టపడటంలో ఇండియన్లు, ఇటాలియన్లు మిగిలిన దేశాలకు చెందిన ప్రొఫెషన్స్‌ని వెనక్కి నెట్టారు. పని ప్రదేశంలో సరదాగా ఉండటాన్ని ఇష్టపడుతున్నట్లు ఈ రెండు దేశాల్లో 38 శాతం మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. రోజుకు కనీసం ఒక్క జోకైనా పని ప్రదేశంలో వేస్తుంటమని వీరు చెబుతున్నారు. ఇండియా, ఇటాలియన్ తర్వాత జర్మన్ (36 శాతం), బ్రిట్స్ (34 శాతం), డచ్ (33 శాతం), ఫ్రెంచ్ (32 శాతం), ఆస్ట్రేలియా (29 శాతం)లు నిలిచాయి. ఇండియాలో కూడా దక్షిణ భారతదేశానికి చెందిన ప్రొఫెనల్స్ జోకులు పేల్చడంలో అందరికంటే ముందు వరుసలో ఉన్నారు. ఇక్కడి ఫ్రొఫెషనల్స్ నుంచి సేకరించిన అభిప్రాయం ప్రకారం వర్క్‌ప్లేస్‌లో కనీసం ఒక్క జోకైనా వేసే వారిలో దక్షిణ భారతీయులు 43 శాతం ఉన్నారు. తర్వాతి స్థానాల్లో పశ్చిమ, తూర్పు, ఉత్తర భారతీయులు ఉన్నారు. పని ప్రదేశంలో నార్త్ఈస్ట్కు చెందిన వారు చాలా సీరియస్‌గా ఉంటారని తేలింది. జోకులేయడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందనే భావనలో 71 శాతం మంది భారతీయ ప్రొఫెషనల్స్ ఉన్నారు. 56 శాతం మంది పని ప్రదేశాల్లో చతుర్లాడటాన్ని నాన్ ప్రొఫెషనల్ థింగ్‌గా పరిగణిస్తున్నట్టు లింక్ట్‌ఇన్ సర్వే చెబుతోంది. అయితే పని ప్రదేశంలో సరదాగా ఉండటాన్ని తప్పుగా చూడటం అనే అలవాటు మన సొసైటీలో ఎక్కువగా ఉందనే అభిప్రాయం ఎక్కువైంది. ముఖ్యంగా పురుషలతో పోల్చినప్పుడు మహిళలకు ఈ సమస్య ఎక్కువగా ఉంది. చదవండి: భవిష్యత్తులో ఎక్కువ ఉద్యోగాలు ‘గిగ్’లోనే లభిస్తాయట -
జొమాటో బాస్‌కు యువతి వాలంటైన్స్ ప్రపోజల్!! నెటిజన్లు ఫిదా..కామెంట్ల వరద!
ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ యువతి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్‌కు ప్రపోజల్ చేసింది. ఆ ప్రపోజల్‌కు దీపిందర్ ఫిదా అయ్యారు. నెటిజన్లు సైతం ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. జొమాటో! నిన్న మొన్నటిదాకా అదొక జస్ట్ చిన్నకంపెనీ. మొబైల్ యాప్‌తో లక్షలాది మంది ఆకలి తీరుస్తుంది. హోటళ్లకు, కస్టమర్లకు వారధిగా మారి వేడి వేడి ఫుడ్‌ను క్షణాల్లో కస్టమర్లకు అందిస్తుంది. కట్ చేస్తే స్టార్టప్ నుంచి అతి తక్కువ కాలంలో లక్షల కోట్ల కంపెనీగా ఎదిగింది. ఇప్పుడు అదే కంపెనీలో తమిళనాడు సత్యబామ యూనివర్సిటీ సీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్ధి దీక్షితా బసు ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంది. వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా 14 పేజీల ఇంటర్న్‌షిప్ ప్రపోజల్‌ను తయారు చేసి జొమాటో సీఈవో దీపిందర్ గోయల్, జొమాటో డిజైన్ లీడ్ విజయ్ వర్మ, ఫుడ్ డెలివరీ సీఈవో రాహుల్ గంజూని ట్యాగ్ చేసింది. అంతే ఆమె ప్రపోజల్‌కు జొమాటో యాజమాన్యం స్పందించింది.ఇంటర్న్‌షిప్ చేసేందుకు అంగీకరించింది. అయితే ఇంతకీ యువతి ఇంటర్న్‌షిప్ ప్రపోజల్‌కు జొమాటో గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడానికి ఆమె ఏం చేసిందో తెలుసా? క్రియేటివిటీని జోడించింది. మూస ధోరణిలో కాకుండా కొత్తగా, కాస్త భిన్నంగా ఆలోచించింది. జొమాటో ప్రొడక్షన్ డిజైన్ డిపార్ట్మెంట్లో ఇంటర్న్‌షిప్ చేయాలని అనుకున్న దీక్షితా బసు జొమాటో కస్టమర్లకు మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చేలా కొన్ని సలహాలు, అదే విధంగా యాప్‌లో కొన్ని లోపాల్ని ఎత్తి చూపిస్తూ 14పేజీల ఇంటర్నషిప్ డ్రాఫ్ట్‌ను తయారు చేసింది.ఆ డ్రాఫ్ట్‌కు సుజనాత్మకతను జోడించి చిన్న కార్టూన్ బొమ్మతో ఇంట్రడ్యూజ్ చేస్తూ స్లైడర్‌తో కట్టిపడేసింది. ఆ స్లైడర్‌కు వాలంటైన్స్‌డే ఇంటర్న్‌షిప్ ప్రపోజల్ పేరు పెట్టి లింక్డిన్లో పోస్ట్ చేసి జొమాటో బాస్‌కు ట్యాగ్ చేసింది. అంతేనా "జొమాటో జింగ్" అనే కొత్త కాన్సెప్ట్ 15సెకన్ల వీడియోలో జొమాటోలో ఆర్డర్ పెట్టే కస్టమర్లకు తాను తెచ్చిన కాన్సెప్ట్ ఎలా ఉపయోగపడుతుందో వివరించింది. ప్రస్తుతం ఆమె చేసిన వాలెంటైన్ ప్రపోజల్ జొమాటో యాజమాన్యాన్ని కట్టిపడేసింది. నెటిజన్లు సైతం ఆ క్రియేటివిటీకి ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు ఆ పోస్ట్‌ను 16వేలకు పైగా లైకులు, 800 కామెంట్ల వర్షం కురిపించారు. దీక్షితా బసు ఇన్నోవేటీవ్ థాట్‌కు జొమాటో సీఈఓ గంజూ స్పదించారు. దీక్షితా బసు ప్రయత్నాన్ని అభినందిస్తున్నామని వ్యాఖ్యానించారు. త్వరలోనే జొమాటో యాజన్యం ఆమెతో సంప్రదింపులు జరుపుతుందని తెలిపారు. ఈ పోస్ట్‌పై విజయ్ వర్మ కూడా ‘గ్రేట్ వర్క్’ అంటూ స్పందించారు. -
2022లో ఉద్యోగం మారిపోవాలి..! కారణాలు ఇవే..
న్యూఢిల్లీ: మెజారిటీ నిపుణులు ఈ ఏడాది ఉద్యోగం మారిపోయే ఆలోచనతో ఉన్నారు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ భవిష్యత్తు పట్ల వారిలో ఎంతో ఆశావాదం కనిపించింది. నిపుణుల నెట్వర్క్ సంస్థ లింక్డ్ఇన్ ‘జాబ్ సీకర్ రీసెర్చ్’ పేరుతో సర్వే వివరాలను మంగళవారం విడుదల చేసింది. దేశంలో 82 శాతం నిపుణులు 2022లో ఉద్యోగాన్ని మార్చాలని యోచిస్తున్నట్టు వెల్లడించింది. ఎందుకని? అని ప్రశ్నించగా.. చేస్తున్న పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కష్టంగా ఉందని, తగినంత ధనం లేదని, కెరీర్లో మరింత ముందుకు వెళ్లాలని ఉందని ఇలా పలు రకాల సమాధానాలు సర్వేలో పాల్గొన్న వారి నుంచి వచ్చాయి. పని పరంగా సౌకర్యమైన ఏర్పాట్లే తమకు ప్రాధాన్య అంశంగా ఎక్కువ మంది చెప్పారు. చేస్తున్న పని – జీవన సమతుల్యత సరిగ్గా లేకపోవడం వల్ల పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగులు 1.3 రెట్లు అధికంగా ఉద్యోగాన్ని వీడే అవకాశం ఉందని ఈ సర్వే పేర్కొంది. పురుషుల్లో ఇలాంటి అభిప్రాయం కలిగిన వారు 28 శాతంగా ఉన్నారు. మెరుగైన వేతనం ఇస్తే ప్రస్తుత కంపెనీతోనే కొనసాగుతామని 49 శాతం మంది మహిళలు చెప్పగా.. పునరుషుల్లో ఇది 39 శాతంగానే ఉంది. ప్రాధాన్యతల్లో మార్పు.. ‘‘తమ కెరీర్ (వృత్తి జీవితం) పట్ల పునరాలోచించేలా, కొత్త ఉద్యోగ అవకాశాల అన్వేషణ, జీవిత ప్రాధాన్యతల విషయంలో పునరాలోచించుకునేలా మహమ్మారి చేసింది. నైపుణ్యాలే ఇప్పుడు నడిపించే సాధనం. నేడు సౌకర్యమే వారి మొదటి ప్రాధాన్యం’’ అని లింక్డ్ఇన్ న్యూస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అంకిత్ వెంగుర్లేకర్ తెలిపారు. ఐటీ, హెల్త్‌కేర్, బిజినెస్ డెవలప్మెంట్ విభాగాల్లో టెక్నాలజీ ఉద్యోగాలకు డిమాండ్ పెరిగినట్టు చెప్పారు. నిపుణులు తమ ఉద్యోగ బాధ్యతలు, కెరీర్ పట్ల నేడు ఎంతో నమ్మకంగా ఉన్నారని, మొత్తం మీద 2022లో ఉద్యోగాల లభ్యత మెరుగ్గా ఉంటుందని లింక్డ్ఇన్ తెలిపింది. ప్రశ్నించుకునే తత్వం ఉద్యోగుల్లో కెరీర్, భవిష్యత్తు పట్ల ఎంతో సానుకూలత కనిపించినప్పటికీ.. 71 శాతం మంది నిపుణులు గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో చేస్తున్న పనిలో తమ నైపుణ్యాలను ప్రశ్నించుకుంటున్నట్టు లింక్డ్ఇన్ సర్వే పేర్కొంది. తమ పనిపై సందేహం అన్నది గడిచిన రెండేళ్లుగా ఒంటరిగా పనిచేస్తుండడం వల్లేనని తెలిపింది. కరోనా మహ మ్మారి పని విషయంలో తమ నమ్మకాన్ని దెబ్బతీసినట్టు 33 శాతం మంది సర్వేలో పేర్కొన్నారు. -
మీరు ఈ టెక్నాలజీలో ఎక్స్‌పర్టా? అయితే మీకు జాబులే జాబులు!!
మార్కెట్లోకి కొత్తగా పుట్టుకొస్తున్న టెక్నాలజీకి అనుగుణంగా చేసే పనితీరు మార్చుకోవాల్సి ఉంటుంది. లేదని మూసధోరణిలో ఉంటే వెనకబడి పోతాం. ఇప్పుడు ఇదే ఫార్ములా ఉద్యోగాల విషయంలో వర్తిస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మార్కెట్ రీసెర్చ్ ప్రకారం..ప్రస్తుతం ఉద్యోగులు ఎంపిక చేసుకుంటున్న ఉద్యోగాలకంటే.. ట్రెండింగ్‌లో ఉన్న పలు టెక్నాలజీలలో నిష్ణాతులైన ఉద్యోగుల కోసం ఆయా సంస్థలు అన్వేషిస్తున్నట్లు తేలింది. ప్రముఖ ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్ లింక్డ్ఇన్ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ నివేదిక ఆధారంగా.. క్రిప్టోకరెన్సీ, బ్లాక్‌చెయిన్ రంగంలో పరిజ్ఞానం, నిపుణులైన అభ్యర్ధుల కోసం సంస్థలు వెతుకుతున్న ఉద్యోగాల జాబితా రోజురోజుకీ పెరిగిపోతున్నట్లు తేలింది. గతేడాది యూఎస్‌లో పై టెక్నాలజీ ఉద్యోగుల కోసం అన్వేషిస్తున్న శాతం 395పెరిగింది. ఇదే 2020తో పోలిస్తే 2021లో 5 రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు, సాధారణ సాంకేతిక రంగాల్లో ఉద్యోగ డిమాండ్ కేవలం 98శాతం పెరిగిందని లింక్డ్ఇన్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. జాబ్ డిస్క్రిప్షన్‌తో పాటు జాబ్ టైటిల్స్‌లో బిట్‌కాయిన్, ఎథెరియం, బ్లాక్‌చెయిన్, క్రిప్టోకరెన్సీ వంటి పదాల్ని జత చేస్తూ కంపెనీలు ఉద్యోగుల్నిఎంపిక చేసుకుంటున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో బే ప్రాంతం, టెక్సాస్‌లోని ఆస్టిన్, న్యూయార్క్ నగరం, మయామి ఫోర్ట్ లాడర్డేల్,డెన్వర్ ప్రాంతాల్లో క్రిప్టో టెక్నాలజీ జాబ్స్ అందించే ప్రధాన ప్రాంతాలుగా అవతరిస్తున్నాయి. 2020 నుంచి ట్రెండ్ మారింది 2020 నుంచి అమెరికాకు చెందిన పలు ప్రాంతాల్లో ఉద్యోగాల రూపకల్పన విషయంలో ట్రెండ్ మారినట్లు లింక్డ్ఇన్ తెలిపింది. 2020 నుంచి శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా, న్యూయార్క్ నగరం, నార్త్ కరోలినాలోని రాలీ డర్హామ్ చాపెల్ హిల్ ప్రాంతం, గ్రేటర్ ఫిలడెల్ఫియా, లాస్ ఏంజిల్స్ ప్రాంతాల్లో క్రిప్టోకరెన్సీతో పాటు అందుకు అనుబంధంగా ఉన్న టెక్నాలజీలో ఉద్యోగ అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. గతంలో బ్లాక్‌చెయిన్ డెవలపర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లను ఎక్కువగా కోరుకోగా..సాఫ్ట్వేర్, ఫైనాన్స్ లీడింగ్‌లో ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత అకౌంటింగ్, కన్సల్టింగ్, స్టాఫింగ్, కంప్యూటర్ హార్డ్‌వేర్ డెవలప్మెంట్ కోసం నిపుణుల కోసం మరిన్ని ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. అయితే ఈ నేపథ్యంలో లింక్డిఇన్ నివేదిక ఆధారంగా మార్కెట్ నిపుణులు పలు అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా అక్కడి పరిస్థితులకు తగ్గట్లు టెక్నాలజీలను ఫాలో అవ్వాలని సలహా ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు మార్కెట్ అవసరాల్ని అంచనా వేస్తూ..ఆయా టెక్నాలజీల్లో తర్ఫీదు పొందితే ఉద్యోగులు రాణిస్తారని సూచిస్తున్నారు. చదవండి: 'రండి బాబు రండి', పిలిచి మరి ఉద్యోగం ఇస్తున్న దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలు! -
చైనాకు మరో భారీషాక్, డ్రాగన్‌ను వదిలేస్తున్న టెక్ దిగ్గజ కంపెనీలు
హాంకాంగ్: చైనాలో ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో విదేశీ టెక్ దిగ్గజాలు ఒక్కొక్కటిగా అక్కడి నుంచి తప్పుకుంటున్నాయి. తాజాగా యాహూ కూడా చైనా మార్కెట్ నుంచి వైదొలిగింది. చైనాలో కార్యకలాపాలు కొనసాగించలేని విధంగా కఠినతరమైన పరిస్థితులు నెలకొనడమే ఇందుకు కారణమని పేర్కొంది. వాస్తవానికి ఇప్పటికే యాహూకి సంబంధించిన చాలా మటుకు సర్వీసులను చైనా నిలిపివేసింది. దేశీ దిగ్గజాలు సహా టెక్నాలజీ కంపెనీలపై నియంత్రణను ప్రభుత్వం ఇటీవలి కాలంలో మరింతగా పెంచుతోంది. ఈ పరిస్థితుల మధ్య చైనా నుంచి యాహూ నిష్క్రమించడం కేవలం లాంఛనంగా మాత్రమే మిగిలింది. ‘చైనాలో వ్యాపార నిర్వహణ, చట్టాల అమలుకు సంబంధించిన పరిస్థితులు కఠినతరంగా మారుతున్న నేపథ్యంలో నవంబర్ 1 నుంచి మా సర్వీసులు అందుబాటులో ఉండవు‘ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. చైనా అతి పెద్ద మార్కెట్ అయినప్పటికీ కఠినతరమైన ప్రభుత్వ విధానాలకు లోబడి పనిచేయాల్సి రావడం టెక్ కంపెనీలకు సవాలుగా మారిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్ చాన్నాళ్ల క్రితమే చైనా నుంచి తప్పుకుంది. మైక్రోసాఫ్ట్‌కి చెందిన ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాం లింక్డ్ఇన్ సైతం తమ చైనా సైట్‌ను మూసివేస్తున్నట్లు గత నెలలోనే వెల్లడించింది. చదవండి: భారత్ దెబ్బకు చైనా భారీగా నష్టపోనుందా? -
చైనాకు భారీ షాకిచ్చిన మైక్రోసాఫ్ట్..!
ప్రముఖ అమెరికన్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ చైనాకు గట్టి షాక్‌ను ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డ్ఇన్ కెరీర్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాంను మూసివేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. చైనా తెచ్చిన చట్టాలను కట్టుబడి ఉండటం సవాలుగా మారడంతో లింక్డ్ ఇన్ సేవలను మూసివేయాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకుంది. చైనా జర్నలిస్టుల ప్రోఫైళ్లను మైక్రోసాఫ్ట్ బ్లాక్‌చేసింది. దీంతో మైక్రోసాఫ్ట్‌ను అక్కడి ప్రభుత్వం ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. చదవండి: 4 నెలల పాటు ఉచిత ఇంటర్నెట్ సేవలు...! ఎలాగంటే... లింక్డ్ ఇన్ ప్లేస్‌లో...! లింక్డ్ ఇన్ సేవలను నిలిపివేసినప్పటికీ చైనా మార్కెట్లను వదిలివెళ్లడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధంగా లేనట్లు కన్పిస్తోంది. లింక్డ్ ఇన్ స్థానంలో ఇన్‌జాబ్స్‌ను త్వరలోనే మైక్రోసాఫ్ట్ లాంచ్ చేయనుంది. లింక్డ్ ఇన్‌లో మాదిరిగా ఇన్‌జాబ్స్‌లో యూజర్లు తమ అభిప్రాయాలను పంచుకొలేరు. లింక్డ్ ఇన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మొహక్ ష్రాఫ్ మాట్లాడుతూ.... అమెరికన్ కంపెనీలపై చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. అంతేకాకుండా పలు కంపెనీలను తమ అధీనంలో ఉంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని వెల్లడించారు. కంపెనీలపై డ్రాగన్ వీపరితబుద్ది..! గత కొద్ది రోజుల నుంచి దిగ్గజ కంపెనీలపై చైనా విరుచుకుపడుతుంది. ఆయా అమెరికన్ కంపెనీలను కట్టడి చేసేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలను చేస్తోంది. చైనా నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే కఠిన ఆంక్షలను పెడుతుంది. అమెరికన్ కంపెనీలపైనే కాకుండా స్వదేశీ కంపెనీలపై కూడా వీపరితంగా ప్రవర్తిస్తోంది. చదవండి: లీకుల పేరుతో ఉద్యోగులపై ఆపిల్ వేటు -
భారీగా ఉద్యోగాలు, ఈ రేంజ్లో శాలరీలు ఎప్పుడు ఇవ్వలేదేమో!
నిరుద్యోగులకు శుభవార్త. కరోనా కారణంగా నిలిపివేసిన ఉద్యోగాల నియామకాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోతో పాటు ఇతర సాఫ్ట్ వేర్ కంపెనీలు భారీ ఎత్తున నియామకాలు చేపట్టనున్నట్లు కొన్ని రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. 2020 గణాంకాల ప్రకారం..కోవిడ్ కారణంగా ఇండియాలో 12.2 కోట్ల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి. ఇప్పటి వరకు ఉద్యోగుల నియామకాల్ని నిలిపివేసిన సంస్థలు తిరిగి.. ఉద్యోగుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. దాదాపు ఒకటిన్నర సంవత్సరం తరువాత దేశంలో థర్డ్ వేవ్ రూపంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుందనే వార్తలు వస్తున్నా..పలు సెక్టార్లకు చెందిన సంస్థలు భారీ ఎత్తున నియామకాలు చేపట్టనున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. గత కొద్ది కాలంగా కరోనా ఇండియన్ జాబ్ మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న అంశంపై విశ్లేషణ చేస్తున్న జాబ్ సైట్ ఇండీడ్ రిపోర్ట్ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. టెక్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ప్రస్తుతం జాబ్ మార్కెట్లో టెక్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఉన్నట్లు ఇండీడ్ తెలిపింది. 400శాతం వరకు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల డిమాండ్ పెరిగినట్లు ఇండీడ్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. లింక్డ్ఇన్ జాబ్ కోసం అప్లయ్ చేస్తే టెక్ ఉద్యోగాలకు ఏ విధమైన డిమాండ్ ఉందో తెలుస్తోందని చెప్పింది. అంతేకాదు 2020లో మహమ్మారి ప్రారంభంలో పలు రంగాల్లో అనిశ్చితి నెలకొందని, జూన్ 2020లో కరోనా ఫస్ట్ వేవ్ గరిష్ట స్థాయికి చేరడానికి కొన్ని నెలల ముందు ఉద్యోగుల నియామకం 50 శాతం తగ్గినట్లు వెల్లడించింది. వీటితో పాటు అప్లికేషన్ డెవలపర్, లీడ్ కన్సల్టెంట్, సేల్స్‌ఫోర్స్ డెవలపర్,సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ వంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న జాబ్స్‌కు డిమాండ్ 150-300 శాతం మధ్య పెరిగింది. 70-120 శాతం జీతాల పెంపు సంస్థలు ఉద్యోగుల్ని నియమించడమే కాదు. గతేడాదితో పాలిస్తే ఇప్పుడు భారీ ఎత్తున జీతాలు ఇస్తున్నాయి.ఉద్యోగులు ఎక్కువ జీతాలు ఆశించడమే కాదు..అదే స్థాయిలో కంపెనీలు శాలరీలు ఇచ్చేందుకు వెనకడుగు వేయడంలేదు.పుల్ స్టాక్ ఇంజనీర్లకు కంపెనీలు 70-120 శాతం వరకు జీతాలు పెంచుతున్నాయని నివేదికలో పొందుపరిచింది. ఇక మిగిలిన రంగాలకు చెందిన ఉద్యోగుల జీతాల పెంపు 20-30 శాతంగా ఉంది. ఉద్యోగులకు ఇదే మంచి సమయం ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కెరీర్ గ్యాప్ తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మహిళా నిపుణుల కోసం అతిపెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించినట్లు ఇటీవల ప్రకటించింది. టీసీఎస్‌తో పాటు ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు దేశం అంతా టెక్ ఉద్యోగుల్ని భారీ ఎత్తున రిక్రూట్ చేసుకుంటున్నాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న, మంచి ఉద్యోగం కావాలనుకునే అభ్యర్ధులకు నైపుణ్యాలు ఉంటే ఇదే మంచి సయమం. బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ఐటి నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉందని ఇండీడ్ తన నివేదికలో స్పష్టం చేసింది. చదవండి: నియామకాలు పెరుగుతున్నాయ్, ఆ రంగాలే కీలకం -
నియామకాలు పెరుగుతున్నాయ్, ఆ రంగాలే కీలకం
న్యూఢిల్లీ:నియామక కార్యకలాపాలు స్థిరమైన రికవరీలో ఉన్నాయని లింక్డ్ఇన్ ఇండియా తెలిపింది. కోవిడ్ ముందస్తు కాలం 2019తో పోలిస్తే 65 శాతం అధికంగా నమోదయ్యాయని వివరించింది. ‘2021 ఏప్రిల్‌లో తిరోగమన వృద్ధి నమోదైంది. ఆ తర్వాతి నుంచి రికవరీ ప్రారంభమైంది. 2019తో పోలిస్తే ఈ ఏడాది మే చివరినాటికి 35 శాతం, జూన్ 42, జూలై చివరినాటికి 65 శాతం నియామకాలు అధికమయ్యాయి. ఒక సంవత్సరం స్తంభింపజేసిన తర్వాత ఐటీ, తయారీ, హార్డ్‌వేర్ వంటి పెద్ద రంగాలు నియామకాలను పెంచడం ప్రారంభించాయి. నియామకాలు క్రమంగా అధికం అవుతూనే ఉంటాయని అంచనా. ఉద్యోగాలు చేసేవారిలో కొత్తగా ప్రవేశించే వ్యక్తుల కంటే.. జాబ్ మారుతున్నవారే అధికం. ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడం కొనసాగుతున్నందున కొత్త, అభివృద్ధి చెందుతున్న ఉద్యోగాలలో అవకాశాలపై దృష్టిసారిస్తున్నారు. కోవిడ్ కారణంగా ఉద్యోగాలు మారే వ్యక్తులలో భారీ తగ్గుదల ఏర్పడింది. చదవండి: మెరుగుపడుతున్న రాష్ట్రాల ఆదాయాలు! -
లక్షల్లో వేతనాలు కావాలంటే ఈ స్కిల్స్ ఉండాల్సిందే.!
న్యూ ఢిల్లీ : కోవిడ్ 19 అదుపులో ఉండటంతో ఆర్థిక కార్యకాపాలు పుంజుకుంటున్నాయి. నియామకాలు చేపట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. కరోనా కారణంగా చాలా కాలంగా ఉద్యోగాన్వేషణలో ఉన్న వారు తమ అర్హతకు తగ్గ జాబులు వెతుక్కునే పనిలో పడ్డారు. అయితే ప్రస్తుం జాబ్మార్కెట్లో ఏ తరహా కోర్సులు, స్కిల్స్ ఉన్న వారికి డిమాండ్ ఉందనే అంశంపై లింక్డ్ఇన్ సర్వే చేపట్టింది. ఈ స్కిల్స్‌కే డిమాండ్ కరోనా తర్వాత అన్ని రంగాలు ఒకే సారి కోలుకోలేదు. ఎంటర్టైన్ మెంట్, నిర్మాణ రంగం ఇంకా గాడిన పడాల్సి ఉండగా ఐటీ రంగం సాధారణ స్థికి చేరుకుంటోంది. అయితే స్థూలంగా చూస్తే మార్కెట్లో నియామకాల సంఖ్య పెరిగిందని లింక్డ్ఇన్ సర్వేలో తేలింది. అదే సమయంలో ఉద్యోగాలను అన్వేషించే వారి సంఖ్య కూడా వృద్ధి కనిపిస్తోంది. ప్రస్తుతం ఐటీ సెక్టార్లోనే ఎక్కువ నియామకాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులోనూ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ నైపుణ్యాలు ఉన్న యువ వర్కర్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని లింక్డ్ఇన్ అంటోంది. ఈ స్కిల్స్ ఉన్నవారికి భారీ ప్యాకేజీలు ఇచ్చేందుకు కంపెనీలు వెనకడుగు వేయడం లేదని, భారీ జీతం రావాలంటే హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ నైపుణ్యాలు తప్పని సరి అని లింక్డ్ఇన్ సూచిస్తోంది. పెరుగుతున్న నియామకాలు కరోనా సంక్షోభానికి ముందు నాటి 2019తో పోలిస్తే నియామకాల రేటు ఈ ఏడాది జూన్‌లో 42 శాతం అధికంగా నమోదయినట్టు లింక్డ్ఇన్ ఇండియా తెలిపింది. సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో హైరింగ్ కాస్త తగ్గినా. మే వచ్చేప్పటికీ సాధారణ స్థితికి చేరుకోవడం మొదలైనట్టు తెలిపింది. మేలో 35 శాతం, జూన్‌లో 42 శాతం నియామకాలు రేటు అధికంగా నమోదు అయ్యాయి. నియామకాల రేటు ప్రస్తుతం దేశీయంగా జరుగుతున్న నియామకాలను లింక్డ్ఇన్లో నమోదు చేసుకున్న ఉద్యోగార్థుల సంఖ్యతో భాగించగా వచ్చిన అంకెను హైరింగ్ రేటుగా పరిగణలోకి తీసుకుని లింక్డ్ఇన్ ఈ నివేదిక రూపొందించింది. చాలాకాలంగా నిలిచిపోయిన నియామకాలను కంపెనీలు మళ్లీ చేపడుతుండటం వల్ల హైరింగ్ రేటు పెరుగుతున్నట్టు పేర్కొంది. -
జూమ్ ఇతరులతో మీ డేటాను పంచుకుంటుందా..! ఎంతవరకు నిజం..!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా రాకతో వీడియో సమావేశాల యాప్ జూమ్ గణనీయంగా అభివృద్ధి చెందింది. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులను నిర్వహించడంలో, ఉద్యోగులకు ఆఫీసు కార్యకలాపాలకు జూమ్ యాప్ ఎంతగానో ఉపయోగపడింది. జూమ్ యాప్‌కు పోటిగా పలు దిగ్గజ కంపెనీలు సైతం సమావేశాల కోసం సపరేటుగా యూజర్లకోసం యాప్‌లను తీసుకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా జూమ్ యాప్‌ను ఎన్నో కోట్ల మంది వాడుతున్నారు. అయితే జూమ్ తన యూజర్ల డేటాను ఇతర థర్డ్ యాప్స్‌తో పంచుకుంటోందని యూఎస్ సంస్థలు నిగ్గుతేల్చాయి. జూమ్ తన యూజర్ల డేటాను ప్రముఖ దిగ్గజ సంస్థలు ఫేస్బుక్, గూగుల్, లింక్డిన్తో పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. జూమ్ యూజర్ల ప్రైవసీని దెబ్బతీసింనందుకు గాను యూఎస్ న్యాయస్థానం సుమారు 85 మిలియన్ డాలర్ల(రూ. 630 కోట్లు)ను జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని చెల్లించడానికి జూమ్ యాజమాన్యం ఒప్పకున్నట్లు తెలుస్తోంది. జూమ్ సరైన భద్రతా పద్ధతులను పాటించక పోవడంతో హ్యాకర్లు జూమ్ సమావేశాలను హ్యక్ చేయడం సింపుల్ అవుతోంది. దీనినే జూమ్‌బాంబింగ్ అని అంటారు. జూమ్ బాంబింగ్ అనేది బయటి వ్యక్తులు జూమ్ సమావేశాలను హైజాక్ చేసి, అశ్లీలత ప్రదర్శించడం, జాత్యహంకార భాషను ఉపయోగించడం లేదా ఇతర కలవరపెట్టే కంటెంట్‌ను పోస్ట్ చేయడం. కాగా , యూఎస్‌లో కాలిఫోర్నియా శాన్‌జోస్‌లోని యూఎస్ డిస్ట్రిక్ న్యాయమూర్తి లూసీ కో ప్రిలిమినరీ సెటిల్మెంట్ ఫైల్‌పై ఆమోదం తెలపాల్సి ఉంది. మీటింగ్ హోస్ట్‌లు లేదా ఇతర పార్టిసిపెంట్లు మీటింగ్‌లలో థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగించినప్పుడు యూజర్లను హెచ్చరించడం, ప్రైవసీ, డేటా హ్యాండ్లింగ్‌పై ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణను అందించడం వంటి భద్రతా చర్యలకు జూమ్ అంగీకరించింది. శాన్ జోస్ ఆధారిత కంపెనీ ప్రిలిమినరీ సెటిల్మెంట్ ఫైల్‌ను పరిష్కరించడానికి అంగీకరించడంలో తన తప్పును ఖండించింది. జూమ్ ఆదివారం చేసిన ఒక ప్రకటనలో.. గోప్యత, సెక్యూరిటీ విషయంలో యూజర్లు మాపై ఉంచే విశ్వాసాన్ని తీవ్రంగా పరిణిస్తామని జూమ్ పేర్కొంది. కోవిడ్-19 మహామ్మారి సమయంలో యూజర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. -
మైక్రోసాప్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్
-
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్!
మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ అంధించింది. ఈ కరోనా మహమ్మరి కారణంగా ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొనడం వల్ల 1,500 డాలర్లు(రూ.1.12 లక్షలు) సింగిల్ టైమ్ బోనస్ గా ఇస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా కష్టాలతో గడిచిన ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో ఉద్యోగుల చేసిన కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్, కాథ్లీన్ హొగన్ ఈ రోజు ఉద్యోగులకు ఈ సింగిల్ టైమ్ బోనస్ ను ప్రకటించారు. ఈ బోనస్ యుఎస్, అంతర్జాతీయంగా అర్హులైన ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. ఈ బోనస్ మార్చి 31, 2021కు ముందు కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి దిగువన ఉన్న సిబ్బంది అందరికీ బహుమతిగా అందించింది. ఇందులో పార్ట్ టైమ్ వర్కర్లు కూడా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 1,75,508 మంది ఉద్యోగులు ఉన్నారు. కానీ మైక్రోసాఫ్ట్ అనుబంధ సంస్థలైన లింక్డ్ ఇన్, గిట్ హబ్, జెనిమాక్స్ ఉద్యోగులకు ఈ బోనస్ కు అర్హులు కాదు. ఈ బోనస్ కోసం సుమారు $200 మిలియన్ల డాలర్లు కేటాయించినట్లు సంస్థ పేర్కొంది. ఇంతక ముందు ఫేస్బుక్ తన 45,000 ఉద్యోగులకు ఒక్కొక్కరికి $1,000 బహుమతిగా ఇవ్వగా, అమెజాన్ ఫ్రంట్ లైన్ కార్మికులకు $300 సెలవు బోనస్, బీటీ గ్రూప్ తన 60,000 ఉద్యోగులకు £1,500(సుమారు $2,000) బహుమతిగా ఇచ్చింది. -
ఆన్ లైన్ లో లింక్డిన్ యూజర్ల డేటా లీక్
-
ఆన్లైన్ అంగట్లో లింక్డిన్ యూజర్ల డేటా..!
వాషింగ్టన్: ఉపాధి ఆధారిత ఆన్లైన్ సేవలను అందించే లింక్డిన్ యూజర్ల డేటా ఆన్లైన్లో లీకైనట్లు తెలుస్తోంది. సుమారు 700 మిలియన్ల లింక్డిన్ యూజర్ల డేటా ఆన్లైన్లో బహిర్గతమైనట్లు వార్తలు వస్తున్నాయి. హాకర్లు యూజర్ల డేటాను ఆన్లైన్లో అమ్మకానికి ఉంచారని తెలుస్తోంది. లింక్డిన్ సుమారు 756 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉండగా..సుమారు 92 శాతం వరకు వినియోగదారుల సమాచారం ఆన్లైన్లో లీకైంది. వినియోగదారుల ఈ మెయిల్, ఫోన్ నంబర్, పనిచేసే ఆఫీసు, పూర్తి పేరు, ఖాతా ఐడీలతో పాటుగా యూజర్ల సోషల్ మీడియా ఖాతాల లింకులు, వ్యక్తిగత వివరాలు లీకైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యూజర్ల సాలరీ వివరాలు కూడా లీకైనట్లు తెలుస్తోంది. కాగా తాజాగా లింక్డిన్ డేటా లీక్‌పై స్పందించింది. లింక్డిన్ ఒక ప్రకటనలో.. ‘యూజర్ల డేటా లీక్ జరగలేదని పేర్కొంది. కానీ ఇతర మ్యాడుల్ నెట్వర్స్క్తో హాకర్లు డేటాను పొందారని లింక్డిన్ తెలిపింది. కాగా డేటా లీక్‌పై లింక్డిన్ ప్రతినిధులు దర్యాప్తు చేపడుతున్నారని వివరించింది. కంపెనీ నిర్వహించిన ప్రాథమిక విచారణలో హాకర్లు ఇతర వనరులను ఉపయోగించి డేటాను పొందారని తెలిపింది. లింక్డిన్ తన యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. యూజర్లు తమ ఖాతాలకు కచ్చితంగా 2FA టూ ఫ్యాక్టర్ అథణ్టికేషన్ను ఉండేలా చూసుకోవాలని లింక్డిన్ సూచించింది. సుమారు ఒక మిలియన్ యూజర్ల డేటాను హాకర్లు డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది. చదవండి: Reliance: అబుదాబి కంపెనీతో భారీ డీల్ -
వారం రోజుల పెయిడ్ లీవ్ : ఉద్యోగులకు పండగే
సాక్షి, న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ సోషల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. సంస్థంలోని ఫుల్ టైం ఉద్యోగులకు ఏకంగా వారం రోజుల పాటు పెయిడ్ లీవ్ ఇస్తున్నట్టు ప్రకటించింది. కష్టించిన పనిచేసిన తమ సిబ్బంది ఒత్తిడిని అధిగమించి, రిలాక్స్ అయ్యి, తిరిగి రెట్టించిన ఉత్సాహంతో రీఛార్జ్ అయ్యేందుకు వీలుగా ఈ వెసులుబాటును కల్పిస్తోంది. వచ్చే సోమవారం (ఏప్రిల్ 5 ) నుంచి ఇది అమలు కానుంది. తద్వారా దాదాపు 15,900 మంది పూర్తికాల ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని లింక్డ్ఇన్ "రెస్టప్!" అంటూ వారం రోజుల సెలవును ఉద్యోగులకు కల్పిస్తోది. ఈసందర్భంగా లింక్డ్ఇన్ కీలక ఉద్యోగి తుయిలా హాన్సన్ మాట్లాడుతూ, సంస్థ కోసం కష్టపడి పనిచేసిన తమ ఉద్యోగులకు విలువైన సమయాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. వారు మంచి సమయం గడపాలని భావిస్తున్నామని తెలిపారు. సెలవు నుంచి తిరిగి వచ్చిన ఉద్యోగులందరూ పూర్తి శక్తితో పనిచేయాలని కోరుకుంటున్నామని చెప్పారు. అలాగే మెయిట్ టీం ఈ వారంలో పని చేస్తారు. ఆ తరువాత వారు కూడా ఈ సెలవును తీసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయంతో ఉద్యోగులు సేద తీరనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబరు వరకు లింక్డ్ఇన్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం విధానాన్ని కొనసాగించుకోవచ్చు. అంతేకాదు సగానికి సగంమందికి ఇంటినుంచే పనిచేసే విధానాన్ని ప్రామాణింగా మార్చాలని కూడా యోచిస్తోంది. కాగా మైక్రోసాఫ్ట్ 2016 మధ్యలో లింక్డ్ఇన్ను 26.2 బిలియన్లకు కొనుగోలు చేసింన సంగతి తెలిసిందే. -
‘స్కిల్డ్’లో గ్రేటర్ నం.3
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఆకర్షించటంలో దేశంలో మొదటి మూడు నగరాల్లో హైదరాబాద్ స్థానం దక్కించుకుంది. ఈ విషయంలో దేశ రాజధాని ఢిల్లీ తొలిస్థానంలో నిలిచింది. ద్వితీయస్థానంలో గ్రీన్‌సిటీ బెంగళూరు నిలిచింది. నైపుణ్యం గల ఉద్యోగులకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్న నగరాలపై అతిపెద్ద ’ప్రొఫెషనల్ నెట్వర్క్’అయిన ‘లింక్డ్ఇన్’ తాజా అధ్యయనం ‘భారత ఉద్యోగస్తుల నివేదిక’లో ఈ వివరాలు వెల్లడించింది. కొత్తగా ఏఏ రంగాల్లో ఉద్యోగాలు అధికంగా వస్తున్నాయి.. ఎటువంటి నిపుణులకు గిరాకీ ఉంది.. దేశంలోని ఏఏ నగరాలు సమర్థులైన ఉద్యోగులను ఆకర్షించగలుగుతున్నాయి... అనే విశేషాలతోఈ నివేదికను లింక్డ్ఇన్ రూపొందించింది. యువ ఉద్యోగులు భారత్‌లోనే అధికం.. ప్రపంచవ్యాప్తంగా యువ జనాభా, యువ ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో ఉన్న దేశం భారతేనని ఈ నివేదిక పేర్కొంది. ఉద్యోగాలు, ఉద్యోగస్తుల తీరుతెన్నులను ప్రతిబింబిస్తూ ఈ నివేదిక రూపొందించినట్లు లింక్డ్ఇన్ ఇండియా పేర్కొంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్ రంగాలకు 2020 తొలి త్రైమాసికంలో విశేష గిరాకీ కనిపించినట్లు తెలిపారు. నైపుణ్యం కలిగిన నిపుణులను ఆకర్షించటంలో ముందున్న నగరాలు ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ తొలిమూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్ చండీగఢ్, వడోదర, జయపుర ఉన్నాయి. ఈ రంగాల్లోనే అత్యధిక కొలువులు.. 1.సాఫ్ట్వేర్, ఐటీ సేవలు 2.తయారీ రంగం, ఫైనాన్స్, కార్పొరేట్ సేవలు 3.విద్యా రంగం యువతలో డాలర్ డ్రీమ్స్.. దేశంలో పలు మెట్రో నగరాల్లో విస్తృత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నప్పటికీ యువతలో డాలర్ డ్రీమ్స్ కనుమరుగు కాలేదని ఈ నివేదిక స్పష్టం చేసింది. కాస్తోకూస్తో చదువుకొని విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగంలో స్ధిరపడాలని కోరుకునే యువకుల సంఖ్య ఇటీవల కాలంలో పలు నగరాల్లో పెరిగిపోతోందని ఈ నివేదిక వెల్లడించింది. యువత ప్రధానంగా ఏ దేశాలకు వెళుతున్నారనేది పరిశీలించగా.. మొదట అమెరికా ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో యూఏఈ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా దేశాలున్నాయి. ఈ రంగాల్లో నైపుణ్యాలకు భలే గిరాకీ.. 1. ఉత్పత్తి, నిర్మాణ రంగం, విద్యుత్, మైనింగ్ రంగాల్లో ఆటో క్యాడ్ నిపుణులకు గిరాకీ ఉంది 2. మేనేజ్మెంట్ ఉద్యోగార్థుల్లో నాయకత్వ లక్షణాలు, కస్టమర్ సర్వీస్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సామర్థ్యాలు ప్రదర్శించే వారికి పెద్దగా వెతుక్కునే పనిలేకుండానే ఉద్యోగాలు లభించే పరిస్థితి ఉంది. 3. ముంబై, ఢిల్లీ నగరాల్లో మేనేజ్మెంట్ రంగంలో అధికంగా ఉద్యోగాలున్నాయి. ఐటీ ఉద్యోగాలకు బెంగళూరు సిటీ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని తాజా నివేదిక వెల్లడించింది. -
లింక్డ్ఇన్ సీఈవో రాజీనామా
సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సొంతమైన లింక్డ్ఇన్ సీఈవో జెఫ్ వీనర్(49) తన పదవికి రాజీనామా చేశారు. సీఈవోగా 11 సంవత్సరాల పాటు సంస్థకు సేవలందించిన వీనర్ తాజాగా ఈ పదవి నుంచి తప్పుకున్నారు. జెఫ్ వీనర్ ఇకపై ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అవుతారనీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ర్యాన్ రోస్లాన్ స్కీ జూన్ 1వ తేదీనుంచి సీఈవోగా బాధ్యలను స్వీకరించనున్నారని మైక్రోసాఫ్ట్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. లింక్డ్ఇన్లో 10 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న ర్యాన్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకుకు రిపోర్ట్ చేస్తారని వెల్లడించింది. తన రాజీనామాపై స్పందించిన వీనర్ గత పదకొండు సంవత్సరాలు తన జీవితంలో గొప్ప వృత్తిపరమైన అనుభవాన్నందించాయని పేర్కొన్నారు. ఇందుకు లింక్డ్ఇన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వైస్ ప్రెసిడెంట్‌గా కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు ఉత్సుకతగా ఎదురు చూస్తున్నానంటూ ట్వీట్ చేశారు. తదుపరి సీఈవో ర్యాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 2008లో లింక్డ్ఇన్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించగా, రోస్లాన్ స్కీ 2009లో కంపెనీలో చేరారు. కాగా ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్ తొలిసారి 2011లో పబ్లిక్ ఆఫరింగ్ (స్టాక్)కు వచ్చింది. మైక్రోసాఫ్ట్ 2016 లో కొనుగోలు చేసింది. లింక్డ్ఇన్ ఆదాయం 12 నెలల్లో 78 బిలియన్ డాలర్ల నుండి 7.5 బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని కంపెనీ తెలిపింది. సంస్థలో సభ్యులు కూడా 33 మిలియన్ల నుండి 675 మిలియన్లకు పైగా పుంజుకుంది. Couldn't be more excited to start my next play as LinkedIn's Executive Chairman on June 1st. Congrats to @Ryros on becoming our next CEO. https://t.co/txanyXU3Xh — Jeff Weiner (@jeffweiner) February 5, 2020 -
దూసుకుపోతున్న ‘లింక్డ్ఇన్’
ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టిన ‘లింక్డ్ఇన్’ సోషల్ మీడియాకు భారత్‌లో ఆదరణ పెరుగుతోంది. గత 20 నెలల కాలంలో దీని యూజర్లు రెట్టింపు అయ్యారు. 2018, జనవరి నెలలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో ఆరు శాతం యూజర్లు ఉండగా, వారి సంఖ్య 2019, ఏప్రిల్ నాటికి 15 శాతానికి పెరిగినట్లు వ్యాపార విశ్లేషణ సంస్థ ‘కాలాగోట్’ తెలిపింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా 66 కోట్ల మంది వినియోగదారులు ఉండగా, భారత దేశంలో 6.20 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. భారత్‌లో ఇటీవల దీని వినియోగం భారీగా పెరగడానికి కారణం, భారత్‌లో అసాధారణంగా నిరుద్యోగ సమస్య పెరగడమే. దేశంలో మున్నెన్నడు లేనంతగా నిరుద్యోగుల శాతం 8.1 శాతం పెరిగినట్లు ఇటీవలి గణాంకాలు తెలియజేస్తున్నాయి. ‘జాబ్ ఫ్లాట్‌ఫారమ్’ ఉండడంతో భారతీయ నిరుద్యోగులందరు ‘లింక్డ్ఇన్’ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు మంచి ఉద్యోగావకాశాల కోసం ఈ యాప్‌ను ఆశ్రయించిన నిరుద్యోగులు ఇప్పుడు ఏదో ఒక ఉద్యోగం కోసం ఆశ్రయిస్తున్నారని స్వతంత్ర టెక్–విధాన కన్సల్టెంట్ ప్రశాంతో కే. రాయ్‌తోపాటు పలువురు నిపుణులు తెలిపారు. అయితే ఇప్పటికీ తమకు కావాల్సిన ఉద్యోగులు ఈ యాప్ ద్వారా దొరకడం లేదని, 20 నుంచి 30 శాతం మంది ఉద్యోగులను ఇతర మార్గాల్లో వెతుక్కోవాల్సి వస్తోందని పలు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ యాప్‌ను పేటీఎం వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ శర్మ, బైకాన్ వ్యవస్థాపకులు కిరణ్ మజుందార్ షాలతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బాలీవుడ్ సూపర్ స్టార్ ప్రియాంక చోప్రాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇతర సోషల్ మీడియాలాగా వినోదం కోసం, పోటీ కోసం కాకుండా వృత్తిపరమైన అంశాలను షేర్ చేసుకోవడానికే దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అందుకని ఇతర సోషల్ మీడియాలతో దీనికి పోటీయే లేదు. -
‘లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్’లో మోదీ, ప్రియాంక
ముంబై: ప్రముఖ సామాజిక మాధ్యమం లింక్డ్ ఇన్ అత్యంత శక్తిమంతమైన ప్రొఫైల్స్ జాబితా లో ప్రధాని నరేంద్రమోదీ, నటి ప్రియాంక చోప్రాలు చోటు సం పాదించారు. 2017 సంవత్సరానికి గాను భారత్‌కు సంబంధించి అత్యంత శక్తిమంతమైన ప్రొఫైల్స్, ఎక్కువమంది చూసిన ప్రొఫైల్స్ జాబితాను లింక్డ్ ఇన్ సంస్థ బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో మోదీ వరుసగా మూడో సారి చోటు సంపాదించారు. లింక్డ్ ఇన్‌లో ఆయనను 22లక్షలు మంది అనుసరిస్తున్నారు. జాబితాలో మొత్తం 50మంది చోటు సంపాదించగా, వారిలో నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి , కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, సిప్లా సీపీఓ ప్రబీర్ ఝా, షయోమీ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్, ఎండీ మను కుమార్ జైన్ తదితరులు ఉన్నారు. -
లింక్డ్ఇన్ లైట్ వెర్షన్ యాప్
న్యూఢిల్లీ: ఫేస్బుక్, ట్విటర్ తర్వాత ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌కు చెందిన ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ‘లింక్డ్ ఇన్’ కూడా లైట్ వెర్షన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎక్కువ మంది యూజర్లకు చేరువ కావాలనే ఉద్దేశంతో కంపెనీ ఈ యాప్‌ను ఆవిష్కరించింది. డేటా వినియోగాన్ని 80 శాతం వరకు తగ్గించాలనే లక్ష్యంతో కొత్త ‘లింక్డ్ ఇన్ లైట్’ యాప్‌ను రూపొందించింది. దీని పరిమాణం 1ఎంబీ కన్నా తక్కువగానే ఉంది. ‘లింక్డ్ఇన్ లైట్ యాప్‌ను తొలిగా భారత్‌లో వినియోగంలోకి తెచ్చాం. దీన్ని త్వరలోనే 60కిపైగా దేశాల్లో అందుబాటులోకి తీసుకువస్తాం’ అని లింక్డ్ఇన్ తెలిపింది. -
అవినీతికి చోటులేదు
• నగదు రహితంతోనే నల్లధనానికి అడ్డుకట్ట ‘లింక్డిన్’లో ప్రధాని • నగదు రహిత మార్పునకు యువత నాయకత్వం వహించాలి న్యూఢిల్లీ: 21వ శతాబ్దంలో అవినీతికి చోటు లేదని, అది అభివృద్ధిని మందగింప చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పేదలు, దిగువ మధ్య, మధ్య తరగతి ప్రజల కలల్ని అవినీతి నాశనం చేస్తుంది’ అని లింక్డిన్.కామ్ వెబ్సైట్లో రాసిన వ్యాసంలో ప్రధాని పేర్కొన్నారు. కరెన్సీ రూపంలో భారీగా నగదు చెలామణిలో ఉండడం దేశంలో అవినీతి, నల్లధనానికి ఊతమిస్తోందని, దానికి అడ్డుకట్ట వేసేందుకు నగదు రహిత కార్యకలాపాల దిశగా సాగుతున్న మార్పునకు యువత నాయకత్వం వహించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ విధానం అవినీతి రహిత భారతదేశ నిర్మాణానికి గట్టి పునాదిగా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. భారీగా భౌతికరూపంలో నగదు ఉండడం అవినీతి, నల్లధనానికి కారణమవుతోందని, వాటిని నిర్మూలించేందుకే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ⇔ ‘నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా యువతకు... నగదు రహిత సమాజం దిశగా మార్పునకు నాయకత్వం వహించమని కోరుతున్నా’ అని కోరారు. ‘మనం ప్రస్తుతం మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ల యుగంలో నివసిస్తున్నాం. ఆహార పదార్థాల ఆర్డర్‌కు, ఫర్నీచర్ కొనుగోలు, అమ్మకానికి, టాక్సీ సేవల కోసం ఇలా చాలా వాటిని మొబైల్ ద్వారానే నిర్వహిస్తున్నాం. సాంకేతికత మన జీవితాల్లో వేగం, సౌలభ్యాన్ని తీసుకొచ్చింది’ అని వ్యాసంలో ప్రధాని పేర్కొన్నారు. కార్పొరేట్ల లబ్ధి కోసమే ఈ-వాలెట్లకు ప్రోత్సాహం: కాంగ్రెస్ కొన్ని కార్పొరేట్ సంస్థల ఈ-వాలెట్ వ్యాపారాలకు సాయపడేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైటట్ శుక్రవారం ఆరోపించారు. ప్రభుత్వమే ఎందుకు సొంత ఈ-వాలెట్ వ్యవస్థతో ముందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ వాలెట్ కంపెనీల్లో 60 శాతం వాటా చైనా ప్రజలవేనని, రహస్యాల్ని చైనాకు బహిర్గతం చేస్తున్నారంటూ విమర్శించారు. నోట్ల రద్దును విమర్శిస్తున్న వారు 50 రోజుల గడువు వరకూ ఓపిక పట్టాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లక్నోలో శుక్రవారం చెప్పారు. -
ప్రభుత్వంతో ‘లింక్డ్ ఇన్’ ఎంఓయూ
ముంబై: ప్రముఖ గ్లోబల్ ప్రొఫెషనల్ నెట్వర్క్ ‘లింక్డ్ ఇన్’ తాజాగా కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపింది. విద్యార్థులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో లింక్డ్ ఇన్.. మానవ వనరుల అభివృద్ధి శాఖతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌తో అనుసంధానమైన అన్ని కాలేజీలు తమ ‘ప్లేస్‌మెంట్స్’ ప్రొడక్ట్‌ను ఆమోదించాల్సి ఉంటుందని లింక్డ్ ఇన్ పేర్కొంది. విద్యార్థులు ప్లేస్‌మెంట్స్ ప్రొడక్ట్ద్వారా దేశంలోని పలు కార్పొరేట్ కంపెనీల్లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. కాగా లింక్డ్ ఇన్.. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ను సులభతరం చేయాలనే ఉద్దేశంతో 2015 నవంబర్‌లో ఈ ప్లేస్మెంట్ ప్రొడక్ట్‌ను ఆవిష్కరించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దీన్ని విద్యార్థులకు, కాలేజీలకు, యూనివర్సిటీలకు అందుబాటులోకి తెచ్చింది. -
ఆ తర్వాత ఏ ఉద్యోగం చేయాలో !
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండుసార్లు సేవలందించిన బరాక్ ఒబామా వచ్చే జనవరి 20 నాటికి ఖాళీగా మారబోతున్నారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక 55 ఏళ్ల వయస్సులో ఎలాంటి పని చేయాలన్న దానిపై ఇప్పటికీ తనకు క్లారిటీ లేదని ఒబామా చెప్పారు. కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి తాను కూడా అందరిలాగా 'లింకెడ్ ఇన్' వెబ్ సైట్ లో చేరాల్సి వస్తుందేమోనంటూ ఆయన జోకులు వేశారు. 'సెలెక్ట్ యూఎస్ ఫారెన్ ఇన్వెస్ట్ మెంట్' సదస్సులో సోమవారం ప్రసంగించిన ఒబామా వ్యాపారం చేయడానికి అమెరికా గొప్ప ప్రదేశమని ప్రశంసించారు. ఈ సందర్భంగా తన భవిష్యత్ గురించి ప్రస్తావించిన ఒబామా ' మరో ఏడు నెలల్లో నేను ఉద్యోగ విపణిలోకి అడుగుపెడతాను. అక్కడికి వెళ్లడం నాకు ఆనందంగానే ఉంది. నేను కూడా లింకెడ్ ఇన్ లో ఖాతా తెరుస్తాను. ఎలాంటి (ఉద్యోగాలు) వస్తాయో చూడాలి' అంటూ చమత్కరించారు. ఉద్యోగ అవకాశాలను కల్పించే ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ అయినా లింకెడ్ ను మైక్రోసాఫ్ట్ ఇటీవల 26.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగం కోసం లింకెడిన్ లో చేరే విషయమై ఇంతకుమునుపు కూడా ఒబామా ఓసారి పేర్కొన్న సంగతి తెలిసిందే. హోనులులులో బాస్కిన్ రాబిన్స్ ఐస్ క్రీమ్ దుకాణంలో టీనేజర్ గా తాను చేసిన తొలి ఉద్యోగం నాటి జ్ఞాపకాలను ఒబామా గుర్తుచేసుకున్నారు. వేసవిలో తాను చేసిన ఆ తొలి ఉద్యోగం అంత గొప్పదేమీ కాకపోయినా.. అది తనకు విలువైన పాఠాలను నేర్పిందని, బాధ్యత, కటోరశ్రమతోపాటు స్నేహితులు, కుటుంబం, చదువును సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన ఆవశ్యకతను ఆ ఉద్యోగం నేర్పిందని ఒబామా నెమరువేసుకున్నారు. , -
మైక్రోసాఫ్ట్ చేతికి లింక్డ్ఇన్
♦ డీల్ విలువ రూ.1,75,000 కోట్లు.. ♦ పూర్తి నగదు రూపంలో కొనుగోలు.. ♦ ఒక్కో షేరుకి 196 డాలర్లు చెల్లించేందుకు ఓకే ♦ మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఇదే అతిపెద్ద కొనుగోలు డీల్... ♦ కంపెనీ సీఈఓగా సత్య నాదెళ్ల పగ్గాలు చేపట్టాక జరిగిన భారీ ఒప్పందం కూడా న్యూయార్క్: ప్రపంచ టెక్నాలజీ రంగంలో మరో అతిపెద్ద డీల్‌కు మైక్రోసాఫ్ట్ తెరతీసింది. వివిధ వ్యాపార రంగాలకు చెందిన నిపుణులు, ఉద్యోగులు, సంస్థలకు ఆన్లైన్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తున్న లింక్డ్ఇన్ను చేజిక్కించుకుంటున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ డీల్ కోసం ఏకంగా 26.2 బిలియన్ డాలర్ల మొత్తాన్ని(దాదాపు రూ.1.75 లక్షల కోట్లు) చెల్లించనున్నట్లు తెలిపింది. మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఇదే అతిపెద్ద కొనుగోలు ఒప్పందం కావడంతోపాటు... సత్య నాదెళ్ల కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన భారీ డీల్ కూడా ఇదే కావడం గమనార్హం. పూర్తిగా నగదు రూపంలో ఈ కొనుగోలు ఒప్పందం ఉంటుందని.. లింక్డ్ఇన్కు చెందిన ఒక్కో షేరుకి 196 డాలర్ల చొప్పున విలువ కట్టినట్లు మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది. అమెరికాలోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో గత శుక్రవారం నాటి ముగింపు ధరతో పోలిస్తే మైక్రోసాఫ్ట్ చెల్లింస్తున్న ప్రీమియం దాదాపు 50 శాతం అధికం కావడం గమనార్హం. మరోపక్క, విశిష్టమైన లింక్డ్ఇన్ బ్రాండ్‌ను యథాతథంగా కొనసాగించనున్నామని.. స్వతంత్ర కంపెనీగానే కొనసాగించనున్నట్లు కూడా మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ సీఈఓగా వ్యవహరిస్తున్న జెఫ్ వీనర్ బాధ్యతల్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని.. ఆయన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఆధ్వర్యంలో పనిచేస్తారని కంపెనీ వివరించింది. లింక్డ్ఇన్ సహ-వ్యవస్థాపకుడు మెజారిటీ వాటాదారుతో పాటు చైర్మన్ కూడా అయిన రీడ్ హాఫ్మన్, వీనర్‌లు ఇరువురూ ఈ డీల్‌కు పూర్తి మద్దతు తెలిపారని మైక్రోసాఫ్ట్ ప్రకటన పేర్కొంది. ఈ ఏడాది చివరికల్లా ఒప్పందం పూర్తవుతుందని అంచనా. నిధుల కోసం కొత్త రుణాలు... లింక్డ్ఇన్ కొనుగోలుకు సంబంధించిన నిధుల కోసం కొత్తగా రుణాలను సమీకరించనున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. డీల్ పూర్తయిన తర్వాత లింక్డ్ఇన్ ఆర్థికాంశాలన్నింటినీ మైక్రోసాఫ్ట్ తన ప్రొడక్టివిటీ అండ్ బిజినెస్ ప్రాసెస్ విభాగంలో భాగంగా చూపనుంది. కాగా, గత ప్రణాళికలకు అనుగుణంగా ఈ ఏడాది డిసెంబర్‌కల్లా తమ 40 బిలియన్ డాలర్ల షేర్ల కొనుగోలు(బైబ్యాక్)ను పూర్తిచేస్తామని పునరుద్ఘాటించింది. ఈ ఒప్పందానికి సంబంధించి మైక్రోసాఫ్ట్‌కు మోర్గాన్ స్టాన్లీ ప్రత్యేక ఫైనాన్షియల్ అడ్వయిజర్‌గా... సింప్సన్ థాచెర్ అండ్ బార్లెట్ ఎల్ఎల్పీ లీగల్ అడ్వయిజర్‌గా ఉన్నాయి. కాగా, 2015లో మైక్రోసాఫ్ట్ నికర లాభం 12.2 బిలియన్ డాలర్లుకాగా, ఆదాయం 93.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. భారత్‌లోనూ కార్యాలయం... భారత్‌లోనూ లింక్డ్ఇన్కు ప్రత్యక్ష కార్యకలాపాలు ఉన్నాయి. బెంగళూరులో ఒక పరిశోధన-అభివృద్ధి(ఆర్అండ్డీ) కార్యాలయం ఉంది. ఇందులో సుమారు 650 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. లింక్డ్ఇన్ సంగతిదీ... ♦ బిజినెస్ ఆధారిత సోషల్ నెట్వర్కింగ్ సేవల్లో ప్రపంచ దిగ్గజంగా నిలుస్తోంది. ముఖ్యంగా ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్(డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.లింక్డ్ఇన్.కామ్)గా దీన్ని వ్యహహరిస్తున్నారు. వివిధ రంగాల నిపుణులు, కంపెనీలు దీనిలో తమ ప్రొఫైల్స్‌ను పెట్టుకోవచ్చు. యూజర్ల వివరాలను నియామక సంస్థలకు అందించడం ద్వారా ప్రధానంగా లింక్డ్ఇన్కు ఆదాయం లభిస్తోంది. ♦ 2002 డిసెంబర్లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన మౌంటెన్ వ్యూలో ఈ సంస్థ ఆవిర్భవించింది. అధికారికంగా లింక్డ్ఇన్ వెబ్సైట్ మాత్రం 2003 మే 5న మొదలైంది. ♦ కంపెనీ సహ వ్యవస్థాపకుడు ప్రస్తుత చైర్మన్ అయిన రీడ్ హాఫ్మన్ తన నివాసంలోని లివింగ్ రూమ్ వేదికగా లింక్డ్ఇన్ను ప్రారంభించారు. ♦ అలెన్ బ్లూ, కాన్స్టాంటిన్ గుయెరికీ, ఎరిక్ లీ, జీన్ లూక్ వెయిలంట్లు దీనికి ఇతర సహ-వ్యవస్థాపకులు. కంపెనీలో నియంత్రణ వాటా మాత్రం చైర్మన్ రీడ్ హాఫ్మన్ చేతిలోనే ఉంది. ♦ 2011 మే నెలలో కంపెనీ ఐపీఓ ద్వారా(షేరు ధర 45 డాలర్లు) న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయింది. 2004లో గూగుల్ లిస్టింగ్ తర్వాత ఇంటర్నెట్ కంపెనీల ఐపీఓల్లో ఇదే అతిపెద్దదిగా నిలిచింది. ♦ ఈ ఏడాది జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి 9,200 మంది ఉద్యోగులు ఉన్నారు. భారత్‌లోని బెంగళూరుతో సహా ప్రపంచవ్యాప్తంగా 30 నగరాల్లో ఆఫీసులున్నాయి. వీటిలో బీజింగ్, షికాగో, దుబాయ్, డబ్లిన్, హాంకాంగ్, లండన్లు కొన్ని. ♦ లింక్డ్ఇన్లో ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 43.3 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఇందులో 9.2 కోట్ల యూజర్లు ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి చెందినవారే. యూజర్ల సంఖ్యలో ఏటా 19 శాతం వృద్ధి నమోదవుతోంది. ♦ ఇక త్రైమాసికంగా చూస్తే యూజర్లకు చెందిన ప్రొఫైల్ పేజీలకు 4,500 కోట్ల వ్యూస్(పేజీలను చూడటం) లభిస్తున్నట్లు అంచనా. దీనిలో 34 శాతం వృద్ధి ఉన్నట్లు కంపెనీ చెబుతోంది. ♦ 2016 పూర్తి ఏడాదికి తమ ఆదాయం 3.63-3.7 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. 2015 ఆదాయం 2.99 బిలియన్ డాలర్లు కాగా, 16.5 కోట్ల డాలర్ల నష్టం ప్రకటించింది. కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆదాయం 35 శాతం వృద్ధితో 86.1 కోట్ల డాలర్లుగా నమోదైంది. మైక్రోసాఫ్ట్ కొనుగోళ్ల పర్వం... ♦ సాఫ్ట్వేర్, టెక్నాలజీ రంగంలో ప్రపంచ దిగ్గజంగా వెలుగొందుతున్న మైక్రోసాఫ్ట్.. 1987లో తొలిసారిగా ఫోర్‌థాట్ అనే కంపెనీని చేజిక్కించుకోవడం ద్వారా కొనుగోళ్ల పర్వాన్ని ఆరంభించింది. ♦ 2002లో నావిసన్ను 1.45 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ♦ 2011లో స్కైప్‌ను 8.5 బిలియన్ డాలర్లకు చేజిక్కించుకుంది. ♦ ఇక 2012లో యామెర్(1.2 బిలియన్ డాలర్లు), 2013లో నోకియా మొబైల్ హ్యాండ్సెట్ వ్యాపారం(9.4 బిలియన్ డాలర్లు), 2014లో మొజాంగ్(2.5 బిలియన్ డాలర్లు) మైక్రోసాఫ్ట్ ఖాతాలోకి చేరాయి. ప్రపంచంలోని వివిధ వ్యాపా రంగాల్లో ఉన్న నిపుణులందరినీ అనుసంధానించేవిధంగా లింక్డ్ఇన్ బృందం అత్యద్భుతమైన ప్లాట్‌ఫామ్‌ను నెలకొల్పింది. దీన్ని ఒక గొప్ప సంస్థగానే నేను ఎప్పడూ భావిస్తుంటాను. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ చెంతకు చేరడం ద్వారా అటు లింక్డ్ఇన్ వృద్ధి జోరందుకోవడంతోపాటు ఆఫీస్ 365కు కూడా మరింత చొచ్చుకెళ్లేందుకు దోహదం చేస్తుంది. అంతేకాదు ప్రపంచంలోని ప్రతి వ్యక్తి, సంస్థ సామర్థ్యాలను పెంపొందించడం కోసం మేం చేస్తున్న ప్రయత్నాలకు కూడా లింక్డ్ఇన్ కొనుగోలు తోడ్పాటుగా నిలుస్తుంది. ఈ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. కంపెనీ చైర్మన్ రీడ్, సీఈఓ జెఫ్‌లతో జరిగిన చర్చల తర్వాత డీల్ కొలిక్కి రావడం సంతోషం కలిగిస్తోంది. - లింక్డ్ఇన్తో డీల్‌పై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల లింక్డ్ఇన్ కొనుగోలు పూర్తయితే మైక్రోసాఫ్ట్‌కు సరికొత్త అవకాశాలతో పాటు ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. నా హయాంలోనే కాకుండా కంపెనీ చరిత్రలో ఇదే అతిపెద్ద కొనుగోలు కూడా. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నా. గతంలో మన కంపెనీకి ఉన్న మార్కెట్ పరిమాణం 200 బిలియన్ డాలర్లుగా ఉండగా... ఇప్పుడు 315 బిలియన్ డాలర్లకు చేరుకుంది. - మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ఈ-మెయిల్లో నాదెళ్ల ఉద్యోగ, వ్యాపారావకాశాలకు సంబంధించి ప్రపంచాన్ని అనుసంధానించడంలో మేం ఒక కొత్త ఒరవడిని సృష్టించాం. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ చెంతకు చేరడం ద్వారా లింక్డ్ఇన్ నెట్‌వర్క్‌కు క్లౌడ్ నెట్వర్క్ కూడా తోడవనుండటంతో ప్రపంచ పనితీరును కూడా సమూలంగా మార్చేసే అవకాశం లభిస్తుంది. - జెఫ్ వీనర్, లింక్డ్ఇన్ సీఈఓ మైక్రోసాఫ్ట్ చేపడుతున్న ఈ కొనుగోలు లింక్డ్ఇన్కు పునరుత్తేజం కల్పిస్తుంది. - రీడ్ హాఫ్మన్, లింక్డ్ఇన్ సహ-వ్యవస్థాపకుడు, చైర్మన్ -
సోషల్ మీడియాలో తప్పులతో ఉద్యోగాలకు ఎసరు
సోషల్ మీడియాను ఆస్వాదిస్తూ నేటి యువతరం గంటల తరబడి అందులో లీనమైపోతోంది. తమ భావాలను వ్యక్తీకరిస్తూ ప్రతి అంశంపైనా స్పందిస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, లింక్డిన్.. ఇలా వేదిక ఏదైనా కావొచ్చు. స్నేహితులతో చాటింగ్, తమ కామెంట్స్ పోస్టుచేయడంతో పాటు అనేక విషయాలను వెల్లడిస్తున్నారు. అయితే ఒక్కోసారి ఆ పోస్టింగ్స్ వల్ల మీ ఉద్యోగానికే ఎసరు రావొచ్చు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు సోషల్ మీడియాలో మీరు చేసిన పోస్టింగ్స్ మీకు ఉద్యోగం రాకుండా ప్రతిబంధకంగా మారొచ్చు... తస్మాత్ జాగ్రత్త అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలంలో విడుదలైన సోషల్ రిక్రూటింగ్ సర్వే తాజా ఎడిషన్‌లో దీనికి సంబంధించి అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఇటీవలి కాలంలో అమెరికా లాంటి దేశాల్లో రిక్రూటింగ్ ఏజెన్సీలు, రిక్రూటర్లు అత్యంత ప్రతిభావంతులైన నిపుణుల కోసం అన్వేషిస్తున్నాయి. వృత్తి నిపుణుల కోసం అన్వేషణలో అవి సోషల్ మీడియాపై ప్రధానంగా దృష్టి సారించాయని ఆ సర్వేలో వెల్లడైంది. రోజులు గడుస్తున్న కొద్దీ పోటీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిభావంతులను ఎంపిక చేసుకోవడంలో రిక్రూటర్స్ 73 శాతం సోషల్ రిక్రూటింగ్ పైన, 63 శాతం రిఫరల్స్తో, 51 శాతం మొబైల్ ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఇంజనీరింగ్, ఐటీ, ఆపరేషన్స్, సేల్స్ రంగాల్లో అత్యంత ప్రతిభావంతుల కోసం డిమాండ్ ఉన్నట్టు తేలింది. సోషల్ నెట్వర్క్ ఒక్కటే రిక్రూట్మెంట్కు ప్రామాణికం కాకపోయినా, ఉద్యోగ నియామకాల్లో రిక్రూట్ చేసుకునేవారు అభ్యర్థుల గురించి తెలుసుకోడానికి సోషల్‌మీడియా ప్రొఫైల్స్ ప్రధాన సోర్స్‌గా పనికొస్తోందని తేలింది. సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో పేర్కొన్న విషయాలకు అనుగుణంగా ఇంటర్వ్యూలు జరుగుతున్నట్టు తేలింది. ఉద్యోగ నియామకాల్లో ఇండస్ట్రీస్‌కు సోషల్ మీడియా (లింక్డిన్ 94 శాతం, ఫేస్ బుక్ 66 శాతం, ట్విట్టర్ 52 శాతం) ప్రధాన సాధనంగా మారింది. అభ్యర్థులను సంప్రదించడం, సరైన అభ్యర్థులను వెతుక్కోవడం, ఇంటర్వ్యూల కన్నా ముందుగానే ఎంపికచేసిన వారిని ఫిల్టర్ చేయడం (లింక్డిన్), ఎంప్లాయర్ బ్రాండ్, రిఫర్రల్స్, ప్రీ ఇంటర్వ్యూ, పోస్ట్ ఇంటర్వూల ద్వారా వడపోత కార్యక్రమం (ఫేస్ బుక్), గతంలో చేసిన ఉద్యోగాలు, ఇంటర్వ్యూల కన్నా ముందే వడపోత కార్యక్రమం (ట్విట్టర్) వంటి వాటన్నింటికీ రిక్రూటర్స్ సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నట్టు తేలింది. ఇలా దాదాపు 73 శాతం ఇలాంటివాటి ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేసుకున్నట్టుగా రిక్రూటర్స్ చెప్పినట్టు సర్వేలో వెల్లడైంది. అయితే ఈ రకంగా చేయడంలోనూ, అత్యంత ప్రతిభావంతులైన ప్రొఫెషనల్స్‌ను ఎంపిక చేసుకోవడంలో ఏజెన్సీలు 93 శాతం మేరకు వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను రివ్యూ చేస్తున్నట్టు ఆ సర్వేలో బయటపడింది. అడ్డగోలు పోస్టింగ్స్‌తో అసలుకే ఎసరు జాబ్స్ రిక్రూట్ మెంట్స్‌లో రిక్రూటర్లు ప్రధానంగా సోషల్ మీడియాపై ఆధారపడుతున్న నేపథ్యంలో నిపుణులైన యువతీ యువకులు సోషల్ మీడియా విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. డ్రగ్స్‌కు సంబంధిన విషయాలు, చట్ట వ్యతిరేక చర్యలు, శృంగారానికి సంబంధించిన పోస్టింగ్స్ వంటివి తెలిసీ తెలియక చేసినా మీకు ఉద్యోగం రానట్టే. ఇలాంటి పోస్టింగ్స్‌పై రిక్రూటర్స్ తీవ్ర వ్యతిరేకత చూపుతున్నట్టు సర్వే వెల్లడించింది. ప్రధానంగా డ్రగ్స్‌కు సంబంధించి స్నేహితులతో ఎలాంటి పోస్టింగ్ చేసినా అది మీకు ప్రతిబంధకం కావొచ్చు. తెలిసీ తెలియని వయసులో డ్రగ్స్‌కు సంబంధించి కొన్ని పోస్టింగ్స్ చేయొచ్చు. కానీ రిక్రూట్ చేసుకునే వారిలో 83 శాతం మేరకు వాటిని వ్యతిరేక దృష్టితోనే చూస్తున్నారు. ఆ తర్వాత సెక్సువల్ పోస్టింగ్స్ విషయంలోనూ 70 శాతం రిక్రూటర్స్ వ్యతిరేకంగానే పరిగణిస్తున్నారు. కేవలం ఒక శాతం మాత్రమే ఆ విషయాలను పాజిటివ్ కోణంలో చూస్తున్నట్టు ఆ సర్వేలో తేలింది. అశ్లీలదృశ్యాలను పోస్టు చేయడం, వాటిపై కామెంట్స్ చేయడం అభ్యర్థుల పట్ల నెగెటివ్ ప్రభావం చూపిస్తున్నాయి. అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లో తుపాకీ సంస్కృతి, మద్యం వంటి విషయాల్లో పోస్టింగ్స్ కూడా 44 శాతం మంది రిక్రూటర్స్‌కు నచ్చడం లేదని వెల్లడైంది. ఇంకో విచిత్రమేమంటే... పోస్టింగ్స్‌లో దొర్లుతున్న అక్షరదోషాలు, వ్యాకరణ దోషాలు కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అభ్యర్థులు ఇలాంటి పొరపాట్లు చేయడం దాదాపు 66 శాతం మంది రిక్రూట్మెంట్ మేనేజర్లకు నచ్చడం లేదు. రాజకీయ పరమైన కామెంట్స్ గానీ, రాజకీయ పార్టీలతో ఉన్న అనుబంధాలకు సంబంధించిన పోస్టింగ్స్ విషయాల్లో గానీ రిక్రూటర్స్ పెద్దగా పట్టించుకోవడం లేదని తేలింది. 1 నుంచి 6 శాతం రిక్రూటర్లు మాత్రమే రాజకీయ సంబంధాలను కూడా సందర్భాన్ని బట్టి నెగెటివ్‌గానే పరిగణిస్తున్నట్టు తేలింది. పాజిటివ్ అంశాలూ ఉన్నాయి... ఫేస్బుక్, లింక్డిన్లో మీ ప్రొఫైల్ మార్చుతున్నప్పుడు, లేదా అప్డేట్ చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఛారిటీ పనులు, స్వచ్ఛందంగా మీరేదైనా విరాళాలు ఇచ్చి ఉంటే ... అలాంటి విషయాలను సానుకూలంగా పరిగణిస్తున్నట్టు 65 శాతం రిక్రూటర్స్ వెల్లడించారు. మీ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియెన్స్, మ్యూచువల్ కనెక్షన్స్, సాంస్కృతికపరమైన అంశాలన్నీ మీకు అనుకూలంగా నిలుస్తున్నాయి. వివిధ రకాల సోషల్ మీడియాలు నిపుణుల వెతుకులాటలో రిక్రూటర్లు ప్రధానంగా లింక్డిన్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నట్టు తెలుస్తోంది. 79 శాతం లింక్డిన్‌పై (బయోడాటా) ఆధారపడుతుండగా, 26 శాతం ఫేస్బుక్ పైన, 14 శాతం ట్విట్టర్ పైన ఆధారపడుతున్నారు. ప్రొఫెషనల్ అనుభవం, ఎంత కాలం సర్వీసు చేశారు, మీకు తగిన ఉద్యోగం చేశారా, కష్టపడే మనస్తత్వం ఉందా, రాయడంలో గానీ, డిజైన్‌లో గాని ఉన్న స్కిల్స్ వంటి వాటి కోసం రిక్రూటర్స్ మీ సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నాయి. వివిధ రకాల ఇండస్ట్రీకి చెందిన దాదాపు 2 వేల మంది హ్యూమన్ రిసోర్స్ ప్రొఫెషనల్స్‌తో ఆన్లైన్ ద్వారా ఈ సర్వే నిర్వహించినట్టు జాబ్ విటే ఇటీవల ప్రకటించింది. అందువల్ల ఉద్యోగాల వేటలో ఉన్న నిపుణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పాజిటివ్ న్యూట్రల్ నెగెటివ్ అశ్లీల దృశ్యాలు, కామెంట్స్ 5 22 63 అక్షర దోషాలు 3 24 66 డ్రగ్స్ వంటి చట్ట వ్యతిరేక రిఫరెన్స్ 2 7 83 సెక్స్ కు సంబంధించిన పోస్టింగ్స్ 1 17 70 రాజకీయ పార్టీల అనుబంధం 2 69 17 విరాళాలు, స్వచ్ఛంద సేవ 65 25 2 మద్యం 2 43 44 గన్స్, మారణాయుధాలు... 2 32 51 -
'నేను సోమవారం చనిపోయాను'
లండన్: చావు దగ్గరకు వచ్చిందని ముందే తెలిస్తే బతుకంటే తెలియని తీపి.. మరికొన్ని రోజులుంటే బాగుంటుందనిపిస్తుంది. బతకాలి.. ఇంక బతుకుతాను అని ధైర్యంతో, ముందుకు నెట్టుకెళ్లాలనిపిస్తుంది. కానీ బ్రిటన్‌లో ఓ వ్యాపార వేత్త మాత్రం తాను బతికుండగానే చావును ప్రకటించేసుకున్నాడు. అలా చేస్తున్నందుకు తనకు ఎలాంటి ఆందోళన, బాధ లేదని చెప్పేశాడు. సైమన్ బిన్నర్ అనే వ్యక్తి సుట్టాన్లోని హెల్త్ అండ్ సోషల్ కేర్ ఆర్గనైజేషన్ కేర్ మార్క్ లో చాలాకాలంగా ఆపరేషన్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకున్న ఆయనకు గత జనవరిలో మోటార్ న్యూరోన్ డిసీజ్ (ఎంఎన్డీ) వచ్చింది. దీంతో ఆయన బాధ్యతలు మరో వ్యక్తికి అప్పగించి ప్రస్తుతం నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. వ్యాధి బాగా ముదిరిపోయింది. ఆ వ్యాధితో ఓ రకంగా నరకం అనుభవిస్తున్నారు. వైద్యులు తన ప్రాణం పోకుండా ప్రయత్నిస్తున్నారు. కానీ, ఎట్టి పరిస్థితుల్లో బతకననే విషయం మాత్రం తనకు తెలుసు. అందుకే ఏమనుకున్నారో ఏమో.. వెంటనే తాను ఉపయోగించే సామాజిక మాద్యమం లింక్ డెన్ ద్వారా 'నేను 2015 అక్టోబర్ 19న (సోమవారం) స్విట్టర్లాండ్‌లో చనిపోయాను. నా అంత్యక్రియలు 2015, నవంబర్ 13, 2015న ఉంటాయి' అంటూ బిన్నర్ తన ప్రొఫైల్ తో సహా లింక్ డన్ వెబ్ సైట్లో పోస్ట్ చేశాడు. ఎంఎన్ డీ వల్ల ప్రస్తుతం ఆయన నాడీ వ్యవస్థ మొత్తం దెబ్బతినడమే కాకుండా శరీరంలో అన్ని అవయవాలు పనిచేయడం మందగించాయి. దీంతో మాట్లాడటం, నడవటం, తినడం, శ్వాసతీసుకోవడం లాంటి పనులు చేయలేకపోతున్నాడు. బిన్నర్ పరిస్థితి చూసి ప్రతిఒక్కరూ బాధపడుతున్నారు. తన మరణానికి వైద్యులు సహకరించాలని పరోక్షంగా ఈ సందేశం ద్వారా బిన్నర్ కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ప్రస్తుత చట్టాలను మార్చేందుకు బిన్నర్ కథనే ఉదాహరణగా తీసుకోవాలని, నయంకానీ జబ్బుతో బాధపడేవారికి వైద్యుల సహాయంతో చనిపోయే అవకాశం ఉంటే.. వారి ఆరోగ్య పరిస్థితి అధ్వాన్నంగా తయారవడానికి ముందు ఆనందంగా తమ వారితో గడిపి తృప్తిగా వారు కన్నుమూస్తారని, అలాంటి చట్ట సవరణలు చేసుకోవాలని అవసరం ఉందని బ్రిటన్ మానవ హక్కుల సంఘం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండ్రూకాప్సన్ తెలిపాడు. -
లింక్డ్ ఇన్‌లో జాబ్ సెర్చ్ చేయండిలా!
లింక్డ్ ఇన్.. నేటి యువతను విపరీతంగా ఆకర్షిస్తున్న సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో కంప్యూటర్లలో, స్మార్ట్ఫోన్లలో చోటు సంపాదించుకుంటోంది. ఉద్యోగాల వేట విషయంలో ఈ సైట్ ఎంతో ఉపయోగకరంగా మారింది. కంపెనీలకు, అభ్యర్థులకు మధ్య వారధిగా పనిచేస్తోంది. కంపెనీల్లో కొలువుల సమాచారాన్ని అభ్యర్థులకు, వారి వివరాలను కంపెనీలకు లింక్డ్ ఇన్ వేగంగా చేరవేస్తోంది. ఇందులో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 65 మిలియన్ల మంది రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు. లింక్డ్ ఇన్ ఇప్పుడు ప్రభావంతమైన, ఆధునిక జాబ్ సెర్చ్ టూల్‌గా మారింది. వివిధ రంగాల ప్రొఫెషనల్స్‌ను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ సైట్ ప్రత్యేకత. ప్రపంచంలోని చాలా కంపెనీల సమాచారాన్ని, వాటిలో కొలువుల వివరాలను క్షణాల్లో కళ్లముందుంచుతోంది. జాబ్ హంట్ విషయంలో లింక్డ్ ఇన్ సహాయం పొందితే సులువుగా విజయం సాధించొచ్చు. ఇష్టమైన కొలువును సొంతం చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అప్లోడ్ మీ అకడమిక్, ప్రొఫెషనల్ బ్యాక్‌గ్రౌండ్, మీ అర్హతలు, నైపుణ్యాలను లింక్డ్ ఇన్ పేజీలో అప్లోడ్ చేయండి. సైట్ సెర్చ్ ఇంజన్లో ఈ సమాచారమంతా నమోదవుతుంది. రిక్రూటర్లు తమకు కావాల్సిన అభ్యర్థుల కోసం వెతికేటప్పుడు మీ వివరాలను పరిశీలిస్తారు. తగిన అభ్యర్థి అని భావిస్తే మిమ్మల్ని ఎంచుకుంటారు. రికమండేషన్లు ప్రొఫైల్ పూర్తి కావాలంటే రికమండేషన్లు అవసరం. ఈ లింక్డ్ ఇన్‌లో ఈ ఫీచర్‌ను తప్పనిసరిగా ఉపయోగించుకోండి. మీ పాత యాజమాన్యం లేదా సహోద్యోగులు, ప్రొఫెసర్లు మీ పేరును సిఫార్సు చేసేలా చూసుకోండి. రికమండేషన్లను చేరిస్తే జాబ్ మార్కెట్లో మీ ప్రొఫైల్‌కు విలువ పెరుగుతుంది. అప్డేట్స్ సైట్లో మీ ప్రొఫైల్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. మీ అర్హతలు, అనుభవాలు పెరిగితే వాటిని చేర్చండి. రిక్రూటర్లు మీ నెట్‌వర్క్‌తో అనుసంధానమవుతారు. వారి సంస్థల్లో కొలువులు ఖాళీగా ఉన్నప్పుడు మీకు సమాచారం చేరవేస్తారు. ఒక కంపెనీలో మీ అర్హతలకు తగిన కొలువులుంటే మీకు వివరాలు తెలుస్తాయి. లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఒక రెజ్యూమెగా కూడా పనిచేస్తుంది. గ్రూప్‌ల్లో చేరండి మీ రంగానికి, మీ కెరీర్ లక్ష్యాలకు, అభిరుచులకు సంబంధించిన గ్రూప్‌లను లింక్డ్ ఇన్‌లో సెర్చ్ చేయండి. వాటిలో సభ్యులుగా చేరండి. ఆయా గ్రూప్‌ల డిస్కషన్ బోర్డుల్లో పాల్గొనండి. దీంతో మీ నెట్వర్క్ విస్తరిస్తుంది. మీ రంగంలో వస్తున్న మార్పులు, తాజా సమాచారం ఎప్పటికప్పుడు తెలిసిపోతాయి. కొత్త ధోరణులపై అవగాహన పెరుగుతుంది. కొలువు సంపాదించడానికి, కెరీర్లో ఎదగడానికి ఇది తోడ్పడుతుంది. పీపుల్స్ ట్యాబ్ లింక్డ్ ఇన్ సైట్లో పీపుల్స్ ట్యాబ్ విభాగంలో పరిశ్రమ ప్రముఖుల సమాచారం, మీ రంగానికి చెందిన కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు ఉంటాయి. వారిని సంప్రదించి, మీ సందేహాలను నివృత్తి చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కంపెనీ ప్రొఫైల్స్ విభాగంలో ఉద్యోగుల కెరీర్ హిస్టరీ ఉంటుంది. అభ్యర్థుల నుంచి రిక్రూటర్లు ఏయే అంశాలను కోరుకుంటున్నారో దీనిద్వారా తెలుసుకోవచ్చు. ఇంటర్వ్యూ సన్నద్ధతకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. జాబ్ బోర్డు లింక్డ్ ఇన్ సొంతంగా జాబ్ బోర్డును నిర్వహిస్తోంది. ఇది ఒక జాబ్ పోర్టల్ లాగే పనిచేస్తుంది. రిక్రూటర్ల పేర్లతో సహా కొలువుల వివరాలు ఇందులో ఉంటాయి. రిక్రూటర్‌తో డెరైక్ట్ కమ్యూనికేషన్‌కు ఇది వీలు కల్పిస్తుంది. ఎడ్యూ న్యూస్ మ్యాట్ దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 25 దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో పీజీ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) నిర్వహించే మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్)- డిసెంబర్ పరీక్షకు నవంబర్ 25వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్/ ఆఫ్‌లైన్ విధానాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు, బ్యాచిలర్స్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మ్యాట్ రాయొచ్చు. పేపర్ బేస్డ్ పరీక్ష డిసెంబర్ 7న ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) డిసెంబర్ 13 నుంచి ప్రారంభమవుతుంది. అడ్మిట్ కార్డులను నవంబర్ 29 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏడాదిలో నాలుగు సార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) మ్యాట్‌ను నిర్వహిస్తారు. వెబ్సైట్: www.aima.in భవిష్య జ్యోతి ఉపకార వేతనాలు గుర్గావ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎన్ఐఐటీ) భవిష్య జ్యోతి స్కాలర్షిప్లను ఆఫర్ చేస్తోంది. ఎన్ఐఐటీ అందిస్తున్న అన్ని కోర్సులను అభ్యసిస్తున్నవారు ఈ ఉపకార వేతనం పొందడానికి అర్హులు. కోర్సులో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ స్కాలర్షిప్లను అందజేస్తారు. ఎంపికైన వారికి రూ.60 వేల వరకు ఇస్తారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 21లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: www.niitcloudcampus.com/ భారత విద్యార్థులకు ఆస్ట్రేలియా వర్సిటీ స్కాలర్షిప్ ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ వొలన్‌గాంగ్(యూఓడబ్ల్యూ) భారత విద్యార్థుల కోసం సర్ డాన్ బ్రాడ్‌మన్ స్కాలర్షిప్ను ప్రకటించింది. 2014 సంవత్సరానికి గాను బ్రాడ్‌మన్ ఫౌండేషన్‌తో కలిసి ఈ ఉపకార వేతనాన్ని అందిస్తోంది. క్రికెట్‌ను ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఈ స్కాలర్షిప్ను ప్రతిఏటా భారత విద్యార్థులకు ఆఫర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వొలన్‌గాంగ్ వర్సిటీలో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులను అభ్యసిస్తున్న ప్రతిభావంతులైన భారతీయులకు వారి కోర్సు ఫీజులో 50 శాతం చెల్లిస్తారు. వివరాలకు వెబ్సైట్: www.uow.edu.au జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజనీర్ అసిస్టెంట్ ట్రైనీ అర్హతలు: 60 శాతం మార్కులతో సంబంధిత విభా గంలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి. టెక్నీషియన్ ‘సి’ అర్హతలు: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 1 వెబ్సైట్: www.bel-india.com నిమ్స్ హైదరాబాద్‌లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్) కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంఎస్సీ (నర్సింగ్). సీట్ల సంఖ్య: 21, అర్హతలు: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీలో డిప్లొమా లేదా బీఎస్సీ(నర్సింగ్) ఉండాలి. మాస్టర్ ఆఫ్ ఫిజియో థెరపీ సీట్ల సంఖ్య: 15 అర్హతలు: ఫిజియో థెరపీలో డిగ్రీ ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ పారా మెడికల్ డిప్లొమా కోర్సెస్. సీట్ల సంఖ్య: 57 దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 30 వెబ్సైట్: www.nims.edu.in ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ(ఐఎంటీ) వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్(డ్యూయల్ కంట్రీ) ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్(ఎగ్జిక్యూటివ్) పార్ట్‌టైం పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అర్హతలు: 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. క్యాట్/గ్జాట్/జీమ్యాట్‌లో అర్హత సాధించాలి. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 24 వెబ్సైట్: http://imt.edu/ కాంపిటీటివ్ కౌన్సెలింగ్ కానిస్టేబుల్ రాత పరీక్షలో ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రాధాన్యతను తెలపండి? ఎలా ప్రిపేరవ్వాలి? - బద్ధం కన్నారెడ్డి, ఉప్పల్ పరీక్షలో చరిత్ర నుంచి సుమారు 25 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి 4 నుంచి 5 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ అంశాలను పక్కాగా ప్రిపేరైతే సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు. జైన, బౌద్ధమత సంబంధిత అంశాల నుంచే ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి మహావీరుడు, గౌతమ బుద్ధుడు జన్మించిన, నిర్యాణం చెందిన ప్రదేశాలను గుర్తుంచుకోవాలి. అలాగే జైన, బౌద్ధ మతాలకు సంబంధించిన ప్రధాన సూత్రాలను, గ్రంథాలను, నియమాలను అభ్యర్థులు ప్రత్యేక దృష్టితో చదవాలి. వీటిని పట్టిక రూపంలో సిద్ధం చేసుకుంటే గుర్తుంచుకోవడానికి సులువుగా ఉంటుంది. గౌతమ బుద్ధుడికి సంబంధించిన మహాభినిష్ర్కమణం, జ్ఞానోదయం, ధర్మచక్ర పరివర్తనం, మహాపరినిర్యాణం తదితర అంశాలు ఎక్కడ, ఎందుకు జరిగాయో తెలుసుకోవాలి. బౌద్ధమత అష్టాంగ మార్గాలు, జైన మత పంచవ్రతాలనూ సులభంగా గుర్తుంచుకోవడానికీ వాటిలోని మొదటి అక్షరాలతో ఒక పదాన్ని రూపొందించుకోవచ్చు. ఉదాహరణకు బౌద్ధమత అష్టాంగ మార్గాలైన సరైన మాట(వాక్కు), జీవనం, ఆలోచన, ధ్యానం, పని(క్రియ), కష్టం(శ్రమ), నిర్ణయం, చూపు(దృష్టి) నుంచి ‘మాజీ ఆధ్యాపకుని చూపు’ అని ఒక సులభమైన వాక్యంగా తయారు చేసుకోవచ్చు. ఇన్పుట్స్: బొమ్మనబోయిన శ్రీనివాస్, సీనియర్ ఫ్యాకల్టీ, హన్మకొండ